HDFC
-
ఒక్క కంపెనీ లాభం.. రోజుకు రూ.216 కోట్లు!
దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..లాభాల్లో టాప్10 కంపెనీలు🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు🔝ఎస్బీఐ రూ.186.7 కోట్లు🔝హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు🔝ఓఎన్జీసీ రూ.156.4 కోట్లు🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు🔝ఎల్ఐసీ రూ.112.1 కోట్లు🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లుఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
ఐదు లక్షల మంది రైతులకు సాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా చిన్న రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో ఒకటైన ‘పరివర్తన్’ ద్వారా ఈ సాయం అందించనున్నట్లు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (డీఎండీ) కైజాద్ ఎం బారుచా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్యాంకు గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. స్థిరమైన వృద్ధిని పెంపొందించడంతోపాటు అల్పాదాయ వర్గాలకు అండగా నిలుస్తోంది. 2014లో ప్రారంభమైన ‘పరివర్తన్’ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద సీఎస్ఆర్ ప్రోగ్రామ్‌ల్లో ఒకటి. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ద్వారా సేవలందిస్తున్నాం. గత పదేళ్ల కాలంలో రూ.5000 కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో ఈ నిధులు పెంచుతాం. ఇప్పటికే పరివర్తన్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా నిలిచాం. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 25,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. స్మార్ట్ తరగతులు, పాఠశాల ఫర్నిచర్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనను నిరోధించడానికి స్వచ్ఛ భారత్ అభియాన్‌కు అనుగుణంగా 25000 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను ఇప్పటికే నిర్మించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటుకేంద్ర ప్రభుత్వం 2013 తరువాత కంపెనీల చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అందులోని సెక్షన్ 135లో సీఎస్ఆర్ నిబంధనను చేర్చింది. దాని ప్రకారం కార్పొరేట్ సంస్థల నికర లాభంలో రెండు శాతం సీఎస్ఆర్కు కేటాయించాలి. ఆర్థిక సర్వేలోని వివరాల ప్రకారం గడిచిన ఎనిమిదేళ్లలో అన్ని దేశీయ కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ కింద దాదాపు రూ.1.53 లక్షల కోట్లు ఖర్చు చేశాయి. -
పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు
భారతదేశంలో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచినట్లు అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.అధికారిక వెబ్సైట్ ప్రకారం.. హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో మూడు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతంగా ఉంది. ఒక సంవత్సరానికి ఎంసీఎల్ఆర్ 9.45 శాతంగా ఉంది. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ ఈఎంఐ పెరుగుతుంది. ఇందులో ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ రెండూ ఉంటాయి. ఇది కస్టమర్ల మీద ప్రభావం చూపిస్తుంది.ఓవర్ నైట్: 9.10 శాతంఒక నెల: 9.15 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.40 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.45 శాతంఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
రేపు మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత!
హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా దాదాపు మూడు గంటల పాటు వినియోగదారులకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.ఈమేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం..బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యూపీఐ సేవలు నిలిపేస్తున్నారు. బ్యాంకు వినియోగదారులు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఈ చర్యలు తీసుకుంటుంది.ఇదీ చదవండి: ఏడాదిలో 42 వేల మంది రాజీనామా!హెచ్డీఎఫ్సీ ప్రకటించిన సమయంలో బ్యాంకు కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) హోల్టర్లకు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు అందుబాటులో ఉండవు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్‌పే, ఫోన్‌పే, వాట్సప్పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా హెచ్డీఎఫ్సీ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉండదు. -
హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ ఉందా?.. 13న ఈ సేవలన్నీ బంద్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఈనెల 13న (జులై 13) సిస్టమ్ అప్‌గ్రేడ్ చేపడుతోంది. ఈ కారణంగా ఆ రోజు పలు బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుస్తుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఉదయం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుంది.హెచ్డీఎఫ్సీ అప్డేట్ అనేది సుమారు 13:30 గంటలు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. అవసరమైన కార్యకలాపాలను 12వ తేదీనే చేసుకుంటే మంచిది. ఎందుకంటే 13వ తేదీ అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం.జులై 13న అందుబాటులో ఉండే సేవలు👉యూపీఐ సేవలను ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు. 👉ఏటీఎమ్ సర్వీసును ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు.👉నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సిస్టమ్ అప్‌గ్రేడ్ సమయంలో అందుబాటులో ఉంటాయి.👉ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ బదిలీలు, బ్రాంచ్ బదిలీలతో సహా అన్ని ఫండ్ బదిలీ అందుబాటులో ఉండవు. -
క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లిస్తున్నారా.. కొత్త చార్జీలు తెలుసుకోండి!
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన 'హెచ్డీఎఫ్సీ' అద్దె చెల్లింపుల కోసం కొత్త ఫీజును ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు క్రెడో, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చెల్లించే అద్దె మీద 1 శాతం ఫీజు వసూలు చేయనుంది. దీనిని గరిష్టంగా రూ. 3వేలుకు పరిమితం చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ జూన్ 26న కస్టమర్లకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంటే ముందు.. క్రెడిట్ కార్లు చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలను ఇతర క్రెడిట్ కార్డు జారీదారులు, బ్యాంకులు కూడా ప్రకటించాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ రెండూ తమ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లలో అద్దె చెల్లింపుల కోసం రివార్డ్ పాయింట్లను అందించడం ఆపివేసాయి.2024 ఫిబ్రవరి 1 నుంచి అమెజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి నిర్దిష్ట కార్డ్‌లు మినహా.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అద్దె చెల్లింపులు, ఈ వాలెట్ లోడింగ్ లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు లభించడం లేదు. కాగా ఇప్పుడు హెచ్డీఎఫ్సీ చెల్లింపులపైన అదనపు ఫీజు చెల్లింపులను ప్రారంభించింది. ఈ మార్పులు 2024 ఆగష్టు 1నుంచి అమలులోకి రానున్నాయి. -
ఇకపై బ్యాంక్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్లుండవు.. ఎవరికంటే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు పంపించే ఎస్‌ఎమ్‌ఎస్‌లపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ వినియోగదారులు చేసే యూపీఐ డెబిట్, క్రెడిట్ లావాదేవీలకు కొత్త నిబంధన వర్తిస్తుందని చెప్పింది.బ్యాంక్ యూపీఐ డెబిట్, క్రెడిట్లు ఉపయోగించి రూ.100లోపు లావాదేవీలు చేస్తే ఇకపై ఎస్ఎమ్ఎస్లు పంపబోమని తెలిపింది. 2024 జూన్ 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ చెప్పింది. అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ సందేశాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా పరిమితి ప్రకారం.. రూ.100కు పైన ఎవరికైనా నగదు పంపినా/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తే ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లు అందుతాయి. దాంతోపాటు రూ.500కు మించి నగదు అందుకున్నప్పుడు మాత్రమే ఎస్ఎమ్ఎస్ సదుపాయం ఉంటుంది.ఇదీ చదవండి: క్యాష్‌లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలుఅధిక మొత్తంలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నందున బల్క్ ఎస్ఎమ్ఎస్లు పంపేందుకు అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం..2023లో యూపీఐ లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఏడాది చివరినాటికి దాదాపు 118 బిలియన్లకు చేరుకున్నాయి. -
హెచ్డీఎఫ్సీ.. ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన దీపక్ పరేఖ్.. తదుపరి ఎవరంటే..
హెచ్డీఎఫ్సీ లైప్ ఇన్సూరెన్స్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దీపక్ పరేఖ్ వైదొలిగారు. ఈనెల 18 వ్యాపార వేళలు ముగిసినప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 24 ఏళ్లుగా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఆయన అందించిన సేవలకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది. పరేఖ్ అనంతరం ఎవరు ఈ కంపెనీని ముందుండి నడిపిస్తారనే వాదనలను తెరదించుతూ కొత్త ఛైర్మన్‌ను కూడా ఏకగ్రీవంగా నియమించారు. కేకి ఎం మిస్త్రీను సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. 23 ఏళ్లుగా కంపెనీలో ఉన్న ఆయన ప్రస్తుతం బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సహ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మిస్త్రీ హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ పొందిన అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇదీ చదవండి: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే.. ఏప్రిల్ 24, 2024న వికె విశ్వనాథన్, ప్రసాద్ చంద్రన్ తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఇటీవల వెంకట్రామన్ శ్రీనివాసన్‌ను ఐదేళ్ల కాలానికిగాను నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సు ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించినట్లు కంపెనీ గతంలోనే పేర్కొంది. -
హెడీఎఫ్సీ బ్యాంక్ రుణాలు ఎన్నంటే..?
ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణాలు రూ.25 లక్షల కోట్లను అధిగమించాయి. 2024 మార్చి త్రైమాసికం ముగిసే నాటికి ఈ మేరకు రుణాలున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2023 మార్చి 31 నాటికి ఈ రుణాల విలువ రూ.16.14 లక్షల కోట్లు ఉండగా, 55.4 శాతం వృద్ధితో రూ.25.08 లక్షల కోట్లకు చేరినట్లు నియంత్రణ సంస్థలకు బ్యాంక్ రిపోర్ట్ చేసింది. 2023 జులై 1న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల విలీనం తర్వాతి రుణాలు కాబట్టి, గత ఏడాదితో వీటిని పోల్చిచూడొద్దని బ్యాంకు వర్గాలు తెలిపాయి. త్రైమాసిక ప్రాతిపదికన 2023 డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే (రూ.24.69 లక్షల కోట్లు) 2024 మార్చి త్రైమాసికంలో 1.6 శాతం మాత్రమే రుణాలు పెరిగాయి. ఇదీ చదవండి: పెరిగిన వెజ్ భోజనం ధర.. తగ్గిన నాన్‌వెజ్ ఖరీదు దేశీయ రిటైల్ రుణాలు 2023 మార్చి 31తో పోలిస్తే 109 శాతం, డిసెంబరు 31తో పోలిస్తే 3.7 శాతం వృద్ధి చెందాయి. వాణిజ్య-గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు వరుసగా 24.6 శాతం, 4.2 శాతం మేర పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు 2024 మార్చి 31 నాటికి రూ.23.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబరు 31 నాటికి రూ.22.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన రూ.18.83 లక్షల కోట్ల నుంచి 26.4 శాతం పెరిగాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తన హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ వాటాను ఎవరు కొనుగోలు దారులను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ బిడ్డర్ ప్రయోజనాల కోసం డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది ఓ కంపెనీలో వాటాను మరో సంస్థకు అమ్మేందుకు ఉపయోగపడే బిడ్డింగ్ ప్రక్రియ. ఆసక్తిగల సంస్థ (సాధారణంగా ఒక ప్రైవేట్ సంస్థ) ఒక కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ కోసం ఒక ప్రతిపాదనను ప్రారంభిస్తుంది. అప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టు వివరాలను బహిరంగంగా విడుదల చేసి, ఇతర పార్టీలను తమ ప్రతిపాదనలను సమర్పించమని ఆహ్వానిస్తుంది. ఈ ప్రతిపాదనను ప్రారంభించిన అసలు బిడ్డర్(ఇక్కడ హెచ్డీఎఫ్సీ బ్యాంక్)కు తిరస్కరించే హక్కు ఉంది. అసలు బిడ్డర్‌కు నచ్చితే వాటా అమ్మకం ప్రక్రియ ముందుకు సాగుతుంది. -
ఈ రెండు బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్
ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు భద్రత ఎక్కువ, రిస్క్ తక్కువ. అందుకే పెట్టుబడి దారులు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతుంటారు. మీరు కూడా ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఎఫ్డీలపై 7.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.5శాతం నుండి 7.75శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది కాకుండా, బ్యాంక్ 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేట్లను పరిమిత కాలానికి 21 నెలల కంటే తక్కువకు పెంచింది. సాధారణ పౌరులకు, వడ్డీ రేటు 7.25శాతం. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, అదే టెన్యూర్ కాలానికి వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఫిబ్రవరి 17, 2024 నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుండగా.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పౌరులకు సంవత్సరానికి 7.2శాతం వడ్డీని అందిస్తుంది. . సాధారణ పౌరులకు, ఫిక్స్డ్ డిపాజిట్ అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 2 సంవత్సరాల టెన్యూర్ కాలానికి 7.2శాతం వరకు ఉంటుంది. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు అదే టెన్యూర్ కు 7.75శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొంది. -
దీర్ఘకాలంలో నమ్మకమైన లాభాలనిచ్చే ఫండ్.. ఓ లుక్కేయండి..
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వేల్యుయేషన్లను అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని ముందుగా గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్‌క్యాప్ ఇండెక్స్ నాలుగేళ్ల కాలంలో మంచి పనితీరు చూపించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది. కానీ, స్మాల్‌క్యాప్ మాత్రం ఏడేళ్లలో మంచి పనితీరు చూపించింది. కనుక ప్రతీ విభాగంలోనూ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రాబడులు ఆర్జించడానికి మంచి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇలా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు ఇచ్చేవే ఫ్లెక్సీక్యాప్, మలీ్టక్యాప్ ఫండ్స్. ఈ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ, మంచి పనితీరు చూపుతున్న పథకాల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. రాబడులు ఈ పథకం ఏ కాలంలో చూసినా కానీ, బెంచ్ మార్క్ అయిన బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. గడిచిన ఏడాది కాలంలో 37.58 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. మూడేళ్లలో కాలంలో వార్షిక రాబడి 24.27 శాతంగా ఉంది. ఇక ఐదేళ్ల కాలంలో 19.40 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 17.13 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో భాగంగా ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూస్తే, ఈ పథకమే 3 శాతం నుంచి 8 శాతం మేర అధిక రాబడిని వివిధ కాలాల్లో అందించినట్టు తెలుస్తోంది. ఇక బీఎస్ఈ 500 టీఆర్ఐతో చూసినా కానీ, ఈ పథకంలోనే 1–6 శాతం మేర వివిధ కాలాల్లో అధిక రాబడి కనిపిస్తుంది. ఈ పథకం 1995 జనవరి 1న ప్రారంభమైంది. గతంలో హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్ కాగా, అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది. ఆరంభం నుంచి వార్షిక రాబడి 19 శాతం మేర ఉండడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం/ఫోర్ట్‌ఫోలియో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌కు దేశ ఈక్విటీ మార్కెట్లో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉండడం గమనార్హం. తొలుత రూ.52 కోట్లతో ఆరంభమైన ఈ పథకంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది జనవరి చివరికి రూ.47,642 కోట్లుగా ఉన్నాయి. ప్రతి మార్కెట్ సైకిల్లో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న రంగాలు, కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ప్రస్తుతం ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 87.5 శాతమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 0.42 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 3.79 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. నగదు, నగదు సమానాల రూపంలో 8.29 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీల్లో 91 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 7.61 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 41 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 32 శాతం పెట్టుబడులు పెట్టింది. హెల్త్‌కేర్ కంపెనీలకు 12.59 శాతం, టెక్నాల జీ కంపెనీలకు 9.5 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.39 శాతం చొప్పున కేటాయించింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు HDFCకి లైన్ క్లీయర్
-
అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ తమ వాలెట్ బిజినెస్ ముకేశ్ అంబానీకి చెందిన NBFCతో పాటు HDFC బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తీవ్ర సంక్షోభంలో ఉన్న కంపెనీ తమ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీకి విక్రయిస్తుందనే పుకార్లు వెల్లువెత్తడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 14 శాతం పెరిగి 288.75 రూపాయల గరిష్ఠానికి చేరుకున్నాయి. పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్‌లు ముందున్నాయని, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ బృందం ఈ విషయాన్నే.. గత నవంబర్ నుంచి జియో ఫైనాన్షియల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. RBI నిషేధానికి ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి జియో కూడా సుముఖత చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్బీఐ పేటీఎం లైసెన్స్ రద్దు చేస్తుందా.. పేటీఎంలో మనీలాండరింగ్, కేవైసీ ఉల్లంఘనల కారణంగా బ్యాంకింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసే విషయాన్ని RBI పరిశీలిస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు.. ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదనే నియమాలు అమలులోకి వస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. పేటీఎం సీఈఓ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని, ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజయ్ శేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువ మంది దీని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ ఛాంపియన్‌గా నిలుస్తుందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే.. -
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్‌తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్‌తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 39% జంప్
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2023–24, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ. 17,718 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 12,735 కోట్లతో పోలిస్తే 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 54,123 కోట్ల నుంచి రూ. 1,15,015 కోట్లకు చేరింది. 112 శాతం ఎగసింది. స్టాండెలోన్ నికర లాభం 34 శాతం వృద్ధితో రూ.16,373 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.12,259 కోట్లుగా ఉంది. ఇక స్టాండెలోన్ ఆదాయం 60 శాతం వృద్ధి చెంది, రూ. 51,208 కోట్ల నుంచి రూ. 81,720 కోట్లకు పెరిగింది. ఎన్పీఏలు ఇలా... బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) క్యూ3లో స్వల్పంగా పెరిగాయి. 1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరాయి. అయితే నికర ఎన్పీఏలు మాత్రం 0.33 శాతం నుంచి స్వల్పంగా 0.31 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర మంగళవారం 0.31 శాతం పెరిగి రూ. 1,678 వద్ద ముగిసింది. -
రూ.10వేల పెట్టుబడితో.. 15 కోట్లు సంపాదన, ఎలా అంటే?
నెలకు 10వేలు 25ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే సుమారు 15 కోట్ల వరకు డబ్బు సంపాదించడం ఎలా? ఈ రహస్యాన్నే హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, యాంఫీ ఛైర్మన్ నవనీత్ మునోత్ బహిర్ఘతం చేశారు. ముంబైలో జరిగిన బిజినెస్ టుడే 500 వెల్త్ క్రియేటర్ సమ్మిట్‌లో భారతీయ మార్కెట్ల భవిష్యత్తు గురించి, వ్యాపారాలు, పెట్టుబడిదారులు, కొత్తగా పుట్టుకొస్తున్న మార్కెట్ ట్రెండ్లు, సవాళ్లు, అవకాశాల్ని అన్వేషించడం అనే అంశంపై ఆయా కంపెనీల సీఈఓలు మాట్లాడారు. ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, యాంఫీ ఛైర్మన్ నవనీత్ మునోత్ మాట్లాడుతూ..మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ విలువ 17 వేల కోట్లు మూడేళ్ళ క్రితం అది నేటితో పోలిస్తే సగం. మ్యూచువల్ ఫండ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి దాదాపు 25 ఏళ్లు పట్టింది. 2017లో 4,000 కోట్లు, 2018లో 8,000 కోట్లు, ఇప్పుడు 2023లో 17,000 కోట్లుగా ఉందని అన్నారు. అనంతరం.. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులతో భారీ రాబడులే వచ్చాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో నెలకు రూ.10వేల చొప్పున 25 నుంచి 30 ఏళ్లు పెట్టుబడులు పెడితే 18-19 శాతం వడ్డీ ఇలా అసలు వడ్డీ మొత్తం కలుపుకుని రూ.15 కోట్లు వచ్చాయి. అయితే, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పరంగా అంత సానుకూలత లేదు. కాబట్టి రాబోయే 28 సంవత్సరాలలో రూ.10వేలు పెట్టుబడి పెడితే ఇంత భారీ మొత్తంలో డబ్బుల్ని సంపాదించవచ్చా’ అంటే ఖచ్చితంగా చెప్పలేను అని అన్నారు. అయితే ఇది దేశ సామర్ధ్యం ఎలా ఉందో నిరూపిస్తుంది. పెట్టుబడుల పరంగా భారత్ మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అత్యుత్తమం అంటూ నవనీత్ మునోత్ తన ప్రసంగాన్ని ముగించారు. -
5 రోజుల్లో రూ. 26 వేల కోట్లు లాభపడిన లక్కీ ఇన్వెస్టర్లు
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కూడా ఒకటి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంకాప్) పరంగా కూడా టాప్ 10 కంపెనీల జాబితాలో టాప్‌లో కొనసాగుతూ వస్తుంది. తాజాగా లిస్ట్‌లో కూడా రిలయన్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. దీంతో రిలయన్స్ పెట్టుబడిదారులు అపార లాభాలను సొంతం చేసుకున్నారు. గత 5 రోజుల ట్రేడింగ్‌లో రూ. 26,000 కోట్లకు పైగా లాభాలను సాధించారు. ఆర్ఐఎల్ ఎంక్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. క్రితం వారంతో పోలిస్తే రూ.26,014.36 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో నాలుగు కంపెనీలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో ఆర్ఐఎల్ తరువాత భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిలిచింది. ఆరు కంపెనీలు లాభాలనుకోల్పోయాయి. రూ. 20,490 లాభాలతో రూ. 11,62,706.71 కోట్ల ఎంక్యాప్‌తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 5,46,720.84 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్లకు చేరుకుంది. గత వారం నష్టపోయిన టాప్ కంపెనీల్లో టీసీఎస్ నిలిచింది. రూ.16,484.03 కోట్లు తగ్గి రూ.12,65,153.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎస్బీఐ , బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన ఇతర టాప్ కంపెనీలు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్‌వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించేసింది. సాధారణ ఖాతాదారులకు 35 నెలల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7.20 శాతం నుంచి ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపుతో 7.15 శాతానికి, అలాగే 55 నెలల టెన్యూర్ కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ 7.20 శాతానికి తగ్గించింది. 12 నెలల నుంచి 15 నెలల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేండ్ల నుంచి రెండు సంవత్సరాల 11 నెలలు, మూడేండ్ల ఒక్కరోజు నుంచి నాలుగేండ్ల ఏడు నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ ఖాతాదారులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నది. ఇక ఐదేండ్ల ఒక రోజు నుంచి 10 ఏండ్ల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి. -
బ్యాంక్ షేర్లలో తాజా కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో భాగంగా ఫెడరల్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌సహా పలు బ్యాంకులలో అదనపు వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు ఆర్బీఐ నుంచి తాజాగా అనుమతులు లభించినట్లు హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వెల్లడించింది. వెరసి అనుమతి పొందిన బ్యాంకులలో వాటాను 9.5 శాతంవరకూ పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలియజేసింది. బ్యాంకులలో అదనపు పెట్టుబడులను చేపట్టేందుకు పెట్టుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ క్లియరెన్స్ ఇచి్చనట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి పొందిన జాబితాలో డీసీబీ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ సైతం ఉన్నాయి. మరోవైపు చెల్లించిన మూలధనం లేదా వోటింగ్ హక్కులలో 9.5 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ ఏఎంసీకి ఆర్బీఐ నుంచి అనుమతి లభించినట్లు విడిగా ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. 2023 జూన్30కల్లా ఫెడరల్ బ్యాంక్‌లో 4.49 శాతం, ఈక్విటాస్ ఎస్ఎఫ్బీలో 4.68 శాతం చొప్పున హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వాటాలు కలిగి ఉంది. అయితే తాజా కొనుగోళ్ల తదుపరి ఒక్కో బ్యాంకులో 9.5 శాతం వాటాను మించేందుకు అనుమతించరు. -
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్
HDFC Bank hikes interest rates దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. అన్ని రకాల లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఆయా రుణాలపై ఈఎంఐ భారం మరింత భరించక తప్పదు. (యాపిల్‌కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) హెచ్డీఎఫ్సీ రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం మేర పెంచింది. దీని ప్రకారం బ్యాంకుకు సంబంధించిన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఇకపై వడ్డీ భారం పెరగనుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ పెంపు తర్వాత 8.35 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.70 శాతం నుంచి 8.80 శాతానికి చేరుకుంది. ఏడాదిలోపు రుణాలపై వడ్డీరేటు భారం 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9.15 శాతానికి చేరింది . (ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్డేట్ చేసుకోకపోతే అంతే!) సెప్టెంబరు 7 నుంచి అమల్లోకి వచ్చిన హెచ్డీఎఫ్సీ MCLR 6 నెలలుకాల రుణాలపై 9.05 శాతం ఏడాది రుణాలపై 9.15శాతం రెండేళ్ల కాలపరిమితి రుణాలపై 9.20 శాతం మూడేళ్ల కాల రుణాలపై 9.25శాతం వడ్డీ వర్తిస్తుంది. -
గిఫ్ట్ సిటీలో హెచ్డీఎఫ్సీ లైఫ్ సేవలు
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) నుంచి హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సేవలను ఆరంభించాయి. ఈ విషయాన్ని హెచ్డీఎఫ్సీ గ్రూప్ గురువారం ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థ ఐఎఫ్ఎస్సీలో ‘హెచ్డీఎఫ్సీ ఇంటర్నేషనల్ లైఫ్ అండ్ ఆర్ఈ’ని ఏర్పాటు చేసింది. ఇదే కేంద్రంలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ను హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ప్రారంభించింది. డాలర్ డినామినేటెడ్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఎన్ఆర్ఐలకు ఆఫర్ చేయనున్నట్టు హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. ఇదే మాదిరి హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఫండ్ సొల్యూషన్లను అందించనుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇంటర్నేషనల్ తన తొలి ఉత్పత్తిని సైతం ప్రకటించింది. ‘యూఎస్ డాలర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్లాన్’ పెట్టుబడులకు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించింది. పిల్లల విదేశీ విద్యకు నిధిని సమకూర్చుకోవాలని అనుకునే వారికి ఇది అనుకూలమని తెలిపింది. కరెన్సీ మారకంలో అస్థిరతలను ఇది నివారిస్తుందని పేర్కొంది. మరోవైపు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సైతం ఆరు కొత్త పథకాలను ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపింది. -
అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?
HDFC: ప్రపంచ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి అమాంతం ముందుకు దూసుకెళుతోంది. ఈ కారణంగా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లకు చేరిన సంగతి తెలిసింది. కాగా అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో ఒక బ్యాంకు నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లిస్తూ ఐదు సంవత్సరాల అగ్రిమెంట్‌తో ఆఫీస్ స్పేస్ లీజుకి తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెలకు రూ. 1.62 కోట్లు అద్దె.. నివేదికల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ ముంబైలోని వన్ ఇంటర్నేషనల్ సెంటర్లో తన ఆఫీస్ కోసం 64,337 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలానికి నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీని కోసం సంస్థ ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తరువాత అగ్రిమెంట్ కాలవ్యవధి పెరుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బ్యాంకు 7వ అంతస్తులో మూడు యూనిట్లు, 8వ అంతస్తులో రెండు యూనిట్లను లీజుకు తీసుకుంది. ఇవి టవర్స్ 2, 3లో ఉన్నాయి. ఈ డీల్ కోసం బ్యాంక్ దాదాపు రూ.9.73 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అయితే అద్దె సంవత్సరానికి 4.5 శాతం పెరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ఐదు సంవత్సరాలకు అద్దె ఇలా.. దీని ప్రకారం మార్చి 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అద్దె రూ. 1.62 కోట్లు. 2024 ఆగష్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు అద్దె నెలకు రూ.1.69 కోట్లు. 2025 ఆగష్టు 1 నుంచి 2026 జూలై 31 వరకు అద్దె రూ. 1.77 కోట్లు. 2026 ఆగష్టు 1 నుంచి 2027 జులై 31 వరకు అద్దె రూ.1.85 కోట్లు ఉండనున్నట్లు సంస్థ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! గత కొన్ని రోజులకు ముందు హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.