సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఫార్మా ఉత్పత్తులను అందిస్తామనే భరోసా ఇచ్చి ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా భారతదేశం కీర్తికెక్కిందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియా వెల్లడించారు. ‘ఔషధాలు: నాణ్యతా నిబంధనల అమలు’పై కేంద్ర సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబాతో కలిసి రెండ్రోజుల చింతన్ శిబిర్‌ను మాండవీయ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఫార్మా, ఆరోగ్య రంగాలలోని వాటాదారులు, లబ్ధిదారులందరికీ పటిష్టమైన నియంత్రణ వ్యవస్థలను నిర్మించడానికి, అందుకు సంబంధించిన విధానాల కోసం మార్గాలను చర్చించడానికి చింతన్ శిబిర్ ఒక వేదికన్నారు.
Comments
Please login to add a commentAdd a comment