Delhi election
-
1996 ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? స్వతంత్రులకు పరాభవమేనా?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలపైనే నిలిచింది. 1996 ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. అది ప్రతీ ఎన్నికల్లోనూ చర్చకు వస్తుంటుంది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిసారీ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కొన్ని ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 500 దాటగా, కొన్నిసార్లు రెండు అంకెలకే పరిమితమైంది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు లోక్‌సభ స్థానాలున్నప్పుడు కేవలం 19 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు.1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 523 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 358 మంది స్వతంత్రులు కావడం విశేషం. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 168 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1984 ఎన్నికల్లో 189 మంది, 1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఎప్పుడూ ప్రధాన పార్టీల అభ్యర్థులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా గెలవకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 17 మంది అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఏడుగురు విజేతలు, ఏడుగురు ప్రత్యర్థి అభ్యర్థులు మినహా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. -
హామీల వలలో ఓటరు ఎటు ?
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం వేరు, ఇచ్చిన హామీలు వేరు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు తటస్థ ఓటర్లను ఆకర్షించడానికి ప్రచారాంశాలు దోహద పడతాయి. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే ఎప్పుడైనా అత్యంత కీలకం. ప్రచారంలో జాతీయ భావాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ మేనిఫెస్టో దగ్గరకి వచ్చేసరికి స్థానిక అంశాలకే పెద్ద పీట వేసింది. ప్రచార పర్వంలో వెనుకబడ్డ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో యువత, మైనార్టీ ఓట్లపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆప్ గురువారం మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ చాలా రోజుల కిందటే ఇచ్చిన గ్యారంటీ కార్డులతో పాటుగా దేశభక్తి అంశాన్ని చేర్చింది. బీజేపీ: ప్రచారంలో జాతీయ భావం ఎజెండాగా తీసుకొని మాటల తూటాలు పేలుస్తున్న బీజేపీ మేనిఫెస్టోలో స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం పాటిస్తూ తూర్పు ఢిల్లీలో వలస కార్మికులు నివసిస్తున్న కాలనీల అభివృద్ధికి డెవలప్మెంట్ బోర్డు, ట్యాంకర్లపై ఆధారపడకుండా ఇంటింటికీ రక్షిత మంచినీరు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 కోట్లు కేటాయింపు, నిరుపేదలకు రూ.2 కే కిలో గోధుమ పిండి, ఆడపిల్ల పుడితే రూ. 2 లక్షల రూపాయలు, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి హామీలు ఇచ్చింది. కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రచారంలోనూ, హామీలివ్వడంలో కూడా బీజేపీ, ఆప్ కంటే వెనుకబడింది. మైనార్టీల ఓటర్లనే అత్యధికంగా నమ్ముకున్న ఆ పార్టీ తాము అధికారంలోకి వస్తే సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. యువ స్వాభిమాన్ యోజనకింద నిరుద్యోగులకు రూ.5 వేల నుంచి రూ.7,500 వరకు భృతి ఇస్తామని తన మేనిఫెస్టోలో వెల్లడించింది. అంతేకాకుండా యువత స్టార్టప్‌లు ప్రారంభించడం కోసం రూ.5 వేల కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. నెలకి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనుంది. ఇక ఢిల్లీ వార్షిక బడ్జెట్లో కాలుష్య నివారణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. ఆప్: యువత, మహిళా సాధికారత దిశగా ఆప్ ముందుకు వెళుతోంది. హిందూ ఓట్లు చేజారినా కష్టమేనని భావించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలపై చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. హిందూత్వపై కాస్త సానుకూలంగానే ఉంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్యే మార్గంగా అడుగులు వేస్తున్నారు. ఇది మేనిఫెస్టోలో ప్రతిఫలించేలా చర్యలు తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఢిల్లీ స్కూళ్లలో దేశభక్తికి సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెడతామన్నారు. తనని అధికార అందలం ఎక్కిస్తాయనుకున్న ఉచిత పథకాల్ని కొనసాగిస్తానంటూ ఇప్పటికే 28 పాయింట్ల గ్యారంటీ కార్డులు ఇచ్చారు. నాణ్యమైన విద్య, నెలకి 200 యూనిట్ల ఉచిత కరెంట్, నెలకి 20 కిలోలీటర్ల ఉచిత నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటి వద్దకే రేషన్, 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్ర, పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణిస్తే కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం వంటి హామీలకే మేనిఫెస్టోలో ప్రధానంగా చోటు కల్పించారు. 24 గంటలు మార్కెట్లను తెరిచి ఉంచడాన్ని ప్రయోగాత్మకంగా చేపడతామని కూడా ఆప్ హామీ ఇచ్చింది. -
ఢిల్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్‌సభ సీట్లకు జరుగుతున్న ఎన్నికలను ప్రభావితం చేసే ఓ అంశం నేడు ప్రచారాస్త్రమైంది. అక్రమ వాణిజ్య సంస్థలు, దుకాణాలను మూసువేయడం కోసం కొనసాగుతున్న ‘స్పెషల్ డ్రైవ్’ అది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మొదటి డ్రైవ్ 2006లోనే ప్రారంభంకాగా, తాజా డ్రైవ్ 2017, డిసెంబర్ నెలలో ప్రారంభమైంది. దీని క్రింద 2019, జనవరి 31వ తేదీ నాటికి ఢిల్లీ నగరంలో 10,533 షాపులను మూసివేశారు. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ సీలింగ్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ మూడు పాలక మండళ్లలోను బీజేపీయే అధికారంలో ఉంది. ఈ దుకాణాదారులంతా సంప్రదాయంగా బీజేపీ విధేయులు. ఇప్పుడు వారంతా బీజేపీ ఆగ్రహంతో రగిలిపోతున్నారని, వారు ఈసారి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయక పోవచ్చని బీజేపీలోని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీలింగ్‌కు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులంతా రోడ్డెక్కి ఆందోళన చేయడంతో స్థానిక బీజేపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. వ్యాపారుల సమస్యకు సామరస్య పరిష్కారాన్ని వెతకాలంటూ ఓ వర్గం వ్యాపారుల పక్షం వహిస్తోంది. ఏదేమైనా ఈ సమస్య ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మీదకు నెట్టివేసేందుకు ఇరువర్గాలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి. ఢిల్లీ మాస్టర్ ప్లాన్‌ను అధికారంలోని ఆప్ ప్రభుత్వం మార్చిందని, అలా మార్చకపోయి ఉన్నట్లయితే నేడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేశ్ భాటియా వాదిస్తున్నారు. మరోపక్క అరవింద్ కేజ్రివాల్ వివిధ వ్యాపార వర్గాల నాయకులతో ఇప్పటికే పలు విడతలుగా చర్చలు జరిపారు. రాష్ట్ర హోదాకు వారి సమస్యలకు లింకు పెట్టారు. రాష్ట్ర హోదా వచ్చినట్లయితే వ్యాపారం మరింత విస్తరిస్తోందంటూ వారికి ఆశ చూపిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వచ్చినట్లయితే పది రోజుల్లో మూసివేసిన షాపులను తెరిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఏదేమైనా వ్యాపారుల సమస్యే నేడు హాట్ ఠాపిక్‌గా మారింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12వ తేదీన పోలింగ్ జరుగుతోంది. -
నేను కిరణ్ పెషావారియా
ఆడపిల్లలు నడుముకు వడ్డాణం వెతుక్కుంటున్న రోజుల్లో ఆమె బెల్ట్ కట్టుకుంది. పాదాలకు పట్టీలతో మురిసిపోతున్నప్పుడు ఆమె పోలీసు బూట్లు తొడుక్కుంది. లావణ్యమైన చేతులు కరుకైన లాఠీని ఝళిపించాయి. అందమైన కళ్లు నేరస్తులపై నిప్పులు చిమ్మించాయి. మీసాలు అక్కర్లేదు.భారతదేశ స్త్రీకి ఉండే దమ్ము ఏమిటో ఆమే చూపింది. అవును ఆమే కిరణ్ బేడీ. అమృత్సర్ స్వర్ణాలయ శిఖరంపై విరిసిన వెలుగు కిరణం.ఖాకీ దుస్తులు నేర్చిన కొత్త సంస్కారం. విధి నిర్వహణకి కొండగుర్తు. నిబద్ధతకు దిక్సూచీ. ఈ రోజుల్లో ఆడవాళ్లు పెళ్లి తర్వాత ఇంటిపేరును మార్చుకోవడాన్ని ఇష్టపడట్లేదు. కిరణ్ పెషావారియాగా ఉన్న మీరు కిరణ్ బేడీగా మారడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను కిరణ్ పెషావారియానే. పెషావారియా అనే సంతకం పెడతాను. నా తాజాపుస్తకంలో కూడా అదే సంతకం ఉంది. మధ్యలో కొద్దికాలం మాత్రమే నా పుట్టింటిపేరు మిస్సయిపోయింది. మహిళలు వారి గుర్తింపును ఎప్పటికీ వదులుకోకూడదు. మీరు దైవాన్ని, విధిని నమ్ముతారా? నేను మంచి కర్మని, మంచి ఉద్దేశాన్ని, ఎక్కువమందికి మేలు చేయడాన్ని నమ్ముతాను. ఒక మహత్తర ప్రయాణం ఢిల్లీ ఎన్నికలతో ఆగిపోయిందనుకుంటున్నారా? ఇకపై మీ ప్రణాళిక ఏంటి? నేను రాజకీయ జగత్తుకు చెందిన దాన్ని ఎప్పుడూ కాదు. ఎలక్షన్లలో పోరాడటానికి కారణం నేను చేయాలనుకున్న సామాజిక సేవా పరిధిని విస్తరించుకోవడానికి మాత్రమే. ముందూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఇకముందూ అదే చేస్తాను. ఈ ప్రయాణానికి బ్రేక్ ఉండదు. ఎలక్షన్ కేవలం అదనపు ప్రక్రియ మాత్రమే. మీ భర్త బ్రిజ్ మీ ఓటమితో బాధపడుతున్నారా? లేదు. అస్సల్లేదు. నా విషయాల్లో తనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. నా ప్రతి నిర్ణయాన్నీ గౌరవించారు. మీ అమ్మాయి సైనాకి వాళ్ల అమ్మ సమయం ఇప్పుడయినా దొరుకుతుందా? సైనా ఇప్పుడు ఎనిమిదేళ్ల బిడ్డకు తల్లి. చాలా బిజీగా ఉంటుంది.ఇప్పుడు తనే వాళ్ల అమ్మకు సమయం ఇవ్వాలి. మీరు చూసిన పురుషాధిక్యత ఇప్పుడు లేనట్లనిపిస్తోందా? పరివర్తన వచ్చిందంటారా? ఇది ఒక పురుష ప్రపంచం అని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, కీలక నిర్ణయం తీసుకునే అధికారం ఇంకా పురుషుల గుప్పిట్లోనే ఉంది. పురుషుల గుప్పిట నుండి మహిళల చేతుల్లోకి కండబలం, ధనబలం, ఎక్కడికైనా వెళ్లగలిగే స్వేచ్ఛ... అనే మూడు శక్తులు ఇప్పటికీ రాలేదు. ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు? సాత్వికమైన ఆహారాన్నే తింటాను. కేలరీస్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. పోషకాలే కాదు, విలువలున్న ఆహారాన్నే ఇష్టపడతాను.మీ భర్తకు రోజుకు ఐదు ప్రేమ లేఖలు రాసేవారు. ఆ ప్రేమ ఇంకా అలాగే ఉందా? వయసు పెరిగితే కుదురు కూడా పెరుగుతుంది కదా! సాక్షి పాఠకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్లీ కలుద్దాం..! ప్రకాశ్‌లాల్ పెషావారియా, ప్రేమ్లతల నలుగురు కూతుళ్లలో ఒక కూతురు కిరణ్. తండ్రి ఆమెను గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి చేయాలనుకున్నాడు. అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ టైటిల్‌ను కిరణ్ బేడీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో, ఆంధ్రా యూనివర్సిటీలోనే గెలుచుకున్నారు. (1968) జాతీయ స్థాయి ఆసియా స్థాయి పోటీలలో కిరణ్ 22 ఏళ్ల వయసుకు ఆ ఆటలో చాంపియన్ షిప్ సాధించినా ఇంతటితోనే ఆగిపోవడంలో విశేషం ఏమీ లేదనుకుంది. ఒక మహిళగా దేశ మహిళలకు ఆదర్శం కావాలి... ఒక యువతిగా దేశ యువతకు స్ఫూర్తినివ్వాలి... అవే ఆలోచనలు. ఐ.ఏ.ఎస్ నుంచి.... దేశ సేవ చేయాలంటే ఏం చేయాలి? ఐఏఎస్ ఒక ఉన్నతమార్గం. ఇంగ్లిష్ సాహిత్యంతో బీఏ చేసి, తరువాత ఎంఏ రాజనీతి శాస్త్రం చదివి తను పుట్టి పెరిగిన అమృత్‌సర్‌నే కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న కిరణ్ తన దృష్టినంతా సివిల్ సర్వీసెస్ మీదే పెట్టారు. ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకున్నారు. పరీక్షలు రాస్తే ఫలితాలు వచ్చాయి. ఆమె వెంటనే తన కళాశాలలో పని చేసే తోటి అధ్యాపకుడైన బ్రిజ్ బేడీకి ఫోన్ చేసి తన పేరు ఐఏఎస్‌ల జాబితాలో లేదని, ఐపీఎస్ వచ్చిందని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. రాని దాని కోసం బాధపడకుండా వచ్చినదానిలోనే ఎందుకు విజయం సాధించకూడదు అంటూ బ్రిజ్ ఆమెను సాంత్వన పరిచారు. కానీ కిరణ్ తల్లిదండ్రులు మహిళలకు స్థానంలేని పోలీస్ శాఖలో కూతురు చేరడానికి ఇష్టపడలేదు. అయినా బ్రిజ్ ప్రోద్బలంతో పోలీస్ శాఖలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్రిజ్నే వివాహం చేసుకున్నారు. అలా కిరణ్ పెషావారియా కిరణ్ బేడీ అయ్యారు. పెళ్లయిన రెండు మాసాలకే ట్రైనింగ్‌లో చేరాలని కిరణ్‌కి ఆదేశాలు వచ్చాయి. మొదటి పోస్టింగ్ ఢిల్లీలో. అప్పటికి బ్రిజ్ అమృత్‌సర్‌లో ఒక పరిశ్రమను స్థాపించుకున్నాడు. భార్యను ఆపలేదు. 520 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఢిల్లీకి ప్రతి వారాంతంలో వెళుతూ ఉండేవారు. ప్రతి బాధ్యత ఒక సవాలు 1972లో పోలీస్ సర్వీస్‌లో చేరిన నాటి నుంచి 2007లో ‘వ్యక్తిగత కారణాల’తో ఉద్యోగానికి రాజీనామా చేసే వరకు కిరణ్ నిత్యం సంఘర్షణ పడ్డారు. కానీ రాజీ పడలేదు. తలొంచలేదు. ఆమె సామర్థ్యం ఎంత విశిష్టమైనదంటే విధి నిర్వహణలో ఎంత దూకుడుగా ఉన్నా ఏదో ప్రాధాన్యంలేని పోస్టుకు బదలీ చేసి, ఖాళీగా ఉంచడానికి ప్రభుత్వాలు సాహసించలేదు. ఢిల్లీ ట్రాఫిక్ కమిషనర్, మిజోరం డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్, నార్కోటిక్స్ (మత్తు పదార్థాలు) కంట్రోల్ బ్యూరో డెరైక్టర్ జనరల్, ఐక్య రాజ్యసమితి శాంతి స్థాపక శాఖకు పోలీస్ సలహాదారు వంటి పదవులను ఆమె నిర్వహించారు. ఆసియాలోనే అతి పెద్ద కారాగారం తిహార్ జైలు అధిపతిగా కూడా కిరణ్‌ను పంపించారు. అరాచకానికీ, అకృత్యాలకీ కేంద్రంగా పేరు మోసిన ఆ జైలును ‘ఆరు మాసాలలో ప్రశాంతమైన నిలయంగా మారుస్తాను’ అని ఆమె ప్రతిన పూని, దానిని నెరవేర్చారు. అడుగడుగునా సంచలనాలు... కిరణ్ బేడీ ఉద్యోగ జీవితంలో చవి చూసిన అనుభవాలు అసాధారణం. ఇవన్నీ ఆమె సంచలనం కోసం చేయలేదు. విధి నిర్వహణలో భాగంగానే చేశారని మరచిపోకూడదు. ఢిల్లీలో ఇందిర కారును పక్కకు లాగించి అందరి కన్నెర్రకు గురైన కిరణ్, గోవాలో కూడా ఇందిర కారణంగానే వివాదంలో చిక్కుకున్నారు. 1983 మార్చిలో కిరణ్ గోవాలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ జౌరీ నదిలో పడవల మీద అవతలి ఒడ్డుకు చేరేవారు. ఆ రద్దీని తట్టుకోవడానికే వంతెన కట్టారు. కానీ అది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇందిరాగాంధీ రావాలి. కానీ ఆమె రాక వాయిదా పడుతూనే వచ్చింది. ఒకరోజు కిరణ్ అటుగా పోతూ ఈ రద్దీని చూసి విషయం తెలుసుకుని ప్రారంభోత్సవం వరకు రాకపోకలు జరగకుండా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను స్వయంగా పక్కకు తప్పించి వాహనాలు, మనుషుల రాకపోకలకు అవకాశం కల్పించారు. సరిగ్గా అప్పుడే ఆమె ఏకైక కుమార్తె సైనా భరూచ్ ఆరోగ్యం క్షీణించింది. దీనితో కిరణ్ సెలవుకు దరఖాస్తు పెట్టి వెళ్లారు. అయితే ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేయలేదు. అయినా ఆమె ఢిల్లీ వెళ్లారు. దీనిని ఆసరా చేసుకుని నాటి ముఖ్యమంత్రి ప్రతాప్సింహ్ రానే ‘కిరణ్ బేడీ కనిపించడం లేదు’ అంటూ దుష్ర్పచారం మొదలుపెట్టారు. దీనితో మీడియా రానేను చీల్చి చెండాడింది. ఒక న్యాయవాది కేసులో ఆమెకు ఎదురైన మరో అనుభవం మరీ నాటకీయంగా ఉంటుంది. 1988 జనవరిలో సెయింట్ స్టీఫెన్ కళాశాల (ఢిల్లీ)లో చదువుకుంటున్న ఒక విద్యార్థిని పర్సును ఒక వ్యక్తి అపహరించాడు. వారం తరువాత మహిళలకు చెందిన ఒక మరుగుదొడ్డిలో అసభ్య రాతలు రాస్తూ దొరికాడు. ఇతడి పేరు రాజేశ్ అగ్నిహోత్రి అనీ, టీస్హాజరీ కోర్ట్స్ కాంప్లెక్స్‌లో న్యాయవాది అనీ తేలింది. అయితే బేడీ అతడిని అన్యాయంగా కేసులో ఇరికించారని న్యాయవాదులంతా గొడవ ప్రారంభించారు. అయితే బేడీ అతడికి బేడీలు వేయడం సరైనదేనని సమర్థించారు. న్యాయవాదులు అల్లర్లకు దిగితే లాఠీచార్జి కూడా జరిగింది. చివరికి వాద్వా కమిటీ వేసి, ఆమెను మిజోరాం రాష్ట్రానికి బదలీ చేశారు. అక్కడ నుంచి వచ్చి కొద్దిరోజులు ఢిల్లీలో పని చేశాక, తిహార్ జైలు ఇన్స్పెక్టర్ జనరల్‌గా నియమించారు. 2,500 కరడుగట్టిన నేరగాళ్లు ఉండే ఈ జైలులో ఆమె పలు సౌకర్యాలు కల్పించారు. యోగాకు, చదువుకోవడానికి వీలు కల్పించారు. అయితే చార్లెస్ శోభారాజ్ తప్పించుకున్న ఘటనలో ఆమె ఆరోపణలను ఎదుర్కొని ఆ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. చిత్రం ఏమిటంటే, దేశంలో చాలామంది రాజకీయ నాయకులు, సహోద్యోగులు ఆమె చర్యలకు, సంస్కరణలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినా అక్కడ ఖైదీలకు చేసిన సేవలకీ, తెచ్చిన మార్పుకీ గుర్తింపుగా మెగెసెసె పురస్కారం దక్కింది. ఇదే చిత్రం. ప్రేమ... పెళ్లి... డ్యూటీ 1971లో పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఒక టెన్నిస్ కోర్టులో కిరణ్ బేడీ బ్రిజ్ బేడీ కలుసుకున్నారు. తొలి చూపులు కలిశాయి. అతడికి సైన్యంలో, ఇంజనీర్‌గా కొన్ని మంచి అవకాశాలు వచ్చినా భూస్వామి కావడాన అమృత్‌సర్‌లోనే పరిశ్రమ స్థాపించుకున్నాడు. అతడి పట్ల కిరణ్ ప్రేమ గొప్పగా ఉండేది. ఐపీఎస్ ట్రైనింగ్ కోసం వెళ్లినా ఒకే రోజున 1,2,3,4,5 నెంబర్లతో అతడికి ఉత్తరాలు రాసేది. వాళ్ల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఇద్దరికీ కర్మకాండల మీద పెద్దగా నమ్మకం లేకపోవడంతో ఒక శివాలయంలో ఏడు అడుగులు నడిచారు. ఇద్దరి సంపాదనలో కొంత ఖర్చు పెట్టి మిత్రులకు విందు ఇచ్చారు. అది జరిగిన రెండు మాసాలకే ట్రైనింగ్‌కు ఆమె వెళ్లిపోయింది. ఆయన ‘విజిటింగ్ హజ్బండ్’గా మిగిలి పోయాడు. అయినా ఏనాడూ ఆమె ఉన్నతికి అడ్డు తగలలేదు. 1975లో కూతురు పుట్టింది. మొదటి పేరు సుకృతి. తరువాత పెట్టుకున్న పేరు సైనా. ఆమె జర్నలిస్ట్. భర్త భరూచా కూడా జర్నలిస్ట్. షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు ఆ ఇద్దరు. సైనాకు 13 ఏటనే ల్యూకోడెర్మా సోకింది. అందుకే ఆమె పెద్దగా బయట తిరగరు. తల్లిని డ్యూటీకి వెళ్లవద్దని, తన దగ్గర ఉండమని చిన్నారి సైనా ఎంత చెప్పినా, ‘నేను పోవాలి’ అంటూ కిరణ్ విధులకు వెళ్లిపోయేవారు. దీనితో సైనా అటు ఢిల్లీలోనే ఉన్నా తల్లి ప్రేమకీ, అమృత్‌సర్‌లో ఉండిపోయిన తన ప్రేమకీ నోచుకోలేక పోయిందని బ్రిజ్ బాధ పడుతూ ఉంటారు. క్రేన్ బేడీ-ఇందిర 1973 సంవత్సరం, గణతంత్ర దినోత్సవం. మొదటిసారి ఒక మహిళ ఖాకీదుస్తులలో కవాతు చేసింది. ఆ దృశ్యం సాక్షాత్తు నాటి ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఆనందాశ్చర్యాలలో ముంచెత్తేటట్టు చేసింది. మరునాడే తనతో బ్రేక్‌ఫాస్ట్ చేయవలసిందిగా కిరణ్ బేడీకి ఇందిర వర్తమానం పంపింది. సరిగ్గా తొమ్మిదేళ్లకి మరో సంఘటన జరిగింది. ఆగస్ట్ 5, 1982న ఢిల్లీలో కన్నాట్‌ప్లేస్‌లో డీహెచ్ఐ 1817 నెంబరు అంబాసెడార్ కారు రాంగ్ పార్కింగ్‌లో ఉంది. అది పీఎం హౌస్ కారు. అంటే ఇందిరాగాంధీ గృహావసరాలకు ఉపయోగించుకునే వాహనం. ఆ కారును నాటి ఢిల్లీ ట్రాఫిక్ కమిషనర్‌గా ఉన్న కిరణ్‌బేడీ పక్కకు లాగి పెట్టించారు. మరునాడు పేపర్లలో ప్రధాని కారు గురించి వార్త పతాక శీర్షికలలో దర్శనమిచ్చింది. ఆ మరునాడే గోవాకి బదలీ చేస్తూ కిరణ్ చేతికి పత్రాలు వచ్చాయి. ఈ ఉదంతం తరువాతే కిరణ్ బేడీని క్రేన్బేడీ అని పిలవడం మొదలైంది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత 2015లో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నిజానికి ఇందిర కారును పక్కకు లాగిన ఘనత తనది కాదని నిర్మల్‌సింగ్ అనే ఎస్‌ఐదని కాని నిర్మల్‌సింగ్ కంటే పై అధికారి అయిన అశోక్ టాండన్, అంతకంటే పై స్థాయిలో ఉన్న తాను ఈ విషయంలో ఎస్ఐకి గట్టి మద్దతుగా నిలబడ్డామని చెప్పారు. పత్రికల వాళ్లు నిర్మల్సింగ్పై చర్య తీసుకుంటారా అని అడిగారు. ‘తీసుకోను. పైగా అతడు చూపించినా సాహసానికి పురస్కారం కూడా ఇస్తాను!’ అని ఆనాడు కరాకండీగా చెప్పగలిగారు కిరణ్. నిజమే, ఆమెలో చండశాసనుడైన పోలీస్ అధికారి, చల్లని స్పర్శ ఇవ్వగలిగిన స్త్రీ ప్రవృత్తి రెండూ ఉన్నాయి. మహిళా ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ తాను నిర్వహించిన పదవులన్నిటికీ వన్నె తెచ్చారు. 1986లో ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ డీసీపీగా విధులు నిర్వహించేటప్పుడు మత్తుపదార్థాల నిరోధానికి కృషి చేశారు.{పతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ డీటాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తోటి ఉద్యోగులతో కలసి ‘నవజ్యోతి పోలీస్ ఫౌండేషన్’ పేరిట ఆమె నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ దేశప్రజలందరినీ ఆకట్టుకుంది. రెండు మూడేళ్ల క్రితం సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి నిరోధక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఉద్యోగ జీవితంలో ఆరోపణల కారణంగా ఏ ఒక్క ఉద్యోగి మీద చర్య తీసుకోలేదు. వేటు వేయలేదు. పైగా వారిలో విశ్వాసం పెరగడానికి ఒకేరోజు 1,600 మంది సిబ్బందికి పదోన్నతులు కల్పించారు. ‘ఈ దేశంలో దమ్ములున్న ఏకైక మహిళ కిరణ్‌బేడీ’ అని కుష్వంత్ సింగ్ కితాబిచ్చారు. ► టెన్నిస్‌లో ఆసియా స్థాయి పోటీల్లో ఛాంపియన్ షిప్ ► టీచర్‌గా కెరియర్ ప్రారంభం ► ఐఏఎస్‌కు సెలక్ట్ కాలేదని కన్నీరుమున్నీరు ► తోటి అధ్యాపకుడైన బ్రిజ్ బేడీని పెళ్లాడారు ►{పధాని ఇందిర కూడా రూల్స్‌కి అతీతం కాదన్నారు ► తీహార్ జైల్‌ను పరివర్తన మందిరంగా మార్చారు ► అత్తగారంటే దైవసమానం.. అత్తమ్మ ఆశీర్వాదం లేనిదే ఏ పనీ చేసేవారు కాదు ► విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాకు కిరణ్ జీవితమే మూలం. అదే హిందీలో ‘తేజస్విని’ పేరుతో వచ్చింది వరించిన పురస్కారాలు: రామన్ మెగసెసే, రాష్ట్రపతి పతకం, ‘అత్యంత ఆరాధనీయ మహిళ’గా ది వీక్ మేగజైన్ అవార్డు, ఐక్యరాజ్యసమితి అవార్డు, ఐఐటీలో డాక్టొరేట్ - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
కొద్దిగా అంటే ... మొత్తం ఊడ్చేశాడు
దేశ రాజధాని హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' విజయఢంకా మోగించడానికి తామే కారణమని కమలనాథులు తెగ ఫీలైపోతున్నారు. దేశ రాజధాని హస్తినలో కమలం వాడిపోయేందుకు ప్రధాని మోదీ నుంచి సాధారణ కార్యకర్త వరకు అందుకు పరోక్షంగా ప్రచారం చేశారని కలవరపడిపోతున్నారు. గతేడాది అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధాని మోదీ క్లీన్ ఇండియా పేరుతో స్వచ్ఛా భారత్ కార్యక్రమాన్ని చీపురు పట్టుకుని ప్రారంభించడమేంటి... ఆ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖలందరిని భాగస్వాములు కావాలని పిలుపు నివ్వడమేంటి... ఆ జాబితాలో హస్తినలో సీఎం పగ్గాలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఉండటమేంటి... ఆయన పార్టీ గుర్తు చీపురుతో కావడమేంటి... అంతా మాయా అని బీజేపీ సోదరులు వేదాంతం చెప్పుకుంటున్నారు. ఓ విధంగా ఎన్నికల ముందే మోదీతోపాటు ఆయన కేబినెట్ సహచరులంతా న్యూఢిల్లీలోని వీధి వీధి నాదేనంటూ అంతా చీపుర్లు పట్టుకుని కలియదిరిగారు. దీంతో చీపురు ప్రచారం అంతా అరవిందుడికి కలసి వచ్చిందని అనుకుంటున్నారు. అదికాక స్వచ్ఛ్ భారత్‌లో పాల్గొని... కొద్దిగా ఊడ్చి పెట్టమని మోదీ చీపురు ఇస్తే... ఆ చీపురుతో పాటు తన 'చీపురు'తో కమలం పార్టీ రేకులు ఊడ్చిపారేశాడని హస్తినలోని కమలదళం బిక్క మోహం వేసింది. -
మహిళల భద్రతే ప్రధానాంశం
విధానసభ ఎన్నికల్లో మహిళల భద్రతే కీలకాశంగా మారింది. గత ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా, అవినీతి నిర్మూలన తదితర అంశాలకు ఆయా రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిచ్చాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా ప్రచారం సాగిస్తున్నాయి. న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు మహిళా భద్రత అంశానికే పెద్దపీట వేశాయి. అధికారంలోకి ఎవరు వచ్చినా జాతీయ రాజధాని నగరంలో ప్రధాన సమస్య అయిన మహిళా భద్రతను తొలుత పరిష్కరిం చాలని అనేకమంది స్థానికులు కోరుతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్ సమస్యలను కూడా పరిష్కరించాలనేది స్థానికుల అభిమతంగా ఉంది. దీంతోపాటు విద్యుత్, నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు. నేరరహిత నగరంగా మార్చాలి ఈ విషయమై ప్రశాంత్రావ్ అనే ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ‘అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు నగరంలో సర్వసాధారణమైపోయాయి. మహిళలనే లక్ష్యంగా చేసుకుని నేరాలు జరుగుతున్నాయి’అని అన్నారు. నగరంలో అనేకమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిలో కొందరు తరచూ లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. కొత్త ప్రభుత్వం జాతీయ రాజధానిని నేరరహిత నగరంగా మారుస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలి ఇదే విషయమై దీతి గుప్తా అనే మహిళ మాట్లాడుతూ ‘మహిళలు కచ్చితంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చదువు, కర్తవ్య నిర్వహణతోపాటు ఇతర అవసరాల కోసం వారంతా విధిగా బయటికి వెళ్లాల్సి ఉంటుంది. రోజు మార్చి రోజు నగరంలో అత్యాచారాలు జరుగుతున్నా యి. ఇది నన్ను బాగా భయానికి గురిచేస్తోంది’ అని అన్నారు. ఇదే అంశంపై ఆల్ ఇండియా రేడియో ఉద్యోగి ఎస్.ఎస్.రంగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముఖేష్‌శర్మ మాట్లాడుతూ 17 మిలియన్ల మంది నివసిస్తున్న ఈ నగరంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాల్సి ఉందన్నారు. అత్యాచార కేసుల సంఖ్య ఎంతమాత్రం తగ్గడం లేదు’అని అన్నారు. దీంతోపాటు ప్రజారవాణా వ్యవస్థ,మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి కీలకాంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. జాగరూకతతో ఉంటా: షాలిని ఇదే విషయమై నగరంలో ఉంటున్న బీహార్‌కు చెందిన షాలిని అనే విద్యార్థిని మాట్లాడుతూ అభద్రతా భావం కారణంగా బయటికి వెళ్లినపుడు జాగరూకతతో ఉంటానని తెలిపింది. రాత్రిపూట ఇంకా జాగ్రత్తగా ఉంటానంది. పారిశుధ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతయి నా ఉందని మరికొందరు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. దుర్గంధంతో ఇబ్బందులపాలు ఈ విషయమై దీతి గుప్తా మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో దుర్గంధం తీవ్రంగా ఉందని, ఈ కారణంగా నగరవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎంతో చేయాల్సి ఉందన్నారు. లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయన్నారు. ఇక అవినీతి గురించి కొంతమంది మాట్లాడినప్పటికీ అత్యధికులు మాత్రం మహిళా భద్రత అంశాన్నే ఎక్కువగా ప్రస్తావించారు. అత్యధిక శాతం మంది ఓటర్లు ఈ అంశం గురించే మాట్లాడుతున్నారనే విషయాన్ని బీజేపీ, ఆప్‌లు కూడా అంగీకరించాయి. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా మాట్లాడుతూ అది నిజమేనన్నారు. ఇదే అంశంపై ఆప్ నాయకురాలు అతిషి మర్లేనా మాట్లాడుతూ అనేకమంది నగరవాసులలు మహిళా భద్రత, నిరుద్యోగం అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అయితే ఈ సమస్యకు ఏ పార్టీ చక్కని పరిష్కారమిస్తుందనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజే పీ, ఆప్లపైనే ప్రజల దృష్టంతా ఉంది. కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరూ ప్రస్తావించడమే లేదు. ఆప్.. సరిగ్గా సరిపోతుంది ఢిల్లీలో పరిపాలనకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీయే చక్కగా సరిపోతుందని గుప్తా అనే స్థానికుడు అభిప్రాయపడ్డారు. స్థానిక సమస్యలపై ప్రధానమంత్రి దృష్టి సారించడం సాధ్యం కాదని, అందువల్ల ఆప్ మాత్రమే ఈ పనిచేయగలుగుతుందన్నారు. ధరల్ని నియంత్రించింది ఈ వాదనతో శర్మ అనే ఉపాధ్యాయుడు ఏకీభవించారు. ‘ఆప్... నాకు ఎంతో దగ్గరగా ఉంటుంది. నాకే కాదు అందరికీ దగ్గరగా ఉంటుంది. ఆ పార్టీ నాయకులు సామాన్యులనే ఇష్టపడతారు. అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ధరలతోపాటు అవినీతిని విజయవంతంగా నియంత్రించగలిగింది’అని అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చినా చేయగలుగుతుందన్నారు. బీజేపీయే బెటర్ అయితే ఈ వాదనతో రంగా అనే స్థానికుడు ఏకీభవించలేదు. జాతీయ రాజధానికి బీజేపీయే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. పైగా కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలో ఉన్నారన్నారు. ఈసారి ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. ఆటోరిక్షా నడుపుకుని జీవితం సాగించే 57 ఏళ్ల రాంకిషన్కూడా కమలానికే మొగ్గుచూపారు. నిరుపేదలను ఆ పార్టీ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుందన్నారు. కాగా వచ్చే నెల ఏడో తేదీన విధానసభ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. -
ఢిల్లీ సీఎం అభ్యర్థిపై బీజేపీలో సందిగ్థత
న్యూఢిల్లీ: బీజేపీలో ఢిల్లీ సీఎం అభ్యర్థిపై సందిగ్థత నెలకొంది. ఎన్నికల ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని పార్టీలోని కొందరు నేతలు చేసిన విజ్ఞప్తిని సీనియర్లు తోసిపుచ్చారు. పార్టీలో కొత్త సంప్రదాయాలకు తెరతీయొద్దని వారికి సూచించారు. ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని సీనియర్లు స్పష్టం చేశారు. అయితే నిన్న కాక మొన్న వచ్చిన కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సీనియర్లు ఆలోచనలో పడ్డారు. హస్తిన ప్రజల్లో కిరణ్ బేడీకి మంచి పేరు ఉందని వారు బీజేపీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై కిరణ్ బేడీని పోటీకి నిలపాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన న్యూఢిల్లీ పార్టీ అధ్యక్షుడు మూడో స్థానంలో నిలిచారు. దాంతో కిరణ్ బేడీనే బరిలో నిలపాలని సీనియర్లు సమాలోచనలు చేస్తున్నారని తెలిసింది. -
స్మార్ట్ ఫోన్‌తో క్షణాల్లో సమాచారం
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్‌ద్వారా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని నగరవాసులు సులువుగా తెలుసుకోవచ్చు. దీంతోపాటు సంబంధిత పోలింగ్ అధికారి పేరు కూడా తెలుసుకునే వీలుంది. ఇందుకు సంబంధించి ‘ఢిల్లీ ఎలక్షన్’ పేరిట ఎన్నికల కార్యాలయం ఓ యాప్‌ను విడుదల చేసింది. ఇంకా తమ నియోజకవర్గంతోపాటు ఓటరు జాబితాలో నమోదు చేసిన దరఖాస్తు ఏ స్థితిలో ఉందనే విషయాన్ని కూడా తెలుసుకునే వీలుంది. ఈ మేరకు ఇటీవల ఈ యాప్‌ను తమ కార్యాలయం విడుదల చేసిందని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ప్రస్తుతం అనేకమంది స్మార్ట్‌ఫోన్‌ను అనేకమంది వినియోగిస్తున్నందువల్ల ఈ యాప్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విధానసభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమాచారమైనా ఇందులో దొరుకుతుందన్నారు. ఇదిలాఉంచితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల ఓ ఎస్ఎంఎస్ సేవను కూడా ప్రారంభించింది. దీంతో ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకునే వీలుంది. ఇందుకోసం ఈపీఐసీ స్పేస్ ఓటర్ ఐడీ అని టైప్ చేసి సదరు సందేశాన్ని 773299899 లేదా 1950 నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. ఇంకా సీఈఓ.ఢిల్లీ.గవ్.ఇన్ వెబ్సైట్లో కూడా తనిఖీ చేసుకోవచ్చు. కాగా ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం ప్రకారం జాతీయ రాజధాని నగరంలోని జనాభాలో యువ ఓటర్ల సంఖ్య 1.31 శాతంగా ఉంది. -
దృష్టంతా ఢిల్లీ ఎన్నికలపైనే
అహ్మదాబాద్: తమ పార్టీ దృష్టంతా ఢిల్లీ ఎన్నికలపైనేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టం చేసింది. గుజరాత్లో ఓ లోక్‌సభ, తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని తేల్చిచెప్పింది. పంజాబ్‌లో గత నెలలో జరిగిన జాతీయ కార్యవర్గ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ నాయకుడు సుఖ్‌దేవ్ చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, హర్యానా, జార్ఖండ్ శాసనసభలకు జరగనున్న ఎన్నికల్లోనూ పాల్గొనబోమన్నారు. కేవలం ఢిల్లీ విధానసభకు జరిగే ఎన్నికలపైనే దృష్టి సారిస్తామని ఆయన వివరించారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
అటు కోలాహలం.. ఇటు నైరాశ్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఆదివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఘోరంగా ఓడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. బాణసంచా కాలుస్తూ సంబరాలు.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు వార్తలు వెలువడుతుండడంతో ఒక్కరొక్కరుగా బీజేపీ కార్యకర్తలంతా అశోకారోడ్డు లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఫలితాలు వస్తున్న కొద్దీ కోలాహలం పెరుగుతూ వచ్చింది. డప్పు చప్పుళ్ల మధ్య నత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచా కాలుస్తూ సంతోషంగా గడిపారు. వచ్చిపోయే నేతలకు శుభాకాంక్షలు చెబుతూ బీజేపీ కార్యకర్తలు సందడి చేశారు. బీజేపీకి అనుకూల ఫలితాలు వెలువడడంతో కేంద్ర బీజేపీ కార్యాలయం వద్ద మీడియా కోలాహలం మరింత పెరిగింది. విజయాన్ని అందరితో పంచుకునేందుకు కేంద్ర కార్యాలయానికి వచ్చిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రాకతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులతోపాటు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ సైతం సంబరాల్లో పాల్గొన్నారు. చీపుర్లు చూపుతూ నృత్యాలు.. ఆమ్ఆద్మీ పార్టీ అనూహ్య విజయం ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ ఎన్నికల గుర్తు అయిన చీపుళ్లను పెకైత్తి చూపుతూ హనుమాన్రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదుట నృత్యాలు చేశారు. వందల సంఖ్యలో యువత ఆమ్ఆద్మీ పార్టీ టోపీలు ధరించి అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా అక్కడే గడిపారు. పార్టీ ఫలితాలు తెలుసుకుంటూ కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. షీలాదీక్షిత్‌పై కేజ్రీవాల్ వేల మెజార్టీతో ఉన్నారని చెప్పిన ప్రతిమారు చప్పట్లు, కేకలతో ఆనందం వ్యక్తం చేశారు. 25 వేల పైన ఓట్లతో కే జ్రీవాల్ గెలుపొందడంతోపాటు మొత్తం 28 స్థానాలు ఆప్ గెలుచుకోవడంపై ఆ పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మానుష్యంగా కాంగ్రెస్ కార్యాలయాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం మొదలైన గంట నుంచే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, డీడీయూ మార్గ్‌లోని డీపీసీసీ కార్యాలయం, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాస పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. 2008లో 43 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం ఏడు స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు పనిచేసిన షీలాదీక్షిత్ సైతం ఓటమి పాలుకావడం పార్టీ శ్రేణులకు మింగుడు పడటంలేదు. -
కాంగ్రెస్‌కు ‘చీపురు’ దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనను బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూకటి వేళ్లతో సహా పెకిలించాయి. పదిహేనేళ్లు ఢి ల్లీ పీఠాన్ని అధిరోహించిన షీలా సర్కార్‌కి ఆదివారం నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం ఎదురైంది. 2008లో 43 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. షీలాదీక్షిత్ కనీసం తన స్థానాన్ని సైతం నిలబెట్టుకోలేకపోయారు. పట్టుపట్టి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ 25 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్న ఢిల్లీవాసులు సహజంగానే తమ ఓటుద్వారా నిరసన తెలపడం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోమారు టిక్కెట్లు ఇస్తే గెలిచి నిలవొచ్చన్న షీలాదీక్షిత్ వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు వరుసగా రెండు మూడు పర్యాయాలు పార్టీ పెద్దలు కూడా ప్రచారానికి విముఖత వ్యక్తం చేయడంతో షీలా ప్రభుత్వం దిగిపోక తప్పలేదు. ఢిల్లీలో మంత్రులుగా కొనసాగుతున్న వారిలోనూ ఎక్కువ మంది ఓటమి పాలుకావడం గమనార్హం. కాంగ్రెస్‌పార్టీ ఓటమిని అంగీకరిస్తూ ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ వెంటనే తన రాజీనామాను ఎల్జీకి పంపారు.