NG Ranga Agricultural University
-
మార్కెట్లోకి మూడు కొత్త వంగడాలు
సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, అధిక దిగుబడులను సాధించే మూడు కొత్త వంగడాలను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెట్లోకి తీసుకొచి్చంది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో విడుదల చేసిన 109 వంగడాల్లో ఎన్జీ రంగా వర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వంగడాలూ ఉన్నాయి. దేశీ శనగలో నంద్యాల గ్రామ్, పెసరలో లాం పెసర, వేరుశనగలో ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్ 1707) రకాలను వర్శిటీ అభివృద్ధి చేసింది. వీటి ప్రత్యేకతలను వర్శిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ ఆర్. శారదా జయలక్ష్మీదేవి సోమవారం మీడియాకు వివరించారు. ఈ వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. ఆ వంగడాల విశిష్టతలివీ.. నంద్యాల గ్రామ్ (ఎన్‌బీఈజీ 1267): రబీ సీజన్‌కు అనుకూలమైన ఈ శనగ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 20.95 క్వింటాళ్లు. ఎండు తెగులును తట్టుకోగలదు. దేశీ శనగ రకం యంత్రంతో కోతకు అనుకూలం. 1, 2 రక్షిత నీటి పారుదలతో పండించుకోవచ్చు. 15.96 శాతం సీడ్ ప్రొటీన్ ఉంటుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రబీ సీజన్‌కు అనుకూలం. ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్–1707): ఖరీఫ్ సీజన్‌కు అనుకూలమైన ఈ వేరుశనగ రకం పంట కాలం 110 నుంచి 115 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 24.75 క్వింటాళ్లు వస్తుంది. రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్లు, కాండంకుళ్లు, వేరు ఎండు తెగుళ్లను మధ్యస్థంగా తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 70 నుంచి 75 శాతం ఉంటుంది. నూనె 49 శాతం వస్తుంది. 100 గింజల బరువు 40 నుంచి 45 గ్రాములుంటుంది. ప్రొటీన్స్ 29 శాతం. అధిక నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. లాం పెసర (ఎల్జీజీ 610): రబీ సీజన్‌కు అనుకూలమైన ఈ పెసర రకం పంట కాలం 74 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 11.17 క్వింటాళ్లు వస్తుంది. ఎల్లో మొజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుంది. యంత్రంతో కోతకు అనుకూలం. రబీ సీజన్లో వరి మాగాణులకే కాదు.. మెట్ట ప్రాంతాల్లో సైతం సాగుకు అనుకూలం. వీటిలో ప్రొటీన్స్ 23.16 శాతం ఉంటాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశాలలో రబీ సీజన్లో సాగుకు అనువైన రకమిది. -
అపరాలే బెస్ట్
సాక్షి, అమరావతి: రైతులు విత్తు నాటుకునేటప్పుడే కోత సమయంలో తమ పంట ఉత్పత్తులకు ఎంత ధర లభిస్తుందో తెలిస్తే వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. ఏ పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించే అవకాశం ఉందో తెలిస్తే ఆ పంటలనే సాగు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటలు కోతకొచ్చే సమయంలో మార్కెట్లో ధరలు ఎలా ఉండబోతున్నాయో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసే వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం (ఏఎంఐసీ) అంచనా వేస్తోంది. విత్తుకునే సమయంలో ఉండే ధరలు కోతకొచ్చేవేళ ఉండకపోవడంతో రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2019లో ఏఎంఐసీని ఏర్పాటు చేశారు. దీనిద్వారా సీజన్ల వారీగా నిర్దేశించిన పంటల సాగు లక్ష్యం, సాధారణ వాతావరణ పరిస్థితులు, దిగుబడులు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ స్థితిగతులు, వివిధ మార్కెట్ సర్వేల సమాచారం, 25–30 ఏళ్ల మార్కెట్ ధరల హెచ్చుతగ్గులను శాస్త్రీయంగా అంచనా వేస్తున్నారు. సమగ్ర కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్యాకేజీల ద్వారా శాస్త్రీయంగా మూల్యంకనం చేస్తున్నారు. వీటితోపాటు విశ్వవిద్యాలయ గణాంక విభాగ నిపుణులు లోతైన అధ్యయనం చేశాక ఖచ్చితమైన ప్రమాణాల ఆధారంగా పంట ఉత్పత్తులకు ముందస్తు మార్కెట్ ధరలను ఏఎంఐసీ అంచనా వేస్తోంది. తేజా మిరపకే విదేశాల్లో గిరాకీ ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిర్చి విషయానికి వస్తే అధిక ఉత్పత్తి ఫలితంగా ధరలు తగ్గే అవకాశం ఉందని ఏఎంఐసీ అంచనా వేసింది. తేజా రకం మిరపకు మాత్రమే ఎగుమతి రకంగా డిమాండ్ ఉంది. మిగిలిన రకాలకు పెద్దగా ధర లభించే అవకాశాలు ఉండవని అంచనా. ప్రస్తుతం అంచనా వేసిన ముందస్తు ధరలు పంట కోత సమయంలో మద్దతు ధరకు దగ్గరగా లేదా హెచ్చుగా ఉంటాయని ఏఐఎంసీ తెలిపింది. ఇప్పటివరకు విడుదల చేసిన అంచనా ధరల వివరాలను www.angrau.ac.in లో పొందుపర్చింది. వీటిపై విశ్వవిద్యాలయ పరిశోధన, విస్తరణ విభాగాలతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రంలోనూ సంప్రదించొచ్చు. అయితే వాతావరణంలో అసాధారణ మార్పులు, వరదలు, అకాల వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా అంచనా ధరల హెచ్చుతగ్గుల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని ఏఎంఐసీ ప్రకటించింది.ఈ ఉత్పత్తులకు మంచి ధరలు ఖరీఫ్–2024–25 సీజన్ ఊపందుకుంటోంది. 149.32 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగవుతాయని అంచనా వేశారు. ఏఎంఐసీ అంచనా ప్రకారం.. ఈసారి వరి, మొక్కజొన్న, పత్తితో పోలిస్తే అపరాలు, మిరప, పసుపు, వేరుశనగ పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు లభిస్తాయి. ముఖ్యంగా కందులు, మినుములు, పెసలు రైతులకు మార్కెట్లో మంచి ధరలు దక్కుతాయి. తక్కువ ఉత్పత్తి ఖర్చు, స్థిరమైన దేశీయ గిరాకీ, డిమాండ్ కారణంగా ఈ పంటల రైతులు మంచి రాబడిని పొందే వీలుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి మన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సన్నబియ్యం ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా ఈ రకాలు సాగు చేసే రైతులకు మంచి ధర లభిస్తుంది. మిగిలిన వరి రకాల ధరలు కూడా స్థిరంగానే ఉండనున్నాయని ఏఎంఐసీ అంచనా వేసింది. అలాగే బంగ్లాదేశ్, చైనా, వియత్నాం దేశాలకు గణనీయంగా మెరుగుపడిన ఎగుమతుల ద్వారా పత్తి ధరలు లాభదాయకంగా ఉంటాయని అంచనా. ఎగుమతులు పెరగడం, తక్కువ ఉత్పత్తి కారణంగా పసుపు ధరలు కూడా ఆశాజనకంగా ఉండబోతున్నాయి.విత్తుకునే ముందు రైతులకు సమాచారం ప్రధాన పంట ఉత్పత్తులకు ముందస్తు ధరలను నిర్ణయించేటప్పుడు పంట నిల్వలు, సాగు విస్తీర్ణం, ఎగుమతులు, దిగుమతులు, వ్యాపారుల అంచనాలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఏటా రాష్ట్రంలో సాగయ్యే ప్రధాన పంట ఉత్పత్తుల ముందస్తు అంచనా ధరలను అంచనా వేసి విత్తుకునే ముందు రైతులకు స్పష్టమైన సమాచారం అందిస్తున్నాం. విశ్వవిద్యాలయ పరిశోధన, విస్తరణ విభాగాలను సంప్రదించి పంటసాగు నిర్ణయాలను తీసుకునేలా ఏఎంఐసీ రైతులకు అవసరమైన తోడ్పాటునందిస్తోంది. – డాక్టర్ జి.రఘునాథ్‌రెడ్డి, ప్రధాన పరిశోధకులు, వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ కచ్చితమైన సమాచారంతోనే రైతుకు మేలు ప్రస్తుతం పంటల మార్కెట్ ధరలు.. డిమాండ్ సరఫరా సూత్రంతో పాటు స్థానికత, దేశ అవసరాలు, విదేశాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. రైతులకు సకాలంలో ఖచి్చతమైన మార్కెట్ సమాచారాన్ని అందించడం కీలకం. పంటల ఉత్పత్తి సరఫరా కంటే మార్కెట్ ఆధారిత డిమాండ్‌ను గుర్తించడం చాలా ముఖ్యం. స్వాతంత్య్రం వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగినప్పటికీ.. మెజార్టీ రైతులకు నేటికీ నికర ఆదాయం దక్కని పరిస్థితి నెలకొంది. ఏపీ తరహాలోనే ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా అగ్రికల్చర్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ను కలిగి ఉండాలి. ఖచి్చతమైన సమాచారంతో పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వం పెరుగుతుంది.. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. – డాక్టర్ శారద జయలక్ష్మీదేవి, వీసీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
AP: రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8% పెరిగింది
సాక్షి, కడప: వ్యవసాయపరంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే తమ వర్సిటీ లక్ష్యమని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్.ప్రశాంతి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప సమీపంలోని ఊటుకూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో గురువారం నిర్వహించిన కిసాన్‌మేళాలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మన రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగిందని చెప్పారు. బోధన, పరిశోధన, విస్తరణ లక్ష్యంగా తమ విశ్వవిద్యాలయం పనిచేస్తోందన్నారు. ప్రగతిపరంగా దేశంలోనే 11వ స్థానంలో నిలిచామని, దాన్ని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. 2022లో అత్యున్నత స్కోచ్ అవార్డు కూడా సాధించామన్నారు. డ్రోన్ టెక్నాలజీలో డీసీజీఏ సర్టిఫికెట్ కూడా కైవసం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల ఆర్బీకేలకు డ్రోన్లు సరఫరా చేసేందుకు రూ.200 కోట్ల బడ్జెట్ పొందామని, పైలట్, కో పైలట్లకు కడప, తిరుపతి, మార్టూరు, విజయనగరంలలో శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లభించిందని చెప్పారు. -
వ్యవసాయ వర్సిటీకి మొదటి స్థానం
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో రాష్ట్రానికి చెందిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలవగా, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. 2021–22 విద్యాసంవత్సరంలో వ్యవసాయం, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎన్జీ రంగా, హార్టి కల్చర్ అండ్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ కేటగిరీలో ఉద్యాన వర్సిటీ ఈ అవార్డులను దక్కించుకుంది. బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పర్షోత్తమ్‌ఖడోభాయ్ రూ పాలా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రి లోచన్ మహాపాత్ర చేతుల మీదుగా ఎన్జీ రంగా, ఉద్యాన వర్సిటీ వీసీలు డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్ టి.జానకీరామ్ అందుకున్నారు. ఆయా కేటగిరీల్లో అత్యధిక పీజీ స్కా లర్షిప్లు మన రాష్ట్రానికి చెందిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల విద్యార్థులు పొందారు. జాతీయ స్థాయిలో 63 వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పోటీపడిన ఎన్జీ రంగా వర్సిటీ మొదటి స్థానంలో నిలవగా, ఏడు ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో బెంగళూరు ఉద్యాన వర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రెండో స్థానం దక్కించుకుంది. -
వ్యవసాయ విద్య ఆధునీకరణతోనే పూర్తిస్ధాయి ఆహార భద్రత
సాక్షి, విజయవాడ/తిరుపతి: పోషకాహార లోపం, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలన క్రమంలో ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ విద్య ఆధునికతను సంతరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి యువతను ఈ రంగంలో ప్రోత్సహించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ వృత్తిలో వారు నిలదొక్కుకోవటానికి మంచి శిక్షణ అవసరమని సూచించారు. భారత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. చదవండి: సీఎం జగన్ అండగా నిలిచారు.. వారి ఆనందానికి అవధుల్లేవ్.. ఆచార్య ఎన్.జి వ్యవసాయ విశ్వవిద్యాలయం 51వ స్నాతకోత్సవం శుక్రవారం తిరుపతి వేదికగా నిర్వహించారు. విజయవాడ.. రాజ్‌భవన్ నుండి కులపతి హోదాలో హైబ్రీడ్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఐఎఎస్ అధికారిగా ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పనిచేసి ప్రస్తుతం భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని నేషనల్ రెయిన్-ఫెడ్ ఏరియా అథారిటీ సిఇఓ డాక్టర్ అశోక్ దల్వాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావటం విద్యార్ధులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. గవర్నర్ మాట్లాడుతూ ప్రథమ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీని “వ్యవసాయ విద్యా దినోత్సవం”గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. గ్రామీణ ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంపొందించడం వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విధులలో ఒకటిగా ఉండాలన్నారు. పాఠశాల చదువులను ముగించుకున్న వారికి వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలలో శిక్షణ ఇవ్వడం, వ్యవసాయ పాలిటెక్నిక్, సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్, సేంద్రీయ వ్యవసాయంలో డిప్లొమాలు అందించడం కోసం విశ్వవిద్యాలయం చొరవ తీసుకోవటం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగంలో పుష్కలంగా ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. విద్యార్ధులు స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని, రైతు సంఘం పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల ఉన్న బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలని సూచించారు. ఆహార భద్రతపై పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా, సాంకేతికత స్వీకరణ వేగవంతం కావాలన్నారు. భారతీయ వ్యవసాయం డిజిటల్ సాంకేతికతలను అవలంబించాల్సిన అవసరం ఉందన్న గవర్నర్ స్మార్ట్ టెక్నాలజీతో రైతులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే అవకాశం ఉందన్నారు. యువత శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, ధ్యానం సాధన చేయాలని, జీవితాంతం నేర్చుకునే అలవాటును పెంపొందించుకుంటే విజయం సుసాధ్యమని బిశ్వభూషణ్ అన్నారు. రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువత, ఇతర భాగస్వాములకు దూరవిద్య ద్వారా వ్యవసాయ విద్యను విస్తరించాలనే నినాదంతో "ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్"ను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ టెక్నాలజీ, జియో-స్పేషియల్ టెక్నాలజీ, నానో-టెక్నాలజీ వంటి వ్యవసాయ సాంకేతికతలను ఉపయోగించడంలో విశ్వవిద్యాలయం మంచి పురోగతిని కనబరిచిందని,సుస్థిర వ్యవసాయాన్ని సమర్ధించడంలో జరుగుతున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. స్నాతకోత్సవంలో విజయవాడ నుండి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తిరుపతి నుండి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
'పట్టు'న్నోడు రైతు గురుమూర్తి!
పలమనేరు: నెలపాటు సాగు చేసిన పట్టు గూళ్లను నేత్రికల నుంచి విడిపించడానికి ‘పట్టు’ రైతులు పడే పాట్లు చూసి చలించిపోయాడు.. ఆ రైతు. సమయానికి కూలీలు దొరక్కపోవడం.. దీంతో సకాలంలో మార్కెట్‌కు తీసుకువెళ్లకపోవడం వల్ల ఎదురయ్యే కష్టాలను స్వయంగా తాను అనుభవించాడు. దీంతో ఈ కష్టాలకు చెక్ పెట్టాలని భావించిన పట్టు రైతు తానే పట్టు గూళ్లను విడిపించే యంత్రాన్ని తయారు చేశాడు. రూ.40 వేలతోనే యంత్రాన్ని రూపొందించి శాస్త్రవేత్తల మన్ననలందుకున్నాడు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ప్రోగ్రామ్ కింద అందించే రూ.3 లక్షల ప్రోత్సాహకానికి కూడా ఎంపికయ్యాడు. ఇలా అందరికీ ఆదర్శంగా నిలిచిన రైతే.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరుకు చెందిన గురుమూర్తి. ఈయన తయారు చేసిన యంత్రంతో పట్టు రైతుల కష్టాలు తీరాయి. తగ్గిన కూలీల ఖర్చు.. పట్టు పురుగులు నేత్రికల్లో గూళ్లు కట్టాక వాటిని రైతులు జాగ్రత్తగా విడిపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 500 మట్టి (సీడ్) పురుగులను మేపితే సుమారు 400 కిలోల గూళ్లు ఉత్పత్తి అవుతాయి. వెయ్యికిపైగా నేత్రికల్లోని గూళ్లను విడిపించేందుకు రోజుకు 30 మంది కూలీల అవసరముంటుంది. ఒక్కో కూలీకి రోజుకు రూ.300 చొప్పున రూ.9 వేలు ఖర్చు అవుతుంది. అయితే కొన్నిసార్లు సమయానికి కూలీలు దొరకరు. దీంతో గూళ్లను నేత్రికల నుంచి విడిపించడానికి మూడు, నాలుగు రోజులు సమయం పడుతోంది. దీంతో పట్టు గూళ్లను సకాలంలో మార్కెట్‌కు తీసుకెళ్లకపోవడంతో మంచి ధర లభించక పట్టు రైతులు నష్టపోతున్నారు. దీంతో ఈ కష్టాలకు చెక్ పెట్టాలని భావించిన గురుమూర్తి ఈ యంత్రాన్ని తయారుచేశాడు. విద్యుత్ లేకున్నా పనిచేసేలా.. హాఫ్ హెచ్‌పీ మోటారు సాయంతో నడిచే ఈ యంత్రంలోకి పట్టుగూళ్ల నేత్రికలను ఓ వైపు నుంచి ఒకరు పెడుతుంటే మరోవైపున మరొకరు దాన్ని లాగుతుండాలి. నేత్రికల్లోని గూళ్లు అక్కడే పడి యంత్రానికి ఏర్పాటు చేసిన జల్లెడ ద్వారా ముందుకెళ్లి సంచిలో పడతాయి. దీంతోపాటు పట్టు పురుగులు గూడును అల్లేటప్పుడు కొన్ని మల్బరీ ఆకుల్లోనే గూడును కడతాయి. ఇలాంటి ఆకుగూళ్లను సైతం జాగ్రత్తగా విడదీసేలా గురుమూర్తి ఈ యంత్రాన్ని రూపొందించాడు. ఈ యంత్రాన్ని ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా విద్యుత్ లేనప్పుడు సైతం చేతితో తిప్పేలా హ్యాండిల్ ఉంది. బైక్‌ను స్టార్ట్ చేసి దానికి బెల్ట్ వేసి కూడా వాడుకోవచ్చు. ఇటీవల ఈ యంత్రాన్ని పరిశీలించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంజనీర్ రమణ, సీనియర్ శాస్త్రవేత్త డా.బాలహుస్సేన్.. రైతు గురుమూర్తిని అభినందించారు. ఈ యంత్రం పట్టు రైతులకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ప్రోగ్రామ్ కింద గురుమూర్తికి రూ.3 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రూ.1.8 లక్షలు ఆయన చేతికందాయి. పేటెంట్‌కు దరఖాస్తు చేశా నేను ముప్పై ఏళ్లుగా పట్టు పురుగులు పెంచుతున్నా. కూలీల సమస్యను అధిగమించేందుకు ఈ యంత్రాన్ని తయారుచేశా. దీనికి పేటెంట్ కోసం దరఖాస్తు చేశా. పేటెంట్ వచ్చాక యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తా. – గురుమూర్తి, పట్టురైతు -
రైతు ఆర్థికాభివృద్ధే లక్ష్యం
గుంటూరు రూరల్: ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా అభివృద్ధి పరిచిన 24 రకాల నూతన వంగడాలు రైతులకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఉపకులపతి డాక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. హార్టికల్చర్ విశ్వవిద్యాలయం 13 రకాల నూతన వంగడాలను అభివృద్ధి చేసిందన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గుంటూరు నగర శివారు లాం ఫాం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అగ్రిటెక్–2021 ఎగ్జిబిషన్, అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది. చివరి రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ.. పంటల్లో చీడ పీడలను తట్టుకుని నష్టాలను తగ్గించే విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడిందన్నారు. అన్ని జిల్లాల నుంచి రోజుకు 6 వేల మంది రైతులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన 15 రకాల నూతన వంగడాలు, హైబ్రీడ్ వంగడాలు, సేంద్రియ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ల ద్వారా వ్యవసాయం, ట్రాక్టర్లు, గొర్రులు, తదితరాలు రైతులను ఆకట్టుకున్నాయి. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు.. రైతులతో చర్చలు జరిపి పంటల మార్పిడి, నూతన వ్యవసాయ విధానాలపై చర్చించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
రైతు శ్రేయస్సే లక్ష్యం..
సాక్షి, అమరావతి: రైతు శ్రేయస్సే లక్ష్యంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఆశయసిద్ధికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే వినూత్న ప్రయోగంగా ఖ్యాతిగాంచిన వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలతో (ఆర్బీకేలతో) కలిసి అన్నదాతల సంక్షేమానికి, రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్నారు. విశ్వవిద్యాలయం 50వ స్నాతకోత్సవం మంగళవారం తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో జరుగనుంది. వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా పాల్గొనే ఈ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వైస్ చాన్సలర్ చెప్పారు. స్నాతకోత్సవం నేపథ్యంలో ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకునేందుకు వర్సిటీ సహకరిస్తుందన్నారు. దీనివల్ల నాణ్యత పెరుగుతుందని, రైతుకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటివరకు 455 వంగడాల విడుదల యూనివర్సిటీ ఇప్పటివరకు హైబ్రిడ్ సహా 455 పంట వంగడాలను విడుదల చేసింది. 2020లో వర్సిటీ రాష్ట్రస్థాయిలో 22, జాతీయస్థాయిలో 10రరకాల వంగడాలను విడుదల చేసింది. బెల్లంపొడి తయారీకి, నాగజెముడుతో తయారు చేసే ఫ్రూట్‌బార్‌కు పేటెంట్లు వచ్చాయి. 13వ స్థానానికి చేరిన వర్సిటీ ర్యాంకు దేశంలో 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలుంటే గతేడాది వరకు ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ర్యాంకు 31. ఇప్పుడు 13వ స్థానానికి చేరింది. మౌలికవసతులకు తొలి ప్రాధాన్యత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మౌలిక వసతుల కల్పన పెద్ద సమస్యగా మారింది. గుంటూరుకు సమీపంలోని లాం ఫాంలో ప్రధాన భవంతుల నిర్మాణం పూర్తికావొచ్చింది. తిరుపతిలో అగ్రి బిజినెస్ సెంటర్‌ను ముఖ్యమంత్రి, గవర్నర్ మంగళవారం ప్రారంభిస్తారు. ఈ ఏడాది లక్ష క్వింటాళ్ల లక్ష్యం వ్యవసాయంలో విత్తనం ఎంత నాణ్యతగా ఉంటే దిగుబడి అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా నాణ్యమైన విత్తనాన్నే సరఫరా చేయాలని ఆదేశించారు. దానికనుగుణంగానే రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకునే కార్యక్రమానికి యూనివర్సిటీ శ్రీకారం చుట్టింది. 2020–21లో 43,064 క్వింటాళ్ల బ్రీడర్, ఫౌండేషన్ విత్తనాలను రైతులకు సరఫరా చేశాం. ఈ ఏడాది అంటే 2021–22కి ఆ లక్ష్యాన్ని లక్ష క్వింటాళ్లుగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో వినూత్నంగా అమలవుతున్న వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలతో వర్సిటీ కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు అనుసంధానమై రైతులకు రోజువారీ సూచనలు, సలహా ఇస్తున్నాయి. వ్యవసాయ పీజీ కోర్సుల్లో 20 శాతం ఎన్ఆర్ఐ కోటా యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిదిలో వ్యవసాయ పీజీ కోర్సుల్లో 20 శాతం ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా సీట్లు ప్రవేశపెట్టనున్నట్లు వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపా రు. ఆయన సోమవారం తిరుపతి వ్యవసాయ కళాశాలలో మీడియాతో మాట్లాడారు. పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య చాలా త క్కువగా ఉందని, దేశవ్యాప్తంగా డిమాండ్ ఉ న్న నేపథ్యంలో పీజీ కోర్సుల్లో 20 శాతం ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. దీనిద్వారా మరో 34 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. యూజీ కోర్సుల్లో 10 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద ప్రవేశపెట్టామన్నారు. డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్ర వేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే నోటిఫికేష న్ విడుదల చేశామన్నారు. ఈనెల 13న మొదలయ్యే రిజిస్ట్రేషన్ల ప్రకియ 23 వరకు కొనసాగుతుందన్నారు. 10వ తరగతి పాసైనవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4,230 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సెప్టెంబర్‌లోపు అడ్మిషన్లు పూర్తిచేస్తామని తెలిపారు. ఆయన వెంట రిజిస్ట్రార్ గిరిధర్‌కృష్ణ, డీన్ ప్రతాపకుమార్‌రెడ్డి, అసోసియేట్ డీన్ బూచుపల్లి రవీంద్రనాథరెడి తదితరులు ఉన్నారు. -
మారని వైస్ చాన్సలర్ తీరు!
