ముంబై: దేశంలోనే అతిపెద్ద గృహ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ జూన్ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ.4,059 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 2 శాతం క్షీణించి రూ.11,168 కోట్లుగా ఉంది. బ్యాంకింగ్, బీమా, మ్యూచువల్ ఫండ్స్ సహా దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవల విభాగాల్లో కంపెనీలకు సబ్సిడరీలు ఉన్నాయి. వీటిని మినహాయించి స్టాండలోన్‌గా (కేవలం గృహ రుణాల వ్యాపారం) చూసుకుంటే సంస్థ లాభం 5 శాతం క్షీణించి రూ.3,051 కోట్లుగా నమోదైంది. ఆదాయం 2 శాతం పెరిగి 10790 కోట్లుగా ఉంది.
తగ్గని మారటోరియం రుణాలు
సంస్థ మొత్తం రుణాల్లో ఇప్పటికీ 22 శాతం మారటోరియం పరిధిలోనే ఉన్నాయి. మొదటి విడత మారటోరియం (రుణ చెల్లింపులకు విరామం) కాలం అయిన మే చివరి నాటికి 27 శాతం రుణాలు ఆ పరిధిలో ఉన్నాయి. వీటిల్లో రిటైల్ రుణ గ్రహీతలవి 16.6 శాతం. ఆగస్టు చివరి వరకు ఈ మారటోరియంను ఆర్‌బీఐ కొనసాగించగా.. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ముందు నాటితో పోలిస్తే 5 శాతం మందే రుణ చెల్లింపులకు ముందుకు వచ్చారు.
ఎన్‌పీఏలు 1.87%: సంస్థ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు/వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో గతంలో 1.99 శాతంగా ఉంటే, జూన్ ఆఖరుకు 1.87 శాతానికి తగ్గాయి. సంస్థ నికర వడ్డీ మార్జిన్ 3.1 శాతంగా ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ. 4,059 కోట్లు
Published Fri, Jul 31 2020 6:26 AM | Last Updated on Fri, Jul 31 2020 6:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment