Candidates
-
ఎప్పుడూ పేరు వినని పార్టీలు సహా మహారాష్ట్ర ఎన్నికల బరిలో 4,136 మంది
దాదర్: హోరాహోరీగా సాగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రచారం ప్రశాంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 158 ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 2,050 మంది బరిలో ఉండగా మిగతా 2,086 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అలాగే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రాందాస్ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐకి చెందిన 31 మంది అభ్యర్థులున్నారు.దీన్ని బట్టి వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకంటే ఇండిపెండెంట్లే అధికంగా బరిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి మొదటి స్థానంలో మాయావతికి చెందిన బీఎస్పీ, రెండో స్థానంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వం వహిస్తున్న వంచిత్ బహుజన్ అఘాడీ, మూడో స్థానంలో బీజేపీ ఉంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (ఏపీ) తదితర ప్రాంతీయ పారీ్టలున్నాయి. మొత్తం 4,136 మంది అభ్యర్థుల్లో ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉండటంతో ఓట్లు చీలిపోతాయే భయం ప్రధాన రాజకీయ పారీ్టల అభ్యర్థులకు పట్టుకుంది. ఈ సారి జనాలు ఎప్పుడు పేరు వినని పారీ్టలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపడం గమనార్హం. మొత్తం 288 స్థానాలకు ఈ నెల 20వ తేదీన ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎవరిని అదృష్టం వరిస్తుంది? ఏ పారీ్టకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది? అనేది ఈనెల 23వ తేదీన వెలువడే ఫలితాల్లో స్పష్టం కానుంది. ఎప్పుడూ పేరు వినని పార్టీలు వికాస్ ఇండియా పార్టీ, ఎల్ఘార్ పార్టీ, వీర్ జనశక్తి పార్టీ, సన్మాన్ రాజకీయ పార్టీ, సర్దార్ వల్లభాయి పార్టీ, సంపూర్ణ భారత్ క్రాంతి పార్టీ, నేతాజీ కాంగ్రెస్ పార్టీ, నిర్భయ్ మహారాష్ట్ర పార్టీ, ఓపెన్ పీపుల్స్ పార్టీ, నేషనల్ వరల్డ్ లీడర్ పార్టీ, జయ్ హింద్ జయ్ భారత్ రా్రïÙ్టయ పార్టీ, ఇండియన్ పాలిటికల్ కాంగ్రెస్ పార్టీ, విందు«థలాయి చిరుతెంగల్ పార్టీ, ఎం పాలిటికల్ పార్టీ, భారత్ జోడో పార్టీ ఉన్నాయి. పది మంది కంటే ఎక్కువ అభ్యర్థుల పోటీ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్)–44, మహారాష్ట్ర స్వరాజ్య పార్టీ–32, రైట్ టూ రీకాల్ పార్టీ–18, సంభాజీ బ్రిగేడ్ పార్టీ–19, ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇంక్విలాబ్ ఏ మిలాత్–16, జనహిత్ లోక్షాహీపార్టీ–18, బహుజన్ మహాపార్టీ–11, భారతీయ యువ జన్ఏక్తా పార్టీ–12, దేశ్ జనహిత్ పారీ్ట–11, జన్ జనవాదీ పార్టీ–13, రాష్ట్రీయ స్వరాజ్య సేనా–15, వికాస్ ఇండియా పార్టీ–11. అత్యధిక, అతి తక్కువ అభ్యర్థులు పోటీ చేస్తున్న జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో ముంబై, ఉప నగర జిల్లాల్లో అత్యధికంగా అంటే 315 మంది, పుణేలో 303 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే అతి తక్కువ అంటే 17 మంది అభ్యర్థులు సింధుదుర్గ్ జిల్లాలో పోటీ చేస్తున్నారు. అలాగే మొత్తం మహిళా అభ్యర్థుల సంఖ్య 363 ఉండగా ఇందులో కూడా ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉంది. కాగా, మొత్తం 363 మంది మహిళా అభ్యర్థులున్నప్పటికీ ఇందులో ముంబై, ఉప నగరజిల్లాల్లో అత్యధికంగా అంటే 39 మంది బరిలో ఉన్నారు. హింగోళీ, రత్నగిరి జిల్లాలో అతి తక్కువ అంటే ఇద్దరు చొప్పున బరిలో ఉన్నారు. జల్గావ్, నాందేడ్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున హిజ్రా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి ఎన్ని ఓట్లు పోలవుతాయనే దానిపై అందరి దృష్టి ఉంది. పార్టీల వారీగా అభ్యర్థుల సంఖ్య బీజేపీ–149, కాంగ్రెస్–101, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–86, శివసేన (శిందే వర్గం)–81, యూబీటీ (శివసేన)–95, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)–59, బహుజన్ సమాజ్ పార్టీ–259, వంచిత్ బహుజన్ అఘాడీ–200, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–125, రాష్ట్రీయ సమాజ్ పార్టీ–93, ఆర్పీఐ (అథవలే వర్గం)–31, ప్రహార్ జనశక్తి–38, ఆజాద్ సమాజ్ పార్టీ–28, రిపబ్లికన్ సేనా–21, బహుజన్ రిపబ్లికన్ స్పెషలిస్టు పార్టీ–22,స్వాభిమాన్ పార్టీ–19, పీడబ్ల్యూపీ–18, ఎంఐఎం–17, భీంసేనా–14, లోక్రాజ్య పార్టీ–10, జనసురాజ్య శక్తి–6, సమాజ్‌వాదీ పార్టీ–9, సమతా పార్టీ–9, రాష్ట్రీయ గోండ్వానా పార్టీ–4, జనతాదళ్ (సెక్యులర్)–4, మార్క్స్‌వాదీ కమ్యూనిస్టు పార్టీ–3. -
మహారాష్ట్ర ఎన్నికలు.. బరిలో 7,995 మంది
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మొత్తం 288 స్థానాల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్లకు ఆఖరు రోజైన అక్టోబర్ 29న దాదాపు 4,996 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.దీంతో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండనున్నారనేది దాదాపు స్పష్టమైందని చెప్పవచ్చు. కాగా మహాయుతితోపాటు మహావికాస్ అఘాడిలపై పలువురు నాయకులు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. తిరుగుబాటు చేసిన అభ్యర్థుల్లో గోపాల్ శెట్టి (బోరివలి), రాజు పారవే (ఉమరేడ్), స్వీకృతి శర్మ (తూర్పు అంధేరి), నానా కాటే (చించ్వడ్) తదితరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు నాలుగో తేదీ వరకు గడువు ఉండటంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు... ప్రధాన కూటములైన బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల కలయికతో ఏర్పడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల కలయికతో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటముల అభ్యర్థులు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో అత్యధికంగా బీజేపీ తరఫున 148 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున 103 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 164 స్థానాల్లో, కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేశాయి. కానీ ఈసారి రాజకీయ సమీకరణాలు మారడంతో ప్రధాన కూటముల్లో సీట్ల పంపకాలు ఆలస్యమయ్యాయి. ఇక మిగిలిన పార్టీలైన శివసేన (యూబీటీ) 89, శివసేన (శిందే) 80, ఎన్సీపీ (ఎస్పీ) 87, ఎన్సీపీ (ఏపీ) 53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మహిం’లో ఎమ్మెన్నెస్‌కే మద్దతు -
యూపీ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కర్హల్ సీటులో లాలూ యాదవ్ అల్లుడు, అఖిలేష్ మేనల్లుడు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్(ఎస్పీ)పై పోటీకి బీజేపీ అనుజేష్ యాదవ్‌ను నిలబెట్టింది. కాన్పూర్‌లోని సిస్మౌ, మిర్జాపూర్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.బీజేపీ ప్రకటించి అభ్యర్థుల జాబితా ప్రకారం కుందర్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ నుంచి సంజీవ్ శర్మ, ఖైర్ (ఎస్సీ) నుండి సురేంద్ర దిలేర్, కర్హల్ నుంచి అనుజేష్ యాదవ్, ఫుల్పూర్ నుంచి దీపక్ పటేల్, కాటేహరి నుండి ధర్మరాజ్ నిషాద్, మజ్వాన్ నుండి సుచిస్మిత మౌర్య పోటీ చేస్తున్నారు.నవంబర్ 13న ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. యూపీలోని 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మిల్కీపూర్ ఉప ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఇది కూడా చదవండి: అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా -
‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’
సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్‌లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్‌లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు. -
Group-1 Exam: అట్టుడికిన సిటీ
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం అట్టుడికింది. ఆందోళనలు, ధర్నాలు, ముట్టడి, బంద్ పిలుపులతో నగరం గరం గరంగా మారింది. ఎక్కడికక్కడ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఆందోళనకారుల అరెస్టులు, లాఠీచార్జ్‌లతో శనివారం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీఓ నం–29ను రద్దు చేయాలని గ్రూప్–1 అభ్యర్థుల మూడు రోజులుగా అశోక్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సెక్రటేరియట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అభ్యర్థులను, మంత్రిని పోలీసులు నిలువరించడంతో అశోక్‌నగర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సికింద్రాబాద్ బంద్‌లో లాఠీచార్జ్.. కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచి్చన సికింద్రాబాద్ బంద్‌లో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద నుంచి వేలాది మంది ర్యాలీగా బయలుదేరారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, హిందూవాహిని, బీజేపీ తదితర సంస్థలకు చెందిన ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి అక్కడి నుంచి బాటా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు, కురీ్చలు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జిలో నలుగురు యువకులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగిపోయింది. బంద్, ర్యాలీలతో సికింద్రాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.స్వచ్ఛందంగా షాపులు మూసిన వ్యాపారులు రాంగోపాల్‌పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచి్చన బంద్ శనివారం ప్రశాంతంగా సాగింది. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు పలికారు. -
గ్రూప్ వన్ ఆందోళనలు.. అశోక్‌నగర్‌లో హై టెన్షన్ (ఫొటోలు)
-
తెలంగాణలో గ్రూప్ -1 టెన్షన్..టెన్షన్
-
ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి
సాక్షి, అమరావతి: దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరుపై ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్‌డీ (ఓట్ ఫర్ డెమొక్రసీ) వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనా? ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్ శాతానికి, తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటం.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 12.54 శాతం పోలింగ్ పెరగడంపై ఆ రెండు సంస్థలతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? పోలింగ్ శాతం ఇంత భారీ స్థాయిలో ఉండటానికి కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేసైనా ఉండాలి! లేదంటే ఈవీఎంలను మార్చైనా ఉండాలి! లేదంటే అవి సక్రమంగా పనిచేయకపోయి ఉండాలి! అంటూ వీఎఫ్‌డీ, ఏడీఆర్ వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? ఈవీఎంల పనితీరుపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను తాజాగా అధికారులు కోరుతుండటం ఎన్నికల ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.ఈవీఎంల పనితీరుపై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదు..రాష్ట్రంలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలో 81 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపును ఈసీ జూన్ 4న చేపట్టింది. అంటే పోలింగ్ పూర్తయిన 21 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు గమనించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.విచారణ కోసం జూన్ 10న ఆయన రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. ఈవీఎంలో మెమరీని తొలగించారా..? మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ జరిగిందా? కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ పాట్స్ ట్యాంపరింగ్గానీ ఏమైనా మార్పులుగానీ జరిగాయా? అని అనుమానం వ్యక్తం చేస్తూ వాటిపై విచారణ చేయాలని ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు సమర్పించారు. విచారణకు రూ.5,66,400 ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైనా ఈనెల 25వతేదీ నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది.వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు..రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతుండగా తాజాగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత అనుమానాస్పదంగా ఉంది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది.ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేస్తామని ప్రతిపాదిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, వీఎఫ్డీలతోపాటు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, వివిధ రాజకీయపార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేననే అభిప్రాయం బలంగా కలుగుతోంది.ఇదే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. సీఈవో కార్యాలయానికి ఈ విచారణకు సంబంధం ఉండదని, ఇది పూర్తిగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫిర్యాదులపై ఆయా రిటర్నింగ్ అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. వారి సమక్షంలోనే ఈ విచారణ ప్రక్రియ జరుగుతుందని సీఈవో చెప్పారు.విచారణ నిర్వహించాల్సిందేఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు తేలింది. నా లోక్‌సభ స్థానం పరిధిలో 81 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్‌కు, కౌంటింగ్ తేదీకి మధ్య 21 రోజులు గడువు ఉంది. అయినా సరే ఈవీఎంలలో 99 శాతం ఛార్జింగ్ ఉండటాన్ని బట్టి చూస్తే ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానంతో ఫిర్యాదు చేశా. విచారణకు అయ్యే ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించా. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అధికారులు నన్ను కోరారు. ఫిర్యాదు ఉపసంహరించుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారు. దాన్ని నేను సున్నితంగా తోసిపుచ్చా. విచారణ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పా.– బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం లోక్‌సభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫీజు వెనక్కి ఇస్తామని పీఏకు ఫోన్ ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, ఓటింగ్ యంత్రాలను మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫిర్యాదుపై విచారణ కోసం ఫీజు కూడా చెల్లించా. ఇప్పుడు ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నా పీఏకు అధికారులు ఫోన్ చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారట. దీనిపై విచారణ జరగాల్సిందే.. వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందేనని తేల్చి చెప్పా. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి -
యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల!
సాక్షి, హైదరాబాద్: ‘యూజీ నీట్ పరీక్ష రద్దు అవుతుంది. కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించనుంది. అందుకే షార్ట్‌టర్మ్ కోర్సు ప్రారంభించాం. మీ అమ్మాయిని వెంటనే చేరి్పస్తే ఫీజు కూడా రాయితీ ఇస్తాం’ రెండ్రోజుల కిందట ఓ ప్రముఖ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థి తండ్రికి వచి్చన ఫోన్‌కాల్ ఇది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి యూజీ నీట్ ప్రవేశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ పరీక్షలో కొందరు అదనపు మార్కుల ప్రయోజనం, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, టాప్ ర్యాంకులపై రగడ తదితర అంశాలతో దేశవ్యాప్తంగా తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ పరిస్థితిని కొన్ని కోచింగ్ సెంటర్లు క్యాష్ చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. నీట్ పరీక్ష రద్దు కానుందని, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారానికి ఊపందిస్తూ షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభిస్తున్నాయి. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులను ఈ కోర్సుల్లో చేరాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, ఎస్ఎంఎస్ల ద్వారా ఫీజు తక్కువంటూ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మే 5న జరిగిన యూజీ నీట్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో రాష్ట్రం నుంచి 1.05 లక్షల మంది పరీక్ష రాసినట్లు అంచనా. రూ.25 వేల నుంచి రూ.30 వేల ఫీజు యూజీ నీట్–2024 ప్రవేశాల ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం కావడం, ప్రతిపక్షాల నిరసన ఏకంగా పార్లమెంటును స్తంభించే పరిస్థితి నెలకొనడంతో అన్ని వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు తీగలాగితే డొంక కదిలినట్లు కనిపిస్తుండటంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. మరో వారం రోజుల్లో నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంకా రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మెరుగైన మార్కులు వచ్చినప్పటికీ విద్యార్థులకు లక్షల్లో ర్యాంకులు రావడంతో సీటు వస్తుందా? రాదా? అంచనా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో అప్పటివరకు ఖాళీగా ఉండలేక షార్ట్‌టర్మ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. షార్ట్‌టర్మ్ కోర్సు కోసం ఒక్కో కోచింగ్ సెంటర్ రూ.25 వేల చొప్పున వసూలు చేస్తుండగా.. కొన్నిమాత్రం రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కోర్సుల్లో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
Lok Sabha Elections 2024: ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈవీఎంలలోని మైక్రో–కంట్రోలర్ చిప్‌లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఆరు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుసహా ఎనిమిది దరఖాస్తులు ఈసీకి అందాయి. తమిళనాడు, హరియాణాలో చెరో రెండు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణలో చెరో స్థానంలో ఇలా మొత్తంగా 8 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పేపర్ బ్యాలెట్ విధానానికి మారుదామంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ, ఈవీఎం విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 26వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువడిన వేళ ఇలా ఈసీకి అభ్యర్థనలు రావడం గమనార్హం. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడి రెండో, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఐదు శాతం ఈవీఎంలను చెక్‌చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుంటూ ఓడిన అభ్యర్థులు కొందరు తాజాగా ఈసీని ఆశ్రయించగా ఆయా వివరాలను ఈసీ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో కలిపి 92 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను చెక్ చేయనున్నారు. అయితే ఒక్కో ఈవీఎం సెట్‌ను తనిఖీచేయడానికి నిర్వహణ ఖర్చుగా రూ.47,200ను ఆ అభ్యర్థి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఒకటో తేదీన ఈసీ ఒక ప్రకటన జారీచేయడం తెల్సిందే. ఈవీఎంల తనిఖీ ఖర్చును భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)లు రూ.40,000 నిర్ణయించగా జీఎస్టీ 18 శాతం(రూ.7,200) కలుపుకుంటే ఖర్చు రూ. 47,200గా తేలింది. అయితే ఈవీఎంల తరలింపు, వాటిని తనిఖీని రికార్డ్ చేసేందుకు సీసీటీవీల ఏర్పాటు, విద్యుత్ చార్జీలు, వీడియోగ్రఫీ, జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి సంజయ్ రాధాకృష్ణ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేయాలని దరఖాస్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక లోక్‌సభ పరిధిలోని 4 పోలింగ్ స్టేషన్లను, హరియాణాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోని 6 పోలింగ్ స్టేషన్లను, తమిళనాడులోని 2 లోక్‌సభ స్థానాల్లోని 20 పోలింగ్ స్టేషన్లను అభ్యర్థులు తనిఖీకి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరారు. గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఒక పోలింగ్ స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంచుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో 7 , జహీరాబాద్‌లో 7, ఆందోల్‌లో 6 పోలింగ్ స్టేషన్లను బీజేపీ అభ్యర్థి ఎంచుకున్నారు. ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 పోలింగ్ స్టేషన్లను బీజేడీ అభ్యర్థి ఎంచుకున్నారు. -
ప్రతి ఇంటికి మంచి చేశాం.. వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఎన్నికల్లో పోటీకి.. పోటీపడిన పార్టీలు
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ ఒకటిన జరిగే ఆఖరి విడత పోలింగ్‌తో ఎన్నికలు ముగియనున్నాయి. తాజాగా ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తెలిపిన వివరాల ప్రకారం 2009తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది.ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 2024లో 751 రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలవగా, 2019లో 766, 2014లో 464, 2009లో 368 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. 2009 నుంచి 2024 మధ్య ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగిన 8,337 మంది అభ్యర్థుల అఫిడవిట్లపై ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సమగ్ర విశ్లేషణ చేశాయి.2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పార్టీల నుంచి, 532 మంది రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ కాని పార్టీల నుంచి, 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బలిలోకి దిగారు. జాతీయ పార్టీలకు చెందిన 1,333 మంది అభ్యర్థుల్లో 443 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 295 మంది అభ్యర్థులు పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి పార్టీలకు చెందిన 532 మంది అభ్యర్థుల్లో 249 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. -
ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్మెంట్ డే 4th June (ఫొటోలు)
-
ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే..
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడకుండా ఇకపై నేతలు, పార్టీ యంత్రాంగం నిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండేలా కార్యాచరణ ఉంటుందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా పార్టీ కార్యక్రమా లు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులు, కొందరు నేతలు గురువారం ఎర్రవల్లి నివా సంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తీరుతెన్నులతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది.వరికి రూ.500 బోనస్, ధాన్యం కొనుగోలు అంశాలపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన నిర సన కార్యక్రమాలపై ఆరా తీశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యవర్గాల ఏర్పాటు లాంటివి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత చేపట్టే అవకాశమున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, కిందిస్థాయి వరకు సోషల్ మీడియా విభాగం బలోపేతం తదితరాలకు సంబంధించిన కార్యాచరణపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు. ‘స్థానిక’సన్నద్ధత ప్రారంభించాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతను కూడా ఇప్పటినుంచే ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారితో పాటు క్షేత్ర స్థాయిలో క్రియాశీలంగా పనిచేసే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు.పార్టీ కార్యవర్గాల ఏర్పాటులోనూ ఇలాంటి నేతలు, కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా పద్దతిలో రిజర్వేషన్లు కల్పించేందుకు 113 బీసీ ఉప కులాల గణన చేపట్టాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వం ముందు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అన్ని ఎన్నికల ఫలితాలు అనుకూలమే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలూ పార్టీకి అనుకూలంగా వెలువడే అవకాశం ఉన్నట్లు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి 28న జరిగిన శాసనమండలి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి గెలుస్తారని పార్టీ నేతలు కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,439 మంది ఓటర్లకు గాను 800 మందికి పైగా పార్టీ అభ్యర్థికే ఓటు వేసినట్లుగా అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడంతో సానుకూల ఫలితం వస్తున్నట్లు వివరించారు.ఇదిలా ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నివేదిత మంచి మెజారిటీ సాధిస్తారని కేసీఆర్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. 27న జరిగే ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించకుండా పార్టీ నేతలు, అభ్యర్థులు పార్టీ ఇచ్చే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని చెప్పారు. -
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్‌కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్‌ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్‌తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్‌సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్‌ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
-
1996 ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? స్వతంత్రులకు పరాభవమేనా?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలపైనే నిలిచింది. 1996 ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. అది ప్రతీ ఎన్నికల్లోనూ చర్చకు వస్తుంటుంది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిసారీ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కొన్ని ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య 500 దాటగా, కొన్నిసార్లు రెండు అంకెలకే పరిమితమైంది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు లోక్‌సభ స్థానాలున్నప్పుడు కేవలం 19 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు.1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 523 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 358 మంది స్వతంత్రులు కావడం విశేషం. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 168 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1984 ఎన్నికల్లో 189 మంది, 1989లో 237 మంది, 1991లో 501 మంది, 1996లో 523 మంది అభ్యర్థులు, 1998లో 132 మంది అభ్యర్థులు, 1999లో 97 మంది, 2004లో 129 మంది, 2009లో 160 మంది, 2014లో 150 మంది 2019లో 164 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఎప్పుడూ ప్రధాన పార్టీల అభ్యర్థులపైనే నమ్మకం పెట్టుకున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా గెలవకపోవడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 17 మంది అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఏడుగురు విజేతలు, ఏడుగురు ప్రత్యర్థి అభ్యర్థులు మినహా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. -
Lok sabha elections 2024: నాలుగో విడత బరిలో 1,717 మంది: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభకు నాలుగో విడతలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్‌లో 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు మొత్తం 4,264 నామినేషన్లు అందాయి. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసిన తర్వాత 1,717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ దశలో ఒక్కో స్థానానికి సగటున 18 మంది పోటీ పడుతున్నట్లు శుక్రవారం న్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో 979 మంది.. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు అత్యధికంగా 1,488 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 625 ఆమోదం పొందగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో మల్కాజ్గిరి స్థానానికి అత్యధికంగా 177 నామినేషన్లు, నల్గొండ, భువనగిరి స్థానాలకు 144 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ స్థానాలకు 1,103 నామినేషన్లు అందాయి. పరిశీలన అనంతరం 503 నామినేషన్లు ఆమోదం పొందగా మొత్తం 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో .. నాలుగో విడత పోలింగ్ జరిగే బిహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీలో ఉన్నారు. జమ్మూకశీ్మర్‌లోని ఒక్క సీటుకు 24 మంది, జార్ఖండ్‌లోని 4 నియోజకవర్గాలకు 45 మంది, మధ్యప్రదేశ్‌లోని 8 సీట్లకుగాను 74, మహారాష్ట్రలోని 11 స్థానాలకు 298 మంది, ఒడిశాలోని 4 సీట్లకు 37 మంది, ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాల్లో 130 మంది, పశి్చమబెంగాల్‌లోని 8 సీట్లకు 75 మంది బరిలో నిలిచారు. -
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ నేతల పేర్లతో ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపలేమని స్పష్టం చేసింది.ఒకే నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు పోటీచేయకుండా అనుమతించాలని కోరుతూ పిటిషనర్ సాబు స్టీఫెన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కీల స్థానాల్లో ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు డూప్లికేట్ అభ్యర్ధులు ఇలా చేస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ఒకే పేరుతో ఉన్న స్వతంత్రులు పోటీ చేయడం వల్ల పేరున్న రాజకీయ నేతలు స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓడిపోతున్నారని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ కోసం ఈ ధోరణిని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.ఈ పిటిషన్ ను పరిశఋలించిన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం.. దీనిపై విచారణకు నిరాకరించింది. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ రకమైన పేర్లను పెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీకి అదెలా అడ్డంకి అవుతుంది? ఒకవేళ రాహుల్‌గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి పేర్లు పెట్టుకుంటే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా అడ్డుకుంటాం?అది వాళ్ల హక్కులను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది. -
‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే కనిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు జతకట్టి ఎన్నికల బరిలో దిగాయి. అయితే కాంగ్రెస్ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా తర్వాత, ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఇంతలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దేశ రాజధానిలోని ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారు.మీడియా నివేదికల ప్రకారం రాజధాని ఢిల్లీలో దాదాపు 20 శాతం ఎస్సీ ఓటర్లున్నారు. దీనితో పాటు యూపీకి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీఎస్పీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మే 25న ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షురాలు మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాంగ్రెస్, కొన్నిసార్లు బీజేపీ మమ్మల్ని ఉపయోగించుకున్నాయి. ఆ పార్టీలు మమ్మల్ని ‘బి’ టీమ్ అని పిలిచాయి. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏది బీ టీమ్ అనేదో తేలిపోనున్నదన్నారు.బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ పార్టీ తరపున ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అడ్వకేట్ అబ్దుల్ కలాం, దక్షిణ ఢిల్లీ నుంచి అబ్దుల్ బాసిత్, తూర్పు ఢిల్లీ నుండి న్యాయవాది రాజన్ పాల్‌ను ఎన్నికల బరిలోకి దించింది. అలాగే ఈశాన్య ఢిల్లీ నుంచి డాక్టర్ అశోక్ కుమార్ మైదాన్, న్యూఢిల్లీ నుంచి న్యాయవాది సత్యప్రకాశ్ గౌతమ్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి విజయ్ బౌధ్, పశ్చిమ ఢిల్లీ నుంచి విశాఖ ఆనంద్‌లకు టికెట్ ఇచ్చింది.దేశ రాజధాని ఢిల్లీలో బీఎస్పీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 250 స్థానాలు, ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటుంది. 2008లో ఢిల్లీలో బీఎస్పీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 2009, 2014, 2019 సంవత్సరాల్లోనూ బీఎస్పీ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఎప్పుడూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అయితే ఇప్పడు ఢిల్లీలో మారిన రాజకీయ సమీకరణలు తమకు కలిసివస్తాయని మాయావతి భావిస్తున్నారని సమాచారం. -
ఉజ్జయినిలో విచిత్ర పోటీ.. ఇద్దరు అనిల్‌లు, ఇద్దరు మహేష్‌లు!
దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల ఆసక్తికర వైనాలు కనిపిస్తున్నాయి. దీనిలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఒకటి. ఇక్కడ మే 13న ఓటింగ్ జరగనుంది. ఉజ్జయిని నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో ఇద్దరు అనిల్‌లు, ఇద్దరు మహేష్‌లు ముఖాముఖీ తలపడటం విశేషం.ఉజ్జయిని నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగినవారిలో బీజేపీ అభ్యర్థి అనిల్ ఫిరోజియా, కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ పర్మార్, భీమ్ సేన దళ్‌కు చెందిన డాక్టర్ హేమంత్ పర్మార్, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రకాష్ చౌహాన్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గంగా మాలవ్య, మహేష్ పర్మార్,అనిల్, ఈశ్వర్‌లాల్, సురేష్, ఈశ్వర్‌లాల్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.ఉజ్జయిని పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చిన 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నీరజ్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది. దీనిలో తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయి. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి -
పంజాబ్‌లో మరో లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్
పంజాబ్‌లో మరో నాలుగు లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించింది. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉండగా ప్రస్తుతం ప్రకటించిన నాలుగు స్థానాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.గురుదాస్‌పూర్ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి సుఖ్జిందర్ సింగ్ రంధవా, లూథియానా నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ అమరీందర్ సింగ్ బ్రార్ (రాజా వారింగ్) బరిలోకి దిగుతున్నారు. ఖదూర్ సాహిబ్ నుంచి కుల్బీర్ సింగ్ జిరా, ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి విజయ్ ఇందర్ సింగ్లాలను పోటీలోకి దింపింది హస్తం పార్టీ.కొత్త అభ్యర్థులను పేర్లను కాంగ్రెస్‌పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. రాష్ట్రంలోని మొత్తం 13 స్థానాలకు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
ఎట్టకేలకు ఆ మూడూ..
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పటివరకు ప్రకటించకుండా మిగిలిపోయిన మూడు స్థానాలు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించేసింది.ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డికి అవకాశం ఇచ్చారు.రఘురాంరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన డోర్నకల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్‌సభ నుంచి నాలుగుసార్లు ఎంపీగా పనిచేశారు. రఘు రాంరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సినీ హీరో దగ్గుబాటి వెంకటే‹Ùలకు వియ్యంకుడు. కాగా నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి రోజు. అగ్రవర్ణాలకు 8 స్థానాలు: రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా, ఇందులో 8 టికెట్లను కాంగ్రెస్ అగ్రవర్ణాలకు కేటాయించింది. ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఒకటి ఆదివాసీ, మరోటి లంబాడా సామాజిక వర్గాలకు కేటాయించగా, ఎస్సీ రిజర్వుడు స్థానాలైన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌లను మాలలకు, వరంగల్‌ను మాదిగలకు కేటాయించింది.మెదక్, సికింద్రాబాద్, జహీరాబా ద్ స్థానాలను బీసీలకు కేటాయించగా, హైదరాబాద్ సీటును మైనార్టీకి, కరీంనగర్ స్థానాన్ని వెలమ సామాజిక వర్గానికి, నిజామాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించడం గమనార్హం. అది బీసీకే..: మూడు లోక్‌సభ స్థానాలతోపాటు త్వరలో ఎన్నికలు జరగనున్న నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. బీసీ వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న పేరును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారుచేశారు. కరీంనగర్ లోక్‌సభ రేసులో ఆయన పేరు వినిపించినా.. అక్కడ ఓసీ వర్గానికి టికెట్ కేటాయించారు. దీంతో బీసీ వర్గానికి చెందిన మల్లన్నకు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం గమనార్హం. -
కాంగ్రెస్: ఎంపీ అభ్యర్థుల తుది జాబితా రిలీజ్
సాక్షి,ఢిల్లీ: నామినేషన్లకు గడువు ముగుస్తున్న వేళ తెలంగాణలో మూడు పెండింగ్ ఎంపీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించింది. గురువారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి, కరీంగనర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ ఉల్లాఖాన్‌ను ప్రకటించారు. అయితే వీరంతా ఇప్పటికే నామినేషన్లు వేయడం గమనార్హం. అటు ఏపీలోనూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మూడు లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. -
టీడీపీ అభ్యర్థులు కళ్లుచెదిరే ఆస్తిపరులు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థుల్లో కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అలాగే తమపై నమోదైన కేసుల వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. మాధవీరెడ్డి ఆస్తి రూ.325.61 కోట్లుటీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి ఆస్తుల విలువ రూ.133.3 కోట్లు కాగా, భర్త శ్రీనివాసులరెడ్డికి రూ. 192.61 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.12.62 లక్షలు ఉండగా, రూ.2.27 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.5.4 కోట్ల విలువ చేసే 6,438 గ్రాముల బంగారు, డైమండ్ ఆభరణాలున్నాయి. రూ.76 కోట్లు విలువ గల నివాస గృహాలు, రూ.12.70 కోట్లు విలువ గల కమర్షియల్ భవనాలు, రూ.2.02 కోట్లు విలువ గల స్థలాలు కలిగి ఉన్నారు. రూ.42.57 కోట్ల విలువైన 47. 33 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తెలిపారు. మాధవీరెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆస్తి రూ.3.36 కోట్లు! అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు వాహనం కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన దగ్గర నగదు, ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్ పథకం, ఇతరులకు ఇచ్చిన అప్పులు, బంగారు తదితర ఆభరణాలు, చరాస్తులు అన్నీ కలిపి రూ.3,35,84,334 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఆయన సతీమణికి వివిధ రూపాల్లో రూ.6,90,14, 921 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం తన స్థిరాస్తులు రూ.62,12,37,500గా కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలÔౌరి ఆస్తి రూ.101.25 కోట్లు జనసేన తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలÔౌరి తనకు రూ.101,25,39,817 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.37,85,00,723, స్థిరాస్తుల విలువ 63,40,39,094 కాగా ఆయన సతీమణి వల్లభనేని భానుమతి పేరున మొత్తం రూ.32,46,74,747 ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై రెండు కేసులు నమోదయ్యాయని బాలÔౌరి తెలిపారు. సీఎం రమేష్ ఆస్తి రూ.445.65 కోట్లుబీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన పేరిట రూ.445.65 కోట్ల ఆస్తులు, రూ.101.63 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున రూ.39,39,24,681, భార్య సీఆర్.శ్రీదేవి పేరున రూ.12,53,30,719 విలువైన చరాస్తులు చూపించారు. అలాగే ఆయన పేరిట రూ.252,66,21,246, భార్య పేరిట రూ.193,01,48,350 స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు సీఎం రమేష్‌పై కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడికి సంబంధించి మరో కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, లక్డీకాపూల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసు అధికారిని దూషించిన కేసు, అంబర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు కేసులు ఉన్నాయి. థామస్ ఆస్తి రూ.124 కోట్లు టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌పై 2017లో చెన్నై సెండియం పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు, 2018లో ఆరింబాకం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు, 2018లో తిరుపతి ఈస్టు పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు నమోదయ్యాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.124 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. టీజీ భరత్ ఆస్తి రూ.243.57 కోట్లు కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.243.57 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రూ.89.50 కోట్లు, ఆయన భార్య టీజీ శిల్పా పేరిట రూ.141 కోట్లు, కుమార్తె శ్రీ ఆర్య పేరిట రూ.10.99 కోట్లు, కుమారుడు టీజీ విభు పేరిట రూ.1.60 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తి రూ.46.76 లక్షలు ఉన్నాయి. అయితే టీజీ భరత్ సమరి్పంచిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలపలేదు. అలాగే టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.15,88,83, 622 విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడించారు. నారాయణ ఆస్తి రూ.824.05 కోట్లునెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ, ఆయన భార్య రమాదేవి పేరిట రూ.824.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరిట రూ.189.59 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. నారాయణ పేరిట బ్యాంకులో నగదు నిల్వ, వివిధ డిపాజిట్లు, వాహనాలు, బంగారు ఆభరణాల తదితరాలు కలిపి రూ.78.66 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య రమాదేవి పేరిట రూ.100.87 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.నారాయణ పేరిట మొత్తం రూ.207.50 కోట్లు, భార్య పేరిట రూ.437.02 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నారాయణ తనపై ఎనిమిది కేసులున్నట్లు తెలిపారు. నారాయణ తమ్ముడి భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు, ప్రశ్నపత్రాలు లీక్ చేశారన్న అభియోగాలతో చిత్తూరులో మరో కేసు, నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య కేసు ఇందులో ఉన్నాయి. మిగిలిన ఐదు కేసులు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసింది. వేమిరెడ్డి ఆస్తి రూ.716.31 కోట్లుటీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.716.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.77.05 కోట్లు ఉన్నట్లు తెలిపారు.అలాగే అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.1.28 కోట్ల ఖరీదైన 1,888.6 గ్రాముల బంగారం, 5.25 క్యారెట్స్ వజ్రాలు, రూ.66.80 లక్షల చేసే రెండు వాచ్‌లు, రూ.5.90 లక్షల వెండి వస్తువులు ఉన్నా యి. వేమిరెడ్డిపై 6 కేసులు కూడా నమోదయ్యాయి.