సాక్షి, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ దామోదరనాయుడు అవినీతి, అక్రమాలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఆయన తీరు సరిగా లేదని, మమ్ములను ఇబ్బంది పెడుతున్నారని యూనివర్సిటీ ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ అధికారిగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నను ప్రభుత్వం నియమించింది. ఈయన వర్సిటీ రికార్డులను పరిశీలించి సిబ్బందిని విచారణ చేస్తున్నారు. అయితే వైస్ చాన్సలర్ దామోదర్‌నాయుడు మాత్రం రికార్డులు తారు మారు చేసి, విచారణ అధికారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వర్సిటీలోని సిబ్బంది వీసీని దీర్ఘకాలిక సెలవుపై పంపి సీఐడీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ను ప్రస్తుత వీసీనే నియమించడంతో, వీసీ అక్రమాలకు ఆయన దన్నుగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ను సైతం సస్పెన్షన్ చేసి, రికార్డులు తారు మారు చేయకుండా పారదర్శకంగా విచారణ జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వీసీ మాత్రం తనకు బీజేపీ అగ్రనేతల అండదండలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ విచారణకు హాజరైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విచారణాధికారికి సైతం ఇప్పటికే ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఐఆర్ 27 శాతం సైతం ఉద్యోగులకు అమలు చేయకుండా వీసీ ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఉద్యోగులు యూనివర్సిటీ ఎదుట గత బుధవారం ఆందోళనకు దిగారు. ఉద్యోగోన్నతుల నిరాకరణ 2018లో చేసిన సీఏఎస్ఏ (కాసా) ఉద్యోగోన్నతుల్లో వింత నిబంధనలతో 57 మంది అర్హత ఉన్న ఉద్యోగులకు ఉద్యోగోన్నతులను వీసీ నిరాకరించారు. అక్రమ బదిలీల వేధింపులపై కోర్టు తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడటమే కాకుండా ప్రతివాదులుగా ఉన్న ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేసి వేధింపులకు గురిచేశారు. ఆడిట్ అభ్యంతరాలు, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగుల హక్కు అయిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను ఏడాది కాలంగా నిలుపుదల చేశారు. సుమారు 200 మందికి పైగా విచారణ అధికారి, మార్కెటింగ్ కమిషనర్ ఎదుట ప్రత్యక్షంగా రెండు దఫాలుగా హాజరై తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. 500 మందికిపైగా సిబ్బంది, విద్యార్థులు ఈమెల్స్ ద్వారా వీసీపై ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరుగుతున్నప్పటికీ దామోదర్‌నాయుడు వివిధ వ్యక్తుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధిత సిబ్బంది, విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. గత శనివారం 13వ తేదీ సుమారు వంద మందికిపైగా బాధిత సిబ్బంది వీసీ బెదిరింపు దోరణిపై విచారణ అధికారికి రాత పూర్వక ఫిర్యాదు చేశారు. ఉపకులపతిని ప్రభుత్వం దీర్ఘకాలిక సెలవుపై పంపి పూర్తి స్థాయి విచారణ సీఐడీతో పారదర్శకంగా జరిపించాలని ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు. అవినీతి ఆరోపణలు ఇవే.. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ నిలుపుదల చేసి ఇబ్బందుల పాలు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాక్ట్ (టైపిస్టు) నియామక రాత పరీక్షల లీకేజీలో కీలక పాత్ర పోషించారు. ––ఎన్నికల కోడ్‌ను అతిక్రమించి డి.ఎస్.కోటేశ్వరరావును నోడల్ అధికారిగా నియమించారు. వర్సిటీ వాహనాలను కుటుంబ సభ్యులు అడ్డగోలుగా వాడుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ కంట్రోలర్ రవాణా అధికారి అండదండలతో అక్రమాలు, ఆగడాలకు పాల్పడ్డారు. సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. వర్సిటీ నిధులు ప్రైవేటు బ్యాంకుకు బదిలీ చేసి కుమారుడికి క్విడ్ ప్రోకో ద్వారా ఉద్యోగంతో పాటు, ప్రమోషన్ పొందారు. అక్రమ బదిలీలు, వేధింపులు, ఉద్యోగోన్నతుల్లో కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ సీపీ అనుకూల ముద్ర వేసి తాత్కాలిక ఉద్యోగులను తొలగించారు. కాంట్రాక్టు, టైమ్ స్కేల్ లేబర్ న్యాయమైన కోరికలను సైతం నిరాకరించారు. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. వీటన్నింటికి సంబంధించి ఆధారాలను విచారణాధికారికి వర్సిటీ ఉద్యోగులు అందించారు. -
ఏడు కొత్త వంగడాలు విడుదల
యూనివర్సిటీక్యాంపస్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఏడు నూతన వంగడాలను విడుదల చేశారు. వరిలో మూడు, వేరుశనగలో ఒకటి, శనగలో ఒకటి, మినుములో ఒకటి, పొద్దు తిరుగుడులో ఒకటి చొప్పున వంగడాలను రూపొందించి శనివారం విడుదల చేశారు. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో పరిశోధనా సంచాలకులు ఎన్వీ నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఎంటీయూ –1140 (భీమ), ఎంటీయూ– 1556(తరంగ్), నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఎన్‌డిఎల్‌ఆర్ 7(నంద్యాలసోన) వరి వంగడాలను రూపొందించారు. తిరుపతి నుంచి తొలిసారిగా మినుమపంటలో పరిశోధనలు చేసి టీ బీజీ –104(తిరుపతి మినుము) విడుదల చేశారు. ఈ వంగడాన్ని శాస్త్రవేత్త ప్రశాంతి రూపొందించారు. అలాగే శనగకు సంబంధించి నంద్యాల పరిశోధనా స్థానంలో ఎన్‌బీఈజీ –49(నంద్యాల గ్రామ్ 49) విడుదల చేశారు. వేరుశనగకు సంబంధించి అనంతపురం జిల్లా కదిరి పరిశోధనా స్థానంలో కె1535(కదిరి అమరావతి ) రకాన్ని రూపొందించారు. అలాగే పొద్దుతిరుగుడుకు సంబంధించి నంద్యాల పరిశోధనా స్థానంలో ఎన్‌డీఎస్‌హెచ్– 1012 (ప్రభాత్) రకాన్ని రూపొందించి విడుదల చేశారు. వీటికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. – ఎంటీయూ–1140(భీమ) ఈరకాన్ని పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు పరిశోధనా స్థానంలో రూపొందించారు. ఎంటీయూ–5249, పీఎల్ఏ–8275 రకాలను సంకరపరచి రూపొందించారు. పంటకాలం 140–145 రోజులు. ఈ రకం 130 సెం.మీ ఎత్తుపెరిగి కాండం ధృడంగా వుంటుంది. చేనుపై పడిపోదు. పడిపోయినా తట్టుకునే శక్తి వుంటుంది. దోమపోటును, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. సాధారణ పరిస్థితుల్లో హెక్టార్‌కు ఆరు టన్నులు, అసాధారణ పరిస్థితుల్లో హెక్టార్‌కు 4 టన్నులు దిగుబడి ఇస్తుంది. – ఎంటీయూ–1156(తరంగ్)ః దీనిని మారుటేరు పరిశోధనా స్థానంలో రూపొందించారు. ఎంటీయూ– 1010, ఎంటీయూ–1081 రకాలను సంకరపరిచి రూపొందించారు. ఇది బలమైన గాలులను తట్టుకుంటుంది. పంటకాలం 115–120 రోజులు. వెన్ను పొడవుగా వుండి 200 నుంచి 250 గింజలను గలిగివుంటుంది. హెక్టార్‌కు 7.5 టన్నులు దిగుబడి ఇస్తుంది. దోమపోటు, అగ్గితెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. –టీబీజీ –104( తిరుపతి మినుము ఒకటి): పీయూ– 19,ఎల్బీజీ–623 రకాలను సంకరపరిచి రూపొందించారు. ముధురు ఆకుపచ్చని ఆకులు కలిగివుంటాయి. పంటకాలం 75 –85 రోజులు. దిగుబడి హెక్టారుకు 15 నుంచి 18 క్వింటాళ్లు ఇస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది. తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అభివృద్ధిపరిచారు. –ఎన్‌బీఈజీ–49(నంద్యాల గ్రామ్49) ః ఇది దేశవాళీ శనగరకం. అన్నెగిరిరకాన్ని, ఐసీసీ– 4958 రకాన్ని సంకర పరచి రూపొందించారు. నంద్యాల పరిశోధనా స్థానంలో రూపొందించిన ఈరకం ద్వారా గింజలు మంచి నాణ్యతతో గోధుమరంగు కలిగివుంటాయి. హెక్టార్‌కు 20 నుంచి 25 క్వింటాళ్లు దిగుబడి సాధిస్తాయి. పంటకాలం 90–105 రోజులు. –కె1535( కదిరి అమరావతి ): కదిరి–6,ఎన్సిఎసి–2242 రకాలను సంకరపరిచి అభివృద్ధి చేశారు. కాలపరిమితి 115–120 రోజులు. హెక్టార్‌కు 1705 కిలోల దిగుబడి ఇస్తుంది. అనంతపురం జిల్లా కదిరి పరిశోధనా స్థానంలో దీనిని రూపొందించారు. బెట్టపరిస్థితులను తట్టుకుంటుంది. మొవ్వకుళ్లు, ఆకుమచ్చ, రసంపీల్చే పురుగు తెగులను తట్టుకోగలదు. –ఎన్‌డిఎల్‌ఆర్–7(నంద్యాలసోన): ఈ వరిరకాన్ని నంద్యాల పరిశోధనా స్థానంలో రూపొందించారు. బీపీటీ –3291, సిఆర్–157 రకాలను సంకరపరిచి రూపొందించారు. పంటకోత దశలో పైరు పడిపోదు. గింజరాలదు. మంచి రుచిగల అన్నం మరుసటిరోజు వరకు నిల్వ సామర్థ్యం కలిగివుంటంది. బీపీటీ –5204 రకంతో పోల్చినప్పుడు 10.8 శాతం అధిక దిగుబడి సాధిస్తుంది. పంటకాలం 140 రోజులు. – ఎన్‌డీఎస్‌హెచ్–1012 (ప్రభాత్)ః ఎన్డీసీఎంఎస్–30ఎ,ఆర్ –843 రకాలను సంకరపరిచి రూపొందించిన పొద్దుతిరుగుడ రకం. తక్కువ కాలపరిమితితో అధిక నూనె శాతం గల సంకరరకం. ఎకరానికి 6 నుంచి 7 క్వింటాళ్లు వర్షాధారం కింద, 8 నుంచి 10 క్వింటాళ్లు నీటి పారుదల పరిస్తితుల్లో ఇస్తుంది. నూనె దిగుబడి హెక్టార్‌కు 705 క్వింటాళ్లు లభిస్తుంది. నంద్యాల పరిశోధనా స్థానంలో దీనిని రూపొందించారు. -
ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయ స్నాతకోత్సవం
-
‘మహా ప్రభో..మా గోడు వినండి’
- నిరవధిక సమ్మెలో ఏజీ వర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగులు - రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ఏల ఊసెత్తని ప్రభుత్వం - డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ సాక్షి ప్రతినిధి, తిరుపతి ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కేంద్రాల్లో పనిచేసే టైమ్‌స్కేల్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడచిన నెల రోజులుగా వీరు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెల రోజుల్లోగా డిమాండ్లను పరిష్కరిస్తామన్న వర్సిటీ అధికారులు మళ్లీ ఉద్యోగుల ముఖం చూసింది లేదు. దీంతో టైమ్‌స్కేల్ ఉద్యోగులంతా డిమాండ్ల సాధన కోసం రోజుకో పద్దతిలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం 900 మంది టైమ్‌స్కేల్ ఉద్యోగులున్నారు. వీరంతా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగాల్లో నియమితులైన వారే. అప్పట్లో మొత్తం 1650 మంది ఉద్యోగాల్లో చేరగా, 2014 నాటికి 900 మంది మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ప్రభుత్వం వీరికి మూలవేతనం, డీఏలను మాత్రమే చెల్లిస్తోంది. ఇవి రెండూ కలిపి ఒక్కొక్కరికీ నెలకు రూ. 14 వేల వరకూ అందుతున్నాయి. వీరి నియామకాల సమయంలో హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్సులపై ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంతేకాకుండా జీవో నెంబరు 119 కింద వీరి ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా వీరి సమస్యలపై స్పందించనే లేదు. ఇప్పటికి పలు మార్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు, వర్సిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణలను కలిసిన టైమ్‌స్కేల్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. వారి నుంచి సరైన స్పందన కరువవడంతో గుంటూరులోని వర్సిటీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. గుంటూరు,తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, కడప, కర్నూలుల్లో వర్సిటీ పరిధిలోని టైమ్‌స్కేల్ ఉద్యోగులు రోజుకో విధంగా నిరసనలు, ఆందోళనలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని యూనివర్సిటీ టైమ్‌స్కేల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ మురళీ కోరుతున్నారు. -
అగ్రీ వర్సిటీ వీసీ పోస్టుకు పోటాపోటీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పోస్టుకు రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి గుంటూరుకు సమీపంలోని లాంఫారానికి తరలిపోయిన విశ్వవిద్యాలయానికి పాలక మండలి వ్యవహారం కొలిక్కి రావడంతో ఇక పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇతర యూనివర్శిటీల మాదిరి వ్యవసాయ వర్శిటీకి వైస్ ఛాన్సలర్ నియామకానికి సెర్చ్ కమిటీ (శోధక సంఘం) ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయ రంగ ప్రముఖులతో చర్చించి తనకు ఇష్టమైన వారిని నియమించుకునే స్వేచ్ఛ ఉంది. ఈ పదవికి పోటీ పడుతున్న వారిలో ప్రస్తుత ఇన్చార్జీ వీసీ విజయకుమార్‌తో పాటు నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ వరప్రసాద్, మరట్వాడ యూనివర్శిటీ వీసీగా ఉన్న తెలుగు వ్యక్తి డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, యూనివర్శిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణ, యూనివర్శిటీ ప్రస్తుత అధికారులు ఆర్. వీరరాఘవయ్య, రమేష్‌బాబు, డాక్టర్ సుధాకర్, ఆలపాటి సత్యనారాయణ తదితరులున్నారు. అధికార పార్టీలోని తమ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యలతో ఎవరికి వారు పైరవీలు చేయించుకుంటున్నారు. -
రెండు రాష్ట్రాల్లోనూ సవాళ్లు ఎదుర్కొందాం..
ఏజీవర్సిటీ : ప్రస్తుతం వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధిగమించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టిసారించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.పద్మరాజు పిలుపునిచ్చారు. దేశ ఆహారభద్రత దృష్ట్యా రెండురాష్ట్రాల్లోని రైతు కుటుంబాలు వ్యవసాయాన్ని కొనసాగించి ఇంకా పురోగతి సాధించేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ శాస్త్రవేత్తపై ఉందన్నారు. విశ్వవిద్యాలయం 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం రాజేంద్రనగర్‌లోని వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట స్వర్ణోత్సవాలు ప్రారంభించారు. దీనికి విచ్చేసిన వీసీ పద్మరాజు మాట్లాడుతూ వ్యవసాయ బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో వర్సిటీ మరింత ముందుకెళ్లడానికి శాస్త్రవేత్తలు,అధికారులు కృషిచేయాలని కోరారు. వర్సిటీ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో సేవలందిస్తూ రైతునేస్తంగా వెలుగొందుతున్నారని ప్రశంసించారు. కాగా స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ ఏడాది జూన్ నుంచి జూన్ 2015వరకు స్వర్ణోత్సవ సంవత్సరంగా ప్రకటిస్తూ ప్రణాళికను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌రావు, టివికె సింగ్, రాజారెడ్డి, రాజిరెడ్డి, మీనాకుమారి, వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగుల ఆందోళన : స్వర్ణోత్సవాల్లో భాగంగా అధికారులు వర్సిటీ గేయాన్ని మైక్ ద్వారా వినిపించేందుకు యత్నించారు. అందులో ‘ఆంధ్రనాట వెలసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం’ అని ఉండడంతో తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గేయానికి బదులు తెలంగాణ రాష్ట్ర గేయమైన జయహే జయహే తెలంగాణ..పాటను పెట్టాలనడంతో అధికారులు దిగొచ్చి తెలంగాణ గేయాన్ని పెట్టడంతో ఆందోళన సద్దుమణిగింది. సాదాసీదాగా స్వర్ణోత్సవాలు : ప్రపంచంలోనే వ్యవసాయవిద్యలో పేరెన్నికగల ఏజీ వర్సిటీ స్వర్ణోత్సవాలు సాదాసీదాగా ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నారు. వర్సిటీ పరిధిలోని ఏ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి ఆడంబరం కనిపించలేదు. వర్సిటీ ప్రధానద్వారాల్లో కూడా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, వ్యవసాయ పరిశోధనా ఫలితాల వివరాలు తెలిపే సమాచారం కనిపించలేదు. రైతుసేవే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల్లో కనీసం ఒక్కరైతును కూడా ఆహ్వానించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రవేశాలు: ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్
ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్ పార్ట్ టైం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ(సివిల్): స్ట్రక్చరల్ ఇంజనీరింగ్/ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ ఎంఈ(ఎలక్ట్రికల్): ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్ ఎంఈ(ఈసీఈ): డిజిటల్ సిస్టమ్స్, సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్/ మైక్రోవేవ్ అండ్ రాడార్ ఇంజనీరింగ్ ఎంఈ(మెకానికల్): ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్/టర్బో మెషినరీ ఎంటెక్ (సీఎస్ఈ): కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దరఖాస్తులకు చివరి తేది: జూన్ 3 వెబ్సైట్: www.uceou.edu ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీహెచ్డీ:అగ్రికల్చరల్/హోంసైన్స్/అగ్రి కల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎమ్మెస్సీ: అగ్రికల్చరల్/ హోంసైన్స్/ఫుడ్ టెక్నాలజీ ఎంటెక్: అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఎంబీఏ: అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ దరఖాస్తులకు చివరి తేది: జూన్ 16 వెబ్సైట్: www.angrau.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, గ్వాలియర్(మధ్యప్రదేశ్) కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(పీజీడీఎం) వ్యవధి: రెండేళ్లు విభాగాలు: టూరిజం అండ్ ట్రావెల్, సర్వీసెస్, ఇంటర్నేషనల్ బిజినెస్ (ఇంటర్నేషన ల్ టూరిజం/ టూరిజం అండ్ లాజిస్టిక్స్) / టూరిజం అండ్ కార్గో, టూరిజం అండ్ లీజర్ అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌లకు 45 శాతం మార్కులు. క్యాట్/మ్యాట్/సీమ్యాట్/జీమ్యాట్/గ్జాట్లలో ఏదైనా ఒకదాంట్లో అర్హత పొంది ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది: మే 31 వెబ్సైట్: www.iittm.org -
ఎన్‌జిరంగా అగ్రికల్చలర్ 44వ స్నాతకోత్సవం
-
ఎన్జీ రంగా వర్సిటీకి 50 ఏళ్లు
2014 జూన్ నుంచి 2015 మే వరకూ స్వర్ణోత్సవాలు హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయ రంగానికి దిక్సూచీగా నిలుస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. విశ్వవిద్యాలయం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 2014 జూన్ నుంచి 2015 మే వరకూ స్వర్ణోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు శుక్రవారమిక్కడ యూనివర్సిటీ వీసీ పద్మరాజు వెల్లడించారు. వేడుకల్లో భాగంగా కిసాన్ మేళాలు, వ్యవసాయ ప్రదర్శనలు, రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ అయ్యప్పన్ ఏజీ వర్సిటీ గోల్డెన్ జూబ్లీ(స్వర్ణోత్సవ) లోగోను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏజీ వర్సిటీని ఐసీఏఆర్ జాతీయ స్థాయిలో రెండుసార్లు ఉత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా గుర్తించిందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ పాలక మండలి సభ్యులు ఎస్.ఎల్. గోస్వామి, సిద్దిఖీ, అల్దాస్ జానయ్య, తదితరులు పాల్గొన్నారు. ఇదీ ప్రస్థానం... ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఏపీఏయూ)గా 1964, జూన్ 12న ప్రారంభ మైంది. ప్రముఖ రైతు నాయకుడు, పార్లమెంటేరియన్ ఆచార్య ఎన్జీ రంగా స్మారకార్థం 1996, నవంబరు 7న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 2,500 ఎకరాల క్యాంపస్‌తో దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయంగా పేరు పొందింది. ఇప్పటివర కూ 40 వేల మంది వ్యవసాయ పట్టభద్రులను దేశానికి అందించింది. -
ఎన్జీరంగా వర్సిటీలో 6 నెలలు ఇన్చార్జి పాలన
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాల యంలో మరో 6 నెలల పాటు ఇన్చార్జి అధికారుల పాలన కొనసాగనుంది. అయితే, రిజిస్ట్రార్ పోస్టును ప్రవీణ్రావుకే మళ్లీ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఇక్కడ జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే, సిద్ధిపేటలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఏఆర్ఎస్), నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు వర్సిటీ పాలకమండలి సభ్యుడు తెలిపారు. కాగా, వర్సిటీకి చెందిన వందల ఎకరాలు కబ్జాకు గురవుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ విద్యా ర్థి జేఏసీ పాలకమండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. -
వ్యవసాయ కోర్సులకు రేపటి నుంచి వెబ్ కౌన్సెలింగ్
సాక్షి,హైదరాబాద్: వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ కోర్సులకు సెప్టెంబరు 2, 3, 4 తేదీల్లో ఉమ్మడి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం(సెంట్రల్ లైబ్రరీ), తిరుపతి, బాపట్ల, రాజమండ్రిలోని వ్యవసాయ కళాశాలలు, వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, గన్నవరం, ప్రొద్దుటూరుల్లోని పశువైద్య కళాశాలలు, వరంగల్, జగిత్యాల, అనకాపల్లి, నంద్యాలల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో వెబ్కౌన్సెంగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు వీటిల్లో ఏ వెబ్ కౌన్సెలింగ్ సెంటర్‌కైనా వెళ్లి ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఏ కారణం చేతనైనా పై తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోతే, సెప్టెంబరు 5 (గురువారం) కూడా ఏదో ఒక వెబ్సెంటర్లో ఆప్షన్లు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. -
ఎన్జీ రంగా వర్సిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, అనుబంధ కోర్సులకు సంబంధించి ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. డిప్లొమా కోర్సులకు ఆగస్టు 19న కౌన్సెలింగ్ మొదలై 21న ముగుస్తుంది. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరామన్న గూడెం(తాడేపల్లి గూడెం) మినహా మిగతా పది కేంద్రాల్లో ఈ తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. డిగ్రీ కోర్సులకు 22వ తేదీ నుంచి 24 వరకు కౌన్సెలింగ్ 11 కేంద్రాల్లో జరుగుతుందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్ ముగిశాక డిఫెన్స్, స్పోర్ట్స్, ఎన్సీసీ, వికలాంగుల కోటాను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరుతో కౌన్సెలింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించి అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వడం లేదని, ఆగస్టు 8న ఇచ్చిన నోటిఫికేషన్లో సూచించిన ప్రకారం ‘గ్రేడ్ పాయింట్ సగటు’ ప్రకారం విద్యార్థులు నిర్ణీత కౌన్సెలింగ్ సెంటర్లలో హాజరు కావాలని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.