దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలపైనే నిలిచింది. 1996 ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. అది ప్రతీ ఎన్నికల్లోనూ చర్చకు వస్తుంటుంది.
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిసారీ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కొన్ని ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 500 దాటగా, కొన్నిసార్లు రెండు అంకెలకే పరిమితమైంది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు లోక్‌సభ స్థానాలున్నప్పుడు కేవలం 19 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు.
1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 523 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 358 మంది స్వతంత్రులు కావడం విశేషం. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 168 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1984 ఎన్నికల్లో 189 మంది, 1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఎప్పుడూ ప్రధాన పార్టీల అభ్యర్థులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా గెలవకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 17 మంది అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఏడుగురు విజేతలు, ఏడుగురు ప్రత్యర్థి అభ్యర్థులు మినహా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment