Manik Rao thackeray
-
ఠాక్రేకు టీపీసీసీ వీడ్కోలు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న మున్షీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించిన నేపథ్యంలో మాణిక్ రావ్ ఠాక్రే తన సొంత రాష్ట్రా నికి వెళ్లిపోయారు. గోవా ఇన్ చార్జిగా నియమితులైన ఆయన కు ఆదివారం ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌లో పలువురు టీపీసీసీ నేత లు కలిసి అభినందనలు తెలి పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు హర్కర వేణు గోపాల్, అంజన్‌కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసీసీ సభ్యుడు ఎం.ఎ.ఫహీం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు భూపతిరెడ్డి నర్సారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆయనను కలిసి వీడ్కోలు పలికారు. ఠాక్రేకు టీపీసీసీ పక్షాన జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలోనే మహారాష్ట్ర కు వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త ఇన్చార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ త్వర లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. -
ఠాక్రే ట్రాన్స్ఫర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మాణిక్‌రావ్ ఠాక్రేను ఆ బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం తప్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వ ఏర్పాటుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇది కలకలం రేపింది. పార్టీ బాధ్యతల మార్పు అంశం మామూలే అయినా.. ఏడాది పాటు శ్రమించి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేసిన ఠాక్రేను.. అధికారం దక్కిన తర్వాత 20 రోజులకే తప్పించడం, వేరే రాష్ట్రానికి పంపడంపై టీపీసీసీ నేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర ఇన్చార్జిని మార్చడంతో.. పార్టీకి సంబంధించి కీలక సమావేశాలన్నీ వాయిదాపడ్డాయి. టార్గెట్ పూర్తయిందనే..! ఠాక్రే మార్పు వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆయనను తెలంగాణకు పంపిన టార్గెట్ అయిపోయిందని, అందుకే ఇప్పుడు మరో రాష్ట్రానికి పంపారని.. అది కూడా ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు దగ్గరగా ఉండే గోవాకు పంపారని అంటున్నాయి. అయితే ఠాక్రే మాత్రం ఆవేదనతో గాం«దీభవన్ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. శనివారం సాయంత్రం అధిష్టానం ఈ నిర్ణయం ప్రకటించిన సమయంలో ఠాక్రే గాందీభవన్‌లోనే ఉన్నారు. డిసెంబర్ 28న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో నాగ్‌పూర్‌లో జరిగే సభకు జనసమీకరణపై మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ నేతలతో చర్చిస్తున్నారు. ఇన్చార్జి మార్పు విషయం తెలియడంతో ఉన్నట్టుండి సమావేశం నుంచి వెళ్లిపోయారని.. దీంతో నేతలు ఆందోళనకు గురయ్యారని తెలిసింది. కీలక సమయంలో మార్పు ఏమిటి? ఠాక్రే స్థానంలో దీపాదాస్‌మున్షీకి బాధ్యతలు అప్పగించారు. ఆమెను కేరళ, లక్షద్వీప్‌లకు పూర్తిస్థాయి ఇన్చార్జిగా నియమించగా.. అదనంగా తెలంగాణ బాధ్యతలు ఇస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. దీనిపై టీపీసీసీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ‘‘రాష్ట్రంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సమన్వయం చేయాల్సిన, అధిష్టానానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతలు రాష్ట్ర ఇన్చార్జికి ఉంటాయి. ఇలాంటి కీలక సమయంలో ఇన్చార్జి బాధ్యతలను అదనంగా వేరే రాష్ట్ర ఇన్చార్జులకు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతుపట్టడం లేదు..’’అని వారు పేర్కొంటున్నారు. అయితే త్వరలోనే రాష్ట్రానికి కొత్త రెగ్యులర్ ఇన్చార్జిని నియమిస్తారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఏడాది కూడా కాకుండానే.. కాంగ్రెస్ అధిష్టానం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్‌రావ్ ఠాక్రేను ఈ ఏడాది జనవరి 4న నియమించింది. వెంటనే రంగంలోకి దిగిన ఠాక్రే అలుపెరగకుండా పనిచేశారు. పూర్తిగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన.. తన సహ కార్యదర్శులతో కలసి టీపీసీసీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ, అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ముందుకెళ్లారు. ఎన్నికల ఎపిసోడ్‌ను విజయవంతంగా ముగించారు. తాను ఇన్చార్జిగా ఉన్న రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో హుషారుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయన అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. గతంలో రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను అధిష్టానం గోవాకు ఇన్చార్జిగా పంపింది. ఇప్పుడు ఠాక్రేను కూడా గోవా ఇన్చార్జిగానే నియమించడం గమనార్హం. గోవా ఇన్చార్జిగా ఉన్న ఠాగూర్‌కు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు. కీలక సమావేశాలు వాయిదా! పార్టీ ఇన్చార్జి మార్పు నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కీలక సమావేశాలు వాయిదాపడ్డాయి. నిజానికి శనివారమే పార్టీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. వాటికి హాజరుకావాల్సిన నేతలకు సమాచారం ఇచ్చింది. కానీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆదివారం ఉదయం రెండు సమావేశాలు జరుగుతాయని.. వాటికి సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరవుతారని టీపీసీసీ నుంచి నేతలకు సమాచారం వెళ్లింది.కానీ కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ నేపథ్యంలో సమయం మార్చారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం జరుగుతుందని.. డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కార్యవర్గాలు, అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ఇక సాయంత్రం 4:30 గంటలకు ఇందిరా భవన్లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఉంటుందని.. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, ఎన్ఎస్యూఐ, యూత్, మహిళా, ఎస్సీ సెల్ అధ్యక్షులు హాజరుకావాలని కోరారు. కానీ ఠాక్రే మార్పు నేపథ్యంలో ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. జనవరి మొదటి వారంలో వీటిని నిర్వహిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్‌కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్‌ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
