సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సర్టిఫికెట్ల తనిఖీకి సంబంధించి 2,17,000 మంది ర్యాంకర్లకుగాను 1,31,000 మంది హాజరుకాగా.. ఇప్పుడు వెబ్‌కౌన్సెలింగ్‌లోనూ కొందరు గైర్హాజరయ్యారు. మంగళవారం నాటికి 1,60,000 ర్యాంకర్ల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా 94,468 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. 1,60,000 లోపు ర్యాంకర్లలో 99,388 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్‌కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన వారు 4,920 మంది ఉన్నారు. వీరంతా యాజమాన్య కోటాలో సీట్లు పొంది ఉండవచ్చని కౌన్సెలింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంసెట్ ఎంపీసీ విభాగం అభ్యర్థులకు ఈనెల 12తో వెబ్ ఆప్షన్ల నమోదు ముగుస్తుంది. ఆప్షన్లు మార్చుకోవాలనుకునే 1 నుంచి లక్ష లోపు ర్యాంకర్లకు ఈ నెల 13న, లక్ష నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులకు ఈనెల 14న అవకాశం ఇస్తారు.
16 నుంచి బైపీసీ ఫార్మా సర్టిఫికెట్ల తనిఖీ: బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ 2013 బైపీసీ విభాగం అభ్యర్థులకు ఈనెల 16 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం ప్రారంభమైన సర్టిఫికెట్ల ప్రక్రియకు 7,654 మంది హాజరయ్యారు. ఈనెల 15 వరకు సర్టిఫికెట్ల తనిఖీ కొనసాగుతుంది. వెబ్‌ఆప్షన్ల నమోదు ఈ నెల 15 నుంచి 18 వరకు జరుగుతుంది.
ఇంజనీరింగ్ వెబ్‌ఆప్షన్ల నమోదులోనూ గైర్హాజరు
Published Wed, Sep 11 2013 2:25 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement