సాక్షి, కడప: వ్యవసాయపరంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే తమ వర్సిటీ లక్ష్యమని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్.ప్రశాంతి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప సమీపంలోని ఊటుకూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో గురువారం నిర్వహించిన కిసాన్‌మేళాలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మన రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగిందని చెప్పారు. బోధన, పరిశోధన, విస్తరణ లక్ష్యంగా తమ విశ్వవిద్యాలయం పనిచేస్తోందన్నారు.
ప్రగతిపరంగా దేశంలోనే 11వ స్థానంలో నిలిచామని, దాన్ని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. 2022లో అత్యున్నత స్కోచ్ అవార్డు కూడా సాధించామన్నారు. డ్రోన్ టెక్నాలజీలో డీసీజీఏ సర్టిఫికెట్ కూడా కైవసం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల ఆర్‌బీకేలకు డ్రోన్లు సరఫరా చేసేందుకు రూ.200 కోట్ల బడ్జెట్ పొందామని, పైలట్, కో పైలట్లకు కడప, తిరుపతి, మార్టూరు, విజయనగరంలలో శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లభించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment