సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే మాజీ సీఎం కేసీఆర్(KCR) రేపు అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలని కోరారు. ఇదే సమయంలో కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత(kavitha) తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో కుల గణన చేస్తామని మాట ఇచ్చాం.. చేసి చూపించామని కామెంట్స్ చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తారు. మేం కమిటీ రిపోర్టును బీరువాలో, ఫ్రిడ్జ్ ఏమీ పెట్టం. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలని వదిలిన వారూ ఉన్నారు. సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలని వివరాలు ఇవ్వలేదు. కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియచేయాలి.
బలహీన వర్గాల కోసం రేపు అసెంబ్లీలో అన్ని పార్టీలు తమ వాదన వినిపించాలి. కులగణన ఒక ఉద్యమంలాగా చేశాం. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలింది. కేబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. కులగణన చేస్తామని మాట ఇచ్చాం.. చేసి చూపించాం. కులగణన అడ్డుకుంటే ఊరుకునేది లేదు. నిర్ణయం నుండి నివేదిక దాకా కులగణన ప్రక్రియలో చేసినందుకు గర్వంగా ఉంది. బీసీ సోదరులందరూ రేపు ఉత్సవాలు జరపండి అని వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: కులగణనపై కవిత కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment