సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, బీ ఫార్మసీలో ప్రవేశానికి ఎంసెట్ (ఎంపీసీ స్ట్రీమ్) ర్యాంకర్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్‌కు ఆదివారం రాత్రితో గడువు ముగిసింది. ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం 1,30,289 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాగా.. వీరిలో 1,28,716 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరంతా 41,26,650 ఆప్షన్లు ఇచ్చినట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో 47,723 మంది వెబ్ ఆప్షన్లు మార్చుకున్నారని ఆయన వెల్లడించారు. ఈనెల 17న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెలువడుతుందని, విద్యార్థులు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్లకు సమాచారం అందుతుందని తెలిపారు.
ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు సగం మందే...
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఐసెట్-2013లో అర్హత సాధించి ర్యాంకు పొందిన వారు 1.21 లక్షల మంది ఉండగా.. కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కేవలం 55,781 మంది ర్యాంకర్లు మాత్రమే హాజరయ్యారు. ఆదివారంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దాదాపు 1.20 లక్షలు అందుబాటులో ఉన్నాయని ఐసెట్ అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ వెల్లడించారు.
రేపే ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు
Published Mon, Sep 16 2013 1:54 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement