pollution
-
World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!
‘ఆ రోజుల్లో’ ‘మా రోజుల్లో’ అంటూ పిచ్చుకలను తలచుకుంటూ బాధపడితే ఏం లాభం? సొంత లాభం కొంత మానుకొని ‘నా ఇల్లు... నా పక్షులు’ అనుకుంటే పిచ్చుకలు పూర్వకళతో సందడి చేస్తాయి. పిచ్చుకలు కనిపించడం అరుదైన దృశ్యం కావడం హైదరాబాద్‌కు చెందిన భావన శ్రీనివాస్‌ను బాధించింది. ఆ బాధే పిచ్చుకల సంరక్షణను ఉద్యమ స్థాయిలో చేసేలా చేస్తోంది. సమాజంలో పర్యావరణం పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యం భావన శ్రీనివాస్‌ను ఆలోచనలో పడవేసింది. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనే ‘జాగృతి అభ్యుదయ సంఘం’కు బీజం వేసింది. ఈ సంస్థ పక్షుల సంరక్షణ, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలాంటి అంశాలపై పనిచేస్తుంది.ప్రతి ఇంటికి ఒక గూడుఇంటి చుట్టుపక్కల, తోటల్లో, రహదారుల పక్కన కనిపించే పిచ్చుకలు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. చెట్లు కొట్టివేయడం, ఆధునిక నిర్మాణాల వల్ల వాటికి గూళ్లు లేకుండా పోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భావన శ్రీనివాస్ ‘పిచ్చుక గూళ్ల సంరక్షణ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక మట్టిగూడు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వేల సంఖ్యలో మట్టి గూళ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.విద్యార్థులే వెన్నెముకగా...గూళ్ల తయారీని గ్రామీణ మహిళలకు అప్పగించి వారికి ఉ పాధి కల్పిస్తున్నారు. వేసవికాలంలో పిచ్చుకలు దాహంతో బాధపడకుండా, ప్రతి ఇంటిముందు చిన్న నీటి తోగులు (నీటి గిన్నెలు) పెట్టేలా అవగాహన కలిగిస్తున్నారు. చెట్లు, బడులు, వృద్ధాశ్రమాలలో కూడా ఈ తోగులను ఏర్పాటు చేస్తున్నారు. పిచ్చుకల ప్రాముఖ్యతపై బడులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక ఇంట్లో ఒక గూడు’ అనే ఉద్యమాన్ని విద్యార్థుల సహకారంతో ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే వేలాది కుటుంబాలు పక్షుల సంరక్షణ ఉద్యమంలో భాగమయ్యాయి. చదవండి : Sunita William Gujarat Home: పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియోపిచ్చుకలు ఎందుకు కనిపించడం లేదో తెలుసా?నగరీకరణ: కొత్త కాంక్రీట్ భవనాల నిర్మాణం, చెట్ల కొట్టివేత వల్ల పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశం తగ్గిపోయింది.ప్లాస్టిక్ వినియోగం: మనం విసిరేసే ప్లాస్టిక్ వ్యర్థాలలో పక్షులు చిక్కుకుని మరణించడం పెరిగిపోయింది.రసాయనాల ప్రభావం: వ్యవసాయ రంగంలో అధికంగా ఉపయోగించే రసాయనిక ఎరువుల వల్ల పురుగులతో పాటు చిన్నపాటి పక్షులు చనిపోతున్నాయి.నీటి కొరత: ప్రత్యేకించి వేసవిలో పిచ్చుకలకు తాగేందుకు నీరు దొరకక పోవడం వాటి మనుగడకు కష్టంగా మారింది.అవిగో పిచ్చుకలు! రకరకాల కారణాల వల్ల పిచ్చుకల సంఖ్య తగ్గిపోతోంది. వాటిని రక్షించుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పక్షి విభాగం శాస్త్రవేత్త వాసుదేవరావుతో మాట్లాడాను. అట్టపెట్టెలతో చేసిన పిచ్చుక గూళ్లు ఇచ్చారు. మంచి మట్టితో తయారుచేసిన గూళ్లు ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి అనే ఆలోచనతో ఒక కుమ్మరి కళాకారుడికి నా కాన్సెప్ట్ చెప్పాను. అతను చేసి ఇచ్చాడు. సక్సెస్ అవుతామా లేదా తెలుసుకోడానికి ముందు మా ఇంట్లోనే పెట్టాము. సూపర్ సక్సెస్ అయ్యాం. ఇప్పుడు మా ఇంటి చుట్టూ వెయ్యి వరకు పిచ్చుకలు ఉన్నాయి. పిచ్చుకలను ఎవరు తీసుకెళ్లినా ఇతరులలో స్ఫూర్తి నింపడానికి ఆ విషయాన్ని వాట్సాప్ గ్రూపులో పెట్టండి అని చెబుతుంటాను. – భావన శ్రీనివాస్ – శిరీష చల్లపల్లి -
ఇంతోటిదానికి పవన్ ఆదేశాలు.. కమిటీలు.. ఫోటోలకు ఫోజులు!
కాకినాడ, సాక్షి: చిత్రాడ.. మొన్నటిదాకా కాలుష్యం అనే పదానికి అల్లంత దూరాన ఉన్న గ్రామం. ఎప్పుడైతే జనసేన, ఆ పార్టీ కార్యకర్తలు అడుగు మోపారో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి!!. పొరపాటున అభివృద్ధి విషయంలో అనుకునేరు!!. విపరీతమైన కాలుష్యం, ఎటు చూసినా చెత్తాచెదారం.. ఫ్లెక్సీలతోనే ఆ మార్పు అంతా!!.మొన్నీమధ్యే జరిగిన జనసేన ఆవిర్భావ సభ.. చిత్రాడ(పిఠాపురం)కు విపరీతమైన కాలుష్యాన్ని మిగిల్చింది. అందుకు కారణం.. అక్కడి చెత్తను తరలించకపోవడం ఒకటైతే.. దానిని అక్కడికక్కడే పోగేసి కాల్చేయడం. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా.. పైగా బోనస్‌గా కాలుష్యాన్ని అంటగట్టారంటూ జనసేనను తిట్టిపోస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు.జనసేన సభ తర్వాత.. ఇవాళ్టికి అక్కడి రోడ్లపై ఇంకా జనసేనవారి ఫ్లెక్సీలు, వెల్కమ్ బ్యానర్లు.. ఆఖరికి భారీ ఆర్చ్‌లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ ముసుగేసి పడుకుంది. దీంతో పవన్ పర్యవేక్షణలో ఉన్న ఓ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలతో ఆ చెత్త ఏరివేయించారు.నాదెండ్ల స్వయంగా ప్రకటించి..తమది చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, సభ తరువాత సభా ప్రాంగణాన్ని శుద్ది చేస్తామని జనసేన సీనియర్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ది చేసి..ఫ్లెక్సీలు తొలగించాలని తమ అధినేత పవన్ ఆదేశించినట్లు చెప్పారాయన. ఈ క్రమంలోనే..కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. అయితే మరుసటి రోజు జనసేన నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. శుద్ధి చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదయ్యాక అక్కడి నుంచి గాయబ్ అయ్యారు. ఈలోపు.. పవన్ సొంత శాఖలోని ఉపాధి హమీ కూలీలు ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా.. అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. దీంతో విపరీతమైన కాలుష్యంతో ఆ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. -
Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!
హోలీ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. సరదాలు, రంగులు కలగలిసిన చక్కటి రంగుల పండుగ హోలీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఒకరిపై ఒకరు సంతోషంగా రంగులు జల్లుకుంటూ సంబరంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ హోలీ వెనుక అనే పురాణగాథలున్నాయి. అంతేకాదు పండుగ వేడుకల్లో ఆరోగ్యకరమైన ఆయుర్వేదకర ప్రయోజనాలున్నాయి. వణికించే చలి పులి పారిపోతుంది. వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ గాలి మార్పు కారణంగా జ్వరాలు, జలుబూ మేమున్నాం అంటూ వచ్చేస్తాయి. వీటిని అడ్డుకునేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడులను నీళ్లలో కలిపి చల్లుకునేందుకు ఈ వేడుక పుట్టిందని పెద్దలు చెబుతారు. కానీ కాలక్రమంలో సహజమైన రంగుల స్థానంలో రసాయనాలుమిళితమైన ప్రమాదక రంగులు వచ్చి చేరాయి. పైగా నాచులర్ కలర్స్‌తో పోలిస్తే చవగ్గా దొరుకుతాయి. అందుకే ఇంట్లోనే తక్కువగా ఖర్చుతో ఆర్గానిక్‌గా తయారు చేసుకునే కలర్స్ గురించి తెలుసుకుందాం. తద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు ప్రకృతిని కాపాడుకున్నవారమవుతాం.పండుగ వేడుక అంటే సంతోషాన్ని మిగిల్చాలి. ఆనందంగా గడిపిన క్షణాలు మనకు లేనిపోని సమస్యల్ని, రోగాలను తీసుకు రావడం కూడదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మందారం, బంతి, చేమంతిలా పూలతోపాటు, గోరింటాకుతో పచ్చని రంగు, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగులు తయారు చేసుకోవచ్చు. మోదుగుపూల రసాన్ని మర్చిపోతే ఎలా? మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హోలీ పండుగ పూట చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరి చేరవని అంటారు.పసుపు: బంతి పువ్వులు, నారింజ తొక్కల పొడి, చేమగడ్డ పొడి, పసుపు వంద సమపాళ్లలో తీసుకొని కలుపుకోవాలి.దీనికి కొద్దిగా నిమ్మ రసం వేసి ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే చక్కటి పసుపు రంగు తయారవుతుంది. దీన్ని నీళ్లలో కలుపుకుంటే లిక్విడ్ కలర్‌గా మారిపోతుంది.ఎరుపు: మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. వీటిని మెత్తని పొడిగా నూరుకుంటే ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఇది ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే దీనికి కొంచెం బియ్యప్పిండి యాడ్ చేసుకుంటే చాలు.మందారంతోపాటు ఎర్ర చందనం పౌడర్(కొంచెం ఖరీదైనదే)కలిపితే రెడ్ కలర్ తయారవుతుంది. ఎర్ర చందనం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తడి, పొడి రూపంలో వాడుకోవచ్చుగోధుమరంగుగోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్ర మాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్య ప్పిండిని కలిపితే చాలు.నీలం: జకరండ లేదా బ్లూ, ఊదా గుల్మొహార్ ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. అలాగే నీలం రంగు శంఖు పుష్పాలను నీళ్లలో నానబెడితే చక్కటి నీలం రంగు తయారవుతుంది. ఆకుపచ్చ: గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్య కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా సిద్దం చేసుకోవచ్చు.కాషాయం: మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెడితే పసుపు కాషాయం రంగుల మిశ్రమంతో చక్కటి రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. గోరింటాకును నూరి నీటిలో కలిపి, కొద్దిసేపు ఉంచి వడబోసుకుంటే ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును (ఇది కూడా చాలా ఖరీదైనది) రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికి కాషాయం రంగు తయారవుతుంది.గులాబీ: హోలీ ఆటలో చాలా ప్రధానమైన గులాల్ గులాబీ రంగులో ఉంటుంది. బీట్ రూట్ (నీటిలో మరగబెట్టి) రసం ద్వారా దీన్ని తయారు చేయొచ్చు. బీట్ రూట్‌ను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దీనికి శెనగ, పిండి, బియ్యం, గోధుమ పిండిని కలుపుకోవచ్చు. -
మన నీళ్లలో నైట్రేట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని భూగర్భజలాలు శుద్ధిచేయకుండా తాగునీటికి ఉపయోగించడం ఏమాత్రం సురక్షితం కాదని తాజా అధ్యయనం తేల్చింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) ప్రమాణాల కంటే కూడా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ అధిక నైట్రేట్ మోతాదులు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 27.48 శాతం మేర భూగర్భ నీటి నమూనాలను పరిశీలించగా నైట్రేట్ స్థాయిలు లీటర్‌కు 45 మిల్లీగ్రాముల నిర్దేశిత ప్రమాణాలకన్నా అధికంగా ఉన్నట్లు నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా–2024 నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను పెంచేందుకు అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతుండటం వల్ల నైట్రేట్స్ మోతాదు, గాఢత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లో పూర్తిస్థాయిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల్లేక మురుగునీరు భూగర్భజలాల్లో చేరుతుండటం కూడా నైట్రేట్స్ మోతాదు పెరుగుదలకు కారణమవుతోందని నివేదిక విశ్లేషిoచింది. దేశవ్యాప్తంగా నైట్రేట్స్ మోతాదులు ఎక్కువగా ఉన్న 15 జిల్లాల్లో రంగారెడ్డి మూడో స్థానంలో నిలవగా ఆదిలాబాద్ 11వ స్థానంలో, సిద్దిపేట 12వ స్థానంలో నిలిచాయి. రసాయన ఎరువుల అధిక వాడకంతో..రాష్ట్రంలో వరిసాగు అధికం కావడంతో అధిక మోతాదులో ఎరువు మందులు వాడుతున్నారని.. అందులో సుమారు 30 శాతం పంటలు పీల్చుకుంటే మిగతా 70 శాతం మాత్రం నీటినిల్వ కారణంగా నెమ్మదిగా భూగర్భజలాల్లో కలుస్తున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా నైట్రేట్ అధికంగా ఉన్న నీరు తాగేందుకు అనువైంది కాదంటున్నారు. ఢిల్లీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్–సేŠట్ట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్–2024 నివేదిక ప్రకారం 2021–22లో తెలంగాణలో ప్రతి హెక్టార్‌కు 297.5 కిలోల ఎరువులను రైతులు వినియోగిస్తున్నారని వారు వెల్లడించారు. అలాగే ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా–2022–23 వార్షిక నివేదిక ప్రకారం తెలంగాణలో 2021–22 నుంచి 2022–23 మధ్య ఎరువుల వినియోగంలో 4.7 శాతం వృద్ధి నమోదైనట్లు తేలిందని చెప్పారు.నైట్రేట్లు భూగర్భజలాల్లోకి చేరితే వాటిని శుద్ధి చేయడం మరింత కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చెరువులు, కాలువల్లోని కలుíÙతాలనే సరైన పద్ధతుల్లో శుద్ధి చేయలేకపోతున్న నేపథ్యంలో ఇక భూగర్భజలాల్లో కలిసే నైట్రేట్లను శుద్ధి చేయడం ఇబ్బందేనని అంటున్నారు. మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో ఏటా పండిస్తున్న మూడు పంటల్లో ఎకరానికి 10–15 బస్తాల రసాయన ఎరువులను రైతులు వాడుతున్నారని వివరించారు. దీనివల్ల విత్తనం, నేల వంటివి బలహీనంగా ఉండటమే కాకుండా రసాయన ఎరువుల అవశేషాలు పంటల్లోకి చేరుతున్నాయని.. వాటిని మనం ఆహారంగా తీసుకుంటుండటంతో మన శరీరంలోకి సైతం కెమికల్స్ ప్రవేశిస్తున్నాయని వివరిస్తున్నారు.మురుగు శుద్ధిపై పర్యవేక్షణ ఏదీ? హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి మెరుగుపడట్లేదు. దీనిపై స్వతంత్ర సంస్థతో ఇప్పటిదాకా పర్యవేక్షణే లేదు. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల సంఖ్య పెరుగుతున్నా సమర్థంగా శుద్ధిచేయక మురుగునీరంతా భూగర్భజలాల్లో చేరడం వల్ల నైట్రేట్ శాతం పెరుగుతోంది. – ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తనైట్రేట్లతో కేన్సర్ ముప్పు.. పంటల ఉత్పాదకతను పెంచేందుకు రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరగడం వల్ల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. అవే నీటిని పంటల సాగుకు ఉపయోగిస్తుండటంతో హెవీ మెటల్స్, కలుషితాలు నేరుగా వాటిలో కలుస్తున్నాయి. చేపల ద్వారా కూడా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. శరీరంలో నైట్రేట్ల శాతాలు పెరిగితే కేన్సర్‌కు దారితీస్తుంది. పంజాబ్‌లో కేన్సర్ కేసుల పెరుగుదలకు పంటల కోసం అధిక ఎరువులు, పురుగుమందుల వినియోగమే కారణమని తేలింది. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణుడు -
చెట్లను నరుకుతూ హరితహారాలెందుకు?
సోలాపూర్–ధూళే నేషనల్ హైవేపై సర్వీసు రోడ్డును నిర్మిస్తున్న ఎన్హెచ్ఏ ఓవైపు ‘హరితహారం’ఏర్పాట్లు ..మరోవైపు చెట్ల నరికివేత పనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తుల్జాపూర్ నాక వాసులు సోలాపూర్: ఒకవైపు పట్టణవ్యాప్తంగా ‘హరితహారం’కోసం ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు తుల్జాపూర్లో అందుకు భిన్నంగా చెట్ల నరికివేత జరుగుతోంది. దీంతో ఎస్ఎంసీ వైఖరి ఏమిటో అంతుబట్టడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోలాపూర్ – ధూళే నేషనల్ హైవేపై సోలాపూర్– తలే ఇప్పర్గా మార్గంలో నేషనల్ హైవే అథారిటీ సర్వీసు రోడ్డును నిర్మిస్తోంది. ప్రతి ఏడాది తుల్జాపూర్లో జరిగే కోజగిరి పూర్ణిమ వేడుకల కోసం వేలాది భక్తులు ఈ మార్గం గుండానే కాలినడకన ప్రయాణిస్తారు. అలాగే పండరీపూర్‌లో జరిగే ఆషాఢ ఏకాదశి ఉత్సవాల కోసం వేలాది మంది వార్కారీలు, భక్తులు సాధుసంతుల పల్లకీలతో ఇదే మార్గంలో పాదయాత్రగా వెళుతుంటారు. వీరంతా మార్గమధ్యంలో ఈ చెట్లనీడనే సేదతీరతారు. ఇప్పుడా సౌకర్యం ఉండబోదంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాగా సర్వీసు రోడ్డు పనుల కోసమే చెట్లను నరికివేస్తున్నామని, పూర్తైన అనంతరం తిరిగి మొక్కలు నాటుతామని సోలాపూర్ జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ రాకేష్ జవాడే తెలిపారు. -
తుంగభద్ర నీరు తాగలేం..
సాక్షి, అమరావతి: ‘‘తుంగాపానం.. గంగాస్నానం’’ అనేది నానుడి.. అంటే, తాగేందుకు తుంగభద్ర నీరు.. స్నానానికి గంగా నది నీరు అని. కానీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక మాత్రం తుంగభద్ర నది కాలుష్య కాసారంగా మారిందని.. నదీ జలాల్లో హానికర బ్యాక్టీరియా, వ్యర్థాలు ప్రమాదకర స్థాయికి చేరాయని.. ఈ నీటిని శుద్ధి చేయకుండా తాగితే వ్యాధుల బారినపడక తప్పదని హెచ్చరిస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్ర పరివాహక ప్రాంత నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగు నీటి, పారిశ్రామిక వ్యర్థ జలాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేయడం.. వ్యర్థాలను పడేయడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయి. జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటికి బీవోడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) రెండు మిల్లీగ్రాముల లోపు ఉండాలి. కానీ, కర్ణాటక పరిధి తుంగభద్ర జలాల్లో బీవోడీ గరిష్ఠంగా 7 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 6.2 మిల్లీగ్రాములు ఉంది. దీన్నిబట్టే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో మంత్రాలయం నుంచి కర్నూలు వరకు తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి బీవోడీ గరిష్ఠంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 2.4 మిల్లీగ్రాములు ఉండగా.. కోలీఫామ్ (బ్యాక్టీరియా) వంద మిల్లీ లీటర్లకు 220 ఉన్నాయి. ఇక ఫీకల్ కోలీఫామ్ (హానికర బ్యాక్టీరియా) వంద మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు. కానీ.. మంత్రాలయం నుంచి కర్నూలు వరకు తంగభద్ర జలాల్లో వంద మిల్లీలీటర్లకు 58 హానికర బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. నాడు స్వచ్ఛతకు.. నేడు కాలుష్యానికికర్ణాటక పరిధిలోని పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,196 మీటర్ల ఎత్తులో తుంగ ఒకవైపు.. భద్ర ఒకవైపు జన్మిస్తాయి. 147 కిలోమీటర్ల పొడవున తుంగ, 171 కి.మీ.ల పొడవున భద్ర పయనించాక కూడలి వద్ద సంగమిస్తాయి. తుంగభద్రగా మారాక 547 కి.మీ. ప్రవహించి తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర సమీపంలోని గొందిమల్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కృష్ణాకు ప్రధాన ఉప నది అయిన తుంగభద్ర ఒకప్పుడు స్వచ్ఛతకు పెట్టింది పేరు. అయితే, కర్ణాటక పరిధి పరివాహక ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడంతో కాలుష్య కాసారంగా మారింది. నిరుడు నవంబరులో తుంగభద్ర జలాల స్వచ్ఛతపై సీడబ్ల్యూసీ, సీపీసీబీ సంయుక్తంగా అధ్యయనం చేసి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి.ఈ నివేదిక ప్రకారం.. » కర్ణాటకలో శివమొగ్గ వద్ద తుంగ నదీ జలాల్లో లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల బీవోడీ ఉంది. » కర్ణాటక పరిధి భద్రావతి నుంచి హోలెహొన్నూరు వరకు భద్ర నదీ జలాల్లో లీటర్ నీటికి 7 మిల్లీ గ్రాముల బీవోడీ ఉంది. » తుంగభద్రగా రూపాంతరం చెందే కూడలి నుంచి మైలార, ఉల్లనూరు నుంచి హొకినేహళ్లి వరకు జలాల్లో లీటర్ నీటికి బీవోడీ 6.2 మిల్లీగ్రాములు ఉంది. » కర్ణాటకలో వ్యర్థాలతో కలుషితమైన తుంగభద్ర నదీ జలాలు ఏపీలోకి ప్రవేశించాక.. మంత్రాలయం నుంచి బావపురం మధ్య ప్రాంతంలోనూ లీటర్ నీటికి బీవోడీ గరిష్ఠంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 3 మిల్లీగ్రాములు ఉంది. » తుంగభద్రలో కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న శివమొగ్గ, భద్రావతి–హోలెహొన్నూరు, కూడలి–మైలార, ఉల్లనూరు–హోకినేహళ్లి, మంత్రాలయం–కర్నూలు ప్రాంతాల్లో మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే నదిలోకి వదలాలి. -
గోదారి గుండెల్లో కాలుష్యం గునపాలు
సాక్షి, అమరావతి: జీవ నది గోదావరికి మానవుడే శాపమయ్యాడు. అనేక రకాల వ్యర్థాలు, రసాయనాలను నదిలో కలిపేసి జలాలను కలుషితం చేసేస్తున్నాడు. దీంతో ఒకప్పుడు నదిలోకి దిగి దోసిటలో తీసుకొని తాగే నీరు ఇప్పుడు శుద్ధి చేయకుండా తాగకూడదన్న దశకు చేరుకుంది. గోదావరి జలాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, నీటిని శుద్ధి చేయకుండా నేరుగా తాగడం శ్రేయస్కరం కాదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) హెచ్చరిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి గోదావరి జలాలపై అధ్యయనం చేయగా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డర్స్ (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలకంటే అధికస్థాయిలో కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. పశి్చమ కనుమల్లో మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పర్వత శ్రేణుల్లో జన్మించే గోదావరి ప్రధాన పాయ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,465 కిమీల దూరం ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దారిలో పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, ప్రవర, మంజీర, మానేరు ప్రధాన ఉప నదులు కలుస్తాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో గోదావరి బేసిన్ 9.5 శాతం. దేశంలో అతి పెద్ద నదుల్లో గోదావరి రెండో స్థానంలో ఉంది. ఇంత పెద్ద నదినీ మానవుడు కలుషితం చేసేస్తున్నట్లు వెల్లడైంది.పారిశ్రామిక వ్యర్థాలు, క్రిమిసంహారక మందుల వల్లేసీడబ్ల్యూసీ, సీపీసీబీ నివేదిక ప్రకారం.. గోదావరి బేసిన్లో భారీ ఎత్తున పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. సాగు భూమి విస్తీర్ణమూ ఎక్కువే. పారిశ్రామిక వ్యర్థాలను, వ్యర్థ జలాలను యథేచ్ఛగా గోదావరి, ఉప నదులు, వంకలు, వాగుల్లోకి వదిలేస్తున్నారు. పంటల సాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. వర్షపు నీటితో ఈ ఎరువులు, మందులు గోదవరిలో కలిసిపోతున్నాయి. గోదావరి బేసిన్లో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని మురుగునీటిని శుద్ధి చేయకుండా యథేచ్ఛగా వదిలేస్తుండటం వల్ల కూడా నది కలుషితమవుతోంది. పశ్చిమ కనుమల్లో భారీ ఎత్తున అడవులను నరికివేస్తుండటం వల్ల భూమి కోతకు గురవుతోంది. అడ్డగోలుగా గనులను తవ్వేస్తుండటం వల్ల వర్షపు నీటి ద్వారా కాలుష్యం గోదావరికి చేరుతోంది. ఇలా మానవ తప్పిదాల వల్లే గోదావరి నది కాలుష్య కాసారంగా మారింది. నేరుగా తాగితే రోగాలు కొనితెచ్చుకోవడమే బీఐఎస్ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో ఫీకల్ కోలీఫామ్ (ప్రమాదకర బ్యాక్టీరియా) ఆనవాళ్లు ఉండకూడదు. కానీ.. గోదావరి జలాల్లో ఫీకల్ కోలీఫామ్ మిల్లీ లీటర్‌కు 4 నుంచి 7 వరకు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఇక టోటల్ కోలీఫామ్ (బ్యాక్టీరియా) లీటర్ నీటికి 50 లోపు ఉండొచ్చు. కానీ.. గోదావరి జలాల్లో లీటర్ నీటికి 93 నుంచి 120 బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది.బీఐఎస్ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో ఘనవ్యర్థాలు (టీడీఎస్) 0.5 గ్రాములు కలిసి ఉన్నప్పటికీ ఆ నీటిని తాగొచ్చు. కానీ.. గోదావరి జలాల్లో లీటర్ నీటిలో 8 గ్రాముల మేర ఘన వ్యర్థాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. అందువల్ల గోదావరి జలాలను శుద్ధి చేయకుండా తాగితే కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగు నీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు..1. పీహెచ్ (ఆమ్లత్వం) 6.5 నుంచి 8.5 శాతం లోపు 2. డీవో (డిజాల్వ్డ్ ఆక్సిజన్) లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి 3. బీవోడీ (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) లీటర్ నీటికి 2 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు 4. టోటల్ కోలీఫామ్ (బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్ల నీటికి 50 లోపు ఉండొచ్చు 5. ఫీకల్ కోలీఫామ్ (ప్రమాదకర బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు 6. టీడీఎస్ (టోటల్ డిజాల్‌్వడ్ సాలిడ్స్) లీటర్ నీటికి 500 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు -
భూగోళంపై భానుడి భగభగలు.!
సాక్షి, విశాఖపట్నం: భానుడి ప్రకోపానికి భూగోళం భగభగమండుతోంది. పెరుగుతున్న కాలుష్యం మానవాళిని ముప్పు ముంగిటకు నెట్టేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వేసవి కాలం మొదలైంది. ఈ ఏడాది కూడా భానుడి భగభగలు తప్పవని ప్రపంచ ఉష్ణోగ్రతల డేటా ప్రొవైడర్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. భూతాపం భారీగా పెరిగిందని ప్రకటించింది. అదేవిధంగా 2050 నాటికి ప్రీ ఇండస్ట్రియల్ లెవల్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటిౖకైనా మేలుకొని కర్బన ఉద్గారాల నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా అడుగులు వెయ్యకపోతే ఉష్ణతాపాన్ని తట్టు కోవడం కష్టమని సీ3ఎస్ హెచ్చరించింది. 1850 నుంచి ఉష్ణోగ్రతల గణాంకాలు తీసుకుంటే... 2024ను అతి దుర్భరమైన (గ్లోబల్ వార్మింగ్) సంవత్సరంగా ప్రకటించింది.సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయ్!కేవలం భూతాపమే కాదు... సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయని సీ3ఎస్ హెచ్చరించింది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా మినహా అన్ని ఖండాంతర ప్రాంతాలు, సముద్రంలోని గణనీయమైన భాగాలు, ముఖ్యంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా 2024లో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2024లో ధ్రువ సముద్రంపై వార్షిక సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత(ఎస్ఎస్టీ) రికార్డు స్థాయిలో 20.87 డిగ్రీలకు చేరుకుంది. ఇది 1991–2020 సగటు కంటే 0.51 డిగ్రీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2025 మరో వేడి సంవత్సరం కాబోతోందా.?ఈ ఏడాది కూడా 2024 మాదిరిగానే భానుడి భగభగలతో మండిపోయే సూచనలు ఆదిలోనే స్పష్టంగా కనిపించాయని సీ3ఎస్ వెల్లడించింది. జనవరి నెలాఖరు నుంచే వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు గరిష్టంగా నమోదవుతుండటమే ఇందుకు సంకేతమని వెల్లడించింది. గత ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీలు పెరగగా.. ఈ ఏడాది జనవరిలోనే సగటు ఉష్ణోగ్రత 0.94 డిగ్రీలు పెరగడం అసాధారణ హెచ్చరికగా పరిశోధకులు భావిస్తున్నారు. 2015–24 మధ్య కాలంలో సాధారణం కంటే 0.3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగి అత్యంత వేడి దశాబ్దంగా నమోదైందని.. ఉష్ణోగ్రత సగటు ఒక్కో డిగ్రీ పెరిగే కొద్దీ.. వడదెబ్బ మరణాల సంఖ్య 5 శాతం పెరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.సీ3ఎస్ ఏం చెప్పిందంటే..» 1850 నుంచి భూ ఉపరితల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు పొందింది.» సీ3ఎస్ పరిశోధనల ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.10 డిగ్రీల సెల్సియస్.» 1991–2020 మధ్య సగటు 0.72 డిగ్రీల సెల్సియస్ కాగా, అది 2024లో 1.5 డిగ్రీలు అధికంగా నమోదైంది. » గత 10 సంవత్సరాల ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుంటే 2024 అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతల సంవత్సరం.» 2024 జూలై 24న రోజువారీ ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.16 డిగ్రీలు నమోదైంది. ఇదే ఇప్పటి వరకు చరిత్రలో అత్యంత ఉష్ణతాపం రోజుగా సీ3ఎస్ ప్రకటించింది.»2024లో వాతావరణంలో నీటి ఆవిరి మొత్తం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. 1991–2020 సగటు కంటే దాదాపు 5శాతం ఎక్కువగా వ్యాపించింది. ఎందుకిలా జరుగుతోంది?శీతోష్ణస్థితి మార్పులు భయపెడుతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. దీనికి కారణం మానవ తప్పిదాలేనన్నది స్పష్టమవుతోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్... మొదలైన వాయువుల కారణంగా గ్లోబల్ వార్మింగ్ ప్రమాదంముంచుకొస్తోంది. గత ఏడాది భూమి వేడెక్కడానికి కారణమైన సీవో2 వంటి వాయు ఉద్గారాలు ఇప్పటికీ వాతావరణంలో రికార్డు స్థాయిలోనే ఉన్నాయని సీ3ఎస్ వెల్లడించింది. కర్బన ఉద్గారాలు అధికంగా విడుదల చేస్తున్న దేశాల జాబితాలో 29.18 శాతంతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా (14.02 శాతం), భారత్ (7.09శాతం), రష్యా (4.65శాతం) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువుల సాంద్రతలే మన వాతావరణాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భవిష్యత్తు వాతావరణం మనచేతుల్లోనే ఉందిభూ ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో వేడెక్కడం చూస్తే వాతావరణం.. మానవాళికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లే. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే వేడిగాలులు, సముద్ర మట్టాల పెరుగుదల, వన్యప్రాణులు అంతరించిపోవడం వంటి ప్రమాదాలు చాలా తీవ్రమయ్యే రోజులు ముందున్నాయి. మనం ఇప్పుడు దానికి అత్యంత చేరువలో ఉన్నాం. గాల్లో సీవో2, మీథేన్, సల్ఫర్ మోనాక్సైడ్ వాతావరణ సాంద్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక పాయింట్ సీవో2 దాదాపు 100 ఏళ్ల వరకు గాల్లో ఉంటుంది. మీథేన్ 400 ఏళ్లు ఉంటుంది. కాబట్టి.. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత అందరిది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన తుఫానులు, వరదలతోపాటు వడగాడ్పులు, కరువు, కార్చిచ్చు ఘటనలు సంభవించాయి. భూతాపం పెరిగే కొద్దీ ఈ తరహా ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉంటాయి. కాబట్టి కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించగలిగితే భూమి వేడెక్కడాన్ని తగ్గించగలం. ఇదే మన ముందున్న అతి పెద్ద సవాల్. చెట్ల కంటే.. సముద్రాలే అసలైన వాతావారణ పరిరక్షకులు. అందులో ఉండే మొక్కలు ఆక్సిజన్ని ఎక్కువగా అందిస్తున్నాయి. అందుకే సముద్రాలను సంరక్షించుకోవాలి. – ప్రొఫెసర్ ఓఎస్ఆర్ భానుకుమార్, వాతావరణశాస్త్ర నిపుణుడు -
తాబేళ్ల మృత్యుఘోష!
సముద్రంలో కాలుష్యాన్ని నియంత్రిస్తూ జీవజాలం మనుగడకు దోహదపడుతున్న సముద్రపు తాబేళ్లు(ఆలీవ్ రెడ్లీ) మృత్యువాత పడుతున్నాయి. సముద్రతీరంలో తాబేళ్ల మరణాల గణాంకాలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఇదే కొనసాగితే తాబేళ్ల జాతి క్రమేపీ అంతరించి పోయే ప్రమాదం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం శ్రద్ధపెట్టి తాబేలు జాతి సంరక్షణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. బాపట్ల, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం, కృష్ణా, కాకినాడ, అనకాపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, విశాఖపట్టణం తదితర జిల్లాల పరిధిలోని తీర ప్రాంతంలో ఒక్క జనవరి నెలలోనే 3,085 తాబేళ్లు మరణించినట్టు వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్న ట్రీ ఫౌండేషన్ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఇవన్నీ తీరానికి కొట్టుకొచ్చినవే. మృతి చెంది సముద్రంలో కలిసి పోయిన తాబేళ్ల సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. – సాక్షి ప్రతినిధి, బాపట్లసముద్ర జీవుల్ని రక్షిస్తూ.. సముద్రంలో విపరీతంగా ఉత్పత్తి అయ్యే నాచు.. సూర్యకిరణాలను సముద్రపు లోతుల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల సముద్రంలో పెరిగే జంతు జాలానికి ఆక్సిజన్ సక్రమంగా అందే అవకాశముండదు. అదే జరిగితే జంతుజాలం చాలా వరకు చనిపోవడంతో పాటు మిగిలిన జంతు జాలానికి ఎదుగుదల ఉండదు. తాబేళ్లు ఈ నాచును ఆహారంగా తీసుకుని దాని ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయి. సముద్రంలో కాలుష్యాన్ని ఉత్పత్తి చేసే జల్లి ఫిష్‌లను సైతం తాబేళ్లు ఆహారంగా తీసుకుంటాయి. సముద్ర గర్భంలో ఉన్న కొండలు, గుట్టల్లో చేపలు గుడ్లుపెట్టే కేంద్రాలను తాబేళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాయి. దీనివల్ల మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారులకు మేలు జరుగుతుంది.ఆ విధంగా అంతరిస్తున్నాయ్..సముద్ర తాబేళ్లు జలాల అడుగున ఉంటున్నప్పటికి ప్రతి 40 నిమిషాలకోసారి శ్వాస తీసుకునేందుకు ఉపరితలానికి రావాల్సిందే. ఇలావచ్చి తిరిగి వెళ్లే క్రమంలో మోటారు బోట్లు, మత్స్యకారుల టేకు, నానాజాతి వలల వల్ల కొన్ని, కాలుష్యానికి గురై మరికొన్ని మృత్యువాత పడుతున్నాయి. ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఈ తరహా వలలు అధికంగా వాడుతుండడంతో తాబేళ్ల మరణాలు అధికంగా ఉన్నాయని టీ ఫౌండేషన్ వెల్లడించింది. ఏటా జనవరి నుంచి మే వరకు గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు తీరప్రాంతానికి వచ్చి ఇసుకలో గుంతలు తీసి గుడ్లు పెట్టి వెళతాయి. 48 నుంచి 50 రోజుల మధ్యకాలంలో ఆ గుడ్లు పిల్లలుగా మారతాయి. ఈ క్రమంలోనే తాబేలు జాతి అధికంగా అంతరిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాబేలు గుడ్లు, పిల్లల సమయంలో నక్కలు, కుక్కలు, ఇతర జంతువులు కొన్ని గుడ్లు, పిల్లల్ని తినేస్తున్నాయి. పిల్లలుగా మారిన తాబేళ్లు 3 గంటల్లోపు నీటిలోకి చేరకుంటే చనిపోతాయి. కొన్ని నీటిలోకి చేరినా శ్వాస కోసం నీటిపైన తేలియాడేటప్పుడు పెద్ద పెద్ద పక్షులు వాటిని పొడిచి చంపుతున్నాయి. ఉత్పత్తి అవుతున్న తాబేలు పిల్లల్లో 10 శాతం కూడా బతకడం లేదని అంచనా. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తాబేళ్లను చంపడం, వాటి గుడ్లను తినడం నేరం. ఈ నేరానికి పాల్పడితే ఏడేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధిస్తారు.ప్రభుత్వ చర్యలు శూన్యం తాబేళ్ల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే జనవరి నుంచి మే నెలల్లో తీరంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఆ ఐదు నెలల పాటు ప్రత్యేకంగా అవగాహన కలిగిన సిబ్బందిని నియమించి తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షణ కేంద్రాల్లో పొదిగించాలి. పిల్లలు ఉత్పత్తి అయ్యాక వాటిని సురక్షితంగా నీటిలో వదలాలి. ఇందుకోసం తగినన్ని నిధులు కేటాయించి సంరక్షణ కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలి. మరోవైపు సముద్రంలో తాబేళ్లు చిక్కుకోని వలలనే వాడేలా మత్స్యకారులకు ఆదేశాలివ్వాలి. తాబేళ్ల ప్రాధాన్యంపై ఎప్పటికప్పుడు మత్స్యకారులకు అవగాహన కల్పించాలి. ఇందుకు ప్రభుత్వం అటవీ, పర్యావరణ శాఖలు సమన్వయం చేసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.తాబేళ్ల రక్షణకు ట్రీ ‘ఫౌండేషన్’! తాబేళ్ల రక్షణకు చెన్నై కేంద్రంగా ఉన్న ట్రీ ఫౌండేషన్ కొంత మేర కృషి చేస్తోంది. 2017 నుంచి ఇక్కడ తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తీరంలోని చినగంజాం మండలం ఏటిమొగ్గ, కుంకుడుచెట్లపాలెం, వేటపాలెం మండలం రామచంద్రాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, రామాపురం, బాపట్ల మండలం సూర్యలంక తీరంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి 12 మంది సిబ్బందితో తాబేలు గుడ్లు సేకరించి వాటిని పొదిగించి పిల్లలను తిరిగి సముద్రంలోకి వదులుతోంది. 2023లో 7,102, 2024లో 9,694 చొప్పున తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలామని, ఈ ఏడాది ఇప్పటివరకు 14 తాబేళ్లు వచ్చి 1,541 గుడ్లు పెట్టినట్టు ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. జిల్లా అటవీశాఖ దీనిని పర్యవేక్షిస్తోంది. గత ప్రభుత్వంలో ఫౌండేషన్ సభ్యులకు నెలకు రూ.10 వేలు చొప్పున గౌరవవేతనం ఇవ్వగా.. ఈ ప్రభుత్వం వచ్చాక అదీ ఇవ్వకపోవడంతో సభ్యులకు ఐటీసీ సంస్థ గౌరవ వేతనాలు చెల్లిస్తోంది.ఇప్పటి వరకు 16,796 పిల్లలను సముద్రంలోకి వదిలాం.. సముద్ర తాబేళ్ల రక్షణకు ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని తీరప్రాంతంలో 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 12 మంది సిబ్బంది ద్వారా తాబేళ్లు పెట్టిన గుడ్లు ఎప్పటికప్పుడు సేకరించి, సంరక్షణ కేంద్రాల్లో పొదిగించి పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి వదులుతున్నాం. గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 16,796 పిల్లలను సముద్రంలోకి వదిలాం. – చంద్రారెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్, ట్రీ ఫౌండేషన్ -
కాలుష్యంపై కానరాని హామీలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అటు ఆప్, ఇటు బీజేపీలకు ప్రతిష్ఠాత్మకంగా పరిణమించాయి. రెండు పార్టీలూ ఉచిత పథకా లను వాగ్దానం చేయడంలో పోటీపడుతున్నాయి. కాని, కాలు ష్యంతో కునారిల్లుతున్న రాజధాని ఢిల్లీ పరిస్థితిని బాగు చెయ్యడంపై ఎటువంటి హామీలూ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నట్లు మరో మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా అభివృద్ధి చెందినా ఇటువంటి రాజధాని నగరంతో అంతర్జాతీయ యవనికపై భారత్ సగర్వంగా నిలబడలేదు. ఒక వంక మురికి కాలువగా మారిపోయిన యమునా నది, ఇంకోవైపు ఎటుచూసినా కనిపించే వ్యర్థపదార్థాలు వంటి ఎన్నో కారణాల వల్ల ఢిల్లీ కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, వైఫల్యాలను ఈ స్థితి తెలుపుతోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ప్రజాజీవనం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి కేసులో జైలుకు వెళ్లిరావడం, ఆయన సహచరులూ అనేకమంది జైలుపాలు కావడం వల్ల ఆప్ ఆత్మరక్షణలో పడింది. తమ నాయకులపై పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్షసాధింపుతో నమోదు చేసినవి అని చెబుతున్నా, ఆ కేసులు న్యాయస్థానాల ముందు నిలబడే అవకాశాలు ఉన్నా, లేకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకనే తన రాజకీయ జీవనంలో పెనుసవాల్‌ను కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. 2014 నుండి వరుసగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 7 లోక్ సభ సీట్లనూ గెల్చుకుంటున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పరాజయం తప్పడం లేదు. మీడియాలో సంచలనాలు సృష్టించే నాయకులపై ఆధారపడుతోంది కానీ ఇతర పార్టీల మాదిరిగా క్షేత్రస్థాయిలో జనం మధ్యలో పని చేసే నాయకులను ప్రోత్సహించడం లేదు. దానితో బీజేపీకి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం పరాజయం తప్పలేదు. ‘శీష్ మహల్’ గురించి కొంతమేరకు కేజ్రీవాల్‌ను ఇరకాటంలో పడవేసిన బంగారు పూత పూసిన టాయిలెట్ ఫిట్టింగ్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ప్రచారాలు అవాస్తవమని వెల్లడి కావ డంతో వెంటనే బీజేపీ తమ ప్రచారాన్ని మార్చి వేసింది. ‘ఒక్కసారి అధికారం ఇస్తే ఢిల్లీ రూపురేఖలను మార్చగలం’ అని ఇప్పుడు చెబున్నారు. ఢిల్లీ తీవ్ర మైన నీటి సమస్య ఎదుర్కొంటున్న సమయంలో పొరుగున ఉన్న హరి యాణాలోని బీజేపీ ప్రభుత్వం సహ కరించే విధంగా కేంద్రం ఎటువంటి చొరవ తీసుకోలేక పోయింది.వాస్తవానికి కేజ్రీవాల్‌తో సమా నంగా ప్రజాదరణ గల నాయకులు ఎవ్వరూ ఢిల్లీ బీజేపీలో లేరు. అందుకనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ఆ పార్టీ వెనకాడుతోంది. కేవలం ప్రధాని మోదీ ప్రజాకర్షణపైననే ఆధారపడుతోంది. ఆప్ ఈ ఎన్నికలలో గెలుపొందితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ వంటి వారు కలిసి బలమైన ప్రత్యా మ్నాయం అందించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజల జీవన్మరణ సమస్య అయిన కాలు ష్యాన్ని వదిలేసి ఆప్, బీజేపీలు ఉచిత పథకాలపై హామీలు గుప్పించి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నాయి. – సభావట్ కళ్యాణ్‌లా విద్యార్థి, ఢిల్లీ యూనివర్సిటీ ‘ 90143 22572 -
యమునలో స్నానమెప్పుడు చేస్తారు
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు యమునా నది కాలుష్యం చుట్టూ తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో విహరిస్తున్న వీడియోను విడుదల చేసి.. ఈ మురికి కాసారంలో ఎప్పుడు స్నానం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్‌కు సవాల్ విసిరారు. యమునా కాలుష్యం ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్‌ల నిర్లక్ష్యం, అవినీతి ఫలితమేనని రాహుల్ ఆరోపించారు. రాహుల్ బుధవారం యమునా నదిలో విహరించి.. నది దుస్థితిని వీడియో తీశారు. ‘నాలాగా మీరు ఢిల్లీ వాసులైనట్లయితే యమునా నది పరిస్థితిని చూసి తీవ్రంగా విచారిస్తూ ఉంటారు. బుధవారం ఉదయం నేను యమునా నదికి వెళ్లాను. స్థానికులు, పడవలు నడిపేవాళ్లు, ఉద్యమకారులతో మాట్లాడాను. యమునా నదిలో ఎటు చూసినా చెత్తే. మురికినీళ్లే. దుర్వాసన వెదజల్లుతోంది. నీటి శుద్ధి తర్వాత వ్యర్థాలను తిరిగి యమునలోనే వదిలేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. యమునా నదిలో స్నానమాచరించడానికి గతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్లు. ఇప్పుడు అతికొద్ది మంది మాత్రమే వస్తున్నారు. అదీ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి’అని రాహుల్ అన్నారు. ‘ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యమునను శుద్ధి చేస్తామని కేజ్రీవాల్ శుష్క వాగ్దానాలు చేస్తున్నారు. నేను యమునా నదిలో మునక వేస్తాను లేదంటే మాకు ఓటు వేయకండి అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిస్తున్నారు. ఇప్పుడు యమునా నీటిని ఒక సీసాలో తీసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఇది యమునా నదిని అవమానించడమే కాదు.. ఢిల్లీ ప్రజలను అపహస్యం చేయడమే’అని రాహుల్ విమర్శించారు. ‘కేజ్రీవాల్ జీ 2025 వచ్చింది. మీరెప్పుడు యమునా నదిలో మునక వేస్తారు. ఢిల్లీ ఎదురుచూస్తోంది’అని రాహుల్ ప్రశ్నించారు. యమున శుద్ధి పేరిట డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపించారు. -
రాత్రి 8 కల్లా ఆధారాలు చూపండి
న్యూఢిల్లీ: హరియాణాలోని అధికార భాజపా యమునా నదిలోకి విషయం కలిపేందుకు ప్రయత్నించిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ‘‘తప్పుడు ఆరోపణలు చేస్తే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. విషం కలిపడానికి ప్రయత్నించారు మీరు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే అన్ని ఆధారాలను జనవరి 29వ తేదీ రాత్రి 8 గంటలలోపు మాకు సమరి్పంచండి. విషం కలుపుతుంటే అడ్డుకున్న ఢిల్లీ జల్ బోర్డ్ ఇంజనీర్ల వివరాలూ ఇవ్వండి’’ అని కేజ్రీవాల్‌కు ఈసీ మంగళవారం ఒక లేఖ రాసింది. హరియాణా నుంచి దిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదీ ప్రవాహంలో అమ్మోనియా స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించడం తెల్సిందే. పొరుగు రాష్ట్రాలకు తాకిన కాలుష్య కాటుయమునా కాలుష్య అంశం ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాలుష్యానికి హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన కారణమని, పారిశ్రామిక వ్యర్ధాలను యమునా కలిపి ఢిల్లీలోకి విషాన్ని పంపుతున్నారంటూ కేజ్రీవాల్ రెండ్రోజుల కిందట తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదో రకంగా జీవజల యుద్ధం, వాటర్ టెర్రరిజం అంటూ హరియాణా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం ఆతిశీ సైతం హరియాణా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న నదీ జలాల్లో వ్యర్థాలు, అమ్మోనియా స్థాయిలో చాలా ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి ఆమె బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదుచేశారు. హరియాణా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా ప్రమాదంలో పడిందని ఆరోపించారు. మునాక్ కాలువ నుంచి అదనపు జలాలను విడుదలచేయాలని మాన్ డిమాండ్‌చేశారు. దీనిపై హరియాణా సీఎం నయాబ్ సింగ్ షైనీ సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఎగువ రాష్ట్రాలతో సత్సంబంధాలు క్షీణించేలా, ఢిల్లీ ప్రజలను అనవసరంగా భయపెట్టేలా కేజ్రీవాల్ ఆరోపణ చేశారు. వీటిపై లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకోవాలి’’అని ఆయన డిమాండ్‌చేశారు. ఓటమి భయం కేజ్రీవాల్‌ను నిస్సహాయంగా మార్చిందని, ఢిల్లీ ప్రజలను భయపెట్టి ఓట్ల లబ్ధి పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. బీజేపీ, ఆప్ పారీ్టలు తాము అధికారంలోకి వస్తే యమునా కాలుష్యాన్ని అరికట్టి పునరుజ్జీవం చేస్తామని తమతమ మేనిఫెస్టోల్లో ప్రకటించడంతో ఈ అంశం ఇప్పుడు ఎన్నికల హామీల్లో ప్రధానమైనదిగా మారుతోంది. -
దుమ్మును అడ్డుకునే దమ్ము
హైదరాబాద్‌లో రోజురోజుకూ వాహన, పారిశ్రామిక కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో నగరానికి చెందిన ఓ సంస్థ దీనికి ఓ విరుగుడును గుర్తించింది. దుమ్ము, వాయు కాలుష్యాన్ని సమర్థంగా నియంత్రించడంలో కొన్ని జాతుల వృక్షాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తాజా పరిశోధనలో తేల్చింది. ముఖ్యంగా మర్రి జాతి చెట్లు అత్యంత సమర్థంగా వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయని.. వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు సైతం కాలుష్య స్థాయిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నిర్ధారించింది. ఈ జాతుల చెట్లు దుమ్మును ఒడిసిపట్టుకోగలవని, గాలిలోని ధూళిని తట్టుకొని ఎదగగలవని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ పరిశోధన వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరిశోధనను పంకజ్ సింగ్ (సైంటిస్ట్–డీ – పరిశోధన బృంద సమన్వయకర్త), భారతీ పటేల్ (సైంటిస్ట్–డీ – అటవీ జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు) నిర్వహించారు. జీవరసాయననమూనాలతో.. ఈ పరిశోధన కోసంహైదరాబాద్ శివార్లలో అధిక కాలుష్యం వెలువరించే పరిశ్రమలున్న దూలపల్లి, బొల్లారంపారిశ్రామిక అభివృద్ధి ప్రాంతం, మేడ్చల్ హైవే వెంబడి ఉన్న తుక్కుగూడ ప్రాంతంలోని పలు చెట్ల జాతుల నుంచి జీవరసాయన నమూనాలను సేకరించారు. ఆయా నమూనాలనువిశ్లేషించగా వాటిలో మర్రి, వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు వాయు కాలుష్య నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.గ్రీన్‌బెల్ట్ విస్తరణకు దోహదం పారిశ్రామిక ప్రాంతాలతోపాటు ప్రధాన హైవేల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్లుగా ఈ జాతుల మొక్కలను నాటడం ద్వారా సత్ఫలితాలను పొందొచ్చని సూచించారు. నగరంలో గ్రీన్ బెల్ట్ విస్తరణకు, వాయుకాలుష్యం నియంత్రణతోపాటు వడగాడ్పుల ప్రభావం తగ్గించేందుకు, మట్టి, శబ్ద, నీటి కాలుష్యం నివారణకు సైతం ఈ వృక్షాలు దోహదపడతాయనిపేర్కొన్నారు.వాయు కాలుష్య తీవ్రతను సూచించే వరగోగువివిధ ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రతను తెలియజేయడంలో వరగోగు (సొగసుల చెట్టు) జాతి చెట్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది. పారిశ్రామిక వ్యర్థాలు అధికంగా ఉండే చోట లేదా భారీ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో ఈ చెట్ల ఆకులు రంగుమారడం, మాడిపోవడం కనిపిస్తుందనిపరిశోధకులు పేర్కొన్నారు. - సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
వచ్చే 10 ఏళ్లలో ప్రపంచానికి అతి పెద్ద ముప్పు ఏంటో తెలుసా?
ఈ ప్రపంచం వచ్చే రెండేళ్లలో, అలాగే వచ్చే పదేళ్లలో ఎదుర్కొనే అతి పెద్ద ముప్పు (Global Risk) ఏమిటి? వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) ఇదే ప్రశ్న రాజకీయ, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన 900 మంది నిపుణులకు వేసింది. వారి సమాధానాల ఆధారంగా తన వార్షిక గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం వచ్చే రెండేళ్లలో.. ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అన్నది అతి పెద్ద ముప్పుగా నిలిచింది. ఇలాంటి అసత్య సమాచార వ్యాప్తి పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, సమాజంలో అశాంతి తలెత్తేలా చేస్తుందని హెచ్చరించింది.వచ్చే పదేళ్ల లెక్క తీసుకుంటే.. వాతావరణ మార్పులు, దాని వల్ల కలిగే దుష్ఫలితాలు అతి పెద్ద ముప్పుగా పేర్కొంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే విపరీత మార్పులు.. స్వల్పకాలంలోనూ అలాగే దీర్ఘకాలంలోనూ ఈ ప్రపంచానికి అతి పెద్ద సమస్యగా మారనుందని తెలిపింది. జీవన వ్యయం, ద్రవ్యోల్బణం (inflation) పెరగడం లాంటి వాటిని ఆయా రంగాల నిపుణులు ఇప్పుడు పెద్ద సమస్యలుగా చూడటం లేదని ఈ నివేదిక పేర్కొంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ నివేదిక ప్రకారం టాప్–10 ముప్పులివీ.. ఇదీ చదవండి: రోమ్‌లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్! -
కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!
ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముక్కు ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా మారుతోంది. అంతేకాదు.. ఈమధ్యకాలంలో శబ్దకాలుష్యం కూడా అనూహ్యంగా పెరిగి పోతోంది. వాహనాల పెరుగుదల వల్ల శబ్ద, వాయు కాలుష్యాలు... ఈ రెండూ ఏకకాలంలో పెరిగి రెండు జ్ఞానేంద్రియాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ ముక్కు, చెవులు రెండూ గొంతుతో అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో చెవులు,ముక్కు, గొంతు ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకం. అందుకే వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకోవడం తప్పనిసరి. ముక్కు చెవులనూ, అలాగే తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే కీలక అవయవ భాగమే మెడ. వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలివి... చెవుల సంరక్షణ కోసం... ∙పెద్ద పెద్ద చప్పుళ్ల నుంచీ, శబ్దకాలుష్యం నుంచి చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇయర్ ఫోన్స్‌తో మొబైల్ వాడేటప్పుడు, కంప్యూటర్ను ఉపయోగిస్తూ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న సమయంలో పెద్దగా వాల్యుమ్ పెట్టుకోకుండా చెవికి తగినంత వాల్యుమ్‌తో జాగ్రత్తగా చెవులను కాపాడుకోవాలి. ∙పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి.చెవుల్లో హోరు శబ్దాలు గానీ, ట్రాన్స్ఫార్మర్ దగ్గరి గుయ్‌మనే శబ్దాలుగాని వినిపిస్తుంటే అది టినైటస్ అనే సమస్య కావచ్చని భావిస్తూ సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలా పరీక్షించి చికిత్స చేయిస్తే... అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాక΄ోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. కాక్లియర్ ఇం΄్లాంట్స్ వంటి చికిత్సలతో మాటలూ, వినికిడీ వచ్చేలా చేయవచ్చు సైనస్ ఇన్ఫెక్షన్లూ, సమస్యల నుంచి కాపాడుకోవడానికి... ఒక్కోసారి చేతుల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు ఏదైనా తింటున్న సమయంలో గొంతులోకి వెళ్లి అక్కణ్నుంచి ముక్కు, నోరు, గొంతు ద్వారా (ఒక్కోసారి కళ్ల నుంచి కూడా) లోనికి ప్రవేశించి ముక్కు, నోరు, గొంతు, కళ్ల ఇన్ఫెక్షన్లతో పాటు సైనసైటిస్ వంటి సమస్యలకూ కారణమవుతాయి. కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మంచి హ్యాండ్ హైజీన్‌ను పాటించడం మేలు. అందుకే కేవలం చేతులు శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్ వాష్)తో ఎన్నో సమస్యలను నివారించవచ్చునని గుర్తుంచుకోవాలికొన్ని అలర్జీ సమస్యలను, మనకు సరిపడని అలర్జెన్స్ వల్ల ముక్కు, గొంతు, కళ్ల అలర్జీలూ, సైనస్ సమస్యలతో ΄ాటు ఊపిరితిత్తులకు సంబంధించిన మరికొన్ని రుగ్మతలూ రావచ్చు. అందుకే మనకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి వేడినీటితో ఆవిరిపట్టడం అనే ఓ చిట్కాతో ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఈ జాగ్రత్తలతోపాటు మంచి సమతులాహారం, విటమిన్–సి సమృద్ధిగా ఉండే నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి వంటివి వాడటం, జింక్ మోతాదులు ఎక్కువగా ఉండే నట్స్, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ఈ జాగ్రత్తలతోపాటు మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితోపాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయనే అంశాన్ని గ్రహించాలి. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసంస్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్యం మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, జబ్బులూ, రుగ్మతలూ నివారితమవుతాయి. గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్తంత ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి ఇంటి చిట్కా. దీనివల్ల గొంతుకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్లూ, ఇన్ఫ్లమేషన్లూ, సోర్ థ్రోట్ వంటి సమస్యలు దూరం కావడమే కాకుండా అనేక రకాల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. ఇది చాలా సులువైన, నమ్మకమైన, ప్రభావపూర్వకమైన చిట్కా ∙ఇక నీళ్లు ఎక్కువగా తాగుతుండటమనేది ఇటు గొంతుతోపాటు పూర్తి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ అనేక సమస్యల నుంచి రక్షణ కల్పించే అంశం. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!)ముక్కు ఆరోగ్యం కోసం...ముక్కు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మనందరి మొదటి ప్రాధాన్యత. అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకోవాలి ∙ఈ సీజన్లో బాగా నీళ్లు తాగుతూ ఉంటే అది ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్‌ను ΄పొడిబారకుండా తేమగా ఉండేలా చూడటంతో పాటు... మిగతా దేహమంతా బాగా హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది.ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. ఇక చీదే సమయంలో బలంగా చీదడం సరికాదు. ఒక్కోసారి దీంతో ముక్కులోని అతి సన్నటి రక్తనాళాలు (క్యాపిల్లరీస్) చెదిరి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు -
‘ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే!’
న్యూఢిల్లీ, సాక్షి: నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీన్నొక పాన్ ఇండియా సమస్యగా అభివర్ణిస్తూ.. సోమవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశంలో ఏయే నగరాల్లో అత్యధిక కాలుష్యం నమోదు అవుతుందో ఓ జాబితా అందించాలని ఆ ఆదేశాల్లో కేంద్రానికి స్పష్టం చేసింది.‘‘వాయుకాలుష్యం ఏయే నగరాల్లో తీవ్రంగా ఉందో ఓ జాబితా ఇవ్వండి. ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే. కేవలం ఢిల్లీకి మాత్రమే మేం ఈ అంశాన్ని పరిమితం చేయాలని అనుకోవడం లేదు. అలా గనుక విచారణ జరిపితే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. అందుకే ఈ ఆదేశాలిస్తున్నాం’’ అని ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ జరుపుతున్న జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM) ఎలా ఉందో.. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న నగరాల్లో అలాంటి వ్యవస్థలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కేంద్రానికి స్పష్టం చేసింది.దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం కోసం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. అయితే.. ఎన్సీఆర్ పరిధి వెలుపల నగరాలు ఈ విధానం పాటించడం లేదని, పంటలను తగలబెట్టడం ఇతర రాష్ట్రాలకూ ప్రధాన సమస్యగా ఉందని కోర్టు కమిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. పిల్ పరిధిని పెంచుతూ సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గత నెలలో.. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయుకాలుష్యాన్ని నవంబర్ 18వ తేదీ నుంచి సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. అలాగే.. సీఏక్యూఎం ఆదేశాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో పరిశీలిస్తోంది. ఢిల్లీలో మళ్లీ GRAP-3ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో.. GRAP-3 విధానం కఠినంగా అమలు చేయాలని సీఏక్యూఎం ఆదేశించింది. ఈ విధానం ప్రకారం.. విద్యాసంస్థల తరగతులు హైబ్రిడ్ విధానంలో అమలు కానున్నాయి. అంటే.. ప్రాథమిక తరగతుల క్లాసులు ఆన్లైన్లో జరగనున్నాయి. ఇక.. నిత్యావసర వస్తువులకు చెందని డిజీల్ వాహనాలపై నిషేధం అమలు చేస్తారు.చదవండి👉🏼: అమిత్ షాజీ.. రాజధాని ఎలా మారిందో చూడండి! -
తీవ్ర వాయుకాలుష్యం : 1,200 బేకరీలకు బీఎంసీ నోటీసులు
దాదర్: పరిశ్రమలు, బేకరీలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బేకరీ బట్టీలలో ఇంధనం, ఎలక్ట్రిక్ లేదా గ్యాస్‌కు బదులుగా కలపను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడటంతో 1,200పైగా బేకరీ యజమానులకు నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ముంబైలో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. దీంతో ముంబైకర్లు వివిధ శ్వాససంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సైట్లు భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు బీఎంసీ అధికారులు 18 రకాల సూచనలతో కూడిన నియమావళిని జారీచేసింది. వాటిని కచి్చతంగా పాటించాల్సిందేనని నిర్ధేశించింది. కానీ బేకరీల నిర్వాహకులు నియమాలను బేఖాతరు చేస్తున్నట్లు వెలుగులోకి రావడంతో బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాణీ (అడ్మిన్) ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లకు నోటీసులు కూడా జారీచేసింది. అదేవిధంగా బేకరీలలో బ్రెడ్లు, కేక్‌లు, బిస్కెట్లు, ఇతర తినుబండారాల తయారీకి కలప వాడుతున్నట్లు తేలడంతో వీటిపై చర్యలు తీసుకుంది. పదిహేను రోజుల క్రితమే హెచ్చరిక... ముంబైలో రెండువేలకుపైగా బేకరీలున్నాయి. వీటిలో రోజుకు దాదాపు 130 కేజీల కలపను వినియోగిస్తున్నారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగవల్ల గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కలప వాడకాన్ని నిలిపివేయాలంటూ బేకరీ యజమానులను గత పదిహేను రోజుల కింద బీఎంసీ హెచ్చరించింది. దీనికి బదులుగా గ్యాస్, ఇంధనం, కరెంటును వినియోగించాలని సూచించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ 1,200పైగా బేకరీల్లో నియమోల్లంఘన జరుగుతున్నట్లు తనిఖీల్లో బయటపడడంతో నోటీసులు జారీచేశారు. నోటీసులకు మాత్రమే పరిమితం... బేకరీల్లో కలపను వినియోగించకూడదని బీఎంసీ 2007లోనే ఆదేశాలు జారీచేసింది. బట్టీలలో కలపకు బదులుగా సీఎన్జీని వినియోగించాలని సూచించింది. ప్రభుత్వాలు మారడంతో బీఎంసీ కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం మానేసింది. ఇదేకాకుండా ముంబైలో ఉన్న అన్ని బేకరీల వివరాలు బీఎంసీ వద్ద లేవు. లైసెన్స్డ్ బేకరీల కన్నా అక్రమంగా నడుపుతున్న బేకరీలే అధికమని తేలింది. ఈ నేపథ్యంలో బీఎంసీ కేవలం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమైందని ఆరోపణలొస్తున్నాయి. దట్టమైన పొగను వెలువరించే బేకరీలతోపాటు జవేరీ బజార్, కాల్బాదేవి, గిర్గావ్ ప్రాంతాల్లో వెండి, బంగారు, గిల్టు నగలు తయారుచేసే ఫ్యాక్టరీలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తారు. నగలు తయారీలో బొగ్గు, రసాయనాల వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో స్ధానికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ అధికారులు బంగారు, వెండి నగలు తయారుచేసే ఫ్యాక్టరీ యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. గాలి నాణ్యత మెరుగు పడేవరకు ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు. -
కాలుష్యంలో హైదరా‘బ్యాడ్’.. ఢిల్లీ బాటలో మన మహానగరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం కూడా తీవ్రస్థాయికి చేరుకుంటోంది. మరీ ముఖ్యంగా మహానగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిలో కాలుష్య స్థాయి పెరిగి వాయు నాణ్యత క్రమంగా తగ్గిపోతోంది. ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీలో వాయునాణ్యత ప్రమాదకరంగా తగ్గిపోయి.. అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా.. గతంలో ఈ సమస్య అంతగా లేని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్య స్థాయి పెరుగుతోంది. నగరాల్లో వాయు నాణ్యత ప్రమాణాలు 0–50 పాయింట్లలోపు ఉంటే ఆరోగ్యకరమైనవిగా, 50 పాయింట్లకు పైబడి గాలి నాణ్యత రికార్డ్ అయితే కొంత సంతృప్తికరంగా, ఆ తర్వాత నుంచి అంటే వంద పాయింట్లకు పైబడి పెరుగుతున్న కొద్దీ ఇది వివిధ వర్గాల వారికి సమస్యాత్మకంగా మారుతూ ఆరోగ్యపరంగా, ఇతరత్రా రూపాల్లో ప్రభావితం చేస్తోంది. నగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్, పాశమైలారం, సనత్‌నగర్‌లలో 144 పాయింట్ల నుంచి 270 పాయింట్లు వాయు నాణ్యత స్థాయి (ఏక్యూఐ)లో రికార్డయ్యింది. దీంతో హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలు కూడా వాయు కాలుష్య తీవ్రత విషయంలో ఢిల్లీ బాటలోనే నడుస్తున్నాయా అన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏక్యూఐ ఆధారంగా రూపొందించిన నివేదికను బట్టి చూస్తే.. వాయుకాలుష్యం పెరిగిన కారణంగా హైదరాబాద్ దేశంలోనే ఏడోస్థానంలో నిలిచింది. నగరంలో వివిధ రకాల వాహనాల సంఖ్య భారీగా పెరుగుదల, పలుచోట్ల సాగుతున్న నిర్మాణాలు, ఇండ్రస్టియల్ పొల్యూషన్ పెరుగుదల, పలుచోట్ల చెత్త దహనం, నాలుగువైపులా విస్తరణ, ఇతర రూపాల్లో గాలి నాణ్యత దెబ్బతింటోంది. దాదాపు ఏడాది కాలంలోనే హైదరాబాద్‌లో వాయు నాణ్యత గణనీయంగా క్షీణించడంతో కలుషిత నగరాల లిస్ట్‌లో చేరిపోయింది. స్విస్ కంపెనీ ఐక్యూ ఏఐఆర్ నివేదిక ప్రకారం అతి సూక్ష్మరూపాల్లోని ధూళికణాలు (పీఎం 2.5) ప్రామాణిక పాయింట్లపరంగా 30 పాయింట్లు దాటితే కాలుష్యకారకంగా పరిగణిస్తారు. మనదేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థా యి జాతీయ సగటు కంటే రెండింతలు నమోదైంది. పీఎం 2.5 విషయానికొస్తే జాతీయ సగటు కంటే ఢిల్లీలో అధికరెట్లు నమోదుకాగా, హైదరాబాద్‌లో 2022లో 42.4 పాయింట్లు, 2023లో 39.9 పాయింట్లు నమోదైంది.ప్రామాణికంగా చూస్తే పీఎం 10 స్థాయి (మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్) 60 పాయింట్లు దాటితే వాయు కాలుష్య కారకాలు పెరిగినట్టుగా భావించాలి. 2023–24 నాటికి ఏడాదికి 20 నుంచి 30 శాతం పీఎం 10 సాంద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే సగటు వార్షిక పీఎం 10 స్థాయి 2023–24లో ఢిల్లీలో 208, హైదరాబాద్‌లో 81 పాయింట్లు రికార్డయ్యింది.ఏక్యూఐ ‘పూర్’ కేటగిరీలోనే ఉంది ప్రస్తుతం హైదరాబాద్ గాలిలో నాణ్యత పరిస్థితిని బట్టి చూస్తే ధూమపానం అలవాటు లేకపోయినా రోజుకు మూడు సిగరెట్ల నుంచి వచ్చే పొగ పీల్చుతున్నట్టుగా భావించాలి. నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఏక్యూఐ ‘పూర్’కేటగిరీలోనే ఉంది. దీనిని బట్టి చూస్తే వాయు నాణ్యత అనేది ఏవైనా హెల్త్ సమస్యలున్న సున్నితమైన వ్యక్తులు అనారోగ్యకరమైనదిగానే భావించాలి. మరీ ముఖ్యంగా ఉబ్బసం ఇతర వ్యాధులున్న చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న పెద్దవారికి ఇది సమస్యగానే పరిగణించాలి. దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్న వారు శ్వాస సంబంధిత సమస్యలున్న వారు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు సంచరించకపోవడం మంచిది. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్స్, కార్లలో ఫిల్టర్లు, బయటకు వెళ్లినప్పుడు ఎన్–95 మాస్క్‌లు ధరించడం ద్వారా వాయునాణ్యత క్షీణతను నియంత్రించే అవకాశాలున్నాయి. – డాక్టర్ హరికిషన్, పల్మోనాలజిస్ట్, యశోద ఆస్పత్రి, సికింద్రాబాద్మనిషి నిర్లక్ష్యం మరింత ప్రమాదకరంకేంద్ర ప్రభుత్వా లు ఇప్పటిదాకా ‘ఎన్విరాన్ ప్రొటెక్షన్ అథారిటీ’ లేదా ‘ఎన్విరాన్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ వంటిది ఏర్పాటు చేయకపోవడం పెద్దలోపం. విపత్తులు సంభవించకుండా.. ఏదైనా ఉపద్రవం జరిగితే సహాయక చర్యలు చేపట్టేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) ఏర్పాటు చేశారు. వాయు, ఇతర కాలుష్యాలను నియంత్రించాలంటూ సుప్రీంకోర్టు అనేక తీర్పులిచ్చినా, ఇప్పటివరకు ఈ సంస్థ వాయు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో వాయు కాలుష్య వ్యాప్తిని జాతీయవిపత్తుగా పరిగణించాలని ఎన్డీఎంఏను డిమాండ్ చేస్తున్నాను. దేశంలోని రాజకీయపార్టీలు కూడా కాలుష్య నియంత్రణ విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. వివిధ రూపాల్లోని కాలుష్య నియంత్రణలో సెంట్రల్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పూర్తిగా వైఫల్యం చెందాయి. 1974 వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, 1981 ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, 1986 ఎన్విరాన్మెంట్ యాక్ట్‌లను దేశంలో కచ్చితంగా అమలు చేసి కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయాయి. మనదేశంలో గాలి, నీరు, ఇతర రూపాల్లో కాలుష్యాలు తీవ్రస్థాయికి చేరుకొని ప్రమాదకరంగా మారాయి. అయినప్పటికీ వీటివల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్న మనిషనేవాడు మాత్రం తనకేమీ కాదన్నట్టుగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రజలంతా కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. తమవంతుగా ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏమాత్రం ప్రయతి్నంచకుండా, కర్బన ఉద్గారాలను పెంచేందుకు తన చర్యల ద్వారా కృషి చేస్తున్నారు. – ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తటీజీపీసీబీ ఏం చెబుతుందంటే... హైదరాబాద్‌తోపాటు పరిసరాల్లోని వాయు నాణ్యతను 14 ప్రదేశాల్లో నిరంతర పరిసర ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల (సీఏఏక్యూఎంఎస్) ద్వారా ఆటోమేటిక్‌గా లెక్కించడంతోపాటు, మాన్యువల్‌గా 16 ప్రదేశాల్లో వాయు నాణ్యతను పర్యవేక్షిస్తున్నాం. హైదరాబాద్‌లో ఏక్యూఐ అనేది నవంబర్ 22న 120 , 23 న 123 పాయింట్లు, 24న 123 పాయింట్లుగా (మూడురోజులుగా మధ్యస్థంగా)ఉంది.ౖగాలి నాణ్యతను మెరుగుపరిచే కార్యాచరణ ప్రణాళిక అమలులో ఉంది. దీని కారణంగా పీఎం10, పీఎం 2.5 సాంద్రతలు 2019 నుంచి 2023 వరకు వరుసగా 97 నుంచి 81 జ/ఝ3, 40 నుండి 36 జ/ఝ3కి తగ్గాయి. నగరంలో ఏక్యూఐ సాధారణంగా గుడ్ నుంచి మోడరేట్ అంటే 200 పాయింట్ల తక్కువ పరిధిలో ఉంటుంది. ఏక్యూఐ వర్షాకాలంలో బాగుంటుంది, శీతాకాలంలో మధ్యస్థంగా ఉంటుంది. రుతువుల్ని బట్టి ఇది మారుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆధారంగా గణిస్తారు. అయితే చాలా యాప్‌లు యూరప్, అమెరికా ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆధారంగా ఏక్యూఐని గణిస్తున్నాయి, అది మనకు వర్తించదు. ఇది అధిక ఏక్యూఐ సూచిస్తుందని గమనించాలి. – తెలంగాణ కాలుష్యనియంత్రణ మండలి (టీజీపీసీబీ) -
హైదరాబాద్‌కు ఢిల్లీ దుస్థితి రానివ్వం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు ఢిల్లీ తరహా దుస్థితి రాకుండా వాహన కాలుష్యానికి కళ్లెం వేసే చర్యలు చేపడుతు న్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో విపరీతంగా కాలు ష్యం పెరిగి ఆ నగరం చివరకు నివాసయోగ్యం కాని నగరాల జాబితాలో చేరేలా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరా బాద్‌కు భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా ఎలక్ట్రిక్ వాహనా లను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో హైదరా బాద్‌లోని ఆర్టీసీ డీజీల్ బస్సులను ఓఆర్ఆర్ ఆవలకు తరలించి వాటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతా మని అన్నారు.డీజిల్ ఆటోల విషయంలో కూడా ఇదే పద్ధతి అవ లంబించే ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ప్రజాపాలన ఏడాది విజయో త్సవాల్లో భాగంగా ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో రవాణా శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏడాది కాలంలో రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన విజయాలతో కూడిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఫొటో ఎగ్జిబిషన్, ట్రాఫిక్ నియమాలపై చిన్నారులు ఏర్పాటు చేసిన నమూనాలను, ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఆర్టీసీ పునరుజ్జీవంలో ‘మహాలక్ష్మి’ కీలకం‘మూసీ పునరుజ్జీవం కూడా కాలుష్య నివారణ చర్యల్లో భాగ మే. దీనికి అందరూ సహకరించాలి. నష్టాల ఆర్టీసీ పునరుజ్జీ వంలో మహాలక్ష్మి పథకం కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి కే ఆ పథకంతో 115 కోట్లమంది ఉచితంగా ప్రయాణించటంద్వారా రూ.4 వేల కోట్ల వరకు ఆదా చేసుకున్నారు. ఒక్కో మహిళ సగటున ప్రతినెలా రూ.7 వేల వరకు ఆదా చేసుకుంటూ ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులది కీలక భూమిక. వారి సంక్షేమం, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఒకే ఏడాదిలో 55,143 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం.ఏ రాష్ట్రంలో కూడా ఈ ఘనత సాధించలేదు. నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు వచ్చి కావాలంటే లెక్కపెట్టుకోవచ్చు. ఒక్క తల తగ్గినా క్షమాపణ కోరేందుకు సిద్ధం..’ అని సీఎం సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్థంగా మారిన ఆర్టీసీని తమ ప్రభుత్వం గాడిలో పెడు తూ లాభాల బాట పట్టిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాగా తొలిసారి రవాణా శాఖ కోసం ఏర్పాటు చేసిన లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మహాలక్ష్మీ పథకంతో మహిళలకు రూ.3,902.31 కోట్ల మేర ఆదా అయినదానికి గుర్తుగా అంత విలువతో ముద్రించిన భారీ నమూనా చెక్కును మహిళా ప్రయాణికులకు సీఎం అందించారు.మహిళలు ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి⇒ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ⇒ సీఎంతో కలిసి ఇందిరా మహిళాశక్తి బజార్ల ప్రారంభంమాదాపూర్ (హైదరాబాద్): మహిళలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మాదాపూర్‌లోని శిల్పారామంలో ఇందిరా మహిళాశక్తి బజార్లను సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు సాధికారత కల్పిస్తేనే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత పెంచడం అభినందనీయమని, క్యాంటీన్ల ఏర్పాటు వినూత్న ఆలోచన అని పేర్కొన్నారు. ఎస్‌హెచ్‌జీల మహిళలతో మాట్లాడితే.. వారు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించినట్లు తెలుస్తోందని, వారిని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. అదానీ, అంబానీలతో ఆడబిడ్డల పోటీ: సీఎంకొత్త సంవత్సరంలో ఉమ్మడి జిల్లాల్లో లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 9వ తేదీన సచివాలయంలో లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల్లో (ఎస్‌హెచ్‌జీలు) 65 లక్షల మంది ఉన్నారని, వీరిని కోటి మందిని చేయాలని మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారికి సూచించారు. మీరంతా కలిసి కోటి మంది సభ్యులను చేస్తే ఆ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.ఇందిరా మహళాశక్తి క్యాంటీన్ల నిర్వహణ, రాబోయే రోజుల్లో సోలార్ పవర్ నిర్వహణ తదితర కార్యక్రమాలతో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామని రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గవర్నర్ సతీమణి సుధా జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
పొల్యూషన్ ఎఫెక్ట్: రోడ్డుపై ఆ కార్లు తిరిగితే భారీ ఫైన్..
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న తరుణంలో సుప్రీంకోర్టు బీఎస్3 పెట్రోల్ కార్లను, బీఎస్4 డీజిల్ కార్లను నడపడం నిషేదించింది. ఈ నిషేధం గురువారం (డిసెంబర్ 5) వరకు కొనసాగుతుంది. రెండు రోజులుగా సాధారణ స్థాయికంటే.. ఎక్కువ కాలుష్యం ఏర్పడింది. కాబట్టి పొల్యూషన్ అదుపులోకి వచ్చే వరకు నిర్దేశించిన కార్లను ఉపయోగించకూడదది సుప్రీంకోర్టు ఆదేశించింది.ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) నవంబర్ 8 నుంచి పరిమితులను అమలు చేసింది. కాలుష్యాన్ని తగ్గించడానికి కొన్ని వాహనాలను నియంత్రించింది. ఈ చర్యలు తీసుకోకపోతే.. కాలుష్యం మరింత తీవ్రతరం అవుతుంది. నిషేధిత వాహనాల జాబితాలో కార్లు మాత్రమే కాకుండా కమర్షియల్ ట్రక్కులు, డీజిల్‌తో నడిచే పబ్లిక్ బస్సులు.. కాలం చెల్లిన ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి.డిసెంబర్ 5 తరువాత బీఎస్3 పెట్రోల్ కార్లను, బీఎస్4 డీజిల్ కార్లను అనుమతించే ముందు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు చెందిన అధికారులను సుప్రీంకోర్టులో హాజరు కావాలని ధర్మాసనం కోరింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమర్థవంతంగా పనిచేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.గత వారం.. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వాహనాలపై నిషేధాన్ని పాక్షికంగా సడలించింది. అయితే ప్రస్తుతం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ.. మళ్ళీ కఠినమైన ఆంక్షలు విధించింది. కాబట్టి నియమాలను ఉల్లంఘిస్తే.. రూ. 20,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పీయూసీ సర్టిఫికేట్ లేకుండా తిరిగే వాహనాలకు రూ. 10,000 జరిమానా విధించారు. ఇవి కాకుండా 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ కార్లు లేదా 10 ఏళ్లు పైబడిన డీజిల్ కార్లు రోడ్డుపై తిరిగితే.. వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి వీటిని గుర్తుంచుకుని వ్యవహరించాలి. లేకుంటే భారీ జరిమానాలు చెల్లించక తప్పదు. -
వాయు కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!
ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. వాయు కాలుష్యం అంతకంతకు తీవ్రమై దేశరాజధాని ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాలను అల్లాడిపోయేలా చేస్తుంది. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంది. ముఖ్యంగా ఈ పొగమంచు కారణంగా పిల్లలు, పెద్దలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీని కారణంగా ప్రజలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. అలాంటి సమస్యల నుంచి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ షాట్‌ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదేంటో, ఎలా తయారు చేయాలో సవివరంగా తెలుసుకుందామా..!.సీనియర్ సిటీజన్లు, చిన్నారులు వాయు కాలుష్యంతో ప్రభావితం కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూనిటీ బూస్టింగ్ షాట్ తీసుకోవాలని చెబుతున్నారు. దీనికోసం అల్లం, నారింజ, ఉసిరిలతో చేసిన పానీయాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని తెలిపారు. తయారీ విధానం..పెద్ద అల్లం ముక్కను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.నారింజ, గింజతో సహా ఉసిరికాయలను తీసుకోండిఈ మూడింటిని మొత్తగా గ్రైండ్ చేసి వడకట్టండిదీన్ని ఐస్ ట్రైలో వేసి స్టోర్ చేసుకోండికావాల్సినప్పుడూ ఈ ఐస్క్యూబ్ని గ్లాస్లో వేసుకుని కొద్దిగా వేడినీరు జోడించండి. దీన్ని రోజు తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి వృద్ధి అవ్వడమే గాక ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Palak Nagpal - Clinical Nutritionist (@nutritionwithpalaknagpal) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వ్యైద్యులను సంప్రదించడం మంచిది.(చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
‘వాతావరణ మార్పునకు ఈవీలు పరిష్కారం కాదు’
ఎలక్ట్రిక్ వాహనాలు వాతావరణ మార్పులకు పరిష్కారం చూపవని ప్రముఖ రచయిత అమితావ్ ఘోష్ తెలిపారు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్ల ద్వారా వాతావరణ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అందుకు బదులుగా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై ప్రపంచం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇటీవల లండన్ కింగ్స్ కాలేజీలో గ్లోబల్ కల్చర్స్ ఇన్స్టిట్యూట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.‘వాతావరణ మార్పు అనేది ప్రపంచ సమస్య. దీన్ని పరిష్కరించేందుకు అందరూ ముందుకు రావాలి. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు ఈ సమస్యకు పరిష్కారం చూపవు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్ల ద్వారా ఇది పరిష్కారం కాదు. స్థానిక ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. బంగ్లాదేశ్‌లో చాలా ఏళ్లుగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అక్కడ వాతావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దాంతో స్థానికులు వాతావరణానికి చేటు చేసే కార్యాలకు స్వతహాగా దూరంగా ఉంటున్నారు. ఈ మార్పునకు ఏదో గొప్ప సాంకేతిక తోడ్పడలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది. భారత్ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశం. అలాంటిది ఇక్కడి రైతులు చాలా ఏళ్లుగా తమకు తోచినంతలో నీటిని సమర్థంగా వాడుకుని పంటలు పండిస్తున్నారు. వనరులను సమర్థంగా వాడుకోవాలనే స్పృహ అందరిలోనూ ఉండాలి. అప్పుడే వాతావరణం మరింత క్షీణించకుండా కాపాడుకోవచ్చు’ అని అమితావ్ ఘోష్ అన్నారు.ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’‘ఇరాక్ యుద్ధ సమయంలో యూఎస్ మిలిటరీ ఏటా 1.3 బిలియన్ గ్యాలన్ల చమురును వినియోగించింది. ఇది బంగ్లాదేశ్ వార్షిక వినియోగం కంటే ఎక్కువ. యుద్ధాలు, భౌగోళిక అనిశ్చితుల కారణంగా చెలరేగులున్న వైరుధ్యం వల్ల వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. అయినా ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా చర్చకు వస్తాయి’ అని అన్నారు. -
మృత్యుకుహరంగా మహానగరం
‘కాలుష్యం రేపటి తరాలకు శాపం’ అన్నది ఒకప్పటి మాట. నేటి పరిణామాలు గమనిస్తే రేపు కాదు, నేడే ప్రాణాంతకంగా మారింది. అందుకు ఉదాహ రణ దేశ రాజధాని న్యూఢిల్లీ. ఒకప్పుడు ప్రపంచంలోనే అందమైన, ఆహ్లాదకర నగరాలలో ఒకటి. దశాబ్ద కాలం పైబడి మానవ తప్పిదాలు, ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా కాలుష్య కాసారంలో పడి మానవ మనుగడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిజానికి దేశంలోని అన్ని పెద్ద నగరాలూ ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. వాయుకాలుష్యాన్ని పర్యావరణ సమస్యగానే పరిగణించకుండా, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశంగా చూసి, దాన్నుంచి బయటపడిన కొన్ని దేశాల అనుభవాలు మనకు ఆచరణీయం. కావాల్సిందల్లా తక్షణ నివారణ చర్యల్ని అమలు చేయగలిగే చిత్తశుద్ధి.ఎక్కడైనా గాలి నాణ్యత స్థాయి (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) 50 నుంచి 100 వరకు ఉంటేనే ఆరోగ్యకరంగా ఉన్నట్టు! దేశంలోని అనేక పట్టణాలు, నగరాలలో ఇది 150 దాటుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరులలో ఏక్యూఐ ప్రమాద ఘంటిక లను మోగిస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుత ఏక్యూఐ సగుటన 130గా నమోదవుతోంది. ఊపిరాడేనా?ఢిల్లీలో నవంబర్ రెండో వారం నాటికి ఏక్యూఐ 467 పాయింట్లకు చేరింది. అక్కడి జహంగీర్‌పూర్‌లో అయితే ఏకంగా 567 పాయింట్లు నమోదైంది. ఊపిరాడని కాలుష్య తీవ్రతకు తోడుగా శీతకాలంలో వచ్చే పొగమంచు ఢిల్లీ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీ రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్య గోచరత (విజిబిలిటీ) తగ్గిపోవడంతో, పలు విమానాల సర్వీసుల్ని రద్దు చేశారు. ఢిల్లీకి వెళ్లే, ఢిల్లీ నుంచే బయలుదేరే రైళ్ల రాక పోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలోని అన్ని స్కూళ్ల ప్రైమరీ క్లాసుల్ని ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. రోడ్ల మీద పెట్రోల్, డీజిల్ వాహనాల రాకపోకలను నిలిపివేసి, కేవలం విద్యుత్, సీఎన్‌జీలతో నడిచే వాహనాలనే అనుమ తిస్తున్నారు. ప్రజారవాణా తప్ప సొంత వాహనాలలో బయటకు వెళ్లే అవకాశం లేని దయనీయ దుఃస్థితి ఏర్పడింది. ఒక్క సమస్య పలు ఇతర సమస్యలకు పుట్లిల్లు అవుతుందని ఓ సామెత. దశాబ్దకాలంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలను వేధిస్తూ వస్తున్న వాయు, నీటి కాలుష్యాలు అనేక అనర్థాలకు దారితీశాయి. వాటిని పరిష్కరించక పోవడం వల్లనే నేడు కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం, భవితవ్యం ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్న ప్రజలలో చాలామందికి శ్వాసకోశ సమస్యలు మొదలుకొని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. నిజానికి, ఢిల్లీ వాయుకాలుష్యంపై అనేక సందర్భాలలో సర్వోన్నత న్యాయస్ధానం జోక్యం చేసుకోవడంతోనే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలనైనా చేపట్టాయి. ఈ అరకొర చర్యలు ప్రజానీకాన్ని రక్షించగలవా?విదేశాల అనుభవాలుప్రపంచంలోని అనేక నగరాలు ఏదో ఒక సమయంలో కాలుష్యం బారిన పడినవే. పరిశ్రమల ఏర్పాటు, భవన నిర్మాణాలు ముమ్మరం కావడం, పట్టణీకరణ పెరగడం తదితర అంశాల వల్ల వాయు, నీటి కాలుష్యాలు అన్నిచోట్లా తీవ్రస్థాయికి చేరాయి. 1952లో లండన్ నగరాన్ని కాలుష్య భూతం కాటేసింది. ‘గ్రేట్ స్మాగ్’ అని పిలిచే ఆ ఉత్పా తానికి 1,200 మంది బలయ్యారు. దాంతో, 1956లో బ్రిటిష్ ప్రభుత్వం ‘క్లీన్ ఎయిర్ యాక్ట్ 1956’ తెచ్చి కఠినంగా అమలు చేసింది. లండన్ నగరంలోని అన్ని పరిశ్రమలనూ సుదూర ప్రాంతా లకు తరలించింది. నగరంలోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరిచి పచ్చదనం పెంచింది. అలాగే, 2008లో ‘బీజింగ్ ఒలింపిక్స్’ నిర్వహించిన చైనా ప్రభు త్వానికి కూడా వాయుకాలుష్యం సవాలు విసిరింది. భారీ నిర్మాణాలు చేపట్టిన ఆ సందర్భంలో, గాలి నాణ్యత తగ్గకుండా చైనా ప్రభుత్వం అన్ని రకాల పరిశ్రమలనూ దూర ప్రాంతాలకు తరలించింది. వాహ నాలను క్రమబద్ధీకరించడమేకాక, ప్రజా రవాణాను ఉపయోగించుకొనేలా ప్రజలను సమాయత్తం చేసింది. బీజింగ్‌లో వాయు కాలుష్యం తగ్గాక, అక్కడి ప్రజల ఆయుర్దాయం సగటున నాలుగేళ్లు పెరిగిందని చైనా ప్రభుత్వం వెల్లడించింది. పారిశ్రామికంగా ఎంతో ముందంజ వేసిన అమెరికా, మెక్సికో, జపాన్‌లు ఒకప్పుడు వాయుకాలుష్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వేగంగా ఆ సమస్య నుండి బయటపడ్డాయి. ప్రభుత్వం, ప్రజలు ఉమ్మడిగా ఆ సమస్యను ఎదుర్కొన్న తీరు అనన్య సామాన్యం. వాయు కాలుష్యాన్ని ఆ ప్రభుత్వాలు కేవలం పర్యావరణ సమస్యగానే పరిగ ణించలేదు, ప్రజారోగ్యానికి సబంధించిన అంశంగా చూశాయి. ప్రభు త్వంలోని అన్ని శాఖలు సమీకృతంగా సమస్యను ఎదుర్కోవడానికి కృషి చేశాయి. అటువంటి రోడ్ మ్యాప్ మన దేశంలో లేకపోవడంతోనే ‘ఇంతింతై వటుడింతౖయె...’ అన్నట్లు కాలుష్య సమస్య పెనుభూతంగా మారింది. పారిశ్రామిక వ్యర్థాలు, వాహనాలు వెలజల్లే కార్బన్ డయాక్సైడ్, భవన నిర్మాణాల కారణంగా గాలిలో కలిసే ధూళి;ఎండిన చెట్లు, చెత్తా, చెదారాలన్నింటినీ తగల బెట్టడం ద్వారా వచ్చే పొగ... ఇవన్నీ వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఢిల్లీకి పక్కనే ఉన్న యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలను విచ్చలవిడిగా వదలడంతో ఆ ప్రాంతం పూర్తిగా కలుషితమైంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న హరియాణా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రతి వ్యవసాయ సీజన్ ముగి శాక పంట వ్యర్థాలను కాల్చడంతో... దట్టమైన పొగలు కమ్మేస్తు న్నాయి. వీటికితోడు దీపావళి, కొన్ని వివాహ వేడుకల సందర్భంగా వినోదం కోసం టపాసుల్ని పేల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.ప్రభుత్వాల ముందున్న కర్తవ్యంఢిల్లీని పీడిస్తున్న వాయుకాలుష్యం చాలావరకు స్వయం కృతమే. ఢిల్లీ పరిధిలో 9,000 హోటళ్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున బొగ్గు ఉపయో గిస్తున్నట్లు తేలింది. తందూరీ వంటకాలు చేసే హోటళ్లు బొగ్గును వాడుతున్నాయి. వంటకు గ్యాస్ బదులు కట్టెలు, వ్యవసాయ వ్యర్థాలు, పిడకలు వాడుతున్నవారి సంఖ్య ఢిల్లీలో దాదాపు 20 లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో రోజుకు సగటున 500 టన్నుల మునిసిపల్ సాలిడ్ వేస్ట్ (ఇళ్ల నుంచి సేకరించే వ్యర్థాల)ను కాలు స్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు, నిర్మాణ స్థలాల్ని పూర్తిగా కవర్ చేయడం; సిమెంట్, ఫ్లయ్ యాష్వంటి నిర్మాణరంగ మెటీరియల్స్‌ను కప్పి ఉంచడం తప్పనిసరిగా చేయాల్సి ఉన్నప్పటికీ... ఆ నిబంధనల్ని చాలావరకు పాటించడం లేదు. చమురు శుద్ధి ప్లాంట్ల నుంచి ప్రాణాంతకమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వెలువడుతుంటాయి. వీటిని నిరోధించే టెక్నాలజీని అమెరికా, చైనా ఉపయోగిస్తుండగా మనకు అందుబాటులోకి రాలేదు. కాలుష్యాన్ని ఎక్కువ వెదజల్లే పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను అభివృద్ధి చెందిన దేశాలు 30 శాతానికి తగ్గించాయి. అధునాతన ఫిల్టర్లను ఉపయోగిస్తూ వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాయి. చాలా దేశాలలో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా వాటిని బయోగ్యాస్ ఉత్పత్తికి, పశువుల దాణాకు వాడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నింపేటప్పుడూ(అన్లోడింగ్), వాహనాల్లో ఇంధనం పోసేటప్పుడూ గాలిలో ప్రమాదకర ఆర్గానిక్ వ్యర్థాలు కలుస్తాయి. చాలా దేశాలలో ఇంధనం లోడింగ్, అన్లోడింగ్ సమ యాలలో ‘వేపర్ రికవరీ సిస్టవ్‌ు’ టెక్నాలజీని ఉపయోగిస్తూ దీన్ని నివారించగలుగుతున్నారు.ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్య భూతం మాటేసిన మృత్యు వులా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన తక్షణ నివారణ చర్యల్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. లేకుంటే, దేశ రాజధాని ఆరోగ్య భద్రతను కాపాడు కోలేకపోతోందనే అపప్ర«థ ప్రభుత్వంపై పడుతుంది. అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు -
‘మా నగరానికి ఏమైంది’ : కాలుష్యంపై నెటిజన్ల ఆగ్రహం
సాక్షి, ముంబై: దేశరాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కా లుష్యంతో ఇప్పటికే సతమత మవుతుండగా, ఇప్పు డు ముంబై కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వాయునాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణవేత్తలు, ముంబైవాసు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు?‘అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి ముంబైలోని అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించిన బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమేపీదిగజారుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు సూచనలు.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేస్తున్నారుపరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం. ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించడం. పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం. -
దేశ రాజధాని మార్పు అవసరమేనా?
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికిచేరింది. తాజాగా అక్కడ గాలి నాణ్యతా సూచి 500 మార్క్ చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో కాలుష్య మయమైన ఢిల్లీని భారతదేశ రాజధానిగా కొన సాగించడం అవసరమా అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లేవనెత్తిన అంశం చర్చకు దారి తీస్తోంది.మొఘల్ చక్రవర్తుల రాజధానిగా ఒక వెలుగు వెలిగిన ఢిల్లీ... బ్రిటిష్ రాణి పాలనా కాలంలోనూ, స్వాతంత్య్రం తరువాత కూడా రాజధాని హోదాతోనే ఉంది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్ట్, ప్రధాన మంత్రి కార్యా లయం వంటి అత్యున్నత సంస్థలు ఢిల్లీలో ఉన్నాయి. ఇతర నగరాలతో పోటీ పడుతూ వాణిజ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందింది. అంతర్జాతీయసంబంధాల రీత్యానూ ఢిల్లీ కీలకమైన స్థానం. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజధాని మార్పుఅంశం తెర మీదకు వచ్చింది.ప్రపంచంలో కొన్ని దేశాలు తమ తమ రాజధానులను అవసరం మేరకు మార్చుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. నైజీరియా పాత రాజధాని లాగోస్ నుంచి 1991లో ‘అబుజా’కు మార్చుకుంది. లాగోస్‌లో అధిక జనసాంద్రత సమస్య, ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. అందుకే దేశానికి భౌగోళికంగా మధ్యలో ఉన్న అబుజాను కొత్త రాజ ధానిగా ఎంచుకున్నారు. ఇక 2006లో యాంగోన్ (రంగూన్) నుంచి నైపిటావ్కు మయన్మార్ తన రాజధానిని మార్చుకుంది. భద్రత, పరిపాలన సామర్థ్యం పెంపొందించుకోవడం వంటి కార ణాలుఇందుకు కారణాలు. 1918లో రష్యా కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి మాస్కోకు రాజధానిని మార్చింది.వ్యూహాత్మకంగా మాస్కో మరింత ప్రాముఖ్యం ఉన్న ప్రాంతమని రష్యా భావించింది. ఇక పొరుగు దేశం పాకిస్తాన్ 1963లో కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు రాజధానిని మార్చుకుంది. కరాచీ నగరానికి భద్రతా సమస్యలు ఉండటం, అక్కడ అధిక జనాభా ఉండడం వంటి కారణాలతో దేశానికి కేంద్ర స్థానంలో ఉన్న ఇస్లామాబాద్‌కు రాజధానిని తరలించు కున్నారు. బ్రెజిల్,, కజకిస్తాన్, టాంజానియా వంటివీ రాజధానులను మార్చుకున్నాయి. ఇక ప్రస్తుతం మన విషయానికి వస్తే... పుణే, హైదరాబాద్, నాగపూర్ వంటి నగరాలు దేశానికి మధ్యలో ఉండటం వల్ల వీటిలో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా ఎంచుకోవాలని కొందరు సూచిస్తు న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో కొన్ని తక్షణ చర్యలు చేపట్టాలి. గ్రీన్ బెల్ట్స్ అభివృద్ధి చేయాలి. పునఃవిని యోగ ఇంధన వనరులన వాడకాన్ని అధికం చేయాలి. పరిపాలనా కార్యా లయాలను ఇతర నగరాలకు విస్తరించాలి. ఈ క్రమంలో హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే అంశం మరో సారి తెరపైకి వస్తోంది. ఇక్కడి మౌలిక వసతుల నేపథ్యంలో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయా లని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బాబా సాహెబ్ అంబేడ్కర్ అప్పట్లోనే అన్నారని, ఆ అర్హత హైదరాబాద్‌కు ఉందని కొందరు గుర్తు చేస్తు న్నారు. హైదరాబాద్‌లో కూడా కాలుష్యం పెరిగే అవకాశం ఉంటుందని, భాగ్యనగరంతో పాటు తెలంగాణలో వివిధ ప్రదేశాల్లో పరిపా లనా కేంద్రాలను నిర్మిస్తే బాగుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.శశిథరూర్ లేవనెత్తిన అంశంపై మరింత చర్చ జరగాలి. ఢిల్లీవంటి నగరంలో పెరుగుతున్న కాలుష్యం, జనాభా, మౌలిక సదు పాయాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. రాజధానిని మార్చడం అనేది తక్షణావసరం కాకపోయినా, భవిష్యత్తులో పరిశీల నార్హమైన అంశం. అదే సమయంలో ఢిల్లీని కాలుష్యం బారి నుంచి రక్షించడం తక్షణ అవసరం.– ఎక్కులూరి నాగార్జున్ రెడ్డిఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 90320 42014 -
‘అమ్మో’ అన్నవారే ‘ఆహా’ అంటున్నారు! ఇతిషా మహిమే!
అస్సాంలోని గౌహతికి చెందిన ఇతిషా సారా పుణెలోని ‘సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో చదువుకుంది. దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ‘సోషల్ డిజైన్’ కోర్సు చేసింది. ‘ఈ కోర్సు వల్ల తరగతి బయట అడుగు పెట్టడానికి, ప్రజలతో నేరుగా మాట్లాడడానికి, రోజువారీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి నాకు అవకాశం వచ్చింది’... గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఇతిషా.తన పరిశోధన అంశానికి ఈ–వ్యర్థాలను ఎంచుకుంది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై పరిశోధనలు చేసిన వారు తక్కువ. ఈ–వ్యర్థాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవడంతో పాటు దిల్లీ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైకిలింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి పరిశీలించేది. ఈ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఎన్నో విషయాల గురించి అవగాహన చేసుకుంది. ‘రీసైకిలింగ్’పై ఇతిషాకు ఉన్న అవగాహన సాంగ్టీని మార్చడానికి ఉపయోగపడింది.అరుణాచల్‌ప్రదేశ్‌లోని సాంగ్టీలో అద్దె ఇంట్లో ఉంటూ, హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణ స్పృహను రేకెత్తించ డానికి గ్రామస్తులతో కలిసి పనిచేసింది. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండకుండా ఒకేచోట ఉండేలా వెదురుతో ప్రత్యేక నిర్మాణాలు చేయించింది.కమ్యూనిటీల నిర్వహణలోని ‘వేస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్’ లతో సాంగ్టీ ప్రాంతంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ గ్రూప్‌లు స్థానిక సంస్కృతి, సాహిత్యాలను ప్రతిబింబించే మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న కాలంలో కోవిడ్ దెబ్బతో పరిసరాల పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్ మూలన పడ్డాయి. లాక్డౌన్ తరువాత ఈ ప్రాంతానికి తిరిగి వచ్చిన ఇతిషా వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో కమ్యూనిటీ గ్రూప్‌లలో ఉత్సాహవంతులైన కొత్త సభ్యులను చేర్చుకున్నారు.ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణను పర్యవేక్షించేందుకు నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వంతుల వారీగా వ్యర్థాలను సేకరించి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ(ఎంఆర్ఎఫ్) సెంటర్లకు తరలిస్తారు. ఒకప్పుడు సాంగ్టీ పేరు వినబడగానే ‘బాబోయ్’ అనుకునేవారు. ఇప్పుడు అలాంటి గ్రామం ‘జీరో వేస్ట్ విలేజ్’గా మారి ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిని ఇస్తోంది. వారిలో ఒకరిగా...అప్పుడప్పుడూ వస్తూ, పోతూ పని చేయడం కంటే సాంగ్టీలోనే ఉండి పనిచేయాలనుకున్నాను. ఆ గ్రామస్థులలో ఒకరిగా కలిసి పనిచేయడం వల్ల అందరూ సహకరించారు. నన్ను వారిలో ఒకరిగా చూసుకున్నారు. ‘జీరో వస్ట్ విలేజ్’గా సాంగ్టీని నిలబెట్టే క్రమంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనకడుగు వేయలేదు. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రతి ఇంటిలో అవగాహన కలిగించడంలో విజయం సాధించాం. - ఇతిషా సారా View this post on Instagram A post shared by Northeast Waste Collective (@northeastwastecollective) -
విషతుల్య రాజధాని
భారత రాజధాని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి శీతకాలంలానే ఈ ఏడాదీ పాత కథ పునరావృత్తం అయింది. ఒకపక్క పెరిగిన చలికి తోడు ధూళి నిండిన పొగ లాంటి గాలి, కాలుష్య ఉద్గారాలు, పొరుగున ఉన్న పంజాబ్ – హర్యానా లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో అక్రమంగా సాగుతున్న కొయ్యకాళ్ళ దహనం... అన్నీ కలిసి అతి తీవ్ర వాయు కాలుష్యంగా పరిణమించాయి. వారంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం, వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) సోమవారం గరిష్ఠంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకూలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణం. ఢిల్లీలో సోమవారంæ కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40 శాతం ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి... భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ, అదే ఐరాస పర్యావరణ పరిరక్షక సంస్థ (యూఎస్‌ఈపీఏ) నిర్దేశించిన ప్రమాణాల లెక్కలో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తోంది. పీఎం 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యమూ హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్‌మహల్ కట్టడం విషవాయు కౌగిలిలో చేరి, దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసి వారమవుతోంది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి. వెరసి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమనే దుష్కీర్తి ఢిల్లీకి దక్కింది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ తేల్చిన ఈ నిష్ఠురసత్యం ఇన్నేళ్ళ మన బాధ్యతా రాహిత్యానికీ, పాలకుల నిష్క్రియాపరత్వానికీ నిదర్శనం. ఆ మాటకొస్తే, 2018లో కానీ, గడచిన 2023లో కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజూ ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదని రికార్డులు చెబుతున్నాయంటే ఏమనాలి? కాలుష్యం దేశవ్యాప్తంగా ఉందనీ, నివారణ బాధ్యత రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా అని ఢిల్లీ ‘ఆప్’ సర్కార్ వాదన. కానీ, ఏటేటా శీతకాలంలో రాజధానిలో పెరుగుతూ పోతున్న ఈ కష్టానికి చెక్ పెట్టడంలో పాలకులు ఎందుకు విఫలమయ్యారంటే జవాబు దొరకదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నిరోధానికి యంత్రాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవేవీ చాలక చివరకు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లలో కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మేఘమథనం జరిపేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని అనుమతి కోరినా, జవాబు లేదన్నది ‘ఆప్’ ఆరోపణ. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రయోజనమెంత అనేది చర్చనీయాంశమే. అయితే, ప్రజలకు తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం మొదటే మోకాలడ్డడం సరికాదు. వాయు కాలుష్యం ‘అతి తీవ్ర’ స్థాయులకు చేరిన నేపథ్యంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్) నాలుగోదశ చర్యలను కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. పాఠశాలల్ని మూసివేయడం, ఆఫీసుకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమల మూసివేత లాంటి చర్యలన్నీ నాలుగో దశ కిందకు వస్తాయి. ముప్పు ముంచుకొస్తున్నా మూడో దశ, నాలుగో దశ చర్యల్లో అధికారులు ఆలస్యం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు షరతులు అమలు చేయాల్సిందేనని కోర్ట్ చెప్పాల్సి వచ్చిందంటే అధికార యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడిక ‘గాప్’ నాలుగో దశ కింద వాహనాల రాకపోకలు, భవన నిర్మాణ కార్యకలాపాలపై షరతులు విధించింది. అయితే, దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో దాదాపు 34 లక్షల చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఉత్పత్తి దెబ్బతిననుంది. అంటే కాలుష్య పాపం ఆరోగ్యాన్నే కాక ఆర్థికంగానూ కుంగదీస్తుందన్న మాట. ఢిల్లీలో వాహనాల వల్ల అత్యధిక కాలుష్యం సంభవిస్తుంటే, ఎన్సీఆర్లో పరిశ్రమలు ప్రధాన కాలుష్య కారకాలని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి) 2021లోనే తేల్చింది. అనేకచోట్ల ఇప్పటికీ కట్టెల వాడకం కొనసాగుతోంది. ఇక, పొలాల్లో కొయ్య కాళ్ళ దహనం తాజా దురవస్థకు 40 శాతం కారణమట. అన్నీ కలిసి పీల్చే గాలే విషమయ్యేసరికి, ఢిల్లీ వాసుల ఆయుఃప్రమాణం సగటున ఏడేళ్ళు తగ్గుతోంది. రాజధాని, ఆ పరిసరాల్లోని 3 కోట్ల పైచిలుకు మంది వ్యధ ఇది. నిజానికి, స్వచ్ఛమైన గాలి ప్రాథమిక మానవహక్కని గత నెలతో సహా గత అయిదేళ్ళలో సుప్రీమ్ అనేకసార్లు స్పష్టం చేసింది. వాయునాణ్యతకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్రస్థాయి యంత్రాంగాలను ఆదేశించింది. అయినా జరిగింది తక్కువ. సరైన ప్రాణ వాయువు కూడా అందని ఈ పరిస్థితికి ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ బాధ్యులే. కాలుష్య నివారణ, నియంత్రణలకు సృజనాత్మక ఆలోచనలు చేయలేకపోవడం ఘోరం. దాహమేసినప్పుడు బావి తవ్వకుండా ఏడాది పొడుగూతా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టడం అవసరం. ఆధునిక సాంకేతికత, ప్రజారవాణా, ప్రజల అలవాట్లలో మార్పులు సహా అనేక అంశాల్లో రాజకీయ కృత నిశ్చయంతో విధాన నిర్ణేతలు పనిచేయాలి. లేదంటే, సాక్షాత్తూ దేశ రాజధానే నివాసయోగ్యం కాక జనం తరలిపోతుండడం చూసి వికసిత భారత్, లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ లాంటివన్నీ వట్టి గాలి మాటలే అనుకోవాల్సి వస్తుంది. -
ఢిల్లీలో ఊపిరాడని మరోరోజు.. 500 వద్ద ఏక్యూఐ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తిన వాయు కాలుష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) గత ఏడు రోజులుగా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆనంద్ విహార్‌తో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500కి చేరుకుంది.ఢిల్లీలోని విషవాయువు స్థానికుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీవాసులు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఢిల్లీలోని ఏక్యూఐ ‘చాలా తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది. ఏక్యూఐ 484గా నమోదైంది.కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లా(గ్రాప్)-4 కింద ఆంక్షలను తక్షణమే విధించాలని జాతీయ రాజధాని ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతుల వారికి తరగతులను నిలిపివేయాలని నిర్ణయించింది.వీరికి ఆన్లైన్లో తరగతులు నిర్వహించనున్నారు. ప్రమాదకరమైన విషపూరిత గాలి నుండి విద్యార్థులను కాపాడేందుకే ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలలు పనిచేయనున్నాయి. అయితే వీరికి కూడా ఆన్లైన్లో తరగతులు నిర్వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
ఒక్కరోజులో భారీగా పంట వ్యర్థాల కాల్చివేత.. మరింతగా పెరిగిన కాలుష్యం
చండీగఢ్: పంజాబ్‌లో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో తరహా కేసుల సంఖ్య 8,404కి చేరుకుంది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా 404 వరకూ పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. వాటిలో ఫిరోజ్పూర్లో 74, భటిండాలో 70, ముక్త్సర్లో 56, మోగాలో 45, ఫరీద్‌కోట్‌లో 30 ఘటనలు ఉన్నాయన్నారు. ఫిరోజ్‌లో అత్యధికంగా పంటవ్యర్థాలను తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా పంజాబ్‌లో 2022లో ఒకేరోజులో 966, 2023లో 1155 పంట వ్యర్థాలు తగులబెట్టిన కేసులు నమోదయ్యాయి.కాగా గత సెప్టెంబరు 15 నుండి నవంబర్ 17 వరకు పంజాబ్‌లో 8,404 పంటవ్యర్థాలు తగులబెట్టారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇటువంటి సంఘటనలలో 75 శాతం తగ్గుదల కనిపించింది. పంజాబ్, హర్యానాలలో అక్టోబర్, నవంబర్లలో వరి పంట కోసిన తర్వాత భారీ ఎత్తున పంట వ్యర్థాలు తగులబెడుతుంటారు. ఇదిలో ఢిల్లీలో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
‘ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలి’
హైదరాబాద్: నగర పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జీవో 41 ద్వారా అమల్లోకి కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చేందకు రంగం సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఈవీ పాలసీ 2026 డిసెంబర్ వరకూ అమల్లో ఉండనుందన్నారు. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని, ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు హైదరాబాద్‌కు రాకూడదని ఈ సందర్బంగా పొన్నం పేర్కొన్నారు. తెలంగాణలో రవాణాశాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్య తెచ్చే కార్యక్రమాలు చేపడతున్నామన్నారు. -
‘గ్రాప్-3’ ఉల్లంఘనలు.. ఒక్కరోజులో రూ 5.85 కోట్ల చలానాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ‘గ్రాప్-3’ నిబంధనలను అమలు చేసింది. అయినప్పటికీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. గాలి నాణ్యత శనివారం మరింత దిగజారింది. పలు ప్రాంతాల్లో ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది. కాలుష్యాన్ని మరింతగా తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పడు గ్రాప్-3ని ఆచరణలో పెట్టింది. అయితే ఇది అమలు చేసిన మొదటి రోజునే ఈ విధానంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. 5.85 కోట్ల జరిమానా విధించింది. గ్రాప్-3ని అమలు చేసినప్పటికీ వాయు కాలుష్యంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు.శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)417గా ఉంది. శుక్రవారం ఇదే సమయంలో ఏక్యూఐ 396గా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం వాయునాణ్యత ‘తీవ్రమైన’ కేటగిరికి చేరినప్పుడు జనం అనారోగ్యం బారిన పడతారు. ఇప్పటికే అనారోగ్యంతోవున్నవారు మరిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.నిషేధం ఉన్నప్పటికీ బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలను వినియోగిస్తున్న వారికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 550 చలానాలను విధించారు. బీఎస్- 3 పెట్రోల్, బీఎస్- 4 డీజిల్, నాలుగు చక్రాల వాహనాలపై కూడా నిషేధం విధించామని, దీనిని ఉల్లంఘిస్తే రూ.20 వేలు జరిమానా విధించే నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలు (పీయూసీసీ)లేని వాహనాలకు కూడా పోలీసులు చలానాలు ఇచ్చారు. శుక్రవారం ఒక్కరోజునే 4,855 వాహనాలపై మొత్తంగా రూ.5.85 కోట్ల జరిమానా విధించారు.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు
కరాచీ: పొరుగుదేశం పాకిస్తాన్ వాయు కాలుష్యంతో విలవిలలాడిపోతోంది. ప్రపంచంలో తీవ్రమైన కాలుష్యం బారిన పడిన నగరాల్లో రెండవ స్థానంలో నిలిచిన లాహోర్‌లో ఇప్పుడు వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. ఇక్కడి గాలి విషపూరితంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 15 వేల మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులలో చేరారు.పాక్‌లోని లాహోర్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 1900ను దాటింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముల్తాన్‌లో కూడా ఏక్యూఐ 750 దాటింది. నాసాకు చెందిన మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్టర్ రేడియోమీటర్ ఉత్తర పాకిస్తాన్లో, ముఖ్యంగా లాహోర్, దాని పరిసరాలలో ఆకాశంలో వ్యాపించిన పొగమంచు చిత్రాలను షేర్ చేసింది.శీతాకాలం ప్రారంభమైనప్పటి నుండి అంటే నవంబర్ నుండి లాహోర్ ఆకాశంలో దట్టమైన పొగమంచు కనిపిస్తోందని, ఫలితంగా గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని నాసా తెలిపింది. లాహోర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. పాఠశాలలు మూసివేశారు. పొడి దగ్గు, శ్వాస ఆడకపోవడం, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో లాహోర్‌లోని మాయో ఆసుపత్రిలో 4,000 మంది బాధితులు చేరారు. అలాగే జిన్నా ఆసుపత్రిలో 3,500 మంది, పిల్లల ఆసుపత్రిలో 2,000 మందికి పైగా రోగులు చేరారు.ఆస్తమా, హృద్రోగులు బయటకు వెళ్ల కూడదని వైద్యులు హెచ్చరించారు. వాహనాల నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ, నిర్మాణ స్థలాల నుంచి వెలువడుతున్న దుమ్ము మొదలైనవి లాహోర్‌లో వాయు కాలుష్యానికి కారణంగా నిలిచాయి. లాహోర్‌లో మూడు నెలల పాటు వివాహాలను నిషేధించారు. పాకిస్తాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గత నెలలో 18 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం -
ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టు
కాఫీ నుంచి కాలుష్యం దాకా.. కాదేదీ కాటుకు అనర్హంకొన్ని ప్రాంతాల్లో దొరికే నీళ్లు సైతం కారణమేఅవగాహన పెంచుకొని అలవాట్లు మార్చుకోవాలి జుట్టు రక్షణకు పలు సూచనలు చేస్తున్న వైద్యులుఆధునిక సాంకేతిక మార్పులతో పాటు నగరవాసుల జీవనశైలి మార్పులు కూడా హెయిర్‌కి టెర్రర్‌గా మారుతున్నాయి. బిజీ లైఫ్‌లో పట్టించుకోని, మార్చుకోలేని అలవాట్లు సిటిజనుల కేశ సంపదను కొల్లగొడుతున్నాయి. సమయానికి తినడం తప్ప సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం తగ్గిపోతోంది. జంక్ ఫుడ్ వినియోగంతో కేశాల ఆరోగ్యానికి అత్యవసరమైన ఐరన్, జింక్, బయోటిన్ అందడం లేదు. కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా గుడ్లు, చేపలు, పాలకూర వంటి ఆకుకూరలు, గింజలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు 2 నుంచి 3 లీటర్లు తాగాలి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ లభించే డ్రైఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. స్టైలింగ్.. కిల్లింగ్.. జుట్టు పొడిబారడానికి హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్‌నెర్‌లు ఉపయోగించడం వల్ల జుట్టు విరిగిపోతోంది. పోనీటెయిల్స్ లేదా బ్రెయిడ్స్ వంటి బిగుతు హెయిర్ స్టైల్స్‌తో ట్రాక్షన్ అలోపేసియా అనే పరిస్థితికి గురై జుట్టు రాలిపోతుంది. కాబట్టి హీట్–ఫ్రీ స్టైలింగ్ పద్ధతులను, స్టైలింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ ఉత్పత్తులను ఉపయోగించాలి. జుట్టు షాఫ్ట్లపై ఒత్తిడి తగ్గించడానికి వదులుగా ఉండే కేశాలంకరణను ఎంచుకోవాలి. ఫ్యాషన్ కోసం పెరమ్స్, రిలాక్సర్ల మితిమీరిన రంగుల వినియోగం, రసాయన చికిత్సలతో జుట్టు నిర్మాణం బలహీనపడుతోంది. అలవాట్లు.. జుట్టుకు పోట్లు.. నగర యువతలో పెరిగిన ధూమపానం, ఆల్కహాల్ వినియోగం రెండూ కేశాలకు నష్టం కలుగజేస్తున్నాయి. ఈ అలవాట్లతో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చక్కని హెయిర్ కోసం ఖచి్చతంగా ధూమపానం మానేయడంతో పాటు మద్యపానాన్ని బాగా తగ్గించడం అవసరం. ఉపరితలం.. ఇలా క్షేమం.. తల ఉపరితలం(స్కాల్ప్) తరచుగా నగరవాసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది జుట్టుకు హాని చేస్తోంది కాబట్టి స్కాల్ప్‌ను శుభ్రంగా తేమగా ఉంచుకోవడం అవసరం. అవసరాన్ని బట్టి హెయిర్ ఫోలికల్స్‌ను పోషించడానికి ఉత్తేజపరిచేందుకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. కదలికతో కేశాలకు మేలెంతో.. కూర్చుని పనిచేయడం, ఎక్కడకు వెళ్లాలన్నా వాహనాల వినియోగం.. ఇలా కదలికలు తగ్గిపోతున్న నగరవాసుల నిశ్చల జీవనశైలి రక్తప్రసరణ లోపానికి దారి తీస్తోంది. తలపై భాగానికి రక్త ప్రసరణ లేకపోవడం కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి శారీరక శ్రమ అవసరం. నీళ్లూ.. నష్టమే.. సిటీలో కొన్ని ప్రాంతాల్లో సాల్ట్స్ ఎక్కువగా ఉండే హార్డ్ వాటర్‌తో స్నానం చేస్తున్నారు. దీంతో తలలో ఉండే సహజమైన నూనెలు ఆవిరై తల ఉపరితలం పొడిబారి కేశాలు దెబ్బతింటాయి.నిద్రలేమీ.. ఓ సమస్యే..దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్యం హెయిర్‌పై దు్రష్పభావం చూపిస్తోంది. గుర్తించిన థైరాయిడ్ వంటి వ్యాధులు లేదా గుర్తించలేని హార్మోన్ల అసమతుల్యత వంటివి.. జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్య సమస్యలను గుర్తించడం తగిన చికిత్స పొందడం అవసరం. అలాగే నిద్రలేమి సిటీలో సర్వసాధారణమైపోయింది. ఇది జుట్టు పెరుగుదల వంటి శరీరపు సహజ ప్రక్రియలను నిరోధిస్తోంది. ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి. వ్యాధులుంటే.. నష్టమే.. థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు మాత్రమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత వంటివి కేశాలకు హాని చేస్తాయి. కాబట్టి అంతర్లీన ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. లక్ష్యసాధన కోసం పరుగుతో దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యంపై పడుతోంది. ఒత్తిడికి విరుగుడుగా ధ్యానం, యోగా బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. కారణాలెన్నో.. జాగ్రత్తలు తప్పనిసరి.. మన జుట్టులో 80శాతం ఎదిగే దశలో ఉంటే 12 నుంచి 13శాతం విశ్రాంతి దశ, మరో 7 నుంచి 8శాతం మృత దశలో ఉంటుంది. అనారోగ్యపు అలవాట్ల వల్ల గ్రోత్ దశలో ఉండాల్సిన 80శాతం 50 శాతానికి అంతకంటే తక్కువకు పడిపోయి డీలోజన్ ఫేజ్ అనే దశకు చేరి హెయిర్ ఫాల్ జరుగుతుంది. రోజుకు 60 నుంచి అత్యధికంగా 100దాకా వెంట్రుకలు ఊడటం సాధారణం కాగా.. ఈ సంఖ్య 200కి చేరితే తీవ్రమైన హెయిర్ఫాల్గా గుర్తిస్తాం. నివారణ కోసం సల్ఫేట్ ఫ్రీ షాంపూల వాడకం, వారానికి ఒక్కసారైనా హెయిర్ కండిషనర్ గానీ హెయిర్ మాస్క్ గానీ వాడటం అవసరం. అలాగే కాలుష్యం బారిన పడకుండా అవుట్డోర్ వెళ్లినప్పుడు మహిళలు చున్నీ, స్కార్ఫ్ మగవాళ్లైతే హెల్మెట్ వంటివి తప్పనిసరి. జాగ్రత్తలు తీసుకున్నా కేశాల ఆరోగ్యం సరిగా లేదంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. :::డా.జాన్వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ -
ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
-
అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కిస్తా: సీఎం రేవంత్
మూసీ పునరుజ్జీవాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. నాతో కలసిరాకపోతే రాయి కట్టి మూసీలో వేస్తా. బుల్డోజర్లకు అడ్డుపడతామంటున్న వాళ్లు.. వాళ్ల పేర్లు ఇవ్వండి. మా నల్లగొండ ప్రజలతో వచ్చి మీపైకి బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటా. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లారంగాలు ధైర్యముంటే తారీఖు చెప్పండి. మా వెంకన్న (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి)తో బుల్డోజర్ నడిపిస్తా. మా ఎమ్మెల్యే సామెల్‌తో జెండా ఊపిస్తా. ప్రధాని మోదీ సబర్మతి, గంగా నదులను బాగు చేసుకోవచ్చుగానీ మేం మూసీని బాగుచేసుకోవద్దా? నకిలీ బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. – సీఎం రేవంత్రెడ్డిసాక్షి, యాదాద్రి: ‘‘మూసీ పునరుజ్జీవ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తా. బిల్లా రంగాలు, చార్లెస్ శోభారాజ్‌లు కలిసి రావాలి. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం. సంగెం శివయ్య సంకల్పంతో మూసీ నదిని ప్రక్షాళన చేసి పునరుజ్జీవింపజేస్తాం’’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం సమీపంలో మూసీ నది వద్ద పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మూసీ పునరుజ్జీవ సభలో ప్రసంగించారు. వివరాలు సీఎం రేవంత్ మాటల్లోనే.. ‘‘ఒకనాడు మంచి నీటిని అందించిన మూసీ నది.. ఇప్పుడు మురికికూపంగా మారి విషాన్ని చిమ్ముతోంది. పాలకులు పగబట్టారా? లేక దేవుడు శాపంపెట్టాడా అని మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు. మూసీని పునరుజ్జీవింపజేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మూసీ పునరుజ్జీవనం కోసం మంచి సంకల్పం తీసుకున్నాను. ఇది నా జన్మదినం కాదు.. ఇక్కడికి రావడంతో నా జన్మధన్యమైంది. ఇక్కడ బతికే పరిస్థితి లేదు.. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ ప్రక్షాళన వద్దంటే చరిత్రహీనులుగా మిగులుతారు. మూసీ కాలుష్యంతో ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడి చెరువుల్లో చేపలు బతికే పరిస్థితి లేదు. ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు. చివరికి ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది. 40 ఏళ్ల క్రితం వరకు స్వచ్ఛమైన నీరు పారిన మూసీ నది వెంట పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇప్పుడు భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజలకు వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోంది. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలో లేదో ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదు. అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారు. బిల్లారంగాలు ప్రజలవైపు ఉంటారో, లేదో తేల్చుకోవాలి. మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టులకు సీఎంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ పాపం తగలక తప్పదు! కేసీఆర్.. నీ బిడ్డ మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే.. మూసీ పరీవాహక ప్రాంతాల బిడ్డల కాళ్లు చేతులు వంకర పోతుంటే నీకు పట్టదా? నీకు పాపం తగలక తప్పదు. నువ్వు కుక్కచావు చస్తావ్ కేసీఆర్. నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్.. మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావ్. నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు. నాకు డబ్బులు కావాలంటే నల్లగొండ జిల్లానే కావాలా? నువ్వు తెచ్చిన ధరణిలో అబ్రకదబ్ర చేస్తే కోట్లాది రూపాయలు రావా? మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది. ప్రక్షాళన చేయకపోతే నా జన్మ ఎందుకు? అణుబాంబు కంటే ప్రమాదం మూసీ ప్రాంతాల్లో మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేదు. ఒకవేళ గర్భం దాల్చినా అంగవైకల్యంతో పిల్లలు జన్మిస్తున్నారు. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరంగా మూసీ నది తయారైంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ అతిపెద్ద విస్ఫోటనాన్ని మూసీ రూపంలో ఎదుర్కోబోతోంది. మూసీ కాలుష్యం వల్ల ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పండే పరిస్థితి లేదు. గోదావరిని మూసీతో కలిపి మూసీ, ఈసీ వాగులను కృష్ణాతో అనుసంధానించే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లను పూర్తి చేస్తాం..’’అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ పర్యటన, యాత్ర ఇలా.. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో మూసీపై ఉన్న సంగెం–»ొల్లెపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. తొలుత మూసీ ఒడ్డున ఉన్న భీమలింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మూసీ పక్షాళన చేస్తానని సంకల్పం తీసుకున్నారు. మూసీ తీరం వెంట నడుచుకుంటూ వస్తూ నదిలో పారుతున్న నీటిని ఒక బాటిల్లోకి తీసుకున్నారు. బోటులో ఎక్కి నదిలో కొద్దిదూరం ప్రయాణం చేసి నీటిని పరిశీలించారు. ఒడ్డుకు చేరుకున్నాక సంగెం గ్రామం వైపు నుంచి బ్రిడ్జి మీదుగా భీమలింగం కత్వ వరకు సుమారు రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మత్స్యకారులు, రైతులు, వివిధ వర్గాల వారితో మాట్లాడారు. రూ.రెండు కోట్లతో సంగెం వద్ద ఉన్న భీమలింగశ్శ్వర ఆలయం వద్ద అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తిరిగి సంగెం గ్రామ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, మందుల సామేల్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మరు: మంత్రి కోమటిరెడ్డిసాక్షి, యాదాద్రి: తప్పుచేసినవారు ఎంతటి వారైనా జైలుకెళ్లాల్సిందేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవన సభలో ఆయన మాట్లాడారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధిలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. ఆ పార్టీల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను జైలుకు పంపిస్తే యోగా చేసి, పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్తున్నారని.. కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి పదేళ్లు సమయం ఇచ్చినా మూసీని ప్రక్షాళన చేయలేదని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవనం ఆరేళ్ల ప్రాజెక్టు అని.. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, రేవంత్‌రెడ్డినే తిరిగి సీఎం అవుతారని పేర్కొన్నారు. -
టపాసుల కాలుష్యంలో టాప్ ఫైవ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మహానగరాల్లో కాలుష్య మేఘాలు మరింత చిక్కబడుతున్నాయి. సాధారణ సమయంలో కూడా వాయు కాలుష్యం రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక పటాకుల పండుగ దీపావళి రోజు వాయు కాలుష్యం అన్ని హద్దులు దాటుతోంది. గత నెల 31న దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషంగా దీపావళి పండుగ జరుపుకొన్నారు. కానీ ఆరోజు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిందో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సర్వేలో తేలింది. మొదటి స్థానం ఢిల్లీదే దీపావళి రోజు నమోదైన వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్ నగరం బెంగళూరుతో కలిసి ఐదో స్థానంలో నిలిచింది. దీపావళి రోజు 24 గంటల్లో ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య వివరాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విడుదల చేసింది. పండుగ రోజు అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దీపావళి రోజు గ్రీన్ కాకర్స్ మినహా సాధారణ పటాకులు కాల్చటంపై నిషేధం ఉన్నా ఢిల్లీ మొదటి స్థానంలోనే నిలవటం గమనార్హం.దీపావళి రోజు ఢిల్లీలో ఏక్యూఐ 339 పాయింట్లుగా నమోదైంది. స్విస్ కంపెనీ ఐక్యూ ఏఐఆర్ ‘లైవ్ ర్యాంకింగ్ ఆఫ్ గ్లోబల్ సిటీస్ ఆన్ ఏక్యూఐ’నివేదిక ప్రకారం దీపావళి పండుగ మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను విశ్లేషించినపుడు ఢిల్లీ నగరం ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది. ఐక్యూ ఏఐఆర్ నివేదిక ప్రకారం» పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) ప్రామాణిక పాయింట్లపరంగా 30 పాయింట్లు దాటితే కాలుష్యకారకంగా పరిగణిస్తారు. » మనదేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయిలు జాతీయ సగటు కంటే రెండింతలు నమోదయ్యాయి. » పీఎం 2.5 (అతి సూక్ష్మస్థాయిలోని ధూళి క ణాలు–పీఎం 2.5) విషయానికొస్తే జాతీయ సగటు కంటే ఢిల్లీలో 2022లో 92.6 పాయింట్లు అధికంగా ఉండగా, 2023లో 102.1 పాయింట్లు అధికంగా నమోదైంది. జాతీయసగటు 2022లో 53.3 పాయింట్లు, 2023లో 54.4 పాయింట్లు మాత్రమే ఉన్నది. » పీఎం 2.5 2022లో ముంబైలో 46.7 పాయింట్లు, 2023లో 43.8 పాయింట్లు నమోదైంది. » కోల్‌కతాలో 2022లో 50.2, 2023లో 47.8 పాయింట్లు రికార్డయ్యింది. » హైదరాబాద్‌లో 2022లో 42.4 పీఎం 2.5 పాయింట్లు, 2023లో 39.9 పాయింట్లు నమోదైంది. » ప్రామాణికంగా చూస్తే పీఎం 10 స్థాయిలు (మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్) 60 పాయింట్లు దాటితే వాయు కాలుష్యకారకాలు పెరిగినట్టుగా భావించాలి. 2023–24 నాటికి ఏడాదికి 20 నుంచి 30 శాతం పీఎం 10 సాంద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించుకొన్నది. ఐతే సగటు వార్షిక పీఎం 10 స్థాయిలు 2023–24లో ఢిల్లీలో 208, ముంబైలో 94, కోల్‌కతాలో 94, అహ్మదాబాద్‌లో 98, పుణేలో 98, బెంగళూరులో 70, హైదరాబాద్‌లో 81, చెన్నైలో 63 పాయింట్లు రికార్డయ్యింది. -
ఢిల్లీలో డేంజర్ బెల్స్.. గాలి పీల్చితే సమస్యలే
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఆదివారం(నవంబర్ 3) ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 500 పాయింట్లుగా నమోదై కాలుష్య తీవ్రత రికార్డు స్థాయికి వెళ్లింది. కాలుష్యానికి తోడు ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఏక్యూఐ 507 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏక్యూఐ 500 పాయింట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి 65 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే శనివారం రాత్రి 9 గంటలకు 327గా ఉన్న ఏక్యూఐ కేవలం 12 గంటల్లో ఆదివారం ఉదయానికల్లా 500 పాయింట్లు దాటడం ఢిల్లీ వాసులను కలవరపరుస్తోంది.ఇదీ చదవండి: విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ -
టపాసుల ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన పొగ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం(నవంబర్ 1) తెల్లవారుజామున పొగ కమ్మేసింది. గురువారం రాత్రి దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ టపాసులు కాల్చారు. దీంతో ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది. ఢిల్లీ ఎన్సీఆర్లోని నోయిడా, గురుగ్రామ్‌లో వాయు కాలుష్యం ఒక్కసారిగా ఒక్కసారిగా పెరిగిపోయింది. రోడ్లపై విజిబిలిటీ తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)పై వాయునాణ్యత శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 395(వెరీపూర్)గా నమోదైంది. ఈ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీతో పాటు పొరుగునే ఉన్న పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ వాయునాణ్యత ఒక్కసారిగా క్షీణించింది.#WATCH | Delhi: A thin layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.As per the CPCB, the AQI of the area is 317, in the 'very poor' category. (Visuals from India Gate) pic.twitter.com/nKvFMOPZrd— ANI (@ANI) November 1, 2024 కాగా, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీ కాలుష్యం శీతాకాలం ప్రారంభమవగానే పెరిగిపోతోంది. పంట వ్యర్థాలకు తోడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే డీజిల్ వాహనాలు కూడా కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం దీపావళి రోజు టపాసులను కాల్చడాన్ని నిషేధించింది. అయితే ఢిల్లీ వాసులు ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా టపాసులు కాల్చి పండుగ జరుపుకోవడంతో కాలుష్యం పెరిగిపోయింది. ఇదీ చదవండి: బాణసంచా కాల్చేవారిపై పోలీసుల దృష్టి -
Happy Diwali: కాలుష్యరహిత దీపావళి.. ఈ టిప్స్ పాటిద్దాం!
వెలుగుల పండుగ దీపావళి వచ్చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సన్నద్ధ మవు తున్నారు. ఈ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రేమికులు, నిపుణులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దేశంలోని పలు నగరాలలో దీపావళి టపాసులను కాల్చడంపై నిషేధం అమల్లో ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తారా స్థాయికి చేరింది. దీంతో కాలుష్యం నుంచి జనావళిని రక్షించేందుకు టపాసులను నిషేధించారు. అలాగే కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పాక్షిక నిషేధం, ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరి కాలుష్యాన్ని నివారించాలంటే ఏం చేయాలి? కాలుష్యం బారిన పడకుండా టపాసులను కాల్చడం ఎలా? తెలుసుకుందాం.టపాసులు కాల్చని, బాంబుల మోత మోగని దీపావళి ఏం దీపావళి అనుకుంటున్నారా? అవును ఇలా అనిపించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి టపాసులను కాల్చడానికి అలవాటు పడ్డాం. అందులో ఆనందాన్ని అనుభవించాం. గతంలో పర్యావరణ హితమైన టపాసులను ఇంట్లోనే తయారు చేసుకునే వారు. మరిపుడు శబ్దం కంటే వెలుగులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కాకరపువ్వొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, చిన్ని చిన్న తాటాకు టపాసులను కాల్చే వారు. అదీ కూడా చాలా పరిమితంగా ఉండేది. దీంతో దోమలు, క్రిములు,కీటకాలు నాశనమయ్యేవి. కానీ రాను రాను ఈ పరిస్థితులు మారాయి. రసాయన మిళితమైన, పెద్ద పెద్ద శబ్దాలతో చెవులు చిల్లలు పడేలా బాంబులు వచ్చి చేరాయి. భయంకరమైన, ప్రమాదకరమైన రసాయన పొగ వ్యాపింప చేసే టపాసులు ఆకర్షణీయంగా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అర్థరాత్రి తర్వాత కూడా అపార్ట్మెంట్లలో భారీఎత్తున దీపావళి టపాసులను కాల్చడం అలవాటుగా మారిపోయింది. దీని వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అలాగే పశుపక్ష్యాదులకు ప్రమాదంకరంగా మారింది.మరి ఏం చేయాలి?భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని, కాలుష్యం కాటేయని ప్రకృతిని అందించాలంటే కొన్ని జాగ్రత్తలు, నియంత్రణలు తప్పనిసరి. అందరం విధిగా కొన్ని విధానాలను అనుసరించక తప్పదు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం స్థాయి పెరుగుతుంది అనడానికి దీపావళి తరువాత వచ్చిన కాలుష్యం స్తాయి లెక్కలే నిదర్శనం. పర్యావరణహితమైన గ్రీన్ టపాసులనే వాడాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ పొగ, ఎక్కువ శబ్దం వచ్చేవాటికి దూరంగా ఉండాలివెలుగులు జిమ్మే మతాబులు, చిచ్చు బుడ్లను ఎంచుకోవాలి.అర్థరాత్రి దాకా కాకుండా, కొంత సమయానికే మనల్ని మనం నియంత్రించుకోవాలి. టపాసులను బడ్జెట్‌ను సగానికి సగం కోత పెట్టుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె దీపాలే శ్రేష్టం. అవే మంగళకరం, శుభప్రదం అని గమనించాలి.ఇతర జాగ్రత్తలుటపాసులు కాల్చేటపుడు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దగ్గరుండి కాల్పించాలి. అలాగే సిల్క్,పట్టు దుస్తులను పొద్దున్నుంచి వసుకున్నా, సాయంత్రం వేళ టపాసులనుకాల్చేటపుడు మాత్రం కాటన్ దుస్తులను మాత్రమే వాడాలి.ఇరుకు రోడ్లు, బాల్కనీల్లో కాకుండా, కాస్త విశాలమైన ప్రదేశాల్లో టపాసులు కాల్చుకోవాలి.టపాసులు కాల్చుకోవడం అయిపోయిన తరువాత, చేతులను,కాళ్లు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.ఇంట్లో శిశవులు, చిన్న పిల్లలు ఉంటే శబ్దాలు విని భయపడకుండా చూసుకోవాలి.అసలే శీతాకాలం, పైగా కాలుష్యంతో శ్వాస కోస సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే అందరూ విధిగా మాస్క్‌లను ధరించాలి.అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. సౌకర్యం ఉన్నవారుఇంట్లో గాలి నాణ్యతకోసం ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి.వాయు కాలుష్యం ఇంట్లోని గాలిపై కూడా ప్రభావం చూపుతుంది. దీపావళి సందర్భంగా అధిక స్థాయి కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. పుష్కలంగా నీరు త్రాగాలి.కాలుష్యం ప్రభావం కనపించకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యంలేని శబ్దాలతో భయపెట్టని ఆనంద దీపావళిని జరుపుకుందాం. మన బిడ్డలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. -
ఢిల్లీ.. 72 గంటలు డేంజర్
న్యూఢిల్లీ: రాబోయే 72 గంటలు దేశ రాజధాని ఢిల్లీకి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొగమంచు కమ్ముకుంటోంది. వాయు నాణ్యత సూచిక ప్రతిరోజూ 300 దాటుతోంది. ఈరోజు (అక్టోబరు 29) ఉదయం ఏక్యూఐ 274గా నమోదయ్యింది. ఢిల్లీలో గాలి నాణ్యత రానున్న మూడు రోజుల్లో మరింత విషపూరితం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi: A thin layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.(Visuals from India Gate) pic.twitter.com/XeCku3Hu1k— ANI (@ANI) October 29, 2024ఇప్పటి వరకు వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల వాయుకాలుష్యం పెరిగిందని, అయితే రానున్న రోజుల్లో పటాకులు పేల్చడం వల్ల వాయుకాలుష్యం పెరగనుందని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం పటాకులను నిషేధించినప్పటికీ కాలుష్యం పెరిగే అవకాశాలున్నాయి. రాజధానిలో గ్రేప్-1, గ్రేప్-2 నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు.#WATCH | Delhi | AQI around Lodhi Road and surrounding areas recorded 255, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/rYZboXTtYN— ANI (@ANI) October 29, 2024సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాలోని వివరాల ప్రకారం సోమవారం ఆగ్నేయ గాలుల కారణంగా ఢిల్లీ కాలుష్య స్థాయి కాస్త మెరుగుపడింది. అయితే దీపావళి నాటికి ఢిల్లీలో రెట్టింపు కాలుష్యం ఏర్పడే అవకాశాలున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 304 (చాలా పేలవంగా ఉంది). సాయంత్రం 6 గంటలకు 299గా ఉండగా, రాత్రి 10 గంటలకు 288కి చేరుకుంది. #WATCH | Delhi | AQI around ITO and surrounding areas recorded 261, categorised as 'Poor' according to the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/FvG2oZGgJB— ANI (@ANI) October 29, 2024ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
ఢిల్లీలో నిర్మాణ పనులపై నిషేధం..ఎందుకంటే
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు(గ్రాప్) రెండో దశకు చేరుకున్నాయి. మంగళవారం(అక్టోబర్22) ఉదయం 8 గంటల నుంచి ఢిల్లీలో నిర్మాణరంగ పనులు,డీజిల్ జనరేటర్లపై నిషేధం అమలు చేయనున్నారు. ఢిల్లీలో తాజాగా వాయు నాణ్యత 301-400 పాయింట్ల మధ్య పడిపోవడంతో గ్రాప్ రెండో దశ చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు. గ్రాప్-2లో భాగంగా రోడ్లను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడంతో పాటు రోడ్లపై దుమ్ము లేవకుండా నీళ్లు చళ్లనున్నారు. కాగా, ఢిల్లీ కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్సే కారణమని సీఎం అతిషి ఇప్పటికే ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా,ఉత్తరప్రదేశ్‌లు ఢిల్లీని కాలుష్యమయంగా మారుస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఆమ్ఆద్మీపార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ మాత్రం కాలుష్యం కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇదీ చదవండి: కిలో ఉల్లికి రూ.35.. ఎక్కడంటే -
బీజేపీ డర్టీ పాలిటిక్స్ వల్లే కాలుష్యం: ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్స్ కారణమని ఢిల్లీ సీఎం అతిషి అ న్నారు. నగరంలో గాలి కాలుష్యం పెరగడం,యమునా నది నీటిపై రసాయనాల నురగ కనబడటంపై ఆమె ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి బీజేపీ పాలిత హర్యానా,ఉత్తరప్రదేశ్లే కారణమని ఆరోపించారు.హర్యానాలో పంట వ్యర్థాలు కాల్చడం,ఇటుక బట్టీలు,యూపీ నుంచి వేల సంఖ్యలో డీజిల్ బస్సులు రావడం,నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని(ఎన్సీఆర్) థర్మల్ పవర్ ప్లాంట్లు కాలుష్యానికి కారణాలని అతిషి చెప్పారు.యమునా నదిలోకి వదిలే పారిశ్రామిక జలాలను శుద్ధి చేయకపోవడం వల్లే నదిపై నురగ ఏర్పడుతోందన్నారు. యమునా నది ఉపరితలంపై ఏర్పడిన నురగను ఆదివారం రాత్రి నుంచి తొలగిస్తామని తెలిపారు.అయితే ఢిల్లీ పొరుగున ఉన్న ఆప్ పార్టీ పాలిత పంజాబ్ మాత్రం ఢిల్లీ కాలుష్యానికి ఏ మాత్రం కారణమవడం లేదని అతిషి చెప్పడం విశేషం.ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ పేలుడు.. పోలీసులు అలర్ట్ -
హస్తినలో యమునా తీరం... కాలుష్య కాసారం!
చూసేందుకు పాల నురగలా తళతళా మెరిసిపోతూ కని్పస్తోంది కదూ! కానీ ఇదంతా దేశ రాజధానిలో యమునా నదిని నిలువెల్లా కబళించిన కాలుష్యం తాలూకు నురగ! ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నురగలో అమోనియా, పాస్పేట్ వంటివి ప్రమాదకర పాళ్లలో ఉన్నట్టు నిపుణులు తేల్చారు. ఇది శ్వాసతో పాటు పలురకాలైన చర్మ సమస్యలకు దారి తీస్తుందని వివరించారు. యమునలో కాలుష్యం కొంతకాలంగా ప్రమాదకర స్థాయికి పెరిగిపోతున్నా వర్షాకాలంలో ఈ స్థాయి నురగను ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ పొడవునా యమునలో కాలుష్యానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్న 13 హాట్స్పాట్లను గుర్తించినట్టు రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. దుమ్ము, ధూళితో పాటు నురగను నియంత్రించేందుకు 80 చోట్ల యాంటీ స్మాగ్ గన్స్ మోహరిస్తామన్నారు. కానీ మాటలే తప్ప యమునలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. -
కాలుష్య కోరల్లో యమునా నది
-
కంపు చుట్టూ మా బతుకులు కనువిప్పని ప్రభుత్వాలు
-
పచ్చని గ్రామాలపై పరిశ్రమల పంజా అత్యంత ప్రమాదకరంగా గడ్డపోతారం
-
కాలుష్యం కోరల్లో ఢిల్లీ.. బాణా సంచాపై నిషేధం
ఢిల్లీ : దీపావళికి ముందే ఢిల్లీలో వాయి కాలుష్యం భారీగా పెరిగింది. ఢిల్లీలో ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ 221గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసుల కాల్చివేతపై నిషేధం విధించింది.అంతేకాదు, అన్నీ రకాల బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు నిర్వహించకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు కొత్త నిబంధనలు వెంటనే అమ్మల్లోకి తెచ్చేలా కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.దేశ వ్యాప్తంగా పండుగ సీజన్ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) ఢిల్లీలో గాలి కాలుష్యంపై దృష్టి సారించింది. పండుగ సీజన్లో ముఖ్యంగా నిన్నటి దసరా వరకు గాలి నాణ్యత భారీగా తగ్గినట్లు గుర్తించింది.అదే సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విశ్లేషించింది. ఆదివారం మద్యాహ్నం 4గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్ బోర్డ్ బాణా సంచాపై నిషేధం విధించింది. దీంతో ఢిల్లీ వాసులు బాణా సంచా కాల్చకుండానే ఈ దీపావళి జరుపుకోనున్నారు.గాలిలో నాణ్యత ఎలా ఉంటే మంచిది..సాధారణ గాలి ఏక్యూఐ 0–50 మంచి గాలి.. ఇబ్బంది లేదు.51 – 100 పర్వాలేదు.. చిన్న చిన్న స్థాయిలో రోగాలు101 – 150 శరీరంపై చిన్నదద్దుర్లు, ఎలర్జీ, నీరసం151 – 200 ఊపిరితిత్తులు, గుండె సమస్యలు వస్తాయి, కళ్లు తిరుగుతాయి.201 – 300 ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోతాయి. కిడ్నీలపై ప్రభావం వాటి సమస్యలు300+ అయితే ఆ ప్రాంత గాలి పిలిస్తే నిత్యం ప్రమాదమే.. అనేక రోగాలబారిన పడతారు. -
అమ్మో.. ప్లాస్టిక్ భూతం!
సాక్షి, అమరావతి: భారత్‌ను ప్లాస్టిక్ భూతం భయపెడు తోంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తోంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే ప్లాస్టిక్ ఉద్గారాలకు భారత్ నిలయంగా మారుతోంది. నేచర్ జర్నల్‌లో ప్రచురించిన లీడ్స్ విశ్వవిద్యాలయ (ఇంగ్లడ్) బృందం అధ్యయనం ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యాలు లేకపోవడంతో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో చైనాను దాటుకుని భారత్ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో 2 లక్షల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌ను నింపొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే 5.21 కోట్ల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ కాకపోవడంతో ఎక్కువ భాగం పర్యావరణంలోకి ప్రవేశించి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నట్టు నివేదిక చెబుతోంది. ఇందులో దాదాపు ఐదో వంతు (18 శాతం) భారత్ నుంచే వస్తుండటం గమనార్హం.ఈ క్రమంలోనే చైనాలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ అక్కడి రీసైక్లింగ్ వ్యవస్థ ద్వారా వాటిని నియంత్రిస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. భారత్ తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనా ప్లాస్టిక్ ఉద్గారాల్లో పోటీపడుతున్నాయి. యూకే మాత్రం 4 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో 135వ ర్యాంకు పొందింది.ఏటా వివిధ దేశాలు ఉత్పత్తి చేస్తూ నిర్వహణకు నోచుకోని ప్లాస్టిక్ వ్యర్థాలు (లక్షల టన్నుల్లో)ఆరోగ్యానికి ముప్పుప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారకాలకు కారణం అవుతోంది. జనాభా పెరుగుదలకు తోడు ఆదాయ వనరులు పెరగడంతో విలాసాల జీవితం దగ్గరవుతోంది. ఫలితంగా ఎక్కువ వ్యర్థాలు బయటకొస్తున్నాయి. దీంతో దేశంలో వ్యర్థాల నిర్వహణను చేపట్టడం సవాల్‌గా మారింది. దేశంలో డంపింగ్ యార్డుల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ఇక్కడ సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.12 కేజీల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.అయితే, దేశంలో 95 శాతం వ్యర్థాలను సేకరిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, విచ్చలవిడిగా తగలబెడుతున్న వ్యర్థాలు, అనధికారికి రీసైక్లింగ్‌లోని వ్యర్థాలను లెక్కించడం లేదని అధ్యయనం పేర్కొనడం గమనార్హం. మరోవైపు ప్లాస్టిక్‌ను బహిరంగంగా కాల్చడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత రసాయనాలు విడుదల అవుతున్నాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కేన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. 20 దేశాల నుంచే 69 శాతం వ్యర్థాలుప్రపంచంలో 69 శాతం వ్యర్థాలు 20 దేశాల నుంచే వస్తున్నట్టు అధ్యయనం నమోదు చేసింది. ఇందులో 4 తక్కువ ఆదాయ, 9 తక్కువ మధ్య ఆదాయ, 7 ఉన్నత మధ్య ఆదాయ దేశాలున్నాయి. అధికాదాయ దేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రపంచంలో రీసైక్లింగ్ చేయని ప్లాస్టిక్‌లో దాదాపు 43 శాతం చెత్తగా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. అయితే.. అత్యంత ప్లాస్టిక్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంటే.. అక్కడ సగటున రోజులో ఒక వ్యక్తి ఉత్పత్తి చేస్తున్న వ్యవర్థాలు తక్కువగా ఉండటంతో 153వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ 127వ స్థానంలో ఉంది. -
ప్రశాంతంగా, కంటికి హాయిగా : బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్
అపార్టమెంట్లలో పచ్చని ప్రకృతి శోభ ఉండేలా, శుభ్రమైన గాలికోసం ఇంట్లోమొక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్. వీటినే ఇండోర్ ప్లాంట్లు అని అంటారు. ఇలాంటి మొక్కలు ఇంటి అందాన్ని ఇనుమడింపజేయడం మాత్రమే కాదు స్వచ్ఛమైన గాలితో కంటికి ఆహ్లాదంగా ఉంటూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇండోర్ ప్లాంట్లు కలిగి ఉంటాయి. మరి అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందామా!పర్యావరణహితమైన ఆరోగ్యకరమైన ఇండోర్ ప్లాంట్లతో ఇంట్లోని గాలి నాణ్యత మెరుగు పడుతుంది. కాలుష్యానికి చెక్ చెప్పవచ్చు. ఒత్తిడి లేకుండా మనసుకు హాయిగా ఉంటుంది. పచ్చని ఇండోర్ వల్ల ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయిస్నేక్ ప్లాంట్అత్తగారి నాలుక అని కూడా పిలుస్తారు. ఇది రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. బెడ్రూమ్లో ఈ మొక్కను పెట్టుకోవచ్చు. గాలిలోని ఫార్మాల్డిహైడ్, జిలీన్, బెంజీన్, టోలున్, ట్రైక్లోరోఎథిలిన్ లాంటి వాటిని ఫిల్టర్ చేస్తుందిఅలోవెరాఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న అలోవెరా ఇండోర్ ప్లాంట్‌గా బెంజీన్, ఫార్మాల్డిహైడ్‌ను ఫిల్టర్ చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చుకుంటుంది. తొమ్మిది ఎయిర్ ప్యూరిఫయర్లు చేసిన పనితో దీని సామర్థ్యం సమానమని చెబుతారు. కొద్దిగా ఎండ, కొద్దిపాటి నీళ్లతో దీన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. కలబంద జెల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి.పీస్ లిల్లీతెల్లటి పువ్వులతో అందంగా కనిపించే ఈ మొక్క కూడా గాలిలో ఉండే కొన్ని విష రసాయనాలను శుద్ధి చేస్తుంది. ఈ సూపర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఇండోర్ ప్లాంట్‌ను ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ , ఇతర గృహోపకరణాల ద్వారా విడుదలయ్యే ఇండోర్ కాలుష్యాలను సమర్థవంతంగా తొలగించగల క్లెన్సర్‌లలో ఒకటి.కాలుష్య కారకాలను తొలగించే విషయంలో ఇది పవర్‌హౌస్. స్పైడర్ ప్లాంట్స్పైడర్ ప్లాంట్‌ను కూడా ఇంట్లో చక్కగా చేర్చుకోవచ్చు, ప్రత్యేకించి పెంపుడు జంతువులకు విషపూరితం కాని కొన్ని మొక్కలలో ఇది ఒకటి. కార్బన్ మోనాక్సైడ్,జిలీన్తో సహా టాక్సిన్స్‌తో నివారిస్తుంది.వెదురు మొక్కబటర్ఫ్లై పామ్ లేదా అరేకా పామ్ అని పిలిచే ఈ వెదురు మొక్క భారతదేశంలోని అత్యుత్తమ గాలిని శుద్ధి చేసే మొక్కలలో ఒకటి. ఇది గాలి శుద్దీకరణకు మించిన అదనపు ప్రయోజనంగా, ఇది సహజ హ్యూమిడిఫైయర్ కూడా. ఇది పొడి శీతాకాలంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.పోథోస్ లేదా మనీ ప్లాంట్: డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. ఇంట్లోని టాక్సిన్స్ తొలగించడంలో ప్రసిద్ధి చెందింది, ప్రతి 1-2 వారాలకు ఒకసారి నీళ్లు పోస్తే చాలు. ఇందులో చాలా రకాలున్నాయి.జెడ్ జెడ్ ప్లాంట్ తక్కువ-కాంతిలో కూడా చక్కగా పెరుగుతుంది. జిలీన్, టోలున్ , బెంజీన్ వంటి టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దీన్ని ఆఫీసుల్లో కూడా పెట్టుకోవచ్చు. వీటితోపాటు స్పైడర్ ప్లాంట్ (క్లోరోఫైటమ్ కోమోసమ్), ఫెర్న్ మొక్కలు కూడా ఈ కోవలోకే వస్తాయి. -
మట్టి గణపతితో పుణ్యం, ఫలం : గణపతి బప్పా మోరియా!
గణనాధుని పూజించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగువారి తొలి పండుగ, ఆది దేవుడైన గణపతి తొమ్మిది రోజుల పాటు పూజలందుకోనున్నాడు. వినాయక చవితి వేడుకలకు వాడ వాడలూ వినాయక మండపాలతో సిద్ధమై పోతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎక్కడ చూసినా బాల గణపయ్యు, బొజ్జ గణపయ్యలు రక రకాల ఆకారాల్లో, సైజుల్లో కొలువు దీరాయి. నవరాత్రి ఉత్సవాలకు మేం రెడీ.. రారమ్మంటూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మట్టి ప్రతిమలనే పూజించాలని పర్యావరణ పరిరక్షకులు, నిపుణులు సూచిస్తున్నారు. మట్టి గణపతే, మేలైన గణపతి అని నినదిస్తున్నారు. ఈ మేరకు పలు స్వచ్ఛంద సంస్థలు గత కొన్నేళ్లుగా ప్రచారాన్ని చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.వినాయక మండపాల్లో అందం, ఆకర్షణ కోసం రంగురంగుల భారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకే చాలామంది మొగ్గు చూపుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అనే ట్రెండ్ ఇటీవలి కాలంలో బాగా వ్యాపిస్తోంది. ఈ ధోరణే పర్యావరణానికి పెద్ద సమస్యగా మారుతోంది. నవరాత్రులు, భక్తితో పూజించడమే ప్రామాణికమని పండితులు సైతం చెబుతున్నారు. పంచభూతాల సమాహారమైన మట్టి గణపతిని పూజించడం అంటే పంచభూతాలు, అధిష్టాన దేవతలు పూజిస్తున్నామని అర్థమని పండితులు చెబుతున్నమాట. పర్యావరణహితంగా వేడుకలు నిర్వహిస్తే ప్రజలను, పర్యావరణాన్ని రక్షించుకున్న వారమవుతామని పిలుపునిస్తున్నారు.పీఓపీ విగ్రహాలతో అన్నీ అనర్థాలేప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల ద్వారా పర్యావరణానికి తీరని ముప్పు అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. విగ్రహాల అలంకరణకు వాడే రసాయన రంగులు మరింత ప్రమాదం కరమంటున్నారు. ఇవి నీటిని కలుషితం చేయడమే కాదు, అనేక రకాల రోగాలు మూలం అవుతాయి. రసాయ రంగులతో నిండిన విగ్రహాలు చెరువులు, వాగులు, నదుల్లో నిమజ్జనం చేస్తే అవి త్వరగా కరగవు. ఈ నీటిని తాగిన పశువులు, ఇతర జీవుల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రసాయనాలు కలిసిన నీటితో నరాలపై ప్రభావం చూపి కేన్సర్ వ్యాధికి దారితీస్తుంది. అనేక చర్మవ్యాధులు సైతం వ్యాప్తి చెందుతాయి. ఈ నీరు పంట పొలాల్లో చేరితే భూసారం దెబ్బతింటుంది. ఆహార ఉత్పత్తులు కలుషితం అవుతాయి. అంతేకాదు పూజకు వాడిన పువ్వులను కూడా వృధాగా కాలువల్లో పారవేయడం కాకుండా, రీసైకిల్ చేయడంగానీ, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి వినియోగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పీఓపీలో సల్ఫర్, జిప్సం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పదార్థాలు ఉంటాయి. రంగుల్లో పాదరసం, కాడ్మియం, ఆర్సెనిక్, సీసం, కార్బన్ ఉన్నాయి.వీటిని నీటిలో నిమజ్జనం చేస్తే అవి విషపూరితం అవుతాయి. జలచరాలు ,వృక్షసంపదను చంపుతుంది. రసాయన రంగులతో అలర్జీ: ఈ రంగులు, మెరుపులు ఊపిరితిత్తులకు, కళ్లకు హాని కలిగిస్తాయి. వీటిని పీల్చినప్పుడు ఒక్కోసారి తీవ్రమైన ఆగ్నిలొచ్చే ప్రమాదం కూడా ఉంది.మట్టి గణపతే మహాగణపతిపురాణాల ప్రకారం వినాయకుడిని పార్వతీదేవి మేని నలుగు మట్టితోనే తయారు చేసిందట. అందుకే మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పూజించడం మంచిది. . సహజ సిద్ధంగా పొలాల్లో లభించే బంక మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసుకోవాలి. ఇవి నీటిలో ఆరు గంటల్లో పూర్తిగా ,సులభంగా కరిగిపోతాయి, అటు పశు పశుపక్ష్యాదులకు, పంటలకు ఎలాంటి నష్టం ఉండదు. అలాగే సహజసిద్ధమైన చెట్ల ఆకులు, బెరడుతో తయారు చేసే రంగులను మట్టి బొమ్మలకు అద్ది మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు.తద్వారా పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాం. అంతేకాదు, గణనాథుడిని పూజించే 21 రకాల పూజా పత్రి కూడా మట్టి నుంచే వస్తాయి కనుక మట్టిలో కలిసి, భూమిని సారవంతం చేస్తాయి.మట్టి గణపతినే ప్రతిష్టిద్దాం..జైబోలో గణేష్ మహారాజ్ కీ అంటూ నినదిద్దాం! తొలి పూజలందుకునే విఘ్న నాయకా ఈ సర్వజగత్తునూ కాపాడు తండ్రీ! అని మనసారా మొక్కుకుందాం! -
కాలుష్య కోరల్లో కుత్బుల్లాపూర్
-
తగ్గిన కాలుష్యం.. పెరిగిన ఆయుర్దాయం!
న్యూఢిల్లీ: భారత్‌లో 2022 ఏడాదిలో గాలిలో సూక్ష్మ ధూళికణాల గాఢత 19.3 శాతం తగ్గడంతో వాయునాణ్యత స్వల్పంగా మెరుగుపడిందని అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపీఐసీ) ప్రకటించింది. ఈ మేరకు రూపొందించిన ‘వాయు నాణ్యతా జీవన సూచీ–2024’నివేదికను ఈపీఐసీ తాజాగా వెల్లడించింది. అయితే ఇప్పటికీ భారత్‌లో వాయుకాలుష్యం అధికంగా ఉందని, తగ్గించుకోకపోతే ప్రజల ఆయుర్దాయం తగ్గక తప్పదని హెచ్చరించింది. గాలిలో ఘనపు మీటర్‌కు 5 మైక్రోగ్రాముల మేరకే 2.5స్థాయి సూక్ష్మధూళి కణాలుండాలి. అంతకుమించి ఉండి, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాలను అందుకోలేకపోతే భారత్‌లో ప్రజల ఆయుర్దాయం 3.6 ఏళ్లు తగ్గే ప్రమాదముందని నివేదిక హెచ్చరించింది. 2022లో 2.5స్థాయి సూక్ష్మధూళి కణాలు తగ్గడానికి అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉష్ణ పరిస్థితులు కారణమని నివేదిక విశ్లేషించింది. పశి్చమబెంగాల్, జార్ఖండ్‌లలో ఈ వాయు కాలుష్య తగ్గుదల కనిపించింది. ‘‘భారత్ అంతటా వాయుకాలుష్యం తగ్గితే ఢిల్లీలో ప్రజల ఆయుర్దాయం 7.8 ఏళ్లు పెరగొచ్చు. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోలేకపోతే మాత్రం ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం 11.9 ఏళ్లు తగ్గవచ్చు. కాలుష్యం ఇలాగే కొనసాగినా, భారత్ నిర్దేశించుకున్న 2.5 స్థాయి వాయు నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయినా 8.5 ఏళ్లు క్షీణిస్తుంది’’ అని నివేదిక పేర్కొనడం విశేషం. పశి్చమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో వాయునాణ్యత పెరిగితే అక్కడి వారి ఆయుర్దాయం 3.6 ఏళ్లు ఎక్కువ అవుతుందని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో వాయకాలుష్యం అధికంగా ఉంటే 2.9 ఏళ్ల ఆయుర్దాయం తగ్గనుంది. నగరాల సమీప జిల్లాలతో పోలిస్తే దూరంగా ఉన్న జిల్లాల్లో 2017తో పోలిస్తే 2022లో కాలుష్యం 18.8 శాతం తగ్గింది. దీంతో 44.67 కోట్ల మంది ఆయుర్దాయం 10.8 నెలలు పెరిగింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్ వినూత్న విధానాలను అవలంబిస్తోందని నివేదిక పేర్కొంది. 2019లో గుజరాత్ తొలిసారిగా వీటిని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సూరత్‌లో కాలుష్యం 20–30 శాతం తగ్గింది. నివాసప్రాంతాల్లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు, వంటచెరకు వాడకం తగ్గించడానికి కేంద్రం ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలుచేస్తుండటాన్ని నివేదిక ప్రస్తావించింది. -
28 ఏళ్లకే క్యాన్సర్
సాక్షి, అమరావతి: మానవ మనుగడకు ఆధారమైన వాయువు పరుగులు పెడుతున్న ప్రస్తుత పారిశ్రామిక యుగంలో స్వచ్ఛతను కోల్పోతోంది. ఆయుష్షును పెంచాల్సిన స్థితి నుంచి ఆయువు తీసే దశకు చేరింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ధూమపానమే ఇందుకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. కానీ జీవితంలో ఎన్నడూ ధూమపానం చేయని వ్యక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో దీని బారిన పడుతున్నారని, దీనికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌కు చెందిన నిపుణులు, పరిశోధకులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై చేపట్టిన అధ్యయనాన్ని ఇటీవల లాన్సెట్ ఈ–క్లినికల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. ఆ అధ్యయనం ప్రకారం పాశ్యాత్య దేశాల కంటే పదేళ్ల ముందే భారత్‌లో ధూమపానం అలవాటు లేని వారిపై ఈ జబ్బు ప్రభావం చూపుతోంది. ఏపీలో ఏటా 70 వేలకు పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. 2025 నాటికి గణనీయంగా పెరుగుదల దేశంలో వ్యాధి సంభవించే రేటు 1990లో ఒక లక్ష జనాభాకు 6.62 శాతం ఉండగా 2019 నాటికి 7.7 శాతానికి చేరింది. 2025 నాటికి పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యం కారణంగా ఈ వ్యాధి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు ప్రజల జీవనం వాయుకాలుష్య కారకాల మధ్యే సాగడంతో దేశంలో కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. కాలుష్య దేశంగా భారత్ అధ్యయనంలో వైద్య నిపుణులు 2022లో ప్రపంచ వాయు నాణ్యత నివేదికను ఉటంకించారు. ⇒ ఈ నివేదిక ప్రకారం క్యూబిక్ మీటర్‌కు సగటున 53.3 మైక్రోగ్రాముల పీఎం 2.5 సాంద్రతతో భారత్ ఎనిమిదో అత్యంత వాయు కాలుష్య దేశంగా నిలిచింది. ⇒ 2023లో మూడవ అత్యంత వాయు కాలుష్య దేశంగా ఆవిర్భవించింది. ⇒ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 భారత్‌లోనే ఉన్నట్లు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో స్పష్టం చేసింది. ఇంటా, బయట జాగ్రత్తలు పాటించాలి ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణాల్లో కాలుష్యం ఒకటి. పొల్యూషన్‌ను ఇండోర్, అవుట్డోర్ అని రెండు విధాలుగా పరిగణించాలి. అవుట్ డోర్ పొల్యూషన్‌కు ఎక్కువగా పురుషులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాహనాల నుంచి వెలువడే డీజిల్, పెట్రోల్ అన్బార్న్ ఉద్గారాలు గాలిలో కలుస్తుంటాయి, వీటితో పాటు సల్ఫర్ డయాక్సైడ్, ఇతర ఉద్గారాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుంచి వెలువడే దుమ్ము, ధూళి గాలిలో ఉంటాయి. వీటిని పీల్చడం ఆరోగ్యానికి హానికరం. ప్రస్తుత రోజుల్లో వాహనాల రద్దీ బాగా పెరిగింది. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లు, ఇతర కారణాలతో ఎక్కువ సేపు నిల్చోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో మాస్క్ వాడటం తప్పనిసరి. అదే విధంగా వీలైనంత వరకూ కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఇక ఇంట్లో వంటింటి నుంచి వెలువడే పొగ నుంచి మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వంటింటిలోకి గాలీ, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా ఎయిర్ ఎక్స్ట్రాక్టర్లను అమర్చుకోవడం ఉత్తమం. – డాక్టర్ రఘు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, గుంటూరు -
జల సంక్షోభం ముంచుకొస్తోంది!
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడమే కాక.. వ్యర్థజలం మురుగునీటిని శుభ్రపరిచి పునర్వినియోగంలోకి తేకపోయినట్లయితే ప్రపంచం మొత్తం జల సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (యూఎన్‌యూ) హెచ్చరించింది. ఈ మేరకు ప్రపంచ జలభద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనాసహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది (72 శాతం)ని నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి.పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు తాగునీళ్లు దొరకడం కష్టమేనని, జలసంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలిచావులు పెరిగే అవకాశముందని కూడ నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో సుమారు వంద కోట్ల మంది (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో 195 దేశాలుండగా.. ఇందులో 193 దేశాలకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది.ప్రజల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి సూచికలను ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. ఇందులో ప్రధానమైనది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం (ఒక మనిíÙకి రోజుకు కనీసం 50 లీటర్ల పరిశుభ్రమైన నీరు). ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఈ లక్ష్యంపై ఐఎన్‌యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జలభద్రత నివేదిక (గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్)ను ఇటీవల విడుదల చేసింది.నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ..కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే..⇒ పపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత నానాటికీ తీవ్రమవుతోంది. ఇది భూతాపాన్ని పెంచుతోంది. దాంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇది ఎల్‌నినో.. లానినో పరిస్థితులకు దారితీస్తోంది. వర్షం కురిస్తే కుంభవృష్టిగా కురవడం.. లేదంటే రోజుల తరబడి వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్) వంటి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు ప్రధాన కారణం.⇒ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలుగా మార్చడంపై దృష్టి పెట్టకపోవడం.. భూగర్భజలాలను ఇష్టారాజ్యంగా తోడేయడం కూడా నీటి కొరతకు దారితీస్తోంది. ⇒ పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తుండటమూ నీటి ఎద్దడికి దారితీస్తోంది.ఆసియా–పసిఫిక్ దేశాలపై తీవ్ర సంక్షోభం..రుతుపవనాలపై అత్యధికంగా ఆధారపడేది ఆసియా–పసిఫిక్ దేశాలే. ఎల్‌నినో, లానినో ప్రభావం అత్యధికంగా పడేది ఈ దేశాలపైనే. ఇందులో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 113 దేశాల్లోని 560 కోట్ల మంది ప్రజలకు నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబేరియా, మడగాçÜ్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్ డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, లాతి్వయా తదితర దేశాల్లోని వంద కోట్ల మంది 49 దేశాల్లోని వంద కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి.⇒ ప్రపంచ జలభద్రత నివేదిక ప్రకారం 2030 నాటికి నీటి కష్టాలు ఇలా..⇒నీటి కష్టాలు చుట్టుముట్టనున్న దేశాలు 113⇒113 దేశాల్లో నీటి కష్టాలు ఎదుర్కోనున్న జనాభా 560 కోట్లు⇒గుక్కెడు పరిశుభ్రమైన తాగునీరు కూడా లభించని దేశాలు 24⇒ఈ 24 దేశాల్లో జనాభా 6.42 కోట్లు⇒ ఒక మనిíÙకి రోజుకు కనీసం కావాల్సిన పరిశుభ్రమైన నీరు 50 లీటర్లు⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న దేశాలు 49⇒పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్న జనాభా 100 కోట్లు -
స్వచ్ఛ గాలి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 13 పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడంపై నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 131 పట్టణాలు, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వాయుకాలుష్యం తగ్గించే విధంగా 2019లో ఈ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. 2025–26 నాటికి వాతావరణ కాలుష్యాన్ని ఆయా ప్రాంతాల్లో తగ్గించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2023–24లో నమోదైన వాతావరణ కాలుష్యం డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా 131 పట్ణణాల్లో అత్యధిక కాలుష్యం నమోదవుతుండగా... అందులో ఏపీ నుంచి 13 ప్రాంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా ఢిల్లీ 208 పీఎం10తో తొలి స్థానంలో నిలిచింది. దేశస్థాయిలో విశాఖ 30వ స్థానంలో, కడప 128వ స్థానంలో నిలిచాయి. కాలుష్యం పెరుగుదలలో పీఎం10 (వాతావరణంలో పీల్చుకునే స్థాయిలో ఉండే 10 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన ముతక కణాలు) స్థాయి 120 పాయింట్లతో ఏపీలో విశాఖ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు నిలిచాయి. 42 పీఎం10 స్థాయితో ఏపీలో కడప చివరి స్థానంలో నిలిచింది. విజయవాడలో తగ్గుముఖంఈ పథకం అమలు తర్వాత రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్సీఏపీ చర్యలతో విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు వంటి పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 2022–23లో విజయవాడలో పీఎం10 స్థాయి 90 పాయింట్లుగా ఉంటే అది 2023–24కు 61 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో కడపలో 57 నుంచి 42కు, నెల్లూరులో 56 నుంచి 52కు, కర్నూలులో 64 నుంచి 56కు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే విశాఖలో వాతావరణ కాలుష్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 2022–23లో పీఎం10 స్థాయి 116 పాయింట్లుగా ఉండగా అది 2023–24 నాటికి 120 పాయింట్లకు పెరిగింది. రాజమహేంద్రవరంలో 68 నుంచి 76, గుంటూరులో 60 నుంచి 61 పాయింట్లకు పెరిగింది. జనాభా పెరుగుదల, పారిశ్రామిక పురోగతి ఎక్కువ అవడం, స్థానికంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం తదితర కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలిపింది. ఏపీలో ఇప్పటివరకు రూ.109.78 కోట్ల వినియోగంవాతావరణంలో పీఎం10, పీఎం 2.5 స్థాయిలను ప్రస్తుతమున్న స్థాయి నుంచి 2025–26కి కనీసం 40% తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 131 పట్టణాలకు రూ.19,614 కోట్లను కేటాయించింది. 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాల్లో ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విడుదల చేస్తుండగా.. మిగిలిన పట్టణాలకు స్థానిక సంస్థల ద్వారా విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటివరకు రూ.11,211.13 కోట్లను ఖర్చు చేసింది. ఎన్సీఏపీ కింద ఏపీ నుంచి ఎంపికైన 13 పట్టణాలకు ఇప్పటివరకు రూ.361.09 కోట్లు విడుదల చేయగా అందులో రూ.109.78 కోట్లను ఖర్చు పెట్టారు. వాతావారణ కాలుష్యానికి కారణమైన రహదారులపై దుమ్ము, వ్యర్థాలను తగలపెట్టడం, వాహన, పారిశ్రామిక కాలుష్యం, నిర్మాణ రంగ వ్యర్థాలు వంటి వాటిని గుర్తించి వాటిని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. -
ఇనుప బట్టీలతో బయోచార్ : బెట్ట నుంచి రక్షణ, 15శాతం అదనపు పంట!
పంట కోతలు పూర్తయ్యాక పత్తి, కంది, సోయా తదితర పంటల కట్టెకు నిప్పుపెట్టి పర్యావరణానికి హాని చేసే కన్నా.. ఆ కట్టెతో కట్టె బొగ్గు (బయోచార్) తయారు చేసి, తిరిగి భూములను సారవంతం చేసుకోవచ్చు. ఎకరానికి టన్ను బయోచార్ కం΄ోస్టు వాడితే పంటలు బెట్టను తట్టుకుంటాయి. తద్వారా పంట దిగుబడులను 12–15% వరకు పెంచుకోవచ్చని మహారాష్ట్రలో ఓ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనుభవం చాటి చెబుతోంది..పంట వ్యర్థాలను తగులబెట్టటం పరిపాటి. ఇది పర్యావరణానికి హాని చేసే పని. పత్తి కట్టె, కంది కట్టె వంటి పంట వ్యర్థాలను కాలబెట్టటం వల్ల గాలి కలుషితమై కార్బన్డయాక్సయిడ్ శాతం పెరిగిపోతంది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. ఫలితంగా సాగుభూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. మట్టికి నీటిని పట్టి ఉంచే శక్తి లోపించటం, వాన నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం తగ్గి΄ోవటం, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయి. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో 4 లక్షల హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో కంది పంటలను రైతు సాగు చేస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత రైతులు పత్తి, కంది కట్టెను కాల్చివేస్తారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా భూమికి తిరిగి అందాల్సిన సేంద్రియ పదార్థం అందకుండా పోతోంది. బిఎఐఎఫ్ (బైఫ్) డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పుణేకు చెందిన స్వచ్ఛంద సంస్థ యవత్మాల్ రైతులతో కలసి పనిచేసి ఈ పరిస్థితిలో విజయవంతంగా మార్పుతెచ్చింది. పత్తి, కంది కట్టెను వట్టిగా కాలబెట్టకుండా.. ఒక పద్ధతి ప్రకారం (దీన్నే పైరోలిసిస్ అంటారు) కాల్చితే బొగ్గుగా మారుతుంది. దీన్నే బయోచార్ అంటారు. దీన్ని సేంద్రియ ఎరువులతో కలిపి బయోచార్ కంపోస్టుగా మార్చి భూమిలో చల్లితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంతతి పెరిగి భూసారం మెరుగవుతుంది. బయోచార్ కంపోస్టు వాడకం వల్ల ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ నేలలకు బెట్టను తట్టుకునే శక్తిని పెంపొందిస్తాయి. బయోచార్ కంపోస్టు తయారు చేయాలంటే.. బయోచార్ను ఉత్పత్తి చేసే ఇనుప బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత చిన్న రైతులకు విడిగా ఉండదు. అందుకని బైఫ్ ఫౌండేషన్ రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్.పి.ఓ.ని) 2019లో రిజిస్టర్ చేయించింది. 220 మంది రైతులను కూడగట్టి ఒక్కొక్క రైతు నుంచి రూ. వెయ్యి షేర్ ధనంతో ఎఫ్.పి.ఓ.ను రిజిస్టర్ చేయించారు. పత్తి, కంది కట్టెను కాల్చవద్దని, దీనితో ఎఫ్పిఓ తరఫున బయోచార్ తయారు చేసుకొని పంటలకు వాడుకుంటే బెట్టను తట్టుకొని మంచి దిగుబడులు పొందవచ్చని బైఫ్ ఫౌండేషన్ సిబ్బంది రైతులకు ఆలోచన కలిగించారు. 2021 జనవరిలో ఎఫ్పిఓ పత్తి కట్టెను రైతుల నుంచి కిలో రూ. 2.5–3లు చెల్లించి కొనుగోలు చేసింది. రూ. 60 వేల ఖర్చుతో బ్యాచ్‌కు 200 కిలోల కట్టెను కాల్చే ఇనుప బట్టీని ఎఫ్పిఓ కొనుగోలు చేసింది. ఈ బట్టీ ద్వారా పైరోలిసిస్ పద్ధతిలో ఈ కట్టెను కాల్చి బొగ్గును తయారు చేసింది. బొగ్గును పొడిగా మార్చి గోనె సంచుల్లో నింపి ఎఫ్పిఓ తిరిగి రైతులకే అమ్మింది. మార్కెట్ ధర కన్నా కిలోకి రూ. 2, 3 తగ్గించి అమ్మింది. 2021–22లో ఎఫ్పిఓ విజయవంతంగా 100 టన్నుల పత్తి కట్టెతో 25 టన్నుల బయోచార్ను ఉత్పత్తి చేయగలిగింది. ఎఫ్పిఓ బయోచార్ ఉత్పత్తిని చేపట్టటం వల్ల చాలా మందికి పని దొరికింది. కాల్చేసే పత్తి కట్టెను రైతు అమ్ముకొని ఆదాయం పొందాడు. కట్టెను సేకరించటంలో కూలీలకు పని దొరికింది. వాహనదారులకు కట్టెను బట్టీ దగ్గరకు చేర్చే పని దొరికింది. చివరికి బయోచార్ను రైతులే తిరిగి తక్కువ ధరకు కొనుక్కోగలిగారు. అంతిమంగా కాలబెడితే ఆవిరైపోయే పత్తి కట్టె.. ఎఫ్పిఓ పుణ్యాన భూమిని సుదీర్ఘకాలం పాటు సారవంతం చేసే బయోచార్గా మారి తిరిగి ఆ పొలాలకే చేరటం విశేషం. హెక్టారుకు 2.5 టన్నుల బయోచార్ కంపోస్టును దుక్కిలో వేశారు. ఏటేటా పంట దిగుబడులు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2% మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23%ని, హెక్టారుకు సగటున 16% టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకుపోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కా΄ాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు.ఎకరానికి టన్ను బయోచార్ కంపోస్టుయవత్మాల్ జిల్లాలోని 0.5% కన్నా తక్కువగా ఉండే వర్షాధార పత్తి తదితర పంటలు పండించే నేలలను బయోచార్ కంపోస్టు పోషకవంతం చేయటమే కాకుండా నీటిని పట్టి ఉంచే సామర్ధ్యాన్ని, కరువును తట్టుకునే శక్తిని పెంపొదించింది. బయోచార్ను ఎంత మోతాదులో వేయాలనే దాన్ని ఇంకా ప్రామాణీకరించాల్సి ఉంది. హెక్టారుకు 1 నుంచి 10 టన్నుల వరకు సూచిస్తున్న సందర్భాలున్నాయి. రైతుకు మరీ భారం కాకుండా వుండేలా హెక్టారుకు 2.5 టన్నుల (ఎకరానికి టన్ను) చొప్పున బయోచార్ కంపోస్టును వేయించాం. బొగ్గు పొడితో వర్మీకంకంపోస్టు, అజొటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులను కలిపి బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని పంట పొలాల్లో వాడాం. ఆ సంవత్సరంలోనే పత్తి, సోయా వంటి పంటల దిగుబడి 12–15% పెరిగింది. పోషకాలను నిదానంగా దీర్ఘకాలం పాటు పంటలకు అందించేందుకు, బెట్టను తట్టుకునేందుకు బయోచార్ ఉపకరిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రైతులు పూర్తిగా గుర్తించేలా ప్రచారం చేయటానికి ప్రభుత్వ మద్దుతు అవసరం ఉంది. ఎఫ్పిఓలు తయారు చేసే బయోచార్ కంపోస్టుకు ప్రభుత్వం మార్కెటింగ్‌కు అవకాశాలు పెంపొందించాలి.– గణేశ్ (98601 31646), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణే -
International Plastic Bag Free Day అందమైన డిజైన్లు, ఆకృతుల్లో ముద్దొచ్చే బ్యాగ్స్ ఇవే!
ఇంటి నుంచి మార్కెట్‌కు, షాపింగ్, ఆఫీసు ఇలా ఏ పనిమీద వెళ్లినా చేతి సంచిలేనిదే పని జరగదు. పాలు, పెరుగు, కూరగాయలు, కిరాణా సరుకులు ఏది తేవాలన్నా ఉండాల్సిందే.కానీ గత కొన్ని దశాబ్దాలుగా చేతి సంచి తీసుకెళ్లే పని లేకుండా చవకగా దొరికే ప్లాస్టిక్ బ్యాగులకు అలవాడి పడి పోయాం. ఈ అలవాటే ప్రకృతికి, పర్యావరణానికి తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. గుట్టలు, గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ బ్యాగ్స్ వర్థాలు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. అందుకే జూలై 3వ తేదీన అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా జరుపుకుంటారు. ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజలను చైతన్యవంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ప్లాస్టిక్ సంచుల ప్లేస్‌లో పర్యావరణ అనుకూల, బయో-డిగ్రేడబుల్ , కాల్చినా కూడా ఎలాంటి విషపూరిత పొగలు లేదా వాయువులను విడుదల చేయని ప్రత్యామ్నాయ బ్యాగులపై ఓ లుక్కేద్దాం.ప్లాస్టిక్ బ్యాగ్‌లు అత్యంత తక్కువ ఖర్చులో, అనుకూలంగా లభించేవే అయినప్పటి అవి మన పర్యావరణానికి చాలా చేటు చేస్తున్నాయి. అందులోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాకులు పర్యావరణానికి తీరని నష్టాల్ని మిగులుస్తున్నాయి. ఈ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం.ప్లాస్టిక్ సంచులకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలువివిధ రంగులు డిజైన్లలో లభించే కాగితపు సంచులను వాడదాంరీసైకిల్ చేయడానికి సులభమైనవి కాగితం సంచులుసహజమైన ఫైబర్‌తో తయారయ్యే జనపనార సంచులుప్లాస్టిక్ బ్యాగ్‌లకు మరో చక్కటి ప్రత్యామ్నాయం క్లాత్ బ్యాగ్‌లు మస్లిన్ నుండి డెనిమ్ వరకు పాత బట్టలతో చక్కటి బ్యాగులను తయారు చేసుకోవచ్చు ఎకో-ఫ్రెండ్లీ, డబ్బు ఆదా కూడా స్టైలిష్ ఆఫీస్ బ్యాగ్‌ల నుండి సాధారణ కిరాణా సంచుల వరకుకాన్వాస్తో తయారైన టోట్ బ్యాగ్స్ బెస్ట్ ఆప్షన్అందమైన డిజైన్లతో ఆకట్టుకునే వెదురు సంచులు, మన్నుతాయి కూడా -
గ్లోబల్ వార్మింగ్‌పై ఫైటర్.. ది మమ్మోత్
ఏటేటా పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమలు.. వాటి నుంచి వెలువడే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతోంది. వాతావరణంలో నిరంతరం పెరిగిపోతున్న కార్బన్డయాక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమ వుతోంది. దీనికి పరిష్కారంగానే.. ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టాయి.ఈ క్రమంలోనే ఐస్ ల్యాండ్‌కు చెందిన ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి బదులు.. నేరుగా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తొలగించే సరికొత్త సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..ఏటా 36 వేల టన్నుల మేర..గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసి.. దానిని నీటితో కలిపి, భూమిలోపలి పొరల్లోకి పంపేలా క్లైమ్ వర్క్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని సాయంతో ఏటా 36 వేల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను గాలిలోంచి తొలగించి.. భూమి పొరల్లోకి పంపేలా నిర్మించింది. ఇది సుమారు 8 వేల డీజిల్ కార్లు ఏడాదంతా తిరిగితే వెలువడేంత కార్బన్‌డయాక్సైడ్‌తో సమానం కావడం గమనార్హం. చూడటానికి ఇది తక్కువే అనిపించినా.. ఇలాంటి ప్లాంట్లు భారీ సంఖ్యలో పెడితే.. గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఒక పరిష్కారంగా పనికొస్తుందని ‘క్లైమ్ వర్క్స్’ సంస్థ చెప్తోంది.దీనిలో నిలువునా గోడల్లా ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఒకవైపు భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి వెనకాల చిన్న చాంబర్ ఉంటుంది. అందులో కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే ఫిల్టర్లు ఉంటాయి.ఫ్యాన్లను ఆన్ చేసినప్పుడు.. అవి వెనకాల చాంబర్ నుంచి గాలిని లాగి.. ముందు వైపునకు వదులుతాయి. ఈ క్రమంలో చాంబర్‌లోని ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహిస్తాయి.ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్తో నిండిపోతే.. ఆటోమేటిగ్గా చాంబర్ సీల్ అయిపోతుంది. అందులో చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో 100 సెంటిగ్రేడ్ల మేరకు వేడెక్కుతుంది. దాంతో ఫిల్టర్లలోని కార్బన్ డయాక్సైడ్ ఆవిరి అవుతుంది.ఎలా పనిచేస్తుంది?ఈ ఆవిరిని ప్రత్యేక పైపుల ద్వారా భూగర్భంలోకి తరలిస్తారు. ఆ పైపుల్లోకి నీటిని పంపే ఏర్పాట్లు చేస్తారు. దీనితో కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి కార్బన్ వాటర్‌గా మారిపోతుంది. భూగర్భంలోకి ఆ కార్బన్ వాటర్ మెల్లగా గడ్డకట్టి రాళ్లుగా తయారవుతుంది.ఈ ప్రక్రియలో ఫ్యాన్ల కోసం, పైపుల ద్వారా కార్బన్ డయాక్సైడ్, నీరు పంపింగ్ చేయడం కోసం వాడే విద్యుత్‌ను ఆ ప్రాంతంలోని జియోథర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు.ఇది వేడినీటి బుగ్గల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ కాబట్టి.. దాని వినియోగంతో పర్యావరణానికి సమస్యేమీ లేదని ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.అమెరికాలోని లూసియానాలో 2030 నాటికి ఏటా 10 లక్షల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించగలిగే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
అన్నీ తెలిసినా అలసత్వమే!
సమస్య తెలుసు... దానికి పరిష్కారమూ తెలుసు... తక్షణమే అందుకు నడుము కట్టకపోతే మానవాళి జీవనానికే ప్రమాదమనీ తెలుసు. అన్నీ తెలిసినా ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒక్కతాటి మీదకు రాలేకపోతున్నాయంటే ఏమనాలి? ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతంపై పరిస్థితి సరిగ్గా అదే! సరికొత్త అంతర్జాతీయ ఒడంబడిక నిమిత్తం గత వారం ఒట్టావాలో జరిగిన సమావేశం స్పష్టమైన నిర్ణయాలేమీ తీసుకోకుండానే చప్పగా ముగిసింది. అందరిలోనూ అసంతృప్తి మిగిల్చింది. 192 దేశాల ప్రతినిధులు వారం పాటు సమావేశమై చర్చలు జరిపినా, ఆఖరి రోజున సమావేశాన్ని అర్ధ రాత్రి దాకా పొడిగించినా ఫలితం లేకపోయింది. ఒప్పందంపై ఒక నిర్ణయం కుదరలేదు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని అధిక భాగం దేశాలు అంగీకరించినప్పటికీ, ఉత్పత్తిపై పరిమితులు విధించడం మీద ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. ఇది నిరాశ కలిగించే పరిణామం.పెట్రోలియమ్ ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్‌లపై దేశాల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన అనేక ధనిక దేశాల్లో ప్లాస్టిక్‌ల తయారీ, పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతోంది. సహజంగానే పెట్రోకెమికల్ పరిశ్రమ వృద్ధిచెందిన ఆ దేశాలు, పారిశ్రామిక గ్రూపులేమో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలనే యోచనను వ్యతిరేకించాయి. ప్రస్తుతానికి వాటి మాటే పైచేయి కాగా, ఒడంబడికపై నిర్ణయం అక్కడికి ఆగింది. ప్లాస్టిక్‌పై అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే మొదలైంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వాటి ఉత్పత్తిని ఆపేయడానికి ఒక నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఒడంబడికను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా ఒట్టావాలో నాలుగో విడత చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రకాల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నా యాలు లేని పరిస్థితి. ఇది పెద్ద ఇబ్బంది. గణాంకాలలో చెప్పాలంటే... ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950లో 20 లక్షల టన్నులుండేది. 2019 నాటికి 4600 లక్షల టన్నులకు చేరింది. వచ్చే 2060 నాటికి అది అంతకు మూడింతలు అవుతుందని అంచనా. దానికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నానాటికీ తీసి కట్టుగా మారింది. పైపెచ్చు, భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఏటా 740 టన్నులుండగా, రానున్న 2050 నాటికి అది ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుంది. విధానపరమైన మార్పులు చేపట్టకుంటే ఇది పెను సమస్యే. అందుకే, వ్యర్థాల లోపభూయిష్ట నిర్వహణను వచ్చే 2040 కల్లా సున్నా స్థాయికి తేవాలనేది లక్ష్యంగా ఒడంబడిక ప్రక్రియకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. వ్యర్థాలే కాదు... అసలు ప్లాస్టిక్ ఉత్పత్తే పర్యావరణానికి పెను ప్రమాదం. ప్లాస్టిక్ భూమిలో కలసిపోదు గనక పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ పెద్ద దెబ్బ. ప్లాస్టిక్ ఉత్పత్తితో గ్రీన్ హౌస్ వాయు వులు వెలువడి భూతాపం పెరుగుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తికి ఉపకరించే పెట్రోకెమికల్స్ తయారీకై శిలాజ ఇంధనాల వెలికితీత, రిఫైనింగ్‌తో ఒక్క 2019లోనే 2.24 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలినట్టయిందట. పాత లెక్కల వంతున ఏటేటా 4 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగినా సరే, వచ్చే 2050 నాటికి ఇది మూడు రెట్లై ఈ గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం 6.78 గిగా టన్నులకు చేరుతుంది. ఒడంబడికతో ఈ పరిమాణాన్ని 26 శాతం మేర తగ్గించాలని లక్షించారు. మనం వాడే ప్లాసిక్లలో 16వేల రకాల రసాయనాలుంటాయి. వాటిలో కనీసం 4200 విషపూరితమే. వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికాలో 9200 కోట్ల డాలర్ల పైగా ఖర్చయింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్‌ల వినియోగం తగ్గించాలనీ, వాటిని రీసైక్లింగ్ చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవేవీ ఇప్పటి దాకా అనుకున్నంత విజయం సాధించలేదు. ఉత్పత్తిపై పరిమితులు విధించడం కన్నా, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని తాజా భేటీలోనూ ప్రధాన దేశాలు పట్టుబట్టాయి. అయితే, కేవలం వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్లతో ప్లాస్టిక్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టడం జరగని పని. నిష్ఠురమైనా అది నిజం. ప్రపంచంలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో 10 శాతమే ఇప్పటి దాకా పునర్వినియోగమైంది. మిగతా వ్యర్థాలన్నీ సముద్రాలు, నేలల్లో మిగిలాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి మాత్రం ఏటేటా పెరుగుతూ పోతోంది. అందుకే, ప్లాస్టిక్‌ల ఉత్పత్తిపై నియంత్రణకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. ఒట్టావా సమావేశంలో కొంత పురోగతి సాధించినట్టు ఐరాస అంటున్నా, అది వట్టి కంటి తుడుపే!కొన్నేళ్ళుగా మైక్రో, నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో, చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తు న్నాయని శాస్త్రవేత్తల మాట. ఇది ఆందోళనకర పరిణామం. అందుకే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలదు. ఉత్పత్తిని బాగా తగ్గించడమే దీర్ఘకాలంలో ఉపయోగం. మన దేశం 2022లోనే ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు’ తీసుకొచ్చి, 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింది. అయితే, ప్రాంతానికో రకం నిబంధనలున్నందున వాటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలోనే మరో విడత బుసాన్‌లో సమావేశం కానున్నాయి. అప్పటికైనా అవి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొదలైన వందేళ్ళ లోపలే మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్‌లపై పోరుకు ఒక్క మాట మీద నిలవాలి. ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకు పక్కనబెట్టి మరీ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే పనిలో మిగతా దేశాల చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ప్రమాదం తెలుస్తున్నా పట్టించుకోకుండా, పరిష్కారంపై చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తూ పోతే మనకే కష్టం, నష్టం. -
గరళ కంఠ భారతం
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అంటూ రొమ్ము విరుచుకుంటున్న మనకు ఇప్పుడు పెద్ద అపకీర్తి కిరీటమూ దక్కింది. ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం ఒకటని తాజాగా తేలింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మొత్తం 134 దేశాలు, ప్రాంతాల్లోని 7,812 నగరాలలో 30 వేలకు పైగా వాయు నాణ్యతా పర్యవేక్షక కేంద్రాల నుంచి డేటా సేకరించి ఈ నివేదికను అందించింది. వారి ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యదేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2022లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ ఒక్క ఏడాది కాలంలో కాలుష్యంలో మూడో ర్యాంకుకు చేరడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత రాజధాని అనే దుష్కీర్తి వరుసగా రెండో ఏడాది కూడా మన ఢిల్లీకే దక్కింది. అవి చాలదన్నట్టు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా బెగూసరాయ్ నిలవడం దిమ్మ తిరిగేలా చేస్తోంది. ప్రపంచంలో గత ఏడాది ఎదురైన ఆరోగ్య విపత్తు వాయు కాలుష్యమని నిపుణుల మాట. మన దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం ప్రధాన కాలుష్యకారకం కాగా, ఉత్తరాదిన ఖరీఫ్ సీజన్లో పంట వ్యర్థాల్ని కాల్చే అలవాటుకు సరైన ప్రత్యామ్నాయం చూపడంలో పాలకుల వైఫల్యాలు సైతం ఢిల్లీ దుఃస్థితికి కారణమై వెక్కిరిస్తున్నాయి. అయితే, మెట్రోలు, గౌహతి – పాట్నా లాంటి ద్వితీయ శ్రేణి నగరాలే కాదు... బిహార్‌లోని బెగూసరాయ్, హర్యానాలోని రోహ్తక్, యూపీలోని మీరట్ లాంటి చిన్న పట్నాలు సైతం వాయు గరళంతో నిండిపోతున్నాయని నివేదిక తేల్చింది. ఐక్యూ ఎయిర్ జాబితాలోని 83 భారతీయ నగరాల్లో చాలావాటిలో కాలుష్య కారకాలు ఏమిటనే సమాచారం లేదు. అలాగే, బెగూసరాయ్ లాంటి చోట ఏడాది తిరగక ముందే కాలుష్యం 6 రెట్లు ఎలా పెరిగిందనేది కనిపెట్టాల్సి ఉంది. కారణాల్ని అంచనా వేస్తూనే, ముంచుకొచ్చిన ఈ ముప్పును విధానపరమైన పరిష్కారాలతో సమర్థంగా ఎదుర్కోవడం పాలకుల ముందున్న సవాలు. గాలిలో ధూళికణాల (పీఎం) సాంద్రత ఏ మేరకున్నదనే దాన్ని బట్టి వాయుకాలుష్య ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు ఫరవాలేదు. అలాకాక, ధూళికణాలు 2.5 మైక్రాన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యాసం (పీఎం 2.5) ఉన్నప్పుడు ఊపిరితిత్తుల, గుండె జబ్బులు, క్యాన్సర్, చిన్న వయసులోనే మర ణాలు సంభవిస్తాయి. కాబట్టి అది ప్రమాదఘంటికకు కొలమానం. 2023లో భారత్‌లో వార్షిక సగటు పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములుగా రికార్డయింది. అలా భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక, క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో, క్యూబిక్ మీటర్‌కు 73.3 మైక్రోగ్రాములతో పాకిస్తాన్ రెండోస్థానంలో ఉన్నాయి. నిజానికి, మిగతా రెండు దేశాలతో పోలిస్తే, భారత్ పీఎం2.5 సాంద్రత 2021 నాటి నుంచి తగ్గింది. అప్పట్లో భారత్‌లో క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రోగ్రాములు ఉండేది. ఇప్పుడది 54.4కు తగ్గిందన్న మాటే కానీ ఇవాళ్టికీ ప్రపంచ టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 మన దేశంలోవే కావడం కలతపరిచే అంశం. దేశ జనాభాలో కొద్ది మంది మినహా దాదాపు 136 కోట్లమంది నిత్యం డబ్ల్యూహెచ్ఓ మార్గ దర్శకాలను మించి పీఎం2.5 ధూళికణ సాంద్రతకు లోనవుతున్నవారే! మరీ ముఖ్యంగా, మన దేశంలోని పట్టణప్రాంతాల్లో అధిక శాతం మంది ఇలా నిత్యం కాలుష్యం కోరల బారిన పడుతూ, శ్వాస కోశ సమస్యలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుండడం తరచూ కంటి ముందు కనిపిస్తున్న కథే. మిగిలి నవి అటుంచితే, భారత్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో 70 శాతం థర్మల్ విద్యుత్తే అన్నది గమనార్హం. ఇప్పటికీ మనం పునరుత్పాదక శక్తి వనరుల మార్గం పట్టలేదు. పైపెచ్చు, దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతమయ్యేకొద్దీ ఇది పెను సవాలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటి పైకప్పులపై సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటు లాంటి భారీ ప్రణాళికలు ప్రకటించింది. అయితే, ఇవన్నీ ఆచరణ లోకొచ్చి, ప్రభావం చూపడానికి మరికొంత సమయం పడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు గణనీ యంగా ప్రభావం చూపాలంటే, మన విద్యుత్ విధానాలను సమూలంగా మార్చడం ముఖ్యం. అసలు ‘స్వచ్ఛమైన గాలి’ కూడా ప్రాథమిక జీవనహక్కే. కోర్టులు ఆ సంగతి పదేపదే చెప్పాయి. బరిలోకి దిగక తప్పని పరిస్థితిని ప్రభుత్వాలకు కల్పించాయి. అయితే, పౌర రవాణాలో సీఎన్జీ, మెట్రో వ్యవస్థ, ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ లాంటివి తీసుకొచ్చినా ఢిల్లీ లాంటి చోట్ల కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సమస్య అవగాహన, పరిష్కారానికై శాస్త్ర విజ్ఞానాన్ని ఆశ్రయించాలి. అలాగే, కాలుష్య నియంత్రణకు అవసరమైన రీతిలో జనజీవితంలో అలవాట్లు మారేలా ప్రోత్సాహకాలు, అతిక్రమిస్తే జరిమానాల పద్ధతి తేవాలి. సర్వజన శ్రేయస్సు కోసం పార్టీలన్నీ కాలుష్యంపై పోరును రాజకీయ అంశంగా తీసుకొని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చోటివ్వాలి. నిజానికి, జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని పటిష్ఠం చేస్తామంటూ 2019లో కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల వాగ్దానపత్రంలో పేర్కొన్నాయి. ఇది కేవలం కేంద్రం పనే కాదని గుర్తించి, రాష్ట్రాల నుంచి మునిసిపాలిటీల దాకా అన్నీ తమ వంతుగా కాలుష్యంపై పోరులో చేతులు కలపాలి. వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యమే కాక, దరిమిలా సంక్లిష్టమైన పర్యావరణ ప్రక్రియలతో పుడమి వాతావరణమే దెబ్బతింటుందని శాస్త్రవేత్తల మాట. అందుకని ఈ విషానికి విరుగుడు కనిపెట్టడం అన్ని విధాలా అత్యవసరం. ఈ క్రమంలో తాజా ఐక్యూ ఎయిర్ నివేదిక మనకు మరో మేలుకొలుపు. -
విషపూరిత నురుగులు కక్కుతున్న యమునమ్మ, ఎవరూ పట్టించుకోరే?
దేశంలో ఒక పక్క సార్వత్రిక ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరో పక్క రోజు రోజుకి కాలుష్య కాసారంగా మారిపోతున్న పవిత్ర యమునా నదీ తీరం మరోసారి కాలుష్య సెగలు కక్కుతోంది. టన్నుల కొద్దీ మురుగునీరు, పారిశ్రామిక, గృహ వ్యర్ధాలతో విషపూరిత నురుగుతో నిండిపోయింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అనూహ్యంగా పెరిగిపోతున్న కాలుష్యానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. యమున ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియోలు గతంలో చాలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి .అలాగే కోవిడ్ లాక్డౌన్ కాలంలో యమునకు కాలుష్యం స్థాయి చాలావరకు తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనార్హం. తీవ్రమైన కాలుష్యంతో యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని దుష్ప్రభావాలు, పొంచివున్న ముప్పుపై వాతావరణ నిపుణులు, శాస్త్రజ్ఞులు ఎంత మొత్తుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. తక్షణమే కనీస జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు. Kalindi Kunj ... Yamuna Delhi . Beautiful poisonous pink water froth with chemicals ,, @ArvindKejriwal promised clean Yamuna in 2017 ,,nothing happened@SwatiJaiHind @AtishiAAP ... IIT quota admission , is useless pic.twitter.com/svcQ3wdYGw — No Conversion (@noconversion) May 19, 2023 నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఢిల్లీ, హర్యానా ,ఉత్తరప్రదేశ్ నుండి శుద్ధి చేయని మురుగునీటిలో ఫాస్ఫేట్లు, సర్ఫ్యాక్టెంట్లు (రసాయన సమ్మేళనాలు) యమునలో కలిసిపోతున్నాయి. ఇదే విషపూరిత నురుగుకు కారణం. ఈ రెండింటిలోనూ 99 శాతం గాలి, నీటిలో కలిసి పోతుంది.ఫలితంగా అనేక బాధలు తప్పవు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు లాంటి సమస్యలొస్తాయి. ఈ రసాయనాలతో జీర్ణకోశ సమస్యలు ,టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు. దీర్ఘకాలం పాటు ఈ పారిశ్రామిక కాలుష్య కారకాలకు ఎక్స్పోజ్ అయితే నరాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఢిల్లీ పొల్యూషన్.. వరల్డ్‌లోనే టాప్ ర్యాంక్ !
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్విస్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో వెల్లడించింది. ఈ సర్వేలో 2018 నుంచి వరుసగా నాలుగుసార్లు ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా టాప్‌లో ఉంటూ వస్తోంది. 2022లో ఢిల్లీ పీఎం 2.5 లెవెల్స్ క్యూబిక్ మీటర్‌కు 89.1 మైక్రో గ్రాములు ఉండగా 2023లో ఇది 92.7 గ్రాములకు చేరింది. ఇక బీహార్‌లోని బెగుసరాయ్ పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణమని ఐక్యూ ఎయిర్ తెలిపింది. క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాముల పీఎం 2.5 కాన్సంట్రేషన్తో ప్రపంచంలోనే మూడవ అత్యంత కాలుష్య దేశంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత భారత్ ఉందని వెల్లడించింది. ఐక్యూ ఎయిర్ కాలుష్య దేశాల ర్యాంకుల్లో 2022లో భారత్ ర్యాంకు 8గా ఉండగా 2023లో 3వ ర్యాంకుకు ఎగబాకింది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి.. వందేళ్ల కక్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్ -
విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..!
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాపంగా ఎన్నో విధానాలను అసుసరిస్తున్నారు. ప్రధానంగా వాతావరణ కాలుష్యం నిత్యం వినియోగిస్తున్న వాహనాల నుంచి వెలువడే పొగద్వారే ఏర్పడుతుంది. దాంతో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈవీలు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో కూడా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, ఆటోలను విక్రయిస్తున్నాయి. అయితే, పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఈవీలు కాస్త అధిక కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఎమిషన్ అనలటిక్స్ అనే సంస్థ రెండు రకాల కార్లలోని బ్రేకింగ్, టైర్ల నుంచి విడుదలయ్యే రేణువులపై అద్యయనం చేసి ఆసక్తికర విషయాలను తెలిపింది. సాధారణ కార్ల ఇంజిన్ కంటే ఈవీల్లోని బ్యాటరీలు ఎక్కువ బరువుగా ఉంటాయి. దీంతో బ్రేక్ వేసినప్పుడు టైర్లపై అధిక ఒత్తిడి ఏర్పడి హానికారక రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తున్నాయని తెలిపింది. ఇది పెట్రోల్, డీజిల్ కార్లలో విడుదలయ్యే వాటి కంటే అధికమని వెల్లడించింది. ఇదీ చదవండి..ఫేమ్-2 పథకం పొడిగింపుపై కేంద్రం వ్యాఖ్యలు సింథిటిక్ రబ్బర్, ముడి చమురుతో టైర్లను తయారు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో పేర్కొంది. పర్యావరణ హితం కోసం చాలా దేశాల్లో ఈవీలకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తున్నారు. క్రమంగా వీటి వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తయారీదారులు ఈవీల బ్రేకింగ్ వ్యవస్థ, టైర్ల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని ‘ఎమిషన్ అనలటిక్స్’ సంస్థ సూచించింది. గతంలో ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. -
ముంపు అంచున అగ్రరాజ్యం
భూతాపోన్నతి, కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచి్చచేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీరప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో ముంపు ముప్పును అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది. ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్రమట్టాలను ఆపడం ఎవరితరమూ కాదు. అమెరికాలోని ప్రభావిత 32 తీరనగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతిసంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. వీటికితోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిశోధన తాలూకు సమగ్ర వివరాలు జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్‌వేవ్‌లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ధృవాల వద్ద హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో అమెరికా, భారత్‌సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం హెచి్చందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. మరిన్ని వరదలు 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తంకానుంది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిననుంది. కొన్ని ప్రాంతాలు మరింతగా కుంగిపోయే ప్రమాదముందని గణాంకసహితంగా అధ్యయనం పేర్కొంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడి నాశనమయ్యే అవకాశముంది. గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని అధ్యయనం హెచ్చరించింది. మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనా. ఈ అధ్యయనంలో పంజాబ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వారి బృందం సైతం పాలుపంచుకుంది. అమెరికా తీరప్రాంతంలో ముంపును ఎదుర్కోనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్దంచేసింది. ‘నక్షత్రాలు నేలరాలితే ఏం చేయగలం?. చిన్నపాటి వర్షం కూడా పడవ వేగంగా మునగడానికి ప్రబల హేతువు కాగలదు. అలాగే తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు అవకాశమున్న 32 నగరాలు బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో – సాక్షి, నేషనల్ డెస్క్ -
Copernicus Climate Change Service: ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల
న్యూఢిల్లీ: కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు (సీ3ఎస్) గురువారం వెల్లడించింది. 1850–1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850–1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతోపాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల భూఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వసు స్పష్టం చేసింది. -
ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
ఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన కాలుష్యానికి తోడు పొగ మంచు అలుముకుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొగ మంచు ప్రభావంతో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ -3 టెక్నాలజీ లేని విమానాలపై పొగ మంచు ప్రభావం పడుతోంది. ఢిల్లీ వాయు నాణ్యత 328 పి.ఎం.తో వెరీ పూర్ కేటగిరికి చేరింది. కాలుష్యం, పొగ మంచుతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తెలుత్తుతున్నాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చలితీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు. CAT III లేని విమానాలు ప్రభావితం కావచ్చని విమానయాన అధికారులు తెలిపారు. సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు. అసౌకర్యం ఏర్పడనున్న నేపథ్యంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అటు.. పొగ మంచు కారణంగా 30 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదీ చదవండి: నేడు కేంద్ర అఖిలపక్ష భేటీ -
అక్కడ ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి ఈవీ.. భారీ రాయితీలే కారణమా?
నిత్యం కాలుష్యంతో సతమతవుతున్న దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ కాలుష్య కోరల్లో నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో ఒకటి సంప్రదాయ ఇంధన వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇది సఫలమైనట్టుగానే కనిపిస్తోంది. వాహనాల ఉద్గారాలను తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశ రాజధాని ఢిల్లీ డిసెంబర్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఢిల్లీలో మొత్తం వాహన విక్రయాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా నవంబర్ 2023లో 9.5 శాతం ఉండగా డిసెంబర్లో 19.5 శాతానికి పెరిగింది. ఢిల్లీలో డిసెంబరు నెలలో అమ్ముడుపోయిన ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం కావడం గమనార్హం. 2020 ఆగస్ట్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వల్లే ఇది సాధ్యమైందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ పాలసీ కింద ఈవీల కొనుగోలుదారులు, తయారీదారులకు వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది. వీటిలో భాగంగా ఎలక్ట్రిక్ కార్లకు రూ. 1.5 లక్షల వరకు క్యాష్‌బ్యాక్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఈ-రిక్షాలు, సరుకు రవాణా వాహనాలకు రూ. 30,000 వరకు రాయితీ ఇస్తోంది. దీంతోపాటు పాత పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చుకోవాలనుకునే వారికి స్క్రాపింగ్ ఇన్సెంటివ్‌లు సైతం ప్రకటించింది. ఒక సంవత్సరంలో నగరం అంతటా 200 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, పాలసీ అమలును పర్యవేక్షించడానికి 'స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డ్'ని ఏర్పాటు చేయడం కూడా ఈ పాలసీ లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలోని వాటాదారులందరి మధ్య సమన్వయం, సహకారం కోసం త్వరలో ఢిల్లీ ఈవీ ఫోరమ్‌ను ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. -
‘పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయం’.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో పిల్లల శ్వాస, నాడీ వ్యవస్థలను వాయు కాలుష్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. దాంతో పిల్లల్లో న్యుమోనియా కేసులు అధికమవుతున్నాయి. పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం వాతావరణంలోనూ అనూహ్య మార్పులు తీసుకొస్తోంది. మొత్తంగా ఇది కంటికి కనిపించని శత్రువుగా పరిణమించింది. భారత్‌లోనూ ఈ సమస్య పోనుపోను తీవ్రతరమవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయంగా పెట్రోల్, డీజిల్‌లతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ కూడా 2024 జనవరి ఒకటో తేదీ (సోమవారం) నుంచి డీజిల్, పెట్రోల్‌లతో నడిచే వాహనాలను కొనుగోలు చేయవద్దని ఆదేశించారు. ఈ నిర్ణయం ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంతోపాటు ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ శాఖలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనాలంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 185, ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలు 2733గా ఉందని సీఎం తెలిపారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఏటా వాయు ప్రమాణాలను అధ్యయనం చేస్తోంది. దాని ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రూపొందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన నివేదికలో ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు!
దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ. డిసెంబర్లో రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా శనివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. శనివారం ఢిల్లీలో నాలుగు నుండి 10 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశ నుండి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీలో డిసెంబర్ 28 వరకు ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలి దిశలో మార్పు, తగ్గిన వేగం కారణంగా రాజధాని మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా జనం కళ్ల మంటలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఎన్‌సిఆర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409గా నమోదయ్యింది. ఇది తీవ్రమైన విభాగంలో ఉంది. ఇది గురువారం కంటే 48 సూచీలు ఎక్కువ. శుక్రవారం మధ్యాహ్నానికి కూడా సూర్యుడు కనిపించలేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలోని 24 ప్రాంతాల్లో గాలి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. ఇది కూడా చదవండి: ‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’ -
ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో గత నెల రోజులుగా కాలుష్య తీవ్రత కొనసాగుతోంది. దీపావళికి ముందు కురిసిన వర్షంతో ఇక్కడి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, దీపావళి నుండి కాలుష్యం ‘అతి పేలవమైన’ స్థాయికి చేరడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 300 కంటే ఎక్కువగా ఉంది. అంటే అతి పేలవమైన కేటగిరీలో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత స్థాయి 360 దాటింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 350, ఆర్కె పురంలో 325, పంజాబీ బాగ్‌లో 332, ఐటీవోలో 328గా ఉంది. శనివారం నుంచి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఏక్యూఐ శుక్రవారం 324గా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి వేగం తక్కువగా ఉంది. పగటిపూట గాలి వేగం సాధారణంగా గంటకు పది కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. అందుకే ఇక్కడి గాలిలో కాలుష్య కణాలు ఎక్కువ కాలం ఉంటాయి. శనివారం, ఆదివారాల్లో ఢిల్లీవాసులు ప్రాణాంతక కాలుష్యం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 12 నుంచి 16 కిలోమీటర్లు ఉండవచ్చు. బలమైన గాలి ప్రభావం కారణంగా కాలుష్యం తగ్గే అవకాశాలున్నాయి. శుక్రవారం ఆకాశం నిర్మలంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా 25.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శనివారం కూడా ఉదయం తేలికపాటి పొగమంచు, పగటిపూట నిర్మలమైన ఆకాశం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. శని, ఆదివారాల్లో ఈదురు గాలులు వీస్తాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే? -
పేద దేశాలకు ‘వాతావరణ మార్పుల’ నష్టపరిహారం
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయి నగరంలో కాప్–28 సదస్సు గురువారం ప్రారంభమైంది. 12 రోజులపాటు సదస్సు జరగనుంది. తొలిరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే. అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తోంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు. -
కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం..
దేశరాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్రం ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఇక్కడి జనంలో చికాకు, కోపం, ఒత్తిడి తదితర సమస్యలు పెరుగుతున్నాయి. అత్యంత కలుషిత నగరాల్లో నివసించే జనం డిప్రెషన్, నిద్రలేమి, తలనొప్పి, ప్రవర్తనలో మార్పులు, మానసిక అలసట లాంటి సమస్యలను ఎదుర్కొంటారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాలుష్యం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మనిషిలో కోపం, హింసాత్మక ప్రవర్తన పెరుగుతుంది. విషపూరితమైన గాలిలో ఉండే హానికరమైన పదార్థాలు మనిషి మెదడుకు చేరి, దానిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కాలుష్యపూరిత ప్రాంతాల్లో నివసించేవారు అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం అనేది మెదడును దెబ్బతీస్తుంది. నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్‌ను అడ్డుకుంటుంది. జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతుందని నిరూపితమయ్యింది. ఎవరైనా కలుషితమైన గాలిని పీల్చినప్పుడు, శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఈ హార్మోన్లు మనిషి మెదడును ప్రభావితం చేస్తాయి. దాని సాధారణ పనితీరులో జోక్యం చేసుకుంటాయి. ఫలితంగా అసౌకర్యం, ఆందోళన, ఒత్తిడిని ఎదురవుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది. రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలామంది బయటకు వెళ్లడం లేదు. మునుపటిలా స్నేహితులు, బంధువులను కలవడం తగ్గించేశారు. కనీసం పార్కుకు వెళ్లడం లేదా బయట నడవడం కూడా మానుకున్నారు ఫలితంగా ఒంటరితనం, నిరాశకు గురవుతున్నారు. ఫలితంగా అలాంటి వారిలో చికాకు, కోపం పెరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి! -
ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజల ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దిశలో మార్పు, వేగం తగ్గడం వల్ల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మళ్లీ తీవ్ర వర్గానికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం జహంగీర్‌పురిలో 434, బవానాలో 441, ద్వారకలో 412, బురారీలో 441, ఆనంద్ విహార్‌లో 387, అశోక్ విహార్‌లో 386గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పొగమంచు కమ్మేయడంతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పర్వతాలపై మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. ఇదిలా ఉండగా వాయు కాలుష్య నియంత్రణకు అనుసరిస్తున్న విధానం తదుపరి దశకు చేరుకుంది. దీంతో రాజధానిలో జీఎన్జీ, బీఎస్4 డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులు మినహా ఇతర బస్సుల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. టూరిస్ట్ బస్సులు, కాంట్రాక్ట్ బస్సులు, రాష్ట్ర రవాణా బస్సులు, డీజిల్ బస్సులు మినహా ఇతర రాష్ట్రాల్లోని అన్ని రకాల పర్మిట్లు కలిగిన బస్సులు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని నిషేధించనున్నట్లు ఒక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్‌లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు! -
ఢిల్లీలో మరో మూడు,నాలుగు రోజులు విష గాలులే!
ఢిల్లీని మరోమారు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఫలితంగా విజిబులిటీ దెబ్బతినడమే కాకుండా జనం విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం రాజధానిలోని ఐదు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 లేదా అంతకంటే ఎక్కువ అంటే ‘తీవ్రమైన’ విభాగంలోకి చేరుకుంది. మరో మూడు నాలుగు రోజులపాటు ఈ విషపూరితమైన గాలి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఢిల్లీ ప్రజలకు లేదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గాలి దిశ, వేగం మారడంతో శని, ఆదివారాల్లో కాలుష్య స్థాయిలో కొంత మెరుగుదల కనిపించింది. అయితే ఇప్పుడు గాలిలో ఉధృతి ఏర్పడిన కారణంగా కాలుష్య స్థాయి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సూర్యరశ్మి బలహీనంగా మారి వాతావరణంలో పొగమంచు కమ్ముకుంది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దృశ్యమాన స్థాయి 1500 మీటర్ల వరకు ఉంది. సాధారణంగా రెండు వేల మీటర్లు ఉండాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 372గా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. గాలిలో తేమ స్థాయి 95 నుంచి 56 శాతంగా నమోదైంది. లోధి రోడ్డు అత్యంత శీతల ప్రాంతం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బుధవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది కూడా చదవండి: అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి? -
Climate Change: డేంజర్ మార్క్ దాటేశాం
భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...! వినాశనమే...? గ్లోబల్ వారి్మంగ్‌తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్‌లోని కోపరి్నకస్ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది! 1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాప్’ లక్ష్యాలన్నీ గాలికి... గ్లోబల్ వారి్మంగ్ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్‌లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్‌గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు... ► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది! ► గ్లోబల్ వారి్మంగ్ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ► గ్లోబల్ వార్మింగ్ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ► ముఖ్యంగా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ స్పష్టం చేస్తున్నారు. ► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్‌లో కాప్–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి! వినాశనమే...? ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే... ► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. ► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్ రీఫ్‌లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. ► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది. ► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది. ► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ► ఇటీవలే ఉత్తరాఖండ్‌లో భూమి బీటలుబారడం తెలిసిందే. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు! – సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ – సాక్షి, నేషనల్ డెస్క్ -
దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా?
శీతాకాలం రాగానే ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా దేశంలోని అనేక నగరాలు వాయు కాలుష్యానికి లోవుతుంటాయి. పొగ మంచు దుప్పటిలో దూరిన విషపూరిత వాయు కాలుష్యం ప్రజల జీవనాన్ని అవస్థలపాలు చేస్తోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. అయితే చలికాలంలో కాలుష్యం అంతలా ఎందుకు తీవ్రమవుతుందని, దీని ప్రభావం దక్షిణాసియాపైనే ఎందుకు అధికంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల అభిప్రాయం ప్రకారం గత రెండు దశాబ్దాలలో దక్షిణాసియా ప్రాంతంలో వేగంగా పారిశ్రామికీకరణ జరిగింది. ఆర్థికాభివృద్ధి ఊపందుకుంది. జనాభా కూడా అంతే వేగంగా పెరిగింది. వీటన్నింటి కారణంగా డీజిల్,పెట్రోల్, ఇతర ఇంధన వనరుల వినియోగం అత్యధికం అయ్యింది. ఫలితంగా కాలుష్య స్థాయి కూడా పెరిగింది. వీటన్నింటికీతోడు దక్షిణాసియాలో దారుణమైన కాలుష్యం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శీతాకాలపు కాలుష్యానికి అతిపెద్ద కారణం పంజాబ్, హర్యానాలో రైతులు పంటలను కాల్చడం. ఈ ప్రాంతంలో 38 శాతానికి పైగా కాలుష్యం వరి పొలాల్లోని వృథా గడ్డిని కాల్చడం కారణంగానే ఏర్పడుతోంది. దీనికితోడు గత కొన్నేళ్లుగా ఢిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి నుంచి వెలువడే పొగ కూడా కాలుష్యానికి కారణంగా నిలుస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీ రోడ్లపై దాదాపు 80 లక్షల వాహనాలు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మందికి 472 వాహనాలు ఉన్నాయి. అంటే ఢిల్లీలో ప్రతి ఇద్దరికి సగటున ఒక వాహనం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక పద్ధతులను అవలంబిస్తున్నప్పటికీ అవేవీ తగినంతగా లేవని తేలింది. భారతప్రభుత్వం హరిత ఇంధనాలపై దృష్టి సారించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్నాహాన్ని అందిస్తోంది. అయినా కాలుష్య నియంత్రణకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దక్షిణాసియాలోని ప్రధాన నగరాల్లో కాలుష్య సమస్య నుండి బయటపడటం కష్టమైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం విధాన రూపకర్తలు తమ సంకల్ప శక్తిని ప్రదర్శించాలంటున్నారు. ప్రభుత్వాలు స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను రూపొందించాలని, వ్యవసాయం, ఇతర కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తగిన విధంగా పారవేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్‌కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత? -
ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!
ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. డిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో వాయు నాణ్యత మరోసారి ‘తీవ్ర’ కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)442, ఐటీఓలో 415, జహంగీర్‌పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్‌లో 415, ఆనంద్ విహార్,ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదుటనున్నవి స్పష్టంగా కనిపించడం లేదు. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు మాట్లాడుతూ తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని వాపోయాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే.. #WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category. (Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ — ANI (@ANI) November 16, 2023 -
ఇంకా తెల్లారని ఢిల్లీ.. పొగమంచు వీడేనా?
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత ‘తీవ్రం’గానే ఉంది. దీపావళి తర్వాత, దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభం తిరిగి తలెత్తింది. నగరం విషపూరిత పొగమంచుతో నిండిపోయింది. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో అన్ని వయసుల వారూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (బుధవారం) ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో గాలిలో కాలుష్యాన్ని కొలిచే సగటు వాయు నాణ్యత సూచిక (ఎక్యూఐ) ‘తీవ్రమైన’ కేటగిరీలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉదయం 6 గంటలకు నమోదు చేసిన డేటా ప్రకారం ఎక్యూఐ ఆర్కే పురంలో 417, ఆనంద్ విహార్‌లో 430, ఐజీఐ విమానాశ్రయంలో 403, నరేలాలో 430, పంజాబ్ బాగ్‌లో 423గా నమోదైంది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో ప్రతి సంవత్సరం చలికాలం ప్రవేశించడంతోనే వాయు నాణ్యత మరింతగా క్షీణిస్తుంది. వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాల దుమ్ము, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి కాలుష్య కారకాలుగా నిలుస్తున్నాయి. ఇది కూడా చదవండి: సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది? #WATCH | Air quality across Delhi continues to be in the 'Severe' category as per the Central Pollution Control Board (CPCB). (Visuals from IIT Delhi, shot at 6:30 am) pic.twitter.com/AxgNPrXBOv — ANI (@ANI) November 15, 2023 -
ఢిల్లీని బెంబేలెత్తిస్తున్న కాలుష్య స్థాయిలు
దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం మరింతగా పెరిగింది. గాలి నాణ్యత ‘పేలవమైన’ కేటగిరీకి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత స్థాయి 450కి చేరుకుంది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 360, ఆర్కె పురంలో 422, పంజాబీ బాగ్‌లో 415గా ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కాలుష్యంతో పాటు పొగమంచు కమ్మేయనుంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)దీపావళి సందర్భంగా ఢిల్లీలోని 31 ప్రదేశాలలో శబ్ద కాలుష్యాన్ని అంచనా వేసింది. వీటిలో ఏడు నిశ్శబ్ద మండలాలు, ఎనిమిది నివాస ప్రాంతాలు, 11 వాణిజ్య, ఐదు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. నజాఫ్‌గఢ్‌లో అత్యల్ప స్థాయి శబ్ధ కాలుష్యం, కరోల్ బాగ్‌లో అత్యధిక శబ్ధ కాలుష్యం నమోదైంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ విశ్లేషణ ప్రకారం, దేశ రాజధానిలోని దాదాపు అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగాయి. దీపావళి (ఆదివారం) నాడు ఢిల్లీలో 24 గంటల సగటు పార్టికల్ మీటర్(పీఎం)10 గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 430 మైక్రోగ్రాములుగా ఉంది. గత సంవత్సరం క్యూబిక్ మీటరుకు 322 మైక్రోగ్రాములు, 2021లో క్యూబిక్ మీటరుకు 748 మైక్రోగ్రాములుగా నమోదయ్యింది. అలీపూర్, పట్పర్గంజ్, నజాఫ్‌గఢ్, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లలో 2022తో పోలిస్తే 2023లో పార్టికల్ మీటర్ 10 సాంద్రతలు పెరిగాయని డీపీసీసీ డేటా వెల్లడించింది. ఇది కూడా చదవండి: గాజాపై హమాస్ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్ -
కాలుష్య కోరల్లోకి మరో రెండు నగరాలు.. టాప్-10లోకి చేరిన ఇండియన్ సిటీలు ఇవే..
ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలోకి ఢిల్లీతో పాటు మరో రెండు భారతీయ నగరాలు చేరాయి. దేశమంతా ఆదివారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ మొత్తంలో బాణాసంచా కాల్చడంతో ఆ విషపూరిత పొగ గాలిని కమ్మేసింది. ఫలితంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ప్రపంచంలో వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎప్పటిలాగే దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా అగ్ర స్థానంలో నిలించింది. ప్రస్తుతం అక్కడ గాలి నాణ్యత సూచీ 420 ఉండటంతో దీన్ని 'ప్రమాదకర' కేటగిరీలో చేర్చింది. టాప్-10 లో మరో రెండు నగరాలు అత్యంత కాలుష్యపూరిత నగరాల టాప్ 10 జాబితాలోకి భారత్ చెందిన మరో రెండు నగరాలు చేరాయి. 196 ఏక్యూఐతో కోల్‌కతా నాల్గవ స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై 163 ఏక్యూఐతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఏక్యూఐ స్థాయి 400-500 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఉన్న వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. ఇక 150-200 స్థాయి ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఏక్యూఐ స్థాయి 0-50 ఉంటే అది మంచిదిగా పరిగణిస్తారు. -
వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు!
ఢిల్లీలో వాయుకాలుష్యం చెప్పనలవి కానంతగా పెరిగిపోయింది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు కలిగినవారు ఊపిరి తీసుకునేందుకు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో డిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు వీలైంతవరకూ బయటకు వెళ్లకుంటూ ఉంటే మంచిదని, స్వల్ప వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శివ ఆశ్రయ్ వృద్ధాశ్రమం సెక్రటరీ రాజేశ్వరి మిశ్రా మాట్లాడుతూ పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా అత్యవసర అవసరాల కోసం ఆశ్రమంలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పలుచోట్ల ‘ఎయిర్ ప్యూరిఫయర్లు’ ఏర్పాటు చేసింది. ఎన్డీఎంసీ వైస్-ఛైర్మెన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము వృద్ధాశ్రమాలలో నివసించేవారి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తుంటామని, అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన! -
‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది?
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దీపావళి మరుసటి రోజు ఉదయం అంటే నవంబర్ 13 నుండి ప్రారంభంకానుంది. ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) గత కొన్ని రోజులుగా నిరంతరం 450కు పైననే ఉంటూ వస్తోంది. ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే గాలి పీల్చుకోవడానికి ‘చెడు’ అయినదిగా పరిగణిస్తారు. ఇది 301-400 మధ్య ఉంటే ‘చాలా పేలవంగా’ ఉన్నట్లులెక్క. 401-500 మధ్య ఉంటే ‘తీవ్రమైనది’గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ‘చాలా తీవ్రమైనది’గా పరిగణిస్తారు. నవంబరు 13-20 తేదీల మధ్య గత ఏడేళ్లుగా ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలుత దీనిని 2016లో ప్రారంభించారు. సరి-బేసి విధానం అంటే ఏమిటి? రెండు చేత భాగింపబడని సంఖ్యను బేసిగా పరిగణిస్తారు. ఉదాహరణకు 1, 3, 5…. ఇక సరి (ఈవెన్) అంటే రెండు చేత పూర్తిగా భాగింపబడే సంఖ్య. ఉదాహరణకు 2, 4, 6.. ఇవి సరి సంఖ్యలుగా పరిగణిస్తారు. ‘బేసి-సరి’ నియమం ప్రకారం డ్రైవింగ్ చేయడం అంటే.. సరి సంఖ్యగల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ సరి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా బేసి సంఖ్యల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ బేసి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి కల్పిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం విషయానికొస్తే.. ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై కార్ల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలనుకుంటోంది. ఇలా చేయడం వలన వాయు నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తోంది. గతంలో ప్రభుత్వం దీనిని అమలు చేసినప్పుడు, టాక్సీలు (సీఎన్జీతో నడిచేవి), మహిళలు నడిపే కార్లు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, అన్ని ద్విచక్ర వాహనాలతో సహా అనేక వర్గాల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 75 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఈ 75 లక్షల వాహనాల్లో మూడో వంతు కార్లు. బేసి-సరి పథకం అమలయినప్పుడు ప్రతి రోజు దాదాపు 12.5 లక్షల కార్లు (ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మినహా) ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అవకాశం ఉండదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏడాది పొడవునా ఉంటుంది. అయితే కొన్ని నెలల్లో (ముఖ్యంగా దీపావళి వచ్చే మాసంలో) వాయు కాలుష్యం మరింత తీవ్రంగా మారుతుంది. పంజాబ్, హర్యానాలలో పంట చేతికొచ్చాక గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇది కూడా వాయు కాలుష్యానికి కారణంగా నిలుస్తుంది. అక్కడి నుంచి వచ్చే పొగ ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా, మెక్సికో, ఫ్రాన్స్‌లోని నగరాల్లో సరి-బేసి విధానాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. 2019లో ఢిల్లీలో సరి-బేసి విధానం అమలు చేసినప్పుడు నోయిడా, ఘజియాబాద్‌లలో స్వల్పంగా వాయు కాలుష్యంలో తగ్గుదల కనిపించిందని తేలింది. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడం వల్ల తీవ్రమైన కాలుష్య స్థాయిలు ఖచ్చితంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత మేరకు ఉంటుందనేది అంచనా వేయడం కష్టమని అంటున్నారు. 2016 జనవరిలో సరి-బేసి విధానాన్ని అమలు చేసినప్పుడు.. ఈ ప్రణాళిక ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమైంది’ అని ఒక అధ్యయనం పేర్కొంది. ఇది కూడా చదవండి: కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? -
వాయు కాలుష్యానికి విరుగుడు
ఢిల్లీ మహానగరం ఇప్పటికే వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేయడం, పంట పూర్తయిన తర్వాత కొయ్యకాళ్లను కాల్చడం, రవాణా వాహనాల నుంచి వచ్చే పొగ, అవి నిరంతరం లేపే ధూళి... ఇవన్నీ వాయు నాణ్యతను దారుణంగా తగ్గిస్తున్నాయి. పైగా రానున్నది దీపావళి పండుగ కావడంతో ఈ ఆందోళన మరింత పెరుగుతోంది. వాయు కాలుష్య సమస్య ఢిల్లీలో తీవ్రంగా ఉన్నప్పటికీ, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇది పట్టించుకోవాల్సిన అంశమే. ఈ తీవ్ర సమస్యను ఎదుర్కోవడానికి, ఉద్గారాల జాబితా అని చెబుతున్న కారకాల పరిమాణంపై కేవల సమాచారం సరిపోదు. ఈ ఉద్గారాల మూలాలపై డేటా అందుబాటు లోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభావవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు. ప్రాథమికంగా ఉన్న సమాచారంతో కొన్ని సమర్థవంత మార్గాలనైతే చేపట్టవచ్చు. మనం దీపావళికి దగ్గరవుతున్న కొద్దీ, గాలి నాణ్యత గురించిన ఆందోళన ‘జాతీయ రాజధాని ప్రాంతం’(నేషనల్ క్యాపిటల్ రీజియన్ – ఢిల్లీ)లో ఊపందుకుంటుంది. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది. చలిని తట్టుకోవడానికి కలపను కాల్చడం, తదుపరి పంటకు నేలను సిద్ధం చేయడం కోసం పంట కోతల తర్వాత మిగిలిన చెత్తను తగులబెట్టడం, రవాణా వాహనాల నుంచి ఉద్గారాలు వెలువడటం, అనేక మూలాధారాల నుండి వచ్చే ధూళి కలిసి ఒక ప్రాణాంతక మిశ్రమాన్ని సృష్టిస్తాయి. కొన్నేళ్లుగా ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు రావడం కూడా క్షేమకరం కాని పరిస్థితి. స్పష్టంగా చెప్పాలంటే, ఇది కొనసాగకూడదు. పరిష్కారాన్ని కనుగొనడానికి, ఢిల్లీ ప్రభుత్వం గాలి నాణ్యతా నిర్వహణ కోసం ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ తీవ్ర సమస్యను ఎదుర్కోవటానికి వ్యూహాలను రూపొందించడం కోసం, ఉద్గారాల జాబితా అని చెబుతున్న కాలుష్య కారకాల పరిమాణంపై కేవలం సమాచారం సరిపోదు. ఈ ఉద్గారాల మూలాలపై డేటా అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభావ వంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు. వాటి కాలాను గుణమైన వైవిధ్యాలతోపాటు, ఈ ప్రతి ఒక్క మూలాధారం నుండి ఉద్గారాల వాటా ఎంత అనేది కీలకం. గాలి నాణ్యతా నిపుణులు దీనినే మూల విభజనగా సూచిస్తారు. సరళంగా చెప్పాలంటే, మనం ఎదుర్కొనే కాలుష్య స్థాయికి వివిధ కార్యకలాపాలు ఎలా కారణం అవుతున్నాయనేది ఇది మనకు తెలియజేస్తుంది. ఈ ప్రతి మూలాధారం నుండి వచ్చే మొత్తం ఉద్గారాల వాటా ఏడాది పొడవునా లేదా రోజంతా కూడా స్థిరంగా ఉండదు. ఇంకా, అవి నగరంలోని వివిధ ప్రాంతాలలో కూడా మారుతూ ఉంటాయి. అందువల్ల, రోజులో ఏ సమయంలో లేదా సంవత్సరంలో ఏకాలంలో, లేదా నగరంలోని ఏయే ప్రదేశాలలో కాలుష్యానికి దోహద పడుతున్నవి ఏమిటన్నది అర్థం చేసుకోవడం ముఖ్యం. పనికొచ్చే అధ్యయనాలు నిపుణులు మూలాలను కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు సాధారణంగా నాలుగు ముఖ్యమైన అధ్యయనాలను సూచిస్తుంటారు. అవి: ఒకటి, ఢిల్లీ కోసం... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ సమర్పించిన కాలుష్య మూలాల విభజన, మూలాల జాబితా (2015); రెండు, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తేరి) అధ్యయనం (2018); మూడు, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం (2018); ఇక నాలుగవది, సిస్టమ్ ఆఫ్ ఎయిర్–క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్(సఫర్) అధ్యయనం (2018). గాలి కాలుష్యానికి వివిధ కారకాలు అందిస్తున్న సాపేక్ష సహ కారంలో గణనీయ స్థాయిలో సీజన్ పరమైన తేడాలు ఉన్నట్లు ఈ అధ్యయనాలు చూపుతున్నాయి. వేసవిలో, ధూళి ప్రభావం దాదాపు 31–34 శాతం వరకు పెరుగుతుంది. శీతాకాలంలో దాని వాటా 6–15 శాతం వరకు తగ్గుతుంది. వాహనాలు, పరిశ్రమలు, బయోమాస్ దహనం తోడ్పాటు శీతాకాలంలో దాదాపు 85–94 శాతం వరకు పెరుగుతుంది. ముఖ్యంగా ద్వితీయ కణాల వాటా (సల్ఫర్ డయా క్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, అమ్మోనియా, అస్థిర కర్బన సమ్మేళనాలు వంటి దహన మూలాల నుండి వాతావరణంలో ఏర్పడేవి) శీతాకా లంలో 26–30 శాతంగా, వేసవిలో 15–17 శాతంగా ఉంటుంది. స్పష్టంగా, రవాణా, రహదారిపై ధూళి అనేవి సంవత్సరం పొడవునా గాలి కాలుష్యానికి ముఖ్యమైన దోహదకారులు. అయితే, అధ్యయనాలు జరిగిన సమయంలో కొయ్యకాళ్ల దహనం ప్రధాన సమస్యగా లేదు. అందువల్ల దాని ప్రభావం గురించి తగినంత సమాచారం లేదు. అయినప్పటికీ, గాలి కాలుష్యానికి అధికంగా దోహదం చేస్తున్న కొయ్యకాళ్ల దహనం ఒక నెల వ్యవధిలో మాత్రమే జరుగుతుంది. ఆకుపచ్చటి రోడ్లు రహదారిపై ధూళిని తగ్గించడానికి, మోటారు వాహనాల నుండి ఉద్గారాలను తగ్గించడానికి తీసుకోగల చర్యలు దీర్ఘకాలికమైనవి. రహదారి దుమ్ముతో వ్యవహరించడానికి రోడ్డు పక్కలను పచ్చగా మార్చడం లేదా వాటిపై నీటిని చిలకరించడానికి గట్టి ప్రయత్నం అవసరం. ఢిల్లీ ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేయాలి. రవాణా రంగం నుండి ఉద్గారాలను తగ్గించడానికి అనేక విధాలుగా ప్రయత్నించవచ్చు. వాటిలో ముఖ్యమైనది వ్యక్తిగత మోటారు వాహనాల నుండి ప్రజా రవాణాకు మారేలా గణనీయంగా ప్రభావితం చేయడం. ఢిల్లీ నగరంలో ఇప్పటికే 400 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ పనిచేస్తుండగా, చిట్టచివరి గమ్యం వరకూ అనుసంధానం లేకపోవడం వల్ల దాని వినియోగానికి ఆటంకం ఏర్పడుతోంది. మెట్రో రైలు వ్యవస్థను పూర్తి చేయడానికి, పబ్లిక్ బస్సు వ్యవస్థలను విస్తృతంగా పెంచడం, మెరుగుపరచడం ఎంతగానో అవసరం. వ్యక్తిగత మోటారు వాహన వినియోగదారులు కూడా ఆకర్షితులయ్యేలా అధిక నాణ్యతా సేవలను అందించే స్థానిక బస్సు సేవలను నిర్వహించడం అవసరం. ఇరుగుపొరుగు వారికి సేవ చేయడానికి స్థానిక సర్క్యులేటర్ సేవలను నిర్వహించడం కూడా సరైన దిశలో ఒక అడుగు. అత్యధికంగా ట్రాఫిక్ ఉండే రహదారులను గుర్తించడం ద్వారా వాటిని వన్ వేలుగా మార్చడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేయడానికి, పనిలేకుండా ఉన్న వాహనాల నుండి ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడుతుంది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌ను (ఐటిఎంఎస్) పరిచయం చేయడం కూడా ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికీ, నిష్క్రియాత్మక ఉద్గారాలను తగ్గించడానికీ మరొక మార్గం. ఇటీవల ప్రతిపాదించిన ప్రీమియం బస్ అగ్రిగేటర్ పథకం సరైన దిశలో ఒక అడుగు. పార్కింగ్ రుసుములను పెంచడంతోపాటు, రద్దీ సమయంలో అధికంగా వసూలు చేసే వ్యవస్థను ప్రవేశపెట్టడం వలన ప్రజలు వారి వ్యక్తిగత మోటారు వాహనాలను ఉపయోగించకుండా నిరోధించ వచ్చు. ఎలక్ట్రిక్ చలనశీలతకు ఇటీవల ఏర్పడుతున్న ప్రాధాన్యత కూడా సరైన దిశలో మరొక అడుగు అని చెప్పాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు వాస్తవంగా ఎటువంటి కాలుష్యాన్నీ విడుదల చేయవు. చలికాలంలో పేదలకు ఆశ్రయాలు మరొక ముఖ్యమైన కాలుష్య సహకారి ఏదంటే, ముఖ్యంగా చలికాలంలో వెచ్చగా ఉండటానికి పేద పౌరులు కట్టెలను కాల్చడం. ఈ సమస్యను తగ్గించడానికి, నిరాశ్రయులైన వారి కోసం పెద్ద సంఖ్యలో ఆశ్రయాలను ఏర్పర్చేందుకు అవకాశాలను అన్వేషించాలి. ఈ అశ్రయాలను స్వచ్ఛమైన శక్తి రూపాలను ఉపయోగించి వెచ్చగా ఉంచవచ్చు. ఇటువంటి ఆశ్రయాలు పేదలకు మరింత సౌకర్యవంతమైన గూడును అందించడంతోపాటు వాయు కాలుష్యాన్ని తగ్గించడం అనే ద్వంద్వ ప్రయోజనాలకు కూడా చక్కగా ఉపయోగ పడతాయి. అనేక ఫ్లై ఓవర్ల కింద ఉన్న స్థలాన్ని దీని కోసం ప్రయోజ నకరంగా ఉపయోగించవచ్చు. ఇంకా, దీన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం కోసం రోజులో, సీజన్లలో మూలాల విభజన డేటాను సేకరించే వ్యవస్థ అవసరం. ఢిల్లీలోని గాలి నాణ్యత సమస్యలను మరింత శాశ్వత ప్రాతి పదికన అంతం చేసేందుకు ఈ రకమైన సాధారణ డేటా ఉపయోగ పడుతుంది. ‘బిగ్ డేటా‘కు ప్రాధాన్యత ఉంటున్న ఈ యుగంలో, ఇది ఎంతమాత్రమూ సమస్య కాకూడదు. – అనిల్ బైజల్, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ – ఓపీ అగర్వాల్, ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం
ఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. ఢిల్లీలోని ముంద్ఖా ప్రాంతంలో గురువారం గాలినాణ్యతా ప్రమాణాలు తీవ్ర స్థాయికి చేరాయి. నాణ్యతా ప్రమాణాల సూచీలో అత్యధికంగా 616 పాయింట్లకు పడిపోయిందని అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. బుధవారం ఉష్ణోగ్రత అత్యధికంగా 32.7 డిగ్రీలుగా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) రాత్రి 7 గంటలకు 357 వద్ద నమోదైంది. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అటవీ శాఖకు హైకోర్టు ఆదేశించింది. కలుషిత గాలి పీల్చడం వల్ల అస్తమా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత సూచిలో 0-50 ఉంటే ఆరోగ్యమైన గాలి ఉన్నట్లు, 50-100 ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. 101-200 ఉంటే మధ్యస్థంగా, 201-300 పేలవంగా ఉన్నట్లు గణిస్తారు. 301-400 ఉంటే అత్యంత పేలవంగా, 401-500 ఉంటే తీవ్ర స్థాయిలో గాలి నాణ్యతా ప్రమాణాలు ఉన్నట్లు భావిస్తారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో నేడు ఈడీ ఎదుటకు సీఎం కేజ్రీవాల్ -
లాక్డౌన్ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆదేశాలు?
పండుగల సీజన్లో ఢిల్లీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఢిల్లీ ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ వాయు నాణ్యత సూచీ తాజాగా 302కి చేరుకుంది. ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ సూచీ(ఏక్యూఐ) 200 నుండి 300 మధ్య ఉంటుంది. రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింత దిగజారుతోంది. దీపావళికి ముందే ఢిల్లీ పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ పండుగ తరువాత పరిస్థితి మరింత దిగజారనుంది. మొన్న ఆదివారం ఉదయం ఢిల్లీ ఏక్యూఐ 266గా ఉంది. శనివారం ఈ సంఖ్య 173గా ఉంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మధ్యాహ్నానికి 330కి చేరుకుంటోంది. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్డౌన్ తప్పదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ వాతావరణం మరింత దిగజారుతుండటంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయాందోళన వ్యక్తం చేసింది. జనం ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. పార్కింగ్ ఫీజులు పెంచాలని, ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగితే, నూతన ఆంక్షలు విధించే అవకాశముందని సమాచారం. ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం స్టేజ్-3కి చేరుకుంటే, బీఎస్-III, బీఎస్-IV వాహనాలను నిషేధించవచ్చు. అత్యవసర సేవల వాహనాలపై కూడా పరిమితులు విధించే అవకాశముంది. రైల్వేలు, జాతీయ భద్రతా ప్రాజెక్టులు, ఆసుపత్రులు, మెట్రో, హైవేలు, రోడ్లు మినహా ఇతర ప్రాజెక్టులను అధికారులు నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలుష్య పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటే హైవేలు, రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, పైప్లైన్ల పనులు కూడా నిలిచిపోనున్నాయి. విద్యాసంస్థలను కూడా మూసివేసే అవకాశాలున్నాయి. వాహనాలకు సంబంధించి బేసి-సరి ఫార్ములా తిరిగి అమలు చేసే అవకాశముంది. అలాగే ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేసేవిధంగా అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే కొన్ని సంస్థలలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? -
మురికికూపాలు..సుందర జలాశయాలుగా..
(నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి) నిర్లక్ష్యానికి నిలయాలుగా.. అపరిశుభ్రతకు ఆలవాలంగా.. కాలుష్యపు కాసారాలుగా మారిన పట్టణాల్లోని చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొస్తోంది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా చూడముచ్చటగా అభివృద్ధి చేస్తోంది. పార్క్ వాతావరణం, గట్లపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె, ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను ఏర్పాటుచేస్తోంది. వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మురుగునీరు వాటిల్లోకి చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. మొదటి దశలో 101 జలాశయాలను, రెండో దశలో మరో 95 చెరువులను సుందరీకరించే పనిని ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీబీసీ) ఇప్పటికే చేపట్టింది. రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరించి, తిరిగి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీలు–అర్బన్ లోకల్ బాడీలు) 196 చెరువులను ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.522 కోట్లను వెచ్చిస్తోంది. మొదటి దశలోని 101 జలాశయాల్లో ఇప్పటికే 50 చెరువుల్లో సుందరీకరణ పనులు దాదాపు పూర్తిచేశారు. ఆయా పనులకు అవసరమైన ప్రణాళికను పురపాలక శాఖ రూపొందించి, ఇప్పటికే అమలుచేస్తోంది. ఈ నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తోంది. మొదటి దశలోని చెరువుల్లో సగం చెరువుల పనులు పూర్తిగా, మిగతావి దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. వరద నష్టాన్ని నివారించేలా మార్పులు.. వరదలు వచ్చినప్పుడల్లా పట్టణాల్లో వీధులు నీటమునగడం పరిపాటిగా మారి, ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సైతం పట్టణాల్లోని చెరువులను అమృత్ 2.0 పథకంలో అభివృద్ధి చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలోని పట్టణ జలాశయాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొచ్చేందుకు నడుంబిగించింది. మొదటి దశలోని 101 చెరువులను రూ.189.07 కోట్లతోను, రెండో దశలో 95 చెరువులకు రూ.332.97 కోట్లతోను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టులో చెరువులను వినియోగంలోకి తీసుకొచి్చ, వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా వర్షపు నీరు తప్ప మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వాటిల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగును శుద్ధిచేసి నీటిని స్వచ్ఛంగా మారుస్తున్నారు. జలాశయాల గట్లను రాళ్లతో పటిష్టం చేసి గట్లపై మొక్కలు నాటుతున్నారు. దీనివల్ల వరదలు సంభవించినప్పుడు ఆయా పట్టణాలకు ఈ చెరువులు సహజ రక్షణ వలయాలుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. నాడు ఈ ఫొటోలో కనిపిస్తున్నది గుంటూరు మున్సిపాలిటీలోని అంకిరెడ్డిపాలెం చెరువు. దాదాపు 12 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు ముఫ్పై ఏళ్ల క్రితం వరకు తాగునీటిని అందించింది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో మురుగునీరు, జారిపోయిన గట్లు, ముళ్ల చెట్లతో నిండిపోయింది. దీనినిప్పుడు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కొత్తగా తీర్చిదిద్దుతోంది. పటిష్టమైన గట్లు, సెంట్రల్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో సందర్శకులకు నిలయమైంది. పక్కనే ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ సైతం ఏర్పాటుచేస్తున్నారు. వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేడు చెరువుల అభివృద్ధి ఇలా.. మురుగుతో నిండిపోయిన జలాశయాలను శుద్ధి చేస్తారు. గట్లను పటిష్టం చేయడం, వీలైనంత ఎక్కువగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల్లా తీర్చిదిద్దుతారు. గట్లపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుచేస్తారు. ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను కలి్పస్తారు. ఆక్రమణలు జరగకుండా చుట్టూ రక్షణగా ఇనుప కంచె వేస్తున్నారు. తాగునీటి చెరువులుగా మార్పు జలాశయాల పునరుజ్జీవంలో మొదటి విడతగా 101 చెరువులను తీసుకున్నాం. ఇవి సుమారు 5 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో 50 జలాశయాల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ప్రతి చెరువును శుద్ధమైన నీటితో ఉండేలా ప్రక్షాళన చేయడంతో పాటు, గట్లను పటిష్టం చేసి, పార్కులు, వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్, పిల్లలకు ఆటస్థలం, వస్తువులతో పాటు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తున్నాం. పట్టణంలో కురిసిన వర్షపునీరు చెరువులోకి చేరేలా.. అక్కడ నుంచి బయటకు వెళ్లేలా ఇంజినీరింగ్ పనులు చేస్తున్నాం. తాగునీటి చెరువులను సైతం అభివృద్ధి చేస్తున్నాం. నవంబర్‌కి మొదటి దశ చెరువుల అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం. – బొమ్మిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏపీయూజీబీసీ ఎండీ స్థలాల రేట్లు పెరిగాయి ఈ ఊరిలో ఇక్కడే పుట్టి పెరిగాం. ఈ చెరువు నీటితోనే గ్రామం దాహం తీర్చుకునేది. కానీ, గత 30 ఏళ్లుగా నిరుపయోగంగా మారిపోయింది. ఊరు గుంటూరులో కలిసిపోయినా ఇటువైపు ఎవరూ వచ్చేవారు కాదు. ప్రభుత్వం ఈ చెరువును పార్కులా మారుస్తుండడంతో చుట్టుపక్కల స్థలాల రేట్లు పెరిగాయి. చుట్టూ వెంచర్లు కూడా వస్తున్నాయి. వచ్చే ఐదేళ్లల్లో ఈ ప్రాంతమంతా కొత్త పట్టణంగా మారిపోతుంది. – అప్పిరెడ్డి, అంకిరెడ్డిపాలెం (గుంటూరు) మా ప్రాంతానికి ఐకాన్ గతంలో ఈ చెరువులో చేపలు పెంచేవాళ్లం. కలుషిత నీరు చేరడంవల్ల చేపలు చనిపోతుండడంతో మానేశాం. వాకింగ్‌కు భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజెల్స్ లిమిటెడ్ (బీహెచ్‌వీపీ)కి వెళ్లా ల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు మా చెరువును ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండడంతో ఇకపై వాకింగ్‌కు, పిల్లలు ఆడుకునేందుకు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఈ ప్రాంతానికి ఇప్పుడీ చెరువు ఐకాన్‌లా మారుతోంది. – వి.వెంకటరమణ, అక్కిరెడ్డిపాలెం (విశాఖ) ఆక్రమణలు తొలగించి ఆహ్లాదకరంగా.. విశాఖపట్నం లంకెలపాలెం చెరువు మూడెకరాలకు పైగా ఉండేది. 20 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోయి అసాంఘిక పనులకు అడ్డాగా మారిపోయింది. ఇన్నేళ్లకు అధికారులు ఆక్రమణలను తొలగించి అద్భుతంగా మారుస్తున్నారు. గతంలో వాకింగ్‌కు స్టీల్ ప్లాంట్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఈ చెరువు గట్టుపైనే చేస్తున్నాం. జిమ్, పార్కు కూడా అభివృద్ధి చేస్తున్నారు. – సాలపు విజయకుమార్, లంకెలపాలెం (విశాఖపట్నం) బోటింగ్ కూడా పెడుతున్నారు హిందూపూర్‌లోని 113 ఎకరాల సూరపుకుంట చెరువు గత నెల వరకు గట్లు అడవిలా, పాములు, పందులకు నిలయంగా ఉండేవి. నీరు కూడా మురికిగా ఉండేది. అధికారులు పదిరోజుల్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు చెరువు గట్టుపై వాకింగ్ చేస్తున్నాం. అధికారులు బోటింగ్ పెట్టాలని కూడా నిర్ణయించారు. బెంగళూరు, ఎలహంకలో ఇలా చెరువుల అభివృద్ధిని చూశాను. – సింగిరెడ్డిపల్లి ప్రసాదరెడ్డి, హిందూపూర్ -
బీపీసీఎల్, ఐఓసీకి రూ.3కోట్లు ఫైన్!
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని రిటైల్ అవుట్లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (వీఆర్ఎస్) ఇన్స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో వీఆర్ఎస్లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్‌ఎస్‌ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్ఎస్ను ఇన్స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. -
ప్లాస్టిక్ ప్రళయం
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్లాస్టిక్ మింగేస్తోంది. సముద్ర జీవులు, అడవి జంతువులను హరించడంతో పాటు మానవుల ఆహారంలోకి చొరబడుతోంది. గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం 1950లో రెండు మిలియన్ టన్నులు ఉండగా.. తాజా వినియోగం 391 మిలియన్ టన్నులను దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి చిన్న పనిలోనూ ప్లాస్టిక్‌పై ఆధారపడటంతో వీటి వినియోగం క్రమేపీ ఎక్కువైంది. ఇది 2040 నాటికి రెట్టింపు అవుతుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. పండ్లలోనూ ప్లాస్టిక్ భూతమే మానవులు తరచూ తినే పండ్లు, కూరగాయలను కూడా ప్లాస్టిక్ వదలడం లేదు. తాజాగా ఇటలీలోని కాటానియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్యారెట్, పాలకూర, యాపిల్స్, బేరి పండ్లలో చిన్నచిన్న ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు. యాపిల్స్‌లో అత్యధికంగా సగటున గ్రాముకు 1.95 లక్షలు, బేరిలో 1.89 లక్షలు, క్యారెట్, బ్రొకోలీలో లక్ష వరకు అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. ప్లాస్టిక్ కలుషిత నీరు, భూమి ద్వారా ఆహార ఉత్పత్తుల్లోకి చేరుతున్నట్టు పేర్కొన్నారు. తాబేలు పొట్టలోనూ చేరుతోంది గతంలో సముద్ర తీరాల్లో అకారణంగా తాబేళ్లు మృత్యువాత పడుతుండటంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అరచేతిలో ఒదిగిపోయే చిన్న తాబేలు పొట్టలో దాదాపు 140 మైక్రో ప్లాస్టిక్ ముక్కలను కనుగొన్నారు. ప్రస్తుతం ఏటా 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతుండగా.. ఇది వచ్చే 20 ఏళ్లల్లోపే మూడు రెట్లు పెరగనుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 800కి పైగా సముద్ర, తీర ప్రాంత జాతులను ఆహారంగా తీసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు, వారి రక్తంలో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. ముఖ్యంగా ప్రపంచంలో 1,557 సముద్ర జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం జీవులు ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకుంటున్నాయని తేలింది. గజరాజుల పాలిట ప్లాస్టిక్ పాశం గతేడాది భారత దేశంలోని పెరియార్ అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల అడవి ఏనుగు మృతి చెందింది. ప్రతి శీతాకాలంలో శబరిమలకు అడవుల ద్వారా కాలినడకన వెళ్లే లక్షలాది మంది భక్తులు విచ్చలవిడగా పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో పేగుల్లో అంతర్గత రక్తస్రావం, అవయవాలు విఫలమై అది చనిపోయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్క ఏనుగులే కాదు అతి శక్తివంతమైన వేటాడే జీవులైన హైనాలు, పులులతో పాటు జీబ్రాలు, ఒంటెలు, పశువులతో సహా భూ ఆధారిత క్షీరదాలు ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృత్యువాత పడుతున్నాయి. భూసారానికి పెనుముప్పు ప్లాస్టిక్‌లోని మైక్రో ప్లాస్టిక్స్ భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమికి మేలు చేసే మిత్ర పురుగులు, లార్వాలు, అనేక కీటకాల క్షీణతలకు దారి తీస్తోంది. ప్లాస్టిక్ ఫుడ్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ గొట్టాలు, బయోవ్యర్థాలు హానికరమైన రసాయనాలను మట్టిలోకి విడుదల చేస్తాయి. అవి భూగర్భ జలాల్లోకి ప్రవేశించి నీటిని సైతం కలుషితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం, ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌పై అనేక స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా 77 దేశాలు పాస్టిక్‌పై శాశ్వత, పాక్షిక నిషేధాన్ని విధించాయి. -
కలవరపెడుతున్న కాంతి
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్.. వాయు కాలుష్యం. అలాగే శబ్ద కాలుష్యం గురించి కూడా మనకు తెలుసు. వీటితో తలెత్తే అనర్థాలపైన కూడా అవగాహన ఉంది. అయితే కాంతి కాలుష్యం (లైట్ పొల్యూషన్) గురించి మాత్రం అంతగా తెలియదు. అయితే దీనితో కూడా ప్రమాదమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాంతి కాలుష్యంపై తమ దేశంలో నిర్వహించిన పరిశోధనను చైనా తాజాగా వెల్లడించింది. కొన్ని లక్షల మందిపై పరిశోధన చేసి అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. ఇందులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కాంతి కాలుష్యం కారణంగా చైనాలో 90 లక్షల మంది మధుమేహ బాధితులుగా మారారని ఆ అధ్యయనం బాంబుపేల్చింది. వీరంతా చైనాలోని 162 నగరాల్లో నివసిస్తున్నారు. కాంతి కాలుష్యంతో ఏం జరుగుతుంది? అధిక కాంతి వల్ల కాంతి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు పండుగల సమయంలో రంగు రంగుల్లో మెరిసే దీపాలు మిరుమిట్లు గొలిపే కాంతులు విరజిమ్ముతుంటాయి. ఇవి కాంతి కాలుష్యానికి కారణమవుతున్నాయి. అలాగే అన్ని రకాల కృత్రిమ కాంతి, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఎల్ఈడీ, కారు హెడ్‌లైట్, హోర్డింగ్‌ల నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి కూడా కాలుష్యాన్ని వెదజల్లుతోంది. ముఖ్యంగా ఈ కాంతి కాలుష్యం వ్యక్తి శరీరాన్ని క్రమంగా ప్రభావితం చేస్తోందని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా మధుమేహ బాధితులుగా మారుస్తోందని పరిశోధకులు వెల్లడించారు. వీధి దీపాలు, స్మార్ట్ ఫోన్లు వంటి అన్ని కృత్రిమ లైట్లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 25 శాతం పెంచుతాయని స్పష్టమైంది. రాత్రిపూట కూడా మనకు పగటి అనుభూతిని కలిగించే ఈ లైట్లు మానవుల శరీర చక్రాన్ని మారుస్తాయని.. అంతేకాకుండా క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే మన శరీర సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 80% మంది రాత్రిపూట చీకటిలో కాంతి కాలుష్యం బారిన పడుతున్నారని కూడా తెలిపారు. పరిశోధన ప్రకారం.. చీకటిలో కన్నా ఎక్కువసేపు కృత్రిమ కాంతిలో ఉండేవారిలో 28 శాతం మందికి అజీర్తి సమస్యలు ఉన్నాయని తేలింది. శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణం. వాస్తవానికి ఈ హార్మోన్ మన జీవక్రియ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఎక్కువసేపు వెలుతురులో ఉండడం వల్ల ఏమీ తినకుండానే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. మన దేశంలో తలసరి ఉద్గారాలు తక్కువే.. ప్రపంచంలో చైనా, అమెరికా, ఈయూల తర్వాత అధిక కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే మనదేశంలో అధిక జనాభా ఉండడం వల్ల తలసరి ఉద్గారాలు మిగతా ప్రధాన దేశాలతో పోలిస్తే తక్కువ. 2030 నాటికల్లా దేశ ఇంధన శక్తిలో 50 శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచే పొందాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అదే సంవత్సరానికి కర్బన ఉద్గారాలను వంద కోట్ల టన్నులు తగ్గించాలని నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సౌర విద్యుత్‌పై దృష్టి సారిస్తోంది. దాదాపు 43,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంతి కాలుష్యంపైనా భవిష్యత్తులో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరం ఢిల్లీ అని ఓ అధ్యయనం చెబుతోంది. తీవ్ర కాలుష్యం బారిన పడుతున్న ఢిల్లీ వాసులు తమ ఆయుర్దాయంలో అత్యధికంగా 11.9 ఏళ్లు కోల్పోతున్నారని పేర్కొంది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం ప్రకారం చూసినా దేశ రాజధాని వాసులు సగటు కన్నా 8.5 ఏళ్లు నష్ట పోతున్నారని తెలిపింది. భారత్‌లో ప్రజల ఆరోగ్యానికి కాలుష్యం పెనుముప్పుగా తయారైందని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే భారత్‌లో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పర్టిక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 ఐదు మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్‌గా కాలుష్యం ఉండాల్సి ఉంది. కాలుష్య తీవ్రతలు ఇలానే కొనసాగితే భారతీయుల సగటు ఆయుర్దాయం కన్నా 5.3 ఏళ్లు తగ్గుతుందని తెలిపింది. దేశంలోని మొత్తం 130 కోట్ల మందికి పైగా ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. చదవండి: చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే! జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్లకు మించి కాలుష్యం ఉండే ప్రాంతాల్లో 67.4 శాతం మంది నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. సగటు భారతీయుడి ఆయుర్దాయం కాలుష్యం కారుణంగా 5.3 ఏళ్లు తక్కువగా ఉంటోందని వివరించింది. 2021లో భారత్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరి్టక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 నమోదు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగటు కన్నా 2.6 ఏళ్లు, తెలంగాణ ప్రజలు సగటు కన్నా 3.2 ఏళ్లు కోల్పోతున్నారని తెలిపింది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆయుష్షు ముప్పు లేదని తెలిపింది. దేశంలో హృదయ సంబంధ వ్యాధులతో 4.5 ఏళ్లు, తల్లీ పిల్లల పోషకాహార లోపంతో 1.8 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నట్లు నివేదిక పేర్కొంది. 2013– 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కాలుష్యంలో భారత్ వాటా 59.1 శాతమని తెలిపింది. సగటు కంటే ఎక్కువగా ఆయుర్దాయం కోల్పోతున్న అత్యధిక జనాభా కలిగిన 10 రాష్ట్రాలు వరసగా.. యూపీ, బిహార్, బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయని తెలిపింది. -
ఉనికి కోల్పోతున్న బొక్కు సొర చేప
సాక్షిప్రతినిధి, కాకినాడ: సముద్ర కాలుష్య నివారణలో కీలకపాత్ర పోషించే బొక్కు సొర చేప కాలక్రమేణా ఉనికిని కోల్పోతోంది. వేల్ షార్క్‌గా పిలిచే ఈ చేప ‘రిన్ కో డాంటిడే’ జాతికి చెందింది. ఏళ్ల సంవత్సరాల కిందట డైనోసార్లతో సముద్ర జలాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అతి ప్రాచీన సముద్ర జీవిగా ప్రసిద్ధి. 65 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సాదు జీవి మనుగడ కోసం ప్రస్తుతం పోరాడుతోంది. ఈ జీవి ప్రపంచవ్యాప్తంగా 20వేల వరకు ఉండగా ప్రస్తుతం 10 వేలకు తగ్గిపోయనట్లు ‘ఐయూసీఎన్( ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) తన నివేదికలో పేర్కొంది. అలాగే తన నివేదికలో ఇది అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా రెడ్‌బుక్‌లో పేర్కొంది. నిశ్శబ్ద జలాల్లోనే నివాసం.. ఈ చేపలు నిశ్శబ్దంగా ఉండే సముద్ర జలాల్లోనే ఉండటానికి ఇష్టపడతాయి. ఎప్పుడైన ఓడలు, బోట్లు ఫ్యాన్లు తగిలితే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. చూస్తే భయంతో వణికిపోయేలా భారీ ఆకారంతో తిమింగలానికి నాలుగు రెట్లు అధికంగా ఉండే వేల్ షార్క్(»ొక్కు సొర) ఎవరికీ ఏ హాని తలపెట్టదు. ఈ చేపలు 13 మీటర్లు(42 అడుగులు) పొడవు, 20 నుంచి 25 మెట్రిక్ టన్నుల బరువుతో భారీ ఆకారంతో ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా వేల్షార్క్కు పేరుంది. తీరం నుంచి 50 నుంచి 60 కిలో మీటర్లు (డీప్సీ)దూరంలో సముద్రంలో సుమారు ఐదు కిలోమీటర్ల లోతులో ఇవి ఉంటాయి. సముద్ర ఉపరితలంపై ఎక్కడా కనిపించవు. లోతు జలాల్లో ఉండే అరుదైన జలచరం ఇది. రెండేళ్ల కిందట విశాఖలో ప్రత్యక్షం ఈ చేప చమురు, మాంసం, రెక్కలు, అంతర్జాతీయంగా వాణిజ్య విలువలతో మంచి డిమాండ్ ఉంది. ఉష్ణ మండలం, సమశీతోష్ణ సముద్ర జలాల్లో కనిపిస్తుంటాయి. సేనిగల్ నుంచి గునియా, న్యూయార్క్ నుంచి కరేబియన్, మెక్సికో నుంచి టోంగా, తూర్పు ఆఫ్రికా నుంచి థాయిలాండ్, ఎర్ర సముద్రం, యూఎస్ఏ, అరేబియన్, గల్ఫ్, జపాన్, ఆ్రస్టేలియా, బ్రెజిల్, పిలిపీన్స్ సముద్ర జలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. దేశంలో గుజరాత్, తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు, ఉప్పాడ, కోనపాపపేట, కాకినాడ కుంభాభిషేకం, భైరవపాలెం తదితర తీరప్రాంతాల్లో వేట సమయంలో సముద్రంలో మత్స్యకారులకు కనిపిస్తుంటాయి. రెండేళ్ల కిందట విశాఖబీచ్కు వచ్చిన బొక్కు సొరను రక్షించి తిరిగి సముద్రంలో విడిచిపెట్టారు. వేల్‌షార్క్ సంరక్షణపై అవగాహన.. గతంలో ఈ చేపలను చూసి భయంతో వేటకు వెళ్లే మత్స్యకారులు చంపేసేవారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం కల్పిస్తోన్న అవగాహనతో తీర ప్రాంతంలో కొంతవరకు సత్ఫలితాలన్నిస్తున్నాయి. తూర్పు తీరంలో పరిరక్షణ కోసం వన్యప్రాణి సంరక్షణ విభాగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వేల్‌షార్క్ సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా తూర్పు తీరంలోని మత్స్యకార గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం, అవగాహన కార్యక్రమాలు ప్రారంభించి ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తోంది. నేరుగా పిల్లలను పెట్టే ఒకే ఒక చేప.. దక్షిణాఫ్రికా తీరంలో మొట్టమొదటిసారి ఈ తిమింగలం సొరను డాక్టర్ ఆండ్రూ స్మిత్ గుర్తించాడు. 70 నుంచి 100 సంవత్సరాల జీవితకాలం కలిగిన ఈ చేపలు లైంగిక పరిపక్వతకు రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. సహజంగా చేపలన్నీ గుడ్లు పెట్టి చేప పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. కానీ బొక్కు సొర మాత్రం నేరుగా పిల్లలను పెడుతుంది. అదీ కూడా రెండు, మూడు చేప పిల్లలను మాత్రమే పెట్టడం ప్రత్యేకం. ఇది గుడ్లు పెట్టినా బయటకు రిలీజ్ చేయదు. తన అంతర్భాగంలోనే దాచుకుంటుంది. ఒకేసారి 200–300 గుడ్లు వరకు పెడుతుంది. 2–3 ఏళ్ల అనంతరం నేరుగా పిల్లల రూపంలో బయటకు వదులుతుంది. ప్లైటో ప్లాంటాన్స్ అనే మొక్కలే ఆహారం. సముద్ర కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చేపలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్లైటో ప్లాంటాన్స్(సృష్టిలో మొదటిగా వచ్చాయి) అనే మొక్కలను పోలిన జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ప్లైటో ప్లాంటాన్స్ ఎక్కువగా పెరిగితే సముద్రంలో పైకి తెట్టులా పెరిగిపోయి ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ బొక్కు సొర దానిని తినడం వల్ల సముద్రంలో ప్లైటో ప్లాంటాన్స్ పెరగకుండా సముద్ర కాలుష్యాన్ని తగ్గిస్తోంది. సముద్రంలోని సూక్ష్మ మృత జీవరాశులు, సముద్రకాలుష్యాన్ని శుద్ధి చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంటుంది. పులులతో సమాన హోదా... వన్యప్రాణి పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బొక్కు సొర చేపను పరిరక్షిస్తున్నాం. గత కొన్నేళ్లుగా తీర ప్రాంత ప్రజల్లో, మత్స్యకారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. అడవుల్లో ఉండే పులులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అంతే ప్రాధాన్యం బొక్కు సొరకు ఇస్తున్నాం. బొక్కు సొరను చంపినా, శరీర భాగాలను విక్రయించినా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 50, 51 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, అధిక మొత్తంలో జరిమానా విధిస్తాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వన్యప్రాణి విభాగం -
నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు"
ఇవి మైక్రో రోబోలు. ఫొటోలో కనిపిస్తున్నంతగా ఉండవు. మనిషి వెంట్రుక కంటే తక్కువ మందంతో సన్నని గొట్టాల మాదిరిగా ఉండే ఈ రోబోలు నీటిలోని ప్రమాదకరమైన కాలుష్యాలను తొలగిస్తాయి. అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని ఫ్లింట్ నగరంలో నీటి కాలుష్యం వల్ల విపరీతమైన సమస్యలు తలెత్తడంతో శాస్త్రవేత్తలు ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించి, ఈ మైక్రో రోబోలను రూపొందించారు. ఒక పైపులో ఈ మైక్రోరోబోలను భద్రపరచి ఉంచుతారు. కలుషితమైన నీటిలోకి వీటిని విడిచిపెడితే, గంటలోపే నీటిలో ఉండే సీసం, పాదరసం వంటి భారలోహ కణాలను పూర్తిగా తొలగిస్తాయి. నీటిలోకి ప్రవేశించగానే, ఇవి వీటి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకుని, సూక్ష్మాతి సూక్ష్మమైన భార లోహకణాలను, ప్రమాదకర రసాయనాల కణాలను పీల్చేసుకుని, నీటిని సురక్షితంగా మారుస్తాయి. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
విలయం.. యువ హృదయం!
విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన 40 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఛాతిలో నొప్పి అని చెప్పి కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తేల్చారు. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఛాతిలో నొప్పి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో యువతలో గుండె పోటు మరణాలు ఎక్కువగా సంభవించడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. మారుతున్న జీవన శైలి, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రౖమెన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగానే చిన్న వయస్సులో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ని యంత్రించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాల్సిన అవసరముందంటున్నారు. అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించుకుని గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆకస్మిక మరణాలు గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణా లకు వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు. ధూమపానం, మద్యపానం,ఊబకాయం, వ్యాయామం లేకపోవడం పోస్టు కోవిడ్ గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె కండరాలు ఉబ్బడం(మయోకార్డిటైస్) పల్మనరీ ఎంబోలిజం(గుండె నుంచి ఊపిరి తిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) ముందు జాగ్రత్తే మందు గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిళ్లకు దూరంగా ఉండటం నీరు ఎక్కువగా తీసుకోవడం యువతలో అధికమవుతున్నాయ్.. గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారిలో 80 శాతం మందికి గుండెపోటు రావడానికి పొగతాగడం, మద్యం తీసుకోవడం, ఒత్తిడే కారణాలు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. పోస్టు కోవిడ్ వారిలో కూడా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్‌ను అలవర్చుకోవాలి. – డాక్టర్ బొర్రా విజయ్‌చైతన్య, కార్డియాలజిస్ట్ -
ప్రకృతి హిత జీవనమే పరిష్కారం
ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడం సాధారణ దృశ్యం అయ్యింది. ఇందుకు నానాటికీ పెరిగి పోతున్న కాలుష్యమే అసలు కారణం. ఈ కాలుష్యానికి అభివృద్ధి పేరుతో మానవుడు సాగిస్తున్న ప్రకృతి విధ్వంసమే హేతువని సైన్స్ చెబుతోంది. భూ స్వరూపాలను ఇష్టమొచ్చినట్లు మార్చడం, పేరాశతో సహజవనరులను విచక్షణారహితంగా వినియోగించడం, ప్రకృతి నియమాలకు ఎదురీదాలని ప్రయత్నించడం నేటి కరువులకూ, వరదలకూ అసలైన కారణాలని అధ్యయనాలు చెబుతున్నాయి. సహజ ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనిషి జీవించడం ఒక్కటే ప్రకృతి విపత్తుల నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక పరిష్కారం. వాతావరణ మార్పులు, పెరుగుతున్న విపరీ తమైన వాతావరణ సంఘటన వల్ల గత 50 ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగు తున్నాయి. ఇవి పేద దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ), యూఎన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వరదలు వస్తున్న వార్తలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒకే రోజు పడే వర్షం ఎక్కువగా ఉండడం వాతావరణంలో వచ్చిన మార్పుల పరిణామం. అందులో అనుమానం లేదు. వాతావరణంలో విపరీత మార్పులకు మానవ కార్యకలాపాల నుంచి ఉద్భవించిన కాలుష్య ఉద్గారాలు కారణం. కర్బన ఉద్గారాల వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగి, సముద్ర జలాలు, గాలి, మంచు వంటి వాటిమీద దుష్ప్రభావం పడుతోంది. వరదలు నివారించాలంటే కాలుష్యం తగ్గించడమే ఉత్తమమైన మార్గం. అంటే, మానవులు ఏర్పరచుకున్న ‘శక్తి’ వనరులలో తీవ్ర మైన, సత్వర మార్పులు చేస్తేనే కాలుష్యం తొందరగా తగ్గుతుంది. ఈ విధంగా చూస్తే వరదలకు ‘స్థానిక’ కారణాలు ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే, కాలుష్యం ఒక భౌగోళిక పరి ణామం కాబట్టి. చైనాలో వరదల బీభత్సం ఈ మధ్య ఎక్కువ అయ్యింది. ఈ ఏడాదే దాదాపు 3 కోట్ల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. బీజింగ్‌లో 2012లో సంభవించిన వరదల్లో 79 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత తీవ్రమైన వర్షాల నుంచి రక్షించడానికి చైనా ఇటీవలి సంవత్సరాల్లో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ ‘స్పాంజ్‌ల వంటి నగరాలను‘ నిర్మించాలని పిలుపునిచ్చారు. మిద్దె తోటలు, నీరు ఇంకే ఫుట్‌పాత్‌లు, భూగర్భ నిల్వ ట్యాంకులు, ఇతర స్పాంజ్ లాంటి వ్యవస్థలను ఉపయోగించి భారీ వర్షపాతాన్ని ఇంకే విధంగా చేసి, తరువాత నెమ్మదిగా నదులు లేదా జలాశయాల్లోకి విడుదల చేయడం. చైనాలో వరదల నివారణకు ‘స్పాంజి’ నగరాల కార్యక్రమం చేపట్టినా ఫలితం కానరాలేదు. ప్రకృతి సహజంగా చేసే ‘స్పాంజి’ పని... మానవ నిర్మిత వ్యవస్థల ద్వారా సాధ్యం కాదు అని రుజువు అయ్యింది. భారత దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో ప్రతి ఏటా వరదలు వస్తున్నాయి. కోస్తా నగరాలైన ముంబాయి, చెన్నైల్లో వస్తున్న వరదలు అక్కడి భౌగోళిక పరిస్థితుల్లో తీవ్ర మార్పుల వల్ల సంభవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. బెంగళూరు, హైదరా బాద్ నగరాలలో చెరువులు, వరద నీటి కాలువలు, నదులు కబ్జా కావడం వల్ల వరదలు వస్తున్నాయి. 2023 జూలైలో లోక్‌సభలో కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు సమాధా నంగా ఇచ్చిన సమాచారం గమనించదగింది. ‘కేంద్ర జల కమిషన్’ ప్రకారం గత మూడేళ్లుగా (2020, 2021, 2022) దేశంలో 465 తీవ్ర మైన, అతి తీవ్రమైన వరదలు సంభవించాయి. ఈ సంవత్సరం కూడా వరదలు పెరిగాయి. 23 రాష్ట్రాలలో అత్యధికంగా బిహార్ (99), ఉత్తర ప్రదేశ్ (75), అసోం (60)లలో తీవ్రమైన, అతి తీవ్రమైన వరదలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో 18, తెలంగాణ లో 14 వచ్చాయి. ఈ ఏడు హిమాచలప్రదేశ్, హరియాణాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయి. అయితే, సాధారణ వర్షాలకే వరదలు రావడానికి స్థానిక పరిస్థి తులే కారణం. అధిక వర్షాల సంగతి చెప్పనవసరం లేదు. వరదల తీవ్రత, నష్టం పెరగడానికి స్థానిక వనరుల విధ్వంసం ప్రధాన కారణం. నీటి వనరులైన నదులు, వాగులు, తటాకాల ‘సరిహద్దు లను’ మనం చెరిపేస్తే, వాటి సామర్థ్యం మనం రకరకాలుగా తగ్గిస్తే, నీరు ఒలుకుతుంది. చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణల వల్ల వాటి సామర్థ్యం తగ్గిస్తున్నాం. మన నెత్తి మీద పడి, మన కాళ్ళ కింద ప్రవహించే నీటిని ఒడిసిపట్టుకునే సహజ వ్యవస్థను ‘అభివృద్ధి’ పేరిట నాశనం చేసి, నీళ్ళ కొరకు పెద్ద ఆనకట్టలు కట్టి నీటి సరఫరా ‘సుస్థిరం’ చేసుకుంటున్నాం అనే భ్రమలో మనం ఇప్పటికీ ఉన్నాము. ఇక్కడ పడ్డ నీటిని వదిలిపెట్టి, ఎక్కడో వాటిని ఆపి, ఆ నీటిని పైపుల ద్వార సరఫరా చేస్తూ, విద్యుత్ వినియోగిస్తూ, అది ఆధునికతగా భావిస్తూ తరిస్తున్నాము. కాగా, ఈ అసహజ నీటి వ్యవస్థ కారణంగా ప్రకృతి దెబ్బతిని కుదేలు అయితే ఆ నష్టం భరి స్తున్నది ఎవరు? చిన్న ప్రవాహాలను నిర్లక్ష్యం చేసి, నదులుగా మారిన తరువాత అడ్డు కట్టలు కట్టి మనం ఉపయోగించే నీటికి ‘విలువ’ పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడికి, నిర్వహణకు ఖర్చు అయ్యింది కనుక. ఈ ‘విలువ’ పెంచిన నీరు రకరకాల కారణాల వల్ల కొందరికే అందుతుంది. సామాజిక అసమానతలకు కారణం అవుతుంది. కొండల వెంబడి నీరు జాలువారడానికి అనువుగా ప్రకృతి ఏర్పరుచుకున్న దారులను మనం రోడ్ల కొరకు నాశనం చేస్తే, కొండ చరియలు పడడం చూస్తున్నాము. కొండలు, గుట్టల మీద సహజ కవ చంగా ఉండే చెట్లు, అడవి, గడ్డి తదితర పచ్చదనాన్ని మనం హరిస్తే మట్టి కొట్టుకుని పోయి, నీటి వేగానికి, ప్రవాహానికి ‘సహజ’ అడ్డంకులు ఉండవు. వరద నీరు తగ్గినప్పుడు ప్రభావిత ప్రాంత భూములలో సాధారణంగా పూడిక బురదతో నిండి ఉంటాయి. ఈ రకమైన అవ శేషాలు పోషకాలతో నిండి ఉండి ఆ ప్రాంతంలోని రైతులకు వ్యవ సాయానికి ప్రయోజనం చేకూర్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి అంతటా లేదు. కొన్ని చోట్ల వరద... ఉన్న సారవంతమైన భూమిని కోసేస్తే, ఇంకొక చోట ఇసుకను నింపుతున్నది. పట్టణాల నుంచి వచ్చిన వరద అనేక రకాల కలుషితాలను వదిలిపెడుతున్నది. కొండ ప్రాంతం నుంచి మైదానాలకు వచ్చే వరద బండ రాళ్ళు, చెట్టు కొమ్మలు, ఈ మధ్య కార్లు, మోటార్ సైకిళ్ళు, ఇండ్లు, ఇండ్ల గోడలు, సిమెంటు కట్టడాల అవశేషాలను కూడా తీసుకువస్తున్నది. వరద నీటిలో తమ ‘పాపాలను’ (వ్యర్ధాలు, కాలుష్య జలాలు) పడేసే పరిశ్రమలు కూడా ఉన్నాయి. పశువులు సాధారణంగా నీళ్ళలో ఈదగలవు. కాని, వేగంగా ప్రవహించే వరదలో చాల మటుకు అవి చనిపోతుంటాయి. అసలు పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్న క్రమంలో పశువుల మరణాల గురించి ఆలోచించేందుకు ఆధునిక సమాజం సిద్ధంగా లేదు. వరదలు చేసే ఆస్తి నష్టం వల్ల పేదలు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతున్నారు. రోడ్లు, బ్రిడ్జిలు, పైపులైన్లు, విద్యుత్ స్తంభాలు తదితర ప్రజా ఆస్తులకు హాని కలిగి ప్రభుత్వ నిధుల మీద భారం పెరుగుతున్నది. వరదల నివారణకు భూమి వినియోగం మీద అధ్యయనం చాలా అవసరం. ప్రకృతిలో, భూమితో ముడిపడి ఉన్న నీటి సహజ చక్రా లను అర్థం చేసుకోవాలి. నదులు పుట్టే ప్రదేశంలో అర్థరహిత కాంక్రీ టికరణ చేటు చేస్తున్నది. గోదావరి నది పుట్టే నాసిక్ నగరంలో ఇట్లా చేసి నాలుక కరుచుకున్నారు. హైదరాబాద్‌కు నీటిని అందించే మూసీ నది పరివాహక ప్రాంతం, ముఖ్యంగా అనంతగిరి కొండలలో ఉన్న అడవి నాశనం వల్ల, కింది ప్రాంతాలలో వరద ముప్పు పెరుగు తున్నది. చెరువులు వరద నివారణకు ఉపయోగపడతాయి. కాని, వాటిని దుర్వినియోగపరుస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కొల్లేరు సరస్సు విధ్వంసం వల్ల చుట్టూ పరిసర ప్రాంతాలలో వరద ముప్పు పెరుగు తున్నది. తూర్పు కనుమల ద్వార ప్రవహించే అనేక నదులు బంగా ళాఖాతంలో కలుస్తాయి. కానీ, వాటి పరివాహక ప్రాంతంలో మైనింగ్ వల్ల, అడవుల నరికివేత వల్ల వరద ముప్పు పెరిగింది. శారద నది, రుషికుల్య తదితర నదులు మైదాన ప్రాంతాలలో, కోస్తాలో ప్రమా దకరంగా మారడానికి మానవ ప్రకృతి విధ్వంసకర కార్యకలాపాలే. ఇప్పటికైనా ప్రభుత్వాలు చేసిన, చేస్తున్న, చేయబోతున్న కార్య క్రమాలు, నిర్మాణాలను సమీక్ష చేసి, వరద నివారణకు, వరద ముప్పు తగ్గించటానికి సుస్థిర ప్రణాళికలు చేపట్టాలి. ఆలస్యం మరింత వినాశనానికి కారణమవుతుందనే సంగతి మరువరాదు. వ్యాసకర్త: దొంతి నరసింహారెడ్డి, విధాన విశ్లేషకులు 90102 05742 -
1950 నుంచే పెనుముప్పు శకం ఆరంభం
భూగోళంపై గతంలో ఎన్నడూ కనిపించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. కాలుష్యం, భూతాపం, వాతావరణ మార్పులు పెరిగిపోతున్నాయి. రుతువులు గతి తప్పుతున్నాయి. ఒకవైపు భీకర వర్షాలు, వరదలు, మరోవైపు నిప్పులు కక్కే ఎండలు సర్వసాధారణంగా మారాయి. మొత్తం పుడమి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే, మానవుల నిర్వాకం వల్ల భూమిపై అవాంఛనీయ ఈ పరిణామం ఎప్పుడు మొదలైందో తెలుసా? 1950 నుంచి 1954 మధ్య మొదలైందని ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు గుర్తించారు. భూమాతను ప్రమాదంలోకి నెట్టివేసే కొత్త శకానికి అదొక ఆరంభమని అంటున్నారు. ఈ పరిణామానికి ఆంథ్రోపొసీన్ అని నామకరణం చేశారు. మనిషి, నూతన అనే అర్థాలున్న గ్రీక్ పదాలతో ఈ కొత్త పదం ఏర్పడింది. మొదట దీనిని 2000 సంవత్సరంలో పాల్ క్రట్జెన్, యూగీన్ స్టార్మర్ అనే శాస్త్రవేత్తలు ఉపయోగించారు. దీనిని ప్రస్తుత ‘జియోలాజికల్ టైమ్ ఇంటర్వెల్’గా పరిగణిస్తున్నారు. ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు ఇంకా ఏం చెప్పారంటే.. ► ఆంథ్రోపొసీన్లో భాగమైన పరిణామాలు, మార్పులు 1,000 లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► ఇవి మొత్తం భూమి ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ప్రభావం భూమిపై శాశ్వతంగా ఉంటుంది. ► శిలాజ ఇంధనాల వాడకం, అణ్వాయుధాలను ఉపయోగించడం, పొలాల్లో రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగం, భూమితోపాటు నదులు, చెరువుల్లో ప్లాస్లిక్ వ్యర్థాలు పెరగడం వంటివి ఆంథ్రోపొసీన్‌కు కారణమవుతున్నాయి. ► మానవుల చర్యల భూమికి జరుగుతున్న నష్టం అనూహ్యంగానే ఉందని, ఈ నష్టం రానురాను మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన జియాలజిస్ట్ కోలిన్ వాటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ► సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం బలమైన గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఇప్పుడు మానవ చర్యలు సైతం అదే కేటగిరీకి సమానంగా ఉన్నాయి. 1950వ దశకం తర్వాత భూగోళంపై ఎన్నో రకాల జీవులు అంతరించిపోయాయి. ► గ్రహ శకలాలు ఢీకొట్టడం అనేది ఒక కొత్త శకానికి దారితీసింది. మనుషుల కార్యకలాపాలు కూడా భూమిపై కొత్త శకానికి నాంది పలికాయి. ► ఇప్పటికైనా మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టోన్ క్రషర్‌ను తొలగించాల్సిందే..
బిచ్కుంద: తమ గ్రామ సమీపంలోని స్టోన్ క్రషర్‌ను తొలగించాలని, కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ సమీపంలో సుమారుగా ఏడేళ్లుగా ఎల్లయ్య అండ్ సన్స్ స్టోన్ క్రషర్, డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ కొనసాగుతోంది. అది ప్రస్తుతం ఐదు హెక్టార్లలో ఉంది. తొమ్మిది హెక్టార్లలో క్రషర్ నిర్వాహణకు అనుమతి కోరుతూ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంది. దీంతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ శుక్రవారం గ్రామానికి వచ్చారు. గ్రామస్తులతో సమావేశమై చర్చించారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు వెంకటేశ్ ధోత్రె అన్నారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ.. స్టోన్ క్రషర్‌తో బ్లాస్టింగ్, అనుమతి లేని డాంబర్ మిక్సింగ్ ప్లాంట్‌తో కాలుష్యం పెరిగిపోయి గ్రామంలో ఐదుగురు వ్యక్తులు క్యాన్సర్‌తో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పారు. గ్రామానికి ఆరు వంద మీటర్ల దూరంలో క్రషర్, మిక్సింగ్ ప్లాంట్ ఉన్నాయని, వీటిని తొలగించాలని గతంలో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశామన్నారు. తిరిగి రెండోసారి అనుమతి ఇవ్వమమని, తొలగిస్తామని అధికారులు, క్రషర్ నిర్వాహకులు హామీ ఇచ్చారని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్‌కు తెలిపారు. క్రషర్‌ను తొలగించాలని ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. అనుమతి రద్దు చేసే వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ప్లాంట్ తమ ప్రాణాలను తీస్తోందని, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ప్లాంట్ తొలగించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నకిలీ సామాజిక కార్యకర్తల నిలదీత ప్రజాభిప్రాయ సేకరణలో నకిలీ సామాజిక కార్యకర్తలు క్రషర్‌తో పర్యావరణానికి ముప్పు లేదని, అనుమతికి అనుకూలంగా అభిప్రాయాలు ఇచ్చారు. దీంతో గ్రామ యువకులు వారిని పట్టుకొని ని లదీశారు. అందులో కొందరు నకిలీ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల పేరుతో చెలామణి అవుతు న్న వారు ఉన్నారు. వారిని క్రషర్ నిర్వాహకుడు తీ సుకొచ్చారు. దీంతో కొంత సేపు ప్రజాభిప్రాయ సే కరణలో గందరగోళం ఏర్పడింది. అక్కడి నుంచి వారు కార్లలో పారిపోయే యత్నం చేయగా యువ కులు అడ్డుకున్నారు. నకిలీ సామాజిక కార్యకర్తల అభిప్రాయాలను వీడియోలో నుంచి తొలగించాలని పట్టుబట్టారు.అధికారులు, ఎస్సై శ్రీధర్‌రెడ్డి సముదాయించడంతో యువకులు శాంతించి కార్ల ను వదిలేశారు. గ్రామస్తులు తెలియజేసిన అభిప్రా యాలు, వినతులను పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర కమిటీ, సంబంధిత శాఖా అధికారులకు నివేదిక పంపించి అందరికి న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ హామీనిచ్చారు. మైనింగ్, పర్యావరణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనారోగ్యంతో చనిపోతున్నారు స్టోన్ క్రషర్, డాంబర్ మిక్సింగ్ ప్లాంట్ మా గ్రామానికి ఆరు వందల మీటర్ల దూరంలో ఉంది. పొగ, దుమ్ము, బ్లాస్టింగ్లతో ప్రజలు అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. అనుమతి ఇవ్వవద్దని కోరుతున్నాము. అనుమతి ఇస్తే గ్రామ ప్రజల సూచనల మేరకు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. – శ్రీనివాస్, సర్పంచ్ గోపన్‌పల్లి -
స్టీల్‌బ్యాంక్
కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని కోరుకునే సాధారణ గృహిణి తులికా సునేజా. ‘చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది, అప్పుడే భవిష్యత్ తరాల మనుగడకు ఢోకా ఉండదన్న తాపత్రయం తనది. ‘వాయు, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గిద్దాం’ అని చెప్పేవారే కానీ ఆచరించేవారు అరుదు. అందుకే కాలుష్య స్థాయుల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించడంలేదని భావించిన తులికా... పర్యావరణాన్ని కాపాడడానికి నడుం బిగించి ‘క్రోకరీ బ్యాంక్’ నడుపుతోంది. ఈ బ్యాంక్ ద్వారా డిస్పోజబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కృషిచేస్తోంది. ఫరీదాబాద్‌కు చెందిన తులికా సునేజా ఓ రోజు పిల్లలతో బయటకు వెళ్లి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు... రోడ్డుమీద కొంతమంది ఉచితంగా అన్నదానం చేస్తుండడం చూసింది. నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు అని సంతోష పడేలోపు.. చుట్టుపక్కల చెల్లాచెదరుగా పడి ఉన్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, స్పూన్లు కనిపించాయి. తులికాతో ఉన్న తన పిల్లలు ‘‘అమ్మా ఇలా ప్లాస్టిక్ పడేయడం పర్యావరణానికి మంచిది కాదు, దీనిని నియంత్రించడానికి షరిష్కారమే లేదా?’’ అని తల్లిని ప్రశ్నించారు. అప్పుడు ఆ ప్రశ్నకు తులికా దగ్గర సమాధానం లేదు. కానీ డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని రోజుల తరబడి ఆలోచించసాగింది. కొన్నిరోజుల తర్వాత తన మదిలో మెదిలిన ఐడియానే ‘క్రోకరీ బ్యాంక్’. ఎవరికీ నమ్మకం కుదరలేదు.. తనకు వచ్చిన క్రోకరీ బ్యాంక్ ఐడియాను తన స్నేహితులతో చెప్పింది తులిక. ‘‘బ్యాంక్ ఆలోచన బావుంది కానీ ఎవరు పాటిస్తారు. బ్యాంక్ ఏర్పాటు చేయడానికి చాలా స్థలం, డబ్బులు కావాలి’’ అన్న వారే తప్ప సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చడానికి తన భర్త సాయం తీసుకుంది. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించడంతో.. తాను దాచుకున్న డబ్బులతో స్టీ్టల్వి.. యాభై టిఫిన్ ప్లేట్లు, యాభై స్పూన్లు, యాభై భోజనం చేసే ప్లేట్లు, యాభై గ్లాసులు కొనింది. ఇవన్నీ పదమూడు వేల రూపాయల్లోనే వచ్చేశాయి. ఈ స్టీల్ సామాన్లతో 2018లో తనింట్లోనే ‘క్రోకరీ బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ గురించి తెలిసిన కొంతమంది తమ ఇళ్లల్లో జరిగే చిన్నచిన్న ఫంక్షన్లకు ఈ సామాన్లు తీసుకెళ్లేవారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా సోషల్ మీడియాకు చేరడంతో చాలామంది ఫంక్షన్లకు ఈ ఇక్కడి నుంచే సామాన్లను తీసుకెళ్లడం మొదలు పెట్టారు. కొంతమంది పర్యావరణవేత్తలు సైతం తులికాకు మద్దతు ఇవ్వడంతో క్రోకరీ బ్యాంక్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్నాపెద్దా పుట్టినరోజు వేడుకలు, కిట్టీపార్టీలు, కొన్ని ఆర్గనైజేషన్లలో జరిగే చిన్నపాటి ఈవెంట్లకు సైతం ప్లాస్టిక్ వాడకుండా ఈ బ్యాంక్ నుంచే సామాన్లు తీసుకెళ్తున్నారు. తులికాను చూసి ఫరీదాబాద్‌లో పదికి పైగా స్టీల్ క్రోకరీ బ్యాంక్‌లు ఏర్పాటయ్యాయి. నేను చాలా చిన్నమొత్తంతో క్రోకరీ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాను. ఎవరైనా ఇలాంటి బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. నాలా మరికొంతమంది పూనుకుంటే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. దీని ద్వారా 2018నుంచి ఇప్పటిదాకా ఐదులక్షల డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను నియంత్రించగలిగాను. భవిష్యత్‌లో మరింత పెద్ద సంస్థను ఏర్పాటు చేసి భారీస్థాయిలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రిస్తాను. – తులికా -
నక్షత్రాకాశం మాయం కానున్నదా?
చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడా పల్లెకు వెళ్లి ఆరుబయట పడుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేవి. పట్నం చేరిన తరువాత నక్షత్రాలు కనిపించడం కరువైపోయింది. ఇందుకు కారణం ‘కాంతి కాలుష్యం’ అని సులభంగానే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడా వెదజల్లబడి అక్కడ చుక్కలను మనకు కనిపించకుండా చేస్తున్నాయి. నక్షత్రాలనూ, అంతరిక్షంలోని ఇతర అంశాలనూ పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇదంతా పెద్ద సమస్యగా చాలా కాలంగానే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూశారు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూసినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాల కంటే వేరుగా ఉంటాయి. మనిషి సృష్టించిన వెలుగులు ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు మొదలయ్యాయి. జర్మనీ దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగా పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నారు. ఒక పట్టణంలో బాగా వెలుతురుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. అటువంటి ప్రదేశాలతో ఒక పటం తయారు చేస్తారు. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగా మనిషి కళ్ళు కూడా చూడగలుగుతాయి. 2011వ సంవత్సరంలో మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను, నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశారు. ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చారు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడా చాలా ఎక్కువ కదా! మొత్తానికి మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నారు. మామూలుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఏటా పది శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించనే కనిపించవేమో అంటున్నారు పరిశోధకులు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా ఈ కాలుష్యం బాగా పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చారు. నివాసాల దగ్గర ఉండే వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు, మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగా ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతాయి. చివరకు మిణుగురు పురుగులు కూడా ఈ వెలుగుకు తికమక పడతాయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగా ఉంటుంది. కాంతి కాలుష్యాన్ని ఎవరికి వారు తగ్గించడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. ‘అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం’ అనేది ఒకటి తయారై ఉందని, అది తీవ్రంగా పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగా వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నారు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు, కిందకు మాత్రమే రావాలి అని వారు సలహా ఇస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడా చెబుతున్నారు. వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాలా అవసరం. ఇంటి బయట రాత్రంతా అనవసరంగా వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగా చర్చించి, అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. దాని అర్థం అందరూ చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు. కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ప్రకృతి అందం పాడవకుండా ఈ వెలుగులను వాడాలి. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్నా అందమైన దృశ్యం. దాన్ని చేతనైనంతవరకు కాపాడుకోవాలి. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగా గుర్తించి పరిశీలించాలి. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతైనా చెప్పగలుగుతారు. రాత్రి ఆకాశం నిజంగా అందమైనది. ముందు తరాలకు అందమైన నక్షత్రాకాశాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత ‘ మొబైల్: 9849062055 -
డేంజర్లో ఉన్నామా?.. సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్..
లండన్: శిలాజ ఇంధనాల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రకృతి విపత్తులు.. వీటి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రపంచ దేశాలు నష్టనివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం గరిష్ట స్థాయికి చేరినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా వెలువడుతున్న గ్రీన్‌హౌజ్ వాయువులు 54 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్తో సమానమని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతలపై విస్తృత అధ్యయనం నిర్వహించి, ఉమ్మడిగా నివేదిక విడుదల చేశారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపం, వాతావరణ మార్పులకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. జీవజాలానికి ఇన్నాళ్లూ ఆవాసయోగ్యంగా ఉంటూ వస్తున్న భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారిపోతోందని హెచ్చరించారు. సైంటిస్టులు తమ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే.. ► 1800వ సంవత్సరంతో పోలిస్తే భూఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగాయి. ► ఉష్ణోగ్రత ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూతాపం మానవాళిని కబళించడం ఖాయం. ► గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని యథాతథంగా కొనసాగిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత సమీప భవిష్యత్తులోనే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ► పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి. మునుపెన్నడూ లేనిస్థాయిలో తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ► భూతాపం ముప్పు నుంచి మానవళి బయటపడాలంటే 2035 నాటికి ప్రపంచదేశాలు తమ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను 60 శాతానికి తగ్గించుకోవాలని సైంటిస్టు పియర్స్ ఫాస్టర్ చెప్పారు. -
నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు
మహా సముద్రాలు మన గ్రహానికి ఊపిరితిత్తులు. మానవ తప్పిదాల కారణంగా ఆ మహా సముద్రాలు కాలుష్య కాసారాలుగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భూ ఉపరితలంపై దాదాపు 70 శాతం నీటితో విలువైన వనరులుగా ఉంటూ.. భూమికి ఆక్సిజన్ సరఫరా చేయడంతోపాటు అనేక జాతుల మొక్కలకు, జంతువులకు నిలయంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. అంతటి మహా సముద్రాలను ప్లాస్టిక్ పొరలు చుట్టేస్తున్నాయి. సాగర గర్భంలోని జాతులను నాశనం చేస్తున్నాయి. సముద్ర కాలుష్యంపై నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఏటా సుమారు 12 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తోంది. దీని బరువు లక్ష నీలి తిమింగలాలకు సమానం. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోని చేపల కంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అతిపెద్ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌తో నిండిపోయింది. ఇందులో 1.8 ట్రిలియన్ ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి. దీని విస్తీర్ణం అమెరికాలోని టెక్సాస్ భూ భాగానికి రెండింతలు. - సాక్షి, అమరావతి సముద్ర కాలుష్యం ఇలా.. ♦ సముద్ర కాలుష్యం అనేది కేవలం ప్లాస్టిక్, ఇతర కాలుష్య కారకాల వల్లే కాకుండా.. ఓడలు నుంచి వెలువడే శబ్ద కాలుష్యం కూడా పెను ప్రమాదంగా ఉంది. తిమింగలాలు, డాల్ఫిన్లు వంటి అనేక సముద్ర క్షీరదాలు నీటిలో తమ పరిసరాలను అర్థం చేసుకోవడానికి శబ్దాలు చేయడం ద్వారా సంభాషించుకుంటాయి. దీనిని ఎకోలోకేషన్గా పిలుస్తారు. అయితే ఓడలు, సోనార్లు, ఇతర పరికరాల నుంచి వచ్చే కృత్రిమ శబ్దాలు సముద్ర జీవుల కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా వలసలు చెదిరిపోవడంతో పాటు వాటి పునరుత్పత్తి, ఆహార వేట ప్రక్రియలను ప్రభావితం చేస్తోంది. ఒక్కోసారి ఓడలను ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడుతున్నాయి. ♦ చర్మ సౌందర్యానికి వినియోగించే సన్ స్క్రీన్ల తయారీలో పగడాలు, ఇతర సముద్ర జీవులను వాడటం వాటికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఆ జీవుల్లోని ఆక్సిబెంజోన్, ఆక్టినోక్సేట్ వంటి రసాయనాలు చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ♦ సముద్రంలో ముడి చమురు ట్యాంకర్లు రవాణా చేస్తున్నప్పుడు చమురు లీకవడంతో ఆ నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గుతున్నాయి. ఆ చమురు సముద్ర జీవుల రెక్కలకు బలంగా అంటుకోవడంతో ఈదే శక్తిని కోల్పోతున్నాయి. ఆ నీటిలోని చేపలు తినడంతో మానవ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ♦ వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగించే కృత్రిమ రసాయనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే కలుíÙత నీరు.. చిన్నచిన్న ప్రవాహాలు, నదుల ద్వారా సముద్రాల్లోకి కలుస్తాయి. లోతైన సముద్రపు మైనింగ్ కారణంగా నీటి అడుగున జీవం ఉనికి కోల్పోతోంది. ♦ కృత్రిమ కాంతి కాలుష్యం కూడా సముద్ర జీవుల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక పిల్ల తాబేలు దాని గుడ్డు నుంచి బయటకు వచి్చనప్పుడు, అది సముద్రాన్ని కనుగొనడానికి చంద్రకాంతిని అనుసరిస్తుంది. సముద్రతీర రెస్టారెంట్లు, బీచ్ సైడ్ క్యాబనాస్ (గుడారాలు), క్యాంప్ ఫైర్ల వెలుతురు వాటిని అడ్డుకుంటుంది. మహా సముద్రాల్లో 500 డెడ్ జోన్లు వివిధ రకాల సముద్ర కాలుష్యం కారణంగా ఏటా 100 మిలియన్ సముద్ర జంతువులు ప్రాణాలు కోల్పోతున్నట్టు శాస్త్రవేత్తల అంచనా. ఇది వెయ్యికి పైగా సముద్ర జాతుల ఉనికిపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. మహా సముద్రాల కాలుష్యం 500 డెడ్ జోన్లను సృష్టించింది. ఇక్కడి ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువ ఉండటంతోపాటు జీవం ఉనికే ఉండని పరిస్థితి ఏర్పడింది. సముద్రాల్లో మితిమీరిన చేపల వేట కూడా ప్రమాదకరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మితిమీరిన చేపలు వేట, కాలుష్యం కారకాల నుంచి సముద్రాలను రక్షించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు తీర్మానించాయి. 2030 నాటికి ప్రపంచంలోని 30 శాతం భూమి, సముద్రాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని ఒప్పందం చేసుకున్నాయి. ఇక స్విస్ ఆధారిత ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ జాబితా ప్రకారం నీటి అడుగున మొక్కలు, జంతువులు 10 శాతం అంతరించిపోయే స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. చేపల ద్వారా మానవ దేహంలోకి ప్లాస్టిక్ సముద్రాల్లో ప్లాస్టిక్ సీసాలు, బ్యాగ్‌లు, సిగరెట్ పీకలు, స్ట్రాలు, టైర్లు, వేట వలలు వంటివి చేపలు, ఇతర జీవుల మరణాలకు కారణమవుతున్నాయి. తాబేళ్లు, సముద్ర పక్షులు కొన్నిసార్లు వాటిని ఆహారంగా భావించి తినడంతో వాటి జీర్ణ వ్యవస్థ కోసుకుపోయి.. చివరికి ఆకలితో మరణిస్తున్నాయి. సాగరాల్లోని మైక్రో ప్లాస్టిక్‌లను చేపలు తింటుంటే.. ఆ చేపలను తిన్న మనుషుల శరీరాల్లోకి ప్లాస్టిక్ చేరుతోంది. ఉత్తర పసిఫిక్ తీరంలోని చేపలు ఏడాదికి 24 వేల టన్నుల ప్లాస్టిక్ ముక్కలు తింటున్నట్టు.. అవి మానవుల ఆహారంలో కలుస్తున్నట్టు కనుగొన్నారు. కాలిఫోరి్నయాలోని మార్కెట్లో విక్రయించే నాలుగింట ఒక వంతు చేపల పొట్టల్లో ప్లాస్టిక్ మైక్రో ఫైబర్స్‌ను గుర్తించారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏడాదికి సగటున 74 వేల మైక్రో ప్లాస్టిక్లు తింటున్నట్టు తేల్చారు. భారతదేశంలో సముద్రంలో చేరే చెత్తలో 60 శాతం ప్లాస్టిక్ ఉంటోంది. స్వచ్ఛ్ సాగర్, సురక్షిత్ సాగర్ క్యాంపెయిన్ ప్రకారం ఇక్కడి సముద్ర తీరంలోని ప్రతి కిలో మీటరుకు సగటున 0.98 మెట్రిక్ టన్నుల చెత్తను గుర్తించారు. -
ప్రమాదంలో జీవ వైవిధ్యం
ఆకాశాన్నంటే హిమాలయాల నుంచి, మూడు వైపులా ఆవరించిన అనంత సాగర జలరాశి దాకా; సహారా ఇసుక ఎడారి మొదలుకుని, అపార జీవరాశికి ఆలవాలమైన సుందర్బన్ వంటి అడవుల దాకా... అంతులేని జీవ వైవిధ్యానికి పుట్టిల్లు మన దేశం. అలాంటి జీవవైవిధ్యం ఇప్పుడు మనిషి నిర్వాకం వల్ల అక్షరాలా అతలాకుతలమవుతోంది. అస్తిత్వం కోసం పెనుగులాడుతోంది. అతి త్వరలో పూర్తిగా అంతరించిపోయే పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కారణమేమిటి? ♦ విచ్చలవిడిగా అడవుల నరికివేత, అడ్డూ అదుపూ లేని పట్టణీకరణ, ఫలితంగా విపరీతమైన కాలుష్యం, వాతావరణ మార్పులు తదితరాలు. ♦ భారత్‌లో 1990–2020 మధ్య 30 ఏళ్లలోనే ఏకంగా ఏడు లక్షల హెక్టార్ల మేరకు అడవి నరికివేతకు గురైనట్లు యుటిలిటీ బిడ్డర్ నివేదిక చెబుతోంది. ఇదిఇలాగే కొనసాగితే వన్యప్రాణులకు కనీసం నిలువ నీడ కరువవుతుంది. ♦ విచ్చలవిడిగా విస్తరిస్తున్న నగరాలు క్రమంగా చిత్తడి, గడ్డి నేలల వంటి సహజ జీవ వ్యవస్థలను కబళిస్తున్నాయి. ♦ ప్రణాళికలేని విస్తరణతో పలు నగరాలు వరదల వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ♦దీని తాలూకు విపరిణామాలకు బెంగళూరే అతి పెద్ద ఉదాహరణ. కేవలం గత 50 ఏళ్లలోనే నగరంలో పచ్చదనం 88 శాతం, నీటి వనరులు 79 శాతం మటుమాయమయ్యాయి! ♦ పెరిగిపోతున్న ధ్వని, కాంతి కాలుష్యం వణ్యప్రాణుల జీవితాలను, ప్రవర్తనను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని... మొత్తంగా వాటి మనుగడనే దెబ్బ తీస్తోంది. ముప్పేట ముప్పు! ♦ జీవవైవిధ్యం అంతరిస్తే తలెత్తే విపరిణామాలను ఊహించడం కూడా కష్టమే. ♦ వాతావరణ ధోరణులు పూర్తిగా మారిపోతాయి. వాటితో పాటే రుతువులూ క్రమం తప్పిపోతాయి. అంతా అల్లకల్లోలమవుతుంది. ♦ సముద్ర మట్టాలు మరింత పెరిగి తీర ప్రాంతాలను క్రమంగా కనుమరుగవుతాయి. ♦ సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగి వాటిలోని జీవజాలానికి ముప్పు ఏర్పడుతుంది. ♦ హిమానీ నదాలు శరవేగంగా కరిగిపోతాయి. ♦ ప్రజలు భారీగా నిర్వాసితులవుతారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ♦ పలు అరుదైన జీవ జాతులు శాశ్వతంగా అంతరించిపోతాయి. రాయల్ బెంగాల్ టైగర్, గోల్డెన్ లంగూర్, సిరోయ్ లిలీ వంటివి ఇప్పటికే ఈ జాబితాలోకి చేరాయి. ఏం చేయాలి? ♦ జీవవైవిధ్యపరంగా ప్రస్తుత తిరోగమన ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలు తక్షణం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రంగంలోకి దిగాలి. ♦ శాస్త్రీయ, సమాజ, విధానపరంగా కలసికట్టుగా కృషి జరగాలి. ♦ పర్యావరణ, సహజ వనరుల పరిరక్షణకు నగదు ప్రోత్సాహకాల వంటివి ఇవ్వాలి. ఉత్తరాఖండ్ ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ♦ తీవ్ర వాతావరణ పరిస్థితులను నిరోధించి పర్యావరణ సమతుల్యతను కాపాడే మడఅడవుల వంటి సహజ వనరులను పూర్తిస్థాయిలో పరిరక్షించుకోవాలి. ♦ పర్యావరణ విద్యను బోధన ప్రణాళికలో తప్పనిసరి చేయాలి. ♦ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యత ప్రజలందరికీ అర్థమయ్యేలా ముమ్మర ప్రచారం చేపట్టాలి. హాట్‌స్పాట్స్.. విశేషాల పుట్టిళ్లు! ♦ అంతర్జాతీయ గుర్తింపున్న 36 జీవవైవిధ్య హాట్స్పాట్లలో నాలుగింటికి భారత్ నెలవు. అవి హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, ఇండో–బర్మా జోన్, సుందర్బన్ అడవులు. ♦ ఇవి మనుషులతో పాటు పలు జీవజాలాలకు నిలయాలు. ♦ తాగునీటి, ఆహార అవసరాలను సమర్థంగా తీరుస్తున్నాయి. ♦ వాతావరణాన్ని నియంత్రిస్తూ జీవజాలానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ♦ ప్రాణికోటి మనుగడకు అత్యవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తికి ఇవి ప్రధాన వనరులు. ♦ ఈ హాట్స్పాట్లు అతి పెద్ద పర్యాటక ఆకర్షణలు. తద్వారా స్థానికులకు ఆర్థికంగా పెద్ద ఆలంబనగా నిలుస్తున్నాయి. ♦ ఇక ఈ హాట్ స్పాట్స్‌కు మూలమైన అడవుల మీద దేశ జనాభాలో 22 శాతం మంది తమ జీవికకు, సామాజిక, సాంస్కృతిక అవసరాలకు పూర్తిగా ఆధారపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలుష్యానికి కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యాన్ని 30% మేర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విశాఖ, విజయవాడ నగరాల్లో గాలిలో ఉన్న కాలుష్యం అంతకంతకు పెరుగుతోన్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు రెండేళ్లుగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే విశాఖ మునిసిపల్ కార్పొరేషన్.. ఏయూ, ఐఐటీ (కాన్పూర్), అమెరికాకు చెందిన డ్యూక్ వర్సిటీలతో కలిసి కాలుష్య నియంత్రణకు ప్రణాళిక తయారు చేసింది. విజయవాడ కార్పొరేషన్ కూడా ఐఐటీ (తిరుపతి) భాగస్వామ్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం,విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నగరాల్లో ఈ తరహా ప్రణాళికలను రూపొందించారు. ఇందుకోసం ఆ నగరాలకు ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల చొప్పున మూడేళ్లు కేటాయిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు నగరపాలక సంస్థలు ఏయూ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ ప్రణాళికలు రూపొందించాయి. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు ఐఐటీ (తిరుపతి) సహకారంతో, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు నగరాలకు నేషనల్ సెంటర్ ఫర్ అట్మోస్ఫియరిక్ రీసెర్చ్ (తిరుపతి) ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళికలను బట్టి గాలి కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాయు కాలుష్య పర్యవేక్షణ వాయు కాలుష్య నియంత్రణ కోసం ఈ నగరాల్లో రూ.35 కోట్లతో కంటిన్యూస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో 5 చొప్పున, 11 మునిసి పాల్టీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా గాలి కాలుష్యాన్ని ఆన్లైన్లో పర్యవేక్షించడం, ప్రజలకు దానిపై డిజిటల్‌గా చూపించడంపై అవగాహన కల్పించనున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 35 స్టేషన్లలో గాలి కాలుష్యాన్ని పర్యవేక్షించనున్నారు. వ్యర్థాల నుంచి ఇంధనం తయారీకి చర్యలు కార్పొరేషన్లు, మునిసిపాల్టీల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటోంది. అక్కడి నుంచి వచ్చే మురుగునీటిని ప్రస్తుతం 89 సివేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేస్తుండగా మరికొన్ని ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్, ఈ–పరిశ్రమల వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. -
ప్రకృతి ఒడి.. ప్రశాంత లోగిలి!
కరోనా మహమ్మారి జీవనాన్ని కొత్త దారిలో తీసుకెళ్తోంది. పట్టణాల్లో చిన్న పని దొరికితే చాలు.. అపార్ట్మెంట్ ఎన్నో అంతస్తు అయినా పరవాలేదు.. సర్దుకుపోదాం అనే ధోరణి ఇప్పుడు తగ్గుతోంది. కాస్తంత రెంటు ఎక్కువైనా.. వ్యక్తిగత ఇల్లు మేలు అనే భావన ఇప్పుడు అధికమవుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం.. కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో పట్టణానికి కాస్త దూరమైనా ప్రశాంతమైన వాతావరణంలో నివసించేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొక్కలు నాటేందుకు ఇష్టపడని వారు కూడా.. ఇప్పుడు ప్రకృతితో మమేకమై జీవించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. – సాక్షి, కర్నూలు డెస్క్ నంద్యాల పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ వెంచర్ రూపుదిద్దుకుంటోంది. మహానంది మండలం బుక్కాపురం వద్ద 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్లో 12 విల్లాలను ఒక్కొక్కటి 25 సెంట్ల స్థలంలో నిర్మించనున్నారు. మిగిలిన స్థలం అంతా పచ్చదనానికి కేటాయిస్తున్నారు. అంటే.. ప్రశాంత జీవనానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ వెంచర్‌ను చూస్తే అర్థమవుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది పల్లెల నుంచి పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలు పట్టణాల్లో కలిసిపోతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ ఎక్కడా ఖాళీ స్థలం కనిపించని పరిస్థితి. అంతో ఇంతో స్థలం ఉందంటే అపార్ట్మెంట్, లేక షాపింగ్ కాంప్లెక్స్ కడదామనే ఆలోచన వస్తోంది. ఈ కారణంగా కనుచూపు మేరలో కాంక్రీటు వనాలే కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు ఏడాదికేడాది విపరీతంగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి . అపార్ట్మెంట్ సంస్కృతి ఇటీవల కాలంలో అధికమైంది. ఉపాధి, ఉద్యోగంలో భాగంగా పట్టణాల్లో ఉండాల్సి రావడంతో ఎక్కడికక్కడ అపార్ల్మెంట్లు పుట్టుకొచ్చాయి. ఐదు అంతస్తులతో, వందలాది నివాసాలతో కూడిన ఈ కాంక్రీటు వనాలు మనుషులను దగ్గర చేస్తున్నా, మనసులను దూరంగా ఉంచుతున్నాయి. పక్కపక్కనే ఉంటున్నా ఎవరికి వారుగా బతికేస్తున్నారు. ఇక ఇటీవల కరోనా సృష్టించిన విలయం నేపథ్యంలో ఇలా ఇరుకిరుకు ప్లాట్లలో కాకుండా ఊరికి దూరంగా విశాలమైన వ్యక్తిగత ఇళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పచ్చని చెట్లు కనుమరుగు పట్టణాల పరిధి పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్క గ్రామాలు అందులో విలీనం అవుతున్నాయి. ఈ కారణంగా అభివృద్ధి విస్తరిస్తుండటంతో గ్రామీణ వాతావరణం కనుమరుగవుతోంది. శివారు కాలనీల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు పుట్టుకొస్తుండగా.. ఆ ప్రాంతంలోని చెట్లు తొలగించక తప్పని పరిస్థితి. కొంత స్థలం ఉందంటే చాలు.. రెండు ఇల్లు కట్టుకొని, ఒకటి బాడుగకు ఇచ్చుకోవడమో.. లేదంటే అపార్ట్మెంట్ కడితే జీవనానికి కాస్త ఊరట కలిగిస్తుందనే ఆశ పచ్చని చెట్లకు శాపమవుతోంది. పల్లెకు పోదాం.. పట్టణాల్లో వాతావరణం రోజురోజుకూ కాలుష్యంతో నిండుకుంటోంది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఎక్కడన్నా సేదతీరుదామంటే చెట్టు నీడను వెతుక్కోవాల్సిందే. సెంటు స్థలం ఉందంటే చాలు రోడ్డు పక్కనైతే దుకాణం కడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో అయితే ఇంటి ఆలోచన చేస్తున్నారు. ఈ కారణంగా మధ్య తరగతి ప్రజలు తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నగరానికి దూరంగా, పల్లెలకు సమీపంలోని వెంచర్లలో ప్లాట్లు కొంటున్నారు. పదవీ విరమణ వయస్సు తర్వాత పల్లె వాతావరణంలో సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు. అభిరుచికి అనుగుణంగా వెంచర్లు కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ కూడా తన స్వరూపాన్ని మార్చుకుంటోంది. ఇప్పటి వరకు 3 నుంచి 5 సెంట్ల స్థలాలతో వెంచర్లు ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 25 సెంట్ల స్థలాలతో వెంచర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు, అధికారులు, వైద్యులు ఈవిధమైన వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. రియల్టర్లు ఇలాంటి వాళ్లను ఎంపిక చేసుకొని అందుకు అనుగుణంగా వెంచర్లలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు కూడా పరిమితంగా ఉంటుండటం విశేషం. ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడుపుతాం పట్టణాల్లో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. అందుకే ఎమ్మిగనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా సొంత పొలంలోనే ఫాంహౌస్ కట్టుకున్నాం. ఉన్న ఇద్దరు కుమారులు మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ప్రశాంతత లేదని చెబుతుంటారు. చిన్నబ్బాయి హర్ష ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. యాంత్రిక జీవనం నుంచి బయటపడేందుకు, ఇంటిల్లి పాది సంతోషంగా గడిపేందుకు ఈ ప్రాంతం మాకు ఎంతో అనువుగా ఉంది. ప్రకృతి ఒడిలో సేదతీరితే ఎంతో ఆరోగ్యం. – మాచాని నాగరాజు ప్రశాంతత కోసం నగరానికి దూరంగా ఇల్లు కరోనా నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేం. నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా అధికం కావడంతో ఇరుకు ప్రాంతాల్లో సర్దుకుపోయి జీవించాల్సిన పరిస్థితి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఊరి బయట ప్రశాంత వాతావరణంలో ఇటీవల వ్యక్తిగత ఇల్లు నిర్మించుకున్నాం. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రాంతంలో నివాసం ఉంటే వ్యాధుల బారి నుంచి కొంతవరకైనా బయటపడొచ్చు. – హరగోపాల్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కర్నూలు -
కాలుష్యంతో శిశువుల్లో మానసిక సమస్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం, నాణ్యత లేని గాలి కారణంగా భారత్‌లో రెండేళ్లలోపు శిశువుల్లో మానసికంగా ఎదుగుదల సమస్యలు తలెత్తుతున్నట్లు అధ్యయనంలో తేలింది. సాధారణంగా రెండేళ్ల లోపు వయసున్న శిశువుల్లో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వయసులో స్పర్శ, అనుభవం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. జ్ఞానేంద్రియాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు. కాలుష్యంతో కూడిన గాలిని పీల్చడం వల్ల మెదడు అభివృద్ధిలో వేగం మందగిస్తుందని, ఈ ప్రతికూల ప్రభావం జీవితాంతం ఉంటుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వాయు కాలుష్యం వల్ల శిశువుల్లో మానసికపరమైన ఎదుగుదలతో పాటు భావోద్వేగ, ప్రవర్తన సంబంధిత సమస్యలు తలెత్తుతాయని, ఇవి వారి కుటుంబాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ స్పెన్సర్ చెప్పారు. (చదవండి: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు!) -
వనరుల పొదుపు..కాలుష్యం అదుపు.. సర్క్యులర్ ఎకానమీ! అంటే తెలుసా?
టవల్ మసి గుడ్డగా మారడం... వంటింట్లో వ్యర్థాలు మొక్కలకు పోషకాలుగా వినియోగించడం... అవసరం మేరకే విద్యుత్, నీరు, సామాన్లు వాడటం.. ఇలాంటి వాటికి మనం పెట్టుకునే పేరు.. పొదుపు. ఆ తరహా పనులే ప్రపంచం మొత్తం మీద అన్ని రంగాల్లో చేపడితే..? అదే.. సర్క్యులర్ ఎకానమీ! -కంచర్ల యాదగిరిరెడ్డి ప్రపంచం మొత్తం మీద ఏటా వినియోగిస్తున్న వస్తువులు 10,000 కోట్ల టన్నులు. ఇందులో ఒకసారి మాత్రమే వాడగలిగిన ప్లాస్టిక్, లోహాలు, కలప, కాంక్రీట్, రసాయనాలు ఏకంగా 92 శాతం. కాంక్రీట్‌ను పక్కనబెడితే మిగిలినవన్నీ చెత్తకుప్పల్లోకి చేరి మనల్ని ఇబ్బంది పెట్టేవి, ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసేవే. ఈ విపత్కర పరిస్థితికి తరుణోపాయం సర్క్యులర్ ఎకానమీ అని నిపుణులుఅంటున్నారు. భూమి మీద ముడి చమురు, ఫాస్పరస్ వంటి రసాయనాలు, సాగుభూమి, తాగునీరు ఇలా అన్నీ పరిమితమైనవే. కానీ మనం ఈ వనరులను వృధా చేస్తున్నాం. ఎంత వృ«థా అంటే.. అవసరానికి మించి 1.6 రెట్లు వాడేస్తున్నామని ప్రపంచ ఆర్థిక వేదిక స్పష్టం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు అన్నిరకాల ఇబ్బందులూ తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకునేందుకు సర్క్యులర్ ఎకానమీ దోహదపడుతుంది. వాడుకుని వదిలేయకుండా.. ఇప్పటివరకు మనం వస్తువులను తయారు చేసి వాడుకున్న తర్వాత వదిలేయడం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నాం. ఇంగ్లిషులో దీనిని ‘లీనియర్ ఎకానమీ మోడల్’అని పిలుస్తారు. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని, కాలుష్యం పెరుగుతోందని, వనరుల దుర్వినియోగం జరుగుతోందని 1970 దశకంలోనే కొంతమంది ఆర్థిక వేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి విరుగుడుగా సర్క్యులర్ ఎకనామీ మోడల్‌ను ప్రతిపాదించారు. ఎలన్ మెకార్థర్ ఫౌండేషన్ వంటివి ఈ ఆలోచనకు మరింత పదునుపెట్టి అన్ని రంగాల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్ని స్తున్నాయి. కొత్త సర్క్యులర్ ఎకానమీ మోడల్‌ను అమలు చేస్తే కేవలం కాలుష్యం, పర్యావరణ సమస్యలకు పరిష్కారం లభించడం మాత్రమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వనరుల వినియోగం.. ఎక్కువ మన్నిక సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో వస్తువులను వీలైనంత తక్కువ వనరుల వినియోగంతో తయారు చేస్తారు. వ్యర్థాలను, కర్బన ఉద్గారాలను వీలైనంతగా తగ్గించడం అనేది వీటి రూపకల్పనలో ముఖ్యాంశం. పైగా ఏ వస్తువైనా వీలైనంత ఎక్కువ సమయం ఉపయోగపడేలా ఉంటుంది. కొత్త మోడల్ వచ్చి నప్పుడల్లా పాత స్మార్ట్ఫోన్లను పడేసినట్లు కాకుండా.. చెడిపోతే మరమ్మతు చేయడం, డిజైన్లను మార్చడం ద్వారా సదరు వస్తువు జీవితకాలం పెంచడం, పూర్తిగా పనికిరాకుండా పోయిన తర్వాత రీసైకిల్ చేయడం సర్క్యులర్ ఎకానమీలో భాగం. ఉదాహరణకు.. యూరప్ దేశాలు ఏటా సుమారు 250 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిని మళ్లీ వాడుకునేలా చేయడం ద్వారా కొత్త వాటిని కొనుక్కునే అవసరాన్ని తప్పిస్తారన్నమాట. ఇలా చేయడం వల్ల బోలెడు డబ్బు ఆదా అవుతుంది. అలాగే అవి తిరిగి పనిచేసేలా తయారు చేసేందుకు, మరమ్మతులు చేసేందుకు మానవ వనరులు అవసరమవుతాయి. అంటే కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్నమాట. ఇది ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి వస్తే 2030 నాటికి సర్క్యులర్ ఎకానమీ విలువ దాదాపు 4.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకోరకంగా చెప్పాలంటే 4.5 లక్షల కోట్ల డాలర్ల మొత్తాన్ని ఆదా చేయవచ్చని వారు చెబుతున్నారు. వ్యవస్థ మొత్తం మారితేనే.. ఇందుకోసం వ్యవస్థ మొత్తం మారాలి. వినియోగదారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు అందరూ తమవంతు పాత్ర పోషించాలి. సులువుగా రీసైకిల్ చేయగలిగేలా, విడదీసేలా వస్తువులను డిజైన్ చేయడం ఒక పద్ధతి. దీనివల్ల తయారీకి ముడిసరుకులు తక్కువగా అవసరమవుతాయి. ఫెయిర్ ఫోన్ అనే స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసింది. పాడైపోయిన భాగాలను తీసేసి కొత్తవి వేసుకోవడం ఈ స్మార్ట్‌ఫోన్‌లో సాధ్యమవుతుంది. కేవలం వాడుకున్నందుకే డబ్బులు..! కొత్తరకం బిజినెస్ మోడల్ ద్వారా కూడా సర్క్యులర్ ఎకానమీ అమలు చేసేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్, మోటార్‌సైకిల్, ఏసీ, ఫ్రిజ్ వంటి వాటిని కొనడం కాకుండా.. కేవలం వాడుకునేందుకు మాత్రమే కంపెనీలకు డబ్బులు చెల్లించడం ఈ కొత్తరకం బిజినెస్ మోడల్‌కు ఒక ఉదాహరణ. ఈ మోడల్లో ఆయా వస్తువుల జీవితకాలం ముగిసిన తర్వాత సదరు కంపెనీ వెనక్కి తీసుకుంటుంది. వాటిల్లోని పరికరాలను రీసైకిల్ చేస్తుంది. ఉపయోగపడే వస్తువులన్నింటినీ మళ్లీ మళ్లీ వాడుతుంది. వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని 2040 నాటికల్లా దశలవారీగా తగ్గించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే పునర్వినియోగాన్ని, రీసైక్లింగ్‌నూ ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో సర్క్యులర్ ఎకానమీని అమల్లోకి తెచ్చింది. వ్యర్థాల మోతాదు తగ్గాలి ఈ ఏడాది ఫ్రిబవరిలో ప్రపంచవ్యాప్తంగా సర్క్యులర్ ఎకానమీ అమలుపై ఒక నివేదిక వెలువడింది. ‘ద సర్క్యులేటరీ గ్యాప్ రిపోర్ట్’గా పిలిచే ఈ నివేదిక ప్రకారం.. 1970తో పోలిస్తే మన వస్తు వినియోగం మూడు రెట్లు అంటే ఏడాదికి 10,000 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో సర్క్యులర్ ఎకానమీని కనుక అమలు చేయగలిగితే ఇందులో మూడొంతుల మేరకు వస్తు వినియోగాన్ని తగ్గించవచ్చు. సర్క్యులర్ ఎకానమీ అమల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని, అన్ని రకాల పరిశ్రమల్లో వ్యర్థాల మోతాదును తగ్గించేందుకు ప్రయత్నాలు జర గాలని నివేదిక సూచించింది. నియోమ్‌లో వ్యర్థాలన్నీ రీసైకిల్ సౌదీ అరేబియా కడుతున్న సరికొత్త నగరం ‘నియోమ్’లో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే అత్యాధునిక డీశాలినేషన్ ప్లాంట్లను ఉపయోగించనున్నారు. ఆ దేశంలో ఇది కొత్త కాదు కానీ.. నియోమ్‌లోని ప్లాంట్ల వ్యర్థాల నుంచి విలువైన రసాయనాలను వెలికితీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. బ్యాటరీల్లో వాడే లిథియంతో పాటు పొటా షియం, సోడియం వంటి అనేక లవణాలు, ఖనిజాలు సమ్రుదపు నీటిలో ఉంటాయన్నది తెలిసిన విషయమే. నియోమ్ ప్లాంట్ల వ్యర్థాల నుంచి జిప్సమ్‌ను వేరు చేసి దాన్ని సిమెంట్ తయారీలో వాడాలన్న ఆలోచన సాగుతోంది. కాగా నియోమ్‌లో వ్యర్థాలన్నింటినీ పూర్తిగా రీసైకిల్ చేయనున్నారు. ఘన వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా ఎరువులు, మురుగునీటి లోంచి నైట్రోజన్, ఫాస్పరస్ (సబ్బులు, డిటర్జెంట్ల వాడకంతో కలుస్తుంటాయి) వంటి వనరులను వెలికితీయనున్నారు. వాడేసిన వంట నూనెలతో వాహనాల పరుగు ఇంగ్లండ్‌లోని బౌర్న్మౌత్ ప్రాంతంలో చెత్తను సేకరించే వాహనాలన్నీ వాడేసిన వంటనూనెలతో నడుస్తున్నాయి. ఈ నూనెలను రీసైకిల్ చేసి తయారు చేసిన హైడ్రోట్రీటెడ్ వెజిటబుల్ ఆయిల్ (హెచ్‌వీఓ)ను ఉపయోగిస్తున్నారు. ఆమ్స్టర్డ్యామ్లో మెక్‌డొనాల్డ్స్ కేంద్రాల్లో వాడేసిన నూనెలను రీసైకిల్ చేసి చెత్త సేకరించే వాహనాలకు, స్విగ్గీ, జొమాటో వంటి ఆహారం సరఫరా చేసే కంపెనీలకు అందిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేక రసాయనాల ద్వారా విడగొట్టి ఆ ద్రావణాన్ని కొత్త ప్లాస్టిక్ తయారీకి వాడేలా సింగపూర్ ఇటీవలే ప్రయత్నాలు మొదలుపెట్టింది. -
కాలుష్య కాసారంతో నిండిపోతున్న కృష్ణ కెనాల్ కాలువ...
-
కేటీపీఎస్ బూడిదతో నరకం అనుభవిస్తున్న ప్రజలు
-
‘ముంచు’కొస్తున్న సముద్రం
సాక్షి, అమరావతి: సముద్ర నీటిమట్టాలు ఏటా పెరుగుతున్నాయని నాసా తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 2021–22లో 0.27 సెం.మీ మేర పెరిగిన సముద్రజలాలు తీరంలో అలజడిని సృష్టించాయని పేర్కొంది. సముద్రజలాలు కొద్దిగా పెరిగినా తీరం వెంబడి ఆవాసాలు ఏర్పరుచుకున్న వారికి ఆందోళన కలిగిస్తుందని వెల్లడించింది. ఉపగ్రహాల ద్వారా సముద్రజలాలపై నాసా చేసిన అధ్యయన నివేదికను ఇటీవల వెల్లడించడంతోపాటు గత 30 సంవత్సరాల సముద్ర మట్టాలను విశ్లేషించింది. 1993 నుంచి ఇప్పటివరకు సముద్ర జలాల మట్టం 9.1 సెం.మీ పెరిగిందని పేర్కొంది. గతేడాదిలో 0.27 సెం.మీ పెరిగిన సముద్ర జలాలు ఇకపై ఏడాదికి సగటున 0.66 సెం.మీ చొప్పున పెరిగి 2050 నాటికి మొత్తం 17.82 సెం.మీకు చేరుతుందని వెల్లడించింది. సముద్రాలపై ‘ఎల్‌నినో’ తీవ్రప్రభావం చూపడం, వాతావరణ మార్పులతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని, పెరుగుతున్న గ్రీన్హౌస్ వాయువులు, వాయుకాలుష్యం వంటివాటిని తగ్గించుకోకపోతే తీరప్రాంతాల్లో నివసించే ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరించింది. సముద్ర నీటిమట్టం పెరుగుదలను పరిశీలించేందుకు అమెరికా–ఫ్రెంచ్ ప్రభుత్వాలు సంయుక్తంగా 1993లో ‘టోపెక్స్ మిషన్’ను చేపట్టాయి. ప్రత్యేక రాడార్లతో సముద్ర ఉపరితలంపైకి మైక్రోవేవ్ తరంగాలని పంపించి కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. వేగంగా కరుగుతున్న అంటార్కిటిక్ మంచు వాతావరణ మార్పులకు, సముద్ర మట్టం పెరుగుదలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని నాసా విశ్లేషించింది. పరిమితికి మించిన కాలుష్యకారక వాయువుల కారణంగా వాతావరణంలో వేడి పెరిగి మంచు ప్రాంతాలు కరిగిపోయి హిమనీ నదాల్లో నీరు పెరుగుతోందని గుర్తించింది. వేసవి ఉష్ణోగ్రతలకు 2022లో అంటార్కిటిక్ ఖండంలోని మంచు పలకలు సాధారణ సగటు కంటే ఎక్కువగా కరిగిపోయినట్టు పేర్కొంది. దీనికి గ్రీన్‌ల్యాండ్ ఐస్ ప్యాక్ కరిగి అదనపు నీరు తోడవడంతో సముద్ర మట్టాలు వేగంగా పెరిగినట్లు ప్రకటించింది. అర మీటర్ మునిగింది.. గతేడాది పెరిగిన సముద్ర జలాలతో మియామి, న్యూయార్క్, బ్యాంకాక్, షాంఘై, లిమా (పెరూ), కేప్‌టౌన్‌తో పాటు అనేక తీర ప్రాంతాలు అర మీటర్ మేర నీటమునిగినట్టు నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పెరుగుదల కష్టాలను కనీసం 800 మిలియన్ల మంది ఎదుర్కొంటారని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దేశస్తుల్లో సగం మందికి పైగా తీరప్రాంతాల్లోనే ఉన్నారు. ప్రధాన సీపోర్టులు, వినోద ప్రాంతాలు, ఇతర సౌకర్యాలు తీరంలోనే ఉన్నాయి. సముద్ర మట్టం పెరిగితే వీటిపై తీవ్రంగా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ ముంపు ప్రభావం అడవులు, వన్యప్రాణుల పైన కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. నాసా వెల్లడించిన అంశాలు వాతావరణాన్ని ఏ స్థాయిలో కలుషితం చేస్తున్నామో.. గ్రీన్హౌస్ వాయువులను ఏస్థాయిలో విడుదల చేస్తున్నామో హెచ్చరికగా పేర్కొన్నారు. నాసా లెక్కల ప్రకారం 2050 నాటికి సముద్ర మట్టం 17.82 సెం.మీ పెరిగితే.. 300 నుంచి 500 మీటర్ల మేర తీర ప్రాంతం సముద్ర గర్భంలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొత్త పోకడ...రైలెక్కి రయ్.. రయ్
ఇంటి నుంచి కాలు బయట పెడితే విమానాలు ఎక్కడమే వారికి తెలుసు. రయ్యిమంటూ గాల్లో తేలిపోతూ గమ్యస్థానాలకు చేరుకోవడాన్ని ఇష్టపడతారు. అలాంటిది ఇప్పుడు వారిలో కూడా మార్పు వస్తోంది. హాయిగా రాత్రిపూట రైలెక్కి బెర్త్ వాల్చితే ఉదయానికల్లా ఊరు చేరుకోవడంలో ఎంత సదుపాయముందో యూరప్ వాసులు గ్రహించారు. చుకు బుకు చుకు బుకు రైలును, అదిరిపోయే దాని స్టైలును, ఆ ప్రయాణంలోని మజాను ఆస్వాదిస్తున్నారు. విమాన ప్రయాణాలతో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి యూరప్‌లో పలు దేశాలు కూడా రైలు ప్రయాణాలకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. దాంతో వారు కూడా తక్కువ దూరాలకు విమానానికి బదులుగా రైలు వైపే మొగ్గు చూపిస్తున్నారు... యూరప్‌లో రైలు ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని డచ్ విమానయాన సంస్థ కేఎల్ఎమ్ వంటివి రైలు రవాణా నెట్‌వర్క్‌లో భాగస్వాములవుతున్నాయి. యూరోపియన్ కమిషన్ కూడా 2021ని ఇయర్ ఆఫ్ యూరోపియన్ రైల్‌గా ప్రకటించి రైలు ప్రయాణికులకు భారీగా ప్రోత్సాహకాలు కల్పించింది. హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం, రైలు టికెట్ ధరల్ని తగ్గించడం వంటి చర్యలతో ఇప్పుడు చాలామంది రైలు జర్నీయే సో బెటరని అంటున్నారు. ముఖ్యంగా స్వల్ప దూర ప్రయాణాలకు రైళ్లల్లో వెళ్లడానికి యూరప్ పౌరుల్లో 62% మంది ఇష్టపడుతున్నారని తాజా సర్వేలో తేలింది. 1990 తర్వాత మళ్లీ ఇప్పుడు రాత్రిళ్లు ప్రయాణించే స్లీపర్ రైళ్లకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలు... యూరప్‌లో విమాన ప్రయాణాల వల్ల వెలువడుతున్న కాలుష్యం ఏటా పెరుగుతూనే ఉంది. ఈ పెరుగుదల 2013–2019 మధ్య ఏడాదికి సగటున 5% చొప్పున నమోదైంది! ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు కేవలం స్వల్ప దూరాల విమానాలను మాత్రమే నిరుత్సాహపరుస్తూ అధిక దూరం ప్రయాణించే విమానాలకు ప్రోత్సాహకాలు కొనసాగించడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వచ్చే పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటూ పెదవి విరుస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ వాటి కాలుష్యమే అధికం ప్రపంచవ్యాప్తంగా అధిక దూరాలు ప్రయాణించే విమానాల నుంచి వెలువడే కాలుష్యమే ఎక్కువ! జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జియోగ్రఫీ తాజా నివేదిక ప్రకారం 500 కి.మీ. కంటే తక్కువ దూరం ప్రయాణించే విమానాల యూరోపియన్ యూనియన్‌లో 27.9 % కాగా వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు 5.9%. 4 వేల కి.మీ. కంటే అధిక దూరం వెళ్లే విమానాలు కేవలం 6.2% మాత్రమే. కానీ వాటినుంచి వెలువడే కాలుష్యం ఏకంగా 47 శాతం! అలాంటప్పుడు కేవలం తక్కువ దూరాలు ప్రయాణించే విమానాల రద్దుతో ఒరిగే ప్రయోజనాలేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. రైల్వేలకున్న అడ్డంకులివే..! కొన్ని దశాబ్దాలుగా విమాన ప్రయాణానికే అలవాటు పడడంతో చాలా మార్గాల్లో రైలు సదుపాయం లేదు. కొత్త ట్రాక్‌లు నిర్మించడం, రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడం వంటి చర్యలు ఇంకా తీసుకోవాల్సి ఉంది. చాలా దేశాల్లో విమాన ప్రయాణాల కంటే రైలు ప్రయాణాలు ఎక్కువ ఖరీదు. అధిక చార్జీలు కూడా రైలు ప్రయాణానికి అడ్డంకిగా మారింది. యూరప్ రైలు ఆపరేటర్లకు లాభార్జనే ధ్యేయం. మార్కెట్ షేర్ కంటే అధిక లాభాలు ప్రజల నుంచి గుంజాలని చూస్తుంటాయి. ఇవన్నీ రైల్వేల విస్తరణకు అడ్డంకిగా మారుతున్నాయి. ఫ్లైట్ షేమ్ ఉద్యమంతో దశ మారిన రైల్వే యూరప్‌లో ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గుచూపించడానికి ఫ్లైట్ షేమ్ ఉద్యమం ప్రధాన కారణం. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వీడన్‌కు చెందిన టీనేజ్ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్ 2019లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్య రాజ్యసమితి పర్యావరణ సదస్సుకి హాజరవడానికి ఆమె విమాన ప్రయాణం చెయ్యకుండా అట్లాంటిక్ సముద్రంలో నౌకలో కొద్ది రోజుల పాటు ప్రయాణించి మరీ అమెరికా చేరుకున్నారు. విమానం నడపడానికి భారీగా చమురు ఖర్చు చేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని అందుకే విమానానికి బదులుగా పడవలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించాలని గ్రేటా థెన్‌బర్గ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమ ప్రభావంతో యూరప్ వాసులు విమానాలకి బదులుగా రైలు ప్రయాణంపై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. యూరప్ దేశాలు తీసుకుంటున్న చర్యలివే... ► జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలన్నీ రైలు ప్రయాణానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ► తక్కువ దూరం ఉండే మార్గాల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం విమానాలను రద్దు చేసింది. ఆయా మార్గాల్లో కొత్త రైళ్లను నడపడం ప్రారంభించింది. ► రెండున్నర గంటల కంటే తక్కువ సమయం పట్టే రెండు ఊళ్ల మధ్య రైళ్లలోనే ప్రయాణం చేయడం తప్పనిసరి చేసింది. ► దీని వల్ల దేశీయంగా విమానం ద్వారా వెలువడే గ్రీన్హౌస్ వాయువుల్ని 3% తగ్గించగలిగింది. ► 2020లో ఆస్ట్రియా ప్రభుత్వం రైలులో ప్రయాణిస్తే మూడు గంటల కంటే తక్కువ సమయం పట్టే అన్ని మార్గాల్లోనూ విమానాలను రద్దు చేసింది. ► ఆస్ట్రియాలో 350 కి.మీ. కంటే తక్కువ దూరం విమానాల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి 30 యూరోల పన్ను వసూలు చేస్తోంది. ► మరోవైపు 2050 నాటికి 2.5 గంటల కంటే తక్కువ సమయాల్లో వెళ్లే విమానాలన్నీ రద్దు చేయడానికి స్పెయిన్ సన్నాహాలు చేస్తోంది. -
మిరుమిట్ల మాటున ముప్పు
సాక్షి, అమరావతి: ఏదైనా నగరంలో రాత్రివేళ ఎత్తయిన భవనంపై నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది?!... మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతి వెలుగులతో ఆ నగరం అంతా మెరిసిపోతూ ఉంటుంది. నిశిరాత్రే పట్టపగలు మాదిరిగా గోచరిస్తుంది. అయితే ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే. ఆ మిరుమిట్ల వెలుగుల చాటున పర్యావరణానికి, జీవజాలానికి పెనుముప్పు పొంచి ఉందనే విషయం చాలామందికి తెలియదు. కాంతి కాలుష్యం వర్తమాన ప్రపంచానికి పెను సవాల్‌గా మారుతోందని ప్రముఖ సైన్స్ జర్నల్ ‘సైన్స్ మ్యాగజైన్’ అధ్యయనం ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశంలో ఏటా 20 శాతం పెరుగుతున్న స్కై గ్లో అభివృద్ధి పేరుతో నగరాల్లో రాత్రుళ్లు మితిమీరిన విద్యుత్ వెలుగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చీకటిని పారదోలుతున్నాయి. ఈ విద్యుత్ కాంతుల నుంచి వెలువడే రేడియేషన్‌ను ‘స్కై గ్లో’ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ‘స్కై గ్లో’ ఏటా 10 శాతం చొప్పున పెరుగుతుండటం గమనార్హం. న్కూయార్క్, వాషింగ్టన్, లండన్ వంటి నగరాలతోపాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లోనూ ‘స్కై గ్లో’ ఏటా 20 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ ‘స్కై గ్లో’ ఆకాశంలోని చిన్న చిన్న నక్షత్రాలను సైతం మసకబారుస్తుండటంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారుతోందని అంటున్నారు. 2011– 2022 మధ్య 10 శాతం చిన్న నక్షత్రాలు మసకబారిపోయినట్టు అధ్యయనంలో వెల్లడైంది. అంతరిస్తున్న కార్పెంటర్ తేనెటీగలు.. కాంతి పరావర్తనాన్ని బట్టి మొక్కల పెరుగుదల ఉంటుందన్న సంగతి తెలిసిందే. ‘స్కై గ్లో’ పూల వికాసంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పూలు సహజసిద్ధంగా వికసించడం లేదని.. నిర్ణీత సమయానికి కంటే ముందుగానే వికసిస్తున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పూలపై ఆధారపడి పరాగ సంపర్కం చేసే తేనెటీగలు సందిగ్ధతకు గురవుతున్నాయి. దీంతో వాటి సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. భారత్‌లోనే ప్రత్యేకంగా ఉండే ‘కార్పెంటర్ తేనెటీగ’ ఉనికి ప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చీకట్లో పరాగ సంపర్కం జరపడం ‘కార్పెంటర్ తేనెటీగ’ ప్రత్యేకత. కృత్రిమ వెలుగులతో చీకటి తగ్గిపోతుండటంతో ఈ తేనెటీగలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ముంబైకి 100 కి.మీ. దూరంలో ఉన్న భీమశంకర్ అభయారణ్యంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ముంబై నగరం చిమ్మే వెలుగులతో ఆ అభయారణ్యంలో కార్పెంటర్ తేనెటీగలు క్రమంగా అంతరిస్తున్నాయని గుర్తించారు. ఏటా లక్షల పక్షులు బలి.. నక్షత్రాల వెలుగునే ఆధారంగా చేసుకుని వివిధ ఖండాల నుంచి పెద్ద సంఖ్యలో వలస వచ్చేపక్షులకు స్కై గ్లో నుంచి ముప్పు ఏర్పడుతోంది. విద్యుత్ వెలుగులతో జిగేల్మంటున్న భారీ భవంతులతో వలస పక్షులు సందిగ్ధతకు లోనవుతున్నాయి. పక్షులు కాంతి పరావర్తనాన్ని గుర్తించలేవు. దీంతో కృత్రిమ కాంతిని చూసి అదే తమ గమ్యస్థానమని భావిస్తున్నాయి. నేరుగా వచ్చి ఎత్తైన భవనాల అద్దాలను ఢీకొట్టి లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కాగా వలస పక్షుల విసర్జకాలు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతున్నాయి. వలస వచ్చే సముద్ర పక్షులు ప్రపంచవ్యాప్తంగా ఏటా బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.8,500 కోట్లు) విలువైన సేంద్రియ ఎరువును అందిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. రాష్ట్రంలో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి వచ్చే పెలికాన్ పక్షులు సేంద్రియ ఎరువును అందిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ వెబ్సైట్లో పేర్కొంది. ఇంతటి ప్రయోజనాన్ని అందిస్తున్న వలస పక్షులు స్కై గ్లో బారిన పడుతుండటం ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. డార్క్ స్కై లైటింగ్ విధానాలే పరిష్కారం ప్రమాదకరమైన ‘స్కై గ్లో’ను తగ్గించే దిశగా నిపుణులు పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్ని దేశాలు డార్క్ స్కై లైటింగ్‌ను ప్రవేశపెట్టాయి. అమెరికాలోని పిట్స్బర్గ్ నగరంలో ‘డార్క్ స్కై లైటింగ్’ అమల్లో ఉంది. అంటే మిరుమిట్లు గొలిపే కాంతిని కాకుండా తక్కువ కాంతిని వెదజల్లే లైట్లను అమరుస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా అవకాశం ఉన్నంతవరకు రాత్రి వేళల్లో సహజసిద్ధమైన చీకటి ఉండేలా చూస్తోంది. ఎత్తైన భవనాలకు ముదురు రంగులు వేస్తోంది. దాంతో కాంతి పరావర్తనం చెందదు కాబట్టి వలస పక్షులకు ఇబ్బంది ఉండదు. -
ప్రకృతి వనం... ఆక్సి‘జనం’
సాక్షి, మేడ్చల్ జిల్లా: నగరీకరణ శరవేగంగా పెరుగుతోంది. దీంతోపాటే కాలుష్యమూ పెచ్చుమీరుతోంది. దీంతో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలతోపాటు ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న మానసిక ఒత్తిళ్లు సరేసరి. వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు చక్కటి సాంత్వన కల్పిస్తున్నాయి ప్రకృతి వనం, లంగ్స్ స్పేస్. హరితహారంలో భాగంగా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌తోసహా శివారు పట్టణాలు, సెమీఅర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే లక్షలాది మొక్కలు నాటిన సర్కారు పల్లె, పట్టణ ప్రకృతి వనాలను పెంచుతోంది. వీటిలో వాకింగ్ పాత్‌లు, చిల్ట్రన్ కార్నర్స్ ఏర్పాటుచేయడంతోపాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక ఏర్పాటుచేస్తోంది. 80 లక్షల వాహనాలు... ఎన్నో పరిశ్రమలు గ్రేటర్ పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. సుమారు 80 లక్షల మేర ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగతో ‘సిటీ’జన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెట్టడంతో కాలుష్య తీవ్రత మరింత పెరుగుతోంది. వీటికితోడు పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ఫలితంగా పీల్చే గాలిలో సూక్ష్మధూళికణాలు చేరి సమీప ప్రాంతాల్లోని ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాల (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. పుర, పంచాయతీల్లో వనాలు పుర, పంచాయతీల్లో అర ఎకరం నుంచి 4 ఎకరాల పరిధిలో ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. గ్రేటర్ శివారు (మేడ్చల్ జిల్లా + రంగారెడ్డి జిల్లా)లోని 29 పురపాలక సంఘాల్లో 595 పట్టణ ప్రకృతి వనాలున్నాయి. వీటిని పురపాలక సంఘాలు నిర్వహిస్తున్నాయి. అలాగే, 619 పంచాయతీల పరిధిలో 946 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించి ఎకరాకు 2,500 మొక్కల చొప్పున పెంచారు. లంగ్స్ స్పేస్ ఎక్కడెక్కడ? హైదరాబాద్ శివారుల్లో ఏడు అర్బన్ లంగ్స్ స్పేస్లున్నాయి. ►మేడిపల్లి ఫారెస్టు బ్లాకులో 100 ఎకరాల్లో శాంతివనం ►దూలపల్లి ఫారెస్టు బ్లాకులోని ప్రశాంత వనం ►నారపల్లిలోని భాగ్యనగరం నందన వనం ►బహుదూర్‌పల్లి ఫారెస్టు బ్లాకులోని 50 ఎకరాల్లో ►నాగారం ఫారెస్టు బ్లాకులోని 70 ఎకరాల్లో.. ►నారపల్లి–పర్వతాపూర్ ఫారెస్టు బ్లాకులోని 60 ఎకరాల్లో.. ►కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కు హైదరాబాద్‌లో ఏడాదికి సగం రోజులకుపైగా కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలు ►బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ మరిన్ని అభివృద్ధి చేస్తాం నగర శివారుల్లో పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, లంగ్స్ స్పేస్‌లను మరింత అభివృద్ధి పరుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ భూములను కూడా గుర్తిస్తున్నాం. పెరుగుతున్న జనాభా, నగరీకరణ నేపథ్యంలో వీటి అవసరం ఎంతో ఉంది. పెరుగుతున్న కాలుష్యం కట్టడికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. – డా.ఎస్. హరీశ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ స్వచ్ఛమైన గాలి.. ప్రకృతి వనాలు, లంగ్ స్పేస్‌లు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. కాలుష్యం బారి నుంచి రక్షిస్తున్నాయి. సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నాం. రోజంతా అక్కడే ఉండాలనిపిస్తుంది. – కె. ఆంజనేయులు, పోచారం గొప్ప ఉపశమనం.. నారపల్లి–పర్వతాపూర్‌లోని 60 ఎకరాల్లో ఉన్న అర్బన్ లంగ్స్ స్పేస్ పిల్లలతోపాటు పెద్దలనూ ఆహ్లాదపరుస్తోంది. నగరానికి సమీపంలో ఉండటం వల్ల ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు వస్తారు. ఆటపాటలతో అందరూ ఆనందంలో మునిగితేలుతారు. –పి. రవికిరణ్, పీర్జాదిగూడ -
ప్లాస్టిక్ కవర్లలో వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’! అలారం మోగుతోంది.. వినబడుతోందా?
ఎన్నో సందేహాలు, సమాధానాలు దొరకని చిక్కు ప్రశ్నలు.. ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? మార్కెట్‌కు వెళ్లి చికెన్ కొందామనుకున్నాం. కోడి కాస్తా చికెన్‌గా మారే ప్రక్రియలో 30% వేస్ట్‌గా మారుతుంది. ఈ వ్యర్థాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? కోటికి పైగా జనాభా ఉండే హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలాంటి నగరాల్లో ఎన్ని టన్నుల చికెన్ వేస్టేజ్‌ను ఏం చేస్తున్నారు? వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్ కవర్లలో మనకు నీట్‌గా ప్లాస్టిక్ కవర్లలో చికెన్ ప్యాక్ చేసిస్తారు సరే, వేస్టేజ్ అంతా ఎక్కడికి పంపుతున్నారు? స్టేషన్ దగ్గర హోటల్ ఉంది. కర్రీ ప్యాకింగ్ కోసం వస్తున్నారు. అందరికీ వేడి కర్రీలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. అంతెందుకు గిన్నెలో మరిగే వేడి వేడి చాయ్‌ని ప్లాస్టిక్ కవర్లలో కట్టిస్తున్నారు. ఒక్క చుక్క కూడా కారదట. అది సరే, కవర్లలో అంత వేడి పదార్థాలను పోస్తుంటే దాన్నుంచి ఏమీ వెలువడవా? అందులోని పదార్థాలను తిన్నా, తాగినా ఏమీ కాదా? తెలిసిన వాళ్లలో బాగా ఉన్న వాళ్లొకరున్నారు. చాలాసార్లు పిలిస్తే వాళ్లింటికి వెళ్లాను. ఆశ్చర్యం.. ఇల్లంతా ఏసీ. బాత్రూంలో కూడా చల్లదనమే. అడిగితే ఇదే మాకు అలవాటన్నారు. ఏడాదంతా వాళ్లు ఏసీలోనే ఉంటారు. ఎండ ఉన్నా, వేడి నీళ్లతోనే స్నానం మరో విషయం. ఎంత ఎండ ఉన్నా, వాళ్లు వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. ప్రకృతికి విరుద్ధంగా వీళ్లు మారిపోయారా? చలికాలంలో వేడి నీళ్లు సరే, ఎండాకాలంలో కూడా చన్నీళ్లను భరించలేని స్థితికి మారిపోయారా? ప్రతిరోజూ సీల్ విప్పిన ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను మాత్రమే ఎందుకు తాగుతారు? స్టేటస్ సింబల్ సరే, ఇలాంటి వాళ్లు చేసే పని వల్ల పుడమిపై ఎంత భారం పడుతుంది? కడుపులో కుక్కేయాలా? మా ఊరి నుంచి పెద్దాయన కబురు పెట్టాడు. సిటీలోనే ఆయన కూతురు పెళ్లి. తప్పదు కాబట్టి వెళ్లాం. పేద్ద కన్వెన్షన్ హాల్. వేలల్లో అతిథులు ఉంటారు. భోజనాల దగ్గర జాతరలా ఉంది. తిన్నా, తినకపోయినా ప్లేట్ల నిండా అక్కరకు మించి మాంసం ముక్కలు వేసేసుకుంటున్నారు. అందులో సగం కూడా తినట్లేదు. అడ్డంగా పారేస్తున్నారు. మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారు. మళ్లీ మళ్లీ పారేస్తున్నారు. ఇలా చెత్తబుట్టల్లో వేసిన విలువైన ఆహారం సంగతేంటీ? భూమిలో వేస్తారా? లేక ఇంకేమైనా చేస్తారా? మనది కాదు కాబట్టి.. మళ్లీ మళ్లీ దొరకదు కాబట్టి కడుపులో కుక్కేయాలా? మిగిలిపోతోంది చిన్న కుటుంబం. సగటు జీవితం. అయినా తేడా కొడుతోంది. నిజానికి మంచి శాలరీనే వస్తోంది. అయినా సరిపోవట్లేదు, పైగా అప్పులు. నలుగురి కోసం లెక్క వేసుకుంటున్నాం కానీ.. భోజనం పూర్తయ్యేసరికి ఇంకా ఇద్దరు తినాల్సినంత మిగిలిపోతోంది. తెల్లవారికల్లా చద్దన్నం. ఆకలి తగ్గిందా? లేదు లేదు మరింత పెరిగింది. అందుకే ఆర్డర్ల మీద ఆర్డర్లు. యాప్ నొక్కగానే వస్తున్నాయి. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి జంక్‌ఫుడ్ కమ్మగా ఉంటే ఇంట్లో వండింది ఎందుకు తింటాం? ఎందుకు బయటి తిండే రుచికరంగా అనిపిస్తోంది? అవును.. పొట్ట కింద టైర్లు పెరుగుతున్నాయి. తెలియకుండానే దుస్తులు టైట్ అవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు వంద. మనిషి ఆలోచనల్లో ఎక్కడో తేడా కొడుతుంది. బతికే పద్ధతి పక్కదారి పడుతోంది. నేను బతకాలి నుంచి నేనే బతకాలి అన్నంత వరకు వచ్చింది. ఉన్నది ఒక్కటే జిందగీ కాబట్టి దొరికినంత తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఉన్న ఒక్క జీవితం అనుభవించడానికేనా? దొరికిందంతా మనమే అనుభవిస్తే.. వచ్చే తరానికి మిగిలేదేంటీ? అప్పటి నుంచి విప్లవం మన సైన్స్ లెక్కల ప్రకారం భూమి 450 కోట్ల సంవత్సరాల కింద పుట్టింది. సకల ప్రాణుల్లో ఒకరిగా మనిషి అనే రూపం కూడా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న మనిషి రూపం– అంటే రెండు కాళ్లు, రెండు చేతులు, 2 లక్షల ఏళ్ల కింద అవతరించింది. 6 వేల ఏళ్ల నుంచి నాగరికత మొదలయింది. ఎప్పుడయితే మనిషి నిప్పును కనుగొన్నాడో అప్పటి నుంచి విప్లవం వచ్చింది. 200 ఏళ్ల కింద పూర్తి స్థాయి పారిశ్రామికీకరణ వచ్చింది. అంటే 450 కోట్ల పుడమిని అంతకు ముందెన్నడూ లేని రీతిలో 200 ఏళ్లలో మనిషి దెబ్బతీస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనిషి ధాటికి సర్వం కాలుష్యం. భూమిపై నివసిస్తున్న 800 కోట్ల మంది.. ఇష్టానుసారంగా తమకు కావాల్సిన వస్తువులను పుడమి నుంచి తయారు చేసుకుని వాటిని వ్యర్థాలుగా మార్చి మళ్లీ భూమిలో కలిపేస్తున్నారు. ఇంకెన్నాళ్లో ఉండదు ఒక్క భూమి మాత్రమేనా? ఇప్పటికే సముద్రాలన్నింటిలో చెత్త, రసాయనాలు నింపేసి విషపూరితంగా మార్చేస్తున్నాడు. పైగా అహంకారం ఒకటి. ఇంకొకడు వాడింది నేను ముట్టుకోనంతే అంటాడు. ఏంటో మరి. నాకన్నీ కొత్తవి, బ్రాండ్ న్యూ వస్తువులు కావాలంటున్నారు. ఇలా ఎవరికి వాళ్లు నచ్చినవన్నీ వాడేసుకుంటూ పోతే.. వ్యర్థాలన్నీ నింపుకుంటూ వెళ్తే.. ఈ భూమి ఇంకెన్నాళ్లో ఉండదు. అందుకే రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ చేయాలి. ఎవరు చేయాలి? ప్రతి ఒక్కరూ చేయాలి? చెత్త కుప్పలు కాదు కొండలు లేని దేశంగా, పుడమిగా మారాలి. పర్యావరణాన్ని తద్వారా మన భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇవ్వాళ మీరు తీసుకునే జాగ్రత్తలు, వేసే చిన్న చిన్న అడుగులే అందమైన భవిష్యత్తుకు దారిస్తాయి, పుడమిని కాపాడతాయి. -శ్రీనాథ్ గొల్లపల్లి చదవండి: Wat Pa Maha Chedi Kaew: 15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం అమెరికాలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్!! మనమెందుకు పట్టించుకోవాలంటే? -
తారలు తెర‘మరుగు’.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు
బెంగళూరు: మబ్బుల్లేని రాత్రి వేళ అలా ఆకాశంలోకి చూసినప్పుడు లెక్కలేనన్ని నక్షత్రాలు తళుకుమంటూ కనువిందు చేస్తుంటే ఎంతో బావుంటుంది కదా! కానీ వినువీధిలో తారల తళుకులు నానాటికీ తగ్గిపోతున్నాయి. 2011తో పోలిస్తే 2022 నాటికి అబ్జర్వేటరీల కెమెరా కంటికి కన్పిస్తున్న నక్షత్రాల సంఖ్య ఏకంగా 10 శాతం తగ్గిందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అయితే, దీనికి కారణం నక్షత్రాలు నశించిపోవడం కాదు. భూమిపై కృత్రిమ వెలుగులు మితిమీరి పెరిగిపోవడం! మరోలా చెప్పాలంటే కాంతి కాలుష్యమన్నమాట!! దాంతో కాస్త తక్కువ ప్రకాశంతో కూడిన నక్షత్రాలన్నీ సదరు కృత్రిమ వెలుగు మాటున మరుగున పడిపోతున్నాయట! ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితని యూనివర్సిటీ ఆఫ్ శాంటియాగో డీ కాంపొస్టెలా భౌతిక శాస్త్రవేత్త ఫాబియో ఫాల్చీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కాంతి కాలుష్యం ఏటా 7 నుంచి 10 శాతం చొప్పున పెరిగిపోతోంది! ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది’’ అని ఆయనన్నారు. ‘‘ఒకప్పట్లా చిక్కటి చీకటితో నిండిన రాత్రుళ్లు ఎప్పటికీ తిరిగిరావు. ముఖ్యంగా నగరాల్లోనైతే రాత్రిపూట వెలుగులు అనివార్యంగా మారి దశాబ్దాలు దాటింది. కానీ పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆకాశంలో కేవలం వేళ్లపై లెక్కబెట్టగలిగినంతకు మించి చుక్కలు కన్పించని రోజు ఎంతో దూరంలో లేదు’’ అంటూ హెచ్చరించారు. -
చమురుతో కంటే.. పాలిస్టర్‌తో తయారయ్యే ఫాస్ట్ ఫ్యాషన్ వల్లే ఎక్కువ కలుషితం!
మది నచ్చేలా ఉండాలి.. మేనికి హాయినివ్వాలి.. తరాల జ్ఞాపకమై కదలాలి.. పర్యావరణానికి హితమై.. తరుణులకు నెచ్చెలి అయి.. నిలిచేలా ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. సస్టెయినబుల్ ఫ్యాషన్.. ప్రపంచంలో చమురు తర్వాత ఫ్యాబ్రిక్ పరిశ్రమయే అతి పెద్దది. చమురు ప్రపంచవ్యాప్తంగా ..10 శాతం కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. దీనితో పోల్చితే పాలిస్టర్‌తో తయారయ్యే ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల పర్యావరణం విపరీతంగా కలుషితం అవుతుందనేది నిపుణుల మాట. ఇలాంటప్పుడు ఫ్యాషన్‌లో మనవైన ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిద్దాం.. పర్యావరణానికి నేస్తాలుగా మారుదాం. యువత నుంచే.. మన విద్యా విధానంలో ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ వాడకానికి సంబంధించిన విషయాలు చెప్పడం ప్రారంభిస్తే పిల్లలు, యువతకు వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాఠ్యాంశాల్లో సస్టెయినబుల్ ఫ్యాషన్‌కు సంబంధించిన పాఠాన్ని చేర్చాలని పర్యావరణ అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాడిన ఉత్పత్తులను తిరిగి ఉపయోగించడం, వాడిన వస్తువులను రీ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరించబడుతుంది. మైండ్ ‘సెట్’ ఫ్యాషన్ వ్యవస్థలో పరివర్తనకు కీలకమైన మార్పులు తీసుకువస్తున్నాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్. లండన్ ఫ్యాషన్ స్కూల్ ‘యుఎఎల్’ సస్టెయినబుల్ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ కోసం ప్రత్యేకంగా కోర్సులను ఆఫర్ చేస్తోంది. యూనివర్శిటీ స్థాయిలో ఫ్యాషన్ విద్య అనేది కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, వాతావరణం, సామాజిక, న్యాయసూత్రాలను అమలు చేయడానికి వీలైనదని, యువతలో ‘మైండ్‌సెట్’ చేయడానికి ఈ విధానం బాగా ఉపకరిస్తుందని చెబుతోంది. ఇప్పటికే నిలకడ లేని ఫాస్ట్ ఫ్యాషన్ పద్ధతులు పర్యావరణాన్ని విపరీతంగా నాశనం చేశాయంటోంది న్యూయార్క్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వంతో కలిసి పని చేసిన మొట్టమొదటి ఉన్నత విద్యాసంస్థలలో ఒకటిగా నిలిచింది ఎన్ఎఫ్ఇఎటి. 2011లో కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించిన ఈ సంస్థ, 2016 నాటికి 46 శాతానికి తగ్గించింది. 2025 నాటికి 50 శాతానికి చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. మన దేశంలోనూ హ్యండ్లూమ్స్తో యువత కోరుకునేవిధంగా డ్రెస్ డిజైన్ చేసే సంస్థలు ఉన్నాయి. ఫాస్ట్ఫ్యాషన్ పోకడలను నిలువరించి, స్వదేశీ నాణ్యమైన, పర్యావరణ హితమైన ఫ్యాబ్రిక్ డిజైన్స్ వైపు దృష్టి పెట్టాల్సిన అత్యవసర తరుణంగా ఈ యేడాది నిర్ణయం తీసుకుందాం. మనవైన చేనేతలు ఎవర్‌గ్రీన్‌గా ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి. ఇండో–వెస్ట్రన్ మార్కులూ కొట్టేస్తుంటాయి. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్‌ని బ్లాక్ ప్రింట్, టై అండ్ డై డిజైన్స్‌తో మెరిపించినా, చేతితో అల్లిన ఊలు శాలువాలు, జాకెట్స్ కానుకలుగా ఇచ్చినా అవి జ్ఞాపకాల దొంతరగా మనల్ని హత్తుకుపోతాయి. పునరుద్ధరణ ఉపయోగించని చీరలు, దుపట్టాలు చిన్నారుల సంప్రదాయ డ్రెస్‌లకు సరిగ్గా నప్పుతాయి. వేటిని తిరిగి ఉపయోగించవచ్చో తెలుసుకొని ఆచరణలో పెట్టినా ప్రకృతికి ఎంతో మేలు. చదవండి: Megha Akash: తారలా తళుకులీనుతున్న మేఘా ఆకాశ్.. ఈ ట్రెండీ లుక్కు కారణం? -
Hyderabad: కాలుష్యం..కాస్త తగ్గింది
సాక్షి, హైదరాబాద్: గతేడాది వరుస వర్షాలతో మూసీ కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజాగా విడుదల చేసిన 2022 వార్షిక నివేదిక స్పష్టం చేసింది. నది ప్రస్థానం పొడవునా 12 చోట్ల పీసీబీ శాస్త్రవేత్తలు నీటినమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో జని్మంచిన మూసీ.. నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణాలో కలుస్తోంది. ప్రధానంగా అనంతగిరి నుంచి గ్రేటర్ సిటీకి సుమారు 100 కి.మీ వరకు మూసీ నదిలో కాలుష్యం అంతగా నమోదు కానట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. కానీ నగరంలోకి ప్రవేశించే బాపూఘాట్ నుంచి ప్రతాప సింగారం వరకు కాలుష్యం అధికంగా నమోదవడం గమనార్హం. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, బల్‌్కడ్రగ్, ఫార్మా వ్యర్థ జలాలు మూసీలోకి చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. నగర శివార్లు దాటిన అనంతరం కాలుష్య మోతాదు క్రమంగా తగ్గుముఖం పట్టడం విశేషం. పరిమితులు కొన్ని చోట్ల సంతృప్తికరం.. కరిగిన ఆక్సిజన్: నదిలో వృక్ష, జంతు ఫ్లవకాలు, ఆవరణ వ్యవస్థ పరిరక్షణకు నీటిలో కరిగిన ఆక్సిజన్ మోతాదు 4 మిల్లీగ్రాముల కంటే అధికంగా ఉండాలి. ఈ విషయంలో నగరంలోని బాపూఘాట్, మూసారాంబాగ్, నాగోల్, పీర్జాదిగూడ, ప్రతాప సింగారం ప్రాంతాల తోపాటు నగర శివార్లలోని పిల్లాయిపల్లిలో ఉండాల్సిన పరిమితి కంటే తక్కువగా ఉండడం గమనార్హం. మిగతా ప్రాంతాల్లో మూసీ నీటిలో కరిగిన ఆక్సిజన్ మోతాదు సంతృప్తికరంగా ఉండడం విశేషం. గాఢత: నది నీటిలో గాఢత 6.5 నుంచి 8.5 యూనిట్ల మధ్యలో ఉండాలని పీసీబీ పరిమితులు నిర్దేశిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో నదినీటిలో గాఢత పరిమితుల ప్రకారమే నమోదైంది. బీఓడీ: బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్‌గా పిలిచే ఈ మోతాదు ప్రతి లీటరు నీటిలో 30 మిల్లీగ్రాములకు మించరాదు. ఈ పరిమితులు అన్నిచోట్ల సంతృప్తికరంగానే ఉండడం విశేషం. కోలిఫాం బ్యాక్టీరియా: పీసీబీ పరిమితుల ప్రకారం ఈ బ్యాక్టీరియా మోతాదు 50 యూనిట్లకు మించరాదు. ఈ విషయంలో గండిపేట్, భీమారం బ్రిడ్జి, వాడపల్లి వద్ద మాత్రమే ఈ పరిమితుల ప్రకారం ఉండడం గమనార్హం. మిగతా చోట్ల ఈ మోతాదు శృతి మించింది. అమోనియా: ప్రతి లీటరు నీటిలో 1.2 మిల్లీగ్రాములు మించరాదు. పీసీబీ డేటా ప్రకారం అన్నిచోట్లా అమోనియా పరిమితుల ప్రకారమే నమోదవడం గమనార్హం. కొసమెరుపు.. జాతీయ స్థాయిలో అత్యంత కాలుష్యకారక నదుల జాబితాలో చేరిన మూసీలో కాలుష్యం గతేడాది కుండపోతగా కురిసిన వర్షాలతో ఒకింత తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గలేదని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలంలో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టినా.. ఆ తర్వాత కాలుష్యం యథావిధిగా నమోదవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ నివేదికపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఈ విషయమై పీసీబీ ఉన్నతాధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించేందుకు నిరాకరించారు. మూసీ ప్రస్థానం పొడవునా పలు ప్రాంతాల్లో వార్షిక సరాసరి కాలుష్య మోతాదు ప్రతీ లీటరు నీటిలో మిల్లీ గ్రాముల్లో ఇలా ఉంది -
అద్దెకు విద్యుత్ కార్లు
సాక్షి, అమరావతి: పెరిగిపోతున్న కాలుష్యం బారినుంచి ప్రజలను, పర్యావరణాన్ని కాపాడాలంటే 2040 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కంపెనీ ‘కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్)’ ఏపీ సహా దేశంలోని 18 రాష్ట్రాలకు ఎలక్ట్రానిక్ వాహనాలను సమకూర్చనుంది. ఇందుకోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. 3 నుంచి 5 ఏళ్ల కాలానికి 3,500 ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, హరియాణ, అస్సాం, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ–కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ విభాగాలకు అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని భావిస్తోంది. అదేవిధంగా ఏపీ సహా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 4,675 విద్యుత్ బస్సుల్ని నడిపేందుకు కూడా సీఈఎస్ఎల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు సొంతంగా చార్జింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు అవసరమైన అనుమతులను అందించాల్సి ఉంటుంది. సీఈఎస్ఎల్ ఇప్పటికే దాదాపు 2 వేల విద్యుత్ కార్లను ఈ విధంగా వివిధ రాష్ట్రాలకు సమకూర్చింది. చార్జింగ్ స్టేషన్లతో ఏపీ తోడ్పాటు విద్యుత్ వాహనాలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలంటే రాష్ట్రాలకు వివిధ రాయితీలను అందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పథకాన్ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)లను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించాయి. 2019–22 మధ్య మూడేళ్ల కాలానికి ఫేమ్ పథకం కింద రూ.10 వేల కోట్లను కేటాయించగా.. ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై టాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది. ద్విచక్ర వాహనాలకు కిలోవాట్‌కు రూ.15 వేలను, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు రూ.10 వేలను, బస్సులకు రూ.20 వేలను రాయితీగా అందిస్తోంది. విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం 7 వేల ఈ–బస్సులు, 5 లక్షల త్రీ వీలర్లు, 55 వేల పాసింజర్ కార్లు, 10 లక్షల ద్విచక్ర వాహనాలను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఏపీలో 15,865, దేశ వ్యాప్తంగా 4.08 లక్షల విద్యుత్ వాహనాల విక్రయం జరిగింది. తద్వారా రోజుకి 3,76,801 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అవుతోంది. 8,57,441 కేజీల కార్బన్‌డైయాక్సైడ్ తగ్గుతోంది. 2021తో పోలిస్తే విద్యుత్ వాహనాల అమ్మకాలు 2022లో 110 శాతం పెరిగాయి. 2030 నాటికి దేశంలోని మొత్తం వాహనాల్లో దాదాపు 49 శాతం విద్యుత్ వాహనాలే ఉంటాయని అంచనా. వీటికోసం 2 మిలియన్ల పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయి. దేశవ్యాప్తంగా పెరగనున్న విద్యుత్ వాహనాల కోసం మన రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఈవీ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు 4 వేల ప్రదేశాలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. -
Hyderabad: గుండెకు పొగ పెడుతున్న కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కాలుష్యం కోరలు చాస్తోంది. రోజురోజుకు పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా డీజిల్ వాహనాల కారణంగా సిటీ పొగచూరుతోందని, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పీసీబీ తాజా అధ్యయనంలో తేలింది. గ్రేటర్లో వాహనాల సంఖ్య సుమారు 80 లక్షలకు చేరువైంది. ఇందులో పదిహేనేళ్లకు పైబడిన కాలంచెల్లిన వాహనాలు 20 లక్షలకు పైమాటే. వీటిలో డొక్కు బస్సు లు, ట్రక్కులు, కార్లు తదితర డీజిల్ వాహనాలు విడుదల చేస్తున్న పొగతో ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ప్రధానంగా మోటారు వాహనాలు, పరిశ్రమలు విడుదల చేస్తున్న పొగలో సూక్ష్మ ధూళి కణాల(పిఎం2.5) మోతాదు అనూహ్యంగా పెరగడంతో సిటీజన్లలో గుండె కండరాలు, దమనులు దెబ్బ తింటున్నట్లు పీసీబీ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నగ రంలో 28 ప్రాంతాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదును ఈ సంస్థ నిపుణులు నమోదు చేశారు. వీరి లెక్కల ప్రకారం ఘనపుమీటర్ గాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదు 32 మైక్రో గ్రాములకు మించరాదు. కానీ ఆయా ప్రాంతాల్లో వీటి మోతాదు 60 మైక్రో గ్రాములకు పైగా నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. గుండెకూ చేటు.. ఈ సూక్ష్మ ధూళికణాలు గుండెలోని సూక్ష్మ దమనులు, కెరోటిడ్ ఇంటిమా మీడియాపై పేరుకు పోవడంతో వాటి మందం పెరిగి గుండెకు రక్తసరఫరా తగ్గుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిణామంతో గుండెదడ, గుండెపోటు తదితర హృదయ సంబంధిత సమస్యలు సిటీజన్లలో క్రమంగా పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. సూక్ష్మధూళి కణాల కాలుష్యంతో పురుషుల్లో 1.79 శాతం గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని, మహిళల్లో 2.98 శాతం మందికి గుండె సంబందిత సమస్యలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ధూళి కణాల కాలుష్యం మెదడుకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలకు కూడా చేటు చేస్తుందని ఈ అధ్యయనం స్పష్టంచేయడం గమనార్హం. చదవండి: Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు కాలుష్యానికి కారణాలివే.. ►పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 80 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ►పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లోచెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ►శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి. ఘణపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు(పీఎం2.5) మోతాదు 32 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. ►గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 80 లక్షలవాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు,120.45 కోట్ల లీటర్ల డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. ►గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 20 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్‌మోనాక్సైడ్,నైట్రోజన్ డయాక్సైడ్,సల్ఫర్‌డయాక్సైడ్,అమ్మోనియా,బెంజీన్,టోలిన్,ఆర్‌ఎస్‌పీఎం(ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. జాగ్రత్తలు తప్పనిసరి.. ►సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం బారిన పడకుండా ముక్కుకు మాస్‌్కలు ధరించాలి. ►కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియంత్రించాలి. ►ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఎక్కువ సేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►కల్తీ ఇంధనాల వినియోగాన్ని కట్టడి చేయాలి. ప్రతీపెట్రోలు బంకులో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ఇంధన నాణ్యత తనిఖీలు నిర్వహించాలి. కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కల ప్రకారం నగరంలో బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్పల్లి, సైనిక్‌పురి, నాచారం, జూపార్క్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళికాలుష్యం వంద మైక్రోగ్రాములు మించడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు ఈ ధూళికాలుష్యంతో అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమౌతున్నారు. -
Hyderabad: పరిశ్రమల నిర్వాకం.. గుంతలు తీసి.. రసాయనాలు దాచి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు రెడ్, ఆరెంజ్ కేటగిరీ బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నిల్వ చేస్తుండటంతో పర్యావరణ హననం జరుగుతోంది. ఇటీవల పీసీబీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. పర్యావరణ నిబంధనలు పాటించనివి, పీసీబీ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే ఉత్పత్తులు చేస్తున్న ఆరు కంపెనీలను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు... పలు ఫార్మా, బల్క్ డ్రగ్, కంపెనీల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్న క్రమంలో ఉత్పన్నమయ్యే ఫార్మా వ్యర్థ జలాలను జీడిమెట్లలోని ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించకుండా రోజుల తరబడి కంపెనీల ఆవరణలోనే భారీ గుంతలు తీసి వాటిల్లో నిల్వ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినపుడు వరద నీటితోపాటు ఈ వ్యర్థాలను బయటకు వదలిపెడుతుండడంతో సమీప చెరువులు, కుంటలు కాలుష్య కాసారమవుతున్నాయి. మరికొందరు అక్రమార్కులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ట్యాంకర్లలో ఈ వ్యర్థాలను తరలించి ఔటర్ పరిసరాల్లో ఉన్న పలు చెరువులతో పాటు మూసీలోకి యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారు. అంతుచిక్కని లోగుట్టు.. నగరంలో పదికిపైగానే పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఇందులో బల్క్‌డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. పాశమైలారం, జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఎలాంటి ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమ ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా లేదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్య క్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపల ఏమి జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడటం గమనార్హం. కాగితాలకే పరిమితం.. వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టు పక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్ఓ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందారు.. ప్రతిరోజూ వెలువడుతున్న వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. -
Hyderabad: ద్విచక్ర వాహనాలే టాప్.. మెట్రోకు ఆదరణ అంతంతే !
