సాక్షి,హైదరాబాద్: వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ కోర్సులకు సెప్టెంబరు 2, 3, 4 తేదీల్లో ఉమ్మడి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం(సెంట్రల్ లైబ్రరీ), తిరుపతి, బాపట్ల, రాజమండ్రిలోని వ్యవసాయ కళాశాలలు, వెంకటరామన్నగూడెంలోని వైఎస్‌ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, గన్నవరం, ప్రొద్దుటూరుల్లోని పశువైద్య కళాశాలలు, వరంగల్, జగిత్యాల, అనకాపల్లి, నంద్యాలల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో వెబ్‌కౌన్సెంగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
అభ్యర్థులు వీటిల్లో ఏ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్‌కైనా వెళ్లి ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఏ కారణం చేతనైనా పై తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోతే, సెప్టెంబరు 5 (గురువారం) కూడా ఏదో ఒక వెబ్‌సెంటర్‌లో ఆప్షన్లు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.