సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల భేటీ ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణా మాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు గాను ఆదివారం సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ రాజకీ య వ్యవహారాల కమిటీ(పీఏసీ) గాంధీభవన్‌లో సమావేశం కానుంది.
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, ఇతర సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సుయాత్ర, ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు, ప్రియాంకా గాంధీ హాజరు కానున్న కొల్లాపూర్ సభ అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
బస్సుయాత్రపై నిర్ణయం
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగా ఉన్నామని చాటేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నేతలతో కలిసి బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ యాత్ర విధివిధానాలను ఖరారు చేసుకోవడంతో పాటు ఎప్పుడు యాత్ర చేపట్టాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణ యం తీసుకోనున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతలు పార్టీలో చేరేందుకు మొగ్గుచూపు తున్న నేపథ్యంలో వారి చేరికలకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. దీంతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక సందర్భంగా ఈనెల 30న కొల్లాపూర్‌లో జరిగే సభకు హాజరు కావాలంటూ పార్టీ అధిష్టానాన్ని టీపీసీసీ ఇప్పటికే కోరింది. ఈ సభ ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
నేడు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యమ కారులు నేడు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగే ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తారు. రాష్ట్ర సాధన ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకుని ఎలా పనిచేయాలన్న దానిపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.
పొన్నంకు చైర్మన్ పదవి?
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు రాష్ట్ర స్థాయిలో ఏర్పా టు చేసే ఓ కమిటీకి చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో చోటు లభించకపోవడంతో పొన్నం కొంత అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు విని పిస్తున్నాయి. అయితే ఆయనకు కమిటీ చైర్మన్ హోదా ఇవ్వాలన్న ఆలోచనతోనే పీఈసీ సభ్యునిగా చేర్చలేదనే చర్చ గాంధీభవన్‌లో జరుగుతోంది.
పార్టీ మేనిఫెస్టో, కోఆర్డినేషన్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్, ఏఐసీసీ కార్య క్రమాల అమలు, శిక్షణ, మీడియా కమిటీలను ఏఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఈ కమి టీల్లో ఏదో ఒక కమిటీకి సీనియర్ నేత పొన్నంను చైర్మన్‌గా ప్రకటించే అవకా శాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ కమిటీ లను మరో వారం, పది రోజుల్లోగా ఏఐసీసీ ప్రకటిస్తుందన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment