సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరులను ప్రధాని మోదీ అవమానించారు. ఆత్మ గౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాజకీయంగా విమర్శలకు వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
కాగా, రేపు(ఆదివారం) పరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. తెలంగాణకు ఒక గీతం ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే రాష్ట్ర గీతం ఆవిష్కరిస్తాము. ఈ సందర్భం రాజకీయంగా విమర్శలకు వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలి. తెలంగాణ అమరులను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు.
అలాగే, సుష్మాస్వరాజ్ సేవలు మేము మార్చుపోము. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా మేము ఆహ్వానం పంపాము. మాకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక అందలేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ప్రదాత. సోనియా వస్తారనే నమ్మకం ఉంది. రాష్ట్ర చిహ్నంపై గతంలో ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిరసన చెప్పు కోవచ్చు. మా ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పదేపదే పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment