దసరా, దీపావళి సమయంలో బంగారం ధరలు తారాజువ్వలా పైకి లేసాయి. ఈ పండుగలు ముగియడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వడం జరిగిన తరువాత పసిడి ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. దీపావళి నుంచి గోల్డ్ రేట్లు దాదాపు 6 శాతం క్షీణించాయి.
2024 నవంబర్ 1న 80,710 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 16) 75,650 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెల ప్రారంభంలో ఉన్న ధరలకు, ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా డిమాండ్ మాత్రం తగ్గే అవకాశం లేదు. ముఖ్యంగా భారతదేశంలో కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్ బంగారం విక్రయాలను గణనీయంగా పెంచాయని మల్హోత్రా జ్యువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ధృవ్ మల్హోత్రా పేర్కొన్నారు. అయితే బంగారం ధరల తగ్గుదల మరింత ఎక్కువ మందిని బంగారం కొనేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్‌వర్డ్‌లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!
స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడుల కంటే కూడా.. బంగారం మీద పెట్టే పెట్టుబడులు చాలా సురక్షితమని చాలామంది భావిస్తున్నారు. ఈ కారణంగానే.. పెట్టుబడిదారులు కూడా బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడింది. ప్రస్తుత పరిస్థితి మాదిరిగానే.. బంగారం రేటు తగ్గుతూ పోతే మళ్ళీ పాత ధరలకు చేరుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment