home loans
-
పీఎన్బీ రుణ రేట్లు కట్..
న్యూఢిల్లీ: రిటైల్ రుణాలపై (గృహ, వాహన సహా) 25 బేసిస్ పాయింట్ల (0.25శాతం) మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటించింది. గృహ, కార్ల రుణాలు, విద్య, వ్యక్తిగత రుణాలకు ఈ తగ్గింపు అమలు కానుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఆర్బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం తెలిసిందే. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తూ పీఎన్బీ కొత్త రేట్లను ప్రకటించింది. సవరణ తర్వాత గృహ రుణాలపై రేటు 8.15 శాతం నుంచి మొదలవుతుంది. అంటే ప్రతి లక్షకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.744గా ఉంటుందని పీఎన్బీ ప్రకటించింది. ఆటో రుణాలపై 8.50 శాతం నుంచి రేట్లు మొదలవుతాయి. ప్రతి లక్షకు రూ.1,240 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ అనుకూల ఇంధన వాహనాలకు 0.05 శాతం మేర వడ్డీలో రాయితీ ఇవ్వనుంది. అలాగే ఎక్స్ షోరూమ్ ధరపై 100 శాతం రుణంగా లభిస్తుంది. 120 నెలల కాలానికి ఎంపిక చేసుకోవచ్చు. విద్యా రుణాలపై రేట్లు 7.85 శాతానికి తగ్గాయి. వ్యక్తిగత రుణాలపై రేట్లు 11.25 శాతం నుంచి మొదలవుతాయి. కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్బీ ప్రకటించింది. -
గృహ రుణం.. స్మార్ట్‌గా తీర్చేద్దాం..!
రుణంతో సొంతింటి కలను కెరీర్ ఆరంభంలోనే నెరవేర్చుకుంటోంది నేటి తరం యువత. 25–30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని, క్రమం తప్పకుండా చెల్లించడం ఒక విధంగా పొదుపే. కానీ, అందరికీ అంత సుదీర్ఘకాలం పాటు రుణ వాయిదాలు చెల్లించే నగదు ప్రవాహ వెసులుబాటు ఉండకపోవచ్చు. వివాహం అనంతరం పెరిగిపోయిన ఖర్చులతో ఈఎంఐ చెల్లింపులు భారంగా మారొచ్చు. దీంతో త్వరగా రుణ భారం నుంచి బయటపడిపోవాలని అనిపిస్తుంటుంది. అయితే ఈ దిశగా ఆచరణ చాలా మందికి తోచదు. వ్యవస్థలో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. కనుక గృహ రుణాన్ని నిర్ణీత కాలానికంటే ముందుగా తీర్చేయడం మంచి ఆలోచనే అవుతుంది. ఇందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈ దిశగా నిపుణులు ఏమంటున్నారో తెలియజేసే కథనమిది... ముంబైకి చెందిన నీరవ్ (35) 2015లో రూ.40 లక్షల గృహ రుణాన్ని 30 ఏళ్ల కాలానికి 8.5 శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారు. నెలవారీ రూ.31,000 చొప్పున ఇంటి రుణానికి చెల్లిస్తున్నారు. దీంతో వేతనంలో సగానికి పైనే రుణ చెల్లింపులకు పోతోంది. రుణ ఖాతా వార్షిక నివేదికను ఒక్కసారి పరిశీలించగా, తొలి నాళ్లలో తాను చెల్లిస్తున్న ఈఎంఐలో అధిక భాగం వడ్డీ చెల్లింపులకే వెళుతున్నట్టు అర్థమైంది. దీంతో నిపుణుల సాయంతో ఐదేళ్లలోనే ఆ రుణాన్ని తీర్చివేశారు. నీరవ్ మాదిరే ప్రతి ఒక్కరూ తమకు వీలైన మార్గంలో గృహ రుణ భారాన్ని ముందుగానే వదిలించుకోవచ్చు. ఈఎంఐలో తొలి ఏడాది 90 శాతం వడ్డీ చెల్లింపులకు వెళుతుంది. ఏటా ఇది క్రమంగా తగ్గుతూ, అసలు వాటా పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా 20–25 ఏళ్ల కాలానికి సంబంధించి గృహ రుణాల్లో మొదటి ఐదేళ్లలో వడ్డీ చెల్లింపులే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.75 లక్షల గృహ రుణాన్ని 25 ఏళ్ల కాలానికి 8.5 శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.60,392 అవుతుంది. 25 ఏళ్లలో వడ్డీ రూపంలోనే రూ.1.06 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అసలు రూ.75 లక్షలు కూడా కలిపితే మొత్తం రూ.1.81 కోట్లు అవుతుంది. అంటే తీసుకున్న మొత్తానికి రెట్టింపునకు పైగా వడ్డీ రూపంలో చెల్లించాలి. ఒకవేళ గృహ రుణంపై వడ్డీ రేటు 9.5 % గా ఉంటే అప్పుడు 25 ఏళ్లలో వడ్డీ రూపంలో 1.22 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. చాలా ఆదా చేసుకోవచ్చు.. గృహ రుణాన్ని కాల వ్యవధి చివర్లో కంటే మొదటి ఐదేళ్లలో తీర్చేయడం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆరంభ సంవత్సరాల్లో ఈఎంఐలో వడ్డీ భాగమే ఎక్కువగా ఉంటుంది’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. రూ.50 లక్షల రుణాన్ని 9 శాతం వడ్డీపై 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారని అనుకుందాం. ఈ కాలంలో వడ్డీ రూపంలోనే రూ.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పూర్తయిన వెంటనే రూ.5 లక్షల మొత్తాన్ని అదనంగా చెల్లించడం ద్వారా మొత్తం కాల వ్యవధిలో 17.6 లక్షల మేర వడ్డీని ఆదా చేసుకోవచ్చు. అంటే అప్పుడు నికరంగా రూ.40.4 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు 240 నెలల్లో తీరిపోవాల్సిన రుణ భారం, 190 నెలలకే ముగిసిపోతుంది. అంటే రుణాన్ని 50 నెలల ముందే ముగించేయొచ్చు. తొలి నాళ్లలో వడ్డీలకే సింహభాగం పోతుంది. దీంతో అసలు పెద్దగా తగ్గదు. ఇలా వడ్డీకి ఎక్కువ మొత్తం జమ అవుతున్న తొలి సంవత్సరాల్లో చేసే అదనపు చెల్లింపులతో అసలు భాగం తగ్గుతుంది. ఫలితంగా ఈఎంఐలో వడ్డీ భాగం తగ్గి, అసలు జమ వేగాన్ని అందుకుంటుంది.ముందుగా చెల్లిస్తే ఎంత ఆదా? రూ.50 లక్షల రుణం. కాల వ్యవధి 20 ఏళ్లు. వడ్డీ 9 శాతం. రూ.5 లక్షలను రుణం తీసుకున్న అనంతరం ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు పూర్తి అయిన వెంటనే చెల్లించనట్టయితే, తద్వారా ఎంత మేర ఆదా అవుతుందో టేబుల్లో తెలుసుకోవచ్చు. ఈక్విటీలో పెట్టుబడులు గృహ రుణాన్ని ముందుగా వదిలించుకునేందుకు ఈక్విటీ పెట్టుబడుల మార్గాన్ని సైతం ఆశ్రయించొచ్చు. ఈక్విటీల్లో పదేళ్లకు పైన కాలంలో వార్షిక రాబడులు 12–15 శాతంగా ఉండొచ్చు. గృహ రుణంపై 9 శాతం వడ్డీయే పడుతుంది. కనుక ప్రతి నెలా గృహ రుణ ఈఎంఐ చెల్లిస్తూనే, ఈఎంఐలో 10–20 శాతం మేర ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ఐదేళ్లు ముగిసిన తర్వాత నుంచి అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి సమానంగా ఉపసంహరించుకుంటూ గృహ రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి. లేదా పదేళ్ల పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మార్కెట్లు బుల్లిష్‌గా ఉన్న తరుణంలో ఆ మొత్తాన్ని ఉపసంహరించుకుని గృహ రుణానికి జమ చేసుకోవచ్చు. ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో 1.25 లక్షల మొత్తంపై పన్ను లేదు. కనుక ఏడాదిలో రూ.1.25 లక్షల్లోపే వెనక్కి తీసుకోవడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. పైన చెప్పుకున్న నీరవ్ ఉదాహరణను తీసుకుందాం. రూ.40 లక్షల రుణాన్ని 30 ఏళ్ల కాలానికి 8.50 శాతం రేటుపై తీసుకున్నారు. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.31,000. మొత్తం కాల వ్యవధిలో సుమారు రూ.61 లక్షలు వడ్డీ పడుతోంది. ప్రతి నెలా ఈఎంఐలో 20 శాతానికి సమాన మొత్తం అంటే, 6,200 చొప్పున 12 శాతం రాబడిని ఇచ్చే ఈక్విటీ ఫండ్‌లో 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా గృహ రుణం తీరిపోయే సమయానికి రూ. 62 లక్షలు సమకూరుతుంది. రుణంపై చెల్లించిన వడ్డీకి సమానంగా నిధి ఏర్పడినట్టు అవుతుంది. ఏటా 5 % లేదా ఒక ఈఎంఐ అసలులో ఏటా నిర్ణిత శాతాన్ని అదనంగా చెల్లించాలి. రూ.50 లక్షల రుణాన్ని 9 శాతం రేటుపై 20 ఏళ్లకు తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 44,986 అవుతుంది. కేవలం వడ్డీ రూపంలోనే రూ. 58 లక్షలు చెల్లించాలి. ఏటా రుణ బకాయిలో 5% చొప్పున ఒకే విడత తీర్చుతూ వెళితే చెల్లించాల్సిన వడ్డీ రూ.29.8 లక్షలకు తగ్గిపోతుంది. దీంతో 240 నెలలకు బదులు 143 నెలల్లోనే రుణాన్ని ముగించేయొచ్చు. ఏటా ఒక ఈఎంఐ (రూ.44,986) చొప్పున అదనంగా చెల్లిస్తూ వెళితే మొత్తం చెల్లించాల్సిన వడ్డీ రూ.58 లక్షలకు బదులు రూ.45 లక్షలు అవుతుంది. రూ.13 లక్షల వడ్డీ ఆదా అవడంతోపాటు రుణం 45 నెలల ముందే తీరిపోతుంది. ఎన్నో మార్గాలు.. → ఉద్యోగులు అయితే వార్షిక బోనస్‌ను ముందస్తు రుణ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. → కొందరికి బోనస్‌లు రావు. కానీ వార్షికంగా ఎంతో కొంత వేతన పెంపు ఉంటుంది. పెరుగుతున్న వేతనం స్థాయిలోనే గృహ రుణం ఈఎంఐని పెంచుకుంటూ వెళ్లాలి. ఏడాదికి ఒక్క ఈఎంఐ అదనంగా చెల్లించినా చాలా మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. → స్వయం ఉపాధి, వ్యాపారాల్లోని వారు సైతం భిన్న సందర్భాల్లో వచ్చే అదనపు ఆదాయ వనరులను ఇందుకు వినియోగించుకోవచ్చు. → చాలా తక్కువ రాబడులు ఇచ్చే డెట్ పెట్టుబడులు ఉంటే వాటిని ఉపసంహరించుకుని గృహ రుణ చెల్లింపులకు మళ్లించుకోవచ్చు. కాకపోతే గృహ రుణం వడ్డీ రేటు కంటే, తక్కువ రాబడులు ఇస్తున్న పెట్టుబడులనే ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలి. → ఈక్విటీ డివిడెండ్ రాబడులు ఉన్న వారు ఆ మొత్తాన్ని ఇందుకు వినియోగించుకోవచ్చు. → దీర్ఘకాల లక్ష్యాలైన రిటైర్మెంట్ (ఎన్పీఎస్), పిల్లల భవిష్యత్ విద్య (పీపీఎఫ్, ఈక్విటీ తదితర) కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దని నిపుణుల సూచన. → గృహ రుణం ముందుగా చెల్లించేస్తే ‘ఫోర్ క్లోజర్’ చార్జీలు విధించని బ్యాంక్‌ను ఎంపిక చేసుకోవాలి. → పదవీ కాలంలోనే గృహ రుణాన్ని ముగించేలా చూసుకోవాలని ఆదిల్ శెట్టి సూచన. హోమ్‌లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్... ఈ ఖాతా తెరవడం ద్వారా మిగులు నిధులను డిపాజిట్ చేసుకోవచ్చు. దీంతో రుణం అసలు వేగంగా తగ్గిపోతుంది. ‘‘ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లో మిగులు నిల్వలను కావాలనుకున్నప్పుడు జమ చేసుకోవచ్చు. ఈ విషయమై అధికారికంగా బ్యాంక్‌కు తెలియజేయక్కర్లేదు’’ అని ఆదిల్ శెట్టి వివరించారు. 20 20 60 ‘‘ఆదాయంలో 20 % పొదుపు చేసి పెట్టుబడులకు వినియోగించుకోవాలి. 20 శాతం రుణ ఈఎంఐలకి, మిగిలిన 60 శాతం జీవన అవసరాలకు వినియోగించుకోవాలి’’ అని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా (అమెరికాకు చెందిన స్టాండర్డ్ బోర్డు లిమిటెడ్ సబ్సిడరీ) సీఈవో కృష్ణ మిశ్రా సూచించారు. అంటే ఆదాయంలో గృహ రుణ ఈఎంఐ 20 శాతానికి పరిమితం చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. జీవన అవసరాల్లో 10 శాతాన్ని ఆదా చేసి, ఆ మేరకు గృహ రుణ ముందస్తు చెల్లింపులకు కేటాయించుకోవచ్చు. అంటే ఆదాయంలో జీవన అవసరాలను 60 శాతానికి బదులు 50 శాతానికి పరిమితం చేసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇళ్ల కొనుగోలులో కీలకంగా వడ్డీ రేట్లు
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు.. → గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. → 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు. → 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు. → రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. → 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. చెప్పుకోతగ్గ మార్పు..‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు. -
వినియోగదారుల రుణాలు రూ.90 లక్షల కోట్లు
కోల్‌కతా: వినియోగదారుల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15 శాతం వృద్ధి చెంది రూ.90 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో నమోదైన 17.4 శాతం వృద్ధితో పోలిస్తే కొంత క్షీణత కనిపించింది. వినియోగదారుల రుణాల్లో 40 శాతం వాటా కలిగిన గృహ రుణ విభాగంలో మందగమనం ఇందుకు కారణమని క్రిఫ్ హైమార్క్ నివేదిక వెల్లడించింది. 2023–24లో గృహ రుణాల విభాగంలో వృద్ధి 7.9 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే విభాగం 23 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం. రూ.35 లక్షలకు మించిన గృహ రుణాలకు డిమాండ్ పెరిగింది. సగటు రుణ సైజ్ 2019–20లో ఉన్న రూ.20లక్షల నుంచి 32 శాతం వృద్ధితో 2023–24లో రూ.26.5 లక్షలకు పెరిగింది. వ్యక్తిగత రుణాలకు డిమాండ్ ఇక వ్యక్తిగత రుణాల (పర్సనల్ లోన్)కు డిమాండ్ బలంగా కొనసాగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2023–24లో వ్యక్తిగత రుణాల విభాగంలో 26 శాతం వృద్ధి నమోదైంది. రూ.10లక్షలకు మించిన వ్యక్తిగత రుణాల వాటా పెరగ్గా.. అదే సమయంలో రూ.లక్షలోపు రుణాలు తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. బ్యాంకులు మంజూరు చేసిన రుణాల విలువ అధికంగా ఉండగా, ఎన్బీఎఫ్సీలు సంఖ్యా పరంగా ఎక్కువ రుణాలు జారీ చేశాయి. టూవీలర్ రుణాల జోరు ద్విచక్ర వాహన రుణ విభాగం సైతం బలమైన పనితీరు చూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2022–23లో 30 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆటోమొబైల్ రుణాల విభాగంలో 20 శాతం వృద్ధి నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 22 శాతంగా ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధిని చూపించాయి. రుణాల సగటు విలువ కూడా పెరిగింది. ఎంఎస్ఎంఈ విభాగంలో వ్యక్తిగత రుణాల కంటే సంస్థాగత రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. వ్యక్తిగత ఎంఎస్ఎంఈ రుణాలు 29 శాతం, సంస్థలకు సంబంధించి ఎంఎస్ఎంఈ రుణాలు 6.6 శాతం చొప్పున పెరిగాయి. సూక్ష్మ రుణాలు సైతం బలమైన వృద్ధిని చూపించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల్లో 27 శాతం వృద్ధి నమోదైంది. -
హోమ్ లోన్ తీసుకోవాలంటే ఈ బ్యాంకులే బెస్ట్
-
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
సొంతిల్లు సామాన్యుడి కల. రోజురోజుకు రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతోంది. దాంతో రియల్టీ వ్యాపారులు, గృహాలు నిర్మిస్తున్న డెవలపర్లు వాటిని కొనుగోలు చేయాలనుకునేవారిని వివిధ మార్గాల ద్వారా ఆకర్షిస్తున్నారు. దాంతో మరింత సమయం వేచిచూస్తే ధరలు పెరుగుతాయనే భావనతో ఎలాగోలా అప్పు చేసైనా గృహాలు కొంటున్నారు. అలా ఏటా వినియోగదారులు తీసుకుంటున్న గృహ రుణాలు బ్యాంకుల వద్ద పేరుకుపోతున్నాయి. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రికార్డు స్థాయిలో రూ.10లక్షల కోట్ల గృహ నిర్మాణ రంగ రుణాలు పెరిగాయి.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు2024 మార్చి నెల వరకు గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం తెలిసింది. 2022 మార్చి నాటికి రూ.17,26,697 కోట్ల బకాయిలు ఉండగా, 2023 మార్చి నాటికి రూ.19,88,532 కోట్లకు, 2024 మార్చి నాటికి రూ.27,22,720 కోట్లకు చేరాయని పేర్కొంది. వాణిజ్య స్థిరాస్తి రుణ బకాయిలు 2024 మార్చి నాటికి రూ.4,48,145 కోట్లకు చేరాయని, 2022 మార్చిలో రూ.2,97,231 కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది. -
త్వరలోనే కొత్త హౌసింగ్ స్కీమ్.. ధ్రువీకరించిన కేంద్ర మంత్రి
గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) తాజాగా ధ్రువీకరించారు. “మేము కొత్త హోమ్ సబ్వెన్షన్ స్కీమ్ వివరాలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం. ప్రధాన మంత్రి చెప్పినట్లుగా లబ్ధిదారులకు వడ్డీ రాయితీని అందించే ఇది ఒక పెద్ద పథకం. త్వరలోనే ఈ పథకం తుది వివరాలు వెల్లడిస్తాం ” అని హర్దీప్ సింగ్ పూరి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తొలుత ఈ పథకాన్ని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చే కొత్త హౌసింగ్ లోన్ స్కీమ్‌ను తమ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ప్రధాని మోదీ, నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికార కాలనీలలో నివసించే కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. ‘సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న పేదలకు వడ్డీ రేట్లు, బ్యాంకుల నుంచి రుణాల ఉపశమనంతో సహాయం చేస్తాం. అది వారికి లక్షల రూపాయలు ఆదా చేయడంలో సహాయపడుతుంది’ అని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.9 లక్షలు రుణం అందిస్తారు. దీనిపై కేవలం 3 నుంచి 6.5 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒక వేళ ఇంతకు ముందే హోమ్‌లోన్ తీసుకున్నట్లయితే 20 సంవత్సరాల టెన్యూర్‌తో రూ.50 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్నవారు మాత్రమే ఈ వడ్డీ సబ్సిడీకి అర్హులు. -
ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు
ముంబై: ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జోరుగా సాగనున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 8–10 శాతం అధిక అమ్మకాలు ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ రంగంపై క్రిసిల్ ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. గృహ రుణాలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగినా కానీ అమ్మకాల్లో వృద్ధికి ఢోకా ఉండదని పేర్కొంది. మధ్యస్థాయి, ప్రీమి యం విభాగాలు, విలాసవంత ఇళ్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, వీటి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా నమోదైనట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనికితోడు వసూళ్లు బలంగా ఉండడం, రుణ భారం తక్కువగా ఉండడంతో డెవలపర్ల రుణ పరపతి మెరుగుపడినట్టు పేర్కొంది. 11 పెద్ద లిస్టెడ్ సంస్థలు, 76 చిన్న, మధ్య స్థాయి నివాస గృహాల డెవలపర్ల గణాంకాల ఆధారంగా క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదిక రూపొందించింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ విభాగంలో డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక వృద్ధి ఆరోగ్యంగా ఉండడంతోపాటు కార్యాలయాలు ఇప్పటికీ హైబ్రిడ్ నమూనాలో పనిచేస్తున్నాయి. దీంతో ప్రీమియం, పెద్ద ఇళ్ల కు ఇస్తున్న ప్రాముఖ్యం డిమాండ్‌కు మద్దతిస్తోంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) పెద్ద సంస్థల మార్కెట్ బలోపేతం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11 ప్రముఖ రియల్ ఎస్టేట్ (లిస్టెడ్) కంపెనీలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాల్లో విలువ పరంగా 50 శాతం, స్థల విస్తీర్ణం పరంగా 20 శాతం వృద్ధిని చూపించినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. పెద్ద సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయని, 2020 నాటికి 16–17 శాతంగా ఉన్న వీటి వాటా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. పేరున్న సంస్థలు అయితే బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా రావడంతోపాటు, విశ్వసనీయ బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం వాటి మార్కెట్ వాటాను పెంచుతుందని తెలిపింది. హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో గణాంకాలను క్రిసిల్ తీసుకుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, కోల్టే పాటిల్ డెవలపర్స్, మాక్రోటెక్ డెవలపర్స్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్, ఒబెరాయ్ రియలీ్ట, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పురవంకర, శోభ, సన్‌టెక్ రియాలిటీ సంస్థలను పెద్ద సంస్థలుగా పేర్కొంది. (రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ) -
ఏం కొంటాంలే! తగ్గుముఖం పట్టిన ఇళ్ల కొనుగోళ్లు..
భారత్‌లో పండుగల సీజన్లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. పండుగ త్రైమాసికంలో (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు) తీసుకున్న గృహ రుణాల విలువ ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా తగ్గుముఖం పట్టడంతో ఇది స్పష్టమవుతోంది. మరోవైపు ఇదే కాలంలో ఆటో, ద్విచక్ర వాహనాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, వ్యక్తిగత రుణాలు స్థిరమైన వృద్ధిని సాధించగా, గృహ రుణాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. వాహన రుణాల్లో గణనీయ వృద్ధి క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరం పండుగ సీజన్ అయితే మూడో త్రైమాసికం విలువ, పరిమాణం రెండింటిలోనూ ఆటో, ద్విచక్ర వాహన రుణాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే, ఈ కాలంలో గృహ రుణాలు 2. 6 శాతం తగ్గిపోయాయి. ఇది ఇటీవలి సంవత్సరాలలో గృహ రుణాలకు సంబంధించి అత్యంత నిరాశాజనక పండుగ త్రైమాసికం. అయితే గృహ రుణాల తగ్గుదలకు వడ్డీ రేట్ల పెరగడం కారణంగా భావించవచ్చు. వాహన రుణాలు ఆరిజినేషన్స్ (విలువ)లో 24 శాతం పెరుగుదలను ప్రదర్శించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇవి రూ.60,900 కోట్లు ఉండగా 2023 ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.75,500 కోట్లకు పెరిగాయి. అదేవిధంగా ద్విచక్ర వాహన రుణాలు 34. 5 శాతం వృద్ధిని సాధించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.17,100 కోట్ల నుంచి 2023 ఆర్థికేడాది మూడో త్రైమాసికానికి రూ.23,000 కోట్లకు పెరిగాయి. పర్సనల్ లోన్ విభాగం కూడా 20. 2 శాతం వృద్ధిని సాధించింది. 2022 ఆర్థిక ఏడాది క్యూ3లో రూ.1,58,500 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,90,500 కోట్లకు చేరుకుంది. We today announced the second edition of the How India Celebrates Report on Festive Lending in India. Discover key trends and insights into major consumer lending products. Get the full report at: https://t.co/9cSuZdbuSW#CRIF #HowIndiaCelebrates #FestiveLoans #Insights pic.twitter.com/6DOu8jkGJh — CRIF India (@CRIF_India) June 14, 2023 -
34 లక్షల మందికి ఇంటి రుణాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు 2022లో దేశవ్యాప్తంగా 34 లక్షల మందికి ఇంటి రుణాలను మంజూరు చేశాయి. వీటి విలువ రూ.9 లక్షల కోట్లు. రిటైల్ రుణాలపై ఈక్విఫ్యాక్స్, ఆండ్రోమీడియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రూ.25 లక్షల లోపు ఇంటి లోన్ అందుకున్నవారి సంఖ్య గతేడాది ఏకంగా 67 శాతం ఉండడం గమనార్హం. రూ.75 లక్షలు–రూ.1 కోటి వరకు తీసుకున్న లోన్లు 36 శాతం అధికం అయ్యాయి. 2021తో పోలిస్తే హోమ్ లోన్స్ 2022లో 18 శాతం ఎగశాయి. అలాగే ఈ రుణాలు అందుకున్నవారి సంఖ్య 17 శాతం పెరిగింది. 2021 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు మొత్తం గృహ రుణాలు 16 శాతం అధికం అయ్యాయి. వ్యక్తిగత రుణాల్లో 57 శాతం వృద్ధి నమోదైంది. రిటైల్ రుణ మార్కెట్ విలువ 2022 డిసెంబర్ నాటికి రూ.100 లక్షల కోట్లకు చేరింది. 54 కోట్ల యాక్టివ్ లోన్లు ఉన్నాయి. గతేడాది చివరినాటికి గృహోపకరణాల కోసం రుణాలు అందుకున్న యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 6.5 కోట్లు. 2021తో పోలిస్తే ఇది 48 శాతం అధికం. హోమ్ లోన్స్ విభాగంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆరోగ్యకర వృద్ధిని నమోదు చేశాయి. వినియోగం పెరగడం, సులువుగా లభ్యత, రుణదాతల మధ్య పోటీ వ్యక్తిగత రుణ విభాగం డిమాండ్‌కు కారణం. ఇటీవల ఆర్బీఐ పాలసీ రేటు పెంపుదల ఉన్నప్పటికీ గృహ రుణ రేట్ల మాదిరిగా వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు పెరుగుదలను చూడలేదు. -
లెక్క ఎక్కువైనా పర్లేదు..మాకు కాస్ట్లీ ఇళ్లే కావాలి!
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగితే అది తమ భవిష్యత్తు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని 96 శాతం మంది కొనుగోలుదారులు (ఇల్లు కొనాలని అనుకుంటున్నట్టు) చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్, సీఐఐతో కలసి దీనిపై ఓ సర్వే నిర్వహించింది. ‘ద హౌసింగ్ మార్కెట్ బూమ్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటుని 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. ఇటీవలి ఏప్రిల్ సమీక్షలో మాత్రం రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 80 శాతం మంది తమకు ధరలు ముఖ్యమైన అంశమని చెప్పారు. ఒకవైపు నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు పెరిగిన ఫలితంగా ప్రాపర్టీల ధరలకు సైతం రెక్కలు రావడం తెలిసిందే. దీనికి తోడు గృహ రుణాలపై రేట్లు 2.5 శాతం మేర పెరగడం భారాన్ని మరింత పెరిగేలా చేసింది. విశాలమైన ఇంటికే ప్రాధాన్యం.. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో పెద్ద మార్పు కనిపించలేదు. 42 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 40 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు అనుకూలంగా ఉండగా, 12 శాతం మంది ఒక్క పడకగది ఇంటి కోసం చూస్తున్నారు. 6 శాతం మంది అయితే 3బీహెచ్‌కే కంటే పెద్ద ఇళ్లను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది తాము రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధరలో ఇంటిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసుకునే ఇంటికే తాము ప్రాధాన్యం ఇస్తామని 36 శాతం మంది తెలిపారు. దేశ రాజధాని ప్రాంత పరిధిలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో 45 శాతం మంది 3బీహెచ్‌కే తీసుకోవాలని అనుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 42 శాతం మంది ఎంపిక 2బీహెచ్కేగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉండడం కొనుగోలు ప్రాధాన్యతల్లో మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 52 శాతం మంది సొంత వినియోగానికేనని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల ప్రభావం ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశీయ హౌసింగ్ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి అన్నారు. మొత్తం మీద ఇళ్ల డిమాండ్‌లో రేట్ల పెంపు ఒక భాగమేనని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్దా, చిన్న కంపెనీల్లో ఉద్యోగాల కోతలు సైతం ఇళ్ల కొనుగోలు డిమాండ్‌పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవచ్చన్నారు. 2024–25 నాటికి అన్ని సమస్యలు సమసిపోయి, హౌసింగ్ మార్కెట్ తిరిగి బలంగా పుంజు కుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ జట్టు
ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ (ఎస్హెచ్ఎఫ్ఎల్) సంస్థలు చేతులు కలిపాయి. యూబీ కో.లెండ్ ప్లాట్‌ఫాం ద్వారా రుణాలు ఇచ్చేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దీనితో చిన్న, మధ్య తరహా సంస్థలకు అలాగే గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లోని మధ్య.. అల్పాదాయ వర్గాలకు గృహ రుణాలు అందించనున్నాయి. ఆర్థిక రంగంలో యాక్సిస్ బ్యాంక్, లోన్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో ఎస్హెచ్ఎఫ్ఎల్ అనుభవాలు.. రుణ గ్రహీతల ప్రొఫైల్‌ను మదింపు చేసి, రుణాలు ఇచ్చేందుకు ఉపయోగపడగలవని ఇరు సంస్థలు తెలిపాయి. ఎంఎస్ఎంఈలు, అఫోర్డబుల్ హోమ్ సెగ్మెంట్లలో విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మునీష్ షర్దా, ఎస్హెచ్ఎఫ్ఎల్ ఎండీ రవి సుబ్రమణియన్ తెలిపారు. -
నెలవారీ చెల్లింపులు మరింత భారం
ముంబై: వరుసగా ఐదో విడత ఆర్బీఐ కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ఇది విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉంది. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు ఈ మేరకు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే గృహ రుణాలపై ఈఎంఐలు 23 శాతం వరకు పెరిగినట్టయింది. ఈ భారం ఎలా ఉంటుందంటే 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్న వారిపై ఈఎంఐ 17 శాతం, 30 ఏళ్ల కాలానికి తీసుకున్న వారిపై 23 శాతం మేర (8 నెలల్లో) ఈఎంఐ పెరిగినట్టయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందన్న గత అంచనాను ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఎంపీసీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తమ చర్యలు వేగంగా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చారు. వృద్ధి అంచనాలకు కోత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని తాజాగా ఆర్బీఐ అంచనా వేసింది. గత అంచనా 7 శాతంతో పోలిస్తే కొంత తగ్గించింది. అంతేకాదు ఇలా వృద్ధి అంచనాలను తగ్గించడం ఇది మూడోసారి. పలు అంతర్జాతీయ ఏజెన్సీలు, రేటింగ్ సంస్థలు సైతం భారత్ వృద్ధి అంచనాలను దిగువకు సవరించడం తెలిసిందే. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మాంద్యం, కఠినంగా మారుతున్న ద్రవ్య పరిస్థితులను వృద్ధికి ప్రతికూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపైనా వీటి రిస్క్ ఉంటుందన్నారు. అయినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును చూపిస్తోందంటూ, ప్రపంచంలో భారత్ చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మరోసారి గుర్తు చేశారు. డిసెంబర్‌తో (క్యూ3) ముగిసే త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి–మార్చి (క్యూ4)లో 4.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 7.1 శాతం, క్యూ2లో 5.9 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. రబీ సాగు బాగుండడం, అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగడం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ మెరుగుపడడం, తయారీ, సేవల రంగాల్లో పునరుద్ధానం సానుకూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుంది.. మార్చి త్రైమాసికంలో నిర్దేశిత 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగొస్తుంది. ద్రవ్యోల్బణానికి సంబంధించి గడ్డు పరిస్థితులు ఇక ముగిసినట్టే. రేటు పెంపు తక్కువగా ఉండడం అన్నది ధరలపై పోరాటం విషయంలో మేము సంతృప్తి చెందినట్టు కాదు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుంది. ఇక ఆర్బీఐ ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లావాదేవీలను రిటైల్, హోల్‌సేల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నాయి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ పాలసీలోని ఇతర అంశాలు ►ఆరుగురు సభ్యుల ఎంపీసీలో 0.35 శాతం రేటు పెంపునకు ఐదుగురు ఆమోదం తెలిపారు. ►సర్దుబాటు విధాన ఉపసంహరణను ఆర్బీఐ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ►ఆర్బీఐ రెండేళ్ల విరామం తర్వాత రేట్లను ఈ ఏడాది మే నెలలో తొలిసారి సవరించింది. మేలో 0.40 శాతం పెంచగా, జూన్ సమీక్షలో అర శాతం, ఆగస్ట్‌లో అర శాతం, సెప్టెంబర్ సమీక్షలోనూ అర శాతం చొప్పున పెంచుతూ వచ్చింది. ►యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ‘సింగిల్ బ్లాక్, మల్టీ డెబిట్స్’ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఈ కామర్స్, సెక్యూరిటీల్లో పెట్టుబడుల చెల్లింపులు సులభతరం అవు తాయని పేర్కొంది. అంటే కస్టమర్ ఒక ఆర్డర్‌కు సంబంధించిన మొత్తాన్ని తన ఖాతాలో బ్లాక్ చేసుకుని, డెలివరీ తర్వాత చెల్లింపులు చేయడం. ►భారత నియంత్రణ సంస్థల విశ్వసనీయతను అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రేట్ల పెంపు స్పీడ్ తగ్గినట్టే ఆర్బీఐ పాలసీ ప్రకటన మా అంచనాలకు తగ్గట్టే ఉంది. విధానంలోనూ మార్పులేదు. ప్రకటన కొంచెం హాకిష్‌గా (కఠినంగా) ఉంది. రేట్ల పెంపు సైకిల్ ముగిసిందనే సంకేతాన్ని ఇవ్వలేదు. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2022–23 సంవత్సరానికి 6.7 శాతం వద్ద కొనసాగించడం, సీక్వెన్షియల్‌గా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న అంశాలు తెరముందుకు వచ్చాయి. ఇదే ధోరణి స్థిరంగా ఉంటూ, ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకునేందుకు దారితీస్తుందా అన్నది చూడాలి. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ రెపో రేటు ఏ మాత్రం పెంచినా ఆ ప్రభావం అంతిమంగా వినియోగదారుడిపై, గృహ కొనుగోలుదారులపై పడుతుంది. బ్యాంకులు రేట్ల పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. దీంతో స్వల్పకాలంలో ఇది కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తుంది. – హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
హరిత గృహ రుణాలపై ఐఐఎఫ్ఎల్: వారికి ప్రత్యేక డిస్కౌంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణానికి అనుకూలమైన, హరిత గృహాల ప్రాజెక్టులకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ జోనల్ హెడ్ (ఏపీ, తెలంగాణ, తమిళనాడు) శ్రీనివాసరావు రేకపల్లి తెలిపారు. నిర్దిష్ట నిబంధనలను పాటించే డెవలపర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తున్నట్లు వివరించారు. అటు కీలక వ్యాపార విభాగమైన అఫోర్డబుల్ ఇళ్లకు సంబంధించి మరిన్ని రుణాలు అందించేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. 2022 మార్చి ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 25,300 కుటుంబాలకు రుణాలు అందించామని .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 50, తెలంగాణలో 35శాఖలు ఉన్నాయన్నారు. కొత్తగా ఏపీలో మరో 10, తెలంగాణలో 15 శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. -
సొంత ఇల్లు కోరుకుంటున్నారు
న్యూఢిల్లీ: దేశంలో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరాల్లో గృహాలకు డిమాండ్ బలంగా ఉంటుందని హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ తెలిపింది. అధికంగా ఉన్న యువత, వారి ఆర్థిక శక్తి సామర్థ్యాల పురోగతి, గృహ రుణాలపై సాపేక్షంగా కొనుగోలుదారులు తక్కువ ఆధారపడటం వంటి అంశాలు ఇందుకు కారణమని సంస్థ ఎండీ విపుల్ రూంగ్తా శుక్రవారం తెలిపారు. రుణం తీసుకోకుండానే మూడింట ఒక వంతు గృహాలు అమ్ముడవుతున్నాయని చెప్పారు. గత ఆరు నెలల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు కఠినతరం అయినప్పటికీ భారతదేశ గృహ మార్కెట్ బలమైన డిమాండ్‌ను సాధిస్తోందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో భాగంగా ఈ ఏడాది మే నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 190 బేసిస్ పాయింట్లు పెంచిందని గుర్తుచేశారు. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి 8 శాతానికిపైగా ఎగశాయని తెలిపారు. పెరిగినా, తగ్గినా కొంటారు.. మధ్య, తక్కువ ఆదాయ గృహాలు మాత్రమే కాకుండా ప్రీమియం, అల్ట్రా–ప్రీమియం విభాగంలో కూడా విపరీతమైన డిమాండ్ ఉండబోతోందని విపుల్ అన్నారు. సొంత ఇంటిని కలిగి ఉండాలన్న తపన ప్రజల్లో పెరుగుతోందని వివరించారు. ‘భారతదేశంలో గృహ యజమానుల సగటు వయస్సు 37 సంవత్సరాలు. దేశంలో మూడింట రెండు వంతుల మంది ఇప్పటికీ 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. కాబట్టి చాలా స్పష్టంగా, తీవ్రమైన డిమాండ్ ఉండబోతోంది. నిర్మాణ సంస్థలు సద్వినియోగం చేసుకోవాలి. కస్టమర్లు వడ్డీ రేటు తగ్గితేనే ఇల్లు కొనాలని చూడడం లేదు. వడ్డీ పెరిగినంత మాత్రాన కొనుగోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవట్లేదు. ఇంటి విలువలో రుణ భాగం 68 శాతం మించడం లేదు. అంటే 30–32 శాతం మొత్తాన్ని సొంత నిధులను సమకూరుస్తున్నారు. భారతదేశంలో ఉన్న తనఖాల విలువ దాదాపు రూ.24,66,000 కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో 11 శాతం’ అని ఆయన అన్నారు. -
ఫెస్టివ్ బొనాంజా: హోం లోన్లపై ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఆఫర్స్
ముంబై: ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 1.9 శాతం మేర పెంచడంతో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. అయినప్పటికీ పండుగల దృష్ట్యా ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ తక్కువ రేటుకే గృహ రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఎస్బీఐ పావు శాతం మేర గృహ రుణాలపై రేటు తగ్గింపును అందిస్తున్నట్టు ప్రకటించింది. 2023 జనవరి 31 వరకు తీసుకునే గృహ రుణాలపై 8.40 శాతం రేటు అమలవుతుందని తెలిపింది. (Jio True 5G: అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు) ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. టాపప్ లోన్లపైనా 0.15 శాతం తక్కువ రేటును ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. తన గృహ రుణాల విలువ రూ.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటినట్టు వెల్లడించింది. పరిశ్రమలో ఈ మార్క్‌ను సాధించిన తొలి సంస్థగా పేర్కొంది. గృహ రుణాల్లో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ అయిన హెచ్డీఎఫ్సీ సైతం 0.20% తక్కువగా, 8.40శాతం కే గృహ రుణాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. పండుగ ఆఫర్ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని హెచ్డీఎఫ్సీ తన వెబ్సైట్లో పేర్కొంది. కనీసం 750 క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 8.40శాతం రేటు వర్తిస్తుందని తెలిపింది. జూన్ నాటికి గృహ రుణాల విలువ రూ.5.36 లక్షల కోట్లుగా ప్రకటించింది. (5జీ కన్జ్యూమర్ సేవల్లోకి రావడం లేదు) -
గృహ రుణాలకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: గృహ రుణాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో బ్యాంకుల పుస్తకాల్లో గృహ రుణాలు రెట్టింపై రూ.16.85 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనూ (ఏప్రిల్–ఆగస్ట్ వరకు) గృహ రుణాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఆర్బీఐ 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. సెప్టెంబర్‌లోనూ అర శాతం మేర పెంచడం గమనార్హం. 2016–17 నాటికి బ్యాంకుల నుంచి గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.8,60,086 కోట్లుగా ఉండగా, 2022 మార్చి నాటికి రూ.16,84,424 కోట్లకు వృద్ది చెందింది. రేట్ల పెంపు ప్రభావం ఉండదు.. వడ్డీ రేట్ల అన్నవి ముఖ్యమైనవే అయినప్పటికీ.. అవి గృహ కొనుగోలుకు అవరోధం కాదని, రుణ గ్రహీతల ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తు ఆదాయ అంచనాలపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గృహ రుణ కాలంలో (15–20 ఏళ్లు) వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం అన్నది సాధారణ ప్రక్రియగా ఇన్వెస్టర్లలోనూ అవగాహన పెరుగుతుండడాన్ని ప్రస్తావించాయి. రుణాలపై ఇళ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంటి ధర కీలకం అవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ట్గేజ్, రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి పేర్కొన్నారు. ‘‘గృహ రుణం అన్నది దీర్ఘకాలంతో ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయని కస్టమర్లకూ తెలుసు. దేశంలో సగటు వేతన పెంపులు 8–12 శాతం మధ్య ఉంటున్నందున పెరిగే రేట్ల ప్రభావాన్ని వారు తట్టుకోగలరు’’అని సోలంకి అభిప్రాయపడ్డారు. ప్రణాళిక మేరకే.. వడ్డీ రేట్ల పెంపు గృహ రుణాల డిమాండ్‌పై పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ రేణు సూద్ కర్నాడ్ సైతం పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు అన్నది మిగిలిన ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య చర్చించిన తర్వాతే, ప్రణాళిక మేరకు ఉంటుందన్నారు. కారు, కన్జ్యూమర్ రుణాల మాదిరిగా కాకుండా, 12–15 ఏళ్లు, అంతకుమించి కాల వ్యవధితో ఉండే గృహ రుణాలపై ఫ్లోటింగ్ రేట్లు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు. ‘‘కనుక వడ్డీ రేట్ల పెంపు వారి నగదు ప్రవాహాలపై తక్కువ ప్రభావమే చూపిస్తుంది. సాధారణంగా 12–15 ఏళ్ల కాలంలో రెండు మూడు విడతల్లో రేట్ల పెంపు ఉండొచ్చు. దీర్ఘకాలంలో రేట్లు దిగొస్తాయని వినియోగదారులకు సైతం తెలుసు’’అని కర్నాడ్ పేర్కొన్నారు. ఇళ్లకు డిమాండ్ చక్కగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ‘‘ఇళ్ల విక్రయాలు బలంగా కొనసాగుతున్నాయి. 2022 చివరికి దశాబ్ద గరిష్టానికి చేరుకుంటాయి. స్థిరమైన ధరలకుతోడు, పండుగల డిమాండ్, గృహ రుణాలపై తక్కువ రేట్లు (గతంలోని 10–11 శాతంతో పోలిస్తే) సానుకూలతలు’’అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ వివరించారు. కాకపోతే అదే పనిగా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే ఈఎంఐ పెరిగి, సెంటిమెంట్‌కు విఘాతం కలగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87 శాతం పెరిగి.. 2,72,709 యూనిట్లు అమ్ముడైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. -
ఆ లోన్ తీసుకున్నవారికి భారీ షాక్.. .. ప్చ్, ఈఎంఐ మళ్లీ పెరిగింది!
దేశంలో ద్రవ్యోల్పణాన్ని కట్టడి చేసేందుకు ఇటీవల ఆర్బీఐ రెపో రేటుని పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచే పనిలో పడ్డాయి. తాజాగా ప్రముఖ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. హోమ్ లోన్స్‌పై ఉన్న రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ రుణాల బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. కాగా పెంచిన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు ఆగస్టు 9 నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ నెలలో ఇది రెండవ పెంపు కావడం గమనార్హం. మూడు నెలల్లో హెచ్‌డిఎఫ్‌సి చేపట్టడం ఇది ఆరోసారి. మే 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం రేటు 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో గృహ రుణాలు తీసుకున్న కస్టమర్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. మే నుంచి ఆర్బీఐ ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్ల పెంపుదలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరోసారి సెప్టెంబరుతో పాటు డిసెంబర్లో కూడా ఆర్బీఐ సమావేశం కానుంది. ఏది ఏమైనా భారం మాత్రం తప్పట్లేదని సామన్య ప్రజలు వాపోతున్నారు. మూడు నెలల కాలంలోనే ఆర్పీఎల్ఆర్ (RPLR) చాలా అధికంగా పెరగడంతో హోం లోన్స్ తీసుకున్న వారు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు? -
హోం లోన్ తీసుకున్నవారికి మరో భారీ షాక్ తప్పదా? ఏం చేయాలి?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం (ఎంపీసీ) ఆగస్టు 3 బుధవారం ప్రారంభం కానుంది. అయితే రెపో రేటు బాదుడు తప్పదనే అంచనాల మధ్య హోం లోన్ రేట్లు ఎంత పెరుగుతాయోననే ఆందోళన వినియోగదారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ద్రవ్యోల్బణానికి చెక్ చెప్పేలా ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపో రేటును పెంచే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాలు, ఇటు నిపుణులు భావిస్తున్నారు. (నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ) ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ తాజా రివ్యూలో రెపో రేట్లను పెంచే అవకాశాలపైనే ఎక్కువ అంచనాలు కనిపిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపు 35-50 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. అంచనాలకనుగుణంగా రెపో రేటు పెరిగితే, అనివ్యారంగా బ్యాంకులు కూడా మొత్తం రేటు పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. రెపో రేటు పెరిగితే ఆర్బీఐకి బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్ల మీదే వేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంటిలోన్లపై భారం తప్పదు. ఉదా: రూ. 50 లక్షల రుణం, 7.65 శాతం వడ్డీతో 20 సంవత్సరాల కాలవ్యవధితో ఉన్న లోన్‌పై వడ్డీ రేటు 0.50 శాతం పెంచితే, వడ్డీ రేటు 8.15కి పెరుగుతుంది అనుకుంటే, రుణ వ్యవధిని రెండేళ్లు పొడిగింపు ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే లోన్ కాలం రెండేళ్లు పొడిగించడంతో ఖచ్చితంగా రూ. 10.14 లక్షలు అదనపుభారం తప్పదు. ఒకవేళ చెల్లించాల్సిన కాలం కాకుండా, ఈఎంఐ భారాన్ని పెంచుకుంటే.. ఉదా: 20 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 50 లక్షల రుణంపై, వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని భావిస్తే.. మునుపటి ఈఎంఐ రూ. 40,739తో పోలిస్తే రూ. 42,289 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటి రుణం తీసుకున్న వారు ఏ సిస్టంలో ఉన్నారో చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం ఈఎంఐ పెంచుకోవడమా, కాల వ్యవధిని పెంచుకోవడమా అనేది రుణగ్రహీత జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇప్పటికే లోబడ్జెట్‌లో ఉండి ఉంటే పొదుపు, ఖర్చులపై దెబ్బపడకుండా లోన్ టెన్యూర్‌ను లేదా ఈఎంఐని పెంచుకోవడంమంచిది. అలాగే ఏ ఆప్షన్ ఎంచుకన్నా, దీర్ఘకాలిక రాబడి, భవిష్యత్తు అవసరాలకోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని పాలసీ కమిటీ మూడు రోజుల పాటు సమావేశం కానుంది. పాలసీ విధానాన్ని శుక్రవారం (ఆగస్టు 5న) ప్రకటించనుంది. అయితే ఈ సారి రివ్యూలో కూడా రేటు పెంపు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ మే 4, 2022 నుండి రెపో రేటును 0.9 శాతం పెంచింది. ఫలితంగా 6.72 శాతం వద్ద గృహ రుణం తీసుకున్న వారు ఇప్పుడు 7.62 శాతం చెల్లించాల్సి వస్తోంది. గత రెండు మానిటరీ పాలసీ సమావేశాల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇటీవల అమెరికా ఫెడ్ రికార్డు స్థాయిలో 75 బేసిస్ పాయింట్లు రేట్లు పెంచింది. అలాగే ఆ తరువాత కూడా పెంపు ఉంటుందనే సంకేతాలు అందించింది. -
Repo rate rise: రేట్లకు రెక్కలు.. ఏం చేద్దాం?
ఈ ఏడాది ఏప్రిల్ వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు 6.5 శాతం. ఇళ్ల కొనుగోలుదారులను ఈ రేటు ఎంతో ఆకర్షించింది. కనిష్ట రేటును చూసి ఇళ్లను కొనుగోలు చేసిన వారు ఎందరో..? పాశ్చాత్య దేశాల మాదిరే మన ఆర్థిక వ్యవస్థ కూడా తక్కువ రేట్ల దిశగా అడుగులు వేస్తుందన్న విశ్లేషణలు అంతకుముందు వరకు వినిపించాయి. కానీ, కేవలం కొన్ని నెలల్లోనే పరిస్థితులు మారిపోయాయి. రుణ రేట్లు సుమారు ఒక శాతం మేర పెరిగాయి. ఆర్బీఐ రెపో రేటును 0.90 శాతం మేర పెంచింది. ఇది కచ్చితంగా రుణ గ్రహీతలపై భారం మోపేదే. రేట్ల పెంపు కథ ఇంతటితో ముగియలేదు. ఇప్పుడే మొదలైంది. మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ తరుణంలో రేట్ల పెంపు ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది..? గృహ రుణాలు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి..? తీసుకోబోయే వారి ముందున్న మార్గాలు ఏంటన్న విషయాలను చర్చించే కథనమే ఇది. 80 శాతం రిటైల్ రుణాలు ఫ్లోటింగ్ రేటు ఆధారితంగానే ఉంటున్నాయి. కనుక ఆర్బీఐ రేట్ల సవరణ ప్రభావం దాదాపు అన్ని రకాల రిటైల్ రుణాలపైనా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా ఈబీఎల్ఆర్ను గృహ రుణాలను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టిందేనని గుర్తు పెట్టుకోవాలి. రిటైల్ రుణాల్లో సగానికి పైన గృహ రుణాలే ఉన్నాయి. కనుక బ్యాంకులు వేగంగా గృహ రుణ రేట్లను సవరించాయి. కారు, ద్విచక్ర వాహన రుణాలపైనా అదనపు భారం పడింది. అయితే ఈ విభాగంలోని మొత్తం రుణాల్లో ఈబీఎల్ఆర్కు అనుసంధానమై ఉన్నవి 40 శాతం కంటే తక్కువ. ఈ తరహా రుణాలకు ఈబీఎల్ఆర్ కంటే ముందు విధానమైన ఎంసీఎల్ఆర్నే బ్యాంకులు అనుసరిస్తున్నాయి. బ్యాంకులు రెపో మాదిరే గృహ రుణాలపై 0.90 శాతం పెంపును అమలు చేయగా.. ఇతర రుణ ఉత్పత్తులపై పెంపు వాటి విచక్షణకు అనుగుణంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకు కారు రుణంపై రేటును 7.45 శాతం నుంచి 8.5 శాతానికి పెంచగా.. ఎస్బీఐ 7.2 శాతం నుంచి 7.7 శాతానికి సవరించింది. ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్ వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ఉన్నాం. కనుక గృహ రుణం తీసుకునే వారు డౌన్ పేమెంట్ (తన వంతు వాటా) ఎక్కువ సమకూర్చుకోవడం ఒక మార్గం. ఎక్కువ సమకూర్చుకునేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు ‘హోమ్‌లోన్ ఇంటరెస్ట్ సేవర్ అకౌంట్’ లేదా ‘స్మార్ట్లోన్’ను పరిశీలించొచ్చు. ఒక్కో బ్యాంకు ఒక్కో పేరుతో ఈ తరహా రుణాలను మార్కెట్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ‘మనీ సేవర్ హోమ్ లోన్’, ఎస్బీఐ ‘మ్యాక్స్ గెయిన్ హోమ్‌లోన్’, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ‘హోమ్ సేవర్’ అనేవి ఈ తరహా రుణ ఉత్పత్తులే. రెండు ప్రయోజనాలు.. ఈ రుణం కరెంటు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. మీ దగ్గర ఉన్న మిగులు బ్యాలన్స్ ఎంతైనా కానీయండి ఈ కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకుంటే చాలు. ఆ మేరకు రుణంపై వడ్డీ భారం తగ్గిపోయినట్టే. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల గృహ రుణాన్ని ఇంకా చెల్లించాల్సి ఉందనుకుంటే.. రూ.5 లక్షలు మిగులు మీ వద్ద ఉంటే దాన్ని కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకోవాలి. అప్పుడు గృహ రుణం రూ.45 లక్షలపైనే వడ్డీ పడుతుంది. మరొక ప్రయోజనం ఏమిటంటే.. మిగులు రూ.5లక్షలను కరెంటు ఖాతా నుంచి ఎప్పుడైనా వెనక్కి తీసేసుకోవచ్చు. కనుక మిగులు నిల్వలను ఈ ఖాతాలో ఉంచుకోవడం ద్వారా గృహ రుణంపై వడ్డీ భారాన్ని కొంత దింపుకోవడం ఇందులో ఉన్న అనుకూలత. మంచి మార్గం అందరూ కాకపోయినా.. కొందరు అయినా అత్యవసర నిధి అంటూ కొంత మొత్తాన్ని నిర్వహిస్తుంటారు. కొందరు బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఉంచేస్తుంటారు. లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టేవారు కూడా ఉన్నారు. ఇలా ఉంచేయడానికి బదులు ఆ మొత్తాన్ని తీసుకెళ్లి హోమ్‌లోన్ ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్లో ఉంచుకోవడం మంచి మార్గమని ఆర్థిక సలహాదారుల సూచన. మిగులు నిల్వలు ఏవైనా కానీ ఈ ఖాతాలో ఉంచుకోవడం వల్ల వడ్డీ భారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చని లాడర్7వెల్త్ ప్లానర్స్ ప్రిన్సిపల్ ఆఫీసర్ సురేష్ సెడగోపన్ సూచించారు. వడ్డీ రేటు వేరు సాధారణ గృహ రుణాలతో పోలిస్తే,, ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌తో కూడిన రుణాలపై వడ్డీ రేటు 0.5–0.6 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మిగులు నిల్వలు లేని వారికి ఇదేమంత ప్రయోజనం కాదు. వేతన జీవులు, వ్యాపారులు సాధారణంగా తమ అవసరాల కోసం మిగులు నిల్వలు ఎంతో కొంత నిర్వహిస్తుంటారు. అటువంటి వారికి ఈ తరహా రుణం అనుకూలం. వడ్డీ ఆదా/ముందస్తు చెల్లింపు ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌కు బదులు రెగ్యులర్ హోమ్ లోన్ తీసుకుని.. మధ్య మధ్యలో తమకు బోనస్, ఇతర రూపాల్లో అందిన నిధులతో ముందస్తు గృహ రుణం చెల్లింపు మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా కూడా అదనపు రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు. కానీ, మిగులు నిల్వలు ఎప్పుడూ ఎంతో కొంత ఉండే వారికి.. వాటిని రాబడి మార్గంగా మలుచుకోవడం తెలియని వారికి ఇంట్రెస్ట్ సేవర్ హోమ్ లోన్ అకౌంట్ మెరుగైన మార్గం అవుతుంది. అయితే, కొన్ని బ్యాంకులే ఈ ఉత్పత్తిని ఆఫర్ చేస్తున్నాయి. ఆయా అంశాలపై ఈ విభాగంలోని నిపుణులు, బ్యాంకర్ల సలహాలను తీసుకోవాలి. ఈఎంఐ పెరుగుదల..? రూ.75 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలవ్యవధిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.5 శాతం రేటు మీద తీసుకుని ఉన్నారనుకుంటే.. నెలవారీ ఈఎంఐ రూ.55,918 అవుతుంది. గృహ రుణ రేటు 7.3 శాతానికి పెరిగిందని అనుకుంటే ఈఎంఐ రూ.59,506 అవుతుంది. సుమారు రూ.4,500 పెరిగింది. అది కూడా క్రెడిట్ స్కోరు 791కి పైన ఉన్నవారికే ఇది. 681 నుంచి 790 మధ్య క్రెడిట్ స్కోరు ఉన్న వారికి వడ్డీ రేటు 7.65 శాతం నుంచి 7.9 శాతం వరకు చేరింది. ఈ రేటు ప్రకారం చూస్తే రూ.75 లక్షల గృహ రుణం ఈఎంఐ రూ.55,918 నుంచి రూ.61,109–62,267కు పెరిగినట్టు అవుతుంది. ఏడాదికి చూసుకుంటే వడ్డీ పెంపు వల్ల పడుతున్న అదనపు భారం రూ.46,000–73,000 మధ్య ఉంది. ప్రత్యామ్నాయాలు.. ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారు ఈఎంఐ పెరగడకుండా ఉండేందుకు రుణ కాలవ్యవధిని పెంచుకోవచ్చు. నిజానికి చాలా బ్యాంకులు ఈఎంఐ పెంపునకు బదులు వాటంతట అవే రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. రుణ కాలవ్యవధి ఎంత మేర పెరుగుతుందన్న దానికి ఒక సూత్రం ఉంది. 20 ఏళ్ల కాలానికి గృహ రుణాన్ని తీసుకుని ఉంటే.. తీసుకునే నాటి రేటుపై ప్రతి పావు శాతం పెంపునకు 10 నెలల మేర కాలవ్యవధి పెరుగుతుంది. 6.5 శాతం రేటుపై గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకుని ఉన్నారనుకుంటే.. 0.90 శాతం రేటు అధికం కావడం వల్ల రుణ కాలవ్యవధి సుమారు మూడేళ్లపాటు పెరుగుతుంది. మరో 0.75శాతం మేర ఈ ఆర్థిక సంవత్సరంలో రేటు పెరుగుతుందని అనుకుంటే.. ఈఎంఐ ఇప్పటి మాదిరే ఉండాలనుకుంటే రుణ కాలవ్యవధి 5.5 ఏళ్లు పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈఎంఐ భారం కాకూడదు, రుణ కాలవ్యవధి పెరగొద్దు అనుకుంటే రుణ గ్రహీతల ముందున్న మరో మార్గం ఒకే విడత కొంత మొత్తం గృహ రుణాన్ని చెల్లించడమే. ఒకవేళ గృహ రుణం ముగియడానికి ఇంకా చాలా వ్యవధి ఉంటే, అప్పుడు పలు విడతలుగా కొంత మొత్తం చొప్పున ఈఎంఐకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం కాల వ్యవధి చివర్లో ఉంటే.. పెరిగిన మేర ఈఎంఐను కడుతూ వెళ్లాలి. లేదంటే పొదుపు, పెట్టుబడులు ఉంటే వాటితో గృహ రుణాన్ని కొంత చెల్లించేయాలి. కానీ, ఇక్కడ చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడం వల్ల పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి రావచ్చు. కనుక పన్ను పరిధిలో ఉన్న వారు లెక్కలు వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మిగులు నిల్వలు ఉంటే వాటిని గృహ రుణంగా తీర్చివేయడం కంటే పెట్టుబడి ద్వారా ఎక్కువ రాబడి వచ్చే మార్గం ఉంటే దాన్ని కూడా కోల్పోవాల్సి రావచ్చు. కనుక ఈ కోణాల నుంచి పరిశీలించాకే ఈ నిర్ణయానికి రావాలి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు రుణాన్ని పరిశీలించొచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఫిక్స్డ్ రేటుపై గృహ రుణాలను 9.6 శాతం రేటుకు ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అయితే ఇది 11.5 శాతం మేర ఉంది. కాకపోతే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి ఫ్లోటింగ్ రేటుపై రుణమే నయం. 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు 8.15 శాతం! గతంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించినా, పెంచినా ఆ ప్రభావం రుణాలపై ప్రతిఫలించడానికి కొన్ని నెలలు పట్టేది. దీన్ని గమనించిన ఆర్బీఐ.. రేట్ల సవరణ సత్వరం అమలయ్యేందుకు వీలుగా.. 2019లో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును (ఈబీఎల్ఆర్) ప్రవేశపెట్టింది. దీంతో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే బ్యాంకులు కూడా సవరణ చేయక తప్పని పరిస్థితి. రెపో రేటు, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఇవన్నీ ఈబీఎల్ఆర్కు ప్రామాణికం. ఆర్బీఐ నూతన విధానం నేపథ్యంలో చాలా వరకు గృహ రుణాలకు రెపో రేటు ప్రామాణికంగా మారిపోయింది. ఈ విధానం కారణంగానే 2020లో రెపో రేటు 4% కనిష్టానికి తగ్గిపోవడం వల్ల రుణ గ్రహీతలు ప్రయోజనం పొందారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపు తప్పిన క్రమంలో మళ్లీ రేట్ల పెంపు ప్రభావం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే మరో 0.75 శాతం మేర ఆర్బీఐ రేట్లను పెంచుతుందని విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తక్కువలో తక్కువ గృహ రుణ రేటు 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా రేట్లను పెంచితే 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు ఎంత లేదన్నా 8.15 శాతానికి చేరుతుంది. 2019లోనూ 8 శాతం స్థాయిలోనే గృహ రుణ రేట్లు ఉన్నాయి. -
SBI: ఇళ్లు కట్టాలంటే ఇబ్బందే.. హోంలోన్స్‌పై వడ్డీరేట్ల పెంపు
ముంబై: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై కనీస వడ్డీ రేట్లను 7.55 శాతానికి పెంచింది. బుధవారం నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రెపో రేటు 4.40% నుంచి 4.90%కి పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. మేలో ఈ రేటు 4% నుంచి 4.4%కి చేరిన సంగతి తెలిసిందే. వెబ్సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్)ను కూడా ఎస్బీఐ జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంపుదల చేసింది. ప్రస్తుతం ఈ రేటు 6.65 శాతం ప్లస్ క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలిగి ఉంది. తాజాగా ఈ రేటు 7.15 శాతానికి చేరింది. బీఓబీ డిపాజిట్ రేట్ల పెంపు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు 40 బేసిస్ పాయింట్ల వరకూ బుధవారం ప్రకటించింది. చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే? -
హెచ్డీఎఫ్సీ షాక్.. హోంలోన్లు ఇకపై భారం
దేశంలో హౌసింగ్ ఫైనాన్స్‌లో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న హెచ్డీఎఫ్సీ హోంలోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచింది. ఇటీవల రెపోరేటును రిజర్వ్‌బ్యాంకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్)ను 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టుగా వివిధ స్లాబుల్లో హోంలోన్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఈ పెంపు 2022 మే 9 నుంచి అమల్లోకి రానుంది. హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయంతో కొత్త రుణాలతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న రుణాలపై కూడా వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఆర్బీఐ రెపోరేటు పెంచడానాకి ముందు పలు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ బేసిక్ పాయింట్లను పెంచడం ద్వారా పరోక్ష పద్దతిలో ఇప్పటికే వడ్డీరేట్లు పెంచాయి. హెచ్డీఎఫ్సీ నిర్ణయంతో మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. దీని ప్రభావం రియాల్టీ రంగంపై పడనుంది. HDFC increases its Retail Prime Lending Rate on Housing Loans, on which its Adjustable Rate Home Loans are benchmarked by 30 basis points with effect from May 09, 2022. pic.twitter.com/cOoBoIM1Q8 — ANI (@ANI) May 7, 2022 చదవండి: నాలుగేళ్ల తర్వాత..సామాన్యులకు ఆర్బీఐ భారీ షాక్! -
గుడ్‌న్యూస్! గృహ రుణ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) పరిమిత కాలానికి గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30 వరకూ 6.50 శాతం వడ్డీ రేటుకే రుణాలు అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇది 6.75 శాతంగా ఉంది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ బట్టి కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంకు పేర్కొంది. గత కొద్ది నెలలుగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వడ్డీ రేటు ఆఫరు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంకు జనరల్ మేనేజర్ (మార్ట్గేజెస్, ఇతర రిటైల్ అసెట్స్) హెచ్‌టీ సోలంకి తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, అలాగే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి కూడా కొత్త రేటు అందుబాటులో ఉంటుంది. సిబిల్ స్కోరు 771కి పైగా ఉన్న వారికి దీన్ని వర్తింపచేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ 6.5 శాతమే వడ్డీ రేటు ఆఫర్ చేసిన బీవోబీ .. ఏప్రిల్ 1 నుంచి దాన్ని 6.75%కి పెంచింది. మళ్లీ వెంటనే తిరిగి పూర్వ స్థాయికి తగ్గించడం గమనార్హం. చదవండి👉🏼: నగరంలో అల్ట్రా లగ్జరీ గృహాలు -
కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త..!
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలకమైన పాలసీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఇప్పుడు కొత్తగా ఇల్లుకొనాలనుకునే వారికి వరంలా మారింది. కీలకమైన పాలసీ రేట్లపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో గృహ రుణాలపై చౌక వడ్డీకి మార్గం సుగుమం చేసింది. బ్యాంకులకు ఊరట..! ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC)లో రెపో రేటు, రివర్స్ రెపోరేటులను యథాతథంగా ఉంచింది. రెపోరేటులో మార్పు లేకపోవడంతో చాలా బ్యాంకులకు, బ్యాంకు ఖాతాదారులకు ఊరట కల్పించింది. బ్యాంకులకు అందించే రుణాలపై ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచకపోవడంతో ...ఖాతాదారులకు ఆయా బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం ఆర్బీఐ వడ్డీరేట్లపై ఎలాంటి మార్పులు చేయలేదు. పొడగింపు..! ఇక అధిక లోన్-టు-వాల్యూ రేషియోతో వ్యక్తిగత గృహ రుణాల కోసం అనుమతించబడిన తక్కువ రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ మార్చి 31, 2023 వరకు పొడిగించింది. మార్చి 31, 2022 వరకు మంజూరైన అన్ని కొత్త హౌసింగ్ లోన్ల టు-వాల్యూ (LTV) నిష్పత్తులు ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రకటనలో తెలిపారు. ఇది వ్యక్తిగత గృహ రుణాలకు అధిక క్రెడిట్ ప్రవాహాన్ని సులభతరం చేస్తుందని ఆయన చెప్పారు. హౌసింగ్ రంగ ప్రాముఖ్యత, దాని గుణకార ప్రభావాలను గుర్తిస్తూ, ఈ మార్గదర్శకాల వర్తింపును మార్చి 31, 2023 వరకు పొడిగించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది కాగా ప్రస్తుతం ఆయా బ్యాంకులు 6.50శాతం వడ్డీతో గృహ రుణాలను అందిస్తున్నాయి. అక్టోబర్ 2020 ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ ఎల్టీవీ 80 శాతం వరకు ఉన్న సందర్భాల్లో ఇటువంటి రుణాలు 35 శాతం రిస్క్-వెయిట్‌ను ఆకర్షిస్తాయి. ఇక ఎల్టీవీ 80 శాతం నుంచి 90 శాతం మధ్య ఉన్నట్లయితే 50 శాతం రిస్క్ వేయిటేజ్ను తగ్గించనుంది. లోన్స్ టూ వాల్యూ అంటే..? ఎల్టీవీ(లోన్ టూ వాల్యూ) అనేది ఆస్తి విలువకు వ్యతిరేకంగా రుణగ్రహీతకు మంజూరు చేయగల రుణ పరిమాణాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, రుణగ్రహీత ఆస్తి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకోవచ్చని 80 శాతం ఎల్టీవీ సూచిస్తుంది. కాబట్టి, ఆస్తి విలువ రూ. 1 కోటి ఉంటే, రూ. 80 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని గృహ కొనుగోలుదారులు వారి స్వంత జేబులో నుండి నిధులు సమకూర్చాలి. చదవండి: పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే! -
కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు పెంపు
ముంబై: ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీరేటు స్వల్పంగా 0.05 శాతం పెరిగింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుంది. దేశంలో వడ్డీరేట్ల పెంపునకు అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ విషయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ బ్యాంక్ గృహ రుణ రేటు 6.50 శాతం అయితే, ఇది 6.55 శాతానికి పెరిగింది. నిజానికి పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంక్ సెప్టెంబర్‌లో వడ్డీరేటును తగ్గించింది. పోటీరీత్యా మిగిలిన బ్యాంకులూ ఈ దిశలో నిర్ణయం తీసుకున్నాయి.తమ ప్రత్యేక 60 రోజుల పండుగల సీజన్ ఆఫర్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు బ్యాంక్ కన్జూమర్ బిజినెస్ వ్యవహారాల ప్రెసిడెంట్ అంబుజ్ చందనా పేర్కొనడం గమనార్హం. కోటక్ కీలక ట్వీట్ నేపథ్యం... కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ ఆదివారం చేసిన ట్వీట్ నేపథ్యంలో బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి’ అని ఉదయ్ కోటక్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. -
తక్కువ వడ్డీ రేటుతో హోంలోను
న్యూఢిల్లీ: గృహ రుణ రేటును చరిత్రాత్మక కనిష్టం 6.4%కి తగ్గించినట్లు ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 27 నుంచి తగ్గించిన వడ్డీరేటు అమల్లోకి వస్తుంది. కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు లేదా బ్యాలెన్స్ బదిలీలతో సహా ప్రస్తుత రుణాలను బదిలీ చేయాలనుకునే వారికి కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది. ‘పండుగ సీజన్లో గృహాలను కొనుగోలు చేయడానికి పెరుగుతున్న డిమాండ్‌ను మేము గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఈ ఆఫర్ నుండి ప్రయోజనం పొందుతారు. ఈ తగ్గిన వడ్డీ రేటుతో యూబీఐ గృహ రుణ రేటు పరిశ్రమలో అత్యంత పోటీగా మారింది‘ అని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు, లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? -
గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత పెరగడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి తగ్గిపోవడం వంటి అంశాల ఊతంతో హోమ్ లోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ తర్వాత హౌసింగ్‌కు డిమాండ్ పుంజుకోవడంతో పండుగ సీజన్ సందర్భంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. గృహ రుణాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు 6.5 శాతానికే హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. ‘గత కొన్నాళ్లుగా ఆదాయ స్థాయులు ఎంతో కొంత పెరగ్గా దేశవ్యాప్తంగా ప్రాపర్టీ ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉండిపోయాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహాలు మరింత అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. చౌక వడ్డీ రేట్లు కూడా గృహ రుణాలు తీసుకోవడానికి ఒక కారణంగా నిలుస్తున్నాయి. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో కొనుగోలుదారులు కాస్త పెద్ద సైజు అపార్ట్మెంట్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు’ అని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణు సూద్ కర్నాడ్ తెలిపారు. రెడీమేడ్ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంటోందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ వై విశ్వనాథ గౌడ్ తెలిపారు. పండుగ సీజన్, ఆ తర్వాత కూడా రెడీమేడ్ ఇళ్లు, అందుబాటు ధరల్లో ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు పలు బ్యాంకులు, పండుగ సీజన్‌కు ముందే గృహ రుణాల రేట్లను తగ్గించాయని కోలియర్స్ ఇండియా కొత్త సీఈవో రమేష్ నాయర్ చెప్పారు. -
గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి గుడ్‌న్యూస్..!
గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ అందించింది. గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లను వరుసగా 35 బేసిక్ పాయింట్స్, 50 బేసిక్ పాయింట్స్ మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ రుణాలపై 6.50 శాతం, వాహన రుణాలపై 6.85 శాతం వడ్డీరేట్లకే రుణాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. ఈ వడ్డీరేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. చదవండి: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్స్‌పై డిస్కౌంట్లు వడ్డీరేట్ల తగ్గింపు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. అంతకుముందు బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 6.85 శాతం మేర, వాహన రుణాలపై 7.35 శాతం మేర వడ్డీ రేట్లు ఉండేవి. పండుగ సీజన్ సందర్భంగా పలు బ్యాంకింగ్ సంస్థలు వడ్డీరేట్లను తగ్గించాయి. పండుగ సీజన్ సందర్భంగా కొద్దిరోజుల క్రితం హోమ్లోన్స్, వెహికల్ లోన్స్‌పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను తగ్గించింది. చదవండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..! -
రుణ గ్రహీతలకు ఎస్బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు
పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ ఇటు బ్యాంకులు, అటు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారుల మీద ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తుంటే, బ్యాంకులు గృహ, వ్యక్తిగత, కారు, బంగారం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు పండుగ ఆఫర్ల వర్షం కురిపించింది. గృహ రుణం, కారు రుణం, బంగారు రుణం, వ్యక్తిగత రుణంపై అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఎస్బీఐ చేసిన ఒక ట్వీట్లో కారు, బంగారం, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఆఫర్ల గురించి ప్రస్తావించింది. ఈ ట్వీట్లో "కారు రుణం, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ పై ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లతో పండుగ వేడుకలను ప్రారంభించండి. ఈ రోజు ప్రారంభించండి!" అని పేర్కొంది. కారు రుణాన్ని లక్షకు రూ.1539, బంగారు రుణాన్ని 7.5 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాన్ని లక్షకు రూ.1832 ఈఎంఐకే అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ కస్టమర్లు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. (చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!) Start the festive celebrations with special offers on Car Loan, Gold Loan and Personal Loan from SBI. Get started today! Apply Now: https://t.co/BwaxSb3HYQ#SBI #StateBankOfIndia #HarTyohaarShubhShuruaat #CarLoan #PersonalLoan #GoldLoan pic.twitter.com/Ebx69ujTYf — State Bank of India (@TheOfficialSBI) September 22, 2021 అలాగే, త్వరలో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని గృహ రుణాలపై ఆఫర్లను ప్రకటించింది. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల(100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. -
కొత్త ఇల్లుకొనేవారికి హెచ్డీఎఫ్సీ ఫెస్టివల్ బొనాంజా!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) పండుగ ఆఫర్లలో భాగంగా సెప్టెంబర్ 21 నుంచి 6.70 శాతానికి గృహ రుణాలను అందించనున్నట్లు తెలిపింది. అయితే, క్రెడిట్ స్కోర్ 800కి పైగా ఉండాలని షరతు విధించింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద, కస్టమర్లు 20 సెప్టెంబర్ 2021 నుంచి 6.70 శాతానికి హెచ్డీఎఫ్సీ అందించే గృహ రుణాలను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తం లేదా ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కేవలం 31 అక్టోబర్ 2021 వరకు అందుబాటులో ఉండనున్నట్లు రుణదాత తెలిపింది. గతంలో ఉద్యోగులు రూ.75 లక్షలపైన గృహ రుణాలకు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి 7.30 శాతం వడ్డీ వర్తించేంది. తాజా ఆఫర్ కింద ఏ మొత్తానికైనా తక్కువలో తక్కువ 6.7 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా సైతం పండగ సీజన్ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేసింది.(చదవండి: అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్!) -
సచివాలయాల్లోనే ‘వన్‌టైం సెటిల్మెంట్’
సాక్షి, అమరావతి: గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం, పేదల ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పథకం పేరు.. ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వర్తింపచేసే వన్‌టైం సెటిల్మెంట్కు ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ పథకంగా పేరు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. పథకం విధివిధానాలపై సమావేశంలో చర్చించడంతోపాటు ప్రతిపాదనలను వివరించారు. సెప్టెంబర్ 25 నుంచి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డేటా అప్లోడ్ చేయనుందని, వివిధ సచివాలయాలకు డేటాను పంపనున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన చేపడతారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్మెంట్ పథకం డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. పథకం అర్హుల వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. జాబితా ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లించిన వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తామని వెల్లడించారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీంకు మంచి స్పందన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే బూట్ల నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ కచ్చితంగా ఇళ్ల లే అవుట్ల సందర్శన పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల కార్యక్రమం పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయినట్లు అధికారులు తెలియచేయగా గృహ నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి స్వయంగా పరిశీలన, తనిఖీల కోసం కలెక్టర్లు, జేసీలు, మునిసిపల్ కమిషనర్లు కచ్చితంగా వారానికో లేఅవుట్‌ను సందర్శించాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ జేసీ, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు లే అవుట్లను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వారానికోసారి మంత్రుల కమిటీ సమీక్ష సమగ్ర భూ సర్వేపై నియమించిన మంత్రుల కమిటీ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కూడా వారానికోసారి సమీక్షించాలని సీఎం ఆదేశించారు. కమిటీలో గృహ నిర్మాణ శాఖ మంత్రిని కూడా నియమించాలని సూచించారు. ఇళ్ల లబ్ధిదారులందరికీ పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18 వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాలనీ యూనిట్‌గా మౌలిక వసతులు పేదల ఇళ్లకు సంబంధించి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, టిడ్కో ఇళ్లపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కాలనీ యూనిట్‌గా తీసుకుని మౌలిక సదుపాయాల పనులను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుకల తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని, దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయని చెప్పారు. మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలు, ఖర్చులు కూడా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ రాహుల్‌పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ ఎన్.భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ నాణ్యత పరిశీలన సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక కిట్‌లో భాగంగా వచ్చే ఏడాది అందించనున్న స్కూల్ బ్యాగ్, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, సీఎం కార్యాలయ అధికారులు చూపించారు. వచ్చే ఏడాది జగనన్న విద్యా కానుక కిట్‌లో ఇచ్చే బ్యాగ్ నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం జగన్ -
గృహ రుణ గ్రహీతలకు ఎస్బీఐ బొనాంజా
ముంబై: గృహ రుణ మార్కెట్లో భారీ వాటా దక్కించుకోవడంలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ రేటు తగ్గింపు సహా రుణ గ్రహీతలకు పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుంది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. ► ప్రస్తుతం వడ్డీరేటు వేతన జీవులతో పోల్చితే, ఎటువంటి వేతనం పొందనివారు 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. వీరి మధ్య రుణ రేటు వ్యత్యాసాన్ని ఎస్బీఐ తొలగించింది. ► రుణ బ్యాలన్స్ బదలాయింపుల విషయంలోనూ 6.70 శాతం వడ్డీరేటు అమలవుతుంది. ► ప్రాసెసింగ్ ఫీజునూ బ్యాంకింగ్ దిగ్గజం రద్దు చేసింది. రిటైల్ రుణాలపై బీఓబీ ఆఫర్లు మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని రిటైల్ రుణాలపై పలు ఆఫర్లను ప్రకటించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కార్ రుణ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గాయి. కారు రుణ రేటు 7 శాతం వద్ద ప్రారంభమైతే, గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుంది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును బ్యాంక్ తగ్గించింది. బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌పై కూడా రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెస్టివల్ బొనాంజా ఆఫర్లు..!
త్వరలో రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు రిటైల్ లోన్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ హోమ్లోన్స్, కార్లోన్స్కు వర్తించనుంది. హోమ్లోన్స్, కార్లోన్స్కు వర్తించే వడ్డీరేట్లపై సుమారు 0.25 శాతం మాఫీని ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా హోమ్‌లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపును కూడా అందిస్తోంది. గృహ రుణాలు 6.75 శాతం నుంచి , కారు రుణాలు 7.00శాతం నుంచి వడ్డీరేట్లు ప్రారంభమవుతాయి. (చదవండి: Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!) కస్టమర్లు బాబ్ వరల్డ్ మొబైల్ యాప్స్ ద్వారా కూడా సులభంగా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎమ్ హెచ్.టీ. సోలంకీ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్లో రిటైల్ లోన్ ఆఫర్లను ప్రవేశపెట్టడంతో కస్టమర్లకు తమ బ్యాంకు తరపునుంచి పండుగ ఉత్సాహాన్ని అందించాలని భావిస్తున్నామన్నారు. బ్యాంక్ కస్టమర్లకు కొత్త రుణాలు అందించడం కోసం గృహ రుణాలు, కారు రుణాలపై ఆకర్షణీయమైన ప్రతిపాదనతో బీవోబీ ముందుకు వచ్చిందన్నారు. తక్కువ వడ్డీరేట్లకు కస్టమర్లు రుణాలను పొందవచ్చునని పేర్కొన్నారు. ఆయా రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి కూడా మినహయింపు వస్తుందని తెలిపారు. చదవండి: SBI Home Loan: పండుగ సీజన్ రాకముందే ఎస్బీఐ ఆఫర్ల వర్షం -
గృహ రుణాలలో 26 శాతం వృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో గృహ రుణాలలో 26 శాతం వృద్ధి నమోదయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పెంచకపోవటంతో బ్యాంక్‌లు 7 శాతం కంటే తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. 46 శాతం మంది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ముందుకొచ్చారని మ్యాజిక్ బ్రిక్స్ తెలిపింది. ఆస్తి మీద రుణం తీసుకునే అంశాలలోనూ 20 శాతం పెరుగుదల నమోదు కావటం గమనార్హం. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాలు, తక్కువ వడ్డీ రేట్లు, ఆయా నగరాలలో అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల కారణంగా ఇళ్లను కొనేవారి సంఖ్య పెరిగింది. దాదాపు 50 శాతం మంది 15 ఏళ్ల కంటే తక్కువ రుణ వ్యవధిని ఎంచుకుంటున్నారు. అంటే వీలైనంత త్వరగా గృహ రుణాలను కట్టేయాలని కొనుగోలుదారులు భావిస్తున్నారన్నమాట. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు సాధారణంగా గృహ రుణం చెల్లింపుల కోసం 25–30 ఏళ్ల దాకా గడువును ఇస్తున్నాయి. అయినప్పటికీ రుణాన్ని త్వరగా తీర్చేయాలన్న ఆలోచనతో ఇళ్ల కొనుగోలుదారులు ఉన్నారు. -
గృహ రుణాలపై ప్రాసెస్ ఫీజు మినహాయింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆగస్టు 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం హౌసింగ్ లోన్స్ మీద ప్రాసెసింగ్ ఫీజు 0.40 శాతంగా ఉంది. ఎస్బీఐ మాన్సూన్ ధమాకా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, గృహ రుణ కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి ప్రారంభమవుతాయని.. ఇల్లు కొనేందుకు ఇంతకుమించి మంచి తరుణం లేదని పేర్కొంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకు గృహ రుణాలకు 5 బీపీఎస్ (0.05 శాతం), మహిళ గృహ రుణగ్రహీతలకు 0.05 శాతం రాయితీకి అర్హులని ఎస్బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. -
గృహ రుణాలపై ఎస్బీఐ బంపర్ ఆఫర్..!
న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొత్తగా గృహ రుణాలను తీసుకునే కస్టమర్లకు తీపికబురును అందించింది. గృహ రుణాలపై ఎస్బీఐ మాన్సూన్ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మినహాయిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును 0.4శాతం మేర వసూలు చేసేది. ఈ ఆఫర్ 2021 ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉండనుంది. మాన్సూన్ ధమాకా ఆఫర్‌తో గృహ రుణాలను తీసుకొనే కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్బీఐ పేర్కొంది. గృహ రుణ వడ్డీ రేట్లు కేవలం 6.70 శాతంతో ప్రారంభమవుతాయని ఎస్బీఐ తెలిపింది. కొత్తగా గృహరుణాలను తీసుకునే ప్రణాళికలు ఉన్న వారికి ఇదే సరైన సమయమని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఇవ్వడంతో కొత్తగా గృహరుణాలను తీసుకునే వారికి ఎంతగానో ఉపయోగపడనుందని ఎమ్డీ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. కనిష్ట స్థాయి గృహ రుణాల వడ్డీ రేట్లు గృహ కొనుగోలుదారులకు రుణాలను సులభంగా తీసుకోవడానికి ఎస్బీఐ ప్రోత్సహిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.ఎస్బీఐ ప్రతి భారతీయుడికి బ్యాంకర్‌గా ఉండటానికి ప్రయత్నిస్తుందని, తద్వారా, దేశ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని ఎస్బీఐ ఎమ్డీ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. యోనో యాప్ ద్వారా గృహ రుణాలను ఆప్లై చేసుకున్నట్లయితే సుమారు 5బీపీఎస్ పాయింట్ల రాయితీ లభించనుంది. అంతేకాకుండా మహిళలకు రుణాలపై 5బీపీఎస్ పాయింట్ల రాయితీని ఎస్బీఐ అందించనుంది. It’s raining offers for new home buyers! Apply for a Home Loan with NIL* processing fee. What are you waiting for? Visit: https://t.co/N45cZ1V1Db *T&C Apply #HomeLoan #SBI #StateBankOfIndia #MonsoonDhamakaOffer pic.twitter.com/nDbPb7oBhF — State Bank of India (@TheOfficialSBI) July 31, 2021 -
రిటైల్ రుణాలు.. రయ్రయ్!
గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా కొద్ది నెలలనుంచీ దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇటీవల పలు బ్యాంకింగ్ దిగ్గజాలు కార్పొరేట్ విభాగానికి బదులుగా రిటైల్ రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ రుణ విభాగం పైచేయి సాధించనున్నట్లు అంచనాలు నెలకొన్నాయి. వెరసి కార్పొరేట్ రుణాలను మించి అగ్రస్థానానికి చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముంబై: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2020–21).. కీలక మార్పులకు వేదిక కానుంది. కొన్ని నెలలుగా గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు తదితరాలపట్ల బ్యాంకులు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కార్పొరేట్ రంగ డెట్‌ను వ్యక్తిగత రుణ విభాగం అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 18వరకూ) బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం(అవుట్‌స్టాండింగ్) పారిశ్రామిక, కార్పొరేట్ రుణాలు 1.2 శాతం తగ్గి రూ. 27.6 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో వ్యక్తిగత రుణాలు 9.5 శాతం జంప్‌చేసి రూ. 26.6 లక్షల కోట్లను తాకాయి. ఇక సర్వీసుల రంగ రుణాలు 25.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వెరసి దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో వ్యక్తిగత రుణ విభాగం సర్వీసుల రంగ రుణాలను మించి రెండో ర్యాంకుకు చేరింది. వెనకడుగులో..: పారిశ్రామిక, కార్పొరేట్ రుణ విభాగాలలో 2014–15 మొదలు రికవరీ కనిపించడంలేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు వ్యక్తిగత రుణ విభాగంపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలియజేశాయి. ఫలితంగా గృహ, ఆటో రుణాలు, క్రెడిట్ కార్డులు వృద్ధి బాటలో సాగుతున్నట్లు నార్నోలియా సెక్యూరిటీస్ సీఐవో శైలేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం పారిశ్రామిక, కార్పొరేట్ లోన్‌బుక్ నీరసిస్తూ వస్తోంది. తాజా రుణ మంజూరీకంటే చెల్లింపులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 9 నెలల్లో పారిశ్రామిక రుణాలు 5 శాతం క్షీణించగా.. సర్వీసుల రంగ రుణాలు 0.6 శాతం మందగించాయి. అయితే వ్యక్తిగత రుణాలు 4.3 శాతం పుంజుకున్నాయి. వ్యవసాయ రుణాలైతే 7.6 శాతం ఎగశాయి. దీంతో సమీప కాలంలో రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియో దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద విభాగంగా ఆవిర్భవించే వీలున్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐఐపీ వీక్... కొంతకాలంగా తయారీ, పారిశ్రామిక రంగాలలో క్షీణత కొనసాగుతుండటంతో ఇండస్ట్రియల్ క్రెడిట్ వెనకడుగు వేస్తున్నట్లు బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తయారీ రంగం నీరసిస్తుండటంతో కొత్త పెట్టుబడి ప్రణాళికలు కరువైనట్లు తెలియజేశారు. దీంతో కార్పొరేట్ క్రెడిట్‌కు డిమాండ్ తగ్గినట్లు ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపక ఎండీ జి.చొక్కలింగం వివరించారు. సాధారణంగా సామర్థ్య విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, ప్లాంట్ల ఏర్పాటు తదితరాల కారణంగా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పుట్టుకొస్తుందని తెలియజేశారు. కారణాలివీ... ఇటీవల వడ్డీ రేట్లు తగ్గడం, టెక్నాలజీ ఆధారిత (ఆన్లైన్) రుణ మంజూరీ పెరగడం వంటి అంశాలు రిటైల్ విభాగంలో రుణ వృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ విభాగంలో క్రెడిట్ కార్డులు, ఇతర వ్యక్తిగత అన్సెక్యూర్డ్ రుణాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే మొత్తం వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో చూస్తే సెక్యూర్డ్ విభాగంలోని గృహ రుణాలు, ఆటో రంగ రుణాలు నెమ్మదిస్తున్నాయి. వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో ఆర్బీఐ గణాంకాల ప్రకారం గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డులు మూడు పెద్ద విభాగాలుగా ఆవిర్భవించాయి. హౌసింగ్ వాటా 52.3 శాతంకాగా.. గత ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు తదితర రుణాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా క్రెడిట్ కార్డుల రుణాల వాటా 4.1 శాతానికి చేరడం గమనార్హం! -
సొంతింటి కల : ఐసీఐసీఐ గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: సొంత ఇల్లు కొనుగోలుచేయాలనుకునే వారికి దేశీయ అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకు ఐసీఐసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. గృహరుణాలపై వడ్డీ రేటును 6.7 శాతంగానిర్ణయించింది. సవరించిన వడ్డీ రేటు, ఈ రోజు(మార్చి 5, శుక్రవారం) నుండి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఆ తగ్గింపు రేటు అందుబాటులో ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. దీంతో హోమ్లోన్లపై బ్యాంకు వసూలుచేస్తున్న వడ్డీరేటు పదేళ్ల కనిష్ఠానికి దిగి రావడం విశేషం. గృహ రుణాల కోసం వినియోగదారులు రూ.75 లక్షలలోపు రుణాలపై వడ్డీరేటు 6.7 శాతంగా ఉంటుంది. రూ.75 లక్షలకు మించినరుణాలపై వడ్డీరేటు మాత్రం 6.75 శాతం నుంచి మొదలవుతుందని ఐసీఐసీఐ సెక్యూర్డ్ అసెట్స్ హెడ్ రవి నారాయణన్ చెప్పారు. గత కొన్ని నెలలుగా గృహాలను కొనాలనుకునే సంఖ్య పెరుగుతోందని, డిమాండ్ తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లతో వినియోగదారుల సొంత ఇంటి కల నెర వేర్చేందుకు ఇది సరైన సమయంగా తాము భావిస్తున్నామన్నారు. -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సొంత ఇల్లు కల కంటున్న కస్టమర్లకు శుభవార్త అందించింది. ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేటుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే రుణగ్రహీతలకు మూడు ప్రయోజనాలు లభిస్తాయని వెల్లడించింది. ఆ మేరకు వివరాలను బ్యాంకు ట్వీట్ ద్వారా తెలిపింది. ప్రయోజనాలు ప్రాసెసింగ్ ఫీజు రద్దు 30 లక్షలకు పైబడి, కోటి రూపాయల కంటే తక్కువ రుణాలపై సిబిల్ స్కోరు ఎక్కువ ఉన్న రుణగ్రహీతలకు 0.10శాతం వడ్డీ రాయితీ ఎస్బీఐ యోనో యాప్ ద్వారా అయితే అదనంగా 0.5 శాతం రాయితీ లభ్యం. దీంతో రుణం మొత్తంపై 0.40 శాతం వరకు వినియోగదారులకు ఆదా అవుతుంది. ఉదాహరణకు, 30 లక్షల రుణంపై 15 సంవత్సరాల కాల పరిమితిలో 1.52 లక్షల వరకు కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం వేతన జీవులకు గృహ రుణాలపై 6.95 శాతం నుండి 7.45 శాతం స్వయం ఉపాధి పొందుతున్నవారి రుణాలపై 7.10 శాతం నుండి 7.60 శాతం మధ్య వడ్డీ రేటు వసూలు చేస్తోంది. కాగా కరోనావైరస్ వ్యాప్తి తరువాత రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 4 శాతానికి తగ్గించిన తరువాత గృహ రుణాలపై వడ్డీ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగి వచ్చిన సంగతి తెలిసిందే. Knock Knock! Who's there? Concessions on SBI Home Loans through YONO. Apply now: https://t.co/wWHot51u7y *T&C Apply#YONOSBI #HomeLoan #DreamHome #SBI #StateBankOfIndia pic.twitter.com/7uQiKNecPM — State Bank of India (@TheOfficialSBI) September 9, 2020 -
హెచ్డీఎఫ్సీ లాభం రూ. 4,059 కోట్లు
ముంబై: దేశంలోనే అతిపెద్ద గృహ రుణ సంస్థ హెచ్డీఎఫ్సీ జూన్ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ.4,059 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 2 శాతం క్షీణించి రూ.11,168 కోట్లుగా ఉంది. బ్యాంకింగ్, బీమా, మ్యూచువల్ ఫండ్స్ సహా దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవల విభాగాల్లో కంపెనీలకు సబ్సిడరీలు ఉన్నాయి. వీటిని మినహాయించి స్టాండలోన్‌గా (కేవలం గృహ రుణాల వ్యాపారం) చూసుకుంటే సంస్థ లాభం 5 శాతం క్షీణించి రూ.3,051 కోట్లుగా నమోదైంది. ఆదాయం 2 శాతం పెరిగి 10790 కోట్లుగా ఉంది. తగ్గని మారటోరియం రుణాలు సంస్థ మొత్తం రుణాల్లో ఇప్పటికీ 22 శాతం మారటోరియం పరిధిలోనే ఉన్నాయి. మొదటి విడత మారటోరియం (రుణ చెల్లింపులకు విరామం) కాలం అయిన మే చివరి నాటికి 27 శాతం రుణాలు ఆ పరిధిలో ఉన్నాయి. వీటిల్లో రిటైల్ రుణ గ్రహీతలవి 16.6 శాతం. ఆగస్టు చివరి వరకు ఈ మారటోరియంను ఆర్బీఐ కొనసాగించగా.. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ముందు నాటితో పోలిస్తే 5 శాతం మందే రుణ చెల్లింపులకు ముందుకు వచ్చారు. ఎన్పీఏలు 1.87%: సంస్థ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో గతంలో 1.99 శాతంగా ఉంటే, జూన్ ఆఖరుకు 1.87 శాతానికి తగ్గాయి. సంస్థ నికర వడ్డీ మార్జిన్ 3.1 శాతంగా ఉంది. -
మెడపై వేలాడుతున్నహోమ్లోన్స్, రుణాలు
సాక్షి, సిటీబ్యూరో: హోమ్లోన్స్ సహా ఇతర రుణాలపై మూడు నెలల మారిటోరియం.. అద్దెదారుల నుంచి మూడు మాసాలు వరకు కిరాయి వసూలు చేయవద్దంటూ ఆదేశాలు.. పేదలకు అవసరమైన నిత్యావసరాలు, కొంత నగదు పంపిణీ.. కరోనా నిరోధానికి అమలులోకి వచ్చిన లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలివీ. ఆచరణలో మాత్రం ఇవేవీ అమలుకు నోచుకోవడంలేదు. నగరంలో లక్షలాది మంది మెడలపై వడ్డీ మాఫియా మిత్తి కత్తి వేలాడుతోంది. ఫలితంగా చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలతో పాటు కొందరు ‘పెద్దలూ’ ఇబ్బందుల పాలవుతున్నారు. అక్రమ దందానే అధికం.. నగరంలో సాగుతున్న వడ్డీ వ్యాపారంలో 70 శాతం వరకు అక్రమ దందానే. ఈ వ్యాపారులు ఎలాంటి అనుమతులు తీసుకోరు. తాము చేసే టర్నోవర్ పైన, తీసుకుంటున్న వడ్డీపై ఎలాంటి పన్నులు చెల్లించరు. చిన్న స్థాయిలో జరిగే మిత్తి దందానే కాదు.. ప్రతి నెలారూ.లక్షలు, రూ.కోట్లలో లావాదేవీలు నెరిపే కొందరు పెద్ద వ్యాపారులదీ అదే తీరు. వీరిలో అత్యధికులు తమకు పరిచయస్తులకో, వారి ద్వారా పరిచయమైన వారికో మాత్రమే అప్పులు ఇస్తూ ఉంటారు. ష్యూరిటీగా ఖాళీ ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లు, చెక్కులతో పాటు ఆస్తి పత్రాలను తమ అధీనంలో ఉంచుకుంటారు. ఇలాంటి దందా చేయడం అక్రమమైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో వీరి వ్యవహరం యథేచ్ఛగా సాగుతోంది. ఊహకు అందని వడ్డీ రేట్లు.. వడ్డీ వ్యాపారం నగరంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణ మండలంలోనే అధికంగా ఉంది. దీంతో పాటు మధ్య, తూర్పు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ జోరుగా సాగుతోంది. రూ.లక్షలు, రూ.కోట్లు అప్పుగా ఇచ్చే వారిలో పశ్చిమ మండలానికి చెందిన ఫైనాన్సియర్లు ఎక్కువగా ఉన్నారు. పెద్ద మొత్తాలు ఇచ్చే వారు నూటికి రూ.3 నుంచి రూ.6 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇక చిరు వ్యాపారులు, మధ్య తరగతి వారికి అప్పులు ఇచ్చేవారిది మరో వ్యవహారం. వీళ్లు రోజు, వారం, నెల లెక్కన తిరిగి చెల్లించే పద్ధతుల్లో అప్పులు ఇస్తుంటారు. ఎవరైనా రూ.50 వేలు అప్పు అడిగితే రూ.39 వేలు మాత్రమే ఇస్తారు. ఈ మొత్తాన్ని వారానికి రూ.1250 చొప్పున 40 వారాలు చెల్లించాల్సి ఉంటుంది. రోజు, నెల చెల్లింపుల వద్దకు వస్తే ఈ చెల్లించే మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. గరిష్టంగా 10 శాతం వరకు వడ్డీగా వసూలు చేస్తుంటారు. కుప్పకూలిన వ్యాపారాలతో.. అప్పు తీసుకునే వారికి ఉండే అవసరం.. ఇచ్చే వారి లాభాపేక్ష.. ఈ రెండూ వెరసీ ఇన్నాళ్లూ వడ్డీ దందా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయింది. దాదాపు 50 రోజులుగా నగర వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు స్తంభించిపోయాయి. నిత్యావసర సరుకులు మినహా మరే ఇతర బిజినెస్ సాగట్లేదు. ఫలితంగా చేతిలో చిల్లిగవ్వ లేని చిరు వ్యాపారులు, దందాలు ఆగిపోయి పెద్ద వ్యాపారులు సైతం వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి బెదిరింపులు, వేధింపులపై ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనుకాడుతున్నారు. లాభాల్లో సగానికి పైగా.. నా వ్యాపారం కోసం ఏ రోజుకా రోజు మిత్తికి డబ్బు తీసుకుంటూ ఉంటాను. ఆ అప్పు కట్టడానికి, వడ్డీతో సహా చెల్లించడానికి సాయంత్రం వరకే గడువు ఉంటుంది. అనివార్య కారణాల వల్ల అలా ఇవ్వలేకపోతే మరుసటి రోజు ఇవ్వాల్సిందే. ఆలస్యం అయితే వడ్డీ పెరుగుతుంది. వ్యాపారం కోసం తీసుకునే అప్పు తీర్చగా.. ఆ వడ్డీ చెల్లించడానికి సగానికి పైగా లాభం ఇచ్చేయాల్సి వçస్తోంది. ఇప్పుడు వ్యాపారాలు లేక తినడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు పెరుగుతున్నాయి. తక్షణం అసలు, వడ్డీ చెల్లించకపోతే మళ్లీ అప్పు ఇవ్వబోమని, ఇంకెక్కడా పుట్టకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. – దిల్సుఖ్నగర్కుచెందిన చిరు వ్యాపారి రెట్టింపు కంటే ఎక్కువే ష్యూరిటీ పెట్టా.. ఆంధ్రప్రదేశ్ నుంచి నిత్యం వ్యాపారం కోసం హైదరాబాద్‌కు వచ్చిపోతూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌కు చెందిన ఓ ఫైనాన్సియర్‌తో పరిచయం ఏర్పడింది. నాలుగు నెలల క్రితం వ్యాపార అవసరాల కోసం రూ.25 లక్షలు నెలకు నూటికి రూ.8 వడ్డీకి అప్పు తీసుకున్నా. ఆ సమయంలో రూ.70 లక్షల విలువైన కారు, ఆస్తి పత్రాలు ష్యూరిటీగా పెట్టా. లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా వడ్డీ ఇవ్వలేకపోతున్నా. దీంతో ఆ ఫైనాన్షియర్ ప్రతి రోజూ ఫోన్ చేసి బెదిరించడంతో పాటు వేధిస్తున్నాడు. ఎవరికి చెప్పాలో అర్థం కావడంలేదు. – విజయవాడకు చెందినఓ బడా వ్యాపారి -
తగ్గిపెరిగిన ఎస్బీఐ ‘రేటు’
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4.4 శాతం) ఆధారిత గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కోవిడ్–19 నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచీ, రియల్టీ సంస్థల నుంచీ క్రెడిట్ రిస్క్ (రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యంలో ఇబ్బంది) పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణలు ఎస్బీఐ తాజా నిర్ణయానికి నేపథ్యమని సంబంధిత ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై సైతం వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లమేర ఎస్బీఐ పెంచింది. మే 1వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ఎస్బీఐ తాజా నిర్ణయం బాటలో మిగిలిన బ్యాంకులూ నడిచే అవకాశం ఉంది. గృహ రుణాల్లో భారీ మొత్తం అటు రెపో రేటుకో లేక ఎంసీఎల్ఆర్కో అనుసంధానమై ఉంటాయి. మరోపక్క, బెంచ్‌మార్క్ రుణ రేటు–ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా 0.15% (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. ప్రస్తుతం 7.40% ఉంటే దీనిని 7.25%కి తగ్గించింది. మే 10వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం– ఒక వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల గృహ రుణం తీసుకుంటే (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన వడ్డీ రేటుకు) అతనికి నెలవారీ వాయిదా చెల్లింపులపై దాదాపు రూ.255 భారం తగ్గుతుంది. వృద్ధులకు ఊరట: రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్లకోసం ‘ఎస్బీఐ వియ్‌కేర్ డిపాజిట్’ పథకం ఒకటి ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వడ్డీరేట్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో వృద్ధులకు ఊరటనిచ్చే నిర్ణయం ఇది. ఐదేళ్లు, ఆపైన కాలపరిమితికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లకు మామూలుగా వచ్చే వడ్డీకన్నా 30 బేసిస్ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ చెల్లించడమే ఈ కొత్త ప్రొడక్ట్ ప్రత్యేకత. అయితే ఈ స్కీమ్ సెప్టెంబర్ 30వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇప్పటికే మామూలుగా వచ్చే డిపాజిట్లరేటుకన్నా సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు అదనంగా అందుతుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఐదుళ్లు, ఆపైన కాలపరిమితికి డిపాజిట్ చేస్తే 80 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు (50 బేసిస్ పాయింట్లకు 30 బేసిస్ పాయింట్లు ప్రీమియం) అందుతుంది. మూడేళ్లలోపు రేటు తగ్గింపు: మరోపక్క, మూడేళ్ల కాలపరిమితిలోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మే 12వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఎన్బీఎఫ్సీలకూ ‘రుణ మారటోరియం’ వర్తింపు కోల్‌కతా: కరోనా కష్టాల నేపథ్యంలో రుణ బకాయిల చెల్లింపులపై మే 31వ తేదీ వరకూ మూడు నెలల పాటు విధించిన ‘మరటోరియం’ను ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లకూ వర్తింపజేయాలని ఎస్బీఐ గురువారం నిర్ణయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా ‘బకాయిల చెల్లింపులపై’ 3 నెలలు(మార్చి–ఏప్రిల్–మే) మారటోరియం విధించడానికి ఆర్బీఐ బ్యాంకింగ్‌కు అనుమతి నిచ్చింది. అయితే ఈ మారటోరియంను ఎన్బీ ఎఫ్‌సీలకు వర్తింపజేసేలా ఆర్బీఐ అనుమతి నివ్వడంతో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో మరికొన్ని బ్యాంకులూ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట కలుగుతుంది. దీనితోపాటు 3 నెలల మారటోరియం ప్రయోజనాన్ని ఎన్‌బీఎఫ్‌సీలూ తమ కస్టమర్లకు అందించగలుగుతాయి. మేతో ముగియనున్న మూడు నెలల మారటోరియం మరో మూడు నెలలు పొడిగించవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. -
వినియోగదారులకు ఎస్బీఐ శుభవార్త
సాక్షి, ముంబై : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ‘సప్నా ఆప్కా, భరోసా ఎస్బీఐ కా’ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఎస్బీఐ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి గడువు లోగా ప్రాజెక్టు పూర్తికాకపోతే డబ్బు వాపస్ ఇస్తామంటోంది. ‘రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’గా తీసుకొస్తున్న ఈ పథకాన్ని తొలుత ముంబై నగరంలో ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే సన్ టెక్ డెవలపర్స్ సంస్థతో ఎస్బీఐ ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఈ పథకం వల్ల అటు గృహ కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇది దేశ రియల్ ఎస్టేట్ రంగంపై బలమైన, సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో ప్రారంభించిన ఈ పథకాన్ని క్రమంగా ఈ దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రేరా, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాల నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు సమయానికి ప్రాజెక్టులను అందించటంతో పాటు, వారి డబ్బులు ఇరుక్కుపోకుండా ఈ కొత్త పథకం రక్షణ కల్పిస్తుందని రజనీష్ కుమార్ భరోసా ఇచ్చారు. ఎన్నో ఆశలతో సొంతింటి కల సాకారం కోసం బ్యాంకురుణాలు తీసుకొని మరీ సొమ్మును పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుపెట్టి, అవి సమయానికి పూర్తికాక మధ్యలో నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నవినియోగదారులకు పరిష్కారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు బ్యాంకు తెలిపింది. ఈ పథకం గరిష్టంగా రూ 2.5 కోట్ల విలువ ఉన్న గృహాలకు వర్తిస్తుంది. అలాగే ఈ పథకంలో చేరే బిల్డర్లు తమ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు సుమారు రూ 50 కోట్ల నుంచి రూ 400 కోట్ల వరకు రుణాలను పొందవచ్చు. బిల్డర్ గడువులోగా వినియోగదారునికి ఇంటిని అందించలేకపోతే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ను బ్యాంకు తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకం బిల్డర్ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు అమల్లో ఉంటుంది. మరిన్ని వివరాలు homeloans.sbi లో లభ్యం. #SBI launched ‘Sapna Aapka Bharosa SBI Ka’ - Residential Builder Finance with Buyer Guarantee, to protect home buyers & boost the real estate sector. A MOU was signed by #SBI & Sunteck Realty Ltd., in Mumbai, followed by a press conference by Shri Rajnish Kumar, Chairman SBI. pic.twitter.com/SjRhG0b86C — State Bank of India (@TheOfficialSBI) January 9, 2020 -
ఎస్బీఐ వినూత్న గృహ రుణ పథకం
ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’ పేరుతో ఆరంభించిన ఈ పథకం కింద.. ఎంపిక చేసిన గృహ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి ఎస్బీఐ నుంచి హామీ లభిస్తుంది. అది కూడా ఎస్బీఐ నుంచి రుణం తీసుకుని ఆ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 10 పట్టణాల్లో రూ.2.5 కోట్ల ధర ఉండే ప్రాజెక్టులపై ఈ పథకం ముందుగా అమలవుతుందని ఎస్బీఐ తెలిపింది. ఈ పథకం కొనుగోలుదారులకు, బిల్డర్లకు, బ్యాంకుకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పథకం గురించి కుమార్ మరింత వివరిస్తూ.. ‘‘ఉదాహరణకు ఒక కొనుగోలుదారు ఒక ప్రాజెక్టులో రూ.2 కోట్ల ఫ్లాట్ బుక్ చేసుకుని రూ.కోటి చెల్లించారనుకుంటే, ఆ ప్రాజెక్టు నిలిచిపోతే అప్పుడు రూ.కోటి తిరిగి కొనుగోలుదారుకు చెల్లిస్తాం. ఈ గ్యారంటీ సంబంధిత ప్రాజెక్టు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందేంత వరకు అమల్లో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
ఇంటి రుణాలపై వడ్డీరేటు 7%కి తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలని, అమ్మకాలను మరింతగా ప్రోత్సహించేందుకు 6 శాతం పైబడి వడ్డీ చెల్లించే ప్రతి ఒక్కరికీ వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించింది. కేంద్ర బడ్జెట్ రూపకల్పన కోసం ఆర్థిక మంత్రి నిర్వహించిన ప్రి బడ్జెట్ సమావేశంలో గృహ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన మార్పులను సూచించినట్టు కౌన్సిల్ చైర్మన్ నిరంజన్ హిరనందన్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి విలువలో 90% మేర రుణంగా ఇవ్వాలని, స్టాంప్‌డ్యూటీ, ఇతర పన్నులు కూడా రుణంలో కలిపేలా సంస్కరణలు రావాలని నివేదించినట్టు తెలిపారు. రెంటల్ హౌజింగ్, స్టాఫ్ హౌజింగ్ అందించే సంస్థలకు ప్రాజెక్టులో 90% మేర రుణాలు మంజూరు చేయాలని, అది కూడా గృహాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే వడ్డీ రేటుకే ఈ రుణాలు ఇవ్వాలని నివేదించినట్టు తెలిపారు. ముంబై వంటి నగరాల్లో స్టాంప్ డ్యూటీ కేవలం రూ. 1000గా ఉందని, కానీ అనేక రాష్ట్రాల్లో 3–5% వరకు ఉందని వివరించారు. దీనిని సగానికి సగం తగ్గించాలని కోరినట్టు తెలిపారు. గృహ రుణాలకు చెల్లించే వడ్డీని ఏటా రూ. 5 లక్షల మేర మినహాయింపు ఇవ్వాలని, గృహ నిర్మాణం పూర్తవడంతో సంబంధం లేకుండా తొలి ఏడాది నుంచే వర్తించేలా చూడాలని కోరినట్టు తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ రంగం ఊపందుకుంటుందని నివేదించినట్టు తెలిపారు. -
గృహ రుణ బదిలీతో లాభమెంత
అరుణ్ మిశ్రా (40) ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. 2010లో యాక్సిస్ బ్యాంకు నుంచి రూ.20 లక్షల రుణాన్ని తీసుకుని నోయిడాలో రూ.37 లక్షల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశారు. ఫ్లోటింగ్ రేటుపై రుణాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన 9 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నాడు. 2010లో రుణాన్ని తీసుకున్నందున బీపీఎల్ఆర్ ఆధారిత రుణ రేటే ఇప్పటికీ అమలవుతోంది. ప్రస్తుత రేటుకు అతను మార్చుకోలేదు. దీనివల్ల అతను పలు ప్రయోజనాలు కోల్పోతున్నాడు. అరుణ్ ఒక ఉదాహరణ మాత్రమే. 2010 తర్వాత గృహ రుణాలకు బెంచ్‌మార్క్ విధానాలు మూడు పర్యాయాలు మారిపోయాయి. 2011లో బేస్ రేటు, 2016లో ఎంసీఎల్ఆర్ రేటు, 2019 అక్టోబర్‌లో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటు విధానాలు అమల్లోకి వచ్చాయి. రేట్లలో మార్పును వెంటనే బదలాయించడం, పారదర్శకత పెంపునకు ఎప్పటికప్పుడు నూతన విధానాల అమలు జరుగుతోంది. కానీ, అరుణ్ మిశ్రా వంటి ఎందరో ఇప్పటికీ పాత బెంచ్ మార్క్ విధానంలోనే కొనసాగుతున్నారు. మరింత పారదర్శకత, తక్కువ వడ్డీ రేటుతో కూడిన విధానాలకు బదిలీ చేసుకోవడం లేదు. ఒక నివేదిక ప్రకారం.. ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియోలో 25 శాతం రుణాలు ఇప్పటికీ బేస్ రేటు విధానంలోనే కొనసాగుతున్నాయి. రూ.5,000 కోట్ల రుణాలు బీపీఎల్ఆర్ విధానంలో ఉన్నాయి. ‘‘బేస్ రేటు లేదా బీపీఎల్ఆర్ విధానంలో రుణాలు తీసుకున్న కస్టమర్లు నేడు అందుబాటులో ఉన్న మెరుగైన రేట్లతో పోలిస్తే 3.5 శాతం అధికంగా చెల్లిస్తున్నారు’’ అని బ్యాంక్‌బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ చందానీ తెలిపారు. కనుక ఇంటి రుణాలు తీసుకున్న వారు ఒక్కసారి వాటిని సమీక్షించుకోవడం ఎంతో అవసరం. రుణాన్ని నూతన బెంచ్ మార్క్ విధానంలోకి మార్చుకోవడం.. అప్పటికీ తాము చెల్లిస్తున్న వడ్డీ రేటు, మార్కెట్లో ఉన్న రేటు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే వెంటనే ఆ రుణాన్ని మరో సంస్థకు బదలాయించుకోవడం వల్ల లాభం ఉంటుంది. కానీ, దీనికంటే ముందు చూడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలను అందించే ప్రాఫిట్ కథనం ఇది. అవగాహన లేకే.. ‘‘ఇంటి రుణాన్ని మరొక బ్యాంకు లేదా సంస్థకు బదలాయించుకోకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉంటుంటాయి. మరింత పారదర్శకమైన బెంచ్‌మార్క్ రేట్ల విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలియకపోవచ్చు. లేదా ప్రస్తుతం తాము చెల్లిస్తున్న రేటు మెరుగ్గానూ ఉండొచ్చు. కొందరికి తెలిసినప్పటికీ నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు’’ అని స్విచ్మే వ్యవస్థాపకుడు ఆదిత్య మిశ్రా తెలిపారు. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలతో పోలిస్తే బ్యాంకులు కొంచెం తక్కువ రేటుకు రుణాన్ని ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకుల దగ్గర సేవింగ్స్, కరెంటు ఖాతాల్లో డిపాజిట్లు దండి గా ఉంటాయి. వీటిపై కస్టమర్లకు బ్యాంకులు చెల్లించే రేటు సగటున చాలా తక్కువ. సేవింగ్స్ ఖాతాలపై 3–3.5 శాతం రేటు చెల్లిస్తుంటే, కరెంటు ఖాతాల్లోని బ్యాలెన్స్‌లపై చెల్లింపులు సున్నా యే. చాలా చౌకగా బ్యాంకులకు నిధుల అందుబాటు ఉంటుంది. అందుకే బ్యాంకుల గృహ రుణాలపై రేట్లు కొంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఎప్పుడు మారడం.. గృహ రుణాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేసే మరో సంస్థకు బదిలీ చేసుకోవాలని భావించే వారు.. దీనివల్ల లాభమా? నష్టమా? అన్న సందిగ్ధంలో ఉంటే... పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. ‘‘రుణ కాల వ్యవధి కనీసం మరో 15 ఏళ్లు ఉండి, ప్రస్తుత రుణంపై రేటుతో పోలిస్తే కనీసం 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తక్కువకు ఆఫర్ చేస్తుంటే అప్పుడు రుణాన్ని బదిలీ చేసుకోవడం లాభదాయకం అవుతుంది. ఒకవేళ 15 సంవత్సరాల కంటే తక్కువ కాలమే ఇంకా చెల్లింపులకు మిగిలి ఉంటే అప్పుడు బదిలీ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఎంతన్నది లెక్క వేసుకుని చూడాలి’’ అని ఆదిత్య మిశ్రా సూచించారు. హోమ్‌లోన్ ట్రాన్స్ఫర్ కాలిక్యులేటర్లు ఆన్లైన్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో బదిలీ వల్ల మిగిలేది ఎంతన్నది తెలుసుకోవచ్చు. రుణాన్ని బదిలీ చేసుకునే సమయంలో చెల్లించాల్సిన పలు చార్జీలను మిగిలే ప్రయోజనం నుంచి మినహాయించడం మరిచిపోవద్దు. అంతిమంగా పెద్ద మొత్తమే మిగులుతుందన్న లెక్క తేలితే అప్పుడు నిరభ్యంతరంగా రుణాన్ని బదలాయించుకోవచ్చు. కాకపోతే, రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. ‘‘చాలా సంస్థలు మిగిలి ఉన్న గృహ రుణ బదిలీకి అనుమతిస్తూ కొత్తగా టాపప్ లోన్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అదనపు నిధుల సాయం అవసరమున్న వారు దీన్ని పరిశీలించొచ్చు. ఇది తక్కువ వడ్డీ రేటుకే లభిస్తుంది’’ అని రతన్ చౌదరి తెలిపారు. రేటు తగ్గింపునకు సంప్రదింపులు మీరు ఇప్పటికే గృహ రుణం తీసుకుని వాయిదాలు చెల్లిస్తున్నట్టయితే.. అదే సంస్థ మీతో పోలిస్తే కొత్త కస్టమర్లకు తక్కువ రేటుకు రుణాన్ని ఆఫర్ చేస్తుంటే.. అప్పుడు మీకు కూడా రేటు తగ్గించే విషయమై సంప్రదింపులు చేపట్టాలి. రుణ రేటును తగ్గించేందుకు బ్యాంకు అంగీకరించనప్పుడు లేదా మంచి రేటును ఆఫర్ చేయనప్పుడే రుణ బదలాయింపు గురించి యోచించాలి. గతంలో రుణాలు తీసుకుని ఉంటే.. అవి ఎంసీఎల్ఆర్, బేస్ రేటు, బీపీఎల్ఆర్ వడ్డీ రేట్ల విధానంలో ఉండొచ్చు. ఈ రుణాలను ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత విధానానికి (రెపో తదితర) మార్చుకోవచ్చు. ఎటువంటి ఫీజులు తీసుకోకుండానే బ్యాంకులు ఇందుకు అనుమతిస్తున్నాయి. ‘‘నిర్వహణ చార్జీ, న్యాయపరమైన డాక్యుమెంట్ల చార్జీలను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కసారి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ విధానానికి మారిపోతే.. అప్పుడు కొత్త కస్టమర్లకు అమలు చేసే చార్జీయే వర్తిస్తుంది’’ అని పైసాబజార్ గృహ రుణాల విభాగం అధిపతి రతన్ చౌదరి తెలిపారు. బదిలీ ప్రక్రియ.. రుణాన్ని బదిలీ చేసుకోవాలని నిర్ణయించుకుంటే మీ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా ప్రస్తుత రుణదాతకు తెలియజేయాలి. అప్పుడు సంబంధిత బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) లేదా సమ్మతి పత్రాన్ని విడుదల చేస్తుంది. అందులో ఇంకా చెల్లించాల్సిన రుణం ఎంతన్న వివరాలు ఉంటాయి. ఈ పత్రాన్ని కొత్తగా రుణాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థకు అందించాలి. దీనితోపాటు ఆదాయ ధ్రువీకరణ, ప్రాపర్టీ టైటిల్ డాక్యుమెంట్ కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్యుపేషన్ (ప్రాపర్టీ వినియోగం) లేదా కంప్లీషన్ (నిర్మాణం పూర్తయినట్టు) సర్టిఫికెట్, ఆర్కిటెక్ట్ ప్లాన్ కూడా కొత్త సంస్థ కోరే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత కొత్త సంస్థ రుణాన్ని మంజూరు చేస్తుంది. అంగీకరించిన మేరకు రుణాన్ని చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పాత రుణదాత పేరు మీద విడుదల చేస్తుంది. దీన్ని పాత రుణదాతకు సమర్పించాలి. కొత్త రుణ గ్రహీత వద్ద మార్ట్గేజ్ అగ్రిమెంట్‌పై (తనఖా ఒప్పందం) సంతకం చేయాల్సి ఉంటుంది. పాత సంస్థ నుంచి కొత్త రుణ గ్రహీత పేరు మీదకు ప్రాపర్టీ డీడ్ మార్చే సమయంలో రుణ గ్రహీత హాజరుకావాల్సి వస్తుంది. వ్యయాలు నూతనంగా రుణాన్ని ఇచ్చే సంస్థ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. రుణ మొత్తంలో ఇది ఒక శాతంగా ఉండొచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో రుణదాతలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటారు. ఆ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.10వేల లోపే ఉంటుంది. కొన్ని అయితే, పూర్తిగా మాఫీ కూడా చేస్తున్నాయి. అయితే ప్రాపర్టీ మార్ట్గేజ్ డీడ్‌పై స్టాంప్ డ్యూటీ రూపంలో ఎక్కువ చార్జీ భరించాల్సి ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఇది ఒక్కో విధంగా ఉండొచ్చు. గృహ రుణ బదిలీకి ఎంతలేదన్నా రెండు నుంచి ఐదు వారాల సమయం తీసుకుంటుంది. -
అక్టోబర్‌లో రుణాల పంపిణీ రూ.2.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భాగంగా అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2.5 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. నిదానించిన ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికి ప్రేరణనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. పీఎస్‌బీలు దసరా, దీపావళి పండుగల సమయంలో 374 జిల్లాల పరిధిలో రుణ మేళాలను నిర్వహించిన విషయం గమనార్హం. ‘‘ఈ సందర్భంగా పీఎస్‌బీలు రూ.2,52,589 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులో రూ.1,05,599 కోట్లు నూతన టర్మ్ రుణాలు కాగా, రూ.46,800 కోట్లు మూలధన రుణాలు’’అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) కూడా రూ.19,627 కోట్లను సమకూర్చాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, రుణ డిమాండ్లను అవి తీర్చే స్థితిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఎవరికి ఎంత మేర.. ♦ కార్పొరేట్లకు రూ.1.22 లక్షల కోట్ల రుణాలు ♦ వ్యవసాయ రుణాలు రూ.40,504 కోట్లు ♦ ఎంఎస్ఎంఈ రంగానికి రూ.37,210 కోట్లు ♦ గృహ రుణాలు రూ.12,166 కోట్లు ♦ వాహన రుణాలు రూ.7,058 కోట్లు ♦ ఎన్బీఎఫ్సీ రంగానికి రూ.19,627 కోట్లు -
స్థిర రేటుపై గృహ రుణాలు
లేహ్: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ స్థిర రేటుపై గృహ రుణాలను తీసుకురావాలనుకుంటోంది. ఇవి స్థిర రేటు (ఫిక్స్డ్) నుంచి అస్థిర రేటు(ఫ్లోటింగ్)కు మారే గృహ రుణాలు. అంటే ప్రారంభం నుంచి నిరీ్ణత కాలం వరకు (సుమారు ఐదు పదేళ్లు) ఒకటే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి మార్కెట్ రేట్లకు అనుగుణంగా గృహ రుణంపై రేటు మారుతుంటుంది. ఈ విధమైన గృహ రుణాలను ఆఫర్ చేయవచ్చా? అన్న దానిపై ఆర్బీఐ నుంచి స్పష్టత కోరినట్టు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. లేహ్ వచి్చన సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల రిటైల్ రుణాలను ఫ్లోటింగ్ రేటు ఆధారంగానే అందించాలని, రుణాలపై రేట్లు రెపో వంటి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్ల ఆధారంగానే ఉండాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిన విషయం గమనార్హం. ఆర్బీఐ నూతన మార్గదర్శకాల విడుదల అనంతరం ఫ్లోటింగ్ రేటు రుణాల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై స్పష్టత లేదన్నారు రజనీష్ కుమార్. కస్టమర్లు కోరుకుంటున్నారు.. కొంత మంది కస్టమర్లు గృహ రుణాలపై రేట్లు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అటువంటి వారి కోసం ఫిక్స్డ్–ఫ్లోటింగ్ రేటు ఉత్పత్తులను అందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. వీటిల్లో ఐదు లేదా పదేళ్ల వరకు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందన్నారు. కొంత కాలం తర్వాత ఫ్లోటింగ్ రేటుకు మార్చడం... భవిష్యత్తు పరిస్థితులను బ్యాంకు అంచనా వేయలేకపోవడం వల్లనేనన్నారు. సాధారణంగా గృహ రుణాల కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తుల నిర్వహణ బాధ్యతల విషయంలో 30 ఏళ్ల కాలానికి స్థిర రేటు ఉత్పత్తిని ఆఫర్ చేయడం కష్టమని వివరించారు. ఎస్బీఐ గరిష్టంగా 30 ఏళ్ల కాలానికే గృహ రుణాలను అందిస్తోంది. ప్రస్తుతానికి ఎంసీఎల్ఆర్ ఆధారిత ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను ఆఫర్ చేస్తోంది. రెపో రేటు ఆధారిత ఫ్లోటింగ్ రుణాలపై రేట్లు తరచుగా మారే పరిస్థితులు ఉంటుంటాయి. ఆర్బీఐ రేపో రేటును సవరించినప్పుడల్లా బ్యాంకులు కూడా ఆ మేరకు మార్పులు చేయాల్సి వస్తుంది. -
‘రియల్’ రయ్.. రయ్..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రం ఇచ్చిన రాయితీలు రాష్ట్రంలో ఆ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా రాజధాని భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2020 వరకు రూ. 45 లక్షలలోపు గృహాల కొనుగోలుకు రుణాలు తీసుకునే వారికి వడ్డీ చెల్లింపులో అదనంగా రూ. లక్షన్నర మేరకు ఆదాయపు పన్ను రాయితీ లభించనుంది. ఫలితంగా గృహ రుణాలపై లభించే ఆదాయపు పన్ను రాయితీ రూ. 3.5 లక్షలకు చేరుకుంది. దేశంలో ప్రతి కుటుంబానికీ సొంతింటి కలను నెరవేరుస్తామని చెబుతున్న కేంద్రం... ప్రస్తుతం ఇచ్చిన రాయితీతో సొంతింటి కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. మరోవైపు తొలిసారిగా ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గరిష్టంగా రూ. 2.67 లక్షల వడ్డీ రాయితీ రావడం గమనార్హం. దీంతో మొత్తం పన్ను రాయితీ రూ. 6 లక్షలకు చేరుకుంది. కేంద్రం ఇచ్చిన ఈ రాయితీలతో నిర్మాణరంగం మరింత ఊపందుకోనుంది. మరోవైపు భారీ గృహ సముదాయాలు నిర్మించేందుకు ముందుకు వచ్చే రియల్ సంస్థలకు భూములు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రియల్ కంపెనీలు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే మధ్యతరగతి వాళ్ల కలలను సాకారం చేయనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. పెట్రో ధరలతో ముడిసరుకుల భారం.. పెట్రోల్, డీజిల్‌లపై సెస్ విధించడంతో లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది నిర్మాణరంగంపైనా ప్రభావం చూపే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుక, స్టీలు, సిమెంటు, కాంక్రీటు తదితర సరుకులపై రవాణా భారం పడే అవకాశాలు ఉండటంతో బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మరింత జోరుగా.. దేశంలోని ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాదులోనే ధరలు తక్కువగా ఉండటం తెలిసిందే. దీంతో భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా ఊపందుకుంటోంది. ప్రభుత్వం తాజాగా కల్పించిన ప్రోత్సాహకాలు, రాయితీలను భవిష్యత్తులో మరిన్ని కల్పిస్తే రియల్ రంగం వేగంగా ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ రెసిడెన్షియల్ విభాగంలో 30 శాతం వృద్ధి నమోదైందని ఇటీవల క్రెడాయ్ (ద కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులు వెల్లడించారు. పెరిగిన ఇళ్ల రేట్లు గృహ విక్రయాల్లో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానం దక్కించుకుందని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ జేఎల్ఎల్ వెల్లడించింది. 2019 ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా ఉన్న 7 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్లాట్ల అమ్మకాల్లో హైదరాబాద్ వేరే నగరాలను వెనక్కి నెట్టింది. జనవరి నుంచి జూన్ మధ్య దాదాపు 65 శాతం వృద్ధి నమోదు కాగా, జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్ నిలిచాయి. పశ్చిమ హైదరాబాద్‌లో నివాస సముదాయాలకు గిరాకీ ఎక్కువ ఉందని తెలిపింది. స్వాగతిస్తున్నాం... గృహ రుణాలపై లభించే ఆదాయపు పన్ను రాయితీ రూ. 3.5 లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి పీఎంఏవై కింద లభిస్తున్న రూ. 2.67 లక్షల పన్ను రాయితీ కలిపితే గరిష్టంగా రూ. 6 లక్షల ప్రయోజనం చేకూరనుంది. సొంతింటి కలను నెరవేర్చాలనుకునే మధ్యతరగతి వర్గాలకు మంచి ప్రోత్సాహాన్నిస్తుంది. భారీ గృహ సముదాయాలు నిర్మించాలనుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ కేటాయింపులు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆహ్వనిస్తున్నాం. అయితే పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల రవాణా చార్జీలు పెరిగి ఇసుక, స్టీలు, సిమెంటు, కాంక్రీటు వంటి వాటి ధరలు పెరుగుతాయన్న ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ను ఆర్బీఐ పరిధిలోకి తీసుకురావడం వల్ల బిల్డర్లకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తుందని విశ్వసిస్తున్నాం. ఈసారి బడ్జెట్లో ఇవన్నీ నిర్మాణరంగానికి సానుకూల అంశాలే. – సి.శేఖర్‌రెడ్డి, మాజీ ప్రెసిడెంట్, క్రెడాయ్ -
గుడ్‌న్యూస్ : గృహ రుణాలపై వడ్డీ రాయితీ
న్యూఢిల్లీ : మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఇందుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రూ. 45 లక్షల ఇల్లు కొంటే రూ. 3.5 లక్షల మేర వడ్డీ రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా హోంలోన్ తీసుకున్న వారికి మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటించారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు పెంచుతామని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తామని నిర్మల పేర్కొన్నారు. ఈ క్రమంలో హౌజింగ్ ఫైనాన్స్ రంగాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి తీసుకువస్తామని వెల్లడించారు. అదే విధంగా ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏడాదికి రూ. 5 లక్షల ఆదాయం దాటితే పన్ను విధిస్తామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70 వేల కోట్ల మూలధన సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకు రూ. 5 వేల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తామన్నారు. ముద్రా పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు లక్ష రుణం అందజేస్తామని వెల్లడించారు. ఇక త్వరలోనే రూ. 1, 2, 5, 10, 20 కొత్త నాణేలు విడుదల కానున్నాయని పేర్కొన్నారు. కాగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. -
గృహ రుణాలపై ఎస్బీఐ గుడ్ న్యూస్
ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ రూ.30 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. ఆర్బీఐ కీలక రేట్లను పావు శాతం తగ్గించిన మరుసటి రోజే ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ ఎంపీసీ ప్రకటన నేపథ్యంలో రూ.30 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ తాము ముందు నిలిచినట్టు ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ తెలిపారు. నూతన రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయన్నారు. గృహ రుణాల మార్కెట్లో అత్యధిక మార్కెట్ వాటా తమకు ఉందని, దీంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న దిగువ, మధ్య తరగతి వర్గాలకు రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేయడానికి ఇది సరైన సమయంగా పేర్కొన్నారు. పోటీ బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ బ్యాంకు డిపాజిట్ రేట్లు తక్కువగా ఉన్నాయని, వీటిని ఇంకా తగ్గించాలంటే ఎంసీఎల్ఆర్ వ్యవస్థలో మొత్తం లెండింగ్ రేట్లను తగ్గించాల్సి ఉంటుందన్నారు. -
ఉమ్మడి రుణం.. ఉభయకుశలోపరి
సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే గణనీయంగా పొదుపు చేసి ఉన్నవారు, వేరే ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకునే వారికి ఇది సాధ్యమే అయినా, మిగిలిన వారి ముందున్న ఏకైక మార్గం గృహ రుణమే. అందుకే నేడు విక్రయం అవుతున్న కొత్త ప్రాజెక్టుల్లో మూడింట రెండొంతులు గృహ రుణాలపైనే ఉంటున్నాయి. ఇందులో ఇద్దరు కలసి తీసుకునే గృహ రుణాలు కూడా ఉన్నాయి. మరొకరితో కలసి గృహ రుణం తీసుకోవాల్సిన అవసరం ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఉండొచ్చు. కారణం ఏదైనా జాయింట్ హోమ్‌లోన్ విషయంలో ఉండే సానుకూల ప్రతికూలతలు ఏంటన్నవి తెలుసుకుంటే గృహ రుణ గ్రహీతలకు సాయంగా ఉంటుంది. వాటిని తెలియజేసే కథనమే ఇది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం జాయింట్హోమ్ లోన్ అన్నది మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణం. సాధారణంగా జీవిత భాగస్వామి లేదా తోడబుట్టిన వ్యక్తితో కలసి జాయింట్ హోమ్‌లోన్ తీసుకోవచ్చు. విడిగా ఒక్కరే తీసుకునే రుణంతో పోలిస్తే, ఇతరులతో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణానికి ఎన్నో కారణాలు ఉంటాయి. విడిగా తీసుకునేందుకు అనుకూలమైన క్రెడిట్ స్కోరు లేకపోవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) దరఖాస్తుదారుల రుణ చరిత్ర (క్రెడిట్ స్కోరు)ను చూసిన తర్వాతే రుణంపై తేలుస్తాయి. వారి క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించి ఒకవేళ రుణం మంజూరు చేస్తే తిరిగి చెల్లించే సామర్థ్యం వారికి ఉందా అని ఆరాతీస్తాయి. రుణ ఎగవేతల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నాయి. ఒకవేళ ఒకరి క్రెడిట్ రిపోర్ట్ మంచిగా ఉండి, గతంలో తీసుకున్న రుణాలకు చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే, సహజంగానే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది. ఇటువంటి వారికి గృహ రుణం సులభంగానే లభిస్తుంది. అయితే, క్రెడిట్ స్కోరు తగినంత లేని వారి పరిస్థితి ఏంటి? వీరు ఆశ కోల్పోనవసరం లేదు. క్రెడిట్ స్కోరు మంచిగా ఉన్న మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడమే పరిష్కారం. మీరు ఎంచుకునే ఆ భాగస్వామి క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటే, అప్పుడు సులభంగానే రుణం లభిస్తుంది. ఇక తీసుకున్న రుణాన్ని తాము ఒక్కరమే తిరిగి చెల్లించడం కష్టమని భావించే వారు కూడా ఉమ్మడిగా రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే, భార్యాభర్తలు ఇరువురూ వేతన జీవులు అయి ఉంటే, పన్ను ప్రయోజనం ఇరువురికీ అవసరం కనుక జాయింట్ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపుతారు. సానుకూలతలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే సాధారణ హోమ్‌లోన్‌తో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు లభించే అవకాశాలు ఎక్కువ. ఖరీదైన ప్రాపర్టీ అయితే పెద్ద మొత్తంలోనే గృహ రుణాన్ని పొందొచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం జాయింట్ హోమ్‌లోన్‌లో ఇద్దరూ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకు గాను ఒక్కొక్కరు విడిగా రూ.2లక్షలను మినహాయింపు చూపించుకోవచ్చు. అలాగే, రుణం అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలపై అదనంగా తమ ఆదాయం నుంచి పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. బలహీన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి కూడా జాయింట్ హోమ్‌లోన్‌లో సులభంగా రుణం లభిస్తుంది. ప్రతికూలతలు జాయింట్ లోన్ తీసుకునే వారు గుర్తించుకోవాల్సిన ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత వారిలో ఒకరు తమవాటా చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఇద్దరి క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఇక భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని, అది చెల్లించే కాలంలో విభేదాల కారణంగా వారు విడిపోతే న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రాపర్టీ అనేది ఒకరి పేరిట నమోదై ఉండి, ఇద్దరూ కలసి రుణం తీసుకుని పూర్తిగా చెల్లించారనుకోండి. అయినప్పటికీ ప్రాపర్టీ ఉన్న వారికే దానిపై చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. అపోహలకు చెక్ ► జాయింట్ హోమ్‌లోన్ విషయంలో ఎన్నో సందేహా లు ఉన్నాయి. రుణం తీసుకునే వారు ముందుగా వీటిపై స్పష్టత తెచ్చుకోవాలి. ప్రాథమిక రుణ దరఖాస్తుదారునితో సమానంగా సహ దరఖాస్తుదారునిపైనా గృహ రుణం చెల్లించాల్సిన బాధ్యత సమంగానే ఉంటుంది. అందుకే రుణ డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికి ముందే నిబం ధనలపై పూర్తిగా స్పష్టత తెచ్చుకోవాలి. బ్యాంకుతో చేసుకునే ఒప్పందం గురించి సందేహాలు తీర్చుకోవాలి. ► ఉమ్మడిగా తీసుకునే రుణంలో ఒక్కరికే పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అంటే... ఇద్దరు గ్రహీతలకూ ప్రయోజనాలు సమానంగా వర్తిస్తాయి. కానీ, ఉమ్మడిగా తీసుకునే రుణాలపై పన్ను స్పష్టత కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 24ను చూడాల్సి ఉంటుంది. ఆదాయపన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం... సహ రుణ గ్రహీత పన్ను ప్రయోజనాలు క్లెయి మ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత ఆస్తికి అతను లేదా ఆమె సైతం సహ యజమాని అయి ఉండాలి. ► ఒక్కరు విడిగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే మరొకరితో కలసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకుంటే రుణాన్ని సులభంగా పొందడం అన్నది నిజమే. అయితే, కచ్చితంగా రుణం వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఎందుకంటే గృహ రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అధిక రిస్క్‌తో కూడినవిగానే పరిగణిస్తాయి. కనుక సహ దరఖాస్తుదారునితో కలసి రుణం తీసుకునే ప్రయత్నం చేసే వారు... వారి క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండి, ఈఎంఐ చెల్లించేంత ఆదాయం కలిగి ఉంటేనే రుణాన్ని పొందగలరు. ఉమ్మడి గృహ రుణం విషయంలో ఈ అంశాలతోపాటు వడ్డీ రేటు సహా చూడాల్సినవి మరి కొన్ని కూడా ఉన్నాయి. ఒక్కసారి రుణం తీసుకుంటే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కనుక ముందే సమగ్రంగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలి. గృహ రుణానికి అర్హతలు ఇంటి రుణం దరఖాస్తును ఆమోదించడానికి ముందు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఏఏ అంశాలను చూస్తాయి? రుణం ఇస్తే ఎగవేతకు అవకాశం లేదని ఎలా తేలుస్తాయి? ఇవి తెలిస్తే దరఖాస్తుదారులు తమకు రుణం వస్తుందో లేదో తెలుసుకోవడం సులభం. ఇంటి రుణం విషయానికి వస్తే ప్రతీ దరఖాస్తుదారుని అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. వీటిని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. వయసు దరఖాస్తుదారుని వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి రుణంలో గరిష్ట టర్మ్ 30 ఏళ్ల వరకే ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వారు అయితే దీర్ఘకాలానికి ఇంటి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే మధ్య వయసుకు వచ్చిన వారికి దీర్ఘకాలిక రుణానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 25 ఏళ్ల వయసుతో పోలిస్తే, 40–45 ఏళ్ల వయసున్న వ్యక్తి పదవీ కాలం తక్కువగా ఉంటుంది కనుక. ఈ నేపథ్యంలో యుక్తవయసులో ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో రుణం, దీర్ఘకాలానికి లభించే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, ప్రాపర్టీ వయసు, సైజును కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలంటే గ్రహీత ఆదాయం దాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఎంత ఆదాయం వస్తోంది, స్థిరత్వం ఏ మేరకు తదితర అంశాలు రుణం మొత్తాన్ని నిర్ణయిస్తాయి. క్రెడిట్ హిస్టరీ దరఖాస్తుదారుని రుణ చరిత్ర కూడా కీలకం అవుతుంది. గతంలో తీసుకున్న రుణాలు, వాటికి చెల్లింపులు ఏ విధంగా చేశారన్నది క్రెడిట్ రిపోర్ట్‌లో తెలుస్తుంది. మంచి స్కోరు ఉందంటే రుణ ఎగవేత అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి బ్యాంకులు సులభంగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఇతర బాధ్యతలు అలాగే, దరఖాస్తుదారునిపై ఇప్పటికే ఉన్న ఆర్థిక, రుణ బాధ్యతలు కూడా పరిశీలనకు వస్తాయి. కారు రుణం, క్రెడిట్ కార్డు వంటివి తీసుకుంటే వాటిని కూడా ఇంటి రుణం దరఖాస్తు పరిశీలనలో భాగంగా బ్యాంకులు చూసి, చెల్లింపుల సామర్థ్యంపై అంచనాకు వస్తాయి. వ్యక్తిగత ప్రొఫైల్ వీటితోపాటు దరఖాస్తుదారుని వ్యక్తిగత ప్రొఫైల్ కూడా కీలకం అవుతుంది. విద్యార్హతలు, బ్యాక్‌గ్రౌండ్‌ను రుణదాతలు చెక్ చేసుకుంటారు. మంచి విద్యార్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయి. వీరికి రుణం ఇచ్చినా తిరిగి చెల్లించగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్యాంకులు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. హామీదారుగా ఉంటే ఇప్పటికే ఏదైనా రుణానికి హామీదారుగా ఉన్నారనుకుంటే... ఆ మేరకు దరఖాస్తుదారుని అర్హత నుంచి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహాయించి చూస్తాయి. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ బాధ్యత హామీగా ఉన్న వారిపైనే పడుతుంది. కనుక ఇది కూడా రుణ దరఖాస్తుదారుని అర్హతలను ప్రభావితం చేసే అంశంగా గుర్తు పెట్టుకోవాలి. అర్హత ఉంటే... అర్హత ఉందని నిర్ధారణకు వస్తే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తర్వాతి అంశాలపై దృష్టి పెడతాయి. వీటిల్లో ఆదాయంతో రుణ వాయిదా రేషియో ఒకటి. రుణ వాయిదా చెల్లింపుల కోసం వచ్చే ఆదాయంలో పక్కన పెట్టాల్సిన మొత్తం. ఆదాయంలో సగాన్ని సాధారణ ఖర్చుల కింద మినహాయించి మిగిలిన మొత్తంలో బాధ్యతలను చూస్తాయి. అంటే అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని వాటికి వాయిదాలు చెల్లిస్తున్నట్టయితే ఆదాయంలో కచ్చితమైన బాధ్యతల కింద ఆ మొత్తాన్ని మినహాయిస్తాయి. లోన్ కాస్ట్ రేషియో కూడా ఒకటి. ప్రాపర్టీకి ఇచ్చే రుణంలో దరఖాస్తుదారుని వాటాను చూస్తాయి. అర్హతను పెంచుకునే మార్గాలు ► జీవిత భాగస్వామి లేదా కుటుంబంలో సన్నిహిత వ్యక్తిని సహ దరఖాస్తుదారునిగా చేర్చుకుంటే రుణం లభించడం సులువు అవుతుంది. ► క్రమం తప్పకుండా ఆదాయం, పొదుపు, పెట్టుబడుల చరిత్ర ఉంటే రుణం లభించడం తేలిక. ► అదనపు ఆదాయ వనరుల గురించి కూడా దరఖాస్తుతోపాటు తెలియజేయడం అవసరం. అద్దె ఆదా యం, వ్యాపారం, వృత్తి పరంగా ఇతర ఆదాయ వనరుల గురించి తప్పక తెలియజేయడం లాభిస్తుంది. ► ఇక ఇంటి రుణం అవసరం అనుకునే వారు ముందు నుంచే తమ క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. రుణాలు ఏవైనా తీసుకుని ఉంటే ముందుగా చెల్లించేయడం, బకాయిలు ఉంటే వెంటనే తీర్చేయడం చేయాలి. చాలా వరకు రుణమిచ్చే సంస్థలు క్రెడిట్స్కోరును తెలుసుకునే అవకాశాన్ని ఆన్లైన్లో ఉచితంగానే కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. -
ఆర్బీఐ పాలసీ : వడ్డీరేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద గృహ రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లను పెంచింది. నేటి నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘10 బేసిస్ పాయింట్ల మేర రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచుతున్నాం. నేటి నుంచే ఈ పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి’ అని హెచ్డీఎఫ్సీ స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపింది. దీంతో ఈఎంఐ మరింత భారంగా మారనుంది. ఆగస్టులో కూడా 20 బేసిస్ పాయింట్ల గృహ రుణాల వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను పెంచడంతో, హెచ్డీఎఫ్సీ కూడా వడ్డీరేట్లను పెంచింది. తాజాగా మరోసారి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైపాక్షిక మానిటరీ పాలసీ సమీక్ష మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, హెచ్డీఎఫ్సీ ఈ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ఈ సారి పాలసీలో కూడా రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్‌ధరలు పెరగడంతో, రూపాయి విలువ క్షీణించడంతో, ద్రవ్యోల్బణం మరింత పెరిగే భయాందోళనలు ఉండటంతో, కీలక రెపోను మరోసారి పెంపుకే ఆర్బీఐ మొగ్గుచూపుతుందని మెజార్టీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఆర్బీఐ పాలసీ సమీక్ష అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ సమీక్ష జరగనుంది. గత నెలలో దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ కూడా మూడేళ్ల వరకు ఉన్న అన్ని కాల వ్యవధిలపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో ఏడాది కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. -
వ్యాపారులకిచ్చే గృహ రుణాలపై జాగ్రత్త!
ముంబై: స్వయం ఉపాధి పొందే వ్యాపార వర్గాలకు గృహ రుణాలిచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సూచించింది. ఈ రిస్కీ విభాగంలో మొండిబాకీలు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని ఒక నివేదికలో తెలియజేసింది. గృహ రుణాల మంజూరులో అధిక వృద్ధి సాధించే దిశగా ఆర్థిక సంస్థలు.. ఈ విభాగం వర్గాలకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో క్రిసిల్ నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నాలుగేళ్ల క్రితం హెచ్ఎఫ్సీల పోర్ట్‌ఫోలియోలో.. స్వయం ఉపాధి పొందే గృహ రుణగ్రహీతల వాటా 20 శాతంగా ఉండగా... ప్రస్తుతం అది 30 శాతానికి పెరిగిందని క్రిసిల్ పేర్కొంది. ఇదే సమయంలో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 0.40 శాతం నుంచి రెట్టింపై 1.1 శాతానికి పెరిగింది. ఇది గణనీయమైన ప్రభావం చూపకపోయినప్పటికీ.. ఈ విభాగం విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని క్రిసిల్ తెలిపింది. అందరికీ గృహాలు సమకూర్చే దిశగా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ప్రోత్సాహక చర్యలు తీసుకుంటుండంతో అది గృహ రుణాల వృద్ధికి దోహదపడుతున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. స్వయం ఉపాధి పొం దేవారి ఆదాయాలన్నీ అంచనాలను బట్టే ఉంటాయి కనక జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. -
గృహ రుణంతో ప్రయోజనాలు ఇలా..
పశ్చిమగోదావరి ,నిడమర్రు : ఇంటి రుణం తీసుకుని సొంతిల్లు కల సాకారం చేసుకోవడమే కాదు. ఆదాయపన్ను పరిధిలో ఉన్నవారు భారీగా పన్ను ఆదా చేసుకునే అవకాశం కలదు. గృహరుణం తీసుకోవడం ఆదాయ పన్ను చెల్లింపులో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. రుణం తీసుకున్న అసలుపై ఇంటి రుణం తీసుకున్న తర్వాత ప్రతీ నెలా నిర్ణీత మొత్తం చెల్లిస్తుండాలి. ఇలా చెల్లించే మొత్తం రెండు భాగాలుగా చూడాలి. ఇందులో వడ్డీ, అసలు..రెండూ రుణానికి జమ అవుతాయి. ఇలా అసలుకు జమ అయ్యేదాన్ని ప్రిన్సిపల్‌గా పేర్కొంటారు. ఇలా అసలు రుణానికి జమ అయ్యే మొత్తాన్ని ఓ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద అనుమతించిన రూ.1.5 లక్షల గరిష్ట పరిమితి మేరకు ఆదాయం మినహాయింపు కింద చూపించుకోవచ్చు. ♦ ఉదాహరణ: ఓ ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణం ప్రిన్సిపల్‌కు రూ.1.5 లక్షలు అంతకంటే ఎక్కువే జమ చేశారనుకోండి. అప్పుడు బేసిక్ ఎగ్జంప్షన్ రూ.2.5 లక్షలు. ఇంటి రుణానికి చేసిన రూ1.5 లక్షలు కలిపి మొత్తానికి రూ.4 లక్షలపైనా పన్ను ఉండదు. ♦ వడ్డీపైనా పన్ను ఆదా.. ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపులు ఉన్నాయి. అయితే రుణం తీసుకుని సమకూర్చుకున్న ఇంట్లో నివసిస్తూ ఉండాలి. ఇలా అయితే గరిష్టంగా ఓ ఏడాదిలో రూ.2 లక్షల వరకు వడ్డీ రూపంలో చేసే చెల్లింపులపై పన్ను కట్టక్కర్లేదు. ఈ ప్రయోజనం పొందాలంటే రుణం తీసుకున్న అర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు ఇల్లు సమకూర్చుకోవాలి. కట్టిన ఇల్లయినా, లేక నిర్మాణం చేసుకున్నా గడువు ఇదే. ఈ కాల వ్యవధిలోపు ఇంటి నిర్మాణం సాధ్యం కాకపోతే పన్ను మినహాయింపు రూ.30 వేలకే పరిమితం అవుతుంది. తొలిసారి అయితే మరో రూ.50 వేలు మినహాయింపు ♦ మొదటిసారి ఇంటి కొనుగోలుదారులు అయితే నిబంధనల మేరకు అదనంగా మరో రూ.50 వేలు మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇంటిని అద్దెకు ఇస్తే ఆదాయంలో మున్సిపల్ పన్నులు పోను మిగిలిన మొత్తంలో ప్రామాణిక తగ్గింపు, వడ్డీ చెల్లింపులను నష్టంగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఇంటి అద్దె రూ.5 లక్షలు వస్తుందనుకోండి, ప్రామాణిక తగ్గింపు 30 శాతం అంటే రూ.3.5 లక్షలను నష్టంగా పరిగణిస్తారు. ఇందులో రూ.2 లక్షలను ఇతర ఆదాయం కింద పన్ను మినహాయింపుగా పొందొచ్చు. మిగిలిన రూ.1.5 లక్షలను తదుపరి ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడైనా చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. భాగస్వామితో కలసి తీసుకుంటే ప్రయోజనం ఇంటి రుణాన్ని బార్య, భర్త కలిసి తీసుకుంటే ఇద్దరూ వేర్వేరుగా అంతే మొత్తం పన్ను మినహాయింపులు పొందొచ్చు. వడ్డీ రుపేణా చేసే చెల్లింపులపై చెరో రూ.2 లక్షలు చూపించుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న కుమారుడు, కుమార్తె కూడా ఉంటే బ్యాంకు రుణాన్ని మూడు భాగాలుగానూ చేస్తుంది. అప్పుడు ముగ్గురూ చెరో రూ.2 లక్షల చొప్పున పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు తేదీ నుంచి పన్ను మినహాయింపు ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్లాట్ అయితే రేటు ఎక్కువే. అదే నిర్మాణంలో ఉన్న దాన్ని బుక్ చేసుకుంటే కొంచెం ధర తగ్గుతుంది. రుణం తీసుకుని ఇలా నిర్మాణంలో ఉన్న వాటిని కొనుగోలు చేసినట్టయితే, కొనుగోలు తేదీ నుంచి నిర్మాణం పూర్తయి చేతికి అందేలోపు వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపు కింద చూపించుకోవచ్చు. ఇంటి నిర్మాణం పూర్తయిన లేదా మీ చేతికి అందిన ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు సమాన వాయిదాల్లో చూపించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఇలా గరిష్ట మినహాయింపు ఒక్కో వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలుగానే ఉంటుంది. ఇతర రుణం విషయంలో.. పనిచేస్తున్న సంస్థ నుంచి లేదా సహచర ఉద్యోగి నుంచి రుణం తీసుకున్నా లేక ప్రైవేటు వ్యాపారి నుంచి అప్పు తీసుకున్నా వాటికి పై వడ్డీ చెల్లింపులపైనా మినహాయింపునకు చట్ట ప్రకారం అర్హత ఉంది. కాకపోతే రుణం ఇచ్చిన వారి నుంచి ఓ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంటి మరమ్మతులు, నిర్వహణకు చేసే ఖర్చులను అద్దె ఆదాయంలో 30 శాతం వరకు ప్రామాణిక తగ్గింపు కింద చూపించుకోవచ్చు. టీడీఎస్.. పనిచేస్తున్న సంస్థ ఉద్యోగి వేతనం పన్ను చెల్లించేంత ఉంటే ఆ మేరకు టీడీఎస్ రూపంలో మినహాయించి ఆదాయ పన్ను శాఖకు జమ చేస్తుంది. 2016–17 సంవత్సరపు రిటర్నులను 2018 మార్చి 31లోపు దాఖలు చేసుకోవాలి. వడ్డీ ఆదాయం.. బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉన్నా వాటన్నింటిలోని బ్యాలెన్స్ మొత్తంపై వడ్డీ రూపంలో ఏడాదికి రూ.10 వేలు ఆదాయం మించితే దానిపై పన్ను చెల్లించాలి. రూ.10 వేలు లోపు ఉంటే పన్ను కట్టక్కర్లేదు. ఆ ఆదాయాన్ని రిటర్నుల్లో ఇతర ఆదాయం కింద చూపించాల్సి ఉంటుంది. -
ఇల్లు కొంటారా..? ఇవి గుర్తుంచుకోండి!!
ప్రభుత్వ ప్రోత్సాహం తోడుండటం వల్ల కూడా కావచ్చు... ప్రస్తుతం మార్కెట్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహ రుణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లిస్తున్నాయి. తగ్గుతున్న వడ్డీ రేట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రెరా చట్టం ప్రయోజనాలు, అమ్ముడు కాకుండా పెద్ద సంఖ్యలో పేరుకుపోయిన గృహాలు... ఇవన్నీ చూస్తే ఇంటి కొనుగోలుకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. మీరు కొనడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది వేరే విషయం. ఒకవేళ కొనాలనే ఉద్దేశం ఉండి, ఊగిసలాడుతుంటే కనక సొంతింటి కలను సాకారం చేసుకునే ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం... అనువైన ఇల్లు ఏది..? ఎలాంటి ఇంటిని కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం రెండో అంశం. ఇది కష్టమైన వ్యవహారమే. మంచి లొకాలిటీలో మీరు మెచ్చిన ఇంటిని వెతికిపుచ్చుకుంటే సరిపోదు. ఆ ఇంటి ఖరీదు మీ బడ్జెట్‌కి అనువైనదిగాను, ఇటు సౌకర్యంతో పాటు అటు మానసిక సంతృప్తినిచ్చేదిగా కూడా ఉండాలి. అలాంటి ప్రాపర్టీని ఎంచుకున్నాక... తర్వాతి దశలో చూడాల్సినవి మరికొన్ని ఉన్నాయి. చేతి నుంచీ కొంత పడుతుంది.. ఇంటి కొనుగోలు అంటే బోలెడన్ని లావాదేవీలుంటాయి. డౌన్ పేమెంటు, రిజిస్ట్రేషన్.. స్టాంపు డ్యూటీ, ఫర్నిషింగ్, బ్రోకరేజి, లోన్ చార్జీలు, ఈఎంఐలు.. వగైరా వంటి అనేకానేకం ఉంటాయని గుర్తుంచుకోవాలి. గృహ రుణం సంగతి పక్కనపెడితే.. డౌన్ పేమెంటు, ఇతర ఖర్చులన్నీ మీ జేబు నుంచే కట్టాలి. ఎందుకంటే గృహ రుణం అనేది ప్రాపర్టీ విలువలో సుమారు 70–90 శాతానికే వస్తుంది. ఇక మిగతా ఖర్చులన్నీ మీరు చూసుకోవాల్సినవే. ఇందుకు సరిపడేంత నగదు కూడా చేతిలో పట్టుకుని ఉన్న పక్షంలో .. తదుపరి అంశంపై దృష్టి పెట్టవచ్చు. ఏ అవసరానికి కొంటున్నాం.. ముందుగా ఇంటి కొనుగోలు అవసరం గురించి ప్రశ్నించుకోవాలి. చాలా మందికి రెండే కారణాలుంటాయి. ఒకటి సొంతంగా నివసించేందుకు కాగా రెండోది.. పన్నుపరమైన మినహాయింపు, క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలు పొందడం కోసం ఇన్వెస్ట్మెంట్ కోణంలో కొనడం. అవసరం ఏదైనా రెండింటిలో సానుకూల, ప్రతికూలాంశాలను బేరీజు వేసుకోవాలి. కుటుంబానికి సొంతింటి భరోసా, పెరిగే అద్దెల నుంచి రక్షణ, పెరిగే ఆస్తి విలువ, పన్నుపరమైన ప్రయోజనాలు మొదలైనవి సానుకూలాంశాలు ఉంటాయి. ఇక దీనికి వ్యతిరేక అంశాల విషయానికొస్తే.. చేతిలో నగదు లభ్యత, మార్కెట్.. చట్టపరమైన రిస్కులు, తీసుకున్న రుణం తిరిగి చెల్లింపులో ఎదురయ్యే సమస్యలు లాంటివి ఉంటాయి. పేపర్‌వర్క్ పక్కాగా.. సాధారణంగా ఇంటి కొనుగోలు అనేది చాలా మంది జీవితాల్లో చాలా పెద్ద ఆర్థిక లావాదేవీగానే చెప్పవచ్చు. అందుకే అన్నీ సక్రమంగా ఉండాలి. మీరు కొందామనుకుంటున్న ఇంటికి సంబంధించి మున్సిపల్ క్లియరెన్సులు, ఇతరత్రా అవసరమైన పర్మిట్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి. పేపర్‌వర్క్ పక్కాగా ఉండాలి. స్థల వివాదాల్లాంటివేమీ ఉండకూడదు. ఇంటి పత్రాలను మదింపు చేయడంలో న్యాయనిపుణుడి సలహాలనూ తీసుకోవడం మంచిది. ప్రాపర్టీ చట్టబద్ధంగా పక్కాగా ఉందని పూర్తిగా నమ్మకం కలిగాకే కొనుగోలు విషయంలో ముందడుగు వేయాలి. ఎంత గృహ రుణం రావొచ్చు.. ఏ రుణానికైనా కొన్ని అర్హతా ప్రమాణాలుంటాయి. అవి కుదిరితేనే బ్యాంకులు రుణాలిస్తాయి. గృహ రుణమూ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ అర్హతా ప్రమాణాలేమిటంటే.. మీ వయస్సు (సాధారణంగా 18–65 ఏళ్ల మధ్య), ఆదాయం, క్రెడిట్ స్కోరు, ప్రస్తుతం కడుతున్న రుణ మొత్తాలు మొదలైనవి. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే గానీ క్రెడిట్ స్కోరు తెలుసుకునే వీలు లేదు కదా అనుకోవద్దు. ప్రస్తుతం ఆన్లైన్లోనే ఉచితంగా కూడా క్రెడిట్ రిపోర్టు పొందే వెసులుబాటుంది. సదరు నివేదికను బట్టి రుణ అర్హత మెరుగుపర్చుకునేందుకు వీలయితే ప్రస్తుత రుణాలను తీర్చుకునే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. ఒకవేళ మీ ఎలిజిబిలిటీ తక్కువగా ఉన్న పక్షంలో అర్హత ఉన్న కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్‌గా కూడా రుణం తీసుకోవచ్చు. దీర్ఘకాలమని గుర్తుంచుకోవాలి.. ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా చాలా పెద్ద వ్యవహారమే. సొంతంగా ఉండటానికైనా లేదా ఇన్వెస్ట్మెంట్ కోసమైనా... చాన్నాళ్ల పాటు దాన్నే అట్టే పెట్టుకుని ఉండాలి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌ను ఏ రోజైనా విక్రయించుకునే వీలుంది. అదే ప్రాపర్టీ విషయానికొస్తే.. అలాంటి వెసులుబాటు ఉండదు. అనుకున్న రేటుకు విక్రయించుకుని, వైదొలగాలంటే కాలం పట్టేస్తుంది. ఇక, గృహ రుణం తీసుకున్నారంటే.. కాలపరిమితి ఎంతైనా సరే చట్టప్రకారంగాను, ఆర్థికంగానూ, నైతికంగాను కట్టి తీరాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. -
ఇకపై ‘చౌక గృహ’ రుణాల భారం!
ముంబై: చౌక గృహ నిర్మాణాలు, వీటికి రుణాలు సంబంధిత అంశాలకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో... ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్, ఆ సంస్థ దేశీయ అనుబంధ సంస్థ ఇక్రాలు తాజాగా ఈ ధోరణికి ‘రెడ్ ఫ్లాగ్’ ఊపాయి. చౌక గృహ రుణాలే బ్యాంకులకు తదుపరి ముప్పుగా వాటిల్లే అవకాశం ఉందని మూడీస్–ఇక్రా తాజా నివేదిక అంచనా వేసింది. ఈ విభాగంలో కొన్ని ప్రతికూల అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని, ఇవే అంశాలు 2018లోనూ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ♦ చౌక గృహ నిర్మాణ రుణ మంజూరీలో నెలకొన్న పోటీ– రుణ ప్రమాణాలు తగ్గిపోవడానికి కారణమవుతోంది. ఇక స్వయం ఉపాధిలో ఉన్న వారికి చౌక గృహ రుణ సదుపాయం వల్ల బకాయిల పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ♦ సాంప్రదాయక గృహ విభాగంలో రుణనాణ్యత స్థిరంగా కొనసాగేవీలుంది. అయితే చౌక గృహరుణ విభాగంలో మాత్రం ఇందుకు సంబంధించి కొంత ఆందోళన పరిస్థితి కొనసాగవచ్చని ఇక్రా హెడ్ (స్ట్రక్చర్డ్ ఫైనాన్సెస్) మిట్టల్ పేర్కొన్నారు. ♦ చౌక గృహ రుణ విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు 2017 సెప్టెంబర్ నాటికి 1.8 శాతానికి చేరాయి. సాంప్రదాయక గృహ రుణ విభాగంతో పోల్చిచూస్తే 90 రోజులు పైబడిన రుణ బకాయిల సగటు స్థాయి చౌక గృహ రుణాల విషయంలో దాదాపు ఏడు రెట్లు అధికంగా ఉంది. ♦ 2020 నాటికి అందరికీ గృహం లక్ష్యం నెరవేరాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం, ఇందుకు సంబంధించి చౌక గృహ నిర్మాణ రంగంలో భారీ ప్రోత్సాహకాలు, దీని ప్రాధాన్యతా విభాగంగా బ్యాంకింగ్ పరిగణించడం, వడ్డీ రాయితీలు, ప్రత్యక్ష నగదు సబ్సిడీ వంటి అంశాలను నివేదిక ప్రస్తావిస్తూ, రుణ నాణ్య తాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది. ♦ అయితే మొత్తంగా హౌసింగ్ రుణ విభాగం రిటైల్ రుణాలకు సంబంధించి అత్యుత్తమమైనదిగా కొనసాగుతోంది. రుణ హామీలు పటిష్టంగా ఉండడం, రుణం తీసుకునే వ్యక్తి సొంత ఆస్తిగా రుణ హామీ ఉండడం, ఆస్తి ధరల్లో భారీ తగ్గుదల లేకపోవడం, రుణానికి తగిన ఆస్తి విలువల వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావనార్హం. ♦ ఇక 2017 జూలై ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అంతక్రితం డీమోనిటైజేషన్ చిన్న తరహా పరిశ్రమలపై భారాన్ని మోపాయని ఇక్రా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రస్తోగీ పేర్కొన్నారు. -
గృహ, కారు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్
గృహ, కారు కొనుగోలుదారులకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ, కారు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. రిటైల్ రుణాలను పెంచడానికి, హోమ్, ఆటో రుణ రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కొత్త వడ్డీరేట్ల ప్రకారం 8.30 శాతానికి గృహ రుణాలను, 8.70 శాతానికి ఆటో రుణాలను ఆఫర్ చేయనున్నట్టు ఎస్బీఐ పేర్కొంది. ఈ వడ్డీరేట్లు అర్హులైన వేతన కస్టమర్లందరికీ వర్తిస్తాయని, రూ.30 లక్షల వరకున్న రుణాలకు వార్షికంగా 8.30 శాతం వడ్డీరేటును విధించనున్నట్టు బ్యాంకు తెలిపింది. కారు రుణాల వడ్డీరేట్లు వార్షికంగా 8.70 శాతం నుంచి 9.20 శాతం మధ్యలో ఉండన్నాయి. అంతకముందు ఈ రేంజ్ 8.75 శాతం నుంచి 9.25 శాతం మధ్యలో ఉంది. అసలైన రేటు రుణ మొత్తం, వ్యక్తి క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. 2017 నవంబర్ 1 నుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. అలాగే మెచ్యూరిటీస్లకు వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు కూడా ఎస్బీఐ పేర్కొంది. అంతేకాక ప్రస్తుతమున్న ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేటును కూడా బ్యాంకు తగ్గించింది. అంతకముందు 6.5 శాతమున్న వడ్డీరేటును ప్రస్తుతం 6.25 శాతానికి తగ్గించినట్టు బ్యాంకు తన వెబ్సైట్లో తెలిపింది. -
హోమ్ లోన్స్‌పై ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై : దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గృహ రుణం తీసుకునే వారికే పండుగ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు నెలల కాలవ్యవధి అంటే నవంబర్ 30 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కొత్తగా గృహరుణం పొందేవారు లేదా తమ పాత గృహరుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు ట్రాన్సఫర్ చేసుకునే వారికి 20 శాతం క్యాష్ బ్యాక్ అంటే రూ.10వేల రూపాయల వరకు అందించనున్నట్టు బ్యాంకు చెప్పింది. కస్టమర్ ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుపై కనీసం రూ.30వేల కొనుగోళ్లు జరిపిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. బ్యాంకు వెబ్సైట్ తెలిపిన సమాచారం మేరకు సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్యలో కొత్తగా గృహరుణాలు పొందేవారికి, పాత గృహరుణాలను ఐసీఐసీఐకి ట్రాన్సఫర్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిసింది. 2017 డిసెంబర్ 31 వరకు ఈ మొత్తాన్ని అందించడం జరుగుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డు రెండూ కలిగి ఉన్న వారికి ఒకే కార్డుపై ఈ క్యాష్‌బ్యాక్‌ను బ్యాంకు ఇవ్వనుంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు గృహరుణాల వడ్డీరేట్లు మహిళలకు 8.35 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. వేతన వ్యక్తులకైతే 8.40 శాతం నుంచి ఉన్నాయి. స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు 8.50శాతం, ఇతరులకు 8.55శాతం వడ్డీకి రుణాలను మంజూరు చేస్తోంది. -
మరింత దిగిరానున్నగృహరుణ వడ్డీ రేట్లు
2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెండవ ద్వితీయ ద్రవ్య విధాన సమీక్షలో యథాతధ వడ్డీరేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ అనంతరం ద్రవ్యవిధాన కమిటీ వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది. రివర్స్, రెపో రేట్లను స్టేటస్ కో వ్యూహాన్ని అనుసరిచింది. చాలామంది ఆర్థిక విశ్లేషకుల అంచనాలకు కనుగుణంగానే ఆర్బీఐ అనుసరించిన విధానంతో గృహరుణాల రేట్లు దిగారానున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఎస్ఎల్ఆర్లో కట్ బ్యాంకింగ్ పరిశ్రమకు సానుకూలంగా ఉందనీ, ఇది మరింత ద్రవ్యత్వాన్ని అందిస్తుందని ఎనలిస్టుల అంచనా. ఫలితంగా గృహరుణాలు మరింత దిగిరానున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 6.25, రివర్స్‌రెపోను 6శాతం, సుప్రీం బ్యాంక్ లీటరి లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) ను 50 బీపీఎస్ పాయింట్లను తగ్గించింది. దీంతో కచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత ద్రవ్యం రానుంది. దీంతో హోం లోన్లు మరింత చౌకగా లభించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక ద్రవ్యతతో, కొంతమంది బ్యాంకులు ముందుకొచ్చే బిట్లను తగ్గించవచ్చని చెప్పారు.మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి నిర్ణయించడంతో ఎస్ఎల్ఆర్ 50 బేసిస్ పాయింట్లు తగ్గింపును ఊహించలేదని ఎనలిస్టులు చెప్పారు. ఫలితంగా బ్యాంకులు ఖాతాదారులకు తక్కువ రేటులో ఎక్కువ రుణా లివ్వగలిగే ద్రవ్యనిధులను కలిగి ఉంటాయని చెప్పారు. క్రెడిట్ ఆఫ్ తీసుకోవడం కూడా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రొవిజనింగ్ అవసరాలు తగ్గిపోతుండటం వలన హౌసింగ్ రుణాలు ఖచ్చితంగా చౌకగా లభించనున్నాయని ఇన్వెస్టాప్ షాప్ప్ ఇండియా లిమిటెడ్ సీఈఓ ఆశిష్ కపూర్ తెలిపారు. అయితే మార్జిన్ ఒత్తిడి వంటి, ఎన్పీఐ రిజల్యూషన్ తదితరకారణాల రీత్యా పారిశ్రామిక రుణాలు చౌకగా లభించవనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్బీఐ తదుపరి పాలసీ రివ్యూ ఆగష్టులో జరుగనుంది. ప్రధానంగా జీఎస్టీ, రుతుపవనాలపై ఆర్బీఐ దృష్టి కొనసాగనుంది. ఏదైనా సానుకూల సూచికలు అందితే తప్ప ఆర్బీఐ కొన్ని నెలలు రిపో రేటు ప్రస్తుత వైఖరినే కొనసాగించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు ఇంటిని కొనడానికి చూస్తున్న వారు ముందుకు సాగవచ్చనీ, గృహ రుణాన్ని తీసుకోవడానికి ఇదే సరైన సమయమని సూచిస్తున్నారు. కాగా డిమానిటైజేషన్ అనంతరం దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు హోం లోన్లపై విధించే ఎంసీఎల్ఆర్ రేట్లను ఇప్పటికే గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. -
రూ.5,000 కోట్ల గృహ రుణాల లక్ష్యం
♦ ఈ ఆర్ధిక సంవత్సరంలో 25 శాతం వృద్ధి ♦ గృహ రుణాల తగ్గింపు జూలై 31 వరకే ♦ తెలంగాణలో కొత్తగా 100 ఏటీఎంల ఏర్పాటు ♦ మరో 200 ఏటీఎంల తరలింపు కూడా.. ♦ ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ సీజీఎం హర్దయాల్ ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహ రుణాల వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తెలంగాణలో రూ.5,000 కోట్ల గృహ రుణాల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 25 శాతం వృద్ధి రేటును లకి‡్ష్యంచామని ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ సీజీఎం హర్దయాల్ ప్రసాద్ తెలిపారు. రూ.30 లక్షల్లోపు రుణాలకు 8.35 శాతం, రూ.30–70 లక్షల్లోపు రుణాలకు 8.50 శాతం వడ్డీ రేట్లుంటాయని.. ఈ రెండూ కూడా జులై 31 వరకే అందుబాటులో ఉంటాయని ఆయన తెలియజేశారు. మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత కారణంగా చాలా వరకు ఏటీఎంలు మూతపడి ఉంటున్నాయి. దీంతో ఏటీఎంలను తొలగిస్తున్నారనే అసత్య ప్రచారం జరుగుతోంది. అనుబంధ బ్యాంకుల విలీనంతో ఒకే చోట రెండు శాఖలు, ఏటీఎంలుంటే వాటిని తొలగించి వేరే చోటుకు తరలిస్తున్నామే తప్ప.. ఏటీఎంలను గానీ శాఖలను గానీ తీసేయటం లేదు’’ అని ఆయన వివరించారు. అనుబంధ బ్యాంకులతో కలిపి ప్రస్తుతం తెలంగాణలో ఎస్బీఐకు 1,301 శాఖలు, 17,800 ఏటీఎంలున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే 909 శాఖలు, 1,300 ఏటీఎంలున్నాయి. సెప్టెంబర్ నాటికి తెలంగాణలో కొత్తగా మరో 100 ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని, మరో 200 ఏటీఎంలను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తామని హర్దయాల్ తెలియజేశారు. తెలంగాణలో రూ.20 వేల కోట్ల గృహ రుణాలు.. దేశంలో రూ.2.4 లక్షల కోట్ల గృహ రుణాలనందిస్తే.. ఇందులో 45 శాతం వాటా రూ.30 లక్షల్లోపు రుణాలదే. మొత్తం రుణాల పంపిణీలో తెలంగాణ వాటా రూ.20 వేల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో మెజారిటీ వాటా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలదేనని చెప్పారు. అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత మొండి బకాయిలు (ఎన్పీఏ) పెరిగాయని.. వచ్చే 6 నెలల్లో వీటి పరిష్కారానికి రోడ్‌మ్యాప్ రూపొందిస్తామని చెప్పారు. రీపేమెంట్ సరిగా ఉంటే మరింత ఎక్కువ మొత్తంలో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించే వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ డీజీఎం (రియల్ ఎస్టేట్ అండ్ హౌజింగ్ బిజినెస్ యూనిట్) వీ సంబంధన్, జీఎం గిరిధార కీనీ కూడా పాల్గొన్నారు. -
చౌక గృహాలకు రుణం... లాభం!
ముంబై: చౌక గృహాలకు (రూ.10 లక్షల లోపు) రుణాలను అందించడం బ్యాంకింగ్ రంగానికి లాభదాయకమైన అంశంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ– సిబిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ విభాగంలో గడచిన ఐదేళ్లలో రుణ వృద్ధి రేటు 23 శాతంపైగా ఉందని సిబిల్ పేర్కొంది. ఈ విభాగంలో మొండిబకాయిలు ఒక శాతంగా ఉన్నాయని తెలిపింది. రుణదాతలకు హౌసింగ్ విభాగం పటిష్ట వృద్ధి అవకాశాలను కల్పిస్తోందని తన తాజా అధ్యయన పత్రంలో వివరించింది. ఈ నివేదికలో అంశాలను సిబిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్షలా చందూర్కర్ వివరించారు. ముఖ్యాంశాలు చూస్తే... 2016లో చౌర గృహ రుణ బుక్విలువ రూ.30,400 కోట్లు. రుణ గ్రహీతలు 7.5 లక్షల మంది.మొండిబకాయిల శాతం అతి తక్కువగా ఉండడం రుణదాతకు సానుకూలాంశం. ఈ విభాగంలో సగటు రుణ పరిమాణం సగటున రూ.4.8 లక్షలు ఉంటే, ఇది ఇప్పుడు దాదాపు రూ.4.1 లక్షలకు చేరింది. సగటు తక్కువగా ఉండడం వల్ల మరిన్ని చిన్న బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు రానున్న సంవత్సరాల్లో ఈ విభాగంలోకి అడుగుపెట్టొచ్చు. టాప్–5లో ఆంధ్రప్రదేశ్... చౌక గృహ రుణాలకు సంబంధించి అకౌంట్ల ప్రారంభంలో గడచిన ఐదేళ్లలో టాప్‌లో ఉన్న రాష్ట్రాల్లో– మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ప్రారంభమైన అకౌంట్లలో 60 శాతం వాటా ఈ రాష్ట్రాలదేనని అధ్యయనం తెలిపింది. అకౌంట్ల విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో (6.53 లక్షలు) ఉంది. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ (5.60 లక్షలు), గుజరాత్ (3.13 లక్షలు), తమిళనాడు (2.65 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (2.28 లక్షలు) ఉన్నాయి. -
గృహ రుణాన్ని మార్చేద్దాం!
► ఐదేళ్ల కిందట తీసుకున్న రుణాలపై అధిక వడ్డీ రేటు ► ప్రస్తుతం ఎంసీఎల్ఆర్తో దిగొచ్చిన రేట్లు ► 8.5 శాతానికే ఆఫర్ చేస్తున్న పలు బ్యాంకులు ► పాత రుణాలను కొత్త విధానానికి మార్చుకునే అవకాశం ► వడ్డీ ఒకశాతం తగ్గినా మొత్తంగా మిగిలేది ఎక్కువే మీరు ఇంటి కోసం రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తూ వస్తున్నారా? ఎప్పుడో తీసుకున్న రుణం కాబట్టి అప్పటి వడ్డీ రేట్ల ప్రకారం నెలసరి వాయిదాలు తీర్చడం కష్టంగా అనిపిస్తోందా? అయితే, రుణంపై వడ్డీ రేటును మార్చుకుంటే సరిపోతుంది! బ్యాంకులు గతంలో ఉన్న బేస్ రేట్ విధానం నుంచి నూతన మార్జినల్ కాస్ట్ బేస్డ్ రుణ రేటుకు (ఎంసీఎల్ఆర్) మారడంతో రుణాలపై రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎల్ఆర్కు మారడం ద్వారా మీరు కూడా తాత్కాలికంగా భారాన్ని దింపుకోవచ్చు. వడ్డీ రేటు ఎంత...? గృహరుణాన్ని తీసుకుని నెలసరి వాయిదాలు తీర్చడంలో ఇబ్బందులు పడుతున్నవారు ముందు చేయాల్సింది ఒకటుంది. బ్యాంకు ఎంత వడ్డీరేటు వసూలు చేస్తోందో ఓ సారి కనుక్కోవాలి. ఎందుకంటే బ్యాంకులు ఇటీవల బేస్ రేటు నుంచి ఎంసీఎల్ఆర్కు మళ్లాయి. మరి ఆ ప్రయోజనం కస్టమర్‌గా మీకు దక్కుతోందో, లేదో ముందు చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఖాతాదారులందరికీ ఒకటే రేటును అమలు చేయడం లేదు. కొత్త కస్టమర్లకు తక్కువ రేటుకే రుణాలిస్తూ పాత కస్టమర్లను మాత్రం చార్జీల పేరుతో బాదేస్తున్నాయి. అందుకే మీ బంధుమిత్రుల్లో ఎవరైనా గృహ రుణం లేదా ఆటో లోన్, లేదా వ్యక్తిగత రుణాన్ని తీసుకుని ఉంటే వారి నుంచి బ్యాంకు ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తోందో కనుక్కోండి. సాధారణంగా బ్యాంకుల మధ్య వడ్డీ రేట్ల విషయంలో స్వల్ప తేడాలుండడం సహజమే. కానీ ఒకే బ్యాంకులో ఖాతాదారుల మధ్య కూడా ఈ వ్యత్యాసాలుంటాయని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ తేడా తక్కువ ఉండొచ్చు. ఎక్కువగానూ ఉండొచ్చు. ఇది కస్టమర్ల రుణ చెల్లింపుల చరిత్ర (క్రెడిట్ హిస్టరీ/క్రెడిట్ స్కోరు) వల్ల అనుకుంటే పొరబడినట్టే. కొన్ని బ్యాంకులు కొత్త వారిని ఆకర్షించటానికి వారికి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. పాతవారిపై భారం మోపుతున్నాయి. బ్యాంకులు పాత ఖాతాదారులు, కొత్త ఖాతాదాల విషయంలో భిన్న రకాల వడ్డీ రేట్లతో వివక్ష చూపిస్తున్నాయని ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిస్డమ్’ సహ వ్యవస్థాపకుడు రామ్‌గణేష్ అయ్యంగార్ పేర్కొన్నారు. పీఎల్ఆర్ టు ఎంసీఎల్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2016 ఏప్రిల్‌లో ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక విధానం ఇది. అప్పటి వరకు బేస్ రేట్ విధానం అమల్లో ఉండేది. బేస్ రేటు విధానంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు బదిలీ చేయకుండా వేచి చూసే ధోరణి అనుసరించటంతో ఆర్బీఐ ఎంసీఎల్ఆర్ను తీసుకొచ్చింది. బ్యాంకులు నిధుల సేకరణకు అయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రుణ రేటును ఖరారు చేసుకుంటాయి. బేస్ రేటు కంటే ముందు తక్కువ పారదర్శకతతో కూడిన ప్రైమ్ లెండింగ్ రేటు (పీఎల్ఆర్) అమల్లో ఉండేది. రుణ బదిలీకి చార్జీలుంటాయ్ రుణాల్లో ఫిక్స్డ్, ఫ్లోటింగ్ అని రెండు రకాల వడ్డీ రేట్లుంటాయి. ఆర్బీఐ ప్రకటించే రేట్ల ఆధారంగా బ్యాంకుల ఎంసీఎల్ఆర్ మారుతుంది. దానికనుగుణంగా ఎప్పటికప్పుడు వడ్డీ రేటు మారే రుణాలు ఫ్లోటింగ్. కొన్నేళ్ల పాటు అలా మారకుండా స్థిరంగా ఒకే రేటుతో ఉండేవి ఫిక్స్డ్ రేటు రుణాలు. అయితే ప్రస్తుత రుణాలను ఎంసీఎల్ఆర్ కిందకు మార్చుకుందామని నిర్ణయించుకుంటే అందుకు బ్యాంకులు కొంత చార్జీలు వసూలు చేయొచ్చు. డ్రాఫ్ట్ తయారీ, నూతన ఒప్పందం రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ తదితర చార్జీలను బ్యాంకులు భరించాల్సి వస్తుంది. దీంతో అవి ఖాతాదారుల నుంచి వసూలు చేస్తాయి. మిగిలి ఉన్న రుణం మొత్తంపై ఈ చార్జీలు 0.20 శాతానికి మించి ఉండవు. కానీ బ్యాంకులు 0.5 శాతం వసూలు చేస్తుంటాయి. ఈఎంఐ ఎంత తగ్గుతుంది...? 0.50 శాతం చార్జీని బ్యాంకు విధించినా ఎంసీఎల్ఆర్కు మారడం లాభదాయకమేనని నిపుణుల సూచన. ఎందుకంటే స్వల్పంగా చార్జీలు చెల్లించినా అధిక వడ్డీ రేటు దిగి రావడం వల్ల మిగిలే ప్రయోజనం ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. ఉదాహరణకు ప్రైవేటు కంపెనీ ఉద్యోగి అయిన శ్రావ్య (40) బేస్ రేటు కింద గృహ రుణం తీసుకున్నారు. ఆమె ఇంకా రూ.50 లక్షల బకాయి చెల్లించాల్సి ఉంది. వ్యవధి 15 ఏళ్లు. రుణ రేటులో ఒక శాతం తగ్గినా ఆమె నెలసరి వాయిదా (ఈఎంఐ) రూ.52,200 నుంచి రూ.49,250కు దిగొస్తుంది. అంటే రూ.2,950 తగ్గుదల. ఇలా మారడం వల్ల మొత్తం మీద మిగిలేది రూ.5 లక్షలకు పైనే. కానీ, మారేందుకు చెల్లించాల్సిన చార్జీలు 0.50 శాతం కింద రూ.25వేలే. బ్యాంకు సిబ్బందితో మంచి సంబంధాలుంటే ఈ చార్జీలను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల క్రితం తీసుకుంటే భారమే! ఐదేళ్ల క్రితం గృహ రుణం తీసుకుని ఉంటే ఆయా కస్టమర్లు పీఎల్ఆర్ రేటు విధానంలో వడ్డీ చెల్లిస్తున్నట్టే. ఆ తర్వాత బేస్ రేటు విధానం అమల్లోకి వచ్చింది. వీటితో పోలిస్తే ఇప్పుడు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కింద 8.5% వడ్డీ రేటుకు గృహ రుణాలను ఆఫర్ చేస్తుండడం ఆకర్షణీయం. ఇప్పటికే గృహ రుణాలు తీసుకుని ఉన్న వారు కూడా ఈ ప్రయోజనాన్ని అందుకోవడం ద్వారా వడ్డీ భారాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు. ‘‘ముందు మార్కెట్లో తక్కువ రుణ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నది తెలుసుకోవాలి. దీనివల్ల తాము రుణం తీసుకున్న బ్యాంకును వడ్డీ రేటు విషయమై బేరమాడేందుకు కావాల్సిన అవగాహన వస్తుంది’’ అని ఐసర్వ్ ఫైనాన్షియల్ సీఈవో దీపక్ సమంత వ్యాఖ్యానించారు. మార్కెట్‌కు అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించుకోవాలనుకుంటే పీఎల్ఆర్ లేదా బేస్ రేటులో ఉన్న వారు ఎంసీఎల్ఆర్కు మారడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో తటస్థ విధానానికి మళ్లిన నేపథ్యంలో ప్రస్తుతానికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదని, కొంత తగ్గే అవకాశం కూడా లేకపోలేదన్నది వారి విశ్లేషణ. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎంసీఎల్ఆర్ విధానమనేది బ్యాంకులు ఎప్పటికప్పుడు ఆర్బీఐ విధానానికి అనుగుణంగా తమ ప్రామాణిక రేట్లను మార్చుకునేందుకు ఉద్దేశించినది. కనుక ఈ విధానంలో వడ్డీ రేట్లు ఎంత వేగంగా అయితే తగ్గాయో.... ఆర్బీఐ రెపో, సీఆర్ఆర్లను పెంచడం మొదలు పెడితే... అంతే వేగంగా పెరుగుతాయి. -
ఆ ఇళ్లు ‘అందుబాటు’లోనే
అఫర్డబుల్ హౌసింగ్‌కు ఇన్ఫ్రా పరిశ్రమ హోదా ఆ రంగానికి చౌకగా దక్కనున్న రుణాలు బిల్టప్ ఏరియాను కార్పెట్ ఏరియాగా మార్చిన జైట్లీ దీంతో ఇంకాస్త పెద్ద ఇళ్లు కూడా అందుబాటు పరిధిలోకి పీఎంవైఏకు రూ.23 వేల కోట్లు కేటాయింపు సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు బడ్జెట్ మార్గం సుగమం చేసిందనే చెప్పాలి. 2019 నాటికి దేశంలో కోటి గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలోనే ప్రధాని నరేంద్రమోదీ చెప్పగా... జైట్లీ దానికి రోడ్‌మ్యాప్ వేశారు. అందుకు అనుగుణంగానే అందుబాటు గృహాల విభాగానికి మౌలిక రంగ హోదానిచ్చారు. గతేడాది రూ.15 వేల కోట్లుగా ఉన్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంవైఏ) కేటాయింపును ఈసారి బడ్జెట్లో రూ.23 వేల కోట్లకు పెంచారు. అలాగే అందుబాటు గృహాలను నిర్మించే డెవలపర్లను ప్రోత్సహించేందుకు గాను 80–ఏబీఏ సెక్షన్‌ను సవరించారు కూడా. ప్రస్తుతం మూడేళ్లుగా ఉన్న అందుబాటు ఇళ్ల ప్రాజెక్ట్ నిర్మాణ గడువును 5 ఏళ్లకు పెంచారు. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో మెట్రోలో 30 చ.మీ., నాన్మెట్రోలో 60 చ.మీ. గతేడాది బడ్జెట్లో అందుబాటు ఇళ్లను ప్రోత్సహించేందుకు ఆదాయ పన్ను రాయితీలను కల్పించిన జైట్లీ.. ఈసారి అందుబాటు గృహాల బిల్టప్ ఏరియాలను కార్పెట్ ఏరియాలుగా మార్పు చేశారు. అంటే గతంలో 30 చ.మీ., 60 చ.మీ. బిల్టప్ ఏరియాలుంటే అందుబాటు గృహాలుగా పరిగణించేవి కాస్త తాజా బడ్జెట్‌తో మెట్రో నగరాల్లో 30 చ.మీ., నాన్‌మెట్రో నగరాల్లో 60 చ.మీ. కార్పెట్ ఏరియాలుగా ఉండాలన్నమాట. ఒక చదరపు మీటరంటే 9 చదరపు అడుగులు. ఈ లెక్కన 60 చదరపు మీటర్లంటే 540 చదరపు అడుగుల ఇళ్లన్న మాట. గతంలో సింగిల్ బెడ్ రూమ్ మాత్రమే అందుబాటు ఇళ్ల పథకం కిందకు వచ్చేది. ఎటూ చాలదనే భావనతో అల్పాదాయ, దిగువ మధ్య తరగతుల వారు కొనేవారు కాదు. దాంతో డిమాండ్ లేక వీటి నిర్మాణానికి సంస్థలు కూడా సాహసించలేని పరిస్థితి ఉంది. తాజా మార్పుతో దాదాపు 900 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ( 650 – 700 అడుగుల కార్పెట్ ఏరియా) అవుతుంది. ఈ విస్తీర్ణంలో చిన్న డబుల్ బెడ్ రూమ్స్ వస్తాయి. దీంతో అల్పాదాయ, దిగువ మధ్య తరగతి వారు ఈ పథకం కింద ఇళ్ల కొనుగోలుకు ముందుకు వస్తారని, నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2001 నాటి మార్కెట్ రేటు ఆధారంగా ఇప్పటివరకు 1980 కంటే ముందుకొన్న ఫ్లాట్, ప్లాట్ ఏదైనా స్థిర, చరాస్తులను ఎప్పుడు విక్రయించినా సరే 1981 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ రేటు ఆధారంగా మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్) విలువలను లెక్కగట్టేవారు. కానీ, తాజా బడ్జెట్లో విలువ లెక్కింపు సంవత్సరాన్ని 2001 ఏప్రిల్ 1కి మార్చారు. దీంతో విక్రయదారుడికి సరైన మార్కెట్ రేటు వస్తుంది. గతంలో మూడేళ్లుగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ పన్ను ప్రయోజనాలను 2 ఏళ్లకు కుదించారు. మూడేళ్ల కంటే ఎక్కువున్న స్థిరాస్తుల దీర్ఘకాలిక మూలధన లాభాలు 20 శాతం చెల్లించాలి. మౌలిక రంగ హోదాతో ఏం జరుగుతుంది? మౌలిక రంగ హోదా ఇవ్వటం వల్ల అఫర్డబుల్ ఇళ్లను నిర్మించే కంపెనీలకు ఇన్ఫ్రా రంగానికిచ్చే వడ్డీ రేటుతో రుణాలు లభించే అవకాశముంటుంది. అంటే తక్కువ వడ్డీకే అన్నమాట. దీనివల్ల అవి నిర్మాణానికి ముందుకొస్తాయి. ఆ మేరకు కలిగే లాభాన్ని వినియోగదారులకు బదలాయించే అవకావం కూడా ఉంటుంది. రూ.20 వేల కోట్ల గృహ రుణాలు.. గృహ రుణాలు అందించే బ్యాంకులకు 2017–18కి గాను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20 వేల కోట్ల రుణాలను అందించనున్నారు. మధ్య ఆదాయ వర్గాల కోసం కొత్తగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద రూ.1,000 కోట్లు కేటాయించారు. అలాగే నివాస విభాగంలో అమ్ముడుపోకుండా ఉండిపోయే ఇళ్లపై (ఇన్వెంటరీ) పన్ను రాయితీలను ప్రకటించారు. కంప్లీషన్ సర్టిఫికెట్ పొందిన తర్వాత ఖాళీగా ఉన్న ఇళ్లపై అద్దెను ఆదాయ పన్నుకు లోబడి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోగానే ల్యాండ్ ఓనర్ చెల్లించే మూలధన రాబడిని కాస్త ప్రాజెక్ట్ పూర్తయ్యాక చెల్లించే వీలును కల్పించారు. కార్పెట్..బిల్టప్ అంటే.. సాధారణంగా కార్పెట్ ఏరియా అంటే గోడలు కాకుండా మనం ఉపయోగించే స్థలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కానీ బిల్టప్ ఏరియా అంటే గోడలు కలుపుకొని ఇంట్లోని మొత్తం స్థలాన్ని బిల్టప్ ఏరియాగా పరిగణిస్తారు. ఇందులో బాల్కనీ కూడా వస్తుంది. ఈ లెక్కన చూస్తే గతంలోకన్నా కాస్తంత పెద్ద ఇళ్లు ఇపుడు అందుబాటు గృహాల పరిధిలోకి వస్తాయన్న మాట. ఆ మేరకు వాటికి వర్తించే ప్రోత్సాహకాలు, రాయితీలు దీనికీ వర్తిస్తాయి. సూపర్ బిల్టప్ ఏరియా అంటే మాత్రం లాబీ, లిఫ్టు, మెట్లు, స్విమ్మింగ్ పూల్, గార్డెన్, క్లబ్‌హౌస్ వంటి అన్ని రకాల వసతులకు కేటాయించే స్థలాన్ని కూడా కలుపుతారు. -
సొంతింటికి టైమొచ్చింది..!
గృహ రుణరేటు తగ్గిస్తున్న బ్యాంకులు ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 8 శాతానికి... వడ్డీ 8.6 శాతం ఎంసీఎల్ఆర్ కింద రుణం తీసుకునే వారికి వర్తింపు ఏప్రిల్ తర్వాత రుణం తీసుకున్న వారికీ లాభమే అంతకుముందు తీసుకున్న వారైతే మార్చుకోవాలి ఇలా మార్చుకోవటానికి కన్వర్షన్ చార్జీలు చెల్లించాలి ఎలాంటి చార్జీలూ లేకుండా మారుస్తామంటున్న బీఓబీ పెద్ద నోట్ల రద్దుతో రియల్టీ ధరలు కూడా తగ్గుదల హైదరాబాద్ వంటి చోట్ల పెరగకుండా స్థిరంగా ఉన్నతీరు ఇదే మంచి తరుణమంటున్న హౌసింగ్ నిపుణులు అల్పాదాయ వర్గాల కోసం వడ్డీ రాయితీ ఇచ్చిన ప్రధాని గృహ రుణానికి సంబంధించి ఇపుడొక మంత్రంలా వినిపిస్తున్న సంఖ్య 8.65. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక గృహ రుణాలకు కొన్ని బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేటు శాతం. బహుశా! ఇటీవలి కాలంలో ఇంత తక్కువ రేటుకు గృహ రుణాలు లభ్యం కావటం ఇదేనని చెప్పాలి. నిన్న మొన్నటిదాకా 9.5 శాతంగా ఉన్న వడ్డీ రేటు... ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 90 బేసిస్ పాయింట్లు కోత విధించటంతో 8.65కు దిగివచ్చింది. గడిచిన మూడేళ్లలో తగ్గించిన రుణ రేటు కన్నా ఇది రెట్టింపు కావటం గమనార్హం. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తానూ రేసులో ఉన్నానంటూ ఎస్బీఐకి జత కలసింది. దాంతో అన్ని బ్యాంకులూ రేట్ల కోతను ప్రకటిస్తున్నాయి. ఈ తాజా తగ్గింపు ఎవరెవరికి వర్తిస్తుందంటే... ♦ పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లోకి ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్లు వచ్చి చేరాయి. సేవింగ్స్ ఖాతాల్లో వేసిన డబ్బులు కాబట్టి వీటిపై బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ తక్కువే. మరోవంక ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తూ వస్తోంది. దీంతో బ్యాంకులూ వడ్డీ రేట్లను తగ్గించే పనిలో పడ్డాయి. ప్రధానంగా గృహ రుణాలపై వడ్డీకి ప్రాతిపదికగా భావించే ఎంసీఎల్ఆర్ను తగ్గిస్తున్నట్లు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి. ♦ నోట్ల రద్దుతో దేశంలో రియల్టీకి డిమాండ్ తగ్గిందని సర్వేల సారాంశం. చాలా నగరాల్లో ధరలూ ఇప్పటికే తగ్గాయి. కొనుగోళ్లు మందగించటం వల్ల నేరుగా గృహ ప్రవేశం చేయటానికి వీలయ్యే ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ధరలు భారీగా తగ్గకపోయినా గడిచిన నాలుగైదు నెలలతో పోలిస్తే పెరగలేదు. ♦ వీటన్నిటికీ తోడు అల్పాదాయ వర్గాల వారు... తక్కువ రుణంతో ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారికి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ పలు వరాలిచ్చారు. వారు తీసుకునే గృహ రుణాలపై రాయితీల జల్లు కురిపించారు. రూ.12 లక్షల లోపు గృహ రుణాలు తీసుకునేవారికి ఈ రాయితీలు వర్తిస్తాయన్న మాట. ఇది కూడా సొంతింటి కల సాకారం చేసుకోవటానికి నిచ్చెనలాంటిదే. ♦ ఒకవైపు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. మరోవంక ఇళ్ల ధరలు కూడా ఊరిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు కొన్ని వర్గాల వారికి గృహ రుణాలు రాయితీ ధరకే దొరుకుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం!! బ్యాంకు లోన్‌కి ఇదే సమయం.. అనుకుంటున్నారా? మరి బ్యాంకుకు వెళ్లే ముందు ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది? ఎంసీఎల్ఆర్ను ఎవరు ఎంత వసూలు చేస్తున్నారు? అసలింతకీ ఎంసీఎల్ఆర్ అంటే ఏంటి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...! కొత్తగా రుణాలు తీసుకుంటున్న వారికి.. తాజా రేట్ల తగ్గింపుతో గరిష్ఠంగా లాభం పొందేది ఎవరైనా ఉంటే వారు కొత్తగా రుణాలు తీసుకోబోతున్నవారే. ఎందుకంటే వారు రుణం తీసుకున్ననాటి నుంచే తాజా రేట్లు వారికి వర్తిస్తాయి. ప్రస్తుతం అందరికన్నా తక్కువగా ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 8 శాతం ఉండగా... ఐసీఐసీఐ బ్యాంకు ఎంసీఎల్ఆర్ 8.2 శాతంగా ఉంది. ఇవి 8.6 నుంచి 9.25 మధ్య వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి. ఈ వడ్డీరేట్లు తీసుకున్న రుణం, తిరిగి తీర్చే వ్యవధిని బట్టి మారతాయి. ఇప్పటికే ఎంసీఎల్ఆర్ కింద రుణాలు తీసుకుంటే... చాలా బ్యాంకులు తాము ఎంసీఎల్ఆర్ను ఎప్పుడెప్పుడు సవరించేదీ చెబుతుంటాయి. అంటే ఎంసీఎల్ఆర్ వ్యవధి ఏడాదా? 6 నెలలా? 3 నెలలా? అనేది ముందే చెబుతాయి. చాలా బ్యాంకులకు ఇది ఏడాదిగానే ఉంది. అంటే... రుణం తీసుకున్న ఏడాది తరవాతే వారికి కొత్త రేటు వర్తిస్తుందన్న మాట. ఉదాహరణకు అక్టోబర్‌లో ఎంసీఎల్ఆర్ కింద రుణం తీసుకున్నారని అనుకుందాం. వారికి తాజా తగ్గింపు ఇప్పుడు వర్తించదు. ఈ ఏడాది అక్టోబర్‌లో అప్పుడు ఎంసీఎల్ఆర్ ఎంత ఉంటే... అది వర్తిస్తుంది. దాని ప్రకారం రుణ రేటు తగ్గటమో, పెరగటమో జరుగుతుంది. బేస్‌రేటు కింద రుణాలు తీసుకుంటే.. గతేడాది ఏప్రిల్‌కన్నా ముందు తీసుకున్న గృహ రుణాలన్నీ బేస్ రేట్ ప్రాతిపదికన తీసుకున్నవే. ఇది కొంత ఎక్కువే. వారికి తాజా తగ్గింపు వర్తించదు. కాకపోతే వారు ఎంసీఎల్ఆర్కు మారాల్సి ఉంటుంది. ఇలా మారడానికి చాలా బ్యాంకులు మొత్తం రుణంలో .0.5 శాతాన్ని గానీ, రూ. 10 వేల మొత్తాన్ని గానీ కన్వర్షన్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. దీన్లో ఏది ఎక్కువైతే అది తీసుకుంటారని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు రూ.30 లక్షల రుణం తీసుకున్నారనుకోండి. రూ.15వేలు కన్వర్షన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.15 లక్షలైతే... రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం ఎలాంటి కన్వర్షన్ చార్జీలూ వసూలు చేయకుండా బేస్ రేట్ రుణ గ్రహీతలను ఎంసీఎల్ఆర్ విధానంలోకి మారుస్తామని చెబుతోంది. ఎలాంటి షరతులూ ఉండవని కూడా బ్యాంకు ప్రకటించింది. ఏం చేయాలంటే... ఇది ఒక్క గృహ రుణాలకే కాదు. ఎస్బీఐ అయితే ఆటో రుణాలకూ వర్తింపజేస్తోంది. అందుకని మీ రుణ రేట్ ఇపుడెంత ఉందో చూసుకుని... మీ బ్యాంకును సంప్రతించటం మేలు. ఒకవేళ తగ్గింపు మీకూ వర్తిస్తుందని అనుకుంటే వెంటనే ఎంసీఎల్ఆర్లోకి మారిపోవచ్చు. సీఎల్ఆర్లోకి మారడానికి చార్జీలు వసూలు చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. మారితే వచ్చే లాభాన్ని లెక్కించేటపుడు ఈ చార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందుకని 0.5 శాతంకన్నా ఎక్కువ లాభం ఉంటేనే మారాలి. మీరిపుడు ఎంసీఎల్ఆర్లో ఉన్నా సరే... తాజా తగ్గింపు వర్తించకపోవచ్చు. అందుకని మీ బ్యాంకును సంప్రదించి, ఎప్పటి నుంచి తగ్గింపు వర్తిస్తుందో తెలుసుకోవాలి. గృహ రుణాలపై ప్రధాని రాయితీ.. ♦ పట్టణ ప్రాంతాల్లో రూ.9 లక్షలలోపు గృహ రుణం తీసుకునేవారికి వడ్డీలో 4 శాతం.. రూ.9–12 లక్షల మధ్య తీసుకున్న వారికి 3 శాతం రాయితీ లభిస్తుంది. తగ్గించిన వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ♦ గ్రామాల్లో అయితే కొత్తింటి కోసం గానీ, ఉన్న ఇంటిని విస్తరించడానికి గానీ రూ.2 లక్షలలోపు రుణం తీసుకునే వారికి 3 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ♦ 2017లో రుణాలు తీసుకుంటే ఈ రాయితీ వర్తిస్తుంది. ఈఎంఐ బాగానే తగ్గుతుంది.. ప్రధాని ప్రకటించిన వడ్డీ రాయితీవల్ల ఈఎంఐ గణనీయంగా తగ్గుతుందని చెప్పవచ్చు. గతంలో రూ.6 లక్షల లోపు రుణం తీసుకునే వారికి వడ్డీలో 6.5 శాతం రాయితీ ఉండేది. ఈ రాయితీని తగ్గించినా... రుణ మొత్తాన్ని పెంచటం వల్ల చాలామందికి ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.12 లక్షల రుణాన్ని 15 ఏళ్ల కాలానికి తీసుకున్నారనుకోండి. వడ్డీ 3 శాతం తగ్గడం వల్ల వారికి ఈఎంఐ నెలకు రూ.2,044 వరకూ తగ్గుతుంది. ఈ పథకానికి అర్హులెవరు? ఈ వడ్డీ రాయితీ పొందడానికి వార్షికాదాయం రూ.6 లక్షల లోపున్న అల్పాదాయ వర్గాలు మాత్రమే అర్హులు. రుణాన్ని మహిళల పేరిట , లేదా జాయింట్‌గా భార్యతో కలసి తీసుకోవాలి. వారికి పక్కా ఇల్లు ఉండకూడదు. ఇంటి కార్పెట్ ఏరియా (బిల్టప్ ఏరియా కాదు) 645 చదరపు అడుగులకు మించి ఉండకూడదు. రుణానికి దరఖాస్తు చేసేటప్పుడు ఆదాయ రుజువు పత్రాన్ని, సెల్ఫ్ అఫిడవిట్‌ను జత చేయాలి. వడ్డీ రేటు.. ఇదీ రూటు! అసలు ఎంసీఎల్ఆర్ అంటే ఏంటో చూద్దాం... మా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను తగ్గించాం. దీంతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానంగా ఉన్న గృహ, వాహన ఇతర రుణ రేట్లు తగ్గుతాయి. – బ్యాంకులన్నీ ఇపుడు చెబుతున్నదిదే బేస్‌రేటుపై రుణాలు తీసుకున్నవారు ఇపుడు ఎంసీఎల్ఆర్కు మారాలంటే చార్జీల రూపంలో రూ.10,000 లేదా 0.5 శాతం అదనంగా చెల్లించాలి. మా బ్యాంకులో అయితే ఇప్పుడు ఉచితం. – ఇది మరో బ్యాంక్ ప్రకటన ఇదంతా ఎందుకంటే ఇపుడు ఏ బ్యాంకయినా వడ్డీ రేట్ల గురించి చెప్పేటపుడు తమ ఎంసీఎల్ఆర్ ఎంతో చెబుతోంది. ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు కావచ్చు. కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు కావచ్చు. వారి వడ్డీ రేట్లన్నీ ఈ ఎంసీఎల్ఆర్ మీదే ఆధారపడి ఉంటాయి. దాని హెచ్చుతగ్గులను బట్టే వడ్డీ రేట్లూ మారుతుంటాయి. 2016 ఏప్రిల్ 1వ తేదీకి ముందు బ్యాంకులన్నీ బేస్‌రేటు విధానాన్ని అమలు చేశాయి. అప్పటి నుంచి ఎంసీఎల్ఆర్ను తెచ్చాయి. ఎంసీఎల్ఆర్ను బేస్‌గా చేసుకుని... వినియోగదారులకు వారి రుణ చరిత్ర, ఆదాయం, చెల్లించే సామర్థ్యం ఆధారంగా వడ్డీరేటు నిర్ణయిస్తారు. ఎంసీఎల్ఆర్ను నెలవారీ సమీక్షిస్తుంటారు. బేస్‌రేట్ ప్రకారమైతే... రెపో రేటును ఆర్బీఐ తగ్గించినా, పెంచినా దాని లాభనష్టాలు వెంటనే బ్యాంకు కస్టమర్లకు బదిలీ అయ్యేవి కావు. ఎంసీఎల్ఆర్ వ్యవస్థను ఆర్బీఐ ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఎంసీఎల్ఆర్తో ఈ లోపం కొంత తొలగిపోయింది. రుణరేటు లెక్కింపు నిర్ణయంలో పారదర్శకత పెరిగింది. ఎంసీఎల్ఆర్కు సంబంధించి ఓవర్‌నైట్ (ఒకరోజు), నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాలాలకు వేర్వేరు రేట్లు అమలవుతున్నాయి. ఆర్బీఐ నుంచి తాము తీసుకునే స్వల్ప కాలిక రుణాలకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. దీన్ని రెపో రేటుగా పిలుస్తారు ప్రస్తుతమిది 6.25 శాతం. దీన్ని... తాను డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీని లెక్కించి... లాభంగా కొంత మార్జిన్‌ను కలిపి బ్యాంకు ఎంసీఎల్ఆర్ను నిర్ణయిస్తుంది. ఇంకా తన డిపాజిట్లలో సీఆర్ఆర్ (నగదు నిల్వల నిష్పత్తి) ప్రకారం ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు (ప్రస్తుతం ఇది 4 శాతం) ఎంత? నిర్వహణా వ్యయాలెంత? రుణ కాలపరిమితి ఎంత? వంటివి కూడా ఎంసీఎల్ఆర్ లెక్కింపులో చోటు చేసుకుంటాయి. సీఆర్‌ఆర్‌పై ఆర్బీఐ ఎటువంటి వడ్డీనీ చెల్లించదు. దీనికి వడ్డీని పరోక్షంగా బ్యాంకులు రుణ గ్రహీత నుంచే వసూలు చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఏ రుణాలకు లింక్... ఫ్లోటింగ్ రేట్ రుణాలన్నీ ఎంసీఎల్ఆర్కే అనుసంధానమవుతాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు– గృహ రుణాలకు తప్ప వ్యక్తిగత రుణాలు, కార్ లోన్లకు ఎంసీఎల్ఆర్ వర్తింపజేయడం లేదు. వాటికి స్థిర వడ్డీరేట్లుండడమే కారణం. ఎస్బీఐ మాత్రం వ్యక్తిగత, విద్య, ఆటో రుణాలకు కూడా ఎంసీఎల్ఆర్ వర్తింపజేస్తోంది. ఎంసీఎల్ఆర్తో లాభమిదీ... బ్యాంకులు ఎంసీఎల్ఆర్పై ‘స్ప్రెడ్’ను అమలు చేస్తుంటాయి. ఇది ఒకరకంగా బ్యాంకుల లాభం. ఇది డిపాజిట్‌పై చెల్లిస్తున్న వడ్డీ ప్రాతిపదికగానే ఉండాలి తప్ప, ఇష్టానుసారంగా ఉండకూడదు. కానీ అన్ని లోన్లకూ ‘స్ప్రెడ్’ను ఒకే శాతంలో విధించరు. గృహ రుణాలకు ఒకరకమైన ‘స్ప్రెడ్’ ఉంటే, తనఖా రుణాలపై మరో రకంగా ఉంటుంది. గృహ రుణాలపై ‘స్ప్రెడ్’ తక్కువ. ఉదాహరణకు వార్షిక పాతిపదికన గృహ రుణంపై ఎంసీఎల్ఆర్ 9.2 శాతం ఉంటే, అప్‌ట్రెండ్‌లో ‘స్ప్రెడ్’ మరో 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఉంటుంది. అపుడు రుణంపై వడ్డీ రేటు 9.45 శాతం చెల్లించాలన్నమాట. ఎంసీఎల్ఆర్... దీర్ఘకాలానికి బెటర్! నిజమే!! మీరిపుడు ఎంసీఎల్ఆర్కు మారొచ్చు. కానీ దీనికి బ్యాంకులు కన్వర్షన్ చార్జీల్ని వసూలు చేస్తున్నాయి. సాధారణంగా బేస్‌రేటులో ఉన్న రుణ గ్రహీతలు ఎంసీఎల్ఆర్కు మారాలంటే చెల్లించాల్సిన రుణంలో 0.5 శాతం లేదా రూ.10,000 చెల్లించాల్సి వస్తోంది. దీనికితోడు ఇతర వ్యయాలూ ఉంటాయి. ఇవన్నీ కలిపాక కూడా మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీకి, ఎంసీఎల్ఆర్లో చేరితే చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం కనీసం 25 బేసిస్ పాయింట్లుంటే మారొచ్చు. మీది దీర్ఘకాలిక రుణమైతే ఎంసీఎల్ఆర్లోకి మారడం బెటర్. చివరిగా ఒక విషయం.. బ్యాంక్ ఆఫ్ బరోడా..బేస్ రేట్ (9.60 శాతం) ప్రాతిపదికగా ఉన్న బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి అదనపు చార్జీలూ లేకుండా కొత్త ఎంసీఎల్ఆర్లోకి మారే వెసులుబాటునిచ్చింది. ప్రస్తుత రుణాలకు ప్రాతిపదిక.. ఎంసీఎల్ఆర్ బేస్‌రేట్ స్థానంలో 9 నెలలుగా అమలు ఇప్పుడైనా కొత్త్త రేటుకు మారే అవకాశం వడ్డీ లెక్కింపులో పారదర్శక విధానం -
గృహ రుణాలపై తగ్గేది తక్కువే..!
• ఎంసీఎల్ఆర్ను తగ్గించి.. స్ప్రెడ్‌ను పెంచిన బ్యాంకులు • దీంతో రుణాలపై తగ్గే వడ్డీ అరకొరే సాక్షి, బిజినెస్ విభాగం గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ ప్రకటించాయి. ఇం దుకు అనుగుణంగా ఎంసీఎల్ఆర్ను (మార్చినల్ కాస్ట్ ఆఫ్ పండింగ్ రేటు) 0.9% తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ... 0.7% తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించాయి. మరి ఆ మేరకు వడ్డీ రేట్లు తగ్గాయా అంటే... అలాంటిదేమీ లేదు. వాస్తవంగా గృహ రుణంపడ్డీ రెండు బ్యాంకులూ తగ్గిస్తున్న వడ్డీ రేటు 0.5 శాతమే!!. అదీ కథ. లాభాలు పెంచుకోవడానికే... ఆర్బీఐ రేట్లు తగ్గిస్తే... ఆ తగ్గుదలను వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేయకుండా, ఎన్పీఏలు పెరిగాయని, తమ నిధుల వ్యయం ఎక్కువని కుంటిసాకులు చెపుతూ వచ్చిన బ్యాంకులు తాజాగా మరో నాటకానికి తెరలేపాయి. ఆర్బీఐ రేట్ల తగ్గుదలను, నిధుల వ్యయం తగ్గుదలను బ్యాంకులు పూర్తిగా బదిలీ చేయటానికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) విధానాన్ని 2016 ఏప్రిల్ నుంచి ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం బ్యాంకులకయ్యే నిధుల సమీకరణ వ్యయంతో కొంత స్ప్రెడ్ (లాభం) కలుపుకొని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించాలి. ఇందుకు అనుగుణంగా వివిధ బ్యాంకులు గృహ రుణాలపై వాటి ఎంసీఎల్ఆర్పై 0.25–0.60 శాతం స్ప్రెడ్ కలుపుకొని గృహ రుణ వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. అన్ని బ్యాంకులకంటే చౌకగా రుణాలిస్తామని ప్రచారం చేసుకునే ఎస్బీఐ, ఐసీఐసీఐ ఇప్పటివరకూ వాటి ఎంసీఎల్ఆర్పై 25 శాతం స్ప్రెడ్ వేసుకుని గృహ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ వచ్చాయి. తాజాగా ఇవి వాటి స్ప్రెడ్‌ను బాగా పెంచేశాయి. ఎస్బీఐ స్ప్రెడ్‌ను 0.65 శాతానికి పెంచేయటంతో గృహ రుణంపై వడ్డీ రేటును 0.5 శాతం తగ్గించినా 9.15 శాతం నుంచి 8.65 శాతానికి మాత్రమే దిగుతోంది. ఎంసీఎల్ఆర్ 0.9 తగ్గడం వల్ల ఎంసీఎల్ఆర్ రేటు మాత్రం 8 శాతానికి దిగుతుంది. దీనికి పాత స్ప్రెడ్‌ను అమలుచేస్తే ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేటు 8.25 శాతానికి తగ్గాలి. ఐసీఐసీఐ బ్యాంక్ గృహ రుణంపై వడ్డీ రేటు 9.15 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గాల్సి వుండగా, ఈ బ్యాంకు కూడా తన స్ప్రెడ్‌ను 0.45 శాతానికి పెంచుకోవడంతో గృహ రుణంపై రేటు 8.65 శాతానికి మాత్రమే తగ్గుతోంది. తద్వారా 0.7 శాతం ఎంసీఎల్ఆర్ తగ్గింపు గృహ రుణ వినియోగదారులకు చేరడం లేదు. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకుల్లోకి కుప్పతెప్పలుగా వచ్చిపడిన డిపాజిట్ల ప్రయోజనాన్ని ప్రజలకు మళ్లించకుండా, బ్యాంకులు వాటి లాభాల్ని పెంచుకోవడానికే స్ప్రెడ్‌ను పెంచుతున్నాయనేది విశ్లేషకుల మాట. -
ఇక చౌక గృహ రుణాలు..!
-
ఇక చౌక గృహ రుణాలు..!
♦ పండగల వేళ దిగొస్తున్న బ్యాంకులు ♦ కొత్త రుణ గ్రహీతలకు 0.15% తగ్గింపు ♦ ఎస్బీఐ బాటలోనే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ♦ ఇతర బ్యాంకులూ వరసకట్టే అవకాశం! న్యూఢిల్లీ: దసరా.. దీపావళి... మరో రెండు నెలల్లో సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో గృహ రుణాలు దిగొస్తున్నారుు. రుణ గ్రహీతలను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారుు. రూ.75 లక్షలు దాటని గృహ రుణాలపై వడ్డీని 0.15 శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించటంతో... 24 గంటలు కూడా గడవక ముందే తామూ అదే బాటలో నడుస్తున్నట్లు ప్రరుువేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ప్రకటించారుు. కొత్తగా గృహ రుణం తీసుకునే వారికి వడ్డీ రేట్లు 15 శాతం తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ గురువారం ప్రకటించింది. దీని ప్రకారం రూ.75 లక్షల వరకూ మహిళలకు గృహ రుణ రేటు 9.15 శాతంగా ఉంటుంది. ఇంతకుముందు ఈ రేటు 9.30 శాతంగా ఉంది. ఇక ఉద్యోగులకిచ్చే రేటు 9.35 శాతం నుంచి 9.20 శాతానికి తగ్గింది. తాజా రేటు నవంబర్ 2 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలియజేసింది. బుధవారమే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణరేటు 10 బేసిస్ పారుుంట్లు (0.10 శాతం) తగ్గిస్తూ ఐసీఐసీఐ ప్రకటన చేసింది. అక్టోబర్ 4న ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన తర్వాత, ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటును తగ్గించడం ఇది మూడవసారి. దీనికితోడు ఐసీఐసీఐ.. వేతన అకౌంట్ హోల్డర్లకు ‘ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ ఓవర్‌డ్రాఫ్ట్’ పేరిట కొత్త పథకాన్ని కూడా ఆరంభించింది. టర్మ్ లోన్‌తోపాటు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఈ ప్రొడక్ట్ ప్రత్యేకత. హెచ్డీఎఫ్సీదీ అదే దారి... హౌసింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కూడా తన గృహ రుణ రేట్లను 0.15 శాతం తగ్గిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. రూ.75 లక్షల లోపు గృహ రుణాలకే ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం తాజా రేట్లు అందరికీ 9.20 శాతంగా, మహిళలకు 9.15 శాతంగా ఉంటారుు. ఎస్బీఐ రేటు కాస్త తక్కువ... రూ.75 లక్షలు దాటని గృహ రుణాలకు వడ్డీ రేటును 0.15 శాతం తగ్గిస్తున్నట్లు బుధవారమే ఎస్బీఐ ప్రకటించింది. దీని ప్రకారం ఈ రుణ రేటు 9.15 శాతంగా ఉంటుంది. మహిళలకు 9.10 శాతమే ఉంటుంది. కాగా బ్యాంకింగ్ దిగ్గజాలన్నీ గృహ రుణాలపై రేట్లు తగ్గించడంతో ఇతర బ్యాంకులపై సైతం ఈ ప్రభావం పడుతుందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్ రంగం నుంచి క్రెడిట్ డిమాండ్ తగ్గడంతో రిటైల్ రుణ మంజూరు ద్వారా రుణ వృద్ధికి బ్యాంకులు వ్యూహ రచన చేస్తున్నారుు. అక్టోబర్ 4 రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ సమీక్ష తరువాత, పలు బ్యాంకులు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణరేటు తగ్గించటం తెలిసిందే. అక్టోబర్ 4 తరువాత వివిధ బ్యాంకుల ఎంసీఎల్ఆర్ రేట్లు.. ⇔ ఆర్బీఐ పాలసీ రేటు ప్రకటించాక ఇప్పటిదాకా పలు బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును (ఎంసీఎల్ఆర్) తగ్గించారుు. దాని ప్రకారం వివిధ బ్యాంకుల ఎంసీఎల్ఆర్ ఎలా ఉందంటే... ⇔ ఆంధ్రా బ్యాంకు బేస్ రేటును, బీఎంపీఎల్‌ఆర్ ను 5 బేసిస్ పారుుంట్లు తగ్గించింది. దీంతో బేస్ రేటు 9.70 శాతానికి, బీఎంపీఎల్‌ఆర్ 13.95 శాతానికి తగ్గింది. ఏడాది వ్యవధి రుణాలపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పారుుంట్లు తగ్గించింది. దీంతో ఇది 9.55 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గింది. ⇔ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓవర్‌నైట్ కాలపరిమితి విషయంలో రేటు 0.05 శాతం తగ్గి 9 శాతానికి చేరింది. మూడు నెలల కాలానికి 9.15 శాతానికి, ఏడాది కాలానికి 9.25 శాతానికి, మూడేళ్లకు 9.40 శాతానికి తగ్గింది. -
రుణానికి బ్యాంకుకెళ్లటం ఎందుకు?
బ్యాంక్‌బజార్.కామ్, పైసాబజార్.కామ్, అప్నాపైసా.కామ్, క్రెడిలా.కామ్... ఇంకా చాలా. గృహ రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం పాత మాట. ఇపుడు దాదాపు ప్రతి బ్యాంకూ, ప్రతి ఆర్థిక సంస్థా ఆన్లైన్ రుణ సేవలందిస్తున్నాయి. దేనికైనా ఆన్లైన్లో దరఖాస్తు నింపితే చాలు. బ్యాంకు ప్రతినిధులే దరఖాస్తుదారు దగ్గరకొచ్చి పత్రాలన్నీ తీసుకుని ప్రాసెసింగ్ చేస్తారు. ఇవి కాక బ్యాంక్‌బజార్, పైసా బజార్, క్రెడిలా వంటి సంస్థల సైట్లను ఆశ్రయిస్తే మాత్రం... లోన్ కాలిక్యులేటర్ నుంచి, వివిధ బ్యాంకుల వాయిదాలను సరిపోల్చుకోవటం, అన్నిటినీ పరిశీలించాక ఏది నప్పుతుందో చూసుకోవటం కుదురుతుంది. అంతేకాదు! మీ వివరాలు నింపితే... మీకు రుణం ఎంత వస్తుంది? ఎన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది? తదితర వివరాలన్నీ తెలిసిపోతాయి. అన్నీ చూసుకున్నాక... ఈ సంస్థల ద్వారా దరఖాస్తు నింపితే ఇవే మనం ఎంచుకున్న ఆర్థిక సంస్థ లేదా బ్యాంకుకు దరఖాస్తును పంపిస్తాయి. హోమ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్, హౌసింగ్ లోన్ కాలిక్యులేటర్, హోమ్ లోన్ ఎలిజిబిలిటీ, మైఈఎంఐ వంటి ఫీచర్లను ఇవి అందిస్తున్నాయి.ఇవన్నీ నచ్చని వారు... ఆన్లైన్లో కేవలం తమ పేరు, ఫోన్‌నెంబరు, ఈ-మెయిల్ ఇస్తే చాలు. ఆయా సంస్థల ప్రతినిధులే ఫోన్లు చేసి... మీ దగ్గరకొచ్చి మరీ దరఖాస్తు తీసుకెళతారు. వారే బ్యాంకు ద్వారా ప్రాసెస్ చేయిస్తారు. బ్యాంకుల యాప్‌ల ద్వారా... ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఇండియాబుల్స్ హోమ్లోన్స్ తదితర సంస్థలు సొంత యాప్‌లను విడుదల చేశాయి. వీటిద్వారా వడ్డీరేట్లు తెలుసుకోవటమే కాదు. నెలవారీ వాయిదాలు కూడా ఆన్లైన్ బ్యాంకింగ్‌లో చెల్లించొచ్చు. మీ దగ్గర్లోని బ్రాంచి చిరునామా తెలుసుకోవచ్చు. -
హెచ్డీఎఫ్సీ లాభం 3,460 కోట్లు
ఒక్కో షేర్‌కు రూ.14 డివిడెండ్ న్యూఢిల్లీ: గృహరుణాలిచ్చే ఆర్థిక సంస్థ హెచ్డీఎఫ్సీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.3,460 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో ఆర్జించిన నికర లాభం(రూ.2,646 కోట్లు)తో పోల్చితే 31 శాతం వృద్ధి సాధించామని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మొత్తం ఆదాయం 14,737 కోట్ల నుంచి 17,027 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.14 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. గతంలోని రూ.3 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనమని పేర్కొంది. కేటాయింపులు రూ.68 కోట్ల నుంచి రూ.545 కోట్లకు పెరిగాయని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 0.72 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గాయని, నికర వడ్డీ మార్జిన్ 4 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గిందని తెలిపింది. లోన్ బుక్ రూ.2.28 లక్షల కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.2.59 లోల కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక స్టాండోలోన్ ప్రాతిపదికన 2014-15 క్యూ4లో రూ.రూ.1,862 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 40 శాతం వృద్ధి చెంది రూ.2,607 కోట్లకు పెరిగిందని వివరించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఏడాదిలో రూ.8,763 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం వృద్ధితో రూ.10,190కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.48,390 కోట్ల నుంచి రూ.53,257కు పెరిగిందని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,355 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.2,469 కోట్లకు పెరిగిందని పేర్కొంది. -
గృహ ప్రవేశం చేసేద్దాం!
ఒకపక్క సిమెంట్ ధరలు తగ్గాయి. కొన్నాళ్లుగా స్టీల్ ధరలు కూడా దిగివస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు సొంతింటికి కీలకమైన గృహ రుణాలూ తక్కువ వడ్డీరేట్లతో ఊరిస్తున్నాయి. వడ్డీరేట్లు మెల్లగా కిందికి దిగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే కొన్నాళ్లుగా రియల్టీ ధరలు నిలకడగా ఉన్నాయి. మునుపటి అంత బూమ్ లేదు. ఇవన్నీ చూస్తే సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికిదే మంచి తరుణమన్నది నిపుణుల మాట. ఎందుకంటే గడిచిన 14 నెలల కాలంలో ఆర్బీఐ వడ్డీరేట్లను దాదాపు 1.5 శాతం తగ్గించింది. వచ్చే ఐదారు నెలల్లో ఇవి మరింత తగ్గవచ్చనే సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ ఏడాది వర్షాలు బాగుంటాయని వాతావరణ శాఖ నివేదికలివ్వడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా పెద్దగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది మరో అర శాతం వరకు వడ్డీరేట్లు తగ్గవచ్చనేది నిపుణుల అంచనా. ఇక వడ్డీరేట్లను లెక్కించడానికి బేస్ రేట్ స్థానంలో మరింత పారదర్శకంగా ఉండే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ (ఎంసీఎల్ఆర్) కూడా వచ్చింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కొత్తగా గృహరుణాలు తీసుకునే వారేం చెయ్యాలి? ఇప్పటికే రుణాలకు ఈఎంఐలు చెల్లిస్తున్న వారు ఏం చెయ్యాలి? అనే వివరాలే ఈ వారం ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం * సొంతింటికి అనుకూలిస్తున్న పరిణామాలు * సిమెంటు, స్టీల్ ధరల తగ్గుదల; రియల్టీ ధరల్లో నిలకడ * మెల్లగా దిగివస్తున్న గృహ రుణాల వడ్డీ రేట్లు * 14 నెలల్లో 1.5% తగ్గిన వడ్డీరేట్లు, ఇంకా తగ్గే అవకాశం * కొత్తగా అమల్లోకి వచ్చిన ఎంసీఎల్ఆర్తో మరింత తగ్గనున్న వడ్డీ వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయా...! ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తోంది. తాజాగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గించింది. ఇదే విధంగా గృహరుణాలపై వడ్డీరేట్లు కూడా పావు శాతం తగ్గితే రూ.50 లక్షల గృహరుణం తీసుకున్న వారికి మొత్తమ్మీద రూ.1.95 లక్షల వరకు కలిసొస్తుంది. కానీ ఆర్బీఐ తగ్గిస్తున్న మొత్తాన్ని బ్యాంకులు రుణగ్రహీతలకు వెంటనే బదలాయించడం లేదు. గత 14 నెలల్లో ఆర్బీఐ 1.50 శాతం తగ్గించినా దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ గృహ రుణాల వడ్డీ రేట్లను కేవలం 0.55 శాతం మాత్రమే తగ్గించింది. తాను తగ్గిస్తున్నా అది పూర్తిస్థాయిలో వినియోగదారులకు చేరకపోవడంతో వడ్డీ లెక్కింపునకు ఇపుడు ఆర్బీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్). నిజానికి ప్రతి బ్యాంకూ తాము సేకరిస్తున్న డిపాజిట్లపై కొంత వడ్డీని అందిస్తాయి. రుణాలపై వడ్డీరేట్లను కూడా వీటి ఆధారంగా నిర్ణయించటమే ఎంసీఎల్ఆర్. దీంతో బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గిస్తే రుణాల వడ్డీరేట్లు కూడా తగ్గుతాయి. డిపాజిట్ రేట్లు పెరిగితే వాటితో పాటే వడ్డీరేట్లు పెరుగుతాయి. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. బేస్ రేటు కన్నా ఈ ఎంసీఎల్ఆర్ విధానంలో వడ్డీరేట్లు తక్కువగా ఉండటం విశేషం. ఎంసీఎల్ఆర్కు మారడమే బెస్ట్!! గడచిన పదేళ్లలో వడ్డీరేట్ల లెక్కింపులో చాలా మార్పులొచ్చాయి. 2010కి ముందు ప్రైమ్ లెండింగ్ రేటు విధానం (బీపీఎల్ఆర్) అమల్లో ఉండేది. ఆ సమయంలో బీపీఎల్ఆర్ కంటే రెండు మూడు శాతం తక్కువ రేటుకు గృహరుణాలిచ్చేవారు. ఆ తర్వాత 2010లో బేస్ రేట్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో బేస్ రేటు కంటే తక్కువ రేటుకు రుణాలివ్వడానికి వీల్లేదు. ఇక గృహరుణాల విషయానికి వస్తే బేస్ రేటుకో... లేక దానికి పావు నుంచి అర శాతం కలిపో ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రెండింటి స్థానంలో డిపాజిట్ల సేకరణ వ్యయం ఆధారంగా ఎంసీఎఆల్ఆర్ను ప్రవేశపెట్టారు. బేస్ రేటు మాదిరి ఎంసీఎల్ఆర్ రేటు కంటే తక్కువ రేటుకు రుణాలు ఇవ్వడానికి లేదు. కానీ బేస్ రేటుతో పోలిస్తే ఎంసీఎల్ఆర్ ఆధారంగా వడ్డీరేటు లెక్కించటంలో మరింత పారదర్శకత ఉంటుంది. దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు ఎంసీఎల్ఆర్లోకి మారడం ద్వారా ప్రయోజనం పొందవచ్చన్నది నిపుణుల సూచన. బీపీఎల్ఆర్, బేస్ రేట్‌తో పోలిస్తే ఎంసీఎల్ఆర్ విధానంలో గృహరుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం కూడా అదనపు ఆకర్షణ. ఇప్పుడు ఎస్బీఐతో సహా చాలా బ్యాంకులు కొంత రుసుము చెల్లించడం ద్వారా ఎంసీఎల్ఆర్లోకి మారడానికి అనుమతిస్తున్నాయి. కేవలం తేడా పది బేసిస్ పాయింట్లే కదా (0.1 శాతం) అనుకోవద్దు. రూ.50 లక్షల రుణానికి 20 ఏళ్లలో పది బేసిస్ పాయింట్లు తగ్గడం వల్ల సుమారు లక్ష రూపాయల భారం తగ్గుతుంది. అదే అర శాతం తగ్గితే రూ.4 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. అందుకే ఈ కొత్త విధానంలోకి మారడం ద్వారా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. అదే 2010కి ముందు బీపీఎల్ఆర్ విధానంలో తీసుకున్న వారైతే ఈ కొత్త విధానంలోకి మారడం ద్వారా రుణ భారాన్ని భారీగా తగ్గించుకోవచ్చు. కొత్తగా తీసుకునే వారైతే...! ఏప్రిల్ 1 నుంచి రుణాలు తీసుకునే వారికి ఎంసీఎల్ఆర్ విధానంలోనే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. మీ రుణ కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ రేటు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు రుణ కాలపరిమితిని బట్టి అయిదు రకాల ఎంసీఎల్ఆర్ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఎంసీఎల్ఆర్ విధానం వచ్చిన తర్వాత బ్యాంకులు అత్యధికంగా ఫిక్స్డ్ వడ్డీరేట్ల వైపునకు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రుణం తీసుకునేటప్పుడు నిబంధనలన్నీ తప్పకుండా పరిశీలించండి. ఎందుకంటే ఎంసీఎల్ఆర్ విధానంలో దీర్ఘకాలానికి వడ్డీరేట్లు స్థిరంగా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఫిక్స్డ్ వడ్డీరేటు ఎంత కాలానికి వర్తిస్తుంది? ఆ తర్వాత ఫ్లోటింగ్ రేటు ఉంటుందా? లేక తిరిగి అప్పటి వడ్డీరేటుకు ఫిక్స్డ్ చేస్తారా? అనే విషయంపై స్పష్టత తీసుకోండి. 0.1% తగ్గిన ఎస్బీఐ రేటు... ఎస్బీఐ విషయానికొస్తే బేస్ రేటు 9.3 శాతంగా ఉంటే, ఎంసీఎల్ఆర్ రేటు 9.20%. మొన్నటి వరకు ఎస్బీఐ గృహరుణాలను బేస్ రేటు కంటే పావు శాతం అధిక వడ్డీ రేటుకు అంటే 9.55 శాతానికి ఇచ్చేది. ఇప్పుడు ఈ కొత్త విధానంలో కూడా ఎంసీఎల్ఆర్ కంటే పావు శాతం అధిక వడ్డీరేటుకే గృహరుణాలిస్తోంది. కానీ గృహ రుణాలకు ఎంసీఎల్ఆర్ రేటు 9.2 శాతం కావడంతో 0.10 శాతం తక్కువ రేటుకే అంటే 9.45 శాతానికే రుణాలు లభిస్తున్నాయి. అంతేకాదు!! రానున్న కాలంలో డిపాజిట్ల రేట్లు తగ్గితే ఎంసీఎల్ఆర్ కూడా తగ్గుతుంది. వచ్చే ఏడాది కాలంలో వడ్డీరేట్లు మరో అరశాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్బీఐ రుణాల వడ్డీరేట్లు బేస్ రేటు : 9.3% బీపీఎల్ఆర్ రేటు : 14.05% ఎంసీఎల్ఆర్ రేటు : 9.20% -
గృహ రుణానికి బీమా ధీమా
అనుకోని ఉపద్రవం ముంచుకొస్తే... కొండంత భరోసా! గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహ రుణాల లభ్యత మెరుగయింది. దీంతో ఇళ్ల కొనుగోళ్లూ పెరుగుతున్నాయి. పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో రుణం తీసుకుని ఇల్లు కొనుక్కోవడం సాధారణమైపోయింది. అయితే సజావుగా సాగినంత కాలం అంతా బాగానే ఉంటుంది. కానీ ఊహించని ఉపద్రవం వచ్చి పడితే? చెల్లించాల్సిన ఇంటి రుణం భారంగా మారితే? ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కుంగిపోకుండా కాస్త భరోసా కల్పించే బీమా పథకాలు కొన్ని ఉన్నాయి. వాటి తీరుతెన్నులు వివరించేదే ఈ కథనం. - అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ మూడు రకాల పాలసీలు.. అనుకోని ఉపద్రవం ముంచుకొస్తే మిగతా మొత్తాన్ని కట్టే భారం కుటుంబం మీద పడకుండా బీమాపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మూడు రకాల పాలసీలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్ ఇన్సూరెన్సు. దురదృష్టవశాత్తూ రుణగ్రహీత కన్నుమూసిన పక్షంలో గృహ రుణ బాకీ మొత్తం చెల్లింపు ఆటోమేటిక్‌గా జరిగేలా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని పాలసీలు అందిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం కోల్పోయిన పక్షంలో 3 నెలల పాటు ఈఎంఐల భారాన్ని కవర్ చేసే విధంగా మరికొన్ని ప్యాకేజీలున్నాయి. గృహ రుణ బీమా పాలసీలో ప్రీమియాన్ని ముందస్తుగా సింగిల్ పేమెంటులో చెల్లించేయాల్సి ఉంటుంది. రుణాలిచ్చే సంస్థలు చాలా మటుకు ఈ ప్రీమియాన్ని కూడా రుణ మొత్తంలోనే కలిపేసి, తదనుగుణంగా ఈఎంఐలను లెక్కిస్తాయి. ఇలాంటప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియంపై పడే వడ్డీ భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్‌లు... మొత్తం గృహ రుణానికి కవరేజీ పొందడంతో పాటు కట్టిన ప్రీమియం నుంచి గరిష్ట ప్రయోజనం దక్కించుకునేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైనదిగా చెప్పొచ్చు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌కి భిన్నంగా ఈ తరహా పాలసీల్లో కవరేజీ స్థిరంగా ఉంటుంది. గృహ రుణ బీమా పాలసీ విషయంలో ఈఎంఐలు కట్టే కొద్దీ బాకీ మొత్తం తగ్గుతూ ఉంటుంది కనుక.. దానికి తగ్గట్లే కవరేజీ కూడా తగ్గుతూ వస్తుంది. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఇలాంటి సమస్య ఉండదు. పెపైచ్చు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తర్వాత ఇది అత్యంత చౌకైన జీవిత బీమా పాలసీ. దీనికి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీల్లాగా గరిష్ట కవరేజీ రూ. 25 లక్షలే ఉండాలన్న నిబంధనా లేదు. స్థూలంగా చెప్పాలంటే వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు .. శరీరానికి, జీవితానికి బీమా రక్షణ కల్పించే సరళమైన పథకాలు. తీవ్ర గాయాల పాలైనా, మరణం సంభవించినా మొదటిది బీమా రక్షణ కల్పిస్తుంది. రుణ భారం ఉన్నా, లేకున్నా ఎవరైనా తీసుకోతగిన పాలసీ ఇది. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే.. గృహ రుణంతో పాటు కుటుంబానికి కూడా కవరేజీ అందించగలిగేది ఇది. వ్యక్తిగత ప్రమాద బీమా అనుకోని విధంగా ఏవైనా ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలైతే ఈఎంఐలు సమస్యగా మారకుండా చూసుకునేలా ముందు జాగ్రత్తగా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తీసుకోవచ్చు. అంగవైకల్యం, పక్షవాతం మొదలైన వాటికి కూడా దీని ద్వారా కవరేజీ లభిస్తుంది. అయితే, ఈ పాలసీల గరిష్ట కవరేజీ రూ. 25 లక్షలు మాత్రమే ఉంది. కానీ ఒకవేళ ప్రమాదం కారణంగా మరణం సంభవించిన పక్షంలో సందర్భాన్ని బట్టి సమ్ అష్యూర్డ్ కన్నా కూడా కొంత అధిక మొత్తమే లభించే పాలసీలూ ఇందులో ఉన్నాయి. గరిష్ట కవరేజీకి పరిమితులున్నప్పటికీ... తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందించగలిగే పాలసీలు ఇవి. ఏ రుణాలు ఉన్నా లేకున్నా.. వ్యక్తిగత ప్రమాద బీమా అన్ని విధాలుగా ఉపయోగకరమైనదే. -
ప్లాటైనా.. ఫ్లాటైనా.. గురి చూసి కొట్టాలి!
స్థిరాస్తి.. దొంగలు ఎత్తుకుపోతారన్న దిగులక్కర్లేదు! హఠాత్తుగా విలువ తగ్గుతుందన్న ఆందోళన అవసరం లేదు!! ఎప్పటికైనా విలువ పెరుగుతుందే తప్ప తగ్గనే తగ్గదు. ఇలాంటి సానుకూలాంశాల కారణంగా చాలామంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడతారు. స్థలాలు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాల్ని కొనడానికి ముందుకొస్తారు. లాభాలే కాదు.. మోసాలకు, వివాదాలకూ ఈ రంగం పెట్టింది పేరని గుర్తుంచుకోవాలి. కాబట్టి స్థిరాస్తులు కొనేముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్ సొంతిల్లా? ఇప్పటికే సొంతిల్లు ఉండి.. రెండో ఇంటిపై పెట్టుబడి పెట్టే వారు అద్దెల ద్వారా ఆదాయం, లేదంటే మంచి ధరొస్తే అధిక రేటుకు అమ్ముకోవడానికి ప్రాధాన్యమిస్తారు. వీటి విలువ వాణిజ్య భవనాల కంటే తక్కువగా ఉండటం, గృహ రుణాలపై పన్ను మినహాయింపు వంటి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఏం చేయాలి? * మార్కెట్లో బిల్డర్‌కు ఎలాంటి పేరుందో ఆరా తీయాలి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ ప్రాంతంలో ఉంది? అన్న విషయాలను బట్టే మీరు కొనబోయే ఇంటి విలువ ఎంత పెరుగుతుందనేది ఆధారపడుతుంది. వీటితో పాటు భవన ప్రణాళిక, అనుమతులు, యాజమాన్య హక్కులనూ పరిశీలించాలి. * ఫ్లాట్/ఇల్లు నివాసానికి సిద్ధంగా ఉన్నవి, లేదంటే నిర్మాణం పూర్తి కావచ్చినవి కొనడం వల్ల రాబడిని త్వరగా అందుకోవచ్చు. ఇలాంటి ఇళ్లను కొంటే.. వెంటనే అద్దెకిచ్చి ఆదాయం పొందవచ్చు. * అభివృద్ధికి ఆస్కారం గల ప్రాంతంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ఇంటిని కొంటే రెండిందాల లాభం. ప్రాజెక్టు పూర్తి కాగానే నెలనెలా అద్దె పొందొచ్చు. ఇంటి విలువ వేగంగా పెరుగుతుంది. * దాచుకున్న సొమ్ముతో ఇల్లు కొంటే నెలవారీ వాయిదాల భారం లేకుండా చూసుకోవచ్చు. ఏం చేయకూడదు? పేపర్ వర్క్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. సాధ్యమైనంత వరకు మీరు కొనబోయే ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలుసుకోండి. స్థలం కొంటున్నారా? భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో అందరూ స్థలాలు కొనలేని పరిస్థితి. ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం రుణాలు తీసుకుని మరీ ప్లాట్లు, వారాంతపు ఇళ్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం చేయాలి? * మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతంలోనే స్థలాలు కొనుగోలు చేయండి. * మీరు కొనబోయే స్థలాన్ని ఎవరైనా లీజుకు తీసుకున్నారా? ఖాళీగా ఉందా? అన్నది చూడాలి. ఆ స్థలం వ్యవసాయ భూమా, వ్యవసాయేతర భూమా? ఆ భూమిపై చెల్లించాల్సిన రుసుములేమైనా ఉన్నాయా వంటివి చూడాలి. ఒకవేళ మీరు రైతుగా భూమిని కొనుగోలు చేస్తుంటే.. మీరు వ్యవసాయ రంగంలో ఉన్నారని నిర్ధారించే పత్రాల్ని చూపించాల్సి ఉంటుంది. ఏం చేయకూడదు? * తక్కువ ధరకు వస్తుందని తొందరపడొద్దు. స్థలానికి రవాణా మార్గం, అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. వాణిజ్య భవనాల్లో.. అద్దెల రూపంలో మంచి ఆదాయం ఆశించే వారికి నివాస భవనాలతో పోలిస్తే వాణిజ్య భవనాలే మేలు. ఏం చేయాలి? * నగరాల్లోని ప్రధాన ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి. * మీరు కమర్షియల్ స్పేస్ కొనుగోలు చేసే ప్రాజెక్ట్‌లో ఎలాంటి కార్యాలయాలు ఏర్పాటవుతాయో తెలుసుకోండి. దీన్ని బట్టి మీ స్థలానికి విలువెంత పెరుగుతుందనే విషయం ఆధారపడి ఉంటుంది. * కొనుగోలు చేయడానికి ముందే లీజ్‌లో ఉన్న షాపులు/కమర్షియల్ స్పేస్‌లో పెట్టుబడి పెడితే నెలనెలా స్థిరాదాయం లభిస్తుంది. ఇలాంటి వాటిలో పెట్టుబడి వల్ల క్రమంగా ఆదాయం రావడంతో పాటు ఆస్తి విలువ పెరుగుతుంది. * మరొకరితో కలసి పెట్టుబడి పెట్టాలనుకుంటే... భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోండి. దీని వల్ల ఖర్చుల్లో భాగం పంచుకోవడంతో పాటు, మీ పెట్టుబడికి రక్షణగా ఉంటుంది. ఏం చేయకూడదు? * అభివృద్ధి చెందని ప్రాంతంలో కమర్షియల్ స్పేస్ కొనకపోవడమే ఉత్తమం. * చౌకగా వస్తుందని తొందరపడి పెట్టుబడి పెట్టొద్దు. నిర్మాణ నాణ్యత, కమర్షియల్ స్పేస్ లేఅవుట్‌ను పరిశీలించడం ఎంతో ముఖ్యం. * సొమ్ము చేతిలో లేకపోయినా కొనడం తెలివైన మదుపరుల లక్షణం కాదు. కమర్షియల్ స్పేస్‌పై పెట్టే పెట్టుబడిపై పన్నురాయితీలు ఉండవని గుర్తుంచుకోండి. రుణాలపై వడ్డీ రేట్లు కూడా అధికమేనన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. వీటిపై వడ్డీ సుమారుగా 15-16 శాతం వరకు ఉండొచ్చు. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
వాయిదాలకూ పద్ధతులున్నాయ్!
బ్యాంకులు ఈ మధ్యే వడ్డీ రేట్లు కొంత తగ్గించాయి. గృహ రుణాలు కొంత ఆకర్షణీయంగా మారాయి. కోరుకుంటున్న ఇంటిని ఇక వాయిదాల్లో సొంతం చేసుకోవచ్చు అనుకుంటున్న వారు... దాన్ని తిరిగి చెల్లించేందుకు అందుబాటులో ఉన్న పద్ధతుల గురించి కూడా వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే.. వీటిపై అవగాహన ఉంటే సునాయాసంగా రీపేమెంటు చేయొచ్చు. అలాంటి విధానాల్లో కొన్ని మీకోసం... * రుణాల రీపేమెంట్లో పలు ఆప్షన్లు * ఆదాయాన్ని బట్టి ఈఎంఐలలో హెచ్చుతగ్గులు క్రమంగా పెంచుకునే రీపేమెంట్... స్టెప్ అప్ రీ-పేమెంట్‌గా పిలిచే ఈ ఆప్షన్... ఉద్యోగం, లేదా వ్యాపారం ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్న వారికి బాగా పనికొస్తుంది. ఎందుకంటే కెరీర్ మొదట్లో వారికి ఆదాయం తక్కువగా ఉం టుంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుం టుంది. దీనికి అనుగుణంగానే ఈ విధానంలో ఈఎంఐలు ఉంటాయి. ప్రారంభంలో తక్కువగా ఉండే ఈఎంఐ... ఆదాయం పెరిగే కొద్దీ పెరుగుతుంటుంది. సరళీకృత రుణ వాయిదాలు... ఫ్లెక్సిబుల్ లోన్ ఈఎంఐలుగా పిలిచే ఈ ఆప్షన్... కెరీర్ ప్రారంభంలో ఉన్న వారికి కాకుండా రిటైర్మెంట్కు దగ్గరవుతున్నవారికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని స్టెప్ డౌన్ విధానంగా కూడా వ్యవహరిస్తారు. స్టెప్ అప్‌లో కట్టాల్సిన ఈఎంఐ మొత్తం.. ఏటా పెరుగుతూ పోతే, ఈ స్టెప్ డౌన్లో క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఉద్యోగం చేస్తున్నన్నాళ్లూ ఈఎంఐ అధిక మొత్తం ఉంటుంది. తర్వాత రిటైరయ్యే నాటికి బాగా తగ్గిపోతుంది. దశలవారీ చెల్లింపు.. నిర్మాణ దశలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రాపర్టీ పూర్తిగా చేతికొచ్చే దాకా ఎంత ఈఎంఐ కట్టాలనుకుంటున్నారన్నది మీరే ఎంపిక చేసుకోవచ్చు. ప్రాపర్టీ నిర్మాణ దశలో ఉండగానే రుణగ్రహీత కొంత భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా బ్యాంకులు ఈ విధానాన్ని అందిస్తున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఇంటిని తీసుకునేటప్పుడు దానికి పక్కాగా అన్ని అనుమతులూ ఉన్నాయో లేదో చూసుకోవటం మాత్రం ముఖ్యం. త్వరితగతి రీపేమెంట్.. మీ దగ్గర అదనంగా నిధులు ఉన్నప్పుడు... ఈఎంఐ మొత్తానికి మరికాస్త జోడించి కట్టే వెసులుబాటు కల్పిస్తుందీ యాక్సిలరేటెడ్ రీపేమెంట్ స్కీము. దీనివల్ల రుణం త్వరితగతిన తీరడంతో పాటు వడ్డీ భారమూ కాస్త తగ్గుతుంది. స్మార్ట్ఫిక్స్ విధానం.. ఫిక్స్డ్, ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల మేళవింపుతో ఉండే ఈఎంఐల విధానమే స్మార్ట్ఫిక్స్. దీనికి తొలి మూడేళ్ల పాటు కట్టాల్సిన ఈఎంఐని... ఫిక్స్డ్ వడ్డీ రేట్ల ప్రాతిపదికన లెక్కిస్తారు. ఈ స్థిర వడ్డీ రేటును బ్యాంకే నిర్ణయిస్తుంది. ఇక నాలుగో సంవత్సరం నుంచి ఫ్లోటింగ్ (చలన) ప్రాతిపదికన నెలవారీ కట్టాల్సిన ఈఎంఐ మొత్తాన్ని లెక్కిస్తుంది. ఒకవేళ వడ్డీ రేటు పెరిగితే ఆ మేరకు మీరు కట్టాల్సిన వడ్డీ మొత్తం పెరుగుతుంది. అలాగాకుండా వడ్డీ రేటు తగ్గితే.. ఇదీ తగ్గుతుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూమ్!
క్యూ4 లాభంలో 21 శాతం వృద్ధి; రూ. 2,807 కోట్లు - అధిక నికర వడ్డీ ఆదాయాల,మార్జిన్ల తోడ్పాటు - మొండిబకాయిలు తగ్గుముఖం... న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగబాకి రూ.2,807 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,327 కోట్లుగా ఉంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయాలు(ఎన్ఐఐ) పుంజుకోవడం లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, బ్యాంక్ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.15,570 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.12,790 కోట్లతో పోలిస్తే 21.7 శాతం వృద్ధి చెందింది. కాగా, గతేడాదివరకూ బ్యాంక్ త్రైమాసిక లాభాల్లో 30% స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. ఎన్ఐఐ 21 శాతం అప్... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎన్ఐఐ మార్చి క్వార్టర్లో రూ.6,013 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.4,953 కోట్లతో పోలిస్తే 21.4 శాతం ఎగసింది. ఇక బ్యాంక్ ఎన్ఐఎం క్యూ4లో 4.4 శాతంగా నమోదైంది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యధికమని బ్యాంక్ డిప్యూటీ ఎండీ పరేష్ సుక్తాంకర్ చెప్పారు. బేస్ రేటులో 0.15 శాతం కోత ప్రకటించినప్పటికీ.. ఎన్‌ఐఎంను ఈ స్థాయిలోనే కొనసాగించగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వడ్డీయేతర ఆదాయం(ఫీజులు ఇతరత్రా) 30 శాతం ఎగసి రూ.2,564 కోట్లకు చేరింది. మొండిబకాయిలు తగ్గాయ్... బ్యాంక్ మొండిబకాయిలు(ఎన్పీఏ) క్యూ4లో మరింత మెరుగుపడ్డాయి. స్థూల ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.93 శాతానికి తగ్గింది. నికర ఎన్పీఏలు 0.3 శాతం నుంచి 0.2 శాతానికి దిగొచ్చాయి. అయితే, ప్రొవిజనింగ్ మొత్తాన్ని బ్యాంక్ రూ.286 కోట్ల నుంచి రూ.577 కోట్లకు పెంచింది. రుణ పునర్వ్యవస్థీకరణ కంపెనీ(ఏఆర్సీ)లకు రూ.500 కోట్ల విలువైన రుణాలను క్యూ4లో విక్రయించింది. పూర్తి ఏడాదికి ఇలా...: 2014-15 పూర్తి ఏడాదిలో బ్యాంక్ నికర లాభం రూ. 10,216 కోట్లుగా నమోదైంది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఇదే తొలిసారి. అంతక్రితం ఏడాది రూ.8,478 కోట్లతో పోలిస్తే లాభం 20.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 17.1% వృద్ధితో రూ.49,055 కోట్ల నుంచి రూ.57,466 కోట్లకు ఎగసింది. ఇతర ముఖ్యాంశాలివీ.. ⇒ క్యూ4లో బ్యాంక్ 300 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. పూర్తి ఏడాదిలో ఈ సంఖ్య 611గా ఉంది. 10 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. ⇒ మార్చి క్వార్టర్ రుణాల్లో 21.2% మెరుగైన వృద్ధి నమోదైంది. రిటైల్ విభాగంలో 17%, కార్పొరేట్ విభాగంలో 26% వృద్ధి సాధించింది. మొత్తం రుణాల విలువ రూ.3.65 లక్షల కోట్లకు చేరింది. ⇒ గురువారం బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ.1,013 వద్ద స్థిరపడింది. గృహ రుణాలపై మహిళలకువడ్డీ తగ్గింపు... ఎస్బీఐ, ఐసీఐసీఐల బాటలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా మహిళలకు గృహ రుణాలపై స్వల్పంగా వడ్డీ తగ్గింపును ప్రకటించింది. మిగతా కస్టమర్లందరికీ 9.9 శాతం వడ్డీ రేటును అమలు చేస్తున్నామని.. మహిళలకు ఈ రేటును 9.85 శాతానికి తగ్గిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ రేణు సూద్ కర్నాడ్ పేర్కొన్నారు. ‘మహిళా శక్తి’ పేరుతో ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. జాయింట్ ఓనర్‌గా లేదా సింగిల్‌గా కొనుగోలు చేసే ప్రాపర్టీపైన మాత్రమే ఈ రేటు వర్తిస్తుంది అని అమె చెప్పారు. ప్లాట్లకు సంబంధించిన రుణాలపై రేటు 9.9 శాతమే ఉంటుందని కూడా కర్నాడ్ వివరించారు. -
వడ్డీ తగ్గితే మనకేంటి?
హోమ్ లోన్లు ఇకపై చౌక ఇప్పటికే తీసుకున్న వారికీ తగ్గనున్న ఈఎంఐ భారం తగ్గే వడ్డీరేట్లతో డిపాజిట్‌దారులకు ఇబ్బందే కొంచెం రిస్క్‌కు సిద్ధపడితే ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం హమ్మయ్య! ఆర్బీఐ హెచ్చరిక ఫలితమైతేనేం... వ్యాపారం కోసమైతేనేం... వడ్డీరేట్లు దిగివస్తున్నాయి. వరసగా రెండుసార్లు ఆర్బీఐ రెపో రేటు తగ్గించినా కిమ్మనని బ్యాంకులు... ఇపుడిపుడే వడ్డీరేట్లు తగ్గించటం మొదలెట్టాయి. ఫలితం... కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఈఎంఐ భారం ఇక నుంచి తగ్గనుంది. కొత్త రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించి... పాత రుణాలకు అధిక వడ్డీరేట్లను కొనసాగిస్తుండటంపై ఆర్బీఐ కన్నెర్ర చేయడంతో బ్యాంకులు దిగిరాక తప్పడం లేదు. ప్రధాన బ్యాంకులు ఇప్పటికే బేస్ రేటును తగ్గించిన ఫలితంగా పాత రుణాలకూ ఈ ఉపశమనం లభించనుంది. మరి వడ్డీరేట్లు తగ్గుతున్న ఈ తరుణంలో రుణాలు తీసుకునేవారు ఏం చేయాలి? డిపాజిట్ చేయాలనుకునేవారు ఏం చేయాలి? ఇప్పటికే రుణాలు తీసుకున్నవారి సంగతేంటి? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఈ వారం ‘ప్రాఫిట్’ ప్రధాన కథనం... డిపాజిట్లతో ఇబ్బందే! ఇప్పటికే బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించాయి. రానున్న కాలంలో ఈ వడ్డీరేట్లు ఇంకా బాగా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా డిపాజిట్లపై వడ్డీరేట్లు దిగి రావడం వల్ల రిస్క్ లేకుండా స్థిరాదాయం పొందాలనుకునే వారికి ఇబ్బందే. అందుకే ఇలాంటి సమయంలో కాస్త తెలివిగా వ్యవహరించాలి. అప్పుడే కాస్త అధికాదాయం దక్కుతుంది. 1. దీర్ఘకాలానికి వెళ్లండి.. సాధారణంగా రెండు మూడేళ్ల కాలానికి డిపాజిట్లు చేస్తుంటారు. కానీ.. వడ్డీరేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది కనక సాధ్యమైనంత ఎక్కువ కాలానికి డిపాజిట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే రెండేళ్ల కాలపరిమితి అయిన తర్వాత డిపాజిట్ పునరుద్ధరించుకోవాలనుకుంటే అప్పటికి ఇంకా వడ్డీరేట్లు తగ్గి ఉండే అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలపరిమితితో డిపాజిట్ చేసిన పక్షంలో ఇప్పటి వడ్డీయే చివరిదాకా లభిస్తుంది. యండి. అలాగే దీర్ఘకాలానికి ఏ బ్యాంకులో అధిక వడ్డీ లభిస్తుందో పరిశీలించి ఆ కాలపరిమితికి డిపాజిట్ చేయటమే మంచిది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఒకటి నుంచి ఐదేళ్ల కాలపరిమితికి 8.5 శాతం నుంచి 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రాబ్యాంక్ 1-2 ఏళ్ల కాలానికి మాత్రమే 8.75 శాతం వడ్డీని అందిస్తోంది. కానీ కొన్ని బ్యాంకులు ఐదేళ్ల కాలానికి కూడా ఇదే వడ్డీని అందిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రా బ్యాంక్‌లో రెండేళ్ల కాలానికి డిపాజిట్ చేయడం కంటే ఇదే వడ్డీరేటు అందిస్తున్న పీఎన్బీ, బీవోబీ బ్యాంకుల్లో ఐదేళ్ల కాలానికి డిపాజిట్ చేయడం ఉత్తమం. 2. కొద్దిగా రిస్క్ చేస్తే... కొద్దిగా రిస్క్ చేసే సామర్థ్యం ఉంటే అధిక వడ్డీరేటు కావాలనుకునే వారికి కంపెనీల డిపాజిట్లు, ఎన్సీడీలు, డెట్ ఫండ్స్ వంటి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్ల రేట్లతో పోలిస్తే కంపెనీల డిపాజిట్లు కాస్త అధిక వడ్డీరేటును అందిస్తాయి. ఇప్పుడు బ్యాంకులు మూడు నుంచి ఐదేళ్ళ కాలానికి 8.5 నుంచి 8.75 శాతం వడ్డీరేటును అందిస్తుంటే ఇదే కాలానికి వివిధ కంపెనీలు 9.25 శాతం నుంచి 9.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. కార్పొరేట్ డిపాజిట్లలో ఉన్న రిస్కల్లా మెచ్యూర్టీ అనేది ఆ కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కార్పొరేట్ డిపాజిట్ల విషయంలో చాలా విషయాలు పరిశీలించాలి. తెలియని కంపెనీ కాకుండా దీర్ఘకాలంగా కొనసాగుతున్న, ఫండమెంటల్స్ పరంగా మంచి పటిష్టంగా ఉన్న కంపెనీలనే ఎంచుకోవాలి. వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో కొన్ని కంపెనీలు అధిక వడ్డీ రేటుతో ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. ఇటువంటి కంపెనీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కొన్ని కంపెనీలు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ను జారీ చేయడం ద్వారా నిధులను సేకరిస్తాయి. ఇవి కూడా దీర్ఘకాలానికి చెందినవే. కానీ ఇవి స్టాక్ మార్కెట్లో నమోదవుతాయి కాబట్టి మధ్యలో వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు షేర్ల మాదిరి విక్రయించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఎన్సీడీ ఇష్యూ నడుస్తోంది. 11 ఆప్షన్స్‌లో లభిస్తున్న ఈ ఎన్సీడీపై 9.75 శాతం నుంచి 10.8 శాతం వరకు వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నారు. 3. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ... కొద్దిగా రిస్క్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ పథకాలు కూడా ఒక చక్కటి ఆప్షన్‌గానే భావించాలి. వడ్డీరేట్లు తగ్గే సమయంలో ఏడాది నుంచి మూడేళ్ళ కాలపరిమితి గల డెట్ ఫండ్స్ మంచి రాబడిని అందిస్తాయి. కానీ ఈ రాబడిపై ఎటువంటి హామీ ఉండకపోవడమే వీటిలోని ప్రధానమైన లోపం. ఇంటి రుణమైతే ఏం చేయాలి? సుమారు రెండున్నర ఏళ్ల విరామం తర్వాత ఈఎంఐ భారం తగ్గుతోంది. బేస్ రేటు తగ్గడం వల్ల కొత్తగా తీసుకునే గృహరుణాలతో పాటు, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా ఈఎంఐ తగ్గనుంది. ఇటువంటి సమయంలో కొత్తగా రుణాలు తీసుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా గృహ రుణాల్లో వడ్డీరేట్లు రెండు రకాలుగా చలన (ఫ్లోటింగ్), స్థిర (ఫిక్స్డ్) రూపంలో ఉంటాయి. ఫ్లోటింగ్ రేటును ఎంచుకుంటే వడ్డీరేట్లు తగ్గుతుంటే ఈఎంఐ తగ్గుతుంది. పెరిగితే ఆ మేరకు ఈఎంఐ భారం పెరుగుతుంది. అదే ఫిక్స్డ్ వడ్డీరేటు తీసుకుంటే పెరగడం, తగ్గడంతో సంబంధం లేకుండా ఈఎంఐ ఒకే విధంగా ఉంటుంది. సాధారణంగా వడ్డీరేట్లు తగ్గుతున్న తరుణంలో బ్యాంకులు ఫిక్స్డ్ వడ్డీరేట్ల పథకాలను ప్రవేశపెడతాయి. ఈ మధ్యనే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి సంస్థలు ఫిక్స్డ్ వడ్డీరేటుపై గృహ రుణాలను ప్రకటించాయి. వడ్డీరేట్లు తగ్గే సమయంలో ఫిక్స్డ్ రేటు కంటే ఫ్లోటింగ్‌ను ఎంచుకోవడం ఉత్తమం. దీనివల్ల రానున్న కాలంలో ఈఎంఐ భారం తగ్గుతుంది. అలా కాకుండా ఫిక్స్డ్ ఎంచుకుంటే వడ్డీరేట్లు తగ్గుతున్నా ఆ ప్రయోజనాన్ని పొందలేరు. గతంలో తీసుకున్నవారైతే? గతంలో అధిక వడ్డీరేటుకు రుణం తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గించుకోవడానికి బ్యాంకులు కన్వర్షన్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. కన్వర్షన్ కింద కొంత మొత్తం చెల్లించడం ద్వారా ప్రస్తుత తక్కువ బేసు రేటు మీదకు రుణాన్ని మార్చుకోవచ్చు. లేకపోతే లోన్ టేకోవర్ ద్వారా కూడా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. అధిక వడ్డీరేటు ఉన్న బ్యాంకు నుంచి తక్కువ వడ్డీరేటుకు ఉన్న బ్యాంకుకి రుణాన్ని మార్చుకోవడాన్నే లోన్ టేకోవర్ అంటారు. తక్కువ వడ్డీరేటున్న బ్యాంకును సంప్రదిస్తే వారే మీ రుణం చెల్లించి.. ఆ రుణాన్ని తమ బ్యాంకుకు మార్చుకుంటారు. -
హెచ్డీఎఫ్సీ గృహ రుణంపై వడ్డీరేటు తగ్గింపు
న్యూఢిల్లీ: గృహరుణాలపై వడ్డీరేటును హెచ్డీఎఫ్సీ 0.2 శాతం తగ్గించింది. కొత్త వడ్డీరేటు 9.9 శాతమని, ఇది ఈ నెల 13 (సోమవారం)నుంచి అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. కొత్త, పాత రుణగ్రహీతలకు ఇది వర్తిస్తుందని వివరించింది. వివిధ మెచ్యూరిటీ డిపాజిట్లపై రేట్లను కూడా హెచ్డీఎఫ్సీ తగ్గించింది. ఇంతకు ముందే ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు వడ్డీరేట్లను తగ్గించాయి. ు -
‘నెట్టింట్లో’ చుట్టేస్తారు
* ప్రభుత్వ సాయంతో కట్టే ఇళ్లకు జియో టాగింగ్ * అక్రమాలను అరికట్టే దిశగా గృహ నిర్మాణ శాఖ అడుగులు ఏలూరు (టూ టౌన్) : ఒకే స్థలంపై రెండు మూడు రుణాలు.. ఒకే వ్యక్తి పేరుతో అదే స్థాయిలో బిల్లుల మంజూరు.. ఒకే ఇంటిపై ఇద్దరు లేదా ముగ్గురికి వేర్వేరు పథకాల్లో ఇళ్ల కేటాయింపు.. గృహ నిర్మాణ శాఖలో ఇలాంటి అక్రమాలు అన్నీఇన్నీ కావు. ఇకపై వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆ శాఖ సమాయత్తమైంది. ఇందుకు జియో టాగింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మన జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు కింద లక్ష ఇళ్లను జియో టాగింగ్ విధానం ద్వారా ఆన్లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసిన ఇళ్లలో 98 వేల ఇళ్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ ఇళ్లన్నీ నెట్టింట్లోకే.. ప్రభుత్వం ఐఏవై, ఇందిరమ్మ, ఆర్పీహెచ్, అర్బన్ పథకాల కింద జిల్లాలోని పేదలకు సబ్సిడీతో కూడిన గృహ రుణాలను మంజూరు చేసింది. వీటిలో చాలా యూనిట్లు అక్రమార్కులు దక్కించుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురికి ఇళ్లు కేటాయించిన సందర్భాలు అనేకం ఉన్నారుు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ గృహ నిర్మాణ శాఖ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు తీసుకున్న లబ్ధిదారుల వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడంతోపాటు ప్రతి ఇంటిని జియో టాగింగ్ పద్ధతిలో ఆన్లైన్ చేయూలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందారుు. పని మొదలుపెట్టాం గృహ నిర్మాణ శాఖ ద్వారా లబ్ధిపొందిన వారి ఆధార్ నంబర్లను అనుసంధానం చేయడంతోపాటు జియో టాగింగ్ విధానానికి శ్రీకారం చుట్టామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో మొత్తం 2 లక్షల 37వేల 770 ఇళ్లను నిర్మించగా, 2 లక్షల 34వేల 500 ఇళ్లకు సంబంధించి ఆధార్ సీడింగ్, ఆన్లైన్ ప్రక్రియల్ని పూర్తి చేశామని చెప్పారు. లబ్ధిదారుల ఇళ్లను హౌసింగ్ ఏఈలో ఫొటోలు తీసి సిద్ధంగా ఉంచారన్నారు. ఈ వివరాలన్నిటితో లక్ష ఇళ్లకు జియో టాగింగ్ చేయనున్నామని వివరించారు. ఇది పూర్తి కాగానే మిగిలిన అన్ని ఇళ్ల వివరాలను, ఫొటోలను జియో టాగింగ్లో పొందుపరుస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఎవరెవరు సబ్సిడీతో కూడిన ఇంటి రుణాలు పొందారు, ఏ పేర్లతో తీసుకున్నారు, ఎక్కడ, ఎప్పుడు తీసుకున్నారనే వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తామని వివరించారు. తద్వారా అదే వ్యక్తులు భవిష్యత్‌లో ఎక్కడైనా అక్రమ పద్ధతుల్లో గృహ రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తే అడ్డుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. జియో టాగింగ్ విధానమంటే.. ఒక లబ్ధిదారుడు సబ్సిడీతో కూడిన రుణం తీసుకుని ఇల్లు కడితే అతని ఫొటోతోపాటు అతని ఇంటి ఫొటోను కూడా తీసుకుంటారు. ఆధార్ నంబర్, రేషన్ కార్డు వివరాలను అనుసంధానం చేస్తారు. ఇల్లు కట్టిన ప్రదేశం, సర్వే నంబర్, గ్రామం, మండలం తదితర వివరాలను సవివరంగా నమోదు చేస్తారు. ఇల్లు, లబ్ధిదారుడి ఫొటోలను అందులో పొందుపరుస్త్తారు. ఇవన్నీ ఆన్లైన్లో భద్రపరు స్తారు. భవిష్యత్‌లో గృహ రుణం తీసుకునేందుకు ఎవరు దరఖాస్తు చేసిన తక్షణమే ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. సదరు వ్యక్తి గతంలో సబ్సిడీతో కూడిన రుణం తీసుకుని ఉంటే ఆ వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతారుు. అలాంటి వారికి రుణాలు మంజూరు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. -
గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీరేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.75 లక్షలు పైబడిన గృహ రుణాలపై వడ్డీరేటును 0.15% మేర తగ్గించింది.ఇదే సమయంలో రుణాలకు సంబంధించి శ్లాబ్‌లను ఎత్తివేసింది. దీని ప్రకారం గృహ రుణం ఇకపై ఎంత మొత్తం అయినా 10.15% వడ్డీ అమలవుతుంది. అయితే మహిళలకు సంబంధించి 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05%(100 బేసిస్ పాయింట్లు 1%) రాయితీ ఉంటుంది. ఈ వడ్డీరేటు 10.10%గా అమలవుతుంది. బ్యాంక్ బేస్ రేటు (ఇంతకన్నా తగ్గించి రుణ రేటు ఉండడానికి వీలు లేదు) ప్రస్తుతం 10%. అంటే గృహ రుణం ఇకపై మహిళలకు బేస్ రేటుపై 10% అధికంగా, ఇతరుల విషయంలో 15% అధికంగా ఉంటుందన్నమాట. ఇప్పటి వరకూ ఇలా... ఇప్పటి వరకూ అంటే 2013 డిసెంబర్ 20 నుంచీ అమలవుతున్న విధానం ప్రకారం బ్యాంక్ రెండు స్లాబ్స్‌లో గృహ రుణం ఉండేది. ఇందులో ఒకటి రూ.75 లక్షల లోపు ఒక స్లాబ్. రూ.75 లక్షల పైబడి స్లాబ్ మరొకటి. రూ.75 లక్షల లోపు రుణంపై మహిళలకు 10.10% వడ్డీ, ఇతరులకు 10.15% అమలయ్యేది. రూ.75 లక్షల పైబడిన రుణంపై మహిళలకు 10.25% రుణం అమలయితే, ఇతరుల విషయంలో ఇది 10.30%గా ఉండేది. ఈ శ్లాబ్‌లు ఇకపై తొలగిపోయి శ్లాబ్ రహిత తాజా రేట్లు అమలవుతాయి. ఇప్పుడు శ్లాబ్‌లతో సంబంధం లేకుండా గృహ రుణాలపై మహిళలకు 10.10%, ఇతరులకు 10.15 శాతం చొప్పున వడ్డీ రేటు ఉంటుంది. కాగా, తాజా స్లాబ్ రహిత (యూనిఫామ్) గృహ రుణ రేట్లు 26 ఆగస్టు 2014 నుంచీ అమల్లోకి వచ్చాయి. మహిళల విషయంలో...: గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు ఏకైక దరఖాస్తుదారుగా ఉండాలి. సహ-దరఖాస్తుదారులు అయితే వారిలో మహిళ మొదటివారై ఉండాలి. ఇదే విషయం ప్రోపర్టీకీ వర్తిస్తుంది. ప్రోపర్టీ కేవలం మహిళకు చెందినదై ఉండాలి. సహ యజమానులైతే, వారిలో మొదటివారు మహిళై ఉండాలి. పీఎన్బీ కూడా... పండుగ సీజన్ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. రూ. 2 కోట్ల వరకూ రుణాలపై వడ్డీరేటు 10.25%గా నిర్ణయించింది. అలాగే గృహ, కారు, ద్విచక్ర వాహనాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను పూర్తిగా రద్దుచేస్తున్నట్లు పేర్కొంది. రూ.2 కోట్ల పైబడిన రిటైల్, హౌసింగ్ రుణాలపై రేట్లు 10.50%గా బ్యాంక్ పే ర్కొంది. ఫ్లోటింగ్ ప్రాతిపదికన ద్విచక్ర వాహన రుణ రేటు 12.25%గా ఉంటుంది. ఫిక్స్డ్ బేసిస్‌పై కార్ రుణ రేటు 10.65 శాతంగా ఆఫర్ చేస్తోంది. ఫ్లోటింగ్ బేసిస్‌పై 10.50 శాతమని పేర్కొంది. -
గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తాం: వెంకయ్య
న్యూఢిల్లీ: గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తామని పట్టణాభివృద్ది శాఖామంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. బుధవారం కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతల్ని స్వీకరించిన వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ.. అందరికి ఇళ్లు అనే లక్ష్యం సాధించాలంటే వడ్డీ రేట్లు తగ్గించకతప్పదు అని వ్యాఖ్యానించారు. గృహ నిర్మాణం అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశమని.. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో ఈ అంశంపై చర్చిస్తానని అన్నారు. వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీడీఏ ప్రభుత్వంలో కూడా గృహ నిర్మాణమే అత్యంత ప్రాధాన్యత అంశమనే విషయాన్ని గుర్తు చేశారు. వాజ్ పేయి ప్రభుత్వంలో వడ్డీ రేట్లను 11 శాతం నుంచి 7 శాతానికి తీసుకువచ్చామని వెంకయ్య అన్నారు. 2020 నాటికి అందరికి ఇళ్లు అనే లక్ష్యాన్ని సాధించాలంటే వడ్డీ రేట్లు తప్పించాల్సిందేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.