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ ప్రజా రవాణాలో సింహభాగం వాటా ద్విచక్ర వాహనాలదే కావడం విశేషం. నిత్యం సిటీలో వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగించే వారు 39 శాతం ఉండగా.. బస్సుల్లో జర్నీ చేసే వారు 34 శాతం ఉన్నారు. ఇక ఆటోలు, క్యాబ్‌ల్లో రాకపోకలు సాగించేవారు 17 శాతం మంది.. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో జర్నీ చేసేవారు కేవలం 10 శాతం మించకపోవడం గమనార్హం. నగరంలో కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ప్రజల ఆదరణను చూరగొనలేకపోయింది. ఇవే శాపం.. ► నగర మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. ఒక కిలోమీటరు మేర ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.272 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగర మెట్రో నిత్యం రూ.కోటి నష్టంతో నెట్టుకొస్తోంది. మెట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, సాంకేతిక నష్టాలను అరికట్టేందుకు ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ► ఇక రెండో దశ మెట్రో ఏర్పాటుకు అవసరమైన రూ.8,400 కోట్లు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఆ స్థాయిలో నిధులు విడుదల చేసే పరిస్థితులో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రెండో దశ మెట్రో మార్గాన్ని పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశంపై పలు అనుమానాలు నెలకొంటున్నాయి. మెట్రోతో కాలుష్యం తగ్గిందిలా.. ► గతేడాది సరాసరి లెక్కను పరిశీలిస్తే సుమారు 3.8 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నగర వాతావరణంలో చేరకుండా మెట్రో నివారించడం విశేషం. నగర మెట్రో రైళ్లు విద్యుత్ ఆధారంగా పని చేస్తున్న విషయం విదితమే. స్టేషన్లలో విద్యుత్ అవసరాలకు సౌర విద్యుత్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. మెట్రో రైళ్లు గతేడాది సుమారు 1.6 కోట్ల లీటర్ల ఇంధనాన్ని సైతం ఆదా చేసినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ► మూడు బోగీలుండే మెట్రో రైలులో ఏకకాలంలో 975 మంది ప్రయాణించవచ్చు. ఇక కాలుష్య ఉద్గారాల విషయానికి వస్తే 30 కిలోమీటర్లు మెట్రోలో జర్నీ చేస్తే కేవలం 190 కిలోల కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం విడుదల అవుతుంది. అదే బస్సులో కేవలం 50 మంది ప్రయాణించవచ్చు. కాగా.. ఒక మెట్రో రైలులో ప్రయాణించేవారి సంఖ్య 20 సిటీ బస్సులతో సమానం. వీటిలో జర్నీ చేస్తే ఏకంగా 405 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలై పర్యావరణ హననం జరుగుతోంది. ► ద్విచక్ర వాహనంపై ఇద్దరు జర్నీ చేసే వీలుంది. సుమారు 975 మంది జర్నీ చేయాలంటే 488 వాహనాలు అవసరం. వీటిపై 30 కిలోమీటర్లు జర్నీ చేస్తే 730 కిలోల సీఓ 2 కాలుష్యం విడుదల అవుతుంది. కారులో నలుగురు వ్యక్తులు జర్నీ చేయవచ్చు. 975 మంది 30 కి.మీ మేర జర్నీ చేసేందుకు 244 కార్లు అవసరం అవుతాయి. ఇన్ని కార్లలో జర్నీ చేస్తే ఏకంగా 1200 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెబుతున్నాయి. అంటే బస్సు, కారు, ద్విచక్రవాహనాలతో సిటీ కిక్కిరిసిపోయి.. పొగచూరుతుండగా.. మెట్రోతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్ చేయండి: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ) -
భారత్‌లో 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం.. మేల్కోపోతే వినాశనమే!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతోనూ చాలా దేశాల్లో తిండి దొరకని పరిస్థితులు తెలెత్తాయి. అయితే, అంతుకు మించిన విపత్తు మనకు తెలియకుండానే ప్రాణాలను హరిస్తోంది. మనం చేసుకుంటున్న కర్మకు ఫలితేమేనంటూ శాస్త్రవేత్తలు బల్ల గుద్ది చెబుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా భూతాపం(గ్లోబల్ వార్మింగ్) పెరిగిపోయి.. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గు, చమురు, గ్యాస్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ పెరిగి.. విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఓ పరిశోధన. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని తాజాగా నివేదిక ‘ద లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ హెచ్చరించింది. ఈ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు రూపొందించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సూచించారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తూ.. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వల్ల మరణాలు వంటివి పెరిగిపోయి మహా విపత్తు తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు చేపట్టకపోతే జరిగేది వినాశనమేనని హెచ్చరించారు. ► శిలాజ ఇంధనాల వాడకంతో ఏర్పడే కాలుష్యం కారణంగా భారత్‌లో గత ఏడాది 2020లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక వెల్లడించింది. అది ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా, ఐరోపాలో 1,17,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 32 వేల మంది మరణించారు. ► ప్రస్తుతం ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న తీరుతో ఈ శతాబ్దం చివరి నాటికి భూతాపం 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుంది. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్ పెరిగినందుకే వడగాలులు, వరదలు, తుపాన్లతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. మరి ఆ స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకుంటే పరిస్థితి దారుణంగా ఉండనుంది. ► వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం కారణంగా ఎక్కువ నష్టం జరుగుతోందని నివేదిక వెల్లడించింది. శిలాజ ఇంధానలను వాడటం వల్ల గ్రీన్‌హౌజ్ గ్యాస్ గాల్లో కలిసి ప్రాణాలను హరించివేస్తోందని పేర్కొంది. గాలి కాలుష్యం కారణంగా శరీరంలోని ప్రతి అవయవం దెబ్బతింటున్నట్లు స్పష్టం చేసింది. గాలి నాణ్యత పీఎం 2.5గా ఉన్న అమెరికాలోనే గత ఏడాది 32వేల మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. ► ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తున్నాయి. అందులో కొన్ని దేశాల్లో ఆరోగ్య రంగానికి మించి శిలాజ ఇంధానల కోసం ఖర్చు చేస్తున్నాయి. 2019లో 69 దేశాలు 400 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. భారత్ 43 బిలియన్ డాలర్లు, చైనా 35 బిలియన్ డాలర్లు, ఐరోపాలోని 15 దేశాలు ఒక్కో దేశానికి ఒక్కో బిలియన్ డాలర్ల చొప్పును రాయితీలు కల్పిస్తున్నాయి. అమెరికా 20 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. దీంతో శిలాజ ఇంధనాల వాడకం పెరిగిపోతోంది. దీంతో కాలుష్యం పెరగటం, పర్యావరణ మార్పులు చోటు చేసుకుని వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
వాయు నాణ్యత వెరీ పూర్.. హైదరాబాద్‌ను కమ్మేసిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: దీపావళి బాణసంచా మోత ఆగింది. వాయు కాలుష్యంపై ప్రజల్లో బెంబేలు మొదలయ్యింది. పలు స్థాయిల్లో కాలుష్య స్థాయిలు పెరిగిపోవడమే ఇందుకు కారణం. రెండేళ్లుగా కోవి డ్ మహమ్మారి పరిస్థితుల కారణంగా అంతంతగానే టపాకాయలు కాల్చిన నగర ప్రజలు, కరోనా తగ్గుముఖంతో ఈ ఏడాది ఫుల్ జోష్‌తో పండుగ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం మొదలుపెట్టి మంగళవారం తెల్లవారుజాము దాకా పటాకులు పేలాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ని పలు జిల్లాల్లో భారీయెత్తున బాంబులు, ఇతర టపాసుల్ని ప్రజలు కాల్చారు. దీని ప్రభావం వాతావరణంపై పడింది. హైదరాబాద్‌లోని 14 వాయు నాణ్యత పరీక్షా కేంద్రాల్లో చాలాచోట్ల కాలుష్య స్థాయిలు పెరిగినట్టు స్పష్టమౌతోంది. ముఖ్యంగా అత్యంత సూక్ష్మ స్థాయిల్లోని (2.5 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటే ధూళి, కాలుష్య కణాలు–పీఎం 2.5) కాలుష్యాలను బట్టి వాయు నాణ్యత సూచీని (ఏక్యూఐ–ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వర్గీకరణ ప్రకారం.. ఏక్యూఐ 400 పాయింట్లపైన ఉంటే వాయునాణ్యత తీవ్రమైన స్థాయిలో తగ్గినట్టుగా భావిస్తారు. ఇది ఆరోగ్యవంతులపై సైతం ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నిచోట్లా అధికంగానే.. 24 గంటల సమయంలో పీఎం 2.5 కాలుష్యాలు 60 పాయింట్ల లోపు ఉండాల్సి ఉండగా మంగళవారం మధ్యాహ్నం 12కి సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలలో 99, హైదరాబా ద్ యూఎస్ కాన్సులేట్ వద్ద 92, జూపార్క్ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్–2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లు నమోదయ్యాయి. దీపావళి టపాసులతో వాయు నాణ్యతలో క్షీణత ఏ మేరకు జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక సోమవా రం రాత్రి 10 గంటల సమయంలో అయితే సనత్‌నగర్ స్టేషన్లో ఏక్యూఐ అత్యధికంగా 759కు చేరుకు ని క్రమంగా మంగళవారం ఉదయం 4 గంటలకు 298కు చేరుకుంది. అమీర్‌పేట, సోమాజిగూడ, గచ్చిబౌలి, జూబ్లీíహిల్స్, బంజారాహిల్స్, రామచంద్రాపురం ప్రాంతాల్లో సోమవారం రాత్రి 500 పాయింట్ల దాకా టచ్కాగా, రాత్రి 11 గంటల ప్రాంతంలో నాచారం స్టేషన్లో 446 పాయింట్లు రికార్డయింది. మంగళవారం సాయంత్రానికి చాలాచోట్ల మోస్తరు నుంచి తక్కువస్థాయిలో వాయునాణ్యత రికార్డయింది. కాగా, ఈ ఏడాది దీపావళి సందర్భంగా వాయు, శబ్ద కాలుష్యంపై పీసీబీ అధికారికంగా గణాంకాలు వెల్లడించాల్సి ఉంది. దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం పొగ, మంచు, ఇతర రూపాల్లోని కాలుష్యాలు పెరిగి వాయు నాణ్యత స్థాయి తగ్గడం గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుటికీ వానాకాలం కొనసాగడం, చలి పెరగడం, దీపావళి కాలుష్యం తదితరాలతో గతంలోని అలర్జీలు తిరగబెట్టి తీవ్రమైన జబ్బులుగా మారుతున్నాయి. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి, ఖఫం పడడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగి అలర్జిటిక్ బ్రాంకైటిస్, స్వైన్‌ఫ్లూ వంటివి వస్తున్నాయి. అస్తమా ఉన్న వారు, పొగతాగే అలవాటు ఉన్న వారు, టీబీ వచ్చి తగ్గినవారిలో ఆరోగ్య సమస్యలు పెరిగి ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. – డా. వీవీ రమణప్రసాద్, కన్సల్టింగ్ పల్మనాలజిస్ట్, కిమ్స్ -
Air Quality Index: ఆసియాలోని కాలుష్య నగరాల్లో 8 భారత్‌వే
న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. చలికాలం వస్తూ ఉండడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం హరియాణాలోని గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజధాని ఢిల్లీ లేదు. ఇక గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియా మొత్తంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలవడం విశేషం. గురుగ్రామ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం ఉదయం 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లక్నో (298), ఆనందపూర్ బెగుసరాయ్ (269) భోపాల్ (266) ఖడక్‌పడ (256), దర్శన్ నగర్, చాప్రా (239) ఉన్నాయి. -
బాణసంచా నిషేధం ఎత్తివేతపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా నిషేధం ఎత్తివేసేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. వాతావరణ కాలుష్యం, ఇతర పద్ధతుల్లో దీపావళి జరుపుకొనే అంశాలను చూపుతూ ఈ మేరకు స్పష్టం చేసింది. బీజేపే ఎంపీ మనోజ్ తివారీ అక్టోబర్ 10న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో బాణసంచా వినియోగం, విక్రయాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. అయితే, అప్పుడే ఎలాంటి కొత్త ఆదేశాలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా.. తివారీ న్యాయవాది ఈ అంశాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చి లంచ్ బ్రేక్‌లో అత్యవసరంగా విచారించాలని కోరారు. కానీ, కోర్టు మళ్లీ అందుకు నిరాకరించింది. ‘మీ డబ్బులను స్వీట్స్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేయండి.. ప్రజలను స్వచ్ఛమైన గాలి పీల్చుకోనివ్వండి. గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ ఎలా అనుమతించమంటారు? ఢిల్లీలో కాలుష్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?’ అని పిటిషనర్‌ను ప్రశ్నించింది సుప్రీం కోర్టు. బీజేపీ ఎంపీ తివారీతో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించి ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ఆప్ ప్రభుత్వం బాణసంచాపై నిషేదం విధించటంపై బీజేపీ లీడర్ తాజిందర్ పాల్ సింగ్ బగ్గా ఆరోపణలు గుప్పించారు. ‘హిందువులు దీపావళికి క్రాకర్స్ కాలిస్తే కాలుష్యం ఏర్పుడుతుందని, వారిని కేజ్రీవాల్ జైలులో వేస్తామని బెదిరిస్తున్నారు. కానీ, ఢిల్లీ మంత్రి ఫైర్ క్రాకర్స్ కాలిస్తే ఆక్సిజన్ వస్తుందా?’ అని ప్రశ్నించారు. ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బాణసంచా కాల్చుతున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా! -
ఢిల్లీలో వరుణుడి ఉగ్రరూపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుణ దేవుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో ఏకంగా 74 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2007 తర్వాత నగరంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇది రెండోసారి. శనివారం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షాల వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. వాయు నాణ్యత మెరుగుపడింది. గాలి నాణ్యత సూచి ఆదివారం ఉదయం 9 గంటలకు 54గా నమోదయ్యింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం ఇది ‘గుడ్’ కేటగిరీలోకి వస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది ప్రస్తుత సీజన్లో సగటు కంటే తక్కువే కావడం గమనార్హం. శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 20.8 డిగ్రీలు కాగా, శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు. రెండింటి మధ్య వ్యత్యాసం 2.6 డిగ్రీలు. నగరంలో 1969 తర్వాత ఇదే అతి తక్కువ వ్యత్యాసమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1998 అక్టోబర్ 19న ఈ వ్యత్యాసం 3.1 డిగ్రీలు నమోదయ్యందని చెప్పారు. నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఢిల్లీలో రుతుపవనాలు గత నెల 29న వెనక్కి మళ్లాయి. రుతుపవనాల సీజన్ ముగిసింది. పశ్చిమ వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. -
హుస్సేన్‌సాగర్‌లో భారీగా పెరిగిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్‌లో కాలుష్యం అనూహ్యంగా పెరిగినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత రోజుల్లో సాగర్ నీటి నమూనాలను సేకరించి.. పరీక్షించగా పలు ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. నీటి రంగు, బురద రేణువులు, కరిగిన ఘన పదార్థాలు, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, భార లోహాల మోతాదు పరిమితికి మించి పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. నిమజ్జనానికి ముందు ఆగస్టు 29 తోపాటు నిమజ్జనం జరిగిన తేదీలు సెప్టెంబరు 2,5, 7, 9 తేదీలలో.. నిమజ్జనం అనంతరం సెప్టెంబరు 12న పీసీబీ నిపుణులు.. ఎన్‌టీఆర్‌పార్క్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, లేపాక్షి పాయింట్, సాగరం మధ్యనున్న బుద్ధవిగ్రహంవద్ద నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. అన్ని పాయింట్ల వద్దా కాలుష్యమే.. నిమజ్జనంతో పీసీబీ సేకరించిన అన్ని పాయింట్ల వద్ద కాలుష్య మోతాదు భారీగా పెరిగినట్లు గుర్తించారు. ఎన్టీఆర్ పార్క్ నిమజ్జనానికి ముందు సరాసరిన లీటరు నీటిలో బురద రేణువుల మోతాదు 45 మిల్లీగ్రాములుండగా.. అనంతరం ఏకంగా 152 మిల్లీ గ్రాములకు చేరింది. నీటి గాఢత కూడా 7.24 పాయింట్లుగా నమోదైంది. కరిగిన ఘన పదార్థాల మోతాదు 712 మిల్లీగ్రాముల నుంచి 848 మిల్లీగ్రాములకు పెరిగింది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 37 మిల్లీగ్రాములుండగా.. నిమజ్జనం తర్వాత ఏకంగా 164 మిల్లీగ్రాములకు చేరింది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 10 మిల్లీగ్రాముల నుంచి 30 మి.గ్రా మేర పెరిగింది. భార లోహాలు క్రోమియం, లెడ్, జింక్, కాపర్, క్యాడ్మియం తదితరాల మోతాదు కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. లుంబినీ పార్క్ వద్ద: నీరు ఆకుపచ్చ రంగులోకి మారింది. బురద రేణువుల మోతాదు అత్యధికంగా 1340 మి.గ్రా నమోదైంది. గాఢత 8.12 పాయింట్లకు చేరింది. కరిగిన ఘన పదార్థాల మోతాదు 831 మి.గ్రా నమోదైంది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 284 మిల్లీగ్రాములుగా.. నీటి కాఠిన్యత మి.గ్రాములకు చేరింది. నెక్లెస్‌రోడ్ వద్ద: బురద రేణువులు 112 మి.గ్రాములకు చేరువయ్యాయి. గాఢత 8.24 పాయింట్లుగా ఉంది. కరిగిన ఘన పదార్థాలు 829 మిల్లీగ్రాములుగా ఉన్నాయి. ఈ–కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 160 మిల్లీగ్రాములుగా ఉంది. నీటి కాఠిన్యత 404 మి.గ్రాములకు చేరింది. లేపాక్షి: బురద రేణువులు 100 మి.గ్రాములకు చేరాయి. నీటి గాఢత 8.50 పాయింట్లకు చేరింది.కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 126 మిల్లీగ్రాములుగా ఉంది. కాఠిన్యత 326 మి.గ్రా ఉంది. బుద్ధ విగ్రహం వద్ద: బురద రేణువులు 96 మి.గ్రా నమోదయ్యాయి. కరిగిన ఘన పదార్థాలు 832 మి.గ్రా ఉన్నాయి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 101 మి.గ్రా.. కాఠిన్యత 426 మి.గ్రా ఉంది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 24 మిల్లీగ్రాములుగా ఉంది. అనర్థాలివే.. ► సాగర్‌లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ► పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ► సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ► వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. ► జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి. -
Hyderabad: నగరంపై ‘కారు’ మబ్బులు!
సాక్షి, హైదరాబాద్: గంటకు 14.. రోజుకు 336.. వారానికి 2,532.. నెలకు 10,080.. ఏడాదికి 1,20,960. ఈ లెక్క ఏమిటో తెలుసా? హైదరాబాద్‌లో రోడ్లపైకి వస్తున్న కార్లు వంటి కొత్త వాహనాల సరాసరి. గతేడాది నగరంలో జరిగిన వాహన కొనుగోళ్ల గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నగరంలో కార్లు వంటి తేలికపాటి వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇతర వాహనాలు, చివరకు టూవీలర్స్ సైతం వీటి ‘వేగాన్ని’ అందుకోలేకపోతున్నాయి. 2001–2022 (ఫిబ్రవరి) మధ్య గణాంకాలను విశ్లేషిస్తే మొత్తం వాహనాల్లో ద్వి చక్ర వాహనాల శాతం తగ్గగా.. కార్ల శా తం పెరిగినట్లు కనిపిస్తోంది. తేలికపాటి వాహనాల్లో వ్యక్తిగతమైనవే అత్యధికం. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ట్రాఫిక్ జామ్‌లు’ తీవ్రం కాకతప్పదని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీసికట్టుగానే సిటీ రోడ్ల విస్తీర్ణం హైదరాబాద్ నగర విస్తీర్ణంలో కేవలం 8.32 శాతం మాత్రమే రోడ్లు ఉన్నాయి. అంతర్జా తీయ ప్రమాణాల ప్రకారం కనీసం 12 శాతం ఉండాలి. రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే సిటీలో వాహనాల సంఖ్య పెరుగుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 37 లక్షలకు చేరువయింది. రోజూ కొత్తగా 600 వాహనాలు (అన్నీ కలిపి) రోడ్లపైకి వస్తున్నాయి. అయితే ద్విచక్ర వాహనాలకు పోటీగా కార్లు వంటి తేలిక పాటి వాహనాలు వస్తున్నాయి. రోడ్డుపై ఒక్కకారు ఆక్రమించే స్థలంలో కనిష్టంగా 4 ద్విచక్ర వాహనాలు ప్రయాణి స్తాయి. కొత్తగా వస్తున్న తేలికపాటి వాహనాల్లో వ్యక్తిగతమైనవే ఎక్కువగా ఉండటంతో అందులో ఒకరు లేదా ఇద్దరు చొప్పునే ప్రయాణిస్తున్నారు. అంటే రోడ్డుపై 8 మంది వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఇద్దరే ఆక్రమిస్తున్నారన్న మాట. ఇదే ట్రాఫిక్ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సిటీలో కార్ల పెరుగుదల ఇలా... 2001–22 (ఫిబ్రవరి) మధ్య వాహనాల పెరుగుదల గణనీయంగా కనిపించింది. 2001లో నగరంలోని వాహనాల సంఖ్య 10,91,734గా ఉండగా... 2022 ఫిబ్రవరి నాటికి 36,87,834కు చేరింది. తేలికపాటి వాహనాలు 2001లో మొత్తం వాహనాల్లో 11.58 శాతం కార్లు, 78.44 శాతం ద్విచక్ర వాహనాలు ఉండేవి. 2022 ఫిబ్రవరి నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ద్విచక్ర వాహనాల శాతం తగ్గగా.. తేలికపాటి వాహ నాల వాటా పెరిగింది. క్యాబ్‌లు మినహా యించినా ఇదే పరిస్థితి కనిపించింది. 2022 మే నాటికి మొత్తం వాహనాల్లో కార్ల శాతం 17.19కు చేరగా.. ద్విచక్ర వాహనాల వాటా 73.65 శాతానికి తగ్గింది. రుణ సౌకర్యాలు పెరగడం, ద్విచక్ర వాహనం ఖరీదు చేసే వారు నేరుగా కారుకు ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు కారణాలుగా కన్పిస్తోంది. కొనసాగితే తిప్పలే.. రాజధానిలో వాహనాలు పెరుగుతున్న స్థాయిలో కాకపోయినా కనీస స్థాయిలోనూ రోడ్ల విస్తీర్ణం పెరగట్లేదు. ఫ్లైఓవర్లు వంటి కొత్త మార్గాల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణ జరగట్లేదు. మరో పక్క మెట్రోరైల్ నిర్మాణాల నేపథ్యంలో ఉన్న రహదారులూ అనేక చోట్ల కుచించుకుపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తేలికపాటి వాహనాల పెరుగుదలలో ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని ట్రాఫిక్ విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో శాసనసభ ఎస్టిమే ట్స్ కమిటీకి నివేదించామని చెప్తున్నారు. కాగా ప్రజారవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే ఈ ధోరణికి కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నగర జనాభాకు చాలినంత స్థాయిలో ఆర్టీసీ బస్సులు లేకపోవడం, మెట్రోరైల్ వంటివి ఇంకా ఎక్కువగా అందుబాటులోకి రాకపోవడం వల్లే అనేకమంది వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారని చెప్తున్నారు. వీటిని అభివృద్ధి చేస్తే ఈ స్థాయిలో పెరుగుదల ఉండదని స్పష్టం చేస్తు న్నారు. సింగపూర్‌లో ప్రస్తుతం కార్ల రీ–ప్లేస్మెంట్ విధానం అమలులో ఉంది. దీని ప్రకారం కొత్త ప్రత్యేక పరి స్థితుల్లో మినహా ఎవౖరెనా కారు కొనాలంటే పాతది చిత్తుగా మార్చాల్సి ఉంటుంది. ఇలాంటి వాటితో పాటు ఇతర చర్యలు చేపడితేనే ఈ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. (క్లిక్: పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీకి కొత్త విధానం) -
‘రాజుగారు’ ఒక ఆశాకిరణం
వాతావరణ మార్పు నుండి జెనిటిక్ ఇంజనీరింగ్ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్ ముప్పు వరకు మానవాళి బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను బ్రిటిష్ సింహాసనాన్ని కొత్తగా అధిష్ఠించిన ఛార్లెస్ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసుకున్నారు. జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చుకున్నారు. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాక, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణపై ఆయనకున్న దృఢమైన నిబద్ధత ఆయనను కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచకపోవచ్చు. ప్రపంచంలో నిస్పృహలు పెరుగుతున్న సమయంలో ఈ కొత్త రాజు కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరు. మనోహరమైన చిద్విలాసాలు, ప్రజాసమూ హాలకు అభివాదాలు, కార్యక్రమాల ప్రారం భోత్సవాలు.. ఇటువంటి సాధారణ కర్తవ్యాల వరకే రాచరికాలు పరిమితమై ఉన్న తరుణంలో బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్ఠించిన మూడవ ఛార్లెస్ రాజు తన సొంతవైన ఆలోచనలతో, సున్నితమైన వ్యక్తిత్వంతో, భూగ్రహాన్ని రక్షించాలన్న ప్రబలమైన కాంక్షతో ‘హరిత చక్రవర్తి’గా అవతరించగలరన్న ఆశలు రేకెత్తిస్తున్నారు. ‘‘ఆయన తన ఇరవైల ప్రారంభంలో భవిష్యత్ కాలుష్య దుష్ప్రభావాలపై ప్రభావ వంతమైన ప్రసంగాలు చేశారు. తన మధ్యవయస్సులో ఆర్థిక, పర్యా వరణ, సామాజిక అంశాల మధ్య సమతూకం సాధించే అత్యున్నత స్థాయి సుస్థిరతలకు చొరవ చూపారు. ఈ ఏడాది జనవరిలో తన 73 ఏళ్ల వయసులో వాతావరణ మార్పును నియంత్రించేందుకు అత్యవ సర చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి, వ్యాపార దిగ్గజాలకు స్పష్టమైన పిలుపు నిచ్చారు’’ అని ‘టైమ్’ పత్రిక రాసింది. రానున్న కాలంలో కానున్న రాజుగా మొన్నటి వరకు ఆయన సాగించిన ప్రయాణాన్ని ఈ నాలుగు మాటల్లో ఆ పత్రిక సముచిత పరిచింది. బ్రిటన్ రాజైన వెంటనే, బ్రిటిష్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ‘చరిత్ర నాపై మోపిన బాధ్యత ఎంత బరువైనదో తెలుస్తోంది’ అని ఛార్లెస్ అన్నారు. తనెంతో శ్రద్ధ వహిస్తూ వచ్చిన స్వచ్ఛంద కార్య కలాపాలకు, ఇతర విధులకు ఇకపై తన సమయాన్ని, శక్తిని కేటా యించడం మునుపటి స్థాయిలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఆయన యోగ్యతలను, పర్యావరణ పరిరక్షణపై ఆయన కున్న దృఢమైన నిబద్ధతను గుర్తెరిగిన చరిత్ర ఆయన్ని కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచగలదని నేను భావించడం లేదు. ఎలిజబెత్ రాణి అంత్యక్రియలకు ఐరోపా దేశాల రాచరిక కుటుంబాల నుంచి హాజ రైన వారిలో జపాన్ చక్రవర్తి దంపతులు సహా అందరూ అనామకంగా ఉన్న రాజులు, రాణులే. వారందరిలోనూ ఉన్న సారూప్యం ఒక్కటే. వారిలో ఎవరి జీవితాలూ సునిశితమైన గమనింపులతో గడుస్తున్నవి కావు. వారు తమ మనోభావాలను బయటి వ్యక్తం చేసేవారు కాదు కనుక ప్రజా జీవనంలో వారి గురించి మాట్లాడటానికి ఉన్నది చాలా తక్కువ. పైగా అది వారు ఎంపిక చేసుకుని, అనుసరిస్తున్న జీవనశైలి కూడా. కానీ ఛార్లెస్ అలా కాదు. తన మనోభావాలను వెల్లడించడానికి ఆయన ఏనాడూ సంకోచించలేదు. అది వ్యతిరేకమైన ఫలితాన్నే ఇచ్చినా ధైర్యంగా నిలబడి ఉన్నారు. ఉదాహరణకు ఆయన నిశ్చితాభి ప్రాయాలు ఇలా వ్యక్తం అయ్యేవి : ‘రసాయనాల వాడకం వ్యవసా యానికి వినాశకరంగా పరిణమిస్తుంది. అనేక విధాలుగా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కాలుష్య కారకాలైన ఉద్గారాలు విపరీతంగా వెలువడతాయి’ అనేవారు. లేదా, ‘చిన్న పొలాలు కనుమరుగైతే అది బ్రిటిష్ గ్రామీణ ప్రాంతాల హృదయాన్నే చీల్చివేస్తుంది’ అని చెప్పే వారు. విధ్వంసక వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు రాయితీలు అనే అంశాలు తరచు ఆయన మాటల్లో వెల్లడయేవి. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాకుండా, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు. జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చు కున్నారు. మాంసాహారాన్ని దాదాపుగా త్యజించారు. పశుగణాభివృద్ధి అవసరాన్ని తగ్గిస్తే ఉద్గారాలను నియంత్రించవచ్చు అన్న ఆలోచనే ఆయన్ని శాకాహారం వైపు మళ్లించింది. పాల ఉత్పత్తులను తీసు కోవడాన్ని కూడా ఛార్లెస్ తగ్గించారు. ‘కాప్–26’ సదస్సుకు ముందు ఆయన తన ఆస్టన్ మార్టిన్ కారును బయో–ఇథనాల్‌తో నడుపు తున్నట్లు వెల్లడించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని ‘ది గార్డియన్’ ఒక వార్తాకథనం రాసింది. ఇంగ్లిష్ వైట్ వైన్ అవశేషాలు, జున్ను తయారీలోని పాల విరుగుడుల మిశ్రమమే ఆ బయో– ఇథనాల్. దాని ద్వారా ఛార్లెస్ తన ప్రజలకు ఒక స్పష్టమైన ఆచరణా త్మక సందేశాన్ని అందిస్తున్నారు. ‘మీ వంతుగా ఉద్గారాలను తగ్గిం చండి, తద్వారా పర్యావరణాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషించండి’ అన్నదే ఆ సందేశం. వాతావరణ మార్పు నుండి జెనిటిక్ ఇంజనీరింగ్ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్ ముప్పు వరకు, సేంద్రియ వ్యవసాయం నుండి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన వరకు... బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను ఛార్లెస్ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసు కున్నారు. దీనిని ఎలాగైనా పిలవండి. విపరీతం అనండి, అతిమోహం అనండి. ఒకటి మాత్రం వాస్తవం. ఆయన బాగా చదివినవారు. విషయంపై అవగాహన లేకుంటే, ఆధిపత్య కథనాలను సవాలు చేయడం అంత సులభమేమీ కాదు. అది కూడా డబ్బు మూటలతో పెద్ద పెద్ద కంపెనీలు ఆ కథనాలకు మద్దతు ఇస్తున్నప్పుడు! దీనిని బట్టి ఆయన తన పాలనను ఎలా నిర్వహిస్తారు, తన కొత్త పాత్రను ఎలా మలుచుకుంటారు అనేవి ఆధారపడి ఉంటాయని భావిస్తు న్నాను. అంతకంటే కూడా ఆయన తను ఎలా గుర్తుండి పోవాలని అనుకుంటున్నారో అది కూడా కీలక పాత్ర వహిస్తుంది. నేను బాగా ఇష్టపడే మరొక చక్రవర్తి కూడా ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నారు. థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అదుల్యాతేజ్ 1946లో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 70 సంవత్సరాలు పరిపాలించారు. ప్రజల అభివృద్ధి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షంగా వారితో సమయం గడపడం అనే ఆయన మానవీయ దృక్పథానికి విద్యార్థిగా ఉండగా నేను ఆకర్షితుడనయ్యాను. ఒక రాజుగా ఆయనకు అంత చేయవలసిన అవసరం లేదు. కానీ ఆర్థిక శ్రేయస్సు, ప్రజా సంక్షేమంపై ఆయన ఆసక్తి చివరికి ఆయన ఓ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికి దోహద పడింది. 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం సమయంలో ఉన్నప్పుడు టెలివిజన్ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు: ‘‘దేశం పులిగా మారా లని దేశ ప్రజలు పిచ్చిగా కోరుకుంటున్నారు. పులిగా ఉండటం ముఖ్యం కాదు. దేశం సమృద్ధ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం ముఖ్యం. సమృద్ధిగా అంటే, మనల్ని మనం పోషించుకోవడానికి తగి నంతగా.’’ ఈ మాటలు ప్రస్తుతం భారత్‌కు కూడా వర్తిస్తాయి. ఏదేమైనా అభివృద్ధి చక్రానికి స్థిరత్వపు ఇరుసు లాంటి ఆ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతం నేడు థాయ్‌లాండ్‌లోని 23 వేల గ్రామాల్లో ఆచరణలో ఉంది. ఎగుమతులపై దృష్టి పెట్టడానికి బదులు, స్వయం సమృద్ధిని నిర్మించడం అనే భావనపై ఆ సిద్ధాంతం ఆధారపడి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మట్టి పునరుత్పత్తి, సూక్ష్మక్రిమి కణాల సేకరణలతో పాటు అనేక అభివృద్ధి ప్రణాళికల కోసం కృషి చేసిన థాయ్ రాజును ఐక్యరాజ్య సమితి 2006లో తన మొదటి ‘మానవాభివృద్ధి అవార్డు’కు ఎంపిక చేసింది. ఆయనకు ప్రపంచంలోని మొట్టమొదటి, ఏకైక ‘అభివృద్ధి రాజు’గా గుర్తింపు ముద్ర వేస్తూ, ఆనాటి సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్... ‘‘థాయ్‌లాండ్‌లోని పేద, అత్యంత బలహీన వర్గాల ప్రజల చెంతకు.. వారి స్థితి, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా థాయ్ రాజు వెళ్లారు. వారి జీవితాలను వారే తమ చేతుల్లోకి తీసుకునే సాధికారతను వారికి ఇచ్చారు’’ అని కీర్తించారు. అనేక విధాలుగా ఛార్లెస్ కూడా తనను కేంద్ర స్థానంలో నిలబెట్టే ఒక వారసత్వాన్ని పంచుకున్నారు. ప్రపంచానికి ఇప్పుడు సుస్థిరతపై దృష్టిని మళ్లించగల కొన్ని తెలివైన స్వరాల అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు, అసమానతలు మరింత పెరిగేందుకు దారితీసిన ఆర్థిక మాంద్యంపై కచ్చితంగా ఆయన దృష్టి సారించాలి. ఎలాంటి రాజకీయ వివాదాలలోకీ వెళ్లకుండా, నిస్పృహలు పెరుగు తున్న ఈ సమయంలో ఆశలను పెంపొందించేందుకు ఈ కొత్త రాజు ఒక కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరని నేను విశ్వసి స్తున్నాను. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) ఈ–మెయిల్: hunger55@gmail.com -
వాతావరణ మార్పులపై పోరులో భారత్ ముందంజ
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల (క్లైమేట్ చేంజ్)పై పోరాటంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించగలదని, ఇప్పటికే ఎన్నో భారత కంపెనీలు అంతర్జాతీయంగా ఈ విషయంలో ముందంజలో ఉన్నట్టు మహీంద్రా గ్రూపు ఎండీ, సీఈవో అనీష్ షా పేర్కొన్నారు. భూమిపై వేడి అసాధారణ స్థాయిలో పెరిగిపోవడం ఎన్నో విపత్తులకు దారితీస్తుండడం తెలిసిందే. ఇది ఇలానే కొనసాగితే విపత్కర పరిమాణాలకు దారితీస్తుందని ‘ఫిక్కీ లీడ్స్ 2022’ కార్యక్రమంలో భాగంగా అనీష్ షా చెప్పారు. ‘‘మన ప్రధాని ఎంతో సాహసోపేతమైన ప్రకటనలు చేయడాన్ని చూశాం. 2030 నాటికి 50 శాతం పునరుత్పాదక ఇంధన వనరులు ఇందులో ఒకటి. ఈ విషయంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించగలదన్న నిజాన్ని మనం అంగీకరించాల్సిందే’’అని పేర్కొన్నారు. నూతన టెక్నాలజీలు, పర్యావరణ అనుకూల మెటీరియల్స్, డీకార్బనైజింగ్ పరిశ్రమలతో భారత కంపెనీలు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. కనుక భారత్ దీన్ని ముందుండి నడిపించాలని అభిప్రాయపడ్డారు. క్లైమేట్ చేంజ్‌పై పోరాటంలో భారత్ కీలకంగా వ్యవహరించగలదని హిందుస్థాన్ యూనిలీవర్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా సైతం పేర్కొన్నారు. భారత్ స్థిరంగా 8–9 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. -
క్రతువు ముగిసింది.. కాలుష్యం మిగిలింది!
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్ సహా సుమారు వంద జలాశయాల్లో వేలాదిగా గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు. నిమజ్జన క్రతువు ముగిసిన వెంటనే వ్యర్థాలను గణనీయంగా తొలగించినట్లు బల్దియా యంత్రాంగం ప్రకటించినప్పటికీ.. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కారణంగా టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, అధిక గాఢత రసాయనాలు, హానికారక మూలకాలు, ఇనుము, కలప, పీఓపీ ఆయా జలాశయాల్లో కలిసినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. త్వరలో నిమజ్జన కాలుష్యంపై తుది నివేదిక విడుదల చేయనున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో అంచనా ఇలా.. జలాశయంలోకి సుమారు 5 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 2 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలిసినట్లు పీసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఇనుము, కలపను బల్దియా ఆధ్వర్యంలో తొలగించినా.. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్లు పరిమితులకు మించి నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. రసాయనాలు, మూలకాలిలా.. రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టరీ్పన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్ని‹Ù. హానికారక మూలకాలు: కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జిక్ సలై్ఫడ్, మెర్క్యురీ, మైకా. తలెత్తే అనర్థాలు.. ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి. (చదవండి: రూబీ లాడ్జీ: ఎనమిదికి చేరిన మృతుల సంఖ్య..ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు) -
Ganesh Chaturthi 2022: ఆకట్టుకుంటున్న పోర్టబుల్ పాండ్స్
సాక్షి, హైదరాబాద్: ఇదివరకు సహజసిద్ధమైన చెరువులు, కొలనుల్లో గణేశ్ నిమజ్జనాలు జరిగేవి. చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా విగ్రహాల నిమజ్జనం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బేబిపాండ్స్ (నిమజ్జన కొలనులు) వినియోగిస్తున్నారు. ఈసారి కొత్తగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ప్లాస్టిక్ (ఎఫ్ఆర్సీ) పాండ్స్, నేలను తవ్వి తాత్కాలిక పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తాత్కాలిక పాండ్స్, ఎఫ్ఆర్సీ పాండ్స్ పనులు వడివడిగా జరుగుతున్నాయి. మూడో రోజు నుంచే.. బుధవారం వినాయకచవితి.. మూడోరోజు నుంచే చిన్నసైజు విగ్రహాల నిమజ్జనం జరగనుంది. వాటికోసమే ఉద్దేశించిన ఈ పాండ్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో ఎఫ్ఆర్సీ పాండ్స్ పోర్టబుల్వి. వీటిని ఎక్కడంటే అక్కడ.. ఎప్పుడంటే అప్పుడు ఏర్పాటు చేసే సౌలభ్యం ఉంది. ఇవి చూడ్డానికి ఆకర్షణీయంగానూ ఉండటంతో కాలనీల్లోని స్థానిక ప్రజలు వీటిని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది. నగరంలోని అన్ని జోన్లలో ఈ పాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో రెండు పోర్టబుల్ పాండ్లు, ఒక తాత్కాలిక పాండ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మిగతా జోన్లలోనూ పనులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు,నాలుగున్నర అడుగుల లోతుతో ఈ పాండ్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ పాండ్స్‌లోకి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతారు. నిమజ్జనం కాగానే విగ్రహాలు, పూజా సామగ్రి వెంటనే తొలగించి వేరే చోటుకు తరలిస్తారు. నీరు పరిశుభ్రంగా ఉండేందుకు నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు తాజా నీరు నింపుతారని అధికారులు పేర్కొన్నారు. లోతు నాలుగున్నర అడుగులే అయినప్పటికీ, విగ్రహాలను అడ్డంగా పాండ్స్‌లోకి వేసి నిమజ్జనం చేయడం ద్వారా అంతకంటే పెద్ద విగ్రహాలు కూడా నిమజ్జనం చేయవచ్చని అధికారులు తెలిపారు. నిమజ్జనాలు ముగిసేంత వరకు వినియోగించే పోర్టబుల్ పాండ్స్‌ను అవసరాల కనుగుణంగా ఎక్కడంటే అక్కడ మాత్రమే కాకుండా వేసవిలో జీహెచ్ఎంసీ స్టేడియంలలో స్విమ్మింగ్ పూల్స్ గానూ వినియోగించుకునే అవకాశం ఉంది. -
Telangana: సైకిల్ సవారీకి సై
సాక్షి హైదరాబాద్: గ్రేటర్ ప్రజలకు సైకిల్ అలవాటు చేసేందుకు ప్రస్తుతం జోన్‌కు రెండు మూడు సైకిల్‌ట్రాక్‌ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. క్రమేపీ ప్రజలకు అలవాటయ్యాక నగరవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. సైకిల్ వినియోగంతో ఆరోగ్యానికి మంచి వ్యాయామంతో పాటు పర్యావరణ హితం, ఇంధన వినియోగం తగ్గడం, ఇతర వాహనాల వినియోగం వల్ల వెలువడే కాలుష్యం తగ్గడం వంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సైకిళ్లకు అలవాటు పడేందుకు ప్రస్తుతానికి జోన్‌కు రెండుమూడు సైకిల్‌ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో జోన్లో ఒక్కో డిజైన్‌తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పరిశీలించాక అన్ని విధాలా యోగ్యమైన డిజైన్‌తో నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఎంపిక చేసే డిజైన్లతో తాత్కాలిక, శాశ్వత రెండు రకాలైన సైకిల్ట్రాక్స్ను ఏర్పాటు చేసే యోచనలోనూ అధికారులున్నారు. రోడ్లు 3 లేన్లు, అంతకంటే ఎక్కువ ఉన్న మార్గాల్లో శాశ్వత సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. కొత్తగా మోడల్ కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రాంతాల్లోనూ శాశ్వత సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. అంతకంటే తక్కువ లేన్లున్న మార్గాల్లో మాత్రం తాత్కాలిక సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. వీటిని ఉదయం వేళల్లో దాదాపు రెండుగంటలు మాత్రం సైకిల్ ట్రాక్స్‌గా కేవలం సైకిళ్లను మాత్రమే వినియోగిస్తారు. ఆ సమయాల్లో మిగతా వాహనాలు ఆ ట్రాక్‌లోకి రాకుండా బొలార్డ్స్ వంటివి ఉంచుతారు. మిగతా సమయాల్లో వాటిని తొలగించడం వల్ల అన్ని వాహనాలు ప్రయాణిస్తాయి. ఇక తాత్కాలిక, శాశ్వత సైకిల్ట్రాక్స్ రెండింటిలోనూ విపరీతమైన వాహన రద్దీ ఉండే సమయాల్లో ఆ ట్రాక్స్‌లో మోటార్‌బైక్స్ ప్రయాణానికి అనుమతించే యోచన ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు.. టోలిచౌకి–షేపేట, బయోడైవర్సిటీ జంక్షన్–లెదర్‌పార్క్, ఖాజాగూడ–నానక్‌రామ్‌గూడ, బయోడైవర్సిటీపార్క్– ఐకియా, గచ్చిబౌల జంక్షన్–బయోడైవర్సిటీ, మెహిదీపట్నం–గచ్చిబౌలి, నర్సాపూర్రోడ్ తదితర మార్గాల్లోని సైకిల్ ట్రాక్స్ అందుబాటులోకి వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఐడీఎల్ లేక్–జేఎన్టీయూ–ఫోరమ్‌మాల్ సర్క్యూట్ ట్యాంక్‌బండ్–పీవీఎన్ఆఆర్ మార్గ్‌రోడ్–ఎన్టీర్ మార్గ్‌రోడ్ సర్క్యూట్గానూ సైకిల్ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలిదశలో మారి్నంగ్‌వాక్ మాదిరిగా సైకిల్ తొక్కడం అలవాటయ్యేందుకు మాత్రమే నిరీ్ణత దూరాల వరకు మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు బాగా అలవాటుపడ్డాక ఎక్కువ దూరాలు వెళ్లేందుకు సైకిల్ ట్రాక్స్‌తో పాటు సైకిళ్లు అద్దెలకిచ్చేందుకు షేరింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు. (చదవండి: ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్) -
ఇదే తొలిసారి.. అంటార్కిటిక్ మహాసముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం
ప్లాస్టిక్.. ప్టాస్టిక్.. భూగోళాన్ని వణికిస్తున్న భూతం. మనిషి ఉనికి ఉన్న ప్రతి చోటా ప్లాస్టిక్ ఆనవాళ్లు విధిగా కనిపిస్తున్నాయి. నీటితోపాటు గాలిలోనూ కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు తిష్ట వేశాయి. దీనివల్ల పర్యావరణానికి, తద్వారా మానవాళి మనుగడకు పెను ముప్పు పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రపంచమంతటా ప్లాస్టిక్ వాడకం నానాటికీ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంటార్కిటిక్ మహాసముద్రంలో కొత్తగా కురిసిన మంచులో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు బయటపడటంఆందోళన కలిగిస్తోంది. అక్కడి మంచులో, ఉపరితల జలంలో ప్లాస్టిక్‌ను గతంలోనే గుర్తించినా కొత్తగా కురిసిన మంచులోనూ ఆ రేణువులు బయట పడటం ఇదే తొలిసారని పరిశోధకులు చెప్పారు. దీనివల్ల మంచు కరిగే వేగం బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు నీట మునిగి అక్కడి జనం నిరాశ్రయులవుతారు. తీర నగరాలకు ముంపు ప్రమాదం మరింత పెరుగుతుంది. మారుమూలల్లో ప్లాస్టిక్ కాలుష్యం న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బరీకి చెందిన పీహెచ్డీ విద్యార్థిని అలెక్స్ అవెస్ ఈ పరిశోధన చేపట్టారు. 2019లో అంటార్కిటిక్‌లోని రాస్ ఐస్ షెల్ఫ్ నుంచి మంచు నమూనాలు సేకరించారు. వాటిని కెమికల్ అనాలిసిస్ టెక్నిక్‌తో అధ్యయనం చేయగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. 19 నమూనాలను సేకరించగా ప్రతిదాంట్లోనూ ప్లాస్టిక్ ఆనవాళ్లున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయమని అవెస్ అన్నారు. మానవ సంచారం లేని అత్యంత మారుమూల ప్రాంతంగా భావించే రాస్ ఐస్ షెల్ఫ్లోనూ ప్లాస్టిక్ కోరలు చాస్తుండటం ఆందోళనకరమన్నారు. సముద్రంలో 13 రకాలు కరిగిన ప్రతి లీటర్ మంచులో సగటున 29 మైక్రోప్లాస్టిక్ రేణువులున్నట్లు తేలింది! ఇటాలియన్ హిమానీ నదాల్లో కంటే అంటార్కిటిక్‌లోని రాస్ ఐలాండ్, స్కాట్ బేస్‌ల్లో ప్లాస్టిక 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటార్కిటిక్‌లో 13 రకాల ప్లాస్టిక్లున్నాయి. కూల్‌డ్రింక్ సీసాలు, వస్త్రాల తయారీకి వాడే పీఈటీ రకం ప్లాస్టిక్ ఎక్కువగా కన్పించింది. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ వ్యాప్తికి ప్రధాన వాహకం గాలే. ప్లాస్టిక్ రేణువులు గాలి ద్వారా వేల కిలోమీటర్లు సులువుగా ప్రయాణిస్తాయి. అయితే పర్యాటకుల ద్వారానే ప్లాస్టిక్ అంటార్కిటిక్ దాకా చేరి ఉంటుందని పరిశోధకుల అంచనా. ప్లాస్టిక్‌తో భారీ నష్టం 85 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అంటార్కిటిక్ మహాసముద్ర పర్యావరణ వ్యవస్థ ప్లాస్టిక్ వల్ల బాగా దెబ్బతింటోంది. సముద్ర జీవులు ఆహార పదార్థాలుగా భ్రమించి విషపూరిత ప్లాస్టిక్‌ను తిని మృత్యువాత పడుతున్నాయి. రొయ్యల జాతికి చెందిన క్రిల్ అనే జీవులకు ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు గమనించారు. సౌందర్య ఉత్పత్తుల వల్ల గత పదేళ్లలో భారీ పరిమాణంలో మైక్రోప్లాస్టిక్, టూరిజం వల్ల 25.5 బిలియన్ సింథటిక్ ఫైబర్లు అంటార్కిటక్ సముద్రంలో చేరుతున్నట్టు లెక్కగట్టారు. వాస్తవానికి ఈ పరిమాణం ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. చేపల వేట తదితరాల వల్ల కూడా సముద్రంలోకి ప్లాస్టిక్ వచ్చి చేరుతోంది. సముద్ర ఉపరితలంలోనే గాక అన్ని పొరల్లోనూ మైక్రో ప్లాస్టిక్ విస్తరించింది. ఉపరితలం నుంచి 6 నుంచి 11 మీటర్ల లోతులో ప్రతి చదరపు మీటర్‌కు 766 మైక్రోప్లాస్టిక్ రేణువులు కనిపించాయి! అంటార్కిటిక్, పరిసరాల్లో ప్లాస్టిక్ బెడద, పర్యావరణంపై దాని ప్రభావంపై పూర్తిస్థాయి అధ్యయనం తక్షణావసరమని బ్రిటిష్ యూనివర్సిటీ ఆఫ్ హల్ మెరైన్ బయాలజిస్టు డాక్టర్ కేథరిన్ వాలర్ అంటున్నారు. -
కాలుష్య భూతంపై ప్రక్షాళన అస్త్రం
రాజమహేంద్రవరం సిటీ: పవిత్ర గోదావరి నదీ స్నానం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ నదీ తీరంలోని ప్రధాన నగరం రాజమహేంద్రవరంలోని ఘాట్లలో మాత్రం పరిస్థితులు పుణ్యస్నానానికి తగినట్టుగా ఉండవు. ఎగువన కోటిలింగాల నుంచి దిగువన గౌతమ ఘాట్ వరకూ ప్రతి చోటా ఈ పావన వాహిని మురికికూపాన్ని తలపిస్తుంది. దీంతో ఈ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నగరంలో ప్రధానంగా గోదావరి ఘాట్లు తొమ్మిది ఉన్నాయి. కొంతవరకూ పుష్కర ఘాట్ మినహా మిగిలినచోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు, మలినాలు, మురుగు, నాచు పేరుకుపోయి దుర్గంధభరితంగా మారాయి. అనేక ప్రసిద్ధ ఆలయాలకు నెలవుగా ఉన్న గౌతమ ఘాట్ వద్ద గోదావరిలో నాచు, వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోయాయి. ఇబ్బందికర పరిస్థితుల మధ్యనే స్నానాలకు దిగుతూ దుర్గంధంతో పాటు దురదలతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాపోతున్నారు. దేశంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన కోటిలింగాల ఘాట్ రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇంత పొడవైన ఈ ఘాట్ వద్ద గోదావరిలో దిగేందుకు, స్నానం చేసేందుకు సైతం అవకాశం లేని దుస్థితి. అంతలా ఇక్కడ వ్యర్థాలు పేరుకుపోయాయి. కోటిలింగాల ఘాట్‌కు పుష్కర ఘాట్‌కు మధ్య నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఇన్‌టేక్ పాయింట్ ఉంది. ఇక్కడ విపరీతంగా ఉన్న వ్యర్థాల మధ్య నుంచే గోదావరి జలాలను సేకరించాల్సిన దుస్థితి. ఈ రెండు ఘాట్లకు దిగువన కూడా ప్రధాన రక్షిత మంచినీటి సరఫరా పథకం ఇన్‌టేక్ పాయింట్ ఉంది. వీటి నుంచి కలుషితమైన నీటినే నగర ప్రజలకు ఫిల్టర్ చేసి అందిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రక్షాళనకు కదిలిరావాలి గోదావరి నదీ కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంపై నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నగరంలోని ఘాట్ల వద్ద పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నదిలో చెత్తను తొలగించే కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాకే తలమానికమైన గోదావరి నదీ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి స్ఫూర్తి నింపాలని కోరారు. ఈ నది పవిత్రతను కాపాడటంలో ఎవరికి వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో గోదావరి ప్రక్షాళనను ఉద్యమంలా చేపట్టాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో నగరాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు. నదీ జలాలు కలుషితం కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఇతరులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం అభినందనీయమని దినేష్‌కుమార్ అన్నారు. -
భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే అత్యధికమని తెలిపింది. కాలుష్య మరణాల్లో అత్యధికం (16.7 లక్షలు) వాయుకాలుష్యం వల్ల జరిగాయని, వాయుకాలుష్య మరణాల్లో అత్యధిక మరణాలు(9.8 లక్షలు) పీఎం2.5 కాలుష్యకాల వల్ల సంభవించాయని వివరించింది. గాలిలో 2.5 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ సైజుండే కణాలను పీఎం 2.5 కాలుష్యకాలంటారు. మిగిలిన వాయు కాలుష్య మరణాలు గృహసంబంధిత వాయు కాలుష్యకాల వల్ల సంభవించినట్లు తెలిపింది. భారత్‌లో 2019లో నీటి కాలుష్యంతో 5 లక్షలు, పారిశ్రామిక కాలుష్యంతో 1.6 లక్షల మంది మరణించారని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద 2019లో అన్ని రకాల కాలుష్యాలతో 90 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. వీటిలో అత్యధికంగా (66.7 లక్షలు) వాయుకాలుష్యం వల్లనే సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని నివేదిక రూపకర్త రిచర్డ్ చెప్పారు. 2015 నుంచి మాత్రమే దేశాలు కాలుష్య నివారణ బడ్జెట్‌ను స్వల్పంగా పెంచుతున్నాయన్నారు. గంగా మైదానంలో అధికం భారత్‌లో వాయు కాలుష్యం గంగా– సింధు మైదాన ప్రాంతం (ఉత్తర భారతం)లో అధికమని నివేదిక తెలిపింది. ఇళ్లలో బయోమాస్ తగలబెట్టడం వల్ల వాయుకాలుష్య మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. దేశ వాతావరణంలో కాలుష్య కారకాలు 2014లో గరిష్ఠంగా ఉన్నాయని, ఆ తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినా తిరిగి వీటి సరాసరి పెరుగుతోందని తెలిపింది. భారత్‌లో జాతీయ వాయు శుభ్రతా కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను ప్రభుత్వం కాలుష్య నివారణకు చేపట్టిందని, కానీ భారత్‌లో వాయుకాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ లేదని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల కన్నా భారత వాతావరణంలో కాలుష్యకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే సాంప్రదాయక కాలుష్యకాల వల్ల మరణాలు 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో కాలుష్యం వల్ల ఆర్థిక నష్టం జీడీపీలో ఒక్క శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వల్ల జరిగిన ఆర్థిక నష్టం 46లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. అంతర్జాతీయంగా కాలుష్యాల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2015లో చైనాలో 18 లక్షల మంది కాలుష్యంతో మరణించగా, ఈ సంఖ్య 2019లో 21.7 లక్షలకు పెరిగిందని నివేదిక తెలిపింది. -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇంటింటికి తప్పనిసరిగా మారింది
సాక్షి,హైదరాబాద్: వాహన విస్ఫోటనం గ్రేటర్ హైదరాబాద్‌ను బెంబేలెత్తిస్తోంది. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ఏకంగా 71 లక్షలు దాటింది. ఇందులో ప్రజా రవాణా వాహనాలు పట్టుమని పది లక్షలు కూడా లేవు. సింహభాగం వ్యక్తిగత వాహనాలే. రోజురోజుకూ వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న వాహనాలతో రహదారులు స్తంభించిపోతున్నాయి. ఇంచుమించు రెండేళ్ల పాటు కోవిడ్ కాలంలో స్తంభించిన ప్రజారవాణా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తారస్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ రెండేళ్లలోనే 5 లక్షలకుపైగా కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. రహదారులను విస్తరించి, ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు కోవిడ్ కంటే ముందు నుంచే ప్రజా రవాణా ప్రాధాన్యం తగ్గింది. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి. ఇంటింటికీ సొంత బండి... సొంత బండి ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మారింది. రోజురోజుకూ నగరం విస్తరిస్తోంది. ఔటర్‌ను దాటి పెరిగిపోతోంది. ఇందుకు తగినట్లుగా ప్రజా రవాణా పెరగడం లేదు. దీంతో నగరానికి దూరంగా ఉండి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించాల్సినవాళ్లు సొంత వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నగర శివార్ల నుంచి, కాలనీల నుంచి ప్రధాన మార్గాలకు అనుసంధానం చేసే రవాణా సదుపాయాలు లేకపోవడంతో సొంత ఇల్లైనా, అద్దె ఇంట్లో ఉంటున్నా సరే బండి తప్పనిసరిగా మారింది. మొబైల్ ఫోన్ ఉన్నట్లే బైక్.. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక మొబైల్ ఫోన్ అనివార్యమైన అవసరంగా మారింది. ఇంచుమించు యువతలో 80 శాతం మందికి బైక్ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో నిమిత్తం లేకుండా ఒక వయసుకు రాగానే పిల్లలకు బండి కొనివ్వడాన్ని తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. ప్రజా రవాణా పెరగాలి వాహన విస్ఫోటనాన్ని అరికట్టేందుకు ప్రజా రవాణా విస్తరణ ఒకటే పరిష్కారం. వ్యక్తిగత వాహనాలను నియంత్రించలేకపోతే రానున్న కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది. – పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు! -
కోటి వాహనాల ఐటీ సిటీ
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో సొంత వాహనాలపై ఏటేటా మక్కువ పెరుగుతోంది. ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న వాహన రిజిస్ట్రేషన్లే దానికి నిదర్శనం. ఫలితంగా రోడ్లు చాలక మొత్తం నగరవాసులు ఇబ్బందులను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు జనాభా 1.30 కోట్లుగా ఉంది. వాహనాల సంఖ్య కూడా సుమారు కోటికి చేరుకుంది. నగరంలో ప్రస్తుతం బైకులు, కార్లు, బస్సులు, ఇతరత్రా రవాణా వాహనాల సంఖ్య 1,03,21,000గా ఉంది. కిక్కిరిసిన వాహనాల ఫలితంగా వాతావరణ కాలుష్యం కూడా ఎగబాకుతోంది. 68 లక్షల బైక్‌లు, 21 లక్షల కార్లు 2022, మే వరకు రాజధానిలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య చూస్తే 68,72,763 బైకులు, 21,74,830 కార్లు, 1,15,000 ట్రక్కులు, లారీలు, 3,50,000 ట్యాక్సీ, ఆటోలు, 8,08,990, ఇతర వాహనాలు ఇలా మొత్తంగా 1,03,21,583 వాహనాలు బెంగళూరు రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంత వాహన ఒత్తిడిని తట్టుకోలేని రోడ్లు తరచూ నాశనమవుతున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ రద్దీ జన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కిలోమీటరు దూరంలోని గమ్యం చేరడానికి పీక్ అవర్స్‌లో రెండు మూడు గంటలు పడుతోంది. చాలీచాలని రహదారులు బీబీఎంపీ పరిధిలో మొత్తం 1,1940 కిలోమీటర్ల పొడవునా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు 60 లక్షల వాహనాలను మాత్రం భరించగలవు. కానీ కోటికి పైగా వాహనాలు రోడ్లపై తిరగడం వల్ల రోడ్ల నాణ్యత దెబ్బతింటోంది. మరోవైపు నగరంలో వాహనాల రద్దీని తగ్గించేందుకు కార్‌పూలింగ్‌ను అమలు చేయాలని, పార్కింగ్ స్థలం ఉన్న ఇళ్లవారికే కారు కొనుగోలు నిబంధన ఉండాలని డిమాండ్లు ఉన్నాయి. చదవండి: 19 ఏళ్ల తర్వాత.. చనిపోయిన వ్యక్తి.. మళ్లీ ప్రాణాలతో.. -
అంతటా పొల్యూషన్.. ఏదీ సొల్యూషన్!
పొద్దున, సాయంత్రం చల్లగాలి.. వారానికోసారి పార్కులోని చెట్ల గాలి.. ఆఫీసులు, ఇళ్లలో ఏసీ గాలి.. ఇలా ఏ గాలి అయినా ఒకటేనట. ఊరుదాటి వెళితే స్వచ్ఛమైన గాలి దొరుకుతుందన్నదీ ఉత్త మాటేనట. ఇక్కడా, అక్కడా అని కాదు.. భూమ్మీద ఉన్న 700 కోట్ల మంది జనాభాలో 99 శాతం కలుషిత గాలే పీల్చుకుంటున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. కరోనా మహమ్మారిని చూసి భయపడుతున్నాంగానీ.. అంతకంటే వేగంగా కాలుష్యం లక్షల మంది ప్రాణాలు తీస్తోందని పేర్కొంది. మరి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు, సూచనలేమిటో చూద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ నాలుగేళ్లలో మరింత పెరిగి.. గాలిలో ఏయే కలుషితాలు గరిష్టంగా ఎంతవరకు ఉండవచ్చనే దానిపై డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించింది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో గాలి ఈ ప్రమాణాల మేరకు లేదని డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదికలో హెచ్చరించింది. అధిక ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఐదో వంతు మాత్రమే కాలుష్య పరిమితుల్లో ఉంటే.. పేద దేశాల్లో ఒక శాతం మాత్రమే తక్కువ కాలుష్యంతో ఉన్నాయని తెలిపింది. ఈ కలుషిత గాలి పీల్చడం వల్ల కోట్ల మందికి గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. భూమ్మీద నాలుగేళ్ల కింద 90శాతంగా ఉన్న ఉన్న కాలుష్య ప్రభావ ప్రాంతం.. ఇప్పుడు 99 శాతానికి చేరిందని తెలిపింది. తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత తక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఈ కాలుష్యం వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారని, మరెంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో పర్యావరణ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా వెల్లడించారు. పెట్టుబడులు వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతున్నాయే తప్ప.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలిని అందించడం లేదని పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న కలుషితాలు మనుషులు ఏడాదిపాటు పీల్చేగాలిలో 2.5 పీఎం రేణువులు 5 గ్రాములకంటే ఎక్కువ ఉండొద్దు, 10 పీఎం రేణువులు 15 గ్రాములు దాటకూడదు. నైట్రోజన్ ఆక్సైడ్ సాంద్రత ఏడాదికి పదిగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ చాలా వరకు అధికాదాయ దేశాల్లోని నగరాలు ఈ స్థాయిలను ఎప్పుడో దాటి ప్రమాదకర స్థితికి వెళ్లిపోయాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. తక్కువ ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఈ పరిస్థితి కొంత తక్కువగా ఉందని వెల్లడించింది. నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి విషయంలో పేద, ధనిక తేడా లేదని.. అన్ని దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపింది. మొత్తంగా 4 వేల నగరాల్లోని 77 శాతం ప్రజలు నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి ఎక్కువున్న గాలినే పీలుస్తున్నారని వెల్లడించింది. తక్కువ స్థాయి వాయు కాలుష్య కారకాలు కూడా గణనీయమైన హానిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కర్బన ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే తప్ప గాలి కాలుష్య స్థాయిని తగ్గించలేమని స్పష్టం చేసింది. ►పీఎం అంటే పర్టిక్యులేట్ మేటర్ (అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళి కణాలు). 2.5 మైక్రోమీటర్లకన్నా చిన్నవాటిని పీఎం 2.5, 10 మైక్రోమీటర్ల పరిమాణం ఉన్నవి పీఎం 10గా పేర్కొంటారు. నిర్మాణాలు జరుగుతున్న చోట, కచ్చారోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు, మంటలు, వివిధ రకాల పొగల నుంచి ఇవి ఏర్పడుతాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజైన్ ఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, వాహనాల నుంచి ఎక్కువగా వెలువడతాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడొద్దు ‘ఒక మహమ్మారి నుండి బయటపడ్డామనుకుంటే... కాలుష్యాన్ని పెంచుకుంటూ, మనం నివారించగల మరణాలను కూడా కొని తచ్చుకుంటున్నాం. వాయు కాలుష్యం కారణంగా మంచి ఆరోగ్యాన్ని కోల్పోవడం ఆమోదయోగ్యం కాదు. వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించాల్సిన అవశ్యకత ఇప్పుడు మన ముందుంది. శిలాజ ఇంధనాలపై తక్కువ ఆధారపడే ప్రపంచం అవసరం’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ వ్యాఖ్యానించారు. 117 దేశాల్లో పరిశీలన చేసి.. డబ్ల్యూహెచ్‌వో 117 దేశాల్లోని 6 వేల నగరాల్లో కాలుష్య డేటాను పరిశీలించింది. వాహనాలు, రోడ్ ట్రాఫిక్ వల్ల ప్రమాదకరమైన నైట్రోజన్ ఆక్సైడ్ పెరిగిపోతోందంది. ప్రమాదకర దుమ్ము, ధూళి రేణువుల శాతం పెరిగిందని తెలిపింది. ఇవి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరుతున్నాయని.. రక్తపోటు, శ్వాస సంబంధిత సమస్యలు, కేన్సర్లకు కారణమవుతున్నాయని తేల్చి చెప్పింది. దుమ్ము, ధూళికి తోడు నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడంతో.. ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నట్లు హెచ్చరించింది. రవాణా, విద్యుత్, సాగు కోసం అధికంగా ఇంధనాన్ని కాల్చడమే కాలుష్యానికి ప్రధాన కారణమని తెలిపింది. ఇబ్బంది పడేవాళ్లెవరు..? కాలుష్యం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఇబ్బంది పడతారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అధికంగా ప్రభావితమవుతారు. ►కాలుష్యంతో తాత్కాలికంగా.. తలనొప్పి, ముక్కు, గొంతు, కళ్లు మంటలు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ►దీర్ఘకాలికంగా.. కేంద్రనాడీ వ్యవస్థపై ప్రభావంతో తలనొప్పి, యాంగ్జైటీ , గుండె సంబంధిత జబ్బుల పెరుగుదల, ఆస్తమా, కేన్సర్, శ్వాసకోశ ఇబ్బందులు, కాలేయం, ప్లీహం, రక్త ప్రసరణపై ప్రభావం వంటివి తలెత్తుతాయి. మనమేం చేయొచ్చు ►వాహనాల వాడకాన్ని వీలైనంతగా తగ్గించడం. ►కరోనాతో సంబంధం లేకుండా మాస్క్ ధరించే అలవాటు కొనసాగించడం. ►దుమ్ము, ధూళి ఇంట్లోకి రాకుండా చూసుకోవడం. ►రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు కలుషి తాల నుంచి రక్షణ పొందేలా ఏర్పాట్లు చేసుకోవడం. -
ప్లాస్టిక్ భూతానికి చెక్..
సాక్షి, అమరావతి: ఉదయం పాలు, కూరలు తేవాలంటే ప్లాస్టిక్ కవర్లు.. టీ తాగాలంటే ప్లాస్టిక్ కప్పు.. వాటర్ బాటిల్ ప్లాస్టిక్.. కూల్‌డ్రింక్ బాటిల్ ప్లాస్టిక్.. టిఫిన్ లేదా ఏదైనా పార్సిల్ తేవాలంటే ప్లాస్టిక్.. దుస్తులు కొన్నా ప్లాస్టిక్ కవర్లోనే ఇంటికి వస్తాయి.. నిత్య జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు అనేక ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంటాం. కానీ, రసాయనాలతో కూడిన ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవుడితో సహా సమస్త జీవజాలానికి, పర్యావరణానికి అత్యంత హాని కలుగజేస్తున్నాయి. వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్ధాలు చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి (డీకంపోజ్) ఏకంగా 400 ఏళ్లు పడుతుంది.ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని నివారించాలని ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా, సాధ్యమవడంలేదు. పైగా, వీటి వినియోగం ఏటికేడాది పెరుగుతూనే ఉందని కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగేళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం రెట్టింపైందని, ఇది మరింత వేగంగా విస్తరిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది. 2015–16 సంవత్సరంలో దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 15.89 లక్షల టన్నులు కాగా, 2019–20 నాటికి 35 లక్షలకు చేరింది. రోజుకు 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే అందులో సుమారు 10,376 టన్నుల వ్యర్థాలను సేకరించకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. 2050 నాటికి 12 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ దేశ భూ భాగంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం తక్కువే. అమెరికాలో తలసరి ప్లాస్టిక్ వినియోగం 109 కేజీలు , చైనాలో 38 కేజీలుంటే ఇండియాలో 11 కేజీలే. అయినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్ డెలివరీ విస్తరిస్తుండటంతో ప్లాస్టిక్ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. కేవలం జుమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ప్రతి నెలా అదనంగా 22,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నట్లు అంచనా. ప్రభుత్వం తక్షణం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, లేకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ఆ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూ 2016లో కేంద్రం నిబంధనలు విధించగా, తాజాగా వాటిని సవరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఒకసారి మాత్రమే వినియోగించే (సింగిల్ యూసేజ్) ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించింది. దీని ప్రకారం కూల్డ్రింక్ల్లో వినియోగించే స్ట్రాలు, ఐస్‌క్రీం స్టిక్‌లు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, చెంచాలు, బెలూన్స్, క్యాండీ స్టిక్స్ వంటి వాటిలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ప్లాస్టిక్ కట్టడిలో ఏపీ చొరవ ప్లాస్టిక్ వినియోగం, నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. పట్టణాల నుంచి సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ నిర్వహణ పద్ధతులను పాటిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో ఏటా 46,222 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ తయారీలో, రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 131 ప్లాస్టిక్ సంబంధ యూనిట్లు ఉండగా అందులో 117 ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి. 14 ప్లాస్టిక్ రీ–సైక్లింగ్ యూనిట్లు. తాడిపత్రి, బొబ్బిలి, తిరుపతి, విజయవాడ వంటి మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల వినియోగంపై పాక్షిక నిషేధం అమలవుతోంది. కేంద్ర నిబంధనలను అతిక్రమించిన వారిపై దాడులు చేయడం ద్వారా రాష్ట్ర అధికారులు 235 టన్నల ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేశారు. రూ.1.64 కోట్లు జరిమానాగా విధించారు. తాజాగా ప్లాసిŠట్క్ వ్యర్థాల నుంచి సముద్ర తీరప్రాంతాన్ని రక్షించేలా అమెరికాకు చెందిన పార్లే ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలో ఏటా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయనున్నట్లు పార్లే ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరిల్ గట్చ్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 500 పార్లే ఎయిర్ స్టేషన్లు, 10 ఎకో ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటుతోపాటు 20 వేల మంది సముద్రపు వారియర్స్‌ను నియమిస్తామని వివరించారు. ఆయన ఈ నెల 5న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసే ఉత్పత్తులను వివరించి, రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. -
శీఘ్రమేవ శుభ్రమస్తు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతే ప్రాణాలకు ప్రమాదం ముంచుకొస్తుంది. పల్స్ ఆక్సీ మీటరు ద్వారా చెక్ చేసుకుంటూ ఆక్సిజన్ లెవెల్ తగ్గగానే ఆస్పత్రులకు పరుగు తీస్తాం. లక్షల మందికి తాగు, సాగునీరు అందించే గోదావరిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నా ఎవరూ ఉలకరు పలకరు. కాలుష్యంతో కూడిన వ్యర్థాలు మురుగు కాలువల ద్వారా గోదావరిలో కలిసిపోతున్నా పట్టించుకోరు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న గోదారమ్మను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నదిలో నీటి నాణ్యత అథమ స్థాయి డి–గ్రేడ్‌కు (చేపలు, జంతువులకు మాత్రమే పని చేస్తుంది) పడిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర జలసంఘం నిర్ధారించింది. గోదావరి ప్రక్షాళనకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టకుంటే భవిష్యత్ తరాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఐదేళ్ల క్రితమే స్పష్టం చేసింది. ప్రక్షాళనకు ‘నమామి గోదావరి’ ఈ పావన నది ప్రక్షాళనకు ‘నమామి గోదావరి’ పేరిట కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి ప్రక్షాళనకు చేసిన ప్రతిపాదనలకు ఇటీవల కేంద్ర ఆమోదం లభించింది. గోదావరి జన్మస్థలి నాసిక్ నుంచి చివరన రాజమహేంద్రవరం వరకూ నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.1,700.84 కోట్లతో ప్రతిపాదించింది. ఇందులో ‘నమామి గోదావరి’ పేరిట తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని నదిలో జల కాలుష్య కట్టడికి రూ.400 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.87 కోట్లు ఇప్పటికే కేటాయించింది. కార్యాచరణ మొదలు కావాల్సి ఉంది. కాలుష్యమిలా.. దేశవ్యాప్తంగా 351 నదుల్లో జల కాలుష్యాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఆ నదుల జాబితాలో మన గోదావరి కూడా ఉంది. గోదావరి జలాల కాలుష్యంపై 2018లో ఎన్జీటీలో కేసు కూడా నమోదైంది. రాజమహేంద్రవరం నుంచి కోనసీమలోని సముద్ర మొగ వరకూ అడుగడుగునా గోదావరి కలుషితమవుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన రాజమహేంద్రవరంలో 5 లక్షల జనాభా ఉంది. ఈ నగరంలోని ఇళ్లల్లో వినియోగించిన నీరు, కాలువల్లో మురుగు కలిసి రోజుకు 60 మిలియన్ లీటర్లు (60 ఎంఎల్డీ) వస్తోంది. ఇందులో రోజూ 30 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే హుకుంపేట వద్ద మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటు (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ – ఎస్టీపీ) ద్వారా శుద్ధి చేసి గోదావరిలో విడిచి పెడుతున్నారు. మూడు ప్రధాన కాలువల ద్వారా గోదావరికి మురుగు నీరు వచ్చి చేరుతుంది. నల్లా చానల్: లోతట్టు ప్రాంతంగా ఉన్న రాజమహేంద్రవంలో వర్షాకాలంలో వచ్చే నీటిని పైపులైన్ల ద్వారా గోదావరిలోకి తోడేందుకు నల్లా చానల్ ఏర్పాటు చేశారు. ఎక్కువగా ఈ పైపులైన్ ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. ఆవ డ్రెయిన్: ఈ డ్రెయిన్ ద్వారా మురుగునీటిని ధవళేశ్వరం వద్ద గోదావరిలో విడిచిపెడుతున్నారు. మల్లయ్యపేట డ్రెయిన్: ఈ డ్రెయిన్ ద్వారా పేపర్ మిల్లు ప్రాంతంలో మురుగు నీటిని గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి ప్రక్షాళనకు చర్యలు తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం వద్ద మూడు కాలువల ద్వారా మురుగునీరు చేరుతోంది. రాజమహేంద్రవరంలో రోజుకు 60 మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో చేరుతోంది. ఇందులో సగం మాత్రమే శుద్ధి చేసి విడిచిపెడుతున్నారు. మిగిలిన మురుగునీటిని కూడా శుద్ధి చేసే ప్రణాళిక సిద్ధమవుతోంది. నదీ కాలుష్యాన్ని నివారించగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. – ఎన్.అశోక్‌కుమార్, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి, కాకినాడ కలవరం కాలుష్య నియంత్ర మండలి కాకినాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా ప్రతి నెలా గోదావరిలోకి మూడు కాలువల ద్వారా కలుస్తున్న మురుగు నీటి నమూనాలను లేబొరేటరీలో పరీక్షిస్తుంటే వస్తున్న ఫలితాలు కలవరపెడుతున్నాయి. మూడు శాతం ఉండాల్సిన బయో కెమికల్ ఆక్సిజన్ 70 శాతం నమోదవడం కాలుష్య తీవ్రతను చాటుతోంది. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ (డీఓ) ఆధారంగా నీటి నాణ్యతను లెక్కిస్తారు. డీఓ పరిమాణం లీటరుకు కనీసం నాలుగు మిల్లీ గ్రాములుండాలి. బీఓడీ మూడు మిల్లీ గ్రాములు దాటకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ గోదావరిలో నాలుగు నుంచి తొమ్మిది శాతం వరకూ ఉందని గుర్తించారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో 50 పరిశ్రమలున్నాయి. వీటిల్లో కొన్ని పరిశ్రమల వ్యర్థాలు గోదావరి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇదిగో సాక్ష్యం గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకూ గోదావరి జలకాలుష్యంపై లేబొరేటరీ నివేదికలు. నల్లా చానల్: బీఓడీ కనిష్టంగా 52, గరిష్టంగా 94 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 71.83గా తేలింది. ఆవ డ్రెయిన్: బీఓడీ కనిష్టంగా 44, గరిష్టంగా 82 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 66.33గా గుర్తించారు. మల్లయ్యపేట డ్రెయిన్: బీఓడీ కనిష్టంగా 50, గరిష్టంగా 114 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 78.33గా నమోదైంది. -
పిల్లల్లో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్ల వలయం?
పెద్ద వయసు వాళ్లలో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్లటి వలయం రావడం మామూలే. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లోని చాలామందిలో ఇది కనిపిస్తుంది. కానీ పిల్లల్లోనైతే ఇది రావడానికి వాతావరణ కాలుష్యం ఓ కారణమనీ, దాంతో వచ్చే అలర్జీ కారణంగానే ఇలా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఆరుబయట తిరుగుతూ దువు్మూ ధూళి, ఆరుబయటి కాలుష్య, పుప్పొడి వంటి వాటికి నిత్యం ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు... ఏదైనా అంశంతో అలర్జీ కలిగితే ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలా కార్నియా చుట్టు తెల్లవలయం రావడాన్ని వైద్య పరిభాషలో వెర్నల్ కెరటో కంజంక్టవైటిస్ (వీకేసీ) అంటారు. ఈ సమస్య నివారణ కోసం వాతావరణ కాలుష్యాలకు దూరంగా ఉండటం ద్వారా కంటిని రక్షించుకోవాలి. ఇందుకోసం ప్లెయిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు వీలైనన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. కంటి డాక్టర్‌ను కలిసి... వారు సూచించిన యాంటీ అలర్జిక్ చుక్కల వుందుల్ని వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఒకింత ఎక్కువ కాలం పాటు వీటిని వాడాల్సిరావచ్చు. వీటిల్లోనూ స్టెరాయిడల్, నాన్ స్టెరాయిడల్ (స్టెరాయిడ్ లేనివి) అనే రెండు రకాల మందులు ఉంటాయి. స్టెరాయిడ్ మోతాదులు ఉన్న మందుల్ని మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు మాత్రమే వాడాలి. ఎక్కువకాలం వాడితే సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల డాక్టర్ సూచించిన కాలానికి మించి వాటిని వాడకూడదు. ఇక నాన్‌స్టెరాయిడ్ (స్టెరాయిడ్ లేని) మందుల్ని మాత్రం చాలా కాలంపాటు వాడవచ్చు. ఉదాహరణకు ఓలోపాటడిన్ వంటి నాన్‌స్టెరాయిడ్ డ్రాప్స్ రోజుకు రెండుసార్లు చొప్పున ఆరుమాసాల వరకు వాడవచ్చు. అలాగే లూబ్రికెంట్ డ్రాప్స్ కూడా వాడాలి. దాంతో అలర్జెన్స్ పలచలబారుతాయి. కంటికి ఉపశమనం కలుగుతుంది. ఈ మందుల్ని వాడుతున్న కొద్దీ నల్లగుడ్డు చుట్టూ ఉన్న తెల్లటి రంగు క్రమంగా మాయమవుతుంది. అలర్జీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచనల మేరకు యాంటీహిస్టమైన్ ఐ డ్రాప్స్‌తో పాటు కొందరిలో యాంటీహిస్టమైన్ మాత్రలు కూడా వాడాల్సి వస్తుంది. ఈ సవుస్య గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినా... నిర్లక్ష్యం మాత్రం మంచిది కాదు. -
పది కాలాలు పదిలంగా ఉండాలంటే...
భూమి మీద జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి ఆందోళన రానురానూ పెరుగుతున్నది. పర్యావరణ విధ్వంసం తగ్గించే ప్రయత్నాలు జరుగు తున్నా కూడా ప్రకృతి వనరుల భక్షణ మీద దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణం కొనసాగడం వల్ల ఫలితాలు రాలేదు. ఈ రోజు అవే ఆర్థిక వ్యవస్థలు కాలుష్య దుష్పరిణామాల భారంతో కుప్పకూలుతున్నాయి. విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఆహార లేమి బాధిస్తున్నది. నీటి కొరత ఆందోళన కలిగిస్తున్నది. మానవ సమాజ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నది. ప్రకృతి వనరుల సుస్థిర ఉపయోగంలో పాటించాల్సిన సమన్యాయం అంతకంతకూ కొరవడుతున్నది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా పరిణతి కలిగిన ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కదలాల్సిన అవసరం ఉంది. అనేక రూపాలలో, అనేక విధాలుగా పుడమి ప్రస్తుతం ఎదుర్కొంటున్న భారీ సంక్షోభానికి దీటుగా అంతర్జాతీయ ప్రతిస్పందన ఉండాలనే ఆకాంక్ష ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నది. అయితే ప్రభుత్వాల స్పందన చాలా నెమ్మదిగా ఉంది. భారతదేశం పర్వతాలు, అడవులు, సముద్రాలు, నదులు, ఇతర జలవనరులతో విలసిల్లుతోంది. 91,000 జాతులకు పైగా జంతువులు, 45,000 జాతుల మొక్కలకు ఇది నిలయం. వీటి ఉనికికి ముప్పు ఉంది. ఫలితంగా, ఆహార ఉత్పత్తికి విఘాతం కలుగు తున్నది. పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలు, సాలెపురుగులు, పగడాలు, చెట్లు మానవ మనుగడకు వివిధ పాత్రల ద్వారా దోహదపడుతున్నాయి. దాదాపు 1,000 జాతులు ప్రమాదంలో పడ్డాయి. ప్రాంతాల వారీగా, ఆయా పరిస్థితుల ప్రభావంతో క్రమంగా అంతరించి పోతున్నాయి. వీటిలో అనేకం ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ రెడ్ లిస్ట్’లో చేర్చారు. వీటిని ఇప్పుడు కాపాడుకోలేకపోతే భూమిపై శాశ్వతంగా అదృశ్యమవుతాయి. పర్యావరణవాదుల ఒత్తిడి మేరకు 2015లో పారిస్‌లో 197 దేశా లకు చెందిన ప్రపంచ దేశాధినేతలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పారిస్ ఒప్పందంలో ప్రధాన లక్ష్యం భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించడం, 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవడం. పారిస్ ఒప్పందం మేరకు చేసిన వాగ్దానాలపై ప్రభుత్వాలు వేగంగా వ్యవహరిస్తే, వాతా వరణ మార్పుల వలన ఏర్పడుతున్న విపరిణామాలను నివారించ వచ్చు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉపయోగపడే ప్రభుత్వ విధా నాలను నిలువరించడానికి కొన్ని వర్గాలు సర్వ ప్రయత్నాలు చేస్తు న్నాయి. భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి. ‘సీఓపీ 26’లో తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి శిలాజ ఇంధనాల మీద ఒప్పం దానికి రాకుండా, శిలాజ ఇంధనాల మీద అంతర్జాతీయ నిషేధం రాకుండా సఫలీకృతం అయినారు. విపరీత ప్రకృతి వైపరీత్యాల రూపంలో వాతావరణ మార్పుల గురించి ఏడాదికేడాది స్పష్టత వస్తున్నప్పటికీ, బహుళ జాతి కార్పొరేట్ సంస్థలు (కార్బన్ ఉద్గారాలు అధిక భాగం వాటివల్లే) శిలాజ ఇంధ నాల కోసం డ్రిల్లింగ్, బర్నింగ్ కొనసాగిస్తున్నాయి. శిలాజ ఇంధన వ్యవస్థ ద్వార లాభాలు పొందుతున్న సంస్థలు, వర్గాలు తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి పుడమి భవిష్యత్తును పణంగా పెడుతున్నాయి. ఈ సంవత్సరం పుడమి దినోత్సవ సందర్భంలో సుస్థిర భవి ష్యత్తు కొరకు పెట్టుబడులు పెంచాలని నినాదం ఇచ్చారు. ప్రధాన మైన మూల పరిష్కారాలు మూడున్నాయి. అన్ని దేశాలు అనుసరిం చాల్సిన మార్గాలు ఇవి. శిలాజ వనరులను భూమిలోనే ఉంచాలి. శిలాజ ఇంధనాలలో బొగ్గు, చమురు, సహజ వాయువు ఉన్నాయి. వీటిని వెలికితీసి కాల్చినకొద్దీ, పర్యావరణం మీద, పంచ భూతాల మీద దుష్ప్రభావం పెరుగుతున్నది. అన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా శిలాజ ఇంధనాల నుండి ప్రత్యా మ్నాయ ఇంధనాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. పునరుత్పా దక శక్తిలో పెట్టుబడులు కూడా వేగంగా పెంచాలి. ప్రధాన ఇంధన వనరులను పరిశుభ్రమైన, పునరుత్పాదక శక్తిగా మార్చడం శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఆపడానికి ఉత్తమ మార్గం. వీటిలో సోలార్, విండ్, వేవ్, టైడల్, జియోథర్మల్ పవర్ వంటి వనరులు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ఈ మార్గాల ద్వారా చేసుకోవడం ఉత్తమమైన పరిష్కారం. పెట్రోల్, డీజిల్ వాహనాలు, విమానాలు, ఓడలు శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తాయి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం, విమాన ప్రయాణాన్ని తగ్గించడం వలన వాయు కాలుష్యం తగ్గుతుంది. సుస్థిర రవాణా వ్యవస్థకు మారడం చాలా అవసరం. రాజకీయ నాయకులు, పార్టీలు ఈ దిశగా ఆలోచన చేసే విధంగా పర్యావరణ స్పృహ పెంచుకున్న ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. ఎన్నికల వేళ పునరుత్పాదక శక్తి వనరుల మీద విధానాల మార్పునకై కృషి చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసే విధంగా ప్రజలు వ్యవహరించాలి. వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డై ఆక్సైడ్‌ను సహజంగా గ్రహించే వ్యవస్థలలో కీలకమైనవి రెండు: దట్టమైన అడవులు, సము ద్రాలు. అడవుల నరికివేతను పూర్తిగా నిషేధించాలి. పచ్చదనాన్ని కాపాడితే, కాలుష్య ఉద్గారాలను ప్రకృతి పరిమితిలో ఉంచే అవకాశం ఏర్పడుతుంది. వాతావరణ మార్పుల వ్యతిరేక పోరాటంలో దట్టమైన అడవులు కీలకం. వాటిని రక్షించడం ఒక ముఖ్యమైన వాతావరణ పరి ష్కారం. 30 నుంచి 100 ఏళ్ళ పైన వయసు గల చెట్లు చాలా ముఖ్యం. పెరుగుతున్న భూతాపం నేపథ్యంలో సముద్ర జీవావరణ వ్యవస్థలను రక్షించాల్సిన బాధ్యత పుడమి వాసుల మీద ఉన్నది. సముద్రాలు వాతావరణం నుండి పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తాయి. సముద్రాల జీవావరణ వ్యవస్థ వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను తగ్గించే ఏకైక అతిపెద్ద పెట్టుబడి అవసరం లేని సహజ వ్యవస్థ. ఈ ప్రక్రియ పుడమి వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. సముద్రాలలో ఉన్న జీవావరణ వ్యవస్థల మీద భూతాపం ప్రభావం కూడా ఉంటుంది. సముద్రాలు వేడెక్కడం వలన అందులోని కోట్లాది జీవాలు అతలాకుతలం అయ్యి, అంతరించే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూ సీఓపీ 26లో ఈ వ్యవస్థ సంరక్షణ మీద చర్చ కూడా చేపట్టలేదు. పారిశ్రామికీకరణ, భూతాపాల మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్ర వేత్తలు చాలా కాలంగా ప్రస్తావిస్తున్నారు. విధానకర్తలు, పెట్టుబడి దారులు, కంపెనీలు డీకార్బనైజేషన్ మార్గంలో వెళ్ళడానికి కలిసి కట్టుగా పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవాలి. నూతన పారిశ్రామిక విప్లవం పర్యావరణహితంగా ఉండాలంటే, వనరుల దోపిడీతో కూడిన ప్రస్తుత పారిశ్రామిక ఉత్పత్తి మారాలి. అటువంటి మార్పు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న సాంప్రదాయ వస్తూత్పత్తి వ్యవస్థల ద్వారా సాధ్యం అవుతుంది. చేనేత వస్త్రోత్పత్తికి ఊతం ఇవ్వడం ద్వారా పర్యావరణం మీద దుష్ప్రభావం గణనీయంగా తగ్గ డంతో పాటు ఉపాధి కూడా పెరుగుతుంది. సహజ నూలు ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తే ఆధునిక జౌళి పరిశ్రమ వల్ల పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలను సులభంగా తగ్గించవచ్చు. విని మయ జీవన శైలిలో తీవ్ర మార్పులు రావాలి. పరిశ్రమల ఉత్పత్తులను సమీక్షించి కాలుష్యాన్ని పెంచే వస్తువుల ఉత్పత్తిని తగ్గించడం లేదా పూర్తిగా మానివేయడం ద్వారా నిరంతర కార్బన్ కాలుష్యం తగ్గించ వచ్చు. పుడమి సుస్థిరతకు చేపట్టవలసిన చర్యలు ధనిక దేశాలు, ధనిక వర్గాలు మొదలు పెట్టాలి. సుస్థిర మార్పు దిశగా చేయాల్సిన కార్యక్రమాలకు అత్యవసరమైన త్యాగాలు వాళ్ళు చెయ్యాలి. నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కూడా వారి మీదనే ఉంది. కాలుష్య ఉద్గారాల వల్ల, భూతాపం పెరగడం వల్ల జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా పేద వర్గాల పైననే ఉంటున్నది. ఆహారం దొరకని అభాగ్యుల సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి, పుడమిని కాపాడు కోవడానికి అందరూ నడుం బిగించాలి. భూతాపం వల్ల ఏర్పడుతున్న సామాజిక ఆర్థిక సమస్యల పట్ల, వాటి పరిష్కారాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. పర్యావరణ పరిరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు, జీవ వైవిధ్య విస్తృతికి, ఆహార భద్రతకు, సహజ వనరుల ఉపయోగంలో సమన్యాయానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అమలు చేసే దిశగా పరిణతి కలిగిన ప్రజలు ఈ పుడమి దినోత్సవ సందర్భంగా ముందుకు కదులుతారని ఆశిద్దాం. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ,వ్యాసకర్త విధాన విశ్లేషకులు (నేడు ధరిత్రీ దినోత్సవం) -
కబళించనున్న వాయుకాలుష్యం
మన దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిన వాయు కాలుష్యంతో మరణించిన వారి సంఖ్య గత రెండు దశాబ్దాలలో రెండున్నర రెట్లు పెరిగింది. ఏటా ఈ వాయు కాలుష్యానికి 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా లెక్కలు చెబుతున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2019లో ప్రపంచ వ్యాప్తంగా సంభ వించిన వాయుకాలుష్య మరణాలలో మన దేశంలోనే 25 శాతానికి పైగా నమోదయ్యాయని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ తాజా నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం ఒక్క 2019 లోనే ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం కాటుకు 66.7 లక్షల మంది బలయ్యారని తెలుస్తోంది. ఇందులో 16 లక్షల మరణాలు భారత్‌లోనే నమోదయ్యాయట. వాయు కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచంలో పుట్టిన నెలలోపే ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 4.76 లక్షలు కాగా, మన దేశంలో అది 1.16 లక్షలుగా నమోదయింది. ప్రపంచంలో 99 శాతం మంది ప్రజలు పీలుస్తోంది కలుషిత గాలేనని డబ్లు్యహెచ్‌ఓ కుండ బద్దలు కొడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతున్న కర్బన ఉద్గారాల విడుదల రానున్న కాలంలో మరింత పెరిగితే ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పుల ముప్పు బారిన పడతాయని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది. మానవ కల్పిత వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలన్నింటిపైనా తీవ్ర విపరిణామాలు చూపుతున్నాయని ఐపీసీసీ కమిటీ ఛైర్మన్ హో సెంగ్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులకు బడుగు బలహీన వర్గాల ప్రజలు, వారికి సంబంధించిన మౌలిక వసతుల వ్యవస్థలు దెబ్బ తింటున్నాయని ఆయన వ్యాఖ్యా నించారు. ఈ మానవకల్పిత వాతావరణ మార్పులకు మన దేశంలో లక్నో, పట్నా నగరాలు ప్రధానంగా గురవు తున్నా... అనేక ఇతర నగరాలూ ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. దీనికి తోడు గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి కారణంగా ఒకసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వినియోగం పెరిగి కాలుష్యం మరింత పెరిగిపోయింది. కర్బన ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ శతాబ్ది చివరి నాటికి వాతావరణ ఉష్ణోగ్రతలు ప్రపంచ వ్యాప్తంగా 30 డిగ్రీలకు పైగా పెరిగే ప్రమాదం వుందని ఐపీసీసీ ఛైర్మన్ హెచ్చరిస్తున్నారు. రానున్న కాలంలో వాతావరణ మార్పుల బాధితులను ఆదుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. వాతావరణ మార్పుల బాధితు లను ఆదుకునేందుకు ఇప్పటికే జాతీయ స్థాయి నిధినీ, ‘విపత్తు నివారణ మౌలిక వసతుల వ్యవస్థ’నూ ఏర్పాటు చేశామనీ, 2030 నాటికి మన విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు దేశం శిలాజ ఇంధనాల వినియోగాన్ని 30 శాతానికి తగ్గించుకునేందుకు 2015 నాటి పారిస్ ఒప్పందంలో అంగీకరించిందనీ ప్రభుత్వం గుర్తు చేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటి మీదకు రావల్సిన అవసరం వుంది. మన దేశంలో పర్యావరణ మండలి వంటి వ్యవస్థ ఏర్పాటు చేయవలసి ఉంది. దీన్ని ఏర్పాటు చేస్తే 2070 నాటికి పర్యావరణ పరిరక్షణకు అవసరమైన కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట వేయా లన్న లక్ష్యసాధనకు చేరుకోవచ్చు. (చదవండి: ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!) నవీన నాగరికతకు అనుగుణంగా పెరుగుతున్న మన ఇంధన అవసరాలను తీర్చుకునే క్రమంలోనే వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగంతో వెలువ డుతున్న ఉద్గారాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచుకు చేరుస్తున్నాయి. ఈ ఉద్గారాలతో కేవలం ధరిత్రి మాత్రమే, కాదు ఇంధన విపణి కూడా ఉడికిపోతోంది. ఈ ధరల పెరుగుదలతో అయినా హరిత, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా మనం ప్రయాణిస్తామా అన్న సందేహం తలెత్తు తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం చమురు సరఫరాలకు విఘాతం కలిగిస్తోందని చెప్పక తప్పదు. దీనితోనయినా మనం స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలన్న ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవుతోంది. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) - కేవీ రమణమూర్తి సీనియర్ పాత్రికేయులు -
‘మంచు’కొస్తోందా..?
కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియాలో కమలా పండ్లు గడ్డకట్టిపోయేంత స్థాయిలో మంచు కురిసింది. అలాగే ఆఫ్రికాలోని సహారా ఎడారిపై మంచు దుప్పటిలా పరుచుకుంది. అసాధారణ రీతిలో కొన్నిచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఇంకొన్ని చోట్ల వెన్ను వణికించే స్థాయిలో చల్లదనం కనిపించాయి కూడా. ఇవన్నీ యాదృచ్ఛికం అనుకునేందుకు వీల్లేదంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్న సూర్యుడిపై జరిగే కార్యకలాపాలకూ వీటికి సంబంధం ఉందన్నది వీరి వాదన. సన్‌స్పాట్స్‌కు, మంచుకు లింకేంటి? సన్‌స్పాట్స్‌లో హెచ్చుతగ్గులకు.. భూమిపై మంచు పడేందుకు సంబంధం ఉంది. సన్‌స్పాట్స్ ఎక్కువ ఉన్నప్పుడు సూర్యుడిపై జరిగే పేలుళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటే సూర్యుడి నుంచి ఎగజిమ్మే ప్లాస్మా కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక ప్లాస్మాలోని కణాలు కాస్తా భూ అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా వాతావరణం పైపొరల్లో భారీస్థాయి మేఘాలు ఏర్పడతా యని అంచనా. సూర్యరశ్మి తగ్గిపోయేందుకు, అదే సమయంలో అధిక వర్షాలు/వరదలకూ ఇది కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్య రశ్మి తగ్గిపోతే భూ ఉష్ణోగ్రతలూ తగ్గిపోతాయి. ఎంత? ఎక్కడ? ఎలా? 1645 నాటి పరిస్థితులను తీసుకుంటే.. అప్పట్లో సూర్యుడి నుంచి వెలువడే శక్తి ప్రతి చదరపు మీటర్‌కు మూడు వాట్ల వరకూ తగ్గిందని లెక్క. ఈ చిన్న మార్పుకే బ్రిటన్ మొదలుకొని అనేక యూరోపియన్ దేశాలు మంచులో కూరుకుపోయాయి. నదులు గడ్డకట్టిపోయాయి. శీతాకాలం ఎక్కువ సమయం కొనసాగింది. సూర్యుడిపై సన్‌స్పాట్స్ వేగం పుంజుకోకపోతే ఈసారి కూడా భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ వరకూ పడిపోతుందని అంచనా. అదే జరిగితే భూ ఉత్తరార్ధ గోళంలో చాలాదేశాల్లో మంచు ప్రభావం చాలా ఎక్కువ అవుతుంది. ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాల్లోనూ మంచు కురవడం ఎక్కువ అవుతుంది. 2020 సెప్టెంబర్ తరువాత సన్‌స్పాట్స్ ఏర్పడటం కొంచెం ఎక్కువైనప్పటికీ.. 2023 నాటికి అది పతాకస్థాయికి చేరుకుని 2030 నాటికి కనిష్టానికి చేరతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే రేడియోధార్మికత రానున్న 30 ఏళ్లలో ఏడు శాతం వరకూ తక్కువ కావొచ్చని అంటున్నారు. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశమే లేదని అంటోంది. సన్‌స్పాట్స్ తగ్గినా.. దాని ప్రభావం కంటే కాలుష్యం కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఆరు రెట్లు ఎక్కువని చెబుతోంది. అంటే.. సూర్యుడిపై ఏర్పడే మచ్చలు వందేళ్లపాటు తక్కువగా ఉన్నా.. భూమి ఉష్ణోగ్రతలు మాత్రం పెద్దగా తగ్గవని అంటోంది. అంతా సూర్య భగవానుడి మహత్తు.. ► మినీ మంచుయుగం గురించి అర్థం చేసుకోవాలంటే సూర్యుడి గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయ స్కాంత శక్తి తీవ్రతల్లో తేడాల కారణంగా సూర్యుడిపై పెద్ద పెద్ద పరిమాణాల్లో మచ్చల్లాంటివి ఏర్పడుతుంటాయి. వీటి సంఖ్య కొన్నేళ్లు పెరుగుతూ.. ఇంకొన్నేళ్లు తగ్గుతూ ఉంటాయి. ఈ కాలాన్ని సోలార్ సైకిల్ అం టారు. 1912 నుంచి 24 సోలార్ సైకిల్స్ పూర్తి కాగా.. ఇప్పుడు 25వ సైకిల్ నడుస్తోంది. 2019లో వందేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువస్థాయిలో సన్‌స్పాట్స్ ఏర్పడగా ఆ తరువాతి ఏడాది పెరగడం మొదలవుతుందని శాస్త్రవేత్తలు లెక్కలేశారు. కానీ, 2020 సెప్టెంబర్ వరకూ ఈ సన్‌స్పాట్స్ పెరగలేదు. అప్పుడెప్పుడో 1645–1710 సంవత్సరాల మధ్య ఇలాగే సూర్యుడిపై అతి తక్కువ సన్‌స్పాట్స్ ఏర్పడ్డాయని.. మాండర్ మినిమం అని పిలిచే ఈ కాలంలోనే భూ ఉత్తరార్ధ గోళం మంచులో మునిగిపోయిందని చెబుతున్నారు. అందుకే ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉందన్న అంచనా ఏర్పడింది. -
పాలమూరు అన్నదాతలపై కాలుష్యం కాటు
-
సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?
సాక్షి, హైదరాబాద్: జీవో 111 ఎత్తివేస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పర్యావరణ వేత్తలు, నీటి వనరుల రంగ నిపుణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత సమీపాన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు ఉన్నాయని, నగరంతో ముడిపడిన జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్య ప్రాంతం మొత్తం కూడా ఈ జలాశయాల పరిధిలోనే ఉందని వారు చెబుతున్నారు. ఈ ప్రకృతి సహజసిద్ధమైన లక్షణం, నగరానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న పరిస్థితులు దెబ్బతింటే.. ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాతావరణంలో పెను మార్పులు సంభవించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. జలాశయాల ప్రాధాన్యత తగ్గించకూడదు ‘దేశంలో, బహుశా ప్రపంచంలో కరెంట్ లేకుండా నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మాత్రమే. అంటే సున్నా శాతం కర్బన ఉద్ఘారాలతో నీటిని సరఫరా చేసే ఇంతగొప్ప జలాశయాలను గొప్పగా చూపుకోవాలి. అంతేకానీ వాటి ప్రాధాన్యతను, విలువను తగ్గించకూడదు. 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తినప్పుడు వాటి నివారణకు నీటిపారుదల రంగ నిపుణుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వశ్వేరయ్య విభిన్న ఆలోచనలతో ముందుచూపుతో వీటికి డిజైన్ చేశారు..’అని సమీకృత నీటివనరుల నిర్వహణ నిపుణుడు, భారత ప్రమాణాల సంస్థ సాంకేతిక సభ్యుడు బీవీ సుబ్బారావు తెలిపారు. చదవండి: CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరాల వర్షం బీవీ సుబ్బారావు, పురుషోత్తంరెడ్డి ప్రస్తుతం పరిమితులు లేని పట్టణీకరణ పెనుసమస్యగా మారిందని, పట్టణీకరణలో కూడా సుస్థిరమైన నీటిసరఫరా అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ముఖ్యమని చెప్పారు. అభివృద్ధి అంటే కాంక్రీట్ బిల్డింగ్లు కట్టి అమ్మేయడం కాదన్నారు. హుస్సేన్‌సాగర్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ జంట జలాశయాల విషయంలో జరగకుండా చూసుకోవాలని సూచించారు. వాటి అవసరం తీరిపోయిందన్నట్టుగా మాట్లాడటం సరికాదన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని అంశాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచించారు. కోర్టుల ముందు నిలబడలేదు ‘భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూసీనదిపై ఈ రెండింటినీ నిర్మించారు. జీవో 111ను సుప్రీంకోర్టు గతంలో పూర్తిగా సమర్థించింది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ సమతుల్యాన్ని పాటిస్తూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అందువల్ల జీవో 111ను ఏమీ చేయలేరు. తమకు అధికారం ఉందని ఏదైనా చేసినా కోర్టుల ఎదుట ఎంతమాత్రం నిలబడదు. రియల్ ఎస్టేట్ లాబీకి, కార్పొరేట్ ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగితే ప్రజలు ఈ ప్రతిష్టాత్మక అంశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు..’అని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి హెచ్చరించారు. పర్యావరణాన్ని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని అన్నారు. అసలేంటి జీవో 111 హైదరాబాద్ నగరానికి వరద ముప్పు తప్పించడంతోపాటు తాగునీటిని అందించేందుకు నిజాం కాలంలో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి నీళ్లు తీసుకునేవారు. ఇప్పుడది తగ్గిపోయింది. ఎండా కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు నీళ్లు తీసుకునే సందర్భం ఉంది. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ రెండు జలాశయాల నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదు. సుమారు 1,32,600 ఎకరాల భూమి జీవో పరిధిలో ఉంది. 83 గ్రామాలు, ఏడు మండలాలు కలిసి ఉన్నాయి. ఈ రిజర్వాయర్ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. అయితే రిజర్వాయర్ల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ.. 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం పలు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇవీ నిబంధనలు జీఓ పరిధిలో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు మండలాల్లోని 83 గ్రామాలను చేర్చింది. ఈ జీవో పరిధిలో కాలుష్యకారకమైన ఫ్యాక్టరీలు, నిర్మాణాలు, లేఅవుట్లు, వెంచర్లు చేపట్టవద్దని నిబంధనలు పెట్టింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు. -
‘మూసీ’లా మారే ప్రమాదం
గంగానదితో సహా మనదేశంలో అనేక ముఖ్యనదులు, వాటి ఉపనదులు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా నదుల్లో కూడా కాలుష్యం బాగా పెరిగిపోయింది. గోదావరి నది వెంబడి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పారిశ్రామిక వ్యర్థాలను; వివిధ పట్టణ, నగరాల ‘సీవరేజ్’ను శుద్ధిచేయకుండా వదిలివేస్తుండటంతో దానిలో కాలుష్య స్థాయి ప్రమాద ఘంటికలను మ్రోగిస్తోంది. భద్రాచలం ఎగువన ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధిచేయకుండా నదిలోకి వదిలేస్తున్నాయి. భద్రాచలం పట్టణం నుండి వచ్చే మురుగు... ‘ఫిల్టరేషన్’ లేకుండానే గోదావరిలో కలుస్తోంది. ఐటీసీ పేపర్ బోర్డు పరిశ్రమ నుండి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరిలో కలిసిపోతోంది. అలాగే ఇతర పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వల్ల కూడా గోదావరి కాలుష్యం బారిన పడుతోంది. మూడు దశాబ్దాలకు ముందు 1991లో రూ. 34.19 కోట్లతో ‘గోదావరి నదీ కాలుష్య నివారణ పథకం’ ప్రయత్నం మొదలైనా... అలసత్వం వల్ల అది అమలుకు నోచుకోలేదు. కృష్ణానదిలో కాలుష్యం మరింత దారుణంగా ఉంది. గత దశాబ్ద కాలంలో కృష్ణానదిలో వివిధ రకాల కాలుష్యం రెట్టింపైనట్లు నిపుణులు చెపుతున్నారు. కృష్ణానదిలో ‘బయొలాజికల్ ఆక్సిజన్ డిమాండ్’ (బీఓడీ), ‘అల్కల్నిటీ’ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. దీని కారణంగా ‘ఆహార ప్రక్రియ పరిణామ క్రమం’లో తీవ్రమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల ప్రక్షాళనకు తగిన చర్యలు తీసుకోకపోతే మూసీ నదిలా మురుగు కాల్వల్లా ఇవీ మారిపోయే ప్రమాదం ఉందని గ్రహించి సత్వరమే కార్యాచరణకు పూనుకోవాలి. – డా. కొత్తపల్లిశ్రీనివాసవర్మ, జర్నలిస్టు మార్చి 14న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ -
కరోనాను మించి ముంచుతోంది!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండేళ్లుగా సృష్టిస్తున్న బీభత్సాన్ని చూస్తున్నాం. ఈ కోరల నుంచి మానవాళి ఇంకా బయటపడలేదు. దీంతో లక్షలాది మంది మృత్యువాతపడుతూనే ఉన్నారు. అయితే, దీనికి మించిన ముప్పు మరోటి ఉంది.. అదే కాలుష్యం. కరోనా భూతం కంటే ఎక్కువ మందిని పొట్టనపెట్టుకుంటోంది దీనిపై ఐక్యరాజ్యసమితి తాజాగా ఓ నివేదిక రూపొందించింది. అదేంటో చూద్దాం..! – సాక్షి, సెంట్రల్ డెస్క్ కాలుష్యంతో పర్యావరణంతోపాటు ప్రాణికోటికి పెనుముప్పు పొంచి ఉంది. కోవిడ్–19 కన్నా కాలుష్యంతో మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉందని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక చెప్పిందంటే దీని తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎరువులు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఏటా 90 లక్షల మంది అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారని చెప్పింది. కరోనా వచ్చిన మొదటి 18 నెలల కాలంలో చనిపోయినవారి సంఖ్యకు ఇది రెట్టింపు ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఇంత జరుగుతున్నా దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. కరోనా వల్ల రెండేళ్లలో దాదాపు 60 లక్షల మంది మరణించారు. స్వచ్ఛ పర్యావరణం మన హక్కు ‘కాలుష్యం, విషపూరితాల నియంత్రణకు మనం చేస్తున్న విధానాలు సరిగా లేవు. ఫలితంగా స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందాలన్న హక్కుకు పెద్ద ఎత్తున ఉల్లంఘన జరుగుతోంది. కాలుష్యకట్టడికి చట్టపరంగా ముందుకెళ్తేనే మంచి ఫలితాలు సాధించే అవకాశముంది’ అని ఐరాస ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ బోయిడ్ చెప్పారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన ఐక్యరాజ్యసమితి.. తక్షణమే విషపూరితరసాయనాలు నిషేధించాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది. స్వచ్ఛమైన పర్యావరణం మానవుల హక్కు అని స్పష్టంచేసింది. నాన్‌స్టిక్ పాత్రలతోకూడా... పాలీఫ్లోరోఆల్కైల్, పర్ఫ్లోరోఆల్కైల్తో తయారయ్యే నాన్‌స్టిక్ వంటపాత్రలతో ఆరోగ్యానికి ముప్పు అని ఐరాస పేర్కొంది. ఇవి కేన్సర్‌కు దారితీస్తాయని, ఇలాంటి వాటిని నిషేధించా ల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చిచెప్పింది. ఈ రసాయనాలను అంత సులభంగా అంతం చేయలేమంది. అందుకే వీటిని ‘చిరకాలం ఉండే రసాయనాలు’గా అభివర్ణించింది. అలాగే, పేరుకుపోయిన వ్యర్థాలతో ఆరోగ్యం దెబ్బతింటుందని, వ్యర్థాలున్న ప్రాంతాలను శుభ్రం చేయాలని చెప్పింది. లేకపోతే ఆయా ప్రాంతాల్లో నివసించేవారిపై తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని, అందువల్ల వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించింది. పర్యావరణ మప్పు అనేది ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ అని ఐరాస హక్కుల అధినేత మైకేల్ బాచ్లెట్ చెప్పారు. -
నయీ సోచ్
కాలంతోపాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పటిలా సమాజాభివృద్ధికి జీవితాలను అంకితం చేసేవారు కనుమరుగైతే, కనీసం ఆ దిశగా ఆలోచించేవారు వారు సైతం క్రమంగా తగ్గిపోతున్నారు. ‘‘నేను, నా వాళ్లు, నా కుటుంబం’’ అంటూ స్వార్థంగా మారిపోతున్న ఈ రోజుల్లో కాలుష్యంతో పాడైపోతున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రీతూ సింగ్. డ్రెస్‌లు తయారయ్యాక వృథాగా పోతున్న బట్ట ముక్కలతో సరికొత్త డ్రెస్‌లు రూపొందించి వాటిని నిరుపేద పిల్లలకు ఉచితంగా పంచుతోంది. పంజాబ్‌కు చెందిన రీతూ సింగ్ ఎమ్బీఏ పూర్తయ్యాక ఏడాదిపాటు ఫ్యాషన్ రంగంలో పనిచేసింది. ఆ తర్వాత తనకు సామాజిక సేవచేయాలన్న ఆలోచన వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో.. ఓ రోజు రీతూ తన కుమార్తెని స్కూల్ బస్ ఎక్కించడానికి బస్‌స్టాప్‌లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఓ టైలర్, బట్టలు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ ముక్కలను దగ్గరలో ఉన్న చెత్త కుండీలో పడవేయడం చూసింది. అది చూసిన రీతూ ‘‘రోజూ ఇన్ని ముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది’’ అని అనుకుని, వృథాగా పోతున్న ఆ బట్ట ముక్కలకు చక్కటి పరిష్కారం చూపాలనుకుంది. ఏడాది పాటు ఫ్యాషన్ రంగంలో అనుభవం ఉన్న రీతూకు ..‘‘ఈ బట్టముక్క లన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది’’ అన్న ఆలోచన వచ్చింది. వెంటనే బొటిక్‌లు, టైలర్ల దగ్గర నుంచి ముక్కలను సేకరించి వాటిని పిల్లలు వేసుకునే విధంగా డ్రెస్‌లు రూపొందించింది. అలా కుట్టిన డ్రెస్‌లను నిరుపేద పిల్లలకు ఇవ్వడంతో వారు వాటిని ధరించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో రీతూకు మరింత ఉత్సాహం వచ్చింది. మరిన్ని గుడ్డ ముక్కలను సేకరించి ఎక్కువమొత్తంలో డ్రెస్‌ల రూపకల్పన చేయసాగింది. ఇలా గత నాలుగేళ్లుగా రీతు వేస్ట్ పీసెస్‌తో కుట్టిన డ్రెస్‌లను చాలామందికి పంచిపెట్టింది. డ్రెస్‌లతోపాటు బ్యాగులు, జాకెట్లు, నిత్యావసర వస్తువులను వేసుకోగల సంచులను కూడా తయారు చేస్తోంది. నయీ సోచ్‌తో అవగాహన మురికి వాడల్లో నివసిస్తోన్న నిరుపేద పిల్లలకేగాక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లోని పెద్దలు, పిల్లలకు సైతం డ్రెస్‌లు కుట్టి ఇస్తోంది రీతు. స్కూలుకెళ్లే విద్యార్థులు వేసుకోగలిగిన స్టైలిష్ డ్రెస్‌లను రూపొందించి యాభైకి పైగా మురికివాడల్లో పంచింది. తన కార్యక్రమానికి వస్తోన్న స్పందనకు సోషల్ మీడియాలో ‘నయీ సోచ్’ పేరిట పేజ్ క్రియేట్ చేసి అవగాహన కల్పిస్తోంది. ఈ పేజీ ఫాలో అయ్యేవారు చాలా మంది తమకు తెలిసిన బొటిక్స్, టైలర్స్, బట్టల తయారీ యూనిట్ల నుంచి మిగిలిపోయిన బట్ట ముక్కలను సేకరించి తీసుకొచ్చి ఇస్తున్నారు. స్కూళ్లకు వెళ్లి వస్త్ర పరిశ్రమల ద్వారా కాలుష్యం ఎలా ఏర్పడుతుందో వివరించి, పర్యావరణంపై పిల్లల్లో అవగాహన కల్పిస్తోంది. నలుగురు మహిళలను తన పనిలో చేర్చుకుని వారికి ఉపాధి కల్పిస్తో్తంది. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకు రీతూ ఉదాహరణగా నిలుస్తోంది. సమాజాభివృద్ధికి సేవచేసే శక్తి, స్థోమతలు నాకు లేవు అని చేతులు దులుపుకోకుండా, తనకున్న నైపుణ్యంతో గుడ్డముక్కలను చక్కని డ్రెస్‌లుగా తీర్చిదిద్ది ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది రీతు. రోజూ ఇన్ని బట్టముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది. ఈ బట్టముక్కలన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది అన్న ఆలోచన నుంచి పుట్టిందే నయీ సోచ్. -
ఓజోన్ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిత్యం రోడ్డెక్కుతున్న లక్షలాది వాహనాల పొగ కారణంగా భూస్థాయి ఓజోన్ మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే సమయాల్లో.. ప్రధానంగా ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పరిస్థితి అధికంగా ఉన్నట్లు పీసీబీ తాజా అధ్యయనంలో తేలింది. ఈ పరిణామంతో నగరవాసులు అస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊపిరాడక సతమతం.. వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలతో పాటు ఓజోన్ వాయువులు.. గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలియడంతో పాటు సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 120 నుంచి 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతుండడం గమనార్హం. ఓజోన్‌తో నష్టాలివే.. ♦శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. చికాకు, అసహనం, శ్వా స తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. తలనొప్పి, పార్శ్వపు నొప్పి హేతువవుతోంది.మోతా దు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ♦ ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, అస్త మా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాయుకాలుష్యమే. ఉపశమనం ఇలా.. ♦ ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్లు ధరించాలి. కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యం, భూస్థాయి ఓజోన్‌తో కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ♦ కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. గ్రేటర్ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ప్రతి వాహనానికీ ఏటా పొల్యూషన్ చెక్ పరీక్షలను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించాలి. ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి.