మొబైల్, కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్.. ఇలా వేటికైనా సరే పాస్‌వర్డ్ తప్పనిసరి. ఎందుకంటే మన డేటా ఇతరుల చేతిలోకి వెళ్లకుండా ఉండాలంటే సెక్యూరిటీ అవసరం. దీనికోసమే పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే చాలామంది సింపుల్ పాస్‌వర్డ్స్ క్రియేట్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం కఠినమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకుంటున్నారు. నార్డ్‌పాస్ అనే కంపెనీ 2024లో ఎక్కువమంది సులభమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడిస్తూ.. జాబితాను కూడా విడుదల చేసింది.
ఎక్కువమంది ఉపయోగించే పాస్‌వర్డ్‌లు
→123456
→123456789
→12345678
→Password
→Qwerty123
→Qwerty1
→111111
→12345
→Secret
→123123
నార్డ్‌పాస్ కార్పొరేట్ పాస్‌వర్డ్‌ల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఆఫీసుల్లో ఉపయోగించే పాస్‌వర్డ్‌లు మాత్రమే కాకుండా.. ప్రొఫెషనల్ జోన్‌లలో కూడా ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లను వెల్లడించింది.
కార్పొరేట్ పాస్‌వర్డ్‌లు
→123456
→123456789
→12345678
→secret
→password
→qwerty123
→qwerty1
→111111
→123123
→1234567890
వ్యక్తిగత పాస్‌వర్డ్‌లను, కార్పొరేట్ పాస్‌వర్డ్‌లను గమనిస్తే.. ఈ రెండూ కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది తమ వ్యక్తిగత పాస్‌వర్డ్‌లనే.. ఆఫీసుల్లో కూడా ఉపయోగించుకుంటారు. ఇలా చేయడం వల్ల హ్యాకర్స్ సులభంగా డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించాల్సిన అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఆ వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తోన్న అంబానీ కూతురు..
Comments
Please login to add a commentAdd a comment