మార్పుచేర్పులకు మంత్రి పొన్నం మేథోమధన సదస్సు
ఇతర వర్గాలకు ఇచ్చినట్లే బీసీలకూ ప్రయోజనాలు కల్పించాలని సూచనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ– 2024 పాల సీలో ఇతర వర్గాలకు ఇ చ్చిన మాదిరిగా బీసీల కూ ప్రయోజనాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో మంగళవారం సెక్రటేరియట్ కాన్ఫ రెన్స్ హాల్‌లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరా వుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేధావులు, రిటైర్డ్ ఐఎఎస్‌లు, బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పారిశ్రామిక వేత్తలతో మేథోమధన సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఎంఎస్‌ఎంఈ రిటైర్డు జాతీయ డైరెక్టర్ ఆఫ్ జనరల్ చుక్కా కొండయ్యతో పా టు రిటైర్డు ఐఎఎస్‌లు, మేధావులు, పారిశ్రామి కవేత్తలతో కలిపి కమిటీ వేయాలని నిర్ణయించారు.
ఎంఎస్‌ఎంఈలో బీసీలకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు వారి సలహా సూచనలు తీసుకొని అందులో చేర్చాల్సిన అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కేశవ రావు మాట్లాడుతూ బీసీలకు సబ్సిడీలు కల్పిస్తే వారితో పారిశ్రామికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎంఎస్‌ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు ఇతర అంశాలు చేరిస్తే లక్షలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు స్వత హాగా కులవృత్తులు ఆధునిక సాంకేతికతతో ఆర్థికవృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబం ఒక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. ఎంపీ అనిల్‌కుమార్ యాద వ్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, కమిషనర్ బాల మాయాదేవి, రిటైర్డు ఐఎఎస్ లు చిరంజీవులు, చోలేటి ప్రభాకర్, దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని, బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలను ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు సందర్శించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ కోరారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వ హించి బీసీ సంక్షేమ శాఖలో ఉన్నా సమస్యలపై చర్చించారు. బీసీ సంక్షేమ శాఖలో ఉన్న సమ స్యలపై చర్చించారు. అధికారులు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురు కులాలు సందర్శిస్తానని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాల మాయా దేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment