web counselling
-
బీడీఎస్ కన్వినర్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ వైద్య కళాశాలల్లో యూజీ డెంటల్ కోర్సుల్లో (బీడీఎస్) మొదటి ఏడాది ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) శనివారం విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వర్సిటీ వెల్లడించింది. tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు వర్సిటీ ఫీజు రూ.12 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీకి ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.10 వేలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి రూ.45 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 డెంటల్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. -
8 నుంచి ఓయూ హాస్టళ్ల మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్ వార్డెన్ శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌లను కూడా మూసివేస్తామని చెప్పారు. విద్యార్థులు హాస్టల్ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. పీజీఈసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ పీజీఈసెట్ ఈ నెల 6 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ పి.రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ వరకూ ఆన్లైన్ రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని, 9 నుంచి 11 వరకూ వెబ్ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 19వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువుంటుందని వెల్లడించారు. ‘డిగ్రీ వన్‌టైమ్ చాన్స్’ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్‌టైమ్ చాన్స్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్లాగ్, వన్‌టైమ్ చాన్స్ ఫలితాలు.. బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్ శ్రీనగేశ్ తెలిపారు. (తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు) పీజీ ప్రవేశాల చివరి విడత వెబ్ కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. సీపీజీఈటీ–2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్‌కౌన్సెలింగ్ జరగనున్నట్లు కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్య ర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్‌కు హాజరు కావాలన్నారు. ఈ నెల 12నుంచి 15వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సీట్లు లభించిన విద్యార్థులు 20 నుంచి 25 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా సర్వేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడ బ్ల్యూఆర్‌ఈఐఎస్) అదనపు కార్యదర్శిగా వి.సర్వేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వేశ్వర్‌రెడ్డి గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకుడిగా, టీసీఆర్టీఐ (గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ) సంచాలకుడిగా కొనసాగుతున్నారు. గిరిజన గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో మంగళవారం రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అదనపు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు సర్వేశ్వర్రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లు వారంపాటు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2020 కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు ఇంకా ప్రభుత్వ అను మతి రాకపోవడం, ఇటు కాలేజీలకు యూని వర్సిటీ అఫిలియేషన్ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఈమేరకు కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు జరిగాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 9 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలు కాగా, సోమవారం (ఈనెల 12న) నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. బీటెక్‌లో కొత్త కోర్సులకు అనుమతి రాకపోవడంతో పాటు అఫిలియేషన్ల ప్రక్రియలో జాప్యం జరగడంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వారం పాటు వాయిదా వేశారు. దీంతో ఈనెల 18వ తేదీ నుంచి వెబ్ఆప్షన్లు ఇచ్చేకునేలా వెబ్సైట్లో అధికారులు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 22వరకు ఆప్షన్లు ఇచ్చేలా వీలు కల్పించారు. అదేరోజు ఆప్షన్లు ఫ్రీజ్ కావడంతో ఈనెల 24న సీట్ల అలాట్మెంట్ పూర్తవుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలి. కరోనా నేపథ్యంలో.. రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లో 1,10,873 సీట్లున్నాయి. ఈమేరకు ప్రతి కాలేజీకి ఏటా యూనివర్సిటీ అఫిలి యేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న కాలేజీలే కౌన్సెలింగ్‌లో పాల్గొం టాయి. వాస్తవానికి ఈ అఫిలియేషన్ ప్రక్రియ మే నెలాఖరు నాటికే పూర్తవుతుండటంతో ఆ తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఈ కాలేజీల పేర్లు కనిపిస్తాయి. కానీ ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో అఫిలియేషన్ల ప్రక్రియ తీవ్ర జాప్యం జరిగింది. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అఫిలియేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. మరోవైపు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోగా.. వీటికి ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. దీంతో బీటెక్‌లో కొత్తగా 15,690 సీట్లు పెరగనున్నాయి. అయితే ఈ కోర్సులు, సీట్లను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎంసెట్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అఫిలియేషన్, కొత్త కోర్సుల అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈమేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేశారు. -
టీ ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా పడింది. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అయిదో తేదీకి వాయిదా పడింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు జూలై 5 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా కోర్సు, కళాశాల ఎంపిక చేసుకోవచ్చు. కాగా కొన్ని కళాశాలలు కోర్టు కెళ్ళి ఫీజులు పెంచుకున్న విషయం తెలిసిందే. దీంతో కాలేజీలు ఫీజుల పెంపుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది. ఈలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, ఆ కళాశాలల ఫీజుల వ్యవహారం తేలాకే వెబ్ ఆప్షన్లుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. -
వెబ్ కౌన్సెలింగ్ వద్దే..వద్దు
ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్‌కౌన్సెలింగ్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తొలిరోజు శనివారం జరిగిన హెచ్ఎంల వెబ్‌కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. ఆప్షన్లు ఇచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, ఖాళీలు కనిపించకపోవడం తదితర పరిణామాలతో ఆందోళనకు దిగారు. – నల్లగొండ నల్లగొండ : టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబం ధించి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు ఆందోళనకు దిగారు. తొలిసారిగా శనివారం జరిగిన ప్రధానోపాధ్యాయుల వెబ్‌కౌన్సెలింగ్ గందరగోళానికి దారితీసింది. వెబ్‌కౌన్సెలింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో ఆప్షన్లు ఇచ్చుకునే క్రమంలో హెచ్ఎంలు అనేక రకాలు ఇబ్బందులు పడ్డారు. స్పౌజ్ కేటగిరీలో బదిలీ అయిన పోస్టు ఒక దగ్గర చూపిస్తే.. స్పౌజ్ పనిచేస్తున్న ప్రదేశం మరో దగ్గర చూపిస్తుందని హెచ్ఎంలు తెలిపారు. బదిలీ అయిన తర్వాత ఏర్పడిన ఖాళీ పోస్టుల వివరాలు వెబ్‌కౌన్సెలింగ్‌లో కనిపించడం లేదని దాంతో తాము కోరుకున్న ప్రదేశంలో కాకుండా మరోచోటుకు ఆప్షన్ వెళ్తుందని తెలిపారు. ఆప్షన్ పెట్టుకున్న ప్రదేశం ఆన్లైన్లో సేవ్ కావడం లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో శనివారం రెండొందల మందికి పైగా హెచ్ఎంలు వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఆన్లైన్ కౌన్సెలింగ్ గందరగోళంగా మారడంతో వెబ్ ఆప్షన్ల సమయాన్ని పొడగించారు. సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడగించినట్లు అధికారులు తెలిపారు. కేవలం రెండొందల మంది హెచ్ఎంల కౌన్సెలింగ్‌లోనే ఇన్ని రకాల ఇబ్బందులు ఎదురైన పక్షంలో ఎస్జీటీలు ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల మందికి పైగా ఉన్నారు. కావున ఆన్లైన్ సమస్యలు తొలగించాకే కౌన్సెలింగ్ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తునారు. నాలుగో కేటగిరీ వివాదం కొలిక్కి... కౌన్సెలింగ్ నాలుగో కేటగిరీ పాఠశాలల వివాదం కొలిక్కి వచ్చింది. 2015లో జరిగిన టీచర్ల కౌన్సెలింగ్‌లోనే నాలుగో కేటగిరీ పాఠశాలలను రద్దు చేశారు. 2012లో జరిగిన కౌన్సెలింగ్‌లో ఉమ్మడి జిల్లాలో నాలుగో కేటగిరీ పాఠశాలలు 466 ఉంటే...2013లో నాలుగు స్కూళ్లకు పడిపోయాయి. దీంతో 2015కు వచ్చేసరికి అసలు జిల్లాలో నాలుగో కేటగిరీ స్కూళ్లే లేకుండాపోయాయి. అయితే 2009 నుంచి 2013 వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనకుండా లాంగ్‌స్టాండింగ్‌లో పనిచేసిన టీచర్లకు ఈ కౌన్సెలింగ్‌లో అదనపు పాయింట్లు కల్పించాలని టీచర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా విధానం అన్ని జిల్లాలో కల్పించినప్పటికీ నల్లగొండ జిల్లాలో మాత్రమే నాలుగో కేటగిరీకి కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించలేదు. దీంతో శనివారం టీచర్లు విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ను కలిశారు. విద్యాశాఖ జేడీ, డీఈఓలతో సమావేశమైన కలెక్టర్ నాలుగో కేటగిరీ అంశాన్ని పరిశీలించారు. 2012 వరకు వందల సంఖ్యలో ఉన్న నాలుగో కేటగిరీ స్కూళ్లు 2013లో అనూహ్యంగా పడి పోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో రవాణా సౌకర్యం ఉన్నటువంటి కుక్కడం, కొత్తపల్లి వంటి స్కూళ్లను నాలుగో కేటగిరీలో చేర్చడంపైన కలెక్టర్ ఆరా తీశారు. 2009 నుంచి 2013 వరకు నాలుగో కేటగిరీలో ఉన్న స్కూళ్ల జాబితాను పరిశీలించి అర్హత కలిగిన స్కూళ్ల జాబితాను పంపించేందుకు మండల స్థాయిలో కమిటీ వేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓలు ఆ స్కూళ్ల జాబితాను పరిశీలించి వెంటనే డీఈఓ కార్యాలయానికి పంపాలని సూచించారు. మండలాల నుంచి వచ్చే నాలుగో కేటగిరీ స్కూళ్ల జాబితాను డైరక్టరేట్‌కు పంపించి అక్కడి నుంచి అనుమతి పొందాక మళ్లీ సీనియారిటీ జాబితాలో మార్పులు చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. -
బీఈడీ కళాశాలల్లో 28వేల సీట్లు ఖాళీ
యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి) రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో 28,770 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఏపీఎడ్‌సెట్–2016 కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 27 నుంచి 29 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. విద్యార్థులు పెట్టుకున్న వెబ్ఆప్షన్ల మేరకు బుధవారం సీట్ల కేటాయింపు చేశామన్నారు. మూడు రోజుల పాటు జరిగిన వెబ్ కౌన్సెలింగ్‌కు 3,657 మంది హాజరై, సర్టిఫికెట్లను పరిశీలింప చేసుకున్నారన్నారు. 487 కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 32,145 సీట్లకు గాను 3,375 మందికి సీట్లను కేటాయించామన్నారు. సీట్లు కేటాయింపబడిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ విద్యార్థులకు ఈ నెల 8వతేదీనుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామన్నారు. -
వెబ్ ఆప్షన్లు రేపటి నుంచి !
-
వెబ్ ఆప్షన్లు రేపటి నుంచి !
* ఇంజనీరింగ్ ప్రవేశాలపై నేడు అధికారిక ప్రకటన * ప్రవేశాలకు మార్గం సుగమం చేసిన హైకోర్టు ధర్మాసనం * సింగిల్ జడ్జి తీర్పు సవరణ.. పిటిషన్లు దాఖలు చేసుకున్న కాలేజీలకు వెబ్ కౌన్సెలింగ్‌లో చోటు * తనిఖీల అనంతరం అఫిలియేషన్లపై తుది నిర్ణయం * ఏఐసీటీఈ నుంచి ఇద్దరు, జేఎన్టీయూ నుంచి ఒకరితో 25 బృందాలు.. ఆగస్టు 1కల్లా తనిఖీలు పూర్తిచేయాలి * అఫిలియేషన్ రాని కాలేజీల్లో చేరే విద్యార్థులను మరో కాలేజీలోకి మార్చాలని ఆదేశం * తదుపరి విచారణ ఆగస్టు 3కు వాయిదా * కోర్టు తీర్పు అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష * నెలాఖరులోగా ప్రవేశాలు పూర్తి చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం శుక్రవారం (ఈనెల 17) నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కాలేజీలకు అఫిలియేషన్ల వ్యవహారంపై బుధవారం హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, జేఎన్టీయూహెచ్ ఇన్చార్జి వీసీ శైలజారామయ్యర్, రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు తదితరులు హాజరైన ఈ సమావేశంలో... కోర్టులో జరిగిన వాదనలు, తీర్పు సారాంశం ప్రకారం ముందుకు సాగాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే హైకోర్టు తీర్పు కాపీ బుధవారం రాత్రి వరకు అధికారికంగా అందకపోవడంతో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తీర్పు ప్రతిలో ఏముంటుందో తెలియదు కనుక.. అది అందిన వెంటనే దానిలోని అంశాలను బట్టి గురువారం అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో చర్చించి ప్రకటన జారీ చేయనున్నారు. ఇక ఎంసెట్‌లో అర్హత సాధించిన 90,556 మంది విద్యార్థుల్లో 66,308 మంది ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఇక తదుపరి ప్రక్రియ వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు చేపట్టడమే. ఈ నేపథ్యంలో 17 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించి.. ఒకటీ రెండు దశల్లో ప్రవేశాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈనెల 31 నాటికి ప్రవేశాలను పూర్తిచేసి, ఆగస్టు 1న తరగతులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తీర్పు ప్రతి కోసం.. మొదటి దశ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్, తర్వాతి రెండో దశ ప్రక్రియ తేదీలను గురువారం ఉన్నత విద్యా మండలి అధికారికంగా ప్రకటించనుంది. బుధవారమే కోర్టు తీర్పు ప్రతి అందితే షెడ్యూల్ ప్రకటించి గురువారం నుంచి ప్రక్రియ చేపట్టాలని షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ కోర్టు తీర్పు ప్రతి అందనందున 17 నుంచి ప్రక్రియ కొనసాగించేలా మార్పులు చేస్తున్నారు. దాని ప్రకారం... ఈ నెల 17 నుంచి 20 వరకు వెబ్ఆప్షన్లు, 21న ఆప్షన్లలో మార్పులు, 23న సీట్ల కేటాయింపు జరిపే అవకాశముంది. విద్యార్థులు 27 వరకు కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టనున్నారు. రెండోదశలో 28, 29 తేదీల్లో వెబ్ఆప్షన్లు, 30న సీట్ల కేటాయింపు, 31న కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. మొత్తంగా ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించెందుకు యోచిస్తున్నారు. 20వ తేదీ నుంచి సంయుక్త తనిఖీలు హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ నుంచి ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ల ఆధ్వర్యంలో కాలేజీల్లో తనిఖీలను చేపట్టనున్నారు. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలపై జేఎన్టీయూహెచ్ దృష్టి సారించింది. అఫిలియేషన్లు కోరుతూ, సీట్ల కోతను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో దాదాపు 25 బృందాలు ఈ తనిఖీలను చేపట్టనున్నాయి. ప్రతి కాలేజీకి తనిఖీలకు వెళ్లే తేదీ వివరాలను 48 గంటల ముందే తెలియజేసి మరీ సంయుక్త బృందాలు తనిఖీలకు వెళ్లేలా జేఎన్టీయూహెచ్ కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు పూర్తి వివరాలు తెలిసేలా.. మరోవైపు అదనపు సీట్లు, అఫిలియేషన్లు కోరుతూ కోర్టును ఆశ్రయించిన కాలేజీలు, బ్రాంచీలకు సంబంధించిన సమగ్ర సమాచారం విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలోనే తెలిసేలా చేర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. తనిఖీలు వద్దు.. సీట్లూ వద్దు 66 కాలేజీల రాతపూర్వక విజ్ఞప్తులు సాక్షి, హైదరాబాద్: అఫిలియేషన్లపై హైకోర్టును ఆశ్రయించిన కాలేజీలు.. ఇప్పుడు కోర్టు తీర్పు పర్యవసానాన్ని తలచుకుని వణికిపోతున్నాయి. ఇప్పటికే అనుబంధ గుర్తింపు పొందిన బ్రాంచీలకు సంబంధించిన ఫ్యాకల్టీ తదితర సదుపాయాల తాలుకు వివరాలను కూడా తెలుసుకునే వెసులుబాటును సంయుక్త తనిఖీ బృందాలకు హైకోర్టు ఇచ్చింది. దీంతో అదనపు బ్రాంచీలు, సీట్ల కోసం చూసుకొని ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ బృందాల తనిఖీలకు ఒప్పుకుంటే... ఇప్పటికే గుర్తింపు ఉన్న బ్రాంచీలు, సీట్లలో లోపాలు బయటపడతాయేమోనని కాలేజీలు ఆందోళనపడుతున్నాయి. దీంతో కోర్టును ఆశ్రయించిన 120 కాలేజీల్లో 66 కాలేజీలు తమకు అదనపు సీట్లు వద్దు, సంయుక్త బృందాల తనిఖీలు వద్దంటూ జేఎన్టీయూహెచ్కు రాతపూర్వకంగా తెలియజేశాయి. కోర్టు తీర్పు వచ్చిన బుధవారమే 66 కాలేజీలు సీట్లు వద్దంటూ లేఖలు ఇవ్వగా.. తనిఖీలు ప్రారంభించే 20వ తేదీ నాటికి మరెన్ని కాలేజీలు ఇలా లేఖలు ఇచ్చే అవకాశముంది. దీనిని బట్టే ఇంజనీరింగ్ కాలేజీల్లో అనేక లోపాలు ఉన్నాయంటూ జేఎన్టీయూహెచ్ మొదటి నుంచీ చేస్తూ వస్తున్న వాదన వాస్తవమేనని స్పష్టమవుతోంది. ‘బ్రాంచీలు, సీట్లపై స్పష్టత ఇవ్వాలి’ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి కోరారు. కోర్టు తీర్పు మేరకు వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టే కాలేజీలు, వాటిల్లోని బ్రాంచీలు, సీట్ల వివరాలు వెబ్ ఆప్షన్ల సమయంలోనే విద్యార్థులకు తెలిసేలా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సీట్లను ఎంచుకుంటే ఏయే షరతులు వర్తిస్తాయన్న వివరాలు అందులో ఉండేలా సాఫ్ట్వేర్ రూపొందించాలన్నారు. వీలైతే వాటిని ప్రత్యేకంగా, వేరుగా వెబ్ ఆప్షన్లలో పెట్టాలని చెప్పారు. -
తెరుచుకోని ఎంసెట్ లాగిన్ ఆప్షన్
హైదరాబాద్ సీటీ: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ సందర్భంగా సోమవారం వెబ్ ఆప్షన్లకు అవకాశముంటుందని ఎదురుచూసిన అభ్యర్ధులకు నిరాశ ఎదురైంది. వెబ్ ఆప్షన్లకు సంబంధించి లాగిన్ ఆప్షన్‌ను అధికారులు ఎంసెట్ అధికారిక వెబ్సైట్లో ఓపెన్ చేయకపోవడంతో అభ్యర్ధులు తొలిరోజు ఆప్షన్లు నమోదు చేయలేకపోయారు. సోమవారం రాత్రి లాగిన్‌కు అవకాశమిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నా వెబ్సైట్లో అదేమీ కనిపించలేదు. ఇలా ఉండగా ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇటీవలే వెలువడినందున ఆ విద్యార్ధుల ధ్రువపత్రాలను సోమవారం పరిశీలించామని, అందువల్లనే వెబ్‌కౌన్సెలింగ్‌కు తొలిరోజు అవకాశం కల్పించడంలో కొంత ఇబ్బంది అయ్యిందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. తొలిరోజు ఇటీవల సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించినట్లు కౌన్సెలింగ్ అధికారులు వివరించారు. సోమవారం 5వేలమంది ధ్రువపత్రాల పరిశీలన చేపట్టామన్నారు. 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నామని, 16వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామని కౌన్సెలింగ్ చీఫ్ క్యాంప్ ఆఫసర్ (ఓఎస్డీ) రఘునాథ్ తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో పాలిసెట్, ఈసెట్ ైఫైనల్ కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. పాలిసెట్, ఈసెట్ అభ్యర్ధులు ఈరెండు రోజుల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు. 18న రంజాన్, 19న ఆదివారం సెలవు రోజులైనందున 20 న పాలిసెట్, 21న ఈసెట్ సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. -
ఆ కాలేజీలకు ‘తాత్కాలిక’ఊరట
అఫిలియేషన్ ఇవ్వాలని జేఎన్టీయూకు హైకోర్టు ఆదేశం తీర్పునకు అనుగుణంగా నిబంధనలు సవరించాలని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ అఫిలియేషన్ నిరాకరించడంపై హైకోర్టుకు వెళ్లిన కాలేజీలకు ఊరట లభించింది. ఆయా కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలని, వాటిని వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని జేఎన్టీయూను మంగళవారం ఆదేశించింది. మూడేళ్లుగా ఏఐసీటీఈ అనుమతి ఉండి, 2014-15 వరకు అఫిలియేషన్తోపాటు తాజా గడువు లోపు గుర్తింపునకు దరఖాస్తు చేసుకుని కోర్టును ఆశ్రయించిన కాలేజీలకు ఈ అఫిలియేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ కాలేజీల్లో జేఎన్టీయూ ఎత్తిచూపిన లోపాలను ఏఐసీటీఈ పరిశీలించి, నిర్ణయం వెలువరించేంత వరకు తాత్కాలిక అఫిలియేషన్ పొందినకాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని సూచించింది. 2014-15 నాటికి అమలుల్లో ఉండి, ప్రస్తుతం అఫిలియేషన్ పొందలేని కోర్సులకూ ఈ తాత్కాలిక అఫిలియేషన్ వర్తిస్తుందని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు తీర్పు వెలువరించారు. తమకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ ఇవ్వడానికి నిరాకరించడాన్ని, సీట్ల సంఖ్యను తగ్గించడాన్ని సవాలు చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు మంగళవారం తీర్పునిచ్చారు. జేఎన్టీయూ చూపిన లోపాలను ఆయా కాలేజీలు సవరించుకున్నాయా లేదా అన్న అంశాలను పరిశీలించేందుకు బృందాలను పంపాలని ఏఐసీటీఈని ఆదేశించారు. పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి 2015-16 విద్యా సంవత్సరానికి తుది అఫిలియేషన్ ఇచ్చే జేఎన్టీయూకు నివేదిక సమర్పించాలని ఆ బృందాలకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఈనెల 28లోపే పూర్తి చేయాలని ఏఐసీటీఈకి స్పష్టంచేశారు. పరిశీలన చేసే కాలేజీని విద్యార్థులు ఎంపిక చేసుకుని ఉంటే, ఆ కళాశాలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇచ్చిన విషయాన్ని వారికి తెలియచేయాలన్నారు. ఏఐసీటీఈ ఏ కాలేజీ అఫిలియేషన్ అయినా తిరస్కరిస్తే.. ఆ కాలేజీ విద్యార్థులను ఇతర కళాశాలల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని వర్సిటీని ఆదేశించారు. ఆరు నెలల్లోపు నిబంధనలు వెల్లడించండి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ తీర్పునకు అనుగుణంగా అఫిలియేషన్ నిబంధనలను సవరించాలని జేఎన్టీయూ పాలక మండలికి హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల సవరించేటప్పుడు న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, ప్రైవేటు కాలేజీల ప్రతినిధులను సంప్రదించాలని సూచించింది. సవరించిన నిబంధనలను ఆరు నెలల్లోపు బహిర్గతం చేయాలని పేర్కొంది. -
పిజీ ఈ సెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్
-
అన్ని కాలేజీలనూ చేర్చండి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం 10వ తేదీ నుంచి జరిగే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను చేర్చాలని హైకోర్టు గురువారం జేఎన్టీయూహెచ్ను ఆదేశించింది. లోపాలన్నింటినీ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చడానికి ముందే సవరించుకుంటామంటూ జేఎన్టీయూహెచ్కు రాతపూర్వక హామీ ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు స్పష్టం చేసింది. జాబితాలో చేర్చిన తరువాత కాలేజీలు లోపాలను సవరించుకోకుంటే.. నిబంధనల మేరకు వాటిపై చర్యలు తీసుకోవచ్చంటూ వర్సిటీకి స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజీల్లో లోపాలను సవరించుకున్నప్పటికీ జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయలేదని, దాన్ని పూర్తి చేసిన తరువాతే కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాదాపు 45 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరిగింది. వర్సిటీపై నమ్మకం లేదు..: పిటిషనర్లు ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా కాలేజీలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో.. పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించి కూడా అలానే ఇబ్బంది పెట్టేందుకు జేఎన్టీయూ ప్రయత్నిస్తోందని కాలేజీల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో తనిఖీలు నిర్వహించిన వర్సిటీ ఇన్ని నెలలు మౌనంగా ఉండి.. ఇప్పుడు చివరి నిమిషంలో లోపాలు ఉన్నాయంటూ చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. వర్సిటీ లేవనెత్తిన లోపాలను సవరించుకున్నామని, ఆ విషయాన్ని చెబుతుంటే పట్టించుకునే అధికారే లేరని కోర్టుకు తెలిపారు. అసలు జేఎన్టీయూను తాము నమ్మే పరిస్థితుల్లో లేమన్నారు. జేఎన్టీయూహెచ్ అరాచకంగా వ్యవహరిస్తోందని.. వర్సిటీ తీరును పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నిర్ణయం తీసుకోలేదు: అడ్వొకేట్ జనరల్ పీజీ కౌన్సెలింగ్ జాబితాకు సంబంధించి ఏ నిర్ణయమూ తీసుకోలేదని వర్సిటీ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. కాలేజీలు బోధనా సిబ్బంది, వారి అర్హతలు, విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలను సమర్పిస్తే... వాటిని పరిశీలించి అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని, తర్వాత వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామని చెప్పారు. కాలేజీలు సమర్పించే వివరాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు స్వయంగా కాలేజీలకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని.. నిబంధనల మేరకు అఫిలియేషన్‌ను వెంటనే రద్దు చేస్తామని తెలిపారు. అన్నింటినీ ఒకే గాటన కట్టొద్దు.. లోపాల విషయంలో అన్ని కాలేజీలను ఒకే గాటన కట్టడం సరికాదని జస్టిస్ రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ సమయంలో వర్సిటీ వ్యవహరించిన తీరును చూసి పిటిషనర్లు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోం దన్నారు. అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబి తాలో చేర్చాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేశారు. కాగా.. ఈ మధ్యంతర ఉత్తర్వులపై అప్పీలు చేయాలని జేఎన్టీయూహెచ్ ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై వర్సిటీ అధికారులు అడ్వొకేట్ జనరల్‌తో చర్చిస్తున్నారు. -
అన్ని కాలేజీలూ కౌన్సెలింగ్‌లోకి!
* గుర్తింపు లభించని కాలేజీల నుంచి ‘బాండ్’లు తీసుకుని అనుమతి * నెల రోజుల్లో లోపాలు సవరించుకోవాలని షరతు * రూ. 100 బాండ్ పేపర్‌పై యాజమాన్యాల నుంచి అండర్ టేకింగ్ * వీటన్నింటినీ రెండో దశ వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ నిరాకరణ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. లోపాలను సరిదిద్దుకున్న కాలేజీలతో పాటు మిగతా కళాశాలలకు కూడా కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ అంగీకరించింది. అయితే ఆయా కళాశాలల్లో తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలన్నింటినీ నెలరోజుల్లోగా పూర్తిగా సరిదిద్దుకుంటామని యాజమాన్యాల నుంచి హామీ తీసుకుంది. దీంతో యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి లభించినట్లయింది. ఇందులో 130 కళాశాలలకు స్క్రూటిని అనంతరం బుధవారం అర్ధరాత్రి అనుమతి ఇచ్చారు. మిగతా కళాశాలలను కూడా వీలయినంత త్వరగా వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు. వెబ్ కౌన్సెలింగ్ తొలిదశ గురువారంతో పూర్తికానుండడంతో.. రెండో దశలో ఈ కాలేజీలను చేర్చాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకూ కొన్ని కళాశాలలకే ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులు... తమ ఆప్షన్లను తాజాగా అనుమతి లభించిన కళాశాలలకు మార్చుకొనేందుకు వీలు కల్పించే అవకాశముంది. వర్సిటీ వద్ద పడిగాపులు.. అర్హతలున్న ఇంజనీరింగ్ కళాశాలలను ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ రెండ్రోజుల కిందట హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తమ కాలేజీలకు అఫిలియేషన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ.. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు జేఎన్టీయూహెచ్కు విజ్ఞప్తి చేశాయి. వెబ్ కౌన్సెలింగ్‌కు ఆయా కాలేజీలను అనుమతించే విషయమై తాము సానుకూలంగానే ఉన్నట్లు మంగళవారం రాత్రి వీసీ రామేశ్వరరావు యాజమాన్యాలకు చెప్పారు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా తాము కోరిన విధంగా అండర్‌టేకింగ్‌లు సమర్పించాలని సూచించారు. దీంతో బుధవారం 9 గంటల వరకే కాలేజీ యాజమాన్య ప్రతినిధులు అండర్ టేకింగ్ పత్రాలు తీసుకుని యూనివర్సిటీకి వచ్చారు. కానీ సాయంత్రం 4 గంటల వరకు అటు వీసీగానీ, ఇటు రిజిస్ట్రార్గానీ అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందారు. అయితే జేఎన్టీయూహెచ్ వీసీ రామేశ్వరరావు అండర్‌టేకింగ్ ఫార్మాట్‌ను రూపొందించి, సాంకేతిక విద్యాశాఖ నుంచి ఆమోదం పొందారు. అనంతరం ఆ ఫార్మాట్లను యాజమాన్యాలకు అందజేసి.. అండర్‌టేకింగ్ తీసుకున్నారు. 130 కాలేజీలకు అనుమతి.. ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించే విషయమై ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి అండర్ టేకింగ్ తీసుకున్న జేఎన్టీయూహెచ్... లోపాలు సరిదిద్దుకున్నట్లుగా పేర్కొంటూ పలు కాలేజీలు ఇచ్చిన నివేదికల పరిశీలన చేపట్టింది. బుధవారం ఆయా కాలేజీల యాజమాన్యాలు ఈ రిపోర్ట్‌లను అందజేయగా... అర్ధరాత్రి వరకు అధికారులు స్క్రూటినీ నిర్వహించి 130 కాలేజీలకు అనుమతి ఇచ్చారు. మిగతా వాటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జేఎన్టీయూ అధికారులు తెలిపారు. సవరించుకోకుంటే చర్యలు తీసుకోండి.. ‘ఏఐసీటీఈ నిర్దేశించిన ప్రమాణాలు, జేఎన్టీయూహెచ్ నిబంధనల మేరకు.. ర్యాటిఫైడ్ ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బంది, లేబొరేటరీలు, పుస్తకాలు, జర్నల్‌లు, మౌలిక వసతులు, అకడమిక్ రెగ్యులేషన్స్ తదితర అంశాల్లో తనిఖీ కమిటీలు(ఎఫ్ఎఫ్సీ) గుర్తిం చిన లోపాలను నెల లోపు సరిదిద్దుకుంటాం. ఆ తర్వాత ఏ సమయంలోనైనా వర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. లోపాలను గుర్తిస్తే చర్యలు తీసుకునే అధికారం వర్సిటీకి ఉంది’.. అని సంబంధిత ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకులు రూ. 100 బాండ్‌పేపర్లపై పేర్కొని సంతకం చేసి అండర్‌టేకింగ్‌లను వర్సిటీ రిజిస్ట్రార్‌కు సమర్పించారు. ఆ కాలేజీల్లో సీట్ల తగ్గింపు సబబే! హైకోర్టు ధర్మాసనం ముందు జేఎన్టీయూహెచ్ అప్పీల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల సీట్ల సంఖ్యను తగ్గించడం సబబేనని హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) పేర్కొంది. ఈ విషయంలో తమ నిర్ణయాన్ని తప్పుబడుతూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను గురువారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. -
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
అఫిలియేషన్లు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకే అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 460 ఇంజనీరింగ్ కాలేజీల్లోని 2,53,964 సీట్ల భర్తీకి అఫిలియేషన్లు లభిం చాయి. వాటిల్లో ప్రవేశాల కోసం ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ (వెబ్ ఆప్షన్లు) ప్రారంభం అవుతోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం గా 645 ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,62,985 సీట్లకు ప్రభుత్వ అనుమతి ఉన్నా.. సంబంధిత వర్సిటీల నుంచి 460 కాలేజీల్లోని 2,53,964 సీట్ల భర్తీకే అనుమతులు లభించాయి. విద్యార్థులు ర్యాంకుల వారీగా కేటాయించిన తేదీల్లో ఆన్లైన్లో వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. అవసరమైన ఏర్పాట్లను సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది. కళాశాలలు, సీట్ల వివరాలను http://eamcet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. అయితే శనివారం రాత్రి 11 గంటల వరకు ఈ వివరాలు వెబ్సైట్లో పెట్టలేదు.. రాత్రి 12 గంటల తరువాత వెబ్ ఆప్షన్లకు వీలు కల్పించాల్సి ఉన్నా సాధ్యం కాలేదు. దీంతో ఆదివారం ఉదయం నుంచి అభ్యర్థి లాగిన్ పేజీ ఓపెన్‌కు అవకాశం కల్పించనున్నారు. భారీ సంఖ్యలో కాలేజీలు ఔట్.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన అన్ని కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అఫిలియేషన్లు లభించలేదు. తనిఖీల్లో లోపాలు గుర్తించిన కాలేజీలకు అనుమతులివ్వలేదని అధికారులు వెల్లడించారు. దీంతో విద్యార్థులకు అందుబాటులో ఉండే కళాశాలల సంఖ్య ఈసారి భారీగా తగ్గింది. అఫిలియేషన్లు లభించని కాలేజీలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా 315 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,84,575 సీట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరిధి (తెలంగాణ)లో ఉండగా... ఇందులో కేవలం 141 కాలేజీల్లోని 85,455 సీట్లకు మాత్రమే అఫిలియేషన్లు లభించాయి. వీటితోపాటు 33 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 7,184 సీట్ల భర్తీకి అనుమతులు వచ్చాయి. వీటినే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగతా 174 కళాశాలకు అఫిలియేషన్లు రాలేదు. వాటి పరిస్థితి ఏమిటనేదానిపై స్పష్టత లేదు. రెండో దశలో అనుమతులు ఇస్తారా? లేక ఈ సారికి అఫిలియేషన్లు లేనట్లేనా? అన్నదానిపైనా ప్రవేశాల క్యాంపు అధికారుల వద్ద సమాచారం లేదు. కాగా.. ఫార్మసీలో 61 కాలేజీల్లో 10,910 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీల్లో 600 సీట్ల భర్తీకి అఫిలియేషన్ లభించింది. ఏపీలో 1,68,509 సీట్లు.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 330 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా... వాటిలో 319 కాలేజీలకు అఫిలియేషన్లు లభించాయి. ఇంజనీరింగ్‌లో 1,78,410 సీట్లకు గాను 1,68,509 సీట్లను వెబ్ ఆప్షన్లకు అందుబాటులో ఉంచనున్నారు. 122 ఫార్మసీ కాలేజీల్లో 111 కాలేజీలకు అనుమతులు వచ్చాయి. వీటిల్లో 12,870 సీట్లకు గాను 10,510 సీట్లు అందుబాటులో ఉంటాయి. కోర్టుకు వెళ్లనున్న యాజమాన్యాలు.. పెద్ద సంఖ్యలో కళాశాలలకు అఫిలియేషన్లు రాకపోవడంతో యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. మొదటి, రెండో తనిఖీల తరువాత లోపాలపై నివేదికలు ఇవ్వలేదని.. లోపాలపై సమాచారం ఇవ్వకుండానే అఫిలియేషన్లను నిరాకరించారని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. జేఎన్టీయూ అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నాయి. దీనిపై కోర్టులో ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పాయి. ఇదీ షెడ్యూలు.. ఆగస్టు 17, 18 తేదీల్లో: 1వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు 20, 21 తేదీల్లో: 50,001వ ర్యాంకు నుంచి లక్ష ర్యాంకు వరకు 22, 23 తేదీల్లో: 1,00,001వ ర్యాంకు నుంచి 1.50 లక్షల ర్యాంకు వరకు 24, 25 తేదీల్లో: 1,50,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు 26, 27 తేదీల్లో: వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 26న: 1వ ర్యాంకు నుంచి లక్ష ర్యాంకు వరకున్నవారు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు 27న: 1,00,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకున్న వారు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. 30వ తేదీన: సీట్ల కేటాయింపు ప్రకటన సెప్టెంబరు 1వ తేదీన: కళాశాలల్లో రిపోర్టు, తరగతులు ప్రారంభం -
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఎంసెట్-2014 వెబ్ కౌన్సెలింగ్ పక్రియ గురువారం ప్రారంభమైంది. నెల్లూరులోని దర్గామిట్ట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల్లో ఈ పక్రియను చేపట్టారు. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూసిన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. మహిళా పాలిటెక్నిక్ కళాశాల్లో ముగ్గురు అభ్యర్థులు, బాలుర పాలిటెక్నిక్ కళాశాల్లో 18 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. 1వ ర్యాంకు నుంచి 5వేల ర్యాంకు వరకు చేపట్టిన ఈ పరిశీలన కార్యక్రమంలో రెండు కేంద్రాల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మందకొడిగా సాగిన తొలిరోజు సర్టిఫికెట్ల పరిశీలన పలు సందేహాలకు తావిస్తోంది. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారన్న అనుమానం కలుగుతోంది. యథావిధిగా ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ వెబ్సైట్ మొరాయించడంతో గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. అభ్యర్థులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పెద్ద ఇబ్బందిలేదని ప్రిన్సిపల్స్ నారాయణ, రామోహన్‌రావు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. పోలీసు బందోబస్తు, తాగునీటి వసతిని కల్పించామన్నారు. శుక్రవారం జరిగే వెబ్ కౌన్సెలింగ్ 5001 నుంచి 7,500 వరకు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో, 7,501 నుంచి 10,000 వేల వరకు బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో అభ్యర్థులు హాజరుకావాలని వారు తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. -
కటకటాల్లోకి చేర్చిన ఈర్ష్య... సైబర్ నేరంలో బీటెక్ విద్యార్థి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: తెలిసిన అమ్మాయికి ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడం, మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే ప్రతిష్టాత్మకమైన కళాశాలలో సీటు సంపాదించడంతో ఈర్ష్య చెందిన ఓ బీటెక్ విద్యార్థి సైబర్ నేరానికి పాల్పడ్డాడు. ఆమె వెబ్‌కౌన్సిలింగ్‌కు సంబంధించిన వివరాలు సేకరించి ఆ సీటు రద్దు చేసి, మరో కళాశాలలో సీటు రిజర్వ్ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్, సైబర్‌క్రైమ్ విభాగం పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి మంగళవారం జైలుకు తరలించారు. డీసీపీ లేళ్ల కాళిదాస్ వేంకట రంగారావు అందించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన నల్లా మణిదీపిక ఈ ఏడాది జరిగిన ఎంసెట్‌లో 7040 ర్యాంకు సాధించి, హైదరాబాద్‌లోని జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో సీటు సంపాదించింది. గత నెల 1న దీపిక కాలేజీలో చేరేందుకు వెళ్లింది. అయితే, తమ కాలేజీలో సీటు రద్దు అయిందని, రెండో విడత కౌన్సిలింగ్లో కీసరలోని హోలీమేరీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు వచ్చిందని యాజమాన్యం చెప్పడంతో నిర్ఘాంతపోయిన దీపిక.. తాను రెండో విడత కౌన్సిలింగ్లో పాల్గొనకపోయినా.. ఉద్దేశపూర్వకంగా ఎవరో చేసి ఉంటారనే అనుమానంతో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు కేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు గండిపేటలోని ఎస్ఎస్జే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న సాయి భరతే ఇదంతా చేశాడని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. భరత్ స్వస్థలం కూడా మధిరే. దీపిక, భరత్ కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయి. దీపికకు మంచి కళాశాలలో సీటు వచ్చిన విషయం తెలుసుకుని ఈర్ష్యకు లోనైన భరత్ ఆమె సోదరుడితో పాటు ఇతర మార్గాల ద్వారా వెబ్‌కౌన్సిలింగ్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ తెలుసుకున్నాడు. ఓ స్నేహితుడి ల్యాప్‌టాప్ ద్వారా లాగిన్ అయి మొదటి సీటు రద్దు చేసి, రెండో సీటు రిజర్వ్ చేశాడు. -
నేటి నుంచి బీఎడ్ వెబ్ కౌన్సెలింగ్
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి బీఈడీ కోర్సుకు ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. డిగ్రీ పూర్తయ్యిందంటే అధికులు బీఈడీ చేసేందుకు ఆసక్తి చూపేవారు. ప్రభుత్వ కళాశాలల్లో సీటు లభించకుంటే ప్రైవేటుగానైనా కోర్సు పూర్తిచేసేవారు. కానీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను నెలకొన్నాయి. బీఈడీ చేసేందుకు విద్యార్థులు విముఖత చూపుతుండడంతో కోర్సుకు ఆదరణ తగ్గుతోంది. ఇందుకు రెగ్యులర్‌గా డీఎస్సీ నిర్వహించకపోవడం ఒక కారణమైతే.. స్కూల్‌అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హత కల్పించడం మరో కారణం. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తుండడంతో విద్యార్థులు డైట్సెట్పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇక నేటి నుంచి ప్రారంభం కానున్న బీఈడీ కౌన్సెలింగ్‌కు ఎంత మంది హాజరవుతారో చూడాల్సి ఉంది. సగానికి తగ్గిన అభ్యర్థులు జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్‌లో ప్రైవేట్ బీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఉట్నూర్‌లో గిరిజన విద్యార్థుల కోసం గిరిజన బీఈడీ కళాశాల ఉంది. ఒక్కో కళాశాలలో 100 సీట్ల వరకు పరి మితి ఉంది. అదనంగా మేనేజ్మెంట్ కోటాలో 50 వరకు భర్తీ చే స్తారు. గతంలో బీఎడ్ ఎంట్రెన్స్‌కు 10 వేల మంది వరకు అభ్యర్థులు హాజరైతే ఈ విద్యా సంవత్సరంలో సంఖ్య ఐదు వేలకు పడిపోయింది. దీంతో బీఎడ్ వైపు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదనేది తెలుస్తోంది. మరోవైపు.. ప్రభుత్వ డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆ దిశగా ఆలోచించడంలేదు. నేటి నుంచి వెబ్‌కౌన్సెలింగ్.. 2003-14 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 29 నుంచి అక్టోబర్ 7 వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు. ఎడ్‌సెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్, మార్కుల జాబితా, పది, ఇంటర్మీడియేట్ మార్కుల మెమోలు, బోనోఫైడ్, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. -
ఎంసెట్ ఫార్మశీ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : ఫార్మశీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో ప్రారంభమైంది. తొలిరోజు 33 వేలలోపు ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా 58 మంది హాజరయ్యారు. వీసీ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి ధ్రువీకరణ వెరిఫికేషన్ పత్రాన్ని ర్యాంకర్‌కు అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ వెరిఫికేషన్ అధికారులు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, డాక్టర్ కె.స్వప్నవాహిని, బోధకులు వి.మల్లికార్జునరావు, హనుమంతు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగనుంది. ఎన్ఎస్ఎస్ సేవలు విస్తరించాలి జాతీయ సేవాపథకం సేవలను విస్తరించాలని వీసీ లజపతిరాయ్ పిలుపునిచ్చారు. జిల్లాలో జాతీయ సేవా పథకం అమలుపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో సేవాదృక్పథం, నాయకత్వ లక్షణాల వృద్ధికి కృషి చేయాలన్నారు. సమాజం పట్ల అవగాహన, సేవా దృక్పథం ఉన్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. ఇంకుడు గుంతల ఏర్పాటు, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. సమీక్షలో స్టేట్ లైజన్ అధికారి పి.రామచంద్రరావు, రీజియన్ అధికారి ఆర్.గోపాలకృష్ణ, ఆంధ్రా యూనివర్సిటీ అధికారి ప్రొఫెసర్ పాల్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ గంజి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. సిలబస్‌కు ఎనలేని ప్రాధాన్యం విద్యార్థి జీవితానికి ఉపయోగ పడేదే నిజమైన విద్య అని, ప్రతి కోర్సు రూపకల్పనలో సిలబస్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉందని వీసీ లజపతిరాయ్ చెప్పారు. సోమవారం నిర్వహించిన ఎడ్యుకేషన్, గణితం, తెలుగు విభాగాల బోర్డాఫ్ స్టడీస్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఉపాధి అవకాశాలకు అనువైన సిలబస్‌తోనే అన్ని విభాగాలు బలోపేతమవుతాయని వివరించారు. విద్యార్థి భవిష్యత్తు తాను చదివే కోర్సుపై ఆధారపడి ఉంటుందన్నారు. అందుకే డిగ్రీ, పీజీ స్థాయిల్లో సిలబస్ కమిటీలు వేశామన్నారు. కామన్ కోర్ సిలబస్, యూజీసీ నిబంధనలకు లోబడి పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ మిర్యాల చంద్రయ్య, బోర్డాఫ్ స్టడీస్ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. -
ముగిసిన వెబ్ కౌన్సెలింగ్ గడువు
హైదరాబాద్ : గత అర్థరాత్రితో ఇంజినీరింగ్, బీ ఫార్మసీలో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్‌కు గడువు ముగిసింది. ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం 1,30,289 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాగా.. వీరిలో 1,28,716 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెలువడుతుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఐసెట్-2013లో అర్హత సాధించి ర్యాంకు పొందిన వారు లక్షా 21వేల మంది ఉండగా.. కౌన్సెలింగ్‌కు సగం మంది ర్యాంకర్లు మాత్రమే హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన గడువు ముగిసింది. అయితే ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దాదాపు లక్షా 20వేలు అందుబాటులో ఉన్నాయని ఐసెట్ అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి తెలిపారు. -
ఇంజనీరింగ్ వెబ్ఆప్షన్ల నమోదులోనూ గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సర్టిఫికెట్ల తనిఖీకి సంబంధించి 2,17,000 మంది ర్యాంకర్లకుగాను 1,31,000 మంది హాజరుకాగా.. ఇప్పుడు వెబ్కౌన్సెలింగ్లోనూ కొందరు గైర్హాజరయ్యారు. మంగళవారం నాటికి 1,60,000 ర్యాంకర్ల వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా 94,468 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. 1,60,000 లోపు ర్యాంకర్లలో 99,388 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్‌కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన వారు 4,920 మంది ఉన్నారు. వీరంతా యాజమాన్య కోటాలో సీట్లు పొంది ఉండవచ్చని కౌన్సెలింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంసెట్ ఎంపీసీ విభాగం అభ్యర్థులకు ఈనెల 12తో వెబ్ ఆప్షన్ల నమోదు ముగుస్తుంది. ఆప్షన్లు మార్చుకోవాలనుకునే 1 నుంచి లక్ష లోపు ర్యాంకర్లకు ఈ నెల 13న, లక్ష నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులకు ఈనెల 14న అవకాశం ఇస్తారు. 16 నుంచి బైపీసీ ఫార్మా సర్టిఫికెట్ల తనిఖీ: బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ 2013 బైపీసీ విభాగం అభ్యర్థులకు ఈనెల 16 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం ప్రారంభమైన సర్టిఫికెట్ల ప్రక్రియకు 7,654 మంది హాజరయ్యారు. ఈనెల 15 వరకు సర్టిఫికెట్ల తనిఖీ కొనసాగుతుంది. వెబ్ఆప్షన్ల నమోదు ఈ నెల 15 నుంచి 18 వరకు జరుగుతుంది. -
వ్యవసాయ కోర్సులకు రేపటి నుంచి వెబ్ కౌన్సెలింగ్
సాక్షి,హైదరాబాద్: వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ కోర్సులకు సెప్టెంబరు 2, 3, 4 తేదీల్లో ఉమ్మడి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం(సెంట్రల్ లైబ్రరీ), తిరుపతి, బాపట్ల, రాజమండ్రిలోని వ్యవసాయ కళాశాలలు, వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, గన్నవరం, ప్రొద్దుటూరుల్లోని పశువైద్య కళాశాలలు, వరంగల్, జగిత్యాల, అనకాపల్లి, నంద్యాలల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో వెబ్కౌన్సెంగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు వీటిల్లో ఏ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్‌కైనా వెళ్లి ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఏ కారణం చేతనైనా పై తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోతే, సెప్టెంబరు 5 (గురువారం) కూడా ఏదో ఒక వెబ్సెంటర్లో ఆప్షన్లు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. -
‘అగ్రి’ కౌన్సెలింగ్‌కు సమైక్య వేడి
అనకాపల్లి, న్యూస్‌లైన్: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాల యం అగ్రి ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ కోర్సుల వెబ్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ తగిలింది. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ కేంద్రంలో మంగళవారం మొదలైన కౌన్సెలింగ్‌కు సమైక్యవాదులు అడ్డుతగిలారు. రాష్ట్రం తగలబడుతుం టే వెబ్ కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తార ని వీరు ఆర్‌ఏఆర్‌ఎస్ సిబ్బందిని నిల దీశారు. పరిస్థితి చేజారుతున్న తరుణంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. మరోవైపు ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ అంకయ్య తమకు సహకరించాలని సమైక్యవాదులను కోరారు. ఇరువర్గాల మధ్య చర్చ లు ఫలప్రదం కావడంతో సమైక్యవాదుల ర్యాలీకి ఆర్‌ఏఆర్‌ఎస్ అధికారు లు, సిబ్బంది సంఘీభావం తెలిపారు. శాంతించిన సమైక్యవాదులు వెబ్‌కౌన్సెలింగ్‌కు అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి వెబ్ కౌన్సెలింగ్ మొదలైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులకు అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ లో వెబ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల, డిప్లొమా ఇన్ అగ్రి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం కోసం ఈ కౌన్సెలింగ్‌ను చేపట్టారు. మంగళవా రం రాత్రి 8.05 గంటలకు కౌన్సెలింగ్ ముగిసింది. మొత్తం 253మంది విద్యా ర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకు న్నారు. ఈ కౌన్సెలింగ్‌కు ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కౌన్సెలింగ్‌కు సమైక్యవాదులు అడ్డుతగలడంతో అక్కడివారు అనకాపల్లికి వచ్చారు. రాకపోకలకు ఇక్కట్లు... సమైక్య ఉద్యమం ఉధృతం కావడంతో ఐదు జిల్లాల విద్యార్థులు అనకాపల్లికి చేరడానికి నానా ఇబ్బందులకు గురయ్యారు. విద్యార్థులు రైళ్లు, సొంత వాహనాల్లో ఈ కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. రాత్రి వరకు కౌన్సెలింగ్ జరగడంతో తమ ఇళ్ళకు వెళ్లేందుకు ఇక్కట్ల పాలయ్యారు. తొలుత సమైక్యవాదుల నిరసనలతో కౌన్సెలింగ్ ఆగి పోతుందని ఆందోళన చెందిన విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి ప్రారం భం కావడంతో ఊపిరి పీల్చుకున్నా రు. కౌన్సిలింగ్‌ను ఏడీఆర్ అంకయ్య, పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సరిత పర్యవేక్షించారు. -
ప్రశాంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్
కర్నూలు (ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్లో ప్రశాంతంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా మొత్తానికి రాయలసీమ విశ్వ విద్యాలయంలోని వెబ్ కౌన్సిలింగ్ మాత్రమే పనిచేస్తుండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు ఆర్యూ కౌన్సెలింగ్ కేంద్రానికే చేరుకుంటున్నారు. శుక్రవారం ఒకటి నుంచి 80 వేల ర్యాంకు వరకు విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. 308 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, స్క్రాచ్‌కా -
వెబ్ కౌన్సెలింగ్‌లో.. ఐదోరోజు 12,047 మంది హాజరు
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: ఇంజనీరింగ్, ఫార్మసీలో ప్రవేశానికి నిర్వహిస్తున్న వెబ్ కౌన్సెలింగ్‌లో భాగమైన సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియలో ఐదోరోజు 12,047 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీమాంధ్రలోని 38 కేంద్రాల్లో 18 కేంద్రాలే పనిచేస్తుండగా, వీటిలో 6,018 మంది హాజరయ్యారు. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 6,029 మంది హాజరయ్యారు. కాగా విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల తనిఖీకి శుక్రవారం ఏర్పా టైన సహాయక కేంద్రంలో షెడ్యూలును సవరించారు. కొత్త షెడ్యూలు ప్రకారం 24న 10,001 నుంచి 20,000 వరకు, 25న 20,001 నుంచి 30,000 వరకు, 26న 30 వేల నుంచి 40 వేల వరకు, 27న 40 వేల నుంచి 50 వేల వరకు, 28న 50 వేల నుంచి 60 వేల వరకు, 29న 60 వేల నుంచి 70 వేల వరకు, 30న 70 వేల నుంచి 80 వేల వరకు ర్యాంకర్లు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావచ్చని అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నేటినుంచి కర్నూలు రాయలసీమ వర్సిటీలో సర్టిఫికెట్ల తనిఖీ కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. ఇక్కడ 24న 60 వేల నుంచి 80 వేల వరకు, 25న 80 వేల నుంచి 90 వేల వరకు, 26న 90 వేల నుంచి లక్ష వరకు, 27న లక్ష నుంచి లక్షా 10 వేల వరకు, 28న లక్షా 10 వేల నుంచి లక్షా 20 వేల వరకు, 29న లక్షా 20 వేల నుంచి లక్షా 30 వేల వరకు, 30న లక్షా 30 వేల నుంచి లక్షా 40 వేల వరకు గల ర్యాంకర్లకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ షెడ్యూలు అనంతరం సమీక్ష జరిపి 29న తదుపరి ర్యాంకర్లకు షెడ్యూలు ప్రకటిస్తామన్నారు. విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రారంభమైన గంటకే సర్వర్ మొరాయించింది. దీంతో గంటసేపు జాప్యం జరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 8 వేల ర్యాంకులకు 262 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం దృష్ట్యా ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా కౌన్సెలింగ్ కేంద్రం వద్ద పారా మిలటరీ బలగాలను మోహరించారు. -
19 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
22 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు సెప్టెంబర్ 5న సీట్ల కేటాయింపు జాబితా విడుదల అదే నెల 10 లేదా 11 నుంచి తరగతులు ప్రారంభం బీ కేటగిరీ భర్తీకి ప్రత్యేక మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల (వెబ్ కౌన్సెలింగ్)కు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టు మధ్యంతర ఆదేశాల ప్రకారం ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నతాధికారులు కౌన్సెలింగ్ కసరత్తు పూర్తి చేశారు. సమావేశం అనంతరం మండలి చైర్మన్ ప్రొఫెసర్ పి. జయప్రకాశ్‌రావు ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్, ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ అజయ్ జైన్, ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్.వి.రమణారావు, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ ఎంసెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. 19 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 19 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 22 నుంచి సెప్టెంబర్ 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్ 4న వెబ్ ఆప్షన్ల సవరణ, 5న సీట్ల కేటాయింపు జాబితా విడుదల ఉంటుందని జయప్రకాశ్‌రావు వెల్లడించారు. అడ్మిషన్లు పొందే విద్యార్థులు 6, 7, 8, 9 తేదీల్లో కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. 10 లేదా 11న తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మొత్తం 53 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం 30 హెల్ప్‌లైన్ సెంటర్లు పనిచేస్తాయని, విద్యార్థుల అడ్మిషన్ల నేపథ్యంలో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు, ఉద్యోగులు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూలు తదితర పూర్తి వివరాలతో కూడిన సమగ్ర ప్రకటనను ఎంసెట్ వెబ్‌కౌన్సెలింగ్ వెబ్సైట్ ్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ లో మంగళవారం పొందుపరచనున్నారు. కాగా కన్వీనర్ కోటాలో 2,38,000 సీట్లు, యాజమాన్య కోటాలో 1,02,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీ-కేటగిరీకి ప్రత్యేక మార్గదర్శకాలు.. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఇచ్చే నోటిఫికేషన్‌తో పాటు బీ-కేటగిరీ(యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి సంబంధించి ప్రత్యేక నోటీసును మంగళవారం జారీ చేయనున్నట్టు జయప్రకాశ్‌రావు తెలిపారు. భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు వివరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం యాజమాన్యాలు కనీసం 2 పత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని, దరఖాస్తు ఫామ్ నమూనా కళాశాల నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచాలని, అలాగే కళాశాల వెబ్సైట్లోనూ పొందుపరచాలని సూచించారు. నమూనా దరఖాస్తును కళాశాల తాను అనుబంధంగా ఉన్న యూనివర్శిటీకి మెయిల్ ద్వారా పంపాలని, ఒక కాపీ ఉన్నత విద్యామండలికి పంపాలని సూచించారు. విద్యార్థులు ఈ దరఖాస్తు ఫారాన్ని నింపి, అవసరమైన పత్రాలు జతపరిచి ఎక్నాలెడ్జిమెంట్ పొందగోరుతూ రిజిస్టర్డ్ పోస్టులో పంపించాలని సూచించారు. అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు యాజమాన్యాలు ఆన్లైన్లో స్వీకరించే వెసులుబాటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల దరఖాస్తులన్నింటినీ స్వీకరించిన తరువాత యాజమాన్యాలు ప్రతిభ ఆధారంగా ప్రవేశాల జాబితా తయారు చేసి అడ్మిషన్ల కన్వీనర్‌కు పంపించాలని సూచించారు. అడ్మిషన్ల కన్వీనర్ వీటిని పరిశీలిస్తారని తెలిపారు. ఆ తరువాత వీటి ఆమోదం కోసం ఉన్నత విద్యామండలికి పంపించాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తులు పంపిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాల వెబ్సైట్లో విధిగా పొందుపరచాలని, అలా లేనిపక్షంలో విద్యార్థులు తమకు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. యాజమాన్య కోటా సీట్లకు కన్వీనర్ కోటా ఫీజు మాత్రమే వర్తిస్తుందని, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ భర్తీ ప్రక్రియపై పూర్తిస్థాయిలో తమ పర్యవేక్షక బృందాలు పరిశీలిస్తాయని వివరించారు. బీ-కేటగిరీ ఎంపిక క్రమం ఇలా.. క న్వీనర్ కోటా సీట్లు 70 శాతం పోగా.. మిగిలిన 30 శాతం సీట్లను యాజమాన్యాలు భర్తీ చేస్తాయి. అయితే 5 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేయగా మిగిలిన వాటిలో ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల జేఈఈ-మెయిన్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. అప్పటికీ సీట్లు మిగిలితే ఎంసెట్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారని జయప్రకాశ్‌రావు వివరించారు. ఇందుకు సంబంధించి జీవో 74, 60 తదితర జీవోలు వర్తిస్తాయని చెప్పారు. షెడ్యూలు ఇలా.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : ఆగస్టు 19-30 వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 22- సెప్టెంబరు 3 ఆప్షన్ల సవరణ : సెప్టెంబరు 4 సీట్ల కేటాయింపు : సెప్టెంబరు 5 కళాశాలలో చేరిక : సెప్టెంబరు 6, 7, 8, 9 తరగతుల ప్రారంభం : సెప్టెంబరు 10 లేదా 11