password
-
ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!
మొబైల్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్.. ఇలా వేటికైనా సరే పాస్వర్డ్ తప్పనిసరి. ఎందుకంటే మన డేటా ఇతరుల చేతిలోకి వెళ్లకుండా ఉండాలంటే సెక్యూరిటీ అవసరం. దీనికోసమే పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే చాలామంది సింపుల్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం కఠినమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకుంటున్నారు. నార్డ్‌పాస్ అనే కంపెనీ 2024లో ఎక్కువమంది సులభమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడిస్తూ.. జాబితాను కూడా విడుదల చేసింది.ఎక్కువమంది ఉపయోగించే పాస్వర్డ్లు→123456→123456789→12345678→Password→Qwerty123→Qwerty1→111111→12345→Secret→123123నార్డ్‌పాస్ కార్పొరేట్ పాస్‌వర్డ్‌ల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఆఫీసుల్లో ఉపయోగించే పాస్వర్డ్లు మాత్రమే కాకుండా.. ప్రొఫెషనల్ జోన్లలో కూడా ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లను వెల్లడించింది.కార్పొరేట్ పాస్వర్డ్లు→123456→123456789→12345678→secret→password→qwerty123→qwerty1→111111→123123→1234567890వ్యక్తిగత పాస్‌వర్డ్‌లను, కార్పొరేట్ పాస్‌వర్డ్‌లను గమనిస్తే.. ఈ రెండూ కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది తమ వ్యక్తిగత పాస్‌వర్డ్‌లనే.. ఆఫీసుల్లో కూడా ఉపయోగించుకుంటారు. ఇలా చేయడం వల్ల హ్యాకర్స్ సులభంగా డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించాల్సిన అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఆ వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తోన్న అంబానీ కూతురు.. -
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగా చాలామంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా యూరప్‌కు చెందిన ఓ వ్యక్తి.. దాదాపు పోయిందన్న డబ్బు తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సుమారు 11 సంవత్సరాల క్రితం యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి బిట్‌కాయిన్ వాలెట్ పాస్వర్డ్ మర్చిపోయారు. పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఎలాంటి లావాదేవీలు చేయలేకపోయారు. అప్పట్లో (2013) తన వాలెట్లో తక్కువ బిట్కాయిన్లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో బిట్కాయిన్లకు పెద్దగా విలువ లేకపోవడంతో అతడు కూడా పట్టించుకోలేదు.ఇటీవల బిట్‌కాయిన్ విలువ ఏకంగా 2000 శాతం పెరిగింది. ఇది గమనించిన వ్యక్తి.. ఎలాగైన తన బిట్కాయిన్లను పొందాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం హ్యాకర్లలో కింగ్‌పిన్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ 'జో గ్రాండ్'ను ఎంచుకున్నారు. అతడు అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA అభివృద్ధి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్‌ను ఉపయోగించి పాస్వర్డ్ రికవర్ చేసాడు.సుమారు దశాబ్దంలో బిట్‌కాయిన్ ధర 20,000 శాతానికి పైగా పెరగడంతో, కోల్పోయిన మరుగున పడ్డ బిట్‌కాయిన్ విలువ సంపదగా పెరిగింది. అది సుమారు రూ. 25 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ఆ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. -
మీ పాస్వర్డ్ స్ట్రాంగేనా?
సాక్షి, హైదరాబాద్: ఏటీఎం, ఆన్లైన్ బ్యాకింగ్ పాస్‌వర్డ్‌ల విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు మరిచిపోతామనో..సులభంగా ఉండాలనో ...1111, 1212 తరహా అత్యంత సాధారణ పాస్వర్డ్లు పెట్టుకునే వారంతా సైబర్ నేరగాళ్లకు డబ్బులు కాజేసే అవకాశమిచి్చనవారవుతారని హెచ్చరించారు. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో భారతదేశంలోని సైబర్ దాడులలో 33% గణనీయమైన పెరుగుదల నమోదైంది. 3.4 మిలియన్ల పాస్‌వర్డ్‌ల అధ్యయనం తర్వాత పది వీక్ పాస్‌వర్డ్‌లను గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటిలో ఏదైనా సంఖ్యను పిన్ నంబర్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్)గా వాడుతుంటే..దాన్ని వెంటనే మార్చుకుని..ఇతరులు సులువుగా గుర్తించలేని పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా తమ, లేదా ఇతర కుటుంబ సభ్యుల పుట్టిన సంవత్సరాలు సైతం పెట్టుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.అత్యంత వీక్ పాస్వర్డ్లు ఇవే... 1234, 1111, 0000, 1212, 7777, 1004,2000, 4444, 2222, 6969 -
మొబైల్ గేమ్ పాస్వర్డ్ ఇవ్వలేదని యువకుని హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఆన్లైన్ మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్వర్డ్ షేర్ చేయలేదని ఓ యువకున్ని అతని స్నేహితులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చి అడవిలో పడేశారు. యువకుడి తల్లి ఫిర్యాదుతో ఈ భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాపాయి దాస్ (18) గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో తల్లి పూర్ణిమా దాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పాపాయి దాస్ మృతదేహం జనవరి 15న అడవి సమీపంలో లభ్యమైంది. హత్యకు గల కారణాలను అన్వేషిస్తూ యువకుని స్నేహితులను విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్వర్డ్ ఇవ్వనందుకు నలుగురు స్నేహితులు కలిసి యువకున్ని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన నలుగురు మైనర్ స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదీ చదవండి: Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. ఐదుగురు పౌరులు మృతి -
డిస్నీ+ హాట్‌స్టార్ యూజర్లకు షాక్! నవంబర్ 1 నుంచే..
నెట్‌ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) కూడా తమ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పాస్వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలియజేస్తూ సబ్‌స్క్రైబర్ ఒప్పందానికి సంబంధించిన అప్డేట్లను కెనడాలోని సబ్స్క్రైబర్లకు ఈ-మెయిల్ చేసింది. ది వెర్జ్ కథనం ప్రకారం.. అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్‌పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కఠిన ఆంక్షలను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి దాని వెబ్‌సైట్‌లోని హెల్ప్ సెంటర్‌ను కూడా అప్డేట్ చేసింది. యూజర్లు నిబంధనలను ఉల్లంఘించి పాస్వర్డ్ షేర్ చేయకుండా వారి అకౌంట్లను పర్యవేక్షించనుంది. కెనడియన్ సబ్‌స్క్రైబర్ ఒప్పందంలో "అకౌంట్ షేరింగ్"పై కొత్త నిబంధనను చేసింది. అందులో సబ్స్క్రయిబ్ అయిన యూజర్ల ఖాతాలను పర్యవేక్షిస్తామని కంపెనీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, సబ్‌స్క్రిప్షన్‌ను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పాస్వర్డ్ షేరింగ్ ఆంక్షలు కెనడాలో 2023 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. భారత్‌తో సహా ఇతర దేశాల్లో కూడా ఈ ఆంక్షలను అమలు చేయాలని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భావిస్తోంది. -
నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్‌స్టార్ - అదే జరిగితే..
Disney Hotstar Limit Account Sharing: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్‌ను ముగించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో 'డిస్నీ+ హాట్‌స్టార్' (Disney+ Hotstar) కూడా ఇదే బాటలో పయనించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, డిస్నీ+ హాట్‌స్టార్ దాని ప్రీమియం వినియోగదారులలో పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వినియోగదారులు కేవలం నాలుగు పరికరాల నుంచి మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని అమలు చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అమలులోకి వస్తే స్ట్రీమింగ్ దిగ్గజం పాస్వర్డ్ షేరింగ్ వినియోగదారులకు కష్టతరమవుతుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానానికి నెట్‌ఫ్లిక్స్ మంగళం పాడింది. ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాల్లో ఇది అమలులో ఉంది. ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం డిస్నీ+ హాట్‌స్టార్ ద్వారా గరిష్టంగా 10 పరికరాలలో లాగిన్లను అనుమతిస్తుంది. కానీ దీనికి త్వరలోనే స్వస్తి చెప్పనుంది. కొత్త రూల్స్ ఈ ఏడాది చివరి నాటికి అమలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!) కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారులు సొంత సభ్యత్వాన్ని పొందాల్సి ఉండవచ్చు. అయితే రానున్న కొత్త మార్పులు చౌకైన ప్లాన్లకు కూడా వర్తిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన డిస్నీ+ హాట్‌స్టార్ 2022 మార్చి నుంచి 2023 మార్చి వరకు 38 శాతం వీక్షకులను కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుస్కోవడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సిందే. -
షాకింగ్ న్యూస్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ ఇక నో ఛాన్స్!
Netflix Password Sharing End: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్‌ను ముగించినట్లు ప్రకటించింది. ఒక వ్యక్తి మాత్రమే ఒక ఖాతాను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్ చేసే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు ఈ విధానానికి చరమగీతం పాడింది. సంస్థ ఈ నిర్ణయం గురించి గతంలోనే వెల్లడించింది. కాగా ఇప్పటికి అమలు చేసింది. ఒక కుటుంబంలో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణ సమయంలో కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉండేలా ఒక కొత్త ఫీచర్ అందించనున్నట్లు స్ట్రీమింగ్ దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఇమెయిల్ ప్రారంభించినున్నట్లు కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) గత మేలో నెట్‌ఫ్లిక్స్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ వంటి ప్రముఖ మార్కెట్లతో సహా 100 కంటే ఎక్కువ దేశాల్లో పాస్వర్డ్ షేరింగ్‌పై పరిమితులను విధించింది. కాగా ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ రూల్స్ అమలులోకి వచ్చేసాయి. సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక డేటా ప్రకారం ముగిసిన త్రైమాసికంలో మొత్తం 238 మిలియన్ల సబ్స్క్రైబర్లతో 1.5 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిసింది. -
సైబర్ సేఫ్టీకి 5 S సూత్రం.. పాస్‌వర్డ్‌ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
రోజువారీ జీవితంలో స్మార్ట్ఫోన్లలోనే సగం సమయం గడిచిపోతోంది. సోషల్ మీడియా యాప్స్ వాడకం మొదలు ఆన్లైన్ ఆర్డర్లు, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల వరకు పని ఏదైనా ఫోన్, ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరైంది. టెక్నాలజీ వాడకంతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అంతేస్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే సైబర్ జమానాలో సేఫ్‌గా ఉండేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొన్ని సూచనలు చేసింది. 5ఎస్ సూత్రాన్ని పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చని పేర్కొంది. ఏమిటి ఆ 5ఎస్? స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్, సెక్యూర్ నెట్వర్క్, సెక్యూర్ వెబ్‌సైట్స్ లేదా యాప్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, సస్పీషియస్ లింక్ అలర్ట్...కలిపి 5 ఎస్‌లుగా పోలీసులు సూత్రీకరించారు. స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం సోషల్ మీడియా ఖాతాలకు, ఆన్లైన్ బ్యాంకు ఖాతాలకు, ఈ–మెయిల్స్‌కు వేర్వేరు పాస్వర్డ్లు పెట్టుకోవడం ఉత్తమం. ఒకటే పాస్‌వర్డ్‌ను అన్నింటికీ పెట్టడం రిస్క్ అని గుర్తించాలి. పాస్‌వర్డ్‌లో వీలైనంత వరకు మన పేరు, బర్త్‌డే తేదీలు, పిల్లల పేర్లు లేకుండా చూసుకోవడం ఉత్తమం. పాస్‌వర్డ్‌ను అంకెలు, క్యారెక్టర్లు, పెద్ద, చిన్న అక్షరాల మిళితంగా పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌లను ఇతరులకు షేర్ చేయవద్దు. సెక్యూర్ వెబ్‌సైట్స్, యాప్స్, సెక్యూర్ నెట్వర్క్.. మనం వాడే వెబ్సైట్లు, డౌన్లోడ్ చేసుకొనే యాప్స్ సరైనవేనా అన్నది ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. యాప్‌లను డౌన్లోడ్ చేసే ముందు ఆ యాప్ రేటింగ్ పరిశీలించాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్.. మొబైల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌తో అప్డేట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల సైబర్ దాడుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సరైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను వినియోగించుకోవాలి. సస్పీషియస్ లింక్ అలర్ట్... మనకు మెసేజ్‌లు, వాట్సాప్ సందేశాలు, ఈ–మెయిల్స్ రూపంలో వచ్చే మెసేజ్‌లలోని అనుమానాస్పద లింక్‌లపై ఎట్టిపరిస్థతుల్లోనూ క్లిక్ చేయవద్దు. చాలా తక్కువ అక్షరాలతో ఉండే లింక్‌లు చాలా వరకు అనుమానాస్పదమైనవని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అక్షర దోషాలు ఉన్న లింక్‌లు సైతం అనుమానాస్పదమైనవని తెలుసుకోవాలి. -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాకిచ్చింది. పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో అమెరికాతో పాటు ప్రపంచంలోని 100 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు వారి అకౌంట్లను కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా పాస్ వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు, యాడ్ సపోర్ట్ ఆప్షన్ వంటి ఫీచర్లను ఎనేబుల్ చేసింది. 103 దేశాల యూజర్లకు ఇ-మెయిల్స్ నెట్‌ఫ్లిక్స్ మంగళవారం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ పాటు పాస్ వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీల్ని వసూలు చేస్తున్నట్లు 103 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యూజర్లకు మెయిల్ పెట్టింది. ఆ ఇ-మెయిల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్‌ను ఒకరే వినియోగించుకోవాలని, ఇతరులకు షేర్ చేస్తే అమెరికా యూజర్లు అదనపు ఛార్జీల కింద 8 డాలర్లను (భారత కరెన్సీలో రూ.700డాలర్లు) విధిస్తున్నట్లు పేర్కొంది. 100 మిలియన్లకు పైగా 100 మిలియన్లకు పైగా కుటుంబాలు తమ లాగ్-ఇన్ వివరాలు ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసినట్లు కంపెనీ అంచనా వేసింది. కాగా, మార్చి చివరి నాటికి, నెట్‌ఫ్లిక్స్ చెల్లింపు కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 232.5 మిలియన్లు సబ్స్క్రిప్షన్ యూజర్లు ఉన్నారు. కొత్త పాలసీల ప్రకారం, ఒకే కుటుంబ సభ్యులు నెట్‌ఫ్లిక్స్ ఖాతాను వీక్షించవచ్చు. ప్రయాణంలో ఇతర డివైజ్‌లలో లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. చదవండి👉 భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం! -
పాస్ వర్డ్ పిన్ అవసరం లేకుండానే ఫోన్ పే పేమెంట్స్...
-
గూగుల్ సంచలన నిర్ణయం..!
-
గూగుల్ సరికొత్త సంచలనం.. లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ అవసరం లేదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్వర్డ్ లేకుండా యాప్స్, వెబ్‌సైట్స్ లాగిన్ అయ్యేలా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను సులభతరం చేసేలా బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నైజేషన్, స్క్రీన్ లాక్ పిన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ తరుణంలో గూగుల్ అకౌంట్ యూజర్లు పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయ్యేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. పాస్వర్డ్ 123లకు గుడ్‌బై ప్రస్తుతం, ఏదైనా వెబ్సైట్, యాప్‌లలో లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడీతో పాటు పాస్వర్డ్ 123, పాస్వర్డ్ 123@$ ఈ తరహాలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా బయోమెట్రిక్ అథంటికేషన్ ఆధారిత ‘పాస్‌కీస్’ ఆప్షన్‌తో సంప్రదాయ పాస్వర్డ్లైన పాస్వర్డ్ 123లకు స్వస్తిపలకనుంది. వచ్చే ఏడాది వరల్డ్ పాస్వర్డ్డే నాటికి యూజర్లు వినియోగించేలా ఈ పాస్‌కీస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పాస్‌కీస్ అంటే? పాస్‌కీస్ అంటే ఫేస్ఐడీ, టచ్ ఐడీ ఆధారిత బయోమెట్రిక్ అథంటికేషన్ విధానం. దీని సాయంతో 123 తరహా పాస్‌వర్డ్‌ల అవసరం ఉండదు. వెబ్ అథింటిక్ ఆధారిత ఫేస్ఐడీ లేదా టచ్ ఐడీలను ఉపయోగించి యాప్స్‌లో లేదంటే వెబ్సైట్లలో లాగిన్ అయ్యేలా సౌకర్యం కలగనుంది. పాస్‌కీస్ టెక్నాలజీ ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే టెక్నాలజీ వినియోగంతో పెరిగిపోతున్న సైబర్ నేరాల్ని అరికట్టేందుకు 2009లో పాస్‌కీస్ విధానం వినియోగిస్తే బాగుండేదన్న ఆలోచన వచ్చింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. అయితే 2012లో అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ పేపాల్ దిగ్గజ టెక్ కంపెనీలతో కలిసి పాస్‌వర్డ్‌ల స్థానంలో బయోమెట్రిక్ టెక్నాలజీ వినియోగం కోసం పనిచేసేలా ఓ ఒప్పందానికి వచ్చాయి. ఫిడోలో గూగుల్ భాగస్వామ్యం అలా జులై 2012లో ఫాస్ట్ ఐడెంటిఫై ఆన్లైన్(Fast Identity Online (FIDO) పేరుతో ఓ సంస్థను స్థాపించాయి. 2013లో ఫిడోలో గూగుల్ సైతం చేరింది. ఆ మరుసటి ఏడాది అంటే 2014లో పేపాల్ - శాంసంగ్ కలిసి ఫిడో అభివృద్ది చేసిన అథంటికేషన్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్లలో ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసింది. దీని సాయంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్లలో పేపాల్ యూజర్లు ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే పాస్వర్డ్ లేకుండా స్వైప్ చేసి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. గూగుల్ పాస్‌కీస్ ప్రయోగం తాజాగా పాస్‌కీస్ ఫీచర్ తెచ్చేందుకు గూగుల్ ప్రయోగాలు ముమ్మరం చేసింది. ఫిడో అలయన్స్‌లో ఉన్న ఇతర టెక్ సంస్థలైన యాపిల్, మైక్రోసాఫ్ట్ పాస్‌కీస్ ప్రాజెక్ట్‌పై కలిసి పనిచేస్తుంది. ఆ ప్రాజెక్ట్ చివరి దశలో ఉందని , వచ్చే ఏడాది మే 2 వరల్డ్ పాస్వర్డ్ డే రోజున పాస్‌వర్డ్‌ల స్థానంలో పాస్‌కీస్ ఆప్షన్‌ను గూగుల్ తేనున్నట్ల నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: చిన్న చిన్న లావాదేవీల కోసం పిన్ అక్కర్లేదు! -
పేపర్ లీకేజీలో బిగ్ ట్విస్ట్.. ప్రధాన సూత్రధారి రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో సిట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ అయినప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి రాజశేఖర్ అని తేల్చింది సిట్. ఈ మేరకు టీఎస్పీఎస్సీకి శుక్రవారం తన నివేదికను అందించింది. టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేసేవాడు రాజశేఖర్. అయితే.. గతంలో టెక్నికల్ సర్వీస్‌లో పని చేసే రాజశేఖర్.. ఉద్దేశపూర్వకంగానే డిప్యూటేషన్‌పై వచ్చాడు. అక్కడ కంప్యూటర్ను హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ను దొంగిలించినట్లు సిట్ అనుమానిస్తోంది. ఇక విధుల్లో చేరాక.. ప్రవీణ్‌తో సంబంధాలు నడిపాడు రాజశేఖర్. దాదాపు ఐదు పరీక్షా పత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి ప్రవీణ్‌కు ఇచ్చాడు. ఫిబ్రవరి 27నే పేపర్‌ను కాపీ చేశాడు రాజశేఖర్. అదే తేదీన రాజశేఖర్‌కు అందించాడు. ఇందులో గ్రూప్-1 పరీక్షాపత్రంతో పాటు జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చర్ పరీక్ష ప్రశ్నాపత్రం సైతం ఉందని సిట్ దర్యాప్తులో తేలింది(అందుకే పరీక్షలు వాయిదా వేసింది కమిషన్). ఆపై ప్రవీణ్.. రేణుకను పేపర్లను అమ్మేశాడు. అదే సమయంలో ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై సిట్ విచారణ జరుపుతోంది. సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ గ్రూప్-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు నిర్ధారించుకుంది సిట్. మరోవైపు పాస్వర్డ్ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రవీణ్ పాస్‌వర్డ్‌ను శంకర్ లక్ష్మి అనే ఉద్యోగి డైరీ నుంచి కొట్టేశానని చెబుతున్నాడు. అయితే ఆమె మాత్రం పాస్‌వర్డ్‌ను తాను డైరీలో రాయలేదని చెబుతోంది. ఈ తరుణంలో.. శంకర్ లక్ష్మీ పాత్రపైనా దర్యాప్తు కొనసాగిస్తోంది సిట్. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులకు ఆరు రోజుల కస్టడీ విధించింది కోర్టు. దీంతో.. రేపటి నుంచి సిట్ వీళ్లను ప్రశ్నించనుంది. -
భారీగా తగ్గిన నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చేజారిపోతున్న సబ్స్కైబర్ల సంఖ్యను పెంచేలా 30 కి పైగా దేశాల్లో సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. ఈజిప్ట్, యెమెన్,జోర్డాన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా,స్లోవేనియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, వెనుజెలా, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్స్క్రిప్షన్ ఫీజును భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే తగ్గించిన దేశాల్లో భారత్ లేకపోవడం గమనార్హం. ఓటీటీ దిగ్గజం గత కొంత కాలంగా పాస్వర్డ్ షేరింగ్‌పై సర్ ఛార్జీలు వసూలు చేస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సబ్స్క్రిప్షన్ చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో యూజర్లను తిరిగి రాబట్టుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, సబ్ సహారన్ ఆఫ్రికా , మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా, సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్ , ఏసియా పసిఫిక్ లాంటి రీజియన్స్‌లో 20 నుంచి 60 శాతం వరకు ఛార్జీలను తగ్గించింది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రతి నెలా బేసిక్ ప్లాన్‌ను కొత్తగా వచ్చే యూజర్లకు, ఇప్పటికే వినియోగిస్తున్న యూజర్లు 28 మలేసియన్ రింగిట్స్‌కే అదిస్తున్నట్లు ట్వీట్ చేయగా.. ఇండియన్ కరెన్సీలో రూ.653 చెల్లించాల్సి ఉంది. కాగా, గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ బేసిక్ ధర 35 మలేసియన్ రింగిట్స్ ఉండేది. -
యూజర్లకు స్విగ్గీ షాక్.. పాస్వర్డ్ షేరింగ్ కుదరదు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ యాజర్లకు షాక్ ఇచ్చింది. స్విగ్గీ వన్ పేరుతో తీసుకొచ్చిన మెంబర్షిప్ ప్రోగ్రామ్‌కు గరిష్టంగా రెండు ఫోన్లలో మాత్రమే లాగిన్ అయ్యేలా పరిమితి విధించింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కూడా ఇదివరకే ఇలాంటి పాస్వర్డ్ షేరింగ్ పరిమితిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాస్వర్డ్ షేరింగ్ ద్వారా యూజర్లు తగ్గిపోవడమే కాకుండా తమ ఆదాయానికి కూడా గండి పడుతుండటంతో స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ చేసిన మార్పులపై స్విగ్గి తమ యూజర్లందరికీ ఈ-మెయిల్స్ పంపించింది. దీని ప్రకారం స్విగ్గీ వన్ కస్టమర్లు ఒకే అకౌంట్‌ను రెండు కంటే ఎక్కువ ఫోన్లలో వినియోగించలేరు. స్విగ్గీ వన్ వ్యక్తిగత వినియోగానికి మాత్రమే ఉద్దేశించిందని, తాజాగా తీసుకొచ్చిన పరిమితితో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా ఈ మెంబర్షిప్ ప్లాన్ కోసం కస్టమర్ల నుంచి నెలకు రూ.75లను స్విగ్గీ తీసుకుంటోంది. అదే మూడు నెలలకు అయితే రూ.299, సంవత్సరానికైతే రూ.899 చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!) -
కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. ఆ ఓటీటీ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి!
కరోనా లాక్డౌన్ కారణంగా ఓటీటీ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇది వందల కోట్ల నుంచి వేల కోట్ల మార్కెట్‌గా అవతరించింది. ఇందులో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అత్యంత జనాదరణ పొందడంతో పాటు కాస్త ఖరీదైన ఓటీటీగా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్ తన కస్టమర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు షాక్.. నో షేరింగ్ సంవత్సరాలుగా, నెట్‌ఫ్లిక్స్ తన చందాదారులను కోల్పోవడానికి పాస్వర్డ్ షేరింగ్ ప్రధాన కారణాలలో ఒకటిగా పేర్కొంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంటిని దాటి పాస్వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయడం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలకాలని యోచిస్తోందట. ఓటీటీ సంస్థలు ఇప్పటి వరకు పాస్ వర్డ్ షేరింగ్ అవకాశాన్ని కల్పించాయి. ఒకరికి అకౌంట్ ఉంటే సుమారు నలుగురు పాస్ వర్డ్ షేర్ చేసుకునే అవకాశం ఉండేది. ఒక్కరు రీఛార్జ్ చేసుకుంటే మిగతా వారంతా ఉచితంగా కంటెంట్ ను చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఇకపై పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పాస్వర్డ్ షేరింగ్‌పై నిషేధానికి సంబంధించిన కొత్త విధానాన్ని 2023 లోపు యునైటెడ్ స్టేట్స్లో అమలు చేయనుంది. ఆ తర్వాత ఈ రూల్‌ని మిగిలిన దేశాలకు అమల్లోకి తీసుకురావాలిని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. పాస్వర్డ్ షేరింగ్ బ్యాన్ కాకుండా, నెట్‌ఫ్లిక్స్ కొత్త నియమాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూజర్లు వారి సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించి పే-పర్-వ్యూ కంటెంట్‌ను అద్దెకు తీసుకునేలా వీలు కల్పిస్తుంది. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ అతి త్వరలోనే ప్రకటన-ఆధారిత సబ్స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రారంభించే ప్లాన్‌లో ఉంది. దీని ట్రయల్స్ 2023లో మొదలుపెట్టేందుకు యోచిస్తోంది. నెట్‌ఫ్లిక్స్( Netflix ), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), హెచ్‌బీఓ (HBO) వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్లో పాస్వర్డ్ షేరింగ్ చట్టవిరుద్ధం అని, ఇది తమ కాపీరైట్ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నాయి. మరో వైపు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రేటు కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్లుకు తమ పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేరింగ్ చేసుకునే వెసలుబాటును నిలిపేవేయనుంది. చదవండి: అవును.. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే, ఎందుకో తెలుసా? -
బిగ్ షాక్: ఈ ఓటీటీ అకౌంట్ పాస్వర్డ్ షేర్ చేయాలంటే, పైసలు కట్టాల్సిందే!
గత సంవత్సర కాలంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గడ్డు కాలాన్ని చవి చూస్తోంది. కరోనా కారణంగా ఓటీటీ మార్కెట్ పుంజుకున్న, నెట్‌ఫ్లిక్స్ మాత్రం సబ్స్క్రైబర్లను పోగొట్టుకుంటూ డీలా పడింది. కొనసాగుతున్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, OTTలో పెరుగుతున్న పోటీ, నెట్‌ఫ్లిక్స్‌లో ప్లాన్ల చార్జీలు అధికంగా ఉండడం కారణంగా ఇప్పటికే లక్షల్లో సబ్‌స్క్రైబర్లును కోల్పోయింది. అయితే దీని వెనుక ప్రధాన కారణాన్ని కనుగోంది. అదే యూజర్ అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సరికొత్త ప్లాన్‌ని తీసుకురాబోతోంది. అదనపు చార్జ్ కట్టాల్సిందే! గతంలో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్‌కి నగదు చెల్లించి ఆ పాస్వర్డ్ ఇతరులకు షేర్ చేసేవాళ్లు. ఇకపై అలా కుదరదు. కస్టమర్లు తమ అకౌంట్లను ఇతర యూజర్లతో పంచుకోవాలంటే అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ నిర్ణయం 2023 నాటికి అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సబ్స్క్రైబర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇతర వినియోగదారులతో షేరింగ్ కోసం ఎంత ఛార్జీ చెల్లించాలనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ వసూలు చేసే అదనపు రుసుము $3 నుంచి $4 మధ్య ఉండబోతుంది. కాస్త ఊపిరి పీల్చుకున్న నెట్‌ఫ్లిక్స్ నెట్‌ఫ్లిక్స్ మార్చి త్రైమాసికంలో దాదాపు 200,000 మంది, జూన్ త్రైమాసికంలో దాదాపు 970,000 మంది సబ్‌స్క్రైబర్ కోల్పోయినట్లు తెలిపింది. అయితే, మూడవ త్రైమాసిక ఆదాయ నివేదికలో, 2.41 మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కస్టమర్ల సంఖ్యను పెంపుతో పాటు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి, ఇటీవలే చౌకైన యాడ్-సపోర్టెడ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. తాజాగా 2022 మూడో త్రైమాసికంలో 2.4 మిలియన్ల కొత్త సబ్స్క్రైబర్లు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఈ లావాదేవీలపై.. -
వార్నింగ్: ఆ వైరస్ కొత్త వెర్షన్‌తో వచ్చింది, ఇలా చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!
ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్. డ్రినిక్ ఆండ్రాయిడ్ ట్రోజన్ కొత్త వెర్షన్ వెలుగులోకి వచ్చింది. డ్రినిక్ అనేది పాత మాల్వేర్. ఈ వైరస్ మీ ఫోన్ స్క్రీన్ రికార్డింగ్‌లతో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకులకు సంబంధించి పిన్, సీవీవీ నంబర్లను తస్కరిస్తుంది. ఇప్పటికే 18 భారతీయ బ్యాంకులు ఈ వైరస్ భారిన పడినట్లు సమాచారం. ఈ మాల్వేర్ పట్ల అప్రమత్తం ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. వార్నింగ్: పాత వైరస్, కొత్త వెర్షన్.. ఏపీకే(APK) ఫైల్‌తో ఎస్ఎంఎస్(SMS) పంపడం ద్వారా యూజర్లను డ్రినిక్ లక్ష్యంగా చేసుకున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇది iAssist అనే యాప్‌తో వచ్చింది. భారత్ ఆదాయపు పన్ను శాఖ అధికారిక పన్ను నిర్వహణ టూల్ మాదిరిగానే పనిచేస్తుంది. ఆదాయపు పన్ను రీఫండ్ల పేరుతో వినియోగదారలు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంది. 2016 లో వార్తల్లో నిలిచిన ఈ వైరస్ కొంత కాలం గ్యాప్ తీసుకుని ఆధునిక టెక్నాలజీ సామర్థ్యంతో అదే మాల్వేర్ లేటస్ట్ వెర్షన్ మళ్లీ దాడికి సిద్ధమైంది. భారత్‌లో యూజర్లను, 18 నిర్దిష్ట భారతీయ బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఈ బ్యాంకులలో, ఎస్బీఐ (SBI) వినియోగదారులను డ్రినిక్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, కొన్ని ఆఫ్షన్స్‌తో అనుమతులు మంజూరు చేయమంటుంది. అలా అనుమతించిన యూజర్ల ఫోన్లలో ఎస్ఎంఎస్లను పొందడం, చదవడం, పంపడం, కాల్ లాగ్‌ను చదవడం, ఔట్ స్టోరేజీ చదవడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారుకు తెలియకుండానే నిర్దిష్ట విధులను నిర్వహించే అవకాశాన్ని పొందుతుంది. యాప్ నావిగేషన్, రికార్డ్ స్క్రీన్, కీ ప్రెస్‌లను క్యాప్చర్ చేయగలదు. యాప్ అన్ని అనుమతులతో పాటు దానికి కావలసిన ఫంక్షన్లకు యాక్సెస్‌ను పొందగానే వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంది. జాగ్రత్త అవసరం థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి లేదా SMS ద్వారా ఏదైనా యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర (Google Play Store) లేదా యాపిల్ (Apple) యాప్ స్టోర్‌లో యాప్‌లను చెక్ చేయాలి. వాస్తవానికి ప్రాథమిక విధులను నిర్వహించేందుకు అన్ని యాప్‌లకు అనుమతి అవసరం లేదు. కానీ తెలియని యాప్‌కు ఎస్ఎంస్, కాల్స్‌కు సంబంధించిన అనుమతులను ఇవ్వకపోవడం ఉత్తమం. చదవండి: NammaYatri దూకుడు: ఓలా, ఉబెర్‌కు ఊహించని దెబ్బ -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. త్వరలో పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఫలితాల్లో స్ట్రీమింగ్ దిగ్గజం ఆదాయ పరంగా భారీ నష్టాలను చవిచూసింది. కానీ సబ్స్క్రిప్షన్ సంఖ్య భారీగా పెరిగింది. అందుకు పాస్వర్డ్ షేరింగ్ కారణమని పేర్కొంది. ఇప్పుడు కంపెనీ తన త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అదనపు ఛార్జీల నిబంధన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాన్నట్లు స్పష్టం చేసింది. అకౌంట్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. “అకౌంట్ షేరింగ్‌ను మానిటైజ్ చేసేందుకు ఆలోచనాత్మకమైన విధానాన్ని ప్రారంభించాము. 2023 ప్రారంభంలో దీన్ని మరింత విస్తృతంగా ప్రారంభిస్తాం. వినియోగదారుల అభిప్రాయాన్ని విన్న తర్వాత నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో లేని చైనా,రష్యా మినాహాయించి మిగిలిన దేశాల్లో పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు రుసుమును విధిస్తాం’’ అని తెలిపింది. వినియోగదారులు పాస్వర్డ్ షేరింగ్‌పై ఎంత ఛార్జీలు వసూలు చేస్తుందనే అంశంపై నెట్‌ఫ్లిక్స్ స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ పలు నివేదికల ప్రకారం.. 3 డాలర్ల నుంచి 4 డాలర్ల మధ్యలో ఉండే అవకాశం ఉండనుంది. చదవండి👉 ఓలా సీఈవో భవిష్ అగర్వాల్‌పై సంచలన ఆరోపణలు! -
400 డేంజరస్ యాప్స్, మీ ఫోన్లలో ఇవి ఉంటే..వెంటనే ఇలా చేయండి!
సైబర్ నేరస్తులు తెలివి మీరారు. యూజర్ల మెటా యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లను దొంగిలించేందుకు 400 రకాలైన ప్రమాదకర యాప్స్‌ను తయారు చేశారు. ఆ యాప్స్‌ను సోషల్ మీడియా యూజర్లను వినియోగించేలా చేశారు. ఈ తరుణంలో మెటా ఆ యాప్స్‌ను గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా ఫోన్లలో ప్రమాదకరమైన యాప్స్ చెప్పింది. మెటా యూజర్ల పాస్వర్డ్స్, వ్యక్తిగత సమాచారం దొంగించడానికే సైబర్ కేటుగాళ్లు ఇలాంటి యాప్స్ చేసినట్లు వెల్లడించింది. ఫొటో ఎడిటర్స్ గేమ్స్, వీపీఎన్ సర్వీసెస్, బిజినెస్‌తో పాటు ఇతర సర్వీసులు అందిస్తామంటూ సైబర్ నేరస్తులు యూజర్లకు యాప్స్ నోటిఫికేషన్లు పంపిస్తున్నారు. ఒకే వేళ నచ్చి యూజర్ వాటిని డౌన్లోడ్ చేసుకుంటే అంతే సంగతులు. ఎవరైతే యూజర్లు ఉన్నారో వారి వివరాల్ని సేకరించి.. వాటిని డార్క్ వెబ్‌లో అమ్ముకోవడంతో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మెటా తెలిపింది. సేఫ్‌గా ఉండాలంటే ఈజీ మనీకోసం సైబర్ నేరస్తులు తయారు చేసిన యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్స్ రివ్వ్యూ, వాటి వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫేక్ రివ్వ్యూలతో యూజర్లను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. ఏదైనా యాప్ మీరు దానిని ఇన్స్టాల్ చేసుకోకముందే లాగిన్ డీటెయిల్స్ అడిగితే వాటి జోలి వెళ్లకపోవడమే మంచిది. డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటే ఓటీపీ ఆప్షన్ సెట్టింగ్ మార్చుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉మార్క్ జుకర్ బర్గ్ : ‘వర్క్ కంప్లీట్ చేయకపోతే..నిన్ను ఈ కత్తితో నరికేస్తా!’ -
పాస్వర్డ్ మేనేజర్ సంస్థకే హ్యాకర్ల షాక్:మూడు కోట్ల యూజర్ల భద్రత గోవిందేనా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్, లాస్ట్‌పాస్‌కు హ్యాకర్లు భారీ షాకిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్ లాస్ట్‌పాస్‌కు సేబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇటీవల సంస్థ సిస్టమ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి సోర్స్ కోడ్, యాజమాన్య సమాచారాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అయితే దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కొంత సమయం పడుతుందని, కానీ తమ కస్టమర్ల భద్రతకు ఢోకా లేదని తెలిపింది. ఈ మేరకు సంస్థ ట్విటర్ ద్వారా సమాచారాన్ని వెల్లడించింది. అయితే తమ ఖాదారులు పాస్ట్వరర్డ్స్కు వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.ప్రస్తుతానికి వారుఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. లాస్ట్‌పాస్ నిర్వహణకు ఉద్యోగులు ఉపయోగించే సాఫ్ట్వేర్ డెవలపర్ లోకి "అనధికారిక పార్టీ" ప్రవేశించిందని తన పరిశోధనలో తేలిందని తెలిపింది. నేరస్థులు ఒక్క డెవలపర్ అకౌంట్‌కి మాత్రమే యాక్సెస్ పొందారని పేర్కొంది. అయితే సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ బ్లీపింగ్ కంప్యూటర్ రెండు వారాల క్రితమే ఉల్లంఘన గురించి లాస్ట్‌పాస్ అడిగిందని నివేదించింది. మరోవైపు లాస్ట్‌పాస్ తక్షణమే స్పందించి సమాచారం అందించడంపై కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు అలెన్ లిస్కా సంతోషం వ్యక్తంచేశారు. అయితే చాలామందికి రెండు వారాలు చాలా ఎక్కువ సమయం అనిపించినప్పటికీ, పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడానికి టీమ్స్‌కి కొంత సమయం పట్టొచ్చన్నారు. కానీ కస్టమర్ పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేసే అవకాశం లేదని లిస్కా చెప్పారు. ఇది ఇలా ఉంటే సోర్స్‌కోడ్, ప్రొప్రయిటరీ సమాచారాన్ని దొంగిలించిన హ్యాకర్లకు,కస్టమర్ల డేటా చోరీ చేయడంపెద్ద కష్టం కాదని, పాస్వర్డ్ వాల్ట్‌ల కీలను యాక్సెస్ చేసేసి ఉంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ అంచనాలపై లాస్ట్సాప్ స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా మాన్యువల్‌గా ఆధారాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ లేదా జీమెయిల్ లాంటి బహుళ ఖాతాల కోసం హార్డ్-టు-క్రాక్, ఆటోమేటెడ్ జనరేటెడ్ పాస్‌వర్డ్‌లను అందిస్తుంది లాస్ట్‌పాస్. We recently detected unusual activity within portions of the LastPass development environment and have initiated an investigation and deployed containment measures. We have no evidence that this involved any access to customer data. More info: https://t.co/cV8atRsv6d pic.twitter.com/HtPLvK0uEC — LastPass (@LastPass) August 25, 2022 -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్..ఈ సారి మరో కొత్త దందా!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తీరు మార్చుకోవడం లేదు. ఫ్రీ పాస్వర్డ్ షేరింగ్ పేరుతో కొత్త దందా తెరతీయడంతో స్క్రైబర్లను కోల్పోయింది. భారీ నష్టాల్ని కొని తెచ్చిపెట్టుకుంది. అయినా ఆ సంస్థ తీరు మార్చుకోవడం లేదు. ఈ సారి సబ్ స్క్రైబర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు వేసేందుకు మరో కొత్త ఎత్తుగడ వేసింది. నెట్‌ఫ్లిక్స్ ఇటీవల 'యాడ్ ఎక్స్ట్రా మెంబర్' అనే కాన్సెప్ట్ పేరుతో కొత్త ఆప్షన్‌ను అందుబాబులోకి తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్ యూజర్లు వారి అకౌంట్‌ను ఇంటి కుటుంబ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు ఓపెన్ చేసి చూడాలంటే అందుకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ చీలి, కోస్టారికా, పేరు దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తుంది. ఆ ట్రయల్స్ కొనసాగుతుండగా.. మరో ఆప్షన్‌ను ఎనేబుల్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అదనపు వసూళ్లు షురూ! నెట్‌ఫ్లిక్స్ అర్జెంటీనా, డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల,హోండురాస్‌తో సహా పలు దేశాల్లో 'యాడ్ ఏ హోం' పేరుతో మరో ఫీచర్‌ను డెవలప్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉన్నా.. భవిష్యత్‌లో యాడ్ ఏ హోం పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఈఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్లు పాస్వర్డ్ షేరింగ్ చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని సూచించింది.కాబట్టి, కంపెనీ మరికొన్నినెలల్లో భారత్‌లో సైతం యాడ్ ఏ హోం ఫీచర్ సాయంతో అదనంగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాడ్ ఏ హోంపై అదనపు ఛార్జీలు ఎంతంటే? వచ్చే నెల నుంచి 'యాడ్ ఏ హోం' ఆప్షన్‌ను పైన పేర్కొన్న ప్రాంతాల్లో వినియోగంలోకి రానుంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాంతాల్లో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ఇంట్లో ఒకరు మాత్రమే వీక్షించే సౌలభ్యం ఉంది. అదే అకౌంట్‌ను మరో వ్యక్తి లాగిన్ అవ్వాలంటే అదనపు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు అర్జెంటీనాలో అదనంగా 219 పెసోలు, ఇతర ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ప్రాంతాలలో 2.99 డాలర్లు (అంచనా) చెల్లిస్తే ఆ అకౌంట్‌ను యాక్సెస్ చేయోచ్చు. ప్రస్తుతానికి, నెట్‌ఫ్లిక్స్ మనదేశంలో వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను వారి కుటుంబేతర వ్యక్తులు వీక్షిస్తే ఎంత వసూలు చేస్తుందనే విషయంపై నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు స్పష్టత ఇవ్వలేదు. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌లో ఉన్న వినియోగదారులు అదనంగా ఒక ఇంట్లో వీక్షించే అవకాశం ఉంది. స్టాండర్డ్, ప్రీమియం వినియోగదారులు వరుసగా రెండు, మూడు ఇళ్లకు చెందిన సభ్యులు వీక్షించొచ్చు. ఇలా ప్లాన్ల వారీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవాలంటే అదనపు చెల్లింపులు తప్పని సరి. నెట్‌ఫ్లిక్స్‌ను ఆదరిస్తున్నారు.. తప్పులేదు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ను వీక్షకులు ఆదరిస్తున్నారు.ఇతర కుటుంబ సభ్యులకు,స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నారు. యూజర్లు చూడడం వేరు. వారి అకౌంట్లను ఇతరులకు షేర్ చేయడం వేరు. అకౌంట్లను షేర్ చేయడం వల్ల తలెత్తే ఇబ్బందులతో దీర్ఘకాలిక లక్ష్యాల్ని చేరుకోలేమని నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ చెంగీ లాంగ్ చెప్పారు. చదవండి: తగ్గేదేలే: నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం, లక్షల అకౌంట్లు బ్యాన్! -
వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ బంపరాఫర్!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం, పాస్వర్డ్ షేరింగ్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడంతో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 2లక్షమంది వినియోగదారుల్ని కోల్పోయింది. 30శాతం షేర్లు నష్టపోయాయి. క్యూ2లో మరో 20లక్షల వినియోగారుల్ని కోల్పోవచ్చని నెట్‌ఫ్లిక్స్ అంచానా వేసింది. ఈ తరుణంలో వినియోగారుల్ని తిరిగి రప్పించుకునేందుకు సరికొత్త బిజినెస్ స్ట్రాటజీతో నెట్‌ఫ్లిక్స్ ముందుకు రానుంది. వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ బంపరాఫర్ ప్రకటించింది. త్వరలో తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందించేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అన్న చందాన..సబ్ స్క్రిప్షన్ ధరల్ని తగ్గించి..యాడ్ టైర్ ప్లాన్‌ను యాడ్ చేస్తున్నట్లు నెట్ఫ్లిక్ కో- సీఈవో టెడ్ సారండోస్ తెలిపారు. తద్వారా నెట్‌ఫ్లిక్స్ వీడియోలు చూసే సమయంలో యాడ్స్ ప్రసారం అవుతాయి. యాడ్స్ ప్రసారంతో సంస్థకు లాభాలు..సబ్స్క్రిప్షన్ ధరల తగ్గింపుతో చేజారిపోయిన సబ్స్క్రైబర్లను పెంచుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టెడ్ సారండోస్ మాట్లాడుతూ.." నాకెందుకో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తోంది. ఓటీటీ వీడియోల్లో యాడ్స్ ప్లే అయితే పెద్దగా పట్టించుకోను. కానీ సబ్స్క్రిప్షన్ ధర తక్కువగా ఉండాలి" అని అనుకునే యూజర్ల కోసం కొత్త యాడ్ టైర్ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. -
యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది.తమ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే యూజర్ల అకౌంట్లను బ్యాన్ చేసేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ జీరో టోలరెన్స్ పేరుతో రూల్స్ బ్రేక్ చేసిన యూజర్ల అకౌంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే వినియోగదారులు వారి అకౌంట్లను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేస్తే అదనపు ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకటనతో సుమారు 2లక్షల మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయినా సరే మరోమారు యూజర్లకు కొత్త నిబంధనల్ని విధించింది. ఆ నిబంధనల్ని లైట్ తీసుకుంటే మాత్రం యూజర్లపై చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదంటూ పలు నివేదికలు చెబుతున్నాయి. వీపీఎన్ వాడుతున్నారా! వీపీఎన్..వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. బ్రౌజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. అసాంఘీక కార్యకలాపాలకు, లేదంటే మన దేశంలో అందుబాటులో లేని కంటెంట్ కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ మార్గంగా వీపీఎన్ సేవల్ని అందిస్తుంది. అయితే ఈ వీపీఎన్ సాయంతో నెట్ ఫ్లిక్స్‌ను వీక్షిస్తే సదరు యూజర్ల అకౌంట్లను బ్లాక్ చేయనుంది. ఒరిజినల్ కంటెంట్‌ను కాపీ చేస్తున్నారా! సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వీడియో కంటెంట్ కాపీ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ టెక్నాలజీ ఉపయోగించి అదే కంటెంట్‌ను మార్చి వీడియోలు చేసినా, లేదేంటే వేరే వారికి అమ్మిన చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం యూజర్లకు మీరు మా నిబంధనల్ని అతిక్రమించారా అంటూ యాప్ ఓపెన్ చేస్తే డిస్ప్లే అయ్యే పాప్ అప్‌లో మిమ్మల్ని అడుగుతుంది. అందులో మీరు పొరపాటునా అతిక్రమించాం అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. అకౌంట్ సస్పెండ్ అవుతుంది. మళ్లీ అదే అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే సాధ్యపడదు. చదవండి👉 తగ్గేదేలే: నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం, లక్షల అకౌంట్లు బ్యాన్! -
కొంచెం ఇష్టం..కొంచెం కష్టం,యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ షాక్!
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు భారీ షాకివ్వనుంది. ప్రస్తుతం మూడు దేశాల్లో మాత్రమే పాస్వర్డ్ షేరింగ్‌పై నెట్ ఫ్లిక్స్ అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అన్నీ దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్‌పై డబ్బులు వసూలు చేయాలని భావిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..చీలీ, కోస్టరికా,పెరులో నెట్‌ఫ్లిక్స్ వినియోగించే యూజర్లు వారి అకౌంట్ క్రెడియన్షియల్స్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలంటే.. అందుకు అదనంగా 2.99డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సర్ ఛార్జీలను మిగిలిన దేశాల్లో సైతం వసూలు చేయనుంది. ఈ ఏడాది విడుదలైన మొదటి త్రైమాసికంలో(జనవరి,ఫిబ్రవరి, మార్చి) 200,000 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. రానున్న నెలల్లో మరో 2మిలియన్ల మంది సబ్స్క్రిప్షన్లను కోల్పోవచ్చని అంచనా వేసింది. కాబట్టే మార్కెట్ విలువ నుండి సుమారు $55 బిలియన్ల ఆదాయం తగ్గిపోయింది. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం గతనెల క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో వాటాదారులకు రాసిన లేఖలో సుమారు 100 మిలియన్ల మంది యూజర్లు పాస్‌వర్డ్‌ను షేరింగ్ చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అందుకే సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్‌పై సర్ ఛార్జీలను వసూలు చేయనుంది.అదే జరిగితే సబ్స్క్రిప్షన్ సంఖ్య తగ్గిపోతుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి విరుగుడుగా సబ్స్క్రిప్షన్ ఛార్జీలు తగ్గించి..ఈ ఏడాది (2022) చివరి నాటికి పాస్వర్డ్ షేర్‌పై సర్ చార్జీలను విధించాలని చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే సబ్‌స్క్రిప్షన్‌ను కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు షేర్ చేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 ఆ కక్కుర్తితో వందల కోట్ల హాంఫట్,నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులారా బుద్ధొచ్చింది! -
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా! టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్!
టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఆన్ లైన్లో షాపింగ్ కోసం ఒక్కోసారి గుర్తు తెలియని వెబ్ సైట్లు,యాప్స్‌లలో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. అదే సమయంలో సైబర్ నేరస్తులు పాస్‌వర్డ్‌ల సాయంతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం లాంటి సంఘటనల్ని మనం చూసే ఉంటాం. అయితే ఇకపై వాటికి చెక్ పెట్టేలా దిగ్గజ సంస్థలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. వరల్డ్ పాస్వర్డ్ డే సందర్భంగా యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఎఫ్ఐడీఓ (ఫాస్ట్ ఐడెంటిఫై ఆన్లైన్) అలయన్స్ సంస్థ, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం(డ్ల్యూ3సీ) భాగస్వామ్యంతో పైన పేర్కొన్న మూడు దిగ్గజ సంస్థలు పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయ్యేలా అప్లికేషన్లను డెవలప్ చేయనున్నాయి. ఎలా అంటే సాధారణంగా స్మార్ట్ ఫోన్‌తో మనం గూగుల్‌పే యూపీఐ పేమెంట్స్ స్కానింగ్‌తో, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లో ఫేస్ ఐడీ వెరిఫికేషన్‌ను వినియోగిస్తుంటాం. సేమ్ ఇలాగే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ డెవలప్ చేస్తున్న కొత్త టెక్నాలజీతో పాస్వర్డ్ లేకుండా వెబ్సైట్లలో లాగిన్ అవ్వొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవ్వడం సాధ్యమేనా? పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవ్వడం సాధ్యమేనా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పుట్టుకొస్తున్న కొత్త కొత్త టెక్నాలజీలతో సాధ్యమవుతుందని చెబుతున్నారు. భవిష్యత్‌లో బయోమెట్రిక్ సాయంతో పాస్వర్డ్ లేకుండా వెబ్సైట్లు, యాప్స్‌లో లాగిన్ అవ్వొచ్చని అంటున్నారు. ప్రస్తుతం యూజర్లు టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ విషయంలో యూజర్లు పడుతున్న ఇబ్బందులు తొలగిపోన్నాయి. సైబర్ నేరస్తులకు చుక్కలు కనిపించనున్నాయి. చదవండి👉'వన్ రింగ్ స్కామ్'..మిస్డ్ కాల్ వచ్చింది..రూ.46లక్షలు పోయాయి -
భారతీయులు ఎక్కువగా వాడుతున్న పాస్వర్డ్ ఇదే..!
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్స్, సోషల్ మీడియా, యూపీఐ పేమెంట్స్ యాప్స్ వాడే వారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. భద్రత కారణాల దృష్ట్యా లేదా మన ప్రైవసీ పరంగా పాస్‌వర్డ్‌లను ఏర్పాటుచేస్తాం. శక్తివంతమైన పాస్‌వర్డ్స్‌ను ఏర్పాటు చేయడంతో ఆయా అకౌంట్లను, స్మార్ట్ఫోన్లను, ల్యాప్‌ట్యాప్‌లను సైబర్ దాడులకు గురికాకుండా చూడవచ్చును. అయితే పాస్వర్డ్స్ విషయంలో భారతీయుల గురించి తాజాగా ప్రముఖ సెక్యూరిటీ దిగ్గజం నార్డ్ పాస్ భయంకర నిజాలను వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారని నార్డ్ పాస్ పేర్కొంది. చాలా మంది భారతీయులు ఎక్కువగా తమ సోషల్ మీడియా ఖాతాలకు ఒకే రకమైన పాస్ వర్డ్ ఏర్పాటుచేస్తున్నారని వెల్లడించింది. సైబర్ నేరస్తులకు సులువుగా ఉండే పాస్‌వర్డ్‌లను ఉంచుతున్నట్లు నార్డ్ పాస్ పేర్కొంది. భారతీయుల వాడే 200 పాస్‌వర్డ్‌లో 62 పాస్‌వర్డ్‌లను సెకను కంటే తక్కువ వ్యవధిలో క్రాక్ చేయవచచ్చును. అయితే ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్ రూపొందించడంలో అగ్రరాజ్యాలతో పోలిస్తే తక్కువ రిస్క్ భారతీయులు కల్గి ఉన్నట్లు నార్డ్‌పాస్ పేర్కొంది. భారతీయులు ఎక్కువ వాడే పాస్వర్డ్స్.. భారతీయులు ఎక్కువగా ‘password’ ను ఎక్కువగా తమ పాస్‌వర్డ్‌గా వాడుతున్నట్లు నార్డ్ పాస్ పేర్కొంది. అంతేకాకుండా 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty, abc123, iloveyou వంటి పాస్‌వర్డ్‌లను వాడుతున్నుట్ల తెలుస్తోంది. వాటితో పాటుగా qwerty కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ పాస్‌వర్డ్‌లను సైబర్ నేరస్తులు కేవలం ఒక్క సెకనులో క్రాక్ చేయవచ్చునని నార్డ్ పాస్ స్పష్టం చేసింది. కొంతమంది తమ అభిమాన నటినటుల పేర్లను కూడా పాస్‌వర్డ్స్‌గా ఏర్పాటు చేస్తున్నారని నార్డ్ పాస్ తెలిపింది. అంతేకాకుండా sairam, krishna, omsairam పేర్లను కూడా పాస్‌వర్డ్‌గా పెడుతున్నట్లు తేలింది. శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఇలా రూపొందించండి. సైబర్ నేరస్తుల నుంచి మీ అకౌంట్లను కాపాడుకోవాలంటే, బలమైన, శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటుచేసుకోవడం చాలా మంచింది. మీరు ఏర్పాటు చేసే పాస్వర్డ్ లో కచ్చితంగా 12 అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. అప్పర్‌కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ సింబల్స్ (!,@,#,.....మొదలైనవి) వాటిని పాస్‌వర్డ్‌గా ఉంచాలి. అంతేకాకుండా 2 అథనిటికేషన్ పాస్వర్డ్ ఉంచుకోవడం మరింత మంచింది. -
వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్!
వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఇతర మెసేజింగ్ యాప్ లకు చుక్కలు చూపిస్తుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన వ్యతిరేకితను మరిచిపోయేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తుంది. తాజాగా వాట్సప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొనిరాబోతుంది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సప్‌లోని మీ ఛాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. మళ్లీ చాట్స్ ని రీస్టోర్ చేసే సమయంలో పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లు పరీక్షిస్తున్నట్లు 'వాబీటా ఇన్ఫో' సమాచారం ఇచ్చింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని ట్విటర్ లో షేర్ చేసింది. ఈ ఫీచర్ వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం వాట్సప్‌లోని ఛాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది వాట్సప్. పాస్వర్డ్ సెట్ చేస్తే ఆ ఛాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్వర్డ్ తప్పనిసరి. ఇప్పటికే వాట్సాప్ డెస్క్ టాప్ యూజర్ల కోసం వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. అలాగే, డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్‌ని కూడా మార్చబోతోంది. ప్రస్తుతం వారం రోజులు ఉన్న టైమ్ 24 గంటలకు తీసుకొనిరానుంది. త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ చేయొచ్చు. As previously announced, @WhatsApp is working on cloud backups encryption. The chat database and media will be safe from unauthorized access when using a password. The password is private and it's not sent to WhatsApp. It will be available in a future build for iOS and Android. pic.twitter.com/Lp06PaECBX — WABetaInfo (@WABetaInfo) March 8, 2021 చదవండి: నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు! 'వరల్డ్ వైడ్ వెబ్’ కోటకు బీటలు -
పాస్వర్డ్... పర్సనల్ కాదుగా...!
సాక్షి, కడప : చాలా మంది పుట్టిన రోజు, తేదీని, జాబ్‌లో జాయిన్ తేదీని రహస్య కోడ్‌గా వినియోగిస్తున్నారు. అలా చేస్తుంటే ఇబ్బంది పడతారు. ఎలాగంటే మీ కొలీగ్స్, సహచరులకు అవకాశమిచ్చినట్లే. డబ్బు ఎవరికి చేదు చెప్పండి. ప్రధాన నగరాల్లో ఒక ప్రయివేట్ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో ఎక్కువశాతం మంది కొన్ని నంబర్లనే పిన్, పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారని తేలింది. ఈ నివేదిక ప్రకారం ఎక్కువ మంది వాడుతున్న పిన్ నెంబరు, పాస్‌వర్డు 12234, తరువాత స్థానంలో 1111 ఉంది. కేవలం సమాచారం ఇచ్చి పుచ్చుకునే ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కష్టమైనది పెడుతున్న చాలామంది డబ్బులు, లావాదేవీలు నిర్వహించే అకౌంట్లు, డెబిట్, క్రెడిట్ కార్డులకు, విలువైన వ్యక్తిగత సమాచారం దాచుకునే స్మార్ట్‌ఫోన్‌కు మాత్రం సులువైన పిన్ నెంబర్లు పెట్టడం ఆశ్చర్యకరం. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే సైబర్ నేరాలు జరిగే అవకాశముందని బ్యాంకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంస్థ నివేదిక ప్రకారం చాలామంది పుట్టిన తేదీని, సంవత్సరాన్ని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా 1980 నుంచి 2000 వరకూ పిన్ నంబర్లు మాత్రమే ఉంటున్నాయి. డెబిట్ , క్రెడిట్ కార్డు పాస్వర్డ్ నాలుగు అంకెలు మాత్రమే ఉండాలి. సాధారణంగా నాలుగంకెల నెంబర్లు 10 వేల వరకు ఉన్నాయి. కానీ వందలో సగం మంది 10 వేల నాలుగంకెలలో కేవలం 500 నెంబర్లను మాత్రమే వినియోగిస్తున్నారు. ఇలా వాడటం వల్ల ఏటీఎంకార్డు పోయినా, చోరీకి గురైనా సులువుగా డబ్బు డ్రా చేసుకునే అవకాశం దొంగలకు ఉంటుంది. చాలా మంది ఎక్కువగా వినియోగిస్తున్న పాస్వర్డ్స్, పిన్ నెంబర్లు ఇవేనని సంస్థ నివేదిక పేర్కొంది. 1234, 1111, 0000, 1212, 2222, 2244, 7777, 8888, 3333, 4444, 5555, 6666, 1122, 1313, 1010, 2001, 2010 తస్మాత్ జాగ్రత్త పిన్ నంబరే కదా అనుకుంటే చాలా పొరపాటే. ఎందుకంటే నాలుగు అంకెల ఈ సంఖ్య మీ ఆర్థిక స్థితిగతినే మార్చేసే అవకాశముంది. ఒక్క పిన్ విషయంలోనే కాదు మిగిలిన విషయాల్లోనూ అప్రమత్తత అవసరం. తద్వారా మీడబ్బు భద్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దొంగిలించిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా అయితే అందుకు బ్యాంకు బాధ్యత వహించదు. విషయం గుర్తించుకోవాలి. తర్వాత ఎన్ని పాట్లు పడినా పోయిన డబ్బు రాదని తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మారిస్తే మంచిది పిన్ నంబర్లను నెలకు, రెండు నెలకొకసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీ జరిపిన తక్షణం పిన్‌నంబర్ మారిస్తే సైబర్‌నేరగాళ్లకు చిక్కకుండా బయట పడొచ్చంటున్నారు. అదే విధంగా పిన్‌నంబర్ నమోదు చేసే ముందు మిమ్మల్ని ఎవరైనా గమనించనట్లైతే మీ లావాదేవీని వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పిన్ ఎంటర్ చేసే సమయంలో ఇతర వ్యక్తులు సహాయం చేస్తామని వస్తే నిరాకరించాలి. చాలా మంది పిన్ నెంబరు మరిచిపోతామనే ఉద్దేశంతో పౌచ్‌లో రాసి ఉంచుతారు. ఇది చాలా ప్రమాదం. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే, మీ మెదడులో పాస్వర్డును భద్రంగా దాచుకుంటే ఇబ్బందులుండవు. -
నిద్రిస్తున్న జంటను లేపి మరీ...
నిద్రిస్తున్న జంటను లేపి మరీ షాకిచ్చాడు ఓ యువకుడు. ముసుగు ధరించి ఇంట్లోకి దొంగలాగ దూరి ఆ దంపతులను బెదిరించాడు. అయితే అతను అడిగిన ప్రశ్నకు బిత్తర పోయిన ఆ జంట.. తన్ని బయటకు తరిమేశారు. నార్తర్న్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పాలో అల్టో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 17 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఈస్ట్ ఛార్లెస్టన్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డాడు. నిద్రిస్తున్న వృద్ధ జంటను లేపి తన ఫోన్లోని డేటా అయిపోయిందని.. వైఫై పాస్వర్డ్ చెప్పాలని కోరాడు. అంతే కంగుతిన్న ఆ ఇంటి యాజమాని కంగారులో యువకుడ్ని మెడ బట్టి బయటకు గెంటేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేయగా.. యాజమాని ఇచ్చిన క్లూస్ మేరకు మరుసటి రోజు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రాత్రి ఆ ప్రాంతంలో ఓ బైక్ మిస్సింగ్ కంప్లైయింట్ రావటంతో సదరు యువకుడిని అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టారు. సెక్స్‌లో పాల్గొన్నాడు.. పొద్దున్నే షాకిచ్చాడు -
ఐఫోన్ ఇక మరింత సురక్షితం
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కీలక ప్రకటన చేసింది. పాస్వర్డ్ అవసరం లేకుండా ఐఫోన్లలోని సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించేలా ఉన్న సాఫ్ట్వేర్ లోపాన్ని సరిదిద్దనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలోనే ఐవోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు, సమాచార మార్పిడి కోసం వాడుతున్న లైటనింగ్ పోర్ట్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతున్నారని తెలిపింది. త్వరలో తీసుకురానున్న అప్డేట్తో తప్పుడు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే ఐఫోన్ డేటా గంటపాటు నిలిచిపోతుందని వెల్లడించింది. తాజా అప్డేట్ తర్వాత కూడా లైటనింగ్ పోర్ట్‌తో చార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చంది. యాపిల్ తాజా నిర్ణయం ఈ లోపాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఎఫ్‌బీఐ, పోలీసులకు ఇబ్బందికరం కానుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పాస్వర్డ్స్ మార్చుకోండి
శాన్ఫ్రాన్సిస్కో: ట్వీటర్‌ను వినియోగిస్తున్న 33 కోట్ల యూజర్లూ తమ ఖాతాల పాస్వర్డ్స్ మార్చుకోవాలని ట్వీటర్ కోరింది. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ట్వీటర్ ఈ ప్రకటన చేసింది. సోషల్ మీడియా ఖాతాల డేటా అమ్ముకుంటున్నారని, చోరీ జరుగుతోందనే ఆరోపణలు గట్టిగా వినవస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ట్వీటర్లో సమస్య తలెత్తింది. దీంతో ఆ సంస్థ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. పాస్‌వర్డ్‌ల చోరీ గాని, సమాచార దుర్వినియోగం గాని జరిగిందా అనే అంశంపై విచారణ చేసింది. ఇందులో అలాంటివేమీ జరగలేదని వెల్లడైంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా తమ పాస్వర్డ్స్ మార్చుకోవాలని సూచించింది. అయితే ట్వీటర్లో తలెత్తిన సమస్య ఎన్ని పాస్‌వర్డ్స్‌పై ప్రభావం చూపిందనే విషయాన్ని వెల్లడించలేదు. ఇదే పాస్వర్డ్ ఇంకా ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారో అక్కడా మార్చుకుంటే మంచిదని సూచించింది. -
47 ఏళ్ల పాటు ఐఫోన్‌కు లాక్
షాంఘై : పిల్లలు స్మార్ట్ఫోన్లకు ఇటీవల ఎంతగా అతుకుపోతున్నారంటే... సెల్ఫీలు తీసుకోవడం దగ్గర్నుంచి గేమ్స్ ఆడుకోవడం వరకు అన్ని కూడా పిల్లలు స్మార్ట్ఫోన్లలోనే చేస్తున్నారు. ఇలా తీవ్రస్థాయిలో ఆకర్షితులవుతున్న పిల్లల అమాయకపు చర్యలతో వారి పేరెంట్స్ కూడా భారీ మొత్తంలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. చైనాలో ఓ రెండేళ్ల పాప తమ తల్లి ఐఫోన్‌ను ఏకంగా 47 ఏళ్ల పాటు ఎందుకు పనికి రాకుండా లాక్ చేసేసింది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదేంటి 47 ఏళ్ల పాటు ఎలా లాక్ చేస్తారు అనుకుంటున్నారా? తప్పుడు పాస్వర్డ్ కొట్టిన ప్రతీసారి లాకింగ్ సమయం పెరుగుతూ వెళ్తోంది. ఇలా ఆ పాప చేసిన పనికి 25 మిలియన్ నిమిషాల పాటు ఫోన్ లాక్ అయిపోయిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం... ఎడ్యుకేషన్ వీడియోలను చూడటానికి లూ అనే మహిళ తన పాపకు ఐఫోన్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఆ మహిళకు పనికిరాకుండా పోయిన ఐఫోన్ కనిపించింది. లాక్ విప్పేందుకు రెండు నెలల పాటు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో చివరకు ఐఫోన్ స్టోర్‌ను ఆశ్రయించింది. ఏకధాటిగా తప్పుడు పాస్‌వర్డ్‌ను పదే పదే టైప్ చేయడం వల్ల ఫోన్ లాక్ అయిందని స్టోర్ కీపర్ అసలు విషయం చెప్పేశాడు. ఫ్యాక్టరీ సెట్టింగ్‌లోకి వెళ్లి మొత్తం డేటా తీసేస్తే తప్ప ఐఫోన్ పనిచేయదని తెలిపాడు. తన రెండేళ్ల కూతురు పదే పదే తప్పుడు పాస్వర్డ్ టైప్ చేయడం వల్ల ఇంత నష్టం జరిగిందని లూ గుర్తించింది. చైనాలో ఇలాంటి ఘటనే అంతకముందు కూడా చోటు చేసుకుంది. ఇదే కారణంతో మరో ఐఫోన్ ఏకంగా 80 ఏళ్ల పాటు పనిచేయకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
నా పాస్వర్డ్ ఇవ్వలేదు.. ఇచ్చే సమస్యే లేదు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తన ఫోన్ పాస్వర్డ్ చెప్పలేదని, చెప్పే సమస్యే లేదని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం స్పష్టం చేశారు. ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో జరుగుతున్న వాదోపవాదాలను తాను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గత విచారణ సందర్భంగా కార్తీ తన మొబైల్ పాస్‌వర్డ్‌ను చెప్పడం లేదని, అందుకు ఆదేశించాలంటూ కోర్టును సీబీఐ కోరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా విచారణ ఎదుర్కొంటున్న ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. దీనిపై శుక్రవారం కోర్టుకు రాగా బెయిల్ పిటిషన్ ను మార్చి 15కు వాయిదా వేసిన కోర్టు.. ఆయన కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అభ్యర్థించగా.. కోర్టు మాత్రం మూడు రోజులకు అనుమతిచ్చింది. బెయిల్ పిటిషన్‌పై విచారణకు వచ్చిన నేపథ్యంలోనే ఆయనను మీడియా ప్రతినిధులు మొబైల్ పాస్వర్డ్ పై ప్రశ్నించారు. దానికి బదులిచ్చిన కార్తీ 'సీబీఐకి నా మొబైల్ పాస్వర్డ్ ఇవ్వలేదు. ఎప్పటికీ ఇవ్వను కూడా' అని ఆయన స్పష్టం చేశారు. కార్తీని ఆయన అడిటర్‌తో సహా విచారణ చేపట్టే అవకాశం ఉందని.. అవసరమైతే నార్కో పరీక్షలు కూడా నిర్వహించే యోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం. -
నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోయారా..?
సాక్షి, హైదరాబాద్ : ఇంతకుముందు నగదు లావేదేవీలకు బ్యాంకు అకౌంట్ ఉంటే సరిపోయేది. పెద్ద నోట్ల రద్దుతో ఆన్లైన్ లావాదేవీలు ఊపందుకున్నాయి. నేటికీ ఏటీఎంల వద్ద నగదు లేకపోవడంతో నగదు లావాదేవీల విషయంలో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాదారులందరినీ నగదు లావాదేవీలవైపు మళ్లించే వ్యూహంలో భాగంగానే మార్కెట్లో నగదు కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నా వారంతా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు చాలామంది 2, 3 బ్యాంక్ ఖతాలకు సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వినియోగిస్తున్నారు. దీంతో పాస్వర్డ్లు మర్చిపోవడం పరిపాటైపోయింది. ఎవరైనా ఖాతాదారుడు వరుసగా మూడుసార్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను తప్పుగా నమోదు చేస్తే కొన్ని గంటల పాటు ఆ నెట్ బ్యాంకింగ్ ఖాతాను లాక్ చేస్తారు. సాధారణంగా 24 గంటల పాటు పనిచెయ్యదు. దేశంలోనే బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద బ్యాంక్ వ్యవస్థ ఎస్బీఐ. ఎస్బీఐ ఖాతాదారులు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సంబంధించి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం, ఎస్బీఐ లాగిన్ పాస్వర్డ్ మర్చుకోవడం తెలుసుకుందాం.. మూడు విధాలుగా రీసెట్ చేసుకోవచ్చు ఏటీఎమ్ కార్డును, ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, ఏటీఎమ్ కార్డు వివరాలు లేకుండా రీసెట్ చేసుకోవచ్చు అనుసరించాల్సిన పద్ధతులు ఇలా.. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ www.onlinesbi.com లోకి లాగిన్ అవ్వాలి. ‘ఫర్గాట్ పాస్వర్డ్’పై క్లిక్ చెయ్యాలి. ‘మీ యూజర్ నేమ్, బ్యాంక్ ఖాతా సంఖ్య దేశం, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్ సంఖ్య, క్యాప్చా కోడ్ ఎంటర్ చెయ్యాలి. ‘సబ్మిట్పైన క్లిక్ చెయ్యాలి. ‘మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీ కాలంలో వచ్చిన ఓటీపీని ఎంటర్ చెయ్యండి. ‘కన్ఫర్మ్’ బటన్ క్లిక్ చేయండి. సరైన ఓటీపీని ఎంటర్ చేస్తే పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకునేందుకు మూడు ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి. ఒకటి : ఏటీఎమ్ కార్డును ఉపయోగించి రెండు : ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి మూడు : ఏటీఎమ్ కార్డు వివరాల్లేకుండా ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఎస్బీఐ లాగిన్ పాస్వర్డ్ మార్చుకోండిలా.. మొదట ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వండి ప్రొఫైల్ ట్యాబ్‌కు వెళ్లండి. ఆ తర్వాత చేంజ్ పాస్వర్డ్పైన క్లిక్ చెయ్యండి. ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ప్రొఫైల్ పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ ఒకలాగే ఉండకూడదని గుర్తుంచుకోండి. పాత పస్వర్డ్ను ఎంటర్ చేయండి. కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి రెండోసారి అదే పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను అప్పుడప్పుడు మార్చుకోవడం మంచిది. -
వైఫై పాస్వర్డ్ ప్లీస్..
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్‌లో జరిగిన మూడో వన్డే సందర్భంగా క్రికెట్ వ్యాఖ్యాత మయాంతి లాంగర్, క్రికెటర్ సురేష్ రైనా మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. దీనిని మయాంతి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. కాన్పూర్ వన్డే జరుగుతున్న సమయంలో మయాంతి తన మొబైల్ ఫోన్లో వైఫై నెట్వర్క్స్ చూస్తున్న సమయంలో అందులో సురేష్ రైనా అని కనిపించింది. వెంటనే మయాంతి.. సురేష్ రైనాకు వైఫై పాస్వర్డ్ చెప్పాలంటూ మెసేజ్ పెట్టింది. స్క్రీన్ షాట్ ఫొటోల్లో థర్డ్ అంఫైర్ వైఫై కూడా కనిపించడం విశేషం. మయాంతి ట్వీట్‌కు సురైష్ రైనా స్పందించలేదు.. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం విపరీతంగా ప్రతిస్పందించారు. ఒకరైతే.. ధోని పాస్వర్డ్ కోసం ట్రై చేయమంటే.. మరొకరు.. రైనా దగ్గరి వ్యక్తిని అడగండి అని, ఇంకొకరు అయితే.. నో షార్ట్స్ బాల్స్ ప్లీస్ అంటూ రీ ట్వీట్ చేశారు. సురేష్ రైనా టీమిండియాకు దూరమై చాలా కాలమైంది. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఈ మధ్యే సురేష్ రైనా తెలిపారు. Hi 🙋🏻 @ImRaina possible to get the password to your network? 😃 #Kanpur #IndvNZ pic.twitter.com/z0FUJ31tLp — Mayanti Langer Binny (@MayantiLanger_B) 29 October 2017 -
పాస్వర్డ్ చిక్కుముడి
♦ గౌరిలంకేష్ హత్య కేసులో సిట్ విచారణ ♦ ఇంటి ముందున్న రెండు సీసీ కెమెరాల్లో కీలక చిత్రాలు ♦ పాస్వర్డ్ వల్ల ఆటంకాలు సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరి లంకేష్ హత్యకేసులో దర్యాప్తు వేగంగా సాగడానికి అధికారులకు రెండు సీసీ కెమెరాల పాస్వర్డ్లు అడ్డుపడుతున్నాయి. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గౌరిలంకేష్‌ను రాజరాజేశ్వరి నగరలోని ఆమె ఇంటి వద్దే దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా సిట్ బృందం ఆమె ఇంటి వద్ద ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాల చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తుపాకితో గురిచూసి కాల్చే సమయంలో వ్యక్తి, అతనికి సహకారం అందించినవారు కనీసం అరనిమిషం పాటు నిల్చొనే ఉంటారు. ఘటనకు ఆ సీసీ కెమెరాలు దగ్గరగా ఉండడం వల్ల చిత్రాలు స్పష్టంగా ఉంటాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే ఆ ఫుటేజీలు బయటకు రావడం లేదని సమాచారం. మొత్తం నాలుగు కెమెరాల చిత్రాల్లో రెండింటివి చూశారు, మిగిలిన రెండింటి కెమెరాల ఫుటేజీల్లోకి వెళ్లడానికి గౌరిలంకేష్ పాస్వర్డ్ పెట్టారని, దాన్ని డీకోడ్ చేయడం పై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. నెంబర్ ప్లేట్ కీలకం ఇదిలా ఉండగా సంఘటన జరిగిన సమయం రాత్రి 7:45 నుంచి 8 గంటలు. ఆ సమయంలో బెంగళూరు వాతావరణం మబ్బులు పట్టీ చినుకులు కూడా పడుతుండటంతో సరైన వెలతురు లేదు. దుండగుల బైక్ సీసీ కెమెరాల చిత్రాల్లో కనిపిస్తున్నా రిజిస్ట్రేషన్ నెంబర్‌ను గుర్తించడం ఖాకీలకు కష్టసాధ్యంగా మారింది. సమస్య పరిష్కారం కోసం పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారుల సహకారం కోరినట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా పాస్‌వర్డ్‌ను డీ కోడ్‌చేయడంతో పాటు నైట్ విజన్ డిజిటల్ టెక్నాలజీతో నంబర్ ప్లేట్‌పైనున్న అక్షరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆయుధం మావోయిస్టులదేనా? హత్యాస్థలంలో దొరికిన ఖాళీ తూటా (కాట్రిడ్జ్)ను చూస్తే, హత్యాయుధం 7.35 ఎంఎం పిస్టల్గా పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. గతంలో లొంగిపోయిన కొందరు మావోయిస్టులు ఈ పిస్టళ్లనే పోలీసులకు అప్పజెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో హత్య వెనుక మావోయిస్టుల హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే ఇవి కేవలం ప్రాథమికంగా ఆధారాలు మాత్రమేనని, దర్యాప్తు సాగిన కొద్ది కొత్తవిషయాలు కూడా వెలుగులోకి రావచ్చునని సిట్ బృందంలోని డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. అంత్యక్రియలకు మావోయిస్టుల హాజరు గౌరి లంకేష్‌కు మావోయిస్టు సానుభూతి పరులారన్న పేరున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సిరిమనే నాగరాజు వంటి అగ్రస్థాయి నాయకులు జనజీవన శ్రవంతిలోకి రావడానికి ఆమె విశేషంగా కృషి చేశారు. ఎంతోమందితో పరిచయాలూ ఉన్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన గౌరిలంకేష్ అంత్యక్రియలకు దాదాపు 15 మంది మావోయిస్టులు రహస్యంగా హాజరయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ఫుటేజీలతో పాటు మఫ్టీలో పోలీసులు అత్యాధునిక కెమరాలతో తీసిన వీడియో రికార్డ్స్‌ను పరిశీలించిన సిట్ బృందం ఈ నిర్థారణకు వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ కేసు విషయమై పనిచేస్తున్న సిట్బృందంలోని దాదాపు పదిమంది గతంలో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసినట్లు సమాచారం. -
పాస్వర్డ్స్ పంచుకుంటున్నారు!
న్యూఢిల్లీ : పట్టణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థుల్లో 98.9 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. టెలికాం కంపెనీ టెలినార్ ఇండియా దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 2,700 మంది విద్యార్థులపై సర్వే నిర్వహించింది. ఇందులో ఇంటర్నెట్ వాడుతున్న విద్యార్థుల్లో 54.6 శాతం మంది సులభమైన పాస్వర్డ్స్ వినియోగిస్తున్నారని పేర్కొంది. దీనివల్ల ఆన్లైన్ మోసాలు పెరగుతున్నాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా దాదాపు 54.82 శాతం విద్యార్థులు తమ పాస్‌వర్డ్స్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుంటున్నట్లు తెలిపింది. 6 నుంచి 18 ఏళ్ల మధ్యనున్న 83.5 శాతం విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్నారని టెలినార్ సర్వేలో వెల్లడైంది. మొత్తం విద్యార్థుల్లో 35 శాతం మంది తమ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని చెప్పగా, కేవలం 15.74 శాతం మాత్రం తమకు అపరిచిత సందేశాలు వచ్చినట్లు అంగీకరించారు. ‘ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. చాలా మంది వినియోగదారులు ముఖ్యంగా పిల్లలు.. బలహీన, సులువుగా పసిగట్టే పాస్వర్డ్స్ కారణంగా సైబర్ ముప్పును ఎదుర్కొంటున్నారు. డిజిటల్ ప్రపంచంలో పాస్వర్డ్స్ వినియోగం ప్రాముఖ్యతను తెలిపేందుకు వరల్డ్ పాస్వర్డ్స్ డే సందర్భంగా ఈ సర్వే నిర్వహించామ’ని టెలినార్ ఇండియా సీఈవో శరద్ మల్హోత్రా తెలిపారు. -
డజను సార్లు పాస్వర్డ్ చెప్పాడు!
⇒ ముషీరాబాద్ వాసికి సైబర్ నేరగాళ్ళ ఎర ⇒ అతడి ఖాతా నుంచి రూ.లక్ష నగదు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు ఖాతాలోని నగదు ఆన్లైన్లో కాజేసే సైబర్ నేరగాళ్ళు రోజురోజుకూ తెలివి మీరుతున్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఓ చిరు వ్యాపారికి టోకరా వేసిన ఈ కేటుగాళ్ళు రెండు రోజుల్లో రూ.లక్ష కాజేశారు. సదరు సైబర్ నేరగాళ్ళు ఏ స్థాయిలో బుట్టలో వేసుకున్నారంటే... ఈ వ్యవధిలో పన్నెండుసార్లు తన ఫోన్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) చెప్పిన సదరు చిరు వ్యాపారి అదే సమయంలో తన సెల్‌ఫోన్‌కు వచ్చిన బ్యాంకు ఎస్సెమ్మెస్‌లను పట్టించుకోలేదు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌కు చెందిన ఓ చిరు వ్యాపారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లో ఖాతా ఉంది. ఈ నెల 19న ఇతడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్ళు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, అనివార్య కారణాల నేపథ్యంలో మీ డెబిట్‌కార్డ్ బ్లాక్ అయిందంటూ చెప్పారు. అసలే నోట్లు రద్దు ఎఫెక్ట్‌తో అత్యధికంగా లావాదేవీలు కార్డు ద్వారానే చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కార్డ్ బ్లాక్ అని తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు పరిష్కారమేమిటని ఆలోచిస్తుండగా... పునరుద్ధరిస్తామంటూ ఫోన్ చేసిన వారే చెప్పి బుట్టలో వేసుకున్నారు. పునరుద్ధనణ కోసమంటూ కార్డు నెంబర్, సీవీవీ కోడ్ సహా ఇతర వివరాలు తెలుసుకున్నారు. వీటిని వినియోగించి ఆన్లైన్ ద్వారా వ్యాపారి ఖాతాలో ఉన్న సొమ్ము స్వాహా చేయడానికి ఓటీపీ అవసరం. అది లావాదేవీ చేసినప్పుడు వ్యాపారి సెల్‌ఫోన్‌కే వస్తుంది. దీంతో లావాదేవీలకు రంగం సిద్ధం చేసిన సైబర్ నేరగాళ్ళు ఆన్లైన్లో డబ్బు కాజేస్తూ బాధితుడికే ఫోన్ చేసిన ఓటీపీ అడిగారు. తాము మీ కార్డును పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఈ నెంబర్ చెప్పడం అనివార్యమంటూ నమ్మించారు. 19న ఆరుసార్లు, 20న మరో ఆరుసార్లు ఫోన్లు చేసిన సైబర్ నేరగాళ్ళు బాధితుడి ఖాతా నుంచి రూ.లక్ష కాజేశారు. ఈ సమయంలో సైబర్ నేరగాళ్ళు మాట్లాడుతున్న అంశాలను బాధితుడు రికార్డు చేశాడు. అదే సమయంలో అతడి ఖాతా నుంచి డబ్బు కట్ అయిన ప్రతిసారీ బ్యాంకు నుంచి ఎస్సెమ్మెస్ వచ్చింది. సైబర్ నేరగాళ్ళు హడావుడి పెట్టడం, ఓటీపీని సరిగ్గా చెప్పనందుకే కార్డు పునరుద్ధరణ కావట్లేదంటూ గందరగోళానికి గురి చేయడంతో ఈ ఎస్సెమ్మెస్‌లను బాధితుడు పట్టించుకోలేకపోయాడు. రూ.లక్ష బదిలీ అయినట్లు గుర్తించిన తర్వాత ఈ సంక్షిప్త సందేశాలను పరిశీలించడం ద్వారా రెండు రోజుల్లో 12 లావాదేవీలు జరిగినట్లు తెలుసుకున్నాడు. దీనిపై శుక్రవారం నగర సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమికంగా సదరు సైబర్ నేరగాళ్ళు జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితుడి నగదు సైతం ఉత్తరాదికి చెందిన ఖాతాల్లోకి మళ్ళించినట్లు భావిస్తున్న పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. -
పన్ను చెల్లింపుదారులకు ఐటీ హెచ్చరిక
పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎవరితో పంచుకోవద్దని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఒకవేళ పాస్‌వర్డు, ఐడీ అనధికారిక వ్యక్తుల చేతులోకి వెళ్తే యూజర్ల కీలక సమాచారం దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని పేర్కొంది. టీడీఎస్ సెంట్రలైజడ్ ప్రాసెసింగ్ ఈ మేరకు హెచ్చరికలను పన్ను చెల్లింపుదారులకు జారీచేసింది. పన్ను చెల్లింపుదారులు యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఎంతో కీలకమైన సమాచారం, వీటితో టీడీఎస్ సంబంధిత రహస్య సమాచారం, కీలకమైన డేటా దిద్దుబాటుకు గురయ్యే అవకాశముంటుందని పేర్కొంది. ఒకవేళ పాస్వర్డ్ హ్యాక్ అయిన లేదా దొంగతనానికి గురైనా, సమాచారం భద్రత ఉల్లంఘనకు గురయ్యే అవకాశముంటుందని వెల్లడించింది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండేలా యూజర్లు పాస్వర్డ్లు క్రియేట్ చేసుకోవాలని, దానిలో నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు కూడా ఉండేలా చూసుకోవాలని సూచించింది. అయితే ఈ పాస్‌వర్డ్‌ను తమ డెస్క్‌పై ఉన్న నోట్‌ప్యాడ్స్ లేదా వైట్బోర్డులపై రాయవద్దని తెలిపింది. ఈ-మెయిల్స్, ఫోల్డర్స్, ఫైల్స్ వంటి వాటి పాస్వర్డ్లు కూడా కంప్యూటర్లపై ఉంచుకోవడం ఇబ్బందులు కలుగజేయవచ్చని హెచ్చరించింది. ఒకవేళ యూజర్లు ఈ-మెయిల్ లేదా కంప్యూటర్ అకౌంట్ హ్యాక్ అయితే, పాస్‌వర్డ్‌లను దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని, మీ ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా క్రెడిట్/డెబిట్ కార్డుల కీలక సమాచారం కూడా ఇతర వ్యక్తుల చేతిలోకి పోతుందని తెలిపింది. -
మేమెప్పుడూ మీ వివరాలు అడగం: ఆర్బీఐ
మోసపూరిత ఈ-మెరుుల్స్తో జాగ్రత్త హైదరాబాద్: ప్రజలను తామెప్పుడూ బ్యాంక్ అకౌంట్, పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వివరాలను అడగబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి వివరాల కోసం తాము ప్రజలకు ఎలాంటి ఈ-మెరుుల్స్, ఎస్ఎంఎస్లు, కాల్స్ చేయమని పేర్కొంది. ఈ మేరకు ప్రజలు మోసపూరిత ఈ-మెరుుల్స్, కాల్స్, ఎస్ఎంఎస్ పట్ల అవగాహనతో ఉండాలని సూచించింది. ఇవి ఒక్కొక్కసారి ఆర్బీఐ నుంచి వచ్చిన ఈ-మెరుుల్స్, ఎస్ఎంఎస్లు లాగే ఉంటాయని, అలాంటప్పుడు జాగ్రత్తతో వ్యవహరించాలని, వాటికి రెస్పాండ్ కావొద్దని విజ్ఞప్తి చేసింది. తామెప్పుడూ ఎవరికీ డబ్బుల్ని ఆఫర్ చేయమని పేర్కొంది. -
మీ ఖాతా.. జర భద్రం!!
మోసగాళ్లు మరీ తెలివిమీరిపోతున్నారు జాగ్రత్తలు తీసుకోకుంటే ఖాళీ కావొచ్చు ఈ మధ్యే ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచిన ప్రశాంతికి ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానంటూ... వెరిఫికేషన్ కోసం మీ డెబిట్ కార్డు నంబరు, సీవీవీ, వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పండని అడిగాడు. యథాలాపంగా వివరాలన్నీ చెప్పేయబోయిన ప్రశాంతి ఆఖరు నిమిషంలో సందేహమొచ్చి అప్రమత్తమై సదరు వ్యక్తిని నిలదీసింది. వెంటనే బ్యాంకు శాఖకు ఫోన్ చేస్తే... అసలలాంటి ఫోన్ కాల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ తమ నుంచి రావని స్పష్టంగా చెప్పారు. దీంతో అప్పటికప్పుడు తను ఫిర్యాదు నమోదు చేసి, మళ్లీ పాస్వర్డ్లు మొదలైనవి మార్చుకుని జాగ్రత్తపడింది. మోసగాళ్లు చెలరేగిపోతున్న పరిస్థితుల్లో మన కష్టార్జితం ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు మన వంతుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే.. పాస్వర్డ్ గోప్యంగా... పాస్‌వర్డ్‌ను సాధ్యమైనంత వరకూ గోప్యంగా ఉంచాలి. ఖాతా వివరాలు ఎవరికీ చిక్కకుండా తరచూ మారుస్తుండాలి, అల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, అంకెలు) కాంబినేషన్లో పటిష్టమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. వివిధ ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించొద్దు. పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకోవడానికే ప్రాధాన్యమివ్వండి. మొబైల్ ఫోన్లో రాసి పెట్టుకోవడం తగదు. ఆన్లైన్ లావాదేవీల్లో జాగ్రత్త.. ఇంటర్నెట్ కేఫ్‌లు.. లైబ్రరీలు మొదలైన చోట్ల, హోటళ్లు.. ఎయిర్‌పోర్ట్‌లలో వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా కంప్యూటర్స్ నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడం సురక్షితం కాదు. ఇలాంటి చోట్ల మీ పాస్‌వర్డ్‌ను మరొకరు చూడటమో లేదా ట్రేస్ చేయడమో జరిగే అవకాశాలెక్కువగా ఉంటాయి. ఒకవేళ అకౌంట్లోకి లాగిన్ కావాల్సి వస్తే క్యాషె, బ్రౌజింగ్ హిస్టరీని, టెంపరరీ ఫైల్స్‌ను కంప్యూటర్ నుంచి డిలీట్ చేయాలి. పిన్ గోప్యంగా ఉంచాలి.. బ్యాంకులు ఎప్పుడూ కూడా ఖాతాదారుల కాన్ఫిడెన్షియల్ వివరాలను గురించి ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా అడగవు. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, సీవీవీ (మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వెనుక ఉండే 3 అంకెల నంబరు), డెబిట్ కార్డు పిన్ నంబరు.. ఎక్స్పైరీ తేదీ, వన్ టైమ్ పాస్వర్డ్ మొదలైనవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బ్యాంకు అధికారీ అడగరని గుర్తుంచుకోండి. ఇలాంటి కీలక అంశాలు ఎవ్వరికీ చెప్పొద్దు. ఖాతా స్టేట్మెంట్లు చెక్ చేసుకోవాలి.. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించిన తర్వాత ఖాతాను పరిశీలించుకోవడం మంచిది. మీ ఖాతా నుంచి సరైన మొత్తమే డెబిట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఏవైనా తేడాలు గమనించిన పక్షంలో బ్యాంకుకు వెంటనే తెలియజేయాలి. బ్రౌజర్‌తో జాగ్రత్తలు.. బ్రౌజర్లో ఆటో సేవ్, ఆటో కంప్లీట్ వంటి ఫీచర్లు పనిచేయకుండా డిసేబుల్ చేయాలి. ఎందుకంటే సేవ్ చేసిన సమాచారాన్ని హ్యాకర్స్ లేదా మరెవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. పాస్వర్డ్లు, ఇతరత్రా కాన్ఫిడెన్షియల్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని క్లియర్ చేసేయండి. వెబ్‌సైట్లన్నింటిలోనూ సేవ్ పాస్వర్డ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి. లాటరీ మెయిల్స్‌తో భద్రం .. పరిచయం లేని వారి నుంచి వచ్చే ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అటాచ్‌మెంట్స్‌ను క్లిక్ చేయడం గానీ లేదా డౌన్లోడ్ చేయడం గానీ చేయొద్దు. ఈ తరహా అటాచ్మెంట్స్ ద్వారా మీ ఫైల్స్‌ను, డేటాను చౌర్యం చేసే.. లేదా ధ్వంసం చేసే వైరస్లు గానీ ట్రోజన్లు గానీ సిస్టమ్‌లో ప్రవేశించవచ్చు. సంజయ్ చౌగులే హెడ్-ఫైనాన్షియల్ క్రైమ్ ప్రివెన్షన్ విభాగం, ఐసీఐసీఐ బ్యాంక్ -
కనుసన్నల్లో స్మార్ట్‌ఫోన్స్!
♦ పాస్‌వర్డ్స్‌కు ఇక కాలం చెల్లినట్లే..! ♦ ఐరిస్, ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో మోడళ్లు ♦ ఫీచర్లతో పోటీపడుతున్న కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యక్తిగత, విలువైన సమాచారం అంతా మొబైల్స్‌లో నిక్షిప్తం చేయడం సర్వ సాధారణమవుతోంది. ఈ సమాచారం భద్రంగా ఉండాలంటే ఇప్పటి వరకు వినియోగదారులు తమ మొబైల్స్‌కు పాస్వర్డ్ లేదా ప్యాటర్న్ పెట్టుకునేవారు. ఇప్పుడీ విధానానికి కాలం చెల్లుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కూడిన స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టాయి. ఇది చాలదన్నట్టు కనురెప్ప వాల్చి తెరిస్తే ఫోన్ తెరుచుకునేలా ఐరిస్ స్కానర్ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్చల్ చేస్తోంది. భారత్‌లోనూ ఈ ఫీచర్ ఉన్న స్మార్ట్ఫోన్లు రంగ ప్రవేశం చేశాయి. అందుబాటు ధరలోనూ ఇవి లభిస్తున్నాయి. భద్రంగా సమాచారం.. పాస్వర్డ్ మరిచిపోయి తప్పుగా టైప్ చేసినా, ప్యాటర్న్ మరో రకంగా ఇచ్చినా ఫోన్ లాక్ అయిపోతుంది. పాస్వర్డ్ తస్కరణకు గురైతే ఇతరులెవరైనా ఉపకరణాన్ని తెరిచేందుకు ఆస్కారం ఉంది. అయితే ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కానర్ వంటి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్‌తో ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పాస్వర్డ్ తస్కరణ సమస్య ఈ విధానంలో ఉండదు. యజమానులు మాత్రమే ఉపకరణాన్ని తెరవగలరు. అందుకే ఈ ఫీచర్లపట్ల మొబైల్ యూజర్లుఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఫింగర్ ప్రింట్‌తో పోలిస్తే ఐరిస్ స్కానర్ మరింత భద్రమైంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ-బ్యాంక్, ఆన్లైన్ షాపింగ్‌కు కస్టమర్లు ఐరిస్ స్కానర్‌ను వినియోగిస్తున్నారు. ఒకదాని వెంట ఒకటి.. మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫీచర్ల హవా నడుస్తోంది. ఫోన్లు అమ్ముడుపోవాలంటే కాస్త వినూత్నత ఉండాల్సిందే. అందుకే చాలా కంపెనీలు ఒకదాని వెంట ఒకటి రిచ్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ మోడళ్లు దేశంలో 100 దాకా ఉన్నాయి. రూ.7 వేల నుంచి ఇవి లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి ఏటా 100 కోట్ల యూనిట్ల మొబైల్స్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ నిక్షిప్తమై ఉంటుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ ట్రాక్టికా నివేదిక చెబుతోంది. అంటే మొత్తం అమ్ముడయ్యే ఫోన్లలో వీటి వాటా 34 శాతంగా ఉంటుందని వెల్లడించింది. ఐరిస్ ఫీచర్‌తో.. ఫోన్‌ను తె రిచేందుకు పాస్వర్డ్ టైప్ చేయాలన్నా, ప్యాటర్న్ ఇవ్వాలన్నా కొన్ని సెకన్ల సమయం పడుతుంది. అదే ఐరి స్తో సెకను లోపే ఈ తతంగాన్ని పూర్తి చేయవచ్చు. యజమాని తన కన్ను చిత్రాన్ని ఫోన్లో ఒకసారి రిజిష్టర్ చేస్తే చాలు. మైక్రోసాఫ్ట్, శాంసంగ్, హెచ్‌పీ, ఆల్కటెల్, జెడ్‌టీఈ, వివో, రిలయన్స్ లైఫ్ స్మార్ట్‌ఫోన్స్, ఫ్యూజిట్సు, యూమీ తదితర కంపెనీలు ఐరిస్ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీపడుతున్నాయి. తాజాగా వీటి జాబితాలోకి టీసీఎల్ సైతం వచ్చి చేరింది. అది కూడా రూ.7,999లకే టీసీఎల్-560 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. భారత్‌లో అతి తక్కువ ధరలో లభిస్తున్న ఐరిస్ స్కానర్ ఫీచర్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. -
అవి.. ఎప్పుడూ, ఎక్కడా వాడకూడదు!
న్యూఢిల్లీః కంప్యూటర్ల కాలంలో పాస్ వర్డ్స్ కు ప్రాధాన్యత భారీ పెరిగిపోయింది. ఎటువంటి వ్యక్తిగత వివరాలను భద్రపరుచుకోవాలన్నా అందుకు పాస్ వర్డ్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే పెట్టుకున్న పాస్ వర్డ్ ఎవ్వరికీ తెలియకుండా కూడ చూసుకోవాలి. బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు పాస్ వర్డ్ వివరాలు ఎవ్వరికీ షేర్ చేయొద్దంటూ ఒక్కోసారి హెచ్చరికలు కూడ జారీ చేస్తుంటాయి. అంతటి ప్రాధాన్యత ఉన్న పాస్ వర్డ్స్ కు కూడ ఒక 'డే' ఉందని మీకు తెలుసా? 'పాస్ వర్డ్స్ డే' సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ, డిజిటల్ జీవితంలోనూ కూడ ముఖ్యమైన విషయాలు కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. భద్రతా, గోప్యతా వంటి విషయాలు పాటించడాన్ని అశ్రద్ధ చేస్తే ఒక్కోసారి ఎన్నో నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పాస్ వర్డ్స్ విషయంలో అటువంటి భద్రత, గోప్యత ఎంతో అవసరం. కానీ ఈ విషయంలో చాలా మంది విఫలం అవుతుంటారు. సులభంగా గుర్తుండేదో, వరుస నెంబర్లో, స్వంత పేర్లనో వాడేస్తుంటారు. కానీ పాస్ వర్డ్ క్రియేట్ చేసుకునేవారు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. పాస్ వర్డ్ కొత్తగా పెట్టుకునేవారు పదాలు, అక్షరాల్లో తప్పనిసరిగా కొన్ని సంఖ్యలను కలసి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సొంత పేర్లు, పుట్టిన తేదీలు, ఇంతకు ముందు వాడిన పేర్లు, కారు నెంబర్లు వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ వర్డ్స్ గా వాడొద్దని సలహా ఇస్తున్నారు. అంతేకాదు ఇతరులు ఊహించగలిగే పదాలు, సంఖ్యలను కూడ వాడకూడదు. 123456 వంటి పాస్ వర్డ్స్ సైబర్ నేరగాళ్ళు ఈజీగా ఊహించగల్గుతారని, సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని చోరాసురులు టార్గెట్ చేస్తారని చెప్తున్నారు. పాస్ వర్డ్స్ లో కొన్నిసార్లు వారిచ్చే ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇవ్వడంతో కూడ వ్యక్తిగత డేటాను చోరీ చేయగల్గుతారని భద్రతా సంస్థలు చెప్తున్నాయి. అంతేకాక వెబ్ ప్రపంచంలో ఏదో ఒక ఆధారంతో ఆయా వివరాలను తెలుసుకోగల్గుతారని, తరచుగా పాస్ వర్డ్స్ మార్చుకుంటుండటం వల్ల హ్యాక్ చేసే అవకాశం ఉండదని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకే పాస్ వర్డ్ ను అన్ని వెబ్ సైట్లలో వాడటం మానుకోవాలని చెప్తున్నారు. హ్యాకర్స్ , సైబర్ క్రమినల్స్ ఆట కట్టించాలంటే ఎవరికి వారు పాస్ వర్డ్స్ విషయంలో శ్రద్ధతోపాటు, జాగ్రత్తలు వహించాలని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంవల్ల సైబర్ నేరాలను అరికట్టేందుకు అధికారులకు సహకరించినవారవుతారని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో వాడేందుకు పనికిరాని, వాడ కూడని 25 చెత్త పాస్ వర్డ్స్ జాబితాను కూడ.. పాస్ వర్డ్స్ డే సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు వెల్లడించారు. అవేమిటో చూద్దాం... -
ఇక రైళ్లలో కేఎఫ్‌సీ
న్యూఢిల్లీ: ఇకపై రైళ్లలోనూ కేఎఫ్‌సీ చికెన్, మీల్ దొరుకుతుంది. రైళ్లలో తమ ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు కేఎఫ్‌సీ, ఐఆర్సీటీసీతో ఒప్పందం చేసుకుంది. తొలి దశలో ప్యాంట్రీ కారు లేని రైళ్లలోనే కేఎఫ్‌సీ సేవలు లభిస్తా యి. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే 12 రైళ్లలో సోమవారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మరో పదిరోజుల్లో విశాఖ, హైదరాబాద్ (కాచిగూడ), బెంగళూరుల మీదుగా వెళ్లే రైళ్లలోనూ కేఎఫ్‌సీ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్సీటీసీలో టికెట్ బుక్చేసేటపుడు కేఎఫ్‌సీకి ఆర్డరు పెట్టొచ్చు. లేదా 18001034139 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఆర్డరు చేయవచ్చు. ఆర్డరు చేయగానే ప్రయాణికుడి సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్లో పాస్‌వర్డ్‌ను వస్తుంది. డెలివరీ చేసే సమయంలో మనంఆ పాస్‌వర్డ్‌ను చెప్పాల్సి ఉంటుంది. -
నకిలీ ఆధార్ సెంటర్ సీజ్
హన్మకొండ అర్బన్ : హన్మకొండ సుబేదారిలోని నకిలీ ఆధార్ కేంద్రాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు బుధవారం సంయుక్తంగా దాడి చేసి సీజ్ చేశారు. ఆసరా పింఛన్ల కోసం ఆధార్ కార్డుల్లో వ్యక్తుల వయసు మార్పులు చేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనిపై కలెక్టర్‌కు కొందరు వ్యక్తులు సమాచారం అందించారు. దీంతో బుధవారం రాత్రి సుబేదారిలోని ఎఫ్ఎన్ స్పేస్ ఇంటర్నెట్ సెంటర్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఆధార్ కార్డుల్లో మార్పులు చేస్తున్నట్లు గుర్తించారు. రెండు లాప్‌ట్యాప్‌లు, ప్రింటర్లు, ఐరిష్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ కేంద్రం నిర్వాహకుడికి పాస్వర్డ్ ఎలా వచ్చిందని అధికారులు విచారిస్తున్నారు. గతంలో జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రస్తుతం పనపిచేయడంలేదు. ప్రసుతం స్వాధీనం చేసుకున్న పరికరాలను పరిశీలించి, నిర్వాహకులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనిఖీల్లో హన్మకొండ తహసీల్దార్ చెన్నయ్య, డీఐఓ విజయ్‌కుమార్, శ్రీధర్, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సత్యనారాయణ, శివశంకర్, సుబేదారి పోలీసులు పాల్గొన్నారు. -
తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్తున్నారా..?
దర్శనానికి వెళ్తున్నారా..? అయితే మీరు ముందుగానే మీ ఇంటి నుంచే దర్శనం టికెట్లు పొందవచ్చు. ఇందుకోసం ముందుగా మీరేం చేయాలి..?, ఎన్ని రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలో తెలుసుకోండి మరి... రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా... http://www.ttdsevaonline.com/Home.aspx లింక్‌ను క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సైన్అప్ ఆప్షన్ వస్తుంది. యూజర్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత వివరాలు అందించాల్సి ఉంటుంది. 20 కేబీ పరిమాణానికి మించని ఫొటోతోపాటుగా, మీకు సంబంధించిన ఐడీ ఫ్రూప్ ఇవ్వాలి. మీ మెయిల్ ఐడీ ఇచ్చి దానికి ఎనిమిది అక్షరాలుగల పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. అన్ని పూర్తయ్యాక మీరు ఇచ్చిన మెయిల్‌కు రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే టీటీడీ సేవా ఆన్లైన్లో రిజిష్టర్ అయినట్టే. టికెట్ పొందండిలా... ॥ టీటీడీ సైట్లో లాగిన్ అయ్యాక మీరు పలు దశల్లో టికెట్ పొందవచ్చు. ॥ పిలిగ్రిమ్ ఇన్ఫర్మేషన్ (భక్తుల సమాచారం), పేమెంట్, కన్ఫర్మేషన్(ధ్రువీకరణ) అంశాలు పూర్తి చేయాలి. పిలిగ్రిమ్ ఇన్ఫర్మేషన్ ఎంతమంది భక్తులు వెళ్తున్నారో అంతమంది ఫొటోలతోపాటుగా ఐడీ ప్రూఫ్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. టికెట్ రిజర్వు ఇలా ఇక్కడ మీకు నచ్చిన తేదీ, సమయాన్ని ఎంచుకోవచ్చు. దర్శనానికి ఎన్ని టికెట్లు కావాలో సెలక్ట్ చేసుకోవాలి. ప్రతి గంటకు స్లాట్లు అందుబాటులో ఉంటాయి. విండోలో కుడివైపు గ్రీన్ కలర్లో ఉన్న ‘చెక్ ఎవైలబిలిటీ’ ఆప్షన్‌తో అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇతర సేవలు ఆన్లైన్లో... టీటీడీ సైట్లో ఒకసారి రిజిష్టరైతే ఈ-దర్శన్ మాత్రమే కాకుండా ఇతర సేవలు, ఈ-వసతి, ఈ-సుదర్శనమ్, ఈ-డొనేషన్ తదితర అంశాలను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈ-స్పెషల్ ఎంట్రీ దర్శన్ తప్ప ఇతర సేవలకు 60 రోజులు ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సూచనలు : టికెట్ బుకింగ్ సైట్ రోజూ రాత్రి 11.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.15 వరకు పనిచేయదు. ఈ-దర్శన్ కోటాను రోజూ ఉదయం 9 గంటలకు మాత్రమే విడుదల చేస్తారు. టికెట్లను రెండు ప్రింట్లు తీసుకోవాలి. ఒకటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద అందించాలి. రెండోది దర్శనం క్యూలో ఇవ్వాలి. ఒకసారి బుక్ చేశాక ఇక అది రద్దుకాదు. ప్రత్యేక పరిస్థితుల్లో మీ దర్శన సమయాన్ని మార్పు చేసే అధికారం టీటీడీకి ఉంది. ఏ ఫొటో ఐడీ సమర్పించారో దాన్నే దర్శనం సమయంలో చూపించాలి. -
ఆన్లైన్ బ్యాంకింగ్‌కు కొత్త వైరస్ ముప్పు
న్యూఢిల్లీ: ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలకు తాజాగా మరో వైరస్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. యూజర్ల డేటా, పాస్‌వర్డ్‌లను చోరీ చేసే ‘డెరైజా’ వైరస్ శరవేగంగా సిస్టమ్స్‌లోకి చొరబడుతోంది. ప్రమాదకరమైన ట్రోజన్ వైరస్ కోవకి చెందిన డెరైజా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్-ఇన్) ఆన్లైన్ బ్యాంకింగ్ కస్టమర్లను హెచ్చరించింది. అసలైన బ్యాంకుల నుంచే వచ్చినట్లు అనిపించే ఈమెయిల్స్‌లో అటాచ్మెంట్ రూపంలో ఈ వైరస్ వస్తుందని పేర్కొంది. పొరపాటున దీన్ని ఇన్స్టాల్ చేస్తే సిస్టమ్‌లో తిష్టవేసి బ్యాంకింగ్ పాస్వర్డ్లు మొదలైన వాటిని తస్కరిస్తుందని హెచ్చరించింది. వైరస్‌తో ముప్పు ఇదీ.. సెర్ట్-ఇన్ వివరాల ప్రకారం స్పామ్ మెసేజీల కింద ఈమెయిల్లో జిప్ లేదా పీడీఎఫ్ అటాచ్మెంట్ల రూపంలో ఈ వైరస్ వ చ్చే అవకాశం ఉంది. ఈ అటాచ్మెంట్లను డౌన్లోడ్ చేసుకుని, అందులోని ప్రోగ్రామ్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలంటూ బ్యాంకు సూచిస్తున్నట్లుగా ఈమెయిల్ సారాంశం ఉంటుంది. దానికి అనుగుణంగా జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని అన్జిప్ చేసిన పక్షంలో అందులోని మాల్వేర్ ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత భద్రతకు సంబంధించిన సెటింగ్స్ అన్నింటినీ కూడా ఛేదిస్తుంది. బ్రౌజర్‌ను హైజాక్ చేయడం, కీ స్ట్రోక్స్ వివరాలను వైరస్ రూపకర్తకు చేరవేయడం మొదలైనవి చేస్తుంది. ఇది క్రోమ్, ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సహా వివిధ వెబ్ బ్రౌజర్లలో ప్రమాదకరమైన కోడ్‌ను ఈ మాల్వేర్ పొందుపరుస్తుంది. ఫలితంగా యూజరు తన బ్యాంకు వెబ్సైట్ పేరును టైప్ చేసినప్పుడు ముందుగా .. వైరస్ సర్వర్‌కు సంకేతాలు వెడతాయి. ఆ తర్వాత అసలు సిసలు బ్యాంకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో యూజర్ టైప్ చేసే వివరాలన్నీ కూడా వైరస్ సర్వర్‌కు చేరిపోతాయి. జాగ్రత్త చర్యలు.. ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను సెర్ట్-ఇన్ సూచించింది. డాట్ వీబీఎస్, బీఏటీ, ఈఎక్స్ఈ, పీఐఎఫ్, ఎస్సీఆర్ ఎక్స్‌టెన్షన్స్‌తో వచ్చే ఈమెయిల్ అటాచ్‌మెంట్స్‌ను బ్లాక్ చేసేలా ఈమెయిల్ సెటింగ్స్‌ను మార్చుకోవాలని పేర్కొంది. అలాగే ఇంటర్నెట్, లోకల్ ఇంట్రానెట్ సెక్యూరిటీ జోన్ సెటింగ్స్‌ను అధిక స్థాయికి పెంచుకోవాలని తెలిపింది. సాధ్యమైనంత వరకూ విశ్వసించతగని వెబ్సైట్లను బ్రౌజ్ చేయొద్దని, ఫైర్‌వాల్‌ను యాక్టివ్‌గా ఉంచాలని సూచించింది. అలాగే తెలియని ఐడీల నుంచి వచ్చే మెయిల్స్‌ను తెరవొద్దని, సాధ్యమైనంత వరకూ యాంటీ మాల్వేర్ ఇంజిన్స్‌ను స్కాన్ చేసుకుని, అప్-టు-డేట్ ఉండేలా చూసుకోవాలని సెర్ట్-ఇన్ తెలిపింది. -
పెదవుల కదలికే పాస్వర్డ్!
లండన్: పెదవుల కదలికే కంప్యూటర్ పాస్వర్డ్ కానుంది! పెదవుల కదలికను గ్రహించే కంప్యూటర్లు త్వరలో రానున్నాయి. మనుషులు మాట్లాడేటపుడు ప్రతి ఒక్కరి పెదవుల కదలికల్లో తేడా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. జోర్డాన్‌లోని ముటా యూనివర్సిటీ పరిశోధకుడు అహ్మద్ హసానత్ పెదవుల కదలికను గ్రహించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. మనుషులు మాట్లాడేటపుడు నోరు, పెదవుల కదలికలను కెమెరా ద్వారా గుర్తిస్తారు. మాట్లాడేటపుడు ఆ వ్యక్తి పల్లు ఎన్ని కనిపిస్తాయి తదితర విషయాలను గ్రహిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఓ వ్యక్తి మాట్లాడిన మాటలను అతని నోటి కదలికను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే 80 శాతం వరకు కచ్చితంగా గుర్తిస్తుంది. వ్యక్తి పెదవుల కదలిక ఆధారంగా కంప్యూటర్లో లాగిన్ కావచ్చని హసానత్ చెబుతున్నారు. అలాగే బయోమెట్రిక్ సెక్యూరిటీలోనూ విజువల్ పాస్వర్డ్ పద్ధతి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. -
పాస్ వర్డ్ ఓ చిన్నారిని అలా కాపాడింది
స్కూల్ పిల్లలు కిడ్నాప్ గురికావడం తరచు వార్తల్లో వింటుంటాం. చూస్తుంటాం. న్యూఢిల్లీలోని ఓ స్కూల్ లో ఓ విద్యార్ధిని కిడ్నాప్ చేయడానికి దుండగుడు చేసిన ప్రయత్నాలను ఓ చిన్నారి తిప్పికొట్టింది. వివరాల్లోకి వెళితే.. అర్జెంట్ మీ అమ్మ తీసుకురమ్మని నన్ను పంపించింది అని ఓ దుండగుడు దేశ రాజధానిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ఎనిమిదేళ్ల పాపను కిడ్నాప్ కు ప్రయత్నించారు. అయితే కిడ్నాపర్ పై అనుమానం వచ్చిన ఆ చిన్నారి అందుకు సమాధానంగా పాస్ వర్డ్ చెప్పమని అడిగిందట. దాంతో కంగారుపడిన కిడ్నాపర్ అక్కడి నుంచి జారుకున్నారట. ఇంతకు అసలు విషయమేమింటంటే.. కిడ్నాపర్ల నుంచి బారిన పడకుండా తల్లి, కూతుళ్లు ఓ పాస్ వర్డ్ ను పెట్టుకున్నారట. ఏ పరిస్థితిల్లోనూ ఎవరైనా తనతో రమ్మని అడిగితే పాస్ వర్డ్ చెప్పాలని కూతురుకు తల్లి చెప్పిందట. తల్లి, కూతుర్ల మధ్య పాస్ వర్డ్ ఓ ప్రమాదం నుంచి తప్పించింది. ఏమైనా కిడ్నాపర్ చిక్కుకుండా తీసుకున్న తల్లి జాగ్రత్తను ప్రశంసిస్తూ స్కూల్ యాజమాన్యం ఓ లేఖను ప్రకటన రూపంలో వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ లెటర్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఏదైనా జరగకూడనిది జరిగితే పోలీసులను, సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులను నిందించకుండా తల్లి తండ్రులు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. అందరికి మంచిదే కదా.... -
పాస్వర్డ్ సీక్రెట్‌గా ఉంచుకోవాలి
పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్చార్జ్ శంకర్ ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : విద్యార్థులు వెబ్ అప్షన్లు ఎంపిక చేసుకునే క్రమంలో పాస్‌వర్డ్‌ను సీక్రెట్‌గా ఉంచుకోవాలని పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్చార్జ్ శంకర్ సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సులో చేరేందుకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ప్రారంభమైంది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్‌లో 1నుంచి 10వేల ర్యాంక్ వరకు పిలువగా 277, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 10,001 నుంచి 20వేల ర్యాంక్ వరకు పిలువగా 293 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరిశీలన అనంతరం వారికి చెక్ మెమోలు అందజేశారు. వెబ్ కౌన్సెలింగ్‌పై అవగాహన కల్పించారు. సర్టిఫికెట్ల పరిశీలనలో వెంకట్ నారయణ, శ్రీనివాస్, అప్పారావు, యుగంధర్‌రెడ్డి, కృష్ణ, రమేష్ కుమార్ పాల్గొన్నారు. మంగళవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 20,001 నుంచి 30వేల ర్యాంకు వరకు, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 30,001 నుంచి 40వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. -
మొబైల్ బ్యాంకింగ్ సురక్షితమే..
దేశీయంగా మొబైల్ ఫోన్ల వాడకం భారీగా పెరుగుతోంది. 2009-10 నాటితో పోలిస్తే కనెక్షన్ల సంఖ్య 50 శాతం పైచిలుకు పెరిగి ప్రస్తుతం 90 కోట్ల స్థాయిలో ఉంది. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారి సంఖ్య 8.6 కోట్ల స్థాయిలో ఉంది. వివిధ రేట్లలో స్మార్ట్ఫోన్లు లభిస్తున్న నేపథ్యంలో ఇది వార్షిక ప్రాతిపదికన 200 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2015 నాటికి మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరుతుందని అంచనా. ఫలితంగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ వల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాంకింగ్ సేవలను పొందడం సాధ్యపడుతోంది. దీని వల్ల బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరం అవ్వడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ఉదాహరణకు .. సూపర్ మార్కెట్లోనో, షాపింగ్ మాల్స్‌లోనో ఏదైనా కొన్నారనుకోండి. చెల్లించడానికి మీ అకౌంట్లో తగినంత డబ్బు ఉందో లేదోనని సందేహం వస్తే.. లైన్లో నుంచునే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా డెబిట్ కార్డుతో కొనాలా క్రెడిట్ కార్డును ఉపయోగించాలా అన్నది నిర్ణయించుకోవచ్చు. అలాగే, కరెంటు, వాటరు మొదలైన బిల్లులను ఆఖరు రోజున కూడా అప్పటికప్పుడు, సురక్షితంగా కట్టేసేందుకు మొబైల్ బ్యాంకింగ్ తోడ్పడుతుంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఖాతాల మధ్య నగదును బదిలీ చేసుకోవచ్చు, డిపాజిట్ అయ్యిందా లేదా చూసుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మీకు బ్యాంకులో ఏయే సేవలు లభిస్తాయో.. దాదాపు వాటన్నింటినీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పొందవచ్చు. ఈ లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు బ్యాంకులు మొబైల్ అప్లికేషన్స్ (యాప్స్)ని అందిస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్‌తో ప్రయోజనాలు.. ఇతర మార్గాలతో పోలిస్తే మొబైల్ బ్యాంకింగ్ అనేక ప్రయోజనాలు కల్పిస్తుండటంతో.. దీని వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇంకా పెరుగుతుంది. సౌకర్యం: ఖాతా వివరాలు ఎక్కడైనా, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. వ్యక్తిగతమైన సేవలు: మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఆయా కస్టమర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన ఆఫర్లు, పర్సనలైజ్డ్ మెనూ తదితర ఫీచర్స్‌తో సమగ్రమైన సేవలు అందించగలవు. సురక్షితం: మొబైల్ బ్యాంకింగ్ క్లయింట్ యాప్స్‌కి వెబ్ బ్రౌజర్లతో పనిలేదు. కాబట్టి ఫిషింగ్ స్కాములు ఇతరత్రా సమస్యలకు ఆస్కారం లేదు. పెపైచ్చు ఎంపిన్ (మొబైల్ పిన్ నంబర్), ఓటీపీ (వన్‌టైమ్ పాస్వర్డ్) ఫీచర్లతో లావాదేవీలు సురక్షితంగా జరుపుకోవచ్చు. ఇతర ఉపయోగాలు: మనకు దగ్గర్లో ఉండే ఏటీఎంలు, బ్యాంకు శాఖల వివరాలు.. సమీపంలో షాప్‌లు, మాల్స్ ఇస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్ల సమాచారాన్ని ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అందిస్తుంటాయి. మరింత సురక్షితంగా ఉండాలంటే.. పాస్వర్డ్ టైప్ చేస్తేనే హ్యాండ్సెట్ ఆన్ అయ్యేలా సెట్ చేసి ఉంచాలి. మీ పాస్వర్డ్, అకౌంటు నంబరు, పిన్ నంబరు, సీక్రెట్ ప్రశ్నలకు జవాబుల సమాచారాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండటమే కాకుండా హ్యాండ్‌సెట్‌లో భద్రపర్చొద్దు. ఫోన్ పోయిన పక్షంలో వెంటనే బ్యాంకుకు లేదా మొబైల్ ఆపరేటరుకు సమాచారం ఇవ్వాలి. ఫోన్ పోగొట్టుకున్నా, లేదా అది దొంగతనానికి గురైనా మొబైల్ ఆపరేటరు.. అది పనిచేయకుండా డిసేబుల్ చేయవచ్చు. అలాగే, దాన్నుంచి మీ ఖాతాలను ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా బ్యాంకు కూడా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఫోన్లో మాల్వేర్ (వైరస్లు) చొరబడకుండా ముందే గుర్తించి, నివారించే సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఫోన్ పోయిన పక్షంలో .. ఎక్కణ్నుంచైనా లాక్ చేయడానికి, డేటాను డిలీట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్లు ఉపయోగపడతాయి. పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లో ఎప్పుడూ కూడా స్మార్ట్‌ఫోన్‌తో బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్ లావాదేవీలు జరపకుండా ఉండటం మంచిది. అలాగే యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారాన్ని టైప్ చేయాల్సి వచ్చే అవసరమున్న లావాదేవీల జోలికి కూడా పోకుండా ఉంటే ఉత్తమం. మొబైల్లో బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతున్నప్పుడు.. అవి పూర్తి కాకుండా ఫోన్‌ను పక్కన పెట్టేసి వెళ్లిపోవద్దు. మొబైల్ బ్యాంకింగ్ క్రమంగా ఊపందుకుంటున్నా.. ఇప్పటికీ ఇంటర్నెట్ లేదా బ్యాంకుకు స్వయంగా వెళ్లడంతో పోలిస్తే ఇది సురక్షితమేనా అనే సందేహాలున్నాయి. వాస్తవమేమిటంటే.. ఇది కూడా సురక్షితమైనదే. పైగా లావాదేవీలు నిర్వహించాలంటే రెండంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. కస్టమరు మొబైల్ నంబరుతో పాటు వారి మొబైల్ పిన్ నంబరు కూడా అవసరం అవుతుంది. కాబట్టి, ఫోన్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. లాగిన్ అయ్యి, ఆథరైజ్ చేసే దాకా ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని మొబైల్ యాప్‌లో ఇవ్వాల్సిన అవసరం లేనందున హ్యాకర్ల నుంచి సమస్యలు కూడా ఉండవు. -
మీ వాసనే పాస్వర్డ్!
న్యూయార్క్: వేలిముద్రలు.. కనుపాపల స్కానింగ్.. ఫేస్ రికగ్నిషన్.. ఇవన్నీ అత్యంత భద్రమైన ‘పాస్వర్డ్’లు.. వ్యక్తుల ‘గుర్తింపు’ కోసం ఉపయోగించే పద్ధతులు. తాజాగా ఈ జాబితాలోకి మన శరీరం వాసన కూడా చేరింది. శారీరక లక్షణాల కారణంగా ప్రపంచంలోని వ్యక్తులందరికీ.. ఎవరిది వారికే ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దాని ఆధారంగా పనిచేసే ప్రత్యేకమైన పరికరాలను స్పెయిన్‌కు చెందిన డి మాడ్రిడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ పరికరాలు 85 శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నాయని వారు చెబుతున్నారు. -
పిన్‌తో జాగ్రత్త
డెబిట్ కార్డుతో షాపింగ్ చేస్తే అక్కడ కూడా పిన్ను వినియోగించే పద్ధతి ఈనెల ఒకటి నుంచీ అమల్లోకి వచ్చింది. కార్డును స్వైప్ చేసి బిల్లు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ (పిన్) కూడా ఎంటర్ చేస్తేనే లావాదేవీ పూర్తి అవుతుంది. డెబిట్ కార్డుతో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ ఈ మేరకు నిబంధనలు మార్చింది. కాని ఇలా పిన్ ఎంటర్ చేసేటప్పుడు కనీస జాగ్రత్త పాటించకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే షాపింగ్‌లో డెబిట్ కార్డును వినియోగిస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి: ఏటీఎం పాస్వర్డ్ అనేది అత్యంత రహస్యంగా ఉంచుకోవాలి. ఈ పిన్ అందరికీ తెలిస్తే దీంతో ఎటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చన్న సంగతి మర్చిపోవద్దు. అంతే కాదు వారు కూడా బయట షాపింగ్‌కు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. అందుకే ఈ పిన్ను మూడో వ్యక్తికి తెలవకుండా జాగ్రత్తపడండి. కౌంటర్ వద్ద పీవోఎస్ మెషీన్లో పిన్ను ఎంటర్ చేయాల్సినప్పుడు ఆ నంబర్‌ను బిల్ కౌంటర్లో కూర్చున్న వ్యక్తికి చెప్పకుండా నేరుగా మీరే ఎంటర్ చేయండి. అలాగే ఎంటర్ చేసేటప్పుడు మిగిలిన వారికి కనపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. -విశాల్ సాల్వి, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ -
స్మార్ట్‌ఫోన్‌కు పాస్వర్డ్!
లండన్: రోజుకో కొత్త సాఫ్ట్వేర్ అభివృద్ధిచేస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ఇక స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటివాటికి పాస్వర్డ్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా పోనుంది. అవును.. ఇలినాయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చెంగ్ బో నేతృత్వంలోని బృందం ఈ మేరకు సరికొత్త ‘సెలైంట్సెన్స్’ అనే సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసింది మరి. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇక స్మార్ట్ఫోన్లకుు పాస్‌వర్డే అవసరం లేదట. టచ్‌స్క్రీన్‌పై జస్ట్ అలా తట్టడంగానీ లేదా స్వైప్ (గీకడం) గానీ చేస్తే చాలు.. ఫోన్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నది మీరేనా? కాదా? అన్నది ఇది ఇట్టే గుర్తుపట్టేస్తుంది. తడుతున్న లేదా గీకుతున్న చేతివే లి సైజు, ఒత్తిడి, వేగం, గీకే విధానం వంటి అనేక వివరాలను ఇది ఫోన్లో అమర్చే సెన్సర్ల ద్వారా అతివేగంగా అంచనావేస్తుంది. ఫోన్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నది వేరే వ్యక్తులని అనిపిస్తే వెంటనే లాక్ పడిపోతుంది. సాధారణంగా 3 నుంచి 5 సార్లు తట్టినా లేదా ఒకసారి గీకినా చాలు.. యజమానిని ఇది గుర్తిస్తుంది. అంతేకాదు.. ఫోన్ వినియోగిస్తున్నవారు యజమానేనా? కాదా? అన్నదీ ఇది ఓ కంట కనిపెడుతుందట. ఆటలు ఆడుకునేటప్పుడు తప్ప ఈ-మెయిళ్లు, ఎసెమ్మెస్‌లు చెక్ చేయడం వంటి సందర్భాల్లో ఆటోమేటిక్‌గా అప్రమత్తం అయిపోతుందట. -
మీ గుండెచప్పుడే... పాస్వర్డ్!
మొబైల్ ఫోన్లు, పీసీలు, ట్యాబ్లెట్లు... కారు, ఇంటి తలుపులను సైతం ఇకపై మీ గుండె చప్పుడుతోనే ఓపెన్ చేసేయొచ్చు. ఇందుకు కావలసిందల్లా జస్ట్ మీ చేతికి ఓ రిస్ట్‌బ్యాండ్‌ను కట్టుకోవడమే. అవును.. గుండెచప్పుడును బట్టి మనుషుల్ని గుర్తించే సరికొత్త రిస్ట్‌బ్యాండ్‌ను టొరంటోలోని ‘బయోనిమ్స్’ కంపెనీ పరిశోధకులు తయారుచేశారు. ‘నైమీ’ అనే ఈ రిస్ట్‌బ్యాండ్‌పై ఉండే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) సెన్సర్లపై కొన్ని సెకన్లపాటు చేతితో తాకితే చాలు. ముందుగానే రికార్డు అయిన మీ గుండెచప్పుడుతో పోల్చి చూసుకుని ఇది బ్లూటూత్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తుంది. వేలిముద్రలు, కనుపాపలే కాదు... గుండె కొట్టుకునే విధానంలో కూడా మనిషికి మనిషికీ మధ్య తేడాలుంటాయట. దీన్నిబట్టే ఈ రిస్ట్‌బ్యాండ్ అసలు మనిషిని గుర్తిస్తుందట. ఇప్పుడున్న బయోమెట్రిక్ పద్ధతుల కన్నా ఇది మరింత భద్రమైనదని శాస్త్రవేత్తలు అంటున్నారు.