సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో ఒకరైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు.
రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్
ఈ పరిణామాల్లో భాగంగానే.. ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనకు ఆసిఫాబాద్ టికెట్టు ఖరారైనట్లు సమాచారం. రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థులను మార్చింది.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్‌ఎస్ టికెట్ దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment