అనకాపల్లి, న్యూస్‌లైన్: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాల యం అగ్రి ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ కోర్సుల వెబ్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ తగిలింది. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ కేంద్రంలో మంగళవారం మొదలైన కౌన్సెలింగ్‌కు సమైక్యవాదులు అడ్డుతగిలారు. రాష్ట్రం తగలబడుతుం టే వెబ్ కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తార ని వీరు ఆర్‌ఏఆర్‌ఎస్ సిబ్బందిని నిల దీశారు. పరిస్థితి చేజారుతున్న తరుణంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. మరోవైపు ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ అంకయ్య తమకు సహకరించాలని సమైక్యవాదులను కోరారు. ఇరువర్గాల మధ్య చర్చ లు ఫలప్రదం కావడంతో సమైక్యవాదుల ర్యాలీకి ఆర్‌ఏఆర్‌ఎస్ అధికారు లు, సిబ్బంది సంఘీభావం తెలిపారు.
శాంతించిన సమైక్యవాదులు వెబ్‌కౌన్సెలింగ్‌కు అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి వెబ్ కౌన్సెలింగ్ మొదలైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులకు అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ లో వెబ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల, డిప్లొమా ఇన్ అగ్రి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం కోసం ఈ కౌన్సెలింగ్‌ను చేపట్టారు. మంగళవా రం రాత్రి 8.05 గంటలకు కౌన్సెలింగ్ ముగిసింది. మొత్తం 253మంది విద్యా ర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకు న్నారు. ఈ కౌన్సెలింగ్‌కు ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కౌన్సెలింగ్‌కు సమైక్యవాదులు అడ్డుతగలడంతో అక్కడివారు అనకాపల్లికి వచ్చారు.
రాకపోకలకు ఇక్కట్లు...
సమైక్య ఉద్యమం ఉధృతం కావడంతో ఐదు జిల్లాల విద్యార్థులు అనకాపల్లికి చేరడానికి నానా ఇబ్బందులకు గురయ్యారు. విద్యార్థులు రైళ్లు, సొంత వాహనాల్లో ఈ కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. రాత్రి వరకు కౌన్సెలింగ్ జరగడంతో తమ ఇళ్ళకు వెళ్లేందుకు ఇక్కట్ల పాలయ్యారు. తొలుత సమైక్యవాదుల నిరసనలతో కౌన్సెలింగ్ ఆగి పోతుందని ఆందోళన చెందిన విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి ప్రారం భం కావడంతో ఊపిరి పీల్చుకున్నా రు. కౌన్సిలింగ్‌ను ఏడీఆర్ అంకయ్య, పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సరిత పర్యవేక్షించారు.
‘అగ్రి’ కౌన్సెలింగ్‌కు సమైక్య వేడి
Published Wed, Aug 28 2013 3:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM
Advertisement