danger
-
చలికాలంలో గీజర్లు వాడుతున్నారా ? జాగ్రత్తలు పాటించండి! లేదంటే ముప్పే!
ప్రస్తుతం చలి పులి పంజా విసురుతోంది. బారెడు పొద్దెక్కినా మంచంమీద నుంచి లేవాలంటే వణుకు పుడుతోంది. మరి ఈ చలినుంచి తప్పించుకోవాలంటే రూం హీటర్లు, గీజర్లు వాడడం అనివార్యమనే చెప్పాలి. అయితే ఇటీవల గీజర్లకు సంబంధించి కొన్ని విషాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గీజర్ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవేంటో చూద్దాం. గీజర్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉత్తమ బ్రాండ్లను మాత్రమే ఎంచుకోవాలి. అంతేకాదు తొందరంగా నీళ్లు వేడెక్కాలంటే నాణ్యమైన గీజర్లను వాడాలి. గీజర్‌ను ఆన్ చేసి, స్నానం చేయడం కాకుండా, నీళ్లను బకెట్లో నింపుకొని, గీజర్ ఆఫ్ చేసిన స్నానానికి వెళ్లాలి. దీని కరెంట్ ఆదా అవుతుంది. ప్రమాదాలను చాలావరకు నివారించే అవకాశం ఉంది.గీజర్ ఎక్కువ సమయం ఆన్‌లో ఉండటం అంత మంచిదికాదు.అలాగే ఆటో కట్ఆఫ్ ఉన్న గీజర్లను ఎంచుకోవాలి. పొరపాటున గీజర్ ఆన్ చేసి మర్చిపోతే, పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. గీజర్లను తడి తగలకుండా ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. గీజర్‌కు గోడకు మధ్య ఖాళీ ఉండాలి.గీజర్‌లో ప్రెషర్ ఎక్కువ అయితే ఆ ఒత్తిడిని విడుదల చేయడానికి గీజర్‌లో వాల్వ్ ఉంచారో లేదో చెక్ చేసుకోవాలి. వాల్వ్‌లో ఏదైనా లోపం ఉందేమో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. -
ఆ మలుపులో ఎన్నో ప్రమాదాలు!
భూదాన్ పోచంపల్లి: అసలే ఇరుకు రోడ్డు.. దానిపై ప్రమాదకరంగా మూల మలుపు.. దాని పక్కనే చెరువు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పురంలో శనివారం కారు చెరువులో బోల్తా కొట్టిన ప్రాంతం దుస్థితి ఇది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, పక్క నే చెరువు ఉన్నట్టు ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేక, ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాహనాలు చెరువులోకి దూసుకెళ్లాయి. పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలతో నిత్యం రద్దీ ఉన్నా..పోచంపల్లి పర్యాటక కేంద్రం, చేనేతకు ప్రసిద్ధికావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేవారు వస్తుంటారు. వాహనాల రద్దీ ఉంటుంది. అయితే ఈ రోడ్డుపై జలాల్పురం చెరువు కట్ట వద్దకు రాగానే ఇరువైపులా పెద్ద మూల మలుపులు ఉన్నాయి. ఇరువైపులా చెట్లు, పొదలు పెరిగి, ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చేంత వరకు సరిగా కనిపించవు. చెరువుకు రక్షణ గోడ కూడా లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి మూల మలుపుల సమీపంలో సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని... చెట్లు, పొదలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శనివారం ధర్నా కూడా చేశారు. చెరువు సమీపంలో మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఎన్నో ప్రమాదాలు జరిగినా ఎవరికీ పట్టింపులేదని జలాల్పురం గ్రామానికి చెందిన పాలకూర్ల జంగయ్య మండిపడ్డారు.చెరువులోకి దూసుకెళ్తున్న వాహనాలు⇒ ఈ ఏడాది జూలై 17న ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.⇒2023 జూలై 24న చెరువు కట్టపై పండ్ల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. అదే ఏడాది డిసెంబర్లో జరిగిన ప్రమాదంలో ప్రశాంత్ అనే యువకుడు మృతిచెందాడు.⇒ 2020 జూలై 24న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన జింక వంశీ, తన స్నేహితులతో కలిసి పోచంపల్లి మండలం రాంలింగంపల్లిలోని బంధువులకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వస్తుండగా... ఇదే మలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. వంశీ మృతిచెందగా, మిగతావారు బయటపడ్డారు.⇒ 2020 జూన్ 26న చెరువు కట్ట మలుపు వద్ద ఎదురెదురుగా వచ్చిన కారు, బైక్ ఢీకొన్నాయి. కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఇక పదుల సంఖ్యలో ద్విచక్రవాహనలు అదుపుతప్పి చెరువులో పడి చాలా మంది గాయాలపాలయ్యారు. -
Delhi Pollution: కమ్మేసిన పొగమంచు.. ప్రమాదస్థాయిలో కాలుష్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈరోజు(బుధవారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 339గా నమోదైంది. దీనికితోడు చలి వాతావరణం నెలకొంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గింది.ఢిల్లీ ఎన్సీఆర్లో గాలి నాణ్యత నిరంతరం క్షీణిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధానిలో గాలి నాణ్యత బుధవారం కూడా ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. గాలి నాణ్యత 301 నుండి 400 మధ్య ఉన్నప్పుడు జనం శ్వాసకోశ వ్యాధులకు లోనవుతారు. ఇదేవిధంగా ఏక్యూఐ 401 నుండి 500 మధ్య ఉన్నప్పుడు తీవ్రమైన కాలుష్యం కమ్మేసినట్లు పరిగణిస్తారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో మంగళవారం ఉదయం 7:30 గంటలకు సగటు గాలి నాణ్యత సూచిక 355గా నమోదైంది. ఇది చాలా పేలవమైన కేటగిరీలోకి వస్తుంది. సోమవారం ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ 347గా నమోదైంది. ఇదిలావుండగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఢిల్లీ సెక్రటేరియట్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు హీటర్లను పంపిణీ చేశారు. చలి మంటలను వేస్తే కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం హీటర్లను పంపిణీ చేసిదని తెలిపారు. ఇది కూడా చదవండి: రాష్ట్రంలో రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ప్లాంట్లు -
డెస్క్ జాబ్ చేస్తున్నారా, ప్రమాదం పొంచివుంది : ఈ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయండి!
డెస్క్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ పని గంటలు కూర్చునే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోతుంటుంది. చెయిర్లో కూర్చుని చేసే అనుకూలమైన వ్యాయామాలను సాధన చేయడం వల్ల పొట్ట భాగం ఫిట్‌గా అవుతుంది. దీంతో పాటు వెన్నుకు, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు ఇవి...సీటెడ్ లెగ్ లిఫ్ట్స్: కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. కుర్చీ సీటు భాగాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. పాదాలను నేలకు ఆనించి, మోకాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఒక కాలిని నేలకు అలాగే ఉంచి, మరొక కాలును పైకి ఎత్తాలి. కుర్చీ సీటుకు సమంగా ఉండేలా కాలిని ఎత్తి, కొన్ని సెకన్లు ఉంచి, తిరిగి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత మరో కాలును కూడా అదే విధంగా చేయాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగం బలంగా అవుతుంది. చెయిర్‌కు ఉన్న హ్యాండిల్స్‌ను చేతులతో పట్టుకొని, దానిపైన కూర్చోవాలి. మోకాళ్లను మడిచి, ఛాతీ వరకు తీసుకొని, పాదాలను కుర్చీకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. మోకాళ్లను కొన్ని సెకన్ల పాటు అదే పొజిషన్లో ఉంచాలి. దీని వల్ల పొట్ట కింది భాగం కండరాలు ఫిట్‌గా అవుతాయి. అదనపు కొవ్వు తగ్గుతుంది. ఆబ్లిక్యూ ట్విస్ట్: చెయిర్లో నిటారుగా కూర్చొని, రెండు చేతులతో తలకు రెండువైపులా సమాంతరంగా, భుజాలను నిటారుగా ఉంచాలి. అదే భంగిమలో ఉండి, ఒకసారి కుడి వైపుకి తిరిగి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. మరోసారి ఎడమ వైపుకు తిరిగి కొన్ని సెకన్లు ఉండాలి. నడుము భాగంలో ఉన్న కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. సీటెడ్ క్రంచెస్: చెయిర్ పైన కూర్చొని, దాని హ్యాండిల్స్‌ను బలంగా పట్టుకొవాలి. కాళ్లను, వెన్నును నిటారుగా ఉంచి, చెయిర్ మీద నుంచి కొద్దిగా అదే భంగిమలో పైకి లేవాలి. కొన్ని సెకన్లలో తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు, పై భాగం కండరాల పనితీరులో వేగం పెరుగుతుంది. టో టచెస్: చెయిర్ మీద కూర్చొని పాదాలను నిటారుగా నేలకు ఉంచాలి. నడుము భాగాన్ని వంచుతూ తలను మోకాళ్లవైపుగా తీసుకువచ్చి, చేతులను పాదాలకు ఆనించాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి, తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం ద్వారా శరీరానికి స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది.సీటెడ్ బైస్కిల్ పెడల్స్: చెయిర్లో ముందుకు వచ్చి కూర్చోవాలి. పూర్తి బ్యాలెన్స్ చూసుకొని, కాళ్లను సైకిల్ పెడల్ తొక్కినట్టుగా కదలికలు చేయాలి. ఈ వ్యాయామ లక్ష్యం కాలి కండరాలకు బలం చేకూర్చడం అని దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనన్ని సార్లు ఈ వ్యాయామం చేయచ్చు. -
ఢిల్లీలో డేంజర్ బెల్స్.. గాలి పీల్చితే సమస్యలే
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఆదివారం(నవంబర్ 3) ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 500 పాయింట్లుగా నమోదై కాలుష్య తీవ్రత రికార్డు స్థాయికి వెళ్లింది. కాలుష్యానికి తోడు ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఏక్యూఐ 507 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏక్యూఐ 500 పాయింట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి 65 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే శనివారం రాత్రి 9 గంటలకు 327గా ఉన్న ఏక్యూఐ కేవలం 12 గంటల్లో ఆదివారం ఉదయానికల్లా 500 పాయింట్లు దాటడం ఢిల్లీ వాసులను కలవరపరుస్తోంది.ఇదీ చదవండి: విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ -
ఢిల్లీ.. 72 గంటలు డేంజర్
న్యూఢిల్లీ: రాబోయే 72 గంటలు దేశ రాజధాని ఢిల్లీకి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొగమంచు కమ్ముకుంటోంది. వాయు నాణ్యత సూచిక ప్రతిరోజూ 300 దాటుతోంది. ఈరోజు (అక్టోబరు 29) ఉదయం ఏక్యూఐ 274గా నమోదయ్యింది. ఢిల్లీలో గాలి నాణ్యత రానున్న మూడు రోజుల్లో మరింత విషపూరితం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi: A thin layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.(Visuals from India Gate) pic.twitter.com/XeCku3Hu1k— ANI (@ANI) October 29, 2024ఇప్పటి వరకు వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల వాయుకాలుష్యం పెరిగిందని, అయితే రానున్న రోజుల్లో పటాకులు పేల్చడం వల్ల వాయుకాలుష్యం పెరగనుందని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం పటాకులను నిషేధించినప్పటికీ కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయి. రాజధానిలో గ్రేప్-1, గ్రేప్-2 నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు.#WATCH | Delhi | AQI around Lodhi Road and surrounding areas recorded 255, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/rYZboXTtYN— ANI (@ANI) October 29, 2024సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాలోని వివరాల ప్రకారం సోమవారం ఆగ్నేయ గాలుల కారణంగా ఢిల్లీ కాలుష్య స్థాయి కాస్త మెరుగుపడింది. అయితే దీపావళి నాటికి ఢిల్లీలో రెట్టింపు కాలుష్యం ఏర్పడే అవకాశాలున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 304 (చాలా పేలవంగా ఉంది). సాయంత్రం 6 గంటలకు 299గా ఉండగా, రాత్రి 10 గంటలకు 288కి చేరుకుంది. #WATCH | Delhi | AQI around ITO and surrounding areas recorded 261, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/FvG2oZGgJB— ANI (@ANI) October 29, 2024ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
వందేళ్ల వంతెన చాన్నాళ్లు 12 ఏళ్ల వంతెనకు నూరేళ్లు
నిజాం కాలంలో వందేళ్ల క్రితం ఖమ్మం మున్నేరుపై రాతి కట్టడంగా నిర్మించిన బ్రిడ్జి 36.9 అడుగుల మేర వరదను తట్టుకుని నిలబడింది. అదే మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద పదేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి స్పాన్ మాత్రం పక్కకు జరిగింది. భారీ వరదతో బ్రిడ్జి స్పాన్ బేరింగ్ పైనుంచి పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 1న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు మున్నేరుకు భారీగా వరద వచి్చంది. 36.9 అడుగుల మేర వరద ప్రవాహం ఆరు గంటలపాటు కొనసాగింది. ఈ వరద ప్రవాహంతోనే బ్రిడ్జి స్పాన్ బేరింగ్ల పైనుంచి పక్కకు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని గంటలు వరద ఇలాగే కొనసాగితే బ్రిడ్జికి ముప్పు వాటిల్లేదని నిపుణులు చెబుతున్నారు. – ఖమ్మం మయూరి సెంటర్పదిలంగా వందేళ్ల బ్రిడ్జి.. అనేకసార్లు భారీగా వరదల తాకిడి తగిలినా ఎక్కడా తొణుకు లేకుండా ఖమ్మం కాల్వొడ్డు వద్ద నిర్మించిన బ్రిడ్జి పదిలంగా నిలిచింది. నిజాంల కాలంలో రాతితో కట్టిన ఈ బ్రిడ్జి వద్ద పలుసార్లు 30 అడుగులకు పైగా వరద ప్రవహించినా చెక్కుచెదరలేదు. గత పదేళ్లుగా బ్రిడ్జి పని అయిపోయిందని, వందేళ్లు దాటినందున ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అధికార యంత్రాంగం, ప్రజలు చర్చించుకుంటున్నా.. సగర్వంగా నిలవడం విశేషం. కాగా, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై ఎస్12 స్పాన్ పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూడో బ్రిడ్జిగా నిర్మాణం.. హైదరాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, కోదాడ, విజయవాడ ప్రాంతాల వైపు నుంచి ఖమ్మం నగరంలోకి వచ్చేందుకు మున్నేరుపై మూడు వంతెనల నిర్మాణం జరిగింది. 110 ఏళ్ల క్రితం నిజాం కాలంలో కాల్వొడ్డు వద్ద ఒక బ్రిడ్జి.. కరుణగిరి వద్ద రెండు దశాబ్దాల క్రితం మరో బ్రిడ్జి నిర్మించారు. నానాటికీ రద్దీ పెరగడంతో 2010లో ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరుపై మూడో బ్రిడ్జి నిర్మాణానికి నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2013లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాగా.. గత ఏడాది 30.7 అడుగులు, ఈనెల 1న 36.9 అడుగుల మేర వరద వచి్చంది. తాజా వరదతో బ్రిడ్జి నాణ్యత వెలుగులోకి వచి్చందన్న చర్చ జరుగుతోంది. -
భద్రాచలం వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/ధరూరు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో శుక్రవారం రాత్రికి మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. గోదావరికి ఎగువన ఉన్న మహా రాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు కాళేశ్వరం, సమ్మక్క బ్యారేజీ వద్ద నుంచి పెరిగిన వరద గోదావరికి చేరుతుండగా నీటిమట్టం తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. గురు వారం రాత్రి 11 గంటలకు 48.10 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం ఉదయం 8గంటలకల్లా తగ్గి 46.90 అడు గులకు చేరింది.దీంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కానీ ఆతర్వాత పెరుగుతూ రాత్రి 9:15 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, వరదతో ముంపు గ్రామాల రైతులు పంట కాలం ఆలస్యమవుతుందని ఆందోళన చెందుతుండగా.. రహదా రుల పైకి నీరుచేరి ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రవాణా స్తంభించింది. నిలకడగా జూరాలజూరాల ప్రాజెక్టులో వరద నిలకడగా కొనసాగుతోంది. శుక్రవా రం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టుకు 2,65,000 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 36 క్రస్టు గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,30,283 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 19,668 క్యూసెక్కులు, భీమా, నెట్టంపాడు, కుడి, ఎడమ కాల్వలకు కలిపి మొత్తం 2,53,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
భారత్‌లో బ్రెయిన్-ఈటింగ్ డిసీజ్ కలకలం
భారత్‌లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ కలకలం రేగింది. మెదడును తినే అమీబా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్‌కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)అని పిలుస్తారు.ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరినప్పుడు, నాలుగు రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ నలుగురు మరణించారు. అయితే.. దీనికి ముందు కూడా మన దేశంలోని వివిధ ఆసుపత్రులలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి బారినపడి కేరళ, హర్యానా, చండీగఢ్‌లలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. వీటిలో ఆరు మరణాలు 2021 తర్వాత నమోదయ్యాయి. కేరళలో మొదటి కేసు 2016లో వెలుగులోకి వచ్చింది.అప్రమత్తమైన కేరళ ప్రభుత్వంఅమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ నివారణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ కూడా మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని, చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున వారు నీటి వనరులలోకి ప్రవేశించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ చేసే సమయంలో నోస్ క్లిప్‌లను ఉపయోగించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ వేణు, ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజన్ ఖోబ్రగాడే తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ కొరియాలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు
దక్షిణ కొరియాలో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు బువాన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. ఈ వివరాలను వాతావరణ శాఖ మీడియాకు తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైనట్లు పేర్కొంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ దక్షిణ కొరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే. అయితే ఈ భూకంపం కారణంగా నష్టం వాటిల్లినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదు. నార్త్ జియోల్లా ప్రావిన్స్‌లోని అగ్నిమాపక శాఖ అధికారి జో హే-జిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపానికి సంబంధించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి సుమారు 80 కాల్స్ వచ్చాయన్నారు. ఈ భూకంపం కారణంగా బువాన్లో ఓ ఇంటి గోడ కూలిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.భూకంపాలను వాటి తీవ్రత పరంగా వివిధ వర్గాలుగా విభజిస్తారు. 2.5 నుండి 5.4 తీవ్రతతో వచ్చే భూకంపాలు మైనర్ కేటగిరీలో ఉంటాయి. 5.5 నుండి 6 తీవ్రతతో వచ్చే భూకంపం స్వల్ప స్థాయిలో ప్రమాదకరమైన భూకంపంగా పరిగణిస్తారు. 6 నుండి 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లయితే, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 7 నుండి 7.9 తీవ్రతతో సంభవించే భూకంపాలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. -
బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!
బొటాక్స్ ఇంజక్షన్‌ను ముఖంపై ముడతలు తగ్గించడానికి తీసుకుంటారు. ఇదిచర్మం ముడతలు పడడానికి కారణమైన ధమనులను ఇది నాశనం చేస్తుంది. అలాంటి బొటాక్స్ ఇంజెక్షన్ వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తారు. ఇక్కడొక మహిళ మైగ్రేన్ కోసం బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకోవడమే శాపమై ప్రాణాంతకంగా మారింది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం కోసం బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకుంది. అలా తీసుకుందో లేదో కొద్ది క్షణాల్లోనే మరణం అంచులకు చేరువయ్యేలా ఆమె పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. తీవ్ర పక్షవాతంతో కనీసం తల కూడా పైకెత్తలేని స్థితిలో అచేతనంగా మారిపోయింది. తన నోటిలోని లాలాజలమే ఆమెను ఉక్కిబిక్కిరి చేసేలా ఉంది ఆమె స్థితి. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. ఈ బొటాక్స్ ఇంజెక్షన్ కారణంగా మెడ కండరాల పక్షవాతానికి గురయ్యింది. దీంతో కనీసం చూడలేకపోవడ, మాట్లాడలేకపోవడం, మింగకపోవడం, తలను కదపలేకపోవడం తదితర ఘెరమైన సమస్యలను ఫేస్ చేసింది. చెప్పాలంటే చనిపోతానేమో అనుకుంది. ఈ బొటాక్స్ ఇంజెక్షన్ అధికమవ్వడం వల్ల లేక మరేదైన కారణమో గానీ, ఇది ఆమె శరీరంపై తీవ్ర ప్రభావం చూపి మెడ, ముఖం భాగాల్లోని నరాల నాశనం చేసింది. ఆస్పత్రిలో చేరి కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందింది. ఆ తర్వాత 18 రోజులకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆమె రక్తనాళాల గోడలు, కీళ్లు, చర్మంలోని బంధన కణజాలాన్ని ప్రభావితం చేసే వారసత్వ రుగ్మత అయిన ఎహ్లర్స్-డాన్లోస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. అయితే ఆమె ప్రస్తుతం బెటర్‌గా కోలుకుంటుందన్నారు. కానీ ఆమె సక్రమంగా తినడానికి, తాగడానికి, నడవడానికి, మాట్లాడటానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని వైద్యులు చెప్పారు. ఈ బొటాక్స్‌తో చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు గానీ, ఈ మహిళలా ఇంతలా తీవ్ర పరిస్థితిని ఎదుర్కొనలేదని అన్నారు. అందుకే ఆమె కేసుపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు వైద్యులు. కాగా, సదరు బాధిత మహిళ తాను ఎదుర్కొన్న ఈ భయానక పరిస్థితిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా అయ్యింది. బొటాక్స్ ప్రమాదకరమా? బోట్యులస్' అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థమే ఈ బోటాక్స్. ఈ బ్యాక్టీరియాను తొలిసారిగా 18వ శతాబ్దంలో పాడైపోయిన సాసేజ్‌ల మీద కనుగొన్నారు. లాటిన్లో సాసేజ్‌ను బోట్యులస్ అంటారు. ఇది బోట్యులైనమ్ టాక్సిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థం. కొన్ని చెమ్చాల బోట్యులైనమ్ టాక్సిన్ ఒక దేశ జనాభానే చంపగలదు. కొన్ని కిలోల బొటాక్స్ ఈ భూమి మీద నివసిస్తున్న సమస్త జనాభానూ సర్వనాశనం చేయగలదు. బోట్యులైనమ్ టాక్సిన్ మనిషి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్లో న్యూరోటాక్సిన్ ఉంటుంది. అంటే ఇది నరాల్లోకి ప్రవేశించి, కీలకమైన ప్రొటీన్లను నాశనం చేస్తుంది. నరాలకు, కండరాలకు మధ్య సంబంధాన్ని హరిస్తుంది. కొత్తగా నరాల చివర్లు పెరిగితే తప్ప మళ్లీ కండరాల పనితీరు బాగుపడదు. దీనికి కొన్ని నెలల సమయం పడుతుంది. దేనికి ఉపయోగిస్తారంటే.. బొటాక్స్‌ను సౌందర్య సాధనంగానే కాక అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా కూడా వాడతారు. మెల్లకన్ను తొలగించేందుకు, మైగ్రిన్స్ (తీవ్రమైన తలనొప్పులు) తగ్గించేందుకు, అధిక చెమట నుంచి విముక్తి కలిగించేందుకు, మూత్రాశయ ఇబ్బందులను తొలగించేందుకు కూడా వాడతారు. చెప్పాలంటే దాదాపు 20 కన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలకు చికిత్సలో భాగంగా బోటాక్స్ వాడతారని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా..) -
గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్‌వార్ ముప్పు? భారీ పోలీసు బందోబస్తు!
దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలోగల సంతోష్ మ్యారేజ్ గార్డెన్లో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడి, లేడీ డాన్ అనురాధల వివాహం నేడు (మార్పి 12) జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయితే గ్యాంగ్‌వార్ ముప్పును దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్ గార్డెన్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అతిథులను బార్ కోడ్ ద్వారా గుర్తించి, ప్రవేశం కల్పించనున్నారు. మ్యారేజ్ గార్డెన్లో పలు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మ్యారేజ్ హాల్ చుట్టూ ఉన్న రోడ్లను కూడా ఎప్పటికప్పుడు సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాలుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు ఈ వివాహంపై దృష్టి పెట్టాయి. గ్యాంగ్ వార్ ముప్పు దృష్ట్యా సంతోష్ గార్డెన్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు, దుకాణాలను పోలీసులు మూసివేయించారు. రెండు రోజుల క్రితం ఐదుగురు షూటర్లను పోలీసులు మ్యారేజ్ గార్డెన్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాలా జఠేడికి పలు ముఠాల నుండి ముప్పు ఉంది. వాటిలో బంబిహా గ్యాంగ్ పేరు మొదట వినిపిస్తుంది. బంబిహా గ్యాంగ్‌కి చెందిన షూటర్లు కాలా జఠేడితో పాటు అతని గ్యాంగ్‌పై దాడి చేయడానికి నిత్యం వెదుకుతుంటారని పోలీసులు దగ్గర సమాచారం ఉంది. గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్ల వివాహ వేదికను పూలతో అందంగా అలంకరించారు. అతిథులు కూర్చునేందుకు అద్భుతమైన సోఫాలను ఏర్పాటు చేశారు. అతిథుల విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. VIDEO | Tight security for gangster Sandeep alias Kala Jathedi's marriage with "history-sheeter" Anuradha Choudhary alias 'Madam Minz' in #Delhi. The Delhi Police has made a strategic plan to avert any incident of gang-wars or possibility of Sandeep's escape from custody,… pic.twitter.com/9YQPB9950U — Press Trust of India (@PTI_News) March 12, 2024 -
ఈ ఫుడ్స్ తింటే అంతే..షాకింగ్ స్టడీ! టాక్స్ విధించండి బాబోయ్!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ప్రమాదకరమన్న తాజా సంచలన నివేదికల నేపథ్యంలో అటువంటి ఆహారాలపై పన్ను విధించాలంటూ మహారాష్ట్రలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, మనస్తత్వ వేత్తలతోకూడిన సంఘాలు కేంద్ర వినియోగ దారుల వ్యవహారాల మంత్రి, ఆహార మంత్రికి విన్నవించాయి. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు , కొవ్వుతో కూడిన అధిక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై పన్ను విధించాలని కోరుతూ ఎర్లీ చైల్డ్‌హుడ్ అసోసియేషన్ (ECA) , అసోసియేషన్ ఫర్ ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (APER), కేంద్రమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాయి. తద్వారా పాఠశాలల్లో చాక్లెట్లు, కేకులు, కుకీలు , పుట్టినరోజులు మరియు ఈవెంట్ల వంటి ఇతర వస్తువుల వినియోగం, పంపణీ ఆగిపోతుందని నమ్ముతున్నారు. ఈ పదార్థాల స్థానంలో తాజాపండ్లను చేర్చుకోవాలని కూడా ప్రజల్ని, పాఠశాలల్ని కోరారు. వీరి డిమాండ్లు ♦ అన్ని ఫుడ్ చెయిన్స్, రెస్టారెంట్లు మెనూలు, ప్యాకేజింగ్ , ప్రతీ బాక్సుపైనా ఉప్పు-చక్కెర-కొవ్వు శాతం వివరాలను తప్పనిసరిగా ప్రింట్ చేయాలి. ఉప్పు-చక్కెర-కొవ్వుతో సహా వీటి స్థాయి ఎక్కువుంటే ఎరుపు రంగు, మధ్యస్థానికి గుర్తుగా కాషాయం, తక్కువగా ఉంటే ఆకుపచ్చ రంగుల లేబులింగ్ ఉండాలి. ♦ బ్రాండ్ పేరు లేదా రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌తో రెస్టారెంట్లు విక్రయించే బర్గర్లు, పిజ్జాలు, టాకోలు, డోనట్స్, శాండ్విచ్లు, పాస్తా, బ్రెడ్ ఫిల్లింగ్‌లపై పరోక్ష కొవ్వు కంటెంట్ పన్ను 14.5 శాతం విధించాలి. ♦ చక్కెరపై ఆరోగ్య పన్నును ప్రవేశపెట్టాలి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం చాలా ప్రమాదకరమని, ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని సైంటిస్టులు ఇటీవల హెచ్చరించారు. వీటితో ప్రాణాలకే ప్రమాదం వస్తుందని ఇటీవల అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏకంగా 32 రకాల ప్రమాదకర వ్యాధులు వస్తాయని కూడా వెల్లడించారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కోటి మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యాయంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతో వస్తున్న ముప్పుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటీష్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మానసిక, శ్వాసకోశ , హృదయ, జీర్ణకోశ సమస్యలు వస్తాయని, మొత్తం 32 ప్రమాదకర వ్యాధులు వస్తాయి. మరణాలు సంభవించిన కేసులు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. అంతేకాదు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌తో 50 శాతం పెరుగుతుందని కూడా హెచ్చరించారు. డిప్రెషన్ 22 శాతం అధికంగా పెరిగే అవకాశం ఉందట. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌లో విటమిన్లు, పీచు తక్కువ, ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి, అందుకే కేన్సర్, గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యం తోపాటు, మెటబాలిజంకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని ఈ స్టడీ పేర్కొంది. -
ఆ గుహలోకి వెళ్తే అంతే సంగతులు..!
ఎన్నో గుహలు చూసుంటారు. గుహ అన్వేషకులు వాటన్నింటి చూసుండొచ్చు కానీ ఈ గుహ జోలికి మాత్రం పోయుండరు. ఎందుకంటే వెళ్తే తిరిగి రావడం అంటూ లేని వింత గుహ. ఆ గుహను బయటి నుంచే చూస్తే హడలిపోతాం. ఇక లోపలకి వెళ్లే సాహసం చేస్తే ఇంక అంతే సంగతులు. ఆ గుహ ఎక్కడుందంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన గుహ. జార్జియాలోని నల్లసముద్ర తీరానికి చేరువలో ఉన్న ఈ గుహ మృత్యుగుహగా పేరుమోసింది. క్రాస్నోయార్స్క్కు చెందిన గుహాన్వేషకులు కొందరు దీనిని 1968లో తొలిసారిగా గుర్తించారు. వెరియోవ్కినా అనే ఈ గుహ 7,293 అడుగుల లోతు ఉంటుంది. బయట నిలబడి దీని లోపలకు చూపు సారిస్తే, లోపలంతా చీకటిగా భయంగొలిపేలా కనిపిస్తుంది. దాదాపు గడచిన యాబై ఏళ్లలో ముప్పయిసార్లు గుహాన్వేషకులు ఈ గుహ లోపలి చివరి వరకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడంతో దీనికి మృత్యుగుహ అనే పేరు స్థిరపడింది. పలుసార్లు ఈ గుహలో గుహాన్వేషకుల మృతదేహాలు బయటపడ్డాయి. చివరిసారిగా 2021లో సెర్జీ కోజీవ్ అనే రష్యన్ గుహాన్వేషకుడి మృతదేహం ఈ గుహలో మూడువేల అడుగుల లోతు వద్ద కనిపించగా, దానిని వెలికితీశారు. గుహ లోపల దిగువకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోతాయి. ఈ పరిస్థితుల్లో అడుగు భాగానికి చేరుకునే ప్రయత్నంలో హైపోథెర్మియాకు లోనై గుహాన్వేషకులు మరణిస్తున్నారని, తగిన జాగ్రత్తలు లేకుండా, ఈ గుహ అడుగుభాగానికి చేరుకోవాలని ప్రయత్నించడమంటే కోరి చావును కొని తెచ్చుకోవడమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: వావ్!..వాట్ ఏ డ్రై ఫ్రూట్ జ్యువెలరీ!) -
కోవిడ్‌ను మించిన వ్యాధి మనల్ని కబళిస్తుందా?
మొన్నటి వరకూ ప్రపంచాన్ని కోవిడ్-19 వణికించింది. దీని నుంచి కాస్త దూరవుతున్నామనేంతలోనే ఇప్పుడు మరొక ప్రాణాంతక వ్యాధి సమస్త మానవాళిని చుట్టుముట్టేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపించగల ఈ కొత్త వ్యాధికి ‘డిసీజ్ ఎక్స్’ అనే పేరు పెట్టారు. కరోనా మాదిరిగానే ఈ వ్యాధి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రాణాలను కూడా మింగేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లోనే ఈ వ్యాధి పేరును మొదటిసారి ప్రకటించింది. భవిష్యత్తుకు ముప్పుగామారిన ఈ వ్యాధి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించింది. 2019లో కోవిడ్-19 వేగంగా వ్యాపించడం వల్ల అనేక దేశాలలో బాధితులకు సహాయం చేయడానికి తగినంత మంది వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ కోవిడ్-19 ప్రపంచానికి పెద్ద సమస్యగానే ఉంది. కొందరు శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్ వ్యాధి నుంచి మానవాళిని రక్షించేందుకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ అనే గ్రూప్ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత వ్యాక్సిన్లను తయారీ సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనాలకు అందని డిసీజ్ ఎక్స్ డిసీజ్ ఎక్స్ ఎంత ఘోరంగా ఉండనుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంచనావేయలేకపోతున్నారు. ఇది తేలికపాటి జలుబు మాదిరిగా ఉండవచ్చు లేదా కోవిడ్-19 కంటే చాలా ప్రాణాంతకం కావచ్చని వారు భావిస్తున్నారు. ఏ సూక్ష్మక్రిమి దీనికి కారణంగా నిలుస్తున్నదో, దానిని ఏ విధంగా కనుగొనాలో, ఎటువంటి చికిత్స అందించాలో వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. అందుకే ఈ వ్యాధి విషయంలో అప్రమత్తత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ డ్రాప్స్ ద్వారా వ్యాధి వ్యాపించవచ్చు. బాధితుడు తాకిన వస్తువులపై నిలిచిన సూక్ష్మక్రిములు ద్వారానూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి క్రిములను మోసే కీటకాల నుంచి కూడా వ్యాప్తి చెందవచ్చంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. జంతువుల నుంచి.. డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు తదితర జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహాజనిత వ్యాధి. దీని కారణంగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి కానుంది. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న పలు వైరస్లు గతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డిసీజ్ ఎక్స్ సోకినపుడు బాధితునికి జ్వరం, నరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధి వ్యాపిస్తే కోవిడ్‌ను మించిన ప్రమాదం వాటిల్లవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రతీఒక్కరూ పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. -
2023లో విపత్తులకు నిలయమైన రాష్ట్రం ఏది?
2023 ఉత్తరాఖండ్‌కు ప్రమాదాల సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో పలు భారీ ప్రమాదాలు జరిగాయి. 2023 ప్రారంభం నుండి చివరి వరకు ఏదో ఒక విపత్తు చోటుచేసుకుంటూనే ఉంది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌కు అనేక చేదు అనుభవాలను మిగిల్చింది. ఏడాది ప్రారంభంలోనే జోషిమఠ్‌లో భూమి కుంగిపోయిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టివేసింది. 2023 జనవరిలో చమోలి జిల్లా జోషిమఠ్‌లోని ఇళ్లు, రోడ్లకు అకస్మాత్తుగా భారీ పగుళ్లు కనిపించాయి. కుంగిపోతున్న జోషిమఠ్ అందరినీ కలవరానికి గురి చేసింది. ఈ వార్త దేశ విదేశాల్లో కూడా పతాక శీర్షికల్లో నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లోని చమోలీలో నమామి గంగే ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా విద్యుదాఘాతానికి గురై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన నేపధ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం అందించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి హైవేపై నుంచి బస్సు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. నవంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణించారు. దీపావళి రోజున ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు వారిని 17 రోజుల తరువాత ర్యాట్ హోల్ మైనర్స్ బయటకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం చూతము రారండి! -
డేంజర్ యాప్స్.. మీ ఫోన్లో ఇప్పుడే తొలగించండి..
వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్ యాప్‌లను గూగుల్ ఇటీవల తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్(ESET) ఈ ఏడాది గూగుల్ ప్లేస్టోర్‌లో 18 లోన్ యాప్‌లను స్పైలోన్ యాప్‌లుగా గుర్తించింది. కోట్లాది డౌన్లోడ్స్ ఉన్న ఈ లోన్‌యాప్‌లు వినియోగదారుల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్‌లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తెలియజేశారు. ఈ యాప్‌లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈసెట్ గుర్తించిన 18 డేంజర్ యాప్‌లలో 17 యాప్‌లను గూగుల్ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్ స్థితిలో లేదు. గూగుల్ ప్లేస్టోర్‌లో తొలగించిన ఈ యాప్‌ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్ ఫోన్లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. డేంజర్ యాప్స్ ఇవే.. ఏఏ క్రెడిట్ (AA Kredit) అమోర్ క్యాష్ (Amor Cash) గేయబాక్యాష్ (GuayabaCash) ఈజీ క్రెడిట్ (EasyCredit) క్యాష్‌వావ్ (Cashwow) క్రెడిబస్ (CrediBus) ఫ్లాష్‌లోన్ (FlashLoan) ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito) ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash) గో క్రెడిటో (Go Crédito) ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo) కార్టెరా గ్రాండే (Cartera grande) రాపిడో క్రెడిటో (Rápido Crédito) ఫైనప్ లెండింగ్ (Finupp Lending) ఫోర్‌ఎస్ క్యాష్ (4S Cash) ట్రూనైరా (TrueNaira) ఈజీ క్యాష్ (EasyCash) ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే.. -
మీడియాకు ముప్పుగా మారిన దేశమేది? 17 నెలల్లో ఎంతమంది బలయ్యారు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరులతో పాటు, కొందరు జర్నలిస్టులు కూడా మృతిచెందారు. అయితే ఇలాంటి పరిస్థితులు లేనప్పటికీ ఫిలిప్పీన్స్‌లో పలువురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఈ దేశంలో హత్యకు గురైన జర్నలిస్టుల జాబితాలోకి మరో పేరు చేరింది. తాజాగా రేడియో బ్రాడ్‌కాస్టర్ ఒకరు స్టూడియోలో తుపాకీ కాల్పులకు బలయ్యారు. గడచిన 17 నెలల్లో ఫిలిప్పీన్స్‌లో నలుగురు మీడియా సిబ్బంది హత్యకు గురయ్యారు. కాలాంబా మునిసిపాలిటీ ప్రతినిధి కెప్టెన్ డియోర్ రాగోనియా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 57 ఏళ్ల రేడియో బ్రాడ్‌కాస్టర్ జువాన్ జుమలోన్‌కు చెందిన స్టూడియోలోకి చొరబడిన సాయుధ దుండగుడు అతని తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జుమాలోన్ మృతి చెందాడు. ‘డీజే జానీ వాకర్’గా పేరొందిన జుమాలోన్.. మిండానావోలోని తన నివాసంలోని స్టూడియోలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం ఆగంతకుడు పరారయ్యాడు. ఈ ఘటన స్టూడియోలోని సీసీ కెమెరాలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ హత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఈ కేసులో నేరస్తులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులపై దాడులను సహించబోమని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారి చర్యలు తీసుకుంటామని మార్కోస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్(ఎన్‌యుజేపీ) తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది జూన్‌లో ఫెర్డినాండ్ మార్కోస్ అధికారం చేపట్టిన తర్వాత ఫిలిప్పీన్స్‌లో నలుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఫిలిప్పీన్స్ మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు -
ఇంకా ముప్పు తప్పలేదు: నేపాల్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక!
నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 132 మంది మృతి చెందారు. లెక్కకు మించిన జనం గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌తో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కనిపించింది. నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో ఇది మూడో భూకంపం. భూకంపం ముప్పు ఇంకా తప్పలేదని, అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నేపాల్‌లో మరోమారు భూకంపం సంభవించవచ్చని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ మాజీ భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. గతంలోనూ పలువురు శాస్త్రవేత్తలు హిమాలయ ప్రాంతంలో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించవచ్చని అంచనా వేశారు. భారత టెక్టోనిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతుండటంతో అది యురేషియన్ ప్లేట్‌ను ఢీకొననుంది. ఫలితంగా హిమాలయాలపై ఒత్తిడి ఏర్పడి, అనేక భూకంపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాబోయే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎనిమిది కంటే ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు సంభవిస్తుందో చెప్పలేమని అంటున్నారు. ఇది కూడా చదవండి: నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి? -
నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయంటే..
హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్‌లో మరోసారి భూమి కంపించింది. ఈ విపత్తులో 70 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావం భారతదేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా కనిపించింది. నేపాల్‌లో గతంలోనూ అనేక భూకంపాలు సంభవించాయి. 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపంలో ఎనిమిది వేల మంది మృత్యువాతపడ్డారు. అయితే నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి? శాస్త్రవేత్తలు దీనిపై ఏమంటున్నారు? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపాల్ భౌగోళిక స్వరూపమే తరచూ భూకంపాలు సంభవించడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేపాల్‌లో 17 శాతం ప్రాంతం మాత్రమే మైదానం. మిగిలిన ప్రాంతంలో పర్వతాలు, అడవులు ఉన్నాయి. నేపాల్ ఉత్తర చివరలో ఎత్తయిన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. నేపాల్ తరచూ భూకంపాలకు ఎందుకు గురవుతుందో తెలసుకోవాలంటే ముందుగా భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. భూమి అనేది భారీ టెక్టోనిక్ ప్లేట్లతో రూపొందింది. భూమిలోపలి ఈ టెక్టోనిక్ ప్లేట్లు వివిధ పరిస్థితుల కారణంగా కదులుతూ ఉంటాయి. అలాగే ఒకదానికొకటి ఢీకొంటాయి. నేపాల్.. రెండు భారీ టెక్టోనిక్ ప్లేట్ల అంచున ఉంది. నేపాల్ ఇండో-ఆస్ట్రేలియన్, యురేషియన్ ప్లేట్ల మధ్య ఉంది. ఈ రెండు ప్లేట్లు ఢీకొన్నప్పుడు నేపాల్‌లో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ రెండు ప్లేట్లు ప్రతి సంవత్సరం ఐదు సెంటీమీటర్ల చొప్పున ఒకదానిపైకి మరొకటి ఎక్కేలా కదులుతున్నాయి. ఫలితంగా నేపాల్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. ఐదు సెంటీమీటర్ల వేగం చిన్నదిగా అనిపించినప్పటికీ, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు పలకల తాకిడి కారణంగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయని చెబుతారు. నేపాల్‌కు ఉన్న మరో పెద్ద సమస్య అక్కడి బలహీనమైన భవనాలు. ఇవి బలమైన భూప్రకంపనలను తట్టుకోలేవు. భూకంపం వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే.. -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్ షాప్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్ శర్మ ఆవిష్కరించారు. -
వండటానికి ముందే చికెన్‌ని కడగొద్దు! శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా చికెన్‌ని వండటానికి ముందే శుభ్రంగా కడుతాం. ఇది సర్వసాధారణం. అలా అస్సలు చేయొద్దంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ అలవాటును తక్షణమే మానుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్టితుల్లోను కడగొద్దని తేల్చి చెప్పారు. పైగా కడగకుండానే వండేయాలంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఏంటిది కడగకుండా నేరుగా వండేయడమా? ఇది నిజమా..! అని నోరెళ్లబెట్టకండి. ఔను! మీరు వింటుంది నిజమే! చికెన్‌ని కడగకుండా వండేయడమే మంచిదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. వారి జరిపిన తాజా అధ్యయనంలో దీని గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ పరిశోధనల్లో చాలామంది చికెన్‌ని వండటానికి ముందే కడుతున్నట్లు తేలిందట. దాదాపు 25% మంది చికెన్‌ని ముందే కడిగేస్తున్నారని గుర్తించామని అన్నారు. అధ్యయంనంలో ఇలా చేస్తే కలిగే నష్టాలు గురించి.. విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఆహారం వల్ల కలిగే అనారోగ్యానికి సంబంధించి.. క్యాంపిలో బాక్టర్, సాల్మోనెల్లా అనే రెండు ప్రధాన బ్యాక్టీరియాలు కారణమని తెలిపారు. ఔ అవి సాధారణంగా పౌల్ట్రీ మాంసంలో కనిపిస్తాయని అన్నారు. అందువల్ల మాంసాన్ని పచ్చిగా ఉన్నప్పుడే కడగడం వల్ల ప్రతిచోట ఆ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని, దీని కారణంగా వ్యాధుల ప్రబలే ప్రమాదం ఎక్కువవుతుందని పరిశోధనల్లో తెలిపారు. ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన కేసులు ఆస్ట్రేలియాలో గత రెండు దశాబ్దాల్లో రెట్టింపు అయ్యినట్లు వెల్లడించారు. ఏడాదికి ఈ బ్యాక్టీరియాకు సంబంధించి సుమారు 2 లక్షల కేసుల్లో.. దాదాపు 50 వేల కేసుల దాక కోడి మాంసంకి సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తున్నాయని చెప్పారు. కడిగిన చికెన్ కారణంగా ఉపరితల నీటి బిందువుల నుంచి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే కుళాయిల నీటితో ఫాస్ట్ ఫోర్స్‌తో చికెన్‌ని కడగడంతో ఆ బ్యాక్టీరియా ఆ చెందిన నీటి బిందువల నుంచి మరింతగా వ్యాపిస్తాయని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అధ్యయనంలో నీటి ప్రవాహ రేటు తోపాటు బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే శాతం కూడా పెరగడం గుర్తించినట్లు వెల్లడించారు. అందువల్ల చికెన్‌ని పూర్తిగా ఉడికించి కడగడం లేదా వేడినీళ్లతో కడిగి వండటం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. (చదవండి: మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..షాక్‌లో కూతురు) -
అప్రమత్తత అవసరం
మరపునపడిందనుకున్న ఆ పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మనిషి మెదడును దెబ్బ తీసే ప్రాణాంతక నిపా వైరస్ (ఎన్ఐవీ) మరోసారి దేశంలో జడలు విప్పుతోంది. వస్తూనే కేరళలో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకొని, పాజిటివ్ వచ్చిన మరికొందరి ఆరోగ్యాన్ని అయోమయంలోకి నెట్టి, సన్నిహితంగా మెలిగిన మరో 800 మందిపై వైద్యపర్యవేక్షణ పెట్టాల్సిన పరిస్థితి తెచ్చింది. వీరిలో 77 మంది ప్రమాదస్థితిలో ఉన్నారనీ, వైరస్ సోకినవారిలో 155 మంది ఆరోగ్య కార్యకర్తలూ ఉన్నారనీ వస్తున్న వార్త ఆందోళన పెంచుతోంది. నిపా సోకితే సహాయక చికిత్సే తప్ప, రోగాన్ని తగ్గించే మందులు కానీ, నివారించే టీకా కానీ ఇప్పటిదాకా లేకపోవడమే పెద్ద సమస్య. కోళిక్కోడ్ జిల్లాలోని 9 గ్రామ పంచాయతీలను ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, స్కూళ్ళు – ఆఫీసులు – ప్రజారవాణాకు సెలవిచ్చి, సభలూ సమావేశాలపై నియంత్రణలు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేరళలో మొదలైన ఈ ప్రకంపనలు ఇప్పుడు దేశం మొత్తాన్నీ అప్రమత్తం చేస్తున్నాయి. కలుషిత ఆహారం, రోగితో సాన్నిహిత్యం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించడం నిపా వైరస్ స్వభావం. 1998లో తొలిసారిగా మలేసియా, సింగపూర్లలో పందుల పెంపకందార్లలో, వాటితో సన్నిహితంగా మెలిగే ఇతరుల్లో ఈ వైరస్ తొలిసారి బయటపడింది. అప్పట్లో 300 పైచిలుకు మందికి వైరస్ సోకితే, వంద మందికి పైగా మరణించారు. ఆపై అది వేలాది మైళ్ళు ప్రయాణించి, వివిధ దేశాలకు విస్తరించడం, వైరస్ సోకినవారిలో 72 నుంచి 86 శాతం మంది మరణించడం సంచలనమైంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందుల శరీరద్రవాల ద్వారా మనుషుల కిది వ్యాపిస్తుందట. నిపా సోకితే జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, వాంతులతో మొదలై పరిస్థితి తీవ్రమైతే మెదడువాపు, మూర్ఛలతో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. 1998 – 2015 మధ్య 600కు పైగా కేసులు వచ్చాయని అది లెక్క తేల్చింది. ఈ మాయదారి వైరస్ మన దేశంలో పంజా విసరడం ఇదేమీ తొలిసారి కాదు. గడచిన అయి దేళ్ళలో ఇది నాలుగోసారి. మెదడు మీద దాడి చేసే ఈ అనారోగ్య భూతం 2018 మేలో మొదటిసారి వచ్చినప్పుడు దానిని కట్టడి చేసేలోగా వైరస్ సోకిన 23 మందిలో 21 మంది మరణించారు. ఆ తరువాత 2019, 2021ల్లో కూడా కేరళ తీరాన్ని ఈ వైరస్ తాకింది. మలబారు సీమలో బయటపడ్డ ఈ తాజా నిపా కేసులకు బంగ్లాదేశ్ వేరియంట్ కారణమని గుర్తించారు. మిగతావాటితో పోలిస్తే ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువే అయినా, సోకినవారిలో సగటున నూటికి 70 మంది మరణిస్తున్నారన్న గణాంకాలు గుబులు రేపుతున్నాయి. రోగులకు సన్నిహితంగా మెలిగినవారు ఐసొలేషన్‌లోకి వెళ్ళడం, జనమంతా మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి కార్యాచరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గబ్బిలపు వైరస్ పదేపదే విరుచుకు పడే ప్రమాదం ఎక్కువని మేలో రాయిటర్స్ పరిశోధన తేల్చింది. విచ్చలవిడిగా అడవుల నరికివేత, ఇష్టారాజ్యపు పట్టణీకరణ, ఫలితంగా వన్యప్రాణులతో మానవ సంఘర్షణ – వీటన్నిటి పర్యవసానం ఇదని ఆ పరిశోధన గుర్తించింది. ఇక, మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా 8 రాష్ట్రాల్లోని గబ్బిలాల్లో ఈ ప్రాణాంతక వైరస్ ఛాయలున్నట్టు ఈ ఏడాది జూలైలో భారతీయ వైద్య పరిశోధనా మండలి అధ్యయనం సైతం నిర్ధరించింది. అయితే, కేరళపైనే తరచూ ఈ వైరస్ దాడికి కారణం – జనసాంద్రత, భౌగోళిక పరిస్థితులు, వానలంటూ రకరకాల ప్రచారాలున్నాయి. కచ్చితమైన కారణా ల్నింకా కనిపెట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి కేంద్ర బృందం కేరళ వెళ్ళి సంక్షోభంలో సాయపడుతోంది. నిపాకు ప్రధాన కారణమని భావిస్తున్న ఫ్రూట్ బ్యాట్స్ (పండ్లను కొట్టే గబ్బిలాల) సంఖ్య కేరళలో ఎక్కువైతే కావచ్చు కానీ, వాటి నిర్మూలన కుదరదు. కాబట్టి, ఒకేచోట, ఒకేలా కాకపోయినా ఏటా నిపా వైరస్ ముప్పు తప్పదని గ్రహించి, కేరళ సహా అన్ని రాష్ట్రాలూ జాగ్రత్తపడాలి. జంతువుల నుంచి మానవులకు సోకే ఇలాంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల ఆనుపానులు పసిగట్టేందుకు మహమ్మారులపై పరిశోధన అవసరం. కానీ, కేరళే కాదు... కేంద్రం కూడా నిపాపై తగినంత శ్రద్ధ చూపలేదనే చెప్పాలి. పుణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తరహాలో తిరువనంతపురంలో అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పినా, అది ఇప్పటికీ పూర్తిగా కార్యాచరణలోకి దిగలేదు. అంతకంతకూ పెరుగు తున్న సాంక్రమిక వ్యాధుల రీత్యా తక్షణమే ఆ సంస్థ సేవలపై దృష్టి సారించాలి. 2018 నిపా తాకి డిలో, తర్వాత కరోనా కాలంలో సమర్థనీయంగా పనిచేసిన కేరళ మరోసారి కృతనిశ్చయం చూపాలి. ఇప్పటి వరకు ఇండియా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్ లాంటి ఆసియా దేశాలకే ఈ వైరస్ పరిమితమైంది. ప్రపంచంలోని ఇతర దేశాలకు ఇది విస్తరించకపోవడం అదృష్టమే. కానీ, భవిష్యత్తులో విస్తరించదనే నమ్మకం ఏమీ లేదు. వైరస్ల విజృంభణలు, ప్రాణాంతక రోగాలు... ప్రపంచానికి కొత్త కాకపోవచ్చు. అయితే, చికిత్స లేని రోగాలు, వైరస్‌లపై శాస్త్రీయ పరిశోధనలతో ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా నిపా కేసులు గుర్తుచేస్తున్నాయి. నిన్న కాక మొన్న కరోనా కట్టడిలో అలాంటి పోరే మానవాళికి మేలు చేసిందని మరచిపోరాదు. అయితే, అందుకై పరిశోధన – అభివృద్ధి విభాగానికి కావాల్సిన వనరుల్ని అందించడం తక్షణ అవసరం. ఈలోగా చేతుల శుభ్రత, మాస్కుధారణ, స్వచ్ఛమైన ఆహారాన్నే భుజించడం సదా ఆరోగ్యమనీ, అది మన చేతుల్లోని పని అనీ అందరం గుర్తించాలి. ఎందుకంటే... చికిత్స కన్నా నివారణ, భయం కన్నా అప్రమత్తతే పరమౌషధం! -
అంతా క్షణాల్లో జరిగిపోయింది.. సముద్రంలోకి జారి పడిన యువతి, చివరికి
ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే బయట ప్రాంతాలకు వెళ్లి జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇటీవల ఓ యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కొందరు పీర్ స్లిప్‌వేపై ఆడుకుంటూ ఉంటారు. సముద్ర అలలు వస్తూ పోతూ ఉండగా వారు దాన్ని ఆనందిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి చోట ఆటలే కాదు అజాగ్రతగా ఉన్నా ప్రమాదమే అని తెలియక వాళ్లు అక్కడ గంతులెస్తుంటారు. అకస్మాత్తుగా, ఊహించని విధంగా ఒక బలమైన కెరటం అందులోని ఓ యువతిని తాకింది. దీంతో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలోకి వెళ్లిపోయింది. ఒడ్డుకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కెరటాల ధాటికి యువతి చేరుకోలేకపోతుంది. చివరికి ఆమెను కాపాడేందుకు సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాలకు ఎదురెళ్లి ఓ వ్యక్తి బాలికను రక్షించగలిగాడు. ఈ ప్రమాదం నుంచి బయటక పడిన యువతికి స్వల్ప గాయలయ్యాయి. నార్త్ డెవాన్ కౌన్సిల్ అత్యవసర హెచ్చరికతో పాటు ట్విట్టర్లో ఈ వీడియోని షేర్ చేసింది. సముద్రం తీరం వద్ద అధిక ఆటుపోట్లు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను కోరింది. "సముద్రంలోని అలలు పరిస్థితులు బట్టి మారుతుంటాయ్.. కొన్ని సార్లు ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయి,. కాబట్టి దయచేసి తీరం వెంబడి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. Sea conditions can be changeable and volatile, so please be mindful along the coast. This incident took place at Ilfracombe Harbour on Thursday evening and could have been much more serious were it not for quick-thinking members of the public. pic.twitter.com/TA7r9Itz83 — North Devon Council (@ndevoncouncil) August 8, 2023 -
‘కడెం’ కష్టమే.. ప్రాజెక్టు నిర్వహణపై చేతులెత్తేసిన నీటిపారుదలశాఖ
సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. నిర్వహణతో నెట్టుకురాలేమని, తరచూ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, గేట్లు మొరాయిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి దిగువకు 3.82 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉన్నా, గతేడాది జూలై 13న రికార్డు స్థాయిలో 5,09,025 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ప్రాజెక్టు ఎత్తు 700 అడుగులు కాగా అప్పట్లో ప్రాజెక్టుపై నుంచి 706 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. గతనెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టుపై నుంచి 702 అడుగుల ఎత్తులో వరద పారింది. గేట్ల మొరాయింపుతోనే సమస్య గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు పంపించడం సాధ్యం కావడం లేదు. టాప్‌సీల్ గేట్ల కారణంగా వీటి నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. గతేడాది వచ్చిన వరదలకు 4 గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలడం సాధ్యం కాలేదు. మళ్లీ ఆ గేట్లకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. గత నెలలో వ చ్చి న వరదల సమయలోనూ మరో 4 గేట్లు మొరాయించడంతో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గేట్లకు అప్పటికప్పుడు మరమ్మతులు చేసి పైకి ఎత్తగలిగారు. మరో గేటుకు తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు. చివరి గేటుకు మరమ్మతులు సాధ్యం కాలేదు. గేట్ల విడి భాగాలు లభించడం లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించుకోవాలనుకున్నా, వీటి డిజైన్లు, డ్రాయింగ్స్ అందుబాటులో లేవు. కడెం ప్రాజెక్టు 18 గేట్లను పైకి ఎత్తడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. అయితే కడెం నదిపరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో గంట వ్యవధిలో కడెం ప్రాజెక్టుకు గత నెలలో 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. మూడు చోట్ల పగుళ్లు.. ప్రాజెక్టు గేట్ల మధ్య పిల్లర్ తరహాలో ఉంటే కట్టడాన్ని పీయర్స్ అంటారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మూడు పీయర్స్‌కు అర్ధ అంగుళం నుంచి అంగుళం నిడివితో పగుళ్లు వచ్చాయి. వీటికి సిమెంట్ మిశ్రమంతో మూసి గ్రౌటింగ్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. భవిష్యత్‌లో ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తే పగుళ్లు వచ్చిన పీయర్స్ ఉధృతిని తట్టుకోవడం కష్టమేనని, అకస్మాత్తుగా కొట్టుకుపోతే దిగువన ఉన్న గ్రామాలు నీటమునిగే ప్రమాదముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుఫ్తీ కడితే పెద్దగా ప్రయోజనం ఉండదు.. ఎగువ పరీవాహక ప్రాంతంలో కుఫ్తీ డ్యాం నిర్మిస్తే కడెం ప్రాజెక్టుపై వరద ఉధృతి తగ్గుతుందని గతంలో నీటిపారుదల శాఖ భావించింది. అయితే కుఫ్తీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెంపై పెద్దగా వరద ఒత్తిడి తగ్గదని, ఎగువ నుంచి వచ్చే వరదను ముందస్తుగా అంచనా వేసేందుకు అవసరమైన సమయం మాత్రం లభిస్తుందని తాజాగా నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఆధునీకరణ ప్రతిపాదనలు ఇలా.. కొత్తగా రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాలి. అదనంగా 1.5 లక్షల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా డిజైన్ చేయాలి. అదనపు గేట్లు, కొత్త స్పిల్‌వే నిర్మించాలి. గతేడాది డ్యామ్ సేఫ్టీ అండ్ రిçహాబిలేషన్ ప్రోగ్రామ్(డీఎస్ఆర్పీ) కింద నిపుణులతో అధ్యయనం చేయించినా ఇదే సూచనలు చేసినట్టు సమాచారం. -
ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న..
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు. రష్యా పశ్చిమప్రాంతంలోని ఫెడరేషన్ ఆఫ్ షెల్యాబిన్స్క్లో దక్షిణ యూరల్ పర్వత సానువుల సమీపంలో ఉంది. ఈ సరస్సు పేరు కరాచే. ఇది మరీ అంత పెద్దది కాదు. కేవలం 900 మీటర్ల పొడవున విస్తరించిన ఈ సరస్సు ఒకచోట సన్నగా, ఇంకోచోట వెడల్పుగా కాస్త అడ్డదిడ్డంగా ఉంటుంది. అత్యధిక వెడల్పు గల ప్రదేశంలో దీని వెడల్పు 500 మీటర్లు. సాధారణంగా మొసళ్లతో నిండిన సరస్సులోకి అడుగు పెడితేనే ప్రమాదం. కాని, ఈ సరస్సు ఒడ్డున నిలుచున్నా ప్రమాదమే! ఇది పూర్తిగా రేడియో ధార్మిక వ్యర్థాలతో నిండిపోయి ఉండటమే దీనికి కారణం. ఇదివరకు ఈ సరస్సు సమీపంలోనే ఒక అణుకేంద్రం ఉండేది. అక్కడి వ్యర్థాలన్నీ ఈ సరస్సులోకి చేరడంతో ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక రేడియో ధార్మికత గల సరస్సుగా 1951లోనే ఈ సరస్సు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. అప్పట్లో ఇక్కడ ఉన్న అణుకేంద్రం నుంచి వెలువడిన ప్లూటోనియం–239, యురేనియం–235 ఐసోటోప్స్ ఈ సరస్సులోకి చేరాయి. ఇవి అణ్వాయుధాల్లో ఉపయోగించే రకానికి చెందినవి. ఈ సరస్సుకు దిగువన ఉండే 24 గ్రామాలకు ఇదొక్కటే మంచినీటి వనరుగా ఉండేది. ఈ గ్రామాల్లో రేడియో ధార్మికత పెరగడంతో జనాలు వాటిని ఖాళీ చేశారు. దీని పరిసరాల్లోనూ గాలిలోకి కూడా తీవ్రస్థాయిలో రేడియో« దార్మికత చేరుతోంది. అమెరికన్ శాస్త్రవేత్తలు 1992లో ఈ సరస్సు ఒడ్డున గాలిలో ఉన్న రేడియో ధార్మిక ప్రభావంపై పరిశోధన చేశారు. ఇక్కడ నిలుచుంటే, గంటకు 5.6 సీవర్ట్‌ల రేడియో ధార్మిక ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇది ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలంలో ప్రాణాంతకంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. (చదవండి: ఈ సరస్సు ఒడ్డున నిలుచున్నా ప్రమాదమే!) -
Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన..
అమెరికా: అమెరికాలో ఒక అమ్యూజ్మెంట్ పార్కులో జనంతో ఉన్న ఒక రోలర్ కోస్టర్, రైడ్ జరుగుతుండగా సాంకేతిక లోపం తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారు తలకిందులుగా వేలాడుతూ ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని దాదాపు 3 గంటలపాటు నరకయాతన చూశారు. చాలామందికి రోలర్ కోస్టర్ రైడ్ అంటే మహా సరదా. గాల్లో గింగిరాలు తిరుగుతూ చేసే ఈ స్వారీ సాగుతున్నంత సేపు మహదానందాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే ఇలాంటి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే నష్టాన్ని కూడా ఊహించలేము. ముఖ్యంగా యాంత్రికంగా ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు దేవుడిమీద భారం వేయడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అచ్చంగా అలాంటి భయానకమైన సంఘటన ఒకటి అమెరికాలోని క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్లో చోటు చేసుకుంది. రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతుండగా సాంకేతిక సమస్య ఏర్పడటంతో కోచ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో స్వారీ చేస్తున్నవారు తలకిందులుగా వేలాడుతూ ఊపిరిని బలంగా బిగపట్టి మూడు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ క్షణంలో పరిస్థితి ఏమాత్రం పట్టు తప్పినా దారుణం జరిగుండేదని సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగిపోయిన రోలర్ కోస్టర్ లో ఎనిమిది మంది ఉండగా అందులో ఏడుగురు చిన్నారులేనని సహాయక బృందం వెంటనే స్పందించి వారిని సురక్షితంగా కిందకు దించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపారు. మెకానికల్ సమస్య కారణంగానే రోలర్ కోచ్ మధ్యలో ఆగిపోయిందని.. విస్కాన్సిన్ బృందం ఇటీవలే ఇక్కడ తనిఖీలు కూడా చేశారని, అయినా ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, ఇంతకు మించి మా వద్ద ఎటువంటి సమాచారం లేదని ఈ ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. Eight people hung upside down for about three hours, stuck in a roller coaster-like attraction. Emergency happened at a festival in American Wisconsin. Local media write that seven of the eight stranded are children. According to preliminary data, everyone got off with fright. pic.twitter.com/OP3Ow3syQZ — Sasha White (@rusashanews) July 4, 2023 ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే.. -
‘ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. దేశానికి మరో ముప్పు ఉంది’
కోలారు(బెంగళూరు): ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తరువాత దేశానికి మరో ప్రమాదం పొంచి ఉందని కోడిమఠం శివానంద శివయోగి స్వామి తెలిపారు. ఆయన తరచూ జోస్యాలు చెబుతూ ఉండడం తెలిసిందే. గురువారం తాలూకాలోని సుగటూరు గ్రామంలోని యోగి నారాయణస్వామి మఠాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో చెప్పినట్లుగా ఈసారి రాష్ట్రంలో పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వం వచ్చింది. అదే విధంగా ఈ సంవత్సరం పెద్ద ప్రమాదం సంభవిస్తుందని తెలిపిన విధంగానే ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆపై దేశానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని అన్నారు. కై వార తాతయ్య మళ్లీ పుట్టి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. అలాంటి సూచనలు ఇప్పటికే కొండ ప్రాంతంలో కనిపించిందన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత దారి తప్పితే ప్రభుత్వానికి ప్రమాదమని తెలిపారు. చదవండి: పట్టాలు తప్పిన ఊటీ టాయ్ ట్రైన్ -
భారతదేశంలోని టాప్ 10 అత్యంత నేరాలు జరిగే నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత నేరాలు జరిగే నగరాలు
-
ఎండలో బండి నడుపుతున్నారా? జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్టే
రాత్రికి వంద రూపాయల పెట్రోల్ వేయించా... మాములుగా అయితే బండి రోజులు నడుస్తుంది. అలాంటిది ఒక్క రోజుకే పెట్రోల్ నిల్ అని చూపుతోందని సురేష్ ఆందోళన చెందాడు. ఈ సమస్య సురేష్ ఒక్కడిదే కాదు... జిల్లా వ్యాప్తంగా వాహనాలు వినియోగిస్తున్న అందరి అనుభవం. వేయించున్నా పెట్రోల్ ఏంమైంది? పెట్రోల్ బంకులోనే తక్కువగా వేస్తున్నారా? లేదా ఎవరైనా దొంగలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవేవి కాదని నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండల వేడికి వాహనాల్లోని పెట్రోల్ ఆవిరవుతుండడమే కారణంగా విశ్లేషిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి హిందూపురం: అసలే వేసవికాలం... గతంలో ఎన్నడూ లేనంతగా సూరీడు భగభగ మంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి తరుణంలో వాహనాలను ఎక్కడబడితే అక్కడ ఎండలో ఉంచేస్తే పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం. వాహనదారులు వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కొత్త సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నెలాఖరు నుంచి మే మాసం లోపు 43.1 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్క్‌కు చేరుకోవడంతో ఎండ వేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరైతే ద్విచక్ర వాహనాలు లేదా, కార్లలో అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలను ఎండలో ఎక్కడబడితే అక్కడే ఆపేస్తున్నారు. దీంతో ఎండ వేడిమికి ఆయా వాహనాల్లోని ఇంధనం ఆవిరైపోతోంది. ఇది ఒక్కోసారి అగ్నిప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్కింగ్ జోన్లు లేక అవస్థలు.. జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కదిరి మున్సిపాల్టీలతో పాటు పంచాయతీ కేంద్రాల్లో పార్కింగ్ జోన్లు లేక వాహదారులు అవస్థలు పడుతున్నారు. కాయగూరలకు ఇతర అవసరాలకు వాహనాల్లో వెళ్లినప్పుడు ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధనం ఆవిరై పోతుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల 2,77,235 వాహనాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోని 139 పెట్రోలు బంకుల్లో గతంలో రోజు వారీ 139 వేల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయాలు సాగేవి. వేసవి ఆరంభం నుంచి ఇది పెరుగుతూ వస్తోంది. తాజాగా 210 వేల లీటర్ల మార్క్‌ను చేరుకుంది.వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎండ వేడిమికి పెట్రోల్ ట్యాంకుల్లో గ్యాస్ ఏర్పడి పేలిపోయే ప్రమాదముంది. రాత్రి పూట బైక్‌ను నిలిపి ఉంచినప్డుపు ఓ సారి ట్యాంక్ మూత తీసి మళ్లీ మూసి వేయాలి. మందపాటి సీటు కవర్లు వాడడం మంచిది. పెట్రోల్ ట్యాంకులను సైతం కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయడం ఉత్తమం. – షాజహాన్, మెకానిక్, హిందూపురం -
ఒక్క బైక్‌పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. దిమాక్ ఉందా..?
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో కొందరు యువకులు అత్యంత ప్రమాదకర విన్యాసం చేశారు. ఒక్క బైక్‌పై ఏకంగా ఐదుగురు ప్రయాణించారు. రాత్రి వేళలో రద్దీగా ఉన్న రోడ్డుపై రయ్ రయ్‌మంటూ ఈ బైక్ వేగంగా దూసుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బైక్ నడిపిన యువకుడితో మిగతా నలుగురిలో ఏ ఒక్కరూ కూడా కనీసం హెల్మెట్ ధరించలేదు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు వీరి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌పై ముగ్గురు ఎక్కితేనే ప్రమాదాల బారినపడుతుంటారు, అలాంటిది ఐదుగురు ఎలా ఎక్కారు? అని పలువురు మండిపడ్డారు. शौक़....मनमानी....मजबूरी या फिर जान पर खेलने की आदत....एक बाइक पर फर्राटा भरते 5 युवक....!!#viralvideo राजधानी लखनऊ का।#himanshutripathi @Uppolice @lkopolice @uptrafficpolice @dcptrafficlko pic.twitter.com/m6rLT9VQhc — Himanshu Tripathi (@himansulive) April 9, 2023 ఈ వయసులో సరదా పనులు చేయచ్చు కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ప్రమాదకర విన్యాసాలు చేయడం ఏంటి? మైండ్ ఏమైనా దొబ్బిందా? అని మరికొందరు ఫైర్ అయ్యారు. పొరపాటున ఎదైనా జరిగితే మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచించారా? అని మరికొందరు వీరిని ప్రశ్నించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ఘటనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ఇలాంటి దుస్సాహసాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు.. నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్.. -
ప్రమాదం వారసత్వ రాజకీయాలకే.. ప్రజాస్వామ్యానికి కాదు!: అమిత్ షా
కౌశాంబి: వారసత్వ రాజకీయాలు, కులవాదానికే ప్రమాదం తప్ప దేశ ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కులతత్వం, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు అనే మూడు అల్సర్లతో కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్యాన్ని చుట్టుముట్టిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ మూడింటినీ తొలగించి వేసినందుకే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భయపడుతోందని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ యూకేలో ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు బదులిచ్చారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ‘కౌశాంబి మహోత్సవ్’ను ప్రారంభించి, అనంతరం జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తమ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడిందనే ఒకే ఒక్క కారణంతో పార్లమెంట్ సమావేశాలను సవ్యంగా సాగనీయని కాంగ్రెస్‌ను దేశం క్షమించదని అమిత్ షా ఆరోపించారు. ఎటువంటి కార్యకలాపాలు, చర్చ లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగియడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంలోని నిబంధనల ప్రకారమే రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయిందని ఆయన చెప్పారు. ఒక్క రాహుల్ గాంధీయే కాదు, ఈ చట్టం కింద ఇప్పటి వరకు 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వాలు రద్దయ్యాయన్నారు. చట్టానికి లోబడి నడుచుకుని, హైకోర్టులో అనర్హత వేటు నుంచి బయటపడాలని రాహుల్‌కు సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రధాని మోదీని 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. -
టీడీపీ కార్యాలయం వద్ద ప్రమాదం
మంగళగిరి: గుంటూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద శుక్రవారం బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ర్యాలీగా ఇక్కడకి వచ్చారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు మద్యం మత్తులో ఇష్టానుసారంగా బాణసంచా కాల్చారు. దీంతో అక్కడ ఉన్న బాణసంచాకు అంతటికీ నిప్పు రవ్వలు అంటుకుని ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంగళగిరిలోని మార్కండేయ కాలనీకి చెందిన తాడిశెట్టి చెన్నయ్య, తాడిశెట్టి వెంకటేశ్వర్లు, నంబూరుకు చెందిన కారు డ్రైవర్ కొడాలి షణ్ముఖ, కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కేసర గ్రామానికి చెందిన ఎస్కే హుస్సేన్ సాహెబ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం చినకాకాని ఎన్నారై వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో చెన్నయ్య, వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కార్యాలయం వద్ద ర్యాలీ అదుపుతప్పడం, కార్యకర్తలు మద్యం సేవించి ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. -
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రోడ్డెక్కిన విపక్షాలు..ఢిల్లీలో ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్ని రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు బ్యానర్లు చేతపట్టుకుని పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీలు చేపట్టారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్రతో వస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారం, రాహుల్ గాంధీ అరెస్టు తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం విపక్షాలన్ని ఆందోళనకు దిగాయి. ఈ మేరకు ఈ అంశంపైనే శుక్రవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ఉభయల సభల్లో ఆందోళనకు దిగడంతో ఎలాంటి చర్చలు జరగకుండానే సభలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోనే నిరసనలు చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలు..విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్వైపుకు ర్యాలీ ప్రదర్శనలు చేపట్టాయి. అయితే పోలీసులు ర్యాలీలకు అనుమతి లేదంటూ వారిని అదుపులో తీసుకున్నారు. దీంతో విజయ్ చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదీగాక గత కొంతకాలంగా అదానీ హిండెన్‌బర్గ్ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడమే గాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావాలని కోరుతున్నాయి. ఐతే దీనిపై పార్లమెంట్లో చర్చ జరగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విపక్ష ఆరోపిస్తున్నాయి. పైగా దీని నుంచి దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌పై అరెస్టు వంటి ఎత్తుగడలను ఉపయోగిస్తుందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటుందంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. Democracy in danger.. We stand in support with #RahulGandhi.pic.twitter.com/848QlEQcVt — WB Youth Congress (@IYCWestBengal) March 24, 2023 (చదవండి: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు.. ప్రకటించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్) -
వార్నింగ్: ఆ వైరస్ కొత్త వెర్షన్‌తో వచ్చింది, ఇలా చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!
ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్. డ్రినిక్ ఆండ్రాయిడ్ ట్రోజన్ కొత్త వెర్షన్ వెలుగులోకి వచ్చింది. డ్రినిక్ అనేది పాత మాల్వేర్. ఈ వైరస్ మీ ఫోన్ స్క్రీన్ రికార్డింగ్‌లతో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకులకు సంబంధించి పిన్, సీవీవీ నంబర్లను తస్కరిస్తుంది. ఇప్పటికే 18 భారతీయ బ్యాంకులు ఈ వైరస్ భారిన పడినట్లు సమాచారం. ఈ మాల్వేర్ పట్ల అప్రమత్తం ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. వార్నింగ్: పాత వైరస్, కొత్త వెర్షన్.. ఏపీకే(APK) ఫైల్‌తో ఎస్ఎంఎస్(SMS) పంపడం ద్వారా యూజర్లను డ్రినిక్ లక్ష్యంగా చేసుకున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇది iAssist అనే యాప్‌తో వచ్చింది. భారత్ ఆదాయపు పన్ను శాఖ అధికారిక పన్ను నిర్వహణ టూల్ మాదిరిగానే పనిచేస్తుంది. ఆదాయపు పన్ను రీఫండ్ల పేరుతో వినియోగదారలు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంది. 2016 లో వార్తల్లో నిలిచిన ఈ వైరస్ కొంత కాలం గ్యాప్ తీసుకుని ఆధునిక టెక్నాలజీ సామర్థ్యంతో అదే మాల్వేర్ లేటస్ట్ వెర్షన్ మళ్లీ దాడికి సిద్ధమైంది. భారత్‌లో యూజర్లను, 18 నిర్దిష్ట భారతీయ బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఈ బ్యాంకులలో, ఎస్బీఐ (SBI) వినియోగదారులను డ్రినిక్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, కొన్ని ఆఫ్షన్స్‌తో అనుమతులు మంజూరు చేయమంటుంది. అలా అనుమతించిన యూజర్ల ఫోన్లలో ఎస్ఎంఎస్లను పొందడం, చదవడం, పంపడం, కాల్ లాగ్‌ను చదవడం, ఔట్ స్టోరేజీ చదవడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారుకు తెలియకుండానే నిర్దిష్ట విధులను నిర్వహించే అవకాశాన్ని పొందుతుంది. యాప్ నావిగేషన్, రికార్డ్ స్క్రీన్, కీ ప్రెస్‌లను క్యాప్చర్ చేయగలదు. యాప్ అన్ని అనుమతులతో పాటు దానికి కావలసిన ఫంక్షన్లకు యాక్సెస్‌ను పొందగానే వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంది. జాగ్రత్త అవసరం థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి లేదా SMS ద్వారా ఏదైనా యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర (Google Play Store) లేదా యాపిల్ (Apple) యాప్ స్టోర్‌లో యాప్‌లను చెక్ చేయాలి. వాస్తవానికి ప్రాథమిక విధులను నిర్వహించేందుకు అన్ని యాప్‌లకు అనుమతి అవసరం లేదు. కానీ తెలియని యాప్‌కు ఎస్ఎంస్, కాల్స్‌కు సంబంధించిన అనుమతులను ఇవ్వకపోవడం ఉత్తమం. చదవండి: NammaYatri దూకుడు: ఓలా, ఉబెర్‌కు ఊహించని దెబ్బ -
అప్పుడే అయిపోలేదు.. మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్కును దాటాయి. కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి మంకీపాక్స్ బాధితుల సంఖ్య 70వేలు దాటిందని, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ నివేదిక సమర్పించారు. అయితే మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ అని టెడ్రోస్ హెచ్చరించారు. అమెరికా సహా 21 దేశాల్లో గతవారం కొత్త కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో అమెరికాలోనే 90శాతం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కేసులు తగ్గాయని అజాగ్రత్తగా ఉంటే మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల్లో అమెరికాలోనే అత్యధికంగా 42వేల కేసులు వెలుగుచూశాయి. యూరప్ దేశాల్లో 25వేల మందికి ఈ వైరస్ సోకింది. భారత్‌లో ఇప్పటివరకు 14మంది మంకీపాక్స్ బారినపడ్డారు. చదవండి: ఏడుపుగొట్టు సీఈఓ.. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్‌కే! -
న్యూట్రీఫెర్మ్తో గుడుంబా తయారీ.. తాగితే ప్రాణాలు పోవడం ఖాయం!
కొత్తగూడ(మహబూబాబాద్ జిల్లా): ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనులు మొదట సహజసిద్ధమైన ఇప్పపువ్వుతో గుడుంబా తయారు చేసుకుని తాగేవారు. క్రమంగా బెల్లం, పటిక, యూరియాతో తయారుచేసి గుడుంబాను విక్రయించారు. అయితే నల్లబెల్లం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కొన్ని రోజులు చక్కెర వినియోగించారు. కాగా బెల్లంతో అయినా చెక్కెరతో అయినా గుడుంబా తయారీలో పటిక క్రీయాశీలకంగా మారింది. కాగా పటిక దొరక్కపోవడంతో తయారీదారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. న్యూట్రీఫెర్మ్ స్ప్రే మందుతో గుడుంబా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చదవండి: ప్రగతి భవన్లో మంత్రి ‘కేటీఆర్’ ఎమోషనల్ సీన్.. 500గ్రాముల ప్యాకెట్‌తో 20సీసాలు.. పటిక దొరక్కపోవడంతో తయారీదారులు కొత్తదారిలో వెళ్తున్నారు. 500గ్రాముల ప్యాకెట్‌తో 20 సీసాల గుడుంబా వస్తోంది. దీనికి బెల్లం, చక్కెర, పటికతో పనిలేదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టుకునే అవకాశం లేదు. యథేచ్ఛగా తీసుకెళ్లవచ్చు. మిర్చి, పత్తిలాంటి ఆరుతడి పంటల ఎదుగుదలకు న్యూట్రీఫెర్మ్ అనే మందు ఫర్టిలైజర్ షాపుల్లో దొరుకుతుంది. ఓ ప్యాకెట్ తీసుకుని ఒక డ్రమ్ములో సగం నీరు పోసి కలియబెట్టి రెండు రోజులు నానబెడతారు. మూడోరోజు గుడుంబా తయారు చేసే విధంగానే బట్టీ పెడతారు. సాధారణంగా గుడుంబా తయారు చేయడాని వారం రోజులు పడుతుంది. దీనికి రెండు రోజులే సమయం పట్టడం, అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా న్యూట్రీఫెర్మ్ గుడుంబా తయారు చేస్తున్నారు. వాపు వస్తున్న ముఖాలు.. పంటలపై స్ప్రే చేసే మందుతో తయారుచేసే గుడుంబా వల్ల తయారీదారుల ముఖాలు వాపు వస్తున్నట్లు తెలిసింది. ముఖాలు వాస్తున్నా లాభాల కోసం గుడుంబా తయారీని వారు మానడం లేదు. అయితే తయారీదారుల పరిస్థితి ఇలా ఉంటే తాగే వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. తాగిన వారి అవయవాలు త్వరగా పాడైపోయి మృత్యువుకు దగ్గర కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. గుడుంబాతో ఎక్కువ లాభాలు ఉండడంతో కొందరు కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. వీరిపై ఎన్ని కేసులు బనాయించినా గుడుంబా తయారీని మాత్రం మానడం లేదు. నాజీతండా కేంద్ర బిందువు..? నూతన గుడుంబా తయారీ విధానానికి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం నాజీతండా కేంద్ర బిందువు అని తెలుస్తోంది. ఈ గ్రామంలో గుడుంబా తయారు చేసి పలు గ్రామాలకు సరఫరా చేయడంతో పలు కేసులు నమోదయ్యాయి. మూడు మండలాల సరిహద్దు గ్రామం కావడంతో పోలీసుల నిఘా తక్కువ. ఎక్సైజ్ అధికారులకు తండావాసులు భయపడకపోవడం గమనార్హం. ఖానాపురం మండలంలోని పలు గ్రామాలతో పాటు జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో దాదాపు అన్ని గ్రామాలకు ములుగు జిల్లా పస్రా మండలంలోని పలు గ్రామాలకు ఇక్కడి గుడుంబా సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇక్కడి మహిళలు గుడుంబా తయారు చేస్తారు. చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి భార్యభర్తలు ద్విచక్రవాహనాల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తారు. మధ్యలో ఎవరైనా ఆపి తనిఖీ చేసేందుకు యత్నిస్తే మహిళలు అరవడం, గోల చేయడం, తమపై అత్యాచారయత్రం చేకస్తున్నారని గగ్గోలు చేసి అధికారులను భయానికి గురిచేస్తారు. మద్యం ధరలు పెరగడంతో.. ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో రోజువారి కూలీలు, వ్యవసాయదారులు గుడుంబా తాగడానికి మొగ్గు చూపుతున్నారు. పొద్దంతా పొలం పనులు చేసి రాత్రి సమయంలో అధికంగా వెచ్చించి మద్యం తాగలేక చాలా మంది గుండుబా తాగుతున్నారు. అయితే నూతన గుడుంబా తయారీ విధానం వారికి తెలియకే తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలకే ప్రమాదం గుడుంబా దేనితో తయారు చేసినా తాగడం ప్రాణాలకే ప్రమాదం. ఇంకా స్ప్రే మందుతో తయారు చేసిన గుడుంబాను అస్సలు తాగొద్దు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది రోగుల్లో గుడుంబా కారణంగా కిడ్నీలు, లివర్, గుండె ఇతర అవయవాలు దెబ్బతినడం గమనిస్తున్నాం. దీని ప్రభావం పేగులపై కూడా పడుతుంది. –రవీందర్‌నాయక్,అసిస్టెంట్ ప్రొఫెసర్, మానుకోట మెడికల్ కాలేజీ కఠిన చర్యలు తీసుకుంటాం గుడుంబాను అరికట్టేందుకు బెల్లం, పటిక రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేశాం. స్ప్రే మందులతో గుడుంబా తయారీ నా దృష్టికి రాలేదు. ఇక నుంచి వాటిపై కూడా దృష్టి పెడుతాం. ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా తయారు చేయడం, తాగడం సరైంది కాదు. ప్రజలు చైతన్యవంతులై గుడుంబాను నిషేధించడంతో పాటు ఎక్కడ గుడుంబా తయారు చేసినా సమాచారం అందించాలి. –నగేష్, ఎస్సై -
బీచ్‌లో రిప్ కరెంట్.. వేరీ డేంజర్.. గజ ఈతగాళ్లు కూడా తప్పించుకోలేరు..
పిఠాపురం(కాకినాడ జిల్లా): సాగర తీరంలో కనిపించని, కడలి మాటున వేటు వేసే రిప్ కరెంట్ ఎందరో ప్రాణాలను కాటేస్తోంది. చీలిక ప్రవాహాలుగా పేర్కొనే రాకాసి అలలు ఒక్కసారిగా దాడి చేసి పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఏమరపాటుగా ఉంటే రెప్పపాటులో సముద్రంలోకి లాగేస్తుంటాయి. ఆగస్టు, అక్టోబర్ నెలల మధ్య ఈ రిప్ కరెంట్ అలలు ఎక్కువగా తూర్పు తీరంలో సంభవిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఎక్కువ మంది వీటి వల్ల మృత్యువాత పడినట్లు గుర్తించారు. ఉప్పాడ తీరంలో ఆదివారం సంభవించిన పెను ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన రిప్ కరెంట్ ప్రభావాన్ని గుర్తు చేస్తోంది. చదవండి: ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్‌తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం రిప్ కరెంట్ అంటే.. బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిషిని ఒక్కసారిగా లోతైన ప్రదేశంలోకి లాగేస్తాయి. సముద్ర గర్భంలో సుదూర ప్రాంతంలో ఏర్పడిన గాలి ద్వారా ఏర్పడిన అలలు నీటి అడుగున బలమైన ప్రవాహంగా దూసుకు వస్తాయి. తీరానికి వచ్చే సరికి అవి రాకాసి అలలుగా మారిపోతాయి. అల ఒక్కసారిగా తీరాన్ని తాకినప్పుడు సముద్రం అడుగు భాగాన అత్యంత బలమైన ప్రవాహం ఏర్పడుతుంది. ఆ ప్రవాహంలో ఎవరు ఉన్నా రెప్పపాటులో కడలిలో కలిసి పోతారు. ఎంత గజ ఈతగాడైనా దీని నుంచి తప్పించుకోలేడు. తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడతాయి. తిరిగి కెరటం వెనక్కి సముద్రంలోకి వెళ్లే టప్పుడు ఏర్పడే తీవ్రత అంతా ఇంతా కాదు. దానినే రిప్ కరెంట్ అంటారు. కరెంట్ షాక్ తగిలితే ఎంత తొందరగా ప్రాణాలు పోతాయో దానికంటే ఎక్కువగా ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది. రెండు సముద్రాలు లేదా రెండు ప్రవాహాలు కలిసే చోట ఇవి సంభవిస్తాయి. కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న తీరంలో ఎక్కువ ప్రాంతాల్లో ఉప్పుటేరులు కాలువలు కలిసే చోట్లు ఉన్నాయి. అటువంటి చోట్ల రిప్ కరెంట్ ఏర్పడుతుంది. రిప్ కరెంట్ ప్రవాహ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. ఇది అల చీలికలో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 20 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఇది గజ ఈతగాళ్లను, టన్నుల బరువు ఉండే వాటిని లోపలకు లాగేసే అంత బలమైనవి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సుమారు 350 మంది వరకు రిప్ కరెంట్ వల్ల ప్రమాదానికి గురై అసువులు బాసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరానికి వచ్చిన అలలు ఒక్కసారిగా ఉప్పుటేరు నీటితో కలిసి బలమైన రిప్ కరెంట్‌గా మారి ప్రమాదాన్ని కలిగించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రిప్ కరెంట్‌ను కనుగొనడానికి ఏయూ, ఇస్రో సంయుక్తంగా సముద్ర ప్రాజెక్టును నిర్వహిస్తోంది. సముద్ర అలలను కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ ప్రత్యేక పరికరం ద్వారా అలల తరంగం ఎత్తు, దిశ, సమయాన్ని లెక్కిస్తారు. తద్వారా భవిష్యత్తులో రిప్ కరెంట్ ఎక్కడ ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది? గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసి విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. అది ప్రమాదకర ప్రదేశం ఉప్పాడలో ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతం రిప్ కరెంట్ ఉత్పత్తి అయ్యే ప్రాంతమే. ఎందుకంటే అక్కడ ఏలేరు కాలువ సముద్రంలో కలుస్తుంది. సముద్రం అక్కడ కొంత ఒంపు తిరిగి కూడా ఉంటుంది. అంటే అక్కడ వచ్చే కెరటాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇటు నుంచి అటు నుంచి ఒకేసారి కెరటం రావడం రెండు ఢీకొనడం వల్ల రిప్ కరెంట్ (స్క్వేర్ అలలు) ఏర్పడి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. వినాయక నిమజ్జనానికి దిగిన యువకులు విగ్రమాన్ని నిమజ్జనం చేసేటప్పుడు అలల ఉధృతి తక్కువగానే ఉన్నా ఉప్పుటేరు ఉధృతి ఒక్కసారిగా పెరగడం, దానికి తోడు సముద్ర అలలు ఎక్కువ కావడంతో రెండూ కలిసి రిప్ కరెంట్‌గా మారి వారి ప్రాణాలను తీసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రదేశం చాలా ప్రమాదకరం కాబట్టే అక్కడ నిమజ్జనాలను అనుమతించలేదని పోలీసులు చెబుతున్నారు. మత్స్యకారులు సైతం ఆ ప్రదేశంలోకి తాము వెళ్లబోమని అక్కడ లోతు ఎక్కువగా ఉంటుందని అలలు ఉధృతి చాలా భయంగా ఉంటుందని చెబుతున్నారు. యువకులు రెండవ సారి విగ్రహాన్ని సముద్రం లోపలకు తోయడానికి వెళ్లిన సమయంలో రిప్ కరెంట్ ఉత్పత్తి అయ్యి ఉంటుందని అందుకే రెప్పపాటులో కనిపించనంతగా వెళ్లి పోయి గల్లంతయ్యారని భావిస్తున్నారు. అక్కడ నిమజ్జనాలను నిషేధించాం ఉప్పాడ హార్బర్ నిర్మాణ ప్రాంతానికి ఆనుకుని ఉన్న తీరం చాలా ప్రమాదకర ప్రదేశం అని గుర్తించారు. అందుకే అక్కడ నిమజ్జనాలను నిషేధించి ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాం. ఈ కారణంగానే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయలేదు. అక్కడకు ఎవరూ వెళ్లరని భావించాం. కాని అనుకోకుండా వీళ్లు అక్కడకు వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. – వైఆర్కే శ్రీనివాస్, సీఐ, పిఠాపురం షాక్ తగిలిన ఆనవాళ్లు ఉన్నాయి చనిపోయిన వారి బాడీల్లో ఆకస్మాత్తుగా మరణం సంభవించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఒక్కసారిగా నీటిలో మునిగి పోవడం వల్ల ఊపిరాడక నీటిని తాగేసి చనిపోయి ఉంటారు. కేవలం కెరటాల్లో మునిగిపోయి ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా మరణం సంభవించడం అంటే షాక్ తగిలినట్లు కూడా అనుకోవచ్చు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్లు కూడా లేనందున ఒక్కసారిగా మరణం సంభవించినట్లు భావిస్తున్నాం. – కీర్తిప్రియ, ప్రభుత్వ వైద్యురాలు, పిఠాపురం సీహెచ్‌సీ (పోస్టుమార్టం చేసిన డాక్టర్) గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో వినాయక నిమజ్జనానికి వెళ్లి ప్రమాదంలో సముద్రంలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు సోమవారం తీర ప్రాంతంలో లభ్యమయ్యాయి. పిఠాపురం నవఖండ్రవాడలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభ్యమయ్యింది. కొత్తపల్లి మండలం నాగులాపల్లి నేరేళ్లమ్మ తల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మంటపం నుంచి ఆదివారం సాయంత్రం ఉప్పాడ తీరానికి నిమజ్జనాకి వెళ్లారు. అక్కడ నిమజ్జనం చేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో అనిశెట్టి వెంకటరెడ్డి అలియాస్ వంశీరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందగా చింతపల్లి సతీష్‌రెడ్డి, తమిలిశెట్టి విజయవర్ధనరెడ్డి గల్లంతయ్యారు. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట సమీపంలో తీర ప్రాంతంలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాగర తీరంలో సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టగా మృతదేహాలు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో అలల మధ్య తేలియాడుతుండడంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. వాటికి పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ట్రంప్ కుట్రలు
వాషింగ్టన్: అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్ హాల్లో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిపక్ష రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. ట్రంప్ మద్దతుదారుల అజెండా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పేనని తేల్చిచెప్పారు. వారి దుశ్చర్యల వల్ల సమానత్వం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, అధికారమే పరమావధిగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరుల ఆటలు సాగవని హెచ్చరించారు. నాయకుడి పట్ల గుడ్డిగా విధేయత ప్రకటించడం, రాజకీయ హింసలో పాల్గొనడం వంటివి ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయన్న సత్యాన్ని చరిత్ర మనకు నేర్పుతోందని బైడెన్ ఉద్ఘాటించారు. -
కుక్క మొహం పోలికతో ఉండే విష సర్పం.. ఈ స్నేక్ ఎంత డేంజరో తెలుసా?
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అరుదైన విషసర్పం కడలి ఒడికి చేరింది. విశాఖ నగరంలోని కాన్వెంట్ జంక్షన్ సమీపాన పారిశ్రామిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి డాగ్ ఫేస్ సీ స్నేక్‌ను స్నేక్ క్యాచర్ రొక్కం కిరణ్ పట్టుకున్నారు. కుక్క మొహం పోలికతో ఉండే ఈ పాము అతి ప్రమాదకరమైందని, దీని విషానికి విరుగుడు అందించే ఔషధం కూడా దొరకదని కిరణ్ తెలిపారు. తన 20 ఏళ్ల సర్వీస్‌లో దాదాపు 25 వేల పాముల్ని పట్టుకున్నానని, ఇటువంటి పామును మాత్రం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ సర్పాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: భార్య ఉండగానే మరో మహిళతో లవ్ ఎఫైర్.. చివరికి బిగ్ ట్విస్ట్ -
ఈ పక్షి ఎంత డేంజరో తెలుసా?.. నిలువెల్లా విషమే..
జంతు ప్రపంచంలో విషపూరితమైనవి అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు పాములు, తేళ్లే. అలాగే కొన్ని జాతుల కప్పలు, సాలీళ్లు, కీటకాలు, చివరకు కొన్ని రకాల చేపల్లోనూ విషం ఉంటుందని మనకు తెలుసు. కానీ నిలువెల్లా విషం నింపుకున్న ఓ పక్షిజాతి గురించి ఎప్పుడైనా విన్నారా?! ఆ పక్షి పేరే హుడెడ్ పిటోహుయ్. పపువా న్యూగినియాలో ఎక్కువగా కనిపించే ఈ చిన్న పిట్ట ప్రపంచంలోకెల్లా శాస్త్రీయంగా నిర్ధారణ అయిన మొట్టమొదటి విషపూరిత పక్షి అట. చదవండి: జీబ్రాలు నిలబడే నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా? హుడెడ్ పిటోహుయ్ పక్షి ఈకలు, చర్మం, అంతర్గత అవయవాలు, చివరకు ఎముకల్లోనూ విషం దాగి ఉంటుందట! ముద్దొస్తున్నాయి కదా అని దాని ఈకలను సరదాగా నోట్లో పెట్టుకుంటే నోరంతా మొద్దుబారిపోతుందట! కొన్ని గంటలపాటు భరించలేనంత నొప్పి వస్తుందట! అది గోళ్లతో రక్కినా ఇదే సీన్ రిపీట్ అవుతుందట. పక్షవాతం కూడా వచ్చే చాన్స్ ఉంటుందట. ఇక విషం డోసు ఎక్కువగా శరీరంలోకి ప్రవేశిస్తే ఏకంగా గుండెపోటు, మరణం సంభవిస్తాయట!! అందుకే వేటగాళ్లు సైతం దీన్ని వేటాడేందుకు వెనకాడతారట! ఎవరైనా తెగించి దాని మాంసాన్ని వండుతుంటే విపరీతమైన దుర్వాసన రావడంతోపాటు దాని రుచి సైతం అత్యంత చేదుగా ఉంటుందట!! అందుకే స్థానికులు దీన్ని గార్బేజ్ బర్డ్ (చెత్త పిట్ట)గా పిలుస్తుంటారు. నాడీమండల వ్యవస్థను దెబ్బతీసే బట్రచోటాక్సిన్ అనే రసాయనం ఈ పక్షిలో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ విషాన్ని పిటోహుయ్ స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో దీని ఆహారమైన పురుగుల వల్ల ఈ విష రసాయనం పక్షిలోకి చేరుతోందని చెబుతున్నారు. ఇంకొందరేమో పేలు, ఇతర కీటకాలను దరిచేరనీయకుండా ఉండేందుకే హుడెడ్ పిటోహుయ్ ఇలా విషాన్ని ఉత్పత్తి చేస్తుందని విశ్లేషిస్తున్నారు. -
గిరిజన మహిళ ధైర్యం, తప్పిన పెనుప్రమాదం.. లేదంటే బూడిదే!
సాక్షి,గుమ్మలక్ష్మీపురం(పార్వతిపురం మణ్యం): వంట గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగగా.. ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకూడదని భావించిన ఓ గిరిజన మహిళ ధైర్యంతో..చాకచక్యంగా వ్యవహరించి గ్యాస్ సిలిండర్‌ను ఆరుబయటకు తీసుకొచ్చి పడేయడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని పెదఖర్జ పంచాయతీ బొద్దిడి గ్రామానికి చెందిన మండంగి సుజాత సోమవారం ఉదయం ఇంట్లో గ్యాస్‌పొయ్యిపై వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. వంట గది పురిపాక కావడంతో మంటలు ఎగసిపడడం గమనించిన ఆమె గ్యాస్ సిలిండర్ పేలితే పెనుప్రమాదం జరుగుతుందని ఊహించి ఎవరికీ ఎటువంటి నష్టం జరగకూడదని భావించి, సిలిండర్‌ను పొయ్యి నుంచి వేరు చేసి, ఆరుబయటకు తీసుకొచ్చి మురుగునీటి కాలువలో పడేసింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వంటగదిలోని మంటలతో పాటు గ్యాస్ సిలిండర్లోని మంటను ఆర్పివేశారు. ఈ సంఘటణలో ప్రాణాలకు తెగించి సాహసం చేసిన మహిళ ఎడమ చేతికి కొంతమేర కాలిన గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ధైర్యంగా వ్యవహరించిన ఆమెను గ్రామస్తులంతా అభినందిస్తున్నారు. చదవండి: AP: ఏ సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు -
వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..
పెదవాల్తేరు(విశాఖపట్నం): ఇంట్లోను, హోటళ్లలోను ఒకసారి వినియోగించిన వంట నూనెను పదేపదే ఉపయోగించడం పరిపాటి. కానీ అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం చాలా మందికి తెలియదు. దీనిపై ఇప్పుడిప్పుడే అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. వాడిన వంటనూనెతో తయారైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు సోకుతాయని జిల్లా ఆహార భద్రత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఒకసారి వాడిన వంట నూనెను కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే విశాఖలోని పలు హోటళ్లలోను, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోను వాడిన వంటనూనె సేకరణ కోసం డ్రమ్ములు కూడా ఏర్పాటు చేశారు. లీటర్ అయిల్‌కు రూ.30 వంతున చెల్లిస్తారు. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, హోటల్ యజమానులు వాడిన వంటనూనె విక్రయాల కోసం సదరు సంస్థను సంప్రదించాలని ఆహార భద్రత శాఖ అధికారులు కోరుతున్నారు. ఈ నూనె సాయంతో బయోడీజిల్ తయారు చేస్తారు. ఫలితంగా పెరుగుతున్న చమురు ధరల నుంచి ఉపశమనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. వంట నూనె సేకరణ సంస్థ, ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 91605–14567 -
పంజగుట్ట ఫ్లై ఓవర్.. ప్రమాదం పైనే ఉంది జర జాగ్రత్త
సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్): పంజగుట్ట ఫ్లై ఓవర్ కింద ప్రయాణిస్తున్న వారు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. పంజగుట్ట చౌరస్తాలో ఫ్లై ఓవర్ నుంచి కిందికి కేబుల్ వైర్ల ఎన్‌క్లోజర్ కట్టలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇవి ఏ మాత్రం తెగిపడినా కింద ప్రయాణిస్తున్న వారికి సంకటమే.. సంబంధిత అధికారులు గుర్తించి వీటిని తొలగించడమో లేదా సరిచేయడమే చేయాల్సిన ఎంతైనా ఉంది. -
లోపల ఊపిరి ఆడట్లేదు.. మమ్మల్ని బతకనివ్వండి ప్లీజ్
ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండే విశాఖ సముద్ర తీరం మృత్యు కుహరంగా మారిపోతోంది. నిత్యం కడలి కెరటాల ఘోష వినిపించే ప్రాంతం.. సముద్ర జీవరాశుల మృత కబేళాలతో నిండిపోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగర గర్భంలో ఉండే జీవరాశులు సైతం ఒడ్డుకు కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా విభిన్న జీవరాశులు విశాల విశాఖ తీరంలో ఎక్కడో ఒక చోట నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్‌లతోపాటు విశాఖ తీరంలో అరుదైన డాల్ఫిన్లు ఆలివ్ రిడ్లే తాబేళ్లు, స్టింగ్రే(టేకు చేప), ముళ్లచేప మొదలైన జీవరాశులు మరణిస్తున్నాయి. సముద్ర జలాలు కలుషితం అవుతున్న కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ( చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది ) సాక్షి, విశాఖపట్నం: వాతావరణంలో మార్పులను మానవ నివాసానికి అనుకూలంగా మార్చేవి సముద్రాలే. ఇందులోని జలాలు ఆవిరై వర్షాలుగా కురిసి నీటివనరులు అందేందుకు దోహదపడుతున్నాయి. మనిషి తీసుకునే ప్రోటీన్లలో సింహభాగం సముద్రం ఇస్తున్నదే. ఇన్ని ఇస్తున్న సాగరానికి.. తిరిగి మనమేం ఇస్తున్నామంటే కాలుష్య రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలే. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా సముద్ర గర్భంలో కలుస్తున్నాయి. ( చదవండి: గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ.. ) ప్లాస్టిక్ సీగా మార్చేస్తున్నారు.. అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులే ప్రధాన సమస్యగా మారుతున్నారు. బీచ్ ఒడ్డున కూర్చొని.. తినుబండారాల్ని తినేసి ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు సముద్రంలో పారేస్తున్నారు. ఇలా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ మోతాదుకి మించి సముద్రాల్లో చేరుతుండటంతో ఆమ్లగాఢత పెరుగుతోంది. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విడుదలవుతున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు చేపలకు హాని చేస్తోంది. సముద్ర గర్భం నుంచి ఒడ్డుకి తీసుకొచ్చిన వ్యర్థాలతో లివింగ్ అడ్వెంచర్స్ బృందం అడుగున ఉన్న ఆకర్షణీయమైన ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహారంగా భావిస్తున్న జలచరాలు.. వాటిని తిని మృత్యువాత పడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సముద్ర జీవులు మనుగడ సాధించేందుకు జలాల్లో ఆక్సిజన్, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుంచి 10 పీపీటీ వరకూ ఆక్సిజన్ అవసరంకాగా.. 30 నుంచి 33 శాతం వరకూ లవణీయత ఉండాలి. కానీ విషపూరిత రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తుండటంతో అసమతుల్యత ఏర్పడి.. సరైన స్థాయిలో ఆక్సిజన్ అందక ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ వెలికితీస్తున్న స్వచ్ఛంద సంస్థలు సముద్ర జలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు జలచరాలకు ఎలాంటి హాని తలపెడుతున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన శూన్యమనే చెప్పుకోవాలి. అందుకే.. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాసిక్ వ్యర్థాల్ని తొలగించేందుకు లివిన్ అడ్వెంచర్ సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ఒడ్డు నుంచి ప్రారంభించి.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. మరోవైపు సాగర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు విడిచిపెట్టకుండా తీరానికి వస్తున్న సందర్శకులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినా.. పర్యాటకుల నుంచి స్పందన కరువవడంతో జలచరాల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. ( చదవండి: CM Stalin: రూ.150కు చేరిన టమాటా.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం ) జీవవెవిధ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రంలో విసిరేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సముద్రంలో ఉన్న ప్రాణులు చనిపోతూ కనిపిస్తుంటే మనసు తరుక్కుపోతోంది. అందుకే వెలికితీస్తున్నాం. మన సముద్రాన్ని మనం పరిరక్షించుకుందాం. ప్రజలు, సందర్శకులు కూడా దీనికి సహకరించాలి. ప్లాస్టిక్ సముద్ర ప్రాణుల్ని అంతరించిపోయేలా చేస్తోంది. ఇది జాతి మనుగడకే చాలా ముప్పు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. – బలరాంనాయుడు, లివింగ్ అడ్వెంచర్స్ సంస్థ ప్రతినిధి చేపల శరీరాల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్స్ సంస్థతో కలిసి ఎన్ఐవో చేసిన ఓ పరిశోధనలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేపల శరీరాల్లోకి వెళ్తున్నట్లు తెలిసింది. ఇది ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మెరైన్ పొల్యూషన్ అనేది కేవలం జలచరాలకే కాదు.. మానవాళి ఉనికికే పెను ముప్పు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలపై కాలుష్య నియంత్రణ మండలితో పాటు జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ఐఓ) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. భూ ఉపరితలంతో పాటు సముద్ర తీరాల్ని కాపాడుకునే దిశగా విశాఖ ప్రజలు అడుగులు వేయాలి. – డా. కె.ఎస్.ఆర్.మూర్తి, ఎన్ఐవో విశ్రాంత శాస్త్రవేత్త చదవండి: సరదాగా కుటుంబంతో అత్తవారింటికి.. అంతలో దారుణం -
షాకింగ్ వీడియో: సెకను వ్యవధిలో తప్పింది.. చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడు!
నిన్నటి వరకు బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాలను చుట్టి రావడం ఓ సరదా అయితే ప్రస్తుత రోజుల్లో వాళ్లు చూట్టిన ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే బైకు ప్రయాణం అంటే మజాతో పాటు కాస్త ప్రమాదం కూడా దాగుంటుంది. మరీ కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం వాహనదారుడు అప్రమత్తంగా లేకపోయినా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ బైకర్ మృత్యువు అంచులవరకు వెళ్లి వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్, లడఖ్‌కు మధ్య మార్గం జోజిలా పాస్‌లో పర్వతాల గుండా ఇద్దరు యువకులు బైకుపై వెళుతున్నారు. అయితే ఆ బైకర్ల కంటే ముందు ఇనుప పైపులతో నిండిన ట్రక్కు వెళ్తోంది. ఇంతలో ఓ బైకర్ ఆ ట్రక్కును ఓవర్టేక్ చేసే ప్రయత్నించబోయాడు. అప్పటికే ఆ రోడ్డు మొత్తం బురద బురదగా ఉండటం.. ట్రక్ దగ్గరికి వెళ్లగానే బైక్ స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న లోయలో పడబోయాడు. అదృష్టవశాత్తు అతను బైకుని కంట్రోల్ చేసి కాలు కింద పెట్టి అంతెత్తు పర్వతం నుంచి పడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియోను అతని వెనుకే ఉన్న మరో బైక్ రైడర్ రికార్డ్ చేశాడు. ఈ ఘటన కొన్ని నెలల కింద జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలాంటి రైడ్స్ చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: Guinness World Record: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
వైరల్: బాబోయ్.. బైకుపై 13 మంది.. ఏంటీ వెర్రి పని!
ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్ వీడియోల హవా పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని వీడియోలు నెటిజన్లకు నచ్చడంతో అవి నెట్టింట దూసుకుపోవడంతో పాటు అందులోని వారు సెలబ్రిటీలుగా మారిన ఘటనలు ఉన్నాయి. ఆ జాబితాలో కొన్ని వీడియోలు అనుకోకుండా జరుగుతుంటే మరికొన్ని వాటిలో మాత్రం వ్యూస్ , లైక్స్ కోసం ప్రాణాలకు రిస్క్ అయినా లెక్క చేయడంలేదు. అలా కొందరు వీడియోలు చేస్తున్నప్పుడు ప్రమాదంలో పడిన ఘటనలు మనం బోలెడు చూశాం. తాజాగా ఓ వ్యక్తి బైక్‌పై ప్రమాదకర ఫీట్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బైక్‌పై 13 మంది చిన్నారులను ఎక్కించుకుని రోడ్డుపై దూసుకెళ్తున్నాడు. బైక్ సీట్లు, చక్రాలు.. అసలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చిన్నారులను కూర్చోబెట్టుకుని రయ్ అంటూ రోడ్డుపై షీకారుకు వెళ్లాడు. అంతేనా బైక్‌పై ప్రమాదకరంగా వేలాడుతున్న పిల్లలు ఏకంగా బచ్‌పన్‌కా ప్యార్ అంటూ పాటలు పాడుతూ ఆ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇది వరకు ఉన్న చాలా వరకు వీడియోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయ్, నవ్వించాయ్, కానీ ఇది మాత్రం వాళ్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇది చూసిన కొందరు ఏంటీ వెర్రిపనంటూ కామెంట్ పెడుతున్నారు. చదవండి: Viral Video: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క.. -
డెల్టా వేరియంట్ ఎంత డేంజరో తెలుసా?
లండన్: భారత్‌లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్(బీ1. 617.2) ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ల ప్రభావాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని యూకే హెల్త్ నిపుణుల నివేదిక వెల్లడించింది. యూకేలో ఈ వేరియంట్ వేగంగా పెరుగుతోందని, ఇతర వేరియంట్ల కన్నా తొందరగా వ్యాపిస్తోందని తెలిపింది.ఢి ల్లీలో కేసులు ఉధృతికి ఈ వేరియంటే కారణంగా వీరి అధ్యయనం తేల్చింది. ఇమ్యూనిటే ఎలివేషన్ లక్షణాలతో ఉన్న ఈ డెల్టా వేరియంట్ ఏప్రిల్‌లో 60 శాతం కేసులకు కారణమైందని తెలిపింది. డెల్టా వేరియంట్ అమెరికా,యూకెతో సహా కనీసం 60 దేశాలలో ఉందని కోవిడ్ -19 జెనోమిక్స్ యుకే కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్ షరోన్ పీకాక్ ది వాల్ స్ట్రీట్ జర్నల్ టెక్ హెల్త్ ఈవెంట్లో పేర్కొన్నారు. ఆల్ఫా వేరియంట్, బీ1.117 కంటే 50 శాతం ఇది ఎక్కువ వ్యాప్తిచెందుతుందని గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సీఎస్ఐఆర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ నిపుణులు వెల్లడించారు. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ ప్రభావాన్ని బాగా తగ్గిస్తున్నదని, ముఖ్యంగా ఒక డోసు తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. రెండు డోసుల తర్వాత డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావం బాగానే ఉంటోందని, కానీ కాలానుగుణంగా ప్రభావం తగ్గుదల ఆల్ఫా కన్నా ఎక్కువగా ఉందని వివరించింది. ప్రస్తుతం యూకేలో కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ వల్ల కరోనా ఉధృతి చాలా వరకు అదుపులో ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషనే ఉత్తమమార్గమని యూకే హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. చదవండి : టీకా తీసుకున్న 45 నిమిషాలకే మృతి American Embassy: టీకా తప్పనిసరి కాదు -
రాకాసి మిడతలు.. ముంచుకొస్తున్న ముప్పు!
పులి మీద పుట్రలా కరోనా మహమ్మారికి తోడు మరో ఉపద్రవం ముంచుకువస్తోంది. కరోనాతో సతమతమవుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలపై ఈ వేసవిలో మరో పిడుగు పడబోతోందా? లక్షలాది ఎకరాల్లో పంట పొలాలపై రాకాసి మిడతల దండు ఒకటి, రెండు నెలల్లో విరుచుకుపడి ఆహార భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే పెను ప్రమాదం పొంచి ఉందా? అవుననే అంటున్నారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) నిపుణులు. ఇప్పటికే ఆహార కొరత, కరోనా మహమ్మారితో సతమతమవుతున్న తూర్పు ఆఫ్రికా దేశాల్లో గత పాతికేళ్లలో ఎన్నడూ ఎరుగనంత భీకరంగా రాకాసి మిడతల దండు ఇప్పుడు విలయాన్ని సృష్టిస్తోంది. కొద్ది నెలల క్రితం మిడతల దండు విజృంభించడంతో ఇథియోపియా, సోమాలియా, పాకిస్తాన్‌తోపాటు మన దేశంలోనూ లక్షలాది ఎకరాల్లో నోటికాడికి వచ్చిన పంటలు ధ్వంసమయ్యాయి. అప్పట్లో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 3,70,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తెలంగాణలోని సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లోనూ వేలాది ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు నాశనమయ్యాయి. అప్పట్లో కొద్ది రోజుల్లోనే సమసిపోయిన ఈ సమస్య తూర్పు ఆఫ్రికా దేశాలను కొద్ది నెలల్లోనే భీకర రూపం దాల్చి మళ్లీ చుట్టుముట్టింది. రెండో దశలో ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశాల్లో అంతకు ముందుకన్నా 20 రెట్లు ఎక్కువ సంఖ్యలో మిడతల దండు విజృంభిస్తున్నది. ఇలాగే ఉంటే వచ్చే జూన్ నాటికి మిడతల సంఖ్య 400 రెట్లు పెరిగిపోతుందని, సుమారు 60 దేశాలకు నష్టం చేకూర్చవచ్చని ఎఫ్.ఎ.ఓ. నిపుణుల అంచనా. అయితే, కరోనా మహమ్మారి లాక్డౌన్ మధ్య ఆఫ్రికా దేశాలు మిడతల దండును అరికట్టలేకపోతున్నాయి. ఫలితంగా ఇథియోపియాలో లక్షల హెక్టార్లలో టెఫ్ అనే చిరుధాన్యం, ఉల్లి పంటలు ఇప్పటికే పూర్తిగా నాశనం అయ్యాయి. మిడతల దండును అరికట్ట లేని పరిస్థితుల్లో రానున్న ఒకటి, రెండు నెలల్లో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పంటలకు పెనునష్టం జరగనుంది. ఆఫ్రికా దేశాల నుంచి బయలుదేరే మిడతల దండు జూన్ నాటికి భారత్‌లో పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ చుట్టుముట్టి పంటలకు నష్టం కలిగించే ముప్పు పొంచి ఉందని తాజా నివేదికలో ఎఫ్.ఎ.ఓ. హెచ్చరించింది. – పంతంగి రాంబాబు, సాగుబడి భారత్‌కు రెండు వైపుల నుంచి ముప్పు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పుట్టిన మిడతల దండు రెండు వలస దారుల్లో భారత్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఎమెన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ భూభాగం మీదుగా భారత్‌లోని పంజాబ్, హర్యానాల్లో పంట పొలాలపై మే, జూన్ మాసాల్లో మిడతల దండు దాడి చేసే ప్రమాదం ఉందని ఎఫ్.ఎ.ఓ. హెచ్చరిస్తోంది. అదేవిధంగా, ఇథియోపియా, సోమాలియా దేశాల నుంచి హిందూ మహా సముద్రం మీదుగా దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ సహా తూర్పు, పశ్చిమ తీరంలోని వివిధ రాష్ట్రాల్లో మిడతల దండు దాడి చేసి పంటలను తీవ్రంగా నష్టపరిచే అవకాశం ఉందని ఎఫ్.ఎ.ఓ. తాజా నివేదికలో హెచ్చరించింది. ఎడారి మిడతలు.. 8 తూర్పు ఆఫ్రికా దేశాల్లో (కెన్యా, ఇథియోపియా, సోమాలియా, జిబౌటి, ఉగాండ, టాంజానియా, సూడాన్, ఎరిట్రియ) పంటలు, మొక్కలు, చెట్లకు పెనుముప్పుగా పరిణమించాయి. ఇథియోపియా, సోమాలియాలలో గత పాతికేళ్లుగా ఎన్నడూ లేనంత ఎక్కువగా ఆహార, ఆదాయ భద్రతకు గొడ్డలిపెట్టుగా మారాయి. కెన్యా.. 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువగా మిడతల బెడదను ఎదుర్కొంటున్నది. ఆఫ్రికా దేశాల నుంచి మన దేశానికి మిడతల దండు పయనించే అవకాశం ఉన్న మార్గాలను సూచిస్తూ ఎఫ్.ఎ.ఓ. రూపొందించిన చిత్రం 10 లక్షల హెక్టార్లలో గుడ్లు కరువు కాటకాలతో నిరంతరం అల్లాడే ఈ తూర్పు ఆఫ్రికా దేశాల్లో గతేడాది అక్టోబర్‌లో భారీ వర్షాల తర్వాత ఎడారి మిడతలు గుడ్లు పెట్టి సంతతిని తామరతంపరగా వృద్ధి చెయ్యటం మొదలు పెట్టాయి. 8 దేశాల్లో 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటున్నాయి. ఇది నూర్పిడి సీజన్ కావడంతో రైతులు అల్లాడుతున్నారు. ఆహార , ఆదాయ భద్రతకు ముప్పు వచ్చిపడింది. మూక శక్తితోనే విధ్వంసం ఎడారి మిడత ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు సాధారణంగానే ఉంటుంది. అప్పుడు పంటలకు వీటి వల్ల బెడద ఉండదు. కానీ, ఎక్కువ సంఖ్యలో ఒక చోట చేరినప్పుడు విధ్వంసకర మూక శక్తిగా ప్రవర్తిస్తాయి. మిడతల దండు ప్రవర్తనలోనే కాదు.. వాటి రంగు, రూపంలో కూడా మార్పులు వస్తాయి. రోజూ తనంత తిండి! మిడత రోజూ తన బరువుతో సమానమైనంత ఆకులు, అలములు, గింజలు ఆహారంగా తింటుంది. మిడతల దండు అనేక కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండవచ్చు. ఒక చదరపు కిలోమీటరు విస్తరించి ఉండే మిడతల దండులో 4–5 కోట్ల వరకు మిడతలు ఉంటాయి. ఇవి ఒక్క రోజులో 35 వేల మంది మనుషులు తినేంత ఆహారాన్ని తినేస్తాయి. ఈ దండు నేల వాలిందంటే ఆయా ప్రాంతాల్లో పంటలు, గడ్డి, ఆకులు పచ్చదనం అంతా ఇట్టే ఖాళీ అయిపోతుంది. ఆహార పంటలతోపాటు పచ్చిక బయళ్లను కూడా మిడతల దండు ఆరగించేస్తుంది. అడవులకూ బెడద పొంచి ఉంది. జీవన కాలం 3 నెలలు ఎడారి మిడత జీవిత కాలం సాధారణంగా 3 నెలలు. అయితే, చల్లని వాతావరణంలో 6 నెలలు కూడా జీవిస్తుంది. ఎడారి ప్రాంతాల్లో సైతం నెలకు 2.5 ఎం.ఎం. వర్షపాతం వరుసగా రెండు నెలల్లో కురిస్తే చాలు మిడతల దండు సంతతి వృద్ధికి సరిపోతుంది. తగిన తేమ ఉన్న ఇసుక నేలల్లో 2–4 అంగుళాల లోతున మిడత గుడ్లు పెడుతుంది. ఒక మిడత 80 నుంచి 160 గుడ్లను గంపగుత్తగా పెడుతుంది. చదరపు మీటరు స్థలంలో వందలాది మిడతలు గుడ్లు పెడతాయి. గుడ్ల లో నుంచి రెండు వారాల్లో పిల్లలు బయటకు వస్తాయి. 4–6 వారాల్లో రెక్కలు సంతరించుకొని ఎగర గలుగుతాయి. ఆ దశలో మిడతల దండులో చేరుతుంది. అప్పటి నుంచి 3–4 వారాలు యాక్టివ్‌గా ఉండిన తర్వాత మిడత గుడ్లు పెడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే గుడ్లు పెట్టిన తర్వాత చనిపోతుంది. అడ్డుకునేదెలా? వాతావరణ మార్పుల నేపథ్యంలో అకాల వర్షాలతో ఏర్పడే అనువైన వాతావరణమే మిడతల దండు విజృంభించడానికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పురుగులు మందు చల్లి సంతతిని అరికట్టే ప్రయత్నం చేయటం తప్ప అరికట్టేందుకు మరో మార్గమేదీ లేదంటున్నారు. ఆఫ్రికాలో రెండు రకాల (Schistocerca gregaria, Locusta migratoria) మిడతలు సమస్యాత్మకంగా తయారయ్యాయి. శక్తివంతమైన పురుగుమందులను మనుషులతోను, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల తోను పిచికారీ చేయిస్తున్నారు. పురుగులను అరికట్టే మెటార్హిజియం శిలీంధ్రం (Metarhizium sp.) చల్లుతున్నారు. అయితే, శిలీంధ్రం వృద్ధి చెంది మిడతలను మట్టుబెట్టడానికి 7 నుంచి 14 రోజుల వ్యవధి అవసరం అవుతుంది. చెద పురుగులు, స్కరబ్ బీటిల్స్‌పై ఈ శిలీంధ్రం ప్రతికూల ప్రభావం చూపుతున్నదని అంటున్నారు. మిడతలపై పురుగుల మందు పిచికారీ -
ప్రమాదమని తెలిసినా..
సాక్షి, అశ్వారావుపేట : ఆటోలో మండు వేసవిలో ప్రయాణమంటేనే ప్రాణాంతకం. బస్సు సౌకర్యాలు లేని గ్రామాలకు ఆటోలే రవాణా మార్గాలు. కాకుంటే ప్యాసింజర్ ఆటో వెనుక డోరు తెరిచి దానిపై నిలుచుని ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయడం పల్లెటూర్లలో క్రేజీగా ఉంటుంది. కానీ కళ్లలో పడే దుమ్ము, ధూళికి ఇంటికి చేరేలోపే చతికిల బడతారిలా.. అశ్వారావుపేట మండలం జమ్మి గూడెం ఊట్లపల్లి మధ్యలో ఒక కిలోమీటరు ప్రయాణంలో ‘సాక్షి’కెమేరా ద్వారా చిత్రీకరించిన చిత్రాలివి. -
స్మార్ట్ఫోన్లతో బోలెడు చిక్కులు...
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి నిజమేగానీ.. చిక్కులు కూడా అంతేస్థాయిలో ఉంటాయి అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఇటీవల జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. మన స్మార్ట్ఫోన్లలో ప్రతి పది ఆప్‌లలో కనీసం ఏడు మన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయి. అంతేకాదు. మనం ఏ సమయంలో ఎక్కడున్నాం? ఏఏ అప్లికేషన్లు వాడాము? వంటి వివరాలను కూడా ఆప్‌లు గమనిస్తూ ఉంటాయని నారెసో వల్లీనా రోడ్రిగ్స్ అనే శాస్త్రవేత్త తెలిపారు. తాము పరిశీలించిన ఆప్‌లలో 15 శాతం వినియోగదారుడి వివరాలను ట్రాకింగ్ వెబ్సైట్లకు చేరవేసినట్లు తెలిసిందని చెప్పారు. ఇలాంటి ట్రాకర్లు నాలుగింటిలో ఒకటి ప్రతి స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన అంకెతో గుర్తించేలా కూడా ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు. ఈ చిక్కులకు స్మార్ట్‌ఫోన్ ఆప్‌లను ఆఫ్ చేయడం కూడా పరిష్కారం కాదని... ట్రాకింగ్ చేయవద్దన్న ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి రహస్యంగా పాస్వర్డ్లు సంగ్రహించడం మొదలుకుని ఎప్పటికప్పుడు మనమున్న లొకేషన్ వివరాలను ఇతరులకు తెలపడం చేస్తాయని ఇంకో శాస్త్రవేత్త గువెరా నౌబీర్ అంటున్నారు. ఫేస్‌బుక్‌లోని సమాచారాన్ని, స్మార్ట్‌ఫోన్ వినియోగం తీరుతెన్నులను కలగలిపి వినియోగదారుల ప్రొఫైల్‌లు సిద్ధం చేస్తున్నారని.. ఇలాంటి ప్రైవసీ ఉల్లంఘనలను అడ్డుకునేందుకు తగిన చట్టాలు కూడా లేవని వీరు వివరిస్తున్నారు. -
భారత్‌లో రైతు రాయితీ ఆందోళనకరం
వాషింగ్టన్: ‘భారత ప్రభుత్వం వరి, గోధుమలు పండించే రైతులకు భారీగా రాయితీలు ఇస్తోంది. భారత్ చేపట్టిన ఈ వర్తక వక్రీకరణ విధానంపై ఇతర దేశాలు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది’ అని అమెరికా వ్యాఖ్యానించింది. ‘ప్రపంచవ్యాప్తంగా వరి, గోధుమ పండించే ప్రతి దేశానికీ భారత్ వర్తక ప్రభావం ఆందోళనకరమే. ఈ ధాన్యాలను ఉత్పత్తి చేసే ఇతర దేశాలకు నష్టం కలిగించేలా భారత్ దేశీయ మద్దతు విధానాన్ని అమలు చేస్తోంది’ అని అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్ అధికారి గ్రెగోరీ డౌడ్ ఆరోపించారు. ‘2010 నుంచి 2014 మధ్య వరి ఉత్పత్తి వ్యయాన్ని 74 శాతం నుంచి 84.2 శాతానికి భారత్ పెంచింది. అలాగే గోధుమల ఉత్పత్తి వ్యయాన్ని 60 శాతం నుంచి 68.5 శాతానికి పెంచింది’ అని పేర్కొన్నారు. -
బెల్ట్ బిగించింది
దూరంగా పారిపోయినానేరం పారిపోనివ్వదు.చేసిన పాపం ఊరికే ఉండనివ్వదు.కెలికే మనస్సు ఆరా తీయమంటుంది. ఆ పని కాస్తా పట్టుబడేలా చేస్తుంది.అనుమానానికి మించిన అపాయం లేదు. 2005, ఫిబ్రవరి 9.ఉదయం 8:30.పోలీసు జీపు సైరన్‌తో గుమికూడిన జనాల్లో కదలిక వచ్చింది.ఆ ఇంటి ముందున్న జనం రోడ్డు వైపు తలలు తిప్పారు.జీప్ వచ్చి ఆ ఇంటి ముందాగింది. వచ్చినంత వేగంగా జీపులో నుంచి దిగిన పోలీసులు అంతే వేగంగా ఆ ఇంట్లో అడుగుపెట్టారు. ఎదురుగా కనిపించిన దృశ్యానికి కడుపులో దేవినట్టుగా అయ్యింది వాళ్లకి.ఇంకా పూర్తిగా ఆరకుండా మడుగు కట్టిన రక్తంతో ఒకలాంటి దుర్వాసన వస్తోంది.ఏడెనిమిదేళ్లుంటాయి ఆ పిల్లవాడికి. మూడు పదులు దాటిన ఓ ఆడమనిషి. ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు. ఒళ్లంతా కత్తిగాట్లు ఉన్నాయి. ఆ ఇద్దరినీ అతి కిరాతకంగా చంపేశారు ఎవరో! ఆ గదిలో చుట్టూ చూశారు పోలీసులు. మూలన ఓ బట్టల మూట, పాతబడిన రెండు బెడ్షీట్లు. ఓ మూలన పాత స్టౌవ్, నాలుగైదు గిన్నెలు కనిపిస్తున్నాయి.‘సార్, ఇది మా ఇల్లే సార్. నెల క్రితం ఈ గదిని ఈమెకు అద్దెకు ఇచ్చాను’ అన్నాడు గుంపులో నుంచి వచ్చిన ఓ వ్యక్తి. ‘ఆమె పేరు రేఖ. పిల్లవాడి పేరు బబ్లూ. దగ్గరలో హాస్పిటల్ బిల్డింగ్ కడుతున్నారు. దాంట్లో పనిచేసేది. పిల్లవాడు కూడా ఆమెతో పాటు తిరుగుతూండేవాడు. తనకు ఎవరూ లేరని, భర్త చనిపోయాడని చెప్పింది. పోనీలే పాపం అని గది అద్దెకు ఇచ్చాను’ అన్నాడతను. ఆంబులెన్స్, క్లూస్ టీమ్ వచ్చింది. మార్కింగ్ చేసి, శవాలను ఆంబులెన్స్‌లో తరలించారు పోలీసులు. స్టేషన్లో ఎస్సై ఆలోచనలో ఉన్నాడు.వాళ్లిద్దరిని చంపి వెళ్లిన వ్యక్తి ఎవరో తెలియడం లేదు.ఆ ఏరియాలో సిసి కెమెరాలు లేవు ఏదైనా క్లూ దొరుకుతుందనుకుంటే. దిక్కులేని వారి హత్యల కింద ఈ కేసు మరుగున పడిపోతుందా?కానిస్టేబుల్ వచ్చి పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇచ్చాడు.మెడ, ఛాతీ భాగంలో లోతైన కత్తిపోట్ల వల్ల మరణించారని ఉంది అందులో. ‘ఆ చుట్టుపక్కల వారిని అడిగాం సార్. ఏ వివరాలు తెలియలేదు. గదిలో ఏ ఆధారాలు దొరకలేదు సార్’ అన్నాడు కానిస్టేబుల్.‘ఏ ఆధారం లేకుండా నేరస్తుడు ఈ పని చేశాడంటే అతడు నేరాలు చేయడంలో ఆరితేరిన వాడై ఉండాలి. ఆ నేరస్తుడు ఎవరో.. ఎలా కనిపెట్టడం..?’ ఆలోచనలో పడ్డాడు ఎస్సై. కానిస్టేబుల్‌ను తనతో పాటు రమ్మన్నట్టు సైగ చేసి వెళ్లి జీపులో కూర్చున్నాడు. ఇద్దరూ మళ్లీ ఆ గది వద్దకు వెళ్లారు. అక్కడ ఒక్కో వస్తువును పరిశీలన గా చూశారు. గోడకు ఒక చిన్న పాత సంచి ఉంది. అందులో పిల్లవాడి బట్టలు ఉన్నాయి. గది అంతా ఒకసారి కలియతిరిగి ‘వెళ్దాం పద’.. అన్నట్టు కానిస్టేబుల్ వైపు చూశాడు ఎస్సై.కానిస్టేబుల్ బయటకు నడిచాడు. బయటకు వెళ్లబోతున్న ఎస్సైని ఒక వస్తువు ఆకర్షించింది. అది బట్టల మధ్య ఉన్న స్కూల్ బెల్ట్. తెలుపు, నీలం రంగు చారలతో ఉంది. దగ్గరగా వెళ్లి ఆ బెల్ట్‌ని తీసుకొని చూశాడు. విద్యానికేతన్ స్కూల్ అని ప్రింట్ చేసి ఉంది. ఎస్సై కోసం తిరిగి లోపలికి వచ్చిన కానిస్టేబుల్ వైపు చూస్తూ..‘ఇది స్కూల్ బెల్ట్. ఈ కేసులో ఇదే క్లూ.ఇక్కడికి దగ్గరలో ఈ పేరుతో ఏ స్కూల్ ఉందో వెరిఫై చేయ్!’ అన్నాడు.ఇద్దరూ ఆ బెల్ట్ తీసుకొని గదికి తాళం వేసి బయటకు నడిచారు. ‘సార్! ఇది మా స్కూల్‌కి సంబంధించిన బెల్ట్’ చెప్పింది స్కూల్ ప్రిన్సిపాల్.‘ఈ ఫొటోలో ఉన్న పిల్లవాడు మీ దగ్గర చదువుకుంటున్నట్టు ఎలా తెలుసుకోవచ్చు. ఈ పిల్లవాడి పేరు బబ్లూ’ వివరాలు చెప్పాడుఎస్సై బబ్లూ డెడ్‌బాడీ ఫొటో చూపిస్తూ.‘ఫైవ్ మినిట్స్ సార్! వెరీఫై చేసి చెబుతా!’ అంది ప్రిన్సిపల్.‘సార్ ఆ పిల్లవాడు మా దగ్గరే చదువుతున్నాడు. సెకండ్ క్లాస్. నెల రోజులుగా స్కూల్‌కి రావడంలేదు’ చెబుతూ రిజిస్టర్ ఎస్సై ముందుంచింది ప్రిన్సిపాల్.ఆ రిజిస్టర్లో పిల్లవాడి ఫొటో, వివరాలతో పాటు తండ్రి అని ఉన్న బాక్స్ పక్కన ఓ ఫొటో అతికించి ఉంది. పేరు బిజ్జూ అని రాసుంది.తం్రyì ఫొటోతో పాటు, ఆ రిజిస్టర్లో అడ్రస్ ఉంది. కాని అది హత్య జరిగిన ఇల్లు ఉన్న అడ్రస్ కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న వేరే అడ్రస్. ఆ అడ్రస్ ఉన్న చోటును వెతుక్కుంటూ వెళ్లారు. పోచమ్మ గుడి పక్క సందు, చంపాపేట్.అక్కడ అందరికీ ఆ ఫొటో చూపించారు. ‘సార్! ఇతని పేరు బిజ్జూ. ఇళ్లకు పెయింట్లు వేస్తుంటాడు. కొడుకు, భార్యతో కలిసి ఈ కాలనీలోనే రెండేళ్లుగా ఉండేవాడు. అర్థరాత్రి తాగొచ్చి భార్య, కొడుకును కొడుతుండేవాడు.వాళ్లది బీహార్ అని, చుట్టాలు అక్కడే ఉన్నారని చెప్పేవాడు. కాని ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ లేదు’ అన్నారు అక్కడివాళ్లు.‘ఇతనికి సంబంధించిన వివరాలు ఇంకేమైనా తెలిస్తే మాకు వెంటనే చెప్పండి’ అన్నాడు ఎస్సై.ఆ తర్వాత బిజ్జూ ఫొటోని బీహార్ పోలీస్ట్ స్టేషన్‌కి ఫ్యాక్స్ చేశారు. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది. ‘సార్, మీరు నిన్న వచ్చారు కదా! ఆ బిజ్జూ ఫోన్ చేశాడు. వాళ్ల బంధువులకు ఎవరికో బాగోలేదట. అందుకే బిహార్‌లో ఉన్నారట. అతని భార్య, పిల్లవాడి గురించి అడిగితే బాగున్నారు అని చెప్పాడు సార్!’ అన్నాడు ఫోన్లో సమాచారం చెప్పిన వ్యక్తి. పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు.ఫోన్ నెంబర్ ఆధారంగా బిజ్జూను పట్టుకున్నారు పోలీసులు. నల్లగా పొట్టిగా సిగరెట్లు తాగి తాగి నల్లబడిన పెదాలతో గుంటలు పడిన కళ్లతో అస్థిమితంగా కనిపించాడు.హైదరాబాద్ తీసుకొచ్చాక విచారణ మొదలైంది.‘చెప్పు ఎందుకు చంపావు నీ భార్యా పిల్లలను’‘నేను చంపడం ఏమిటి?’ అన్నాడతను.ఎస్సై అతని ఎదురుగా కొన్ని కాగితాలు పెట్టాడు. వాటి మీద వేలిముద్రలు ఉన్నాయి. కాని అవి ఉత్తుత్తివి అని ఎస్సైకి తెలుసు.‘నీ వేలి ముద్రలు మేచ్ అయ్యాయి.చూడు.నువ్వు తప్పించుకోలేవు’ అన్నాడు.బిజ్జూ నోరు విప్పాడు. బిజ్జూ, రేఖలది బీహార్. రేఖ పెళ్లయి పదేళ్లయ్యింది. పిల్లవాడికి ఐదేళ్ల వయసులో భర్త ప్రమాదంలో చనిపోయాడు. పుట్టింట్లో కొడుకుతో పాటు ఉండేది రేఖ. అక్కడే కొన్నాళ్లకు బిజ్జూతో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌లో తెలిసినవారున్నారని, అక్కడ పనులు సులువుగా దొరుకుతాయని, అక్కడే బతకొచ్చని రేఖకు చెప్పాడు బిజ్జూ. ఆ మాటలను నమ్మిన రేఖ అమ్మనాన్నలను వదిలేసి కొడుకును తీసుకొని హైదరాబాద్ వచ్చింది. చంపాపేట్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. బిజ్జూ ఇళ్లకు పెయింటింగ్ వేసే పనులు చేస్తుండేవాడు. రేఖ ఇంటిపట్టునే ఉండేది. పిల్లవాడిని అదే కాలనీలో ఉండే స్కూల్లో చేర్చాడు బిజ్జూ. తండ్రి స్థానంలో తన పేరు, ఫొటో వివరాలు ఇచ్చాడు. పిల్లవాడు రోజూ స్కూల్కెళుతున్నాడు. బిజ్జూ పెయింటింగ్ పనులకు వెళుతున్నాడు.ఒకరోజు...‘అతనెవరు?’ అడిగాడు బిజ్జూ.‘ఎవరు?’ అడిగింది రేఖ.‘ఇందాక నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి’‘ఏదో అడ్రస్ అడిగితే చెప్పాను’‘అబద్ధం’‘అయ్యో.. అదే నిజం’‘మగావాళ్లు కనిపిస్తే చాలు నవ్వుతూ మాట్లాడతావు’‘అది కూడా తప్పేనా?’‘నన్ను తగులుకున్నది చాలదా. ఇంకా ఎంతమందిని తగలుకోవాలనుకుంటున్నావ్?’ఫట్‌మంటూ దెబ్బ పడింది.ఆరోజున పడ్డ అనుమానం పెనుభూతం అయ్యింది. మద్యానికి అలవాటైన బిజ్జూ పగలు కూడా తాగుతూ పనులు కెళ్లడం తగ్గించాడు. నిజానికి రేఖ మీద కాపలా కోసం ఇంట్లోనే ఉండిపోసాగాడు. కాని ఇల్లు గడవాలిగా. చుట్టుపక్కల తెలిసిన వారి ద్వారా భవన నిర్మాణ కూలీగా పనులకు వెళ్లడం మొదలుపెట్టింది రేఖ. దీంతో బిజ్జూకి ఇంకా అనుమానం పెరిగింది. పని మానేయమని లేకుంటే పిల్లవాడిని చంపేస్తానని బెదిరించేవాడు. ఓ రోజు రాత్రి అన్నంత పని చేయబోయాడు. కూరగాయలు కోసే కత్తితో పిల్లవాడి మీద దాడి చేయబోయాడు. అడ్డం పడ్డ రేఖ బిజ్జూని నెట్టేసి కొడుకును తీసుకొని బయటకు నడిచింది. ఆ రోజు రాత్రి ఇంటి బయటే ఉండిపోయింది. బిజ్జూతో ఉంటే తను, తన కొడుకు బతకడం కష్టమే అనిపించింది రేఖకు. తను పనిచేసే చోట ఒకామె సాయంతో గది చూసుకొని, బిజ్జూ తాగి పడుకున్న సమయంలో కొడుకును తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. బిజ్జూ రేఖ కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆమె పని చేసే చోటుకి వెళ్లాడు. అక్కడ పని మానేసిందని తెలిసింది. రేఖ మరో చోట కూలీ పని చూసుకుంటూ కొడుకును పోషించుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతోంది. నెల రోజుల తర్వాత ఓ రోజు రేఖ ఎక్కడ ఉందో కనిపెట్టిన బిజ్జూ ఆమెను వెంబడించాడు. రాత్రి వరకు ఆ చుట్టుపక్కలనే తిరిగాడు. చుట్టుపక్కల అంతటా సద్దుమణిగాక రేఖ ఇంట్లోకి జొరపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో తల్లీ, కొడుకులిద్దరినీ చంపేసి వెళ్లిపోయాడు. కొద్దిపాటి సామాను, పిల్లవాడి బట్టలు ఇంటి నుంచి వస్తూ వస్తూ తనతో పాటు తెచ్చుకుంది రేఖ. బిజ్జూకు తెలియకుండా ఎక్కడో ఓ మూలన కొడుకుతో హాయిగా బతికేయచ్చు అనుకుంది. తనను కాదని వెళ్లిపోయి మరెవరికో సొంతమవుతుందన్న అనుమానంతో రేఖపై ద్వేషాన్ని పెంచుకున్నాడు బిజ్జూ. ఆ అనుమానంతోనే రేఖ, ఆమె కొడుకు బబ్లూను చంపేశాడు. పోలీసులకు పట్టుబడకూడదని బీహార్ వెళ్లిపోయాడు. తన గురించి పోలీసులకు తెలిసుండే అవకాశమే లేదనుకున్నాడు బిజ్జూ.కాని హైదరాబాద్‌లో పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి మనసు ఆగక ప్రతి నేరస్తుడు చేసినట్టే వివరాల కోసం ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ అతడెక్కడున్నాడో తెలుసుకునే వీలు కల్పించింది. నమ్మకం కోల్పోయిన వ్యక్తి నరకం చూపిస్తాడు నరకం అనుభవిస్తాడు ప్రస్తుతం బిజ్జూ కటకటాల వెనుక ఉన్నాడు. – నిర్మలారెడ్డి -
విరిగి పడితే ప్రమాదమే!
సత్తుపల్లి : ఖమ్మం–సత్తుపల్లి వరకు రాష్ట్రీయ రహ దారి పక్కన వందల సంఖ్యలో పెద్దపెద్ద వృక్షాలు ఎండిపోయి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి గాలిదుమారానికే విరిగి పడే పరిస్థితిలో ఆ చెట్లు ఉన్నాయి. అసలే వర్షాకాలం అయి నందున ఎప్పుడు చెట్లు పడిపోతాయోనని ప్రయా ణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలుమార్లు విరిగిపడిన చెట్లతో గంటల తరబడి ట్రాఫి క్ జామ్ అయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రహదారిపై గంటకు 500లకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చిన్నపాటి అంతరా యం కలిగిన ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడా ల్సి వస్తోంది. గత వారంలో వైరా బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ జామ్ కావడంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కూలేందుకు సిద్ధంగా ఉన్న వృక్షాలు...: ∙తనికెళ్ల వద్ద ఎండిపోయిన చెట్లు విరగటానికి సిద్ధంగా ఉన్నాయి.. ∙వైరా శివారులోని పాఠశాల వద్ద చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙తల్లాడ–పినపాక సమీపంలో చెట్లు ఎండిపోయిన ఉన్నాయి. ∙తల్లాడ మండలం మిట్టపల్లి శివారులోని చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙కల్లూరు–హనుమన్తండా–కొత్తనారాయణపురం గ్రామాల మధ్య చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద చెట్లు ఎండిపోయిన ఉన్నాయి. ∙వి.ఎం.బంజరు శివారులో చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙పెనుబల్లి మండాలపాడులో చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙కొత్తలంకపల్లి–కిష్టారం మధ్యలో చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ఈ విషయమై ఆర్అండ్బీ ఈఈ హేమలతను వివరణ కోరగా ఎండిపోయిన చెట్లను తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న ఎండిపోయిన చెట్లను తొలగిస్తాం. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామన్నారు. -
కుడి ఎడమల మధ్య.. రహదారి రక్తసిక్తం!
సాక్షి, హైదరాబాద్: ‘వాహనాలు ఎడమ వైపునే వెళ్లాలి.. కుడివైపు నుంచి మాత్రమే ఓవర్టేక్ చేయాలి’ఇది మన దేశంలో ట్రాఫిక్ నిబంధన. కానీ హైవేలపై ఎడమ వైపు నుంచి వెళ్లాల్సిన లోడ్‌లారీలు కుడివైపు నుంచి వెళ్తున్నా యి. దీంతో అనివార్యంగా ఎడమ వైపు నుంచే ఓవర్టేక్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది డ్రైవర్లలో అయోమయానికి కారణమై తరచూ ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. శనివారం ప్రజ్ఞాపూర్ సమీపంలోని రిమ్మనగూడ వద్ద జరిగిన ఘోర దుర్ఘటనకు కూడా ఇదే కారణంగా కనిపిస్తోంది. ఎడమ వైపు నుంచే ఓవర్టేక్ చేసే క్రమం లో ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఒకవేళ కుడి వైపు నుంచి ఓవర్టేక్ చేస్తూ.. లారీని ఢీ కొని ఉంటే లారీ ఎడమవైపు రోడ్డు దిగువకు దూసుకెళ్లి ఉండేది. ప్రమాదం తప్పేది. కానీ ఎడమ వైపు నుంచి ఢీ కొనటంలో లారీ.. అవతలి రోడ్డుపై కంటైనర్, కారును ఢీకొంది. దీంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇంత జరుగుతున్నా.. ఇటు పోలీసు శాఖ కానీ అటు రవాణా శాఖ పట్టించుకోవట్లేదు. ఏం జరుగుతోంది? సాధారణంగా హెవీ లోడ్ లారీలు, కంటైనర్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి. ఇవి రోడ్డుకు ఎడమ వైపున వెళ్లాలి. వేగంగా వెళ్లే కార్లు, బస్సులు కుడివైపున వెళ్లాలి. కానీ మనరోడ్లపై లారీలు పూర్తిగా కుడి వైపు నుంచి వెళ్తున్నాయి. దీంతో వెనక వచ్చే కార్లు, బస్సులు వాటి ని నిబంధనలకు విరుద్ధంగా ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయాల్సి వస్తోంది. వేరే వాహనాలు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేసేప్పుడు ఉన్నట్టుండి ముందున్న లారీలు కూడా ఎడమ వైపు జరుగుతున్న సందర్భాలూ ఉన్నాయి. ఎడమవైపు నుంచి వెళ్లే ద్విచక్ర వాహనాలకు ఈ తప్పుడు ఓవర్ టేకింగ్స్ ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఓవర్టేక్ చేసేప్పుడు భారీ వాహనాలు ఎడమవైపు వచ్చి ద్విచక్రవాహనాలపైకి వెళ్తున్నాయి. పరిమితికి మించి పొడవు బస్సుల తయారీలో నిబంధనల ఉల్లంఘన కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కంపెనీలు నిబంధనల ప్రకారమే చాసిస్‌ను రూపొందిస్తున్నాయి. తర్వాత దానికి బాడీ తయారు చేసేప్పుడు నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధన 93.. బస్సు పొడవు, ఎత్తు తదితర వివరాలను స్పష్టం చేస్తోంది. రవాణా బస్సు 12 మీటర్లకు మించి పొడవు, 3.8 మీటర్లకు మించి ఎత్తు ఉండొద్దు. కానీ సంస్థలు అక్రమంగా బస్సు పొడవు, ఎత్తు పెంచుతున్నాయి. బాడీ తయారీ సమయంలో ముప్పావు మీటరు మేర దానికి అతుకు ఏర్పాటు చేసి పొడవు పెం చేస్తున్నాయి. అదనంగా సీట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో బస్సు సులభంగా అదుపు తప్పేందుకు కారణమవుతోందని, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. బస్సుపై భాగంలో మాత్రమే లగేజీ ఏర్పాటుకు చట్టం అనుమతిస్తోంది. కానీ బస్సు దిగువ భాగంలో విడిగా క్యాబిన్ ఏర్పాటు చేసి లగేజీ ఉంచుతున్నారు. బస్సు ఎత్తు పెరగటానికి ఇది కూడా కారణమవుతోంది. ఆర్టీసీ కూడా ఈ అక్రమాలకు పాల్పడుతోంది. కంపెనీ రూపొందించే చాసిస్‌కు అతుకు ఏర్పాటు చేసి పరిమితికి మించి బాడీ రూపొందిస్తోంది. ఉల్లంఘనలే కారణం.. ఎడమ వైపు నుంచి వేగంగా ఓవర్టేక్ చేయటం, బస్సులను పరిమితికి మించి పొడవుగా రూపొందించటం.. ఈ రెండు ఉల్లంఘనలు భారీ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది. వీటిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజా ప్రమాదంలోనూ ఈ ఉల్లంఘనలే కారణమై ఉంటాయని అనిపిస్తోంది. – ‘సాక్షి’తో రవాణా శాఖ విశ్రాంత అదనపు కమిషనర్, హైకోర్టు న్యాయవాది సీఎల్ఎన్ గాంధీ -
ప్రయాణం..ప్రాణసంకటం
ఆదిలాబాద్: ఈనెల 6న నల్లగొండ జిల్లాలో పరిమితికి మించి ట్రాక్టర్లో 25మంది వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం లోయ లో పడి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన తెలిసిందే. డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడపడం, ఇంజిన్ సీటుపై ముగ్గురు కూర్చోవడంతో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతున్నా.. డ్రైవర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీపులు, ఆటోలు, టాటాఏసీల్లో పరిమితికి మించి నిత్యం ఇలా ప్రమాదపు అంచున ప్రయాణిస్తూ కనిపిస్తుంటారు. ఇందులో చాలా మంది సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం డ్రైవింగ్ చేసే వారే ఉంటారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉంది. పరిమితికి మించి ప్రయాణం.. పరిమితికి మించి ప్రయాణం.. ప్రాణం మీదకు తెస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏడాది ప్రయాణికులను తరలించే వాహనాలతో పాటు కొన్నిసార్లు గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఇందులో ముఖ్యంగా జీపులు, ఆటోలు, టాటాఏస్‌లు టాప్ పైనే కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. డ్రైవర్ కూర్చొని వాహనం నడిపే వీలులేకుండా ముందర సీట్లో ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఆటోలో నలుగురు ప్రయాణికులు కూర్చోవాలి. కానీ ఆటో డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా అత్యాశతో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. జీపులు, టాటాఏస్‌లో కూడా ఈ ఇదే పరిస్థితి. గ్రామాల నుంచి తరలింపు.. వాహనాల్లో ప్రయాణించే క్రమంలో గ్రామాల నుంచి వచ్చే జీపులు, ఆటోలు, టాటా ఏఎస్‌లలో 10 మందికి తక్కువ కాకుండా తీసుకొస్తున్నారు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేసే సమయంలో వారిని చూసే వాహనాలు అక్కడే నిలిపివేస్తున్నారే తప్ప.. ప్రయాణికులను మాత్రం తగ్గించడం లేదు. వ్యవసాయ కూలీలను తీసుకెళ్లే సమయంలో, పాఠశాలలకు విద్యార్థులను తరలించేటప్పుడు ఎక్కువ మందిని తీసుకెళ్తున్నారు. నిత్యం ఆదిలాబాద్ పట్టణంలో ఆటోల్లో విద్యార్థులు ముందు సీట్లలో, వెనకసీట్లలో నిండిపోయి కనిపిస్తుంటారు. జరగరానిది ఏదైనా జరిగితే చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా వాహనదారులు, డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు. ధనార్జనే ధ్యేయంగా కొంత మంది పరిమితికి మించి ప్రయాణికులను తరలించి ప్రాణం మీదకు తీసుకొస్తున్నారు. నిబంధనలు గాలికి.. వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులతో పాటు ప్రయాణికులను తరలించే డ్రైవర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇందులో అతివేగంగా నడపడంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం నిబంధనలకు విరుద్ధమే. కొంత మందికి లైసెన్సు లేకుండా కూడా వాహనాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు తనఖీ చేసే సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిబంధనల ప్రకారం వాహనాలకు ఉండాల్సిన పత్రాలు ఉంచుకోవడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆటోల్లోనే పట్టణాలకు వస్తుంటారు. అయితే వాహనాలు నిండే వరకు డ్రైవర్ ప్రయాణికులను తీసుకెళ్లకపోవడం గమనార్హం. దీంతో డ్రైవర్‌కు ముందు సీట్లలో ఇరువైపులా కూర్చోబెట్టుకోవడం ద్వారా వాహనం అదుపు చేయలేక బోల్తాపడుతున్నాయి. పరిమితికి మించితే చర్యలు వాహనాల్లో ప్రయాణికులను పరిమితికి మించి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఆటోలు, జీపులపైన కూర్చోబెట్టి తీసుకెళ్లకూడదు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడడం వల్ల వాహనాలు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. మన ప్రాణాలే కాదు.. మన మీద ఆధారపడిన వారు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకొని డ్రైవర్లు వాహనాలు నడపాలి. – నర్సింహారెడ్డి, డీఎస్పీ ఆదిలాబాద్ -
మతోన్మాదంతో సామాన్యులకు హాని
భద్రాచలం: బీజేపీ పాలనలో మతోన్మాదం పెరుగుతుందని, దీని వల్ల సామాన్యులకు హాని జరిగే ప్రమాదం ఉందని సాంస్కృతిక ఉద్యమ కార్యకర్త దేవి అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలోని అం బేద్కర్ సెంటర్లో జరిగిన సెమినార్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాల్గేళ్ల కాలంలో మతోన్మాదులు పెరిగారని, దీని వల్ల ముస్లిం, మైనార్టీ, ఆదివాసీలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఆవు మాంసం తింటున్నారనే పేరుతో ముస్లిం, దళితులు, ఆదివాసీలపై ఆర్ఎస్ఎస్ మూకలు తెగబడుతున్నాయన్నారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, వారి మధ్య ఐక్యతను దెబ్బతీసి రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. బీజేపీ పాలనలో కవులు, రచయితలపై దాడులు పెరిగిపోయాయని, భావ స్వేచ్చకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. బీజేపీ పాలనలో పౌరహక్కులు, మానవ హక్కుల కంటే జంతు హక్కులే ఎక్కువగా రక్షించబడుతున్నాయని ఎద్దేవా చేశారు. మతోన్మాద శక్తులను తిప్పికొట్టేందుకు ప్రజానీకం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సెమినార్లో సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పట్టణ కార్యదర్శి బి.వెంకటరెడ్డి, ఏజే రమేష్, మర్లపాటి రేణుక, పద్మ, గడ్డం స్వామి, బండారు శరత్ బాబు, వెంకటరామారావు, లీలావతి, సంతోష్, నాగరాజు పాల్గొన్నారు. -
ఈత కొలనుల వద్ద ప్రమాద హెచ్చరికలు
ఆసిఫాబాద్ : వేసవి సెలవుల్లో ఉపశమనం కోసం ఈతకు వెళ్లిన విద్యార్థులు, ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని వాగులు, ఒర్రెల వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వేసవిలో సరదా కోసం ఈత కొలనుల వద్దకు వెళ్లి పిల్లలు మృత్యు వాత పడుతున్నారని, ముందు జాగ్రత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈతకు వెళ్లడం నిషేదమన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఖమ్రొద్దీన్, పోలీసులు పాల్గొన్నారు. -
‘మత్తు’ మింగేసింది..
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరో ఘోరానికి కారణమైంది. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారులో దూసుకువచ్చిన ఓ వ్యక్తి.. ముందు వెళ్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువతుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు బ్రెయిన్‌డెడ్ కాగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మోతాదుకు మించి మద్యం తాగి.. పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట ప్రాంతానికి చెందిన పాల విష్ణువర్థన్(35) హిమాయత్‌నగర్‌లో బ్రైౖట్ స్పార్క్పేరుతో ప్లేస్కూల్ నడిపిస్తున్నాడు. ఇతని భార్య ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లు దుబాయ్‌లో పనిచేసి వచ్చిన విష్ణు శనివారం రాత్రి మాదాపూర్‌లోని స్నేహితుడి ఇంట్లో జరిగిన విందుకు హాజరయ్యాడు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్న విష్ణు, మోతాదుకు మించి మద్యం తాగి అదే స్థితిలో తన టాటా హెక్సా(టీఎస్09ఈవీ7707) కారు నడుపుకుంటూ ఇంటికి బయలుదేరాడు. మామూలుగా అయితే పంజగుట్ట రావడానికి విష్ణు జూబ్లీహిల్స్ 36/10 రోడ్డును వినియోగించాలి. కానీ అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయని ముందే తెలియడంతో విష్ణు గల్లీల మీదుగా.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోకి వెళ్లాడు. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి.. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఈ కారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని డైమండ్ హౌస్ దాటుకుని ముందుకు వెళ్లింది. మితిమీరిన వేగంతో ఉన్న కారు అదుపుతప్పి ముందు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న అనూషారెడ్డి అలియాస్ ప్రియారెడ్డి అలియాస్ వెంకటలక్ష్మి(30)తో పాటు మధ్యలో కూర్చున్న మస్తానీ(35), వెనక కూర్చున్న అనూష(19) రోడ్డుపై పడ్డారు. హెక్సా కారు బాటమ్ కాస్త ఎత్తుగా ఉండటంతో మస్తానీ కారు కింద ఇరుక్కుపోయింది. మద్యం మత్తులో ఈ విషయాన్ని గుర్తించని విష్ణు అలానే దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకుపోయాడు. దీంతో మస్తానీ అక్కడికక్కడే మృతిచెందింది. అనూషారెడ్డి తల పగలడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అనూష నడిరోడ్డుపై విలవిల్లాడుతుండటంతో గుర్తించిన స్థానికులు ‘108’కి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి, మస్తానీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు, క్షతగాత్రులు ఎవరు? ప్రమాదంలో మృతిచెందిన మస్తానీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి దేవభక్తుని సురేష్‌కుమార్‌కు రెండో భార్య అని తేలింది. రెండేళ్ల నుంచి శ్రీనగర్‌కాలనీలోని గణేష్ కాంప్లెక్స్ వద్ద ఇల్లు అద్దెకు తీసుకుని స్నేహితులతో కలసి ఉంటోంది. జూనియర్ ఆర్టిస్టుగా, బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మస్తానీ ఫోన్లో ఉన్న నంబర్ ఆధారంగా భర్త సురేష్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, బ్రెయిన్‌డెడ్ అయిన అనూషారెడ్డికి సంబం«ధించిన వివరాలపై మిస్టరీ నెలకొంది. ప్రస్తుతం మస్తానీతోపాటే ఉంటున్న ఈమె కొన్నాళ్లు జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అనూష మూడు రోజుల క్రితమే సిటీకి వచ్చి కూకట్‌పల్లికి చెందిన నిహారిక అనే యువతి వద్ద ఉంటున్నట్లు తెలిసింది. మస్తానీ ప్రతి ఆదివారం కిట్టీ పార్టీలు నిర్వహిస్తుంటుంది. శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో స్కూటీపై కూకట్పల్లి వెళ్లిన మస్తానీ, అనూషారెడ్డి.. ఆదివారం తమ ఇంట్లో కిట్టీపార్టీ ఉందని రావాలని అనూషను కోరడంతో ముగ్గురూ కలసి స్కూటీపై బయలుదేరారు. అయితే వీరంతా ఆ సమయంలో ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారనే దానిపై స్పష్టత లేదు. ఈ ముగ్గురికీ పరిచయం ఏంటనేది తేలాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగినా.. కారు ఆపలేదు.. తన కారు స్కూటీని ఢీకొన్నా.. విష్ణు కారు ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా వేగాన్ని మరింత పెంచుతూ దాదాపు అర కిలోమీటర్ వెళ్లిపోయాడు. అక్కడి సదరన్ స్పైస్ రెస్టారెంట్ వద్ద వేగాన్ని నియంత్రించలేకపోవడంతో కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అక్కడకు చేరుకున్న పోలీసులు విష్ణును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు మద్యం తాగిన ఆనవాళ్లు ఉండటంతో శ్వాసపరీక్ష యంత్రంతో పరీక్షించారు. దీంతో విష్ణు బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 206గా నమోదైంది. విష్ణును అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిపై ఐపీసీలోని 304(పార్ట్–2), 337, ఎంవీ యాక్ట్‌లోని 185 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ప్రమాదంలో ఉత్తరాఖండ్ ?
సాక్షి, డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వలసలు వేధిస్తున్నాయి. అక్కడి గ్రామాలు నానాటికి హరించుకుపోతున్నాయి. పర్వతమయ ప్రాంతాల్లో ఉండలేక, తమ బతుకులు ముందుకు తీసుకెళ్లలేక ప్రతి ఏడాది ఊర్లకు ఊర్లే ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. యువకులంతా కూడా తమ గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు. దీంతో కనీసం 20 ఏండ్ల నుంచైనా తమ పిల్లలను చూసుకోలేని పరిస్థితి ఉన్న తల్లిదండ్రులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఉదాహరణకు పౌరీ జిల్లాలో భోకాండి అనే గ్రామంలో ఇద్దరంటే ఇద్దరే వ్యక్తులు ఉంటున్నారు. ఇద్దరు ముసలి వారే. ప్యారేలాల్ కు 75 ఏళ్లు ఉండగా ఆయన భార్య సుదామకు దాదాపు అంతే వయసు. పైగా ఆమెకు చూపులేదు. దాదాపు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న వారి ఇంటి ముందు బిక్కుబిక్కుమంటూ ఆకలి బాధతో ఒళ్లంతా కృశించిపోయి వారిని కలిసి మీడియా ప్రతినిధులతో అతికష్టంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. వారి పరిస్థితి చూసిన ఎవరైనా కళ్లు చెమర్చాల్సిందే. 'మా బిడ్డ మనోజ్ ఉద్యోగం కోసం నగరం వెళ్లిపోయాడు. ఎప్పుడోగానీ వస్తాడు వెంటనే వెళతాడు. మాకు తెలుసు వాడు ఇక రాడని. అందరిలాగే వాడికి వయసొచ్చింది.. వెళ్లిపోయాడు' అని చెప్పుకుంటూ ఏడ్చేశారు. ఇలాగే ముసలి తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లిపోతున్న మనోజ్‌లు ఇప్పుడు ఉత్తరాఖండ్ గ్రామాల్లో కోకొల్లలు. ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల నుంచి లక్షల్లో యువత వలస వెళుతున్నారు. ఒక్క పౌరీ జిల్లాలోనే దాదాపు 300 గ్రామాలు వలసల కారణంగా నిర్మాణుష్యంగా మారాయంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా మరికొన్ని గ్రామాలు చెప్పుకుంటూ వెళితే కేసుందర్ అనే గ్రామంలో 199మంది ఉండగా వారిలో చాలామంది 50 ఏళ్లు పైబడినవారే.. ఇక అన్సోలి అనే గ్రామంలో 69మందే ఉండగా వారిలో 13మంది మాత్రమే యువకులు ఉన్నారు. ఇక సిరోలి అనే గ్రామంలో 181మంది ఉండగా వారిలో 20మంది మాత్రమే యువకులు. ప్రస్తుతం గ్రామాల్లో బతికే పరిస్థితులు లేకపోవడం, వారికి ఉపాధి లేని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
మైసూరు ప్యాలెస్‌కు డేంజర్
సాక్షి, మైసూరు: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మైసూరు ప్యాలెస్ కూడా ఉగ్ర ముప్పు పొంచిఉంది. దసరా ఉత్సవాలలోనే కాకుండా ప్రతిరోజూ దేశవిదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. దాంతో ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో మైసూరు ప్యాలెస్ ఉందని నిఘా సంస్థలు పేర్కొనడంతో మైసూర్ ప్యాలెస్‌కు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా భధ్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీస్‌శాఖ, అగ్నిమాపకశాఖలకు కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్యాలెస్ ఆవరణలో ఇకపై 24 గంటల పాటు భధ్రతా బలగాల పహారాతో పాటు ప్యాలెస్ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, సిబ్బందికి కార్యాలయం, బస ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్ డీ.రందీప్ రెండు శాఖలకు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోనున్న ఎన్ఐఏ అధికారులు మూడుసార్లు మైసూరు ప్యాలెస్‌లో భధ్రతా ఏర్పాట్లు పరిశీలించి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరింత భధ్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. అంతేకాకుండా ప్రైవేటు భధ్రతా సిబ్బందితో పాటు ప్రస్తుతమున్న సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలు అమర్చాలని చెప్పారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండడానికి ప్యాలెస్ ఆవరణలోనే అగ్నిమాపక వాహనాలు, కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ సూచించారు. ఎన్ఐఏ అధికారుల సూచనల ప్రకారం అదనపు భధ్రతా సిబ్బంది, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక వాహనాలు, కార్యాలయం, సిబ్బందిని మాత్రం ఇంతవరకూ ఏర్పాటు చేయలేకపోయారు. గత సంఘటనల దృష్ట్యా... సుమారు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించిన మైసూరు ప్యాలెస్‌లో రెండు శతాబ్దాల క్రితం జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ప్యాలెస్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. అనంతరం అదేస్థలంలో ప్రస్తుతమున్న ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రస్తుతమున్న అంబావిలాస్ ప్యాలెస్‌లో అరుదైన, ఎంతో విలువైన చెట్లతో స్తంభాలను ఏర్పాటు చేసారు. కోట్లాది రూపాయల విలువ చేసే బంగారుపూతతో ఈ స్తంభాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇలా ప్యాలెస్‌లో ప్రతీ వస్తువు, స్తంభాలు తదితర వస్తువులన్నింటినీ అరుదైన వృక్షాల దుంగలతో నిర్మించారు. అంతేకాకుండా ప్యాలెస్‌లో కోట్ల విలువ చేసే తైలవర్ణ చిత్రలేఖనాలు, వంశపారంపర్య, చార్రితాత్మక కట్టడాలు, విగ్రహాలు ఉన్నాయి. దీంతో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా లేదా ఉగ్రవాదుల దాడి నుంచి ప్యాలెస్‌ను రక్షించడానికి వీలుగా ప్యాలెస్ ఆవరణలో అగ్నిమాపక వాహనాలు, కార్యాలయంతో పాటు సిబ్బందికి కూడా అక్కడే బస ఏర్పాటు చేయాలంటూ ఎన్ఐఏ సూచించింది. వీటితో పాటు 72 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్యాలెస్ చుట్టుపక్కల వందల సంవత్సరాల కాలం నాటి దేవాలయాలు, మ్యూజియంతో పాటు రాజ వంశానికి చెందిన అశ్వాలు, ఏనుగులు, ఒంటెలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్యాలెస్ వెనుకభాగంలోనే రాజ వంశస్థులు కూడా తరతరాలుగా నివాసం ఉంటుండడంతో ప్యాలెస్‌లో భధ్రతను కట్టుదిట్టం చేయాలంటూ ఎన్ఐఏ సూచించింది. దీంతో బెంగళూరు నగరంలోని విధానసౌధ, ఎం.ఎస్.రామయ్య బిల్డింగ్, హైకోర్టు, రాజ్‌భవన్ తదితర కట్టడాల ఆవరణలో ఏర్పాటు చేసిన విధంగానే ప్యాలెస్ ఆవరణలో కూడా అగ్నిమాపక కేంద్రం, వాహనాలు, సిబ్బందిని నియమించాలంటూ రాష్ట్ర అగ్నిమాపక దళం డీజీపీ, పోలీసుశాఖ డీజీపీలను ఆదేశించారు. -
విశాఖకు మరో ముప్పు
-
అతిగా నీళ్లు తాగుతున్నారా?, బీ కేర్‌ఫుల్..
క్యాన్బెరా: అతి ఏదైనా అనర్థమే అన్నది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు పరిశోధకులు. ప్రాణాధారంగా భావించే నీరే కొన్నిసార్లు ప్రాణాలను తీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. శరీరం అవసరానికి మించి నీరు తాగితే వాంతులు, కళ్ళు తిరగడం వంటివి సంభవించి కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిమీద ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. కొంతమందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు చేత అవసరం లేకున్నా నీరు తాగించారు. మరొక గ్రూపు చేత అవసరం ఉన్నంత మేరకే నీరు తాగించారు. అనంతరం రెండు గ్రూపుల వారి ఆరోగ్యాన్ని పరీక్షించారు. అవసరానికి మించి నీరు తాగిన వారిలో వాంతులు, వికారం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. రెండో గ్రూపులో అలాంటివి కనిపించలేదు. మొదటి గ్రూపు వారిలో కనిపించిన లక్షణాలను ఏ మాత్రం ఆలస్యం చేసినా కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. water, coma, body, danger -
సెల్ఫీకన్నా.. ప్రాణం గొప్పదా?!
-
సెల్ఫీకన్నా.. ప్రాణం గొప్పదా?!
కెమెరా ఫోన్లు అందులోనూ.. సెల్ఫీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక.. ఈ పిచ్చి ప్రపంచమంతా బాగా ముదిరింది. ప్రమాదాల అంచుల్లోనూ, హరికేన్ల విలయతాండవం దగ్గరా.. యాక్సిడెంట్ అయిన చోటా.. ఇలా ఒకటేమిటి ప్రతిచోటా సెల్ఫీలే. ఈ పిచ్చి నేడు మరింత పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అత్యంత ప్రమాకర ప్రాంతాల్లో సైతం సెల్ఫీ తీసుకుని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనేంతగా యువతను పరుగులు తీయిస్తోంది. ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకునే క్రమంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారని అధికారులు చెబుతున్నా.. యువత ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సెల్ఫీ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తామంటోది నేటి యువత. -
ప్లాట్‌ఫాం మీదకు దూసుకొచ్చిన బస్సు
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం నారాయణపేట రూరల్ : డ్రైవర్ అజాగ్రత్తతో ఆర్టీసీ అద్దె బస్సు బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాం మీదకు దూసుకువచ్చింది. ఈ సంఘటనలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పేట ఆర్టీసీ డిపోలో అద్దె ప్రాతిపదికన నడుస్తున్న బస్సు ప్రతిరోజు పరిగి– హైదరాబాద్ రూట్లో తిరుగుతుంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఆదివారం ఉదయం రూట్‌పై వెళ్లేందుకు బస్టాండ్‌లోని ఫ్లాట్‌ఫాం నం.4 దగ్గర ఆపాలి. అక్కడ యానాగుంది బస్సు ఉండటంతో ఫ్లాట్‌ఫాం నం.3 పై బస్సు ఆపేందుకు ప్రయత్నిస్తూ అజాగ్రత్తగా నడపడంతో ఒక్కసారిగా బస్సు జంప్ అయ్యి బస్టాండ్‌లోకి దూసుకువచ్చి స్తంభాన్ని ఢీకొట్టింది. ఉదయం వేళ, సెలవు రోజు కావడంతో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే సమయంలో పేపర్ బాయ్స్ దినపత్రికలను సరిచేసుకుంటూ అక్కడే కూర్చోగా.. బస్సును గమనించి పక్కకు తప్పుకోవడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన బస్సుకు సంబంధించిన బ్రేక్ ఎప్పుడూ మొరాయిస్తుందని, యజమాని పట్టించుకోడని ఇతర బస్సు డ్రైవర్లు ఆరోపించారు. ఏదేమైనా డిపోను ఆర్ఎం తనిఖీ చేసిన మరునాడే ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
వెంటాడిన మృత్యువు
♦ వంతెన గోడను బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడి మృతి ♦ మరొకరికి తీవ్ర గాయాలు ♦ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకువస్తుండగా ప్రమాదం ♦ విషాదంలో చినకొవ్వాడ లావేరు: బైక్‌పై ప్రయాణిస్తూ వంతెన గోడను ఢీకొట్టిన ఘటనలో రణస్థలం మండలం చినకొవ్వాడ గ్రామానికి చెందిన మైలపల్లి పోలయ్య(22) ప్రాణాలు కోల్పోయాడు. బైకు వెనుక కూర్చున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లావేరు మండలం తాళ్లవలస సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి లావేరు ఎస్ఐ సీహెచ్ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రణస్థలం మండలంలోని చినకొవ్వాడ గ్రామానికి చెందిన మైలపల్లి పోలయ్య తన బంధువు కారి రాములుతో కలిసి బుధవారం శ్రీకాకుళం పట్టణంలోని ఓ బ్యాంకుకు వెళ్లాడు. రూ.50 డ్రా చేసుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా అదుపు తప్పి తాళ్లవలస సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వంతెన గోడను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పోలయ్య ఎగిరిపడటంతో తల, కాళ్లు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. రాములు సైతం తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే లావేరు ఎస్ఐ రామారావు సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులిద్దరినీ 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడికి వెళ్లిన కాసేపటికే పోలయ్య మృతి చెందాడు. రాములు చికిత్స పొందుతున్నాడు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే బాధిత కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి పరుగులు తీశారు. పోలయ్య మృతి వార్త తెలుసుకుని బోరున విలపించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే.. హెల్మెట్ ధరించకపోవడం వల్లే యువకుడి తలకు బలమైన గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. వంతెనను ఢీకొట్టిన వెంటనే పోలయ్య రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగిందని, అదే హెల్మెట్ ధరించి ఉంటే అంతగా గాయాలు కావని అంటున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐలు తాళ్లవలస హైవేపై ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, జేఆర్‌పురం సీఐ రామకృష్ణలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును లావేరు ఎస్ఐ రామారావును అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అన్నారు. -
కాలగర్భంలో 400 భాషలు!
తెలుగుకు ముప్పు లేదు భాషకు ముప్పొచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల భాషలు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచంలో మొత్తంగా 6000 భాషలున్నట్లు అంచనా. వాటిలో 2050 ఏడాదికల్లా 4000 భాషలు క్రమేపీ మూగబోయే ప్రమాదం ఉందని భాషాశాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వీటిలో పదిశాతం భారతీయ భాషలున్నాయి. ప్రస్తుతం దేశంలో 780 భాషలను మాట్లాడుతుండగా రాబోయే 35 ఏళ్లలో వాటిలో 400 వరకు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఒక పరిశీలన. భాషను కోల్పోవడమంటే పెద్ద ఎత్తున మానవ, సాంస్కృతిక పెట్టుబడిని కోల్పోయినట్టే. ఒక భాష పుట్టడానికి వేలాది ఏళ్లు పడుతుండగా, ఎంతో మానవ సంఘర్షణ తర్వాతే ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ విషయంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు మాట్లాడుతున్న హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠి, కన్నడ, మలయాళం, గుజరాతి, పంజాబీ భాషలకు అటువంటి బెంగ ఏమీ లేదని, ఈ భాషలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉండడంతో ఈ జాబితాలోకి రావంటున్నారు. వీటిపై ఇంగ్లిష్ భాష ›ప్రభావమున్నా ఇవి క్షీణిస్తాయన్న భయం అవసరం లేదని పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పీఎల్ఎస్ఐ) భరోసా ఇస్తోంది. ఈ సంస్థ 27 రాష్ట్రాల్లోని 780 భాషలపై 3000 మందితో అధ్యయనం నిర్వహించింది. ఈ ఏడాది చివరినాటికి సిక్కిం, గోవా, అండమాన్, నికోబార్‌లలోనూ పరిశీలన పూర్తి చేసే ఆలోచనతో ఉంది. ఈ పరిశోధనకు సంబంధించిన 11 సంపుటాలను ఇటీవల ఢిల్లీలో విడుదల చేసింది. తీరప్రాంత భాషలకే ఎక్కువ ముప్పు తీరప్రాంతాల్లో మాట్లాడుతున్న భాషలే ప్రమాదంలో ఉన్నాయని పీఎల్ఎస్ఐ చైర్మన్ గణేష్ ఎన్.దేవి చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి దొరకక సంప్రదాయ మత్స్యకార వర్గాలు తీరానికి దూరమవుతున్నాయి. అధునాతన జీవనశైలి అలవడి క్రమేణా తమ మాతృభాషను వదులుకోవాల్సి వస్తోంది’ అని ఆయన అంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో మాట్లాడే సంతాలి, గోండి, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లలోని భేలి, మిజోరాంలోని మిజో, మేఘాలయాలోని ఖాసి, త్రిపురలోని కోట్బారక్ భాషలు పుంజుకోవడం శుభపరిణామం. ఈ తెగల్లోని విద్యావంతులు భావ వ్యక్తీకరణకు, రచనలకు విరివిగా ఈ భాçషను ఉపయోగిస్తున్నారు. తమ భాషల్లోనే కవితలు, నాటకాలను రాసి ప్రదర్శిస్తుండడం, గోండి వంటి భాషల్లో సినిమాలను కూడా తీస్తుండడం కలిసివస్తోంది. చిత్రపరిశ్రమ పురోభివృద్ధితో భోజ్‌పురి దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న భాషగా నిలుస్తోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఒక బైకు.. ఏడుగురు ప్రయాణికులు..
తిరుపతి: కళ్ల ముందు ఎవరైనా బైక్‌పై నుంచి పడి గాయపడితే అయ్యో పాపం అని జాలి చూపుతాం. ఒక్కో సారి ఏం వీడికి పోయేకాలం అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడు అంటూ క్లాస్ పీకుతుంటాము. అయితే అవేమీ మాకు సంబంధం లేదంటూ కొందరు నగర రోడ్లపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్తున్నారు. అదికూడా బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్న నిబంధనలు ఉన్నా ముగ్గురు.. నలుగురు కాదు కాదు ఏకంగా ఏడు మందికిపైగా ఎక్కించుకుని రోడ్లపై వెళ్తున్నారు. అందులోనూ చిన్న పిల్లలు, మహిళలు ఉంటున్నారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో ఎదురుగా ఏదైనా వాహనాలు వచ్చినా, ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పెను ప్రమాదంతో భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఇలా ప్రయాణించే వారికి ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రమాదం జరిగినప్పుడు అయ్యో పాపం అని చేతులు దులుపుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. -
బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాద సంకేతాలు
రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ మిశ్రా కాకినాడ సిటీ : జిల్లాలోని జాతీయరహదారులు, ఇతర రహదారులలో ప్రమాదాలు సంభవించే అవకాశమున్న బ్లాక్ స్పాట్స్‌లో ప్రమాద సంకేతాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో మంగళవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీటి వద్ద వేగ నియంత్రణ ఉండేలా కూడా సంకేతాలు ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనచోదకులకు అర్ధమయ్యే రీతిలో ప్రమాద సంకేతాలను తెలుగులో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పనులు వచ్చే 20 రోజుల్లో పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఎన్‌హెచ్–16, 216 రహదారిలో వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన భూముల కోసం భూ సేకరణకు ప్రతిపాదనలు పంపాలని ఎన్‌హెచ్ అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే క్వారీ లారీలపై కేసులు నమోదు చేసి వాటిని స్వాధీన పర్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లైటింగ్, ఇతర రోడ్డు భద్రత చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, ఇన్చార్జి డీటీసీ అశోక్‌కుమార్ ప్రసాద్, ఎన్‌హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరత్నం, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ కె.సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు, ఆర్అండ్బీ డీఈలు, పోలీస్, ఎన్‌హెచ్, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బతుకు పోరు
మన ఊరు కాదు, జిల్లా కాదు, ఆ మటకొస్తే మన రాష్ట్రం కూడా కాదు.. ఎక్కడో అసోం, బీహార్ నుంచి వందలు, వేల కిలోమీటర్లు దాటి వచ్చిన వంద మందికిపైగా యువకులు పొట్టకూటి కోసం ఇదిగో ఇలా విద్యుత్ స్తంభాలపై బతుకుపోరాటం చేస్తున్నారు. సోమవారం కర్నూలు నగరంలో 11000 కేవీ విద్యుత్ లైన్‌కు కవర్డ్ కేబుల్ మార్చే పనుల్లో నిమగ్నమై ఉండగా సాక్షి తీసిన చిత్రమిది. ప్రమాదమని తెలిసినా ఇలా ఎత్తయిన విద్యుత్ స్తంభాలపై కూర్చొని బరువైన కేబుల్‌ను అమరుస్తూ వీళ్లు చేసే పనులు చూసినోళ్ల ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది. - డీ హుసేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
వామ్మో.. రెడ్‌క్రాస్!
- అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు – బ్లడ్‌బ్యాంక్‌లో కనీస ప్రమాణాలు పాటించని వైనం – రికార్డుల నిర్వహణా అస్తవ్యస్తమే – ఏపీ శాక్స్‌కు సమగ్ర నివేదిక అనంతపురం మెడికల్ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించాల్సిన రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్ లోపాల పుట్టగా మారింది. మూడు నెలల నుంచి నివేదికలు రాకపోవడంతో ఎయిడ్స్ అండ్ లెప్రసీ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ అనిల్‌కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సొసైటీలో కొనసాగుతున్న రాజకీయ విభేదాల కారణంగా బ్లండ్బ్యాంక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారినట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు ఏపీ శాక్స్‌కు సమగ్ర నివేదిక పంపారు. తనిఖీల్లో భాగంగా అక్కడికి వెళ్లిన డాక్టర్ అనిల్‌కుమార్.. ముందుగా మూడు నెలల నుంచి నివేదికలు పంపని వైనంపై సిబ్బందిని ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు మెయిల్ చేశామని, ఒకసారి ఫోన్ చేసి చెప్పినా ఎందుకు పంపలేదని నిలదీశారు. అక్కడ 24 గంటలు విధుల్లో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లేకపోవడంతో ఎక్కడికెళ్లారని ఆరా తీయగా సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ రోస్టర్ కూడా లేని పరిస్థితి ఉన్నట్లు గ్రహించారు. మొత్తం ల్యాబ్టెక్నీషియన్లతోనే నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఎంత మేరకు బ్లడ్ సేకరిస్తున్నారు.. ఇతరులకు ఇవ్వడానికి వీల్లేకుండా ఉన్న రక్తం ప్యాకెట్లు ఎన్ని.. ఎన్ని ప్యాకెట్లు గడువు ముగిశాయన్న వివరాలు కూడా లేకపోవడంతో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనల మేరకు రాత్రి వేళ కూడా బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహించాల్సి ఉన్నా ఇక్కడా పరిస్థితి లేదు. సిబ్బందిని అడిగితే ఊరికి దూరంగా ఉంది.. ఇక్కడెలా ఉండాలని సమాధానం రావడంతో ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా రక్తం ఇవ్వడానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన డోనర్ గదిలో ఆక్సిజన్ లేకపోవడం, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోకపోవడం, పరిసరాలన్నీ అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ నాలుగుసార్లు బ్లడ్ ప్యాకెట్ల టెంపరేచర్ పరిశీలించాల్సి ఉన్నా అలాంటిదేమీ ఇక్కడ జరగడం లేదని గ్రహించి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మొత్తంగా బ్లండ్ బ్యాంక్‌లో పర్యవేక్షణ లేదన్న విషయాన్ని తెలుసుకుని ఇక్కడి సౌకర్యాల లేమి, అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ శాక్స్‌కు నివేదిక పంపారు. రెడ్‌క్రాస్‌లో ఉన్న పరిస్థితిని ఎయిడ్స్ నియంత్రణ మండలి జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఎయిడ్స్ అండ్ లెప్రసీ విభాగాన్ని చూసిన అధికారులు అస్సలు దృష్టి కేంద్రీకరించకపోవడంతోనే పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైనట్లు తెలుస్తోంది. ఈ బ్లడ్‌బ్యాంక్‌కు రక్తం సేకరించడానికి అవసరమయ్యే బ్యాగ్స్, టెస్టింగ్ సామగ్రి ఏపీ శాక్స్ నుంచే సమకూరుస్తారు. అయితే వీటి లెక్క కూడా అక్కడ లేదని తెలుస్తోంది. -
మైండ్‌ను దొంగిలించే రోజులొస్తున్నాయి?
జెనీవా: మన మదిలో చెలరేగే ఆలోచనల్ని, భావాల్ని ఇతరులు తెలుసుకోగల, మార్చగల, దొంగిలించగల రోజులు రాబోతున్నాయి. ‘మైండ్ రీడింగ్ టెక్నాలజీ’తో పరిశోధకులు దాన్ని సుసాధ్యం చేయబోతున్నారు. మెదడు పనితీరును శాస్త్రీయంగా డీకోడ్ చేయడం ద్వారా ఇది సాధ్యం కానుంది. ఈ విషయాన్ని ‘సైంటిఫిక్ అమెరికా’ అనే మేగజీన్ ప్రచురించింది. అయితే, ఈ మైండ్ రీడింగ్ టెక్నాలజీ వాస్తవరూపం దాలిస్తే.. మానవాళికి పెనుముప్పని మరో వర్గం శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ఆలోచనలను ఇతరులు నియంత్రించడం జరిగితే ఎదురయ్యే అనర్ధాలను అంచనా కూడా వేయలేమంటున్నారు. అందువల్ల ఇప్పటినుంచే మానవహక్కులకు సంబంధించిన కొత్త చట్టాలను రూపొందించాలని స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వర్సిటీ చెందిన శాస్త్రవేత్త మార్సిలో ఐనెకా కోరుతున్నారు. -
రంగు చూసి కొంటే రోగాలే
- నిషేధిత కార్బైడ్‌తో మామిడి పండ్లను మాగబెడుతున్న వ్యాపారులు - పట్టించుకోని అధికారులు - ఇలాంటి పండ్లను తింటే అనారోగ్యం ఖాయమంటున్న వైద్యులు చూసేందుకు చక్కగా ఉంటాయి. సువాసననూ వెదజల్లుతూ నోరూరించేస్తాయి. అలాగని ఏవి పడితే అవి తిన్నామో అసలుకే ఎసరొస్తుంది. ఇదంతా చెబుతోంది మామిడిపళ్ల గురించే. కాల్షియం కార్బైడ్ గుళికలతో మాగబెట్టిన మామిడి పళ్లను కొందరు వ్యాపారులు స్వలాభం కోసం యథేచ్ఛగా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్ : మళ్లీ మామిడి పళ్ల సీజన్ వచ్చేసింది. కలర్ఫుల్గా కనిపించే పండ్లను జనం కూడా బాగానే కొనేస్తున్నారు. అయితే కొనేముందు, తినే ముందు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఎక్కువ మంది వ్యాపారులు నిషేధిత కాల్షియం కార్బైడ్ అనే రసాయన గుళికలు వేసి మామిడి పళ్లను మాగబెట్టేస్తున్నారు. ఇలాంటి వాటిని తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మార్కెట్లోకి చైనా పౌడర్ ప్రభుత్వం జీఓ జారీ చేసినా, అధికారులు హెచ్చరికలు చేస్తున్నా వ్యాపారులు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. తోటల్లోనూ, రహస్య ప్రాంతాల్లో మామిడి పళ్లను కార్భైడ్‌తో మాగబెడుతున్నారు. కార్భైడ్పై నిఘా ఉండటంతో ఇటీవల చైనా నుంచి మరో రకం పౌడర్ అందుబాటులోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇపుడు చాలామంది చైనా పౌడర్‌తో మామిడి పండ్లను మాగబెట్టి మార్కెట్లోకి వదులుతున్నట్లు సమాచారం. అధికారుల మధ్య సమన్వయ లోపం ఉద్యానశాఖ, మార్కెటింగ్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో యథేచ్చగా కార్భైడ్ పండ్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అధికారులు సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం మాగబెట్టని వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 39 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉండగా అందులో కాపుకు వచ్చినవి 20 వేల హెక్టార్లలో ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా మాగబెడతారు మండీలు, తోటల్లో కాయలను కుప్పగా పోసి రాళ్లు మాదిరిగా ఉండే కాల్షియం కార్బైడ్‌ను చిన్నపాటి గుళికలు చేసి చిన్న చిన్న పాలిథీన్ కవర్లలో పెట్టి పైన పేపర్లు, గడ్డి లాంటివి కప్పుతారు. కాల్షియం కార్బైడ్ వల్ల ప్రమాదకరమైన అసిటలీన్ అనే వాయువును విడుదలవుతుంది. పక్వానికి రాని మామిడికాయలను ఒక రోజులోనే మాగేటట్లు చేస్తుంది. అసిటలీన్ అనే వాయువు చాలా ప్రమాదకరమైంది. మాములుగా అసిటలీన్ను వెల్డింగ్ ప్రక్రియలో ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో కాల్షియం కార్బైడ్ అనే రసాయనం అతి తక్కువ ధరకు లభిస్తుంది. కాల్షియం కార్బైడ్ కాకుండా మరికొందరు క్రిమిసంహారక ముందులు కూడా పిచికారి చేస్తున్నారు. ఆరోగ్యంపై ప్రభావం కాల్షియం కార్బైట్‌తో మాగబెట్టిన పండ్లను తింటే నోటి అల్సర్, గ్యాస్ట్రిక్, డయేరియా, క్యాన్సర్, నాడీ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అనేకమైన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ రంగుతో లభించే పండ్లను కొనకూడదనీ, పండ్ల పై భాగంలో రసాయనాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్న తర్వాత ఉప్పు కలిపిన నీటితో బాగా శుభ్రం చేసి తినాలని చెబుతున్నారు. కార్బైడ్ పండ్లలో పోషకాలు కూడా ఉండవని వైద్యులు చెబుతున్నారు. సహజ పద్ధతులే మేలు వరిగడ్డి లేదా బోధగడ్డి లాంటి సహజ పద్ధతులతో పాటు రైపనింగ్ ఛాంబర్లలో మాగబెట్టిన మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు, ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పండ్లు మాగడానికి ‘ఇథలీన్’ వాయువు చాలా అవసరం. ఇథలీన్ వాయువు ఉత్పత్తి కావడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఒకటన్ను మాగబెట్టడానికి 1 మి.లీ ఇథరిల్ ద్రావణం, 1 గ్రాము సోడియం హైడ్రాక్సైడ్ అవసరమని చెబుతున్నారు. మార్కెట్‌యార్డులో భూమిపుత్ర రైపనింగ్ ఛాంబర్ (58వ షాపు) గత నాలుగేళ్ల నుంచి అందుబాటులో ఉన్నా మాగడం ఆలస్యమవుతుందని చాలా మంది వ్యాపారులు, రైతులు ఇటువైపు మొగ్గు చూపడం లేదు. అయితే ఇటీవల మార్కెట్‌యార్డులో కార్బైడ్ నివారణకు కొంత వరకు చర్యలు చేపట్టడంతో ఇప్పుడిప్పుడే రైపనింగ్ ఛాంబర్‌కు మామిడికాయలు రావడం ప్రారంభమయ్యాయి. రోజుకు ఐదారు టన్నుల మామిడిని మాగబెడుతున్నట్లు రైపనింగ్ ఛాంబర్ నిర్వాహకులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి తెలిపారు. -
వడదెబ్బ నుంచి తప్పించుకోండిలా..
నిడమర్రు: రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగనుంది. దాంతో వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ అంటే ఏమిటి.. దాని లక్షణాలు.. నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. వడదెబ్బ అంటే..? ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటాన్ని వడదెబ్బ అంటారు. అత్యధిక వేడి వాతావరణం లేదా అధిక శారీరక శ్రమను శరీరం తట్టుకోలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈస్థితిలో శరీరంలో సహజంగా జరగాల్సిన చర్యలు జరగకపోవడం వల్ల దాని ప్రభావం అవయవాల పనితీరుపై పడుతుంది. దాంతో వడదెబ్బ తగిలిన వ్యక్తి నీరసించి కుప్పకూలిపోతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది. లక్షణాలు గుండె / నాడి కొట్టుకునే వేగంలో ఆకస్మిక మార్పు, వేగంగా / తక్కువగా శ్వాస తీసుకోవడం, చెమట పట్టకపోవడం, ఎక్కువ/ తక్కువ రక్తపోటు, చిరాకు, కంగారు, తలతిరగడం, శరీరం గాలిలో తేలిపోతున్నట్టు ఉండటం, తలపోటు, వికారం, వాంతులు, అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ తగిలినవారిలో సహజంగా కనిపించే లక్షణాలు. ప్రాథమిక చికిత్స వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకొచ్చి ఆ వ్యక్తి శరీరాన్ని చల్లబరచాలి. రోగి శరీరాన్ని చల్లటి నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. రోగి తాగ గలిగితే చల్లటి పానీయాలు ఇవ్వాలి. వదులు దుస్తులు కట్టాలి. ఎటువంటి మందులు ఇవ్వకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి ముందు జాగ్రత్తగా వేసవిలో డీ హైడ్రేషన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లాలి. నీరు శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది. ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎండలో పనిచేసేవారయితే మధ్యమధ్యలో నీడ పట్టుకు వచ్చి సేదతీరుతూ ఉండాలి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు సాధారణ వ్యక్తుల కంటే తొందరగా డీ హైడ్రేషన్ ప్రభావానికి గురవుతారు. ఆల్కహాల్, సిగరెట్, కార్బోనేటెడ్ ద్రావణాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల శరీరంలో ఉండే నీటి నిల్వలు తొందరగా తగ్గిపోతాయి. ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్‌గ్లాస్, తలకు టోపీ వంటివి ధరించడం మంచింది. వేసవి కాలంలో బయటకు వెళ్లే అవసరం ఉంటే ఉదయ, సాయంత్రం వేళల్లో మాత్రమే వెళ్లేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. వేడి వాతావరణంలో శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు చేయడం మంచింది కాదు. ఒక వేళ శారీరక శ్రమ అధికంగా ఉండే వృత్తుల్లో ఉన్నవారయితే తరచూ శక్తినిచ్చే పానీయాలు తాగాలి. ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి, కారం, మసాలాలు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. బయటకు వెళ్ళిన సందర్భాల్లో టీ, కాఫీ, వేపుడు పదార్థాలు, ఫాస్ట్ఫుడ్స్ మానెయ్యాలి. వాటి బదులుగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి ప్రయాణాల్లో సోడియం వంటి ఎలక్ట్రోలైట్ ద్రావణాలను త్రాగటం మంచిది వేసవిలో వాంతులు, అలసట, బలహీనంగా కనిపించడం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. వయసుతో నిమిత్తం లేదు పి.సతీష్కుమార్రాజు, వర్మ హాస్పిటల్, గణపవరం ఏ వయసువారైనా వడదెబ్బ బారిన పడొచ్చు. వారిలో పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, మధుమేహ వ్యాధి ఉన్న వ్యక్తులు, మద్యపానం అలవాటు ఉన్న వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. అలాగే కొన్ని రకాల ఔషధాలు కూడా వడదెబ్బకు కారణమవుతాయి. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. -
గమ్యం చేరేది డౌటే!
– అత్యంత ప్రమాదకరంగా ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణం – పాలెం ఘటన తర్వాత ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యల పేరుతో ‘ఆర్టీఏ’ హడావుడి – అప్పట్లో 79 సర్వీసులకు ‘బ్రేక్’...మళ్లీ పది రోజులకే గ్రీన్‌సిగ్నల్ – ఆ తర్వాత తనిఖీల ఊసే ఎత్తని అధికారులు – ప్రైవేటుకు టాటా చెప్పి...ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు – బుధ, గురువారాల్లో తీవ్రంగా తగ్గిన ట్రావెల్స్ టిక్కెట్ల విక్రయాలు మొన్న పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్...నిన్న ముండ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్! ఈ రెండు బస్సు ప్రమాద ఘటనలను నిశితంగా పరిశీలిస్తే ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణం ఎంత ప్రమాదకరమో ఇట్టే తెలుస్తోంది. అనుభవం లేని డ్రైవర్లు, విశ్రాంతి లేని డ్యూటీలు..కండీషన్ లేని బస్సులు...వీటన్నిటికీ మించి అధికారుల బాధ్యతారాహిత్యం వెరసీ ‘డేంజర్ జర్నీ’గా మారుతోంది. పై రెండు బస్సులూ జిల్లాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్‌వి కావడంతో ప్రస్తుతం ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారు. ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. (సాక్షిప్రతినిధి, అనంతపురం) జిల్లాలో ప్రైవేటు బస్సులు నడిపే ఆపరేటర్లు 28 ఉంది ఉన్నారు. వీరు అనంతపురంతో పాటు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర కేంద్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్ చేయించి నడుపుతున్నారు. అనంతపురంలో 28 బస్సులకు స్టేట్, ఎనిమిది బస్సులకు ఆలిండియా పర్మిట్ ఉంది. ఇవి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన బస్సులు కలిపి జిల్లా మీదుగా 230 నడుస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు రూట్లలో ప్రధానంగా ఇవి తిరుగుతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్నారు. ఈ బస్సులలో చాలా వరకూ అనుభవం ఉన్న డ్రైవర్లు లేరు. చాలా ట్రావెల్స్ ఒకే డ్రైవరుతోనే సర్వీసులు నడుపుతున్నాయి. నిబంధనలు పాటించకుండా నడిచే సర్వీసులు కూడా చాలానే ఉన్నాయి. అక్కడక్కడా ప్రమాదాలు జరిగినా, కొన్ని సందర్భాల్లో గమ్యం చేరకుండా మధ్యలోనే బస్సులు మొరాయించినా, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నా.. ఏ సందర్భంలోనూ ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం ట్రావెల్స్ యజమానులకు, ఆర్టీఏ అధికారులకు ఉన్న సత్సంబంధాలే! మహబూబ్‌నగర్ ఘటన తర్వాత హడావుడి.. నాలుగేళ్ల కిందట మహబూబ్‌నగర్‌లో జబ్బార్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతై 45మంది దుర్మరణం చెందారు. దీంతో జిల్లాలో ట్రావెల్స్ పరిస్థితి ఏంటని కలెక్టర్, ఆర్టీఏ అధికారులు అప్పట్లో సమీక్ష నిర్వహించారు. పదిరోజులు హడావుడి చేసి 79 బస్సులను ఆపేశారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు, బస్సులు ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు తీసుకునే చర్యలపై లిఖిత పూర్వకహామీ ఇవ్వాలని ట్రావెల్స్ యజమానులను కోరామని, అవి అందేదాకా ఎట్టిపరిస్థితుల్లోనూ బస్సులకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని అప్పట్లో ఆర్టీఏ అధికారులు గట్టిగా చెప్పారు. అయితే.. ట్రావెల్స్ యజమానులు లెటర్‌ప్యాడ్‌లో హామీలు ఇచ్చేదాని కంటే ప్రతి బస్సులో సౌకర్యాలను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉన్నవాటికి అనుమతులు ఇవ్వాలనే ఆలోచన అధికారులకు లేకపోయింది. చివరకు ప్రతి బస్సులో ఓ ‘సుత్తి’ పెట్టుకోండని సలహా ఇచ్చి.. బస్సులు తిరిగేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అప్పుడు ప్రమాదానికి కారణమైన జబ్బార్ ట్రావెల్స్ బస్సు దివాకర్ ట్రావెల్స్‌కు సంబంధించినదే! ఇప్పుడు కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురైంది కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సే. ఏదీ వీటిపై శ్రద్ధ? జిల్లాలోని చాలా ట్రావెల్స్ బస్సులకు విండోస్ లేవు. పూర్తిగా అద్దంతో మూసేశారు. హైటెక్ బస్సులలో ఏదైనా ప్రమాదం జరిగితే డోర్‌లాక్ అయిపోతోంది. దీనివల్ల ప్రయాణికులు బస్సులో నుంచి బయట పడే మార్గమే ఉండడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఏ అద్దాన్నైనా పగలగొట్టచ్చనే సూచీలు, అత్యవసర ద్వారాలు కూడా కన్పించడం లేదు. స్లీపర్ కోచ్‌లలో పరిస్థితి మరీ దారుణం. స్మోక్ అలారమ్ ఉంటే బస్సులో ఏదైనా రిపేరీ వచ్చినా, ప్రమాదవశాత్తు పొగ వచ్చినా వెంటనే అది మోగుతుంది. ప్రమాద తీవ్రత పెరిగే లోపు ప్రయాణికులు బయటపడే అవకాశం ఉంటుంది. అయితే..వీటిని ఏ బస్సులోనూ ఏర్పాటు చేయలేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు సర్వీసులను ఒకే డ్రైవర్‌తో నడుపుతున్నారు. అదే ఆర్టీసీ బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటుందన్నారు. చాలా ట్రావెల్స్ బస్సు టాప్‌పై స్థాయికి మించి లగేజీని తీసుకెళ్తున్నాయి. చాలా ట్రావెల్స్‌లలో.. మరీ ముఖ్యంగా దివాకర్ ట్రావెల్స్‌లో బస్సులు నడిపేవారు లారీ డ్రైవర్లు అని తెలుస్తోంది. దివాకర్ ట్రావెల్స్ బస్సులు 47 ఉన్నాయి. వీరికి వందకుపైగా లారీలు కూడా ఉన్నాయి. దీంతో లారీ డ్రైవర్లను కూడా బస్సులకు డ్యూటీ వేస్తుంటారని తెలుస్తోంది. పైగా వీరు డ్యూటీలకు వెళితే పదిరోజుల వరకూ ఇళ్లకు తిరిగి రారని సమాచారం. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయడం కూడా ప్రమాదాలకు కారణమే! ఈ ట్రావెల్స్ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిలది కావడంతో ప్రశ్నించే నాథులే లేరు. దీంతో పాటు చాలా ట్రావెల్స్ నుంచి ప్రతి నెలా ఆర్టీఏ అధికారులకు భారీగానే మామూళ్లు అందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలు నిర్వహిస్తాం: సుందర్, ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) బెంగళూరు– హైదరాబాద్ సర్వీసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ జర్నీ ఏడు గంటలే. దీంతో ఒకే డ్రైవర్ నడుపుతున్నారు. లాంగ్‌జర్నీ అయితే ఇద్దరూ ఉండాలి. స్పీడ్‌లిమిట్ 80–100 కిలోమీటర్లలోపు ఉండాలి. డ్రైవర్లకు లైసెన్స్‌లు ఉన్నాయా? రికార్డులో చూపినట్లు బస్సు కండీషన్ ఏంటనేది నెల, రెండు నెలలకోసారి తనిఖీలు చేస్తాం. -
హార్బర్లో రెండో నంబరు ప్రమాద సూచిక
నిజాంపట్నం : విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం ఆదేశాల మేరకు నిజాంపట్నం హార్భర్‌లో 2వ నంబరు ప్రమాద సూచికను ఎగరవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారటంతో హార్భర్‌లో 2వ నంబరు ప్రమాద సూచిక ఎగరవేయడం జరిగిందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని తెలిపారు. -
గోదావరి కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
10 మంది మహిళలను కాపాడిన స్థానికులు తప్పిన ముప్పు హుస్సేన్‌పురం (సామర్లకోట) : ప్రయాణికులతో వెళుతున్న ఆటో ఇక్కడకు సమీపంలోని హుస్సేన్‌పురం వద్ద గోదావరి కాలువలోకి దూసుకుపోయింది. స్థానికులు సకాలంలో స్పందించి రక్షించడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. చిన్న ద్వారపూడికి చెందిన 10 మంది మహిళలు మంగళవారం సామర్లకోటలో జరిగిన ఒక వేడుకలో పాల్గొని ఆటోలో తిరుగుప్రయాణమయ్యారు. ఆటో కెనాల్ రోడ్డులోని సుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ దాటిన తరువాత రోడ్డుపై ఉన్న గోతిలో పడింది. దాంతో ఆటో అదుపు తప్పి హుస్సేన్‌పురం వద్ద గోదావరి కాలువలోకి దూసుకుపోయింది. ప్రాణభయంతో మహిళలు కేకలు పెట్టారు. స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో నుంచి మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆటో బురదలో చిక్కుకు పోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఆటోలో కె.రాఘవ, ఉషారాణి, రామలక్ష్మి, కల్యాణి, నవీనకుమారి, సత్యగంగ, శ్రీదేవి, లక్ష్మి, అనుశ్రీ , స్వప్న ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో కె.రాఘవ మనవడు స్వల్పంగా గాయపడ్డాడు. వేట్లపాలెంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడ్ని కాకినాడ తీసుకు Ðð ళ్లారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. -
ఉప్పాడకు పొంచిఉన్న ముప్పు
భయం గుప్పెట్లో తీరప్రాంతం వేట నిలిపి వేసిన మత్స్యకారులు కానరాని ముందస్తు చర్యలు పిఠాపురం : అంతా ప్రశాంతం ... నిండుకుండలా సముద్రం , మామూలుకంటే తక్కువ అలలు ... కానీ ఉప్పెన ముంచుకొస్తుందన్న అధికారిక హెచ్చరికలు స్థానిక తీరప్రాంతవాసులను వణికిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ముప్పు ఉందని హెచ్చరికలు చేస్తున్నంతగా ఉపద్రవం వస్తుందా లేదా అనేదానికంటే బుధవారం ఉదయం నుంచి సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోవడం మాత్రం స్థానికులను కలవరపెడుతోంది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు అంతగా తుఫాన్ముప్పు ఉండదని ముందు అనుకున్నప్పటికీ క్యాంట్ పెను తుఫా¯ŒSగా మారి విశాఖకు సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో భయాందోళన‡లు వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్హెచ్చరికలు చేసినా పట్టించుకోని మత్స్యకారులు తమ పడవలు, వలలు, వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవడంలో తలమునకలయ్యారు. స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.తీరప్రాంతంలో సముద్రం సుమారు 50 మీటర్ల వరకు వెనక్కి వెళ్లిపోవడం కూడా దడ పుట్టిస్తోంది. సాధారణంగా తీవ్ర తుఫాన్ వచ్చే సమయంలో మాత్రమే ఇలా తీరంలో సముద్రం వెనక్కి (ఆటు) వెళ్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఎటువంటి రక్షణ లేకపోవడంతో తీరానికి సమీపంలో ఉన్న సుబ్బంపేట, పల్లెపేట, కొత్తపేట, రంగంపేట తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. బీచ్‌రోడ్డు ఏ మాత్రం తెగిపోయినా పైగ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఇప్పటికే ఉప్పాడకు రక్షణగా వేసిన జియోట్యూబ్ రక్షణ గోడ అండలు జారీ కూలిపోవడంతో ఉప్పాడకు ముప్పు పొంచిఉందని ఆ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హార్బర్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక
హార్బర్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక హార్బర్, 2వ నంబర్, ప్రమాదం harber, 2nd, danger, signal 2nd danger signal ina Nizampatnam port నిజాంపట్నం: తరుముకొస్తున్న తుఫాను ముప్పుతో తీరంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కయాంత్ తుఫాను ప్రభావంతో విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేద్రం ఆదేశాల మేరకు నిజాంపట్నం హార్బర్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక ఎగరవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరావు బుధవారం తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. తీర ప్రాతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను హెచ్చరికల ప్రభావంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కయాంత్ తుఫాను శుక్రవారం కావలి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతుండటంతో తీరంలో అలజడి నెలకొంది. తీరం దాటే సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని తీరవాసులు అంటున్నారు. -
ఒక్కరోజు రోడ్డు
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలకు నగర రోడ్లు ఎంతగా ఛిద్రమయ్యాయో ప్రతి వాహనదారుడికి అనుభవమే. అలాంటి రోడ్లలో ఈ చిత్రంలో కనిపిస్తున్నది కూడా ఒకటి. శ్రీనగర్ కాలనీలోని సందీప్తి గ్యాస్ గోడౌన్ నుంచి యూసుఫ్‌గూడ ఆర్బీఐ చౌరస్తా వరకు ఉన్న ఈ రోడ్డు మొన్నటి వర్షాలకు పూర్తిగా గుంతలు పడింది. దీంతో అధికారులు ఈనెల 7న అర్ధరాత్రి తారు రోడ్డు వేశారు. అయితే వాహనదారుల ఆనందం ఒక్కరోజుకే పరిమితమైంది. 9వ తేదీ ఉదయానికి ఇలా గుంతలు పడి, కంకర తేలి ప్రమాదకరంగా మారింది. గుంతలుగా ఉన్నప్పుడు నెమ్మదిగా, జాగ్రత్తగా వాహనాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు రోడ్డు బాగుందని కాస్త వేగంగా వచ్చినవారు ఈ కంకరపై జారిపడి గాయాల పాలవుతున్నారు. నగరంలో రోడ్ల నాణ్యతకు ఈ మార్గం అద్దం పడుతోంది. -
తలంపులు తీర్చే తల్లి తలుపులమ్మ
అమ్మ తల్లులు - 1 ఆ కొండమీదకు కొన్నాళ్ల కిందట ఒక భక్త బృందం వచ్చిందట. తల్లి దర్శనం అయ్యాక కొండ దిగిందట. అయితే హడావిడిలో ఒక పాపను మర్చిపోయినట్టు గమనించారట. అప్పటికే సాయంత్రమైపోయింది. అప్పట్లో అంతా కీకారణ్యం. తిరిగి పైకి వెళ్లడానికి లేదు... వెళ్లకూడదు. కన్నతల్లి ఏడుస్తుంటే ఎవరో అన్నారట- ‘పిచ్చిదానా... పైన తలుపులమ్మ తల్లి తిరుగుతూనే ఉంటుంది. నీ బిడ్డకు ఏమీ కాదు. తల్లే చూసుకుంటుంది’ అని. తెల్లారాక అందరూ హడావిడిగా పైకి వెళ్లారట. చూస్తే పాప క్షేమంగా కనిపించిందట. తలుపులమ్మ తల్లి మహిమలు ఇలా ఎన్నో. మనిషికి ఆపదలు తప్పవు. కష్టాలు రాకమానవు. అప్పుడు సాయం కోసం పిలిస్తే పలికే శక్తి కావాలి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒక పన్నెండేళ్ల ఆడపిల్ల వచ్చి ఆ ఆపద తీర్చి వెళ్లేదట. మళ్లీ ఎవరికీ కనిపించేది కాదట. కష్టంలో ఉన్నవారు ఎవరైనా మళ్లీ పిలిస్తే వెంటనే వచ్చేదట. ఆ పాప పేరు ఎవరికీ తెలియదు. ‘తలచిన‘ వెంటనే పలికే తల్లి ‘తలంపు’ వచ్చిన వెంటనే పలికే తల్లి కనుక ఆమె ‘తలంపులమ్మ’ కాలక్రమేణా తలపులమ్మ అయ్యింది. ఆ ప్రాంతం పేరు లోవ... రాజమండ్రికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ‘లోవ’. దీనికి పది కిలోమీటర్ల ముందు వచ్చే అందరికీ తెలిసిన ఊరు ‘తుని’. తుని దాపున అడవులు కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని పూర్వం ‘లోయ’ అనేవారని అదే కాలక్రమంలో లోవ అయ్యిందని అంటారు. ఇక్కడ ఉన్న కొండలలోని రెండు కొండలు - ధార కొండ, తీగ కొండల మధ్య తలుపులమ్మ క్షేత్రం ఉంది. ఈ కొండల నడుమే తియ్యని పాతాళ గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఇదే భక్తుల దాహార్తి తీరుస్తూ ఉంటుంది. అగస్త్యుని కోరిక మేరకు.... పూర్వం పర్వతరూపుడైన మేరువు తన ఆకారాన్ని అమాంతం పెంచడం ప్రారంభించాడు. అతడి ఆకారం ఎంతగా పెరిగిందంటే సూర్యుడి రథానికి అడ్డం తగిలే పరిస్థితి వచ్చింది. ఇదే జరిగితే సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది. అందువల్ల దేవగణాలు మేరువుకు గురుసమానుడైన అగస్త్యుని దగ్గరకు వెళ్లి ఆపదను గట్టెక్కించమన్నారు. అప్పుడు అగస్త్యుడు మేరువు దగ్గరకు రాగా అతడు తల ఒంచి నమస్కరించాడు. అప్పుడు అగస్త్యుడు ‘నేను దక్షిణాది యాత్రకు వెళుతున్నాను. నేను వచ్చేంత వరకూ ఇలాగే ఉండు’ అని ఆదేశించి దక్షణాది యాత్రకు బయలుదేరాడు. లోవ ప్రాంతం వచ్చేసరికి సంధ్య వార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కడా నీటిబొట్టు లేకపోవడంతో అగస్త్యుడు జగన్మాతను ప్రార్థించగా ఈ ప్రాంతంలో పాతాళగంగ ఉద్భవించి అగస్త్యునికి నీటి అవసరం తీర్చింది. ఆ రాత్రి అగస్త్యునికి తల్లి కలలో కనిపించి తాను లలితాంబిక అని, తాను భక్తులను ఆదుకునేందుకు ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నానని చెప్పింది. అగస్త్యుడు ఆమెను పూజించి ఎప్పటికీ ఇక్కడే ఉండిపొమ్మని వేడుకున్నాడని కథనం. ఈ ప్రకారం తల్లి ఇక్కడే ఉండి తలుపులమ్మగా భక్తులను కటాక్షిస్తున్నది. అగస్త్యుడు ఇక్కడి వనాలలో ఫలాలు తిని, తేనెను తాగాడని, అంత తియ్యగా ఇక్కడి నీళ్లు కూడా ఉండాలని కోరడంతో పాతాళ గంగ నీరు తియ్యగా మారాయని అంటారు. కొండలలో ఉన్న ఈ పాతాళ గంగ ఎక్కడ పుట్టిందో ఎక్కడకు ప్రవహించి మాయమవుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మరో కథనం.. మరో కథనం ప్రకారం తుని సంస్థానం రాజా వారికి అమ్మ కలలో కనిపించి తాను ఈ కొండలలో శిలలా పడి ఉన్నానని, వచ్చి పూజాదికాలు నిర్వహిస్తే ఈ ప్రాంతంలో పాతాళగంగ ఉద్భవిస్తుందని చెప్పిందట. ఆ మేరకు రాజావారు నడుచుకోగా క్షేత్రం స్థిరపడిందని అంటారు. మొత్తం మీద తలుపులమ్మ క్షేత్రానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా భావిస్తున్నారు. మాంగల్య సౌభాగ్యం కోసం... తలుపులమ్మ తల్లిని నిత్యం ముత్తయిదువులు పూజించి తమ మాంగల్య సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. ఆ తల్లిని పసుపు కుంకుమలతో పూజిస్తే తమ పసుపు కుంకుమలు పదికాలాల పాటు చల్లగా ఉంటాయనే నమ్మకం ఉంది. అలాగే ఇక్కడి రవ్వలడ్డూ, పులిహోర ప్రసాదాలు ఎంతో ప్రసిద్ధం. లోవ దేవస్థానంలో అందించే లడ్డూ, పులిహోర రుచి రాష్ట్రంలో మరెక్కడా లభించదని భక్తులు అంటారు. ఏటా రూ.కోటి విలువ చేసే ప్రసాద విక్రయాలు జరుగుతుంటాయి. ఇక్కడ యాభై అడుగుల అమ్మవారి విగ్రహం, నలభై అడుగుల ఈశ్వరుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. 1981లో విలీనం : తుని రాజావారీ అధీనంలో నడుస్తున్న దేవస్థానం కార్యకలాపాలను ప్రభుత్వం 1981లో దేవాదాయశాఖకు అప్పగించింది. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం రీజనల్ జాయింట్ కమీషనర్ అజమాయిషీ స్థాయికి చేరింది. ఏటా ఆరులక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. పర్వదినాలు.. గంధామావాస్య పర్వదినాన్ని పురష్కరించుకుని లోవకొత్తూరు గ్రామంలో దేవస్థానం భూమిలో అమ్మవారి పుట్టింట సంబరాలను 12 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో అమ్మవారికి దేవస్థానం ఆవరణలో ఆషాఢమాసోత్సవాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అమ్మవారి జన్మనక్షత సందర్భంగా పంచామృతాభిషేకాలు, పౌర్ణమి రోజున అమ్మవారికి మహాచండీ హోమం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. - సూర్యనారాయణ, సాక్షి, తుని రూరల్ ప్రతినిధి మార్గం లోవ క్షేత్రం అన్నవరం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుని నుంచి తొమ్మిది కిలోమీటర్లు. రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్లు. బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. క్షేత్రానికి మెట్ల మార్గం ఉంది. మెట్లు ఎక్కలేనివారి కోసం రోడ్డు మార్గం వేశారు. వాహనాలను కాపాడే తల్లి... తలుపులమ్మ తల్లిని ప్రయాణానికి అధిదేవతగా ఇక్కడివారు భావిస్తారు. ఉత్తరకోస్తాలో ఎవరు ఏ వాహనం, ముఖ్యంగా పెద్ద వాహనం కొన్నా ఇక్కడకు తీసుకు వచ్చి పూజ జరిపిస్తారు. మరికొందరు తమ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల నంబర్లు ఇక్కడి కొండల పై రాయిస్తారు. అందువల్ల ఆ వాహనానికి ప్రమాదం జరగకుండా ఆ తల్లి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందని నమ్మకం. రోజూ ఇక్కడకు అనేక కొత్త వాహనాలు తరలి రావడం భక్తులు చూస్తూనే ఉంటారు. -
కర‘కట్’
హంసలదీవి సమీపంలో సముద్ర కరకట్టకు భారీ కోత వరద నీటితో ఉధతంగా ప్రవహిస్తున్న కష్ణమ్మ తీరప్రాంతాల ప్రజల్లో ఆందోళన కోడూరు:సముద్రం బారి నుంచి దివిసీమ ప్రజలను రక్షించి కాపాడుతున్న ‘దివి రక్షణ’ కవచమైన కష్ణా కరకట్ట భారీస్థాయిలో కోతకు గురవుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీరప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన ప్రకాశం బ్యారేజీ నుంచి పెద్దఎత్తున వరద నీటిని సముద్రంలోకి వదలడంతో కష్ణానదిలో నీటి ఉధతి గంటగంటకు పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర వదిలిన నీరు మొత్తం మండల పరిధిలోని హంసలదీవి సమీపంలోని సాగరసంగమం వద్ద సముద్రంలో కలుస్తాయి. అయితే ఈ వరద నీరు మొదట అవనిగడ్డలోని పులిగడ్డ అక్విడెట్ చేరుకొని అక్కడ నుంచి ఉల్లిపాలెం మీదగా సముద్రంలో కలవాల్సి ఉంది. వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు నీరు ఊళ్ల మీద పడకుండా 2004వ సంవత్సరంలో నాగాయలంక మండలం గుల్లమోద నుంచి ఉల్లిపాలెం వరకు రూ.25కోట్ల వ్యయంతో కరకట్టను నిర్మించారు. అయితే 2008 సంవత్సరంలో వచ్చిన భారీ వరదల ప్రభావానికి ఉల్లిపాలెం సమీపంలో కరకట్టకు భారీ కోత ఏర్పడింది. ఆ కోత ప్రాంతంలో భారీ కొండరాళ్లతో రివిట్మెంట్ వేశారు. మళ్లీ పక్కనే మరో కోత.. మళ్లీ అక్కడే సముద్రం అటుపోట్లతో రెండు నెలల క్రితం కరకట్టకు కోత ఏర్పడింది. తాజా వరద ఉధతికి కోత మరింత ఎక్కువై ఎప్పడైనా గండిపడే ప్రమాదం పెరిగింది. రెండు నెలల నుంచి సమస్యను ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ ఉపద్రవాలు సంభవించక ముందే అధికారులు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వీబీఆర్‌కు ముప్పు లేదు
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ డిజైన్ ప్రకారమే నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలుగు గంగ ఎస్ఈ చంద్రశేఖర్ తెలిపారు. రిజర్వాయర్‌కు ఎలాంటి ముప్పు లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శనివారం ఎస్ఈ చంద్రశేఖర్ వీబీఆర్‌ను సందర్శించారు. హెడ్ రెగ్యులేటర్, స్పీల్ వే, వన్ ఆర్, వన్ ఎల్ తూములను పరిశీలించారు. అనంతరం స్థానిక గంగ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వీబీఆర్‌కు నీరు చేరుతోందన్నారు. పాత డిజైన్ ప్రకారమే నీటిని నిల్వ చేస్తున్నామని, ప్రస్తుతం 15.5 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. స్పీల్ వే, హెడ్ రెగ్యులేటర్, కట్ట వెంట సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తున్నారని, డే అండ్ నై పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కట్ట పటిష్టంగా ఉన్నట్లు చెప్పిన ఎస్ఈ.. రోజు మార్చి రోజు నీటి నిల్వలు పెంచుతున్నామన్నారు. ఆయన వెంట ఈఈ పుల్లారావు, డీఈలు విజయానంద్, ప్రతాప్, జేఈలు, సిబ్బంది ఉన్నారు. -
మలుపు మాటున...?
దారి మలుపు తర్వాత ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. భయంకరమైన మూలమలుపులు. కనీసం కనబడని హెచ్చరిక బోర్డులు, తరుచూ ప్రమాదాలు. పట్టించుకోని అధికారులు వెరసి రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. చెన్నూర్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల మూలమలుపులు ప్రమాదభరితంగా ఉన్నాయి. వాహనదారులు భయపడక తప్పని పరిస్థితులు. చాలా రహదారుల మూలమలుపుల వద్ద చెట్లు ఎదిగి రహదారిని కనబడక కుండా చేస్తున్నాయి. రోడ్డు, భవనాల అధికారులు పట్టించుకోని పరిస్థితి. కిష్టంపేట గ్రామం నుంచి జాతీయ రహదారి, సుద్దాల గ్రామానికి వెళ్లే దారిలో, అలాగే జోడువాగులు దగ్గర నుంచి కిష్టంపేటకు వెళ్లే మంచిర్యాల, చెన్నూర్ ప్రధాన రహదారిలో కూడా మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. – చెన్నూర్ రూరల్ -
ప్రమాదకరంగా రహదారి విస్తరణ
కానరాని రక్షణ చర్యలు ఇబ్బంది పడుతున్న వాహనదారులు బసంత్‌నగర్ : రామగుండం మండలం బసంత్‌నగర్ విమానాశ్రయం నుంచి కుక్కలగూడుర్ వరకు ప్రధాన రహదారి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. వన్‌వేగా ఉన్న ఈరహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు నిధులు మంజూరు కావడంతో రెండు నెలలుగా పనులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా కాంట్రాక్టర్ రహదారికి ఇరువైపులా దాదాపు రెండు మీటర్ల వెడల్పుతో ప్రొక్లెయిన్‌తో మట్టిని తొలగించే పనులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో రహదారిపై ఎలాంటి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కందకాలలో పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా రేడియంతో కూడిన స్టిక్కర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. కనీసం మూల మలుపుల వద్ద కూడా ఎలాంటి హెచ్చరిక, రోడ్డు డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో అయితే పరిస్థితి ప్రమాదకరంగా తయారైంది. నిబంధనల ప్రకారం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపేందుకు సైన్ బోర్డులతో పాటు రేడియంతో కూడిన స్టిక్కరింగ్ ఏర్పాటు చేయాలి. కానీ సంబంధిత కాంట్రాక్టర్ అలాంటి ఏర్పాట్లు చేయలేదు. నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఈరహదారిపై ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్బీ అధికారులు స్పందించి రహదారిపై సైన్‌బోర్డులు, రేడియం స్టిక్కరింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మంటల్లో చిక్కుకొని కారు దగ్ధం
వేగంగా వెళ్తున్న కారులో మంటలు వ్యాపించి క్షణాల్లో కారు తగలపడిపోయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద బుధవారం వెలుగుచూసింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చే లోపే కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారులో మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు అందులో నుంచి బయటపడ్డారు. వంట కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల సాయంతో కారును నడుపుతుంటంతోటే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మరో రెండు గ్యాస్ సిలిండర్లు ఉండటంతోటే మంటల తీవ్రత అధికంగా ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ రేసింగ్ వల్లే ఆ ప్రమాదం?
రెండు మోటారు సైకిళ్ల ఢీ ఘటనలో కొత్త కోణం ప్రమాదంలో మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తింపు రావులపాలెం: రావులపాలెం కెనాల్ రోడ్డులో గురువారం ఇద్దరి మృతికి కారణమైన రెండు మోటారు సైకిళ్ళ ఢీ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పడాల సత్యవెంకటసాయిబాబారెడ్డి(34) తన ఇద్దరు కుమార్తెలతో మోటారు సైకిల్‌పై స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన గొలుగూరి కోమల సాయి తేజ వినయ్‌కాంత రెడ్డి(18) మోటారు సైకిల్‌పై వస్తూ ఢీకొనడంతో ఇద్దరూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో వినయ్ కాంత రెడ్డి ఒక్కడే మోటాటరు సైకిల్‌పై ఉన్నట్టు తొలుత పోలీసులు భావించారు. అయితే బైక్ రేసింగ్ చేస్తూ అతి వేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఊబలంక రోడ్డులో ఉన్న ఒక సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా వినయ్‌కాంత రెడ్డి మోటార్‌సైకిల్‌పై మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. ఆ వ్యక్తి గ్రామానికి చెందిన కర్రి అజయ్‌కుమార్‌రెడ్డి అని, అతనే మోటారుసైకిల్ నడపగా వినయ్కాంతరెడ్డి వెనుక కూర్చున్నట్టు ఆ వీడియోలో తేలింది. వారు ఊబలంక వైపు నుంచి రావులపాలెం వైపు వస్తున్నట్టు ఆ వీడియోలో పోలీసులు గుర్తించారు. దీనిపై ఎస్సై పీవీ త్రినాథ్‌ను వివరణ కోరగా కర్రి అజయ్‌కుమార్‌రెడ్డి మోటారు సైకిల్ నడుపుతున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అతనికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయయని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. బైక్ రేసింగే కారణమా? బైక్ రేసింగే ఈ ప్రమాదానికి కారణమనే ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా రెండు మోటారు సైకిళ్లు ఢీకొంటే ఈ స్థాయిలో ప్రాణ నష్టం ఉండదని, మితి మీరిన వేగంతో వాహనాలు ఢీకొంటేనే ఈ స్థాయిలో ప్రమాదం జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వినయ్‌కాంత రెడ్డి మోటారు సైకిల్ అధిక సీసీ కలిగిన స్పోర్ట్స్ బైక్ వంటిది కావడంతో రేసింగ్ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో బైక్ రేసింగ్ జరుగుతున్నట్టు ఆరోపణ లు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి దీనికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
పచ్చదనం మాటున ప్రమాదం
పచ్చదనం మాటున ప్రమాదం దాగి ఉంది. పై చిత్రాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. ఈ దృశ్యాలు చెన్నూర్ మండలంలోని సుద్దాల, బావురావుపేటలో కనిపించినవి. ఇలాంటి పరిస్థితులు మండలంలోని కిష్టంపేట, బావురావుపేట, లింగంపల్లి, దుగ్నెపల్లి, సుద్దాల, కమ్మరిపల్లి తదితర గ్రామాల్లో అనేకం ఉన్నాయి. పంట పొలాల్లో, ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ఎటువంటి రక్షణ కంచెలు లేకుండా ప్రమాదకరంగా ఉన్నాయి. అసలే వర్షాకాలం వాటి చుట్టూ పిచ్చి మొక్కలు మరింత ప్రమాదకరంగా మారాయి. ఎటువంటి ప్రమాదాలు సంభవించక ముందే అధికారులు పట్టించుకొని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. – చెన్నూర్‌రూరల్ -
మిషన్‌భగీరథ పనుల్లో ప్రమాదం
ట్యాంక్‌పై నుంచి పడి నలుగురికి గాయాలు చికిత్స పొందుతూ ఒకరు మృతి వాటర్ ట్యాంక్ పైన తలకిందులైన మిల్లర్ బకెట్ తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ పరిధిలోని సుభాష్‌నగర్ శివారులో జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనుల వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బండి రాజయ్య(35) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. సుభాష్‌నగర్ వద్ద గతంలో ఓహెచ్‌బీఆర్ ట్యాంక్ ఉండగా పక్కనే మరో ట్యాంక్‌ని నిర్మిస్తున్నారు. ట్యాంక్ చాలా ఎత్తులో పని ఉండడంతో మిల్లర్ ద్వారా కాంక్రీట్‌ని తరలిస్తూ ట్యాంక్ చుట్టూ గాజును పోస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కరీంనగర్‌లోని లేబర్ అడ్డా నుంచి 25 మంది కూలీలు పనికి వచ్చారు. ఉదయం పని చేసిన తరువాత భోజనానికి కూలీలు కిందకు దిగారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి పనిలో చేరేందుకు మిల్లర్ బకెట్లో పైవరకు వెళ్లగా అదుపుతప్పి బకెట్ తలకిందులైంది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు పైనుంచి కింద పడిపోయారు. అక్కడున్న వారు వెంటనే ఎల్ఎండీ పోలీసులకు, 108కి సమాచారం అందించారు. ఎల్ఎండీ ఎస్సై జగదీష్ సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురిని 108లో, మరో వ్యక్తిని కాంట్రాక్టర్‌కు చెందిన వాహనంలో కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చిగురుమామడి మండలం గాగిరెడ్డిపల్లెకు చెందిన బండి రాజయ్య(35)కు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. జమ్మికుంట మండలం సనుగులకు చెందిన జూపాక శంకర్, సైదాపూర్ మండలం లింగాల దుద్దెనపల్లికి చెందిన పెరుమాండ్ల శ్రీనివాస్, కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న తమిళనాడుకు చెందిన ఎన్.వెంకటేష్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ శరత్‌రావు, టీఆర్ఎస్ నాయకులు జీవీ.రాంకిషన్‌రావు, గోగూరి నర్సింహారెడ్డి పరామర్శించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
గుండెజబ్బుల ముప్పులో శిశువులు
విజయవాడ (లబ్బీపేట) : భారత్‌లో పుట్టుకతో గుండెలోపాలతో పుడుతున్న చిన్నారులు రోజు రోజుకు పెరుగుతున్నారని ఇంగ్లండ్‌లో పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుముల అన్నారు. ఆంధ్రా హాస్పటల్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఏపీ, కృష్ణాజిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పిల్లల్లో గుండెలోపాలను గుర్తించడం ఎలా అనే అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఇ) ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సీఎంఈకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 200ల మందికిపైగా పిల్లల వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సదస్సును తొలుత ఏపీ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ పిల్లల్లో గుండెలోపాలు, వాటిని ఎలా గుర్తించాలనే అంశంపై విశ్లేషణాత్మకంగా వివరించారు. ఇంటర్వెన్షనల్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ మిర్జన వెట్కోవిక్ , డాక్టర్ నయన్ షెట్టీ, డాక్టర్ ప్రేమ్సుందర్ వేణుగోపాల్, డాక్టర్ పీవీ రామారావు, డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియో డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
పుట్టపర్తి అర్బన్: ప్రజల ఆరోగ్యాన్ని అధికారులు విస్మరించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న పాడుబడిన బావుల్లో నీళ్లు నిల్వ ఉండి విషం చిమ్ముతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎటువంటి పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోవడంతో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. వర్షాకాలంలో వాన నీటితో నిండిన పాడుబావులు చెత్తాచెదారంతో కుళ్లి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా అటవీ గ్రామాలైన సాతార్లపల్లి, దిగువచెర్లోపల్లి, వెంగళమ్మచెరువు, వెంకటగారిపల్లి కాలనీలలో పాడుబడిన బావులతో పాటు గతంలో తాగునీళ్లు అందించిన చేదబావులు సైతం చెత్తాచెదారం నిండి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దీంతో అనారోగ్యాలతో ఒళ్లు గుల్లవుతోందని ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీరు–చెట్టు కార్యక్రమంలో చెరువుల్లోని మట్టి తోలి పలు బావులు, గుంతలను మూసివేసింది. దీంతో ఆయా స్థలాలు అందుబాటులోకి వచ్చాయి. పాడుబడిన బావులతో అనారోగ్యమే గాక చిన్న పిల్లలకు ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల మధ్య ఉండడంతో ఆడుకుంటూ వెళ్లి ఎక్కడ పడిపోతారోనన్న ఆందోళన కూడా ప్రజల్లో నెలకొని ఉంది. ఇటీవల దిగువచెర్లోపల్లి గ్రామంలో రోడ్డు పక్కనే పాడుబావి ఉండడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడి దెబ్బతింది. అదృష్టవశాత్తు డ్రైవర్ తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు స్పందించి గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న పాడుబడిన బావులను గుర్తించి మట్టితో మూసి వేయాలని గ్రామీణులు కోరుతున్నారు. గ్రామస్తులు ముందుకు రావాలి పాడుబడిన బావులు, నిరుపయోగంగా ఉన్న గుంతలు గ్రామాల్లో ఉంటే గ్రామస్తులు రాత పూర్వకంగా ఇస్తే పూడ్చి వేయడానికి చర్యలు తీసుకుంటాం. చాలా గ్రామాల్లో అటువంటివి ప్రమాదకరంగా ఉన్నాయి. – జమునాబాయి, ఇరిగేషన్ జేఈ -
‘పోరుగు’ ప్రాజెక్టుతో కౌలాస్‌కు ముప్పు
జుక్కల్ : పొరుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులతో జుక్కల్, బిచ్కుంద మండలాల వరప్రదాయని అయిన కౌలాస్ నాలాకు ముప్పు ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లోనే నీటిని ఆపేస్తే దిగువన ఉన్న కౌలాస్ ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడం కష్టం. దీంతో ఆయకట్టు బీడుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో జుక్కల్ మండలంలో కౌలాస్‌నాలా ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 458 మీటర్లు.. జుక్కల్ మండలంలోని ఐదు గ్రామాలు, బిచ్కుంద మండలంలోని మూడు గ్రామాలలో గల 9 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్మించారు. ప్రారంభంలో పూర్తిస్థాయిలో నీరందించిన ప్రాజెక్టు.. క్రమంగా కళను కోల్పోతూ వస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టు పాలిట శాపంగా మారాయి. నాడు ఏడూర్లో.. నేడు సోపూర్లో.. మహారాష్ట్రలోని ఏడూర్ వాగు, కర్ణాటకలోని కరంజి వాగుల నుంచి వచ్చే వరద నీరే కౌలాస్‌నాలా ప్రాజెక్టుకు ప్రధాన ఆధారం. 2009 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏడూర్ వాగు ప్రాంతంలో టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. కౌలాస్నాలాపై అక్రమ కట్టడం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో ఈ ప్రాంతవాసులు ఆందోళనలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఏడూర్ ప్రాజెక్టు దెబ్బతో కౌలాస్ నాలాలోకి వరద నీటి రాక తగ్గిపోయింది. ఖరీఫ్‌లో నీరందించినా.. రబీలో పంటలను గట్టెక్కించలేకపోతోంది. జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామ శివారులో కర్ణాటక ప్రభుత్వం నీటి నిల్వ వంతెన(బ్రిడ్జి కం బ్యారేజీ) నిర్మాణం చేపడుతోంది. పనులు సగం పూర్తయ్యాయి. ఈ నిర్మాణం పూర్తయితే కౌలాస్‌నాలా ప్రాజెక్టు వట్టిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తగ్గిన సాగు.. కౌలాస్‌నాలా ప్రాజెక్ట్ నిర్మించిన తొలినాళ్లలో పూర్తిస్థాయిలో 9 వేల ఎకరాలకు సాగునీరందేది. తర్వాతి కాలంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఏడూరు ప్రాజెక్టు నిర్మాణంతో ఆయకట్టు సాగు విస్తీర్ణం సగానికి పడిపోయింది. జుక్కల్ మండలంలో ఐదు, బిచ్కుందలో మూడు గ్రామాలకు సాగునీరందించాల్సిన ప్రాజెక్టు.. కేవలం జుక్కల్ మండలంలోని 4 వేల ఎకరాలకే సాగునీరు అందిస్తోంది. పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు. -
జాతీయ రహదారికి ‘కోత’ గండం!
భారీ వరదలు వస్తే బ్రిడ్జికి ప్రమాదమే రివిట్మెంట్ చేయకపోవడమే కారణం పట్టించుకోని ఉన్నతాధికారులు వరంగల్/ఏటూరునాగారం : వరంగల్ – భూపాలపట్నం 163వ నంబర్ జాతీయ రహదారి, దానిపైనున్న వంతెనలు కోతకు గురవుతున్నాయి. దీంతో ముల్లకట్ట బ్రిడ్జి సైతం ప్రమాదకరంగా తయారైంది. ఈ వంతెనకు ఇరువైపులా రివిట్మెంట్ చేయకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. రహదారి నిర్మాణ సమయంలో దశలవారీగా కాకుండా మట్టిని ఎత్తుగా పోసి ఒకేసారి రోలింగ్ చేశారు. ఫలితంగా భారీ వర్షాలకు రోడ్డు ఇరువైపులా కోతకు గురవుతోంది. దీని కారణంగా ఈ మార్గంలోని కల్వర్టు, మూల మలుపులు, బ్రిడ్జిల వద్ద నిర్మించిన రెయిలింగ్‌లు కూలిపోయే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రూ.వందల కోట్లు వెచ్చించి, నిర్మించిన ఎన్‌హెచ్ 163 రహదారికి రివిట్మెంట్ పనులు కాకపోవడం గండంగా పరిణమిస్తోంది. డీపీఆర్‌లో ప్రస్తావించకపోవడంతో.. రహదారి నిర్మించిన కాంట్రాక్టు ఏజెన్సీ రివిట్మెంట్ నిధులను మంజూరు చేయించుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణ పనుల డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రూపొందించిన సమయంలో.. అందులో రివిట్మెంట్ పనుల గురించి ప్రస్తావించలేదని సమాచారం. అందువల్లే దానికి సంబంధించిన పనులు జరగలేదని పేర్కొం టున్నారు. దీనిపై ఎన్‌హెచ్ జేఈఈ ప్రదీప్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా..‘ రివిట్మెంట్ పనుల కోసం నిధులు కేటాయించాలని ఎన్‌హెచ్ అ«ధికారులను కోరాం. అయితే దీని ప్రతిపాదనలు ఢిల్లీ స్థాయలో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మూడేళ్ల పాటు జాతీయ రహదారి, బ్రిడ్జి కోతకు గురైతే మరమ్మతులు చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌కు ఉంటుం ది. వానలు తగ్గిన వెంటనే రోడ్డుకు ఇరువైపులా రివిట్మెంట్ చేయిస్తాం. రివిట్మెంట్కు సంబంధించిన రాయి ఈ ప్రాంతంలో లభించడం లేదు. దీంతో కాంక్రీట్ స్లా»Œ వేయాలని భావిస్తున్నాం’ అని వివరించారు. -
ప్రమాదం జరిగితే ‘బోరు’మనాల్సిందే..?
బోరుబావిలో పడి చిన్నారులు పడి మృత్యువాత పడుతున్నా అధికారులు, ప్రజలు నిర్లక్ష్యం వీడడం లేదు. బోరుబావిలో చిన్నారి పడ్డప్పుడు హడావిడి చేసే అధికారులు, పాలకులు తర్వాత పైకప్పు లేని బోరుబావుల మూసివేతపై గానీ, ప్రమాదాలపై అవగాహన కల్పించడంలో గానీ అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనడానికి నిదర్శనం ఇదిగో..! పై చిత్రం. మండలంలోని బొత్తపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో వేసిన బోరుబావి నోరు తెరుచుకునే ఉంది. పాఠశాల ఆవరణలో నిత్యం ఆటలు ఆడుతున్నారు. ప్రతీ సారి ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే పాలకులు, అధికారులు ఇప్పుడే స్పందించి బోరుబావిని పూడ్చి వేయడమో లేక పైకప్పు ఏర్పాటు చేయడమో చేయాలి. లేకుంటే ప్రమాదం జరిగిన తర్వాత ‘బోరు’మనాల్సిందే.... – దహెగాం -
ఆటోలో ప్రయాణం..అటో...ఇటో...
అదుపు తప్పుతున్న ఆటోలు ప్రమాదాల బారీన ప్రయాణికులు పరిమితికి మించి రవాణా ప్రధాన కారణం గంగాధర: ఆటోల్లో ప్రయాణించడం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఆటో ప్రయాణికులు తమ గమ్య స్థానాలు చేరుకునే వరకు ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. వరుస ఆటో ప్రమాదాల వల్ల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మధ్యాహ్నం గంగాధర చౌరస్తా నుంచి బోయినపల్లి మండలంలోని తిప్పాయిపల్లికి వెళ్లేందుకు కరీంనగర్‌కు చెందిన నర్సయ్య ఆటో ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కొద్ది దూరం వెళ్లే సరికి పట్టుతప్పి కింద పడిపోయాడు. ఆటో అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హనుమాన్ జయంతి రోజు మాల విరమణకు కొండగట్టుకు వెళుతున్న ఆటో వెంకటాయిపల్లి బస్టాండ్ సమీపంలో బోల్తాపడింది. ఈ ఘటనలో హనుమాన్ భక్తుడు మృతి చెందాడు. గంగాధర గ్రామానికి చెందిన రమేష్ ఆటోలో జిల్లా కేంద్రానికి వెళుతుండగా ఆటో బోల్తాపడి చేయి విరిగింది. బోయినపల్లి మండలంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ప్రయాణిస్తున్న ఆటో బోయినపల్లి రోడ్డులో బోల్తాపడగా తీవ్రగాయాలై చేయివిరిగింది. మిగితా ప్రయాణికులు గాయాల పాలయ్యారు. కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలో ఇస్లాంపూర్ సమీపంలో మూడు సంవత్సరాల క్రితం లంబాడిపల్లి గ్రామం నుంచి తడగొండకు కూలీలను తీసుకువస్తున్న ఆటో బోల్తాపడి పదిహేను మందికి గాయలయ్యాయి. పోతుగంటì పల్లి గ్రామ సమీపంలో ఆటోబోల్తాపడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఇలా చూస్తే చాలా మంది ఆటోల్లో ప్రయాణించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, అజాగ్రత్త... ఆటో ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం, నిర్లక్షపు డ్రైవింగ్, అజాగ్రత్తేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. డ్రైవర్‌కు ఇరుపక్కల, లగేజీ వేసే చోట కూడా ప్రయాణికులను కూర్చొబెట్టి పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో తరలిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించకుండా అతివేగంతో వాహనాలు నడపడం వల్ల, మద్యం సేవించి నడపడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు పోటీ పడి నడపం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పరిమితికి మించి రవాణ.. పట్టించుకోని అధికారులు.. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంవల్ల ఆటోలు అదుపు తప్పుతున్నాయి. ఆటో కెపాసిటీ నలుగురు మాత్రమే కాగా పది మందికి మించి ప్రయాణికులను ఆటోల్లో ఎక్కిస్తున్నారు. కూలీలను తీసుకువెళ్లే ఆటోలలో పదిహేను నుంచి 20 మంది వరకు ప్రయాణికులను తరలిస్తుంటారు. దీంతో ఆటోలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. గంగాధర చౌరస్తాలో ఉదయం సాయంత్రం పరిశీలిస్తే నలబై నుంచి యాౖభై ఆటోలకు పైగా కూలీలను రవాణా చేయడం కనిపిస్తుంది. మహిళా కూలీలు నిల్చోని మరీ ప్రయాణించడం కనిపిస్తుంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా, ప్రమాదాల కారణాలు అధికారులకు తెలిసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. -
వీరు మారరా...
బండిఆత్మకూరు : పరిమితి మించి ప్రయాణికులను చేరవేయడం ఎప్పటికైనా ప్రమాదకరమే. ఇలా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు కోకొల్లలు. ఈ విషయం తెలిసినా కొందరు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బండిఆత్మకూరు నుంచి ఓంకారం వైపు సుమారు 20 మంది పైగా ప్రయాణికులు కింద పైన కూర్చొని వెళ్తున్నారు. ఆటో ఏ మాత్రం అదుపుతప్పినా ఇక అంతే సంగతులు. -
ఎత్తు తక్కువుంటే ‘ప్రిమెచ్యూర్ బేబీ’ ప్రమాదం
మెల్బోర్న్: ఎత్తు తక్కువగా ఉన్న గర్భిణులకు నెలలు నిండకముందే ప్రసవమయ్యే ప్రమాదం.. సాధారణ లేదా పొడవైన మహిళల కన్నా రెండింతలు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఎత్తు తగ్గుతున్న కొద్దీ నెలలు నిండకముందే ప్రసవం జరిగే ప్రమాదం అంతగా పెరుగుతుందని స్వీడన్‌లోని ఉప్సల, న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ వర్సిటీల అధ్యయనం హెచ్చరించింది. 155 సెంటీమీటర్లు అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్న మహిళల పిల్లల్లో 9.4% మంది పూర్తిగా నెలలు నిండకముందే పుట్టినవారు కాగా, 1.1% మంది 8 నెలలు కూడా నిండకముందే జన్మించినవారని, ఇది పొడవైన వారిలో వరుసగా 4.7%, 0.5%గా ఉందని తేలింది. స్వీడన్‌లోని 1.92 లక్షలమంది మహిళలపై ఈ అధ్యయనం చేశారు. -
అలాంటివి మహిళలకే డేంజర్!
లండన్: మానవ జీవిత చక్రంలో నిద్ర అనేది అత్యంత ముఖ్యమైనది. శారీరక విశ్రాంతి కన్నా మానసిక విశ్రాంతి అత్యంత ముఖ్యం. ఈ విశ్రాంతికి భంగం కలిగిందో ఇక అంతే సంగతులు. నిద్రాభంగం జరిగితే పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతాయని, వారికే తొందరగా ప్రమాదం జరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. రాత్రి వేళ షిప్టుల్లో పనిచేసే పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా దుష్ప్రభావాలు చవిచూడాల్సి ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. 24 గంటల జీవ క్రియలో సర్కాడియల్ ప్రభావం పురుషుల మెదడుపై కన్నా స్త్రీలపైనే ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. 'మొట్టమొదటిసారి సర్కాడియన్ క్లాక్ ఎఫెక్ట్స్ పురుషుల్లో స్త్రీలలో వేర్వేరుగా ఉండటం మేం తొలిసారి గుర్తించాం. షిప్టుల్లో పనిచేసేవాళ్లలో ఈ వైరుద్యాన్ని మేం స్పష్టంగా గుర్తించాం. నైట్ షిప్టులో ఉన్న మహిళలపై ఒత్తిడి స్థాయి అధికంగా ఉంటుంది' అని యూనివర్సిటీ ఆఫ్ సర్రే అధ్యయనకారుల్లో ఒకరైన నయనతార శాంతి అన్నారు. సరిగా నిద్ర భంగం జరిగితే మానసిక నైపుణ్యాలు, మోటారు వాహనాల నియంత్రణ, జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని, ఈ పరిస్థితి మహిళల్లో తొందరగ కలుగుతుందని తెలిపింది. -
లింగ ఆధారిత న్యాయం ప్రమాదకరం
న్యూఢిల్లీ: 'మహిళలకు దేవాలయ ప్రవేశం' అనే అంశంపై దేశంలో చర్చ జరుగుతున్న తరుణంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ అనే కారణంగా ఆలయాల్లోకి అనుమతి నిరాకరించడం, లింగం ఆధారంగా వివక్షచూపడం ప్రమాదకరమని అభిప్రాయపడింది. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి గర్భగుడిలోకి ప్రవేశాన్ని కోరుతూ వేసిన పిటిషన్ ను విచారిస్తూ న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ వాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో ఎక్కడా మహిళ అనే కారణంగా గర్భగుడిలోకి వెళ్లకూడదని లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సాంప్రదాయాల పేరుతో అనుమతి నిరాకరించడం సహేతుకం కాదని అన్నారు. ఒక నాడు సతీసహగమనం, వరకట్నం వంటివి కూడా సాంప్రదాయంలో భాగంగా ఉండేవని వాటిని నిషేధించిన విషయాన్ని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. బ్రహ్మచారి, యోగి అయిన అయ్యప్ప దేవాలయంలో్కి రుతుక్రమంలో ఉన్న మహిళలు వస్తే ఆలయ పవిత్రత దెబ్బతింటుందనే సాంప్రదాయం కొనసాగుతోంది. -
మృత్యువును కళ్లారా చూసి బయటపడ్డారు!
లాహోర్: అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు. పాకిస్థాన్, చైనా మధ్య ఉంటుంది. కారాకోరమ్ పర్వత శ్రేణులకు ఆనుకొని ఈ రోడ్డు ఉంది. కొండచరియలు, వర్షాలు పడితే భారీ వరదలు ఈ రోడ్డుపై నిత్యం కనిపించే దృశ్యాలు. బ్రిడ్జీలు కూడా కొట్టుకుపోయేంత ఉధృతంగా ఇక్కడ వరదలు వస్తుంటాయి. గత కొద్ది రోజులుగా ఈ కారాకోరం పర్వత శ్రేణుల్లో వర్షం పడుతోంది. దీంతో ఈ రోడ్డుపై వరద పోటెత్తింది. అదే సమయంలో కొందరుపాకిస్థాన్ వాసులు ఒక బస్సులో ఆ మార్గం గుండా వచ్చి ఆ వరదల్లో చిక్కుకుపోయారు. పక్కనే పెద్ద లోయ. కాసేపట్లోనే ఆ వరద బస్సును కబళించింది. దీంతో అందులో ఉన్నవారికి గుండెలు జారినంత పనైంది. ధైర్యం చేసి బస్సు కిటికీల అద్దాలు తెరిచి గబగబా అందులో నుంచి ఒడ్డుకు దూకేశారు. ఒక వ్యక్తి మాత్రం బస్సులోని చిక్కుకుపోయాడు. వరద బస్సును అమాంతం ఈడ్చుకెళుతుండటంతో అతడు మెల్లగా బస్సు చివరి అంచునుంచి ముందు టైరువరకు పాక్కుంటూ వచ్చి ఏదో ఒకలా ఊపిరంతా కూడబబట్టుకొని ఒక్క ఉదుటన దూకగా అప్పటికే ఒడ్డున ఉన్నవారు అతడిని బయటకు లాగారు. దీంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది క్షణాల తేడాతో అంతా మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఒకరికి తీవ్రగాయాలు
గోపాలపేట మండలం మున్ననూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
నీటి గుంటలో పడి బాలుడి మృతి..
అకాల వర్షాల కారణంగా నెల్లూరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. భారీ వర్షాలతో ఇంటి ముందే... చెరువులను తలపించేలా నీరు నిలిచిపోవడంతో ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఈ విషాదం.. జిల్లాలోని పెల్లకూరు మండలం చెంబేడు గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామంలో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటి గుంటలో పడి పోయాడు. దీంతో ఊపిరాడక మృతి చెందాడు.. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ప్రమాదంలో ప్రజాభిప్రాయం
సందర్భం అవును, నిజం! బిహార్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం చిత్తయింది. జాతీయ మీడియా ఎంపిరికల్ డాటాను పట్టేసి, సైంటిఫిక్ మెథడాలజీని ధగధగ పట్టించేసి అంతా సరిగ్గా లెక్కేసి చెప్పిన ప్రజాభిప్రాయం కట్టుదప్పింది. గత ఆదివారంనాడు కచ్చితంగా జనం నాడిని ఇట్టే పట్టేసి, ప్రజాభిప్రాయాన్ని విప్పి చెప్పేసే జాతీయ టీవీ చానళ్లను అటూ ఇటూ మార్చేస్తూ కూచున్నవాళ్లకు... అనుకున్నట్టే మోదీ అభివృద్ధి మంత్రాన్ని బిహారీ జనం మెచ్చారని అర్ధమైంది. నిట్టూర్చిన వాళ్లు, సంబరపడ్డవాళ్లు కూడా అనుకున్నట్టే జరుగుతుందనుకున్నారు తప్ప... మిన్ను విరిగి మీద పడినంత పనవుతుందని ఊహించలేదు. ఎన్నికల లెక్కల చిక్కులు విప్పడంలో దిట్ట ప్రణయ్‌రాయ్ అంతటివాడే ఎన్నడూ కనీవినీ ఎరుగని విడ్డూరమని విస్తుపోయి నోరెళ్లపెట్టాడంటే పెట్టడా? చద్ది వార్తలకు పేరు మోసిన దూరదర్శన్ సహా జాతీయ చానళ్లన్నీ మోదీ విజయభేరీని మోగిస్తుండగా... కథ అడ్డం తిరిగింది. ఈసీవోళ్లు ఏ దయ్యపు మెషిన్లు పెట్టారో, బిహారీలు జాతీయ మీడియాకు మస్కాకొట్టి ఎలా అంతుపట్టకుండా ఓటేశారోగానీ నితీశ్, లాలూ బ్రదర్స్ చేతుల్లో మోదీ ఓడిపోయారు! ఓటర్ల తీర్పులపై పోస్ట్‌మార్టమ్‌లు మీడియా పండితులు, విశ్లేషకులకు అలవాటే. సదరు పండితమ్మన్యులంతా చాపుదప్పి కన్నులొట్టపడ్డాక... ఇప్పుడు స్వీయ పోస్ట్‌మార్టమ్‌లు చేసుకోవాల్సి వస్తోంది. ఐదు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొదటి రెండు దశల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే అంచనాలు వేశామని అంతా తేల్చారు. రెండు నెలలుగా డొంక తిరుగుడుగానో, సూటిగానో మోదీ అభివృద్ధి నాగస్వరానికి బిహారీలు నాట్యమాడేస్తున్నారని... కుల, మతాల సంకుచిత రాజకీయాలకు తెరదించేస్తున్నారని ప్రజాభిప్రాయాన్ని జాతీయ చానెళ్లవారు వినిపిస్తూనే ఉన్నారు. అయినా ప్రజలు పెడచెవిని పెట్టి, రెండు దఫాలు తలలూగిస్తున్నట్టే కనిపించి ఆ తర్వాత అలా జెల్లకాయలు కొట్టేస్తే ఎలా? ఆదివారం ఉదయం జాతీయ చానెళ్లు ఎన్డీయే సాధించబోయే విజయంపై అంచనాలు కడుతూ లొట్టలేసి...ఆ కూటమి నేతలను అభినందిస్తూ, అధికారంలోకొస్తే ఏం చేయబోతారో వారిచేత చెప్పిస్తుంటే...అక్కడ అభివృద్ధి వెలుగేలేని బిహార్‌లో స్థానిక చానళ్లకు చెందిన రిపోర్టర్లు, స్ట్రింగర్లు సామాన్య జనంతో మాట్లాడి, వారి మనోగతాలను అందరికీ తెలియజెప్పారు. కనుకనే నితీష్, లాలూ కూటమి విజయం సాధించబోతున్నదని ఆ చానెళ్లు చాలా ముందుగానే అంచనా వేశాయి. ఆఖరికి రాజ్యసభ టీవీ సైతం ఆదినుంచీ మహా కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తున్నదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మన జాతీయ చానెళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఎన్డీఏ కూటమి ఓట్ల లెక్కింపులో విజయపథంలో దూసుకుపోతున్నదని జంకూ గొంకూ లేకుండా ప్రకటించేశాయి. స్థానిక భాషా చానళ్ల సంగతలా ఉంచి రాజ్యసభ టీవీ అందరిలాగే 243 నియోజకవర్గాల్లో స్ట్రింగర్లను మోహరించింది. వారు పంపిన డేటాను 40మంది నిపుణులు విశ్లేషించారు. ‘మేం నిష్పాక్షికంగా ఉండటంవల్లే విజయం సాధించగలిగామ’ని ఆ చానెల్ నిర్వాహకులు గర్వంగా చెప్పుకోగలిగారు. సమస్త వనరులూ ఉన్న జాతీయ చానెళ్లు మాత్రం ఘోరంగా విఫలమయ్యాయి. సీఎన్ఎన్-ఐబీఎన్ వాళ్లు అత్యంత విశ్వసనీయమైనదిగా చెప్పుకునే ఓ సంస్థతో ఎగ్జిట్‌పోల్ సర్వే చేయించి లాలూ, నితీశ్‌ల కూటమికి కూటమికి 160 నుంచి 180 సీట్లు వస్తాయని ఎక్కడో ఓ వైబ్సైట్లో ఇలా పెట్టేసి, అలా తీసేశారు. అతి నమ్మకంగా చివరిదాకా, గూట్లోని ప్రజాభిప్రాయం చెట్టెక్కి కూచోడానికి ముందు వరకూ ఇతర సంస్థల సర్వేలనే ఏకరువు పెడుతూ... ఇప్పుడు అందరితో పాటు తామూ స్వీయ పోస్ట్‌మార్టమ్ నిర్వహించుకుంటున్నారు. ఎందుకు? ఢిల్లీ దర్బారుకు కోపం వస్తుందేమోనని దడుచుకున్నారని, అంతా ఒక దారై, తమది మరో దారై.. చివరికి తామే తప్పని తేలితేనో? అని భయపడ్డారని ఊహగానాలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా నిజాన్ని నిర్భయంగా చెబుతామని ప్రకటించుకునే జాతీయ మీడియా తన ఖ్యాతిని పొగొట్టుకోవాల్సి వచ్చింది. జాతీయ మీడియా దృష్టిలో స్థానిక భాషా చానళ్లు, పేవర్లు నాసిరకానివి. అవి ప్రజాభిప్రాయానికి తూట్లు పొడుస్తుంటాయి. వాటి దృష్టిలో గ్యాస్ సబ్సిడీలనుంచి రైతులకిచ్చే సబ్సిడీలవరకూ అన్నీ వృథా. స్థానిక మీడియా వాటికి అనుకూలంగా మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డుతగులుతున్నదని జాతీయ మీడియా తరచు చెప్పే అభిప్రాయం. ఆ బాపతు విశ్లేషణలే వాటిల్లో కనిపిస్తాయి. బిహార్ ఎన్నికల విషయంలోనూ అవి ఇలాగే వ్యవహరించాయి. జనాభిప్రాయానికి వేరే భాష్యం చెప్పుకుని తప్పు మీద తప్పు చేసుకుంటూ సాగిపోయాయి. బిహార్ ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయింది ఎవరూ అంటే జాతీయ మీడియానే. దాని ప్రజాభిప్రాయ సేకరణలను ఇక ప్రజలు విశ్వసనీయమైనవిగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు అవి ఎవరినో తప్పు పట్టి ప్రయోజనం లేదు. నేల విడిచి సాము చేసినట్టుగా క్షేత్ర స్థాయి, ఓటరు స్థాయి సర్వేలను నిష్పాక్షికంగా, తటస్థంగా ఉండి జరిపించడంలో అవి విఫలమయ్యాయి. ప్రజల నాడిని పట్టుకోవడం కంటే ముందస్తు నిర్ణయాలకు సాక్ష్యాలను వెతికే దిశగా విశ్లేషణలు, సర్వేలు సాగాయి. మహానగరాల్లోని టీవీ స్టూడియోల ఆలోచనలకు భిన్నమైన ఓటర్లు గ్రామాల్లో, బస్తీల్లో నిశ్శబ్దంగానే గడిపేస్తుంటారు. వారి నాడిని పట్టుకునే దిగువస్థాయి రిపోర్టర్ల స్ట్రింగర్ల వ్యవస్థలు సువ్యవస్థితమై లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపై సాగించే సర్వేలు జాతీయ మీడియా విశ్వసనీయతను, స్వతంత్ర తను ఇప్పటికే దెబ్ప తీశాయి. బిహార్ తల బొప్పితోనైనా ఈ తీరు మారేనా? - ఎస్. కమలాకర్ -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి ఎస్సీకాలనీలో బుధవారం నీటితొట్టెలో పడి హేమశ్రీ అనే ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఇంట్లో వాళ్లంతా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆడుకుంటూ ప్రమాద వశాత్తు చిన్నారి తొట్టెలో పడటంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. -
నిమజ్జనానికి వెళ్లి ప్రాణాలు విడిచాడు..
గణే శుని విగ్రహ నిమజ్జనానికి వెళ్లిన ఒక వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా చాకలిపేటలో బుధవారం అర్థరాత్రి జరిగింది. విజయనగరం జిల్లా కేంద్రం నాగోజీపేటకు చెందిన గేదెల పైడిరాజు చాకలిపేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం కార్యక్రమానికి వెళ్లాడు. చెరువులోకి దిగి విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో పట్టుతప్పి.. నీళ్లలోకి జారిపోయాడు. బురద మట్టిలో కూరుకుపోయి తిరిగి పైకి రాలేక ప్రాణాలు విడిచాడు. నిమజ్జనం అనంతరం అందరూ తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. అతడు తిరిగి రాని విషయం గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులతో వెళ్లి చెరువులో వెదకగా బురదలో విగతజీవిగా కనిపించాడు. -
వినాయక విగ్రహం కిందపడి ఒకరి మృతి
ప్రమాదవశాత్తు గణేశుని విగ్రహం పడిపోవటంతో దాని కిందపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో గురువారం వేకువజామున ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేసేందుకు బుధవారం రాత్రి గ్రామస్తులు బయలుదేరారు. అదేమార్గంలోని కృష్ణాయపాలెం గ్రామం గుండా వెళ్తుండగా ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి కిందపడిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఎర్రబాలెం గ్రామానికి చెందిన పోకల శంకర్రావు(42) దాని కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర్రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
డేంజర్ అవర్స్!
-
ఆన్లైన్ వైద్యంతో ముప్పు
న్యూఢిల్లీ: పక్క మీది నుంచి లేచి లేవగానే ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓ పక్క ముక్కు కారతూ ఉంటోంది. మరోపక్క తలంతా భారంగా ఉంటుంది. ఏం చేయాలో తోచదు. డాక్టర్ దగ్గరికెళ్లాలంటే అబ్బా! అంతదూరం ఏం వెళతాం అంటూ బద్ధకిస్తాం. వెంటనే పక్కనున్న స్మార్ట్ ఫోన్ అందుకుంటాం. అవసరమనుకున్న యాప్ ఓపెన్ చేస్తాం. ఎక్కడోవున్న డాక్టర్ లైన్లోకి వస్తాడు. మన బాధంతా చెబుతాం. కొద్ది క్షణాల్లోనే ప్రిస్క్రిప్షన్ మన ఫోన్‌కు మిసేజ్ రూపంలో వస్తుంది. డాక్టర్ నయాపైసా ఫీజు తీసుకోడు. వెంటనే మరో యాప్ ఓపెన్ చేస్తాం. ఆన్లైన్ మెడికల్ మార్కెట్‌కు డాక్టరు రాసిన ప్రిస్క్రిప్షన్ పంపిస్తాం. అంతే ఓ అరగంటలో మన ఇంటికి మందులొస్తాయి. ఆహా ఏమీ భాగ్యమూ...సాంకేతిక విప్లవంతో కదలకుండా పనులవుతున్నాయనే సంతోషం. కానీ ఇక్కడే మోసపోతున్నాం. ఫీజులు తీసుకోకుండా ఎంతోమంది ఆన్లైన్ డాక్టర్లు మనకు వైద్య సలహాలు ఇస్తున్నారు. మందులు రాస్తున్నారు. వారేమీ ఫీజు తీసుకోకుండా పనిచేసే సమాజ సేవకులు కాదు. ఆన్లైన్లో మందులు సరఫరా చేసే ఆసాములు వారికి కావాల్సిన వేతనాలు చెల్లిస్తారు. ఈ ఆన్లైన్ మార్కెట్ సంస్థల వద్ద ఏ మందులున్నాయో, ఆ మందులను మాత్రమే సదరు ఆన్లైన్ డాక్టర్ సిఫారసు చేస్తారు. అవి మార్కెట్ సంస్థలకు లాభదాయకమైన మందులు కావచ్చు లేదా నాసిరకం మందులు కావచ్చు. అక్కడితో ఈ మోసం ఆగిపోవడం లేదు. ఆన్లైన్ మార్కెట్ ద్వారా కుప్పతెప్పలుగా కల్తీ మందులు వచ్చి పడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. లెసైన్స్ పొందిన మెడికల్ షాపుల్లోనే సరైన మందులను విక్రయిస్తున్నారా లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి చాలినంత మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు లేరు. అలాంటిది అలాంటిది ఆన్లైన్ మార్కెట్ గిడ్డంగులను తరిఖీ చేయడం కష్టం. ప్రస్తుతానికి అలాంటి వ్యవస్థ కూడా లేదని సంబంధిత ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఇటీవల ‘మహారాష్ట్ర పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’కు చెందిన అధికారులు తామే వినియోగదారుల పాత్రలో అన్లైన్ డాక్టర్లను, మందుల మార్కెట్లను సంప్రదించగా ఇలాంటి అవకతవకలు బయటపడ్డాయి. కేవలం లెసైన్స్ పొందిన మందుల షాపులు మాత్రమే విక్రయించాల్సిన 45 రకాల మందులు ఆన్లైన్లో విక్రయిస్తున్న విషయమూ వెలుగుచూసింది. అంతేకాకుండా వాటిలో నకిలీ మందులు కూడా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా, మందుల నాణ్యత గురించి అవగాహన లేకుండా ఆన్లైన్లో మందులు కొనుగోలు చేయడం హానికరమేనని ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్’లో స్కూల్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ స్టడీస్‌లో డీన్‌గా పనిచేస్తున్న డాక్టర్ టి. సుందరరామన్ హెచ్చరిస్తున్నారు. పూర్తిగా మంచంపట్టి లేవలేని రోగులు, వృద్ధాప్యంతో కదలలేని రోగులకు ఉన్నంతలో ఆన్లైన్ డాక్టర్లు ఉపయోగపడతారుగానీ మిగతావారికి కాదని ఆయన చెబుతున్నారు. ఎప్పుడైనా డాక్టర్‌ను ముఖాముఖి కలుసుకొని వైద్యం చేయించుకోవడమే ఉచితమని ఆయన సలహా ఇస్తున్నారు. మందుల నాణ్యతతోపాటు ఇతర అంశాలపై ‘భారత ఫార్మాసిస్టుల సంఘం’ ఇప్పటికే పలుసార్లు భారత డ్రగ్ కంట్రోలర్‌కు ఫిర్యాదులు చేసింది. మొత్తంగా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఆన్లైన్ వైద్యంపై మార్గదర్శకాలను రూపొందించే కసరత్తులో పడ్డారు. మరి అప్పటివరకు ఈ విధానం ప్రమాదమేకదా! -
ప్రాణం.. 'ఆటో' ఇటో!
వీళ్లూ మనుషులే. వీరివీ ప్రాణాలే. ఓ తల్లి బిడ్డలే. ప్రమాదం జరిగితే ఆ కన్నపేగు పడే బాధ తెలియనిది కాదు. అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నా.. స్వచ్ఛందంగా చదువుకునేందుకు ముందుకొచ్చే విద్యార్థుల బాగోగులను అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. తమ పిల్లలు బాగుంటే చాలు అనుకున్నారో.. ఏమో. రోజూ మృత్యువుపై సవారీ చేస్తున్న బడి పిల్లలను చూస్తే.. దారినపోయే వారెవరికైనా మనసులో ముల్లుగుచ్చుకోక మానదు. మరి అధికారులు ఏమి చేస్తున్నట్లు? గొల్లలదొడ్డి(సి.బెళగల్): మండల పరిధిలోని గొల్లలదొడ్డి విద్యార్థులు సి.బెళగల్‌లోని ఆదర్శ, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు సమయానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు సమయానికి చేరుకునేందుకు ఆటోలను ఆశ్రయిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కర్నూలు నుంచి గ్రామానికి బస్సు సర్వీసును ఏర్పాటు చేసినా.. పాఠశాలల సమయానికి అందుబాటులో లేకపోవడం గమనార్హం. గతంలో 7.30 గంటలకే గ్రామానికి వచ్చే బస్సు.. ప్రస్తుతం 11.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు వస్తోంది. విద్యార్థులకు ఈ సర్వీసులు ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి. గ్రామంలో దాదాపు 40 మంది విద్యార్థినీ, విద్యార్థులు సి.బెళగల్‌లోని ఆదర్శ, ఉన్నత పాఠశాలలకు, గూడూరులోని జూనియర్ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఆయా పాఠశాలలు, కాలేజీలు ఉదయం 9 గంటలకే తెరుస్తుండటంతో గ్రామం నుంచి విద్యార్థులు ఆటోల్లో వేళాడుతూ అతి కష్టం మీద చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క గొల్లలదొడ్డి గ్రామస్తులదే కాదు.. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థుల అవస్థ ఇదే. విధిలేని పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయిస్తుండగా.. వాళ్లకీ నాలుగు డబ్బులు వస్తుండటంతో ప్రమాదమని తెలిసీ సామర్థ్యానికి మించి విద్యార్థులను అందులో కుక్కేస్తున్నారు. బస్సుల్లోనూ టాపుపై ప్రయాణిస్తున్నారు. పోలీసులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీలు చేపట్టకపోవడం ఎందరి ప్రాణాలు బలిగొంటుందోననే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. -
జర్నలిస్టులకు ఇండియా డేంజర్!
న్యూఢిల్లీ: పత్రికా రంగంలో పనిచేసే విలేకరులకు భారతదేశం సురక్షిత ప్రాంతం కాదని ఓ సర్వే తేల్చింది. అయితే, ప్రపంచంలోనే ఎక్కువ స్వేచ్ఛ ఉండే వాతావరణం భారతదేశ సొంతమని, ఇక్కడ జర్నలిజం చాలా శక్తిమంతమైనదని తెలిపింది. కానీ, జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోవడం కొంత ఆందోళనకరమని వాపోయింది. గత 22 ఏళ్లలో ఇప్పటివరకు 58 మంది జర్నలిస్టులు హత్య చేయబడ్డారని సర్వే పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలో కూడా నరమేధం జరుగుతుందనే విషయాన్ని ఈ ఘటనలు రుజువు చేశాయని వెల్లడించింది. భారత్‌లో విలేకరులు ఎన్నో అరాచకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టులంతా చిన్న చిన్న ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో అతి తక్కువ నికర వేతనాలకే పనిచేస్తున్నారని తెలిపింది. వీటికి స్థిరమైన సంస్థలు లేవని, శక్తిమంతమైన నెట్ వర్క్ కూడా లేదని తెలిపింది. సోషల్ మీడియా వల్ల మీడియా వ్యక్తులకు కొంత ఓదార్పు లభించిందని పేర్కొంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా ఇప్పుడిప్పుడే కొంత స్వేచ్ఛాయుత జర్నలిజంలోకి వస్తున్నారని, ఆశించినంత స్థాయిలో జర్నలిజం విలువలు లేవని కూడా ఆ సర్వే తెలిపింది. 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్' అనే పేరిట ఓ వెబ్సైట్ ఈ సర్వే నిర్వహించి వివరాలు వెల్లడించింది. -
పాములతో పారా హుషార్
వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఇన్నాళ్లూ ఎండ వేడిమితో సతమతమైన పాములు పుట్టలు, బొరియల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ సంచరిస్తున్నాయి. ఈ నెల 16న ఉరవకొండ మండలం రేణుమాకులపల్లికి చెందిన నాగేంద్ర (40) పాముకాటుతో మృతి చెందాడు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఒక్క అనంతపురం సర్వజనాస్పత్రికే 170 మంది పాముకాటు బాధితులు వచ్చారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అనంతపురం మెడికల్ : వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువ. రక్తపింజర, నాగుపాము, తాచుపాము, కట్లపాము, నీరుకట్ట, కొండచిలువ, జెర్రిపోతు వంటివన్నీ విష సర్పాలే. ఇలా ఏ రకమైన పాము కాటు వేసినా ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం. పాము కాటు వేయగానే తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణనష్టం తప్పదని వైద్యులు అంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి మొదట పాము కాటు వేసిన చోటును గుర్తించాలి. కాటు వేసిన పైభాగంలో రక్త ప్రసరణ తగ్గించేందుకు కట్టుకట్టాలి. లేకపోతే రక్తాన్ని పిండేయాలి. పాములు కాటు వేసిన సమయంలో భయాందోళనకు గురైతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎలాంటి పాము కుట్టినా మొదట ఒత్తిడికి లోనుకాకూడదు. విషపూరిత పాము కాటేసినప్పుడు ఆ భాగాన్ని ఎక్కువగా కదలించకుండా సమీపంలోని ఆస్పత్రికి ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్లాలి. ఏ పాము కుట్టినా శరీరంపై ప్రభావం చూపించడానికి 30 నుంచి 60 నిమిషాల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతారు. ఈలోగా సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చు. విషపూరిత పాము కాటుకు యాంటీ స్నేక్ వీనం సరైన సమయంలో ఇస్తే ప్రాణాపాయం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు పాము కాటుకు సంబంధించి ‘యాంటీ స్నేక్ వీనం’ మందును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ విషయం తెలియక చాలా మంది పాము కాటు వేయగానే నాటు వైద్యం కోసం వెళ్తున్నారు. ఇది చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ‘యాంటీ స్నేక్ వీనం’ మందు అందుబాటులో ఉంది. గుంతకల్లు, హిందూపురం, గుత్తి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లాలోని 81 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందు అందుబాటులో ఉన్నట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. తడి ఎక్కువగా ఉండడం తో చల్లని వాతావరణం ఉంటుంది. దీంతో పాముల బెడదకూడా ఎక్కువే. రైతులు పొలం పనులకు వెళ్లేటప్పుడు కాళ్లకు పొడవైన బూట్లు వేసుకోవాలి. రాత్రి వేళల్లో పొలాలకు టార్చిలైట్ తీసుకుని పంచె కింద వరకు ధరించాలి. కర్రతో శబ్దం చేసుకుంటూ వెళ్లాలి. ఒక వేళ అనుకోకుండా పాము కాటు వేస్తే ఆందోళనకు గురికాకుండా సమీప ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకోవాలి. వీలైనంత వరకు వెలుతురు ఉండగానే పనులు ముగించుకుని ఇంటికి చేరుకుంటే మంచిది. - డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి, కేవీకే కో ఆర్డినేటర్, రెడ్డిపల్లి నాటు మందులతో ప్రమాదం చాలా మందు పాముకాటుకు నాటుమందు అంత సురక్షితం కాదు. ముందుగా పాముకాటుకు గురైన వారు ఒత్తిడికి లోనుకావద్దు. అలా చేస్తే విషం వేగంగా ప్రసరించి మెదడుపై ప్రభా వం చూపుతుంది. కాటు వేయగానే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆలస్యం చేయొద్దు. - షేక్ యాసిర్ అరాఫత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అనంతపురం ప్రభుత్వాస్పత్రి. -
కల్తీ పాల కేంద్రంపై అధికారుల దాడులు
గుంటూరు: కృత్రిమ పాల తయారీ కేంద్రాలపై బుధవారం అధికారులు దాడులు చేపట్టారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం అల్లూరి వారిపాలెంలో కత్రిమ పాలు తయారీ కేంద్రంపై ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో కృత్రిమ పాల తయారీకి ఉపయోగించే 160 లీటర్ల రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తయారీ దారులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (నర్సరావుపేట రూరల్) -
ఆర్టీసీ అద్దె బస్సులు డేంజర్
పల్లె వెలుగు అద్దె బస్సులు ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల అనేక ప్రాంతాలలో ఆర్టీసీ అద్దె బస్సుల టైర్లు ఊడిపోవడం, చక్రం రాడ్లు విరిగిపోవడం వంటి సంఘ టనలు జరిగాయి. కొన్నిచోట్ల డ్రైవర్ల అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొన్నిచోట్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు. ముఖ్యంగా అనేక బస్సులు ఫిట్నెస్ లేకుండా, కాలం చెల్లినవి ఉన్నాయి. డిపో అధికారులు, మెకానికల్ సిబ్బంది సరైన తనిఖీ చేయకుండానే బస్సులను డిపోల నుండి వదులు తున్నారు. నిబంధనల ప్రకారం బస్సును డిపోలో క్షుణ్ణంగా ఆయా యంత్రాలను తనిఖీ చేయాలి. చెడిపోయిన భాగాలను మరమ్మతులు చేయాలి. అలాగే దుమ్ము, ధూళితో ఉన్న బస్సులను శుభ్రం చేయాలి. కానీ ఇవేవీ చేయడం లేదు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో భయంతో ప్రయాణిస్తున్నారు. అలాగే దుమ్ము, ధూళి బస్సులలో బాగా ఉండటంతో శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కాలం చెల్లిన బస్సులను నిషేధించాలి. బస్సు కండిషన్ తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి. అలాగే బస్సులలో పరిశుభ్రతపై దృష్టి సారించాలి. - బి. ప్రేమ్‌లాల్ వినాయక్ నగర్, నిజామాబాద్ -
గ్రానైట్ క్వారీలో ప్రమాదం
ముగ్గురు కార్మికులు మృతి శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చింతలగుట్ట వద్ద గ్రానైట్ క్వారీలో శనివారం సాయంత్రం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీలో కార్మికులు డ్రిల్లింగ్ చేసి డిటోనేటర్ అమర్చుతుండగా పేలుడు జరిగినట్టు స్థానికులు అనుమానిస్తుండగా, బండరాయి కూలడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. క్వారీలో బీహార్, తమిళనాడుకు చెందిన కూలీలు కొన్ని నెలలుగా పనులు చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం డ్రిల్లింగ్ పనులను బిహార్‌కు చెందిన అజయ్‌నాయక్(22), రాహుల్‌నాయక్(21), బికారీ నాయక్(23), తమిళనాడుకు చెందిన మరియప్పన్(47), పలనీ(45)లు చేస్తున్నారు. మరికొందమంది కార్మికులు మరోచోట డ్రిల్లింగ్ చేసి, డిటోనేటర్లు అమర్చారు. ఇంతలో పేలుడు జరిగిందో, బండరాయి కూలిపోయిందో కానీ భారీ ప్రమాదం జరిగింది. అజయ్‌నాయక్, రాహుల్‌నాయక్, మరియప్పన్ అక్కడికక్కడే మృతిచెందగా, బికారీనాయక్కు తీవ్రగాయాలయ్యాయి. -
డే కేర్లతో డేంజర్
‘డే కేర్’లలో బంధాలకు దూరమవుతున్న రేపటి తరం ఆయాల పాలనలో బాల్యం చిన్నారులను నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’ వాడకం పసిమొగ్గల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఐదేళ్ల వరకు ఆటపాటల్లో గడపాల్సిన బాల్యం.. ఐదు నెలలకే డే కేర్ పరం అవుతోంది. అమ్మ ఒడి వెచ్చదనాన్ని మనసారా ఆస్వాదించాల్సిన చిన్నారులు.. ఏడాది కూడా దాటకుండానే ప్లే స్కూల్స్‌లో ఆయమ్మల దగ్గరకు చేరుతున్నారు. మారుతున్న జీవనశైలి, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో చిన్నారులు ఇంట్లో ఆహ్లాదకరమైన జీవనాన్ని పొందలేకపోతున్నారు. ఇదిలా ఉంటే డే కేర్ సెంటర్లకు సంబంధించిన మరికొన్ని ఆందోళనకరమైన అంశాలు ‘డే కేర్’ సెంటర్లను ‘డేంజర్’ సెంటర్లగా మార్చేస్తున్నాయి. డే కేర్ సెంటర్లలోని చిన్నారులు త్వరగా నిద్రపోయేందుకు గాను అక్కడి సిబ్బంది వారికి ‘కాఫ్ సిరప్’ను అలవాటు చేస్తున్నారని ఇటీవలి కాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిన్నారుల ఆలనా, పాలనా విషయంలో డే కేర్ సెంటర్లు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ.... ఇక అమ్మ ఒడిలో హాయిగా సాగాల్సిన బాల్యం డేకేర్ సెంటర్లలో నలిగిపోతుండడంపై ఇటీవల నగరంలో నిర్వహించిన ‘చిల్డ్రన్ పార్లమెంట్’లో చర్చ జరిగింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులతో ముఖ్యమంత్రి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ‘డే కేర్’ సెంటర్ల పనితీరుపై విద్యార్థులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. నగరంలోని అనేక డే కేర్ సెంటర్లలో చిన్నారులను త్వరగా నిద్రపుచ్చేందుకు ‘కాఫ్ సిరప్’లను వినియోగిస్తున్నారని, తద్వారా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర దుష్పరిణామాలు కనిపిస్తున్నాయని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదే వేదికపై ఉన్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ ఈ విషయం పై స్పందిస్తూ...‘ఇలాంటి విషయాలు మా దృష్టికి కూడా వచ్చాయి. అందుకే ఇక నుంచి డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాం’ అని ప్రకటించారు. భద్రం ఎంత? నగరంలో ప్రస్తుతం వీధికొక డే కేర్ సెంటర్ కనిపిస్తోంది. తమ ఇంటికి దగ్గరగా ఉందనే కారణంతో చాలా మంది తల్లిదండ్రులు ఆ డే కేర్ సెంటర్ లేదా ప్లేస్కూల్ తమ బిడ్డలకు ఎంత వరకు సురక్షితం అనే అంశంపై తక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. అయితే ఇది ఎంత మాత్రం సరైంది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారులను డే కేర్ సెంటర్లలో చేర్చడానికి ముందు అక్కడ నిపుణులైన సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని చాలా డే కేర్ సెంటర్లలో పిల్లల పెంపకంపై ఏ మాత్రం అవగాహన లేని వారిని సైతం నియమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నగరంలోని చాలా వరకు డే కేర్ సెంటర్లలో సరైన శుభ్రత కూడా కనిపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. చిన్నారుల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, ఏ మాత్రం అపరిశుభ్ర వాతావరణం వారి దరికి చేరినా వెంటనే అనారోగ్యం బారిన పడతారు. అందుకే డే కేర్‌లోని పరిసరాలతో పాటు అక్కడి సిబ్బంది కూడా తప్పని సరిగా శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. డే కేర్లలో పిల్లలను చేర్చే ముందు పై విషయాలన్నింటిని ఓ సారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న కుటుంబాలు కావడంతోనే... ప్రస్తుతం బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో దంపతులిద్దరూ తప్పక పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులతో ఇంటిని నడపాలంటే దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు నగరంలో దాదాపు అన్నీ చిన్న కుటుంబాలే కనిపిస్తున్నాయి. ఎక్కడో స్వగ్రామంలో పెద్దలు ఉంటున్నారు. దీంతో ఇంట్లోని చిన్నారుల పెంపకం పెద్ద సవాల్‌గానే మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తమ చిన్నారిని కేవలం ఐదారు నెలల్లోనే డే కేర్ లేదా ప్లే స్కూల్లలో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ఉదయం దంపతులిద్దరూ ఆఫీసుకు వెళ్లే సమయంలో పాపాయిని డే కేర్సెంటర్లో వదిలి వెళ్లి, తిరిగి సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటపుడు తమతో పాటు తీసుకొస్తున్నారు. ఇల్లే మొట్టమొదటి పాఠశాల... చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శ అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో పెరుగుదల బాగా కనిపించే ఐదేళ్ల వయసు వరకు వారికి ఇల్లే పాఠశాల కావాలని చెబుతున్నారు. చిన్నారులు తమ భావోద్వేగాలను తల్లిదండ్రులతో పంచుకున్నట్లుగా మరెవరితోనూ పంచుకోలేరని మానసిక నిపుణురాలు డైసీ చెబుతున్నారు. ఇంట్లో పిల్లలు పెరుగుతుంటే వారికి ఆత్మీయతలు, అనుబంధాలు, వరుసలు తెలుస్తాయని అంటున్నారు. ‘ఇంట్లో తల్లిదండ్రులు అందించే ప్రేమాభిమానాలు చిన్నారుల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మూడేళ్ల వరకు తల్లి ఒడిలో పెరిగిన చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఒక వేళ తల్లిదండ్రులిద్దరూ తప్పక ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే పెద్దలైన నాయనమ్మ-తాతయ్య లేదా అమ్మమ్మ-తాతయ్యల సహాయం తీసుకోండి. వారిని ఊరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల సంరక్షణా భారాన్ని పెద్దల చేతికి అందివ్వండి’ అని నగరానికి చెందిన ప్రముఖ మానసిక నిపుణురాలు డైసీ తెలిపారు. -
రేసింగ్ యమ డేంజర్
చిలకలూరిపేట: హైదరాబాద్ వంటి మహా నగరాల్లో జరిగే బైక్, కారు రేసింగ్‌లు గుంటూరు జిల్లాలోనూ కనిపిస్తున్నా యి. ప్రాణాంతకంగా మారిన ఈ పందాలు ప్రజల్లోనూ భయాందోళనలు రేపుతున్నాయి. అతి వేగంగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువతరం తమ బంగరు భవితను కోల్పోతున్నారు. పందాల సందర్భంగా జరుగుతున్న ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు గాయాలపాలై వికలాంగులుగా మారుతు న్నారు. ఆదివారం యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన కారు రేసింగ్‌ను చూసిన ప్రజలే భయాందోళనకు గురయ్యారంటే వాహనాల వేగం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఎప్పుడు రద్దీగా ఉండే 16వ నంబరు జాతీయ రహదారిపై తిమ్మాపురం పరిధిలో ఆది వారం కొంతమేర ట్రాఫిక్ తక్కువగానే ఉంది. విద్యాసంస్థలకు సెలవు కావడం, వాహన రాకపోకలు పెద్దగా లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్టయింది. జాతీయ రహదారి విస్తరణ కూడా వాహనాల వేగం పెరగటానికి కారణమైంది. గతంలో నాలుగు లేన్లగా ఉన్న జాతీయరహదారిని ఆరు లేన్లగా విస్తరించిన క్రమంలో వాహనాలు అతి వేగంతో దూసుకువెళుతున్నాయి. ఆదివారం జరిగిన కారు రేస్‌లో ముందుగా విద్యార్థులు నిర్ణయించుకున్న టార్గెట్‌కు సమీప దూరంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి రెండు కారుల్లో వస్తున్న విద్యార్థులు గుంటూరు నగరం దాటిన తరు వాతే రేస్ ఆడాలని ప్లాన్ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కారు రేసులో ప్రమాదానికి గురైన గురైన ఏపీ 37 బీఏ 4646 వాహనం ఏలూరుకు చెందిన వ్యక్తి పేరుపై, మరో వాహనం ఏపీ31 సీపీ 0999 వాహనం విశాఖపట్నానికి చెందిన వ్యక్తిపేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారుల వేగం 140 కిలోమీటర్ల పైగా ఉండి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. అతి వేగమే... రేసింగ్ కాదు : పోలీసులు తిమ్మాపురం సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదం అతివేగం వల్ల జరిగిందేనని కారుల రేస్ కాదని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై రూరల్ సీఐ సంజీవ్‌కుమార్ మాట్లాడు తూ ఎంతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై కారుల రేస్ జరిగే అవకాశమే లేదన్నారు. ఓవర్ టేక్ చేసే సమయంలో జరిగిన ప్రమాదంగా ఆయన అభివర్ణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పురుగుల మందు పిచికారీపై జాగ్రత్త సుమా..
నవాబుపేట: పంట పొలాలు, తోటల్లో పురుగుల మందు పిచికారీ రైతుల పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంది. ఖరీప్ సీజన్లోనే ఎక్కువగా పురుగుల మందు పిచికారీ ప్రభావంతో రైతులు ఆస్పత్రుల పాలవుతున్నారు. పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. యేటా చాలా మంది రైతులు విష ప్రభావానికి గురవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇటీవల పులుమామిడి, కొజ్జవనంపల్లి, మాదారం గ్రామాల్లో పలువురు రైతులు పురుగు మందు పిచికారీ అనంతరం విష ప్రభావానికి గురై వైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. అందుకని మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. విష ప్రభావం ఇలా.. మందుల పిచికారీ చేసేటప్పుడు చర్మం, నోరు, శ్వాసకోశం, కనుగుడ్ల ద్వారా విషం శరీరంలోకి ప్రవేశించి ప్రమాదం వాటిల్లవచ్చు. విష ప్రభావానికి గురైన వ్యక్తులు తలనొప్పి, అలసట, బలహీనత, తలతిరగడం, చర్మం, కండ్లు మంట కల్గించడం, కనుచూపు మందగించడం, కనుగుడ్డు చిన్నగవడం, స్పృహ తప్పడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. పిచికారీ సమయంలో శరీరంపై మందుపడకుండా నిండా దుస్తులు ధరించకపోవడం, నోటికి అడ్డంగా గుడ్డ కట్టుకోకపోవడం వల్ల, అధిక వేడిలో పిచికారీ చేయడంతో శరీరంపై తెరుచుకున్న స్వేద రంధ్రాల వల్ల విషం శరీరంలోకి చేరుతుంది. శరీరంపై గాయాలుంటే అక్కడ పడిన విషం నేరుగా శరీరంలోకి చేరుతుంది. తద్వారారైతులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రాణాలు సైతం పోయే ప్రమాదాలను తెచ్చుకుంటున్నారు. మందుల పిచికారీపై రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. -
ప్రమాదం ‘అంచుల్లో’ ప్రయాణం
ఇరవైచోట్ల కొండ చరియలు కూలే అవకాశాలు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారుల సూచన సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్రోడ్ల ప్రయాణం ప్రమాదం అంచుల్లోకి చేరింది. వర్షాకాలం వస్తే చాలు రెండు ఘాట్‌రోడ్లలోనూ కొండ చరియలు విరిగి పడటం సర్వసాధారణమైపోయింది. రెండు రోజులుగా రెండో ఘాట్‌రోడ్డులోని చివరి ఐదు మలుపుల్లో భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడ్డాయి. మరికొన్ని చోట్ల విరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా ఇరవైకి పైగా ఇలాంటి ప్రదేశాలు ఉన్నట్టు ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. మొదటి ఘాట్‌రోడ్డులో తక్కువే 1944, ఏప్రిల్ 10వ తేదీన తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలకు 56 మలుపులతో కూడిన మొదటి ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. 1973వ సంవత్సరం వరకు ఈ రోడ్డులోనే రాకపోకలన్నీ సాగేవి. ఏకధాటిగా కురిసే కుండపోత వర్షాల వల్ల కేవలం అవ్వాచ్చారి కోన ఎగువ ప్రాంతం, కపిలతీర్థం నుంచి అలిపిరి వరకు మాత్రమే కొండ చరియలు అడపా దడపా విరిగి పడుతున్నాయి. రెండో ఘాట్‌రోడ్డులో కూలుతున్న చరియలు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు భారీగా పెరుగుతుండటంతో 1969 నుంచి 1973 మధ్య కాలంలో రెండో ఘాట్‌రోడ్డును నిర్మించారు. ఈ మార్గంలో అలిపిరి నుంచి ఎనిమిది కిలోమీటర్ల తర్వాత మొదలై తిరుమలకు చేరే వరకు కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. ఇందులోనూ చివరి ఐదు మలుపుల వద్ద ఇలాంటి పరిస్థితులు చాలా ఎక్కువ. రెండు రోజుల పాటు వరుసగా ఓ మోస్తరులో కుండపోత వర్షం కురిస్తే చాలు భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడటం సాధారణమైపోయింది. అదృష్టవశాత్తు అలాంటి ఘటనల్లో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని భక్తులు భావిస్తున్నారు. దీనివల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. తాజాగా, ఇటీవల కురిసిన వర్షాలకు రెండు రోజులుగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఏడేళ్లకు ముందు త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండచరియలు విరిగి పడటంతో అప్పట్లో ప్రత్యేకంగా ఇంజనీరింగ్ నిపుణులను రప్పించి వాటిని తొలగిం చారు. అక్కడే భారీ ఇనుపరాడ్లను కొండలోకి దించారు. ప్రత్యేకంగా ఇనుప కంచె నిర్మించారు. చివరి మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగి పడటంతో రెండేళ్లకు ముందు అక్కడ ఇనుప కంచె నిర్మించారు. దీనివల్ల బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండటంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. ఇలాంటి పరిస్థితులే సుమారు మరో ఇరవై ప్రాంతాల్లో వెలుగుచూస్తుండ టం ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి సమాచారం చెవిన పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వీటిని ని వారించాలంటే ఆయా ప్రాంతాల్లో సిమెంట్ కాంక్రీట్, ఇనుప కంచె నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితులు క నిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కొండ చరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో వాహనదారులు, ద్విచక్రాలపై వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండా లని అధికారులు సూచించారు. -
డేంజర్
-
డేంజర్..యమ డేంజర్
హైవేపై ఎల్లగిరి క్రాస్ రోడ్డు పేరు చెబితేనే వాహనదారుల వెన్నులో వణుకుపుడుతోంది.. ఇక్కడ రోడ్డు దాటాలంటేనే జంకుతున్నారు..ఇందుకు కారణం అతివేగంగా దూసుకొస్తున్న వాహనాలే. ఇప్పటి వరకు ఈ క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. జాతీయరహదారి విస్తరణలో భాగంగా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద భూదాన్ పోచంపల్లి వైపు వెళ్లే వాహనాల కోసం క్రాసింగ్ ఇచ్చారు. దానికి కొద్ది దూరంలోనే కొయ్యలగూడెం గ్రామం వద్ద అండర్ పాస్‌ను ఏర్పా టు చేశారు. వాహనాలు బ్రిడ్జీ మీద నుంచే వెళ్తున్నాయి. ఇక్కడ నాలుగైదు కిలోమీటర్ల మేర హైవే దిగుడుగా, సీదాగా ఉండడంతో, వాహనాలు గంటకు 150కి.మీ.లకు మించిన వేగం తో దూసుకొస్తున్నాయి. దీంతో ఇక్కడ రోడ్డు దాటే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. పది మందికి పైగా క్షతగాత్రులయ్యారు. మరి కొందరైతే అవిటివాళ్లయ్యారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన యువకులు బైక్‌తో రోడ్డును దాటుతుండగా, అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో, గాలిలో బంతిలా ఎగిరొచ్చి, రోడ్డుకు రెండో వైపు పడ్డారు. అంటే వాహనాలు ఎంత వేగంతో పరుగెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ ఈ మలుపు ప్రమాదకరమే.. హైవే విస్తరణ జరుగకముందు ఎల్లగిరి మూల మలుపు చాలా ప్రమాదకరమైనదే. ఇక్కడ రోడ్డు బాగా మలుపుగా ఉండేది. విస్తరణలో మూలమలుపును కొంత వరకు సరిచేయడంతో రోడ్డు ఏటవాలుగా మారడంతో వాహనాలు అతివేగంగా వస్తున్నాయి. గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ఒక్కోసారి 3నుంచి 7మంది వరకు చనిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైంది. ఆందోళన చేస్తున్నా.. ఇక్కడ జరగుతున్న రోడ్డు ప్రమాదాలతో స్థానికులు అందోళన చెందుతున్నారు. జ నం చస్తున్నా జీఎంఆర్ అధికారులు నిర్లక్ష్య ం చేస్తున్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. రోడ్డు ప్రమాదాల నివారణ కు చర్యలు చేపట్టాలని ఆందోళనలు చేస్తు న్నా ఎవరూ స్పందించడం లేదు. క్రాసింగ్ ప్రమాదకరంగా ఉందని చెప్పేవారే కాని, పరిష్కారం చూపడం లేదు. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఎల్లగిరికి చెం దిన ఇద్దరు చనిపోవడంతో గ్రామస్తులు రోడ్డెక్కారు. గంటపాటు హైవేను స్థంభింపజేశారు. పోలీసులు గ్రామస్తుల మీద కేసు లు పెట్టారే తప్ప, మరేం చేయలేదు. క్రాసింగ్ వద్ద స్టాపర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ చేసిందా.. వాహనం దొరకనట్టే హైవే విస్తరణ పనులు పూర్తికావడంతో వాహనాలు రయ్..రయ్‌మంటూ నాలుగులైన్ల రహదారిపై పరుగులు పెడుతున్నా యి. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ఢీ కొట్టిన వాహనాలు కూడా దొరకలేదు. పోలీసుల కు ఫోన్ చేసే లోపే స్టేషన్ దాటి వెళ్లిపోతున్నాయి. స్థానికులు బైక్‌లతో వెంబడించి నా దొరకడం లేదు. మండలపరిధిలో జరిగిన ప్రమాదాల్లో 10కిపైగా వాహనాలు ఇలాగే ఢీ కొట్టి వెళ్లిపోయాయి. దీంతో బాధితులు నష్టపోతున్నారు. పోలీసులు ఏ వాహనంపై కేసు పెట్టాలో తెలియక తల మునకలవుతున్నారు. పలనా వాహనం ఢీ కొట్టిందని చెబుతున్నారే తప్పా, వాహనం నంబరు మాత్రం గుర్తించలేక పోతున్నారు. చివరకు కేసులను మూసేస్తున్నారు. ఇక్కడ జరిగిన {పమాదాలు కొన్ని.. ఈ నెల 25న బైక్‌ను కారు ఢీ కొట్టడంతో, ఇదే గ్రామానికి చెందిన కొలుకులపల్లి లింగస్వామి(23), పోలేపల్లి గాలయ్య(36)లు అక్కడికక్కడే మృతిచెందారు.2012 నవంబర్ 2న, ఎల్లగిరి గ్రామానికి చెందిన కందగట్ల రాఘవరెడ్డి రోడ్డు దాటుతుండగా, కారు ఢీ కొట్టడంతో మృత్యువాతపడ్డాడు. కారు దొరకలేదు. 2012జూలై మాసంలో ఎల్లంబావి గ్రామానికి చెందిన ఈసం లక్ష్మమ్మ, కొయ్యలగూడెం గ్రామానికి చెందిన వనం అంజయ్యలు రోడ్డు దాటుతుం డ గా, వేర్వేరు వాహనాలు ఢీ కొట్టడంతో మృతిచెందారు. ఢీ కొట్టిన వాహనాలు దొరకలేదు. వారం రోజుల్లో సోలార్ సిగ్నల్ ఏర్పాటు హైవేపై క్రాసింగ్ ఉన్నట్టుగా ఇరువైపులా సోలార్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయిస్తా. ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడా. వారం రోజుల్లోగా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయిస్తా. హోటళ్ల వద్ద, రోడ్డు వెంట వాహనాలు ఆగకుండా తగిన చర్యలు తీసుకుంటా. -భూపతి గట్టుమల్లు, పోలీస్ ఇన్స్పెక్టర్, చౌటుప్పల్ -
గమ్మత్తు
యమ డేంజర్.. వైట్నర్.. మత్తులో చిత్తవుతున్న బాల్యం తెల్లవారిందంటే చేతిలో ఉండాల్సిందే డబ్బుల కోసం చోరీల వైపు దాడులకూ తెగబడుతున్న చిన్నారులు చోద్యం చూస్తున్న యంత్రాంగం సాక్షి, సిటీబ్యూరో: వైట్నర్ (ఇంక్ ఎరేజర్) మత్తుకు అలవాటు పడుతున్న చిన్నారులు తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాల్జేసుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో వైట్నర్ను తీసుకుంటున్న పిల్లలు మత్తులో తేలిపోతున్నారు. దాన్ని పీల్చడం ద్వారా వచ్చే మత్తును ఆస్వాదిస్తారు. ఆ సమయంలో ఎంతో బలం, ధైర్యం వచ్చినట్టు భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిన్నారులు ఏం ఆలోచిస్తున్నారు?, ఎలా వ్యవహరిస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. వీరంతా ఆర్థికంగా వెనకబడిన పిల్లలే కావడం గమనార్హం. వైట్నర్ను కొనుగోలు చేయడానికి, ఇతరత్రా వాటికి డబ్బులు అవసరమున్నందున తరచూ చోరీలకు పాల్పడుతున్నారు. మరికొందరు భిక్షాటనకు అలవాటు పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆదివారం ఓ బాలుడు వైట్నర్ మత్తులో డీఆర్డీఓ రీజనల్ డెరైక్టర్‌పై దాడికి దిగాడు. యాక్సా బ్లేడ్‌తో కడుపులో బలంగా గుచ్చడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం లేచింది మొదలు.. ఇలాంటి పిల్లలు ఉదయం లేచింది మొదలు వైట్నర్ కోసం ఎదురు చూస్తారు. ఎక్కడ ఉన్నా కొనుగోలు చేసి మరీ ఆ మత్తును అందుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య పాత బస్తీలో ఈ మధ్య కాలం పెరిగిపోయింది. చదువుకోవాల్సిన వయస్సులో ఈ వ్యవసనం బారిన పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కన్నెత్తి చూడని పోలీసులు... పోలీసులకు డ్రగ్స్ అనగానే కొకైన్, ఎపిడ్రిన్, గంజాయి, బ్రౌన్షుగరే గుర్తుకొస్తుంది. అయితే కళ్లముందు విచ్ఛలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న వైట్నర్లపై మాత్రం దృష్టి సారించడంలేదు. దీంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పుట్‌పాత్‌లపై పిల్లలు వైట్నర్ను నిర్భయంగా తీసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మాఫియా హస్తం? వైట్నర్ అమ్మకాల వెనుక పెద్ద మాఫియానే ఉంది. కొందరు వ్యాపారులు వీటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. బాలలను కిడ్నాప్ చేస్తున్న మాఫియా ముఠాలు వారికి వైట్నర్ అలవాటు చేస్తున్నట్టు సమాచారం. వైట్నర్ బారిన పడిన చిన్నారులు వారు ఏది చెబితే అది చేస్తున్నట్టు తెలుస్తోంది. భిక్షాటన, చోరీలు, నేరాలు సైతం సదరు ముఠాలు చేయిస్తున్నట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ మాదిరిగా పనిచేసే ఈ పదార్థానికి ఒకసారి అలవాటు పడితే మానుకోవడం చాలాకష్టం. ఈ మత్తును తీసుకోనిదే సదరు పిల్లలు ఏ పని చేయలేదు. పూర్తిగా వైట్నర్కు బానిసలుగా మారి డబ్బు కోసం చోరీలకు పాల్పడుతున్నారు. ఒకవేళ వీరు పోలీసులకు చిక్కినా వారి ఇంటరాగేషన్‌లో దెబ్బలను తట్టుకునేందుకు కూడా ఈ వైట్నర్ దోహదపడుతుందని తెలిసింది. ఎంత కొట్టినా వారికి ఎలాంటి నొప్పి అనిపించక పోవడంతో పోలీసులంటే భయం కూడా పోయినట్టు తెలుస్తోంది. పర్యాటక ప్రాంతాల్లో అధికం.. నగరంలోని పలు పర్యాటక ప్రాంతాల వద్ద రోజూ భిక్షాటన చేస్తున్న చిన్నారులు బహిరంగగానే వైట్నర్ తీసుకుంటున్నారు. తమ కళ్ల ముందే వైట్నర్ తీసుకుంటున్నా పోలీసులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ప్రపంచ పర్యాటకులు వచ్చే చార్మినార్, మక్కా మసీదు తదితర ప్రాం తాల్లో వైట్నర్కు బానిసలైన పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పలువురు సూచిస్తున్నారు. -
బడా ? ఆయుధాల నెలవా ?
-
ఆపదలో ఆదుకునే వాచీ!
ఈ వాచీ టైం చూసుకోవడానికే కాదు. అదృష్టం బాలేక కిడ్నాపర్ల చేతిలో పడితే, ఈ వాచీ ఉంటే సులభంగా బయటపడవచ్చు. అందుకు వీలుగా దృఢమైన ప్లాస్టిక్ తాడు, చిన్నపాటి బ్లేడు ఇతర వస్తువులు వాచీ పట్టీ లోపలివైపు ఎవరికీ తెలియకుండా దాచుకోవచ్చు. దాంతో దుండగుల బారి నుంచి రక్షించుకోవచ్చునని ఈ వాచీని డిజైన్ చేసిన గేర్వార్డ్ అనే కంపెనీ చెబుతోంది. ఏకే బ్యాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్న ఈ వాచీ ఖరీదు 20 డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో అయితే సుమారు 1,200 రూపాయలు. -
కారును ఢీకొన్న లారీ
శామీర్‌పేట్, రాంగ్రూట్లో వేగంగా వచ్చిన ఓ లారీ రాజీవ్ రహదారిపై కారును ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులతో పాటు ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని అలియాబాద్ చౌరాస్తా సమీపంలోని రాజీవ్ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్, లలితలు దంపతులు. వీరికి కుమారుడు నితిన్ (5 నెలలు) ఉన్నాడు. సోమవారం దంపతులు లలిత పుట్టిల్లు సిద్దిపేట్ నుంచి కారులో నగరానికి రాజీవ్ రహదారి మీదుగా వస్తున్నారు. ఈక్రమంలో మండలంలోని అలియాబాద్ చౌరాస్తా సమీపంలోని పాత టోల్ గేటు వద్దకు రాగానే రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ఓ లారీ వీరి కారును ఢీకొంది. ప్రమాదంలో ప్రవీణ్‌తో పాటు భార్య లలిత, చిన్నారి నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వారిని అల్వాల్‌లోని ఆక్సిజన్ ఆస్పత్రికి తరలించారు. లారీని స్థానికులు పట్టుకున్నారు. -
పర్యావరణానికి ముప్పు
పర్యావరణానికి ముప్పు మండలంలోని పలు గ్రామాల్లో పొలం గట్టు కొండలకు నిప్పు పెడుతుండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. గత వారం రోజులుగా అంకాలమ్మ గూడూరు, బలపనూరు, నక్కలపల్లె తదితర గ్రామాల్లో పొలాల గట్లకు గొర్రెల కాపరులు నిప్పంటిస్తున్నారు. దీంతో గ్రాసం దగ్ధం కావడంతోపాటు మూగ జీవాలు, విష సర్పాలు, కీటకాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాగే కొండ గుట్టకు నిప్పు పెడుతుండటంతో ఆస్తి నష్టం సంభవిస్తోంది. వర్షాకాలంలో గ్రాసం పచ్చగా ఉంటుందన్న భావనతో గొర్రెల కాపరులు ఇలా చేస్తున్నారు. - సింహాద్రిపురం