భారీగా పెరిగిన వెండి ధర | Gold gains Rs 132 silver zooms Rs 2915 | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన వెండి ధర

Jan 29 2021 6:27 PM | Updated on Jan 29 2021 7:41 PM

Gold gains Rs 132 silver zooms Rs 2915 - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం వెండి ధర ఒక్కసారిగా దాదాపు రూ.3వేలు పెరగడం విశేషం. అలాగే బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్‌లో 99.9 స్వ‌చ్ఛ‌త క‌లిగిన 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.132 పెరిగి రూ.48,376కు చేరింది. అలాగే క్రితం సెషన్‌లో రూ.65,495గా ఉన్న కేజీ వెండి ధర నేడు రూ. 2,915 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో కేజీ వెండి రూ.68,410 పలికింది. అంతర్జాతీయ విపణిలో ధరల పెరుగుదలతో పాటు, కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపరులు భావిస్తున్నారు. దీంతో దేశీయ విపణిలో ఈ లోహల ధరలు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1,844.35 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 26.35 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది.(చదవండి:  ప్రీ బడ్జెట్‌ ఫీవర్‌: తీవ్ర ఊగిసలాట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement