ఢిల్లీ.. 72 గంటలు డేంజర్‌ | Delhi NCR Air Pollution Danger, The Air Quality Index Was Recorded As 274 | Sakshi
Sakshi News home page

Delhi Air Pollution: ఢిల్లీ.. 72 గంటలు డేంజర్‌

Published Tue, Oct 29 2024 10:03 AM | Last Updated on Tue, Oct 29 2024 10:24 AM

Delhi NCR Air Pollution Danger

న్యూఢిల్లీ: రాబోయే 72 గంటలు దేశ రాజధాని ఢిల్లీకి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొగమంచు కమ్ముకుంటోంది. వాయు నాణ్యత సూచిక ప్రతిరోజూ 300 దాటుతోంది. ఈరోజు (అక్టోబరు 29) ఉదయం ఏక్యూఐ 274గా నమోదయ్యింది. ఢిల్లీలో గాలి నాణ్యత రానున్న మూడు రోజుల్లో మరింత విషపూరితం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.  
 

ఇప్పటి వరకు వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల వాయుకాలుష్యం పెరిగిందని, అయితే రానున్న రోజుల్లో పటాకులు పేల్చడం వల్ల వాయుకాలుష్యం పెరగనుందని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం పటాకులను నిషేధించినప్పటికీ కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయి. రాజధానిలో గ్రేప్-1, గ్రేప్-2 నిబంధనలు కూడా  అమలు చేస్తున్నారు.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాలోని వివరాల ప్రకారం సోమవారం ఆగ్నేయ గాలుల కారణంగా ఢిల్లీ కాలుష్య స్థాయి కాస్త మెరుగుపడింది. అయితే దీపావళి నాటికి ఢిల్లీలో రెట్టింపు కాలుష్యం ఏర్పడే అవకాశాలున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 304 (చాలా పేలవంగా ఉంది). సాయంత్రం 6 గంటలకు 299గా ఉండగా, రాత్రి 10 గంటలకు 288కి చేరుకుంది.
 


ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement