
యమునాలో ‘విషం’ ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ: హరియాణాలోని అధికార భాజపా యమునా నదిలోకి విషయం కలిపేందుకు ప్రయత్నించిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ‘‘తప్పుడు ఆరోపణలు చేస్తే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. విషం కలిపడానికి ప్రయత్నించారు మీరు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే అన్ని ఆధారాలను జనవరి 29వ తేదీ రాత్రి 8 గంటలలోపు మాకు సమరి్పంచండి. విషం కలుపుతుంటే అడ్డుకున్న ఢిల్లీ జల్ బోర్డ్ ఇంజనీర్ల వివరాలూ ఇవ్వండి’’ అని కేజ్రీవాల్‌కు ఈసీ మంగళవారం ఒక లేఖ రాసింది. హరియాణా నుంచి దిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదీ ప్రవాహంలో అమ్మోనియా స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించడం తెల్సిందే.
పొరుగు రాష్ట్రాలకు తాకిన కాలుష్య కాటు
యమునా కాలుష్య అంశం ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాలుష్యానికి హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన కారణమని, పారిశ్రామిక వ్యర్ధాలను యమునా కలిపి ఢిల్లీలోకి విషాన్ని పంపుతున్నారంటూ కేజ్రీవాల్ రెండ్రోజుల కిందట తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదో రకంగా జీవజల యుద్ధం, వాటర్ టెర్రరిజం అంటూ హరియాణా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ సీఎం ఆతిశీ సైతం హరియాణా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న నదీ జలాల్లో వ్యర్థాలు, అమ్మోనియా స్థాయిలో చాలా ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి ఆమె బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదుచేశారు. హరియాణా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా ప్రమాదంలో పడిందని ఆరోపించారు. మునాక్ కాలువ నుంచి అదనపు జలాలను విడుదలచేయాలని మాన్ డిమాండ్‌చేశారు.
దీనిపై హరియాణా సీఎం నయాబ్ సింగ్ షైనీ సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఎగువ రాష్ట్రాలతో సత్సంబంధాలు క్షీణించేలా, ఢిల్లీ ప్రజలను అనవసరంగా భయపెట్టేలా కేజ్రీవాల్ ఆరోపణ చేశారు. వీటిపై లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకోవాలి’’అని ఆయన డిమాండ్‌చేశారు. ఓటమి భయం కేజ్రీవాల్‌ను నిస్సహాయంగా మార్చిందని, ఢిల్లీ ప్రజలను భయపెట్టి ఓట్ల లబ్ధి పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. బీజేపీ, ఆప్ పారీ్టలు తాము అధికారంలోకి వస్తే యమునా కాలుష్యాన్ని అరికట్టి పునరుజ్జీవం చేస్తామని తమతమ మేనిఫెస్టోల్లో ప్రకటించడంతో ఈ అంశం ఇప్పుడు ఎన్నికల హామీల్లో ప్రధానమైనదిగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment