ponnam prabhakar
-
తెలంగాణ : కరాటే ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్ vs స్పీకర్ గడ్డం ప్రసాద్ (ఫొటోలు)
-
యువత అత్యాశకు పోయి చిక్కుల్లో పడొద్దు: పొన్నం
-
‘ ప్రపంచ మీడియా హైదరాబాద్‌కు రావడం ఇష్టం లేదా?’
హైదరాబాద్: తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ వంటి నగరంలో అందాలు పోటీలు నిర్వహించాలని భావిస్తుంటే, దానికి కేటీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటన్నారు. అందాల పోటీలు నిర్వహించే సత్తా తెలంగాణకు లేదని కేటీఆర్ భావిస్తున్నాడా? అని ప్రశ్నించారు.‘ప్రపంచ మీడియా హైదరాబాద్ కు రావడం కేటీఆర్ కు ఇష్టం లేదా?, అందాల పోటీ లకు ప్రభుత్వం నామినల్ గా ఖర్చు పెడుతుంది. : ఈ కార్ రేసింగ్ వేరు...అందాల పోటీలు వేరు. ప్రభుత్వం డబ్బులు ఎలా ఉపయోగించామనేదే ఇంపార్టెంట్. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది.ప్రభుత్వం తరఫున ఉత్తమమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్ గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. బెంగళూరు లాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ అన్నారు.అందుకే హైదరాబాద్ ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్ గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మెక్ డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. తదుపరి సంప్రదింపులు, ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమాలను చేపడుతామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్ లెట్లున్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయి. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని పొన్నం తెలిపారు. -
కేంద్ర మంత్రికి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారని పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు.ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు సార్లు, గురువారం, ఆదివారం మాత్రమే రైలు వెళ్తుందన్నారు. ఆ ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి నుంచి కరీంనగర్‌కు బుధ, శనివారాల్లో బయలుదేరుతుందన్నారు. యూపీఏ హయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడానికి వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ క్రమంలో ఈ రైలు ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత పదేళ్లుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు, స్థానిక ఎంపీ బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ లేఖలో పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైలును నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ(Dearness Allowance) ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. డీఏ ప్రకటనతో ఆర్టీసీపై ప్రతినెలా రూ.3.6 కోట్ల భారం పడుతోందన్న ఆయన.. అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తోందని తెలిపారు. ఇక.. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని.. దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు తెలియజేశారాయన. ఉద్యోగుల పై పని ఒత్తిడి పెరిగిన వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి అభినందించారు. ఇక.. మహిళా సమైక్య సంఘాల చేత బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు పెట్టించి మహిళలు ఆదాయాన్ని అర్జించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీ తో అద్దె ప్రాతిపదికన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో.. రేపు(మార్చి 8వ తేదీన) మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలతో కలిసి పొన్నం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుంది. పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్ ,ఖమ్మం ,కరీంనగర్ , మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్య ల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా బస్సుల డిమాండ్ ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనుందని ప్రభుత్వం భావిస్తోంది.ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త2.5 శాతం డిఏ ప్రకటించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్డిఎ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీ పై 3.6 కోట్లు అదనపు భారంమంత్రి పొన్నం ప్రభాకర్ గారి మది నుండి వచ్చిన ఆలోచన రేపు మహిళా దినోత్సవం నుండి అమలులోకిమహిళా సాధికారత…— Ponnam Prabhakar (@Ponnam_INC) March 7, 2025 -
మార్చి మొదటివారం తర్వాతే కొత్త రేషన్‌కార్డులు!
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డుల జారీకి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మార్చి మొదటివారం తర్వాతనే కొత్తగా ఆహారభద్రత (రేషన్) కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మార్చి 1న లక్ష కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధికార యంత్రాంగం మాత్రం మొదటివారం తర్వాతే కొత్తకార్డుల జారీ చేసే అవకాశం ఉన్నట్టు చెబుతోంది. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు కార్డులు జారీ చేయమంటే అప్పుడు ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు గల్లంతైన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బిజీగా ఉన్నారని, కొత్త రేషన్‌కార్డులు ఎలా ఉండాలనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో మార్చి మొదటి వారం తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సమాచారం. చిప్‌తో కూడిన కార్డు అనుకున్నారు...ఏటీఎం తరహాలో స్మార్ట్‌కార్డు రూపంలో కొత్త రేషన్‌కార్డులు తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఆహారభద్రత కార్డుగా పేర్కొనే దీనికి చిప్‌ను అటాచ్ చేసి, యూనిక్ నంబర్ కేటాయించి, కుటుంబం వివరాలన్నీ పొందుపరచాలనుకున్నారు. ఆ శాఖ కమిషనర్ చౌహాన్ సైతం చిప్ సిస్టమ్‌తో కూడిన రేషన్‌కార్డు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను కూడా సీఎంకు పంపారు.అయితే ఇప్పటివరకు స్మార్ట్‌కార్డులకు ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర రాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడితోపాటు సీఎం ఢిల్లీ పర్యటన, ఎస్ఎల్బీసీ ఘటన నేపథ్యంలో సీఎం, మంత్రులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో దీనిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, స్మార్ట్‌కార్డు తయారీకి కంపెనీకి టెండర్లు పిలవడం, అర్హులను ఎంపిక చేయడం, చిప్‌తో కూడిన కొత్తకార్డుల తయారీ, కుటుంబ వివరాలన్నీ పొందుపరచడం లాంటివి ఇప్పట్లో అయ్యే పరిస్థితులు లేవు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే లోపే కొత్త రేషన్‌కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాత పద్ధతిలో ఆహారభద్రత కార్డులను జారీ చేసి, తర్వాత వాటిని ఏటీఎం కార్డు రూపంలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. కొత్తగా ఎన్ని కార్డులో ?» రాష్ట్రంలో ప్రస్తుతం 89 లక్షల ఆహారభద్రత కార్డులున్నాయి. ఈ కార్డుల్లో 2.81 కోట్ల మంది లబ్ధిదారులుగా నమోదై ఉన్నారు. » కాంగ్రెస్ సర్కారు కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ప్రజాపాలన, గ్రామసభలు, మీ సేవ కేంద్రాల్లో కలిపి సుమారు 7 లక్షల కుటుంబాల నుంచి కొత్త దరఖాస్తులు అందించినట్టు సమాచారం.» ఆ దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి కొత్తగా తొలివిడతగా 3 నుంచి 4 లక్షల వరకు రేషన్ కార్డులు జారీ చేయనున్న ట్టు తెలిసింది.» హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 1.12 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్టు తెలుస్తోంది. » కాగా గత జనవరి 26న ఎంపిక చేసిన 577 గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. » ఈనెల 28వ తేదీ వరకు మీసేవ సెంటర్ల నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. వివిధ రూపాల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి, జిల్లా స్థాయిలోనే అర్హులను ఎంపిక చేసి, ఆమోదానికి కమిషనర్ కార్యాలయానికి పంపుతారు. -
‘జిల్లాకు సంబంధం లేనివాళ్లు వచ్చి ఏదో చెబితే ఏమీ కాదు’
కరీంనగర్ జిల్లా: రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్క్షప్తి చేశారు. 27వ తేదీన జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగునున్న తరుణంలో పొన్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లాకు సంబంధం లేని వాళ్లు వచ్చి ఏదో చెబితే ఏమీ కాదని, వారి మాటలు నమ్మవద్దని పొన్నం పేర్కొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం రోజున ఎస్సారార్ కళాశాలలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఉంటుందని ఈ సందర్బంగా పొన్నం తెలియజేశారు.‘మా పెళ్లి అక్కడే ఐందన్నవాళ్లు గానీ, హిందువులమని చెప్పుకున్నవాళ్లుగానీ పట్టోంచుకోకపోతే మేం వేములవాడ అభివృద్ధి చేస్తున్నాం. అలాగే మిడ్ మానేరు నిర్వాసితులకు గత సర్కార్ పట్టించుకోకపోతే మేమే వారి పరిహారం చెల్లించాం. శాతవాహన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ను తీసుకురావడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం . ఇప్పటికే మేం 50 శాతంతో ముందున్నాం, కరీంనగర్ లో కూడా కలుపుకుని మొత్తం 65 శాతంకు పైగా మెజార్టీ సాధిస్తామనే నమ్మకం మాకుంది. బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, బండి సంజయ్ ఈ ఆరేళ్లల్లో కరీంనగర్ పార్లమెంటుకు ఏం తెచ్చారో చెప్పాక ఓట్లు అడగండి. నేను ఫలానా చేశాను ఎంపీగా అని చెప్పగలను. రిజర్వేషన్లకు సంబంధించి చట్టం విషయంలో కేంద్రంలో చట్టబద్ధత కల్పించకపోతే వెంటపడతామంటూ సంజయ్ ను హెచ్చరిస్తున్నా. ఎన్నికల్లో ఓట్ల కోసం మతాన్ని వాడుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ, పట్టభద్రుల దగ్గర ఆ పప్పులుడకవు. గుజరాత్ లో పదిశాతం ఈబీసీలకు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్లు కల్పించారో ముందు సంజయ్ చెప్పాలి. బీసీ కులగణనపై చర్చకు మేం సిద్ధమంటూ బండి సంజయ్ కి ప్రతి సవాల్ విసురుతున్నా., ఎల్అర్ఎస్ పై ఎన్నికల ముందు చెప్పినా.. తెలంగాణాలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో నిర్ణయాల్లో మార్పు ఉండవచ్చు’ అని పొన్నం తెలిపారు. -
కరీంనగర్ : రమణీయం..శ్రీనివాస కల్యాణం (ఫొటోలు)
-
‘వారి సర్వే ఇంటికే పరిమితమైంది.. బయటకు వివరాలు వెల్లడించలేదు’
సిద్దిపేట జిల్లా గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(Household Survey) ఇంటికే పరిమితమైందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar). కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు బయటకు వెల్లడించలేదన్న పొన్నం.. బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ాకార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో ాపాల్గొన్నారు.‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే(Caste Census Survey)లో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు పాల్గొనలేదు. వీళ్లకు కులగణన గురించి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు, కులగణన సర్వే చేపట్టాలి. మా సర్వేలో బీసీల లెక్క తేలింది.. మా ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీలు అనవసరమైన విమర్శలు మానుకొని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలి.సర్వేపై ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం’ అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు కొనసాగిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాలుష్యరహితమైన, పర్యావరణహితమైన రవాణా సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అందజేసే రాయితీలను కొనసాగిస్తామని, ప్రజారవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఫ్లిక్స్ బస్ ఇండియా హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్ సర్వీసులను ప్రారంభించనుంది. ఈ మేరకు గురువారం నగరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్లిక్స్‌బస్, ఈటీవో మోటర్స్ సంస్థలు కలిసి పర్యావరణహిత బస్సులను ప్రారంభించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ–బస్సుల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందజేస్తుందన్నారు. బస్సుల నిర్వహణ, చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుపైన ఫ్లిక్స్‌బస్ ఇండియా–ఈటీవో మోటర్స్ సంస్థలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. -
ఎమ్మెల్యేల రహస్య భేటీ వాస్తవమే: మంత్రి పొన్నం
హైదరాబాద్: పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందించారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ వాస్తవమేనని పొన్నం తెలిపారు. హైదరాబాద్ కోహినూర్ హెటల్లో భేటీ జరిగిందన్నారు. అయితే ఎమ్మెల్యేలు సమావేశం అవ్వొద్దా అంటూ ప్రశ్నించారు మంత్రి పొన్నం. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా ఎమ్మెల్యేల రహస్య భేటీపై తనదైన శైలిలో స్పందించారు పొన్నం. ఎవరి హక్కుల కోసం వాళ్లు పోరాటాలు చేస్తారని, ఎమ్మెల్యేల భేటీ అనేది తమ పార్టీ అంతర్గత అంశమన్నారు మంత్రి పొన్నం.కాగా, రెండు రోజుల క్రితం కొంతమంది కాంగ్రెస్(Congress)ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ కేబినెట్ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై వీరు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ నడిచింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి,.మరోవైపు.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు పెట్టిన పోల్ అంశం కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పెట్టిన పోల్.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. 70 శాతం బీఆర్ఎస్కు అనుకూలంగా, 30 శాతం కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఓట్లు పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోల్ రావడం హస్తం నేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు దిక్కులు చూస్తున్నారనే చర్చ సైతం నడుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు. నాలుగు రోజులు కానీయ్ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి. అలాగే, ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సిందే అని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో, హస్తం నేతలు బీఆర్ఎస్ పంచన చేరే అవకాశాలు సైతం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్యే రహస్య భేటీని కాంగ్రెస్ పార్టీ తమ అంతర్గత అంశమని పైకి చెబుతున్నా.. లోలోపల ామాత్రం ఆలోచనలో పడినట్లే కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ ఏ టర్న్ తీసుకుంటుందో అనేది వేచి చూడాలి. -
బీసీల కోసమైనా కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలి: పొన్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే మాజీ సీఎం కేసీఆర్(KCR) రేపు అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలని కోరారు. ఇదే సమయంలో కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత(kavitha) తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో కుల గణన చేస్తామని మాట ఇచ్చాం.. చేసి చూపించామని కామెంట్స్ చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారు. మేం కమిటీ రిపోర్టును బీరువాలో, ఫ్రిడ్జ్ ఏమీ పెట్టం. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలని వదిలిన వారూ ఉన్నారు. సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలని వివరాలు ఇవ్వలేదు. కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలి.బలహీన వర్గాల కోసం రేపు అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలి. కులగణన ఒక ఉద్యమంలాగా చేశాం. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలింది. కేబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. కులగణన చేస్తామని మాట ఇచ్చాం.. చేసి చూపించాం. కులగణన అడ్డుకుంటే ఊరుకునేది లేదు. నిర్ణయం నుండి నివేదిక దాకా కులగణన ప్రక్రియలో చేసినందుకు గర్వంగా ఉంది. బీసీ సోదరులందరూ రేపు ఉత్సవాలు జరపండి అని వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కులగణనపై కవిత కీలక వ్యాఖ్యలు -
కడుపునొప్పితో వస్తే కాటికి పంపేశారు!
కంటోన్మెంట్: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరితే కాటికి పంపారని, అర్హత, అనుభవం లేని డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన ఆదివారం. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్‌పల్లికి చెందిన మధుసూదన్ గౌడ్ కడుపునొప్పితో బాధపడుతుండటంతో, కుటుంబ సభ్యులు అతడిని శనివారం స్థానిక వీఆర్ ఆసుపత్రిలో చేరి్పంచారు. ఆసుపత్రి సిబ్బంది సూచన మేరకు రాత్రి అక్కడే ఉంచారు. మర్నాడు ఉదయం మధుసూదన్ పరిస్థితి విషమించినట్లు చెప్పడంతో కుటుంబసభ్యులు అతడిని మరో ఆసుపత్రికి తీసుకెళతామని చెప్పారు. అయితే అందుకు నిరాకరించిన ఆసుపత్రి యాజమాన్యం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 10.00 గంటల సమయంలో మధుసూదన్ గౌడ్ మృతి చెందినట్లు చెప్పిన ఆసుపత్రి నిర్వాహకులు, అంబులెన్స్‌లో నేరుగా మృతదేహాన్ని అతడి ఇంటికి తరలించారు. మధుసూదన్‌గౌడ్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు, తిరిగి మృతదేహాన్ని తీసుకువచ్చి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అర్హత, అనుభవం లేని వైద్యుడితో చికిత్స చేయించారని ఆరోపిస్తూ ఆసుపత్రిపై దాడికి యతి్నంచారు. దీంతో అక్కడికి వచి్చన స్థానిక నాయకుడు ఆసుపత్రి యాజమాన్యం తరఫున బాధితులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన మృతుడి బంధువులు సదరు నేతపై దాడికి యత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన అతను అక్కడి నుంచి జారుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో...మృతుడి బంధువులు ఈ విషయాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి సూచించడంతో పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యా రు. ఆదివారం ఉదయం ఆసుపత్రిని సందర్శించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల బృందం మృతుడి చికిత్సకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి చికిత్స చేసిన డాక్టర్ అర్హతతో పాటు మందుల వివరాలను సేకరించారు. అనుమతులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. -
ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బండి సంజయ్(Bandi Sanjay) ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా?.. ఎలా ఇవ్వరో తామూ చూస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.10 నెలల కాలంలో జీఎస్టీ రూపంలో రూ.37 వేల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసింది. మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత? అంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు?. వీల్లేమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా?. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయన్న కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా?’’ అంటూ పోన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ప్రధాని ఫొటో పెడితేనే నిధులు..కాగా, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తామంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్ స్మార్ట్‌సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్‌కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. -
మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన
సాక్షి,హన్మకొండజిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి సంక్రాంతి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన తెలిపారు. జాతర సందర్భంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు సరిగా చేయకుండా నిర్లక్ష్యం వహించారని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వీరభద్రస్వామి ఆలయ కమిటీ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అలిగిన మంత్రి పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆలయ గెస్ట్‌హౌజ్ వద్ద నేలపై కూర్చొని అధికారుల తీరుపై నిరసన తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలోనూ మోకాళ్లపై నిలబడి తన అసహనాన్ని వెల్లడించారు. కాగా,హైదరాబాద్ ఇంఛార్జ్‌గా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గతేడాది హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాల సందర్భంగా బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో అధికారులపై అలిగి గుడిలోనే బైఠాయించారు.తనకు, జీహెచ్ఎంసీ మేయర్‌కు ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై తన నిరసనను తెలిపారు. అనంతరం అధికారులు బుజ్జగించిన తర్వాత పొన్నం అలకవీడడం గమనార్హం. సొంత హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ జాతరలోనూ తాజాగా పొన్నం అధికారులపై బహిరంగంగానే తన అసహనాన్ని తెలపడం చర్చనీయాంశమైంది. -
మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా?
లంగర్‌హౌస్: ఇంట్లో మీరు తినే భోజనం ఇలాగే వండుకుంటారా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా? ఉడకని కూరగాయలకు తోడు అధికంగా మసాలాలు వేస్తే పిల్లల ఆరోగ్యాలు దెబ్బ తినవా? నాణ్యమైన భోజనం కోసం ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినా సరైన మెనూ అందివ్వడానికి మీకు వచ్చిన కష్టం ఏమిటి? అంటూ పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. పిల్లల భోజనంపై ఇంత నిర్లక్షమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం లంగర్‌హౌస్ ఇబ్రహీంబాగ్‌లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ సొసైటీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. దుస్తులు, పాఠ్య పుస్తకాలు, ప్లేట్లు, ఇతర వస్తువులు సరిగా అందుతున్నాయా.. లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బోధనపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం భోజనశాలను సందర్శించి విద్యార్థులకు అన్నం వడ్డించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం సైతం భోజనం పెట్టించుకున్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, గోల్కొండ తహసీల్దార్ అహల్యతో పాటు ఇతర అధికారులను కూడా విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తినాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పొన్నం.. కూరలు నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించి నిర్వాహకులపై మండిపడ్డారు. టమాటాలు ముక్కలు చేయకుండా.. కనీసం కోయకుండా అలా మసాలాలో నేరుగా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనం విషయంలో నాణ్యత పాటించకపోయినా.. నిర్లక్ష్యం వహించినా అందరూ బాధ్యులే అవుతారని ఆయన హెచ్చరించారు. మంచినీళ్లూ కరువేనా..? ఈ క్రమంలోనే మంత్రి మంచినీళ్లు కావాలని అడగడంతో అక్కడ ఉన్న గ్లాసులలోని నీరు ముట్టుకోనీయకుండా సిబ్బంది కాస్త ఆలస్యంగా బాటిళ్లు తెచ్చి ఇచ్చారు. ఇదేంటని మంత్రి అడగగా.. వాటర్ ఫిల్టర్ పని చేయడంలేదని నిర్వాహకులు తెలిపారు. అదే నీరు చిన్నారులకు ఇస్తున్నారంటే వారి ఆరోగ్యం, వారి ప్రాణాలపై మీకు బాధ్యత లేదా? అంటూ మరోసారి మండిపడ్డారు. వెంటనే ఫిల్టర్‌కు మరమ్మతులు చేయించాలని, భోజనాలలో కూడా మార్పులు రాకపోతే ఒక్కరు తప్పు చేసినా అందరినీ బాధుల్ని చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. -
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్ ల మధ్య మాటల యుద్ధం
-
శాసనసభలో కరీంనగర్ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పంచాయితీకి కొద్దిసేపు శాసనసభ వేదిక అయ్యింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. అది వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. గురుకులాల్లో సౌకర్యాల కల్పనపై అసెంబ్లీలో సాగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సీతక్క మాట్లాడిన అనంతరం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏర్పాటు కాక ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విద్య అందించలేదని, చదువు చెప్పలేదని వ్యాఖ్యానించారు.దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ‘ఆయన మారుమూల ప్రాంతం నుంచి కరీంనగర్‌కు వచ్చి కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివితే ఆ బాధ తెలుస్తది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదవలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదవలే. మీకేం తెలుసు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల గురించి’అని అన్నారు. దానికి గంగుల స్పందిస్తూ.. ‘మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచి్చన అన్నరు. పార్లమెంట్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలవయ్’అని వ్యాఖ్యానించారు. దానికి స్పందించిన పొన్నం ‘మొదటిసారి ఎమ్మెల్యేలకు ఏం తెలియదన్నట్లా, అజ్ఞానులన్నట్టా? పార్లమెంట్ మెంబర్ చేసిన, తెలంగాణ కోసం కొట్లాడిన. మీ నాయకుడు నిన్ను ‘షేర్ పటాక’అన్నాడు.తెలంగాణ ఉద్యమంల పార్టీ మారి ఇట్ల మాట్లాడితే ఎట్ల?’అని అన్నారు. దానికి కమలాకర్ బదులిస్తూ... ‘షేర్ పటాకనా, పెప్పర్ స్ప్రే డూప్లికేటా అని నేననలే. దొంగేడుపు ఏడవలే. కండ్లు పోయినయని ఏడువలె ’అని తెలంగాణ బిల్లు సందర్భంగా పార్లమెంట్లో జరిగిన సంఘటనలపై వ్యాఖ్యానించారు. దీంతో పొన్నం సీరియస్ అవుతూ ‘పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే ఒరిజనలా, డూప్లికేటా రికార్డులు పరిశీలిద్దాం. కుక్క షేర్ పటాక.. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి పోయి ఏడుస్తడని వాళ్ల నాయకుడు అన్నడు’అని వ్యాఖ్యానించారు. దీంతో గంగుల స్పందిస్తూ ‘మేం కరీంనగర్ తెలంగాణ చౌక్ల కొట్లాడిన దాన్ని అసెంబ్లీ దాక తీసుకొస్తున్నాడు.కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినవ్ , ఎందుకు హుస్నాబాద్ పారిపోయినవ్ అని నేను అన్ననా? జిల్లా విడిచిపెట్టి పోతరా ఎవరన్నా? ’అని కామెంట్ చేశారు. దీనికి స్పందిస్తూ ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటీ చేయడానికి పారిపోయిన్రా? దమ్ముంటే రా. నెక్ట్స్ టైం వచ్చి నామీద పోటీ చేయ్. వేరే నియోజకవర్గానికి పోవడం తప్పా? నీలాగా కోట్ల కోట్లు లేవు. నాకు దమ్ముంది. అక్కడికి పోయి గెలిచిన’అని తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో కరీంనగర్ పంచాయితీ సద్దుమణిగింది. -
3 లక్ష్యాలతో ఆర్టీసీకి జవసత్వాలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజల జీవితంలో అంతర్భాగంగా ఉన్న ఆర్టీసీని పరిరక్షించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఆర్టీసీని ఉన్నతంగా నిర్వహించే విషయంలో మూడు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. సంస్థ పరిపుష్టి, ప్రయాణికులకు మెరుగైన సేవలు, సిబ్బంది సంక్షేమానికి సమప్రాధాన్యం ఇస్తూ చర్యలు ప్రారంభించాం. తీవ్ర నష్టాలు, అస్తవ్యస్త విధానాలతో మూతబడే దుస్థితిలో ఉన్న ఆర్టీసీని మళ్లీ లాభాలబాట పట్టించడమే కాకుండా ప్రజలకు మరింత చేరువ చేశాం. ఇకపై సంస్థను విస్తరిస్తాం, పటిష్టపరుస్తాం, ఆధునీకరిస్తాం’అని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ‘సాక్షి’కి ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మహాలక్ష్మి’తో మహర్దశ... మా ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కలి్పంచాం. ఇది రాజకీయ హామీ కాదు.. సంస్థ గతిని మార్చే గొప్ప పథకం. కేవలం సంవత్సర కాలంలో ఏకంగా 116 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడం ద్వారా దాదాపు రూ. 4 వేల కోట్లను ఆదా చేసుకున్నారు. ఆ మొత్తం ఆయా కుటుంబాలకు మరో రకంగా లబ్ధి చేకూర్చేందుకు కారణమైంది. కేవలం సిబ్బంది గొప్ప కృషి వల్లే ఈ పథకం ఇంతటి విజయం సాధించింది.మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ నేరుగా కోల్పోయే టికెట్ ఆదాయాన్ని రీయింబర్స్ చేయడం ద్వారా ఆ నష్టాన్ని పూడుస్తున్నాం. ప్రతినెలా ఆ మొత్తాన్ని చెల్లిస్తుండటంతో సంస్థకు ఆర్థిక చేయూత కలుగుతోంది. ఇది సంస్థ విస్తరణకు దోహదపడుతోంది. ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 30 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది. వారిలో మహిళల సంఖ్య దాదాపు 36 లక్షలు. గత ప్రభుత్వం ఆర్టీసీని చంపేసింది... హైదరాబాద్‌లో ఒకప్పుడు దాదాపు 6 వేల సిటీ బస్సులు తిరిగేవి. కానీ గత ప్రభుత్వం ఒకేసారి 3 వేల బస్సులను తొలగించింది. ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్న సిబ్బందిపై భారం పెంచింది. ప్రయాణికులకు వసతులు కలి్పంచకుండా నిర్లక్ష్యం చేసింది. ఇలా అన్ని రకాలుగా సంస్థను దెబ్బతీసింది. ఇప్పుడు వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ మేం సంస్థను బలోపేతం చేస్తున్నాం. మేము వచ్చాక దశలవారీగా 1,500 కొత్త బస్సులు సమకూరాయి. ఇప్పుడు మహిళా సంఘాలు సొంతంగా బస్సులను సంస్థకు అద్దెకివ్వడం ద్వారా ఆయా కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సంఘాల ఆధ్వర్యంలో 600 బస్సులు ఆర్టీసీకి సమకూరనున్నాయి. అద్దె బ స్సుల సంఖ్య నియంత్రణ లోనే ఉండేలా చూస్తాం. ఆర్టీసీని ప్రైవేటీకరించే యో చనే లేదని స్పష్టం చేస్తున్నా. ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. బకాయిలు చెల్లిస్తాం.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రెండు వేతన సవరణలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఒకటి 2017 నాటిది. వెంటనే దానికి సంబంధించి 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేశాం. 2013 నాటి వేతన సవరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బాండ్ల బకాయిలు చెల్లించాం. బకాయి ఉన్న డీఏను చెల్లించాం. ఇలా ఒక్కొక్కటిగా బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం. మిగతావి కూడా ఇదే క్రమంలో క్లియర్ అవుతాయి. చనిపోయిన లేదా మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే కారుణ్య నియామకాలను కూడా చేపట్టాం. ఈవీ పాలసీ కాలుష్యానికి విరుగుడే.. భాగ్యనగరంలో లక్షలాదిగా పెరుగుతున్న వాహనాల రూపంలో వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో ఈవీ పాలసీ తీసుకొచ్చాం. పెట్రోల్, డీజిల్ వాహనాల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు కొన్న వారికి పన్ను మినహాయింపు రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. దీన్ని అందుబాటులోకి తెచ్చాక విద్యుత్ వాహనాల కొనుగోలు మూడు రెట్లు పెరిగిందని గుర్తించాం. ఇదే కోవలో వాహన తుక్కు విధానాన్ని కూడా ప్రారంభించాం. దీనివల్ల 15 ఏళ్లు పైబడ్డ వాహనాలను తుక్కుగా మార్చేందుకు వీలుపడుతుంది. తుక్కుగా మార్చే సెంటర్ల ఏర్పాటుకు ఇటీవలే రెండు సంస్థలకు అనుమతి ఇచ్చాం. రాజకీయ రిజర్వేషన్లకే కులగణన పరిమితం.... కులగణన ప్రస్తుతానికి రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం. డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది కూడా అందుకోసమే. కమిషన్ నివేదిక సమరి్పంచాక చర్చించి కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తాం. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపులో న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉంటాయి. వాటన్నింటినీ కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. కులగణనలో ప్రజలు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వట్లేదని మా దృష్టికి కూడా వచి్చంది. అందరూ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా పథకాల అమలు సులువవుతుంది. సమాచారం ఇవ్వని ప్రజలు తెలంగాణ వారు కాదన్నట్లు.. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయమని గత ప్రభుత్వం బెదిరించినట్లు మేం బెదిరించట్లేదు. అందరూ సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠినచర్యలు.. జ్యోతిబా పూలే విద్యానిధి పథకం కింద 300 మంది విద్యార్థులకు వర్తించే పథకాన్ని 800 మందికి పెంచాం. త్వరలోనే వారందరికీ నిధులు మంజూరు చేస్తాం. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభు త్వం కఠినచర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అన్ని జిల్లాల అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌లోనూ ఈ విషయం స్పష్టం చేశాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు వారికి ఇచ్చే మెస్‌చార్జీలు పెంచాం. వివిధ బీసీ కార్పొరేషన్లకు రూ. 50 కోట్ల చొప్పున కేటాయించినా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇవ్వలేకపోయాం. త్వరలోనే వాటికి నిధులు ఇస్తాం.త్వరలో నియామకాలు.. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఖాళీల భర్తీకి 3 వేల కొత్త నియామకాలు చేపట్టబోతున్నాం. టీజీపీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా నియామకాల ప్రక్రియ మొదలైంది. సాంకేతిక కారణాలతో జరుగుతున్న జాప్యాన్ని నివారించి త్వరలో ఆ పోస్టులు భర్తీ అయ్యేలా చూస్తాం.కాలుష్య నియంత్రణ చర్యలు ఆర్టీసీతో మొదలు.. వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఆ దుస్థితి హైదరాబాద్‌కు పట్టకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు సమకూరుస్తున్నాం. వచ్చే రెండేళ్లలో అవి విడతలవారీగా అందుబాటులోకి వస్తాయి. బస్సుల తరహాలో ఎలక్ట్రిక్ ఆటోలు.. ఆర్టీసీ డీజిల్ బస్సులను తొలగించిన తరహాలోనే నగరం నుంచి డీజిల్ ఆటోలను కూడా తొలగించే ఆలోచన ఉంది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడతాం. ఈ మేరకు ఆటో డ్రైవర్లను త్వరలోనే చైతన్యపరిచే కసరత్తు మొదలుపెడతాం. కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే విషయంలో ఆటోవాలాలకు చేయూత అందించను న్నాం. అది ఏ రూపంలో అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. -
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కేసీఆర్ కు ఆహ్వానం
-
ఎర్రవల్లి ఫాంహౌస్‌కు మంత్రి పొన్నం.. కేసీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, సిద్ధిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. సిద్ధిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన పొన్నం.. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. గంటా 15 నిమిషాల పాటు ఇరువురి సమావేశం సాగింది. కేసీఆర్‌ని కలిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం తరుఫున కేసీఆర్‌ని కలిసి ఆహ్వానించామని తెలిపారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. భోజన సమయంలో వచ్చారు లంచ్ చేయమంటూ కేసీఆర్ కోరారు. దీంతో ఆయనతో కలిసి భోజనం చేసాము.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల వారీగా ఆహ్వానిస్తున్నాము. అందులో భాగంగా కేసీఆర్‌ని కూడా ఆహ్వానించాము.తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనేది ఆయన.. పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారని కోరుకుంటున్నా. తెలంగాణలో పార్టీల మధ్య రాజకీయాలు వుండొన్చు.. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు సహకరించాలి’’ అని పొన్నం విజ్ఞప్తి చేశారు. -
TG: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌కు ఆహ్వానం
-
విగ్రహావిష్కరణకు రండి.. కేసీఆర్‌కు రేవంత్ సర్కార్ ఆహ్వానం
సాక్షి, సిద్ధిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. సిద్ధిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన పొన్నం.. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అయితే, సీఎం రేవంత్ సర్కార్ ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా..? లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.కాగా, శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ప్రజా పాలన ఉత్సవాలు, సోమవారం సచి వాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష నేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, ప్రొటోకాల్ అధికారులు శనివారం వెళ్లి ఆహ్వానాలు అందజేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి ఆహ్వానం అందజేశారు.ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై పిటిషన్కొత్తగా కొలువుదీరబోతున్న తెలంగాణ తల్లి ముడిచిన కొప్పు, మెడలో కంటెతో రెండు సాధారణ బంగారు హారాలు, చెవులకు సాధారణ జూకాలు, చిన్న ముక్కు పుడక, చేతులకు ఆకుపచ్చ మట్టి గాజులు, కాళ్లకు పట్టీలు, మెట్టెలు ధరించి ఉంటుంది. సాధారణ నేత తరహా చీర కనిపిస్తుంది. బంగారు వర్ణం అంచు ఉన్న ఆకుపచ్చ రంగు చీర, ఎరుపు వర్ణం రవిక ఉంటుంది. ఇంటి పనుల్లో తలమునకలయ్యే మహిళలు చీర కొంగును ముడిచిన తీరును ప్రతిబింబిస్తుంది. కుడి చేయిని అభయహస్తంగా తీర్చిదిద్దారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, పచ్చ జొన్న, సజ్జ, వరికంకి.. ఇలా తెలంగాణ సంప్రదాయ పంటలైన తృణధాన్యాల గుర్తులు ఏర్పాటు చేశారు. పీఠం దిగువన తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా బిగించిన పిడికిళ్లు కనిపిస్తాయి. పైభాగంలో.. పైకి ఎత్తుతున్న తరహాలో చేతుల రూపాలు ఏర్పాటు చేశారు. -
కొత్త బస్సులు సమకూర్చుకోండి
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా సేవలను అందించడానికి కొత్త బస్సులను సమకూర్చుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో మంత్రి పొన్నం శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందన్నారు. మొదటి విడతలో మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మహి ళా స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్యలకు అద్దె బస్సులను అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కటి చొప్పున అద్దె బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రారంభించిన కార్గో హోం డెలివరీ సదుపాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరణించిన, మెడికల్లీ అన్‌ఫిట్ అయిన సిబ్బంది జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రూ. 3,747 కోట్ల మేర చార్జీల ఆదా! మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 20 వరకు మొత్తం 111 కోట్ల జీరో టికెట్లను సంస్థ జారీ చేసిందని, రూ.3747 కోట్ల చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం తెలిపారు. జీరో టికెట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు.రవాణా ఆదాయ లక్ష్యాలను సాధించాలి.. ఆదాయ పెంపుదల లక్ష్యాలను సాధించాలని శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని సమీక్షలో సూచించారు. -
హైదరాబాద్‌కు ఢిల్లీ పరిస్థితి రావొద్దనే..: పొన్నం
హైదరాబాద్, సాక్షి: కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేపించాలని పిలుపు ఇచ్చారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు ఈవీ వాహనాలు కొనాలంటూ కోరుతున్నారాయన.ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యంతో స్కూల్స్‌కు బంద్ చేస్తున్నారని, అలాంటి పరిస్థితి తెలంగాణకు.. హైదరాబాద్‌కు రాకూడదనే ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారాయన. ‘‘ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా తెలంగాణ ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉంది. ఈవీ వాహనాల పై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నాం. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం.... హైబ్రిడ్ వాహనాల పై కూడా పన్ను రాయితీ పై ఆలోచిస్తున్నాం. ప్రజలు ఈవీ వాహనాల వైపు అడుగులేయండి. అలాగే.. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారాయన. -
‘ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలి’
హైదరాబాద్: నగర పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జీవో 41 ద్వారా అమల్లోకి కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చేందకు రంగం సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఈవీ పాలసీ 2026 డిసెంబర్ వరకూ అమల్లో ఉండనుందన్నారు. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని, ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు హైదరాబాద్‌కు రాకూడదని ఈ సందర్బంగా పొన్నం పేర్కొన్నారు. తెలంగాణలో రవాణాశాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్య తెచ్చే కార్యక్రమాలు చేపడతున్నామన్నారు. -
సర్వేతో పథకాలకు ముప్పులేదు
బంజారాహిల్స్: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపా రు. ఎవరికీ సంక్షేమ పథకాలను రద్దుచేయబోమని భరోసా ఇచ్చారు. అర్హులకు మరిన్ని పథకాలు అమలవుతాయని చెప్పారు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్లోని ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ తో కలిసి గురువారం ఆయన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుటుంబ సర్వేపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. సర్వే సమాచారం గోప్యంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల స్థితిగతులు తెలుసుకొని పటిష్టమైన భవిష్యత్తు ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో మంచి మార్పు తీసుకువచ్చి ఆదర్శ తెలంగాణను ఆవిష్కరించటమే సర్వే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 30 శాతం సర్వే పూర్తయ్యిందని తెలిపారు. -
సమగ్ర సర్వే షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ఇళ్లకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు స్టిక్కర్లు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు సర్వే పనుల్లో పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో కూడా స్టిక్కర్లు వేసే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. మొదటి దశలో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్‌లో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబాలను నమోదు చేసి, వారి ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేరుతో కూడిన జాబితాను తయారు చేయనున్నారు. ఈ జాబితా పూర్తయిన ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు. ఆ తర్వాత రెండోదశలో ఈ నెల 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో లభించిన సమాచారాన్ని మండల, జిల్లా స్థాయిలో కంప్యూటరీకరిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసి సర్వే వాస్తవ పురోగతిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లను గుర్తించగా, జీహెచ్ఎంసీలో 19,328, ఇతర ప్రాంతాల్లో 67,764 ఉన్నాయి. ఈ బ్లాక్‌ల వారీగా సర్వే చేసేందుకు 94,750 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేశారు. 24,488 మందిని జీహెచ్ఎంసీలో నియమించగా, ఇతర ప్రాంతాల్లో 70,262 మందిని నియమించారు. వీరి సహకారంతో రాష్ట్రంలోని 1,17,44,954 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. -
తెలంగాణ మాజీ సర్పంచ్ల ఆందోళన
-
బుకాయిస్తే తప్పు ఒప్పు కాదు
సాక్షి, హైదరాబాద్: తాగి దొరికిన కేసులో బుకాయిస్తే తప్పు ఒప్పవుతుందని అను కోవడం పొరపాటని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దొరికిన దొంగలు సమర్థించుకుంటూనే ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో ఉండడం దారుణమని అన్నారు. జన్వాడ ఫామ్‌హౌ జ్ ఘటనపై ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యా దు మేరకు పోలీసులు దాడి చేస్తే దొరికారని చెప్పా రు.మాదకద్రవ్యాలు తీసుకోవడం తప్పుకాదనే ధోరణిలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా విమర్శ లు చేయడం సరికాదని అన్నారు. నిజంగా నిర్దోషు లయితే నిరూపించుకోవాలని హితవు పలికారు. ఈ కేసులో ముఖ్యమంత్రి, మంత్రుల జోక్యం ఉంద నడం బీఆర్ఎస్ మాజీ మంత్రులు, శాసనసభ్యుల అవివేకానికి నిదర్శమని పొన్నం వ్యాఖ్యానించారు. సమగ్ర విచారణ జరిపించాలిజన్వాడ ఫామ్‌హౌజ్‌లో జరిగిన రేవ్‌పార్టీ, అనుమతి లేని మద్యం వినియోగం కేసులో సమగ్ర విచారణ జరిపించాలని కేటీఆర్‌కు డ్రగ్స్ టెస్ట్ చేయాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ.ఫహీమ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎస్.శివసేనా రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి డిమాండ్ చేశారు. జన్వాడ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మహిళా ప్రతినిధులు సైబరాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. -
కులగణనకు ఇంటింటి సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను నవంబర్ 4 లేదా 5న ప్రారంభించి 30లోగా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి, విధివిధానాలను ఆమోదించింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని ఫిబ్రవరి 17న శాసనసభలో తీర్మానం చేయడంతోపాటు ఇప్పటికే జీవో 18 ప్రభుత్వం జారీ చేయగా సీఎం రేవంత్ సోమ వారం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లతో సమావేశమై సర్వేపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా, మండల స్థాయిలోని 80 వేల మంది అధికారులు, సిబ్బందికి కులగణనపై శిక్షణ అందించనున్నట్లు పొన్నం తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించి సర్వే పూర్తి చేయడానికి 3, 4 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. 15–20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తికానుందని... ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం ఒక్క రోజులో కుటుంబ సర్వే నిర్వహించి వివరాలను బయటపెట్టలేదని.. కానీ తాము సర్వే ముగిశాక సమాచారాన్ని, ప్రయోజనాలను ప్రజా బాహుళ్యంలో ఉంచి పారదర్శకంగా వ్యవహరిస్తామని పొన్నం తెలిపారు. సర్వేలో సరైన సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి కులమతాలు, పారీ్టలకు అతీతంగా పేదల్లో బహు పేదలను ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళి మర్నాడు లేదా ఆ తర్వాతి రోజున సీఎంతోపాటు మంత్రులం స్వయంగా మొగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఒక డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలను చెల్లించాల్సి ఉండగా దీపావళి కానుకగా 2022 జనవరి నుంచి రావాల్సిన ఒక డీఏను మంజూరు చేశామని పొంగులేటి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే జీవో 317 కింద గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులను స్పౌజ్, ఆరోగ్య, పరస్పర కేటగిరీల కింద తక్షణమే సొంత ప్రాంతాలకు బదిలీలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. జీవో 317 కింద దూర ప్రాంతాలకు వెళ్లిన ఇతర ఉద్యోగుల సమస్యతోపాటు ఉద్యోగ నియామకాలకు జీవో 46తో ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి చట్ట రీత్యా, కోర్టుల రీత్యా చిక్కులున్న నేపథ్యంలో తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కేంద్రం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించామని పొంగులేటి తెలిపారు. ఉద్యోగులకు ఒక డీఏ చెల్లిస్తే ప్రభుత్వంపై రూ. 3 వేల కోట్ల భారం పడనుందని.. అందుకు ప్రతి నెలా రూ. 230 కోట్లు అదనంగా కావాలని పొన్నం తెలిపారు. నాలుగు కేటగిరీలుగా మిల్లర్ల విభజన.. రాష్ట్రంలో మిల్లర్లను నాలుగు విభాగాల కింద విభజిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎలాంటి ఆరోపణలు లేని మిల్లర్లకు ప్రథమ కేటగిరీ, ప్రభుత్వ నోటిసులకు స్పందించి చెల్లింపులు చేసిన వారిని రెండో కేటటిరీ, నోటిసులిచ్చినా చెల్లింపులు చేయక రికవరీకి గురైన వారిని మూడో కేటగిరీగా విభజించి వారి నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకున్న తర్వాత ధాన్యం సేకరణలో అనుమతించాలని, ఇంకా డిఫాల్టర్లుగా మిగిలిపోయిన వారిని అనుమతించరాదని నిర్ణయించామన్నారు. మిల్లర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పొరుగు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఆమోదించామని చెప్పారు. రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశ హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. నాగోల్–శంషాబాద్, రాయదుర్గ్–కోకాపేట, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీనగర్–హయత్‌నగర్ కారిడార్లలో 76.4 కి.మీ. కొత్త మెట్రో రైల్వే లైన్‌ను రూ. 24,269 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేయడానికి రూపొందించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపేందుకు మంత్రివర్గం ఆమోదించింది. పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బీ పరిధిలో 16–17 వేల కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం/పునరుద్ధరణ పనుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి తప్పనిసరిగా బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు 4 లేన్ల రోడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రతి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని పీపీపీ విధానంలో వచ్చే 4 ఏళ్ల పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్ల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మరికొన్ని నిర్ణయాలు.. ⇒ ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి గోషామహల్ స్టేడియం స్థలాన్ని అప్పగించడంతోపాటు ములుగులోని గిరిజన వర్సిటీకి 211 ఎకరాల భూమిని, స్పోర్ట్స్ వర్సిటీకి గచ్చిబౌలి స్టేడియాన్ని అప్పగించాలనే ప్రతిపాదనలకు ఆమోదం. ⇒ మధిర, వికారాబాద్, హుజూర్‌నగర్‌లో స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా కొత్త ఐటీఐల మంజూరు. ⇒ కొత్తగా ఏర్పడిన 8 కోర్టులు, రెండు వైద్య కళాశాలలకు సిబ్బంది మంజూరు. ⇒ కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కడెం ప్రాజెక్టులో పూడికతీతకు ఆమోదం. అన్ని ప్రాజెక్టుల్లో 23 శాతం పూడికతో నిండి ఉన్నాయని, భవిష్యత్తులో వాటిలోని పూడిక తొలగిస్తామని పొంగులేటి తెలిపారు. సినీనటుడు బాలకృష్ణకు స్టూడియో నిర్మాణానికి ఎలాంటి స్థలం కేటాయించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీపావళికి ముందే పొలిటికల్ బాంబుల పేలుళ్లు రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు ఒకట్రెండు రోజుల్లో పేలబోతున్నాయని దక్షిణ కోరియా పర్యటన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. దీపావళి టపాసుల కంటే ముందే ఇవి పేలుతాయని స్పష్టం చేశారు. కాగా, దక్షిణ కొరియాలో అమలైన నదుల పునరుజ్జీవ ప్రాజెక్టు గురించిన వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం తమ సహచరులకు వివరించినట్లు సమాచారం. అయితే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రత్యేకంగా మరో సమావేశం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైనట్లు తెలియవచ్చింది. -
‘హాన్’ను ఎలా పునరుద్ధరించారు?
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుద్ధరణపై అధ్యయనానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని సియోల్ వెళ్లిన అధికారుల బృందం రెండో రోజైన మంగళవారం అక్కడ విస్తృతంగా పర్యటించింది. తొలుత హాన్ నదిని సందర్శించి నది పునరుద్ధరణ పనులను పరిశీలించింది. ఒక ప్పుడు మురికి కాలువలా ఉన్న నదికి జీవం పోసిన విధానాన్ని మంత్రులు పొంగులేటి, పొన్నం అక్కడి అధికారులను అడిగి తెలుసుకు న్నారు.సియోల్‌లో నీటి సరఫరా, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థకు ఈ నది ఎలా కీలకంగా మారిందో అక్కడి అధికారులు వారికి వివరించారు. అనంతరం మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వస్త్ర తయారీ సంస్థ యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈవో ‘కీ హాక్ సంగ్’తో సమావేశమైంది. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వస్త్ర తయారీ పరిశ్ర మలు ఏర్పాటు చేసేందుకు ఇటీవల ముందు కొచ్చిన ఆయన.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటైన ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ గురించి పొంగులేటి, పొన్నం ఆయనకు వివరించారు. ఆ తర్వాత సియోల్ లోని సియోనామ్ వాటర్ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను అధికారుల బృందం సందర్శించింది. నీటి శుద్ధీక రణ ఎలా జరుగుతోందో పరిశీలించింది. సియోల్లోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వ్యర్థ జలాలను ఈ కేంద్రాలు శుభ్రపరుస్తాయి. రోజుకు 16.3 లక్షల లీటర్ల మురుగునీటితోపాటు 4 వేల కిలోలీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తాయి. ఈ సామ ర్థ్య ం ప్రపంచంలోనే 9వ అతిపెద్ద ప్లాంటుగా గుర్తింపు పొందింది. ఇదే కేంద్రంలో హాన్ నది నీటి స్వచ్ఛతను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.ప్రతిపక్షాలు సహకరించాలిమూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సియోల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో మూసీని భాగం చేయాలని తమ ప్రభు త్వం భావిస్తోందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి కష్టం రానివ్వబోమని.. పునరావాసంతోపాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పొన్నం హామీ ఇచ్చారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి తలపెట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాద్ మరో సియోల్ నగరంగా రూపాంతరం చెందుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. -
‘చియోంగ్‌చియాన్’పై అధ్యయనం
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి): ‘మూసీ’ ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణ కొరియాలోని సియోల్‌లో నదులను అభివృద్ధి చేసిన తీరుపై రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం అధ్యయనం ప్రారంభించింది. అక్కడి హాన్, చియోంగ్‌చియాన్ నదుల పునరుజ్జీవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టింది. హాన్, చియోంగ్‌చియాన్ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, పాటించిన పద్ధతులు, విధానాలను క్షుణ్ణంగా తెలుసుకుని.. అదే తరహాలో రాష్ట్రంలో మూసీ నదికి ప్రాణం పోయాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ల నేతృత్వంలోని రాష్ట్ర బృందం.. సోమవారం సియోల్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. మంత్రులు తొలుత చియోంగ్‌చియాన్ నది వెంట కలియదిరుగుతూ.. పునరుద్ధరణ ప్రాజెక్టు వివరాలను అక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం చెత్తను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ‘మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్’ను సందర్శించారు. ఐదు రోజుల దక్షిణకొరియా పర్యటనకు వెళ్లిన ఈ బృందంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌తోపాటు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. రోజూ వెయ్యి టన్నులు రీసైక్లింగ్ మాపో రిసోర్స్ రికవరీ ప్లాంటులో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. ‘వేస్ట్ టు ఎనర్జీ’ సాంకేతికత వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని రాష్ట్ర బృందానికి సియోల్ నగరపాలక సంస్థ అధికారులు వివరించారు. పర్యవరణంపై ప్రభావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. మరో పదేళ్లలో భూఉపరితలం నుంచి ఈ ప్లాంటును తొలగించి, భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. సియోల్ నగరానికి పశి్చమాన ఉన్న ఈ ప్లాంట్‌ను 2005లో ప్రారంభించారు. ఇందులో ఏటా 2 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటి మరో నాలుగు ప్లాంట్లను కూడా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మూసీ అభివృద్ధి కోసం.. సియోల్‌లో నదులకు పునరుజ్జీవం కల్పించినట్టే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సియోల్‌లోని చియోంగ్‌చియాన్ నది పరీవాహక ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హన్ పరీవాహక ప్రాంతాలను రాష్ట్ర బృందంతో కలిసి పరిశీలించానని తెలిపారు. అక్కడ ఒకప్పుడు తీవ్ర కాలుష్యంతో జీవించలేని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు నూతన కళను సంతరించుకుందని చెప్పారు. నది పరీవాహక ప్రాంతాలు టూరిస్టు హబ్‌గా మారాయని.. వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయని తెలిపారు. మూసీ నిర్వాసితులకు అభివృద్ధి ఫలాలను అందిస్తామన్నారు. -
హుస్నాబాద్ కరీంనగర్లో కలవనుందా?
సాక్షి, సిద్దిపేట: హుస్నాబాద్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కేడం లింగమూర్తి గురువారం ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను సిద్దిపేట జిల్లాలో బలవంతంగా కలిపారని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ కలవనుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు.హుస్నాబాద్.. మూడు జిల్లాల పరిధిహుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హనుమకొండ జిల్లాలో, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్నాయి. అప్పట్లో కరీంనగర్ జిల్లా నుంచి తమను వేరు చేయడంపై హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల ప్రజలు ఆందోళనలు చేశారు. వీటిని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అలాగే, గతంలో పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హుస్నాబాద్‌ను కరీంనగర్లో కలుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి సైతం హామీ ఇచ్చారు.బెజ్జంకిలో ఉద్యమం..బెజ్జంకి మండలాన్ని సైతం కరీంనగర్లో కలపాలని కరీంనగర్ సాధన సమితి పేరుతో అక్కడి ప్రజ లు ఉద్యమిస్తున్నారు. ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాలు కరీంనగర్లో కలిపేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. -
కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం
-
మీపై ఇంకా చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్:రాహుల్ గాంధీపై సెటైర్స్ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.పదేండ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం(అక్టోబర్9) ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘మేం చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం.విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారు.విదేశీ విద్యానిధి గత ప్రభుత్వంలో 150 మందికి ఇచ్చారు.మేం 500 మందికి ఇవ్వబోతున్నాం.అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రావడం లేదు.ప్రజలు ఓడించాక ఇంకా పదేళ్ల పాలన పై చర్చ ఎందుకు’అని పొన్నం అన్నారు. కాగా, యువతకు 2 లక్షల ఉద్యోగాలిచ్చిన రాహుల్‌గాంధీకి హైదరాబాద్ అశోక్‌నగర్‌కు స్వాగతమని ఎక్స్‌లో కేటీఆర్ చేసిన పోస్టుకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి: రాజకీయ లబ్ధి కోసం మా పరువు తీశారు -
స్క్రాప్ స్వచ్ఛందమే: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదిహేనేళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. వాహనాన్ని తుక్కుగా మార్చాలా, వద్దా అన్నదానిపై యజమానులే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని, గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి మరో ఐదేళ్లపాటు వినియోగించుకునే ప్రస్తుత విధానం కొనసాగుతుందని ప్రకటించింది. అయితే ఎవరైనా తమ వాహనాన్ని తుక్కుగా మార్చి, అదే కోవకు చెందిన కొత్త వాహనాన్ని కొంటే.. జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)లో కొంతమొత్తం రాయితీగా ఇస్తామని తెలిపింది. కొన్నినెలల పాటు వివిధ రాష్ట్రాల్లోని వెహికల్ స్క్రాపింగ్ పాలసీలను అధ్యయనం చేశాక.. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మిళితం చేసి అధికారులు ఈ విధానాన్ని రూపొందించారు. మంగళవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖ అధికారులతో కలసి ఈ వివరాలను వెల్లడించారు. ఏ వాహనాలకు ఏ విధానం? ఎవరైనా 15 ఏళ్లు దాటిన తమ వాహనాన్ని తుక్కుగా మార్చాలని భావిస్తే.. దీనిపై రవాణా శాఖకు సమాచారమిచ్చి, అదీకృత తుక్కు కేంద్రానికి వెళ్లి స్క్రాప్ చేయించుకోవాలి. ఆ కేంద్రం సంబంధిత వాహనానికి నిర్ధారిత స్క్రాప్ విలువను చెల్లిస్తుంది. ఈ మేరకు సర్టిఫికెట్ ఇస్తుంది. యజమానులు అదే కేటగిరీకి చెందిన కొత్త వాహనం కొన్నప్పుడు.. ఈ సర్టిఫికెట్ చూపితే కొత్త వాహనానికి సంబంధించిన జీవితకాల పన్నులో నిర్ధారిత మొత్తాన్ని రాయితీగా తగ్గిస్తారు.రవాణా వాహనాలను ఎనిమిదేళ్లకే స్క్రాప్‌కు ఇవ్వవచ్చు. వీటికి సంబంధించి ఎంపీ ట్యాక్స్‌లో 10% రాయితీ ఉంటుంది. మిగతా నిబంధనలు నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల తరహాలోనే వర్తిస్తాయి. – ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం నిర్బంధ స్క్రాప్ విధానమే వర్తిస్తుంది. పదిహేనేళ్లు దాటిన ప్రతి ప్రభుత్వ వాహనాన్ని ఈ–ఆక్షన్ పద్ధతిలో తుక్కు కింద తొలగించాల్సిందే. అవి రోడ్డెక్కడానికి వీలు లేదు. – ఏ కేటగిరీ వాహనాన్ని స్క్రాప్‌గా మారిస్తే.. అదే కేటగిరీ కొత్త వాహనంపై మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ద్విచక్రవాహనాన్ని తుక్కుగా మారిస్తే.. మళ్లీ ద్విచక్రవాహనం కొంటేనే రాయితీ వర్తిస్తుంది. అంతేకాదు వాహనాన్ని తుక్కుగా మార్చిన రెండేళ్లలోపే ఈ రాయితీ పొందాల్సి ఉంటుంది. కేంద్రం చట్టం చేసిన మూడేళ్ల తర్వాత.. దేశవ్యాప్తంగా వాహన కాలుష్యం పెరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేసింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలన్న విధాన నిర్ణయం తీసుకుంది. దీనిపై 2021లో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చట్టం అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. చాలా రాష్ట్రాలు దశలవారీగా దీని అమలు ప్రారంభించాయి. కానీ నిర్బంధంగా తుక్కు చేయకుండా.. స్వచ్ఛంద విధానానికే మొగ్గు చూపాయి. తెలంగాణలో మూడేళ్ల తర్వాత ఇప్పుడు పాలసీని అమల్లోకి తెచ్చారు. – ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎ‹స్ఎఫ్)’ కేంద్రాల్లో వాహనాలను తుక్కుగా మారుస్తారు. ఈ కేంద్రాల ఏర్పాటు కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేయగా.. మహీంద్రా కంపెనీ సహా నాలుగు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కేంద్రాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా, లేదా అన్నది పరిశీలించి అనుమతిస్తారు. యజమానులు ఈ కేంద్రాల్లోనే వాహనాలను అప్పగించి, సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాహనాల ‘ఫిట్నెస్’ పక్కాగా తేల్చేందుకు... 15 ఏళ్లు దాటిన వాహనాలను మరికొంతకాలం నడుపుకొనేందుకు ఫిట్నెస్ తనిఖీ తప్పనిసరి. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గానే టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది సరిగా జరగడం లేదని, అవినీతి చోటుచేసుకుంటోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఆటోమేటెడ్ స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ పద్ధతిలో ఫిట్నెస్ టెస్టులు చేయించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు రూ.293 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.133 కోట్లను భరించనుంది. ఇక వాహనాల విక్రయానికి సంబంధించిన ఎన్ఓసీలు, లైసెన్సులు ఇతర సేవలను అన్ని రాష్ట్రాలతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్‌లను ఏర్పాటు చేసింది. చాలా రాష్ట్రాలు వీటితో అనుసంధానమయ్యాయి. తాజాగా తెలంగాణ కూడా అందులో చేరుతున్నట్టు ప్రకటించింది. దీనిని తొలుత సికింద్రాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభిస్తున్నారు. భద్రతపై దృష్టి సారించాం దేశవ్యాప్తంగా ఏటా 1.6 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. తెలంగాణలో కూడా ఆ సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై దృష్టి సారించాం. నిబంధనల విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించాం. రవాణా శాఖకు సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు వాహనాల తుక్కు విధానం లేదు. దాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించి మంచి విధానాన్ని తెచ్చాం. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో రవాణాశాఖకు సంబంధించిన సమాచార మార్పిడికి వీలుగా సారథి, వాహన్ పోర్టల్‌లో తెలంగాణ చేరాలని నిర్ణయించింది. ఏడాదిలో అన్ని విభాగాలను అనుసంధానం చేస్తాం. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్‌ట్యాక్స్ మాఫీ..15 ఏళ్లుదాటిన వాహనాలు ఇంకా ఫిట్‌గా ఉన్నాయని భావిస్తే, వాటిని ఇక ముందు కూడా నడుపుకోవచ్చు. రూ.5 వేల గ్రీన్‌ట్యాక్స్ చెల్లించి తదుపరి ఐదేళ్లు, ఆ తర్వాత రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడు పుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఇప్ప టికే 15ఏళ్లు దాటేసిన వాహనాలను తుక్కుగా మార్పిస్తే.. వాటికి గ్రీన్‌ట్యాక్స్ బకాయి ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. దీంతో కొత్త పాలసీలో ఆ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్క్రాప్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే వాణిజ్య వాహనాలకు త్రైమాసిక పన్ను వంటి బకాయిలు ఉంటే.. ఆ బకాయిలపై పెనాల్టిని మాఫీ చేస్తారు. -
కొండా సురేఖకి అండగా ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తాను అన్న మాటలను ఉపసంహరించుకున్న తరువాత కూడా చర్చ కొనసాగించడం అనవసరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడి యాతో చిట్‌చాట్ చేస్తూ పలు అంశాలపై స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని నాగార్జున ఫ్యామిలీ కోరిన మేర కు మంత్రి వెంటనే స్పందించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్ర కటించారని గుర్తు చేశారు. ఆ అంశం అంతటి తో ముగిసిపోయిందని, పీసీసీ అధ్యక్షుడు కూ డా సమస్య సద్దుమణిగిందని చెప్పిన తరు వాత కూడా మాట్లాడటం శోచనీయమని అ న్నారు. కొండా సురేఖ ఇబ్బంది పడ్డప్పుడు మాట్లాడనోళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆరోపించారు.సురేఖ ఒంటరి కాదని, బలహీ న వర్గాల మంత్రికి తామంతా అండగా ఉన్నా మని అన్నారు. కేంద్రం నుంచి పైసా తేలేని వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలన్నారు. ఈ సంవత్స రం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే బ తుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే బతుకమ్మ చీరలకు రూ. 150 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించానని, వారు సానుకూలంగా స్పందించారని పొన్నం వెల్లడించారు. -
ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ– 2024 పాల సీలో ఇతర వర్గాలకు ఇ చ్చిన మాదిరిగా బీసీల కూ ప్రయోజనాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో మంగళవారం సెక్రటేరియట్ కాన్ఫ రెన్స్ హాల్లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరా వుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేధావులు, రిటైర్డ్ ఐఎఎస్‌లు, బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పారిశ్రామిక వేత్తలతో మేథోమధన సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఎంఎస్ఎంఈ రిటైర్డు జాతీయ డైరెక్టర్ ఆఫ్ జనరల్ చుక్కా కొండయ్యతో పా టు రిటైర్డు ఐఎఎస్‌లు, మేధావులు, పారిశ్రామి కవేత్తలతో కలిపి కమిటీ వేయాలని నిర్ణయించారు.ఎంఎస్ఎంఈలో బీసీలకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు వారి సలహా సూచనలు తీసుకొని అందులో చేర్చాల్సిన అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కేశవ రావు మాట్లాడుతూ బీసీలకు సబ్సిడీలు కల్పిస్తే వారితో పారిశ్రామికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు ఇతర అంశాలు చేరిస్తే లక్షలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు స్వత హాగా కులవృత్తులు ఆధునిక సాంకేతికతతో ఆర్థికవృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు.రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబం ఒక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. ఎంపీ అనిల్‌కుమార్ యాద వ్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, కమిషనర్ బాల మాయాదేవి, రిటైర్డు ఐఎఎస్ లు చిరంజీవులు, చోలేటి ప్రభాకర్, దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.విద్యావ్యవస్థలో సమూల మార్పులుసీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని, బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలను ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు సందర్శించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ కోరారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వ హించి బీసీ సంక్షేమ శాఖలో ఉన్నా సమస్యలపై చర్చించారు. బీసీ సంక్షేమ శాఖలో ఉన్న సమ స్యలపై చర్చించారు. అధికారులు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురు కులాలు సందర్శిస్తానని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాల మాయా దేవి తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: పొన్నం
లక్డీకాపూల్ (హైదరాబాద్): గల్ఫ్ దేశాల్లో ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందన్నారు. గల్ఫ్‌లో పనిచేసే కార్మికుల కుటుంబాల పిల్లల చదువుకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కలి్పస్తున్నామని చెప్పారు. శుక్రవారం బేగంపేట్‌లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం.. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుంచి మొదటి అభ్యర్థనను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో గల్ఫ్ కార్మికుల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం సలహాదారుడు బొజ్జ అమరేందర్‌రెడ్డి, ప్రతినిధులు భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, నరేశ్‌రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మహ్మద్ జబ్బార్, ఉపాధ్యక్షుడు మహ్మద్ మిస్రీ తదితరులు పాల్గొన్నారు. పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దుసాక్షి, హైదరాబాద్: హైడ్రాపై పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దని, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట...అధికారం కోల్పోయిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సచివాలయంలో శుక్రవారం పొన్నం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడం కడితే కూల్చేస్తామని నాడు కేసీఆర్ అన్నారా లేదా అని పొన్నం ప్రశ్నించారు. మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని స్వయంగా నాటి మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని, మూసీ మీద ఉన్న ఇళ్లను మాత్రమే తొలగిస్తున్నామని, వాళ్లకు సొంత ఇళ్లు వచ్చేలా, మెప్మా ద్వారా ఉపాధి అవకాశాలు కలి్పంచడానికి కార్యాచరణ చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. -
‘పొన్నం’కు అవగాహన లేదు: హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేటజిల్లా: తనను విమర్శించే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనారాహిత్యం బయటపడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టుపై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. కాగా, శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ హరీశ్‌రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. దీనికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి.. హరీశ్హార్డ్వర్కర్.. మాకు సలహాలివ్వొచ్చు: పొన్నం ప్రభాకర్ -
టచ్ చేసి చూడు: పొన్నం సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అనవసర రాజకీయాలకు తెరలేపొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై పిచ్చి ప్రేరాపనలు చెయ్యద్దని మండిపడ్డారు. విగ్రహాన్ని కూల్చుతాం పేల్చుతాం అంటే ఎవరు చూసుకుంటూ కూర్చోరని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండదని, దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహం పై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను, తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవమానించదు.. అవమానించలేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తమకు తెలంగాణ తల్లిపై అభిమానం ఉంది కాబట్టే.. సెక్రటేరియట్ లోపల విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. బీఆర్కు చేతనైతే తమకంటే మంచి పనులు చేయాలని సూచించారు. 18 సంవత్సరాలకు యువతకు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు.కాగా తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటుపై రాజీకాయ రగడ నెలకొంది. విగ్రహావిష్కరణపై కాంగ్రెస్, బీఆర్ మధ్య మాటల యుద్దం నడుతస్తోంది. సచివాలయం ఎదుట తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించామని, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని మండిపడుతోంది. అంతేగాక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడాలని, ఏం జరుగుతోందో చుద్దాం అంటూ సవాల్ విసురుతున్నారు. -
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి..
-
మీ కంటే పాలన మాకే బాగా తెలుసు: మంత్రి పొన్నం
సాక్షి,కరీంనగర్: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నంప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం(సెప్టెంబర్15) కరీంనగర్‌లోని మానకొండూరు చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పొన్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఉండొద్దని కోరుకుంటున్నారా? గత పదేళ్లలో ఏం జరిగిందో మాకు తెలియదా? పరిపాలించే సత్తా మీకు మాత్రమే ఉందని అనుకోవద్దు. మీకంటే పాలన మాకే బాగా తెలుసు. హైదరాబాద్ లో నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వేచ్ఛ గా నిమజ్జనం చేసేలా కార్యాచరణ రూపొందించాం. సచివాలయం కూడా నిమజ్జనం రోజు పూర్తి స్థాయిలో పని చేస్తుంది. గతంలో సచివాలయంలో పని జరగకపోయేది. గణేష్ నిమజ్జనం వేళ బీఆర్ఎస్ వాళ్లు గురించి మాట్లాడటం కూడా వృధా’అని పొన్నం అన్నారు. ఇదీ చదవండి.. గత ప్రభుత్వంలో అన్నీ స్కాములే -
పొన్నం వార్నింగ్
-
చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలకు రూ.15 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల నిధులు కేటాయించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఉత్స వాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఐలమ్మ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించా రు. ఈనెల 26న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమాల కోసం రూ.12 లక్షలు కేటాయించామని, అలాగే ఈ నెల 10న జరిగే వర్ధంతి కార్యక్రమం కోసం రూ.3 లక్షలు కేటాయించినట్లు పొన్నం వెల్లడించారు.ఈ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి చైర్మన్‌గా షాద్‌నగర్ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీలో 40 మంది సభ్యులను కూడా నియమించినట్లు చెప్పారు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి ఉన్న అనువైన స్థలాన్ని గుర్తించాలని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి మంత్రి సూచించారు. -
ఆపరేషన్ హైడ్రా హైదరాబాద్ టూ అన్ని జిల్లాలు
-
‘మహిళల్ని అవమానించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై మంత్రులు పొన్నం, సీతక్కలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటున్నారు వాళ్లు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బస్సుల్లో బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.‘‘మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా?. మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం ఈ వ్యాఖ్యలు. గత పది సంవత్సరాలు హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం.గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు?. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు. మేం చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి?. ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే... వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గం. కేటీఆర్, ఆయన బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాల్సిందే అని సీతక్క అన్నారు.మరోవైపు రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని కేటీఆర్ అవమానపరుస్తున్నారు. అల్లం, ఉల్లి పొట్టు తీసుకుంటున్నట్లు ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రేక్ డాన్స్‌లు చేసుమంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాష్ట్ర, కేంద్ర మహిళా కమిషన్లు తక్షణమే కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలి అని మంత్రి పొన్నం అన్నారు. -
అప్పుడు కలెక్షన్ కౌంటర్లు..ఇప్పుడు కాల్‌సెంటర్లా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు అరకొరగా రైతు రుణమాఫీ అమలు చేశారని, దీంతో అర్హులైన 3లక్షల మందికి మాఫీ కాలేదని, సాంకేతిక కారణాలతో ఆ రైతులకు అన్యాయం చేశారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామని స్వయంగా అప్పటి మంత్రి హరీశ్ ప్రకటన విడుదల చేశారే తప్ప...ఆ రైతులకు మాఫీ కాలేదని వెల్లడించారు. రుణమాఫీ కాకపోవడంతో వేలాదిమంది రైతులను బ్లాక్‌లిస్టులో పెట్టి బ్యాంకులు కొత్త రుణాలు నిరాకరించినప్పుడు హరీశ్‌రావు ఏ కలుగులో దాక్కున్నారని సోమవారం ఒక ప్రకటనలో మంత్రి పొన్నం ప్రశ్నించారు. అప్పుడే హరీశ్‌రావు కాల్‌సెంటర్ పెట్టుకొని ఉంటే బాగుండేదన్నారు. అప్పుడేమో కలెక్షన్ కౌంటర్లు పెట్టి... ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తుందని, సాంకేతిక కారణాలతో మాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణమాఫీ అందని రైతులకు లేని తొందర హరీశ్‌రావుకు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పదేళ్లలో ఆరులక్షల కోట్లు అప్పులు చేస్తే..వడ్డీలు కడుతున్నామని, కాలమైతే మీ ఖాతాలో, కరువొస్తే పక్కోళ్ల ఖాతాలో వేసే నైజం బీఆర్ఎస్ నేతలదని విమర్శించారు. అప్పులకు బాధ్యత వహించని బీఆర్ఎస్ అభివృద్ధిని తన ఖాతాలో ఎలా వేసుకుంటుందని ప్రశ్నించారు. పలుశాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు కాల్‌సెంటర్ల పేరుతో ఇప్పుడు కహానీలు చెబుతున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారికి అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆ ప్రకటనలో పొన్నం పేర్కొన్నారు. -
నేడే జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తు న్న జాబ్ కేలండర్ మరికొన్ని గంటల్లో వెలువడనుంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచి్చన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభ వేదికగా జాబ్ కేలండర్‌ను ప్రకటించనుంది. ఇకపై ఏటా యూపీఎస్సీ తరహాలో ప్రణాళికాబద్ధంగా తేదీలవారీగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో జాబ్ కేలండర్‌ను ప్రకటించనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జాబ్ కేలండర్ సహా కొత్త రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, మూసీ నది ప్రక్షాళన, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.మేని ఫెస్టోలో ప్రకటించిన జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రకటిస్తున్నామని పొంగులేటి తెలిపారు. ఈ అంశంపై చర్చలో ప్రతిపక్షాలు చేసే సూచనలను పరిగణనలోకి తీసుకొని తగిన మార్పులు చేసేందు కు సిద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఇప్పటికే ప్రకటించిన గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 నోటిఫికేషన్లకు వర్తింపజేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. త్వరలో తెల్లరేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్నికల్లో ఇచి్చన మరో హామీ మేరకు త్వరలో అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల (హెల్త్ ప్రొఫెల్ కార్డులు)ను విడివిడిగా జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విధివిధానాలు రూపొందించి సత్వరమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం నెలలోగా నివేదిక ఇస్తుందని పొంగులేటి చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మళ్లీ కోదండరాం, అమేర్ అలీఖాన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ గతంలో ప్రభుత్వానికి తిప్పిపంపడం తెలిసిందే. దీంతో వారి పేర్లనే మళ్లీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పోస్టులకు సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు ⇒ కేరళలోని వయానాడ్‌లో ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక, వైద్య, సహకారం అందించాలి. ⇒ షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, టీం ఇండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలంతోపాటు నిఖత్ జరీన్, సిరాజ్‌కు గ్రూప్–1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆమోదం. ⇒ ఇటీవల విధి నిర్వహణలో మరణించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్‌కు మున్సిపల్ కమిషనర్‌గా విధినిర్వహణలో మరణించిన అదనపు డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఓకే. ⇒ 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 2007లో దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 437 కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోదం. ⇒ ఖాయిలాపడిన నిజాం షుగర్స్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి. మంత్రి శ్రీదర్‌బాబు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ప్రకారం రెండు విడతలుగా ఆర్థిక సాయం చేయాలి. ⇒ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట చెరువుకు తరలించి అక్కడి నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలించాలనే ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్. 10 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటికి, మిగిలిన 5 టీఎంసీలను నగర పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో నింపడంతోపాటు మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీళ్లు ఉండేలా వదలాలన్న ప్రతిపాదనకు ఓకే. ⇒ ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమరి్పంచిన నివేదికపై శుక్రవారం శాసనసభలో లఘు చర్చ నిర్వహణకు నిర్ణయం. -
కిషన్‌రెడ్డి.. హైదరాబాద్ గురించి ఆలోచించండి: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ విభజన హామీలకు సంబంధించి నిధులు కేటాయించేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.కాగా, సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రతీ రూపాయి అడుగుతున్నాము. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలి. గత పది సంవత్సరాలుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరిగింది. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ పెంచాలి. రాష్ట్రంలో నవోదయ, సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలి.గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చినా సీఎం కలిసే వారు కాదు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం పని చేస్తాం. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి. యూనివర్సిటీల అభివృద్ధి కోసం నిధులు తెచ్చేలా కిషన్ రెడ్డి కృషి చేయాలి. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా కృషి చేస్తున్నాం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి సానుకూలంగా పరిష్కరించుకునేలా ముందుకు పోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
సికింద్రాబాద్: లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా తొలి బోనాన్ని సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సకాలంలో మంచి వర్షాలు పడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. హైదరాబాద్ జంట నగరంలోనే కాకుండా వంద సంవత్సరాల నుంచి సంస్కృతి సాంప్రదాయాలతో ఈ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి అవాంతరాలు జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి అన్నారు.ఈ రోజు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు, 28వ తేదీ లాల్ దర్వాజా బోనాలు, తర్వాత రంగం, అంబారీ ఊరేగింపు అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు సహకారం కావాలని కోరారు. -
ప్రభుత్వాన్ని నిలబెడతాం బీఆర్ఎస్, బీజేపీకి పొన్నం కౌంటర్
-
బీసీ కుల గణనకు కార్యాచరణ
నల్లగొండ/ నల్లగొండ రూరల్: బడుగు, బలహీనవర్గాలకు మేలు జరిగే విధంగా బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో కూడా విడుదల చేశామని, రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా ఎవరి వాటా ఎంత.. ఎవరి సంఖ్య ఎంత అనే విధంగా కార్యాచరణ చేపట్టే ఆలోచన చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శనివారం నల్లగొండ పట్టణంలో సావిత్రిబాయి, జ్యోతిబాఫNలే విగ్రహాలను ఆవిష్కరించి అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. బీసీల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 80 కోట్లతో గురుకుల భవనాలు ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు బీసీ జన గణనకు కృషి చేయాలని కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం.. ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికుల సంక్షేమంలో భాగంగా 21 శాతం డీఏ ఇచ్చామని, రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించామని చెప్పారు. నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ‘రాజధాని’ఏసీ బస్, నాలుగు డీలక్స్, ఒక పల్లె వెలుగు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడుపుతామని అన్నారు. నల్లగొండ బస్టాండ్‌లో బస్సులను ప్రారంభించిన అనంతరం మంత్రులు బస్సులో కొద్దిదూరం ప్రయాణించారు. నల్లగొండలో 20 ఎకరాల్లో నూతన బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా.. త్వరలోనే బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పొన్నం హామీ ఇచ్చారు. -
అలిగిన మంత్రి..
-
ప్రోటోకాల్ పై మంత్రులు సీరియస్
-
నేనేం అలగలేదు: మంత్రి పొన్నం
హైదరాబాద్, సాక్షి: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఈ ఉదయం జరిగిన తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని అన్నారామె. మంగళవారం సాయంత్రం బల్కంపేట ఘటనపై మంత్రుల సమీక్ష జరిగింది. అంతకు ముందు మీడియాతో ఆమె బల్కంపేట ఘటనపై స్పందించారు.బల్కంపేటలో ‘ప్రొటోకాల్’ ఘటనపై పొన్నం మాట్లాడారు. ఈ ఘటన విషయంలో నేను అలగలేదు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది. తోపులాట నివారించేందుకు ఆగి.. కాసేపు అధికారులతో మాట్లాడాం. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల్ని ప్రశ్నించా? అంతే అని అన్నారాయన. మూడు రోజులపాటు జరిగే ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా.. ఈ ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీసమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుడికి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ల వెంట నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా గుడిలో తోపులాట జరిగింది. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. తమ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఆయన అధికారులపై చిందులు తొక్కారని, ఎవరు నచ్చజెప్పినా వినలేదని కథనాలు వచ్చాయి. -
ప్రమాణాలతో వైద్య విద్యను అందిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య వైద్యను అందిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్ రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల శారీరక ఎదుగుదలకు డీవార్మింగ్ టాబ్లెట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు స్వయంగా డీవార్మింగ్ టాబ్లెట్లను మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్ వేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ మాత్రలను అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలకు అందిస్తున్నామన్నారు. గురువారం నుంచి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని, మన పూరీ్వకులు ఆరోగ్యం కోసం యోగాను వారసత్వంగా అందించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, రాజ్‌భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి పాల్గొన్నారు. -
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా నటిస్తున్న చిత్రం నిమ్మకూరు మాస్టారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జె.ఎమ్. సినీ ఫ్యాక్టరీ పతాకంపై జె.ఎమ్.ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. అముదేశ్వర్ దర్శకుడు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీతం అందిస్తుండగా అన్ని పాటలకు జొన్నవిత్తుల లిరిక్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్.. హీరో శ్యామ్ సెల్వన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మాధవపెద్ది సురేష్ చంద్ర మాట్లాడుతూ.. తమ కుటుంబం నుంచి ఐదో తరం వాడైన తన మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా పరిచయం అవుతుండడం గర్వంగా ఉందన్నారు. ఒక గొప్ప ఉదాత్తమైన కథాంశంతో రూపొందుతున్న రూపొందుతున్న "నిమ్మకూరు మాస్టారు" జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.ఈ చిత్రంలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉందని పేర్కొన్న జొన్నవిత్తుల... ఇందులో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయని, ముఖ్యంగా ఒక పాట చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. మాధవపెద్ది ఇప్పటివరకు చేసిన సినిమాలు, కూర్చిన పాటలు ఒకెత్తు... మనవడి పరిచయ చిత్రమైన "నిమ్మకూరు మాస్టారు" ఒకెత్తు కానుందని జొన్నవిత్తుల అన్నారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని, రాజమండ్రిలో ఒక షెడ్యూల్ చేస్తున్నామని దర్శకుడు అముదేశ్వర్ తెలిపారు.చదవండి: గుండు గీయించుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా? -
కాంగ్రెస్ మంత్రిని ఇమిటేట్ చేసిన కౌశిక్ రెడ్డి
-
కరీంనగర్లో పొన్నం ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ విద్యు త్ కేంద్రం నుంచి ఫ్లైయాష్ (బూడిద) తరలింపులో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లో రేవంత్, పొన్నం ట్యాక్స్ అమలవుతున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, డాక్టర్ సంజయ్‌తో కలిసి తెలంగాణభవన్‌లో కౌశిక్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. 32 టన్నుల బూడిద తరలించాల్సిన లారీలో 72 టన్నులు తరలిస్తున్నారని, వే బిల్లుల్లో ఎన్ని టన్నులు తరలిస్తున్నారనే విషయం పేర్కొనడం లేదని చెప్పారు.బూడిద అక్రమరవాణా ద్వారా మంత్రి పొన్నం రోజూ రూ.50 లక్షలు సంపాదిస్తుండగా, ఆయన అన్న కుమారుడు అనూప్ ఈ వసూ ళ్లు చేస్తున్నారన్నారు. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న 13 లారీలను ఇటీవల తాను స్వయంగా పట్టుకొని అధికారులకు అప్పగించినా, రెండు లారీ లు సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను తాను పట్టుకోవడంతో రూటు మార్చి హుస్నా బాద్ మీదుగా దందా కొనసాగిస్తున్నారని కౌశిక్‌రెడ్డి చెప్పారు. ఇకపై ఏ మార్గంలో ఫ్లైయాష్ తరలించినా బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుంటారని హెచ్చరించారు. ఓవర్‌లోడ్‌తో వెళుతు న్న ఫ్లైయాష్ లారీల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థి అఖిల్ మరణించాడన్నారు. ఎన్టీపీసీ వివరాలు దాచిపెడుతోంది ఫ్లైయాష్ అక్రమ రవాణా జరుగుతున్నా, ఎన్టీపీసీ అధికారులు వివరాలు దాచిపెడుతూ చోద్యం చూ స్తున్నారని కౌశిక్‌రెడ్డి అన్నారు. అధికారుల తీరుపై ఢిల్లీలో ఆ సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా మని చెప్పారు. ఓవర్‌లోడ్ దందాపై బీఆర్ఎస్ కేడ ర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందన్నారు. తప్పు లు చేస్తున్న అధికారుల వివరాలు రెడ్‌బుక్‌లో నమో దు చేసి అధికారంలోకి వచి్చన తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. హరీశ్‌రావుపై ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అనవసర విమర్శలు చేస్తున్నారని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చే స్తారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. -
ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
అబిడ్స్ / గన్‌పౌండ్రీ/ సిరికొండ: ఉబ్బసం రోగుల కోసం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నగరంలో ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం ఉదయం ప్రారంభమైంది. రెండురోజుల పాటు బత్తిని కుటుంబం ఆ ధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని శాసనసభ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్షి్మ, మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మా ట్లాడుతూ, 150 సంవత్సరాలుగా మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తిన కుటుంబీకులు ఉచితంగా, సేవాభావంతో లక్షలాది మందికి చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది అస్తమా రోగుల సౌకర్యార్థం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం... జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, వాటర్ బోర్డు, విద్యుత్, రెవెన్యూ, మత్స్యశాఖ, పోలీస్‌శాఖ, ట్రాఫిక్ శాఖ లతో పాటు పలు శాఖల అధికారులు చేపప్రసాద పంపిణీకోసం భారీ ఏర్పాట్లు చేశారని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లన్ని శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, 32 కౌంటర్ల ద్వారా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా చేయగా, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు రోగులకు అల్పాహారం అందించాయి.వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు ఉచితంగా అందించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్స్ యాదవ్ ఆధ్వర్యంలో అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో దాదాపు 60వేల చేపపిల్లలను శనివారం రాత్రి వరకు విక్రయించినట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం వరకు చేపప్రసాదం పంపిణీ జరుగనుందని వెల్లడించారు.క్యూలైన్లో సొమ్మసిల్లి మృతి.. చేపమందు కోసం హైదరాబాద్ వచ్చిన నిజా మాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామానికి చెందిన మామిడి గొల్ల రాజన్న (65) తొక్కిస లాటలో మృతి చెందాడు. శనివారం ఉదయం క్యూలైన్లో వేచి ఉన్నప్పుడు, ఒకేసారి జనాన్ని పంపించడంతో తోపులాట జరిగి రాజన్న కిందపడిపోయాడు. అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. -
సుష్మాస్వరాజ్ సేవలు మర్చిపోలేం: పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరులను ప్రధాని మోదీ అవమానించారు. ఆత్మ గౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాజకీయంగా విమర్శలకు వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.కాగా, రేపు(ఆదివారం) పరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. తెలంగాణకు ఒక గీతం ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే రాష్ట్ర గీతం ఆవిష్కరిస్తాము. ఈ సందర్భం రాజకీయంగా విమర్శలకు వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలి. తెలంగాణ అమరులను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు.అలాగే, సుష్మాస్వరాజ్ సేవలు మేము మార్చుపోము. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా మేము ఆహ్వానం పంపాము. మాకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక అందలేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ప్రదాత. సోనియా వస్తారనే నమ్మకం ఉంది. రాష్ట్ర చిహ్నంపై గతంలో ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిరసన చెప్పు కోవచ్చు. మా ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పదేపదే పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
-
తెలంగాణకు ఏం చేశారో చెప్పండి
కరీంనగర్ కార్పొరేషన్: పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటో ఆ పార్టీ నేతలు చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి చేసిందేమిటో సమాధానం చెప్పాకే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ఓట్లు అడగాలన్నారు. ఆంబేడ్కర్ జయంతి సందర్భంగా పదేళ్ల బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆదివారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడుగుతున్నారని, తాము అధికారంలోకొచ్చి నాలుగు నెలలే అయిందని, అంతకుముందు పదేళ్లు అధికారంలో ఉండి అమలు చేయని హామీల మాటేమిటని ప్రశ్నించారు. బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ నిరసన దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. నల్లధనాన్ని బయటకు తీసి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు పింఛన్ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్ర విభజన హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన పరిశ్రమలను మోదీ ప్రైవేట్ పరం చేస్తూ అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. డిపాజిట్లు రాని బీజేపీతో కాంగ్రెస్‌కు పోటీ ఏంటి? బీజేపీకి 2014లో 105 సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదని, 2018లో 100 సీట్లలో, 2023లో 70కి పైగా సీట్లలో డిపాజిట్ రాలేదని, అలాంటి బీజేపీకి కాంగ్రెస్‌తో పోటీనా అని పొన్నం వ్యాఖ్యానించారు. మోదీ ఫొటోతో ఓట్లు రావని బీజేపీ నేతలకు కూడా తెలుసని అందుకే రాముడి ఫొటోలతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీక్షలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి పాల్గొన్నారు. -
గాంధీభవన్, తెలంగాణ భవన్ వద్ద మంత్రి పొన్నం దీక్ష చేయాలి
కథలాపూర్ (వేములవాడ/వేములవాడ అర్బన్ ): వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందుకు గాంధీభవన్ వద్ద, కేసీఆర్ పదేళ్లు ప్రజలను అరిగోస పెట్టినందుకు మంత్రి పొన్నం తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సవాల్ విసిరారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో బండి సంజయ్ మాట్లాడారు. అంతకుముందు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రైతులను కలిసి వారు పడుతున్న కష్టాలు తెలుసుకున్నారు. ఇకనై నా కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మా టలు మానుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. పొన్నం దీక్ష ఎందుకోసమో చెప్పాలి పొన్నం దీక్ష చేసేది కరోనా సమయంలో ప్రధాని మోదీ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకా? లేక కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ. 12 వేల కోట్ల నిధులిచ్చినందుకా? లేదా కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసినందుకా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్లో కాంగ్రెస్‌కు ఎంపీ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు చెన్న మనేని వికాశ్రావు, తదితరులు పాల్గొన్నారు. -
Ponnam Prabhakar: 14న కరీంనగర్లో దీక్ష చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 14న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి కోట శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు. గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయకుండా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెర వేర్చకుండా ఏ మొహం పెట్టు కుని బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లడుగుతారని వారు ప్రశ్నించారు. దేశంలోని నవరత్నాల కంపెనీలను అమ్మే స్తున్న బీజేపీకి ఒక ఎజెండా లేదని, కేవలం రాము డుపేరిట అక్షింతలు, కుంకుమలను ప్రజలకిచ్చి ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమంలో యువత బలిదానాలను బీజేపీ అవహేళన చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్య లకు బీజేపీనే కారణమని విమర్శించారు. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. -
బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం
-
టచ్ చేసి చూడండి..ఏం జరుగుతుందో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మొన్నటివరకు బీఆర్ఎస్ పాట పాడిందని.. ఇప్పుడు బీజేపీ నేతల నోట అదే పాట వినిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యా నించారు. తలచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలే టి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో’అని హెచ్చరించారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, తమను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. పొన్నం శనివారం గాం«దీభవన్‌లో టీపీసీసీ నేతలు నిజాముద్దీన్, కోట్ల శ్రీనివాస్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడానికి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఏమైనా జ్యోతిష్యం చదువుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు బీసీని అధ్యక్షుడ్ని చేయండి లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరమని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్ ఏర్పాటైన 23 ఏళ్లలో ఒక్క బీసీ నేత అయినా ఆ పారీ్టకి అధ్యక్షుడయ్యారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక అయినా, లేక ఎన్నికల్లో ఓడిపోయాక అయినా బీసీలకు అధ్య క్ష పదవి ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత, ప్రతిపక్ష నేత, మండలిలో ప్రతిపక్ష నేత.. ఇలా ఏ పదవిని కూడా బీసీలకు ఇవ్వకుండా.. బీసీలను ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. తమ ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి, రూ.150 కోట్లు నిధులు ఇచి్చందని, 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌తోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పారీ్టలో బీసీలకు అన్యాయం జరిగితే పారీ్టలో అంతర్గతంగా అడుగుతామని, బీఆర్ఎస్లో అలా అడిగే స్వేచ్ఛ కొంచెమైనా లేదని విమర్శించారు. బీసీని అధ్యక్ష పదవి నుంచి తీసేసి.. బలహీనవర్గాల నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసిన బీజేపీ.. బీసీ నేతను సీఎం చేస్తామని చెప్పడం ఏమిటని పొన్నం నిలదీశారు. అవినీతి చేసినందుకే బండి సంజయ్‌ను తీసేశామని కిషన్‌రెడ్డి వర్గం చెప్తుంటే.. కిషన్‌రెడ్డిని కేసీఆర్ నియమించుకున్నారని బండి సంజయ్ వర్గం అంటోందని వ్యాఖ్యానించారు. కాగా.. మంత్రులు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారని మీడియా ప్రస్తావించగా.. తనను అలాంటి చర్యకు పాల్పడాలని అడిగే ధైర్యం ఎవరికీ లేదని, కలలో కూడా బీజేపీ ఊసెత్తనంటూ మంత్రి పొన్నం మీసం మెలి తిప్పారు. -
నేటి నుంచే టీజీ రిజిస్ట్రేషన్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలోని వాహనాలు శుక్ర వారం(నేటి) నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, రోడ్డు రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాడాలనే ఆకాంక్షతో పాల్గొన్న ఉద్యమకారులు, ప్రజలు తమ వాహనాలపై ఆరోజే టీజీ ఆని రాసుకున్నారని గుర్తు చేశారు. అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ టీజీకి బదులు టీఎస్‌ను తెచ్చి వారి ఆకాంక్షలు, మనోభా వాలను అణచివేసిందని విమర్శించారు. గురువారం హను మకొండ కలెక్టరేట్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌తో కలి సి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు నెరవేరేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖ పంపించామని, శుక్రవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలన్నీ టీజీ మీదనే అవుతాయని, ఇప్పటివరకు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్లు అలాగే ఉంటాయని చెప్పారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు ఫిట్నెస్ టెస్టులు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయంలో నిబంధనలను కఠిన తరం చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు కూడా ఫిట్నెస్ టెస్టులు నిర్వహించాలనే నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి కొత్తబస్సులు తెచ్చామని, త్వరలోనే మరో వెయ్యి బస్సులు తేనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని కేడర్లకు చెందిన 3,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కార్మికులు సంతోషంగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక మూడు సిరీస్‌ల ముచ్చట సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలకు శుక్రవారం నుంచి టీజీ రిజిస్ట్రేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఇకపై మూడు సిరీస్‌లతో తెలంగాణ వాహనాలు కనిపించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వాహనాలకు ఏపీ సిరీస్ కొనసాగింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 జూన్‌లో టీఎస్ సిరీస్ అందుబాటులోకి వచ్చినా, అప్పటివరకు ఏపీ సిరీస్‌తో ఉన్న వాహనాలకు పాత సిరీస్‌నే కొనసాగించొచ్చని నాటి ప్రభుత్వం పేర్కొంది. దీంతో 2014 జూన్(టీఎస్‌గా మారకముందు)కు ముందు నాటి వాహనాలు ఏపీతో, ఆ తర్వాతవి టీఎస్‌తో కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి టీజీ సీరీస్ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. దీంతో మూడు సిరీస్‌లతో వాహనాలు కనిపించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,91,666 వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 70,81,345 వాహనాలు ఏపీ సిరీస్‌తో ఉండగా, 98,10,321 వాహనాలు టీఎస్ సిరీస్‌తో నడుస్తున్నాయి. రాష్ట్ర సిరీస్ తప్ప జిల్లా సిరీస్‌లు యధాతథంగా కొనసాగుతాయి. టీజీ జెడ్ ఆర్టీసీ వాహనాలకు, టీజీ09 పీ పోలీసు వాహనాలకు, నంబర్ల పక్కన టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లు రవాణా వాహనాలకు కొనసాగుతాయి. -
నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే.. : మంత్రి పొన్నం
సంగారెడ్డి: గ్రామీణ యువత క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడా స్ఫూర్తి ఐక్యతను ప్రోత్స హిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పోతారం(ఎస్) లో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను సందర్శించి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే ఆడేదని, ఈ ఊరు నుంచి కబడ్డీ క్రీడాకారులు పోలీసులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు మడక కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్‌లు కేడం లింగమూర్తి, బత్తిని సాయిలు, ఎంపీటీసీ భొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ రథం అందజేస్తా.. లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్, కరీంనగర్ రెనే ఆస్పత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో మంత్రి వైద్య పరీక్షలు చేసుకున్నారు. శిబిరంలో ప్రముఖ ఛాతీ వైద్యులు, గుండె సంబంధించిన వైద్యులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టుకోవడానికి వసతి కోసం కలెక్టర్, ఆర్డీఓలతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లయన్స్ క్లబ్‌కు నా తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయిలేని అనిత, వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, లయన్స్ క్లబ్ నిర్వాహకులు రాజగోపాల్రావు, కాయిత నారాయణ రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రిని సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ ఉద్యోగులు శాలువా కప్పి సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 సంవత్సరానికి సంబంధించి వేతన సవరణ 21 శాతం ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చదవండి: హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా.. : బీబీ పాటిల్ -
TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. కాగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నాం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16 శాతం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. కొత్త పీఆర్సీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తాం. 21 శాతం పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా నడుస్తోంది అని వ్యాఖ్యలు చేశారు. -
మహా జాతర షురూ
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున ఆ ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. ఉద యం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాక మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్న ను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ గౌతమి, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. -
ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రయాణం
షాద్‌నగర్ (హైదరాబాద్)/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహ బూబ్‌నగర్‌లో నిర్వహించిన గౌడ సంఘం సమావేశానికి వెళ్లేందుకు.. ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు బస్సులో ప్రయాణించారు. నారాయణపేట డిపో బస్సు ఎక్కిన మంత్రి మహిళా ప్రయా ణికులతో ముచ్చటించారు. డ్రైవర్ ఇయర్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న విషయాన్ని గమనించిన పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బస్సులోని మహిళా కండక్టర్‌ను ఈ విషయమై అడి గారు. డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని తమాషా చేస్తున్నాడా?.. అలా మాట్లాడితే సస్పెండ్ అవు తాడు తెలుసా?.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు కదా? అన్నారు. ‘కాంగ్రెస్ సర్కార్ ఆయా.. ఏ సబ్ కా సర్కార్ హై’.. అంటూ ఓ ముస్లిం ప్రయాణికురాలితో మంత్రి ముచ్చటించారు. పెన్షన్ వస్తుందా? అని ప్రశ్నించగా.. రావడం లేదని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నావా? అని అడిగారు. లేదని ఆమె చెప్పడంతో వెంటనే దరఖాస్తు చేసుకోమని మంత్రి పొన్నం సూచించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని.. అదేవిధంగా కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
నా తల్లిని అంటావా?
-
ఉద్యమకారులను విస్మరించిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను విస్మరించడం వల్లనే కాంగ్రెస్‌లో పార్టీలోకి వలస వస్తున్నారని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం గాందీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్షి సమక్షంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీపా దాస్ మున్షి వారిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు తగిన గుర్తిపు ఉంటుందన్నారు. టీఆర్ఎస్ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను తొక్కిపెట్టిందని గుర్తు చేశారు. ఉద్యమకారులు పార్టీ వీడి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని సంక్షేమ అభివద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్తగారింటి నుండి తల్లి గారి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టడంతోనే రాజీనామా చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని ధనబలం ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, జీహెచ్ఎంíసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేటర్లు బాబా ఫసియొద్దీన్ పాల్గొన్నారు. -
వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు. ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్ శనివారం గాం«దీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీలది డ్రామా బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్ మోడల్లో కులగణన త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్‌లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్‌కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూపాలని సవాల్ చేశారు. ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. -
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పీఆర్టీయూటీఎస్ హర్షం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్‌నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్‌యూటీఎఫ్ ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్ జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్‌సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్ కమిషనర్‌కు టీపీఎస్ఏ వినతిపత్రం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్ సబ్‌కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్‌కు టీఎస్పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్‌లో కమిషనర్‌కు టీఎస్పీఏ ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
మా ప్రభుత్వాని టచ్ కూడా చేయలేరు
-
కేసీఆర్ తోడల్లుడిపై కేసు నమోదు
కరీంనగర్‌క్రైం: మాజీ సీఎం కేసీఆర్ తోడల్లుడు, రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్‌రావుపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టూటౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అనుచరుడు కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన కూస రవీందర్ భూదందాలకు పాల్పడుతున్నాడని ఓ యూట్యూబ్ చానల్లో వార్త ప్రసారం చేశారు. మిడ్‌మానేరు భూ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లలో భూకబ్జాకు పాల్పడ్డాడని, అక్రమ పట్టా ఇవ్వమని సిరిసిల్ల ఆర్డీవోను బెదిరింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని, తప్పుడు విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని.. దీని వెనుక కేసీఆర్ తోడల్లుడు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్ ఉన్నారని కూస రవీందర్ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోగినపల్లి రవీందర్ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్, యూట్యూబ్ చానెల్ నిర్వాహకుడు చిలుక ప్రవీణ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.ల -
హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్.. టీపీసీసీ భారీ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్ రాజకీయం నడుస్తోంది. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్‌కు టీపీసీసీ అప్పగించింది. ఇందులో భాగంగా జార్ఖండ్ కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు నేడు హైదరాబాద్‌కు రానున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ వారి కోసం మూడు హోటల్స్‌ను సిద్ధం చేసింది. గచ్చిబౌలి, రామోజీ ఫిల్మ్ సిటీ, శామీర్‌పేట్ లియోనియో హోటల్స్‌ను టీపీసీసీ బుక్ చేసింది. ఈ క్రమంలో 43 మంది ఎమ్మెల్యేలను హోటల్స్‌కు తరలించేందుకు బస్సులను కూడా సిద్ధం చేశారు. కాగా, జార్ఖండ్‌లో బలపరీక్ష నిరూపణ వరకు ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
బాలయ్యలా మారిన మంత్రి పొన్నం ప్రభాకర్
-
దశాబ్ద కాలం తర్వాత డీఆర్సీ
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై బుధవారం సుమారు 4 గంటల పాటు సుదీర్ఘమైన సమీక్ష సమావేశం జరిగింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత డీఆర్సీ సమావేశ దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇన్చార్జి మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పూర్తి స్థాయి వివరాలు, అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో ఆరా తీయడంతోపాటు సమస్యలను ఆయన నోట్ చేసుకున్నారు. అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శాఖాపరంగా సమగ్ర అవగాహన, సమాచారం లేనివారిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికైనా సమగ్ర సమాచారంతో రావాలని పలు శాఖల అధికారులను స్వల్పంగా మందలించారు. అధికారులు తమ విధులు, బాధ్యతలు విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం మాదిరిగా వన్‌సైడ్ నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి త్వరలో జరగనున్న పదోతరగతి, ఇంటరీ్మడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి అని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. సంబంధిత హెచ్ఎం, టీచర్, వార్డెన్లను నుంచి సమ్మతి లేఖ తీసుకోవాలని, విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించకుంటే వారినే బాధ్యులు చేయాలని సూచించారు. ఇప్పటి నుంచే సంబంధిత అధికారులు పాఠశాలలపై పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గురుకులాలు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల లో సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. పరిష్కారానికి హామీ.. ప్రభుత్వ విభాగాల్లో పలు పలు సమస్యలు, పెండింగ్ పనులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండు మోడ్రన్ ధోబీఘాట్ల పూర్తైనప్పటికీ న్యాయపరమైన సమస్యలు ఉండడంతో మిషన్లు తుప్పుపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొనడంతో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఉన్న తాధికారులను ఆదేశించారు బీసీ హాస్టళ్లు అధిక శాతం ప్రైవేట్ భవనల్లో ఉన్నాయని వాటి సొంత భవనాల నిర్మాణం, 6 హాస్పిటళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం జీఓ ఇచి్చందని, నిధులు విడుదల చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటు నగరంలో అధునాతన చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చేపల మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు రోడ్లపై విక్రయిస్తున్నారని, ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేసి మత్స్యకారులు, వినియోగదారులకు సౌకర్యం కలి్పస్తామన్నారు. కూరగాయల మార్కెట్లను సైతం రెగ్యులరైజ్ చేస్తామన్నారు. పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. కలెక్టరేట్‌కు కొత్త భవనాన్ని నిర్మిస్తాం.. త్వరలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. విశాలమైన స్థలంలో ఎవరూ ఊహించని విధంగా భారీ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి సైతం కొత్తవి అందిస్తామని స్పష్టం చేశారు. 58, 59 జీఓకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు రాబోయే వేసవితో పాటు విద్య, వైద్యానికి సంబంధించి అత్యవసర పనుల కోసం ఒక్కో నియోజక వర్గానికి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్లో జరిగిన ‘జిల్లా స్థాయి సమీక్ష సమావేశం’ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల అత్యవసర సమస్యల పరిష్కారం కోసం తన కోటా నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే, ఎమెల్సీలు, ఎంపీలతో జిల్లా అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. -
కూలుస్తామంటే ఊరుకోం
కరీంనగర్ కార్పొరేషన్: ‘ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం.. మమ్మల్ని ముట్టుకొనే దమ్ముందా, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు.. మా పార్టీలో కోవర్ట్ వ్యవస్థ లేదు, మా 64 మంది కుటుంబ సభ్యులమంతా కలిసే ఉన్నాం, నోరు.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి’అని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్‌ని హెచ్చరించారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలుస్తుందని బండి సంజయ్ చెప్పడంపై స్పందిస్తూ.. ఆయన జోస్యం చెబుతున్నారా, లేదంటే బీఆర్ఎస్ నాయకులు ఆయనకు సమాచారం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తాము చెప్పిందే నిజమని దీనితో రుజువైందన్నారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న సంజయ్ వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. తాము దేశ నిర్మాణం చేసినవారిమని, విధ్వంసాలు సృష్టించే పని తమకెందుని అన్నారు. ఇవి మతిలేని వ్యాఖ్యలని ధ్వజమెత్తారు. తాము జీవితంలో బీజేపీతో కలిసేది లేదని, రెండు పార్టీల దారులు వేరని స్పష్టం చేశారు. ఇంటర్మిడియెట్ ఫెయిల్ అయిన బండి సంజయ్ జోస్యాలు చెపుతున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. పర్మినెంట్‌గా ‘కేసీఆర్’లానే ఉండండి.. ‘మీ నాయనకు సీఎం పదవి అనేది ఎడం కాలు చెప్పు అయింది. నీకు కూడా ఆ అక్షరాలు నచ్చట్లేదు.. పర్మినెంట్‌గా కేసీఆర్‌లానే ఉండండి. జీవితంలో సీఎం అనే పదవి తీసుకోకండి. సీఎం అనే పదమే మీకు పడదు. ఆ పదవి దిక్కే రాకండి. చాలా సంతోషం’అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి పొన్నం వ్యాఖ్యానించారు. సీఎం పదవి కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలు పవర్ఫుల్ అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా విమర్శించారు. అధికారం కోల్పోతామని కేటీఆర్ కలలో కూడా ఊహించలేదని, అందుకే అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. అయోధ్యలో ఎన్నికల మార్కెటింగ్ అయోధ్యలో ధర్మానికి విరుద్ధంగా ఎన్నికల మార్కె టింగ్ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే విషయం మాట్లాడితే హిందూ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారన్నా రు. అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట ఎవరు చేయాలో హిందువులందరికి తెలుసని, జంటగా లేనటువంటి వారెలా చేస్తారని ప్రశ్నించారు. ఆలయం నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంబోత్సవమేమిటన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చన్నారు. -
కాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర: బండి సంజయ్
కరీంనగర్‌టౌన్/ఎల్కతుర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ పెద్దఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో కేసీఆర్‌కు కోవర్టులున్నారని, గత ఎన్నికల్లో ఆయన వారికి పెద్దఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి ఆ నిందను బీజేపీపైకి నెట్టివేసినా ఆశ్చర్యం లేదని సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్లో బండి సంజయ్ సమక్షంలో మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవాళ్లమని కేటీఆర్ అంటున్నారని, పంచొద్దని ఎవరు అన్నారని ప్రశ్నించారు. ‘భద్రాద్రి రామాలయానికి తలంబ్రాలు కూడా తీసుకురానోడు.. ఎములాడ రాజన్నకు, కొండగట్టుకు, ధర్మపురి ఆలయాలకు నిధులిస్తామని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్’అని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ను మర్చిపోయారని, బయటికి వస్తే ఎవరూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు. గల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఢిల్లీలో ఉండాల్సింది మోదీనే అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. అలాంటి కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజల బతుకులను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ను పూర్తిగా బొందపెట్టేదాకా విశ్రమించబోమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచి్చన హామీలు నెరవేరాలంటే కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఎక్కువగా గెలవాలన్నారు. అయోధ్యపై రగడ ఎందుకు? అయోధ్య రామమందిర ఉత్సవం రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమమని, దీనిపై రగడ ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లు రామ మందిర నిర్మాణానికి అనుకూలమా? వ్యతిరేకమా? సమాధానం చెప్పా లన్నారు. ఒకనాడు కాంగ్రెసోళ్లు అయోధ్యలోనే రాముడు పుట్టారనడానికి ఆధారాలేమిటని ప్రశ్నించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. కానీ దేశ ప్రజలు ప్రశాతంగా ఉంటూ కోర్టు తీర్పును స్వాగతించే సరికి జీరి్ణంచుకోలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హితవు పలికారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు ఎంత అహకారం ఉందో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కూడా అంతే అహంకారం ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల మాటలనే పొన్నం ప్రభాకర్ కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని నిందిస్తే పొన్నంకు ఏమి వస్తుందో అర్థం కావడం లేదన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయిన ప్రజలు మనల్ని చూసి గర్వపడాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని సూచించారు. రాబోయో ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఓ మిత్రుడు అడగడంతో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 350 సీట్లకు పైగా గెలవడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ఎంతమంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే అంత ఎక్కువగా నిధులు తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. -
పర్యాటక అభివృద్ధికి కృషి
కంటోన్మెంట్ (హైదరాబాద్): ప్రపంచ స్థాయిలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా అన్ని పండుగలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్‌ను శనివారం రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో నిర్వహించే పతంగుల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు నగరంలో నివసిస్తున్నారని, అందువల్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో పతంగులు, మిఠాయిల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 16 దేశాల నుంచి 40 మందికి పైగా కళాకారులు కైట్స్ ఫెస్టివల్లో పాలుపంచుకుంటున్నారన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు 400కు పైగా స్టాళ్లలో సుమారు 1,200 రకాల స్వీట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వేడుకల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలతోపాటు వంటకాలనూ తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇలాంటి ఉత్సవాలను జిల్లా, మండలస్థాయిలోనూ నిర్వహిస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాం, నెదర్లాండ్స్, కొరియా తదితర దేశాల నుంచి పర్యాటకులు పాల్గొన్నారని తెలిపారు. ముఖ్య ఆదాయ వనరుగా మారాలి: పొన్నం రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పర్యాటకం అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎక్సైజ్ ఇతర శాఖలకు పోటీగా పర్యాటకం ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఇందుకు రవాణా శాఖ నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె.నిఖిల, ఎండీ రమేష్ నాయుడు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్వామి వివేకానంద బాటలో నడవాలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తి బాటలో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్లు వివేకానంద చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చిన్నతనంలోనే అనేక విషయాలపై పట్టు సాధించిన వ్యక్తి అని అన్నారు. పొన్నంకు క్రిబ్కో చైర్మన్ సన్మానం.. ఢిల్లీ వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిబ్కో చైర్మన్ చంద్రపాల్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని శాలువాతో సత్కరించారు. తెలంగాణలో సహకార రంగం అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రపాల్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
బీఆర్ఎస్లో దడ మొదలైంది: మంత్రి పొన్నం
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణతో బీఆర్ఎస్లో దడ మొదలైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదన్నారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకు బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులవుతుంది. గ్యారంటీ స్కీమ్‌లపై దరఖాస్తులు స్వీకరించాం. చిత్తశుద్ధితో అమలు చేస్తాం. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. జెన్ కోతో పాటు ఇతర శాఖల్లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళాలి. భూ అక్రమార్కులపై చర్యలు చేపడుతాం’’ అని మంత్రి హెచ్చరించారు. ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు -
అర్హుల గుర్తింపునకు 'ఇంటింటి సర్వే'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ఇంటింటి సర్వే నిర్వహిస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, ఆరు గ్యారంటీలను వందరోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ప్రజాపాలన దరఖాస్తులు..తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ సచివాలయ మీడియా సెంటర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడు తూ కోటి ఐదు లక్షల దరఖాస్తులు ఆరు గ్యారంటీలకు రాగా, మరో 20 లక్షల దరఖాస్తులు రేషన్‌కార్డులు, ఉద్యోగాలు, భూసమస్యలపైనా వచ్చాయన్నారు. 30వేల మందికిపైగా ఆపరేటర్లతో యుద్ధప్రాతిపదికన డేటాఎంట్రీ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 13 నుంచి 14 శాతం వరకు ఎంట్రీ పూర్తయ్యిందని, మొత్తం పూర్తిచేసేందుకు ఈనెల 25 నుంచి 30వతేదీ వరకు సమయం పడుతుందని, ఆలోపు పూర్తి సమాచారం కంప్యూటరీకరిస్తామన్నారు. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను లింకప్ చేసి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ హామీలన్నీ అందిస్తామని చెప్పారు. డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత అర్హులందరి లిస్ట్ గ్రామాల వారీగా వెల్లడిస్తామన్నారు. ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి అధికారులు వెళ్లి వివరాలు మరోసారి పరిశీలిస్తారని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 40 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గతంలో తామెప్పుడూ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, మల్లిఖార్జున ఖర్గే, రాహూల్గాందీ, ప్రియాంకగాందీలు సైతం ఎక్కడా ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చి మంగళవారానికి నెలరోజులు అవుతుందని, ఈలోపే ప్రతిపక్షాలు విమర్శలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజులు కూడా కాకముందే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయన్నారు. విమర్శలు చేసే ముందు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. గత ప్రభుత్వ తప్పులను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రతిపక్షాలు, మీడియా సైతం ఓపిక పట్టాలని కోరారు. డేటాఎంట్రీ పూర్తయిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘంలో విధివిధానాలపై చర్చిస్తామన్నారు. వీటన్నింటిపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేయని అర్హులైనవారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాపాలన వెబ్సైట్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కమిటీలో ఎవరంటే.. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ సబ్‌కమిటీని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సబ్‌కమిటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు తాను సభ్యుడిగా ఉన్నానని పొంగులేటి చెప్పారు. ఈ కమిటీ ఆరు గ్యారంటీల అమలుపై చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని తెలిపారు. రేషన్కార్డులపైనా త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుతం 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని, కార్డులు లేనివారి నుంచి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈనెల 6వ తేదీ నుంచి అధికారులంతా ఓటర్‌లిస్ట్ ప్రక్రియలో ఉన్నారని, అయినా ఆరు గ్యారంటీల అమలు ప్రక్రియలో భాగంగా డేటాఎంట్రీ కొనసాగుతుందన్నారు. సంక్రాంతి తర్వాత మీడియా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచి్చన భూములకు సంబంధించిన జీఓలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. -
బీఆర్ఎస్ సర్కార్ ధోబీ ఘాట్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదు
సాక్షి, హైదరాబాద్: లాండ్రీలు, ధోబీఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందని, అందుకయ్యే వ్యయాన్ని మాత్రం డిస్కంలకు చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు. అయితే బకాయిల పేరిట విద్యుత్ కనెక్షన్ తొలగించొద్దని డిస్కంలకు మంత్రి సూచించారు. ఈ విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతామన్నారు. ఈ ఏడాది జనవరి మూడోతేదీ వరకు వాషర్‌మె న్లో లబ్ధిదారులు 76,060 మంది కాగా, బకాయిలు రూ.78.55 కోట్లు అని, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు 36,526 మంది కాగా, బకాయిలు రూ.12.34 కోట్లు ఉన్నాయన్నారు. -
భారం పడనీయం.. చార్జీలు పెంచం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి నిధుల కొరత రానీయబోమని.. ఎప్పటి కప్పుడు ఆర్టీసీకి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రయాణికులపై ఎలాంటి చార్జీల భారం మోపబోమని...సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వారిద్దరూ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై దృష్టి పెట్టాలని, నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలని అధికారులకు సూచించారు. టీఎస్ ఆర్టీసీ ఆర్థిక అంశాలు, మహాలక్ష్మి పథకం అమలుతీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సంస్థ ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ పథకం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ పథకం ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి..త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతీరోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా.. రోజు వారీ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజల సంస్థ.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా..లాజిస్టిక్స్, వాణిజ్య, తదితర టికెటేతర ఆదాయంపై దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, కృష్ణకాంత్, ఆర్థిక సలహాదారు విజయపుష్ప, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను రక్షించేందుకే సీబీఐ విచారణా?
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును రక్షించడానికే మీరెప్పుడూ సీబీఐ విచారణ కోరుతుంటారని, సీబీఐ మీ పెంపుడు సంస్థ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్రమంత్రి కిషన్రెడ్డినుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై జ్యుడీషియల్ విచా రణ చేయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించాలని వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను రక్షించడానికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిలుక పలుకులు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉన్నా ఇప్పటివరకు కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదని, అప్పుడే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని, గోషామహ ల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదని, జూబ్లీహిల్స్‌లో మాత్రం బీఆర్ఎస్ పోటీ చేసిన తీరు తీస్తుంటే వీళ్ల స్నేహం అర్థం అవుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ నేతలు లేనిపోని అపోహలు స్పష్టిస్తున్నారని, ఆటో డ్రైవర్లతో ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మాట్లాడేందుకు ఎవరు వచ్చినా తాను రెడీగా ఉంటానని, సచివాలయంలోనైనా మాట్లాడేందుకు సిద్ధమన్నారు. ప్రజాపాలన దరఖాస్తులకు ఈనెల 6 వరకే గడువు అని, పొడిగింపు ఉండదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. కేంద్రం స్పందించాలి లారీ డ్రైవర్ల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లేకపోతే నిత్యవసరాల ధరలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను పిలిచి తెలంగాణ భవన్లో కేటీఆర్ భోజనాలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇంకా మంత్రి అనుకుంటున్నారే మోనని ఎద్దేవా చేశారు. కార్మికులకు భోజనాలు కాదు... వాళ్లకు బట్టలు కుట్టించాలని హితవు పలికారు. -
HYD: 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోరవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. నేడు 80 బస్సులు ప్రారంభించామని, త్వరలో మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మే జూన్ కల్ల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రూ. 400 కోట్లతో ఈ కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణం తీసుకొచ్చిందన్న సజ్జనార్.. ఈ 21 రోజుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. వచ్చే రోజుల్లో ఓపికతో ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఇప్పటికీ ఆరు కోట్ల ఉచిత టికెట్లు విక్రయించినట్లు తెలదిపారు. కండక్టర్, డ్రైవర్లకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు. ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని, బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేoదుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. LIVE : Minister Ponnam Prabhakar Inaugurates 80 New RTC Buses https://t.co/C2TMl4o6rp — Telangana Congress (@INCTelangana) December 30, 2023 రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. లీజుకు ఆర్టీసీ భూములు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఎస్ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఈ-టెండరు దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానించింది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనుంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్సైట్లో చూడాలని సూచించింది. టెండర్లకు వచ్చే ఏడాది జనవరి 18 చివరి తేదీగా పేర్కొంది. -
రోడ్డెక్కనున్న కొత్త బస్సులు
సాక్షి,హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు హాజరవుతారు. రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. -
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి
సాక్షి,హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, రాహుల్ గాందీని ప్రధాన మంత్రిని చేయాలని టీపీసీసీ నేతలు పిలుపునిచ్చారు. గురువారం గాంధీ భవన్లో 139వ అఖిల భారత జాతీ య కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సేవా దళ్ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, పార్టీ ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ జెండాను మహేశ్‌కుమార్‌గౌడ్ ఆవిష్కరించగా.. సేవాదళ్ ర్యాలీని జగ్గారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మా ట్లాడుతూ, 1885లో బొంబాయిలో 72 మందితో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ.. నేడు 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిందన్నారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఒకవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలను ప్రజలు మరవలేరన్నారు. సోనియా గాం«దీ, పీవీ, మన్మోహన్సింగ్ లాంటి వారు దేశం కోసం నిరంతరం శ్రమించారన్నారు. మంత్రి జూపల్లి శుభాకాంక్షలు భారత్.. ప్రపంచంలో సగర్వంగా నిలబడిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్లెనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. మతతత్వ శక్తుల చేతిలో దేశం బందీగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
వెనుకబడిన చోటే వెతుక్కొనేలా..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉన్న నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించడంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రెండు చోట్లా పార్టీ గెలుపునకు సహకరించే అంశాలు, ప్రతికూల పరిస్థితులపై చర్చించిన కాంగ్రెస్ నేతలు అందుకు తగిన కార్యాచరణను రూపొందించుకున్నారు. నిరాశపరిచిన ఫలితాలు.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీని నిరాశపరిచాయి. ఈ ఫలితాలను సమీక్షించుకున్న కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల్లో తమకు లభించిన ఓట్లు, ఇతర ప్రధాన పక్షాలకు వచ్చిన ఓట్ల సంఖ్య ఆధారంగా వ్యూహం రూపొందించుకోవాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో బీఆర్ఎస్తో పోలిస్తే వెనుకబడినప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలోనే ప్రజల మద్దతు లభించింది. మల్కాజిగిరి పరిధిలో బీజేపీ కంటే ఎక్కువ ఓట్లే వచ్చినా బీఆర్ఎస్ కంటే దాదాపు 3.5 లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. మల్కాజిగిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో పార్లమెంటు ఫలితాలు కొంతమేర భిన్నంగా ఉంటాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఆ నియోజకవర్గం పరిధిలో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా బలపడాలని భావిస్తోంది. చేవెళ్లలోనూ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు దాదాపు లక్ష ఓట్లు తక్కువగా వచ్చాయి. ఇక్కడ కూడా కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తే గెలుపు కష్టమేమీ కాదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లోనే కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీకి బలమైన నాయకత్వం కూడా లేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లకు కొత్త ఇన్చార్జీలను నియమించాలని పార్టీ భావిస్తోంది. ఇన్చార్జీల ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల సమన్వయంతో క్షేత్రస్థాయిలో కేడర్‌ను కదిలించాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా బ్యాలెట్ బాక్సులు నిండేలా పనిచేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ స్థానం పరిధిలో ఎంఐఎంను ఢీకొట్టడం కష్టమే అయినా అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్ వరకు పకడ్బందీగా వ్యవహరించాలని, ఎంఐఎంకు దీటైన అభ్యరి్థని రంగంలోకి దించాలని నిర్ణయించింది. ప్రజలకు దగ్గరగా పనిచేయండి: ఇన్చార్జి మంత్రి పొన్నం హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల నేతలతో జరిగిన సమావేశంలో ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందజేయడంలో పార్టీ నేతలు ముందుండాలని సూచించారు. ప్రజలకు దగ్గరగా ఉండేలా నాయకులు పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ కేడరంతా పాల్గొనాలని కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 28న వాడవాడలా ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: దమ్ముంటే స్వేద పత్రంపై చర్చకు రావాలంటూ కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. పదేళ్లలో ఎవరి ఆస్తులు ఎంత పెరిగాయో చర్చకు సిద్ధమా?. భవనాలు, భూములు ఎవరికెన్ని ఉన్నాయో లెక్కలు తేలుద్దామా.. మీ లెక్కలు చెప్పేందుకు మేము సిద్దం.. మీరు సిద్దమా? అంటూ ప్రశ్నించారు. చెమటలు చిందించి తెలంగాణను అప్పులపాలు చేశారు: కూనంనేని బీఆర్ఎస్ నేతలు చెమటలు చిందించి తెలంగాణను అప్పులపాలు చేశారని, కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ఎందుకు వివరించారో మాకైతే అర్థం కాలేదని సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు ‘‘మానవ తప్పిదాల వల్ల సింగరేణి నష్టాల్లో కూరుకుపోయింది. మరో 20 ఏళ్లలో సింగరేణి కాలం చెల్లనుందని 20 ఏళ్ల తర్వాత కొత్త మైన్స్ రాకపోతే సింగరేణి ఓ చరిత్రగా ఉండిపోనుంది. తెలంగాణలో పెద్ద సంస్థలన్నీ అప్పుల్లోనే ఉన్నాయి. సింగరేణి ఎన్నికలు జరగకుండా గత ప్రభుత్వం అనుకూల సంఘం ప్రయత్నం చేసింది. టీబీజీకే, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి’’ అని కూనంనేని పేర్కొన్నారు. ఇదీ చదవండి: తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్ -
పవర్ ఫైట్
-
అసెంబ్లీలో హుస్నాబాద్ మాట
హుస్నాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రస్తావన తెచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఆ పార్టీ సభ్యులు చెబుతున్న తరుణంలో హుస్నాబాద్‌లో శిథిలావస్థకు చేరుకున్న ఓ రేకుల ఇంటి ఫొటోను చూపిస్తూ పొన్నం చర్చించారు. పట్టణం కేబీ కాలనీలోని గృహం శిథిలావస్థలో ఉన్నందున ‘ఈ గృహంలో నివసించరాదు. ఒక వేళ నివసిస్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది’ అని గోడపై రాశారని తెలిపారు. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా ఆ ఇంటి యాజమానికి డబుల్ బెడ్రూం ఎందుకు ఇవ్వలేదని, అభివృద్ధి అంటే ఇదేనా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ఓపిక పట్టండి అన్నీ పరిష్కరిస్తాం
లక్డీకాపూల్: ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ప్రధానంగా ధరణి, భూ సమస్యలను పరిష్కరించాలంటూ ఎక్కువమంది రాగా, కొండ పోచమ్మ సాగర్ బాధితులు, టీఎస్పీఎస్సీ రద్దు చేయాలంటూ నిరుద్యోగులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు విన్నవించారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మంత్రితో పాటు ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన ఉన్నారు. ఆటోవాలాలపై విధానపరమైన నిర్ణయం ప్రజావాణి అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అందరి సమస్యలనూ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, కాస్త ఓపిక పట్టాలని సూచించారు. మంగళవారం ప్రజా వాణి కార్యక్రమంలో 5,324 వినతి పత్రాలందాయని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోవాలాలు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారికి కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇళ్లు, రేషన్, భూసమస్యల వంటివన్నీ ఆరు గ్యారంటీల అమలుతో పరిష్కారమవుతాయని మంత్రి అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాదీనం చేసుకోవాలి తెలంగాణలోని అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డిపాజిట్‌దారులకు తక్షణమే డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. బాలమల్లేష్ ప్రజావాణిలో కోరారు. మాజీ హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల మాజీ హోంగార్డుల ప్రతినిధులు ఇందిర, యూనస్ మహ్మద్ వ్రిజ్ఞప్తి చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికి న్యాయం జరగలేదన్నారు. ఇంకా పలు సమస్యలపై.. ప్రభుత్వ పాఠశాల్లోని స్వచ్ఛ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెమ్మది వెంకటేశ్వర్లు, ప్రమీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 28 వేల మంది కార్మికులకు నిధుల కొరత పేరిట గ్రా మ పంచాయతీలు వేతనాలు చెల్లించడం లేదన్నా రు. కాళేశ్వరం బాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో బాధితులు పాదయాత్రగా ప్రజాభవన్‌కు వచ్చి కొండపోచమ్మ సాగర్ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. నిలిచిపోయిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలకు అనుమతించాలని స్పౌజ్ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి 10గంటల్లోపు వచ్చిన వారికి మాత్రమే శుక్రవారం నుంచి ఉదయం 10 గంటలలోపు వచ్చిన వారికే ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు ప్రజా భవన్ అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ప్రజాభవన్ వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. -
ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినేందుకే ప్రజాదర్బార్ ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరలోనే వారి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వినేందుకే ప్రగతిభవన్‌కు ఉండే అడ్డుగోడలను తొలగించి ప్రజాభవన్‌గా మార్చామని పొన్నం తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణతో పాటు సీపీఐ నాయకులను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మతో సమావేశమయ్యారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నేతలు కలిసేందుకు కూడా అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని, భవిష్యత్‌లో కూడా తాము కలిసే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునాది పడిందన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురవరం వారికి అభినందనలు తెలిపారు. -
గౌరవెల్లి సమస్యలను ఎమ్మెల్యే సతీశ్ పట్టించుకోలేదు-పొన్నం
-
మంత్రి గంగులకు హైకోర్టులో ఊరట..
సాక్షి, హైదరాబాద్/ కరీంనగర్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 2018లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈసీ నిర్ధారించిన వ్యయానికి మించి గంగుల ఎన్నికల ఖర్చు చేశారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు గంగుల ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. చదవండి: తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్ -
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రమాదంపై పరిశీలించడానికి పొన్నం ప్రభాకర్ పిలుపు
-
రూట్ మార్చిన పొన్నం.. టార్గెట్ అదే!
మాజీ ఎంపీ పొన్నం రూట్ మార్చేశారు. తనకు అచ్చిరాని చోట నుంచి.. మరో కొత్త చోట తన భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు. అనువుగాని చోట అధికులమనరాదనే భావనతో పాటు.. కలిసొచ్చే చోట ప్రయత్నిస్తే లక్కూ కలిసి రావొచ్చనేమో పొన్నం యోచన. అందుకే ఇప్పుడు పొన్నం చూపు హుస్నాబాద్ నియోజకవర్గం వైపు పడింది. సరే, మరి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాటేమిటి..? ఆయనెంతవరకూ పొన్నంకు సహకరిస్తారు..? మరోవైపు కామ్రేడ్స్ కత్తిదూస్తున్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరెవరు ఆశావహులు ఏ ఏ నియోజకవర్గాల నుంచి బరిలో ఉండాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు తెలంగాణా కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. అయితే, అంతా అనుకున్నట్టుగా కరీంనగర్ నుంచి కాకుండా.. ఈసారి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన భవిష్యత్తును హుస్నాబాద్ నుంచి పరీక్షించాలనుకోవడమే విశేషం. అందుకోసం కరీంనగర్ స్థానానికి ఆశావహ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోని పొన్నం ప్రభాకర్.. హుస్నాబాద్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తానే మీడియా ముఖంగా తెలిపారు. తన ఇష్టదైవమైన పొట్లపల్లి స్వయం భూ రాజరాజేశ్వరుడితో పాటు.. హుస్నాబాద్‌లో గుట్టపైనున్న సిద్ధరామేశ్వరుడిని దర్శించుకుని... తాను హుస్నాబాద్ నుంచే బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. పొన్నం తరపున ఆయన సోదరుడు గాంధీభవన్ లో దరఖాస్తు చేశారు. అయితే, ఇప్పుడు పొన్నం చూపు హుస్నాబాద్ వైపు ఎందుకు పడిందనేదే సర్వత్రా జరుగుతున్న చర్చ. పొన్నంకు అసలే రోజులు బాలేనట్టుగా కనిపిస్తున్నాయి. తనకు ఎన్నికల వేళ ఎలాంటి పదవులు ప్రకటించకపోవడం.. పొన్నం అలగడం.. 48 గంటల్లోపు పొన్నంకు పదవిస్తామని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించడం.. ఆ తర్వాత ఎలాంటి ఊసూ లేకపోవడంతో ఒకింత అసహనంగానే పొన్నం పొల్టికల్ జర్నీ ప్రస్తుతం కొనసాగుతోంది. పైగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలోకి దిగితే మూడోస్థానానికి పరిమితం కావడం.. 2014, 2018 కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలూ కలిసి రాకపోవడంతో పొన్నం కరీంనగర్ నుంచి తన మనసు మార్చుకున్నారు. పైగా పొన్నం ప్రభాకర్ కు గత పార్లమెంట్ ఎన్నికల్లో.. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ లోనే 50 వేలకు పైగా ఓట్లు పోలవ్వడం.. ఈ నియోజకవర్గంలో తన గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 40 వేల వరకూ ఉండటం.. తనకున్న బీసీ కార్డుకు.. ఓ 90 వేల ఓట్ల పైచిలుకు అడ్వంటేజ్ గా భావించడం.. సతీష్ బాబుకు దీటైన నాయకుడు లేడన్న భావన.. తనైతే గెలవగలనన్న భరోసా.. అంతకుమించి తన అనుయాయులు, అనుచరుల నుంచి వచ్చిన ఒత్తడి వంటివాటితోనే పొన్నం అడుగులు హుస్నాబాద్ వైపు పడినట్టుగా తెలుస్తోంది. అయితే, ఇప్పటికే హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇంటింటి తన ప్రచారాన్ని ప్రారంభించారు. మీడియాలో పెద్దగా లైమ్ లైట్ లో లేకున్నా.. సోషల్ మీడియాలో తన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి.. పొన్నంకు సహకరిస్తారా..? కాంగ్రెస్ టిక్కెట్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికా.. లేక, కొత్తగా బరిలోకి దిగుతున్న పొన్నంకా...? ఒకవేళ హుస్నాబాద్ లో తనకు టిక్కెట్ రాకుంటే పొన్నం అడుగులెలా ఉండబోతాయి...? ఒకవేళ పొన్నంకే టిక్కెట్ ఇస్తే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటూ పొన్నంకు సహకరిస్తారా..? లేక, ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో.. కమలం వైపు ఏమైనా అడుగులు వేస్తారా అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పై విరుచుకుపడుకున్న కామ్రెడ్స్ కు కూడా హుస్నాబాద్ స్థానంలో బరిలో ఉండాలన్నది గట్టి తలంపు. ఈ క్రమంలో కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు కుదురుతుందా..? మిత్రపక్షంగా కాంగ్రెస్ నుంచి అయితే పొన్నం.. లేదంటే అల్గిరెడ్డి ఎవ్వరు బరిలో ఉన్నా.. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పోటీకి దూరంగా ఉంటారా...? ఎంత మిత్రపక్షమైనా.. బరిలో నిల్చే విషయంలో మిత్రభేదం తప్పదంటూ చాడ కూడా బరిలోకి దిగుతారా...? అప్పుడు మొత్తంగా హుస్నాబాద్ రాజకీయమెలా ఉండబోతుందన్నది ఇప్పుడు కడు ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ నుంచి తన మనసు మార్చుకుని పొన్నం పక్కకు తప్పుకోవడంతో కరీంనగర్ అసెంబ్లీకి కూడా ఆశావహుల జాబితా పెద్దదే తయారైనట్టుగా గాంధీభవన్ లో దరఖాస్తైన ఫారాలే చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో హుస్నాబాద్ వైపు పొన్నం చూపు పడటంతో.. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించిన చర్చతో పాటు.. హుస్నాబాద్‌లో ఫైట్ పై ఓ పేద్ద డిబేటే కొనసాగుతోంది. -
కరీంనగర్: ఈసారి సర్వత్రా ఆసక్తి
ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు.. రాజకీయ చైతన్యానికి కేరాఫ్.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో సరికొత్త అందాలను సంతరించుకుని సుందరంగా రూపుదిద్దుకుంటున్న నగరం.. ఇప్పుడీ నియోజకవర్గంలో గెలుపు గుర్రమెవ్వరనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశం.. కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎంతమంది ఓటర్లున్నారు? వారిలో స్త్రీ, పురుష, ఇతరుల నిష్పత్తి ఏవిధంగా ఉంది? ఏ ఏ సామాజికవర్గాలది పైచేయి ఇప్పుడు చూద్దాం. ► 40 వేల ఓట్లు మున్నూరు కాపులు ► 38 వేల ఓట్లు ముస్లిం మైనారిటీలు ► 22 వేల ఓట్లు పద్మ శాలీలు ► 29 వేల ఓట్లు ఎస్సీలు ► 14 వేల ఓట్లు ముదిరాజ్ ► 9 వేల ఓట్లు గౌడ ► 8 వేల క్రిస్టియన్ ఓట్లు 1957లో కరీంనగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి జువ్వాడి చొక్కారావు గెలిచారు. ఆ తర్వాత 5 సార్లు కాంగ్రెస్ అధిష్టానంలో నిలిచింది. ఇక నాలుగు సార్లు టీడీపీ, 2 సార్లు గులాబీ పార్టీలు ఇక్కడ సత్తా చాటాయి. హ్యాట్రిక్ విజయాలు సాధించిన జువ్వాడి చొక్కారావు అదే తరహాలో మూడుసార్లు మంత్రిగా గెలిచి మంత్రి పదవి చెపట్టారు. ఎమ్మెస్సార్, ముద్దసాని దామోదర్ రెడ్డి సరసన ప్రస్తుత మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలిచారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ .. కానీ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ తప్పలేదు 2009, 2014, 2018 లో వరుసగా గెలిచి... హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ రికార్డ్ సాధించారు. 2009లో 68738 ఓట్లు, 2014 లో 77209 ఓట్లు సాధించి గెలుపొందారు. 2018లో మాత్రం గంగుల, బండి సంజయ్‌ల మధ్య పోరు రసవత్తరంగానే సాగింది. గంగులకు 80, 983 ఓట్లు రాగా... బండి సంజయ్‌కి 66, 009 ఓట్లు, పొన్నం ప్రభాకర్‌కు 39,500 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై కేవలం 14 వేల 974 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ టికెట్ బరిలో ఉండగా.. 4వ సారి సమరానికి సై అంటున్నారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా గంగుల కమలాకర్‌ను ఎంపీగా పోటీ చేయించాలన్న ఓ చర్చ దాదాపు ఊహాగానమేనని వినిపిస్తోంది. గంగులతో పాటు, అధికారపార్టీ బలాలు ఆర్థికంగా బలమైన నేత... మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పోరేటర్ల సంఖ్య 21 ఇందులో అధికార పార్టీ కార్పొరేటర్లు 19 గంగుల ప్రధాన బలం ప్రత్యమ్నాయా ప్రతిపక్షాలు లేకపోవటం నిత్యం ప్రజలతో మమేకం బలమైన క్యాడర్ బలహీనతలు నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండే కోటరీ. ప్రజలు ఆయనని నేరుగా కలిసే అవకాశం లేకపోవటం. తన సామాజిక వర్గాన్ని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తారన్న అపవాదు. రూరల్, అర్బన్ నేతల కబ్జా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు. మునిసిపల్ కార్పొరేషన్ లో కమీషన్ల కక్కుర్తిపై ఆరోపణలు. బొమ్మకల్, కొత్తపల్లితో వంటి మేజర్ ప్రాంతాల్లోని కీలక నేతలతో ఈమధ్య సయోధ్య చెడటం. కులుపుకోవాలని చూసినా నివురుగప్పిన నిప్పులాగే కొనసాగుతున్న సంబంధాలు. ఎంఐఎం నేతలు పూర్తిగా వ్యతిరేకమవ్వటం. చేసిన పనులు కరీంనగర్ సిటీలో 14 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి. ఐటీ టవర్ నిర్మాణం. 234 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. 600 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు. మెడికల్ కళాశాల మంజూరు. టీటీడీ దేవాలయం. కరీంనగర్ చుట్టూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, కొత్తపల్లి వద్ద కాకతీయ కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయించి 13 వేల ఎకరాలకు సాగునీరు అందించడం, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ఏటా కరీంనగర్ మున్సిపాలిటీకి 100 కోట్ల నిధులు వచ్చేలా మూడేళ్ల నుంచి మంజూరు చేయించుకోవడం... స్మార్ట్ సిటీ, ఐలాండ్ లతో సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దడం వంటివి ప్లస్. చేయని పనులు 24 గంటల నీటి సరఫరా విలీన గ్రామాల సమస్య డంప్ యార్డ్ ప్రధాన సమస్య ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేకపోవడం నగరంలో పార్కింగ్ సమస్య నూతనంగా గొప్పగా చెప్పుకున్న కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్స్ కుంగిపోవడం రక్షణ వాల్స్ కు బీటలు రావడం అధ్వానంగా అంతర్గత రోడ్ల పరిస్థితి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కానీ దుస్థితి డబుల్ బెడ్ రూమ్ హామీ నెరవేర్చలేకపోవటం ప్రత్యర్థులు... బీజేపీ నుండి బండి సంజయ్, ఆయన రాజకీయ గురువు పొల్సాని సుగుణాకర్ రావు ఉన్నారు. బండి సంజయ్ కుమార్, అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో 14 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ వరకు ఎదిగారు. బీజేపీ మూల సిద్ధాంతాల నుండి వచ్చిన ఏబీవీపీ, RSS విద్యార్థి స్థాయిలోనే పనిచేస్తున్నారు. హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు సంపాదించుకున్నారు. హిందూ ఏక్తా యాత్ర హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తూ 80% ఉన్న హిందువుల కోసం తమ పోరాటం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు. 2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుండి బిజెపి. కార్పొరేటర్ గా మూడుసార్లు గెలిచాడు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 52455 ఓట్లు సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై 66009 ఓట్లు సాధించి 14,000 పైగా ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్నారు బండి. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో హోరాహోరీ పోరులో 14 వేల ఓట్ల ఓటమి చవిచూసిన తర్వాత సానుభూతి పవనాలు బలంగా వీచాయి. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అనుహ్య విజయం సాధించారు. అగ్ర నాయకుల దృష్టిలో పడ్డ బండి సంజయ్‌ని ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి పార్టీ పగ్గాలాయన చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఆయన మూడు విడుతలగా జరిపినటువంటి మహా సంగ్రామ పాదయాత్ర బిజెపికి కొత్త ఊపును తెచ్చిపెట్టింది. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచి తన మార్కు నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో జరిగిన నాగార్జునసాగర్ మునుగోడు ఓడిపోవడంతో సీనియర్లతో వచ్చిన వర్గ విభేదాలు పదవీకాలం ముగియడంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని మరో కీలక పదవైన జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ రావడంతో నూతనోత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ.. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌కు డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, సిటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్ వంటివారు టికెట్ ఆశిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ : పొన్నం ప్రభాకర్ గతంలో కాంగ్రెస్ రెబెల్ గా కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆ తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన పొన్నం ప్రభాకర్ కెరీర్లోనే అత్యుత్తమ స్థాయి గ్రాఫ్ అందుకున్నాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్ గా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నాడు. మరోసారి ఆయన బరిలో ఉంటారా? ఉండరా? అనే అంశంపై క్లారిటీ ఇవ్వట్లేదు? మేనేని రోహిత్ రావు : కరుడు గట్టిన కాంగ్రెస్ వాది... మాజీ మంత్రి ఎమ్మెస్సార్...మనవడు రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు... కరీంనగర్ కార్పొరేషన్ లోని పారిశుద్యం, 1000 కోట్ల కుంభకోణం, స్థానిక సమస్యలతో పాటుగా రైతాంగ సమస్యలు ధాన్యం కొనుగోలు అంశాలపై మంత్రిని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వరంగల్ డిక్లరేషన్ సభతో పాటుగా కరీంనగర్లో రేవంత్ రెడ్డి సభకి పూర్తిస్థాయిలో అన్ని తానై నిర్వహించాడు.... వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా కృషి చేస్తున్నారు. కొత్త జైపాల్ రెడ్డి... ట్రేండింగ్ లో ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది.కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ అయింది. బీజేపీ లో వెళ్తారన్న టాక్ వినిపించినా ఎందుకో ఆగిపోయింది. గంగులకు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ మైనారిటీ వర్గాలు సపోర్ట్ చేస్తూ చెబుతున్నాయి. 1996 లో తెలుగుదేశం రాజకీయ అరంగేట్రం చేసిన జైపాల్ రెడ్డి 1999 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత కు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఉన్నారు. 2005, 2013 లో సింగిల్ విండో చైర్మన్ గా గెలిచిన జైపాల్ రెడ్డి...2010 లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. 2013లో పొలిటికల్ గాడ్ ఫాదర్ నాగం జనార్దన్ రెడ్డి తో సహా రాజనాథ్ సింగ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. 2018 లో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ చొప్పదండి అభ్యర్థి మేడిపల్లి సత్యం గెలుపుకు కృషిచేశారు. జైపాలన్న మిత్ర మండలి పేరుతో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించారు. గోల్డెన్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుండి అంబటి జోజిరెడ్డి బరిలో ఉంటామని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసిన అంబటి. కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జిగా పార్టీకి సేవలందించారు. ఏఐఫ్ బి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. -
పొన్నంకే ఎందుకు అన్యాయం?
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కమిటీలోనూ స్థానం కల్పించకుండా అవమానపరుస్తున్నారంటూ ఆయన అనుచరులు ఆదివారం గాందీభవన్‌లో ఆందోళనకు దిగారు. ఎన్ఎస్యూఐ నుంచి పార్టీ కి సేవ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ప్రభాకర్‌కే ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. పదవులు రాకుండా జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు, రాష్ట్ర స్థాయిలో మరికొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో పొన్నంకు స్థానం కల్పించనందుకు నిరసనగా గాంధీభవన్‌కు వచ్చిన ఆయన అనుచరులు రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన నేతలను కూడా అడ్డుకునే యత్నం చేశారు. అవసరమైతే తన పదవి ఇస్తానన్న కోమటిరెడ్డి సరిగ్గా అదే సమయంలో గాందీభవన్‌కు వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వారితో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతే తన స్థానంలో పొన్నం పేరు చేర్చాలని పార్టీని కోరు తానని చెప్పారు. సీనియర్ నేత జానారెడ్డి స్పంది స్తూ పార్టీ వదిలి వెళ్లిపోయిన మహేశ్వర్‌రెడ్డి స్థానంలో పొన్నంకు అవకాశం కల్పించాలని సూచించారు. మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ త్వరలోనే పొన్నంకు చైర్మన్ పదవి వస్తుందన్నారు. పీఏసీ సభ్యులు ఎక్కువయ్యారు.. అందుకే: ఠాక్రే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ పొన్నం విషయంలో ఆందోళన అవసరం లేదని, త్వరలోనే ఆయనకు మంచి హోదా కల్పిస్తామని, పీఏసీ సభ్యులు ఎక్కువ కావడంతోనే ఆయనకు అవకాశం కల్పించలేకపోయామన్నారు. -
తాడో పేడో తేల్చుకుంటాం.. గాంధీభవన్‌లో పొన్నం అనుచరుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్‌కు చోటు దక్కలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో చోటు లభించకపోవడంతో పొన్నం ప్రభాకర్ కొంత అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, పొన్నం ప్రభాకర్‌కు మద్ధతుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలు ఈ రోజు ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. రేవంత్‌కు వార్నింగ్! మరో వైపు, హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది. రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశంలోలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నారు. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల భేటీ ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణా మాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు గాను ఆదివారం సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ రాజకీ య వ్యవహారాల కమిటీ(పీఏసీ) గాంధీభవన్‌లో సమావేశం కానుంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, ఇతర సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సుయాత్ర, ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు, ప్రియాంకా గాంధీ హాజరు కానున్న కొల్లాపూర్ సభ అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. బస్సుయాత్రపై నిర్ణయం రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగా ఉన్నామని చాటేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నేతలతో కలిసి బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ యాత్ర విధివిధానాలను ఖరారు చేసుకోవడంతో పాటు ఎప్పుడు యాత్ర చేపట్టాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణ యం తీసుకోనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతలు పార్టీలో చేరేందుకు మొగ్గుచూపు తున్న నేపథ్యంలో వారి చేరికలకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. దీంతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక సందర్భంగా ఈనెల 30న కొల్లాపూర్‌లో జరిగే సభకు హాజరు కావాలంటూ పార్టీ అధిష్టానాన్ని టీపీసీసీ ఇప్పటికే కోరింది. ఈ సభ ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. నేడు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యమ కారులు నేడు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగే ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తారు. రాష్ట్ర సాధన ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకుని ఎలా పనిచేయాలన్న దానిపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. పొన్నంకు చైర్మన్ పదవి? మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు రాష్ట్ర స్థాయిలో ఏర్పా టు చేసే ఓ కమిటీకి చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో చోటు లభించకపోవడంతో పొన్నం కొంత అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు విని పిస్తున్నాయి. అయితే ఆయనకు కమిటీ చైర్మన్ హోదా ఇవ్వాలన్న ఆలోచనతోనే పీఈసీ సభ్యునిగా చేర్చలేదనే చర్చ గాంధీభవన్‌లో జరుగుతోంది. పార్టీ మేనిఫెస్టో, కోఆర్డినేషన్, ఎలక్షన్ మేనేజ్మెంట్, ఏఐసీసీ కార్య క్రమాల అమలు, శిక్షణ, మీడియా కమిటీలను ఏఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఈ కమి టీల్లో ఏదో ఒక కమిటీకి సీనియర్ నేత పొన్నంను చైర్మన్‌గా ప్రకటించే అవకా శాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ కమిటీ లను మరో వారం, పది రోజుల్లోగా ఏఐసీసీ ప్రకటిస్తుందన్న చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
బీసీ కోటాతో పాగా..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక వ్యవస్థలో సింహభాగం వాటా ఉన్న బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ కులాల వారిని ఆకట్టుకునేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సామాజిక వర్గాల వారీగా డిక్లరే షన్లు ప్రకటించి, మేనిఫెస్టోలో ఆయా డిక్లరేషన్ల లోని హామీలను పొందుపరిచే ఆలోచనలో ఉన్న హస్తం పార్టీ.. బీసీల కోసం ఏం చేయాలన్న దానిపై ముమ్మర కసరత్తు జరుపుతోంది. కొన్ని ప్రతిపాద నలపై పార్టీలో ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం వచ్చిందని, ఈ మేరకు బీసీ డిక్లరేషన్ ఎజెండా ఖరారైందని సమాచారం. ఇందులో భాగంగా జనా భా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. కులగణన కోసం జాతీయ స్థాయిలో పార్టీ మద్దతు లభించినందున, ఆయా కులాల జనాభా లెక్కల మేరకు వారికి రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పాలని నిర్ణయించింది. టికెట్ల కేటాయింపులో గతానికి భిన్నంగా.. కనీసం 34 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా, 50 వరకు టికెట్లు ఇస్తామని భరోసా ఇవ్వనుంది. లోక్‌సభలో కనీసం రెండు అసెంబ్లీలు వారికే.. బీసీ నేతలకు టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. 2014 ఎన్నికల్లో 31 స్థానాలను కేటాయించగా, 2018లో పొత్తుల కారణంగా అది 25కు తగ్గింది. అదే సమయంలో 2018 ఎన్నికల్లో ఓసీలకు 41, ఎస్సీలకు 17, ఎస్టీలకు 10, మైనార్టీ లకు 7 స్థానాలను కేటాయించింది. అయితే ఈ ఎన్నికల్లో బీసీ నేతలు కొందరికి ఆఖరి క్షణంలో సీట్లు కేటాయించడంతో సానుకూల ఫలితాలను రాబట్టడంలో విఫలమయ్యింది. కాగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రతి లోక్‌సభ స్థానంలో కనీసం రెండు సీట్లు బీసీ నేతలకు ఇస్తామనే హామీని బీసీ డిక్లరేషన్‌లో చేర్చనుంది. అయితే ఈ 34 స్థానాలకే పరిమితం కాదని, అవకాశాలు, సమీకరణలను బట్టి ఆ సంఖ్య 50 వరకు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల మాదిరి ఆఖరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలున్నంత ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని వారు స్పష్టం చేస్తుండటం గమనార్హం. జీవితాలకు స్థిరత్వం కల్పించే దిశలో.. తాము అధికారంలోకి వస్తే బీసీ కులాలకు ఆర్థికంగా సాయం చేస్తామనే హామీని కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే ఏదో కొంత నగదు ఇచ్చి చేతులు దులుపుకోకుండా.. బీసీ వర్గాలకు చెందిన వారు, ముఖ్యంగా కుల వృత్తుల వారు వారి వారి జీవితాల్లో స్థిరపడి ఆత్మగౌరవంతో బతికే విధంగా చేయూతనిచ్చే పథకాలకు రూపకల్పన చేసి, బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించనుంది. ఇక బీసీల్లో బాగా వెనుకబడిన (ఎంబీసీ) కులాలు, సంచార జాతులను గుర్తించి వారికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీసీలకు పార్టీ పదవులు, సీట్ల కేటాయింపులో తగినంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అధికారం దక్కుతుందని పలుమార్లు రుజువయ్యిందని.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కూడా ఆ సూత్రాన్ని అనుసరించేనన్న అభిప్రాయానికి కాంగ్రెస్ నేతలు వచ్చారు. మా పార్టీకి ఆ స్పృహ ఉంది.. బలహీన వర్గాలకు న్యాయం చేస్తామంటూ ఎన్నికలకు ముందు ప్రకటనలు చేయడమే కాదు. వాటి అమలు కోసం చర్యలు తీసుకుంటాం. బీసీల అభివృద్ధికి మేం కట్టుబడి ఉంటాం. మేం అధికారంలోకి వచ్చాక వారికి ఏ ఇబ్బంది వచ్చినా జవాబుదారీతనంతో వ్యవహరిస్తాం. లక్ష రూపాయలు ఇచ్చి కొట్లాడుకోండని చెప్పం. వారు ఆత్మగౌరవంతో బతికే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడింది సామాజిక కోణంలోననే స్పృహ మా పార్టీకి ఉంది. – పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ బీసీ ముఖ్య నేత, మాజీ ఎంపీ -
‘బండి సంజయ్ పాదయాత్రకు కేసీఆరే స్పాన్సర్’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పాన్సర్ అంటూ ధ్వజమెత్తారు. చిన్న చిన్న విషయాలకు బండిని అరెస్ట్ చేసి కేసీఆరే హైప్ చేశారని విమర్శించారు. అదే సమయంలో లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయకుండా వదిలేయడం వెనుక ఆంతర్యం ఏమిటో బండి సంజయ్ చెప్పాలన్నారు. బండి సంజయ్ కి బుద్ధి ఉందా ..? .ఓసారి హాస్పిటల్లో చూపించుకోవాలి. కాంగ్రెస్‌కు అభ్యర్థులను ప్రకటించేది కేసీఆర్ అని సంజయ్ ఎలా మాట్లాడతారు..?, కరీంనగర్లో గంగుల కమలాకర్ బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఈటెలతో మాత్రం బండి మాట్లాడరు. కరీంనగర్ అభివృద్ధి విషయంలో జర్నలిస్టులు, బార్ అసోసియేషన్‌తో పాటు ఐదు సంఘాల పెద్ద మనుషులను జడ్జిలుగా ఉంచి చర్చిద్దాం. అందుకు ప్రస్తుత ఎంపీ సంజయ్, మాజీ ఎంపీ వినోద్ సిద్దమేనా..? ’ అంటూ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. -
లిక్కర్ స్కాంలో మహిళ దొరకడం మహిళలకే అవమానం : పొన్నం ప్రభాకర్
-
Congress Party: అంతా రేవంత్ ఇష్టమేనా? ఇలానే ఉంటే ఎవరూ మిగలరు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణ, కార్యవర్గ ఏర్పాటుపై తీవ్ర కసరత్తు జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ నేతల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇన్‌చార్జ్‌లకు అనేక ఫిర్యాదులు చేసిన పార్టీ నేతలు తమ ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో ఖర్గేను కలిసినప్పుడు సైతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు, రేవంత్ ఏకపక్ష నిర్ణయాలపై నేతలు తీవ్ర అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం. కమిటీల్లో, కార్యవర్గంలో ఇష్టారీతిన సొంతవారికే పదవులు కట్టబెడితే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరనే విధంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు స్పష్టంచేసినట్లు తెలిసింది. సీనియర్లను కాదని సొంత మనుషులకే పెద్దపీట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్వర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, వంశీచంద్ రెడ్డి మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యవర్గ ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. కార్యవర్గ ఏర్పాటులో రేవంత్ సొంత నిర్ణయాలు, సీనియర్లపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పార్టీలో నేతల మధ్య సమన్వయలోపం తదితర అనేక విషయాలను ఖర్గే దృష్టికి సీనియర్లు తీసుకెళ్లినట్లు సమాచారం. కమిటీల్లో పార్టీ సీనియర్లను కాదని, జూనియర్ నేతలు, టీడీపీ నుంచి వచ్చిన నేతలు, సొంత మనుషులకే రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్న విషయం తమకు తెలిసిందంటూ ఖర్గేకు సదరు నేతలు చెప్పినట్టు సమాచారం. ఈ పరిణామాలు తెలంగాణలో పార్టీ భవిష్యత్తుకు ఏమాత్రం క్షేమకరం కాదని ఖర్గేకు స్పష్టంచేసినట్లు తెలిసింది. తెలంగాణలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పూర్తయిన తరువాత... ఇప్పటివరకు కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరికీ అందుబాటులో లేరని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అలాగే పార్టీకి సంబంధించిన అనేక కీలక విషయాల్లో సీనియర్ల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ తీరుతో పార్టీలో ఎవరూ మిగులరని, ఈ దృష్ట్యా కమిటీల ఏర్పాటు, పార్టీలో నేతల మధ్య సమన్వయం, రేవంత్ ఏకపక్ష నిర్ణయాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని నేతలు పార్టీ అధ్యక్షుడికి మొరపెట్టుకున్నట్లుగా తెలిసింది. దీనిపై స్పందించిన ఖర్గే రేవంత్‌ను పిలిపించుకొని అన్ని అంశాలపై మాట్లాడుతానని హామీ ఇచ్చారని చెబుతున్నారు. అంతర్గత విషయాలు చర్చించాం: భట్టి ఈ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మల్లికార్జున ఖర్గేతో పార్టీ అంతర్గత విషయాలు మాత్రమే చర్చించుకున్నామని, కమిటీల అంశం తనకు తెలియదని దాటవేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ నాయకులందరూ కలిసి పనిచేసేలా చూడాలని ఖర్గేను కోరానని తెలిపారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్‌లో అంతా బాగుందని.. రేవంత్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేగాక పార్టీలోని సీనియర్లలో ఎలాంటి అసంతృప్తి లేదని వ్యాఖ్యానించారు. -
వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పది రోజుల్లో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని, పేస్కేలు కల్పించి క్రమబద్ధీకరిస్తామని, 55 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పిస్తామని, వీఆర్ఏల సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని 2017లో మహా శివరాత్రి పండుగ రోజు ప్రగతిభవన్, మంత్రులు, ఉన్నతాధికారుల సాక్షిగా సీఎం హామీ ఇచ్చి ఐదేళ్లవుతున్నా నెరవేర్చలేదని విమర్శించారు. మరోవైపు 2020లో అసెంబ్లీలో రెవెన్యూ చట్టం ప్రవేశపెడుతూ వీఆర్ఏలందరికీ పే స్కేల్ కల్పించి క్రమబద్ధీకరిస్తానని చెప్పి 22 నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని.. వీఆర్ఏలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన సీఎస్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని పొన్నం గుర్తు చేశారు. -
ప్రభుత్వ సంస్థలను అమ్మడంతోనే మీకు శక్తి
సాక్షి, హైదరాబాద్: 20 ఏళ్లుగా తనను ప్రతిపక్ష పార్టీలు తిట్టే తిట్ల వల్ల న్యూట్రిషన్ జరిగి తనకు శక్తి వస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘ప్రతిపక్షాల తిట్ల కారణంగా మీకు శక్తి రావడం లేదు. పోర్టులు, ఎయిర్‌పోర్టులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మడం వల్ల వస్తోంది’అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు బలరాంనాయక్, సురేశ్‌షెట్కార్, అంజన్‌కుమార్‌యాదవ్, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టబోమని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో మోదీ కన్నా పేదలను దోచుకునే పెద్ద దోపిడీదారుడు ఎవరున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ వెళ్లి ఉండాల్సిందని, సీఎం హోదాలో తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మోదీతో కొట్లాడాల్సిందని పొన్నం అభిప్రాయపడ్డారు. -
Munugode Bypoll 2022: ఉప ఎన్నికల వేళ.. ఫేక్ ప్రచారాల గోల!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలాయి. పోలింగ్ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరడంతో పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. సోషల్ మీడియా వేదికగా పార్టీలు ఫేక్ పోస్టుల యుద్ధానికి దిగాయి. ఫలానా నేత తమ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. స్రవంతిపై బోగస్ ప్రచారం: కాంగ్రెస్ గతంలో దుబ్బాక లో చేసిన విధంగా నేడు మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని అధికార పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను స్రవంతి కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మకై తమ అభ్యర్థి పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బోగస్ వీడియో సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలు పోరిక బలరాం, పొన్నం ప్రభాకర్, మధుసూదన్‌రెడ్డి ట్విటర్ ద్వారా కోరారు. నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు: స్రవంతి తనపై జరుగుతున్న అసత్య ప్రచారం గురించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లతామని పాల్వాయి స్రవంతి తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి బోగస్ ప్రచారాలతో తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని స్రవంతి స్పష్టం చేశారు. బీజేపీలో చేరడం లేదు: కర్నె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారడం లేదని, మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కర్నె ప్రభాకర్ వివరణయిచ్చారు. ఇటువంటి అసత్య ప్రచారాలతో బీజేపీ గెలవాలనుకుంటే వారి దౌర్భాగ్యపు పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇటువంటి వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. మునుగోడులో కచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు
కరీంనగర్: జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పట్టు సాధించే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు. అభివృద్ధి, పథకాల పేరుతో టీఆర్ఎస్ హడావిడి చేస్తుండగా, పాదయాత్ర కార్యక్రమంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తోంది. ప్రధాని మోదీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. వామపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తున్నాయి. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుడటంతో ఆయా పార్టీల నేతలు పల్లెబాటతో పాటు శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మూడుచోట్ల అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హుజూరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండగా, ప్రజా సమస్యలపై నిరసనలతో విపక్షాలు హోరెత్తిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు రాకపోయినా ఇదే వాతావరణం సాధారణ ఎన్నికలు జరిగే వరకు ఉండే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీలో ఉత్సాహం కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ ఊరూరా సంబరాలు నిర్వహించింది. నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో సమావేశాలకు ప్రణాళిక రూపొందించి రాష్ట్రస్థాయి నాయకులను ఆహ్వానించారు. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని, ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ ధర్నాలు, నిరసనలతో ప్రజల్లోకి వెళ్లింది. ప్రస్తుతం కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో నాయకులు ఉన్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో అల్లర్లు జరుగుతున్నాయనే కారణంతో పాదయాత్రను అడ్డుకొని కరీంనగర్‌కు తీసుకరావడంతో రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలపై సంజయ్ ఇంట్లో నిరసన దీక్షకు దిగడంతో బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలు కరీంనగర్‌కు రావడం అతడికి సంఘీభావం తెలుపడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. వరంగల్ డిక్లరేషన్‌తో కాంగ్రెస్.. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ వరంగల్‌లో సభ నిర్వహించినప్పటి నుంచి కాంగ్రెస్ శ్రేణులు కదనోత్సాహంతో పల్లెల్లో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, రైతులకు వద్దతు ధర హామీలతో ఆ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. మొన్నటి వరకు సభ్యత్వం పేరుతో, వరంగల్ డిక్లరేషన్‌తో ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిర్వహించిన యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండిలో మేడిపల్లి సత్యం, హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్, కరీంనగర్లో నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తదితరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. గులాబీ దళంలో జోష్ కేంద్రంపై టీఆర్ఎస్ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విమర్శలు మొదలుకొని బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని ప్రచారం చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పల్లె, పట్టణ ప్రగతి, ఇతర కార్యక్రమాలతో ప్రజలను మచ్చిక చేసుకుంటోంది. దళితబంధు, నేతన్న బీమా, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ పనిలోపనిగా బీజేపీ వైఫల్యాలను ఎండగడుతోంది. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు, మేయర్ సునీల్‌రావు విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. (క్లిక్: టీఆర్ఎస్లో కోల్డ్ వార్.. ఆడియో లీక్ కలకలం!) పోరుబాటలో కామ్రేడ్స్ ప్రజాసమస్యలపై వామపక్షాలు పోరుబాట పడుతున్నాయి. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ తదితర లెఫ్ట్ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. సీపీఐ జిల్లా మహాసభలు ఇటీవల పూర్తి చేసుకొని జిల్లా కార్యదర్శిగా మర్రి వెంకటస్వామిని ఎన్నుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శిగా మిల్కూరి వాసుదేవారెడ్డి ప్రజా సంఘాలను ఏకం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరుబాటలో నిమగ్నమవుతున్నారు. అలాగే వైఎస్సార్టీపీ, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. (క్లిక్: వచ్చే ఎన్నికల్లో పోటీ.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు) -
హంగామా చేస్తే సరిపోదు: ఉత్తమ్
సాక్షి, ఢిల్లీ: తనపై వచ్చిన ఆరోపణలకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ కేవలం తన ఇమేజ్ పెంచుకునేందుకే సభలు పెట్టారని మండిపడ్డారు. హంగామా చేస్తే సరిపోదని, గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలు అమలు చేయలేదన్నారు. కౌశిక్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడే నిర్వహించిన అంతర్గత సర్వేలో కాంగ్రెస్ పరిస్థితి 4 శాతం మించలేదు. కౌశిక్ రెడ్డి జులైలో పార్టీని వీడి వెళ్తే, ఆ తర్వాత కొన్ని నెలల పాటు ప్రస్తుత నాయకత్వం మరో బలమైన అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఏం చేసిందని ఉత్తమ్ ప్రశ్నించారు. కౌశిక్ వ్యవహారాన్ని సాకుగా చూపుతూ తనను కుట్రపూరితంగానే కార్నర్ చేస్తున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్‌కు అస్సలు పడదని, అతను పార్టీని వీడి వెళ్లడానికి సగం కారణం పొన్నమేనని ఉత్తమ్ అన్నారు. రేవంత్ రెడ్డి.. మాణిక్కం ఠాగూర్‌తో కలిసి పొన్నం ప్రభాకర్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి ఆశజూపుతూ తనపై రెచ్చగొట్టి ఆరోపణలు చేయిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. -
ఉత్తమ్‌పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉపఎన్నిక ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకులతో శనివారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం అంటూ పొన్నం సమీక్షలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన ఇద్దరు పీసీసీ అధ్యక్షులు కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు. మరో పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు (కజిన్) కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్ విసిరారు. ఉపఎన్నిక ఇన్చార్జ్గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. -
ఇందిరమ్మ రాజ్యమా.. రాక్షస రాజ్యమా?
సాక్షి, ఇల్లందకుంట (కరీంనగర్): ఇందిరమ్మ రాజ్యం కావాలా.. లేక నియంతృత్వంగా పాలిస్తున్న టీఆర్ఎస్ రాక్షస పాలన కావాలనేది ప్రజలే ఆలోచించుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఇల్లందకుంటలో హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్య క్రమానికి పార్టీ ఎలక్షన్ ఇన్చార్జి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. సీతారామచంద్రస్వా మి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్యాల, వాగుఒడ్డు రామన్నపల్లిల్లో పొన్నం మాట్లాడారు. ఈ ఎన్నికలను ఈటల, కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఆయనకు ప్రజలే గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని కోరారు. -
ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
కరీంనగర్‌టౌన్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ.. రెండూ ఒక్కటేనని, ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచేస్తోందని, ఆ కుటుంబ పాలనకు తెర దించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాత్రి 8 గంటల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి విపత్కర సంఘటనలు జరిగినా ప్రజలకు అందుబాటులో ఉండని మోడ్రన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్ అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేస్తూ, కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినా ఈడీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే గంగుల కమలాకర్ గ్రానైట్‌స్కాంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆ నిర్ణయాన్ని కేసీఆర్ వెనక్కి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : కొనుగోలు కేంద్రాల ఎత్తివేతని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉపసంహరించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. 2005లో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో మొక్కజొన్న, వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల వారీగా, మేజర్ గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి.. పంట వేసినప్పటి నుండి కొనుగోలు చేసే వరకు నా బాధ్యత అన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామనే మాట వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు. సన్న వడ్లు వేసుకోమని చెప్పి మద్దతు ధరలు కల్పించలేదు. ( తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు డ్రామా ఆడుతూ ఈరోజు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం అనేది రైతులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. కాబట్టి మేం చూస్తూ ఊరుకోం. ‘జాగ్రత్త కేసీఆర్’ అని హెచ్చరిస్తున్నాం. పునరాలోచన చేయండి. రైతుల ఆగ్రహానికి గురి కావద్దని కోరుతున్నాను. కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను ఉపసంహరించుకోవాలి. లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మళ్లీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తా’’మని చెప్పారు. -
‘రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ ఢిల్లీ పర్యటన’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ జాతీయ నాయకులు కేసీఆర్ అవినీతిపై మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ నేడు ఢిల్లీలో సీఎం పర్యటనలో దాగున్న రహస్యం ఎంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం తిట్టుకొని ఇప్పుడు రహస్య మంతనాలు ప్రజలు గమనించాలన్నారు. రైతులకు మద్దతుగా డిసెంబర్ 8న భారత్ బంద్‌లో టీఆర్ఎస్ కూడా పాల్గొందని తెలిపారు. పార్లమెంట్ సభ్యులను పిలుచుకొని కేసీఆర్ ఢిల్లీ రైతులకు మద్దతుగా కలిసి దీక్షల శిబిరంలో పాల్గొనాలని సూచించారు. కేసీఆర్ కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తమ ఎంపీలు, శాఖ అధికారులు ఎందుకు లేరని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. చదవండి: అవినీతిలో ఆమెకు ఆమే సాటి ‘గత 15 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా ఎముకలు కొరికే చలిలో రైతులు నిరసనలు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ అమిత్‌షాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కేసీఆర్, అమిత్‌షా, మోదీ ,ఒవైసీ అంత ఒకటే. ఢిల్లీ పై పోరాటం చేస్తా అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ బీజేపీ నేతలను కలుస్తున్నారు. దేశంలో ఏ పార్టీ పైన అయిన సీబీఐ ,ఈడీ కేసులు చేస్తున్న బీజేపీ కేసీఆర్‌పై ఈగ కూడా వాలనివ్వడం లేదు. కేసీఆర్ అవినీతిపైన ఎందుకు విచారణ జరిపిస్తలేరు. వరదసాయం ఆడిగేతే దాని అంచనా ఏది.. అధికారులను ఎందుకు తీసుకుపోలేదు. మీరు వేయమంటేనే సన్న వడ్లు రైతులు వేశారు. అక్కడే ఉన్న ఢిల్లీ నేతలను సన్న వడ్లకు మద్దతు ధర కల్పించాలని అడగండి. బీజేపీ బెదిరింపులకు భయపడే ఢిల్లీ వెళ్లావు. తెలంగాణ ప్రయోజనాల కోసం అని కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ మీ పోరాటానికి అండగా ఉంటుంది. కానీ ఓ రహస్య ఎజెండా తో రాజకీయ లబ్ది కోసమే ఢిల్లీ వెళ్లారు.’ అని కేసీఆర్‌ను నిలదీశారు. చదవండి: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్ -
టీఆర్ఎస్కు సవాల్ విసిరిన పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే కాంగ్రెస్‌ను చూసి హరీష్ రావు ఎందుకు భయపడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హరీష్‌రావు లాంటి అబద్ధాల కోరును నమ్మనుకుంటే మునిగిపోతారని హితవు పలికారు. గతంలో హరీష్‌రావు ప్రచారం చేసిన ఉప ఎన్నికల నియోజక వర్గాలను పరిశీలిస్తే తన గురించి తెలుస్తుందని సూచించారు. చదవండి: దుబ్బాకలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్! ‘దుబ్బాకకు కేసీఆర్ ఎన్ని సార్లు వచ్చారు. సిద్ధిపేట పైన ఉన్న ప్రేమ దుబ్బాక పైన ఎందుకు లేదు. దుబ్బాకలో ఏ గ్రామనికైనా వెళ్దాం. ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్నాయా చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న గ్రామాలకు మీరు రావొద్దు, డబల్ బెడ్ రూమ్ ఉన్న గ్రామాలకు మేము రాము. దుబ్బాకలో టిఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటే కాంగ్రెస్ నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారు. బీజేపీ ప్రభావం దుబ్బాకలో లేదు’. అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. చదవండి: ఆ బిడ్డను ఒక్కరైనా పరామర్శించారా? -
రైల్వే ప్రైవేటీకరణ దేశ పతనానికి నాంది: పొన్నం
సాక్షి, హైదరాబాద్: రైల్వేలు, రైల్వేస్టేషన్లను ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటన ఈ దేశ పతనానికి నాంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇప్పటికే ఎల్ఐసీ, ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టులను ప్రైవేట్‌పరం చేసిన బీజేపీ ప్రభుత్వం చివరకు 151 రైల్వేస్టేషన్లను కూడా ప్రైవేట్‌కు అప్పగిస్తామనడం దుర్మార్గమైన చర్య అని బుధవారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ఇది అం బానీ, ఆదానీల ప్రభుత్వమని విమర్శించారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘కరీంనగర్లో నిరంతరాయంగా నీటి సరఫరా’
సాక్షి, కరీంనగర్: జిల్లాలో రేపు(మంగళవారం) ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమాలాకర్ కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. అనంతరం గంగుల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా కరీంనగర్లో రేపటి నుంచి నిరంతరాయంగా వాటర్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఐటీ టవర్ రేపటి నుంచి వినియోగంలో వస్తుందని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా వాటిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ను మణిహారంగా నిలిచే కేబుల్ బ్రిడ్జి పనులు అక్టోబర్ 2 వరకు పూర్తి చేస్తామని చెప్పారు. దసరా నుంచి కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభిస్తామని, మానేరు రివర్ ఫ్రంట్ పనులు త్వరలో చేపడతామన్నారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ పర్యాటక కేంద్రంగా మారబోతుందని మంత్రి గంగుల తెలిపారు. (చదవండి: గంగులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు) కేటీఆర్‌కు పోన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ... మంత్రి జిల్లా పర్యాటన సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కేటీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్లో మంచి నీటి సరఫరాను ప్రారంభించనున్న కేటీఆర్.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచినీటికి ఎంత ఖర్చు చేశారో కాంగ్రెస్ హయాంలో ఎంత ఖర్చు చేసిందో ఈ సందర్భంగా స్పష్టం చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఐటీ టవర్‌లో ఎన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎంతమందికి ఉద్యోగం ఇస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. కేబుల్ బ్రిడ్జినీ పరిశీలించే మంత్రి కేటీఆర్ దాని పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి నగర ప్రజలు పొల్యూషన్ బారిన పడకుండా చూడాలన్నారు. గతంలో కరీంనగర్‌కు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారో స్పష్టం చేయాలని పోన్నం పేర్కొన్నారు. -
దేశానికి ఎనలేని సేవ చేశారు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు, కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావ్ తదితరులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాల మనసుల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి పీవీ అని కొనియాడారు. ఎవరో ఇప్పుడు ఆయన జయంతి వేడుకలు చేస్తున్నారని రాష్ట్ర ప్ర భుత్వాన్ని పరోక్షంగా విమర్శించిన ఉత్తమ్, అయి నా తాము గర్విస్తామని, స్వాగతిస్తామన్నారు. గీతారెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు పీవీ శతజయంతి వేడుకల నిర్వహణకుగాను మా జీ మంత్రి గీతారెడ్డి చైర్మన్‌గా, మంథని ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు వైస్ చైర్మన్‌గా 15 మంది సభ్యులు, ముగ్గురు సలహాదారులతో ఉత్తమ్ కమిటీ ఏర్పాటు చేశారు. కాగా, దిగవంత పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను ఏడాదిపాటు జరపాలని సోనియా గాంధీ ఆదేశాలిచ్చారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలోనే తీర్మానం చేశామని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని పార్లమెంట్లో కూడా కోరతామని చెప్పారు. -
వరంగల్ అర్బన్ జిల్లాకు పీవీ పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం హర్షణీయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన స్వస్థలం వంగర ఉన్న వరంగల్ అర్బన్ జిల్లాకు పీవీ పేరు పెట్టాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శుక్రవారం పొన్నం లేఖ రాశారు. ఎస్సారెస్పీ వరద కాల్వ, రాష్ట్రంలోని ఒక మెడికల్ కాలేజీ, ఒక యూనివర్సిటీకి కూడా పీవీ పేరు పెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి పీవీపై చిత్తశుద్ధి ఉంటే ఆయన శత జయంతి సందర్భంగా ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
ఆ హామీ ఏమైంది: పొన్నం ప్రభాకర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రతి ఏడాది వంద కోట్ల రూపాయలు ఇస్తామని గత ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరిట ఉన్న గుడి చెరువు పూడ్చడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదని విమర్శించారు. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిలో దూసుకుపోతుందని, వేములవాడలో మాత్రం ఒక పని కూడా చేయలేదని మండిపడ్డారు. వీటీడీఏ హైదరాబాద్ కార్యాలయానికి కూడా దేవస్థానమే డబ్బులు చెల్లిస్తుండగా, యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోందని తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికై ఏడాది గడుస్తున్నా.. వేములవాడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రికి ఒక్క లేఖ కూడా రాయలేదని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఆయన వెంటనే సీఎం కేసీఆర్‌ను కలవాలని డిమాండ్ చేశారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు జర్మనీకే అంకితం అయ్యారని ధ్వజమెత్తారు. వచ్చేనెల లోపు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే గాడిదకు వినతపత్రం ఇస్తామని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. -
నిర్మల.. యాక్సిడెంటల్ మినిస్టర్!
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల కోసం, వలస కార్మికుల కోసం ప్రతిరోజూ తపిస్తూ తన వంతు మనోధైర్యాన్ని ఇస్తూ అండగా నిలుస్తున్న ఎంపీ రాహుల్ గాంధీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సీతారామన్ అనుకోకుండా ఆర్థిక మంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, రాహుల్‌ను విమర్శించడం మానుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఆమె బయటకు వచ్చి వలసకార్మికులను చూస్తే వారు పడుతున్న కష్టాలు ఏంటో అర్థమవుతాయని, ఏసీ గదుల్లో కూర్చుని ప్రెస్మీట్లు పెడితే ఏం తెలుస్తాయని పొన్నం ఎద్దేవా చేశారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ ప్యాకేజీలతో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కరోనా మాటున దేశంలో ఉన్న కీలక రంగాలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తూ లబ్ధి పొందాలని కేంద్రం చూస్తోందని ఆయన ఆరోపించారు. -
అది ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నా: పొన్నం
సాక్షి, కరీంనగర్: వావిలాలలో రైతు బుచ్చయ్య ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడం వల్లే చనిపోయాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుచ్చయ్య కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై మర్డర్ కేసు నమోదు చేయాలని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తుంటే జీవో 67 తీసి తిరగడానికి వీలు లేకుండా చేసి కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో 100 శాతం ధాన్యం సేకరణ జరిగితే కరీంనగర్ జిల్లా కనీసం సగం కూడా జరగలేదని తెలిపారు. రైతాంగానికి క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ఇబ్బందుల గురించి ప్రతిపక్ష పార్టీగా మేము పర్యవేక్షిస్తుంటే మాపై బురద జల్లడం ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నామని హితవు పలికారు. ఐకేపీ సెంటర్లలో తాలు తప్పా పెరు మీద కోతలు విధిస్తూనే కొనుగోలు పనులు వేగవంతం చేయడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులు రైస్ మిల్లర్లకు మద్దతు తెలపడం తప్పా రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రైస్ మిల్లర్లు ఎన్ని అక్రమాలు చేస్తున్న రైతులకు ఎంత అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంత్రి కళ్లు, ముక్కు, నోరు, చెవులు ముసుకొకుండా ఇంటలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకుని రైతులకు జరుగుతున్న అన్యాయం గమనించి రైతులకు న్యాయం చేయాలని పొన్నం కోరారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: పొన్నం ప్రభాకర్
సాక్షి, కరీంనగర్: జీవో నంబర్ 64ను తక్షణమే రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇలాంటి జీవో తెచ్చి ప్రతిపక్షాలను అడ్డుకోవాలని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం గగ్గోలు పెడుతోందని విమర్శించారు. రైతు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను పరామర్శిస్తే కేసులు నమోదు చేస్తామని జీవో 64 తీసుకొచ్చారని మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కుల, చేతి వృత్తులకు ఆర్థిక సాయం అందించిందని, తెలంగాణలో ఎంతమందికి కుల వృత్తుల వారికి సాయం చేశారో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలను చూసైనా సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల కుల ,చేతి వృత్తులకు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశాల్లో సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పడం తప్ప..చేసేదేమీ కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. జిల్లాలో నలుగురు మంత్రులు ఉన్నా ధాన్యం కొనుగోళ్లు ఎందుకు వేగవంతం కావడం లేదని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు సమస్యలు ఉంటే ప్రభుత్వ పెద్దలతో చర్చించుకోవాలి కానీ, రైతులను ఇబ్బందులు పెట్టడం సబబు కాదన్నారు. నల్గొండ జిల్లాలో 100 శాతం కొనుగోళ్లు జరిగితే ఎందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగడం లేదని ప్రశ్నించారు. తాను చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్‌ను మాట మీద నిలబడని ఏకైక రాజకీయ వేత్తగా పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. ఫ్యూడల్ మనస్తత్వంతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. -
జూపల్లి.. ఇదే సరైన సమయం.. నిర్ణయం తీస్కో!
సాక్షి, కరీంనగర్: ‘తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న జూపల్లి కృష్ణారావు పట్ల టీఆర్ఎస్ కార్యాలయంలో ఎదురైన అవమానం తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి తమతో కలిసి తెలంగాణ కోసం జూపల్లి ఉద్యమించారని, మంత్రి పదవికి రాజీనామా చేసి.. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు తన నియోజకవర్గంలో తానేంటో నిరూపించుకొని.. గెలిచివస్తే.. టీఆర్ఎస్ నేతలు ఆయనను అవమానించడం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. జూపల్లి తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునే సమయమిదేనని, ఇప్పటికైనా టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి ఆయన తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. -
ఢిల్లీలో దోస్తీ... గల్లీలో కుస్తీ..
కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మకయ్యాయని, వారికి అభ్యర్థులు దొరకడం లేదని మంత్రి కేటీఆర్ మాట్లాడటం గర్హనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాటికైనా ఉత్తర, దక్షిణ ధ్రువాలనేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభ్యర్థులను భయాభ్రాంతులకు గురిచేయడం, డబ్బు సంచులతో ప్రలోభాలకు గురి చేయ డాన్ని చూస్తుంటే టీఆర్ఎస్కు మున్సిపల్ ఎన్నికల్లో గెలువమనే అభద్రతా భావం నెలకొందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఢిల్లీలో బీజేపీతో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్న తీరుకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. -
'టీఆర్ఎస్, బీజేపీ దోస్తానాపై ఆధారాలున్నాయి'
సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల విషయంలో కేటీఆర్ అభద్రతా భావంలో ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పొన్నం మాట్లాడుతూ.. కరీంనగర్, నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యారని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లాంటి కాంగ్రెస్, బీజేపీలు ఎన్నటికి కలవవని పొన్నం తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీల దోస్తానాపై తమ వద్ద ఆధారాలున్నాయని, ఇరు పార్టీలు కలిసి డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ఎన్నటికైనా కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను బెదిరించి తమ నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా ఒత్తిడి తెస్తున్నారని, పోటీ చేసి గెలవకుండా ఎందుకు బయపడుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాల తరపున ఎవరైనా పోటీ చేస్తామని ముందుకు వస్తే వారింట్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులను బదిలీలు చేస్తామని బెదిరించడం దారుణమని వెల్లడించారు.11 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్న గంగుల కమలాకర్ కరీంనగర్‌కు ఏం చేశారో చెప్పాలని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలకు 24 గంటలు నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగనని చెప్పిన కమలాకర్ మళ్లీ ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారంటూ విమర్శించారు.బీజేపీ ఎంపీ బండి సంజయ్ మతపరంగా రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో మాకు అభ్యర్థులు దొరకడం లేదంటున్నారని పొన్నం తెలిపారు. కానీ వాస్తవానికి అన్ని డివిజన్లలో మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు లేనిది బీజేపీకేనన్న విషయం ఎంపీగారికి తెలియదునుకుంటా.. అందుకే ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మేయర్, ఎమ్మెల్యే మధ్య గొడవతో కరీంనగర్లో అభివృద్ధి ఆగిపోయిందని , మమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్‌లోని రెండు సీట్లకు తాము సీపీఐకి మద్దతిస్తున్నట్లు పొన్నం స్పష్టం చేశారు. -
హుజూర్నగర్ ఎన్నికతో తేలిపోయింది!
సాక్షి, సిద్దిపేట: రిజర్వేషన్లు ప్రకటించకుండానే మున్సిపల్ ఎన్నికలకు తమ అభ్యర్థులు సిద్ధమని కేటీఆర్ చెప్పడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. బుధవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను మరిచిపోయిందని, హామీలు గుర్తుకు రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో చురక పెట్టాలంటూ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా బీజేపీకి ఎప్పటికీ రాదని హుజూర్నగర్ ఎన్నికలతో తేలిపోయిందన్నారు. ఎన్నికల అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇటీవల సిద్ధిపేట డీసీపీ నరసింహరెడ్డికి తలెత్తిన పరిస్థితే.. అధికారులకు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదని పేర్కొన్నారు. ప్రజలకు, అధికారులకు ప్రత్యామ్నాయ పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. -
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్ : ఓటర్ల జావబితా ప్రకటన చేయకుండా నోటిషికేషన్ ఎలా ఇస్తారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ను రాష్ట్రంలో రెండు శాఖలు కాపాడుతున్నాయని.. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్, పోలింగ్ సమయంలో పోలీసులు టీఆర్ఎస్ను కాపాడుతున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇవ్వకముందే టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నాగిరెడ్డి ఎన్నికల అధికారినా..లేక టీఆర్ఎస్ కార్యకర్తనా అని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని దొడ్డి దారిన గెలవాలని టీఆర్ఎస్ చూస్తుందని, మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. సంక్రాంతి పండగ తరువాత నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్‌ను కోరారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోర్టు సూచనల మేరకు డిలిమిటేషన్ జరిగిందన్నారు. జనాభాకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, అయినా కావాలనే ప్రకటించడం లేదని విమర్శించారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా షెడ్యూల్ ప్రకటించిందని ఆరోపించారు. రిజర్వేషనల ప్రకటన ఎన్నికల తేదికి ఒక్క రోజు ఉంచడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ మార్చడానికి అవకాశం ఉందని, రిజర్వేషన్ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని కోరారు. -
‘మీ నిర్ణయాల వల్లే ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది’
సాక్షి, కరీంనగర్: కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(నవంబర్ 7)తో పెద్దనోట్ల రద్దుకు మూడేళ్లు అవుతుదని.. శుక్రవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు. ధర్నాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. వాటికి లొంగకుండా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. హైకోర్టు చేస్తున్న కామెంట్లు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివన్నారు. కేసీఆర్ ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిన సర్కారు.. ఆర్టీసీకి రూ. 40 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకునే మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల ఉసురు ఈ సర్కారుకు తగిలి తీరుతుందన్నారు. హైకోర్టుపై గౌరవం లేకుండా ‘కోర్టేమైనా కొడుతుందా?’ అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో టీఆర్ఎస్, బీజేపీలు నకిలీ ఫైటింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. సకల జనుల సమ్మెలో సమైక్య సర్కారు ఒక్కరి ఉద్యోగమైనా తీసిందా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
'రాజకీయ లబ్ధికోసమే బీజేపీ గాంధీ సంకల్పయాత్ర'
సాక్షి, కరీంనగర్ : రాజకీయ లభ్ధికోసమే బీజేపీ గాంధీ సంకల్పయాత్ర చేపట్టిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడు అంటూనే.. గాంధీ పేరుతో సంకల్ప యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. చంపిన వాళ్లను పూజించే బీజేపీ ఏ ముఖం పెట్టుకొని యాత్రలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తెలిపారు. ఇప్పటికైనా కార్మికులు చేస్తున్న ఆందోళనపై స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. మిడ్ మానేరు ప్రాజెక్టులో రిపేర్లు నడుస్తుండడంతో ఎల్లంపల్లి నుంచే నీరు వృధాగా పోతుందని, వెంటనే ఆ నీటిని దారి మళ్లించి చెరువులను, కుంటలను నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాబిన్నామవ్వడానికి బతుకమ్మ చీరలు తయారుచేసిన సిరిసిల్ల నేతన్నలకు డబ్బులు చెల్లించకపోవడమే నిదర్శనమని వాపోయారు. -
‘దానికి గంగుల ఏం సమాధానం చెప్తాడు’
సాక్షి, కరీంనగర్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సోమవారం జిల్లాలోని చింతకుంటలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న డబుల్బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు మాసాల క్రితం ప్రారంభించిన టీఆర్ఎస్ భవనాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారు.. కానీ మూడేళ్ల క్రితం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం మాత్రం ఇంతవరకు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ భవనాన్ని శరవేగంతో పూర్తి చేసిన కాంట్రాక్టర్.. పేదల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు ఇంతవరకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఓటమి ఎరుగని విజేత అని చెప్పుకునే మంత్రి గంగుల కమలాకర్.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో 60 వేల మంది డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హులు ఉంటే.. కేవలం 660 ఇళ్ల నిర్మాణం మాత్రమే చెపట్టారని ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ డివిజన్, గ్రామాల వారిగా డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హులైన వారి జాబితా తయారు చేస్తుందని.. ఇళ్లు రాని వారంతా దరఖాస్తు చేసుకోవాలని కోరారు పొన్నం. -
కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ముమ్మాటికీ ఓ వైఫల్యమే అని.. దీని ద్వారా జరిగే లబ్ధికన్నా నష్టమే ఎక్కువని ‘కడెం ప్రాజెక్టు– కాళేశ్వరం సోకులు– నిజానిజాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీ ద్వారా ఎత్తిన నీటికంటే, మేడిగడ్డ నుంచి సముద్రానికి వెళ్లిందే ఎక్కువని తేలి్చచెప్పింది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే నిర్మాణ వ్యయం వృథా అయ్యేది కాదని, ఇప్పుడు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచి్చంచి పైసా ప్రయోజనం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేసింది. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని తీర్మానించింది. గురువారం తెలంగాణ జల సాధన నమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి, బీజేపీ నేత విజయరామారావు, కాగజ్‌నగర్ నేత పాల్వాయి హరీశ్, టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్, న్యూడెమొక్రసీ నేత గోవర్ధన్, కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎల్లంపల్లికి వచి్చన నీళ్లు, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఏవీకూడా కాళేశ్వరంలోని మేడిగడ్డ ద్వారా ఎత్తిపోసినవి కావన్నారు. సుమారు 1,500 టీఎంసీలు మేడిగడ్డను దాటుకుంటూ సముద్రంలోకి వెళ్లాయ ని తెలిపారు. ప్రతిఏటా విద్యుత్, వడ్డీలు, నిర్వహణకు అయ్యే వ్యయం రూ.65 వేల కోట్లు ఉంటుందన్నారు. ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే రూ.లక్ష కోట్లు దాటిందని, ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రూ.3 లక్షల కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. జాతీయ హోదాపై మభ్య పెట్టారు.. మేడిగడ్డ వద్ద లభ్యతగా ఉండే జలాల్లో 80 శాతం ప్రాణహిత నది నుంచి వచ్చేవేనని, అక్కడ తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్లు పారించే అవకాశం ఉండేదని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని సీఎం కేసీఆర్ కేవలం నోటిమాట ద్వారానే కోరారు తప్పితే దానికి సంబంధించిన ఎలాంటి నివేదికలు కేంద్రానికి సమరి్పంచలేదని కేంద్ర జలశక్తి మంత్రి స్వయంగా రాజ్యసభలో వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కాళేశ్వరం పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలని కోరారు. -
గాంధీ అంటే ఒక ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: గాంధీ అంటే ఓ ఆదర్శమని, ఆయన జీవితం ఓ సిద్ధాంతమని ఏఐ సీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా టీపీసీసీ ఆధ్వ ర్యంలో చార్మినార్ నుంచి గాందీభవన్ వరకు బుధవారం శాంతి యాత్ర నిర్వహించారు. గాంధీభవన్ లో జరిగిన సభలో కుంతియా మాట్లాడుతూ శాంతి, అహింస ఆయుధాలతో స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీ అన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు పాల్గొన్నారు. -
సీపేజీ కాదు.. లీకేజీనే..
సాక్షి, కరీంనగర్: మిడ్ మానేరు డ్యాం (ఎంఎండీ) కట్టను నాణ్యత లేకుండా నిర్మాణం చేయడం వల్లనే లీకేజీ అయి ఊట నీరు బయటకు వచ్చి ప్రమాదకరంగా తయారైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ నేతల కమిషన్ల కక్కుర్తితోనే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేశారని ఆరోపించారు. శుక్రవారం ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంలతో కలిసి ఆయన మాట్లాడారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డిలు ఎంఎండీ కట్ట లీకేజీ కాదని, సీపేజీ అని బుకాయించడమే కాకుండా దమ్ముంటే చర్చకు రావాలనడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ నేతల చాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని ఎంఎండీ ముంపు గ్రామాల్లోనే బహిరంగ చర్చ పెట్టుకుందామని, సమయం మీరు చెప్పినా సరే.. లేదంటే మేమే చెబుతామని సవాలు విసిరారు. కట్టకు ఏర్పడ్డది లీకేజీ కాకపోతే రాత్రికి రాత్రే పోలీసు బందోబస్తు పెట్టి ఎంఎండీ అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకు ఎందుకు వదిలారో స్పష్టం చేయాలన్నారు. ఎంఎండీ ఎడమ వైపు కట్టను కిలోమీటరు పొడవు ఒర్రె మీద నిర్మించినట్లు అక్కడి రైతులు చెబితే ఆశ్చర్యం కలిగిందన్నారు. మూడేళ్ల క్రితం ప్రాజెక్టు కట్టకు గండి పడితే రూ.200 కోట్లు అంచనా పెంచి మళ్లీ కట్ట నిర్మించారని, అప్పటి ఈఎన్‌సీయే ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నారని, ఈఎన్సీకి ఎందుకు క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నాణ్యత లేకపోతే కాంట్రాక్టరుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. కేవలం టీఆర్ఎస్ నేతల కమిషన్ల కక్కుర్తి వల్లనే కాంట్రాక్టరు అడ్డగోలు పనులు చేసి, కట్టను ప్రమాదంలో పెట్టారని తెలిపారు. కాళేశ్వరం గుండెకాయ ఎంఎండీ అని చెప్పిన ప్రభుత్వం సక్రమమైన పద్ధతిలో కట్టను ఎందుకు నిర్మించలేదన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. కట్ట తెగితే కింద ఉన్న గ్రామలన్నింటికీ ప్రమాదమేర్పడుతుందని, వెంటనే కిలోమీటరు పొడవు కట్టను తొలగించి మళ్లీ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు పద్మాకర్‌రెడ్డి, దుర్గారెడ్డి, పిల్లి కనకయ్య, కూస రవి, ఆగయ్య, రాజశేఖర్, రాజు, ప్రదీప్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో టెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరవైఫల్యం తర్వాత కీలక నేతలంతా బరిలోకి దిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్న పార్టీలో ఆందోళన ఎక్కువవుతోంది. పార్టీలోని రాష్ట్ర ముఖ్య నేతలం దరికీ అగ్నిపరీక్షగా మారిన ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? సానుకూలంగా ఉంటే ఏం జరగబోతోంది? ప్రతికూలంగా ఫలితాలు వస్తే పార్టీలో ఎలాంటి మార్పులుంటాయి? అసలు పార్టీ మనుగడ, భవిష్యత్తు ఏమవుతుందనే ప్రశ్నలు నాయకులతో పాటు పార్టీ శ్రేణులను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పోలింగ్ సరళిని బట్టి ఐదారు స్థానాల్లో పార్టీకి మంచి ఓటింగ్ జరిగిందని భావిస్తున్నా.. నేడు వెలువడనున్న ఎగ్జిట్‌పోల్ ఫలితా లు ఏం చెబుతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. చావో.. రేవో! ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చావో రేవో సమస్యగా పరిణమించాయి. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురవడం.. పార్టీ నేతలంతా వలసబాట పడుతుండడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మనుగడ సాగించాలంటే.. లోక్‌సభ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. దీనికితోడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాష్ట్రంలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు ఏఐసీసీ స్థాయి నేతలుగా చెలామణి అవుతున్న రేణుకాచౌదరి, మధుయాష్కీగౌడ్, కేంద్ర మాజీ మంత్రి మల్లురవి లాంటి నేతల భవితవ్యంపై ఈ ఎన్నికలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన ఈ నేతల్లో ఎవరు విజయబావుటా ఎగరేస్తారు? ఎవరు తేలిపోతారనేది కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వ పటిమకు అగ్నిపరీక్షగా మారింది. ఈ ఫలితాలను బట్టే రాష్ట్ర కాంగ్రెస్‌లో మార్పులుంటాయనే చర్చ కూడా ఈ ఉత్కంఠకు కారణమవుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజామోదం వచ్చిన వ్యక్తికే పార్టీ పగ్గాలిస్తారన్న అంచనాలు కూడా ఉత్కంఠను రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా పోలింగ్ సరళిని బట్టి మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ గెలుస్తుందనే అంచనాలు, ఐదారు స్థానాల్లో తమ కన్నా బీజేపీ మెరుగైన ప్రదర్శన చేసిందనే లెక్కలు ఈ ఆందోళనకు కారణమవుతు న్నాయి. అయితే, నల్లగొండ, భునవగిరి, మల్కాజ్గిరి, ఖమ్మం, చేవెళ్ల, మహబూబాబాద్ స్థానాలపై ఆశలు సన్నగిల్లకపోయినా వీటిలో ఎన్ని స్థానాలు గెలుస్తామన్న దానిపై పార్టీ అంతర్గత సర్వేల్లోనూ స్పష్టత రావడంలేదు. -
‘నిర్వాసితులను భయపెడుతున్నారు’
సాక్షి, సిద్ధిపేట : కొండపోచమ్మ, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వానిదేనన్నారు. కోర్టు తీర్పును ఒక చిల్లర పంచాయితీగా అభివర్ణించిన సీఎం కేసీఆర్.. నిందలన్నీ కాంగ్రెస్ పార్టీపై మోపుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా నర్సారెడ్డి పట్ల పోలీసుల తీరును ఎండగట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి, రైతుల భూములు సస్య శ్యామలం కావాలని.. వీటితో పాటు భూనిర్వాసితులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మానసిక ఆనందం పొందుతున్నాడే తప్ప.. ‘ఇప్పటివరకు వరకు మేనిఫెస్టో గురించి గానీ, రైతుల సమస్యల గురించి గానీ పట్టించుకోకుండా.. ఎంతసేపు ఫెడరల్ ప్రంట్ పేరుతో తీర్థయాత్రలు తిరగుతూ మానసిక ఆనందం పొందుతున్నాడే తప్ప.. సీఎం కేసీఆర్ ఏ ఒక్క సమస్య గురించి మాట్లాడకపోవడం దారుణం. ప్రాజెక్ట్ పనులలో జాప్యం చేస్తూ ఆ నిందలు కాంగ్రెస్ పార్టీపై రుద్దుతున్నాడు. హైకోర్టు స్టేతో ఆగిపోయిన పనులను.. నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేసి ప్రభుత్వం పూర్తి చేస్తోంది. కోర్టు ప్రత్యేక నివేదిక తెప్పించుకుని నిర్వాసితులకు న్యాయం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యా యత్నం చేయడం దారుణం అని పొన్నం ప్రభాకర్ కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
20 జెడ్పీ చైర్మన్లే లక్ష్యం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 20 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్ తెలిపారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కేడర్‌కు తోడుగా ఉంటారని చెప్పారు. పొన్నం మాట్లాడుతూ.. మండల, జిల్లా పరిషత్‌లకు నేరుగా ఎన్నిక జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోం దన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే విధానాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. 32 జెడ్పీ పీఠాలు దక్కించుకునే పరిస్థితి టీఆర్ఎస్కు ఉంటే ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించాల్సి వస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఫిరాయింపులను నివారించేందుకే కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ ఇవ్వాలనే విధానాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. కుసుమకుమార్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రజల నాడి కాంగ్రెస్ వైపు ఉందని టీఆర్ఎస్కు అర్థమైందని వ్యాఖ్యానించారు. అందుకే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాకముందే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని యత్నిస్తోందన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పాల్గొన్నారు. -
పార్టీ మారనని అఫిడవిట్ ఇస్తున్నా : పొన్నం
సాక్షి, కరీంనగర్ : కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు వెల్లువెత్తుతుండగా.. మరో కీలక నేత కూడా పార్టీ మారబోతోన్నట్లు ప్రచారం సాగింది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పార్టీ మారబోతున్నారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను పార్టీ మారుబోతున్నానని అనడం సబబు కాదని, ఏ పరిస్థితుల్లోనూ పార్టీ మారనని అఫిడవిట్ ఇస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాను ఏడు ముక్కలు చేశారని, కరీంనగర్‌కు మెడికల్‌కాలేజ్ ప్రకటించి ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని మోసం చేశారని విమర్శించారు. పోరాడితే పొన్నంలాగా పోరాడాలని కేసీఆర్ ఉద్యమ సమయంలో అన్నారని గుర్తు చేశారు. పాఠశాల బస్సులను ఎన్నికలకు ఉపయోగించారని.. అయినా ఎలక్షన్ కమీషన్ చూస్తూ ఉండిపోయిందని దుయ్యబట్టారు. -
పొన్నంకు మతి భ్రమించింది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విచక్షణ కోల్పోయి మతిభ్రమించి మాట్లాతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వరుస ఓటములతో పొన్నం ఓటమికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేశా చేశారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్పైనా, నాపైనా పొన్నం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. పొన్నం విచక్షణ కోల్పోయి మతిభ్రమించి మాట్లాడారు. పొన్నం ఓ రాజకీయ వ్యభిచారి. 5 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కసారి గెలిచారు. నేను ఐదుసార్లు పోటీ చేస్తే ఐదుసార్లు గెలిచాను. పొన్నం హైదరాబాద్‌లో ప్రెస్మీట్లకే పరిమితం. కరీంనగర్లో ఆయనకు అంత సీన్ లేదు. కరీంనగర్లో మొన్న పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమవడంతో తెలంగాణ కేఏ పాల్గా మారారు. పొన్నం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాలి గోటికి సరిపోరు..’ అని వ్యాఖ్యానించారు. పొన్నం ఓ మీటర్ బద్ద.. తుపాకీ రాముడు తెలంగాణ ఉద్యమంలో పొన్నం ఓ డ్రామా ఆర్టిస్టు అని గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ‘లగడపాటి రాజగోపాల్‌తో కుమ్మక్కై పెప్పర్ స్ప్రే కొట్టించుకున్నారు. అయినా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు పొన్నం ప్రభాకర్‌ను తుక్కుతుక్కుగా ఓడించారు. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించానని పొన్నం ప్రభాకర్ దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు పొన్నం ఉన్న పార్టీలో ఎవరైనా చేరతారా? పొన్నంను కాంగ్రెస్ నుంచి మెడ పట్టి గెంటేయాలి. పొన్నం ఓ మీటర్ బద్ద.. తుపాకీ రాముడు. పొన్నం పోటుగాడని మళ్ళీ కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నారా? కేటీఆర్‌ను విమర్శించే అర్హత పొన్నంకు ఉందా? స్థాయికి మించి సంస్కారం లేకుండా మాట్లాడితే మేం ఊరుకోం. ఎంపీగా కాదు కార్పొరేటర్‌గా పోటీ చేయాలి. మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా, ఎంపీగా పొన్నం ప్రభాకర్‌ది అవినీతి చరిత్రే. పొన్నం ఖబడ్దార్.. సంస్కారం లేకుండా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని గంగుల కమలాకర్ హెచ్చరించారు. -
పాతపని పూర్తిచేసేందుకే!
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్లో పెండింగ్‌లో ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తిచేసేందుకే కేంద్రం ఎక్కువ ఆసక్తి చూపించింది. కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా.. పాత వాటికి నిధుల కేటాయింపునకే పెద్దపీట వేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట డివిజన్ హోదా, వట్టినాగులపల్లి టెర్మినల్ నిర్మాణం తదితర డిమాండ్లు ఈ బడ్జెట్లోనూ తీరని కోరికలుగానే మిగిలిపోయాయి. కాజీపేట–బల్లార్షా మూడో లైనుకు ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు. మరోవైపు అక్కన్నపేట–మెదక్ రైలు మార్గం ఈఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్‌కు మార్గంలోనూ మనోహరాబాద్–గజ్వేల్ వరకు ట్రయల్ రన్‌కు అధికారులు సిద్ధమవుతుండటం శుభసూచకం. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ జాన్ థామస్ బడ్జెట్ వివరాలు వెల్లడించారు. కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు.. 1. మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టుకు రూ.200 కోట్లు 2. మునీరాబాద్–మహబూబ్‌నగర్ మార్గానికి రూ.275 కోట్లు 3. భద్రాచలం–సత్తుపల్లి లైన్‌కు రూ.405 కోట్లు 4. కాజీపేట–బల్లార్షా మూడో లైన్‌కు రూ.265 కోట్లు 5. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్‌కు రూ.200 కోట్లు 6. కాజీపేట–విజయవాడ మూడోలైన్‌కు రూ.110 కోట్లు 7. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ ఫేజ్–2కు రూ.20 కోట్లు 8. చర్లపల్లి శాటిలైట్ స్టేషన్‌కు రూ.5 కోట్లు 9. కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌కు రూ.10 కోట్లు 10. మౌలాలిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైల్వే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు తీరని కలలు... 1980 నుంచి తీరని కలగా మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈసారి కూడా మోక్షం దక్కలేదు. కాజీపేటను డివిజన్‌గా మార్చాలన్న డిమాండ్, లాలాగూడలో మెడికల్ కాలేజీ నిర్మించాలన్న డిమాండ్ ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి, వట్టినాగులపల్లి టెర్మినళ్ల నిర్మాణం ఇంకా సాకారం కావడం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించడంలో జాప్యం చేస్తున్నందునే ఇది ఆలస్యమవుతోంది. ఈ సర్వే పనులకు టెండర్లు పిలుస్తారా? 1. పటాన్చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్ 95 కిలోమీటర్లు 2. నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ రూ.125 కోట్లు 3. కరీంనగర్–హుజూరాబాద్–ఎల్కతుర్తి: 60 కిమీ ‘ఓట్ల కోసమే ఈ బడ్జెట్ ’ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఓట్ల కోసమే పెట్టినట్టుందని కాంగ్రెస్ ఆరోపించింది. పేదలను వదిలి వ్యాపారుల మన్ననలు పొందేలా ఉన్న ఈ బడ్జెట్‌తో బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని మరోమారు తేలిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కిసాన్‌సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలసి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్నును మినహాయించినట్టు ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. బడాబాబులకు ఐటీ తగ్గించి పేదలను పట్టించుకోకుండా అంకెలు చూపెట్టారని, మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దెదింపేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ త్వరలో జరిగే సాధారణ ఎన్నికలకు ప్రచారం మాదిరిగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ద్వారా గతంలో తాను ప్రవేశపెట్టిన అన్ని పథకాలు విఫలమైనట్లుగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అయిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, మద్దతు ధర, ఈనామ్ లాంటివన్నీ విఫలమవడంతో ఇప్పుడు కొత్తగా రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ముందుకొచ్చారని విమర్శించారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు మంచిదని పేర్కొన్నారు. అయితే, దీన్ని గత ఐదేళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎన్నికల కోణంలో ఉందన్నారు.