వార్ రూం... వేదికగా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో నేటి పోలింగ్ ప్రక్రియకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి సానుకూలంగా ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆ సానుకూలతను ఓట్ల రూపంలో మార్చుకునే అంశంపై దృష్టి సారించింది. బుధవారమంతా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే గాంధీభవన్ వార్ రూం నుంచి సమీక్షించారు. ఏ నియోజకవర్గంలో ప్రచార తీరు ఎలా ఉందన్న విషయాలను తెలుసుకోవడంతోపాటు పోలింగ్ ఏజెంట్ల నియామకం, పోల్ మేనేజ్మెంట్ లాంటి విషయాలపై అభ్యర్థులతోపాటు నియోజకవర్గాల పరిశీలకులు, సమన్వయకర్తలు, స్థానిక నేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ ముగిసేంతవరకు అభ్యర్థులతో సహా కేడర్ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఇతర పార్టీల వ్యూహాలు, డబ్బు, మద్యం పంపిణీ లాంటి అంశాలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ వర్గాలను సంప్రదించాలని సూచించారు. పూజలు... ప్రమాణాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు బాండ్‌పేపర్లు రాసిచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగిసిన మరుసటి రోజు దేవుడి సన్నిధిలో పూజలతో ప్రమాణాలు చేశారు. ఉదయం గాంధీభవన్‌కు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్ కొంతసేపు ప్రచార సరళిపై సమీక్ష జరిపారు. అనంతరం బిర్లామందిర్‌కు వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆరు గ్యారంటీలకు మొదటి మంత్రివర్గంలోనే చట్టబద్ధత కల్పిస్తామని, మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రమాణం చేశారు. ఆ తర్వాత నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. కేటీఆర్‌పై ఫిర్యాదు మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ను నిర్వహించాలంటూ ఆయన మీడియాలో పిలుపునివ్వడం, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్యాలయంలో రక్తదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు. అదేవిధంగా తెలంగాణలో ఓటు హక్కు ఉండి ఏపీలో నివసిస్తున్న వారిని ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరెక్కడ ఉన్నారంటే...! ఉదయం ప్రత్యేక పూజల అనంతరం రేవంత్‌రెడ్డి.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. రాత్రికి కొడంగల్‌కు చేరుకున్నారు. గురువారం కొడంగల్‌లోని జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేయనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుధవారమంతా మధిర నియోజకవర్గంలోనే ఉన్నారు. కార్యకర్తలతో తీరిక లేకుండా భేటీలు జరిపారు. మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా పోలింగ్ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లోని తన నివాసం నుంచి పోలింగ్ ఏర్పాట్లపై పార్టీ కేడర్‌తో సమీక్షించారు. -
రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీయే
సాక్షి, హైదరాబాద్: రైతుల నోటికాడ బుక్క కాంగ్రెస్‌పార్టీ ఎత్తగొట్టిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిని అడ్డుపెట్టి రైతుబంధు పంపిణీ ఆపలేదని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ 6న రైతులకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని చెప్పారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావుతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఆపాలని అక్టోబర్23న కాంగ్రెస్ నేత మాణిక్‌రావు ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, ఆరోజే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌పెట్టి ఈ విషయం చెప్పారని వెల్లడించారు. రైతుబంధు ఐదున్నర ఏళ్లుగా కొనసాగుతున్న పథకమని.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరితే పంపిణీకి అనుమతిఇచ్చిందని, దానిని తాను స్వాగతించాను తప్ప ఎన్నికల సంఘంపెట్టిన ఆంక్షలను ఎక్కడా అతిక్రమించలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీనిపై పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ఎన్నికల సంఘానికిమళ్లీ ఫిర్యాదు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రైతుబంధుకు ఎన్నికల సంఘంఅనుమతి ఇచ్చినప్పుడు పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి.. ఎలక్షన్‌కమిషన్, బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని ఆరోపించారే కానీ స్వాగతించలేదని అన్నారు. రైతులంటే రేవంత్‌కు ప్రేమ ఉంటే రైతుబంధు సాయం పంపిణీని స్వాగతించే వారు పేర్కొన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్‌పరిస్థితి ఉందన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈనెల 30న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు రైతులంటే గిట్టదు.. కాంగ్రెస్‌పార్టీకి రైతులంటేనే గిట్టదని, అది ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయేనని హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్చేసిందని, కాంగ్రెస్అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీది రైతు వ్యతిరేక వైఖరేనని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రూ.4 వేల చొప్పున ఇచ్చేవారని, కానీ కాంగ్రెస్గెలిచిన వెంటనే ఆ పథకాన్ని రద్దు చేశారని చెప్పారు. తెలంగాణలో గెలిచి రైతుబంధును రద్దు చేయాలని కాంగ్రెస్కుట్ర చేస్తోందన్నారు. ఉత్తమ్రైతుబంధును దుబారా అంటున్నారని, రేవంత్రైతులను బిచ్చగాళ్లు అంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కరెంట్ఇచ్చి రైతులను అరిగోస పెట్టిందని, ఎరువులు, విత్తనాలను పోలీస్స్టేషన్ల ముందు లైన్లో నిలబెట్టి పంపిణీ చేస్తూ బాధ పెట్టిందని అన్నారు. వ్యవసాయం దండగ అన్న నాయకుడి వారసుడు రేవంత్అని మండిపడ్డారు. అందుకే ఆయన సాగుకు మూడు గంటల కరెంట్‌చాలు అన్నారని, కర్ణాటక డిప్యూటీ సీఎం ఐదు గంటల కరెంట్‌చాలు అంటున్నారని హరీశ్ మండిపడ్డారు. అవి చిత్తు కాగితాలు.. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు బాండ్‌పేపర్లు రాసి ఇస్తున్నారని.. అయితే అవి చిత్తు కాగితాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్మూడోసారి గెలిచి హ్యాట్రిక్కొడతారని, 80 సీట్లలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
నేడే కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంకా ప్రకటించని 19 స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కట్టబెట్టిన నేపథ్యంలో ఆయన దీనిపై దృష్టి సారించారు. ఆదివారం తెలంగాణ పర్యటన సందర్భంగానే ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న ఖర్గే సోమవారం కూడా కొందరు నేతలతో చర్చించారు. పటాన్చెరు, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలకు సంబంధించి సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహతో మాట్లాడిన ఖర్గే, కమ్యూనిస్టులతో పొత్తులు, వారికి సంబంధించిన సీట్లపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో చర్చించారు. నల్లగొండ జిల్లాకు సంబంధించిన స్థానాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టులకు ఇచ్చే ఆ నాలుగు మినహా కమ్యూనిస్టులకు ఇవ్వాలని భావిస్తున్న నాలుగు నియోజకవర్గాలు మినహా, మిగతా 15 స్థానాలకు అభ్యర్థులను సోమవారం సాయంత్రానికే ఫైనల్ చేస్తారని భావించారు. అయితే రాజస్తాన్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తులో అధిష్టాన పెద్దలు బిజీగా ఉండటంతో ఆ ప్రక్రియను మంగళవారం పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చి నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రికి లేదా బుధవారం ఉదయానికి జాబితా ప్రకటించే అవకాశం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీలోనే తిష్టవేసి అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. -
35 వేల బూత్‌ల నుంచి జన సమీకరణ!
సాక్షి, హైదరాబాద్: పార్టీ అతిరథ మహారథులు హాజరు కావడంతో పాటు రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటించే ‘విజయభేరి’పై కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా ఉత్సాహంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని భావిస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణకు, తుక్కుగూడకు సమీపంలో ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లోని నియోజకవర్గాల ప్రజలను కూడా పెద్ద సంఖ్యలో తరలించేందుకు పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో టీపీసీసీ ముఖ్య నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11 నుంచి మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 35 వేల బూత్‌ల నుంచి సభకు కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చేలా చూడాలని సూచించారు. సోమవారం పార్లమెంటు పరిశీలకులు, టీపీసీసీ ఉపా ద్యక్షు లతో సమీక్ష నిర్వహించాలని, ఆ తర్వాత 12, 13, 14 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి జనసమీకరణ కసరత్తును పకడ్బందీగా పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమన్వయం చేసుకోండి: రేవంత్ విజయభేరి సభ విజయవంతం చేసే కార్యక్రమాన్ని పార్టీ నేతలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సమన్వయం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఈనెల 17న సోనియాగాంధీ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటిస్తారని, సభ ముగిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాలకు వెళ్లి ఇంటింటికీ ఈ గ్యారంటీ కార్డులను అందజేయాలని కోరారు. ఈనెల 18న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటింటికీ వెళ్లి ఈ స్కీంల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. -
భట్టి ప్రతి అడుగూ కాంగ్రెస్ విజయానికి దోహదం
సాక్షి, హైదరాబాద్: పీపుల్స్‌మార్చ్ పేరుతో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలోని ప్రతి అడుగు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకునేందుకే భట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారని అభినందించారు. ప్రజల సమస్యలను విని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేదలకు చేయబోయే మేలుపై భరోసా కల్పించగలిగారని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ రచించిన ‘పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర’డైరీని శనివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఠాక్రే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండుటెండలను కూడా లెక్క చేయకుండా 110 రోజుల పాటు భట్టి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని చెప్పారు. ఇంతటి సాహసోపేతమైన పాదయాత్రను తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇంతకుముందు చేయలేదన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కోసమే: భట్టి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా తన యాత్రను కొనసాగించానని చెప్పారు. ఏఐసీసీ ఆదేశాలతో చేపట్టిన ఈ యాత్రను ఠాక్రే, రోహిత్‌చౌదరి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, శ్రీధర్‌బాబు తదితరులు ఆన్నీ తామై నడిపించారని, నడిచింది తానే అయినా పాదయాత్ర విజయవంతం వెనుక ఆ నాయకులతో పాటు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఉందన్నారు. తన యాత్రకు పీపుల్స్‌మార్చ్ అనే పేరు పెట్టింది ప్రజాయుద్ధనౌక గద్దర్ అని, యాత్రలో పాల్గొని ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ గద్దర్ ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని, పార్టీ విజయం కోసం తపనతో పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని, గౌరవించుకుంటామని భరోసా ఇచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రసంగించిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, కాంగ్రెస్ పార్టీ నేతలు చిన్నారెడ్డి, బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య, చల్లా నర్సింహారెడ్డి, రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర డైరీని రచించిన సీనియర్ జర్నలిస్టు సురేందర్‌ను పలువురు అభినందించారు. -
ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ ‘పోస్టర్ ఆవిష్కరణ’
చార్మినార్: చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అనుమతిలేదంటూ పోలీసులు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చార్మినార్ వద్ద చేపట్టిన ‘బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే’అనే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేను పోలీసులు గుల్జార్‌హౌస్ వద్ద అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పడంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. అనంతరం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొద్దిసేపు అక్కడ నిరసన తెలపడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సిటీ కాలేజీ వరకు తరలించి వదిలేశారు -
దేశ భద్రత కోసమే రాహుల్ పోరాటం
సాక్షి, హైదరాబాద్ / ఖైరతాబాద్ / దిల్సుఖ్నగర్ / గచ్చిబౌలి: దేశాన్ని ఒక్కటి చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ, డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాల వరకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఐమాక్స్ ఇందిరాగాంధీ రోటరీ చౌరస్తాలో మాట్లాడుతూ.. దేశ భద్రత, సమగ్రత కోసం రాహుల్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని అహింసా పోరాటాన్ని పునాదిగా వేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు, 4,183 కిలోమీ టర్లు రాహుల్ గాంధీ నడిచారని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటించాలి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని పొలిమేర దాటే వరకు తరమాల్సిన బాధ్యత ప్రజ లందరిమీద ఉందని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను గెలిపించాలని ప్రతిసారీ అసదుద్దీన్ చెప్తున్నాడని, అసలు ఎందుకు గెలిపించాలని నిలదీశారు. త్రిపు ల్ తలాక్‌కు మోదీకి మద్దతుగా నిలిచినందుకా, 370 ఆర్టికల్‌కు ఓటు వేసినందుకా, నోట్ల రద్దు, జీఎస్టీలో మద్దతు తెలిపినందుకు గెలిపించాలా.. అని అసదుద్దీన్‌ను ప్రశ్నించారు. లక్ష కోట్లు లూటీ చేసిన కేసీఆర్ ఫ్యామిలీకి మద్దతు తెలుపుతున్నారంటే దాని ఆంతర్యమేంటన్నారు. దేశ హోంమంత్రికి చిల్లర రాజకీయం తగునా 16,17,18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని తలపెడితే అధికారం ఉంది కదా అని తాము బుక్ చేసుకున్న గ్రౌండ్‌ను రద్దు చేసి బీజేపీ వాళ్లు గుంజుకున్నారని రేవంత్ నిందించారు. ఇంత చిల్లర రాజకీయం హోంశాఖ మంత్రి చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేశాయని, ఇందుకు ప్రతిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కదలి వచ్చి మూడు రోజులపాటు హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టాలని, అత్యద్భుతంగా ఏఐసీసీ సమావే శాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ... దేశాన్ని కలిపేందుకు ధర్మాలను ఒకటి చేసేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేశారని ఇది ప్రపంచ రికార్డ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్, రోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలో భట్టి.. కోదాడలో ఉత్తమ్..ఎల్బీనగర్లో యాష్కీ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టా యి. మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేటలో జరిగిన పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కోదాడలో జరిగిన యాత్రలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్బీనగర్లో జరిగిన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. రేపు భట్టి పాదయాత్ర ‘డైరీ’ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర డైరీని శనివారం ఆవిష్కరించనున్నారు. సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సురేందర్ రచించిన ఈ డైరీని గాంధీభవన్‌లో విడుదల చేయనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే హాజరుకానున్నారు. మేకిన్ ఇండియా అని భారత్ పేరు పెడతారా.. మేకిన్ ఇండియా అన్న పీఎం మోదీ ఇప్పుడు ఇండియా పేరు తీసేసి భారత్ పేరు పెడతాననడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు కలిసి ఇండియా కూటమి కడితే.. దాన్ని ఎదుర్కోలేక ఇండియా పేరు మారుస్తానన్న భావదారిద్య్రం ప్రధాన మంత్రికి, బీజేపీకి వచ్చిందంటే సిగ్గుపడాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలే గానీ ఈ దేశం పేరు మారిస్తే ఎవరి బతుకుల్లోనూ మార్పులు రావన్నారు. మోదీ పాలనలో దేశ భద్రతకే ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఖాయం: పొంగులేటి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తుందని... అందరికీ ఇందిరమ్మ పథకాలు అందిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో–చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీనియర్ నేత రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లో ర్యాలీ నిర్వహించారు. పొంగులేటి మాట్లాడుతూ జోడో యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకున్న రాహుల్ ప్రధాని అయిన తరువాత పరిష్కరిస్తారని తెలిపారు. -
గాందీభవన్‌లో ‘రైతు గోస’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్‌తో సోమవారం తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ‘రైతు గోస’కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, జాతీయ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, అన్ని జిల్లాల కిసాన్ సెల్ అధ్యక్షులు పాల్గొన్నారు. పలు గ్రామాలకు చెందిన రైతులు, బాధితులు హాజరై తమ సమస్యను, ఆవేదనను వివరించారు. ధరణితో భూమి హక్కుల సమస్య తలెత్తిన నిజమైన హక్కుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, వర్షాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం ఇవ్వాలని.. దళితులు భూములను లాక్కోవడం ఆపేయాలని, తీసుకున్న భూములను 15 రోజుల్లో తిరిగి ఇవ్వాలని కార్యక్రమంలో తీర్మానించారు. రైతులను నట్టేట ముంచిన సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచిందని, దేశంలో పంటల బీమా పథకం లేని రాష్ట్రం ఒక్క తెలంగాణనేనని అన్వేశ్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు భూములిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కుని పెద్ద కంపెనీలకు అమ్ముతోందని, రైతులను బజారున పడేస్తుందని ధ్వజమెత్తారు. ధరణి వచ్చాక లక్షలాది మందికి భూమి హక్కులు రాలేదన్నారు. భూసర్వే జరగకుండా భూమి హక్కుల సమస్య పరిష్కారం కాబోదని స్పష్టం చేశారు. ఇప్పటికీ 9 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ రైతులకు సమస్యలు వచ్చినా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అన్ని మండలాల్లో కిసాన్ కాంగ్రెస్ నిర్మాణంతో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
రేఖా నాయక్ తిరుగుబాటు..కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో ఒకరైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ ఈ పరిణామాల్లో భాగంగానే.. ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనకు ఆసిఫాబాద్ టికెట్టు ఖరారైనట్లు సమాచారం. రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల భేటీ ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణా మాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు గాను ఆదివారం సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ రాజకీ య వ్యవహారాల కమిటీ(పీఏసీ) గాంధీభవన్‌లో సమావేశం కానుంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, ఇతర సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సుయాత్ర, ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు, ప్రియాంకా గాంధీ హాజరు కానున్న కొల్లాపూర్ సభ అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. బస్సుయాత్రపై నిర్ణయం రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగా ఉన్నామని చాటేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నేతలతో కలిసి బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ యాత్ర విధివిధానాలను ఖరారు చేసుకోవడంతో పాటు ఎప్పుడు యాత్ర చేపట్టాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణ యం తీసుకోనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతలు పార్టీలో చేరేందుకు మొగ్గుచూపు తున్న నేపథ్యంలో వారి చేరికలకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. దీంతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక సందర్భంగా ఈనెల 30న కొల్లాపూర్‌లో జరిగే సభకు హాజరు కావాలంటూ పార్టీ అధిష్టానాన్ని టీపీసీసీ ఇప్పటికే కోరింది. ఈ సభ ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. నేడు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యమ కారులు నేడు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగే ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తారు. రాష్ట్ర సాధన ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకుని ఎలా పనిచేయాలన్న దానిపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. పొన్నంకు చైర్మన్ పదవి? మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు రాష్ట్ర స్థాయిలో ఏర్పా టు చేసే ఓ కమిటీకి చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో చోటు లభించకపోవడంతో పొన్నం కొంత అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు విని పిస్తున్నాయి. అయితే ఆయనకు కమిటీ చైర్మన్ హోదా ఇవ్వాలన్న ఆలోచనతోనే పీఈసీ సభ్యునిగా చేర్చలేదనే చర్చ గాంధీభవన్‌లో జరుగుతోంది. పార్టీ మేనిఫెస్టో, కోఆర్డినేషన్, ఎలక్షన్ మేనేజ్మెంట్, ఏఐసీసీ కార్య క్రమాల అమలు, శిక్షణ, మీడియా కమిటీలను ఏఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఈ కమి టీల్లో ఏదో ఒక కమిటీకి సీనియర్ నేత పొన్నంను చైర్మన్‌గా ప్రకటించే అవకా శాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ కమిటీ లను మరో వారం, పది రోజుల్లోగా ఏఐసీసీ ప్రకటిస్తుందన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
Telangana: బస్సు రూట్లో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కలసికట్టుగా ముందుకెళ్లాలని, అంతా ఐక్యంగా ఉన్నామని ప్రజలకు తెలియజెప్పేందుకు రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేపట్టాలని టీపీసీసీ కీలక నేతలు నిర్ణయించారు. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో చర్చించాకే నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కో–చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్య నేతలు ఎం.కోదండరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, బి.మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు ఈ లంచ్ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రాష్ట్ర పార్టీలోని అంతర్గత పరిణామాలపై చర్చించారు. దూకుడుగా వెళ్లాల్సిందే.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్, బీజేపీలపై రాజకీయ దాడులు చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన సఫలీకృతం అవుతున్నామని.. ఇక మీద ఈ దూకుడు మరింత పెంచాలని భేటీలో నేతలు నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా నేతలంతా కలసి పనిచేస్తున్నారన్న భావన కలిగించాలని, ఇందుకోసం ఐక్యంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. యాత్రలో ఎవరెవరు పాల్గొనాలి? ఎప్పట్నుంచి ఎప్పటి వరకు, ఏ రూట్లో యాత్ర నిర్వహించాలన్న దానిపై ఈనెల 22న లేదా 23న పీఏసీ సమావేశం నిర్వహించి ఖరారు చేయాలని అభిప్రాయానికి వచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వే.. ఎన్నికల కోసం అభ్యర్థుల ఖరారు అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేయించాలని నేతలు నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలు, అభ్యర్థుల బలాబలాలతోపాటు ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గం ఎంత మేర ప్రభావం చూపుతుందన్న అంశాలపై పక్కా అవగాహనకు వచ్చేలా సర్వే ఉండాలని.. త్వరగా దానిని ప్రారంభించాలని తీర్మానించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ హామీలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా ప్రచారం చేయాలని.. ప్రధానమైన అంశాలను ఎంచుకుని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అభిప్రాయానికి వచ్చారు. ఇక కొత్తగా పార్టీ చేరే వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యే టికెట్లపై ఆశలు పెట్టుకుని వస్తున్నారని.. బేషరతుగా పార్టీలో చేరాలనుకున్న వారికే అవకాశం ఇవ్వాలని, ఎన్నికల సమయంలో సమర్థులకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరే సందర్భంగా చేపట్టే బహిరంగసభ కోసం ఈనెల 30వ తేదీలోపు తేదీని ఖరారు చేసేలా ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలని, ప్రియాంకా గాంధీ సమయం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఠాక్రే, రేవంత్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ నుంచి బీసీని సీఎం అభ్యర్థి ప్రకటిస్తారా? – ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ – బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ మాత్రమేనని వ్యాఖ్య రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని, బీసీల గురించి తమకు బీఆర్ఎస్ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీని పీసీసీ చీఫ్ చేసిందని, బీఆర్ఎస్కు దమ్ముంటే బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ చేశారు. బుధవారం తన నివాసంలో కీలక నేతలతో భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని విమర్శలకు రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారే తప్ప బీసీలను కించపర్చేలా మాట్లాడలేదని పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని చాటేందుకే ఈ భేటీ నిర్వహించామని చెప్పారు. మీటింగ్‌లో చర్చించిన అంశాలన్నీ బయటికి వెల్లడిస్తే నాలుగు నెలల తర్వాత ఖాళీ కావాల్సిన ప్రగతిభవన్ ఇప్పుడే ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహల్‌గాంధీ తెలంగాణలో రాజకీయాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీల పనితీరు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల విషయాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలు, మైనార్టీల మొగ్గు, ఓబీసీల జనగణన వంటి అంశాలపై చర్చించారు. సోమవారం మధ్యాహ్నం కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తూ మార్గమధ్యలో ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో ఆగారు. కొద్దిసేపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్‌చౌదరిలు పాల్గొన్నారు. జాతీయ నాయకులొస్తే బాగుంటుంది.. రాష్ట్రంలో హాథ్‌సే హాథ్ జోడో యాత్రలు జరుగుతున్న తీరు గురించి రాహుల్ అడిగి తెలుసుకున్నారు. యాత్రలు బాగా జరుగుతున్నాయని, అయితే వీటికి జాతీయ స్థాయి నేతలు హాజరయితే బాగుంటుందని రేవంత్‌రెడ్డి కోరినట్టు తెలిసింది. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతను కాంగ్రెస్ పారీ్టవైపు మరల్చుకునే విషయంలో ఎలాంటి కార్యాచరణను అమలు చేస్తారన్న దానిపై కూడా రాహుల్ చర్చించారు. బీజేపీ కార్యకలాపాలపై కూడా ఆరా తీశారు. మైనార్టీలు.. ఓబీసీల జనగణన.. ముఖ్యంగా రెండు ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాష్ట్రంలో మైనారీ్టల మూడ్ ఎలా ఉందని, ఆ వర్గాలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశముందని రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలోని మైనారీ్టలు ఎక్కువగా ఎంఐఎం వైపే ఉంటారని, గ్రామీణ జిల్లాల్లోని మైనార్టీలు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్కు అండగా ఉంటారని రాష్ట్ర నేతలు తెలిపారు. అయితే బీజేపీపై కాంగ్రెస్ పోరాటం, రాహుల్ గాంధీపై అనర్హత వేటు లాంటి అంశాల నేపథ్యంలో ఈసారి మైనార్టీల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా మరలే అవకాశముందని నేతలు వివరించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఓబీసీల జనగణన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జనగణనకు కట్టుబడి ఉందన్న అంశాన్ని ప్రజలకు చెప్పాలని రాహుల్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ విధానం అనుకూలంగా ఉన్నందున అన్ని రాష్ట్రాల పీసీసీలతో తీర్మానాలు చేయించాలని, దీంతో ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ పారీ్టకి సానుకూలంగా మారే అవకాశం ఉందని యాష్కీ సూచించగా, రాహుల్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. 30–35 నిమిషాల పాటు రాష్ట్ర నేతలతో మాట్లాడిన రాహుల్.. శాండ్విచ్ తిని, తేనీరు సేవించి ఢిల్లీ వెళ్లారు. చదవండి: ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా నేతలు.. అసమ్మతిపై బీఆర్ఎస్ ఆరా! -
లిక్కర్ స్కాంపై ఫిర్యాదు చేసింది మేమే
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కాంపై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, తమ పార్టీ పోరాటం కారణంగానే ఈ స్కాంలో కదలిక వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా అన్నారు. లిక్కర్ స్కాంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ స్కాంలో నిందితులకు ఎందుకు మద్దతు తెలుపుతుందని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్‌లతో కలసి మీడియాతో మాట్లాడుతూ తమ పోరాటం కారణంగానే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపిందని అన్నారు. ‘శంషాబాద్‌లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్లలో కేవలం కవిత మాత్రమే కనిపిస్తున్నారు. బీఆర్ఎస్లో ఇంకో మహిళా నాయకురాలు లేరా? కవితకు మహిళల సాధికారత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?’అని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు మహిళల హక్కుల గురించి కవిత ఎన్ని పోరాటాలు చేశారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తప్ప ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పక్షాన సర్పంచ్ కూడా గెలవడని, అలాంటి పార్టీలతో కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల డబ్బులు కొల్లగొట్టి ఎన్నికల కోసం డబ్బులు సిద్ధం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, బీజేపీతో పోరాడుతున్నామంటూ బీఆర్ఎస్ కలరింగ్ ఇస్తోందని విమర్శించారు. -
విభేదాలు పక్కన.. యాత్రలు పక్కాగా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్నిస్థాయిల్లో ఉన్న పార్టీ నేతలు విభేదాలను పక్కనపెట్టి హాథ్ సే హాథ్ జోడో యాత్రలను కలిసికట్టుగా విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రలపై శనివారం ఆ పార్టీ మండలాల అధ్యక్షులతో గాందీభవన్ లో ఆయన సమీక్ష నిర్వహించారు. మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ జోడో యాత్రల్లో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సందేశం తెలంగాణలోని ప్రతి ఇంటికీ చేరే లా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులన్నింటినీ అదానీకి కట్టబెడుతుంటే రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం పేదల భూములు గుంజుకుంటోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, కాంగ్రెస్ పాలనలో జరిగిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకు యాత్రలను వినియోగించుకోవాలన్నారు. రానున్న 15 రోజులపాటు రాష్ట్రంలో జోడో యాత్రల ను జోరుగా నిర్వహించాలని, ఆ తర్వాత స మీక్ష జరుపుతామని ఠాక్రే చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారులుగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన పవర్ ప్రాజెక్టులతో రాష్ట్రంలో కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతోందని విమర్శించారు. కాగా, ఈనెల 16 నుంచి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు పార్టీ నేతలంతా సహకరించి విజయవంతం చేయాలని ఠాక్రే పార్టీ శ్రేణులకు సూచించారు. రాజకీయాలు కలుషితం: ఉత్తమ్ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ కెపె్టన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో అత్యంత కష్టమైన పని గడప గడపకూ ప్రచారమేనని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పనినే భుజాన పెట్టుకుందని అన్నా రు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు కలుషితం అయ్యాయని, మొత్తం డబ్బు మయం చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకునేందుకు ఇంటింటికీ ప్రచారం ఉపయోగపడుతుందని చెప్పారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ పార్టీ లో నేతలు గొడవలు పడితే కార్యకర్తలే కొట్టే పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు జోడో యాత్రల తెలంగాణ సమన్వయకర్త గిరీశ్ చోడంకర్, ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నదీమ్ జావెద్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీల అధ్యక్షులు, మండల పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. -
వచ్చేవి కాంగ్రెస్ ప్రభుత్వాలే..
కోదాడ: అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాబోతున్నాయని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. ప్రజలను అక్కున చేర్చుకొని ముందుకుపోవడానికి నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన ‘గడప గడపకు కాంగ్రెస్’కార్యక్రమంలో, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించా లని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గడపకు రాహూల్‌గాంధీ సందేశం తీసుకెళ్లాలని, దీనిలో ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొనాలని స్పష్టం చేశారు. గడప గడపకు పార్టీని తీసుకెళ్లాలి బీజేపీ నుంచి దేశాన్ని కాపాడటానికి రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిర్వహిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాణిక్‌రావు ఠాక్రే పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగం పెరగడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమని మండిపడ్డారు. దేశాన్ని అదానీకి దోచిపెట్టారని, అదానీ చేసిన ఆర్థిక కుంభకోణంలో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు. ఆయన వెంట ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, బోస్‌రాజు, నిరంజన్, పటేల్ రమేష్‌రెడ్డి తదితరులున్నారు. దామోదర్‌రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్‌రెడ్డి కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో సాక్షాత్తు మాణిక్‌రావు ఠాక్రే ఎదుటే సూర్యాపేట నియోజకవర్గ నేతలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సూర్యాపేట కాంగ్రెస్ కంచుకోట అని, నేడు దానికి బీటలు వారడానికి కారణం ఎవరో చెప్పాలని, తమను కనీసం సమావేశానికి ఆహ్వానించలేదని రమేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సమయంలో దామోదర్‌రెడ్డి కల్పించుకొని.. టీడీపీ నుంచి వచ్చిన వారికి అంత ప్రా«ధాన్యమివ్వాల్సిన అవసరం లేదనడంతో గొడవ మొదలైంది. దీంతో ఠాక్రే, ఉత్తమ్ జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. -
రజాకార్లను తరిమినోళ్లం.. కేసీఆర్‌ను ఓడించలేమా?
సాక్షి, నాగర్‌కర్నూల్: సీఎం కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతోనే బీఆర్ఎస్ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మార్కండేయ ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేసిన దళితులు, గిరిజనులపై బీఆర్ఎస్ నేతలు దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. భూస్వాములు, దొరలను నిలువరించిన ఈ గడ్డ దళితులపై దాడులను చూస్తూ ఊరుకోదన్నారు. రజాకార్లను తరిమికొట్టిన, ఆంధ్రా నాయకులను పొలిమేర దాటించిన వాళ్లం రేపు కేసీఆర్‌ను ఓడించలేమా? అని ప్రశ్నించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ’లో రేవంత్ మాట్లాడారు. దళితులకు కాంగ్రెస్‌తోనే అండతెలంగాణకు తొలి సీఎం దళితుడేనని చెప్పి దరిద్రపు సీఎం వచ్చారని.. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి జరపని వ్యక్తి దళితుల పేరుచెప్పి సీఎం కుర్చీలో కూర్చున్నారని రేవంత్ విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలమూరు బిడ్డ, ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌ను గొంతుమీద కాలుపెట్టి తొక్కడానికి ప్రయత్నిస్తే.. ఆయన బయటికొచ్చి దళిత బిడ్డల పౌరుషాన్ని చూపుతున్నారన్నారు. దొరలకు బీఆర్ఎస్, పెట్టుబడిదారులకు బీజేపీ అండగా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉంటుందని చెప్పారు. తమ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా దళితుడికి అవకాశం ఇచ్చామని, పంజాబ్‌కు దళితుడిని సీఎం చేశామని పేర్కొన్నారు. మేం నెత్తిమీద కాలుపెట్టి తొక్కుతాం 2018 ఎన్నికల సమయంలో కుర్చీ వేసుకుని మార్కండేయ ప్రాజెక్టును పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారని.. ఇప్పటివరకు తట్టెడు మట్టికూడా తీయలేదని రేవంత్ చెప్పారు. ‘‘ప్రాజెక్టు కట్టకుండా ఫాంహౌస్‌లో పడుకున్న సీఎంను ఈడ్చుకురావడానికే నాగం జనార్దన్‌రెడ్డి అక్కడికి పోయిండు. చేతనైతే ప్రాజెక్టు కట్టాలి్సందే. చేతకాకపోతే మీరు వచ్చాక కట్టుకోండి అని చెప్పి ఉండాల్సింది. కానీ ప్రాజెక్టుపై ప్రశ్నించిన గిరిజనుడు వాల్యానాయక్, దళితుడు రాములుపై దాడి చేస్తారా? వారి గొంతుపై కాలు పెట్టి తొక్కుతారా? దాడి చేసినవారికి ఈ ధైర్యం ఎక్కడిది. కేసీఆర్ నుంచే వచ్చింది. భూస్వాములు, దొరలను నిలువరించిన ఈ గడ్డ దళితులపై దాడులను చూస్తూ ఊరుకుంటుందా? 1,200 మంది శవాల పునాదుల మీద గద్దెనెక్కి ఇప్పుడు కాలుపెట్టి తొక్కుతారా? ఎన్నికలప్పుడు మా ఊరు, వాడ, బస్తీ, చెంచుపెంటలు, గూడెలకు వస్తావు కదా.. అప్పుడు నీ నెత్తిమీద కాలు పెట్టి తొక్కుతాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. మేం కడితే.. మీరు ఫొటోలు దిగుతారా? పాలమూరులో జూరాల, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ చెప్పారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ పూర్తిచేస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాల్వల దగ్గర ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాలు, మూడెకరాల భూమి, మాదిగ వర్గీకరణ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై సర్కారు దౌర్జన్యం: మాణిక్‌రావు ఠాక్రే రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వ దౌర్జన్యం దుర్మార్గమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే మండిపడ్డారు. వాల్యానాయక్, రాములుపై జరిగిన దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల వికాసం, పేదలు, గిరిజనులు, దళితుల అభివృద్ధి కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. కానీ ఇప్పుడు అన్నీ అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ తోడ్పాటుతోనే బీఆర్ఎస్ శ్రేణుల దుర్మార్గాలు: భట్టి రాష్ట్రం వచ్చాక దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత నాగం జనార్దనరెడ్డి కళ్ల ముందే దౌర్జన్యం జరిగిందని.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల దుర్మార్గాలకు ప్రభుత్వ సహకారమే దీనికి కారణమని మండిపడ్డారు. కాగా.. నాగర్‌కర్నూల్ సభలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నదీమ్ జావేద్, నేతలు మల్లు రవి, షబ్బీర్‌అలీ, నాగం జనార్దనరెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, రా>ములు నాయక్, శివసేనరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతం, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్‌లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పని మీది.. పరిష్కారాలు నావి!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే చెప్పారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్‌కు అత్యంత అవసరమనే విషయాన్ని పార్టీ నేతలు గుర్తెరగాలని హితవు పలికారు. ఇన్చార్జిగా నియమితులైన తరువాత తొలిసారిగా బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ఠాక్రే రెండురోజుల పాటు పార్టీలోని వివిధ స్థాయి నాయకులతో సమావేశమయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేతలతో పాటు పీఏసీ, పీఈసీ, డీసీసీ, పీసీసీ కార్యవర్గాలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు, అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా చర్చించారు. జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న ‘హాథ్‌సే హాథ్ జోడో’కార్యక్రమంపైనే ప్రధానంగా దిశా నిర్దేశం చేసిన ఠాక్రే.. పనిలో పనిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవనే విషయాన్ని నొక్కి చెపుతూ అంతర్గత విభేదాలను పక్కనబెట్టి సీనియర్లు, అనుభవజ్ఞులు అంతా ఒక్కతాటిపైకి వచ్చి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా ఏం చేయాలనే దానిపై దృష్టి పెడితే.. చిన్న చిన్న సమస్యలు పరిగణనలోకి రావని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండడం ద్వారా, వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందనే భద్రతా భావాన్ని కల్పించాలని సూచించారు. అంతర్గత సమస్యలను తనకు వదిలేసి, ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని నేతలందరికీ స్పష్టం చేశారు. సమష్టిగా పనిచేస్తే అధికారం మనదే.. రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి మరోసారి గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని ఠాక్రే చెప్పారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేననే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికీ బలంగా ఉందని అన్నారు. అయితే అంతర్గత కుమ్ములాటలు, పార్టీ ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వాసంలోకి తీసుకోలేని పరిస్థితి ఉందని వివరించారు. అందువల్ల బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తూ, జనం సమస్యలపై పోరాడితే స్వల్ప వ్యవధిలోనే వారిని కాంగ్రెస్ వైపు మళ్లించవచ్చని సూచించినట్లు తెలిసింది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒకే తాను ముక్కలనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి సంస్థాగతంగా బలం లేదని, గత ఎన్నికల్లో వంద చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని నాయకులు ఠాక్రే దృష్టికి తీసుకురాగా.. సమష్టిగా పనిచేస్తే అధికారం మనదేనని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. అంతర్గత కుమ్ములాటలపై సీరియస్! పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై ఠాక్రే ఒకింత సీరియస్ అయినట్లు తెలిసింది. పార్టీకి ఉన్న అనుకూలతలను అంతర్గత విభేదాలతో దూరం చేస్తున్నారని ఆయా సమావేశాల్లో వ్యాఖ్యానించినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్న సమావేశంలో.. పార్టీకి నాయకత్వం వహిస్తున్న సీనియర్లు, అనుభవజ్ఞులు ఒక్కతాటిపై నడిస్తే, జిల్లాలు, నియోజకవర్గాల్లో సమన్వయం ఉంటుందని చెప్పినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. కలిసికట్టుగా పనిచేయాలంటూ హెచ్చరికలతో కూడిన హితబోధ చేసినట్లు తెలిసింది. చెత్తబుట్టలో షోకాజ్ నోటీసులు: కోమటిరెడ్డి భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నాకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయి. మా ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడం లేదు. నా ఫొటో మార్ఫింగ్ అయిందని స్వయాన సీపీ చెప్పారు. ఇక పీసీసీ కమిటీలను నేను పట్టించుకోను. నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో నేను కూర్చోవాలా?’అని వ్యాఖ్యానించారు. తాను నియోజకవర్గంలో బిజీగా ఉండడం వల్లే బుధవారం ఠాక్రేను కలవలేదని చెప్పిన ఆయన.. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు కలవలేదో వాళ్లనే అడగండి అని అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ సమయంలో సమావేశమైన ఠాక్రే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. మునుగోడు ఎన్నిక సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు రాష్ట్రంలో వైఎస్ షర్మిల, చంద్రబాబు రాజకీయ అడుగులు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. టీపీసీసీ నాయకులు షర్మిలపై విమర్శలు చేసినట్లుగా..చంద్రబాబుపై చేయడం లేదని కోమటిరెడ్డి వివరించినట్లు సమాచారం. ఇలావుండగా రెండురోజుల రాష్ట్ర పర్యటన ముగించిన ఠాక్రే గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. -
ఎత్తుకు పై ఎత్తు!
ఎంపీసీసీ అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించనున్న కాంగ్రెస్? సాక్షి, ముంబై: పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్న చందంగా తయారైంది రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల పరిస్థితి. ముఖ్యమంత్రినిగానీ, ఎంపీసీసీ అధ్యక్షుడినిగానీ మార్చేదిలేదంటూ స్పష్టంగా చెప్పిన అధిష్టానం ఇప్పుడు ఎంపీసీసీ అధ్యక్ష పదవికి కొత్తవారిని ఎంపికచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇలా నిర్ణయం మార్చుకోవడం వెనక అసలు కారణంగా ఎన్సీపీ రాష్ట్రాధ్యక్షుడిని మార్చడమేనంటున్నారు. బీసీ నేతకు రాష్ట్రాధ్యక్ష పదవిని కట్టబెట్టి ఓట్లు కొల్లగొట్టాలని ఎన్సీపీ చూస్తుండగా ఎత్తుకు పైఎత్తుగా బీసీల్లో మహిళకు ఎంపీసీసీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం రాజ్యసభ సభ్యురాలు రజనీపాటిల్ పేరును పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. దీంతో ప్రస్తుత ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేకు పదవీ గండం తప్పదంటున్నారు. ఆరేళ్లుగా ఆ పదవిలో కొనసాగిన ఠాక్రే రికార్డే సృష్టించారు. ఆయన స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోందని తెలియడంతో కాంగ్రెస్‌లోని మిగతా ఆశావహులు కూడా తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం మహిళకు ఈ పదవి కట్టబెట్టాలని చూస్తుండడంతో ఇప్పటిదాకా ఈ పదవి రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్న వ్యవసాయశాఖ మంత్రి రాధాకృష్ణ విఖేపాటిల్, సీనియర్ నాయకుడు శివాజీరావ్ మోఘే ఆశలపై నీళ్లు చల్లినట్లయిందంటున్నారు. అయితే వీరి పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నాయని, అవకాశాలు అప్పుడే చేజారలేదని మరో సీనియర్ నేత వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చాలని ఎన్సీపీ నుంచి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ నుంచి కూడా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ తొలగించేది లేదంటూ కాంగ్రెస్ పృథ్వీరాజ్ చవాన్‌కు అభయమిచ్చింది. ముఖ్యమంత్రిని మేము మారిస్తే మీరు ఉపముఖ్యమంత్రిని మారుస్తారా? అని కాంగ్రెస్ ఎన్సీపీని ప్రశ్నించడంతో పవార్ వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడిని మార్చడం ద్వారా పవార్ కాంగ్రెస్‌ను ఇరుకునబెట్టాలనేది ఎన్సీపీ వ్యూహంగా కనిపించగా కాంగ్రెస్ కూడా ధీటుగానే సమాధానం ఇచ్చేందుకు రజనీపాటిల్ పేరును తెరపైకి తెచ్చింది. ఎన్సీపీలో మహిళలకు సుప్రియా సూలే నేతృత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్‌లో రాష్ట్రం నుంచి మహిళలకు నేతృత్వం వహిస్తున్నవారు ఎవరూ లేకపోవడం కూడా మహిళను ఎంపిక చేయాలనే ఆలోచనకు బలం చేకూర్చిందని చెబుతున్నారు. రెండేళ్ల కిందట కూడా ఎంపీసీసీ అధ్యక్ష పదవిని మహిళకు కట్టబెట్టాలనే విషయంపై చర్చలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడైనా రజనీపాటిల్‌కు అప్పగిస్తారా? లేకు ఊరించి.. ఉసూరుమనిపిస్తారా చూడాలి.