ముంబై: ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జోరుగా సాగనున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 8–10 శాతం అధిక అమ్మకాలు ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ రంగంపై క్రిసిల్ ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. గృహ రుణాలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగినా కానీ అమ్మకాల్లో వృద్ధికి ఢోకా ఉండదని పేర్కొంది. మధ్యస్థాయి, ప్రీమి యం విభాగాలు, విలాసవంత ఇళ్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, వీటి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా నమోదైనట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది.
దీనికితోడు వసూళ్లు బలంగా ఉండడం, రుణ భారం తక్కువగా ఉండడంతో డెవలపర్ల రుణ పరపతి మెరుగుపడినట్టు పేర్కొంది. 11 పెద్ద లిస్టెడ్ సంస్థలు, 76 చిన్న, మధ్య స్థాయి నివాస గృహాల డెవలపర్ల గణాంకాల ఆధారంగా క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదిక రూపొందించింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ విభాగంలో డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక వృద్ధి ఆరోగ్యంగా ఉండడంతోపాటు కార్యాలయాలు ఇప్పటికీ హైబ్రిడ్ నమూనాలో పనిచేస్తున్నాయి. దీంతో ప్రీమియం, పెద్ద ఇళ్ల కు ఇస్తున్న ప్రాముఖ్యం డిమాండ్‌కు మద్దతిస్తోంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!)
పెద్ద సంస్థల మార్కెట్ బలోపేతం
గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11 ప్రముఖ రియల్ ఎస్టేట్ (లిస్టెడ్) కంపెనీలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాల్లో విలువ పరంగా 50 శాతం, స్థల విస్తీర్ణం పరంగా 20 శాతం వృద్ధిని చూపించినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. పెద్ద సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయని, 2020 నాటికి 16–17 శాతంగా ఉన్న వీటి వాటా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. పేరున్న సంస్థలు అయితే బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా రావడంతోపాటు, విశ్వసనీయ బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం వాటి మార్కెట్ వాటాను పెంచుతుందని తెలిపింది.
హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో గణాంకాలను క్రిసిల్ తీసుకుంది. బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, డీఎల్‌ఎఫ్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, కోల్టే పాటిల్ డెవలపర్స్, మాక్రోటెక్ డెవలపర్స్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్, ఒబెరాయ్ రియలీ్ట, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పురవంకర, శోభ, సన్‌టెక్ రియాలిటీ సంస్థలను పెద్ద సంస్థలుగా పేర్కొంది. (రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ)
Comments
Please login to add a commentAdd a comment