హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాల యంలో మరో 6 నెలల పాటు ఇన్‌చార్జి అధికారుల పాలన కొనసాగనుంది. అయితే, రిజిస్ట్రార్ పోస్టును ప్రవీణ్‌రావుకే మళ్లీ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఇక్కడ జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే, సిద్ధిపేటలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఏఆర్‌ఎస్), నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు వర్సిటీ పాలకమండలి సభ్యుడు తెలిపారు. కాగా, వర్సిటీకి చెందిన వందల ఎకరాలు కబ్జాకు గురవుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ విద్యా ర్థి జేఏసీ పాలకమండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
ఎన్జీరంగా వర్సిటీలో 6 నెలలు ఇన్‌చార్జి పాలన
Published Wed, Jan 1 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement