growth rate
-
ఈఎంఐలు ఇక దిగొస్తాయ్!
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్లుగా దాదాపు ఐదేళ్ల తర్వాత రుణ గ్రహీతలకు ఆర్బీఐ నుంచి చల్లని కబురు అందింది. కీలక రెపో రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు ఇక దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పెరగడమే కానీ, తగ్గడమంటే ఏంటో తెలియని గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ముంబై: రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించేలా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీంతో ఈ ప్రామాణిక వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగి రానుంది. గవర్నర్ సారథ్యంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో కేంద్రం మధ్య తరగతి వర్గాలకు ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించిన వెంటనే ఆర్బీఐ కూడా తీపి కబురు అందించడం విశేషం. కాగా, ప్రస్తుత పాలసీ విషయంలో ప్రస్తుత తటస్థ (న్యూట్రల్) విధానాన్నే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వృద్ధి రేటు ఇలా...: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. మరోపక్క, ద్రవ్యోల్బణం కూడా 4.2 శాతానికి (ఈ ఆర్థిక సంవత్సరం అంచనా 4.8 శాతం) దిగొస్తుందని లెక్కగట్టింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4 శాతానికి (నాలుగేళ్ల కనిష్టం) తగ్గిపోవచ్చని, ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేయడం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతం గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత నెమ్మదిగా శాంతిస్తూ.. నవంబర్‌లో 5.48 శాతానికి, డిసెంబర్లో 5.22 శాతానికి దిగొచ్చింది. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి వెంటాడుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం భయాలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇచ్చింది. ఈ పరిణామాలతో రూపాయి ఘోరంగా పడిపోతోంది. తాజాగా డాలరు మారకంలో సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 87.60కి క్రాష్ అవ్వడం తెలిసిందే. ఈ తరుణంలో ఆర్బీఐ రేట్ల కోత దేశీయంగానూ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని, రూపాయి పతనంతో విదేశీ నిధులు మరింత తరలిపోయే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.రెపో రేటు అంటే.. బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటునే రెపో (రీపర్చేజ్) రేటుగా వ్యవహరిస్తారు. రెపో అధికంగా ఉంటే బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది, దీంతో రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతాయి. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదలాయిస్తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత కార్పొరేట్ లోన్లపైనా వడ్డీ భారం తగ్గుతుంది. అయితే, రెపో రేటు తగ్గడం వల్ల డిపాజిట్ రేట్లతో పాటు ఇతర పొదుపు సాధనాలపై కూడా తక్కువ వడ్డీ లభిస్తుంది.ఇతర ముఖ్యాంశాలు... → సైబర్ మోసాలకు అడ్డకట్ట వేసి, భద్రతను కట్టుదిట్టం చేయడం కోసం ప్రత్యేకంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటర్నెట్ డొమైన్‌ను డాట్ ఇన్ (.in)కు మార్చుకోవాలి. అంటే బ్యాంకులు ‘bank.in’, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ‘fin.in’ ఉపయోగించాలి. బ్యాంకు డొమైన్ మార్పు 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండగా.. నాన్–బ్యాంకులకు రాబోయే రోజుల్లో అమలు చేయనున్నారు.→ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీలో రిజిస్టర్ అయిన బ్యాంకింగేతర బ్రోకరేజ్ సంస్థలు తమ క్లయింట్ల తరఫున... ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల కోసం ఇక నేరుగా నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్–ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–ఓఎం) ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నియంత్రిత సంస్థలకు, బ్యాంకులు, ప్రత్యేక ప్రైమరీ డీలర్ల తరఫున క్లయింట్లకే అందుబాటులో ఉంది. → తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 7–9 తేదీల్లో జరుగుతుంది.గృహ రుణంపై ఊరట ఎంతంటే..? ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 9 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ. 25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,493 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.22093కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.400 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ. 96 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.5ఏళ్లలో తొలిసారి.. 2020 తర్వాత తొలి సారి రెపో రేటు ను తగ్గించగా.. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ కీలక రేట్లలో మార్పులు చేయడం విశేషం. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఆర్బీఐ రెపో రేటును ఏకధాటిగా 4% నుంచి 6.5 శాతానికి, అంటే 2.5% పెంచేసింది. ఆ తర్వాత రేట్లలో మార్పు లేకుండా యథాతథ పాలసీని కొనసాగిస్తూ వస్తోంది. ఇక గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఆల్‌టైమ్ కనిష్టాన్ని (దాదాపు 6%) తాకిన తర్వాత కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం 9–9.5% రేంజ్లో తీవ్ర భారంగా మారాయి. అధిక వడ్డీ రేట్లకు తోడు పన్నుల భారం ధరల పెరుగుదల డెబ్బతో గత రెండేళ్లుగా ఇల్లు కొనాలంటే బెదిరిపోయే పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణ గ్రహీతలకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.సానుకూల పరిస్థితులతోనే... గడిచిన కొన్ని పాలసీ చర్యల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలున్నాయి. 2025–26లో ద్రవ్యోల్బణం మరింత శాంతించి ఆర్బీఐ టార్గెట్ (4%) స్థాయికి చేరుతుందని భావిస్తున్నాం. ఈ సానుకూల పరిస్థితుల కారణంగానే మందగమనంలో ఉన్న వృద్ధికి తోడ్పాటు అందించేలా ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటు కోతకు మొగ్గు చూపింది. 2024–25 రెండో త్రైమాసికంలో వృద్ధి 5.4 శాతానికి (రెండేళ్ల కనిష్టం) తగ్గిన తర్వాత మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ వృద్ధి–ద్రవ్యోల్బణం లెక్కలను భేరీజు వేసుకునే నిర్ణయం ప్రకటించాం. స్థూల ఆర్థిక అంచనాల మేరకు భవిష్యత్తు సమావేశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటాం. ఫైనాన్షియల్ వ్యవస్థలో తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) ఉండేలా అవసరమైన చర్యలన్నీ చేపడతాం. భారత్ మళ్లీ కచ్చితంగా 7 శాతానికి మించి వృద్ధి రేటు సాధిస్తుంది. బడ్జెట్లో ఆదాయపు పన్ను ఊరట వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు, నిజానికి ఇది వృద్ధికి చేదోడుగా నిలుస్తుంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, డాలరుతో దేశీ మారకం విలువ ’నిర్దిష్ట స్థాయి లేదా శ్రేణి’లో ఉండాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోలేదు. – సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్సమయానుకూల నిర్ణయం.. ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయం సరైన సమయంలో వెలువడింది. నియంత్రణపరంగా చేపట్టిన చర్యలను కూడా స్వాగతిస్తున్నాం. – సి.ఎస్. శెట్టి, ఎస్బీఐ చైర్మన్ ఇది సరిపోదు... ఆర్బీఐ పావు శాతం రేట్ల తగ్గింపు వల రియల్ ఎస్టేట్ పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉంటుంది. మొత్తం డిమాండ్‌ను పెంచి, ఇళ్ల విక్రయాలు జోరందుకోవాలంటే (ముఖ్యంగా అందుబాటు ధరల విభాగంలో) మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని ఆశిస్తున్నాం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడుహౌసింగ్కు బూస్ట్... ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేపో తగ్గింపు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. దీంతో మళ్లీ ఇళ్ల కొనుగోళ్లు పుంజుకునేందుకు దోహదం చేస్తుంది. – జి. హరిబాబు, నరెడ్కో జాతీయ అధ్యక్షుడు -
7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రెండవ త్రైమాసికంలో 5.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయడాన్ని ‘‘తాత్కాలిక ధోరణి’’గా ఫిక్కీ ప్రెసిడెంట్, ఇమామీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష వర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.5 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని పరిశ్రమ సంఘం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులూ పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అగర్వాల్ పేర్కొన్న ముఖ్యాంశాలు... → రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం –ఆర్థిక వృద్ధికి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల విషయంలో ఆర్బీఐ పూర్తి పరిపక్వతతో వ్యవహరిస్తోంది. → వచ్చే నెలలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశానికి భారీ సవాళ్లు వస్తాయని నేను భావించడం లేదు. → భౌగోళికంగా–రాజకీయంగా ఇప్పుడు ప్రతి దేశం వాటి ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు భారీ సవాళ్లు ఉంటాయని నేను భావించడం లేదు. ముఖ్యంగా మెక్సికో, చైనా తదితర దేశాలకు టారిఫ్‌లు ఎక్కువగా ఉండవచ్చు. → ట్రంప్ పాలనా కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే, భారత్ పరిశ్రమలకు అవకాశాలు లభించే అనేక అంశాలు ఉన్నాయి. → భారత్ ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి వ్యయాలు మరింత పెరగాలి. సామర్థ్య వినియోగ స్థాయిలు 75 శాతానికి చేరాలి. ఇది సాధ్యమయ్యే విషయమేనని మేము విశ్వసిస్తున్నాం. → వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన మూలధన వ్యయాలను 15 శాతం పెంచాలని ఛాంబర్ బడ్జెట్ ముందస్తు సిఫార్సు చేసింది. → టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు) సరళీకరణ, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ పురోగతికి బడ్జెటరీ కేటాయింపులు వంటి అంశాలనూ ఫిక్కీ సిఫారసు చేసింది. -
వృద్ధి తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో అనిశి్చతులు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తిరిగి గాడిన పడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు, వృద్ధికి సంబంధించి చర్యలు, మౌలిక వసతులపై ఖర్చు చేయడం సహజంగానే తగ్గుతాయి. ప్రస్తుత త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో పండుగల వ్యయాలకుతోడు, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి పుంజుకోవడం, మౌలిక వసతులపై వ్యయాలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వచ్చే మార్చి చివరికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాం’’అని టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన సదస్సులో భాగంగా మంత్రి గోయల్ చెప్పారు. తయారీ, మైనింగ్ రంగాల్లో బలహీన పనితీరుతో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు గోయల్‌పై విధంగా బదులిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వృద్ధి 8.1 శాతంగా ఉండడం గమనించొచ్చు. చివరిగా 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో జీడీపీ 4.3 శాతం కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసింది. అయినా వేగవంతమే.. ఇప్పటికీ ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గోయల్ చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు, ఆవిష్కరణలు దేశ వృద్ధి రేటును నడిపిస్తాయన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.6 శాతమే కావడం గమనార్హం. ప్రతిపక్ష పారీ్టలు చేస్తున్న తప్పుడు, ప్రతికూల ప్రచారం దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోలేవన్నారు. ‘‘వక్ఫ్ బిల్లు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల ఆమోదానికి కట్టుబడి ఉన్నాం. ఇవి నిర్మాణాత్మక మార్పులు. దేశానికి మంచి చేసే వీటి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం’’అని చెప్పారు. -
పరిశ్రమలు రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు నెలలో ప్రతికూలానికి పడిపోయింది. మైనస్ 0.1 శాతంగా నమోదైంది. పరిశ్రమల ఉత్పత్తిని ప్రతిబింబించే పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపీ) వృద్ధి జూలై నెలకు 4.7 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఆగస్టు నెలలోనూ ఐఐపీ 10.9 వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా మైనింగ్, విద్యుదుత్పత్తి రంగంలో క్షీణత ఐఐపీ పడిపోవడంలో కీలకంగా పనిచేసింది. అదే సమయంలో తయారీ రంగంలోనూ ఉత్పాదకత పుంజుకోలేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. ఇక ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు (ఐదు నెలల్లో) ఐఐపీ వృద్ధి 4.2 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన 6.2 శాతం కంటే తక్కువ. వృద్ధి రేటు మైనింగ్ రంగంలో మైనస్ 4.3 శాతానికి పడిపోయింది. విద్యుదుత్పత్తి రంగంలో మైనస్ 3.7 శాతంగా నమోదైంది. తయారీలో 0.1 శాతంగా ఉంది. ఆగస్ట్ నెలలో అధిక వర్షాలు మైనింగ్ రంగంలో వృద్ధి క్షీణతకు కారణమని ఎన్ఎస్వో తెలిపింది. చివరిగా 2022 అక్టోబర్ నెలలో ఐఐపీ వృద్ధి ప్రతికూలంగా నమోదు కావడం గమనార్హం. -
వృద్ధి బాటలో అదానీ ఎనర్జీ
న్యూఢిల్లీ: విద్యుత్ ప్రసార కంపెనీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 18.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,54,660 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువను సాధించినట్లు బ్రోకరేజీ కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ పేర్కొంది. పటిష్ట వృద్ధిలోనున్న బిజినెస్ కారణంగా కంపెనీ ఆదాయం, పన్నుకుముందు లాభాల్లో భారీ పురోగతికి వీలున్నట్లు అంచనా వేసింది. రానున్న మూడేళ్లలో ఆదాయం వార్షిక ప్రాతిపదికన 20 శాతం, పన్నుకుముందు లాభాలు 29 శాతం చొప్పున పుంజుకోగలవని అభిప్రాయపడింది. కంపెనీ విద్యుత్ ప్రసారం, పంపిణీ ఆస్తులతోపాటు.. స్మార్ట్ మీటరింగ్ బిజినెస్‌లను కలిగి ఉంది. మూడేళ్ల(2024 నుంచి 2027) కాలంలో వార్షిక ప్రాతిపదికన ఆదాయం 20 శాతం, నిర్వహణ లాభం(ఇబిటా) 29 శాతం చొప్పున పురోగమించనున్నట్లు కాంటర్ ఫిట్జ్ అంచనా వేసింది. -
అభివృద్ధికి చిరునామా వైఎస్ జగన్ పరిపాలన
-
Deloitte: గృహ వినియోగ మార్కెట్ 19.67 లక్షల కోట్లు
ముంబై: భారత్‌లో ఇళ్లు, గృహ వినియోగ మార్కెట్ (హోమ్, హౌస్‌హోల్డ్) 2030 నాటికి 237 బిలియన్ డాలర్లకు (రూ.19.67 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ అంచనా వేసింది. ఏటా 10 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు కొనసాగుతుందంటూ.. ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, వివిధ ఉత్పత్తుల పరంగా సౌకర్యం, సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని సానుకూలతలుగా తన నివేదికలో ప్రస్తావించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. ఓమ్నిచానల్ రిటైల్, ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానానికి సాయపడుతున్నాయని, పట్టణాలకు వెలుపలి ప్రాంతాలకు ఇవి చేరుకుంటున్నాయని పేర్కొంది. గృహస్థుల ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వస్తుండడం, సులభంగా రుణాలు లభిస్తుండడం, యువ కస్టమర్లు ఆధునిక డిజైన్లు, గృహ నవీకరణ, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ మార్కెట్ వృద్ధికి చోదకాలుగా తెలిపింది. హౌస్‌హోల్డ్ (ఇంట్లో వినియోగించే ఉపకరణాలు) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. విక్రయానంతర సేవలు, వారంటీపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ వినియోగదారులు ప్రీమియం, బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, కంపెనీలు ఈ–చానళ్ల రూపంలో కస్టమర్లకు ముందుగా చేరువ అవుతున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. వినియోగదారులకు మెరుగైన అనుభవం, డిజైన్ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణపై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్టు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. సోషల్ మీడియా, అత్యాధునిక సాంకేతికతల సాయంతో కంపెనీలు తమ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నట్టు డెలాయిట్ నివేదిక వివరించింది. ఇంధన ఆదా గృహోపకరణాలకు, పర్యావరణ అనుకూల కిచెన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు నీటిని ఆదా చేసే బాత్రూమ్ ఫిట్టింగ్‌లు, ఇంధన ఆధా టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్నాయని వెల్లడించింది. పీఎల్ఐ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజాల, ఎస్ఎంసీ, పీఎం మిత్ర పథకాల మద్దతుతో డిమాండ్ పెరుగుతుండడం, హౌస్‌హోల్డ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది. -
ఎకానమీ జోరుకు బ్రేకులు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతంగా నమోదయ్యింది. గడచిన 15 నెలల కాలంలో ఇంత తక్కువ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎకానమీ 6.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. వ్యవసాయం, సేవా రంగాల పేలవ పనితీరు తాజా లెక్కలపై ప్రభావం చూపినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 8.2 శాతం. తాజా సమీక్షా కాలానికి ముందు త్రైమాసికంలో (జనవరి–మార్చి) రేటు 7.8 శాతం. 6.7 శాతం వృద్ధి ఎలా అంటే.. 2024–25 తొలి త్రైమాసికంలో 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని మదింపుచేసే జీడీపీ విలువ రూ.43.64 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఇది రూ.40.91 లక్షల కోట్లు. అంటే వృద్ధి రేటు 6.7 శాతమన్నమాట. ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికకాకుండా, ప్రస్తుత ధరల ప్రకారం పరిశీలిస్తే, 2023 ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ విలువ 9.7 శాతం వృద్ధితో రూ.70.50 లక్షల కోట్ల నుంచి రూ.77.31 లక్షల కోట్లకు ఎగసింది. ‘వృద్ధి వేగంలో టాప్’ ట్యాగ్ యథాతథం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదయ్యింది. ఈ కాలంలో ప్రపంచంలోనే మరేదేశమూ 6.7 శాతం వృద్ధి రేటును అందుకోలేకపోవడంతో, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటు విషయంలో భారత్ తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నట్లయ్యింది. జీవీఏ వృద్ధి 6.8 శాతం ఉత్పత్తికి సంబంధించిన వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి రేటు 2023–24 చివరి త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదయితే, 2024–25 మొదటి త్రైమాసికంలో అరశాతం పెరిగి 6.8 శాతంగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే జీవీఏ విలువ రూ.38.12 లక్షల కోట్ల నుంచి రూ.40.73 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 6.8 శాతం వృద్ధి రేటుకాగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.3 శాతం. వివిధ రంగాల వృద్ధి తీరును స్థూలంగా జీవీఏ ప్రాతిపదికన పరిశీలిస్తారు. -
ఇళ్ల ధరల జోరులో ముంబై నంబర్ 2
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగదలలో ముంబై రియల్టీ మార్కెట్ రెండో స్థానం నిలిచింది. ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నట్టు జూన్ త్రైమాసికానికి సంబంధించిన నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 44 ప్రముఖ నగరాల్లోని ఇళ్ల ధరల పెరుగుదల వివరాలను నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 2.6 శాతానికి పరిమితమైనట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో పెరుగుదల రేటు 4.1 శాతంగా ఉండడం గమనార్హం. ఇళ్ల ధరల పెరుగుదలలో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 26 శాతం మేర వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల ధరలు 13 శాతం మేర జూన్ త్రైమాసికంలో పెరిగాయి. దీంతో ఏడాది క్రితం ఆరో ర్యాంక్‌లో ఉన్న ముంబై 2కు చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 10.6 శాతం పెరగడంతో, ఏడాది క్రితం ఉన్న 26వ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. బెంగళూరులో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో వార్షికంగా 3.7 శాతం మేర పెరిగాయి. దీంతో 15వ ర్యాంక్ సొంతం చేసుకుంది. టాప్–10లో ఇవే.. లాస్ ఏంజెలెస్‌లో 8.9 శాతం (4వ ర్యాంక్), మియామీలో 7.1 శాతం (5వ ర్యాంక్), నైరోబీలో 6.6 శాతం (ఆరో స్థానం), మ్యాడ్రిడ్‌లో 6.4 శాతం (ఏడో స్థానం), లిస్బాన్లో 4.7 శాతం (ఎనిమిదో స్థానం), సియోల్‌లో 4.6 శాతం (తొమ్మిదో స్థానం), శాన్ ఫ్రాన్సిస్కోలో 4.5 శాతం (10వ స్థానం) చొప్పున జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దుబాయిలో 2020 సంవత్సరం నుంచి ఇళ్ల ధరలు 124 శాతం పెరగ్గా.. జూన్ క్వార్టర్లో 0.3% మేర తగ్గాయి. వియన్నాలో 3.2%, బ్యాంకాక్‌లో 3.9 శాతం చొప్పున ఇదే కాలంలో ఇళ్ల ధరలు తగ్గాయి. -
భారత్, చైనా భేష్
వాషింగ్టన్: భారత్, చైనా, యూరప్ ఆర్థిక వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన అంచనాలను మెరుగుపరిచింది. అదే సమయంలో యూఎస్, జపాన్‌కు సంబంధించిన అంచనాలను కొంత తగ్గించింది. భారత్ 2024లో 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ అంచనా 6.8 శాతాన్ని పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను ఎగువకు సవరించింది. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల నిదానించినట్టు తెలిపింది. 2024లో ప్రపంచ వృద్ధి 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఏప్రిల్‌లో వేసిన అంచనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. 2023లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంతో పోల్చి చూస్తే 0.1 శాతం తగ్గనున్నట్టు ఐఎంఎఫ్ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధిలో సగం చైనా, భారత్ నుంచే ఉంటుందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్తికవేత్త ఒలివర్ గౌరించాస్ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. చైనా 5 శాతం 2024 ఆరంభంలో చైనా ఎగుమతులు పెరగడంతో ఆ దేశ వృద్ధి రేటు అంచనాలను గతంలో వేసిన 4.6 శాతం నుంచి 5 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. అయిన కానీ 2023లో నమోదైన 5.2 శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. ఒకప్పుడు రెండంకెల వృద్ధి సాధించిన చైనా పెద్ద ఎత్తున సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు, ముఖ్యంగా అక్కడ ఇళ్ల మార్కెట్ కుదేలైనట్టు ఐఎంఎఫ్ తెలిపింది. వృద్ధ జనాభా పెరుగుదల, కార్మికుల కొరత నేపథ్యంలో 2029 నాటికి చైనా వృద్ధి రేటు 3.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. యూరప్ 0.9 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. అక్కడ సేవల రంగం మెరుగుపడుతుండడాన్ని ప్రస్తావించింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఈ ఏడాది 2.6 శాతం వృద్ధి రేటుకు పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. ఏప్రిల్‌లో 2.7 శాతంగా అంచనా వేయడం గమనార్హం. ఇక 2024 సంవత్సరానికి జపాన్ వృద్ధి రేటును 0.9 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ధరల మంట (ద్రవ్యోల్బణం) 2023లో ఉన్న 6.7 శాతం నుంచి 2024లో 5.9 శాతానికి దిగొస్తుందని తెలిపింది. ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పేదరిక నిర్మూలన దిశగా ఐఎంఎఫ్ కృషి చేస్తుంటుంది. -
Arvind Virmani: 2024–25లో 7 శాతం వృద్ధి సాధిస్తాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి అంచనా వ్యక్తం చేశారు. ఈ రేటు 0.5 శాతం అటూ, ఇటూగా ఉండొచ్చన్నారు. అంతేకాదు, రానున్న కొన్నేళ్లపాటు ఇదే తరహా వృద్ధి రేటు నమోదవుతుందన్నారు. దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందంటూ.. వాటిని పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) జీడీపీ 7.2 శాతం వరకు వృద్ధిని నమోదు చేయవచ్చని ఆర్బీఐ సైతం ఇటీవలే అంచనా వేయడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం వ్యయాలు క్షీణించడంపై ఎదురైన ప్రశ్నకు విర్మాణి స్పందిస్తూ.. కరోనా విపత్తు ప్రభావంతో గృహ పొదుపు తగ్గిపోయిందని.. అంతకుముందు ఆర్థిక సంక్షోభాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉందన్నారు. రెట్టింపు కరువు పరిస్థితిగా దీన్ని అభివర్ణించారు. గతేడాది ఎల్‌నినో పరిస్థితిని చూసినట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపులను మళ్లీ పోగు చేసుకోవాల్సి ఉన్నందున, అది వినియోగంపై ప్రభావం చూపించినట్టు వివరించారు. ‘‘బ్రాండెడ్ ఉత్పత్తులు కొనుగోలు చేసే వారు, చిన్న బ్రాండ్లు లేదా సాధారణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకుంటున్నారు’’అని వివరించారు. చారిత్రకంగా చూస్తే ప్రాంతీయ భాగస్వామి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ నిదానించినట్టుగా తెలుస్తోందని.. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ చేపట్టకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. వడ్డీ రేట్ల కోతతో పెట్టుబడుల ప్రవాహం..వర్ధమాన దేశాలతో పోలిస్తే రిస్క్ లేని రాడులు యూఎస్‌లో, అభివృద్ధి చెందిన మార్కెట్లో వస్తుండడమే, మన దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తక్కువగా ఉండడానికి కారణంగా విర్మాణి చెప్పారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం మొదలైన తర్వాత మన దగ్గరకు పెట్టుబడుల ప్రవాహం మొదలవుతుందని అంచనా వేశారు. -
ఎగుమతులు, తయారీతో ఎకానమీకి బూస్ట్
ముంబై: ఎగుమతులు పెరగడం, కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) తగ్గడం, తయారీ మెరుగుపడటం వంటి అంశాలు దేశ ఎకానమీ ఆరోగ్యకర స్థాయిలో వృద్ధి రేటును సాధించేందుకు తోడ్పడగలవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సరీ్వసుల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను అధిగమించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2022– 23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా, 2023–24లో 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాభరణాల పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. భారత వృద్ధి గాధపై ఇన్వెస్టర్లలో గణనీయంగా విశ్వాసం ఉందని, పరిశ్రమలోనూ.. ఎగుమతిదారుల్లోను సెంటిమెంటు అత్యంత మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రత్యేక ఆరి్థక మండళ్లపై (సెజ్) ప్రభుత్వం నిర్దిష్ట సవరణ బిల్లు ఏదైనా తెచ్చే యోచనలో ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు సిఫార్సులు పరిశీలనలో ఉన్నట్లు గోయల్ వివరించారు. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేస్తుంది. -
RBI Governor Shaktikanta Das: ఆర్థికాభివృద్ధి.. ధరల కట్టడే లక్ష్యం
ముంబై: అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను (రెపో) వరుసగా ఎనిమిదో సారీ యథాతథంగా ఉంచింది. ఇటు పటిష్టమైన వృద్ధి అటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి రేటు గతంలో భావించిన 7 శాతానికి మించి 7.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 8న తదుపరి పాలసీ ప్రకటన ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు (ఆషిమా గోయల్, జయంత్ వర్మ) వీరిలో ఉన్నారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఈ రేటు య«థాతథంగా ఉంది.బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు బ్యాంకుల అసెట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చేందుకు తోడ్పడేలా బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని ఆర్బీఐ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. సాధారణంగా రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ ఎఫ్డీలపై బ్యాంకులు కొంత అధిక వడ్డీ రేటు ఇస్తాయి. పరిమితులను సవ రించడం సాధారణంగా జరిగేదేనని కొన్నేళ్ల క్రితం ఇది కోటి రూపాయలుగా ఉండేదని, తర్వాత రెండు కోట్లకు పెరిగిందని, తాజా పరిస్థితుల కు అనుగుణంగా దీన్ని రూ. 3 కోట్లకు పెంచామని డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ తెలిపారు. యూపీఐ లైట్ వాలెట్లు, ఫాస్టాగ్‌లకు ఆటోలోడ్ సదుపాయం.. చిన్న మొత్తాలను డిజిటల్‌గా చెల్లించేందుకు ఉపయోగపడే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఆటోమేటిక్‌గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం దీన్ని ఈ–మ్యాన్‌డేట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని దాస్ తెలిపారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)లను కూడా ఈ–మ్యాన్‌డేట్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీపరిమితి రూ. 2,000గా ఉండగా, ఒకసారి గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే చేయడానికి వీలుంది. యూపీఐ లైట్ యాప్‌లో బ్యా లెన్స్ గరిష్టంగా రూ. 2,000కు మించరాదు.బ్యాంకుల సిస్టమ్ వైఫల్యాల వల్లే పేమెంట్స్ అంతరాయాలు.. చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలతో కస్టమర్లకు సమస్యలు ఎదురవడానికి కారణం బ్యాంకుల సిస్టమ్‌ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్‌పీసీఐలు కాదని దాస్ చెప్పారు. ప్రతి అంతరాయాన్ని కేంద్రీయ బ్యాంకులో సంబంధిత అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారని, ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) లేదా ఏకీకృత చెల్లింపుల విధానం ప్లాట్‌ఫాం లోపాలున్నట్లుగా ఏమీ వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. టెక్నాలజీకి సంబంధించి బ్యాంకులు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయన్నారు. -
భళా.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ అన్ని వర్గాల అంచనాలకు మించి మంచి ఫలితాన్ని సాధించింది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయ్యింది. మార్చి త్రైమాసికంలో ఈ పురోగతి 7.8 శాతంగా రికార్డు అయ్యింది. నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఆర్బీఐ వృద్ధి అంచనాసైతం 7 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఫిబ్రవరినాటి తన రెండవ అడ్వాన్స్ అంచనాల్లో 2023–24 వృద్ధి రేటును 7.7 శాతంగా పేర్కొంది. ఈ అంచనాలు, విశ్లేషణలు అన్నింటికీ మించి తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. క్యూ4లో అంచనాలకు మించి (7.8 శాతం) భారీ ఫలితం రావడం మొత్తం ఎకానమీ వృద్ధి (8.2 శాతం) పురోగతికి కారణం. ఎన్ఎస్ఓ శుక్రవారం ఈ మేరకు తాజా గణాంకాలను వెలువరించింది. 5 ట్రిలియన్ డాలర్ల దిశగా అడుగులుభారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్ త్రైమాసికంలో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.6 శాతం పురోగతి సాధించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంకాగా, అదే ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఎకానమీ 2024 మొదటి మూడు నెలల్లో 5.3 శాతం పురోగమించడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఎకానమీ ముందుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితోపాటు భారత్ ఎకానమీ 3.5 ట్రిలియన్ డాలర్ల జోన్లో స్థిరపడగా, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు ముందడుగు పడింది. మార్చిలో మౌలిక రంగం 6.2 శాతం వృద్ధి ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ మార్చిలో 6.2 శాతం పురోగమించింది. సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్ రంగాల చక్కటి పనితీరు ఇందుకు దోహదపడింది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు కూడా కలిగిన ఈ గ్రూప్ 2024 మార్చితో 6 శాతం పురోగమించగా, 2023 ఏప్రిల్‌లో 4.6 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ గ్రూప్ వెయిటేజ్ 40.27 శాతం. 2024లో వృద్ధి 6.8%: మూడీస్ భారత్ 2024లో 6.8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2025లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022లో ఎకానమీ 6.5 శాతం పురోగమిస్తే,,, 2023లో 7.7 శాతానికి ఎగసిందని తెలిపింది.ద్రవ్యలోటు కట్టడిఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలకు మించి పురోగమించిన నేపథ్యంలో ఎకానమీకి మరో సానుకూల అంశం... ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు పరిస్థితి మెరుగుపడ్డం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంగా (జీడీపీ విలువలతో పోల్చి) ద్రవ్యలోటు ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశిస్తుండగా, ఈ అంకెలు మరింత మెరుగ్గా 5.63 శాతంగా నమోదయ్యాయి. విలువల్లో రూ.17.34 లక్షల కోట్లుగా ఫిబ్రవరి 1 బడ్జెట్ అంచనావేస్తే, మరింత మెరుగ్గా రూ.16.53 లక్షల కోట్లుగా ఇది నమోదయినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజా గణాంకాలు వెల్లడించాయి.8.2% వృద్ధి ఎలా... 2011–12ను బేస్ ఇయర్‌గా తీసుకుంటూ.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకు ని స్థిర ధరల వద్ద 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్లు. 2023–24లో ఈ విలువ 173.82 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 8.2 శాతం. ఇక ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా స్థిర ధరల వద్ద వృద్ధి రేటును చూస్తే... ఇది 9.6 శాతం పురోగమించి రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.295.36 లక్షల కోట్లకు చేరింది. 7.8% పరుగు ఇలా.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని క్యూ4లో (2023 క్యూ4తో పోల్చి) ఎకానమీ విలువ రూ.43.84 లక్షల కోట్ల నుంచి రూ.47.24 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతమన్నమాట. స్థిర ధరల వద్ద ఈ రేటు 9.9 శాతం పెరిగి రూ.71.23 లక్షల కోట్ల నుంచి రూ.78.28 లక్షల కోట్లకు ఎగసింది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ వృద్ధి వేగం కొనసాగుతుంది ప్రపంచంలోని దిగ్గజ ఎకానమీలో భారత్ జీడీపీ వృద్ధి తీరు విశేషమైనది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ ఇదే వృద్ధి వేగం కొనగుతుంది. 2023–24లో తయారీ రంగం 9.9 శాతం పురోగమించడం ప్రత్యేకమైన అంశం. 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వం హయాంలో అవినీతితో మొండి బకాయిల కుప్పగా మారిన బ్యాంకింగ్ రంగాన్ని వివిధ సంస్కరణలతో మోదీ ప్రభుత్వం టర్నెరౌండ్ చేసి, వృద్ధి బాటలో పరుగులు తీయిస్తోంది. 2014–23 మధ్య బ్యాంకులు రూ. 10 లక్షల కోట్ల మేర మొండిబాకీల రికవరీ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 1,105 బ్యాంక్ ఫ్రాడ్ కేసులను దర్యాప్తు చేసి రూ. 64,920 కోట్ల మొత్తాన్ని అటాచ్ చేసింది. – మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో నిర్మలా సీతారామన్ -
Duvvuri Subbarao: వృద్ధి, వడ్డీ రేటు మార్పులకు ఆ ఇద్దరి నుంచి ఒత్తిడి
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం ఆర్థిక మంత్రులుగా పని చేసిన సమయంలో సానుకూల సెంటిమెంటు కోసం వడ్డీ రేట్లను తగ్గించాలని, వృద్ధి రేటును పెంచి చూపాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం గురించి ప్రభుత్వంలో కొంతైనా అవగాహన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ‘జస్ట్ ఎ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్’ పేరిట రాసిన స్వీయకథలో దువ్వూరి ఈ విషయాలు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల విషయంలోనే కాకుండా ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి ఆర్బీఐపై ఒత్తిడి ఉండేదని ఒక అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. ‘ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయమిది. ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం, ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు మా అంచనాలను సవాలు చేశారు. సానుకూల సెంటిమెంటును పెంపొందించాల్సిన భారాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సెంట్రల్ బ్యాంకులు సహకరిస్తుంటే మన దగ్గర మాత్రం ఆర్బీఐ తిరుగుబాటు ధోరణిలో ఉంటోందంటూ మాయారాం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆర్బీఐ చీర్లీడరుగా ఉండాలన్న డిమాండ్‌కి నేను తలొగ్గలేదు’ అని దువ్వూరి పేర్కొన్నారు. చిదంబరం విషయానికొస్తే .. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఆర్బీఐపై తీవ్ర ఒత్తిడి తెచి్చనట్లు దువ్వూరి చెప్పారు. పరిస్థితులను సమీక్షించిన మీదట తాను అంగీకరించలేదన్నారు. దీంతో కలవరానికి గురైన చిదంబరం అసాధారణ రీతిలో ఆర్బీఐపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారని వివరించారు. ఏపీలోని పార్వతీపురంలో సబ్–కలెక్టరుగా కెరియర్ను ప్రారంభించిన దువ్వూరి కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా, అటు పైన అంతర్జాతీయ మాంద్యం పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్‌గా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. -
2003-07 నాటి వృద్ధిరేటు దిశగా భారత జీడీపీ
దేశ ఎకానమీ వృద్ధి రేటుపై మోర్గాన్‌స్టాన్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ఎకానమీ 2003–2007 కాలంలో ఎలా అయితే వృద్ధి చెందిందో ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదేమాదిరి వృద్ధి కనబరుస్తోందని మోర్గాన్ స్టాన్లీ నివేదికలో తెలిపింది. భారత జీడీపీ 2003-07 కాలంలో ఏడాదికి సగటున 8.6 శాతం చొప్పున వృద్ధి కనబరిచింది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని నిదేదిక ద్వారా తెలిసింది. భారీగా పెట్టుబడులు వస్తుండడంతో దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. కానీ పెట్టుబడులు పెరగడంతో ఎకానమీ వృద్ధి చెందుతోందని ఈ రిపోర్ట్ పేర్కొంది. వినియోగం తగ్గినా, దేశంలోకి వస్తున్న పెట్టుబడులు జీడీపీ గ్రోత్‌ను ముందుండి నడుపుతున్నాయని తెలిపింది. నివేదిక ప్రకారం.. ప్రభుత్వం చేసే మూలధన వ్యయం తగ్గినప్పటికీ ప్రైవేట్ కంపెనీలు చేసే క్యాపెక్స్ పుంజుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గినా, పట్టణాల్లో వినియోగం ఊపందుకుంది. గ్లోబల్ ఎగుమతుల్లో ఇండియా వాటా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది. జీడీపీ వృద్ధి 2003–2007 సమయంలో 27 శాతం నుంచి 39 శాతానికి చేరుకుంది. ఇదే గరిష్ట వృద్ధిగా నమోదైంది. ఇదీ చదవండి: ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం 2011–21 మధ్య పెట్టుబడులు తగ్గినా ప్రస్తుతం జీడీపీ 34 శాతం దగ్గర ఉందని వివరించింది. భవిష్యత్తులో ఇది 36 శాతానికి చేరుతుందని అంచనా. 2003–2007 లో ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైనట్లు నివేదిక తెలిపింది. -
2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతంగా క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే 2031 నాటికి దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయికి రెట్టింపై దాదాపు 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని.. తద్వారా ఎగువ మధ్య–ఆదాయ దేశంగా మారుతుందని క్రిసిల్ ఇండియా అవుట్‌లుక్ నివేదిక పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణలు తదితర సానుకూల ఆర్థిక నిర్ణయాల వల్ల దేశ ఎకానమీ 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపింది. రానున్న ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2024–25 నుంచి 2030–31) భారత్ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ఈ కాలంలో ఎకానమీ సగటును 6.7 శాతం పురోగమిస్తుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఐదవ స్థానంలో.. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎనానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు. 4,500 డాలర్లకు తలసరి ఆదాయం.. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరుగుతుంది. దీనితో దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకా రం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డా లర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పే ర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. తయారీ, సేవల రంగాల్లో మంచి అవకాశాలు... దేశీయ, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా తయారీ– సేవల రంగాలు రెండింటికీ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 2025–2031 ఆర్థిక సంవత్సరాల మధ్య తయారీ– సేవల రంగాలు వరుసగా 9.1 శాతం, 6.9 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని మేము అంచనా వేస్తున్నాము. తయారీ రంగం ద్వారా కొంత పెరుగుదల ఉన్నప్పటికీ, సేవా రంగం భారతదేశ వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తుంది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ -
కొనసాగిన బుల్ రికార్డులు
ముంబై: పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.., స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ సోమవారమూ కొనసాగింది. ఆకర్షణీయ స్థూల ఆర్థిక డేటా నమోదు కారణంగా అంతర్జాతీ య రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. మూడీస్ అప్‌గ్రేడ్ రేటింగ్‌తో బ్యాంకింగ్, ఇంధన, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్ద తు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 243 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 66 పాయింట్ల లాభంతో 73,872 వద్ద ముగిసింది. ఒక దశలో 184 పాయింట్లు బలపడి 73,990 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 22,441 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 27 పాయింట్లు లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ముగింపు స్థాయిలు సరికొత్త రికార్డుతో పాటు వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.564 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,543 కోట్ల షేర్లు కొన్నారు. ► డిజిట్ ఐపీవోకు గ్రీన్ సిగ్నల్ ► డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ఇష్యూ కింద రూ. 1,250 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 10.94 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. పబ్లిక్ ఇష్యూకి బ్లాక్‌బక్ లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్‌బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్‌బక్ వినియోగించుకోనుంది. బ్లాక్‌బక్‌ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి. -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
హోటల్ పరిశ్రమలో కొనసాగనున్న జోరు
కోల్‌కతా: దేశ హోటల్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మంచి వృద్ధిని చూడనుంది. 2024–25లో హోటల్ పరిశ్రమ ఆదాయం మొత్తం మీద 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ విహార పర్యటనలు కొనసాగుతుండడం, సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలనుకు (ఎంఐసీఈ) డిమాండ్ ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తెలిపింది. సాధారణ ఎన్నికల ప్రభావం స్వల్పకాలమేనని పేర్కొంది. హోటల్ పరిశ్రమ డిమాండ్‌లో ఆధాత్మిక పర్యాటకం, టైర్–2 సిటీలు కీలక చోదకంగా నిలుస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోటళ్లలో గదుల భర్తీ రేటు (ఆక్యుపెన్సీ) దశాబ్ద గరిష్టమైన 70–72 శాతానికి చేరుకుందని, 2022–23లో ఇది 68–70 శాతమే ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా హోటల్ గదుల రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.7,200–7,400 మధ్య ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,800–8,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశ ఆతిథ్య రంగంపై సానుకూల అవుట్‌లుక్‌ను ప్రకటించింది. -
జీడీపీ.. టాప్‌గేర్!
న్యూఢిల్లీ: ఆర్థిక మూలాలు బలోపేతం అవుతున్నందున భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–24) 6.9–7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిడ్ ఇండియా తెలిపింది. త్రైమాసిక వారీ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా మంచి పురోగతి నెలకొందని, స్థూల ఆర్థిక గణాంకాలు దీన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2022–23లో 1.9 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గుతుందని డెలాయిట్ ఇండియా తెలిపింది. అలాగే విదేశీ మారకం నిల్వలు 568 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇవి 10 నెలల దిగుమతి అవసరాలకు సమానమని పేర్కొంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5 శాతం స్థాయిలో ఆర్బీఐ లకి‡్ష్యత పరిధి కంటే ఎగువన ఉన్నట్టు వివరించింది. కానీ, దశాబ్ద కాలం క్రితం నాటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే చాలా తక్కువలోనే ఉన్నట్టు గుర్తు చేసింది. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన తొలి ముందస్తు జాతీయ ఆదాయం గణాంకాల ప్రకారం చూసినా.. దేశ జీడీపీ 2023–24లో 7.3 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. 2022–23 సంవత్సరంలో ఉన్న 7.2 శాతం కంటే స్వల్ప వృద్ధి కావడం గమనార్హం. మైనింగ్, క్వారీయింగ్, తయారీ, సేవలకు సంబంధించి కొన్ని రంగాల బలమైన పనితీరు ఇందుకు దోహదం చేయనుందని జాతీయ గణాంక కార్యాలయం అంచనాగా ఉంది. 2024–25లో 6.4 శాతం.. ‘‘ఆర్థిక మూలాలు మెరుగుపడుతుండడం మా అంచనాలకు మద్దతుగా నిలిచింది. మా ప్రాథమిక అంచనాల ప్రకారం 2023–24లో భారత్ 6.9–7.2 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇది 6.4 శాతం, 6.7 శాతంగా ఉండొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక చిత్రం మోస్తరుగానే ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ, మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అనిశ్చితులను మెరుగ్గా అధిగమించగలదు’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి ముజుందార్ తెలిపారు. ద్రవ్యోల్బణం తిరిగి 5.4 శాతానికి ఇటీవల పెరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణం 2023–24 ద్వితీయ ఆరు నెలల్లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని.. అధిక ఆహార ధరలు, అస్థిరతలతో కూడిన చమురు ధరలు ఆ తర్వాతి కాలంలో స్థిరపడతాయని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో భారత్ సాధించిన వృద్ధి ప్రయాణాన్ని డెలాయిట్ ప్రస్తావించింది. ఎగుమతులను పలు దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవడంతోపాటు, విలువ ఆధారిత ఉత్పత్తుల వైపు మళ్లినట్టు తెలిపింది. ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటా పెరిగినట్టు వెల్లడించింది. ఎగుమతుల్లో పోటీతత్వాన్ని కూడా పెంచుకున్నట్టు పేర్కొంది. అయితే మరింత పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవాలని అభిప్రాయపడింది. -
ఆర్బీఐ అండతో మళ్లీ రికార్డుల మోత
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి మెప్పించడంతో స్టాక్ మార్కెట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది. రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 –24) వృద్ధి రేటు అంచనాలు పెంచడం, వరుసగా అయిదోసారి కీలక వడ్డీ రేట్ల జోలికెళ్లకపోవడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకులు, ఫైనాన్స్ సరీ్వసులు, రియల్టీ షేర్లకు భారీ డిమాండ్ లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త రికార్డులు నమోదు నమోదు చేశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు లాభపడి 69,826 వద్ద వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 20,969 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమీక్షా సమావేశ నిర్ణయాలు వెల్లడి(ఉదయం 10 గంటలు) తర్వాత కొనుగోళ్లు మరింత పెరిగాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 372 పాయింట్లు బలపడి 69,894 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి తొలిసారి 21 వేల స్థాయిపై 21,006 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ► బ్లాక్ డీల్ ద్వారా 75.81 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా వెల్లడి కావడంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ షేరు 12% లాభపడి రూ.69 వద్ద ముగిసింది. -
2023లో వృద్ధి 6.7 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: 2023లో భారత్ 6.7 శాతం వృద్ధి రేటును సాధిస్తుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని రేటింగ్ దిగ్గజం– మూడీస్ తన గ్లోబల్ మాక్రో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024–25లో పేర్కొంది. దేశీయ డిమాండ్ పటిష్టత దీనికి ప్రధాన కారణమని తెలిపింది. 2024లో 6.1 శాతం, 2026లో 6.3 శాతం భారత్ పురోగమిస్తున్న అభిప్రాయాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. కాగా, జీ–20 ఎమర్జింగ్ మార్కెట్ల వృద్ధి 2023లో 4.4 శాతం, 2024లో 3.7 శాతం, 2025లో 3.8 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనావేసింది. అధిక వడ్డీరేట్ల కారణంగా 2024లో ప్రపంచ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ అనిశ్చితి ప్రభావం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది. కాగా, ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్ వృద్ధి రేటును మూడీస్ 6.1 శాతంగా అంచనావేస్తున్న సంగతి తెలిసిందే. పటిష్టంగా ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు, పెరుగుతున్న ఆటో విక్రయాలు, వినియోగదారుల ఆశావాదం, రెండంకెల క్రెడిట్ వృద్ధి ఎకానమీకి సానుకూల అంశాలుగా పేర్కొంది. -
2023–2027 మధ్య భారత్ వృద్ధి జూమ్
న్యూఢిల్లీ: భారత్ మధ్య కాలిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఈ రేటు 5.5 శాతం నుంచి 6.2 శాతానికి చేరింది. 2023 నుండి 2027 వరకు మధ్యకాలంగా ఫిచ్ నిర్వచించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డం, పని చేసే వయస్సులో ఉన్న జనాభా అంచనాలో స్వల్ప పెరుగుదల తమ తాజా అప్‌గ్రేడ్‌కు కారణమని పేర్కొంది. ఫిచ్ తాజా అంచనాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► కరోనా కాలంలో భారత్‌లో భారీగా పడిపోయిన ఉపాధి అవకాశాలు దేశంలో వేగంగా రికవరీ అవుతున్నట్లు తెలిపింది. మహమ్మారి నాటి కాలంలో పోల్చితే కారి్మక సరఫరా వృద్ధి రేటు పెరిగినప్పటికీ, 2019 స్థాయి నాటికన్నా తక్కువగానే ఉంది. 2000 సంవత్సరం ప్రారంభంలో నమోదయిన స్థాయిలకంటే కూడా తక్కువే. ముఖ్యంగా మహిళల్లో ఉపాధి అవకాశాల రేటురేటు చాలా తక్కువగా ఉంది. ► భారత్‌లో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేíÙయా, పోలాండ్, టర్కీ వృద్ధి రేట్ల అంచనా పెరిగింది.అయితే భారత్ కన్నా తక్కువగా 0.2 శాతం మాత్రమే బ్రెజిల్ టర్కీ, ఇండోనేషియా వృద్ధి రేటు అంచనాలకు ఎగశాయి. ► 10 వర్థమాన ఆర్థిక వ్యవస్థల మధ్యకాలిక వృద్ధిని 4 శాతంగా అంచనా వేసింది. ఇది మునుపటి అంచనా కంటే 30 బేసిస్ పాయింట్లు (ఇంతక్రితం అంచనా 4.3 శాతం) తక్కువ. చైనా వృద్ధి అంచనాలో 0.7 శాతం పాయింట్ల కోత వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి నెలకొంది. దీనితో చైనా ఎకానమీ సగటు వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. ఇటీవలి సంవత్సరాలలో చైనా వృద్ధి బాగా మందగించింది. రియల్టీ రంగంలో క్షీణత మొత్తం పెట్టుబడుల అవుట్‌లుక్‌కు దెబ్బతీసింది. ► రష్యా వృద్ధి రేటును ఈ కాలంలో చైనా 80 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఆ దేశం వృద్ధి రేటు మధ్య కాలికంగా 80 బేసిస్ పాయింట్లుగానే (ఒక శాతం కన్నా తక్కువ) ఉంటుంది. 2023–24లో 6.3 శాతం కాగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతమన్న తన అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ పునరుద్ఘాటించింది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు వృద్ధి స్పీడ్‌కు బ్రేకులు వేస్తాయని ఫిచ్ అభిప్రాయపడింది. 2024–25లో వృద్ధి రేటు 6.5 శాతమని అంచనావేస్తున్నట్లు తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో ద్రవ్యోల్బణం 6 శాతం పైనే కొనసాగే అవకాశం ఉందని ఫిచ్ అభిప్రాయపడింది. -
ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడుల దన్ను!
న్యూఢిల్లీ: పటిష్ట ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో ఏప్రిల్‌తో ప్రారంభమైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ సోమవారం వెల్లడించింది. కొన్ని సవాళ్లతో కూడిన అంశాలు నెలకొన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుంది. ఏదైనా ప్రతికూలతలు ఎదురయితే 6 శాతానికి తగ్గవచ్చు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా అనిశ్చితి కొనసాగడం, చైనాలో వృద్ధి మందగించడం, కఠిన ద్రవ్య విధానం, సాధారణ రుతుపవనాల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వృద్ధికి ప్రతికూలతలు. ► మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శా తం వాటా ఉన్న వ్యవసాయ రంగం, అనుబంధ కార్యకలాపాల విషయంలో వృద్ధి రేటు 2.7 శా తంగా ఉంటుంది. అయితే 2022–23తో పోలి్చ తే (4 శాతం) ఈ వృద్ధి రేటు తగ్గుతుందని సర్వే వెల్లడిస్తోంది. ఎల్ నినో ప్రభావం దీనికి కారణం. ► జీడీపీలో మరో 15 శాతం వాటా ఉన్న పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. ► ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండే వీలుంది. ► 2023 సెపె్టంబర్లో సర్వే జరిగింది. పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ► మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ–మూడవ త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.1 శాతం, 6 శాతాలకు తగ్గవచ్చు. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023–24లో సగటున 5.5 శాతంగా నమోదయ్యే వీలుంది. కనిష్టంగా 5.3 శాతం, గరిష్టంగా 5.7 శాతంగా ఉండవచ్చు. ద్రవ్యోల్బణం గమనం అనిశ్చితంగానే ఉందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ప్లస్ 2, మైనస్ 2తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ పాలసీ అంచనావేస్తోంది. ► తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగవచ్చు. 2024 వరకూ ఇదే ధోరణి నెలకొనే అవకాశం ఉంది. అయితే భారత్ ఎకానమీ ఈ సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది. భారత్ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం తప్పదు. 2024–25 ప్రారంభంలో పావుశాతం రేటు కోత 2024 మార్చి వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగే వీలుందని ఫిక్కీ సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25)మొదటి లేదా రెండవ త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్బీఐ పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేíÙంచింది. ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల మొదట్లో జరిగిన సమీక్షసహా గడచిన మూడు ద్రవ్య పరపతి విధాన సమక్షా సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి పెద్ద మరింత ఊరటనిస్తూ, మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి దిగివచి్చంది. అయితే ద్రవ్యోల్బణం పట్ల ఆర్బీఐ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 2–4 ఆర్బీఐ లక్ష్యం అని కూడా ఆయన ఇటీవలి పాలసీ సమీక్షలో ఉద్ఘాటించారు. -
మౌలిక రంగం భేష్
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ ఆగస్టులో మంచి పనితీరును ప్రదర్శించింది. మౌలిక రంగం సమీక్షా నెల్లో 12.1 శాతం వృద్ధిని (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 14 నెలల్లో (2022 జూన్‌లో వృద్ధి రేటు 13.2 శాతం) ఈ స్థాయి భారీ వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. సిమెంట్ (18.9 శాతం), బొగ్గు (17.9 శాతం), విద్యుత్ (14.9 శాతం), స్టీల్ (10.9 శాతం), సహజ వాయువు (10 శాతం) రంగాలు రెండంకెల్లో వృద్ధి సాధించగా, రిఫైనరీ ప్రొడక్టులు 9.5 (శాతం), క్రూడ్ ఆయిల్ (2.1 శాతం), ఎరువుల (1.8 శాతం) రంగాల్లో వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితమైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్ నుంచి ఆగస్టు ఎనిమిది రంగాల వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. మ్తొతం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది పరిశ్రమల వెయిటేజ్ 40.27 శాతం. -
వృద్ధి 6.5 శాతం: అరవింద్ విర్మాణి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి వ్యక్తం చేశారు. క్రూడ్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటకు ఢోకా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక వృద్ధిని అతిగా అంచనా వేస్తోందని అమెరికాకు చెందిన కొంతమంది ఆర్థికవేత్తల వాదనపై ఆయన మాట్లాడుతూ, కొంతమంది మాజీ అధికారులకు భారత్ జీడీపీ మదింపుపై ఎటువంటి అవగాహనా లేదని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల సమస్య మళ్లీ తెరపైకి వచి్చందని, వాతావరణ మార్పుల కారణంగా అనిశ్చితి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారు రుణం వేగంగా పెరుగుతున్నందున నికర హౌస్‌హోల్డ్ పొదుపు నిష్పత్తి (జీడీపీలో) తగ్గుతోందని, అయితే స్థూలంగా చూస్తే, నిలకడగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక హౌస్‌హౌల్డ్ సెక్టార్ రుణం కూడా జీడీపీ నిష్పత్తిలో చూస్తే, తీవ్ర స్థాయిలో లేని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలే దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వివరించారు. -
5.5 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023 క్యాలెండర్ ఇయర్ వృద్ది రేటు 5.5 శాతం అంచనాలను రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ భారీగా 6.7 శాతానికి పెంచింది. ఆర్థిక క్రియాశీలత గణనీయంగా మెరుగుపడ్డం దీనికి కారణమని తన తాజా అంతర్జాతీయ స్థూల ఆర్థిక అవుట్‌లుక్ (ఆగస్టు అప్డేట్)లో తెలిపింది. కాగా 2023 హై బేస్ నేపథ్యంలో 2024లో వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పటిష్ట సేవల రంగం, మూలధన వ్యయాలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతం పెరుగుదలకు కారణంగా పేర్కొంది. 2023 ద్వితీయార్థంలో, 2024 ప్రారంభంలో ఎల్‌నినో పరిస్థితులు బలంగా ఉంటే వ్యవసాయ వస్తువుల ధరలు పెరగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం దేశంలో తట్టుకునే రీతిలోనే ఉండే అవకాశం ఉందని అంచనావేసిన మూడీస్, ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాత) రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంచనా వేసింది. జీ20 వృద్ధి తీరు ఇది... జీ–20 దేశాల వృద్ధి 2023లో 2.5 శాతంగా ఉండవచ్చని, 2024లో 2.1 శాతానికి తగ్గవచ్చని అభిప్రాయపడింది. 2022లో ఈ రేటు 2.7 శాతం. 2024 చైనా వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం గమనార్హం. భారత్‌కు మూడీస్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ‘బీఏఏ3’ సావరిన్ రేటింగ్‌ను అందిస్తోంది. 2023–24లో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనావేస్తోంది. 2022–23 7.2 శాతం కన్నా ఇది భారీ తగ్గుదల కావడం గమనార్హం. -
పరిశ్రమలకు వరాలు
సాక్షి, అమరావతి: అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదని, అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న గొప్ప విజన్ ఉండటమే కాకుండా దాన్ని అక్షరాల చేతల్లో చూపించిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన రూపొందించిన పారిశ్రామిక విధానాలు పరిశ్రమలకు వరాలే అయ్యాయి. అందుకే ఉమ్మడి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పెట్టుబడులు ఏటా సగటున 54 శాతం వృద్ధి చెందాయి. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 7వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ స్థాయి వృద్థి రేటును అంతకుముందు సీఎంలు, వైఎస్ తర్వాత సీఎంలు ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఆయన మరణించి పదేళ్లు అయినా వైఎస్సార్ హయాం పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం. అందుకే ఇప్పటికీ పారిశ్రామికవేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్ సీఎం కాకముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన ముఖ్యమంత్రులందరూ అభివృద్ధినంతా హైదరాబాద్‌కే పరిమితం చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని తన దార్శినికతతో అన్ని ప్రాంతాలకు విస్తరించారు. వైఎస్సార్ అభివృద్ధి చేసిన శ్రీ సిటీ, అపాచీ, బ్రాండిక్స్, రాంకీ ఫార్మా వంటి భారీ ప్రత్యేక ఆర్థిక మండళ్లకు తోడు విశాఖ, విజయవాడ, కాకినాడల్లో ఏర్పాటు చేసిన ఐటీ సెజ్‌లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిపోర్టు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే, బయోటెక్నాలజీ పార్క్, కృష్ణపట్నం పోర్టు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు , టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్ వంటి అనేక ప్రాజెక్టులు ఆయన హయాంలోనే నెలకొల్పారు. ఇవే కాకుండా వాడరేవు, నిజాంపట్నం, బందరు పోర్టు, విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, బ్రాహ్మణీ స్టీల్స్ వంటి అనేక కలల ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి రూ. 11,659 కోట్ల విలువైన పెట్టుబడులు మాత్రమే అమల్లోకి వస్తే.. వైఎస్సార్ ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. 43,117 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. వైఎస్సార్ హయాంలో ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్సార్ బాటనే అనుసరిస్తున్నారు. అభివృద్ధి కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా మూడు రాజధానులతో పాటు పారిశ్రామికంగా అదే బాటను అనుసరిస్తున్నారు. -
వృద్ధి వేగంలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2023–24, ఏప్రిల్–జూన్) 7.8 శాతంగా నమోదయ్యింది. వ్యవసాయం, ఫైనాన్షియల్ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. జూన్ త్రైమాసికంలో ప్రపంచంలో మరే దేశమూ ఈ స్థాయి వృద్ధిని నమోదుచేసుకోలేదు. దీనితో వృద్ధి వేగంలో భారత్ మొదటి స్థానంలో నిలిచినట్లయ్యింది. 6.3 శాతం వృద్ధి రేటుతో భారత్ తర్వాత చైనా వృద్ధి వేగంలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే క్యూ1లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా తాజా లెక్క తక్కువగా ఉండడం గమనార్హం. ఈ నెల రెండవ వారంలో జరిగిన ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5 శాతం, క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా అంచనా వేసింది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనాకు వచి్చంది. 7.8 శాతం వృద్ధి అంటే... 2011–12ని బేస్ ఇయర్‌గా తీసుకుని ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ లెక్కిస్తే, 2022–23 మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.37.44 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.37 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతం పెరిగిందన్నమాట. కాగా ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని (ప్రస్తుత ధరల ప్రాతిపదిక) జీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. విలువల్లో రూ.65.42 లక్షల కోట్ల నుంచి రూ.70.67 లక్షల కోట్లకు పెరిగింది. ► 2022–23 క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు 13.1 శాతంగా ఉంది. అయితే దీనికి లో బేస్ ఎఫెక్ట్ ఒక కారణం. అంటే కరోనా కష్టకాలం 2021–22 ఇదే కాలంలో చేటుచేసుకున్న అతి తక్కువ గణాంకాలు 2022–23 క్యూ1లో అధిక రేటు (శాతాల్లో) నమోదుకు దోహదపడ్డాయి. ► తాజా గణాంకాలకు ముందు త్రైమాసికం అంటే జనవరి–మార్చి మధ్య జీడీపీ విలువ 6.1% కాగా, అంతక్రితం త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్)ఈ రేటు 4.5%. అంటే సమీక్షా కాలంసహా అంతక్రితం గత 3 త్రైమాసికాల్లో వృద్ధి రేటు పెరుగుతూ వచి్చందన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– స్థూల విలువ జోడింపు అనేది ఆర్థిక వ్యవస్థలోని పరిశ్రమ, రంగం, తయారీదారు, ప్రాంతం లేదా ప్రాంతం ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఉత్పత్తి వ్యయాలను ఇందులో చేర్చరు) ప్రకారం వివిధ రంగాల వృద్ధి తీరును పరిశీలిస్తే.. జూలైలో మౌలిక రంగం ఓకే... ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్‌లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం. జూలైలో మౌలిక రంగం ఓకే... ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్‌లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5% వృద్ధి సాధించే సత్తా భారత్‌కు ఉంది. ధరల కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అందువల్ల ద్రవ్యోల్బణం భయాలు అక్కర్లేదు. – వి. అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రోజ్‌గార్ మేళాలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. కేంద్ర పారామిలటరీ దళాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాల్లో మరింత వృద్ధి నమోదవుతుందని, యువతీ యువకులకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు మోదీ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అన్నారు. అన్ని రంగాల అభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. కోట్లాది కొత్త కొలువులు దేశంలో 2030 నాటికి టూరిజం రంగంలో కొత్తగా దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఫార్మాస్యూటికల్ రంగం వాటా రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంలోనూ యువ శక్తి భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఆహార శుద్ధి రంగం విలువ ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లుగా ఉందని, మరో మూడున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమ విస్తరిస్తున్నకొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు సుపరిపాలన, చట్టబద్ధ పాలన ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలన్నారు. నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు పెద్దగా రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయన్నారు. వస్తూత్పత్తి ఊపందుకుందని, ఉద్యోగాల సంఖ్య పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగినట్లు మోదీ తెలిపారు. ఎల్రక్టానిక్ పరికరాల తయారీపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత కంప్యూటర్లు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పారా మిలటరీ దళాల్లో కొత్తగా చేరిన వారిని మోదీ ‘అమృత్ రక్షకులు’గా అభివరి్ణంచారు. -
ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు
ముంబై: ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జోరుగా సాగనున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 8–10 శాతం అధిక అమ్మకాలు ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ రంగంపై క్రిసిల్ ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. గృహ రుణాలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగినా కానీ అమ్మకాల్లో వృద్ధికి ఢోకా ఉండదని పేర్కొంది. మధ్యస్థాయి, ప్రీమి యం విభాగాలు, విలాసవంత ఇళ్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, వీటి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా నమోదైనట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనికితోడు వసూళ్లు బలంగా ఉండడం, రుణ భారం తక్కువగా ఉండడంతో డెవలపర్ల రుణ పరపతి మెరుగుపడినట్టు పేర్కొంది. 11 పెద్ద లిస్టెడ్ సంస్థలు, 76 చిన్న, మధ్య స్థాయి నివాస గృహాల డెవలపర్ల గణాంకాల ఆధారంగా క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదిక రూపొందించింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ విభాగంలో డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక వృద్ధి ఆరోగ్యంగా ఉండడంతోపాటు కార్యాలయాలు ఇప్పటికీ హైబ్రిడ్ నమూనాలో పనిచేస్తున్నాయి. దీంతో ప్రీమియం, పెద్ద ఇళ్ల కు ఇస్తున్న ప్రాముఖ్యం డిమాండ్‌కు మద్దతిస్తోంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) పెద్ద సంస్థల మార్కెట్ బలోపేతం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11 ప్రముఖ రియల్ ఎస్టేట్ (లిస్టెడ్) కంపెనీలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాల్లో విలువ పరంగా 50 శాతం, స్థల విస్తీర్ణం పరంగా 20 శాతం వృద్ధిని చూపించినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. పెద్ద సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయని, 2020 నాటికి 16–17 శాతంగా ఉన్న వీటి వాటా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. పేరున్న సంస్థలు అయితే బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా రావడంతోపాటు, విశ్వసనీయ బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం వాటి మార్కెట్ వాటాను పెంచుతుందని తెలిపింది. హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో గణాంకాలను క్రిసిల్ తీసుకుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, కోల్టే పాటిల్ డెవలపర్స్, మాక్రోటెక్ డెవలపర్స్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్, ఒబెరాయ్ రియలీ్ట, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పురవంకర, శోభ, సన్‌టెక్ రియాలిటీ సంస్థలను పెద్ద సంస్థలుగా పేర్కొంది. (రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ) -
మే నెలలో నియామకాలు ఓకే
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) మే నెలలో 2,849గా ఉన్నాయి. 2023 ఏప్రిల్ నెల నియామకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, 2022 మే నెలలో నియామకాలు 2,863తో పోల్చినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నియామకాలు ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో నియామకాల ధోరణలు భిన్నంగా ఉన్నట్టు పేర్కొంది. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఈ ఏడాది మే నెలలో నియామకాల్లో వృద్ధిని ముందుండి నడిపించాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఏకంగా 31 శాతం పెరిగాయి. అదే ఐటీ రంగంలో నియామకాలు 2022 మే నెలతో పోల్చినప్పుడు 23 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యం పెరగడం, రిఫైనరీల విస్తరతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అధిక నియామకాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అంతకుముందు నెలల్లో ఈ రంగంలో నియామకాల్లో వృద్ధి 10–20 శాతం మించకపోవడం గమనార్హం. ► రియల్ ఎస్టేట్‌లో 22 శాతం, బ్యాంకింగ్‌లో 14 శాతం అధికంగా నియామకాలు నమోదయ్యాయి. రియల్టీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్, సైట్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు.. బ్యాంకింగ్‌లో రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్‌లకు డిమాండ్ నెలకొంది. ► ప్రొడక్షన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్వాలిటీ ఆడిటర్లకు డిమాండ్ ఏర్పడింది. ► హైదరాబాద్, చెన్నై, పుణె నగరాల్లో మధ్య స్థాయి, సీనియర్ ఉద్యోగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ► నియామకాలకు నాన్ మెట్రోలు కొత్త కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. అహ్మదాబాద్‌లో 26 శాతం, వదోదరలో 22 శాతం, జైపూర్‌లో 17 శాతం చొప్పున అధిక నియామకాలు (క్రితం ఏడాది మే నెలతో పోల్చినప్పుడు) జరిగాయి. ఇక్కడ బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు వృద్ధికి మద్దతుగా నిలిచాయి. ► పెద్ద మెట్రోల్లో నియామకాల పరంగా ఫ్లాట్ లేదా క్షీణత నమోదైంది. పెద్ద మెట్రోల్లో ముంబై, ఢిల్లీలో మాత్రం 5 శాతం వృద్ధి కనిపించింది. రియల్ ఎస్టేట్, టెలికం, హెల్త్‌కేర్, ఆటోమొబైల్ ఇక్కడ వృద్దికి దోహదపడ్డాయి. ► సీనియర్లకు అధిక డిమాండ్ నెలకొంది. 13–16 ఏళ్లు, అంతకుమించి సర్వీసు ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చాయి. ► ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో సీనియర్లకు నియామకాల పరంగా ప్రాధాన్యం నెలకొంది. ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్ ఫ్రెషర్లకు అవకాశాలు ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఫ్రెషర్లకు నియామకాల్లో 7 శాతం క్షీణత నమోదైంది. -
ఈ ఏడాది వృద్ధి 6 శాతానికిపైనే
భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి 7.2 శాతం వృద్ధి రేటును సాధించడం, దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం,అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాల నేపథ్యంలో ఎకానమీపై తాజా అంచనాలను పరిశీలిస్తే.. 2023–24లో వృద్ధి అంచనాలు అప్ అంతర్జాతీయ వృద్ధి అవుట్‌లుక్ బాగుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖంగా పయనిస్తున్నాయి. సేవల ఎగుమతులు మెరుగుపడుతున్నాయి. 2022–23 క్యూ4లో భారత్ వృద్ధి అంచనాలకు మించి మెరుగ్గా 6.1 శాతంగా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో భారత్ ఎకానమీ ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నాం. వెరసి 2023–24లో వృద్ధి 6.2 శాతంగా ఉండవచ్చు. ఇక భారత్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే 2023–24లో క్రితం అంచనాలు 5.3 శాతంకన్నా తక్కువగా 5.1 శాతంగా సగటు నమోదుకావచ్చు. ప్రపంచ వృద్ధి అంచనాలను ఇప్పటికే 50 బేసిస్ పాయింట్లు పెంచి 2.6 శాతానికి పెంచడం జరిగింది. చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికా నుంచి వెలువడుతున్న గణాంకాల సానుకూలత దీనికి కారణం. క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో ఉన్న అనిశ్చితి పరిస్థితి ఇప్పుడు కనిపించడంలేదు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. – యూబీఎస్, స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఈ సారీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో జూన్ 8వ తేదీ సమీక్షా సమావేశంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటులో ఎటువంటి మార్పూ చేయకపోవచ్చు. మార్చిలో 5.7 శాతం వద్ద ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. 2023లో సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా నమోదుకావచ్చు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కన్నా ఇది తక్కువ. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో మే 2022 నుంచి ఆరు దఫాలుగా రెపో రేటును ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పెంచుతూ వచ్చింది. ఈ కాలంలో రేటు 4 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్ పాలసీ సమీక్షా సమావేశంలో అందరి అంచనాలకూ భిన్నంగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయించింది. అయితే భవిష్యత్ నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడిపై ఆధారపడి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. – గోల్డ్‌మన్ శాక్స్, వాల్‌స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ 2023–24లో 6.7% వరకూ.. దేశీయంగా పటిష్టంగా ఉన్న ఆర్థిక ఫండమెంటల్స్, ప్రభుత్వం భారీ మూలధన పెట్టుబడుల మద్దతుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.5–6.7 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. 2022–31 దశాబ్ద కాలంలో భారత్ సగటున అంతక్రితం దశాబ్దంతో పోల్చితే (6.6 శాతం) భారీగా 7.8 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్యలు భారత్‌ను చక్కటి వృద్ధి పథంలో నడిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. భారతదేశం జీ–20 అధ్యక్ష పదవిని చేపట్టిన దృష్ట్యా, ఈ సంవత్సరం దేశానికి చాలా ముఖ్యమైనది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. దీని నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలు మనకు ముఖ్యమైనవి. ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. భారత్ వృద్ధికి దోహదపడే అంశం ఇది. – ఆర్ దినేష్, కొత్తగా ఎన్నికైన సీఐఐ ప్రెసిడెంట్ -
భారత్ జీడీపీ జూమ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదయ్యింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఫిబ్రవరిలో విడుదల చేసిన రెండవ అడ్వాన్స్ అంచనాలు 7 శాతం కన్నా ఇది అధికం కావడం గమనార్హం. వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు చక్కటి పనితీరును ప్రదర్శించినట్టు బుధవారం విడుదలైన గణాంకాలు వెల్లడించాయి. చైనా వృద్ధి రేటు చివరి త్రైమాసికంలో 4.5 శాతంగా నమోదయ్యింది. దీనితోపాటు ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను పోల్చితే భారత్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోంది. తాజా గణాంకాలతో గణనీయమైన పురోగతితో వార్షికంగా 3.3 ట్రిలియన్ డాలర్లకు ఎగసిన ఎకానమీ విలువ వచ్చే కొద్ది సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జీడీపీ లెక్కలు ఇలా.. 2011–12 స్థిర ధరల వద్ద (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసి) 2021–22 జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ విలువ రూ.41.12 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో (2022–23 జనవరి–మార్చి) ఈ విలువ రూ.43.62 లక్షల కోట్లు. వెరసి నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.1 శాతమన్నమాట. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరంలో చూస్తే... ఈ విలువలు 2021–22తో పోల్చిచూస్తే 2022–23లో రూ.149.26 లక్షల కోట్ల నుంచి రూ.160.06 లక్షల కోట్లకు పెరిగాయి. వెరసి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంది. 2021–22లో వృద్ధి రేటు 9.1 శాతం అయినప్పటికీ, బేస్ తక్కువగా ఉండడం (2020–21లో కరోనా కష్టకాలంలో వృద్ధిరేటు భారీగా పడిపోవడం) దీనికి ప్రధాన కారణం. అయితే 2021–22 చివరి త్రైమాసికం 4 శాతంతో పోల్చితే తాజా లెక్కలు మెరుగ్గా ఉండడం గమనార్హం. జీవీఏ లెక్క ఇదీ... కేవలం వివిధ రంగాల ఉత్పత్తి విలువకు సంబంధించిన– గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి రేటు 2022–23లో 7%గా ఉంది. 2021–22లో రేటు 8.8 శాతం. జీవీఏ ప్రకారం మార్చి త్రైమాసికం వృద్ధి రేటు పరిశీలిస్తే... ► తయారీ రంగం పురోగతి 2021–22 మార్చి త్రైమాసికంలో 0.6% ఉంటే, 2022–23 మార్చి త్రైమాసికంలో 4.5%గా నమోదయ్యింది. ► మైనింగ్ ఉత్పత్తి వృద్ధి ఇదే కాలంలో 2.3 శాతం నుంచి 4.3 శాతానికి ఎగసింది. ► నిర్మాణ రంగం విషయంలో భారీగా 4.9 శాతం నుంచి 10.4 శాతానికి చేరింది. ► వ్యవసాయ రంగం పురోగతి 4.1 శాతం నుంచి 5.5 శాతానికి చేరింది. 2022–23 వృద్ధి (%) క్యూ1 13.1 క్యూ2 6.2 క్యూ3 4.5 క్యూ4 6.1 సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది ప్రపంచ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.2 శాతం వార్షిక వృద్ధిని నమోదుచేసుకోవడం హర్షణీయ పరిణామం. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని, సూచీల దృఢమైన పనితీరును, ఆశాజనక పరిస్థితిని గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. – ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలకు మించి.. తాజా ఆర్థిక పురోగతిని పరిశీలిస్తే, ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీ తొలి 6.5% అంచనాలను మించి వృద్ధి సాధించే అవకాశా లు కనిపిస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్థల అంచనాలను మించి 2022–23 ఎకానమీ గణాంకాలు నమోదుకావడం భారత్ సవాళ్లను ఎదుర్కొనగలిగిన పరిస్థితికి అద్దం పడుతోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ -
ఎల్ఐసీ ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 17 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. 2021–22 సంవత్సరానికి ప్రీమియం ఆదాయం రూ.1.99 లక్షల కోట్లుగా ఉంది. ప్రీమియం వసూలు పరంగా చూస్తే జీవిత బీమా మార్కెట్లో 2023 మార్చి నాటికి 62.58 మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు ఎల్ఐసీ తెలిపింది. లిస్టెడ్ జీవిత బీమా కంపెనీల్లో ప్రీమియం వృద్ధి పరంగా ఎల్ఐసీ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ 18.83 శాతం మేర ప్రీమియం ఆదాయంలో వృద్ధిని చూపించి మొదటి స్థానంలో ఉంటే, ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 16.22 శాతం పెరిగి మూడో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం ఆదాయం 12.55 శాతం మేర పెరిగింది. ఎల్ఐసీకి సంబంధించి ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల ప్రీమియం ఆదాయం 3.30 శాతం పెరగ్గా, ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 10 శాతం, గ్రూప్ సింగిల్ ప్రీమియం ఆదాయం 21.76 శాతం, చొప్పున పెరిగాయి. -
భారత్ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్ కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతానికి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 6.6 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఆదాయ వృద్ధి మందగమనం, అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తన క్రితం అంచనాల తాజా తగ్గింపునకు కారణమని దక్షిణాసియాకు సంబంధించి ఆవిష్కరించిన నివేదికలో బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక (స్ప్రింగ్) సమావేశాలకు ముందు వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా) హన్స్ టిమ్మర్ ఈ నివేదిక విడుదల చేశారు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ♦ బలహీన వినియోగం, కఠిన వడ్డీరేట్ల వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ ప్రస్తుత వ్యయ నియంత్రణ అంచనాల డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణం. ♦ దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాల కంటే భారతదేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆర్థిక రంగంలో పరిస్థితి ఇతర దేశాల కంటే బాగుంది. భారతదేశంలోని బ్యాంకులు పటిష్ట స్థితిలో ఉన్నాయి. మహమ్మారి తర్వాత బ్యాంకింగ్ చక్కటి రికవరీ సాధించింది. ఆర్థిక వ్యవస్థలో తగిన రుణాలకుగాను లిక్విడిటీ బాగుంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ప్రైవేట్ పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయి. సమస్యల్లా దేశం తన సామర్థ్యాన్ని తక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే. ♦ భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అసంఘటిత రంగం ఉత్పాదకత పెరుగుతోందన్న దాఖలాలు లేవు. అలాగని ఫలితాలూ మరీ అధ్వానంగానూ లేవు. ఆయా అంశాలను పరిశీలిస్తే అన్ని వర్గాల భాగస్వామ్యంతో వృద్ధిని మరింత పెంచడానికి భారత్ ముందు భారీ నిర్మాణాత్మక ఎజెండా ఉందని భావిస్తున్నాం. ♦ విదేశాల నుండి ప్రైవేట్ పెట్టుబడులు మరింత పెరగాలి. ముఖ్యంగా సేవల రంగాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇందుకుగాను సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఉద్గారాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. దక్షిణాసియా దేశాలపై ఇలా.. స్వల్పకాలికంగా చూస్తే, భారత్ దక్షిణాసియాలో ఇతర దేశాలకంటే పటిష్ట ఎకానమీని కలిగి ఉంది. భూటాన్ మినహా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు తమ వృద్ధి అంచనాలను కుదించుకుంటున్నాయి. గత ఏడాది విపత్తు వరదల ప్రభావంతో పాకిస్తాన్ ఇంకా సతమతమవుతూనే ఉంది. సరఫరాల వ్యవస్థకు తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి. పెట్టుబడిదారుల విశ్వాసం దిగజారుతోంది. అధిక రుణ, మూలధన వ్యయాలు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ వృద్ధి ఈ ఏడాది 0.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక రుణ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఎకానమీలో వృద్ధి లేకపోగా, ఇది ఈ ఏడాది 4.3% క్షీణిస్తుందన్నది అంచనా. పర్యాటకం ఊపందుకోవడం మాల్దీవులు, నేపాల్‌కు సానుకూల అంశాలైనా, అంతకుమించి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావాలు ఈ దేశాలు ఎదుర్కొననున్నాయి. దక్షిణాసియాలో 2023లో 8.9 శాతం ద్రవ్యోల్బణం అంచనాలు ఉన్నాయి. 2024లో ఇది 7% లోపునకు తగ్గవచ్చు. అయితే బలహీన కరెన్సీలు పెద్ద సమస్యగా ఉంది. ద్రవ్యోల్బణం భయాలను పెంచే అంశమిది. వృద్ధి 6.4 శాతం: ఏడీబీ ఇదిలాఉండగా, 2023–24లో భారత్ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అవుట్‌లుక్ ఒకటి పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసిన ఏడీబీ, 2023–24లో ఈ రేటు తగ్గడానికి కఠిన ద్రవ్య పరిస్థితులు, చమురు ధరలు పెరగడాన్ని కారణంగా చూపింది. కాగా, 2024–25లో వృద్ధి రేటు 6.7 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనావేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగడం దీనికి కారణంగా చూపింది. రవాణా రంగం పురోగతికి, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఫలితాలు ఇస్తాయని ఏడీబీ వివరించింది. అంతర్జాతీయంగా పలు దేశాలు మాంద్యం ముంగిట నుంచున్నప్పటికీ, భారత్ ఎకానమీ తన సహచర దేశాల ఎకానమీలతో పోల్చితే పటిష్టంగా ఉందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కినీషీ పేర్కొన్నారు. -
ఎనిమిది పరిశ్రమల గ్రూప్.. అక్కడక్కడే!
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు ఫిబ్రవరిలో దాదాపు నిశ్చలంగా 6 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.9 శాతం. 2023 జనవరిలో వృద్ధి రేటు భారీగా 8.9 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో క్రూడ్ ఆయిల్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లో (బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్) ఉత్పత్తి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మాత్రం 4.9 క్షీణించింది (2022 ఫిబ్రవరితో పోల్చి). కాగా, మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య గ్రూప్ వృద్ధి రేటు 7.8 శాతంకాగా, 2021–22 ఇదే కాలంలో ఈ రేటు 11.1 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ రెండవ వారం ప్రారంభంలో ఫిబ్రవరి ఐఐపీ గణాంకాలు వెలువడతాయి. ఎకానమీ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మౌలిక రంగం పురోగతి రానున్న కాలంలో కొంత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కీలక రంగాలకు ప్యాకేజీ అవసరమని కూడా సూచిస్తున్నారు. మున్ముందు ఈ రంగాల గణాంకాలపై ‘బేస్ ఎఫెక్ట్’ ప్రభావం ప్రధానంగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. -
భారత్ వృద్ధికి సంస్కరణల ఊతం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికే అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్కరణల ఎజెండాను మరింత వేగవంతంగా అమలు చేయడం వల్ల దేశ వృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రతికూలతకు దారితీసిందని బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం స్పష్టం చేసింది. ఆయా పరిస్థితులు ఎకానమీ పురోగతికి సంబంధించి ప్రపంచం ఒక ‘దశాబ్దాన్ని’ కోల్పోయే పరిస్థితిని సృష్టిస్తున్నాయని హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక పురోగతి మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. 2000–2010 మధ్య ప్రపంచ స్థూల వృద్ధి రేటు దాదాపు 6.5 శాతం ఉంటే, 2020–30 మధ్య కాలానికి ఈ రేటు 2.2 శాతానికి పడిపోవచ్చని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే, ఎకానమీ క్షీణత 2000– 2010 మధ్య సంవత్సరానికి సగటున 6 శాతం ఉంటే, ఈ దశాబ్దంలో మిగిలిన కాలంలో సంవత్సరానికి 4 శాతానికి పడిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం– మాంద్యం పరిస్థితులు తలెత్తితే ఈ పతనం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ‘దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు తిరోగమనం–పోకడలు, అంచనాలు–విధానాల’ పేరుతో విడుదలైన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు. ► భారత్ తోటి దేశాల కంటే వేగవంతమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ, సంస్కరణ ఎజెండాను ముఖ్యంగా తయారీ, మౌలిక రంగంలో వేగవంతంగా అమలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో ఒత్తిడులను తొలగించాల్సి ఉంది. ఈ విభాగంలో సవాళ్లు దేశ పురోగతికి బ్రేకులు వేస్తున్నాయి. ► 2000–10లో భారత్ పెట్టుబడుల సగటు వార్షిక వృద్ధి 10.5 శాతం అయితే, 2011–21లో ఈ రేటు 5.7 శాతానికి పడిపోయింది. ► విద్యుత్, రోడ్డు, రైలు నెట్వర్క్, వ్యాపారాలకు ఎదురవుతున్న అవరోధాలు, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల వంటి బలహీనతలు వంటి అంశాలు భారత్ ఎకానమీకి అవరోధాలుగా ఉన్నాయి. ► కోవిడ్–19తో ఎదురవుతున్న పరిణామాలు ప్రపంచ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ► భౌగోళిక ఉద్రిక్తతలూ ప్రపంచ వృద్ధి తిరోగమనానికి దారితీస్తున్నాయి. ► పెట్టుబడుల్లో వృద్ధి క్షీణిస్తోంది. ప్రపంచ శ్రామిక శక్తి మందకొడిగా పెరుగుతోంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల మానవ వనరుల నైపుణ్య కొరత ఎదురవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో వృద్ధి.. జీడీపీ పురోగతికి తగిన విధంగా సరిపోవడం లేదు. -
రాష్ట్రంలో అత్యధిక వృద్ధి రేటు
సాక్షి, అమరావతి : గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినట్లు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. 2021–22లో ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 18.47 శాతం మేర వృద్ధి సాధించినట్లు కాగ్ వెల్లడించింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా తెలిపింది. 2020–21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు తగ్గడానికి కోవిడ్ మహమ్మారివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణమని పేర్కొంది. అయితే, దేశ జీడీపీతో పోలిస్తే ఆ ఏడాది రాష్ట్రంలో జీఎస్డీపీ 5 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించింది. అలాగే, ఆ ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 1.36 శాతం క్షీణించిందని కాగ్ తెలిపింది. ఈ రంగాల్లో అత్యధిక వృద్ధి.. ఇక 2021–22 విషయానికొస్తే.. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగంలో అత్యధిక వృద్ధి నమోదైనట్లు కాగ్ పేర్కొంది. ♦ అంతకుముందు ఏడాదితో పోలిస్తే అత్యధికంగా పారిశ్రామిక రంగంలో 25.58 శాతం వృద్ధిని సాధించినట్లు కాగ్ తెలిపింది. అలాగే.. ♦ కోవిడ్ తర్వాత నిర్మాణ రంగం, తయారీ రంగం కోలుకున్నాయి. ఫలితంగా నిర్మాణ రంగం 27%, తయారీ రంగం 25 శాతం పెరిగింది. ♦ వ్యవసాయ రంగంలో ప్రధానంగా చేపలు, ఆక్వాకల్చర్, పంటలు, పశు సంపద కార్యకలాపాలు పెరగడంతో వ్యవసాయ రంగం వృద్ధి సాధించింది. ♦ చేపల పెంపకం, ఆక్వాకల్చర్ 26%, పంటలు, పశుసంపదలో 11 శాతం పెరుగుదల ఉంది. ♦ ప్రధానంగా వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు 23 శాతం, రవాణా, నిల్వల, ప్రసార, సమాచార సేవలు 21 శాతం, స్థిరాస్తి రంగం 15 శాతం పెరగడంతో సేవలం రంగంలో భారీ వృద్ధి నమోదైంది. -
భారత్ ఎకానమీపై భరోసా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7 శాతంగా నమోదవుతుందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) జనవరిలో 25 నెలల కనిష్ట స్థాయి తరహాలోనే రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతా తగ్గుతుందని అంచనావేసింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు కట్టడిలో ఉండడం ఈ అంచనాలకు కారణమని తెలిపింది. ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% దిగువ కు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనావేస్తున్నాట్లు పేర్కొంది. ఈ మేరకు విడుదలైన నెల వారీ ఆర్థిక సమీక్షలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► అధిక సేవల ఎగుమతుల నుంచి పొందుతున్న లాభాలు, చమురు ధరలు అదుపులో ఉండడం, దిగుమతి ఆధారిత వినియోగ డిమాండ్‌లో ఇటీవలి తగ్గుదల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరంలో తగ్గుతుందని భావించడం జరుగుతోంది. ఈ పరిస్థితి రూపాయి అనిశ్చితి పరిస్థితి కట్టడికి దోహదపడుతుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యాడ్ కట్టడిలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అవకాశం. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపబోవు. ► భారత్ సేవల రంగం ఎగుమతుల విషయంలో పురోగతి దేశానికి ఉన్న మరో బలం. కరోనా సవాళ్లు తొలగిన నేపథ్యంలో ఐటీ, నాన్–ఐటీ సేవల విషయంలో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా పెరుగుతోంది. అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల నేపథ్యంలో దిగుమతుల బిల్లు కూడా దేశానికి కలిసి వస్తోంది. ► తైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేయడం జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా యి. 2023లో వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ తరహా భారీ వసూళ్లు వరుసగా 12వ నెల. ► భారతదేశ కార్పొరేట్ రంగం రుణ–జీడీపీ నిష్ప త్తి చారిత్రక రేటు కంటే తక్కువగా ఉంది. ఇది కార్పొరేట్ రంగానికి మరింత రుణం తీసుకోవడానికి తగిన వెసులుబాటును కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగించడంలో కార్పొరేట్ల రుణ ప్రొఫైల్ కీలక పాత్ర పోషిస్తుంది. -
జోరుగా పేటీఎం లావాదేవీలు.. 8.9 కోట్లకు చేరిన యూజర్ల సంఖ్య!
న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తన వృద్ధిని జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ కొనసాగించింది. ఈ రెండు నెలల్లో నెలవారీ లావాదేవీలు నిర్వహించిన సగటు యూజర్ల సంఖ్య 8.9 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా మర్చంట్ల వద్ద పేటీఎం సౌండ్‌బాక్స్ డివైజ్‌ల సంఖ్య 64 లక్షలకు చేరుకుంది. వీరు నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించే చందాదారులు. ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేసిన డివైజ్‌ల సంఖ్య 3 లక్షలుగా నమోదైంది. వర్తకుల వద్ద చెల్లింపుల లావాదేవీలు కూడా పెరిగాయి. స్థూల మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) జనవరి, ఫిబ్రవరి నెలల్లో కలిపి రూ.2.34 లక్షల కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే 41 శాతం వృద్ధి కనిపించింది. రుణ వితరణ వ్యాపారం కూడా తన జోరును కొనసాగించింది. తన ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం చేసుకున్న రుణదాతల ద్వారా రెండు నెలల్లో రూ.8,086 కోట్లను మంజూరు చేసింది. వార్షికంగా ఇది 286 శాతం వృద్ధి కావడం గమనించొచ్చు. రెండు నెలల్లో జారీ చేసిన రుణాల సంఖ్య 79 లక్షలుగా ఉంది. చదవండి👉 పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
ఏడు శాతం కంటే తక్కువే.. మరింత తగ్గే అవకాశం
ముంబై: జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా అంచనా 7 శాతం కంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా అంచనాల్లో పేర్కొంది. చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధి రేటు దాదాపు 4 శాతంగా ఉంటుందని కూడా పేర్కొంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13.2 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. మూడవ తైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం నమోదవుతుందని రెండవ ముందస్తు అంచనాల్లో ఎన్ఎస్ఓ పేర్కొంది. ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావాలంటే నాల్గవ త్రైమాసికంలో కనీసం 4.1 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సి ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా 2022–23లో వృద్ధి రేటు 6.8 శాతంగానే అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ విశ్లేషకులు పరాస్ జస్రాయ్ చేసిన విశ్లేషణల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► వృద్ధి పురోగతికి పలు అవరోధాలు ఉన్నాయి. డిమాండ్ ఊపందుకోవడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎగుమతుల్లో పురోగతి లేదు. రుణ వృద్ధి కఠిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ► ఇక ఉత్తరాదిలో వేసవి ఫిబ్రవరిలోనే తీవ్రంగా ఉంది. ఇది గోధుమ ఉత్పత్తిపై ఆందోళనలను సృష్టిస్తోంది. మార్చి– మే మధ్య వేసవి తీవ్రత మరింత ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ► నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కనీసం 4.3 శాతం నమోదవుతుందన్న అంచనాలను వేసవి తీవ్రత విఘాతం కలిగించవచ్చు. ► ఇక ద్రవ్యోల్బణం తీవ్రత గ్రామీణ వినియోగ డిమాండ్‌పై ప్రభావితం చూపే వీలుంది. మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పడిపోయిన డిమాండ్ ఇంకా నత్తనడకనే సాగుతోంది. ► మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగుల్లో ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ లిక్విడిటీ తగ్గుతుండడం మరో ఆందోళకరమైన అంశం. జనవరిలో బలమైన క్రెడిట్ డిమాండ్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నాలుగు నెలల కనిష్టం 0.43 శాతానికి తగ్గింది. 2022 డిసెంబర్లో ఇది 0.53 శాతంగా ఉంది. -
విధాన లోపం వ్యవస్థకు శాపం
2023 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి రేటును మాత్రమే సాధించగలిగింది. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ జీడీపీ పతనం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమితమైంది. ఈ దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో ఉండడం. ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ప్రభుత్వ విధానాలు మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలానికి సంబం ధించి డిసెంబర్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి (జీడీపీ) రేటును మాత్రమే సాధించగలిగింది. అంతకు ముందరి త్రైమాసిక వృద్ధి రేటు 6.3 శాతం కంటే ఇది గణనీయమైన పతనం. 2022 ఆర్థిక సంవత్సరం తాలూకూ మూడవ త్రైమాసికంలోని 5.2 శాతం కంటే కూడా ఇది తక్కువ. ఈ జీడీపీ దిగజారుడు మన దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొంటున్న అనేక సమస్యలకు ప్రతిబింబం. వృద్ధి రేటును లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకునే అంశా లుగా వ్యక్తిగత వినియోగం, ప్రభుత్వ వినియోగం లేదా వ్యయాలు, పెట్టుబడులు, నికర ఎగుమతులు ఉంటాయి. వీటిలో వ్యక్తిగత విని యోగానిది అతిపెద్ద వాటా. అది దేశీయ జీడీపీలో 55 నుంచి 60 శాతం మేరకు వాటాని కలిగి ఉంటుంది. కాగా, ఇది ప్రస్తుతం అంతకు ముందరి మూడవ త్రైమాసికంలోని వృద్ధి రేటుతో పోలిస్తే కేవలం 2.1 శాతం మాత్రమే ఎదుగుదలను చూపింది. ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటు పతనం వెనుక వ్యక్తిగత వినియోగ పతనం ఉందన్నది గమనించాల్సిన అంశం. ఈ వ్యక్తిగత వినియోగం తగ్గటం వెనుక అసమానతలతో కూడిన ఆర్థిక అభివృద్ధి ఉంది. దీనినే మనం ఆంగ్లాక్షరం ‘కే’ పై గీత, కింది గీతలతో పోలుస్తున్నాం. పై గీతను పోలిన ధనవంతులు మరింతగా ధనవంతులవుతుండగా, కింది గీతను పోలిన సామాన్య జనం మరింత కిందికి దిగజారుతున్నారు. ఈ అసమానతల అభివృద్ధికి వక్కాణింపుగా – ఇండియా రేటింగ్స్ సంస్థ ఆర్థిక వేత్త సునీల్ కుమార్ సిన్హా మాటలను చెప్పుకోవచ్చు: ‘ప్రస్తుత వినియోగ డిమాండ్ అనేది ప్రధానంగా ఉన్నత ఆర్థిక వర్గాలు వినియోగించే సరుకులు, సేవల నుంచే వస్తోంది. అంటే, ప్రస్తుతం దేశంలోని ప్రజల వ్యక్తిగత వినియోగంలో సింహభాగం – ఉన్నత ఆదాయ వర్గాల నుంచే వస్తోంది. మరో రకంగా చెప్పాలంటే – మెజారిటీ జన సామాన్యం కొనుగోళ్లు బల హీనంగా ఉన్నాయి.›ఫలితంగా అంతిమ లెక్కింపులో దేశంలో వ్యక్తిగత వినియోగం బలహీనపడుతోంది’. కోవిడ్ మహమ్మారి కాలంలో దేశంలో ప్రజల వినియోగం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తొలి దశలో ఈ వ్యక్తిగత వినియోగం పెద్దగంతులో పెరిగింది. కోవిడ్, లాక్ డౌన్ల కాలంలో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు లేదా సేవల కొను గోళ్లను వాయిదా వేసి ఉంచడం... కోవిడ్ బెడద తగ్గగానే ఒక్కసారిగా కొనుగోళ్లు చేయడం ఈ పెద్దగంతు వినియోగ పెరుగుదలకు కారణం. ఒక మారు ఈ తరహా కొనుగోళ్లు పూర్తయి పోగానే, మరలా వినియోగం తగ్గుముఖం పట్టసాగింది. కోవిడ్ అనంతర కాలంలో కూడా జఠిలంగానే మిగిలి పోయిన నిరుద్యోగం, పడిపోతున్న దేశీయ ఎగుమతులు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలన్నీ కల గలిసి ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. కోవిడ్, లాక్డౌన్లు, అనంతరం కూడా సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యారు. బంగారాన్ని తనఖా పెట్టడం భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజల పొదుపు స్థాయి దారుణంగా పడి పోయింది. కొత్తగా అప్పులు చేయగల స్థితి కూడా లేకుండా పోయింది. జీడీపీ పతనం కేవలం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమి తమైంది. అంటే, భారతదేశంలో జీడీపి వృద్ధి, మిగత ప్రపంచం తాలూకూ సమస్యలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోనే అత్యధి కంగా ఉంటుందనే కట్టుకథను ఇది వట్టిదిగా కొట్టేసింది. పైన పేర్కొన్న దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆయా దేశాలలో ఆర్థిక అసమానతలు అత్యంత తీవ్రస్థాయిలో ఉండడం. భారత్ సహా దరిదాపు ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ఉదాహరణకు, అంత ర్జాతీయ కార్మిక సమాఖ్య గణాంకాల ప్రకారం 2008–11 కాలంలో మన దేశంలో నిజ వేతనాల పెరుగుదల 1 శాతం ప్రతికూల దిశగా ఉన్నది. అదే కాలంలో దేశంలో కార్మిక ఉత్పాదకత 7.6 శాతం పెరిగింది. పెరిగిన సంపద తాలూకు ప్రయోజనం కార్మికులు, ఉద్యోగు లకు దక్కక పోగా, వారికి అప్పటికే ఉన్న ఆర్థిక స్థితి దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతోంది ఈ వేతనాల పతనమే. 2018 నాటి అంతర్జాతీయ కార్మిక సమాఖ్య తాలూకు ప్రపంచ వేతనాల నివేదిక కూడా ఈ అంశాన్నే చెబుతోంది. ఒక్క చైనా మినహా 2017లో ప్రపంచ వ్యాప్తంగా వేతనాల పెరుగుదల వార్షికంగా కేవలం 1.1 శాతం. జపాన్‌లో దశాబ్దాల కాలంపాటు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు ఎదుగూ బొదుగూ లేకుండా స్తంభించిపోయి ఉన్నాయి. మొత్తంగా జీ 20 దేశాల్లో 2017లో నిజ వేతనాల వృద్ధి కేవలం 0.4 శాతం. చైనాలో 2015 నాటికే సరుకు ఉత్పత్తి రంగంలోని కార్మికుల 1 గంట కాలపు వేతనాలు, అప్పటికే అధిక ఆదాయ దేశాలుగా ఉన్న గ్రీస్, పోర్చుగల్‌తో సమానంగా ఉన్నాయి. దాని వలన అక్కడ యావన్మంది ప్రజల కొనుగోలు శక్తి తగినస్థాయిలో ఉంది. ఫలితంగానే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం తన దేశీయ ఎగుమతులు కొంత మేర తగ్గినా, స్వయంగా తన దేశంలోనే పెరిగిన ప్రజల కొనుగోలు శక్తి ద్వారా, ఆర్థిక వృద్ధిని కొనసాగించగలిగింది. ప్రస్తుతం తన జీరో కోవిడ్ పాలసీ, నిర్మాణ రంగం పట్ల కఠిన వైఖరి తరువాత కూడా చైనాలో కర్మాగారాల ఉత్పత్తి రికార్డు స్థాయిని అందుకుంది. దీనంతటికీ కారణం, కొనుగోలు శక్తి ప్రజానీకం అంతటిలోనూ విస్తారంగా పెరిగి ఉండడమే. మన దేశంలో నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాలు పొదుపు చర్యల రూపంలో ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. ఈ పొదుపు చర్యల వల్ల ప్రతీ సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలపై కోతలు పడుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలు, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ విధానాలపై కోతలు పడడం చూశాం. ఈ పొదుపు చర్యలలో భాగంగానే దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గిపోయింది. 2022లోనే దీనిలో 8.8 శాతం తగ్గుదల నమోదైంది. దీనంతటి ఫలితంగా ప్రజల ఉపాధి అవకాశాలు, కొనుగోలు శక్తి వేగంగా పడిపోతున్నాయి. దశాబ్దాల కాలం ప్రజల పన్నుల డబ్బు, శ్రమలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు వేగంగా ప్రైవేటు పరం అవుతుండడం... దేశంలోని రోడ్లు, రైలు మార్గాలు, స్టేడియాలు ఇత్యాది సమస్త మౌలిక సదు పాయాల వ్యవస్థలూ నగదీకరణ పేరిట ప్రైవేట్ పరం అవుతుండడంతో – ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే పేరిట (ద్రవ్యలోటు తగ్గింపు కోసం) నిత్యావసరాల పైన కూడా జీఎస్టీ వంటి పన్ను భారాలను మోపడం ప్రజల కొనుగోలు శక్తి పాలిట అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వ విధానాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్న విధంగా, మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్గం – ఇప్పటి వరకూ జరిగినట్లుగా కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు ఇస్తూ పోయి, జన సామాన్యంపై భారాలు మోపుతూ నిర్ణయాలు తీసు కోవడం కాదు. సంపదలో సాధ్యమైనంతగా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి జనాలకు తగిన వాటాను కల్పించడం! ప్రస్తుత వృద్ధి రేటు పతనం, దానికి మూలంగా ఉన్న ప్రజల కొనుగోలు శక్తి పతనం వంటి వాటిని పరిష్కరించలేని పక్షంలో మున్ముందు దేశ ఆర్థిక సమస్యలు మరింత జఠిలం కాగలవు. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
హిందూ వృద్ధి రేటుకు దగ్గర్లో భారత్
న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడుల తగ్గుదల, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ‘‘హిందూ వృద్ధి రేటుకు ప్రమాదకర స్థాయిలో చాలా దగ్గరగా’’ ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. సీక్వెన్షియల్‌గా త్రైమాసికాలవారీ వృద్ధి నెమ్మదిస్తుండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1950ల నుంచి 1980ల దాకా అత్యంత తక్కువ స్థాయిలో నమోదైన వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా వ్యవహరిస్తారు. ఇది సగటున 4 శాతంగా ఉండేది. 1978లో భారతీయ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ ఉపయోగించిన ఈ పదం ఆ తర్వాత నుంచి అత్యంత నెమ్మదైన వృద్ధి రేటుకు పర్యాయపదంగా మారింది. జాతీయ గణాంకాల కార్యాలయం గత నెల విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 13.2 శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, రెండో క్వార్టర్లో 6.3 శాతానికి, తర్వాత మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘గత జీడీపీ గణాంకాలను తిరిగి ఎగువముఖంగా సవరించే అవకాశం ఉందని ఆశావహులు ఆశిస్తుండవచ్చు. కానీ సీక్వెన్షియల్ మందగమనం ఆందోళనకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడటం లేదు .. ఆర్బీఐ ఇప్పటికీ వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది .. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి మందగించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు వృద్ధికి అవసరమైన తోడ్పాటు ఎక్కణ్నుంచి లభిస్తుందన్నది తెలియడం లేదు’’ అని రాజన్ పేర్కొన్నారు. తన ఆందోళనకు బలమైన కారణాలే ఉన్నాయని ఆయన చెప్పారు. నాలుగో త్రైమాసికంలో వృద్ధి మరింత నెమ్మదించి 4.2 శాతానికే పరిమితం కావచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక వృద్ధి రేటు దాదాపు మూడేళ్ల క్రితం నాటి కరోనా పూర్వపు 3.7 శాతం స్థాయికి దగ్గర్లో నమోదైందని పేర్కొన్నారు. ‘‘హిందూ వృద్ధి రేటుకు ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో, అత్యంత దగ్గరగా ఉంది!! మనం ఇంకా మెరుగ్గా వృద్ధి సాధించాలి’’ అని ఆయన చెప్పారు. ఆశావహంగా సర్వీసులు.. ప్రభుత్వం తన వంతుగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోందని రాజన్ చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీసుల రంగం ఆశావహంగా కనిపిస్తోందని రాజన్ చెప్పారు. చాలా మటుకు సంపన్న దేశాలు సేవల ఆధారితమైనవే ఉంటున్నాయని.. భారీ ఎకానమీగా ఎదగాలంటే తయారీపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సర్వీసులతో .. నిర్మాణ, రవాణా, టూరిజం, రిటైల్, ఆతిథ్యం తదితర రంగాల్లో ఒక మోస్తరు నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాలను భారీగా కల్పించేందుకు వీలవుతుందని రాజన్ తెలిపారు. అదానీ గ్రూప్–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదంపై స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలపై నిఘాను తీవ్రంగా పెంచాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందని తాను భావించడం లేదన్నారు. తమ పని తాము చేసేలా నియంత్రణ సంస్థలను ప్రోత్సహిస్తూనే అటు వ్యాపార సంస్థలు .. ప్రభుత్వాల మధ్య లోపాయికారీ సంబంధాలను తగ్గించుకుంటే ఇలాంటివి తలెత్తడం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. -
జనవరిలో మౌలిక రంగం ఊరట
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ జనవరిలో మంచి ఫలితా న్ని నమోదు చేసింది. ఈ గ్రూప్ వృద్ధి రేటు సమీక్షా నెల్లో 7.8 శాతంగా నమోదయ్యింది. 4 నెలల గరిష్ట స్థాయి ఇది. క్రూడ్ ఆయిల్ (1.1 శాతం క్షీణత) మినహా మిగిలిన ఏడు రంగాలూ వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. వీటిలో బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్–జనవరి మధ్య ఈ గ్రూప్ వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 49.27 శాతం. -
తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులతో పాటు దేశంలో కీలక తయారీ రంగం కుంటుపడటం ఎకానమీ మందగమనానికి కారణమవుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన అక్టోబర్–నవంబర్–డిసెంబర్ (3వ త్రైమాసికం) గణాంకాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం గడచిన రెండు త్రైమాసికాల్లో (జూన్, సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలో భారత్ వృద్ధి రేటు 11.2%. ఈ లెక్కలు ఎకానమీ మందగమనాన్ని సూచిస్తున్నాయి. 2021–22 వృద్ధి రేటు 9.1 శాతానికి పెంపు 2021–22 వృద్ధి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా క్రితం 8.7 శాతం నుంచి 9.1 శాతానికి ఎగువముఖంగా సవరించడం కొంత ఊరట కలిగించే అంశం. 2020–21లో జీడీపీ విలువ రూ.136.87 లక్షల కోట్లు. 2021–22లో ఈ విలువ రూ.149.26 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 9.1 శాతంగా నమోదయ్యిందన్నమాట. కరోనా తీవ్ర సంక్షోభం నేపథ్యంలో 2020–21లో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8% క్షీణతను నమోదుచేసుకుంది. ఇక తలసరి ఆదాయం 2020–21 నుంచి 2021–22కు రూ.1,27,065 నుంచి రూ.1,48,524కు పెరిగింది. పెట్టుబడులకు సంబంధించి గ్రాస్ క్యాపి టల్ ఫార్మేషన్ కరెంట్ ప్రైస్ ప్రకారం, ఇదే కాలంలో రూ.55.27 లక్షల కోట్ల నుంచి రూ.73.62 లక్షల కోట్లకు ఎగసింది. స్థూల పొదుపులు రూ.57.17 లక్షల కోట్ల నుంచి రూ.70.77 లక్షల కోట్లకు ఎగశాయి. 2022–23లో 7 శాతంగా అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా (6.8 శాతం) ఇది 20 బేసిస్ పాయింట్లు అధికంకావడం గమనార్హం. 4.4 శాతం వృద్ధి ఎలా అంటే.. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన స్థిర (2011–12 బేస్ ఇయర్) ధరల వద్ద 2021–22 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.38.51 లక్షల కోట్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా తొలి అంచనాలు వేయడం జరిగింది. అంటే వృద్ధి రేటు 4.4 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 11.2% వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది. కీలక రంగాల తీరిది... ► తయారీ: గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ప్రకారం (పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి దోహదపడే విధానం) 3వ త్రైమాసికంలో తయారీ రంగం ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 1.1 శాతం క్షీణించింది. 2021 ఇదే కాలంలో ఈ రంగం కనీసం 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► వ్యవసాయం: మొత్తం ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. 2022 ఇదే కాలంలో ఈ రేటు 2.2 శాతం. ► మైనింగ్ అండ్ క్వారియింగ్: వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 8.4 శాతానికి చేరింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి 6 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు: వృద్ధి 9.2 నుంచి 9.7 శాతానికి చేరింది. 2022–23పై అంచనాలు ఓకే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలు తగిన విధంగా, వాస్తవికతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఈ స్థాయి వృద్ధి సాధనకు భారత్ నాల్గవ త్రైమాసికంలో 5 నుంచి 4.1 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్ సిద్ధం కావాల్సి ఉంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
ఫార్మాస్యూటికల్స్ వృద్ది అంతంతే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2023 జనవరిలో 2.3 శాతం వృద్ధి చెందింది. 2022 జూన్ నుంచి పోల్చితే ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతేడాది గరిష్ట అమ్మకాలు నమోదు కావడం, కాలానుగుణ ప్రభావం ఇందుకు కారణమని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ తెలిపింది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపై తీసుకున్న ధరల పెంపు గత నెలలో మొత్తం మార్కెట్ పనితీరుకు కీలకంగా ఉంది. అయితే పరిమాణాలు క్షీణించాయని వివరించింది. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రకారం 2022 జనవరిలో పరిశ్రమ 14.1 శాతం, డిసెంబర్లో 10.4 శాతం దూసుకెళ్లింది. గతేడాది ధరలు 5.8 శాతం పెరిగితే, జనవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. కొత్త ఉత్పత్తుల రాక 1.8 శాతం పెరిగింది. 2022లో ఇది 2.8 శాతం. పరిమాణం 5.5 నుంచి 5.4 శాతానికి క్షీణించింది. భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2021లో 14.9 శాతం, 2022లో 8 శాతం దూసుకెళ్లింది. 2023–24లో పరిశ్రమ 8–10 శాతం వృద్ధికి ఆస్కారం ఉంది. 2023 జనవరిలో డెర్మటాలాజికల్, గైనకాలాజికల్ విభాగం ఔషధాల అమ్మకాలు వరుసగా 11, 10 శాతం పెరిగాయి. విటమిన్స్ విక్రయాలు అతి తక్కువగా 0.3 శాతం అధికం అయ్యాయి. -
వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధి రేటుపై ద్రవ్యోల్బణం ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు గణనీయంగా తగ్గనుందని ‘ముందస్తు ప్రాథమిక అంచనాలు (ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్/పీఏఈ)’ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ 19.4శాతం వృద్ధి రేటును నమోదుచేయగా.. 2022–23లో 15.6 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జాతీయ స్థాయిలో చూసినా.. 2021–22లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.5శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. 2022–23లో 15.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన తెలంగాణ సామాజిక–ఆర్థిక సర్వే–2023 నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది. స్థిర ధరల వద్ద 7.4 % దేశ, రాష్ట్ర వృద్ధిరేటు తగ్గుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, సప్లై మందగమనం, డిమాండ్ తగ్గడంతో వృద్ధికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రధానంగా తయారీ రంగంపై ఈ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. ఇక గత ఏడాది (2021–22) సాధించిన 19.4శాతం భారీ వృద్ధిరేటుపై అంతకు మించిన వృద్ధిరేటును ఈ ఏడాది ఆశించడం సాధ్యం కాదని వివరించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014–15 నుంచి 2019–20 వరకు జాతీయ సగటును మించి వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని.. కోవిడ్ తర్వాత కాలంలో జాతీయ సగటుతో సమానంగా వృద్ధి రేటు కొనసాగుతోందని పేర్కొంది. ఇక స్థిర (2011–12 నాటి) ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 7.4 శాతం, దేశ జీడీపీ వృద్ధి రేటు 7శాతం ఉంటుందని అంచనా వేసింది. తగ్గిన నిరుద్యోగం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్) ప్రకారం రాష్ట్ర లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) 65.4 శాతంగా ఉంది. ఏదో ఒక పనిచేస్తూ లేదా ఏదైనా పనికోసం ఎదురు చూస్తున్న 15–59 ఏళ్ల జనాభా శాతాన్ని ఎల్ఎఫ్పీఆర్గా పరిగణిస్తారు. ఈ సర్వే ప్రకారం.. 2019–20తో పోల్చితే 2020–21లో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 7.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం.. 2022 ఏప్రిల్‌తో పోల్చితే 2022 డిసెంబర్లో రాష్ట్ర నిరుద్యోగ రేటు 9.9 శాతం నుంచి 4.1 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా పట్టణాల్లోనే నిరుద్యోగం అధికంగా ఉంది. 2019–20తో పోల్చితే 2020–21లో గ్రామీణ నిరుద్యోగం 5.7శాతం నుంచి 3.6శాతానికి, పట్టణ నిరుద్యోగం 10.7శాతం నుంచి 8శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో పురుషుల్లో నిరుద్యోగం 8.4శాతం నుంచి 5.5 శాతానికి, మహిళల్లో నిరుద్యోగం 6.1 శాతం నుంచి 4.5శాతానికి తగ్గాయి. పెరిగిన ఉద్యోగ భద్రత సామాజిక–ఆర్థిక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఉద్యోగులకు సదుపాయాలు, భద్రత క్రమంగా పెరుగుతున్నాయి. 2019–20తో పోల్చితే 2020–21లో పెయిడ్ లీవ్‌కు అర్హతగల ఉద్యోగులు 45.2శాతం నుంచి 50.9శాతానికి.. పెన్షన్లు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు కలిగిన ఉద్యోగులు 40.8శాతం నుంచి 46.9శాతానికి పెరిగారు. రాతపూర్వక జాబ్ కాంట్రాక్టు కలిగిన ఉద్యోగులు 39.9శాతం నుంచి 36.2శాతానికి తగ్గారు. ఈఓడీబీ, టీ–ఐడియా, టీ–ప్రైడ్ వంటి కార్యక్రమాలతో పాటు ఐటీ, ఇతర సేవా రంగాలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగుల పరిస్థితులు మెరుగయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర, జాతీయ వృద్ధిరేటు తీరు జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానం ►స్థిర ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.13.27 లక్షల కోట్లు, దేశ జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.48 లక్షల కోట్లు, దేశ జీడీపీ రూ.236.65 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ►జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో (19.4 శాతంతో) నిలిచిందని.. ఒడిశా (20.5శాతం), మధ్యప్రదేశ్ (19.7 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. ►2021–22లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతమని.. 2022–23లో కూడా ఇదే స్థాయిలో భాగస్వామ్యం ఉండనుందని ప్రభుత్వం అంచనా వేసింది. -
AP: రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8% పెరిగింది
సాక్షి, కడప: వ్యవసాయపరంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే తమ వర్సిటీ లక్ష్యమని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్.ప్రశాంతి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప సమీపంలోని ఊటుకూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో గురువారం నిర్వహించిన కిసాన్‌మేళాలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మన రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగిందని చెప్పారు. బోధన, పరిశోధన, విస్తరణ లక్ష్యంగా తమ విశ్వవిద్యాలయం పనిచేస్తోందన్నారు. ప్రగతిపరంగా దేశంలోనే 11వ స్థానంలో నిలిచామని, దాన్ని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. 2022లో అత్యున్నత స్కోచ్ అవార్డు కూడా సాధించామన్నారు. డ్రోన్ టెక్నాలజీలో డీసీజీఏ సర్టిఫికెట్ కూడా కైవసం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల ఆర్బీకేలకు డ్రోన్లు సరఫరా చేసేందుకు రూ.200 కోట్ల బడ్జెట్ పొందామని, పైలట్, కో పైలట్లకు కడప, తిరుపతి, మార్టూరు, విజయనగరంలలో శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లభించిందని చెప్పారు. -
ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!
బీజింగ్: కరోనా తెచ్చిపెట్టిన కష్టాలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతినడం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా తర్వాత ప్రపంచ రెండవ అతిపెద్ద ఎకానమీ 2022లో కేవలం 3 శాతం పురోగతి సాధించింది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, వార్షిక జీడీపీ విలువ 121.02 ట్రిలియన్ యువాన్ (17.94 ట్రిలియన్ డాలర్లు). 2021 విలువతో (114.37 ట్రిలియన్ యువాన్లు) పోల్చితే ఈ గణాంకాలు కేవలం 3 శాతం అధికం. కనీసం 5.5 శాతం వృద్ధి నమోదవుతుందన్న అంచనాలకన్నా... గణాంకాలు తగ్గినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటస్టిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. 1974లో చైనా జీడీపీ వృద్ధి రేటు 2.3 శాతం. అటు తర్వాత ఈ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. అమెరికా డాలర్లతో పోల్చితే జీడీపీ విలువ 2021లో 18 ట్రిలియన్ డాలర్లుకాగా, తాజాగా 17.94 ట్రిలియన్ డాలర్లకు తగ్గడం గమనార్హం. డాలర్లో చైనా కరెన్సీ ఆర్ఎంబీ బలహీనపడ్డమే దీనికి కారణం. ఎన్బీఎస్ డేటా ప్రకారం, చైనా జాబ్ మార్కెట్ 2022లో స్థిరంగా ఉంది. పట్టణ వార్షిక ఉపాధి కల్పనా లక్ష్యం 11 మిలియన్లుకాగా, 12.06 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. 2021లో చైనా ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతం. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
దిగువబాటన భారత్ వృద్ధి రేటు
న్యూఢిల్లీ: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ కుదించింది. 6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్ అప్డేట్లో తెలిపింది. భారత్ 2021–22లో 8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, ప్రస్తుత 2022–23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ 6.1 శాతంగా అంచనావేసింది. అంటే వృద్ధి రేటు క్రమంగా దిగువకే పయనిస్తుందన్నది ప్రపంచ బ్యాంక్ అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, ఎగుమతులు, పెట్టుబడుల వేగం తగ్గడం తన అంచనాలకు కారణమని ప్రపంచ బ్యాంక్ పేర్కొంటోంది. అయితే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో భారత్ తొలి స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
Andhra Pradesh: అభి'వృద్ధి'లో అగ్రగామి
సాక్షి, అమరావతి: వృద్ధి రేటు పరంగా 2022లో ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా నిలిచింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ప్రోత్సాహకాల కారణంగా 2021–22లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో భారీ వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు 2018–19 చంద్రబాబు హయాంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. అయితే, 2021–22లో స్థిర ధరల ఆధారంగా వ్యవసాయ రంగంలో 11.27 శాతంతో రెండంకెల వృద్ధి నమోదు కాగా.. పారిశ్రామిక రంగంలో ఏకంగా 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. సేవా రంగంలో కూడా 2018–19 కన్నా 2021–22లో 9.73 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 11.43 శాతం వృద్ధి మరోవైపు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం వృద్ధి సాధించినట్లు ఆర్బీఐతో పాటు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదికలు ఇటీవలే వెల్లడించాయి. ఇదే 2018–19 చంద్రబాబు హయాంలో 5.36 శాతమే వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు అండగా నిలవడంవల్లే సాధారణ పరిస్థితులకు మించి రెండంకెల వృద్ధి నమోదవ్వడానికి కారణమని తేలింది. కోవిడ్ కారణంగా రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాలో తగ్గుదల ఉన్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుంటుపడకుండా అవసరమైన ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడంతోనే ఈ రంగాలు నిలదొక్కుకుని దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. ఆదాయ వనరులు తగ్గినప్పటికీ కూడా ప్రజల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు’ పథకాలను నిరాటంకంగా అమలుచేసింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఆ ప్రభావం రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపైన స్పష్టంగా కనిపించింది. అలాగే, కోవిడ్ ఆంక్షలున్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని చెప్పిన తేదీకి ఇవ్వడమే కాకుండా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం, రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిండం వంటి చర్యలను ప్రభుత్వం పక్కాగా అమలుచేసింది. దీనివల్లే.. 2021–22లో వ్యవసాయ రంగం వృద్ధి 11.27శాతంగా నమోదైంది. అదే 2018–19లో కేవలం 3.54కు పరిమితమైంది. పారిశ్రామిక వృద్ధి ఇలా.. ఇక పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. 2018–19లో చంద్రబాబు హయాంలో 3.17 శాతమే వృద్ధి నమోదు కాగా అదే 2021–22లో 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంతో పాటు పారిశ్రామిక రాయితీలను సకాలంలో విడుదల చేసింది. 2021–22లో సాధారణ కేటగిరిలో 1,046 ఎంఎస్ఎంఈలకు రూ.191.10 కోట్ల రాయితీలను విడుదల చేసింది. ఓబీసీ కేటగిరిలో 479 ఎంఎస్ఎంఈలకు రూ.101.31 కోట్ల రాయితీలను విడుదల చేసింది. వైఎస్సార్ నవోదయం పేరుతో ఒకసారి ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ అమలుచేశారు. ఏకంగా 1,78,919 ఖాతాలకు సంబంధించిన రుణాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దీంతోపాటు 2021–22లో రూ.1,762.31 కోట్ల పెట్టుబడితో 5,907 ఎంఎస్ఎంఈలు ఏర్పాటవ్వడంతో 37,604 మందికి ఉపాధి లభించింది. అలాగే, కోవిడ్ కష్టాల్లోనూ పాక్షిక ఆంక్షలు, నిబంధనలు అమలుచేయడంతో సేవా రంగంలో కూడా 2021–22లో 9.73 % వృద్ధి నమోదైంది. అదే 2018–19 బాబు హయాంలో కేవలం 4.84 శాతమే. 2021–22లో కేంద్రం విడుదల చేసిన నివేదిక మేరకు స్థిర ధరల ఆధారంగా రాష్ట్రాల జీఎస్‌డీపీల శాతం ఇలా.. -
భారత్ వృద్ధి రేటు 7 శాతానికి కోత: క్రిసిల్
ముంబై: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును రేటింగ్ సంస్థ క్రిసిల్ 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. దీనితో ఇందుకు సంబంధించి క్రిసిల్ అంచనా 7 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రతికూలతలు, పంట ఉత్పత్తికి సంబంధించి అందుతున్న మిశ్రమ ఫలితాలు, ఎగుమతులు తగ్గడం, పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు తమ తాజా అంచనాలకు కారణంగా తెలిపింది. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. 2022–23 తుది ఆరు నెలల్లో వృద్ధి 6.5 శాతం: ఇక్రా కాగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) భారత్ వృద్ధి 6.5 శాతానికి పరిమితం అవుతుందని మరో రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన పరపతి కమిటీ అంచనా 6.3 శాతంకన్నా ఇది అధికం కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 12.7 శాతం కావడం గమనార్హం. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
6.5–7.1 శాతం వృద్ధి సాధ్యమే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022– 23) భారత్ జీడీపీ 6.5 శాతం నుంచి 7.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయింట్ ఇండియా అంచనా వేసింది. ‘‘ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా అధిక స్థాయిల్లోనే ఉంటూ విధానకర్తలకు సవాలుగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆర్బీఐ 1.9 శాతం రెపో రేటు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట పరిమితికి పైనే 9 నెలలుగా కొనసాగుతోంది. డాలర్ బలపడడంతో దిగుమతుల బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఏడాది ముగింపు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మాంద్యం తలెత్తవచ్చు. దీంతో పరిస్థితులు ప్రతికూలంగా మారొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం భారత్ వృద్ధి కారకాలపై చూపించడం మొదలైంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తుకు సంబంధించి స్థిరమైన అంచనాలు వేయడం కష్టమే’’అని డెలాయిట్ ఇండియా తన నివేదికలో వివరించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారత్ జీడీపీ 5.5–6.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. సవాళ్లు ఉన్నాయ్.. ‘‘పండుగల సీజన్ వినియోగ రంగానికి తగినంత ప్రోత్సాహాన్నిస్తుందని అంచనా వేశాం. కానీ, ఇది ఇంకా స్థిరమైన పునరుద్ధరణను చూపించలేదు. పరిశ్రమలో, తయారీ రంగంలో రుణాల వృద్ధి చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. దీంతో ప్రైవేటు రంగంలో మూలధన పెట్టుబడులకు ఎంతో సానుకూల అవకాశాలున్నాయి. స్థిరమైన పెట్టుబడులకు సుస్థిరమైన డిమాండ్ అవసరం. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతున్న తరుణంలో ఎగుమతులు, ప్రభుత్వ తోడ్పాటు అన్నవి వృద్ధికి కావాల్సినంత మద్దతును ఇవ్వలేవు. ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు, కరెన్సీ విలువ క్షీణత రూపంలో వృద్ధి క్షీణించే రిస్క్‌లు సైతం ఉన్నాయి’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి మజుందార్ తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు 2023 మధ్య నాటికి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు డెలాయిట్ తెలిపింది. ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టి, కంపెనీల ముడి సరుకుల ధరలు సైతం దిగొస్తాయని, ఫలితంగా దేశీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు క్షీణిస్తాయని పేర్కొంది. -
సాటిలేని ‘వృద్ధి’ .. రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా ప్రధాన రంగాలలో వృద్ధి రేటు పరుగులు తీస్తుండటం లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం, కార్యదక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆర్ధిక మందగమనం, కోవిడ్ సంక్షోభంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,20,298.54 కోట్ల మేర పెరిగింది. రాష్ట్రంలో మూడేళ్లలో జీఎస్డీపీలో 19.19 శాతం వృద్ధి నమోదు కాగా ఏటా సగటున 6.39 శాతం వృద్ధి సాధించింది. దేశవ్యాప్తంగా 2021–22 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను పొందుపరిచింది. ప్రస్తుత ధరల కన్నా స్థిర ధరలు మాత్రమే వాస్తవ ప్రగతిని ప్రతిబింబిస్తాయి. ఈ నేపథ్యంలో స్థిర ధరల ఆధారంగా 2019–20 నుంచి 2021–22 వరకు వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతూనే ఉందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగం, తయారీ రంగాలలో మూడేళ్లుగా భారీ వృద్ధి నమోదైనట్లు తెలిపింది. మరోవైపు కోవిడ్ లాంటి సంక్షోభాలేవీ లేనప్పటికీ టీడీపీ హయాంలో వ్యవసాయ రంగం తిరోగమనంలోకి వెళ్లడం గమనార్హం. వ్యవసాయంలో మూడేళ్లలో 20.05 శాతం వృద్ధి చంద్రబాబు హయాంలో 2018–19లో స్ధిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,26,614.20 కోట్లు ఉండగా 2021–22లో రూ.7,46,912.74 కోట్లకు పెరిగింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 19.19 శాతం వృద్ధి నమోదైంది. సగటు వార్షిక వృద్ధి రేటు 6.39 శాతం ఉంది. 2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.76,591.24 కోట్ల మేర పెరిగి ఏకంగా 11.42 శాతం మేర వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో వ్యవసాయ రంగంలో వృద్ధి నమోదైంది. 2019–20 నుంచి 2021–22 వరకు మూడేళ్లలో వ్యవసాయ రంగంలో రూ.13,900.77 కోట్ల మేర ఉత్పత్తి పెరిగి 20.05 శాతం వృద్ధి నమోదైంది. వ్యవసాయ రంగం వృద్ధి ఏటా సగటున 6.88 శాతంగా ఉంది. పారిశ్రామిక పరుగులు.. కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో వరుసగా మూడేళ్లు వృద్ధి నమోదైంది. మూడేళ్లలో పారిశ్రామిక రంగం ఉత్పత్తి విలువ రూ.26,719.51 కోట్లు పెరిగి 17.58 శాతం మేర వృద్ధి నమోదైంది. ఏటా సగటున 5.85 శాతం మేర వృద్ధి నమోదైంది. సేవా రంగంలో మూడేళ్లలో రూ.49,068.81 కోట్లు పెరిగి 20.76 శాతం మేర వృద్ధి నమోదైంది. ఏటా సగటున 6.92 శాతం వృద్ధి ఉంది. తయారీ రంగంలో కూడా మూడేళ్లలో రూ.7,758.15 కోట్లు పెరిగి 10.85 శాతం మేర వృద్ధి నమోదైంది. అంటే ఏటా సగటున 3.61 శాతం వృద్ధి నమోదైంది. నాడు.. సాగు దయనీయం కోవిడ్ లాంటి సంక్షోభం లేకున్నా టీడీపీ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి తిరోగమనంలోకి వెళ్లిపోవడం గమనార్హం. 2017–18లో స్దిర ధరల ప్రకారం వ్యవసాయ రంగం ఉత్పత్తి రూ.74,118.40 కోట్లు ఉండగా 2018–19లో రూ.69,303.17 కోట్లకు పడిపోయింది. అంటే వ్యవసాయ రంగం ఉత్పత్తి రూ.4,815.23 కోట్లు తగ్గి 6.49 శాతం క్షీణించింది. ఏపీలోనే జీఎస్డీపీ ఎక్కువ దేశంలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా ఉందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 2021–22 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 11.42 శాతం ఉండగా కర్నాటక, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల స్థూల ఉత్పత్తి తక్కువగా ఉన్నట్లు తెలిపింది. -
ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది: 7 శాతం వృద్ధి సాధిస్తుంది
ముంబై: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మొదలైందని, ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని ఆర్బీఐ పేర్కొంది. దేశీ స్థూల ఆర్థిక పరిస్థితులు బలంగానే ఉన్నాయంటూ.. అదే సమయంలో అంతర్జాతీయ సంక్షోభాల సమస్యల ప్రభావం ఉంటుందని శుక్రవారం విడుదలైన ఆర్బీఐ ఆర్టికల్ పేర్కొంది. ఆర్బీఐ తాజా బులెటిన్‌లో భాగంగా ఈ ఆర్టికల్‌ను ప్రచురించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గమనంపై మేఘాలు కమ్ముకునే ఉన్నాయంటూ, ఇక్కడి నుంచి ఇంకా తగ్గుముఖం పట్టే రిస్క్‌లు ఉన్నట్టు తెలిపింది. (ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్‌కు మరో షాక్!) అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారుతుండడం, మార్కెట్ లిక్విడిటీ తగ్గుతుండడం ఆర్థిక సాధనాల రేట్లపై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. ‘‘పాలసీ రేట్ల మోస్తరు పెంపును మార్కెట్లు సర్దుబాటు చేసుకుంటున్నాయి. రిస్క్ తీసుకునే ధోరణి తిరిగి ఏర్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థలో సరఫరా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పట్టణాల్లో డిమాండ్ బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోలేదు. కాకపోతే ఇటీవలే కొంత మెరుగుపడడం ఆశావహం’’అని ఆర్బీఐ ఆర్టికల్ తెలిపింది. దీన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ దేవబ్రత పాత్ర రూపొందించారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 6.1-6.3 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది. ఇది నిజమైతే 2022-23 సంవత్సరానికి జీడీపీ 7 శాతం వృద్ధిని చేరుకునే క్రమంలోనే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చని తెలిపింది. ఆర్బీఐ రోజువారీగా వ్యవస్థ నుంచి రూ.1.5 లక్షల కోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు చెబుతూ.. మానిటరీ పాలసీకి అనుగుణంగా వ్యవస్థలో లిక్విడిటీ సాధారణ స్థితికి చేరినట్టు వివరించింది. అయినప్పటికీ ఇంకా కొంత మిగులే ఉన్నట్టు తెలిపింది. (మస్క్ 13 కిలోల వెయిట్ లాస్ జర్నీ: ఫాస్టింగ్ యాప్‌పై ప్రశంసలు) -
భారత్ వృద్ధి రేటు అంచనాకు మూడీస్ రెండవ కోత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణమని పేర్కొంది. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్ 2023–24 నివేదికలో మూడీస్ పేర్కొంది. 2024లోనే వెలుగు రేఖలు... 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని అవుట్‌లుక్ పేర్కొంది. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయని మూడీస్ అంచనావేసింది. 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని పేర్కొంటూ, 2023లో జీ–20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణిస్తుందని తెలిపింది. క్రితం 2.1 శాతం క్షీణ అంచనాలు తగ్గడం కొంత ఊరట. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థి క, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి న మోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. -
2022–23లో భారత్ వృద్ధి 6.9 శాతం
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.9 శాతంగా నమోదవుతుందని యూబీఎస్ ఆర్థికవేత్తలు అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఈ రేటు మరింతగా 5.5 శాతానికి పడిపోతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఎకనమిస్టులు ఒక నివేదికలో విశ్లేషించారు. 2024–25లో 6 శాతం వృద్ధి అంచనా వేసిన సంస్థ, దీర్ఘకాలిక సగటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగమనం, కఠిన ద్రవ్య విధానాలు భారత్ వృద్ధి మందగమనానికి కారణమని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటైనప్పటికీ, ఈ ప్రతికూలతల నుంచి భారత్ ఎకానమీ తప్పించుకోలేదు. ► భారత్ వ్యవస్థీకృత వృద్ధి ధోరణి చెక్కుచెదరకుండా ఉంది. అయితే ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వంపై సమీప కాలంలో భారత్ దృష్టి సారించాలి. లేదంటే తీవ్ర ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఉంది. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 4 శాతం కనిష్టం నుంచి 1.90 శాతం పెరిగి 5.9 శాతానికి ఎగసిన రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే అంశం. ► కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే వినియోగదారుల వ్యయంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గృహాల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే ఈ సానుకూల ప్రభావాలు వడ్డీరేట్ల పెంపు పరిణామాలతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. పొదుపుల్లో క్షీణత నమోదుకావచ్చు. అలాగే అసంపూర్తిగా మిగిలిఉన్న లేబర్ మార్కెట్ పునరుద్ధరణ... గృహాల కొనుగోలు శక్తి, డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది. ► ఈ పరిస్థితి కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికల అమలును వాయిదే వేసే అవకాశం ఉంది. ► కొన్ని క్లిష్టతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రతికూల ఫలితాల తగ్గింపు, ప్రైవేటు మూలధనానికి ప్రోత్సాహం వంటి అవకాశాలు దీనివల్ల ఒనగూరతాయి. ► ఇక ఎగుమతుల విషయానికి వస్తే, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఉంటుంది. 450 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన కొంత క్లిష్టంగా మారవచ్చు. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెంట్రల్ బ్యాంక్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇతర సెంట్రల్ బ్యాంకులతో సమన్వయాన్ని సాధిస్తోంది. ► 2024లో సాధారణ ఎన్నికలను ఎదుర్కొననున్న కేంద్ర ప్రభుత్వం, వృద్ధికి మద్దతుగా ద్రవ్య స్థిరీకరణ విధానాలను కొంత నెమ్మది చేయచ్చు. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే వీలుంది. -
ఐఎంఎఫ్ అంచనాలకు మించి భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలు 6.8 శాతం మించి నమోదవుతుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు తమ విశ్వాసానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ వరుసగా రెండోసారి తగ్గించింది. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను ఈ నెల మొదట్లో మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఈ నేపథ్యం అనంత నాగేశ్వరన్ సోమవారం చేసిన ఒక ప్రకటనలో తన తాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► భారతదేశ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బహుశా ఒక కీలక మైలురాయిని దాటింది. ఇది పటిష్ట ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతోపాటు అధిక వృద్ధికి కూడా దోహదపడే అంశం. ► ఆర్థిక, ద్రవ్య విధానలు సాధారణంగా ఒకదానికి మరోటి అనుసంధానమై ఉంటాయి. ఒకదానికొకటి సమతుల్యత కలిగి ఉంటాయి. ► దేశీయ రుణం– జీడీపీ నిష్పత్తి విషయంలో ఆందోళన లేదు. అసెట్ మానిటైజేషన్ (నిరర్ధక ఆస్తుల నుంచి ఆర్థిక ప్రయోజనం) ఈ నిష్పత్తి మరింత తగ్గుతుంది. క్రెడిట్ రేటింగ్ పెరుగుదల విషయంలోనూ ఇది సానుకూల అంశం. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, తయారీ, నిర్మాణంసహా అన్ని కీలక రంగాలూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి. -
భారత్ ఆశాకిరణం
వాషింగ్టన్: ప్రపంచంలో అన్ని దేశాలు వృద్ధి అధోగమనాన్ని చూస్తుంటే.. భారత్ మంచి పనితీరు చూపిస్తూ ఆశాకిరణంగా ఉందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ అన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతూ, ప్రపంచదేశాలు మందగమనంలోకి వెళుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన మూడింట ఒక వంతు దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మాంద్యంలోకి వెళతాయని అంచనా వేస్తున్నాం. ద్రవ్యోల్బణం బలీయంగా ఉంది. ఇదే అంతర్జాతీయంగా నెలకొన్న వాస్తవ పరిస్థితి. దాదాపు ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థ నిదానిస్తోంది. ఈ విధంగా చూస్తే భారత్ మాత్రం మెరుగైన పనితీరు తో వెలిగిపోతోంది’’అని శ్రీనివాసన్ వివరించారు. వృద్ధి రేటు 6.8 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ 2022 సంవత్సరానికి 6.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. 2021లో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. 2023 సంవత్సరానికి జీడీపీ 6.1 శాతం రేటు నమోదు చేస్తుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక వంతు 2023లో క్షీణతను చూస్తుందని అంచనా వేసింది. అమెరికా, యూరప్, చైనా ఆర్థిక వ్యవస్థల్లో స్తబ్ధత కొనసాగుతుందని పేర్కొంది. 2023లో మాంద్యం వస్తుందని చాలా మంది భావిస్తున్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు విధానాలను కట్టడి చేస్తుండడంతో ద్రవ్య పరిస్థితులు కూడా కఠినవుతున్నాయి. ఇది పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల ఆహార ధాన్యాలు, కమోడిటీల ధరల పెరుగుదలకు దారితీసింది. మూడోది చైనా మందగమనాన్ని చూస్తోంది. ఈ అంశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ఆసియా, భారత్ వృద్ధి అవకాశాలపైనా చూపిస్తోంది. భారత్ వెలుపలి డిమాండ్ మందగమన ప్రభావాన్ని చూస్తోంది. అలాగే, దేశీయంగా ద్రవ్యల్బణ పెరుగుదలను చూస్తోంది’’అని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి అనుసరించే ద్రవ్య విధాన కఠినతరం పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. భారత్ విధానాలు బాగు.. భారత్ ప్రతిష్టాత్మక మూలధన వ్యయాల ప్రణాళికను ఐఎంఎఫ్ మెచ్చుకుంది. దీన్ని కొనసాగించాలని, అది దేశీయంగా డిమాండ్ బలపడేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే, పేదలు, సున్నిత వర్గాలపై ప్రభావం చూపిస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రశంసించింది. ఎౖMð్సజ్ పన్నును తగ్గంచడాన్ని ప్రస్తావించింది. దీనివల్ల ధరలవైపు ఉపశమనం ఉంటుందని పేర్కొంది. డిజిటైజేషన్ దిశగా భారత్ అద్భుతమైన ప్రగతి చూపించిందని, పలు రంగాల్లో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడాన్ని కూడా ప్రశంసించింది. -
ఔషధ విక్రయాలకు రెండంకెల వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఔషధ విక్రయాలు గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో 13 శాతం వృద్ధి చెందాయి. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం నాలుగు మాసాలుగా పరిశ్రమ రెండంకెల వృద్ధి కొనసాగిస్తోందని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ వెల్లడించింది. ఆగస్ట్‌లో ఇది 12.1 శాతం నమోదైతే, 2021 సెప్టెంబర్‌లో ఇది 12.6 శాతంగా ఉంది. భారత ఔషధ విపణి యాంటీ–ఇన్ఫెక్టివ్స్, రెస్పిరేటరీ మినహా అన్ని రకాల చికిత్సలలో బలమైన రెండంకెల వృద్ధి కారణంగా మెరుగైన పనితీరును అందించడం కొనసాగించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ధరల్లో 6.6 శాతం పెరుగుదల.. 2021 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఔషధాల అమ్మకాల పరిమాణం 4.5 శాతం ఎగసింది. నూతన ఉత్పత్తుల రాక 1.9 శాతం పెరిగింది. ధరలు 6.6 శాతం దూసుకెళ్లాయి. తీవ్రమైన జబ్బులకు వాడే ఔషధాల విక్రయాలు 9.2 శాతం పెరిగాయి. మొత్తం పరిశ్రమలో వీటి వాటా 47 శాతం. దీర్ఘకాలిక రోగాలకు వాడే మందులు 16.1 శాతం, మిత, మధ్యస్థ వ్యవధి జబ్బులకు ఉపయోగించే ఔషధాల అమ్మకాలు 17.3 శాతం అధికం అయ్యాయి. గైనకాలజీ సంబంధ మెడిసిన్స్ అత్యధికంగా 24.7 శాతం, హృదయ 18.2, చర్మ, నాడీ వ్యవస్థ సంబంధ మందులు 17.8 శాతం ఎగశాయి. కంపెనీల వారీగా ఇలా.. సెప్టెంబర్ నెల అమ్మకాల్లో అత్యధికంగా నాట్కో ఫార్మా 31.2 శాతం వృద్ధి సాధించింది. బయోకాన్ 28.2, గ్లెన్‌మార్క్ 23.2, ఈరిస్ లైఫ్‌సైన్సెస్ 21.2 శాతం దూసుకెళ్లాయి. టోరెంట్, ఆస్ట్రాజెనికా, అజంతా, జైడస్, సన్ ఫార్మా, అబాట్, వొకార్డ్, జేబీ కెమికల్స్, ఇప్కా ల్యాబ్స్ మార్కెట్ కంటే అధికంగా 16 నుంచి 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్డీసీ, ఆల్కెమ్, సిప్లా, గ్లాక్సోస్మిత్‌క్లైన్ 10–12 శాతం, లుపిన్, రెడ్డీస్, అలెంబిక్ 8–9 శాతం అధికంగా విక్రయాలు సాగించాయి. నొవార్టిస్, ఇండాకో రెమెడీస్, ఫైజర్, సనోఫి 3 శాతం లోపు వృద్ధికి పరిమితం అయ్యాయి. ఇక సెప్టెంబర్ త్రైమాసికానికి పరిశ్రమ 13 శాతం వృద్ధి సాధించింది. -
జీవిత బీమా ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు సెప్టెంబర్ నెలకు మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల ద్వారా ప్రీమియం (న్యూ బిజినెస్ ప్రీమియం) 17 శాతం పెరిగి రూ.36,366 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలకు ప్రీమియం ఆదాయం రూ.31,001 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ ఎల్ఐసీ నూతన ప్రీమియం ఆదాయంలో మంచి వృద్ధిని చూపించింది. 35 శాతం అధికంగా రూ.24,991 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించింది. 2021 సెప్టెంబర్‌లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.18,520 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నెల గణాంకాలను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. ఇక 23 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా రూ.11,375 కోట్ల నూతన ప్రీమియం ఆదాయం సంపాదించాయి. 2021 సెప్టెంబర్ నెలకు ఇవే సంస్థలు సంపాదించిన కొత్త పాలసీల ప్రీమియం రూ.12,481 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణించింది. ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 15 శాతం తగ్గి రూ.2,471 కోట్లుగా ఉంటే, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఆదాయం 22 శాతం తగ్గి రూ.2,166 కోట్లకు పరిమితమైంది. బజాజ్ అలియాంజ్ ఆదాయం కూడా 38 శాతం తగ్గి రూ.670 కోట్లుగా నమోదైంది. -
2022లో బెటరే కానీ, 2023 దారుణం!
న్యూఢిల్లీ: ప్రపంచ వస్తు వాణిజ్యం నడుస్తున్న 2022వ సంవత్సరంలో మెరుగ్గాఉన్నా.. 2023లో పరిస్థితి అస్సలు బాగోలేదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో ప్రపంచ వస్తు వాణిజ్య వృద్ధి రేటును గత ఏప్రిల్ నాటి అంచనాలకన్నా ఎక్కువగా తాజాగా 3 శాతం నుంచి 3.5 శాతానికి సవరించింది. 2023లో వృద్ధి రేటు అంచనాను మాత్రం 3.4 శాతం నుంచి భారీగా ఒక శాతానికి తగ్గించింది. నివేదికలో సంస్థ ఆర్థికవేత్తల మరిన్ని అభిప్రాయాలను పరిశీలిస్తే.. ► అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రతికూలత చూపుతున్నాయి. ► 2022 అక్టోబర్ నుంచే ప్రపంచ వాణిజ్య మందగమనం తీవ్రమై, 2023లో తీవ్ర రూపం దాల్చుతుంది. ► పలు కారణాల వల్ల దిగ్గజ ఎకానమీలో దిగుమతుల డిమాండ్ కూడా మందగించే అవకాశం ఉంది. ► ప్రత్యేకించి యూరోప్‌ను చూస్తే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం గృహ వ్యయం, తయారీ వ్యయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ► అమెరికాలో వడ్డీరేట్ల పెంపు– గృహాలు, మోటార్ వాహనాల కొనుగోళ్లు, స్థిర ఇన్వెస్టమెంట్లకు విఘాతం కలిగిస్తోంది. ► ఇక చైనాలో కోవిడ్–19 సవాళ్లు కొనసాగుతున్నాయి. బలహీన అంతర్జాతీయ డిమాండ్, తగ్గిన ఉత్పత్తి వంటి సమస్యలు చైనాకు ఎదురవుతున్నాయి. ► ఇంధనం, ఆహారం, ఎరువుల కోసం పెరుగుతున్న దిగుమతి బిల్లులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార అభద్రత, రుణ సవాళ్లకు దారితీసే వీలుంది. ► పలు ఆర్థిక వ్యవస్థల్లో అనుసరిస్తున్న వడ్డీరేట్ల పెంపు విధానం డిమాండ్ పరిస్థితులను దెబ్బతీసే అంశం. భారత్‌కు చేదువార్తే... ఎగుమతులను భారీగా పెంచుకోవాలని చూస్తున్న భారత్‌కు ఐఎంఎఫ్ తాజా అంచనాలు కొంత ప్రతికూలమైనవే కావడం గమనార్హం. 2021–22లో 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులను సాధించిన భారత్, 2022–23లో 450 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి ఎగుమతుల విషయంలో భారత్ గడచిన రెండు నెలల నుంచి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. జూలై, ఆగస్టు నెలల్లో తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయని (33 బిలియన్ డాలర్లు) ఆగస్టు తొలి గణాంకాలు తెలిపాయి. తరువాత గణాంకాల సవరణల్లో 1.6 శాతం వృద్ధికి ఎగుమతుల పరిమాణం మారింది. ఇక జూలై నెల్లో ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే అటు తర్వాత సవరించిన లెక్కల ప్రకారం, ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్‌లో ఎగుమతులు ఏకంగా 3.5 శాతం క్షీణించి, 32.62 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతులుసైతం ఏడు నెలల్లో తొలిసారి 60 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. మొత్తంమీద తాజా గణాంకాలతో 21 నెలలు వృద్ధి బాటన నడిచిన ఎగుమతులు తీవ్ర ఒడిదుడుకుల నడుమ 2022 సెప్టెంబర్‌లో క్షీణతలోకి జారిపోయినట్లయ్యింది. ఇక ఎగుమతులకన్నా, దిగుమతులు భారీగా ఉండడం పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) భారీగా పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువలో)గా నమోదయ్యింది. విలువలో ఇది 23.9 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కరెంట్ అకౌంట్ 6.6 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.9 శాతం) మిగుల్లో ఉండడం గమనార్హం. ఆర్థిక సంవత్సరంలో 3 శాతం క్యాడ్ ఉంటుందని ఆర్బీఐ పాలసీ విధానం భావిస్తోంది. ఇక 2022 ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్ 23 నాటికి 537.5 బిలియన్ డాలర్లకు చేరాయి. వరుసగా ఎనిమిది వారాలుగా తగ్గుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. -
ఇదీ నిజం.. నమ్మొద్దు విష ప్రచారం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నో విమర్శలకు సూటిగా, స్పష్టమైన సమాధానం చెప్పింది. అప్పులపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని నమ్మొద్దంటూ సవివరంగా, పూర్తి గణాంకాలతో తేటతెల్లంగా ప్రజల ముందుంచారు. ఎల్లో మీడియాతో కలిసి విపక్షాలు చేస్తోన్న విష ప్రచారం నమ్ముతారా? నిజాలను కళ్లకు కట్టినట్టు చూపించే గణాంకాలను నమ్ముతారా? 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో వృద్ధి రేటు ఎంత? 2019 నుంచి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ను నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ పాలనలో అభివృద్ధి ఎలా ఉంది? ఈ లెక్కలు మీరే చూడండి. 2018-19 చంద్రబాబు పాలనలో వృద్ధి రేటు 5.36% ఏపీ ర్యాంకు 21 2019 -20 సీఎం జగన్ పాలనలో వృద్ధి రేటు 6.89% ఏపీ ర్యాంకు 6 కోవిడ్ సమయంలో విపత్కర పరిస్థితులను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్నాయి. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆర్థికంగా అన్ని కష్టాలను తట్టుకుంది. వృద్ధి రేటులో నాలుగో స్థానానికి ఎదిగింది 2020 -21 వృద్ధి రేటు 0.08% ఏపీ ర్యాంకు 4 2021 -22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. వృద్ధి రేటులో అద్భుతంగా రాణించింది, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2021 -22 వృద్ధి రేటు 11.43% ఏపీ ర్యాంకు 1 2014 నుంచి 2019 వరకు అంటే చంద్రబాబు హయాంలో జాతీయ ఆదాయంలో రాష్ట్రం వాటా 4.45% మాత్రమే ఉండగా.. 2019 నుంచి అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాత, ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు జాతీయ ఆదాయంలో ఏపీ వాటా 5% చేరింది. అప్పులపై అసలు నిజం ఇది విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.లక్షా 20వేల 556 కోట్లు ఉంటే దాన్ని చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే సమయానికి రూ.2లక్షల 69వేల 462 కోట్లకు తీసుకెళ్లారు. అంటే అప్పుల్లో అది 123.52% పెరుగుదల. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చే నాటికి అప్పులు రూ.2లక్షల 69వేల 462 కోట్లు ఉంటే.. ప్రస్తుతం అది రూ.3కోట్ల 82లక్షల 165 కోట్లుగా ఉంది. అంటే సీఎం జగన్ హయాంలో అప్పులు పెరిగింది 41.83% మాత్రమే. అప్పులపై కాగ్ చెప్పిన వాస్తవమిది ♦చంద్రబాబు హయాంలో ప్రభుత్వ గ్యారంటీతో వివిధ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు చేసిన అప్పు రూ.14028 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే సమయానికి అది రూ.59257 కోట్లకు చేరింది. మొత్తమ్మీద అప్పుల శాతం 19.55 % ♦ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో పీఎస్‌యూలు తీసుకున్న అప్పు 15.46% మాత్రమే ♦ఏపీ సర్కారుపై విషపు రాతలు రాస్తోన్న ఎల్లో మీడియా అసలు నిజాలు మాత్రం దాచిపెడుతోంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఏపీలో ఉందంటూ దుష్ప్రచారం చేస్తోంది. ఒక సారి కేంద్రం అప్పులు, వృద్ధి రేటు చూస్తే నిజాలు వెల్లడవుతాయి. ఈ లెక్కలు పార్లమెంటు సాక్షిగా కేంద్రం సమర్పించిన బడ్జెట్లో చెప్పినవే. ♦ 2014-19 మధ్య కేంద్రం అప్పులు రూ.62లక్షల 42వేల 220 కోట్లు ♦ వృద్ధి రేటులో అప్పు శాతం 50.07% ♦ 2020-21 కల్లా కేంద్రం అప్పులు రూ.1 కోటీ 20లక్షల 79వేల 18 కోట్లు ♦ వృద్ధి రేటులో అప్పు శాతం 61% కేంద్రం vs ఆంధ్రప్రదేశ్ .. అప్పుడెంత? ఇప్పుడెంత? మీరే గమనించండి ♦2014-19 మధ్య కేంద్రం అప్పులు 59.88% పెరిగితే అదే సమయంలో ఏపీలో సర్కారు నడిపించిన చంద్రబాబు అప్పుల శాతాన్ని ఏకంగా 123.52% పెంచేశారు. ♦2019 నుంచి మార్చి 31, 2022 వరకు కేంద్రం అప్పులు 43.8% పెరిగిన , అదే సమయంలో ఏపీ సర్కారు అప్పుల శాతం పెంపు 41.83% మాత్రమే ఇదీ వాస్తవం ♦ 2018-19 మధ్య వడ్డీ, అప్పు కలిపి చంద్రబాబు సర్కారు చెల్లించింది రూ.28886 కోట్లు అయితే 2021-22 మధ్య సీఎం జగన్ చెల్లించింది రూ.36007 కోట్లు ♦ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, 2019 నుంచి కరోనా కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వాటిని తట్టుకుని ఏపీని నిలబెట్టింది ♦ సీఎం జగన్ సర్కారు. సంక్షేమం, సంస్కరణలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను కరోనా నుంచి కాపాడుకున్నారు సీఎం జగన్. పచ్చ ప్రచారం ఆపండి, నిజాలు చూడండి ♦ మూలధన వ్యయం విషయానికి వస్తే టిడిపి హయాంలో రాష్ట్రం సగటు రూ.15227 కోట్లు. అదే సీఎం జగన్ హయాంలో మూలధన వ్యయం రాష్ట్రం సగటు రూ.18362 కోట్లు. ఈ లెక్కలు దాచిపెట్టి రాష్ట్రం శ్రీలంకలా మారబోతుంటూ చొక్కాలు చించుకున్నారు విష ప్రచారం చేశారు. కేంద్రం ఇచ్చిందెంత? కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా చాలా కీలకమైన అంశం. 2015 నుంచి 2019 వరకు ఏ ఏడాది చూసినా 34.91% నుంచి 36.63% వరకు ఉంది. అంటే చంద్రబాబు సర్కారుకు కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పన్నుల్లో వాటా ఇచ్చింది. సీఎం జగన్ హయాంలో అంటే 2019 నుంచి ఏ ఏడాది చూసినా 29.35% నుంచి 23.13% మధ్యలోనే కేంద్ర పన్నుల వాటా ఉంది. 15వ ఆర్థిక సంఘం 41% ఇవ్వాలని చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రజంటేషన్ pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
13 నుంచి 15.7 శాతం వృద్ధికి చాన్స్
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13 శాతం నుంచి 15.7 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెలాఖరున అధికారిక గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో పలువురు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు వృద్ధి తీరుపై తమ అంచనాలను వెలువరిస్తున్నారు. మహమ్మారి కరోనా మొదటి వేవ్ కారణంగా 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీలో అసలు వృద్ధి లేకపోగా 23.9 శాతం క్షీణించింది. ఇక 2021 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీగా 20.1 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇదే కాలంలో చోటుచేసుకున్న రెండవ వేవ్‌లో మొదటి వేవ్‌కన్నా ప్రాణనష్టం అపారంగా ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ధి రేటు (20.1 శాతం) నమోదుకు లో బేస్ కూడా ఒక కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఆగస్టు 5వ తేదీ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ 16.2 శాతం వరకూ క్యూ1 వృద్ది రేటు ఉండవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన త్రైమాసికంపై (2022 ఏప్రిల్–జూన్) అంచనాలు, అభిప్రాయాలను పరిశీలిస్తే... 15.7 శాతం దాటినా దాటచ్చు... మొదటి త్రైమాసికంలో జీడీపీ 15.7 శాతం దాటిపోతుందని భావిస్తున్నాం. తుది గణాంకాలు ఇంతకు మించి కూడా నమోదుకావచ్చు. ఇది వాస్తవరూపం దాల్చితే ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆర్బీఐ అంచనాలకు (7.2 శాతం) మించి జీడీపీ వృద్ధి రేటు నమోదుకావచ్చు. 41 రంగాలకు సంబంధించి 41 హై ఫ్రీక్వెన్సీ లీడిండ్ ఇండికేటర్స్ ప్రకారం, వృద్ధి విస్తృత ప్రాతిపదిక ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికంలో కరోనా సవాళ్లతో రూ.4.77 లక్షల కోట్ల వరకూ గణనీయంగా పడిపోయిన వినియోగ వ్యయం 2021–22 మొదటి త్రైమాసికంలో 46 శాతం వరకూ రికవరీ అయ్యింది. 2022–23 క్యూ1లో మిగిలిన 54 శాతం రికవరీ అయ్యిందని సూచీలు తెలుపుతున్నాయి. సేవల రంగం రికవరీ ఇందుకు దోహదపడింది. ప్రత్యక్ష వాణిజ్యాన్ని యుద్ధం ప్రభావితం చేస్తున్న మాట వాస్తవమే. ఇంధనం, వస్తువుల ధరలు, వినియోగ విశ్వాసం, పాలసీ చర్యలకు సంబంధించి కొంత అనిశ్చితి ఉన్న మాట నిజమే. అయినప్పటికీ ఈ సవాళ్లను తట్టుకోగలిన ఫండమెంటల్స్ పటిష్టతను భారత్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. – సౌమ్య కాంతి ఘోష్, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 13 శాతానికి పరిమితం అవుతుందని భావిస్తున్నాం... అధిక బేస్ ఎఫెక్ట్‌తో పాటు (2021 ఇదే కాలంలో 20.1 శాతం వృద్ధి) గోధుమల ఉత్పత్తిపై వేసవి ప్రభావం, భౌగోళిక–రాజకీయ సమస్యలు, డిమాండ్–మార్జిన్లపై పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం క్యూ1లో వృద్ధి వేగాన్ని 13 శాతానికి తగ్గిస్తాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ సంబంధించిన ఉత్పత్తి (జీవీఏ) స్థూల విలువ జోడింపు విధానంలో వృద్ధి 12.6 శాతానికి పరిమితం కావచ్చు. జీడీపీలో మెజారిటీ షేర్ ఉన్న సేవల రంగంలో 17 నుంచి 19 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. 9 నుంచి 11 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఆరవ నెలలోకి ప్రవేశించిన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోంది. ఇటీవల కమోడిటీ ధరలు కొంత తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కొంత తగ్గవచ్చు. ఈ పరిస్థితిలో రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్)లో ద్రవ్యోల్బణం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ ఉండవచ్చు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనా (6.2 శాతం) ఇది ఎక్కువే కావడం గమనార్హం. – అదితీ నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
దేశంలో రిటైల్ జోరు..కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారాలు కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది జూలై అమ్మకాలు 18 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బుధవారం తెలి పింది. ‘రిటైల్ వ్యాపారం తూర్పు భారత్‌లో అత్యధికంగా 25% వృద్ధి సాధించింది. దక్షిణాదిలో 21, ఉత్తరాది 16, పశ్చిమ భారత్‌లో 10% అధికమైంది. అత్యధికంగా 32 శాతం వృద్ధితో క్రీడా సామాగ్రి అమ్ముడైంది. పాదరక్షలు, ఫర్నీ చర్, గృహాలంకరణ వస్తువుల విభాగాలు ఒక్కొక్కటి 23 శాతం, దుస్తులు, వస్త్రాలు 22, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, గృహాపకరణాలు, ఎలక్ట్రానిక్స్ 17% దూసుకెళ్లాయి. ఆభరణాలు 15 శాతం, ఆహారం, సరుకులు 11, సౌందర్య సాధనాలు, వెల్నెస్, వ్యక్తిగత సంరక్షణ 3% పెరిగాయి. పండుగల సీజన్లో మెరుగైన విక్ర యాలు ఉంటాయని రిటైలర్లు ఆభాభావం వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వ్యాపారాలు 2019తో పోలిస్తే జూన్‌లో 13 శాతం ఎగశాయి. -
డేంజర్ బేల్స్.. మౌలిక రంగ వృద్ధిలో క్షీణత..
న్యూఢిల్లీ: ఎనిమిది రంగాల మౌలిక పరిశ్రమల గ్రూప్, మార్చిలో 4.3 శాతం పురోగతి సాధించింది. ఫిబ్రవరిలో నమోదయిన 6 శాతంకన్నా తాజా సమీక్షా నెలల్లో వృద్ధి వేగం తగ్గింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంది. అయితే దీనికి లో బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 గణాంకాలను పరిశీలిస్తే.. మౌలిక రంగంలో అసలు వృద్ధిలేక పోగా 6.4 శాతం క్షీణించింది. గణాంకాలు ఇలా... అధికారిక గణాంకాల ప్రకారం, సమీక్షా కాలంలో బొగ్గు, క్రూడ్ ఆయిల్ 0.1 శాతం, 3.4 శాతం చొప్పున క్షీణించాయి. అయితే సహజవాయువు (7.6 శాతం), స్టీల్ (3.7 శాతం), సిమెంట్ (8.8 శాతం), విద్యుత్ (4.9 శాతం) రంగాలు కొంత పర్వాలేదనిపించింది. అయితే 2021 మార్చితో ఈ రేట్లు హై బేస్‌తో వరుసగా 12.3 శాతం, 31.5 శాతం, 40.6 శాతం, 22.5 శాతాలుగా ఉన్నాయి. ఇక సమీక్షా నెల మార్చితో రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువుల రంగం వృద్ధి రేట్లు వరుసగా 6.2 శాతం, 15.3 శాతాలుగా ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 40.27 శాతం. ఐఐపీ మార్చి గణాంకాలు వచ్చే రెండు వారాల్లో విడుదలవుతాయి. చదవండి: బ్రిటన్ కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను! అదే నిజమైతే! -
పారిశ్రామిక ఉత్పత్తి ఓకే!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో 1.3 శాతం పురోగతి (2021 ఇదే కాలంతో పోల్చి) సాధించింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు విడుదల చేసింది. 2021 జనవరిలో ఐఐపీలో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా 0.6 శాతం క్షీణతలో ఉంది. 2021 డిసెంబర్లో వృద్ధి రేటు కేవలం 0.7 శాతంగా ఉంది. మైనింగ్, మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగాలు తాజా సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉండగా, భారీ పెట్టుబడులకు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగం ఇంకా క్షీణతలోనే ఉంది. ఏప్రిల్ నుంచి జనవరి వరకూ 13.7 శాతం వృద్ధి కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 13.7 శాతంగా నమోదయ్యింది. దీనికి లో బేస్ ఎఫెక్ట్ కూడా ఒక కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలాన్ని పరిశీలిస్తే, అసలు వృద్ధిలేకపోగా 12 శాతం క్షీణత నమోదయ్యింది. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. పలు నెలల నుంచి క్షీణతలో కొనసాగిన పారిశ్రామిక ఉత్పత్తి 2021 మార్చి నుంచి స్థిరంగా సానుకూల శ్రేణిలో కదిలింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... చదవండి: రిస్క్ ప్రాజెక్టులకు ఈక్విటీ నిధులే బెటర్! -
వృద్ధి రేటులో ఏపీ సరికొత్త రికార్డ్
-
జనవరిలో మౌలిక రంగం వృద్ధి 3.7 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జనవరిలో 3.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 1.3 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.1 శాతం. అధికారిక గణాంకాల ప్రకారం, బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ పరిశ్రమల పనితీరు సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉంది. క్రూడ్ ఆయిల్, ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బొగ్గు (8.2 శాతం), సహజ వాయువు (11.7 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (3.7 శాతం), సిమెంట్ (13.6 శాతం) ఉత్పత్తులు బాగున్నాయి. స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాల పనితీరు అంతంతమాత్రంగానే నమోదయ్యింది. కాగా, ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ గడచిన 10 నెలల్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంటే, 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 8.6 క్షీణత నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44 శాతం. రానున్న రెండు వారాల్లో ఐఐపీ జనవరి గణాంకాలు వెలువడనున్నాయి. -
మార్కెట్ విలువలపై అధ్యయనం
సాక్షి, అమరావతి: స్థిరాస్తి మార్కెట్ విలువలపై రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, వృద్ధి రేటును పరిగణలోకి తీసుకుని స్థానిక మార్కెట్ విలువలు ఏమైనా పెరిగాయా? అనే కోణంలో విస్తృత సమాచారాన్ని సేకరిస్తోంది. ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో నేతృత్వంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా, ఎంఆర్వో, ఎంపీడీవో సభ్యులుగా కమిటీలు నియమించారు. పట్టణ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా జడ్పీ సీఈవో, పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్ సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఏకాభిప్రాయంతో ప్రతిపాదనలు సబ్ రిజిస్ట్రార్లు తమ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, భూ మార్పిడి తదితర అంశాల ఆధారంగా మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయో సమాచారం సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని కమిటీ సమావేశాల్లో చర్చించి ఏకాభిప్రాయంతో మార్కెట్ విలువలపై ప్రతిపాదనలు తయారు చేస్తారు. అనంతరం ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు కూడా స్వీకరించి మార్పులు చేర్పులుంటే నమోదు చేస్తారు. అనంతరం తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. వీటి ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ విలువలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీలోపు ప్రతిపాదనలు సమర్పించాలని కమిటీలకు ప్రభుత్వం సూచించింది. గడువు ముగియనుండటంతో.. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి అభివృద్ధిని బట్టి ఆయా ప్రాంతాల మార్కెట్ విలువలను సవరిస్తారు. కరోనా కారణంగా గత సంవత్సరం సవరణను ప్రభుత్వం వాయిదా వేసింది. 2022 మార్చి 31 వరకు సవరణను వాయిదా వేస్తున్నట్లు గతేడాది ఉత్వర్వులిచ్చింది. ఆ గడువు ముగియనుండటంతో మార్కెట్ విలువలపై అధ్యయనం చేస్తోంది. -
పారిశ్రామిక ఉత్పత్తి... నాలుగో నెలా నిరాశే!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా నాల్గవ నెల 2021 డిసెంబర్‌లోనూ పేలవంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 0.4 శాతంగా నమోదయినట్లు (2020 ఇదే నెలతో పోల్చి) జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రెండంకెల్లో వృద్ధి నమోదయ్యింది. అటు తర్వాత క్రమంగా బలహీనపడింది. 2020 లో బేస్ ఎఫెక్ట్ ప్రభావం క్రమంగా తొలగిపోతూ రావడం కూడా దీనికి కారణం. సెప్టెంబర్‌లో 4.4 శాతం, అక్టోబర్‌లో 4 శాతం, నవంబర్‌లో 1.3 శాతం (తొలి 1.4 శాతానికి దిగువముఖంగా సవరణ) వృద్ధి రేట్లు నమోదయ్యాయి. కొన్ని కీలక రంగాల పనితీరును పరిశీలిస్తే.. ► మైనింగ్ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. ► విద్యుత్ ఉత్పత్తి 2.8 శాతం పెరిగింది. ► పెట్టుబడులు, భారీ యంత్రసామాగ్రి కొనుగోళ్లను ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ విభాగం కూడా 2021 డిసెంబర్లో క్షీణతలోనే ఉంది. క్షీణరేటు 4.6 శాతంగా నమోదయ్యింది. 2020 ఇదే నెలల్లో ఈ విభాగంలో 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. ► రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా 2.7 శాతం క్షీణతను నమోదయ్యింది. 2020 డిసెంబర్లో ఈ విభాగంలో 6.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కు సంబంధించి విభాగంలో ఉత్పత్తి కూడా 0.6 శాతం క్షీణతలోనే ఉంది. 2020 డిసెంబర్లో ఈ విభాగం 1.9 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. తొమ్మిది నెలల్లో ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 15.2 శాతం. లో బేస్ దీనికి ప్రధాన కారణం. 2020 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 13.3 శాతం క్షీణత నమోదయ్యింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... -
కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!
న్యూయార్క్: గత వారం ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక వారపు కేసులు ఇవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అయితే మరణాల సంఖ్య స్థిరంగా 50వేలకు పైగా కొనసాగుతున్నాయని పేర్కొన్నది. కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5 శాతం పెరిగిందని, కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుదల కనిపిస్తోందని, మొత్తంగా చూస్తే పెరుగుదల రేటు మందగిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో 39శాతంతో అత్యధికంగా కేసులు పెరిగాయని, ఆగ్నేయాసియాలో 36 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, అమెరికాలలో మరణాలు పెరిగాయని, ఇతర ప్రాంతాలలో తగ్గాయని వివరించింది. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించింది. దేశాలన్నీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కోరింది. -
ఎకానమీ స్పీడ్ 5 శాతం దాటకపోవచ్చు
ముంబై: ఎకానమీపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8–5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. కాగా మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఇక్రా స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021–22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.5 నుంచి 10 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. ఏజెన్సీ చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపిన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మూడవ వేవ్ ఇప్పుడే ప్రారంభమైనందున, ఈ అంశంపై తక్షణం ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ముందస్తు సూచనలు, కొత్త అంటువ్యాధి విస్తరణ విశ్లేషణల ఆధారంగా మున్ముందు పరిస్థితిని అంచనావేయవచ్చు. మొబిలిటీ ఆంక్షల వల్ల ముఖ్యంగా కాంటాక్ట్ ప్రాతిపదికన ఉపాధి రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే వీలుంది. ► ఇప్పటికి 2021–22లో 9 శాతం వృద్ధి అంచనాలనే కొనసాగిస్తున్నాం. మూడవ వేవ్ ప్రభావంపై డేటా పూర్తిగా అందుబాటులో లేకపోవడం, డిసెంబర్లో ప్రభుత్వ వ్యయాల గణాంకాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. ► కేంద్రం గత నెల్లో రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు ఎంత మేర పెరిగితే అంతమేర మూడవవేవ్ ప్రభావం తగ్గుతుంది. దీనికితోడు మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వాలు, కుటుంబాల సంసిద్ధత, ఆరోగ్య వ్యవస్థ పటిష్టత వంటి అంశాలూ ఇక్కడ కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇంకా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ► సరఫరాల కొరత తగ్గడం, పండుగల సీజన్ వంటి అంశాల నేపథ్యంలో మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 6 నుంచి 6.5 శ్రేణిలో కొనసాగిస్తున్నాం. ► ఇటీవలి కోవిడ్–19 కేసుల పెరుగుదల, అనిశ్చితికి దారితీసే అంశాల నేపథ్యంలో ‘ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంటే తప్ప’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన సరళతర విధానాన్ని ఇప్పుడే విడనాడకపోవచ్చు. ఫిబ్రవరిలో జరిగే వరుస 10వ ద్వైమాసిక సమావేశాల్లోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే వీలుంది. -
అప్పులపై తప్పుదోవ
సాక్షి, అమరావతి: రాష్ట్రం రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తుంటే ఓర్వలేని విపక్ష టీడీపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. సానుకూల వృద్ధి దిశగా ఏపీ పరుగులు తీస్తుంటే తట్టుకోలేక తిరోగమనం అంటూ దుష్ప్రచారానికి తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019–20లో వృద్ధి రేటు పెరిగిందని, కరోనా కష్టాలతో మధ్యలో తగ్గినా ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని బుగ్గన స్పష్టం చేశారు. కరోనాలోనూ తలసరి ఆదాయాలు పడిపోకుండా చూశామన్నారు. ఒకవైపు రెవెన్యూ లోటు తగ్గుతోందని కాగ్ చెబుతున్నా టీడీపీ నేతలు అబద్ధాలు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంతో పోలిస్తే 2020–21లో రాష్ట్రంలో ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తక్కువేనని చెప్పారు. ప్రతీ అప్పు, ప్రతీ ఖర్చుకూ లెక్కలున్నాయని, ప్రత్యక్ష నగదు బదిలీలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని తెలిపారు. ఈ మేరకు మంత్రి బుగ్గన ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అప్పులపై కోవిడ్ ప్రభావం 2020 నుంచి జీఎస్డీపీ, తలసరి ఆదాయం, రాష్ట్ర ఆదాయం, అప్పులపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపినా ఇది ప్రభుత్వ లోపాల వల్ల మాత్రం కాదు. విభజన సవాళ్లతో పోరాడుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందనే వాస్తవాలను గుర్తుంచుకోవాలి. ► గత సర్కారు హయాంలో అనుకూల పరిస్థితులున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 2017–18లో 10.09 శాతం, 2018–19లో 4.88 శాతానికి క్షీణించింది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో అత్యల్పం. ప్రస్తుత ధరలతో తప్పుదోవ యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఎన్నో ఏళ్లు పనిచేశారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆర్థిక వృద్ధిని లెక్కించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం సబబేనా? టీడీపీ నేతలు ప్రస్తుత ధరలతో జీఎస్డీపీని పోల్చి చూడటం వల్ల 2020–21కి సంబంధించి వాస్తవ జీఎస్డీపీ లెక్కలతో వారి వాదన సరిపోలడం లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీ వృద్ధి రేటు 2019–20లో 7.23 శాతం పెరిగింది. ఇది దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగో స్థానంలో నిలబెట్టింది. తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్డీపీ క్షీణతను 2020–21లో 2.58 శాతానికి పరిమితం చేసింది. తద్వారా మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, కర్నాటక, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ లాంటి ఎన్నో రాష్ట్రాల కంటే మెరుగ్గా నిలిచింది. తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి రేటు గత ప్రభుత్వ హయాంలో 2017–18లో 14.6 శాతం ఉండగా 2018–19లో 10.11 శాతానికి క్షీణించింది. 2019–20లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.63 శాతం ఉంది. ఇది దేశంలో 3వ వేగవంతమైన వృద్ధి రేటు. తెలంగాణ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది. 2020–21లో కరోనా వల్ల జాతీయ స్థాయిలో తలసరి వృద్ధి రేటు మైనస్ 4 శాతం నమోదు కాగా ఏపీలో తలసరి క్షీణతను 1.03 శాతానికి ఆపగలిగాం. రాబడులు గత ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే ఈదఫా తొలి ఆరు నెలల్లో రెవెన్యూ లోటు తగ్గిందని సెప్టెంబర్‌లో కాగ్ నివేదిక స్పష్టం చేసినా రెవెన్యూ లోటు ఆర్థిక లోటును అధిగమించిందని ప్రతిపక్ష నేతలు పచ్చి అవాస్తవాలు చెబుతున్నారు. రాష్ట్ర పన్నుల రాబడులు 2021–22లో పెరుగుతున్నాయి. 2021 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 34 శాతం రాబడుల్లో వృద్ధి నమోదైంది. ద్రవ్య, రెవెన్యూ లోటు విభజన సమస్యలకు తోడు గత సర్కారు నిర్వాకాలు, విచ్చలవిడి ఖర్చులతో రాష్ట్ర ద్రవ్య బాధ్యతలు అనవసరంగా పెరిగాయి. కోవిడ్ నివారణకు లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. 2020–21లో కేంద్ర ద్రవ్య లోటు 9.5 శాతం, రెవెన్యూ లోటు. 7.5 శాతానికి పెరిగాయి. ఇదే ఏపీలో 2019–20లో ద్రవ్య లోటు 3.5 శాతం, రెవెన్యూ లోటు 2.6 శాతం మాత్రమే ఉంది. 2020–21లో ద్రవ్యలోటు 5.38 శాతం, రెవెన్యూ లోటు 3.46 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరగడానికి అసలు కారణాలను చెప్పకుండా ప్రభుత్వాన్ని నిందించడం విడ్డూరం. అప్పులపై దుష్ప్రచారం టీడీపీ సర్కారు బడ్జెటేతర అప్పులతో కలిపి రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. 2021 మార్చి 31 నాటికి ప్రజాపద్దు కింద తీసుకున్న రుణాలు రూ.3,55,874.3 కోట్లు. ఇందులో కోవిడ్ కారణంగా కేంద్రం అనుమతించిన జీఎస్డీపీలో అదనపు 2% రూ.20 వేల కోట్లున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగే కొద్దీ రుణ విలువ పరిమితి పెరుగుతుంది. విభజన సమయానికి ప్రజా రుణం రూ.1,30,654.34 కోట్లకు పెరగ్గా 2019 మార్చి 31 నాటికి రూ.2,57,509.87 కోట్లకు చేరింది. గత ప్రభుత్వం రూ.1,20,000 కోట్లు అప్పు చేసి నీరు–చెట్టు లాంటి పథకాలతో వృథాగా ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ప్రజా రుణం రూ.16,419 కోట్లు ఎక్కువగా తీసుకోవడంతో కేంద్రం 2021–22లో రుణ పరిమితిని తగ్గించింది. డీబీటీతో ప్రజలకు రూ.1,14,9670.93 కోట్లు కోవిడ్ సంక్షోభంలో సమాజంలోని అన్ని వర్గాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకునేందుకు గత రెండున్నరేళ్లలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.1,14,967.93 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు మొత్తం 6,82,02,159 ప్రత్యక్ష నగదు బదిలీలు జరిగాయి. కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్రం అనుమతించిన మేరకు డబ్బును అప్పుగా తీసుకున్నాం. ప్రతి రూపాయికీ లెక్కలు చూపిస్తాం. ఆ రుణాలు గుదిబండగా.. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం అప్పులు రూ.31,647.64 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకు, డిస్కమ్‌లు ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,817.69 కోట్ల నుంచి రూ.20,121.97 కోట్లకు ఎగబాకాయి. పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.20,000 కోట్లు, ఏపీఆర్డీసీ ద్వారా రూ.3,000 కోట్లు, ఏపీడబ్ల్యూఆఆర్‌డీసీ ద్వారా రూ.4,000 కోట్లు, సీఆర్డీఏకు రూ.5,014 కోట్లు, ఏపీటిడ్కోకు రూ.4,601.59 కోట్లు, రైతు సాధికార సంçస్థ్దకు రూ.2,000 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ రూ.1,356 కోట్లు, ఏపీడీడబ్ల్యూసీ రూ.980 కోట్లు, ఏపీఎస్‌ఎహెచ్‌సీ రూ.1,870 కోట్లు, ఇతర కార్పొరేషన్ల రుణాలు రూ.9,438.59 కోట్ల అప్పు చేశారు. 2–3 ఏళ్ల మారటోరియంతో ఇది తీసుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వంపై పెనుభారం పడింది. -
వ్యవసాయ వృద్ధి రేటులో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రజా మౌలిక వసతుల కల్పన, సౌకర్యాల విషయంలో మెరుగైన పనితీరు కనపరిచింది. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా శనివారం విడుదల చేసిన సుపరిపాలన సూచిక–2021 (గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్–జీజీఐ) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రాష్ట్ర వార్షిక వృద్ధి రేటు జీజీఐ 2019లో 6.3 శాతం ఉండగా, 2020–21లో 11.3 శాతానికి పెరిగింది. ఉద్యానవన పంటల రంగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్ర ఉద్యానవన పంటల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 12.3 శాతానికి చేరింది. పాల ఉత్పత్తిలో వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 11.7 శాతానికి పెరిగింది. మాంసం ఉత్పత్తికి సంబంధించిన వృద్ధి రేటులో గణనీయమైన మార్పు నమోదైంది. 2019 ఇండెక్స్‌లో 6.7 శాతంగా ఉన్న వృద్ధిరేటు.. 2021 ఇండెక్స్‌లో 10.3 శాతానికి పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో పంటల బీమా 20.2 శాతం నుంచి 26.1 శాతానికి చేరుకుందని వెల్లడించింది. పెరిగిన వైద్యుల సంఖ్య ప్రభుత్వ రంగ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉండే వైద్యుల సంఖ్య బాగా పెరిగినట్లు జీజీఐ నివేదిక స్పష్టం చేసింది. 2019లో 90.21 శాతంగా ఉన్న డాక్టర్ల సంఖ్య ఇప్పుడు 96.61 శాతానికి చేరింది. ప్రజల్లో రోగనిరోధక శక్తిలో కూడా గణనీయమైన వృద్ధి నమోదైందని స్పష్టం చేసింది. 2019లో ఉన్న 89.96 శాతం నుంచి 97.83 శాతానికి చేరింది. మాతృ, శిశు మరణాల సంఖ్య బాగా తగ్గడం రాష్ట్రంలో ప్రజా వైద్య సదుపాయాలు మెరుగైన విషయాన్ని స్పష్టం చేస్తోంది. మాతృ మరణాల సంఖ్య 74 నుంచి 65కి తగ్గితే, శిశుమరణాలు 32 నుంచి 29కి తగ్గాయి. సొంత ఆదాయంలో పెరుగుదల 2019తో పోలిస్తే 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా తగ్గిన విషయాన్ని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర సొంత ఆదాయం 45.76 శాతం నుంచి 51.17 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 46.56 శాతం నుంచి 42.56 శాతానికి చేరింది. అందరికీ ఇళ్లు విషయంలో కూడా రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. 2019లో 17.6 శాతంగా ఉన్న అందరికీ ఇళ్లు సంఖ్య 2021 నాటికి 24.10 శాతానికి చేరింది. 2019లో 42.5 శాతంగా ఉన్న మహిళా ఆర్థిక స్వావలంబన రేటు 2020–21 నాటికి 58.2 శాతానికి పెరిగింది. 2019లో ప్రతి వెయ్యి మంది బాలురులకు 946గా ఉన్న బాలికల సంఖ్య ఇప్పుడు 955కు పెరిగింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై నమోదైన కేసులు తగ్గాయి. 2019లో 26.96గా ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల సంఖ్య 2021 నాటికి 12.62 శాతానికి తగ్గాయి. ఇదిలా ఉండగా పది రంగాల్లో జరిగిన అభివృద్ధికి సంబంధించి 58 సూచికల ఆధారంగా ఈ నివేదిక సిద్ధం అయ్యింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ స్కోర్‌లో 100 శాతం విజయాన్ని నమోదు చేస్తున్నాయి. 20 రాష్ట్రాలు తమ కాంపోజిట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ స్కోర్లను మెరుగు పరుచుకున్నాయి. -
8.9% కాదు... 9.5%
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ సెక్యూరిటీస్ 9.5 శాతానికి పెంచింది. ఇప్పటి వరకూ ఈ అంచనా 8.9 శాతం. ఆర్థిక రికవరీ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతుండడం, పెరిగిన వినియోగ విశ్వాసం, వ్యయాల పెరుగుదల వంటి అంశాలు తమ అంచనాల పెంపునకు కారణమని వివరించింది. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు వరుసగా 7.7 శాతం, 6 శాతంగా నమోదవుతుందన్నది అంచనాగా తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021–22 జీడీపీ వృద్ధి రేటుకు సమానంగా తాజాగా యూబీఎస్ సెక్యూరిటీస్ తన అంచనాలను పెంచడం గమనార్హం. ప్రభుత్వం 10 శాతం అంచనావేస్తోంది. వివిధ రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనా శ్రేణి 8.5 శాతం నుంచి 10 శాతం వరకూ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతం. వడ్డీరేట్లు పెరిగే అవకాశం! రానున్న 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తక్కువ వడ్డీరేటు ప్రయోజనాలకు ముగింపు పలికే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను అరశాతం పెంచే అవకాశం ఉందని కూడా యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనావేసింది. 2021–22లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉంటుందన్న ఇంతక్రితం అంచనాలను 4.8 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22లో 10.1 శాతంగా, 2022–23లో 8.8 శాతంగా నమోదవుతుందని తమ అంచనా అని యూబీఎస్ సెక్యూరిటీస్ తెలిపింది. ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10 శాతం నమోదవుతుందన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవ్రాయ్ వ్యక్తం చేశారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. -
50 వేల గృహాలు.. 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో పోలిస్తే మూడో త్రైమాసికం (క్యూ3)లో రియల్టీ లావాదేవీలు పెరిగాయి. గృహ, ఆఫీస్, రిటైల్, వేర్‌హౌస్ అన్ని విభాగాలలో వృద్ధి రేటు నమోదయింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గృహ విక్రయాలు పెరగగా.. ప్రయాణ పరిమితులు తొలగడం, ఆఫీసులు పునఃప్రారంభాలతో కార్యాలయాల స్థలాలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో రిటైల్ స్పేస్, ఓమ్నీ చానల్ విధానంతో వేర్‌హౌస్ స్పేస్ వృద్ధికి కారణాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా వెల్లడించింది. మిడ్, అఫర్డబుల్ యూనిట్లదే హవా.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశంలో 50 వేల గృహాలు విక్రయమయ్యాయి. క్యూ2తో పోలిస్తే 46 శాతం వృద్ధి. అదే ఏడాది క్రితం క్యూ3తో పోలిస్తే 86 శాతం పెరుగుదల. నగరాల వారీగా చూస్తే.. 33 శాతం అమ్మకాల వాటాతో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. ముంబైలో 23 శాతం, బెంగళూరులో 17 శాతం, హైదరాబాద్‌లో 13 శాతం వాటాలున్నాయి. మొత్తం విక్రయాలలో 47 శాతం మధ్యస్థాయి గృహాలు కాగా 31 శాతం అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఈ ఏడాది క్యూ3లో కొత్తగా 48,950 యూనిట్లు ప్రారంభమయ్యాయి, గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్ట్గేజ్ వంటి కారణంగా మధ్యస్థాయి, అందుబాటు గృహాల విక్రయాలు, లాంచింగ్స్కు ప్రధాన కారణాలు. అద్దె గృహాల చట్టం అమలుతో డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. మిలీనియల్స్, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడంతో పెద్ద విస్తీర్ణ గృహాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. నగదు నిర్వహణ, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాలు పెరగడం వంటివి కూడా రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్లకే డిమాండ్.. ఈ ఏడాది క్యూ3లో దేశంలో అదనంగా 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. క్యూ2తో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్ లావాదేవీలదే హవా కొనసాగింది. 50 వేల చ.అ.ల కంటే తక్కువ స్థలం లావాదేవీల వాటా 84 శాతం వాటా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలోనే 80 శాతం లావాదేవీలు కేంద్రీకృతమయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేయడం సంస్కృతి పునఃప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. 90 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్.. పారిశ్రామిక గిడ్డంగుల విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే క్యూ3లో 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగి స్థలాల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 2.3 కోట్ల చ.అ. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) ఈ–కామర్స్ మంచి డిమాండ్ ఉంది. క్యూ3లోని లీజులలో 55 శాతం లావాదేవీలు మధ్యస్థాయి, పెద్ద పరిమాణ ఒప్పందాలు ఉన్నాయి. 32 శాతం లావాదేవీల వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. ఢిల్లీలో 22 శాతం, ముంబైలో 12 శాతం వాటాలున్నాయి. ► ఈ ఏడాది ముగింపు నాటికి ఇండస్ట్రియల్ వేర్‌హౌస్ స్పేస్ సపయ్ 2.5 కోట్ల చ.అ. చేరుతుందని, అలాగే 3.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. వినియోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న అధిక నాణ్యత గిడ్డంగులపై దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమేషన్ లాజిస్టిక్స్, త్వరితగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో రిటైల్ హవా.. ప్రయాణ పరిమితులు తొలగిపోవటం, లాక్డౌన్ లేకపోవటం, విద్యా సంస్థలు, పని ప్రదేశాలు పునఃప్రారంభం కావటంతో రిటైల్ కార్యకలాపాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది క్యూ3లో గ్రేడ్–ఏ, హైస్ట్రీట్ మాల్స్‌లలో 6 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీల్లో జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని రిటైల్ స్పేస్ లావాదేవీలో హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం రిటైల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో నగరం వాటా 38 శాతం కాగా.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 శాతం, బెంగళూరులో 12 శాతం లావాదేవీలు జరిగాయి. విభాగాల వారీగా చూస్తే ఫ్యాషన్ అండ్ అపెరల్స్ రిటైల్ స్పేస్ లావాదేవీలు 26 శాతం జరగగా.. 16 శాతం సూపర్ మార్కెట్ల స్థల లావాదేవీలు జరిగాయి. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. వేగవంతమైన వ్యాక్సినేషన్, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలతో దేశీయ రియల్టీ మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య, రిటైల్, పారిశ్రామిక గిడ్డంగుల విభాగాలలో కూడా ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – అన్షుమన్ మేగజైన్, సీఈఓ అండ్ చైర్మన్, సీబీఆర్ఈ ఇండియా -
వచ్చే త్రైమాసికాల్లో పటిష్ట వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ రానున్న త్రైమాసికాల్లో పటిష్ట వృద్ధి రేటును నమోదుచేసుకుంటుదన్న విశ్వాసాన్ని ఇండస్ట్రీ చాంబర్– పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ ప్రదీప్ ముల్తానీ వ్యక్తం చేశారు. పీహెచ్‌డీసీసీఐ ట్రాక్ చేసే 12 ప్రధాన ఆర్థిక, వాణిజ్య ఇంటికేటర్లలో తొమ్మిది 2021 సెప్టెంబర్‌లో (2020 సెప్టెంబర్‌తో పోల్చితే) మంచి పురోగతిలో ఉన్నాయని, 2021 ఆగస్టులో పోల్చితే 2021 సెప్టెంబర్‌లో ఆరు రంగాలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని ముల్తానీ పేర్కొన్నారు. జీఎస్టీ వసూళ్లు, స్టాక్ మార్కెట్, యూపీఐ లావాదేవీలు, ఎగుమతులు, మారకపు విలువ, విదేశీ మారకద్రవ్య నిల్వలు, రిటైల్– టోకు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, వంటి అంశాలు 2021 ఆగస్టులో పోల్చితే 2021 సెప్టెంబర్‌లో ఎంతో పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రత్యేకించి నిరుద్యోగ సమస్య ఆగస్టులో 8.3 శాతం ఉంటే, సెప్టెంబర్‌లో 6.9 శాతానికి తగ్గినట్లు తెలిపారు. సవాళ్లు ఉన్నాయ్.. కాగా, సానుకూల అంశాలతోపాటు ప్రస్తుతం ఉన్న సమస్యల్లో కమోడిటీ ధరల తీవ్రత ఒకటికాగా, మరొకటి ముడి పదార్థాల కొరతని తెలిపారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా దేశంలో వినియోగం, ప్రైవేటు పెట్టుబడులకు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గృహ వినియోగం మరింత పటిష్టం కావాల్సి ఉందని అన్నారు. దీనివల్ల డిమాండ్, పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుపడతాయని తెలిపారు. ఆగస్టు 31వ తేదీన విడుదలైన గణాంకాల ప్రకారం, 2021–22 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.