ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్. డ్రినిక్ ఆండ్రాయిడ్ ట్రోజన్ కొత్త వెర్షన్ వెలుగులోకి వచ్చింది. డ్రినిక్ అనేది పాత మాల్వేర్. ఈ వైరస్ మీ ఫోన్ స్క్రీన్ రికార్డింగ్‌లతో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకులకు సంబంధించి పిన్, సీవీవీ నంబర్లను తస్కరిస్తుంది. ఇప్పటికే 18 భారతీయ బ్యాంకులు ఈ వైరస్ భారిన పడినట్లు సమాచారం. ఈ మాల్‌వేర్ పట్ల అప్రమత్తం ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది.
వార్నింగ్: పాత వైరస్, కొత్త వెర్షన్..
ఏపీకే(APK) ఫైల్‌తో ఎస్‌ఎంఎస్(SMS) పంపడం ద్వారా యూజర్లను డ్రినిక్ లక్ష్యంగా చేసుకున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇది iAssist అనే యాప్‌తో వచ్చింది. భారత్ ఆదాయపు పన్ను శాఖ అధికారిక పన్ను నిర్వహణ టూల్ మాదిరిగానే పనిచేస్తుంది. ఆదాయపు పన్ను రీఫండ్‌ల పేరుతో వినియోగదారలు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంది. 2016 లో వార్తల్లో నిలిచిన ఈ వైరస్ కొంత కాలం గ్యాప్ తీసుకుని ఆధునిక టెక్నాలజీ సామర్థ్యంతో అదే మాల్వేర్ లేటస్ట్ వెర్షన్ మళ్లీ దాడికి సిద్ధమైంది. భారత్‌లో యూజర్లను, 18 నిర్దిష్ట భారతీయ బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది.
ప్రస్తుతం ఉన్న ఈ బ్యాంకులలో, ఎస్‌బీఐ (SBI) వినియోగదారులను డ్రినిక్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, కొన్ని ఆఫ్షన్స్‌తో అనుమతులు మంజూరు చేయమంటుంది. అలా అనుమతించిన యూజర్ల ఫోన్లలో ఎస్‌ఎంఎస్‌లను పొందడం, చదవడం, పంపడం, కాల్ లాగ్‌ను చదవడం, ఔట్ స్టోరేజీ చదవడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారుకు తెలియకుండానే నిర్దిష్ట విధులను నిర్వహించే అవకాశాన్ని పొందుతుంది. యాప్ నావిగేషన్, రికార్డ్ స్క్రీన్, కీ ప్రెస్‌లను క్యాప్చర్ చేయగలదు. యాప్ అన్ని అనుమతులతో పాటు దానికి కావలసిన ఫంక్షన్‌లకు యాక్సెస్‌ను పొందగానే వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంది.
జాగ్రత్త అవసరం
థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌ల నుంచి లేదా SMS ద్వారా ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర (Google Play Store) లేదా యాపిల్ (Apple) యాప్ స్టోర్‌లో యాప్‌లను చెక్ చేయాలి. వాస్తవానికి ప్రాథమిక విధులను నిర్వహించేందుకు అన్ని యాప్‌లకు అనుమతి అవసరం లేదు. కానీ తెలియని యాప్‌కు ఎస్‌ఎంస్, కాల్స్‌కు సంబంధించిన అనుమతులను ఇవ్వకపోవడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment