దేశంలో ద్రవ్యోల్పణాన్ని కట్టడి చేసేందుకు ఇటీవల ఆర్బీఐ రెపో రేటుని పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచే పనిలో పడ్డాయి. తాజాగా ప్రముఖ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. హోమ్ లోన్స్‌పై ఉన్న రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్‌పీఎల్‌ఆర్)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
గృహ రుణాల బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. కాగా పెంచిన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు ఆగస్టు 9 నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ నెలలో ఇది రెండవ పెంపు కావడం గమనార్హం. మూడు నెలల్లో హెచ్‌డిఎఫ్‌సి చేపట్టడం ఇది ఆరోసారి. మే 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం రేటు 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో గృహ రుణాలు తీసుకున్న కస్టమర్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.
మే నుంచి ఆర్‌బీఐ ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్ల పెంపుదలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరోసారి సెప్టెంబరుతో పాటు డిసెంబర్‌లో కూడా ఆర్బీఐ సమావేశం కానుంది. ఏది ఏమైనా భారం మాత్రం తప్పట్లేదని సామన్య ప్రజలు వాపోతున్నారు. మూడు నెలల కాలంలోనే ఆర్‌పీఎల్ఆర్ (RPLR) చాలా అధికంగా పెరగడంతో హోం లోన్స్ తీసుకున్న వారు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది.
చదవండి: Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?
Comments
Please login to add a commentAdd a comment