MSME
-
జీడీపీలో ఎంఎస్ఎంఈ వాటా పెంపునకు ఏఐ తోడ్పాటు
రాంచి: స్థూల ఉత్పాదకతలోనూ, ఉపాధి కల్పనలోనూ కీలక భూమిక పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) పాత్రను కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) మరింత ఇనుమడింపజేస్తాయని ‘ఆఫ్‌బిజినెస్’ తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో 30 శాతం ఎంఎస్ఎంఈ రంగం నుంచే సమకూరుతుండగా.. ఏఐ, ఎంఎల్(మెషిన్ లెర్నింగ్) సాయంతో వీటి ఉత్పాదకత వాటాను 50 శాతానికి చేర్చొచ్చని అంచనా వేసింది.ఈ రంగంలో ప్రస్తుతం 11 కోట్లుగా ఉన్న ఉపాధి అవకాశాలను 17.5 కోట్లకు పెంచొచ్చని బీ2బీ ఈ కామర్స్ సంస్థ అయిన ఆఫ్‌బిజినెస్ తన తాజా నివేదికలో తెలిపింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేయగలదని పేర్కొంది. ఎస్ఎంఈల్లో చాలా వరకు తమ ఉత్పత్తిని పెంచుకునేందుకు ఏఐ, ఎంఎల్ అప్లికేషన్లను తమ కార్యకలాపాల్లో అమలు చేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది. ముడి సరుకుల కొనుగోళ్లు, అనుసంధానత, పంపిణీ నెట్వర్క్, వినూత్నమైన ఉత్పత్తులు, సిబ్బందికి శిక్షణ, వ్యర్థాల నిర్వహణ, మరీ ముఖ్యంగా సమయ నిర్వహణలో ఏఐ, ఎంఎల్ ఎంఎస్ఎంఈలకు సాయపడతాయని వెల్లడించింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్ సమ్మె సైరన్ఏఐ ప్లాట్‌ఫామ్‌ల సాయం..ఎస్ఎంఈలకు ‘బిడ్అసిస్ట్’ తరహా ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు అవసరమని.. ఇది వివిధ ప్రభుత్వ విభాగాల్లో 50 లక్షల మేర టెండర్ల సమాచారాన్ని అందిస్తుందని ఆఫ్‌బిజినెస్ నివేదిక తెలిపింది. అలాగే ‘నెక్సిజో.ఏఐ’ అన్నది ఎప్పటికప్పుడు తాజా కమోడిటీ ధరల పమాచారాన్ని, ఆయా వ్యాపారాలకు అనుగుణమైన టెండర్ల గురించి తెలియజేస్తుందని పేర్కొంది. ఎస్ఎంఈలు తమ మెటీరియల్స్‌ను దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అనుసంధానత కీలకమని తెలిపింది. ఎంఎస్ఎంఈలు కీలక విభాగాల్లో ఎదుర్కొంటున్న ఆందోళనల పరిష్కారానికి వీలుగా ఇంజినీరింగ్ కాలేజీలు, మేనేజ్మెంట్ కాలేజీలు, మానవ వనరుల సంస్థలను వీటితో అనుసంధానించాలని సూచించింది. -
ఎస్ఎంఈ ఐపీఓలు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూలకు నిబంధనలను కఠినతరం చేసింది. వీటిలో భాగంగా లాభదాయకత అంశాన్ని ప్రవేశపెట్టింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) పరిమితిని 20 శాతానికి పరిమితం చేసింది. ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూనే పటిష్ట పనితీరు సాధిస్తున్న ఎస్ఎంఈల నిధుల సమీకరణకు అండగా నిలిచే లక్ష్యంతో సంస్కరణలకు సెబీ తెరతీసింది. గత క్యాలెండర్ ఏడాదిలో ఎస్ఎంఈ ఐపీఓలు, ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ భారీగా పెరిగిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. లాభదాయకత అంశానికివస్తే పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న ఎస్ఎంఈ గత మూడేళ్లలో కనీసం రెండేళ్ల పాటు రూ. కోటి చొప్పున నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించి ఉండాలి. మొత్తం ఇష్యూ పరిమాణంలో 20 శాతానికి మించి వాటాదారులు షేర్లను విక్రయించేందుకు అనుమతించరు. ఇదేవిధంగా వాటాదారుల హోల్డింగ్స్‌లో 50 శాతానికి మించి ఆఫర్ చేసేందుకు వీలుండదు.నిధుల వినియోగమిలాసంస్థాగతేతర ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపులో మెయిన్ బోర్డ్ ఐపీఓ నిబంధనలే ఎస్‌ఎంఈలకూ వర్తించనున్నాయి. కనీస దరఖాస్తు పరిమాణాన్ని రెండు లాట్లకు సెబీ కుదించింది. తద్వారా అనవసర స్పెక్యులేషన్‌కు చెక్ పెట్టనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఐపీఓ నిధుల్లో 15 శాతం లేదా రూ. 10 కోట్లవరకూ(ఏది తక్కువైతే) మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తారు. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, సంబంధిత పార్టీల నుంచి తీసుకున్న రుణ చెల్లింపులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఐపీఓ నిధులు వెచ్చించేందుకు అనుమతి ఉండదు. ప్రమోటర్ల కనీస వాటాకుపైన గల ప్రమోటర్ హోల్డింగ్‌కు దశలవారీ లాకిన్ గడువు వర్తిస్తుంది. అధికంగా ఉన్న ప్రమోటర్ వాటాలో ఏడాది తరువాత 50 శాతం, రెండేళ్ల తదుపరి మిగిలిన 50 శాతానికి గడువు ముగుస్తుంది. పబ్లిక్కు అందుబాటుఎస్ఎంఈలు సెబీకి దాఖలు చేసిన ఐపీఓ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను 21 రోజులపాటు పబ్లిక్కు అందుబాటులో ఉంచాలి. వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేయాలి. సులభంగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను సైతం వినియోగించాలి. ఎస్ఎంఈ ఎక్సే్ఛంజ్, కంపెనీ వెబ్సైట్, మర్చంట్ బ్యాంకర్.. సంబంధిత డీఆర్హెచ్పీపై పబ్లిక్ స్పందనకు వీలు కల్పించాలి. ఎస్ఎంఈలు ఐపీఓ తదుపరి మెయిన్ బోర్డులోకి చేరకుండానే నిధుల సమీకరణ చేపట్టాలంటే సెబీ(ఎల్‌వోడీఆర్) నిబంధనలు పాటించవలసి ఉంటుంది. చెల్లించిన మూలధనం రూ. 25 కోట్లకు మించవలసి ఉంటుంది. రైట్స్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, బోనస్ షేర్ల జారీ తదితరాలు ఈ విభాగంలోకి వస్తాయి. గత రెండేళ్లలో ఎస్ఎంఈ ఐపీఓలు భారీగా ఎగసిన నేపథ్యంలో సెబీ నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు ఉపక్రమించింది. 2024లో ఐపీఓల ద్వారా 240 చిన్న, మధ్యతరహా సంస్థలు రూ. 8,700 కోట్లు సమీకరించాయి. అంతక్రితం 2023లో సమకూర్చుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకావడం ప్రస్తావించదగ్గ అంశం!! -
త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు..
కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ కార్డులను (Credit Cards) సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులు త్వరలో అందుకోనున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025-26) హామీ ఇచ్చినట్లుగా మైక్రో ఎంట్రాప్రెన్యూర్లకు రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది.ఈ సౌకర్యం రాబోయే కొన్నేళ్లలో సూక్ష్మ-యూనిట్లకు అదనంగా రూ. 30,000 కోట్ల నిధులను అందించగలదు. ఇది వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి, క్రెడిట్ కార్డు అందుకునేందుకు చిరు వ్యాపారులు నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి అర్హత ప్రమాణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..క్రెడిట్ కార్డు లిమిట్, షరతులురూ. 5 లక్షల లిమిట్ కలిగిన ఈ క్రెడిట్ కార్డ్.. చిరు దుకాణాలను, చిన్న తరహా తయారీ పరిశ్రమలను నిర్వహించేవారికి అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుల యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వ్యాపార పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. రూ. 10-25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.దరఖాస్తు ప్రక్రియప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి, దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమ్ (Udyam) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. పోర్టల్‌లో నమోదుకు ఈ దశలు పాటించండి..» అధికారిక ఉద్యమ్ పోర్టల్ msme.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. » 'క్విక్ లింక్స్' పై క్లిక్ చేయండి.» 'ఉద్యమ్ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి.» రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించండి. -
పీఎమ్ఈజీపీ రుణాలు..: పెన్నుల నుంచి పాలిమర్స్ దాకా...
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్.పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. 2008లో మొదలైన ఈ పథకం గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి కల్పించి వారి ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎమ్ఎస్ఎమ్ఈ (MSME) పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ కేవీఐసీ ద్వారా ఇది అమలవుతోంది. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రుణసౌకర్యం అందుతోంది. అభ్యర్థులు పది శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సహాయాన్ని పొందవచ్చు. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ ఆర్మీ సిబ్బంది మాత్రం అయిదు శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకులు 95 రుణాన్ని అందిస్తాయి. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ఫిజికల్లీ చాలెంజ్డ్, ట్రాన్స్‌జెండర్స్, గ్రామీణ ప్రాంతం వారికి 35 శాతం రాయితీ కూడా లభిస్తుంది. జనరల్ కేటగిరీలోని వారికేమో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతంలో 25 శాతం సబ్సిడీ కేటాయించారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి... ముందుగా అభ్యర్థులు పీఎమ్ఈజీపీ పోర్టల్‌లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అందులో వివరాలను స్పష్టంగా, పూర్తిగా నింపాలి. తర్వాత దాన్ని గ్రామీణప్రాంతాలవారైతే కేవీఐసీకి, పట్టణ ప్రాంతం వారైతే డీఐసీకి అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో అధికారుల నుంచి స్పందన ఉంటుంది. అధికారుల తనిఖీ అనంతరం వారి సూచన మేరకు.. కేంద్రప్రభుత్వ సంస్థలు ఇస్తున్న ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ శిక్షణ తీసుకోవాలి. ఆ శిక్షణకు సంబంధించిన పరీక్ష కూడా పాసై, సర్టిఫికెట్ పొందాలి. అర్హతలు... 18 ఏళ్లు నిండి, కనీసం ఎనిమిదవ తరగతి పాసై ఉండాలి. స్వయం సహాయక బృందాలు కూడా అర్హులే! ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సిన పత్రాలు... 1. వ్యాపారానికి సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్, 2. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సహా వివరాలు నమోదు చేసిన అప్లికేషన్ ఫామ్, 3. ఐడీ, అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్, 4. శిక్షణ పొందిన ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ప్రోగ్రామ్ సర్టిఫికెట్. 5. ఎక్స్‌పీరియెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్. వ్యాపారాలు... పేపర్ నాప్కిన్స్, పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్.. అనుబంధ ఉత్పత్తులు, నాన్ ఓవెన్ బ్యాగ్స్, పెన్నుల తయారీ, షాంపూ, డిటర్జెంట్లు, ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ తయారీ, ΄్యాక్డ్ వాటర్, ఎల్ఈడీ లైట్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ పరికరాలు, రసాయన పాలిమర్లు, టెక్స్టైల్స్, ఫారెస్ట్ ఇండస్ట్రీ వంటివాటికీ ఈ పథకం కింద రుణాలు పొందవచ్చు. గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయాధారిత, పాడి, వర్తక విభాగాల్లోనూ దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2022– 2025 మధ్య కాలంలో ఈ పథకానికి 13,554.42 కోట్ల రూపాయలను కేటాయించారు.– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
మహిళలూ, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా?
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ముద్ర లోన్స్ఈ వారం స్కీమ్ ‘ముద్ర లోన్స్’.ప్రాథమిక అర్హతలు కలిగిన పేద, మహిళలందరూ స్వల్ప వ్యవధిలో సూక్ష్మ, చిన్నతరహా వ్యావపారాలు మొదలుపెట్టేలా ప్రత్సహించే పథకమే ‘ముద్ర లోన్స్’. 2015, ఏప్రిల్‌లో ప్రారంభమైన కేంద్రప్రభుత్వ పథకమిది. ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్’ద్వారా ప్రభుత్వమే రుణ గ్యారంటీ సదుపాయాన్ని కల్పిస్తోంది. రూ. 20 లక్షల వరకు లోన్ దొరుకుతుంది. దీన్ని గ్రామీణ, వాణిజ్య, కో–ఆపరేటివ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి పొందదవచ్చు. ఈ రుణాలను మూడు విభాగాల్లో అందిస్తారు. శిశు: 50 వేల రూపాయల వరకు రుణం అందుతుంది. అతి చిన్న, వీథి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలకు అనుకూలమైనది. ఇందులో అత్యధికంగా 44 వేల 891 కోట్ల రూపాయల వరకు రుణాలు అందించారు. కిశోర: దీనికింద రూ. 50 వేల నుంచి అయిదు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. పూచీకత్తు అవసరం లేదు. తరుణ: రూ. 5 లక్షల పైబడి పది లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. లబ్ధి పొంది, రుణాన్ని విజయవంతంగా తిరిగి చెల్లిస్తున్నవారు అదనంగా మరో 20 లక్షల రూపాయల వరకు ‘తరుణ్ ప్లస్’ రుణాన్ని పొంది, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశమూ కల్పిస్తోంది ఇది. కనీస అర్హతలు: రుణాల్లో ఎగవేత రికార్డ్ ఉండకూడదు. క్రెడిట్ ట్రాక్ బాగుండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అవసరం. దరఖాస్తుతో ఆధార్, పాన్‌కార్డ్, ఓటరు ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఏడాది బ్యాంక్ స్టేట్మెంట్, వ్యాపారానికి సంబంధించిన స్కిల్ సర్టిఫికెట్‌ను జత చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలయితే క్యాస్ట్ సర్టిఫికెట్‌నూ పెట్టాలి. తరుణ్ ప్లస్ లోన్‌కి ఐటీఆర్ కూడా పొందుపరచాలి. ఇదీ చదవండి : Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి! 18 ఏళ్లు పైబడి 60 ఏళ్లలోపు వారందరూ అర్హులే! మంచి వ్యాపార ప్రణాళికతో బ్యాంకులను సంప్రదించాలి. బ్యాంకువారు.. మనం వ్యాపారం పెట్టాలనుకుంటున్న ప్రాంతం, వ్యాపార వృద్ధికి అక్కడున్న అవకాశాలను బట్టి ఎంత రుణమివ్వాలో నిర్ణయిస్తారు. తీసుకున్న రుణాన్ని అయిదేళ్లలోపు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. సబ్సిడీ సదుపాయం లేదు. కానీ టాప్ అప్, సీసీ లోన్స్‌ను పొందే వీలుంటుంది. దీనికి వస్తు ఉత్పత్తి, మార్కెట్, సేవారంగాల్లో మంచి అవకాశాలున్నాయి. కూరగాయల అంగళ్లు, విస్తరాకుల తయారీ, పేపర్ కప్స్, సారీ రోలింగ్, లాండ్రీ, కిరాణా షాప్స్, కర్రీపాయింట్స్, పిండి మరలు, జిరాక్స్, ఇంటర్నెట్, డయాగ్నస్టిక్స్, స్టేషనరీ నుంచి ఆటో, క్యాబ్, ట్రాక్టర్, వరికోత మిషన్లు, జేసీబీల దాకా దేనికైనా రుణాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి వంటివాటి మీద MSME,DIC, బ్యాంకింగ్ రంగాల వారు అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం కూడా శిక్షణ కార్యక్రమాలనూ చేపడుతోంది.-బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
ఆశల పల్లకీలో ఎంఎస్ఎంఈలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ 2025–26 బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (ఎంఎస్ఎంఈ) ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల పరిధిని కొత్తగా నిర్వచించడంతోపాటు రుణ పరిమితిని రెట్టింపు చేశారు. దీంతో వచ్చే ఐదేళ్లలో ఎంఎస్ఎంఈలకు దేశవ్యాప్తంగా రూ.లక్షన్నర కోట్లు అదనంగా రుణాలు లభించే అవకాశం ఏర్పడింది. తెలంగాణలోనూ రుణ లభ్యత పెరగడంతోపాటు కొత్తగా అనేక సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రంలో 2015 నాటికి 26.05లక్షల ఎంఎస్ఎంఈలు ఉండగా, టీజీ ఐపాస్ పోర్టల్‌లో నమోదవుతున్న వివరాల ప్రకారం వీటి వృద్ది రేటు 11 నుంచి 15 శాతం వరకు ఉంటోంది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే 40శాతం మేర ఉన్నాయి.ఎంఎస్ఎంఈలతో సుమారు 33లక్షల మంది ఉపాధి పొందుతుండగా, సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజాధారిత పరిశ్రమల్లోనే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు భూమి, నిధులు, ముడి సరుకులు, కార్మికులు, సాంకేతికత, సరైన మార్కెటింగ్ వసతులు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిధుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లే ఎంఎస్ఎంఈలు కొల్లేటరల్ సెక్యూరిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎంఎస్ఎంఈ రుణాల కోసం డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. నిర్వహణ వ్యయం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నా సరైన సమాచారం లేకపోవడం, ఇతర నిబంధనలతో సకాలంలో ఎంఎస్ఎంఈలకు నిధులు అందుబాటులోకి రావడం లేదు. కొల్లేటర్ సెక్యూరిటీ లేకుండా రుణపరిమితిని రెట్టింపు చేసి రూ.10 కోట్లకు పెంచారు.ప్రగతిశీల, పురోగామి బడ్జెట్ ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక అనుకూల ప్రగతిశీల, పురోగామి బడ్జెట్ ఇది. టారిఫ్ రేట్ల విధానంలో మార్పులతో దేశీయంగా తయారీ రంగానికి ఊతం లభిస్తుంది. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్’ద్వారా లిథియం, కోబాల్ట్ వంటి అనేక ఖనిజాలు దేశ ఆర్థిక పురోగతిలో కీలకంగా మారడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. తద్వారా లిథియం, ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని ప్రోత్సహిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరం. నైపుణ్య శిక్షణ రంగానికి కూడా బడ్టెట్‌లో పెద్ద పీట వేశారు. –సురేశ్ కుమార్ సింఘాల్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు నిధుల లభ్యత పెరుగుతుంది ఎంఎస్ఎంఈల్లో సులభతర విధానాలకు బాటలు వేసేలా బడ్జెట్ ఉంది. రుణ లభ్యత పెరగడంతో రూ.5 లక్షల విలువ చేసే క్రెడిట్ కార్డులను 10 లక్షల మందికి జారీ చేయాలనే నిర్ణయాన్ని ఆహా్వనిస్తున్నాం. ఇది ఎంఎస్ఈలకు నిర్దేశిత వడ్డీపై ఎప్పుడైనా రుణ మొత్తాన్ని ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకుల దిగుమతి సులభతరమవుతుంది. స్టార్టప్‌ల రుణ పరిమితి కూడా రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచడాన్ని ఆహా్వనిస్తున్నాం. – కొండవీటి సుదీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు -
కొత్త ఏడాదిలో 10 లక్షల కొలువులు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ఉద్యోగాల కల్పనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి అధునాతన సాంకేతికత కూడా ఈ అంశాన్ని ప్రభావితం చేస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కొత్త ఏడాదిలో తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన జోరందుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐటీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క తెలంగాణలోనే వివిధ రంగాల్లో పది లక్షల మేర సాధారణ ఉద్యోగాల కల్పన సాధ్యమని అంటున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలతో పాటు రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల విభాగం అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని అంటున్నారు. గత ఏడాదిలో తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.8 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గగా, 2025లో ఇది మరింత తగ్గుతుందని వివిధ నివేదికలు వెల్లడిస్తుండటం గమనార్హం. పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2024 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చినట్లు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం ప్రకటించింది. 2023తో పోలిస్తే ఎఫ్‌డీఐల్లో 33 శాతం వృద్ధి నమోదు కాగా, రూ.3,185 కోట్లు అదనంగా వచ్చాయి. 2024లో వచ్చిన ఎఫ్‌డీఐల్లో 93 శాతం అంటే రూ.11,970 కోట్లు హైదరాబాద్‌కు రాగా, రంగారెడ్డి జిల్లాకు రూ.680 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.116 కోట్లు, మెదక్‌కు 96.99 కోట్లు వచ్చాయి. ఇదేవిధంగా ఎఫ్‌డీఐల రాక కొత్త ఏడాది కూడా కొనసాగుతుందని, ఉద్యోగాల కల్పనకు ఇవి కీలకంగా మారతాయని అధికార వర్గాలంటున్నాయి. ఐటీ రంగంలో గడిచిన రెండేళ్లుగా నెలకొన్న మాంద్యం, భారత్‌లో ఎన్నికల వాతావరణం తదితర కారణాలతో ఉద్యోగ నియామకాలకు దూరంగా ఉన్న అమెరికా, ఐరోపా కంపెనీలు ఈ ఏడాది జరిపే నియామకాల్లో తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. జీసీసీలకు కేంద్రంగా తెలంగాణ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటు ద్వారా ఉద్యోగాల కల్పన భారీగా సాధ్యమవుతుందనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీసీసీలను ఆకర్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ, పుణే, ముంబయి, చెన్నై వంటి దేశంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. భారత సాంకేతిక వాతావరణం, ఉద్యోగాల కల్పన, మార్కెట్ వృద్ధి, సామర్థ్యాల పెంపుదల తదితరాల్లో 2030 నాటికి ఈ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఐదేళ్లలో భారత్‌లో ఏర్పాటైన జీసీసీల్లో 30 శాతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 355 జీసీసీలు ఉండగా, సాఫ్ట్వేర్/ఇంటర్నెట్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, సెమికండక్టర్, ఫార్మా స్యూటికల్స్, రిటైల్, మెడికల్ డివైసెస్, టెలీ కమ్యూనికేషన్స్, బీఎఫ్ఎస్ఐ, ఆటోమేటివ్, వృత్తిపరమైన సేవల రంగాల్లో కొత్త జీసీసీల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే జీసీసీలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లోనూ ఏర్పాటు చేయాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సరీ్వస్ కంపెనీస్ (నాస్కామ్) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దేశంలోని జీసీసీల్లో పనిచేస్తున్న 19 లక్షల మంది ఉద్యోగుల్లో 12 శాతం మంది తెలంగాణకు చెందిన నిపుణులే ఉండటం గమనార్హం. ఇది వచ్చే రెండేళ్లలో 15 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఎంఎస్ఎంఈలదీ పెద్ద పాత్రే.. ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ద్వారా రాష్ట్రంలో 5.6 లక్షల మంది ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా ఈ ఏడాది ఈ రంగంలో ఉద్యోగాల కల్పన 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెప్తున్నారు. -
ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణ వితరణ
న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలు పొందడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కోరారు. ఎంఎస్ఎంఈలకు ప్రత్యామ్నాయ రుణ వితరణ నమూనాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రతిపాదిత పారిశ్రామిక పట్టణాల్లో ఎంఎస్ఎంఈలకు స్థలాలు కేటాయిస్తామన్నారు.‘‘బ్యాంకు రుణాల విషయంలో ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పండి. అధిక తనఖాలు కోరుతున్నాయా? ఎగుమతుల రుణ హామీ కార్పొరేషన్ (ఈసీజీసీ) ఉన్నప్పటికీ, బ్యాంక్‌లు తనఖా ఇవ్వాలని అడుగుతున్నాయా? ఎగుమతి రుణాల్లో వైఫల్యాలు ఎదురైతే 90 శాతం హామీ బాధ్యతను ఈసీజీసీ తీసుకుంటున్న తరుణంలో బ్యాంక్‌లు రుణాలపై ఎంత మేర వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి? అంశాల వారీ మరింత స్పష్టమైన సమాచారం పంచుకుంటే దాన్ని బ్యాంక్‌ల దృష్టికి తీసుకెళ్లగలం. ఇప్పటికీ బ్యాంక్‌లకు వెళ్లి రుణాలు తీసుకునేందుకుకే అధిక శాతం ఆసక్తి చూపిస్తున్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ రుణ నమూనా ఆలోచనల పట్ల అనుకూలంగా ఉన్నాం’’అని గోయల్ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా చెప్పారు. స్థలాలు కేటాయిస్తాం.. ఎంఎస్ఎంఈలు లేకుండా పెద్ద పరిశ్రమలు మనుగడ సాగించలేవని వాణిజ్య మంత్రి గోయల్ పేర్కొన్నారు. కనుక వాటికంటూ ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో షెంద్రాబిడ్కిన్ పారిశ్రామిక టౌన్షిప్లో టయోటా రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా సుమారు 100 ఎంఎస్ఎంఈల అవసరం ఉంటుంది’’అని వివరించారు. -
ఎంఎస్ఎంఈలకు కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని అసోచామ్ డిమాండ్ చేసింది. ఆర్బీఐ అంబుడ్స్‌మన్ తరహాలో ఇది ఉండాని.. పలు శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఈ పోర్టల్ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం ఉండాలని కోరింది. ఫిర్యాదుల దాఖలు, పరిష్కారం విషయంలో ఎంఎస్ఎంఈలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంటూ ఈ కీలక సూచన చేసింది. వ్యాపార నిర్వహణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈగ్రోవ్ ఫౌండేష్ సాయంతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సమస్యల పరిష్కారం, వాటి బలోపేతానికి సూచనలతో ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే లక్ష్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక, కార్యాచరణను ఈ నివేదిక తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని మన ఎంఎస్ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంక్‌లు, దిగ్గజ కంపెనీల నుంచి మద్దతు అవసరం’’అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నయ్యర్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు కార్పొరేట్ ఆదాయపన్ను రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, సులభతర జీఎస్టీ వ్యవస్థను తీసుకురావాలని అసోచామ్ కోరింది. కేంద్రీకృత పోర్టల్.. ఎంఎస్ఎంఈల నమోదు, వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ తీసుకురావాలని అసోచామ్ తన నివేదికలో కోరింది. జీఎస్టీ రిజి్రస్టేషన్, నిబంధనల అమలు ప్రక్రియలను సైతం సులభతరంగా మార్చాలని పేర్కొంది. స్పష్టమైన నిబంధనలతో మద్దతుగా నిలవాలని కోరింది. సహేతుక కారణాలున్నప్పటికీ సకాలంలో జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్, చెల్లింపులు చేయని ఎంఎస్ఎంఈలపై కఠిన జరిమానాలు విధిస్తున్నట్టు పేర్కొంది. జాప్యం తీవ్రత, కారణాలకు అనుగుణంగా పెనాల్టీలో మార్పులు ఉండాలని సూచించింది. జరిమానాలు ఎంఎస్ఎంఈలకు భారంగా మారరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలంటే వ్యాపార నమూనాలో నిర్మాణాత్మక మార్పు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. ‘‘ఈ నిర్మాణాత్మక మార్పులో ఎంస్ఎంఈలు భాగంగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్‌లో ఎంఎస్ఎంఈలు గొప్ప పాత్ర పోషించాలి. మా అధ్యయనం ఇదే అంశాన్ని బలంగా చెప్పింది’’అని సూద్ వివరించారు. పెరుగుతున్న కారి్మక శక్తికి ఎంఎస్ఎంఈలు పరిష్కారం చూపించగలవని, ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించగలవని ఈగ్రోవ్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్‌సింగ్ అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల మాదిరే ప్రతీ రాష్ట్రంలోనూ ఎంఎస్ఎంఈ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా సమన్వయ మండలిని ఏర్పాటు చేసి, పథకాల అమలు సాఫీగా సాగేలా చూడాలని, రాష్ట్రాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీలో 30 శాతం వాటా, తయారీ రంగంలో 45 శాతం వాటా, ఎగుమతుల్లో 46 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక గుర్తు చేసింది. -
చిన్నతరహా పరిశ్రమల్లో విశాఖ దూకుడు
సాక్షి, అమరావతి: కొత్త ఎంఎస్ఎంఈల ఏర్పాటులో రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. గత ఏడాది (2023–24)లోనే రాష్ట్రంలో కొత్తగా 2,71,341 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా రూ.8,286.46 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు సామాజిక ఆర్థిక సర్వే–2024 వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన యూనిట్ల ద్వారా 19,86,658 మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 1.90 లక్షలుగా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య గడచిన ఐదేళ్ల కాలంలో వేగంగా విస్తరించడం ద్వారా 10 లక్షలు దాటింది. గడచిన ఏడాది కొత్త ఎంఎంస్ఎంఈల ఏర్పాటులో విశాఖ జిల్లా మంచి దూకుడు కనబర్చినట్టు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రూ.648.40 కోట్ల పెట్టుబడితో కొత్తగా 16,505 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.477.56 కోట్లతో గుంటూరు జిల్లా (16,085 యూనిట్లు), రూ.526.13 కోట్లతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు (15,910 యూనిట్లు), రూ.491.88 కోట్లతో కృష్ణా (14,729 యూనిట్లు), రూ.313.84 కోట్లతో అనంతపురం (14,280 యూనిట్లు) జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 968 యూనిట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,213 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఉపాధి కల్పనలో కర్నూలు ఫస్ట్ప్రతీ రూ.కోటి పెట్టుబడికి 8.75 మందికి ఉపాధి కల్పించడం ద్వారా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 2023–24 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో రూ.266.11 కోట్ల పెట్టుబడితో 12,256 యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా 2,33,019 మందికి ఉపాధి లభించినట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో చిత్తూరు జిల్లా 1,72,276 మందికి ఉపాధి కల్పించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ప్రతీ రూ.కోటి పెట్టుబడికి 5.79 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రం మొత్తం మీద చూస్తే 2023–24లో ప్రతీ రూ.కోటి పెట్టుబడికి కేవలం 2.39 మందికి ఉపాధి లభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల విలువ పరంగా చూస్తే రూ.648 కోట్ల ఎంఎస్ఎంఈ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గడచిన ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ 2023–27 ద్వారా ఎంఎంస్‌ఎంఈలను అంతర్జాతీయంగా ఎదిగే విధంగా అనేక ప్రోత్సహకాలు ఇవ్వడమే కాకుండా ఎంఎంస్ఎంఈ క్లస్టర్ పోగ్రాం, ఎంఎస్ఎంఈలను పటిష్టం చేసేవిధంగా ర్యాంప్ పథకం, టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు సర్వేలో ప్రముఖంగా పేర్కొన్నారు. -
ఏ హామీ లేకుండానే లోన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని త్వరలోనే కేబినెట్ ముందు ఉంచుతామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.బెంగళూరులో జరిగిన నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ స్కీమ్ గురించి వెల్లడించారు. ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎంఎస్ఎంఈలకు ఏకంగా రూ. 100 కోట్ల వరకు రుణాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఈ పథకానికి కేంద్ర మంత్రి మండలి అనుమతి దక్కితే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ.. బ్యాంకుల ద్వారా లోన్ అందిస్తుంది. కేంద్రం అందించే ఈ లోనుకు ఎలాంటి హామీ అవసరం లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.ఎంఎస్ఎంఈలు బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్‌ను పొందవచ్చు. కానీ వారికి టర్మ్ లోన్లు, ప్లాంట్.. మెషినరీ కోసం లోన్ లభించడం లేదని ఈ సందర్భంగా సీతారామన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టనున్న కొత్త పథకం ద్వారా.. ప్లాంట్స్, యంత్రాలకు కూడా లోన్స్ అందించనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: రతన్ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీఎంఎస్ఎంఈ రంగంలో కర్ణాటక చేస్తున్న కృషిని సీరాటమన్ ప్రశంసిస్తూ.. రాష్ట్రంలో 35 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని, అవి 1.65 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందని, ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని ఆమె అన్నారు. -
ఎంఎస్ఎంఈ టీసీని తరలిస్తే ఉద్యమం
కడప కార్పొరేషన్: ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కొప్పర్తిలో కొనసాగించకపోతే ఉద్యమం తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో అఖిలపక్ష పార్టీ నేతలు, ప్రజా సంఘాలతో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత ఫోరం జిల్లా చైర్మన్ కిశోర్ బూసిపాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గాలిచంద్ర, జి.చంద్రశేఖర్, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ ఎస్ఏ సత్తార్, బీఎస్పీ జిల్లా ఇన్చార్జి ఎస్.గుర్రప్ప, వైస్సార్‌ఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.250కోట్లతో కొప్పర్తిలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తరలించడం దారుణమన్నారు. దీనివల్ల ఈ ప్రాంత యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పెద్ద దెబ్బ పడుతుందని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కూడా నష్టం జరుగుతుందన్నారు. వైఎస్సార్ జిల్లాపై కక్షసా«ధించడానికే సీఎం చంద్రబాబు ఇలా చేశారని మండిపడ్డారు. కలెక్టర్ లోతేటి శివశంకర్‌కు వినతిపత్రం సమరి్పంచారు. -
‘కడప, రాయలసీమపై చంద్రబాబు కక్ష సాధింపు’
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారని కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపు చంద్రబాబు నైజానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి సేజ్‌కు కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపుపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆయన మాట్లాడారు.‘‘ఇది సీమ యువత అవకాశాలను దెబ్బ తీయడమే. ప్రభుత్వం జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. దానికి కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపే నిదర్శనం’’ అని అన్నారు.కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్‌ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా నిలదీశారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను తీసుకెళ్ళిపోతున్నారు. పులివెందుల మెడికల్ సీట్లు వెనక్కి పంపారు. రాయలసీమ వాడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.కేంద్రం ఇక్కడి యువతకు ఇచ్చిన టెక్నాలజీ సెంటర్‌ను తరలించడానికి చంద్రబాబు ఎవరని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర ప్రశ్నించారు. ‘‘ ఇది క్షమించరాని నేరం. ఇలాంటి చర్యలు యువత అవకాశాలను దెబ్బ తీస్తాయి. ఈ అంశంపై అఖిలపక్షంగా పోరాడతాం’ అని అన్నారు.ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను తరలించడం అంటే సీమకు అన్యాయం చేయడమేనని కడప జిల్లా సీపీఎం కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ‘‘ ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం దారుణం. నైపుణ్యాలను రాయలసీమ యువతకు అందించాల్సిన అవసరం లేదా?. ప్రభుత్వం మారగానే ఇలా చేయడం సరికాదు’ అని అన్నారు.రౌండ్ టెబుల్ సమావేశానికి కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు. -
ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ– 2024 పాల సీలో ఇతర వర్గాలకు ఇ చ్చిన మాదిరిగా బీసీల కూ ప్రయోజనాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో మంగళవారం సెక్రటేరియట్ కాన్ఫ రెన్స్ హాల్లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరా వుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేధావులు, రిటైర్డ్ ఐఎఎస్‌లు, బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పారిశ్రామిక వేత్తలతో మేథోమధన సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఎంఎస్ఎంఈ రిటైర్డు జాతీయ డైరెక్టర్ ఆఫ్ జనరల్ చుక్కా కొండయ్యతో పా టు రిటైర్డు ఐఎఎస్‌లు, మేధావులు, పారిశ్రామి కవేత్తలతో కలిపి కమిటీ వేయాలని నిర్ణయించారు.ఎంఎస్ఎంఈలో బీసీలకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు వారి సలహా సూచనలు తీసుకొని అందులో చేర్చాల్సిన అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కేశవ రావు మాట్లాడుతూ బీసీలకు సబ్సిడీలు కల్పిస్తే వారితో పారిశ్రామికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు ఇతర అంశాలు చేరిస్తే లక్షలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు స్వత హాగా కులవృత్తులు ఆధునిక సాంకేతికతతో ఆర్థికవృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు.రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబం ఒక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. ఎంపీ అనిల్‌కుమార్ యాద వ్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, కమిషనర్ బాల మాయాదేవి, రిటైర్డు ఐఎఎస్ లు చిరంజీవులు, చోలేటి ప్రభాకర్, దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.విద్యావ్యవస్థలో సమూల మార్పులుసీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని, బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలను ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు సందర్శించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ కోరారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వ హించి బీసీ సంక్షేమ శాఖలో ఉన్నా సమస్యలపై చర్చించారు. బీసీ సంక్షేమ శాఖలో ఉన్న సమ స్యలపై చర్చించారు. అధికారులు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురు కులాలు సందర్శిస్తానని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాల మాయా దేవి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరోమారు కక్ష సాధింపు
వైఎస్సార్ కడప, సాక్షి: వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరో మారు కక్షసాధింపుకు దిగారు. జిల్లాలోని కొప్పర్తి సెజ్‌లో కేంద్రం కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తీసుకెళ్లారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొప్పర్తి నార్త్ బ్లాక్‌లో 19.5 ఎకరాల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ప్రభుత్వం మారగానే కొప్పర్తికి మంజూరైన టెక్నాలజీ సెంటర్‌ను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకెళ్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. టెక్నాలజీ పార్క్ వల్ల యువతకు స్కిల్ ట్రైనింగ్, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాలు అందాల్సి ఉంది. కానీ చంద్రబాబు కడప యువత అవకాశాలను దెబ్బతీస్తూ జీవో నంబర్ 56ను విడుదల చేశారు. చదవండి : తిరుమల లడ్డు వివాదం : సిట్‌తో నిజాలు నిగ్గు తేల్చలేం -
తెలంగాణ వడ్డించిన విస్తరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి వంటిదని.. చైనా బయట పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్‌రెడ్డి చెప్పారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం బలోపేతంతో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి.. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ శిల్ప కళావేదికలో ‘తెలంగాణ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ–2024’ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. పెట్టుబడులతో సంపద పెంచుతాం ‘‘ఏ రంగంలోనైనా పాలసీ లేకుండా పురోగతి సాధ్యం కాదు. ఎంఎస్ఎంఈలో పెట్టుబడులు రాబడుతూ సంపద పెంచడంతోపాటు దళితులు, గిరిజనులు, మహిళలను ప్రోత్సహించే వాతా వరణం సృష్టిస్తాం. భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగిస్తూ.. నష్టం చేసే విధానాలను తొలగిస్తాం. పారిశ్రామిక అభివృద్ధితోనే తెలంగాణ ఆర్థికంగా బలోపేతం అవుతుంది..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ఆధారపడటంతో రైతులకు ప్రభుత్వపరంగా ఎన్ని విధాలుగా సాయం అందించినా వారి పరిస్థితి మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యాపార రంగాల్లోనూ ఎదగాలన్నారు. గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని.. తెలంగాణ యువత ఐటీ రంగంలో అడుగుపెట్టి సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి ఎదగడంతో ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, ఇక్కడ ఎకరా అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చని వ్యాఖ్యానించారు. స్కిల్ యూనివర్సిటీకి విరాళాలు సేకరిస్తాం నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకోసం యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో రూ.300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ సేకరిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. భూములు కోల్పోయే వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. అమెరికాలో హడ్సన్, లండన్‌లోని థేమ్స్ తరహాలో మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్ష కోట్లను సున్నా వడ్డీపై రుణాలుగా ఇస్తామని ప్రకటించారు. శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మూడు ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి పునాది: భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం వేళ్లూనుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలు మూతపడుతున్నా తెలంగాణలో ఆ రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల టేకోవర్ల సమస్య కూడా తక్కువగా ఉంటోందని తెలిపారు. తాము ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా సామాజిక న్యాయానికి పునాదులు వేశామని... గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.2వేల కోట్ల సబ్సిడీని ఎంఎస్ఎంఈలకు విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ: మంత్రి శ్రీధర్‌బాబు అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త విధానం తెస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఎంఎస్ఎంఈలను గ్రోత్ సెంటర్లుగా మారుస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక పార్కులు, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసి... మహిళలకు 5శాతం, ఎస్సీ, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్లకు 15శాతం రిజర్వు చేస్తామని ప్రకటించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ‘ఫ్లాట్ ఫ్యాక్టరీలు’, ఎస్ఎంఎస్ఈ క్లస్టర్లలో పది చోట్ల కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు సులభంగా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.100 కోట్లతో యంత్రాల ఆధునీకరణకు నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల కొనుగోలు కోసం ‘ప్రొక్యూర్మెంట్ పాలసీ’, బహుళ జాతి కంపెనీలతో భాగస్వామ్యాలు, పాలసీ అమలు కోసం టాస్‌్కఫోర్స్, లీజు పాలసీ వంటివాటిని కొత్త విధానంలో పొందుపర్చామని వెల్లడించారు. కేంద్ర పథకంపై ఒప్పందం..కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ ప్రపంచ బ్యాంకు సహకారంతో దేశంలో ఎంఎస్ఎంఈల పనితీరును మెరుగుపర్చడం, వేగవంతం చేయడం కోసం పథకాన్ని అమలు చేస్తోంది. కరోనా సమయంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా.. రాష్ట్రంలో స్టేట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు కోసం బుధవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు.కాగా.. పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, రాయల నాగేశ్వర్రావు, ఐత ప్రకాశ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
MSME-2024 పాలసీ ఆవిష్కరణ
-
ఎనిమిది నెలల్లో 3.5 కోట్ల దరఖాస్తులు
దేశవ్యాప్తంగా ఎనిమిది నెలల్లో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయని ఆన్లైన్ జాబ్‌సెర్చ్ ప్లాట్‌ఫామ్ ‘అప్నా.కో’ నివేదిక తెలిపింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్ కారణంగా ఈ ఏడాది ఉద్యోగ దరఖాస్తులు పెరిగినట్లు సంస్థ పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు 31 వరకు సూక్ష్య, చిన్న, మధ్యతరహా సంస్థలకు సంబంధించి 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయి. వివిధ రంగాల్లోని సేల్స్, మార్కెటింగ్ మేనేజర్లు, అకౌంటింగ్ టెక్నీషియన్లు, టెలికాలర్స్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లు, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్ వంటి స్థానాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్ఎంబీ), ఎంఎస్ఎంఈల్లో దాదాపు 11 కోట్లమంది పని చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందేందుకు ఈ రంగాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్ఈ సందర్భంగా అప్నా.కో సీఈఓ నిర్మిత్ పారిఖ్ మాట్లాడుతూ..‘ఎనిమిది నెలల్లో వచ్చిన ఉద్యోగ దరఖాస్తుల్లో 55 శాతానికి పైగా జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, కొచ్చి, భువనేశ్వర్ వంటి టైర్-2, టైర్-3 నగరాలవే కావడం విశేషం. ఈ నగరాల్లో వ్యాపారాలు విస్తరిస్తుండటంతో డిమాండ్‌కు తగ్గట్టుగా ఉద్యోగుల అవసరం పెరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 3.5 కోట్ల దరఖాస్తుల్లో 1.4 కోట్ల మహిళల దరఖాస్తులే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వీటి సంఖ్య 30 శాతం పెరిగింది. ఫైనాన్స్, అకౌంట్స్, మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్.. వంటి ఉద్యోగాలకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు. -
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పీవీ నర్సింహరావు ప్రధానమంత్రి అయ్యాక పారిశ్రామిక విధానంలో అనేక మార్పులు తెచ్చారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచంతో మనం పోటీ పడేలా విధివిధానాలు మార్చారని తెలిపారు. నేడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే పీవీ, మన్మోహన్సింగ్యే కారణమని అతన్నారు.ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ-2024ను సీఎం రేవత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మత్రులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సృష్టించేందుకే ఈ కార్యక్రమమని తెలిపారు. పాలసీ లేకుంటే ఏ ప్రభుత్వం నడవదని.. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. వ్యాపార విస్తరణను మరింత సరళీ కృతం చేసేందుకు ఈ కొత్త పాలసీ ఉపయోగపడుతుందన్నారు.గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటీవల్ హామీలను మేము నెరవేరుస్తామని సీఎం వెల్లడించారు. చిన్న గ్రామాలుగ ఉన్న మాదాపూర్, కొండాపూర్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాయని.. ఐటీ, ఫార్మీ రంగాల్లో మనం దూసుకుపోతున్నామన్నారు. మంచి పనులు ఎవరూ చేసినా కొనసాగిస్తాం. అందులో సందేహం లేదని తెలిపారు. పట్టాలు పొందిన విద్యార్ధులకు ఉద్యోగాలు రావడం లేదు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు.. నైపుణ్యాలు ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. టాటా ఇండస్ట్రీస్‌తో మాట్లాడి రూ, 2400 కోట్లు ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రాను వీసీగా నియమించాం. సాంకేతిక నైపుణ్యం లోపించిన వారికి ఉద్యోగాలు రావడం లేదు. యువతలో సాంకేతిక నైపుణ్యం పెంచితే ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. వ్యవసాయాన్ని ఎవరూ వదలద్దు. వ్యవసాయం మన సంస్కృతి. రైతులను రుణాల నుంచి విముక్తి కల్పించాం. గతంలో కృష్ణా గుంటూరులో ఒక ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో 10 ఎకరాలు వచ్చేవి. ఇప్పుడు హైదరాబాద్‌లో 1 ఎకరం అమ్మితే గుంటూరులో 100 ఎకరాలు కొనొచ్చు. మూసీ అంటే మురికి కూపం కాదు అని నిరూపిస్తాం. మూసీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. విద్యార్ధులకు బట్టలు కూటే బాధ్యత కూడా మహిళలకే ఇచ్చాం’ అని తెలిపారు. -
శిక్షణ, ప్రోత్సాహకాలే కీలకం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందివ్వడంతోపాటు, ముద్రా యోజన తదితర పథకాల ద్వారా రుణాలు ఇవ్వాలని డబ్ల్యూఆర్ఐ ఇండియా సీఈవో మాధవ్ పాయ్ సూచించారు. ఈ రంగానికి సంబంధించిన పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు సాయపడతాయన్నారు. ‘డబ్ల్యూఆర్ఐ ఇండియా కనెక్ట్ కరో’ పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘ఎంఎస్ఎంఈలు కొద్దికాలంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరం. చిన్న వ్యాపారులు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. ఈ దిశగా ప్రభుత్వ వర్గాలు విభిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు టెక్స్టైల్ ఫ్యాక్టరీలను పెట్‌కోక్ ఆధారితంగా ఎక్కువ కాలం నిర్వహించలేం. పెట్‌కోక్ లేకుండా ఉత్పత్తి పెంచాలంటే కంపెనీలకు అదనంగా పోత్సాహకాలు అవసరం. ప్రపంచంలో 20 అధిక కాలుష్య పట్టణాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన నిబంధనల అనుసరించాలి’ అని మాధవ్ చెప్పారు.ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం నిజంగానే తగ్గిందా?‘చాలా ఎంఎస్ఎంఈలు రుణాలు పొందడానికి ఇబ్బందులు పడుతున్నాయి. ముద్రా యోజన తరహా ఇతర పథకాలను ప్రభుత్వం రూపొందించాలి. తద్వారా ఎంఎస్ఎంఈల రుణ సమీకరణ సామర్థ్యాన్ని పెంచాలి’ అని తెలిపారు. -
ఎంఎస్ఎంఈలకు దన్నుగా నిలవండి
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)పై మరింత సానుకూల ధోరణితో వ్యవహరించాలని ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ సూచించారు. ఎకానమీలో కీలక పాత్ర పోషించే ఈ పరిశ్రమకు మద్దతుగా నిల్చే క్రమంలో రుణాల పునర్వ్యవస్థీకరణ, గ్రేస్ పీరియడ్ ఇవ్వడం తదితర చర్యల రూపంలో తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.విదేశీ మారక డీలర్ల అసోసియేషన్ (ఫెడాయ్) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్వామినాథన్ ఈ విషయాలు తెలిపారు. తక్కువ వడ్డీలకు రుణాలు దొరక్కపోవడం, చెల్లింపుల్లో జాప్యాలు, మౌలికసదుపాయాలపరమైన సమస్యలు మొదలైన అనేక సవాళ్లను ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చిన్న సంస్థలు ఎకానమీకి వెన్నెముకలా మాత్రమే కాకుండా వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పనకు చోదకాలుగా కూడా ఉంటున్నాయని స్వామినాథన్ వివరించారు.అయితే, ఈ సంస్థలు వృద్ధిలోకి రావాలంటే ఆర్థిక రంగం వినూత్న పరిష్కారమార్గాలతో వాటికి తగు మద్దతు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్దిష్ట మద్దతు కల్పించడం ద్వారా ఎంఎస్ఎంఈ ఎగుమతులు పెరగడంలో ఆర్థిక రంగం కీలక పాత్ర పోషించగలదని స్వామినాథన్ వివరించారు.ఫైనాన్స్, ఫ్యాక్టరింగ్, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వంటి సంప్రదాయ ప్రోడక్టులతో పాటు ఎగుమతులకు రుణ బీమా, కరెన్సీ రిస్క్ హెడ్జింగ్ సొల్యూషన్స్ వంటివి ఆఫర్ చేయొచ్చని పేర్కొన్నారు. చెల్లింపులపరమైన డిఫాల్ట్‌లు, కరెన్సీ హెచ్చుతగ్గుల సవాళ్ల నుంచి ఇలాంటివి రక్షణ కల్పించడంతో పాటు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లలో విస్తరించేందుకు ఎంఎస్ఎంఈలకు ఆత్మవిశ్వాసం ఇవ్వగలవని స్వామినాథన్ పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కొత్త బ్యాంకు
తెలుగు రాష్ట్రాల్లో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో 5 బ్రాంచిలను ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ ఇందర్జిత్ కామోత్రా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవలను తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ బ్యాంకు ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) వర్గాలు రుణాలు పొందవచ్చు. ప్రాథమికంగా హైదరాబాద్‌లో 5 బ్రాంచిలను ప్రారంభిస్తున్నాం. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ బ్యాంకు బ్రాంచీలు మొదలుపెడతాం. దేశ వ్యాప్తంగా యూనిటీ బ్యాంకుకు 182 శాఖలున్నాయి. వచ్చే ఏడాదిన్నరలో వీటిని 300కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. వీటితోపాటు 130కి పైగా అసెట్ బ్రాంచీలు ఏర్పాటు చేస్తాం. మొత్తం బ్యాంకుకు రూ.7,500 కోట్ల డిపాజిట్లు, రూ.8,500 కోట్ల రుణాలున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియా -
ఏపీలో మహిళలు మహారాణులు రాజ్య సభలో దక్కిన గౌరవం
-
చిన్న సంస్థలకు ఊతం.. రుణ హామీ పథకం
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) తోడ్పాటు అందించే దిశగా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు ప్రతిపాదించారు. యంత్ర పరికరాల కొనుగోలు కోసం ఎటువంటి కొలేటరల్ లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా టర్మ్ లోన్స్ తీసుకునే వెసులుబాటు లభించేలా రుణ హామీ పథకాన్ని ప్రకటించారు.దీనికోసం విడిగా సెల్ఫ్–ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది ఒక్కో దరఖాస్తుదారుకు రూ. 100 కోట్ల వరకు రుణాలకు (తీసుకున్న రుణ మొత్తం ఎంతైనా సరే) హామీ ఇస్తుందని పేర్కొన్నారు. దీన్ని పొందేందుకు రుణగ్రహీత ముందస్తుగా నిర్దిష్ట గ్యారంటీ ఫీజును, రుణ బ్యాలెన్స్ తగ్గే కొద్దీ వార్షిక ఫీజును కట్టాల్సి ఉంటుంది.ఎస్ఎంఈలకు గడ్డు కాలంలో కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉండేలా చూసేందుకు కొత్త విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది. తమ పరిధిలో లేని కారణాల వల్ల స్పెషల్ మెన్షన్ అకౌంటు (ఎస్ఎంఏ) దశలోకి చేరిన ఎంఎస్ఎంఈలు ఆ తదుపరి మొండి బాకీల్లోకి జారిపోకుండా సహాయం పొందేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. కొత్త అసెస్మెంట్ విధానం..: ఎంఎస్ఎంఈలకు రుణాల విషయంలో కొత్త మదింపు విధానాన్ని మంత్రి ప్రతిపాదించారు. అసెస్మెంట్ కోసం బైటి సంస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు దానికి సంబంధించి అంతర్గతంగా సొంత విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొన్నారు. సంప్రదాయ అసెస్మెంట్ విధానంతో పోలిస్తే ఈ మోడల్ మెరుగ్గా ఉండగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక ఎంఎస్ఎంఈలు, సంప్రదాయ చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించుకునేందుకు తోడ్పాటు అందించేలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ–కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. -
ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
ముంబై: ప్రస్తుత ఎంఎస్ఎంఈ కస్టమర్లకు సెక్యుర్డ్ వర్కింగ్ క్యాపిటల్ సాధనాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంటును అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుతో ఈఎంఐ ఆధారిత అన్సెక్యూర్డ్ రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించింది. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 350 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కస్టమర్లను బ్యాంక్ సన్మానించింది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించింది. -
ఎంఎస్ఎంఈలకు శుభవార్త.. కేవలం 45 నిమిషాల్లో లోన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ రంగాల కోసం డిజిటల్ బిజినెస్ లోన్ ప్రారంభించింది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావించి లోన్స్ వేగంగా అందించడానికి ఎస్బీఐ సన్నద్ధమైంది.ఎంఎస్ఎంఈలకు కేవలం లోన్స్ అందించడం బ్యాంక్ పురోగతికి కూడా దోహదపడుతుంది. గత ఆర్ధిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈలకు ఏకంగా రూ. 4.33 లక్షల కోట్ల లోన్ మంజూరు చేసింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే సుమారు 20 శాతం ఎక్కువని తెలుస్తోంది.మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ రంగాలకు 45 నిమిషాల్లో లోన్ అందిస్తామని, ఇప్పటికే తమ వద్ద ఎంఎస్ఎంఈలకు సంబంధించిన చాలా సమాచారం ఉందని, ఇది లోన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో ఉపయోగపడుతుందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అన్నారు.కేవలం 45 నిమిషాల్లో లోన్ అందించడం ఎంఎస్ఎంఈలకు ఓ గొప్ప అవకాశం అనే చెప్పాలి. తక్కువ సమయంలో లోన్ మంజూరు చేయడం వల్ల బ్యాంక్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ఈ విధానం సుదీర్ఘ పరిశీలనకు మంగళం పాడనుంది. ప్రస్తుతం రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవడానికి ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అందించాల్సిన అవసరం లేదు. కేవలం జీఎస్తీ రిటర్న్స్ సమర్పిస్తే సరిపోతుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. -
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రక్షణ కవచం
‘సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి’ –వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన చట్టం ‘ఎంఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ చట్టం–2006’. తయారీదారు దగ్గర కొనని వ్యాపారస్తుని ఈ చట్టం ఎలాంటి ఇబ్బందీ పెట్టదు. తయారీదారు వద్ద కొనుగోలు చేసినవాళ్లే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత 15 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో 40 శాతం మేర పాలు పంచుకోవడం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల విశిష్ఠత.పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా విస్తరించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక అసమానతలను తొలగించేందుకు తోడ్పడుతున్నాయి. పెట్టుబడుల కొరతను ఈ తరహా పరిశ్రమలు అధిగమించడానికి కేవలం వ్యక్తిగత హామీలతో బ్యాంకులు ఋణం అందిస్తున్నాయి. అందుకే ఇవి మనుగడ సాగిస్తున్నాయి. పీఎమ్ఈజీపీ, సీజీటీఎమ్సీ కింద ఇచ్చే రుణాలతో పాటు ముద్రా ఋణాలూ ఇటువంటి పరిశ్రమల స్థాపనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఒక వ్యక్తి కాని, వ్యాపార సంస్థ కాని (కొనుగోలుదారు) వస్తువులు లేక సేవలు సూక్ష్మ, చిన్న పరిశ్రమలను నడిపేవారి (అమ్మకందారు) నుంచి పొందినట్లయితే... వారు అమ్మకందారుకు నగదు ఠంచనుగా చెల్లించాలనేది ఈ చట్టం చెప్తుంది. అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ఒప్పందం ఉండాలి. ఆ ఒప్పందం గడువు 45 రోజులు మాత్రమే ఉండాలి. దాని కోసం అమ్మకందారు ‘ఉద్యమ్ ఆధార్’లో నమోదు పొందిన తయారీదారుడు కావాల్సిన అవసరం లాంటి కొన్ని పరిమితులు నిర్దేశించడం ఈ చట్టంలోని ఒక సుగుణం. అలా ఒప్పంద పత్రం లేకపోతే ‘నియమించిన గడువు’ అనే అంశం పరిగణనలోకి వస్తుంది. వస్తువులను లేదా సేవలను అంగీకరించిన రోజు నుంచి 15 రోజుల లోపల నగదు చెల్లించాల్సి రావడమే ‘నియమించిన రోజు’గా చట్టం చెబుతోంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల తయారీదారుకు కొనుగోలుదారుకు మధ్య ఒప్పంద పత్రం రాతపూర్వకంగా ఉండాల్సి ఉంటుంది. అలా కానప్పుడు కొనుగోలుదారుడు 15 రోజుల్లోపల నగదు చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలుదారుడు భారతదేశంలో ఏ ప్రాంతంలోని వారైనా ఈ చట్టం వర్తిస్తుంది. ఒప్పుదల పత్రంలో గడువు ఎక్కువ రోజులు రాసుకొన్నప్పటికీ ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ చట్టం –2006 సెక్షన్ 15 ప్రకారం విధించిన గడువు కేవలం 45 రోజులే. ఇది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలుచేసిన వ్యక్తులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పెట్టుబడి ఒక కోటి రూపాయలు లోపల ఉండి రూ. 5 కోట్ల అమ్మకాలు సాగిస్తే దానిని సూక్ష్మ తరహా పరిశ్రమగా పరిగణిస్తారు. అదే పెట్టుబడి 10 కోట్ల రూపాయల లోపల ఉండి అమ్మకం రూ. 50 కోట్ల లోపల ఉంటే చిన్న తరహ పరిశ్రమగా పరిగణిస్తారు. తయారీ లేకుండా కేవలం అమ్మకం (ట్రేడింగ్) జరిపే వ్యాపారులకు ఈ చట్టం వర్తించదు. కొన్న వస్తువులకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల చట్టప్రకారం వస్తువులు లేక సేవలు పొందిన ఏ వ్యక్తి అయినా సెక్షన్ 15లో చెప్పిన విధంగా చెల్లింపు జరపని కారణంగా అమ్మకందారునికి ‘వడ్డీ’ చెల్లించాలి. అదీ చక్రవడ్డీ! వడ్డీ రేటు రిజర్వు బ్యాంకు, తన కింది బ్యాంకులకు సూచించిన రేటుకు మూడురెట్లుగా నిర్దేశించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు మూలధన లభ్యత పెరిగి అవి సజీవంగా మనుగడ సాగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కొనుగోలుకు చెల్లింపులు జరపడంలో ఆలస్యానికి కట్టే వడ్డీని ఆదాయపు పన్ను లెక్కలో ఖర్చుల క్రింద పరిగణించకపోవడం మరో విశేషం. అయితే బకాయిలు చెల్లించిన సంవత్సరంలో ఖర్చు కింద చూపే వెసులుబాటు చట్టంలో కల్పించారు. ఈ చట్టం భారతదేశ కొనుగోలుదారులకే కాకుండా విదేశీ కొనుగోలు దారులకు సైతం వర్తిస్తుంది. ఇక్కడ వివాదాల్ని పరిష్కరించడానికీ, చట్టాలు అమలు చేయడానికి దేశ దౌత్యవేత్తల కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 43బీ(హెచ్)కు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టం సెక్షన్ 15ను కలిపి చదివితేనే మనకు ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ప్రతి సంస్థ చట్టాలకు లోబడి ఆస్తి, అప్పుల పట్టీని తయారుచేసి లెక్కలు తనిఖీ చేయించాల్సి ఉంటుంది. అయితే, ఏ సంస్థ అయితే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో చెల్లించలేదో, వాటి బకాయిలను చెల్లించాల్సిన వడ్డీని బహిర్గతం చేయాలి. కంపెనీ అయితే కంపెనీ చట్టాలకు లోబడీ, ఇతరత్రా అయితే ఆ చట్టాలను అనుసరించీ!2006 చట్టంగా వచ్చినప్పటికీ, అమలు చేయడంలో చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభ మయ్యాయి. ఆదాయపు పన్ను చట్టంతో ముడిపెట్టడం వల్ల చట్టం విలువ పెరిగి దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత తరుణంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల మనుగడకు ఈ చట్టం ఒక రక్షణ కవచంగా నిలుస్తున్నదనేది కాదనలేని నిజం.చిన్ని శ్రావణ్ కుమార్ వ్యాసకర్త చార్టర్డ్ అకౌంటెంట్ -
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
సాక్షి, అమరావతి: నిజ జీవితంలో పేదరికం, సామాజిక, లింగ వివక్ష వంటి రుగ్మతలను సమర్థంగా ఎదుర్కొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సీఐఐ ఫౌండేషన్ మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, సామాజిక లింగ – ఆధారిత వివక్షను ఎదుర్కొన్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి ఎగ్జంప్లర్ పేరుతో అవార్డునిస్తోంది. ఇందులో భాగంగా సీఐఐ వుమెన్ ఫౌండేషన్ 19వ ఎడిషన్‌లో సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగంలో సరస్వతి ఎంపిక కాగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందించారు. మొత్తం మూడు విభాగాల్లో అవార్డులను ప్రకటించగా విద్యారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత పవార్, ఆరోగ్యరంగంలో బిహార్‌కు చెందిన రుమీ పర్వీన్, ఎంఎస్ఎంఈ రంగంలో మన రాష్ట్రానికి చెందిన సరస్వతి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు రూ.మూడు లక్షల నగదును అందజేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా మొత్తం 300మంది పోటీపడగా వాటిలో తుది పోటీకి 16మందిని ఎంపిక చేసి స్వయంగా వెళ్లి పరిశీలించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినట్లు సీఐఐ శుక్రవారం పేర్కొంది. మహిళా రైతులతో నెట్వర్క్విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస నిజజీవితంలో గృహ హింస, లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆహార భద్రత, ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే ఈ వివక్షకు ప్రధాన కారణమని గుర్తించిన ఆమె ఇంకెవ్వరూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని మిల్లెట్ సిస్టర్స్ పేరుతో చిన్న స్థాయి మహిళా రైతుల నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా 20,000 మంది మహిళలకు ఆదాయాన్ని మెరుగుపర్చేలా జీవనోపాధిని కల్పించి ఆదర్శంగా నిలిచారు. మహిళా సాధికారితలో అయిదు ‘ఈ’లు ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఎంప్లాయిమెంట్, ఎకనావిుక్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ప్రధానమైనవిగా గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐఐ 19వ ఎడిషన్‌లో ఎంపికైన 16 మందితో కలిపి ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ మందిని గుర్తించామని, వీరి ద్వారా 30 లక్షల మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులను గమనిస్తున్నట్లు సీఐఐ పేర్కొంది. -
ఉమ్మడి ‘తూర్పు’లో అభివృద్ధి వికాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ:/సాక్షి, రాజమహేంద్రవరం/అమలాపురం: తూర్పు గోదావరికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతే వేరు. గడచిన ఐదేళ్ల ప్రగతితో ఆ జిల్లా స్వరూపమే మారిపోయింది. పట్టణాలతో పోటీపడేలా పల్లెల్లో సైతం పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. రూ.299.40 కోట్లతో రోడ్లు, భవన నిర్మాణాలు చేపట్టారు. రూ.229.40తో పనులు మొదలయ్యాయి. మరో 33 రోడ్లను రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండో దశలో రూ.26.37 కోట్లతో పనులు చేపట్టారు. కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి రూ.580.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోనసీమ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. దీనికోసం ఈ ఏడాది రూ.300 కోట్లు నిధులు వచ్చాయి. అయినవిల్లి మండలంలో రూ.300 కోట్లతో 440/132 కేవీ మెగా విద్యుత్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలు గోదావరిపాయ దాటాల్సిన అవసరం లేకుండా రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి. ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులో వృద్ధ గౌతమీ, గౌతమీ నదీ పాయల మధ్య పశువుల్లంక మొండి రేవు వద్ద రూ.49 కోట్లతో వంతెనను సీఎం జగన్న్పూర్తి చేయడంతో 16 గ్రామాల్లోని 8 వేల మందికి సౌకర్యం కలిగింది. 2023, 2024 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. గతేడాది ఎకరాకు 32 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 38 నుంచి 45 బస్తాలు పండించారు. ఏటా ఖరీఫ్ సీజ¯న్లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాజమహేంద్రి రాత మారింది ♦ రూ.423 కోట్లతో నాలుగున్నరేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి. ♦ నవరత్నాలుతో జిల్లా వ్యాప్తంగా 33 పథకాలతో ప్రజలకు మేలు జరిగింది. రికార్డు స్థాయిలో రూ.25,436 కోట్లు వెచ్చించారు. ♦ నాడు–నేడులో 1069 పాఠశాలల భవనాలకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ♦ గృహాల కోసం 68,518 మందికి రూ.1233.34 కోట్లు వెచ్చించారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు విడుదలయ్యాయి. ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.25,436 కోట్లు వెచ్చించింది. ♦ రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ♦ 1.46 లక్షల మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. తొలి దశలో రూ.113.48 కోట్లతో 63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ♦ అనపర్తి బలభద్రపురంలో రూ.2500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమతో 2500 మందికి ఉపాధి లభించింది. ♦ గోకవరం మండలం గుమళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 210 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ♦ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి వద్ద రూ.1,350 కోట్లతో త్రివేణి రెన్యువబుల్స్ ఆధ్వర్యంలో సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2400 మందికి ఉద్యోగాలు దక్కాయి. ♦ నల్లజర్ల మండలం పోతవరంలో రూ.50 కోట్లతో జాగృతి బయోటెక్ ప్రైవేటు సంస్థ బయోటెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. ♦ ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాడు–నేడులో రూ.9.21 కోట్లు మంజూరు ♦ గడప గడపకు మన ప్రభుత్వంలో ఎదురైన సమస్యల్లో రూ.72.88 కోట్ల నిధులతో 1,102 పనులకు పరిష్కారం. ♦‘నాడు– నేడు’ మొదటి విడతలో రూ.104.96 కోట్లతో 436 పాఠశాలలు, రెండో విడతలో రూ.257 కోట్లతో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి. ♦ పేదలందరికీ ఇళ్లు రెండు విడతల్లో 34,454 ఇళ్లకు రూ.62,017 కోట్లు కేటాయింపు. ♦ జల జీవన్ మిషన్‌లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం. ♦ జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో కుళాయిల కోసం రూ.45.75 కోట్లు కేటాయింపు. ♦ ఇంటింటికీ గోదావరి జలాలందించేందుకు రూ.1,650 కోట్లు కేటాయింపు ఫుడ్ ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీల్లో కల్పిస్తున్న ఉపాధి ఇలా 2019– 20లో 265 యూనిట్లతో 1707 మందికి 2020–21లో 119 యూనిట్లతో 978 మందికి 2021–22లో 720 యూనిట్లతో 4254 మందికి 2022–23లో 2412 యూనిట్లతో 9455 మందికి -
కుదేలైంది యంత్రం కాదు..రామోజీ కుతంత్రం!
అక్షరమనే వజ్రాయుధాన్ని ఎంతగా భ్రషు్టపట్టించాలో అంతగానూ రామోజీ భ్రషు్టపట్టిస్తున్నారు..ఈనాడు అంటేనే ఏవగింపు కలిగేలా అబద్ధాలు, కుళ్లూ కుట్రల రాతలతో పత్రికను నింపేస్తున్నాడీ ఎల్లో పెద్ద మనిషి. చంద్రబాబంటే ఆమడదూరం పారిపోయే పారిశ్రామికవేత్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే తెప్పరిల్లారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ జగన్ పరిశ్రమలను ఆదుకున్నారని దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న సీఎంగా గుర్తింపు పొందారు. అయిదేళ్ల కిందట తమకు దక్కని రాయితీలను పారిశ్రామిక వేత్తలు జగన్ ప్రభుత్వంలోనే అందుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగానే పారిశ్రామిక వికాసం, ఉద్యోగ కల్పన పెరిగాయనడానికి తలసరి ఆదాయ వృద్ధే నిదర్శనం...ఈ నిజం రామోజీకి తెలిసినా, తప్పుడు రాతలకే కంకణం కట్టుకున్నారు కనుక కట్టుకథలనే అల్లుతారు.. జగన్ ప్రభుత్వంలోనే రాష్ట్ర ఎగుమతులు పెరిగాయి...చంద్రబాబు హయాంలో ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్యతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆరింతలుగా పెరిగింది...వాస్తవాలెప్పుడూ రామోజీకి చేదుగానే ఉంటాయి...అందుకే అక్షర గరళాన్ని జగన్ ప్రభుత్వంపై చిమ్ముతూనే ఉంటాడీయన... చంద్రబాబు ఎంఎస్ఎంఈలకు బకాయిలు పెట్టి జారుకుంటే...ఆ మొత్తాన్ని జగన్ తీర్చడమే కాదు...వాటికి ప్రోత్సాహకాలనూ అందిస్తూ...పారిశ్రామిక ప్రగతికి జగన్ అహరహం అడుగులు వేస్తున్నారు...ఆయన భరోసాయే పారిశ్రామికవేత్తలకు కొండంత అండ...ఏ వర్గానికీ మంచి జరగాలని చంద్రబాబు ఏనాడూ కోరుకోలేదు...రామోజీదీ అదే వరుస...అయినా వాస్తవాలు చెరిపేస్తే చెరిగిపోవు...చింపేస్తే చిరిగిపోవన్నది రామోజీ గుర్తించాలి... సాక్షి, అమరావతి: తనవాడి పాలన అయితే తందాన తాన...తనకు నచ్చని వ్యక్తి అయితే ఎడాపెడా కారుకూతల రాతల విషం చిమ్మడం రామోజీకి అలవాటైపోయింది. చంద్రబాబు అధికారంలో ఉంటే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినా రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు అంటూ రాతలు రాస్తారు. అదే తనకు గిట్టని వాళ్లు అధికారంలో ఉంటే మాత్రం తిట్టిపోయడం రామోజీకి అలవాటై పోయింది. ఎంఎస్ఎంఈలకు బాబు పెట్టిన బకాయిలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చినా సరే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగమనం ...అంటూ క్షుద్ర రాతలు రాస్తారు. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ వంటి మహమ్మారి కాలంలోనూ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమా మూత పడకుండా జగన్మోహన్రెడ్డి పారిశ్రామికవేత్తలను చేయిపట్టి నడిపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగమే కనుక తిరోగమనంలో ఉండి ఉంటే గత ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగ వాటా పెరగడం ఎలా సాధ్యమవుతుందో రామోజీ జవాబివ్వగలరా? 2019–20లో రాష్ట్ర జీఎస్డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా 2022–23 నాటికి 23.36 శాతానికి చేరిన విషయం వాస్తవమో, కాదో రామోజీ బదులివ్వగలరా? పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పన లేకపోయి ఉంటే తలసరి ఆదాయం ఎలా పెరిగిందో రామోజీ మట్టిబుర్రకు తట్టలేదా? గతేడాది దేశంలో తలసరి ఆదాయం సగటున రూ.23,476 పెరిగితే, మన రాష్ట్రంలో దాన్ని మించి రూ.26,931గా ఎలా పెరిగిందో ఈనాడు చెబుతుందా? 2021–22లో రూ.1,92,587గా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2022–23 నాటికి రూ.2,19,518కు చేరిన విషయం రామోజీకి తెలియదా?. పారిశ్రామికవేత్తల అభిప్రాయాల అధారంగా ప్రకటిస్తున్న సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. రాష్ట్ర ఎగుమతులు రూ.90,000 కోట్ల నుంచి రూ.1,60,000 కోట్లకు చేరుకున్నాయి. చంద్రబాబు హయాంలో 1.93 లక్షలుగా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య ఇప్పుడు ఏకంగా ఏడు లక్షలు దాటింది. కోవిడ్ సమయంలో రీస్టార్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం వంటి పథకాలను జగన్ ప్రభుత్వం సమర్థంగా అమలు చేయడం ద్వారా ఎంఎస్ఎందఈ రంగం ఎలా పురోగమించిందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గత బకాయిలను విడుదల చేసింది ఈ ప్రభుత్వమే రామోజీ .. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, జగన్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆదుకుంది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిలు్లలకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి ఆదుకున్న విషయం వాస్తవం కాదా రామోజీ? గతంలో పట్టణాలు నగరాలకు దూరంగా ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామిక వాడలు పట్టణీకరణలో భాగంగా చాలాచోట్ల నగర మధ్య భాగంలోకి రావడంతో కాలుష్యకారక పరిశ్రమలను చాలా వరకు దూరప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది. దీంతో పాత యూనిట్ల స్థలాలు వృధాగా ఉన్నాయి. కొన్ని సంస్థలు వాటి వ్యాపార కార్యకలాపాలను మార్చుకున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత భూములను ఇతర వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించవచ్చని పారిశ్రామిక సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి జీవో నెంబర్ 5, 6ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చర్యనూ తప్పు పడుతూ రామోజీ తన కలంతో ప్రభుత్వంపై విషం కక్కారు. అన్ని మౌలికవసతులు కల్పిస్తూ అభివృద్ధి చేసిన భూమి ధర మార్కెట్ రేటు కంటే అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని చిన్న పిల్లాడినా అడిగినా చెబుతాడు. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి అయిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని భూమి ధరలను నిర్ణయిస్తుంది. మార్కెట్ ధరలతో పోలిస్తే పారిశ్రామిక పార్కుల్లో భూమి ధర ఎక్కువగా ఉందంటూ రామోజీ రాస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో రాష్ట్రమంతటికీ అర్థమవుతోంది. -
బడి తెరిచిన మొదటి రోజే పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ బైలింగ్యువల్ పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.55 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తోంది. గతేడాది దాదాపు 27 లక్షల పుస్తకాలు మిగలడంతో మిగిలిన 4.28 కోట్ల పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఈసారి పాఠ్యపుస్తకాల ముద్రణ బిడ్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన పితాంబరా ప్రెస్ పొందింది. 25 శాతం ముద్రణను స్థానిక ఎంఎస్ఎంఈలకు అప్పగిస్తారు. గత ఏడాది పుస్తకాల ముద్రణకు అత్యంత నాణ్యమైన 70 జీఎస్ఎం పేపర్‌ను వినియోగించారు. ఈ ఏడాది కూడా ఇదే నాణ్యత ఉండేలా ముద్రణ సంస్థకు నిబంధనలు విధించారు. పదో తరగతి ఫిజిక్స్ పుస్తకాలకు ప్రత్యేకంగా అత్యంత నాణ్యమైన 80 జీఎస్ఎం ఆర్ట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. స్కూళ్లు తెరిచేనాటికే ప్రతి విద్యార్థికీ జగనన్న విద్యా కానుక కింద అందించే కిట్లలో ఇతర వస్తువులతో పాటు అన్ని పుస్తకాలు అందిస్తారు. ఇందుకోసం మే 31 నాటికి మొదటి సెమిస్టర్ పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరతాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థులకు కూడా పుస్తకాలను అందించేందుకు 5 శాతం పాఠ్య పుస్తకాలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు. అన్ని మాధ్యమాలకూ ద్విభాషా పుస్తకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్, తెలుగు మీడియంతో పాటు ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, కన్నడ మాధ్యమం స్కూళ్లు కూడా ఉన్నాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ ద్విభాషా పుస్తకాలు ఇస్తారు. ఇతర మీడియం విద్యార్థులకు కూడా ఇంగ్లిష్‌తోపాటు వారు ఎంచుకున్న భాష ఉన్న ద్విభాషా పుస్తకాలు అందిస్తారు. దీంతోపాటు సవర, కొండ, కోయ, సుగాలి వంటి గిరిజన విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 9 తరగతులు ఇంగ్లిస్ మీడియంలోకి మారాయి. 2024–25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి వస్తుంది. దీంతో 1 నుంచి 10 వరకు నూరు శాతం ఇంగ్లిష్ మీడియం బోధనలోకి వస్తుంది. విద్యార్థులకు స్థానిక సంస్కృతులు, జాతీయ అంశాలపై అవగాహన ఉండేలా తరగతులను మూడు కేటగిరీలుగా విభజించి సిలబస్ రూపొందించారు. 1 నుంచి 5 తరగతులకు 100 శాతం ఎస్సీఈఆర్టీ సిలబస్ ఉంటుంది. 6, 7 తరగతులకు ఇంగ్లిష్, సైన్సు, లెక్కల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్, తెలుగు, హిందీ, సోషల్ స్టేట్ సిలబస్ ఉంటాయి. 8, 9, 10 తరగతులకు ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ) మినహా మిగతా సబ్జెక్టులన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఉంటాయి. స్థానిక ముద్రణ సంస్థలకు 25%అవకాశం పాఠ్య పుస్తకాల ముద్రణ బిడ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన పితాంబరా ప్రెస్ దక్కించు కుంది. ఈ సంస్థ 1 నుంచి 5, 7 తరగతుల పుస్తకాలు ముద్రిస్తుంది. పేజీకి రూ.0.33 ధర నిర్ణయించారు. స్థానిక ఎంఎస్ఎంఈలకు కూడా అవకాశం కల్పించడానికి 6, 8, 9, 10 తరగతుల పుస్తకాల ముద్రణ అప్పగిస్తారు. ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహా్వనించారు. -
రామోజీ బధిర రాతలు
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) వేగంగా విస్తరిస్తుంటే ఐదేళ్లు గాఢ నిద్రలో ఉన్న ఈనాడు రామోజీ వాటిపై విషం కక్కుతూ ఒక కథనాన్ని వండి వార్చారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రభుత్వ చర్యలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ కీర్తించింది. కళ్లకు, చెవులకు గంతలు కట్టుకొని పడుకున్న రామోజీకి ఇవేవీ కనిపించలేదు. ‘‘ఐదేళ్లు నిద్దరపోయి ఐదురోజుల్లో ఉద్ధరిస్తారట!’’ అంటూ అవాస్తవ కథనాన్ని రాసేశారు. ఏషియన్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను కీర్తిస్తూ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర లాల్ దాస్ గడిచిన ఐదేళ్లలో ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మయోజన్, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పురోగతికి తిరుపతి, విజయవాడల్లో మరో రెండు ఎంఎస్ఎంఈ డీఎఫ్‌వో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు సుభాష్ చంద్ర ప్రకటించారు. మౌలిక వసతులకు పెద్ద పీట ఎంఎస్ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందుకోసం ప్రతీ జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నది ఈ క్లస్టర్ల ప్రధాన ఉద్దేశ్యం. తాజాగా విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్‌డబ్ల్యూ ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. సుమారు రూ.531 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కు అందుబాటులోకి వస్తే 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అనకాపల్లి, కొప్పర్తిల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న యూనిట్లకు అండగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలుల్లో ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో మరో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఇలాంటిది విశాఖపట్నంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈల నుంచే కొనుగోలు చేయాలంటూ చట్టం కూడా తీసుకు వచ్చింది. ఏడు లక్షలు దాటిన ఎంఎస్ఎంఈలు ♦ గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530. ఈ ఏడాది ఆగస్టు ముగిసే నాటికి వాటి సంఖ్య ఏకంగా 7,72,802. కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు ఇవి. ♦ ఈ నాలుగున్నర ఏళ్లలో కొత్తగా 15 లక్షలకు పైగా ఉపాధి లభించింది. ♦ గత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతీ నెలా సగటున కొత్తగా 11,379 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే ఈ ఒక్క ఏడాదిలోనే 19,476కు చేరింది. ♦కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈ రంగం పునర్జీవం పొందింది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను అందించింది. అభివృద్ధి కోసం సర్వే చేయడం కూడా తప్పేనా రామోజీ? వచ్చే నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్యను, వాటి వ్యాపారాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో రూ.118 కోట్లతో రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈల వివరాలను ప్రత్యేక సర్వే ద్వారా సేకరిస్తోంది. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కాని ఎంఎస్ఎంఈలను గుర్తించడం ఈ సర్వేలో ఓ భాగం. అవగాహన, శిక్షణ కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, బ్యాంకు రుణాలు, డిలేడ్ పేమెంట్, పోర్టల్‌కు అనుసంధానం వంటి ప్రయోజనాలను కల్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. -
చిన్న పరిశ్రమల వికాసంపై ఫోకస్
సాక్షి, అమరావతి: అత్యధికులకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లను చేయి పట్టి నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు సూత్రాల ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలన్నింటినీ గుర్తించి ‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదు చేయించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోపాటు మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణాలందించడం, అవకాశాలను అంది పుచ్చుకుంటూ విస్తరించే విధంగా అవకాశాలు కల్పించడం, ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయించడం, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించింది. ‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదుకు చర్యలు ఇప్పటికీ ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కాని ఎంఎస్ఎంఈలు 45 లక్షలకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని త్వరతగతిన గుర్తించి ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేయించే విధంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఎంఎస్ఎంఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 7.52 లక్షలు కాగా.. వీటిలో 1.6 లక్షల పరిశ్రమలు తయారీ రంగానికి చెందినవి కాగా 5.7 లక్షల యూనిట్లు సేవా రంగానికి చెందినవి. వీటిలో 96 శాతం యూనిట్లు అత్యధికంగా సూక్ష్మ రంగానికి చెందినవే కావడం గమనార్హం. ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోళ్లు తప్పనిసరి రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విభాగాలు ఏటా చేసే కొనుగోళ్లలో 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈ యూనిట్ల నుంచే ఉండాలంటూ జీవోను జారీ చేసింది. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలు మూతపడకుండా చేయూతనిచ్చే విధంగా ఈ జీవోను తీసుకొచ్చింది. అయినా.. కొన్ని ప్రభుత్వ విభాగాలు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తున్నట్టు ప్రభుత్వ దృష్టికి రావడంతో రాష్ట్ర ఎంఎస్ఎంఈలను కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు చేస్తే అటువంటి బిల్లులకు ఆమోదం తెలపవద్దంటూ ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు చాలా ప్రోత్సాహం లభిస్తుందని ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేగంగా విస్తరిస్తుండటమే కాక అవి ఆదాయ పన్ను చెల్లించే స్థాయికి చేరుకుంటున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 2019–20 నుంచి 2022–23 మధ్య కాలంలో రాష్ట్రంలో కొత్తగా 18.3 లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం.. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట వేస్తుండడం ఐటీ రిటర్నుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత గడిచిన మూడేళ్ల కాలంలో మహారాష్ట్రలో అత్యధికంగా 13.9 లక్షలు, ఉత్తరప్రదేశ్ 12.7 లక్షలు, గుజరాత్ 8.8 లక్షలు, రాజస్థాన్ 7.9 లక్షలు చొప్పున ఐటీఆర్ పెరిగాయి. కానీ, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రిటర్నుల సంఖ్య 11.7 లక్షలు తగ్గడం గమనార్హం. ఎంఎస్ఎంఈలు 1.93లక్షల నుంచి 6.6 లక్షలకు.. ఇక అసంఘటిత రంగంగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని సంఘటితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2020న ఎంఎస్ఎంఈ యూనిట్ల నమోదు కోసం ఉద్యమ్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఈలకు బ్యాంకు రుణాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్ వంటి అనేక సౌలభ్యాలు ఉండటంతో ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530గా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య ఇప్పుడు 6.6 లక్షలు దాటినట్లు ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వల్ల దేశవ్యాప్తంగా 2.18 కోట్ల ఎంఎస్ఎంఈలు కొత్తగా రిటర్నులు దాఖలు చేయడానికి దోహదపడినట్లు ఎస్బీఐ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఇక మొత్తం పెరిగిన ఐటీఆర్‌ల్లో 60 శాతం తొలి ఐదు రాష్ట్రాల నుంచే వచ్చినట్లు పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య 4.1 లక్షలకు దాటడం కూడా రిటర్నులు దాఖలు పెరగడంలో కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలవల్ల రానున్న కాలంలో ఈ రిటర్నులు సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంఎస్ఎంఈలకు పునరుజ్జీవం.. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ రిస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం వంటి పథకాలతో చేయిపట్టి నడిపించడం ద్వారా ఎంఎస్ఎంఈ రంగానికి పునరుజ్జీవం కల్పించడంతో కొత్త యూనిట్లు ప్రారంభించడానికి ముందుకొస్తున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలను విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి వాటిని ఆదుకుంది. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది. అంతేకాక.. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీపడేలా క్లస్టర్ విధానాన్ని, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.118 కోట్లతో ‘ర్యాంప్’కార్యక్రమాన్ని చేపట్టింది. -
చిన్న పరిశ్రమ ధగధగ
ఓ ప్రయత్నం పది మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైంది. చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయపథానికి దారిచూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే... ప్రతి జిల్లా పారిశ్రామికంగా పురోగమిస్తుందని రుజువైంది. విశాఖపట్నంలో అత్యాధునిక డెంటల్ ల్యాబ్... నెల్లూరు జిల్లా పొదలకూరులో బయో మాస్ బ్రికెట్స్... బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో మారుతి గ్రానైట్స్... ఇలా ఏర్పడిన చిన్న పరిశ్రమలే. ఇప్పుడు వందలాదిమందికి ఉపాధి కల్పిస్తూ... పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు ప్రతి జిల్లాలో పుట్టుకొస్తున్న ఎంఎస్ఎంఈలే సాక్ష్యం. ♦ కరోనా విలయం నుంచి.. విజయపథానికి ♦ గ్రానైట్ ఫ్యాక్టరీతో పది మందికి ఉపాధి.. వ్యవసాయం వదిలి పారిశ్రామిక పయనం బల్లికురవ: వారిది వ్యవసాయం కుటుంబం. భర్త డిగ్రీవరకూ చదువుకోగా... భార్య పాలిటెక్నిక్ పాసయ్యారు. వారికి వ్యవసాయం ద్వారా తగిన ఆదాయం సమకూరకపోవడంతో పదిమందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. తొలుత పౌల్ట్రీ పరిశ్రమతో ప్రస్థానం మొదలైంది. దంపతులు ఇద్దరూ అక్కడే పనిచేసి కొందరికి ఉపాధి చూపారు. అయితే బంధువులు గ్రానైట్ వ్యాపారాలు చేసి లాభాలు పొందడాన్ని చూశాక వీరికీ ఓ ఆలోచన వచ్చింది. బాపట్ల జిల్లా ఈర్లకొండ మల్లాయపాలెం గ్రామాల్లో ముడిరాయి దొరుకుతుండడంతో గ్రానైట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. అయితే సాయమందించే ప్రభుత్వం అప్పుడు లేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాయితీతో రుణం అందించి ఊతం అందించడంతో మారుతి గ్రానైట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి కల సాకారమైంది. ఇప్పుడు విజయవంతంగా ఆ సంస్థ నడుస్తోంది. ఇదీ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తమల్లాయపాలెం గ్రామానికి చెందిన లేమాటి నీరజ, హనుమంతరావు దంపతుల విజయప్రస్థానం. అధికారుల నుంచి సానుకూల స్పందన పరిశ్రమ స్థాపిస్తామని చెప్పగానే పరిశ్రమల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ.1.5 కోట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఎస్ఐడీబీఐ(సిబీ)గా గుర్తించి బ్యాంక్ ద్వారా లోన్ మంజూరు చేశారు. అందులో రూ.90 లక్షలు ప్రభుత్వ రాయితీ కింద వచ్చింది. మొత్తం మూడు కోట్లతో ఫ్యాక్టరీ పెట్టారు. ముడిరాయిని పలకలు కోస్తూ స్థానికంగా విక్రయిస్తున్నారు. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన రాళ్లను అద్దంకి, మార్టూరు, ఒంగోలు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ పట్టణాలకు తరలిస్తున్నారు. మాకు ఉపాధి దొరికింది నాకు ఏపనీ దొరక్క తిరుగుతున్న సమయంలో గ్రానైట్ అధినేత పిలిచి ఉపాధి కల్పించాడు. గతంలో క్వారీల్లో చేసిన అనుభవం ఉండడంతో ఇక్కడ లైన్ పాలిష్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. నెలా నెలా జీతాలు బాగా ఇస్తున్నారు. – డేవిడ్, గ్రానైట్ ఆపరేటర్ కోవిడ్ కష్టకాలంలోనూ చేయూత.. రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి అందరినీ వణికించింది. గ్రానైట్‌పైనా ప్రభావం చూపింది. ఫ్యాక్టరీ మూత పడింది. కరోనాతో వందల మంది మృతి చెందడంతో అన్నీ రెడ్ జోన్లే. వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. అప్పుడు మాకు మరో రూ.28 లక్షల లోన్ ఇచ్చారు. నెలానెలా కంతుల వారీగా రుణం చెల్లిస్తున్నాం. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. పిల్లలను బాగానే చదివించుకుంటున్నాం. పది మందికి ఉపాధి కల్పిస్తున్నానే తృప్తి మిగిలింది. సంవత్సరానికి రూ. 1 కోటి వరకు టర్నోవర్ చేస్తున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాకు బాగా అండగా నిలిచింది. – లేమాటి నీరజ, ఫ్యాక్టరీ యజమాని కర్షకుడి నుంచి కర్మాగార స్థాపన వరకూ.. ♦ నెల్లూరు జిల్లా పొదలకూరులో బయోమాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపన ♦ మొక్కవోని దీక్షతో విజయంవైపు అడుగులు పొదలకూరు: ఆయనో సామాన్య రైతు. వ్యాపారం, పరిశ్రమలపై అవగాహన లేదు. అయినా తాను జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పం ఓ చిన్నతరహా పరిశ్రమ స్థాపన వైపు అడుగులు వేయించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారు. మొక్కవోని దీక్షతో వెనుకడుగు వేయకుండా పరిశ్రమను నిర్వహిస్తూ పది మందికి అన్నం పెడుతున్నారు. ఇదీ పొదలకూరు మండలం సూదుగుంట గ్రామానికి చెందిన పెద్దమల్లు శ్రీనివాసులు రెడ్డి విజయప్రస్థానం. పడిలేచిన కెరటంలా.. గతంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో సూదుగుంట షుగర్స్, సోనాక్(రొయ్య పిల్లల మేత) వంటి పెద్ద తరహా పరిశ్రమలు, అల్లోవీర, సిమెంటు బ్రిక్స్ వంటి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి తట్టుకోలేక మూతపడ్డాయి. కానీ పెద్దమల్లు శ్రీనివాసులురెడ్డి 2015లో బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమలను స్థాపించి నష్టాలు, కష్టాలను అధిగమించి ఓ స్థాయికి చేరుకున్నారు. పడి లేచిన కెరటంలా ఎదిగారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వినియోగించే బయో మాస్ బ్రికెట్స్(కట్టె ముక్కలు) తయారీ పరిశ్రమను స్థాపించి తయారు చేసి వస్తువును అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేక ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కూడా పొందలేకపోయారు. ఫలితంగా పరిశ్రమకు ఎలాంటి రాయితీలు పొందలేకపోయారు. బ్రికెట్స్‌ను అమ్ముకోగలిగినా లాభాలు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. ఇబ్బందులతో నెట్టుకొస్తున్న సమయంలో 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొంది యూనియన్ బ్యాంకులో రూ.కోటి రుణం పొందగలిగారు. దానితో పరిశ్రమలో ఆధునాతన మెషినరీని ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను పెంచారు. మార్కెటింగ్ పల్స్ తెలుసుకున్నారు. ఫలితంగా విజయం సాధించి ఇప్పుడు రూ.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 మందికి ఉపాధి అవకాశం కల్పించి నెలకు రూ.3 లక్షల జీతాలు అందజేస్తున్నారు. బ్యాంకు రుణంలో ప్రభుత్వం 20 శాతం రాయితీ ఇవ్వడం, విద్యుత్ యూనిట్‌కు ఒకరూపాయి సబ్సిడీని అందజేయడంతో నిలదొక్కుకోగలిగారు. సర్కారు సాయంతోనే నిలదొక్కుకున్నాం ప్రారంభంలో ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొన్నాను. నిలదొక్కుకునేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమ నిలదొక్కుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నా అదృష్టం బాగుండి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ప్రోత్సాహాలు లభించాయి. దీంతో ఫ్యాక్టరీకి అవసరమైన టిప్పర్లు, మెషనరీ కొనుగోలు చేయగలిగాను. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొందడం వల్ల పంచాయతీ, టౌన్‌ప్లానింగ్ అనుమతులు లభించాయి. ఫలితంగా పరిశ్రమ గాడిలో పడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతున్నాను. ఎలాంటి కాలుష్యం ఏర్పడనందున ఫార్మాసిటికల్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. – పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, ఫ్యాక్టరీ యజమాని, పొదలకూరు స్థానికంగానే ఉద్యోగం దొరికింది నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. మా ఊరికి చెందిన మారుతీ గ్రానైట్స్ నీరజ, హనుమంతరావు ఫ్యాక్టరీ పెట్టడంతో నాకు అందులో సూపర్వైజర్గా పని ఇచ్చారు. నమ్మకంగా పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్లే నాకు వేరే ప్రాంతానికి వెళ్లే పని లేకుండా ఉపాధి దొరికింది. నాతోపాటు ఇక్కడ మరో 15 మంది పనిచేస్తున్నారు. – వెంకటేశ్, సూపర్వైజర్ పదేళ్లుగా పనిచేయిస్తున్నా.. మాది రాజస్థాన్. బతుకుతెరువు కోసం వచ్చా. ఇక్కడ మేస్త్రీగా పని చేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ యజమాని మాకు బాగా నచ్చాడు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. నెలా నెలా వేతనాలు అందుతున్నాయి. – బీరారామ్, మేస్త్రీ డెంటిస్ట్ కల అలా సాకారమైంది విశాఖలో డెంటల్ ల్యాబ్‌కు శ్రీకారం సాక్షి, విశాఖపట్నం: ఆయనో దంత వైద్యుడు. వైద్య విద్యను పూర్తి చేసుకుని 2010లో విశాఖపట్నం మురళీనగర్‌లో ఓ డెంటల్ క్లినిక్ ప్రారంభించారు. తాను నడిపే క్లినిక్కంటే దానికి సంబంధించిన ఉత్పత్తి పరిశ్రమను స్థాపిస్తే పలువురికి ఉపాధి కల్పించవచ్చని ఆయన భావించారు. దాని వ్యాపార మెలకువలు తెలుసుకునేందుకు ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశారు. స్నేహితుడు గోపీకృష్ణతో కలిసి కృత్రిమ దంతాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఎంఎస్ఎంఈ సింగిల్ పోర్టల్ విధానంలో నెల రోజుల్లోనే అన్ని అనుమతులతో పాటు రుణమూ మంజూరైంది. రూ.3.50 కోట్ల పెట్టుబడితో 2020 జనవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. వార్షిక టర్నోవర్ రూ.4.80 కోట్లకు చేర్చారు. ఆయన పేరు డాక్టర్ గండి వెంకట శివప్రసాద్. ఆయన స్థాపించిన యూనిట్ పేరు డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్. రాష్ట్ర ప్రభుత్వం ఈ డెంటల్ ల్యాబ్‌కు రూ.20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ కూడా మంజూరు చేసింది. మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో... విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ల్యాబ్ నడుస్తోంది. ఇందులో కృత్రిమ దంతాలకు అవసరమైన అచ్చులు, క్రౌన్లు, బ్రిడ్జిలు వంటివి తయారు చేస్తారు. వీటిని కాస్టింగ్ టెక్నాలజీతో కాకుండా మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో డిజిటల్ త్రీడీ ప్రింటింగ్ విధానంలో చేస్తారు. కొరియన్ టెక్నాలజీతో తయారయ్యే ఇవి మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ల్యాబ్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దది. ఇప్పుడు 45 మంది శాశ్వత, 20 మంది తాత్కాలిక, మరో 20 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. అతి తక్కువ సమయంలోనే వీటి ఏర్పాటుకవసరమైన అనుమతులను మంజూరు చేస్తోంది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మా ల్యాబ్‌ను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు రూ.6.50 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం మా ఉత్పత్తులు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నాం. భవిష్యత్తులో దేశమంతటా విస్తరించాలని యోచిస్తున్నాం. ల్యాబ్ విస్తరిస్తే వెయ్యి మంది ఉపాధి పొందుతారని భావిస్తున్నాం. – డా. గండి వెంకట శివప్రసాద్, ఎండీ, డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, విశాఖపట్నం -
వీరి జీవితం.. వడ్డించుకున్న ‘విస్తరి’..!
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదంటారు పెద్దలు. శ్రీ పావన ఇండస్ట్రీస్ అధినేత ‘విస్తరి’(భోజన ప్లేట్ల) వ్యాపారంతోనే జీవితాన్ని ‘విస్తరి’ంచుకుంటున్నారు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతోపాటు, జగన్ ప్రభుత్వం తీసుకున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ చర్యలు వీరి వ్యాపారానికి ఊతమిచ్చాయి. ప్రమాదకర ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ఇతోధికంగా సాయపడుతూ, వ్యాపారంలో రాణించాలనుకునే పలువురు ఔత్సాహిక యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప కార్పొరేషన్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎఈ) ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవే ట్ లిమిడెట్(ఏపీఐఐసీ) ద్వారా పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్, బొల్లవరం వద్ద శ్రీ పావన ఇండస్ట్రీస్ ఏర్పాటైంది. 2019లో షెడ్ కన్స్ట్రక్షన్కు రూ.50 లక్షలు, మెషినరీకి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటితో విస్తర్ల(భోజన ప్లేట్ల) తయారీ పరిశ్రమను పోరెడ్డి సందీప్ స్థాపించారు. ఈ పరిశ్రమ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ధైర్యం పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలే తమకు ధైర్యాన్నిచ్చాయని సందీప్ చెప్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 లక్షలు రాయితీ ఇచ్చింది. దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన కరెంట్, నీరు, ఇతర అనుమతులకు సింగిల్ విండో విధానం అమలుతో శ్రమ, కాలయాపన తగ్గింది. ఈ చర్యలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పేపర్ ప్లేట్లు, కప్పులకు డిమాండ్ పెరిగింది. స్టీల్, ప్లాస్టిక్ ప్లేట్లు అయితే వినియోగించిన ప్రతిసారీ శుభ్రం చేయాలి. లేకుంటే రోగాల బారిన పడే ప్రమాదముంది. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మరోవైపు ప్లాస్టిక్ అంత వేగంగా భూమిలో కలిసిపోదు. అదే చేతిలో ఉంచుకొని తినే పేపర్ ప్లేట్లు(బఫే ప్లేట్లు), కూర్చొబెట్టి వడ్డించేవి(సిటింగ్ పేపర్ ప్లేట్లు) తినగానే పడేస్తాం. కడగాల్సిన శ్రమ ఉండదు. ఇవి పేపర్‌తో తయారు చేసినవి కావడంతో భూమిలో త్వరగా కలిసిపోతాయి. ప్రభుత్వ చర్యలతో ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఏర్పడింది. ముడిసరుకు సరఫరా, ప్లేట్ల తయారీ శ్రీ పావన ఇండస్ట్రీస్‌లో క్రాఫ్ట్ పేపర్ రోల్స్, గమ్, ఫిల్మ్ తెచ్చి కారగేషన్ మిషన్‌లో వాటిని అతికించడం ద్వారా పేపర్ షీట్లు తయారు చేస్తున్నారు. వాటిని పేపర్ ప్లేట్లు తయారుచేసే కుటీర పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా చేస్తున్నారు. అందులోనే ఆరు మెషీన్ల ద్వారా వీరు కూడా వివిధ రకాల పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 20 మంది స్థానిక మహిళలు, మరో 20 మంది ఇతర రా ష్ట్రాలకు చెందిన వారు ఉపాధి పొందుతున్నారు. వీరు తయారు చేసే భోజన ప్లేటు హోల్‌సేల్‌గా రూ.1.50, బహిరంగ మార్కెట్లో రూ.2.50కు విక్రయిస్తున్నారు. భారీ స్థాయిలో పేపర్ షీట్లు, ప్లేట్లు తయారు చేయడంతో వీరికి ఆదాయం కూడా బాగానే ఉంటోంది. నీడ పట్టున ఉంటూనే సంపాదన పావన ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందు ఏ పనీ లేక ఇంటిదగ్గరే ఉండేదాన్ని. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఇందులో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. నా కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు, నా ఖర్చులకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతోంది. నాలాంటి పది మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. నీడ పట్టునే ఉండి ఈ మాత్రం సంపాదించడం సంతోషమే కదా..! – భారతి, ప్రొద్దుటూరు ఉన్న ఊర్లోనే ఉపాధి ఈ పరిశ్రమలో నేను మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15 వేలకు పైగానే సంపాదించుకుంటున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎవరు ఏ పని చేయాలో చెప్పడం, ముడి సరుకు రప్పించడం, తయారు చేసిన ప్లేట్లను ప్రాంతాల వారీగా సప్లై చేయడం తదితర విషయాలను చూసుకుంటాను. పెద్దగా శారీరక శ్రమ ఉండదు. ఉన్న ఊర్లోనే గౌరవ ప్రదమైన జీతం వస్తోంది. – శశిధర్, మేనేజర్, ప్రొద్దుటూరు -
ఏపీలో భారీగా పెరిగిన ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు
-
ఏపీలో ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు భారీగా పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్సింగ్వర్మ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22వ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా.. 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. వైఎస్ జగన్ పాలనలోని ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.06 లక్షల ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 6,99,881కు పెరిగిందని కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్ తెలిపారు. దేశంలో 2021–22లో 6,222 ఎంఎస్ఎంఈలు మూతపడగా.. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022–23లో దేశంలో 13,290 ఎంఎస్ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్రమే మూతపడ్డాయని వివరించారు. కోవిడ్ కష్ట సమయంలో సైతం ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిలిచిపోకుండా సీఎం జగన్ రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం తదితర పథకాలతో చేదోడువాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా సీఎం జగన్ చెల్లించారు. మరో రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలనూ విడుదల చేశారు. సీఎం జగన్ అందిస్తున్న ప్రోత్సాహంతో భారీగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. -
ఇక సులభంగా ఎంఎస్ఎంఈ వివాదాల పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎంఈల వివాదాల పరిష్కారానికి కొత్తగా నాలుగు చోట్ల ఏపీ ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి ఫెసిలిటేషన్ కౌన్సిల్ మాత్రమే ఉండటంతో వివాదాల పరిష్కారానికి ఇంత దూరం రావడానికి ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు ఎదుర్కొనేవి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలులో ప్రాంతీయ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేసింది. కన్సిలేషన్స్ (ఇరు పార్టీలను కూర్చొపెట్టి మాట్లాడి పరిష్కరించడం) స్థాయి వివాదాలను ప్రాంతీయ స్థాయిలో పరిష్కరించేలా, ఆర్బిట్రేషన్ స్థాయి వివాదాలను రాష్ట్రస్థాయి కౌన్సిల్లో పరిష్కరించేలా చట్టంలో మార్పులు తెస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం నలుగురు సభ్యులతో కూడిన ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా జిల్లా స్థాయి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫ్యాప్సియా) సూచించిన ప్రతినిధి, ఏపీఎస్ఎఫ్సీ జిల్లా బ్రాంచ్ మేనేజర్, ఏపీఐఐసీ సూచించిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. బకాయిల కోసం కోర్టులకు వెళ్లి సుదీర్ఘ సమయం వృథా చేసుకునే అవసరం లేకుండా వేగంగా పరిష్కరించే చట్టపరమైన హక్కులు ఈ కౌన్సిల్‌కు ఉంటాయి. ప్రభుత్వ అండతో వేగంగా పరిష్కారం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. మరోపక్క ఏపీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల బకాయిలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి. బకాయిల కోసం కౌన్సిల్‌ను సంప్రదించే పరిశ్రమల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ కౌన్సిల్‌కు రూ.654 కోట్ల బకాయిలకు సంబంధించిన 534 ఫిర్యాదులు రాగా వాటిలో 149 ఫిర్యాదులను పరిష్కరించింది. తద్వారా రూ.97 కోట్ల బకాయిలకు పరిష్కారం చూపింది. ఈ సంఖ్య పెరుగుతుండటంతో వివాదాలను మరింత వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాంతీయ కౌన్సిల్స్ ఏర్పాటు చేసింది. వాటికి స్పష్టమైన పరిధి, విధివిధానాలను నిర్దేశించింది. దీంతో చిన్న పారిశ్రామికవేత్తల ఆర్థిక ఇబ్బందులు తీరనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఎంఎస్ఎంఈ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫాఫ్సియా) అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రభుత్వానికి, పరిశ్రమల శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ కౌన్సిళ్ల పరిధిలోకి వచ్చే జిల్లాలివీ.. విశాఖపట్నం ప్రాంతీయ కౌన్సిల్: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలు విజయవాడ కౌన్సిల్: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు తిరుపతి కౌన్సిల్ : ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు కర్నూలు కౌన్సిల్: కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలు -
బిజినెస్విమెన్ @ ఏపీ.. పారిశ్రామికంలో ముందడుగు
మహిళాభ్యుదయం.. పారిశ్రామిక రంగంలో వారి ప్రగతే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకుసాగుతోంది. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన సీఎం వైఎస్ జగన్.. వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వివిధ పథకాల ద్వారా తోడ్పాటు అందిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలకు అనేక విధాలుగా సహకారం అందిస్తున్నారు. దీంతో బిజినెస్ రంగంలో ప్రవేశిస్తున్న మహిళల సంఖ్యలో నాలుగేళ్లలో గణనీయంగా పెరిగింది. ఎంఎస్ఎంఈలలో.. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో దూసుకెళ్తోన్న ఏపీ.. వ్యాపార రంగంలో కూడా ఎన్నో ఘనతలు సాధించడం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME) రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగానే ఉంది. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖకు సంబంధించిన ‘ఉద్యమ్’ (Udyam) రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రకారం.. 2020 జులై 1 నుంచి 2023 డిసెంబర్ 4 నాటికి దేశంలో నమోదైన మొత్తం ఎంఎస్ఎంఈల సంఖ్య 3,16,05,581 (Udyam Assist ప్లాట్ఫామ్లో నమోదు చేసుకున్న అనధికారిక సూక్ష్మ సంస్థలతో సహా). వీటిలో మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈల సంఖ్య 1,17, 36,406 (ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్లో నమోదైన అనధికారిక మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌తో సహా). ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లలో మొత్తం 11,37,229 ఎంఎస్ఎంఈలు నమోదయ్యాయి. ఇందులో మహిళా ఎంఎస్ఎంఈలు 5,53,003 ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. సంవత్సరాల వారీగా చూస్తే.. సంవత్సరం నమోదైన ఎంఎస్ఎంఈలు 2020-21 6,51,74 2021-22 1,47,374 2022-23 2,45,795 2023-24 6,78,886 మొత్తం 11,37,229 మహిళా యాజమాన్యంలోనివి 5,53,003 రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మహిళలను సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చింది. ఫలితంగా పరిశ్రమల స్థాపనకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME) స్థాపనకు లక్షలాది మంది మహిళలు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీ 2021-23లో మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ కమ్యూనిటీలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి అమలు చేసింది. పవర్ బిల్లులపై సబ్సిడీ, లీజ్ రెంటల్స్ పై రాయితీ, నోటిఫై చేసిన జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో స్టాల్స్ సెట్ చేయడానికి రీయింబర్స్మెంట్లు, ఫిక్స్డ్ క్యాపిటల్ పై పెట్టుబడి సబ్సిడీ వంటివి మహిళా వ్యవస్థాపకులకు ఇస్తున్న ప్రోత్సాహకాలలో ఉన్నాయి. -
3 నెలల్లో.. 4 క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. తక్కువ వ్యయంతో ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పోటీ మార్కెట్లో నిలబడే విధంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఔత్సాహికుల చేయిపట్టుకుని నడిపిస్తోంది. దేశంలోనే మొదటగా కాకినాడలో ఏర్పాటైన ప్రింటింగ్ క్లస్టర్ విజయవంతంగా అందుబాటులోకి రావడంతో.. అదే స్ఫూర్తితో ఎంఎస్ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. రూ.46.03 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు క్లస్టర్లను మూడునెలల్లోగా అందుబాటులోకి తీసుకువాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.8 కోట్లతో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద రూ.14.98 కోట్లతో ప్రింటింగ్ క్లస్టర్, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మాచవరం వద్ద రూ.14.83 కోట్లతో పప్పుదినుసులు తయారు చేసే పల్సస్ క్లస్టర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరు వద్ద రూ.8.22 కోట్లతో గార్మెంట్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. చుట్టపక్కల ప్రాంతాల్లో ఉండే సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లు జట్టుకట్టి ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పడి ఈ క్లస్టర్లలో ఉమ్మడిగా మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. మార్చిలోగా ఈ నాలుగు క్లస్టర్లను ప్రారంభించే విధంగా పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.గోపాలకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నాలుగు క్లస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన మ్యాచింగ్ గ్రాంట్, ఎస్పీవీలు సమకూర్చాల్సిన మొత్తం ఇప్పటికే జమచేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నాలుగు క్లస్టర్లతో సుమారు 25 వేలమందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం బకాయిలు గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి ఆదుకుందని తెలిపారు. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు 1,93,530 కాగా.. వీటి సంఖ్య ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ఏకంగా 5,81,152కు చేరింది. నాలుగున్నరేళ్లలో క్తొతగా 3.87 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఎంఎస్ఎంఈల ద్వారా 34.83 లక్షల మందికి ఉపాధి లభిస్తుంటే.. ఈ నాలుగున్నరేళ్లలోనే కొత్తగా 12.61 లక్షల మందికి ఉపాధి లభించినట్లు ఉద్యమ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
మోసం కేసులో హీరోయిన్ నమిత భర్తకు నోటీసులు
సౌత్ ఇండియా హాట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది నమిత. తాజాగా ఆమె భర్త వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. 2017లో తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వ్యాపారవేత్తగ కొనసాగుతున్న వీరేంద్ర దాదాపు 41 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు తమిళనాడు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. (ఇదీ చదవండి: మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ కామెంట్లు) 2016లో తిరుచ్చిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలుసుకుని అన్నాడీఎంకేలో చేరారు నమిత. 2017లో వీరేంద్ర చౌదరిని ఆమె పెళ్లి చేసుకున్నారు. జయలలిత మరణానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై 2019లో ఆమె బీజేపీలో చేరారు.పార్టీలో చేరిన 8 నెలల్లోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. అలా ఈ ఏడాదిలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఇప్పుడు నమిత రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ తరపున జోరుగా తమిళనాడులో ప్రచారం చేస్తోంది. అదే సమయంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ స్థితిలో నమిత భర్త మోసం కేసులో ఇరుక్కున్నాడు. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ ( MSME) ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్‌లు రూ.41 లక్షలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ముత్తురామన్, దుష్యంత్ యాదవ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదే MSME లో తమిళనాడుకు అధ్యక్షుడిగా ఉన్న నమిత భర్తను కూడా విచారించాలని పోలీసులు భావించారు. ఈమేరకు విచారణకు హాజరుకావాలని నమిత భర్తకు కూడా సమన్లు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆయన కనిపించకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతారనే వార్తలు వస్తున్నాయి. -
పీఎం విశ్వకర్మ పథకానికి 1.4 లక్షల దరఖాస్తులు
న్యూఢిల్లీ: పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ఈ నెల 17న ప్రారంభించగా, పది రోజుల్లోనే 1.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం పథకం విజయానికి నిదర్శనమన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విశ్వకర్మ సోదరులు, సోదరీమణుల సమగ్రాభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కోల్పోయిన వారి గుర్తింపు తిరిగి పూర్వపు స్థతికి చేరుకుంటుందన్నారు. చేతి పనివారి సామర్థ్యాన్ని పెంచడం, వారి ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కు తీసుకెళ్లడం ఈ పథ కం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ పథకం కింద 18 విభాగాల చేతివృత్తుల పనివారు, కళాకారులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. వీరికి ఈ పథకం కింద శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణాకాలంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫెండ్ కూడా లభిస్తుందన్నారు. టూల్‌కిట్స్ కొనుగోలుకు రూ. 15,000 అందజేస్తామన్నారు. లబి్ధదారులు హామీ లేని రూ.3 లక్షల రుణానికి అర్హులని చెప్పారు. -
జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలది కీలకపాత్ర
సాక్షి, విశాఖపట్నం: జీడీపీలో ఎంఎస్ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ఎంఎస్ఎంఈ జాయింట్ సెక్రటరీ మెర్సీ ఇపావో తెలిపారు. విశాఖలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ)షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌పై శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక రంగ వృద్ధికి దోహదపడటమే కాక.. ఉపాధికి ముఖ్య వనరులుగా ఉన్నాయని, గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో ఆర్థిక, ప్రాంతీయ అసమానతలను కూడా తగ్గిస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో ఇవి మరింత బలోపేతమవుతున్నాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించడానికి తమ మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగా రుణ పరిధి పెంపు, ఆధునికీకరణకు ప్రోత్సాహం, సాంకేతిక సాయం, మౌలిక సదుపాయాల వృద్ధి, నైపుణ్యాల పెంపుదల, శిక్షణ అవకాశాల మెరుగుదల, మార్కెట్ల విస్తరణ, ఎగుమతుల ధ్రువీకరణ ప్రక్రియను మరింత సరళతరం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఏపీ మారిటైం బోర్డు డెప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ కమాండర్ బీఎం రవీంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఎగుమతుల ప్రోత్సాహానికి, మౌలిక సదుపాయాల విస్తృతానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతులు పెరగడంలో మారిటైం బోర్డు తోడ్పడుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టుల ద్వారా కొత్తగా పలు పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. శ్రావణ్ షిప్పింగ్ సరీ్వసెస్ లిమిటెడ్ ఎండీ జి.సాంబశివరావు, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర ఎస్ జాస్తి తదితరులు ప్రసంగించారు. ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇండియా పోస్ట్‌తో అమెజాన్ జట్టు: వారి కోసమే
న్యూఢిల్లీ: చిన్న సంస్థలకు (ఎస్ఎంఈ) ఎగుమతులను సులభతరం చేసే దిశగా ఇండియా పోస్ట్‌తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. సంభవ్ సమ్మిట్ 2023 సందర్భంగా కంపెనీ ఈ విషయం తెలిపింది. ఇదీ చదవండి: పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు అలాగే అమెజాన్, ఇండియా పోస్ట్ మధ్య దశాబ్ద కాలపు భాగస్వామ్యానికి గుర్తుగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్మారక స్టాంపును ఆవిష్కరించినట్లు వివరించింది. తమ విక్రేతలకు తోడ్పాటు అందించేందుకు సహ్–ఏఐ పేరిట కృత్రిమ మేథ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టినట్లు అమెజాన్ తెలిపింది. (సిమ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, టెల్కోలకు తప్పదు భారీ మూల్యం) -
ఎంఎస్ఎంఈల నమోదుకు సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలను)గుర్తించి వాటిని నమోదు చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో నమోదుకాని ఎంఎస్ఎంఈలకు ఎటువంటి ప్రభుత్వసాయం అందటం లేదు. కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యం పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలతో పాటు బ్యాంకు రుణాలు, ప్రభుత్వరంగ సంస్థలకు ఉత్పత్తులు విక్రయించే అవకాశాలు ఎంఎస్ఎంఈలకు ఏర్పడతాయి. 2015–16 శాంపిల్ సర్వే ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 33,87,000 నమోదుకాని ఎంఎస్ఎంఈలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. మన రాష్ట్రం నుంచి ఉద్యం పోర్టల్‌లో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 5,26,993 మాత్రమే. ఎంఎస్ఎంఈల సంఖ్య పరంగా మన రాష్ట్రం 13వ స్థానంలో ఉంది. 31.22 లక్షల ఎంఎస్ఎంఈలతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 17.82 లక్షలతో తమిళనాడు రెండోస్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇలా నమోదుకాని ఎంఎస్ఎంఈలను గుర్తించి వాటిని నమోదు చేయించడం ద్వారా ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ సర్వే పేరిట వాస్తవంగా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్యను వెలికితీయనుంది. గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో ఈ వివరాలను సేకరించడానికి టీసీఎస్ సంస్థతో ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఎంఎస్ఎంఈ వ్యాపార పరిమాణ, ఏ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తోంది, ఎంఎస్ఎంఈ ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయిమెంట్ వంటి అన్ని వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వే బాధ్యతను ప్రభుత్వం పరిశ్రమల శాఖతోపాటు జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఈ సర్వేకి సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్లకు శిక్షణ ఇచ్చి తొలుత పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.ఎస్.జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ సర్వే అనంతరం వచ్చిన డేటా ఆధారంగా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్దిష్ట కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. -
MSME ప్రోత్సాహానికై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఎంఎస్ఎంఈలకు బంపర్ ఆఫర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార నిర్వహణలో ఈ సంస్థలు ఎదుర్కొనే ఆర్థిక కష్టాలను తగ్గించి తక్కువ పెట్టుబడితో వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను ఏర్పాటుచేయనుంది. ఇందులో భాగంగా.. కనీసం మూడు నుంచి ఐదెకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి అక్కడే ఉమ్మడి సౌకర్యాలతో రెడీ టు వర్క్ విధానంలో వీటిని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. నిజానికి.. ఒక ఎంఎస్ఎంఈ ఏర్పాటులో ఎక్కువ మొత్తం స్థలం కొనుగోలు, వాటి నిర్మాణానికే కేటాయించాల్సి రావడంతో ఆయా సంస్థలు వర్కింగ్ క్యాపిటల్‌కు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి సౌకర్యాలతో కూడిన భవనాలను నిర్మించి వాటిని లీజు విధానంలో ఇస్తే వెంటనే ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బందులూ తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో ఈ విధానంలో రెండు క్లస్టర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. కేంద్రానికి ప్రతిపాదనలు.. ఇక ఆయా జిల్లాల్లో ఉన్న డిమాండ్లను గుర్తించి వాటికి అనుగుణంగా రెండేసి క్లస్టర్లను ఎంపికచేసి వాటి ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎఫ్‌ఎఫ్‌సీల నిర్మాణ వ్యయంలో కేంద్రం 60 శాతం గ్రాంట్‌గా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించిందన్నారు. మొత్తం 26 జిల్లాలకు సంబంధించి 52 క్లస్టర్లను ఎంపిక చేశామని.. ఇందులో ఇప్పటికే 19 ప్రతిపాదనలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రానికి పంపినట్లు ప్రవీణ్‌కుమార్ చెప్పారు. నాలుగేళ్లలో 12.61 లక్షల మందికి ఉపాధి.. ఇక సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా 2,00,995 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.24,059 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 12,61,512 మందికి ఉపాధి లభించింది. గడిచిన ఆర్ధిక సంవత్సరం 2022–23లోనే 92,707 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.9,677 కోట్ల పెట్టుబడులతో 3,61,172 మందికి ఉపాధి లభించింది. ఇలా ఎంఎస్ఎంఈలు అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుండటంతో వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి 15 రోజులకొకసారి సమీక్ష నిర్వహించి ఈ క్లస్టర్ల అభివృద్ధిపై కలెక్టర్లకు ఆదేశాలను జారీచేస్తున్నారు. తాజాగా జరిగిన సమీక్షలో ఈ ఎఫ్‌ఎఫ్‌సీల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులను తక్షణం చేయాల్సిందిగా ఆయన కలెక్టర్లను ఆదేశించారు. అదే విధంగా కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు కూడా త్వరగా ఆమోదం లభించేందుకు ఏపీ భవన్ అధికారులతో సంప్రదింపులు నిర్వహించాలని కూడా కోరారు. -
చిన్న సంస్థల కోసం వినూత్న బీమా పథకాలు
ముంబై: జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కోసం మూడు వినూత్న బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఎంఎస్ఎంఈ సురక్షా కవచ్ పాలసీ, ప్రాపర్టీ ఆల్ రిస్క్ (పీఏఆర్) పాలసీ, ఐ–సెలెక్ట్ లయబిలిటీ పాలసీ వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా వీటిని ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. సురక్షా కవచ్ పాలసీ.. విపత్తుల నుంచి వాటిల్లే ఆస్తి నష్టాన్ని భర్తీ చేస్తుందని, ప్రమాదాల వల్ల జరిగే ఆస్తి నష్టాల కోసం పీఏఆర్ కవరేజీ ఉపయోగపడుతుందని వివరించారు. ఆభరణాల వంటి విలువైన వాటికి ఐ–సెలెక్ట్ లయబిలిటీతో అదనపు కవరేజీ పొందవచ్చని పేర్కొన్నారు. -
గుడ్ న్యూస్: తనఖా లేకుండా రూ.800 కోట్ల రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ కినారా క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు (ఎంఎస్ఎంఈ) రూ.800 కోట్ల రుణాలను అందించాలని నిర్ణయించింది. తనఖా లేకుండా ఈ వ్యాపార రుణాలను సమకూరుస్తామని కంపెనీ సీవోవో తిరునవుక్కరసు ఆర్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 2016 నుంచి ఇప్పటి వరకు 20,000 పైచిలుకు కంపెనీలకు మొత్తం రూ.1,200 కోట్ల లోన్లు ఇచ్చాం. ఈ కంపెనీల ద్వారా 16,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కినారా వృద్ధిలో 20 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎంఎస్ఎంఈల నుండి సమకూరుతుందని ఆశిస్తున్నాం’ అని వివరించారు. -
నాలుగేళ్లలో ఎంఎస్ఎంఈల రైజింగ్ లక్ష్యంగా ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. కరోనా సంక్షోభ సమయంలోనూ వాటికి చేయూతనిచ్చి, తిరిగి జీవం పోసుకొనేలా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, వాటి వ్యాపారాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం వరల్డ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్ ప్రోగ్రాం)ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఎంఎస్ఎంఈలకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అదుబాటులోకి తేవడం, మార్కెటింగ్, రుణ సదుపాయం, ఎగుమతుల అవకాశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చెల్లింపుల్లో జాప్యం నివారించడం, ఎంఎస్ఎంఈల్లో స్త్రీల భాగస్వామ్యం పెంచడం వంటివి ఈ ర్యాంప్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకునే ఉద్దేశంతో 2022–23 నుంచి 2026–27 కాలానికి రూ.6,062.45 కోట్లతో ర్యాంప్ ప్రోగ్రాంని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఇందులో రూ. 3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా ఇస్తుంది. మిగిలిన రూ.2,312.45 కోట్లు కేంద్రం సమకూరుస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంను (సిప్) రూపొందించాలి. దీనిని కేంద్రం పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత నిధులు మంజూరు చేస్తుంది. ఇందులో అత్యధిక నిధులను పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో స్టేట్ ర్యాంప్ ప్రోగ్రాం కమిటీని ఏర్పాటు చేసింది. ర్యాంప్ నోడల్ ఏజెన్సీగా ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, నోడల్ అధికారిగా పరిశ్రమల శాఖ కమిషనర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సమస్యల పరిష్కారానికి ప్రాంతీయ సదస్సులు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల సమస్యలను తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కార మార్గాలను సూచిస్తూ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంను జూన్ 15లోగా కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సి ఉంది. ఇందు కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ రాష్ట్రవ్యాప్తంగా వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ర్యాంప్ కార్యక్రమంపై అధికారులకు అవగాహన కల్పించడం కోసం తాజాగా పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన వర్క్‌షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో ఏటా అత్యధిక మొత్తం పొందేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల సమస్యలను తెలుసుకోవడానికి ఈ నెలాఖరులోగా 5 పట్టణాల్లో వర్క్‌షాపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ పట్టణానికి దగ్గరగా ఉండే జిల్లాలకు చెందిన ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, అసోసియేషన్లు సమావేశంలో పాల్గొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ సిప్‌ను రూపొందిస్తామన్నారు. -
నిబంధనలు పాటించని కెనరా బ్యాంకు: ఆర్బీఐ భారీ పెనాల్టీ
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంకునకు భారీ షాక్ ఇచ్చింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిందని ఆగ్రహించిన ఆర్బీఐ భారీ పెనాల్టీ విధించింది. ప్రధానంగా రిటైల్ రుణాలపై ఫ్లోటింగ్ రేట్ వడ్డీని, ఎంఎస్ఎంఈ రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో బ్యాంక్ విఫలమైందని పేర్కొంది. (మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి) వడ్డీ రేట్లను బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం, అనర్హులకు పొదుపు ఖాతాలు తెరవడం వంటి పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు కెనరా బ్యాంక్‌పై రూ.2.92 కోట్ల జరిమానా విధించింది. ఆర్బీఐ చేపట్టిన తనిఖీల్లో విషయాలు వెలుగులోకి రావటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. బ్యాంక్ ఫ్లోటింగ్ రేట్ రిటైల్ రుణాలపై వడ్డీని, ఎంఎస్ఎంఈలకి ఇచ్చే రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో విఫలమైందని గుర్తించినట్టు కేంద్ర బ్యాంకు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన,ఫ్లోటింగ్ రేటు రూపాయి రుణాలపై వడ్డీని దాని మార్జినల్ కాస్ట్‌తో లింక్ చేయడంలో విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఇదీ చదవండి: 18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్ అలాగే పలు క్రెడిట్ కార్డ్ ఖాతాలలో నకిలీ మొబైల్ నంబర్లను నమోదు చేయటం, 24 నెలలలోపు ముందుగానే ఉపసంహరించుకోవడం, కస్టమర్ల నుండి ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జీలను వసూలు చేసిందనితెలిపింది. కస్టమర్ ప్రొఫైల్‌కు విరుద్ధంగా లావాదేవీలు జరిగినప్పుడు అలర్ట్‌లను రూపొందించడానికి కొనసాగుతున్న కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను చేపట్టడంలో విఫలమైందని పేర్కొంది. రోజువారీ డిపాజిట్ పథకం కింద ఆమోదించిన డిపాజిట్లపై వడ్డీని చెల్లించడంలో కూడా విఫలమైందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. -
లక్ష్యానికి మించి ఎంఎస్ఎంఈ రుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలను) ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో బ్యాంకులు కూడా విరివిగా రుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగానికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రుణ లక్ష్యాన్ని మూడునెలలు ముందుగా డిసెంబర్ నాటికే చేరుకున్నట్లు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజా నివేదిక స్పష్టం చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎంఎస్ఎంఈ రంగానికి రూ.50,100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. తొమ్మిది నెలల కాలంలోనే 6 శాతం అధికంగా రూ.53,419 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ మొత్తం మార్చి చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద వ్యాపార విస్తరణకు విరివిగా రుణాలను ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం రుణాలు పెరగడానికి ప్రధాన కారణంగా బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో సూక్ష్మసంస్థలకు 2022–23లో రూ.23,300 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే.. 14 శాతానికిపైగా అధికంగా మొత్తం రూ.26,658 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. అదే చిన్నతరహా యూనిట్లకు రూ.18,000 కోట్లకు, రూ.17,052 కోట్ల రుణాలను, మధ్యతరహా యూనిట్లకు రూ.8,800 కోట్ల లక్ష్యానికి అదనంగా రూ.9,439 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. నాలుగేళ్లల్లో 46 శాతానికిపైగా పెరిగిన రుణాలు గడిచిన నాలుగేళ్లల్లో ఎంఎస్ఎంఈ రుణాలు 46 శాతానికిపైగా పెరిగాయి. 2019 మార్చి 31 నాటికి ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఔట్‌స్టాండింగ్ రుణ విలువ రూ.58,025 కోట్లుగా ఉంటే... అది 2022 డిసెంబర్ 31 నాటికి రూ.84,922 కోట్లకు చేరింది. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే రుణాలు భారీగా పెరిగాయని, రెండేళ్ల కోవిడ్ సమయంలో కూడా విరివిగా బ్యాంకు రుణాలు మంజూరయ్యాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రోత్సాహకాలను సకాలంలో విడుదల చేయడంతోపాటు రుణాలను అందించే విధంగా ప్రభుత్వం చేయూతనందిస్తుండటంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,05,620 ఎంఎస్ఎంఈలు ఉండగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో 2,13,826కి పెరిగాయి. మూడున్నరేళ్లల్లో కొత్తగా 1,08,206 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కావడం ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 10,04,555 మందికి ఉపాధి లభించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (చదవండి: సొంత ఆదాయాల పెంపుపై పంచాయతీలు దృష్టి పెట్టాలి) -
మహిళా వ్యాపారవేత్తలకు రుణ పరిమితులు: కేంద్ర సహాయ మంత్రి
ముంబై: రుణాల పరంగా ఉన్న పరిమితులతో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపారాలు (ఎంఎస్ఎంఈ) ప్రభావితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులపై జీ20 వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా సహాయ మంత్రి మాట్లాడారు. (ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్) ఈ అసమాన భారాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ వాణిజ్య కమ్యూనిటీ ఉమ్మడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య అంతరం పెరిగిపోతుండడం పట్ల కరాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా బలమైన, సమర్థవంతమైన సరఫరా వ్యవస్థల అవసరం ఉన్నట్టు చెప్పారు. ఆహారం, ఎరువులు, ఇంధనం, ఫార్మా వంటి ముఖ్యమైన రంగాల్లో జీ20 దేశాల మధ్య సహకారానికి పిలుపునిచ్చారు. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) -
వాళ్ళిక చూడాల్సింది కిందికి కాదు... పైకి!
క్రమంగా గడచిన నాలుగేళ్లలో మన రాష్ట్రంలో– ‘ఫీల్ గుడ్’ వాతావరణం కనిపిస్తున్నది. అందుకు కారణం– రాజ్యము – ప్రజల మధ్య ఏర్పడిన దట్టమైన– ‘ఎకో సిస్టం’ అని నా ఫిబ్రవరి 11 వ్యాసంలో రాశాను. అయితే, ఎంతో విస్తృతమైన లోతైన విషయమది, దాన్ని అంత క్లుప్తంగా చెబితే చాలదు, అందుకు కొన్ని ఉదాహరణలు చెబితే అప్పుడు మరింత స్పష్టత దొరుకుతుంది. రాష్ట్రంలో పిల్లల భద్రత గురించి ఫిబ్రవరి 22న ఓ వార్త ‘ది హిందూ’ ఆంగ్ల పత్రికలో వచ్చింది. పోలీస్, కార్మికశాఖ, విద్య, ఆరోగ్య శాఖలు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు వారం రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించిన దాడుల్లో 5–15 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న 285 మంది పిల్లల్ని గుర్తించారు. వీరిలో 45 మంది ఇప్పటివరకు బడి ముఖం చూడలేదు! వీళ్లంతా విషాదకర స్థితిలో ఇక్కడ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, హోటళ్లు, మెకానిక్ షెడ్లలో బాలకార్మికులుగా పని చేస్తున్నారు. ఎవరు వీళ్ళు అంతా అని చూసినప్పుడు– ఛత్తీస్ గఢ్, ఒడిశా, తెలంగాణ, అస్సాం, పశ్చిమ బెంగాల్ నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలించబడ్డారు. ఇలా బాలల శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యాలకు స్థానికంగా బాలకార్మికులు అందుబాటులో లేకపోవడం వల్ల, బయట నుంచి వారిని దిగుమతి చేసుకుంటున్నారు. మరి వారు ఇక్కడ ఎందుకు అందుబాటులో లేరు అంటే... ఇక్కడ ఆ వయస్సు పిల్లలు బడుల్లో ఉంటున్నారు గనుక. అంగన్వాడీ వయస్సు తర్వాత, ‘అమ్మఒడి’ నుంచి ‘విదేశీ విద్యాదీవెన’ వరకు పుట్టిన బిడ్డ విషయంలో ఇక్కడి విద్యా వైద్య శాఖలు పూర్తిగా వారి బాధ్యతలు తీసుకుంటున్నాయి. దిగువ వర్గాల కాలనీల్లో నేరాలు తగ్గి పిల్లలు–స్త్రీలు క్షేమంగా ఉండడాన్ని– ‘ఫీల్ గుడ్’ కాలంగానే చూడాలి. ఈ ప్రభుత్వానిది అంతా సంక్షేమంపై ‘ఫోకస్’ అనే మాట ఉన్నప్పటికీ, అదేమంత ‘స్మూద్’గా ఈ ప్రభుత్వానికి గొప్ప పేరు వచ్చేట్టుగా కూడా సాగడం లేదు. ఇప్పటికీ ఇంకా అసంతృప్తులకు కొదవలేదు! ప్రభుత్వ ప్రాధాన్యతలైన విద్య, వైద్యం పట్ల ఎగువ మధ్యతరగతి వర్గాలకు వారి అభ్యంతరాలు వారి కున్నాయి. పోనీ వాళ్ళను వదిలిపెట్టి, ప్రయోజనాలు అందు కొంటున్న వారి సంగతి ఏమిటి? అని చూసినప్పుడు... అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ఆకాంక్షల వర్గాల (యాస్పై రింగ్ సెక్షన్స్) అవసరాలకు ‘ఫుల్ స్టాప్’ అంటూ ఉండదు. ఉండాలి, అనుకోవడమూ కుదరదు. అయితే, ‘అభివృద్ధి’ ఏదీ? అంటూ ‘సంక్షేమాన్ని’ విమర్శిస్తున్నవారి దృష్టిలో పడకుండా తప్పించుకునేవీ ఉంటాయి. ఉదాహరణకు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న పారిశ్రామిక రాయితీలు రూ. 962 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. ఈ నాలుగేళ్లలో రూ. 1,715 కోట్లు పారి శ్రామిక రాయితీలూ, రూ. 1,114 కోట్లు విద్యుత్ రాయితీలూ ఈ ప్రభుత్వం సంపన్న పారిశ్రామిక వర్గాలకు చెల్లించింది. అయితే, ఇవేవీ ‘పబ్లిసిటీ’ ఉండే అంశాలు కాదు. కనుక గత ముప్పై ఏళ్ల ఆర్థిక సంస్కరణల కాలంలో జీవన ప్రమాణాలు పెరిగి, కొత్తగా ఎగువ మధ్యతరగతి స్థాయికి చేరిన వారు... ప్రభుత్వం నుంచి కిందికి పేదలకు ఏమి వెళుతున్నాయి అని కాకుండా, ఉద్యోగులుగా ఉన్న తమ పిల్లల్ని– మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎమ్ఎస్ఎమ్ఈ) ల్లో ‘ఆంట్ర ప్రెన్యూర్లు’గా చూడ్డం అవసరం. అప్పుడు ఈ కొత్త సామాజిక వర్గాల నుంచి పదిమందికి ఉపాధి కల్పించే– ‘ఎంప్లాయర్స్’ తయారవుతారు. వర్ధమాన వర్గాల్లో ఇటువంటి ‘షిఫ్ట్’ జరిగి నప్పుడు, సంప్రదాయ – ‘పవర్ పాలిటిక్స్’ నుంచి వారు ‘ఫంక్షనల్ పాలిటిక్స్’లో ప్రవేశించి అక్కడ బలపడి విస్తరిస్తున్న కొత్త మార్కెట్లో విజేతలు అవుతారు. ఎందుకీమాట అనడం అంటే, ఈ రోజున ప్రభుత్వం వద్ద 48 వేల ఎకరాల భూమి పారిశ్రామిక అవసరాలకు చౌక ధరలకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. అనుమతులు 12 రోజుల్లో ఇస్తున్నారు, కొత్తగా వస్తున్న పాలసీలో 21 రోజుల్లో భూమి కేటాయింపు చేస్తారు. ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,706 కోట్లు రాయితీలుగా ఇచ్చింది. ‘సంక్షేమం’ పేరుతో చేస్తున్న వ్యయం గురించి ఇటీవల ఐఐటీ ఢిల్లీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ జేజే థామస్– ‘ఇండియా నీడ్స్ బడ్జెట్ ఫర్ ఇట్స్ యంగ్’ శీర్షికతో ఒక ప్రముఖ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘తమ కుటుంబ జీవన ప్రమాణాలు పెరగడానికి పిల్లల విద్య కొత్త మార్గాలను తెరుస్తుందని మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ వారిని చదివిస్తున్నారు. అటువంటప్పుడు, తన యువత విద్య కోసం ఒక దేశం అప్పు చేయడం మరింత మంచిది కదా?’అంటారాయన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నాలుగు ఏళ్లుగా ఇక్కడ చేస్తున్నది అదే. -జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఎంఎస్ఎంఈ పోటీ పథకం పునరుద్ధరణ
న్యూఢిల్లీ: పునరుద్ధరించిన ఎంఎస్ఎంఈ కాంపిటీటివ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నూతన పథకంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం వ్యయాలను భరించనుంది. పాత పథకంలో కేంద్రం వాటా 80 శాతంగా ఉండడం గమనార్హం. ప్రతీ క్లస్టర్‌కు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాల్సిన నిబంధనను కూడా తొలగించింది. గతంలో 18 నెలల్లోగా అమలు చేయాలనే నిబందన ఉండేది. పునరుద్ధరించిన పథకంలో దశలు వారీగా పేర్కొంది. బేసిక్ రెండు నెలలు, ఇంటర్మీడియట్ ఆరు నెలలు, అడ్వాన్స్డ్ పన్నెండు నెలలుగా నిర్ణయించింది. అంటే ఈ వ్యవధిలోపు ప్రాజెక్టులను దశలవారీగా ఎంఎస్ఎంఈలు అమ లు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో తయారీ రంగానికి ఈ పథకం అమలు చేస్తామని, రెండో దశలో సేవల రంగానికి అమల్లోకి వస్తుందని ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్ తెలిపారు. -
ఎంఎస్ఎంఈల్లో రాణిస్తున్న మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ను సొంతంగా నిర్వహిస్తూ మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో మహిళలు ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే రాష్ట్రంలో అత్యధికంగా మహిళల యాజమాన్యంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం అందింది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా గత మూడేళ్లలో క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఈ ఆర్థిక సాయం అందించారు. 2020–21 నుంచి 2022–23 నవంబర్ వరకు రాష్ట్రంలో మహిళల యాజమాన్యంలోని 2.21 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి రూ.1,181.14 కోట్లు అందించినట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీలో మినహా గత మూడేళ్లలో మరే రాష్ట్రంలోనూ మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు ఇంత పెద్ద సంఖ్యలో ఆర్థిక సాయం అందించలేదని తెలిపింది. ఆర్థిక సాయం ఇలా.. 2020–21లో దేశం మొత్తం మీద 1.71 లక్షల మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి కేంద్రం ఆర్థిక సాయం అందించింది. రాష్ట్రంలో అత్యధికంగా 74,339 ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం లభించింది. ఏపీ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి. అలాగే 2021–22లో దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని 1.30 లక్షల ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందించగా.. రాష్ట్రంలో అత్యధికంగా 22,641 ఎంఎస్ఎంఈలకు సాయం దక్కింది. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్ నిలిచాయి. ఇక 2022–23లో నవంబర్ వరకు దేశం మొత్తం మీద మహిళల యాజమాన్యంలోని 2.34 లక్షల ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆర్థిక సాయం అందగా రాష్ట్రంలో అత్యధికంగా 1.24 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలకు సాయం లభించింది. ఏపీ తర్వాత అత్యధికంగా సాయం అందుకున్న రాష్ట్రాల్లో జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్ నిలిచాయని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెరిగిన ఎంఎస్ఎంఈలు 2021–22లో మహిళల యాజమాన్యంలో ఎంఎస్ఎంఈలు 86.11% పెరిగినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021 మార్చి 31 నాటికి మహిళల యాజమాన్యంలో దేశంలో 4,89,470 ఎంఎస్ఎంఈలుండగా గతేడాది మార్చి 31 నాటికి వీటి సంఖ్య 9,10,973కు చేరింది. మహిళల యాజమాన్యంలో ఉన్న ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చేయూతనిస్తున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ద్వారా మొత్తం 19,59,778 మందికి ఉపాధి లభించినట్టు వివరించింది. ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలను ఇవ్వకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది. సుమారు రూ.3,409 కోట్ల మేర టీడీపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఎంఎస్ఎంఈలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించి ఎంఎస్ఎంఈలను ఆదుకుంది. అంతేకాకుండా మూడేళ్లుగా ఎంఎస్ఎంఈలకు సకాలంలో రాయితీలను చెల్లిస్తోంది. గత మూడేళ్లలోనే రూ.1,706.16 కోట్లను రాయితీల కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయిపట్టుకుని నడిపించేలా వ్యవహరిస్తోంది. సీఎం రాయితీలు అందించడం వల్లే.. ఎంఎస్ఎంఈ పథకం కింద కార్ల కోసం పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నా. నెల రోజుల్లోనే నాకు అనుమతి మంజూరైంది. రూ.14.50 లక్షలతో బొలేరో వాహనం, రూ.11.50 లక్షలతో బ్రిజా వాహనం కొనుగోలు చేశా. రెండు కార్లకు మొత్తం రూ.26 లక్షలు కాగా ఇందులో 45 శాతం సబ్సిడీ వచ్చింది. ఈ రెండు కార్లకు డ్రైవర్లను పెట్టుకొని బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంఎస్ఎంఈలకు రాయితీలు అందించడం వల్లే పరిశ్రమలు వస్తున్నాయి. నాకు జీవనోపాధి కల్పిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ఎప్పటికీ మరిచిపోను. –ఎస్ఎల్ శిరోమణి, జ్ఞానాపురం, నంద్యాల (చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? ) -
వివాద్ సే విశ్వాస్ను ఆకర్షణీయంగా మార్చాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో భాగంగా ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్లైన్లో ఉండాలని డిమాండ్ చేశాయి. బడ్జెట్ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్‌లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలకు వివాద్సే విశ్వాస్ పథకాన్ని ప్రకటించారు. -
Fact Check: ఏపీ బాగుపడటం ‘ఈనాడు’కు ఇష్టం లేదా?
ఏ రాష్ట్రంలోని లేని విధంగా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంటే, రాజకీయ ఉనికి కోల్పోతున్న చంద్రబాబుకు ఏదో రకంగా ఊతం ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఈనాడు పత్రిక మరో అసత్య కథనాన్ని వార్చి వడ్డించే ప్రయత్నం చేసింది. గత టీడీపీ ప్రభుత్వం రూ.3409 కోట్ల ప్రోత్సాహక బకాయిలను పారిశ్రామిక యూనిట్లకు చెల్లించకుండా ఎగ్గగొట్టడం మాటను అప్పుడు, ఇప్పుడు పక్కన పెట్టి.. ప్రస్తుత వైఎస్ జగన్ సర్కారు పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం లేదనే తప్పుడు కథనాన్ని ప్రచురించింది ఈనాడు. ‘పారిశ్రామిక రాయితీల జాడేది?’ అంటూ కొత్త రాగం అందుకుంది. వాస్తవానికి ప్రతీ క్యాలెండర్ ఇయర్ ప్రకారం MSME లకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తూ వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2019-20 క్యాలెండర్ ఇయర్‌కు రూ. 46 కోట్లను జగన్ సర్కార్ పారిశ్రామిక తోడ్పాడుకు నిధులు విడుదల చేయగా, 2020-21 క్యాలెండర్ ఇయర్లో రూ. 993.39 కోట్లను విడుదల చేసింది. సుమారు 8వేల MSMEలకు సహకారం అందించాలనే లక్ష్యంతో భారీ మొత్తంలో నిధులు విడుదల చేసింది. కోవిడ్ మహమ్మారితో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు చేయూత అందించే దిశగా అడుగులు వేసింది. ప్రతీ ఆగస్టు నెలలో MSMEలకు నిధులు విడుదల చేస్తోంది ఏపీ సర్కారు. ఏపీ సర్కారు అందించే ఈ తోడ్పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు నడుపుకునే వారికి ఎంతో లాభదాయకంగా మారింది. అయితే 2022-23 పారిశ్రామిక రాయితీలను ఆగస్టు నెలలో ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ 2023లో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ ఉన్నందున సదరు ప్రోత్సాహకాలను 2023, ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈలోపు ఏపీలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో MSMEల నిధులు ఇవ్వడానికి అంతరాయం ఏర్పడింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ నిధులు విడుదల చేయడానికి సర్కారు సిద్ధంగా ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసి కూడా జగన్ సర్కారును అప్రతిష్టపాలు చేసి, చంద్రబాబును పైకి లేపాలనే తాపత్రాయంతో ఆర్టికల్‌ను ప్రచురించి మరీ రామోజీరావు తన భక్తిని చాటుకున్నాడు. ఎంతమాత్రం వాస్తవం లేని ఆ వార్తలోని అసలు వాస్తవాన్ని గ్రహించాలని ఏపీ పారిశ్రామిక శాఖ ఒక ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసింది. MSMEలకు ఇతర సహకారం ఇలా.. 1. కరోనా సమయంలో సైతం పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలిచింది ఏపీ సర్కారు. 2014-15 క్యాలెండర్ ఇయర్ నుంచి మంజూరు చేయబడిన అన్ని ప్రోత్సహకాలను చెల్లించింది జగన్ సర్కారు. చంద్రబాబు చెల్లించకుండా వదిలేసిన ప్రోత్సహకాలను జగన్ సర్కార్ చెల్లించి MSMEలకు అండగా నిలిచింది. 2. మూడు నెలలపాటు విద్యుత్‌పై ఫిక్స్డ్ డిమాండ్ చార్జీలను రద్దు చేసింది 3. భారీ, మెగా పరిశ్రమలకు మూడు నెలల కాలానికి వడ్డీ కానీ జరిమానా వేయకుండా చర్యలు తీసుకుంది. 4. అదే సమయంలో అవసరమైన విద్యుత్‌ను పరిశ్రమలకు నిరంతరం అందించి వారికి వెన్నుదన్నుగా నిలిచింది. 5. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో భాగంగా సంస్కరణల అమలు విజయవంతంపై గతంలో ఏపీకి 10 శాతం మార్కులు మాత్రం పారిశ్రామిక వేత్తలు ఇస్తే, ప్రస్తుత ఏపీ పారిశ్రామిక అవగాహన సర్వేకు 100శాతం మార్కులు ఇవ్వబడ్డాయి. 6. కోవిడ్ కారణంగా 2020లో పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో పడిన సమయంలో ఏపీ 97. 89 శాతం మార్కులతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచి సత్తా చాటింది. MSMEల ప్రమోషన్ కోసం విధానాలు 2020-23 కాలానికి పారిశ్రామిక అభివృద్ధి విధానం కింద ఎస్సీ-ఎస్టీ పారిశ్రామిక వేత్తల అభ్యున్నతి కోసం ‘వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం’ సంక్షేమ పథకంతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు 9,631 ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 661.58 కోట్లు మంజూరు చేసింది. వీరిలో 2207 మంది ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ. 111.08 కోట్లు, 424 మంది ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 24.31 కోట్లు జమ చేసింది ఏపీ సర్కారు. -
పరిపాలన సంస్కరణల్లో దేశానికే ఏపీ ఆదర్శం: మంత్రి చెల్లుబోయిన
-
అనకాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు
సాక్షి, అమరావతి: అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా అనకాపల్లి వద్ద భారీ ఎంఎస్ఎంఈ పార్కును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామంలో సుమారు 129 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తోంది. తొలిదశలో 59 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తెలిపారు. సర్వే నెంబర్ 1(పీ), సర్వే నెంబర్ 21(పీ)లో కనీస మౌలిక వసతుల కల్పన కోసం ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. సుమారు రూ.12.63 కోట్లతో రహదారులు, డ్రైనేజ్, వర్షపు నీటి కాలువలను అభివృద్ధి చేయనున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ 12 నెలల్లో పనులు పూర్తి చేయాలి. ఆసక్తి గల సంస్థలు జనవరి 17లోగా బిడ్లను సమర్పించాలి. ఆటోమొబైల్, కెమికల్ రంగాలకు చెందిన కంపెనీల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎంఎస్–సీడీపీ ప్రోగ్రాం కింద పార్కును అభివృద్ధి చేసేలా ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడించారు. సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు సత్ఫలితాలనిస్తోంది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.962.05 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లించడమే కాకుండా రాయితీలను ఎప్పటికప్పుడు అదే ఏడాది చెల్లిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. రాయితీలను ఫిబ్రవరిలో మరోసారి అందించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పోగ్రాం (పీఎంఈజీపీ) కింద వ్యాపార విస్తరణకు విరివిగా రుణాలను ఇప్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో గత సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,05,620 ఎంఎస్ఎంఈలు ఉండగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో 2,13,826కి పెరిగాయి. మూడున్నరేళ్లల్లో కొత్తగా 1,08,206 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కావడం ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 10,04,555 మందికి ఉపాధి లభించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
యాంబిట్ ఫిన్‌వెస్ట్‌తో సిడ్బీ కో లెండింగ్ ఒప్పందం
హైదరాబాద్: చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) యాంబిట్ ఫిన్వెస్ట్ అనే ఎన్‌బీఎఫ్‌సీతో కో లెండింగ్ ఒప్పందం చేసుకుంది. సిడ్బీకి ఇది తొలి సహ లెండింగ్ ఒప్పందం. ఇరు సంస్థలు కలసి సంయుక్తంగా ఎంఎస్ఎంఈలకు అన్సెక్యూర్డ్ వ్యాపార రుణాలను అందివ్వనున్నాయి. సిడ్బీ వృద్ధి వ్యూహంలో ఎన్బీఎఫ్సీలు ముఖ్య వాహకమని సిడ్బీ సీఎండీ శివసుబ్రమణియన్ రామన్ పేర్కొన్నారు. రుణ సదుపాయం అంతంగా అందుబాటులో లేని ప్రాంతాలకు సైతం ఎన్బీఎఫ్సీలు చేరుకోగలవన్నారు. తమ తొలి కోలెండింగ్ ఒప్పందాన్ని యాంబిట్ ఫిన్‌వెస్ట్‌తో చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందని, ఎంఎస్ఎంఈలకు సరసమైన రేట్లపై వ్యాపార రుణాలు అందించడానికి ఇది సాయపడుతుందన్నారు. చదవండి: ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా? -
రవాణా ఖర్చుల భారం..తక్కువ డిమాండ్.. ఇబ్బందుల్లో ఎంఎస్ఎఈలు
న్యూఢిల్లీ: ఒకవైపు డిమాండ్ తగ్గడం, మరోవైపు అధిక రవాణా చార్జీల కారణంగా పెరిగిపోయిన తయారీ వ్యయాల భారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలుగా ఓ సర్వే తెలిపింది. ఈ సర్వే నివేదికను భారతీయ యువశక్తి ట్రస్ట్ (బీవైఎస్టీ) విడుదల చేసింది. మార్కెట్ స్థిరపడినప్పటికీ, 57 శాతం ఎంఎస్ఎంఈలు తాము కొత్త ఆర్డర్లను పొందడంలో సమస్యలు చవిచూస్తున్నట్టు చెప్పాయి. వినియోగదారుల తక్కువ కొనుగోలు శక్తి డిమాండ్ తగ్గేందుకు దారితీసినట్టు బీవైఎస్టీ మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ పేర్కొన్నారు. ఈ సర్వేలో 5,600 మంది ఎంఎస్ఎంఈలు పాల్గొన్నాయి. ‘‘కరోనా ప్రభావం క్రమంగా సమసిపోతోంది. అయినప్పటికీ ఎన్నో అంశాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఇంకా కుదురుకోవాల్సి ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతున్నామని 27 శాతం ఎంఎస్ఎంఈలు చెప్పాయి. కరోనా ముందు నాటితో పోలిస్తే కొన్ని అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు 53 శాతం తెలిపాయి. -
కొత్త రూల్.. ఇకపై ఎంఎస్ఎంఈలకూ సిబిల్ స్కోరు
ముంబై: ఇప్పటివరకూ వ్యక్తులకు మాత్రమే క్రెడిట్ స్కోరు ఇస్తున్న ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) కూడా ర్యాంకింగ్ వ్యవస్థను ఆవిష్కరించింది. ఆన్లైన్ పీఎస్బీ లోన్స్‌తో కలిసి ’ఫిట్ ర్యాంక్’ను ప్రవేశపెట్టింది. కరెంటు అకౌంట్లు, ఆదాయపు పన్ను రిటర్నులు, జీఎస్టీ రిటర్నుల ఆధారంగా 6 కోట్ల పైచిలుకు ఎంఎస్ఎంఈలకు 1–10 స్కోరును ఇవ్వనుంది. చిన్న వ్యాపారాలకూ రుణ సదుపాయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, అలాగే ఆర్థిక సంస్థలు మొండిబాకీల వల్ల నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థ చెల్లింపు సామర్థ్యాలపై ఆర్థిక సంస్థ ఒక అవగాహనకు వచ్చేందుకు ర్యాంకింగ్ సహాయపడగలదని సిబిల్ ఎండీ రాజేశ్ కుమార్ తెలిపారు. కొత్తగా ఆవిష్కరించిన సాధనాన్ని ఉపయోగించి బ్యాంకులు రూ. 1 కోటి వరకూ రుణాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. చదవండి: న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ! -
పరిశ్రమకు భరోసా: ఎంఎస్ఎంఈ ద్వారా 11 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన మూల స్తంభాలని ఆ శాఖ సహాయమంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ సోమవారం పేర్కొన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, మరింత అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడ్డానికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని అన్నారు. ఎంఎస్ఎంఈ రంగంపై ఫిక్కీ నిర్వహించన వార్షిక సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ⇒ భారతదేశాన్ని స్వావలంబన సాధనకు, అలాగే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎకానమీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో పరిశ్రమ, సంబంధిత వర్గాలు కలిసి పని చేయాలి. ⇒ దేశంలో 6.3 కోట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉన్నాయి. వాటి ద్వారా 11 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ⇒ ఎంఎస్ఎంఈలు మన భారత్ జీడీపీ విలువలో దాదాపు 30 శాతం వాటాను అందిస్తున్నాయి. మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ⇒ దేశంలో ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పీఎంఈజీపీ (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) ఈ దిశలో ఒక ముందడుగు. ఈ పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో తయారీ, సేవల రంగంలో మొత్తం 1.03 లక్షల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. ⇒ ఎంఎస్ఎంఈల పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం సహకారం రెట్టింపయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి ఎదరవుతున్న సవాళ్లను తగ్గించడానికి తగిన ప్రయత్నం జరుగుతుంది. ⇒ యువత పారిశ్రామికవేత్తలుగా మారే సంస్కృతిని పెంపొందించడానికి, ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించడానికి, వారి నాణ్యతను మెరుగుపరచడానికి, వారి సామర్థ్యాన్ని పెంచడానికి, వారి పోటీతత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ⇒ ఇప్పటికే ఉన్న అలాగే కొత్త ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి వాటిని బలోపేతం చేయడానికి మా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ⇒ దీనితోపాటు ‘జెడ్ఈడీ’ సర్టిఫికేషన్ పథకం (టెక్నాలజీ అప్‌గ్రేడేషన్– క్వాలిటీ సర్టిఫికేషన్ అందించడానికి ఉద్దేశించిన), నాణ్యత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ‘ఏఎస్పీఐఆర్ఈ’ డిజైన్ క్లినిక్ మొదలైన వాటి కింద ఎంఎస్ఎంఈలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఇతర సంస్థలతో కలిసి పని చేస్తోంది. ⇒ ప్రభుత్వం చాంపియన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది, ఇది ఒకే చోట అన్ని పరిష్కారాలను అందిస్తుంది. ఎంఎస్ఎంఈలను మరింత పోటీగా మార్చడానికిసైతం పోర్టల్‌ను దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలు మరింత స్థిరంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఈ రంగం పురోగతి అవశ్యం:స్వైన్ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి బీబీ స్వైన్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగం స్థిరమైన అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక పరమైన చేయూత అవసరమని అన్నారు. ‘రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పనితీరు’ (ఆర్‌ఏఎంపీ) కింద ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సమన్వయంగా సహకారాన్ని అందించడానికి, ఇందుకు తగిన ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోందని వివరించారు. ఈ రంగం పురోగతి దిశలో 2020లో ప్రారంభించబడిన సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా ఫండ్ ఇప్పటి వరకు 125 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2,335 కోట్ల విలువైన వృద్ధి సంబంధ మూలధనాన్ని అందించిందని తెలియజేశారు. ఈ రంగం కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను పునరుద్ధరించడం, ఉద్యామ్, ఇ-శ్రామ్, నేషనల్ కెరీర్ సర్వీస్, ఏఎస్ఈఈఎం పోర్టల్‌ల పూర్తి స్థాయి ఏకీకరణ వంటి కార్యక్రమాల కోసం ప్రణాళిక రూపకల్పన జరుగుతోందన్నారు. సాంకేతిక కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమాచార వ్యవస్థ, జాతీయ ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించడం, జెడ్ఈడీ ధృవీకరణ ద్వారా సమస్యలను పరిష్కరించడం, ఎంఎస్ఎంఈ చెల్లింపు సమస్యలను తొలగించడం వంటి చర్యలకూ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఎంస్ఎంఈలకు మద్దతుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ, వర్గీకరణలో అప్‌గ్రేడేషన్ విషయంలో ప్రభుత్వం పన్నుయేతర ప్రయోజనాలను 3 సంవత్సరాల పాటు పొడిగించిందని స్వైన్ పేర్కొన్నారు. ఎకానమీలో కీలక పాత్ర ఎంఎస్ఎంఈ రంగం సామర్థ్యం చాలా విస్తృతమైనది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం మరింత కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం. ఎకానమీ విలువలో ఈ రంగం వాటా 40-45 శాతంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం- ఆర్ నారాయణ్, ఎఫ్ఐసీసీఐ(సీఎంఎస్ఎంఈ ప్రెసిడెంట్) -
Pre-Budget 2023: బడ్జెట్లో పన్నులు తగ్గించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలన్నది బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ముందుకు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. అలాగే, మరింత మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని, ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా మరిన్ని నిధులను ఖర్చు చేయాలని, పలు రంగాలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న డిమాండ్లు వచ్చా యి. కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 బడ్జెట్‌కు ముందు వివిధ భాగస్వాములు, పరిశ్రమలతో సంప్రదింపులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 21న పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు మొదలు పెట్టారు. సోమవారం ఆర్థికవేత్తల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా చర్చలను ముగించారు. వచ్చే ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను మంత్రి సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించనుండడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు గ్రీన్ సర్టిఫికేషన్, పట్టణ నిరుద్యోగుల కోసం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలని, ఆదాయపన్నును క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశీయంగా సరఫరా వ్యవస్థ బలోపేతం, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల తగ్గింపు, ఈవీ విధానాన్ని ప్రకటించడం, గ్రీన్ హైడ్రోజన్‌కు భారత్‌ను కేంద్రం చేయడం, చిన్నారులకు సామాజిక భద్రత ప్రయోజనం, ఈఎస్ఐసీ కింద అసంఘటిత రంగ కార్మికులకు కవరేజీ కల్పించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. -
ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమల సైరన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరో 25 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గత మూడేళ్లలో 107 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా వచ్చే మూడు నెలల్లో మరో 25 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం కింద ఏర్పాటైన బ్లూస్టార్, యాంబర్ ఎంటర్‌ప్రైజెస్‌లకు చెందిన ఎయిర్ కండీషనర్స్, దేశంలోనే తొలి లిథియం బ్యాటరీ తయారీ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. రూ.6,700 కోట్లతో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన అన్‌రాక్ అల్యూమినియం, కర్నూలు జిల్లాలో రూ.2,938 కోట్లతో ఏర్పాటైన స్టీల్ పరిశ్రమ, అనకాపల్లి జిల్లాలోని రూ.2,000 కోట్లతో స్థాపించిన సెయింట్ గోబిన్, రూ.1,500 కోట్లతో నెలకొల్పిన శారద మెటల్స్ ఫెర్రో అల్లాయిస్ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. మొత్తం 25 యూనిట్ల ద్వారా రూ.16,148 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపంలోకి రానున్నాయని, వీటి ద్వారా 19,475 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు. మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే మూడు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.300 కోట్లతో ఏర్పాటవుతున్న అసాగో బయోఇథనాల్ ప్రాజెక్టుకు శుక్రవారం భూమి పూజ జరగనుంది. వీటితో పాటు త్వరలోనే విశాఖలో రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు ప్రారంభం కానున్నాయి. రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ సౌర విద్యుత్‌కు చెందిన ఉపకరణాల తయారీ యూనిట్‌కు సంబంధించిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి యూనిట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పెట్టుబడుల ప్రవాహం గత మూడేళ్లలో 107 పెద్ద యూనిట్లు ప్రారంభం కావడం ద్వారా రూ.46,002 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇదే సమయంలో 1,06,249 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా 7,22,092 మందికి ఉపాధి లభించింది. ఇవి కాకుండా మరో రూ.91,243.13 కోట్ల విలువైన 57 ప్రాజెక్టుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ పూర్తయితే 1,09,307 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. రాష్ట్రానికి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలోకి టాటా, బిర్లా, అదానీ, సంఘ్వీ లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, యాసెంచర్ లాంటి ప్రముఖ ఐటీ కంపెనీల యూనిట్లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఉత్తుత్తి పెట్టుబడుల ఒప్పందాలు కాకుండా వాస్తవం రూపం దాల్చేలా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
ఎంఎస్ఎంఈల నుంచి కొత్త ఉత్పత్తులు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రతి మూడింటిలో ఒకటి పండుగలకు ముందే కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాలని అనుకుంటున్నాయి. ప్రచార కార్యక్రమాలు, డిస్కౌంట్లపై దృష్టి పెట్టనున్నట్టు 34 శాతం కంపెనీలు తెలిపాయి. మీషో–కాంటార్ సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. సెప్టెంబర్ 23 నుంచి ఈ కామర్స్ సంస్థల పండుగల ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇప్పటికే సేల్స్‌ను ప్రకటించాయి. ఆన్లైన్ విక్రేతల పండుగల విక్రయాల సన్నద్ధతను తెలుసుకునేందుకు మీషో కాంటార్ సర్వే ప్రయత్నించింది. సర్వే అంశాలు.. ► 36 శాతం మంది కొత్త ఉత్పత్తులను పండుగలకు ముందు విడుదల చేయనున్నట్టు తెలిపాయి. ► ప్రమోషన్లు, డిస్కౌంట్లను ప్రకటించనున్నట్టు 34 శాతం కంపెనీలు వెల్లడించాయి. ► ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడంపై ఇన్వెస్ట్ చేయనున్నట్టు 33 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ► పండుగల డిమాండ్‌ను తట్టుకునేందకు అదనపు స్టాక్‌ను సమకూర్చుకుంటామని 32 శాతం కంపెనీలు చెప్పాయి. ► కొత్త కస్టమర్లను చేరుకోవాలని 40 శాతం కంపెనీలు కోరుకుంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 787 ఆన్లైన్ విక్రయదారుల నుంచి ఈ అభిప్రాయాలను మీషో సర్వే తెలుసుకుంది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు! -
ఐ థింక్ లాజిస్టిక్స్
హైదరాబాద్: సాస్ ఆధారిత షిప్పింగ్ సేవల ప్లాట్‌ఫామ్ ‘ఐ థింక్ లాజిస్టిక్స్’.. దేశీ ఈ కామర్స్ విక్రేతల కోసం అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల దేశీ ఈ కామర్స్ విక్రేతలు (ఎంఎస్ఎంఈలు), డీ2సీ బ్రాండ్లు అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించొచ్చని సంస్థ తెలిపింది. ఐథింక్ లాజిస్టిక్స్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య సంస్థల ద్వారా ఇందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది. భారత్ నుంచి సీమాంతర షిప్పింగ్ సేవల విలువ 2025 నాటికి 129 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐథింక్ లాజిస్టిక్స్ భారత ఈ కామర్స్ విక్రేతల వృద్ధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ఒక్క క్లిక్‌తో ఐథింక్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్.. అమెజాన్, ఈబే, షాపిఫై, మెజెంటో, వూకామర్స్ సంస్థలతో అనుసంధానించనున్నట్టు తెలిపింది. -
మీకే రుణాలిస్తాం..చిరు వ్యాపారులకు జై కొట్టిన బ్యాంకులు!
ముంబై: మహమ్మారి కరోనా ముందటి స్థాయిలతో పోలిస్తే చిన్న వ్యాపారాలకు రుణ పంపిణీ రెట్టింపు అయ్యింది. అయితే బ్యాంకర్లు రుణ పంపిణీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇప్పటికే ఖాతాలు కలిగి ఉన్న రుణ గ్రహీతలకే తిరిగి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్ మొగ్గు చూపింది. రుణ సమాచార కంపెనీ– సిబిల్ వెల్లడించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి.. ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుండి రుణాల కోసం డిమాండ్ (వాణిజ్య క్రెడిట్ విచారణల సంఖ్య ప్రాతిపదికన) కరోనా ముందస్తు స్థాయితో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1.6 రెట్లు పెరిగింది. ►మొత్తం ప్రత్యక్ష ఎంఎస్ఎంఈ రుణగ్రహీతల సంఖ్య మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 6 శాతం వృద్ధి రేటుతో 7 మిలియన్లకు చేరుకుంది. ►ఎంఎస్ఎంఈ విభాగంలో ఎన్పీఏలు మార్చి 2021 నుండి పెరుగుతున్నాయి. మహమ్మారి వల్ల సూక్ష్మ పరిశ్రమ విభాగం ఎక్కువగా దెబ్బతింది. ►వర్కింగ్ క్యాపిటల్ లోన్ల కంటే టర్మ్ లోన్ విషయంలో ఎక్కువగా పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇది సానుకూల సంకేతంగా పేర్కొనవచ్చు. ►ఎంఎస్ఎంఈలు క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ (సీసీ, ఓడీ) రుణాల ద్వారా తమ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) అవసరాలను నిర్వహిస్తున్నాయి. చదవండి👉 మరింత తగ్గనున్న మొండిబాకీల భారం -
AP: చిన్న పరిశ్రమలకు చికిత్స
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న సంస్థలను గుర్తించి వాటికి తోడ్పాటునందించే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల మూడేళ్ల ఆదాయ వివరాలను పరిశీలించనుంది. వరుసగా ఆదాయం తగ్గుతున్న యూనిట్లను గుర్తించి వాటికి సహకారం అందించాలని భావిస్తోంది. 2019–20 నుంచి 2021–22 వరకు మూడేళ్లలో చెల్లించిన ఎస్జీఎస్టీలను పరిశీలించి తద్వారా ఆదాయం తగ్గిన యూనిట్లను గుర్తిస్తున్నట్లు ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ తెలిపారు. ఇలా గుర్తించిన యూనిట్లలో ఆదాయం తగ్గడానికి గల కారణాలను అన్వేషించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించాలన్న దానిపై జిల్లాల వారీగా వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆదాయం తగ్గడానికి విద్యుత్, ముడి సరుకు, ఆర్థిక ఇబ్బందులు, మార్కెటింగ్, కూలీల కొరత తదితర కారణాలను గుర్తించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. పటిష్టమైన కార్యాచరణ రూపకల్పన ఇక రాష్ట్రంలో 2.50 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉండగా, ఇందులో 88 శాతానికి పైగా సూక్ష్మ తరహా యూనిట్లే ఉన్నాయి. 1,100 మధ్య తరహా.. 10,000కు పైన చిన్న పరిశ్రమలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఏ ఒక్క ఎంఎస్ఎంఈ పరిశ్రమ మూతపడకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కష్టాల్లో ఉన్న యూనిట్లకు జీవితకాలం చేయూతనిచ్చే విధంగా పటిష్టమైన కారా>్యచరణ ప్రణాళికను సిద్ధంచేస్తున్నట్లు రవీంద్రనాథ్ తెలిపారు. ఇప్పటికే దేశంలో మొదటిసారిగా కరోనా కష్టకాలంలో రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఎంఎస్ఎంఈ యూనిట్లకు గత టీడీపీ ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ.2,000 కోట్లకు పైగా రాయితీలను ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చింది. ఇలాగే వరుసగా మూడో ఏడాది కూడా వచ్చేనెలలో ఇవ్వడానికి సర్కారు రంగం సిద్ధంచేసింది. అదే విధంగా.. ఇప్పటికే వ్యాపారం చేస్తూ ఎంఎస్ఎంఈగా నమోదు చేసుకోకపోవడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందనటువంటి సంస్థలను సైతం గుర్తించి వాటిని నమోదుచేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ ‘ఉదయం’ పోర్టల్‌లో కనీసం 1.25 లక్షల యూనిట్లను రిజిస్ట్రేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లను నమోదుచేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, కొత్తగా 4,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఈ ఏడాది ప్రారంభమయ్యాయి. ఎన్‌ఎస్‌ఐసీతో ఏపీఎంఎస్ఎంఈడీసీ ఒప్పందం.. రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకేసింది. కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ)తో ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎంఎస్ఎంఈడీసీ చైర్మన్ వంకా రవీంద్రనాథ్ సమక్షంలో ఎన్ఎస్ఐసీ జోనల్ హెడ్ కె. శ్రీనివాస్, ఏపీఎంఎస్ఎంఈడీసీ సీఈఓ సృజన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంవల్ల రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో ఏర్పాటవుతున్న చిన్న పరిశ్రమలకు సాంకేతిక సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీరేటుతో ఆరు నెలల్లో తీర్చుకునే విధంగా అప్పుపై ముడి సరుకులు పొందే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే.. నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్స్లో పాల్గొనే అవకాశం వంటివి లభించనున్నాయన్నారు. -
ఫార్మా ఎంఎస్ఎంఈలకు కొత్త పథకాలు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్ఎంఈ) కంపెనీలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర సర్కారు మూడు కొత్త పథకాలను గురువారం ప్రారంభించింది. ఈ వివరాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. టెక్నాలజీ నవీకరణ, ఫార్మా ఎంఎస్ఎంఈ క్లస్టర్ల వద్ద ఉమ్మడి పరిశోధన కేంద్రాలు, వ్యర్థాల శుద్ధి కర్మాగాలను ఈ పథకాల కింద ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. చిన్న కంపెనీలు అయినా కానీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ‘‘ఈ పథకాల నుంచి ఫార్మా రంగం ఎంతో ప్రయోజనం పొందుతుంది. దీర్ఘకాలంలో భారత ఫార్మా పరిశ్రమ మరింత బలోపేతంగా, భవిష్యత్తుకు సన్నద్ధంగా, స్వావలంబన సాధిస్తుంది’’అని మాండవీయ అన్నారు. ఫార్మా ఎంఎస్ఎంఈ యూనిట్లు టెక్నాలజీ నవీకరణకు వడ్డీ సబ్సిడీతో కూడిన రుణాలను పొందొచ్చు. ఉమ్మడి పరిశోధన, టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.20 కోట్ల వరకు లభిస్తుంది. సిడ్బీ ఈ పథకాల అమలుకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుంది. రూ.10 కోట్ల వరకు తీసుకునే రుణాలకు 10 శాతం క్యాపిటల్ సబ్సిడీ కూడా లభిస్తుంది. మూడేళ్ల కాల వ్యవధికి తీసుకోవచ్చు. ఫార్మా క్లస్టర్లలో సదుపాయాల అభివృద్ధికి చేపట్టే ప్రాజెక్టు వ్యయంలో 70 శాతాన్ని (రూ.20 కోట్ల వరకు) కేంద్రం సమకూరుస్తుంది. -
రెండేళ్లలో 2.50 లక్షల ఎంఎస్ఎంఈలు
సాక్షి, అమరావతి: అత్యధికమందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా వచ్చే రెండేళ్లలో కొత్తగా 2.50 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఏడాది 1.25 లక్షలు, వచ్చే ఏడాది 1.25 లక్షలు చొప్పున రెండేళ్లల్లో 2.5 లక్షల యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన ‘సాక్షి’కి వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే యూనిట్ల ద్వారా కనీసం రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కనీసం 1.80 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జూన్ నెలలోనే 13 వేల యూనిట్లు ఏర్పాటు కావడమే దీనికి నిదర్శమన్నారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు బకాయిపెట్టిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లించడంతోపాటు రెండేళ్లుగా క్రమం తప్పకుండా ప్రోత్సాహకాలు చెల్లిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందన్నారు. రెండేళ్లలో ఎంఎస్ఎంఈ రంగానికి రూ.2,086 కోట్లు చెల్లించడమే కాకుండా ఈ ఏడాది ఆగస్టులో ప్రోత్సహకాలను చెల్లించడానికి రంగం సిద్ధం చేస్తోందని చెప్పారు. కేవలం కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా పాత యూనిట్లకు జీవితకాలం చేయూతనివ్వనున్నట్లు తెలిపారు. ఆయా యూనిట్ల రెండుమూడేళ్ల కాలానికి సంబంధించిన జీఎస్టీ రిటర్నులను పరిశీలించి ఉత్పత్తి తగ్గుతున్న యూనిట్లకు అండగా నిలిచేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎంఎస్ఎంఈ సీడీపీ, స్ఫూర్తి, పీఎంఈజీపీ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోందని చెప్పారు. ఇందుకోసం వచ్చే రెండేళ్లలో ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి క్లస్టర్లో కనీసం 100 యూనిట్లు ఏర్పాటయ్యేలా ఈ ఏడాది రెండు క్లస్టర్లను అభివృద్ధి చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను నియోజకవర్గ స్కిల్ హబ్స్ ద్వారా అందించే విధంగా కోర్సులను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా దానికి ఎటువంటి కార్యాలయాన్ని, నామినేటెడ్ కమిటీని ఏర్పాటు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే కార్పొరేషన్‌కు చైర్మన్‌ను, డైరెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో సుమారు లక్ష ఎంఎస్‌ఎంఈలున్నాయి. కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఇవి ఇప్పుడిప్పుడే తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. గత ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాలనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తిగా చెల్లించడంతో వాటికి భరోసా లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఆర్థిక ప్రోత్సాహకాలను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం జగన్ చెప్పారు. నాబార్డ్, సిడ్బీ, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ, ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలు అందించే సాయాన్ని ఎంఎస్ఎంఈలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – వంకా రవీంద్రనాథ్, చైర్మన్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఘనంగా అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ డే వేడుకలు జూన్ 27న (నేడు) అంతర్జాతీయ ఎఎంఎస్ఎంఈ డే సందర్భంగా పరిశ్రమల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. రాష్ట్ర ఎంఎస్ఎంఈలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించే విధంగా ఎంఎస్ఎంఈ గ్లోబల్ వాల్యూ చైన్ పేరుతో విశాఖలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఈ సదస్సులో పాల్గొననున్నారు. దీంతోపాటు ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈలపై అవగాహన పెంచే విధంగా ఎంఎస్ఎంఈ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన సమాచారమంతా ఒకేచోట లభించేలా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించనున్నారు. -
జోరుగా ఎంఎస్ఎంఈ క్లస్టర్ల పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలవారీగా ఉత్పత్తుల ఆధారిత క్లస్టర్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. మరో 38 క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద ప్రింటింగ్, ఫర్నీచర్, పప్పు ధాన్యాలు, బంగారు ఆభరణాలు, రెడీమేడ్ దుస్తుల క్లస్టర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాకినాడ సమీపంలో రూ.14.76 కోట్లతో ప్రింటింగ్ క్లస్టర్, రాజమండ్రి వద్ద రూ.14.98 కోట్లతో ఫర్నీచర్ తయారీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాచవరం వద్ద రూ.14.83 కోట్లతో పప్పు ధాన్యాలు, జగ్గయ్యపేట వద్ద రూ.8 కోట్లతో బంగారు ఆభరణాల తయారీ, నెల్లూరు వద్ద రూ.8.22 కోట్లతో రెడీమేడ్ దుస్తుల క్లస్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఎంఎంస్ఎంఈ సీడీపీ ప్రాజెక్టులో రూ.10 కోట్ల లోపు ప్రాజెక్టులకు కేంద్రం 70% గ్రాంటుగా ఇస్తుంది. రాష్ట్రం 20%.. ఎస్పీవీ 10 శాతం భరించాలి. రూ.10 నుంచి 30 కోట్ల లోపు క్టస్లర్లకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 20, ఎస్పీవీ 20 శాతం నిధులివ్వాలి. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న 5 క్లస్టర్లకు రూ.60.80 కోట్లు వ్యయమవుతోంది. ఇందులో రాష్ట్ర వాటా రూ.11.36 కోట్లు, ఎస్పీవీ కింద రూ.6.33 కోట్లు మ్యాంచింగ్ గ్రాంట్‌ను విడుదల చేయడంతో పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. యంత్ర పరికరాలు, ఇతర నిర్మాణ పనులకు టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మొత్తం 108 క్లస్టర్లు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లాల వారీగా డిమాండ్ ఉన్న క్లస్టర్ల అభివృద్ధికి కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 108 క్లస్టర్లకు అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో ఇప్పటికే అయిదు క్లస్టర్ల పనులు ప్రారంభమయ్యాయి. మరో 38 క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. వీటిని ఎంఎస్ఎంఈ సీడీపీ కింద అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా 6,237 ఎంఎస్ఎంఈ యూనిట్లు వస్తాయి. 58,591 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మరో 65 క్లస్టర్లకు ఉన్న అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 1.13 లక్షల ఎంఎస్ఎంఈలు.. 11 లక్షల మందికి ఉపాధి ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,754 గుర్తింపు పొందిన ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.39,211 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 10.81 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఎంఎస్ఎంఈ యూనిట్లో కోటి రూపాయల పెట్టబడికి 28 మందికి ఉపాధి లభిస్తోంది. సగటున ప్రతి ఎంఎస్ఎంఈ 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా 24 శాతం ఎంఎస్ఎంఈలు సేవల రంగంలో ఉండగా, 18 శాతం వ్యవసాయ–ఆహారం రంగాలకు చెందినవి. నిర్మాణ రంగం 9 శాతం, టెక్స్టైల్స్ , ఫార్మా 8 శాతం చొప్పున ఉన్నాయి. -
ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశ పెట్టిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ అమలు ద్వారా రూ.4.1 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటి మూలంగా గడిచిన ఏడేళ్లలో 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించింది. ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ కౌన్సిల్, బిల్‌మార్ట్ ఫిన్‌టెక్ సంస్థల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయన వివరాలను ఎంఎస్ఎంఈ ఈపీసీ చైర్మన్ డీఎస్ రావత్, బిల్‌మార్ట్ ఫిన్‌టెక్ సీఈఓ వ్యవస్థాపకుడు జిగేశ్ సొనగరా గురువారం విడుదల చేశారు. 10 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే 38 వేర్వేరు ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు ఇవ్వడం.. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణను ప్రత్యేక స్థానంలో నిలబెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ సులభతర వాణిజ్య విధానానికి దోహదం చేసిందని వివరించారు. గతంలో వచ్చిన పెట్టుబడుల కంటే టీఎస్ ఐపాస్ అమలు ద్వారా గడిచిన ఏడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులే ఎక్కువని ఈ అధ్యయనం వెల్లడించింది. -
ఎంఎస్ఎంఈలతో భారీ ఉపాధి
రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నాం. అదే చేస్తున్నాం. మనం చేసే పనుల్లో నిజాయితీ ఉంది కాబట్టే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. భజాంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారు. అదానీ కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే కాకుండా రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ, ఇథనాల్ తయారీ రంగంలో వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త పారిశ్రామిక విధానాలు రూపొందించాలని కోరారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పరిశ్రమలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకంగా పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అందువల్లే పారిశ్రామిక వేత్తలు చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో నీరు, విద్యుత్, రోడ్లు, రైల్వే లైన్లకు సంబం«ధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తద్వారా వీలైనంత త్వరగా పరిశ్రమలు తమ పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. విశాఖపట్నం – చెన్నై కారిడార్‌లో నక్కపల్లి నోడ్, కాళహస్తి నోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖపట్నంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతున్నామని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంఎస్ఎంఈలకు అత్యుత్తమ సేవలు ► రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. అందుకని ఎంఎస్ఎంఈలకు చేదోడుగా నిలవాలి. పారిశ్రామిక ప్రోత్సాహకాలు వారికి సకాలంలో అందేలా చూడాలి. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. ► గత ప్రభుత్వం పెట్టిన ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించడమే కాకుండా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్లస్టర్ పద్ధతిలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి. ఒకే తరహా ఉత్పత్తులు అందిస్తున్న గ్రామాలను క్లస్టర్‌గా గుర్తించి, వారికి అండగా నిలవాలి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు అత్యుత్తమ సేవలు అందాలి. కాలుష్య నివారణకు ఊతమివ్వాలి ► పరిశ్రమల అభివృద్ధితో పాటు కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పారిశ్రామిక వాడల్లో పనిచేసే వారంతా మన కార్మికులే. వారి ఆరోగ్యాలను, పరిసరాలను, పరసరాల్లో నివాసం ఉండే వారి ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ► ఇందుకోసం పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి. అవి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేదా? అన్నది చూడాలి. అవసరమైతే పారిశ్రామిక వాడల్లో ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలి. ► ఎంఎస్ఎంఈలు ఉన్నచోట కాలుష్య జలాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. కాలుష్య నివారణలో ఎంఎస్ఎంఈలకు చేదోడుగా నిలవాలి. అప్పుడే పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించగలుగుతాం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో భారీగా ఉపాధి ► గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి లభించనుంది. వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు 66 వేల ఎకరాలకుపైగా భూమిని వినియోగించాల్సి ఉంటుంది. ► అర హెక్టార్ కన్నా తక్కువ భూమి ఉన్న జనాభా రాష్ట్రంలో 50 శాతం ఉండగా, ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న వారు 70 శాతం ఉన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానుంది. ఇలాంటి భూములను లీజు విధానంలో తీసుకుని, వారికి ఏటా ఎకరాకు దాదాపు రూ.30 వేలు చెల్లించేలా విధానం తీసుకు వస్తున్నాం. ► రైతుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కారణంగా సుమారు 30 వేల మందికిపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పంప్డ్ స్టోరేజ్ పవర్‌కు వ్యాల్యూ అడిషన్ చేస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై దృష్టిపెట్టాం. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ రంగంలో చాలా ముందడుగు వేస్తాం. పర్యావరణానికి కూడా మంచిది. దీనికి సంబంధించిన పాలసీ తయారు చేయాలి. ► రాష్ట్రంలో విస్తృతంగా ధాన్యం పండిస్తున్నారు. బియ్యాన్ని వాడుకుని ఇథనాల్ తయారీపై దృష్టి పెట్టాలి. ఆయిల్ ఫాం ప్రాసెసింగ్ యూనిట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీనిపై మంచి విధానాలు తీసుకురావాలి. ► ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్నా«థ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కె వెంకటరెడ్డి, ఏపీ టీపీసీ చైర్మన్ కె రవిచంద్రారెడ్డి, మారిటైం బోర్డు సీఈఓ షన్మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ మూడేళ్ల ప్రగతి -
ఎంఎస్ఎంఈ లపై ప్రత్యేక దృష్టి సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
డిజిటల్ పేమెంట్స్ బాటలో చిన్న సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 కష్టాల నుంచి క్రమంగా బైటపడుతున్న చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎక్కువగా డిజిటల్ పేమెంట్ విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాదీ సంస్థలు మరింత ముందున్నాయి. 76 శాతం సంస్థలు వీటిని వినియోగించుకుంటున్నాయి. దేశంలోనే ఇది అత్యధికం. చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలిచ్చే ఫిన్‌టెక్ సంస్థ నియోగ్రోత్ విడుదల చేసిన ఎంఎస్ఎంఈ ఇన్సైట్ రిపోర్ట్ 2022 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2020 మార్చి–2022 మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 88 పరిశ్రమల వ్యాప్తంగా 40,000 పైచిలుకు ఎంఎస్ఎంఈలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా నియోగ్రోత్ ఈ నివేదిక రూపొందించింది. మహమ్మారి విజృంభించిన సమయంలో ఎంఎస్ఎంఈలకు డిమాండ్‌పరంగా ఎదురైన పరిస్థితులు, రికవరీపై సహాయక చర్యల ప్రభావం, వ్యాపార నిర్వహణ కోసం డిజిటల్ వైపు మళ్లడం, రెండేళ్లుగా నిలదొక్కుకునేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను ఇందులో పరిగణనలోకి తీసుకుంది. ‘డిమాండ్ పడిపోయి, రుణాల చెల్లింపు భారం పెరిగిపోవడంతో 2020–21లో చాలా మటుకు ఎంఎస్ఎంఈలు చాలా సతమతమయ్యాయి. వ్యాపారం నిజంగానే దెబ్బతినడం వల్లే చాలా మటుకు సంస్థలకు అదనపు సహాయం అవసరమైందని కరోనా తొలినాళ్లలో మేము గుర్తించాము. సాధారణంగా ఎంఎస్ఎంఈ కస్టమర్లు నిజాయితీగానే ఉంటారు. రుణాలు తిరిగి చెల్లించే యోచనలోనే ఉంటారు. అందుకే వారికి అవసరమైన తోడ్పాటును మా వంతుగా మేము కూడా అందించాము‘ అని నియోగ్రోత్ సీఈవో అరుణ్ నయ్యర్ తెలిపారు. నివేదికలో మరిన్ని అంశాలు .. ► కోవిడ్–19 కష్టాల నుంచి గట్టెక్కడానికి దేశీయంగా 46 శాతం ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా సహాయం అవసరమైంది. ► కోవిడ్–19 రెండో వేవ్ వచ్చేనాటికి ఎంఎస్ఎంఈలు కాస్త సంసిద్ధంగా ఉన్నాయి. దీంతో ఒకటో వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో 30 శాతం సంస్థలు మాత్రమే ఆర్థిక సహాయం తీసుకున్నాయి. ► మెట్రోయేతర నగరాల్లో ఎంఎస్ఎంఈల రుణాలకు డిమాండ్ ఈ ఏడాది మార్చిలో తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకుంది. మెట్రో నగరాలు స్వల్పంగా వెనుకబడ్డాయి. బెంగళూరు, చెన్నైలో ఎంఎస్ఎంఈల రుణాలకు డిమాండ్ .. కోవిడ్ పూర్వ స్థాయిని మించింది. ► పెట్రోల్ బంకులు, ఇన్ఫ్రా, ఆటోమొబైల్ వంటి విభాగాలు మిగతా రంగాలతో పోలిస్తే వేగంగా కోలుకున్నాయి. ► గడిచిన రెండేళ్లలో ఎంఎస్ఎంఈలకు కొత్త అవ కాశాలు అందుబాటులోకి వచ్చాయి. రుణాలు పొందేందుకు, వ్యాపారాలను నిర్వహించుకునేందుకు పాటిస్తున్న సంప్రదాయ విధానాల స్థానంలో కొత్త తరం డిజిటల్ విధానాలు వచ్చేశాయి. చిన్న సంస్థల ఆర్థిక అవసరాలు తీర్చడంలో డిజిటల్ రుణాలకు ప్రాధాన్యం పెరిగింది. -
లక్ష్యం 2047.. పరిశ్రమలు
బ్రిటష్ పాలనలో దారుణంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) రంగం స్వాతంత్య్రానంతరం చెప్పుకోదగినంత పురోగతినే సాధించింది. ఒకప్పుడు గ్రీస్, రోమన్ సామ్రాజ్యాలకు మేలిమి వస్త్రాలను ఎగుమతి చేసిన భారతదేశం వలస పాలనతో తన వైభవాన్ని కోల్పోడానికి కారణం మన జౌళి ఎగుమతులపై బ్రిటిష్ వాళ్లు అపరిమితంగా సుంకాలు విధించడమే. భారతదేశాన్ని కేవలం ముడి సరకుల ఎగుమతిదారు స్థాయికి దిగజార్చి బ్రిటన్‌లో యంత్రాలపై తయారైన వస్తువులను భారతీయులకు అధిక ధరలకు అంటగట్టేవారు. పర్యవసానంగా స్థానిక కుటీర పరిశ్రమలవారు, చేతివృత్తుల వారు ఎన్నటికీ కోలుకోని విధంగా దెబ్బతిన్నారు. మిగతా రంగాలు కూడా ఇదే విధంగా క్షీణించి పోయాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 లో స్వదేశీ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానం ఏమంత సత్ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత 1956 నాటి పారిశ్రామిక విధానం గ్రామీణ, కుటీర, చిన్న పరిశ్రమలకు ఊతం ఇవ్వాలన్న లక్ష్యంతో ఏర్పడింది. 1991 నాటి పారిశ్రామిక విధానం కొన్ని సంస్కరణలను సూచించింది. 1997 పారిశ్రామిక విధానం చిన్న పరిశ్రమలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలుగా వర్గీకరించింది. 2006 నాటి ఎంఎస్ఎంఇ అభివృద్ధి చట్టం నిర్దిష్ట విధానాలను ముందుకు తెచ్చింది. 2020లో ఆత్మనిర్భర్ పథకంలో ఎంఎస్ఎంఇల వర్గీకరణకు కొత్త ప్రమాణాలు ప్రతిపాదనకు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన సుమారు డెబ్బై ఏళ్లకు 2015–16లో ఈ రంగం 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించిందని 73 వ జాతీయ నమూనా సర్వే పేర్కొంది. వచ్చే పాతికేళ్లలో కనుక విధానపరంగా ప్రోత్సాహం లభిస్తే ఈ రంగం మరింతగా పురోగమించగలదని అంచనా. -
ఎంఎస్ఎంఈ ప్రణాళికపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
సాక్షి, అమరావతి: రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో లక్ష సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) యూనిట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సర ప్రణాళికపై దృష్టి సారించింది. ఇందుకోసం ఎంఎస్ఎంఈ 2022–23 పేరుతో ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ పలు దేశాలు, రాష్ట్రాలు పర్యటించి అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. చదవండి: అంగన్వాడీ వర్కర్లకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు అలాగే రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక సంఘాల నుంచి సూచనలు స్వీకరించేందుకు కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయంలో 17వ తేదీన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 20కి పైగా సంఘాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎంఎస్ఎంఈ యాక్షన్ ప్లాన్‌లో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించనున్నారు. దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కార్యాచరణ ప్రణాళికను పరిశ్రమల శాఖ సేకరించింది. -
రూ.123 కోట్లతో 13 ఎంఎస్ఈ క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: ఏపీలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఎంఎస్ఈ క్లస్టర్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజైస్ క్లస్టర్ డెవలప్మెంట్ పోగ్రాం (ఎంఎస్ఈ–సీడీపీ) కింద కొత్తగా 13 క్లస్టర్లతతో పాటు ఏడు ఫ్యాక్టరీ షెడ్లు నిర్మించనుంది. సుమారు రూ.123.07 కోట్లతో 13 ఎంఎస్ఈ క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికలను తయారుచేసి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. 2,111.59 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్లస్టర్లకు సంబంధించిన ప్రతిపాదనలను న్యూఢిల్లీలోని ఎంఎస్ఎంఈ డీసీ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.33.66 కోట్లు సమకూర్చనుండగా, కేంద్రం గ్రాంట్ రూపంలో రూ.89.41 కోట్లు కేటాయిస్తుంది. హిందూపురం గ్రోత్ సెంటర్, గుంటూరు ఆటోనగర్, మచిలీపట్నం జ్యూవెలరీ పార్కు, కర్నూలు పారిశ్రామిక పార్కు, కడప, నడికుడి పారిశ్రామికపార్కులు, కానూరు, ఒంగోలు ఆటోనగర్లు, నెల్లిమర్ల, తణుకు, గాజులమండ్యం,రాయచోటి, తిరుపతి పారిశ్రామికపార్కుల్లో ఈ ఎంఎస్ఈ–సీడీపీ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ పథకం కింద రూ.11 కోట్లతో కానూరు, ఆమదాలవలస ప్రాజెక్టులను పూర్తిచేయగా, రూ.74.72 కోట్లతో మరో 6 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. యూనిట్లు తక్షణం ఉత్పత్తిని ప్రారంభించుకునే విధంగా 29.14 ఎకరాల విస్తీర్ణంలో రూ.88.62 కోట్లతో ఏడుచోట్ల ఫ్లాటెడ్ ప్యాక్టరీ షెడ్లను నిర్మించనున్నారు. ఆత్మకూరు, మల్లవల్లి, పలమనేరు పారిశ్రామికపార్కులతో పాటు తిరుపతి–1, తిరుపతి–2, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లతో పాటు అచ్యుతాపురం నాన్‌సెజ్ ఏరియాలో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.17.97 కోట్లు ప్రభుత్వం సమకూర్చనుండగా మిగిలినది కేంద్రం గ్రాంట్ రూపంలో ఇస్తుంది. వీటి డీపీఆర్‌లను కేంద్రానికి పంపామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నారు. -
చిన్నవే దేశ భవితకు పెద్ద దిక్కు
ప్రపంచ వ్యాప్తంగా ‘మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్‌లు’ (ఎంఎస్ఎంఈ లు) ఆర్థికాభివృద్ధిపరంగా మొత్తం పారిశ్రామిక రంగానికి ఇంజన్‌లాగా పని చేస్తున్నాయని ఆర్థికవేత్తలు గుర్తించారు. 140 కోట్ల మంది జనాభా గల మన దేశంలో పేదరికం పోవాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ఆదాయ అసమానతలు తగ్గాలన్నా... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధితోనే సాధ్యం. అంతేగాక భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే ఈ తరహా పరిశ్రమల అభివృద్ధి అత్యంత ఆవశ్యకం. చైనాలో ఇంటింటికీ ఒక కుటీర పరిశ్రమ ఉండటం, చైనా ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా చలామణి అవ్వడంలో అక్కడి ప్రభుత్వ పెద్దల నిబద్ధత ఎంతో ఉంది. అందుకే చైనా నేడు ప్రపంచ కర్మాగారంగా ఉంది. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని మన దేశంలోలాగా చైనా పాలకులు అనుకోవడం లేదు. చైనాలో స్థానికంగా పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి పరిచినందువలన అక్కడి పేదరికం పోయింది. దీనికి గాను ప్రజలకు రుణాల రూపంలో పెట్టుబడులు సమకూర్చడం, వారికి తగిన శిక్షణ ఇవ్వడం, పరిశ్రమలకు కావలసిన సాంకేతిక సామగ్రిని అందించడం, మార్కెట్లను చూపించడం లాంటి పనుల్లో ప్రభుత్వం ఒక వైపు, ప్రైవేట్ పారిశ్రామిక రంగం మరొకవైపు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మన దేశం సంగతికొస్తే... ఈ ఎంఎస్ఎంఈల ద్వారా నేడు పారిశ్రామిక రంగంలో 97 శాతం ఉద్యోగ కల్పన జరుగుతున్నది. భారీ పరిశ్రమల ద్వారా కేవలం 3 శాతం మాత్రమే ఉద్యోగావకాశాలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 6.3 కోట్ల సంస్థలు ఎనిమిది వేల రకాల ఉత్పత్తులను చేస్తూ మన స్థూల జాతీయ ఉత్పత్తిలో 30 శాతం వాటా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 33 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ అసంఘటిత రంగంలో ఉన్నాయి. వీటిని సంఘటితపరచి ఆర్థికపరమైన, సాంకేతికపరమైన సహాయం అందించి, సబ్సిడీలు కల్పిస్తే ఉపాధి కల్పనలో, ఆదాయాలు పెంపొందించడంలో దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో వీటి అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఏర్పరిచారు. అయితే వీటికి ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహకాలు అందడం లేదనే విమర్శ ఉంది. మన రాష్ట్రంలో 25.96 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటిలో 70.69 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఏపీలో గత ప్రభుత్వం నిరాదరణ వల్ల అనేక ఎంఎస్ఎంఈలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. దీనికి తోడు కోవిడ్ సంక్షోభం వాటిని మరింత కుంగదీసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ మూతపడకూడదన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ‘రీస్టార్ట్ ప్యాకేజీ’ని ప్రకటించింది. దీని కింద ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం బకాయి పడిన రాయితీలతో పాటు ప్రస్తుత రాయితీలు కూడా కలిపి రూ. 2,086 కోట్లు విడుదల చేసింది. (చదవండి: శ్రమ విలువ తెలుసు కాబట్టే...) అంతేగాకుండా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దేశంలోనే తొలిసారిగా ‘వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకా’న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 2020–21లో ఎంఎస్ఎమ్ఈలకు చెందిన ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ. 235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22 కాలంలో ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ. 111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ. 24.41 కోట్లు రాయితీలను విడుదల చేసింది. ఈ విధంగా దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందిస్తే... దేశం వాయువేగంతో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందనడంలో సందేహం లేదు. (చదవండి: వికేంద్రీకరణ ఫలితాలు ఇప్పటికే షురూ!) - ఎనుగొండ నాగరాజ నాయుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ -
ఎంఎస్ఎంఈలకు మరింత ప్రోత్సాహం!
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పురోగతి లక్ష్యంగా కేంద్రం జెడ్ఈడీ (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్) సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, లాభాలను పెంచడం, పర్యావరణంపై హానికరమైన పద్దతులను నియంత్రించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సంబంధించి తాజా పథకం ప్రయోజనకరంగా ఉంటుంనది మంత్రి రాణే తెలిపారు. ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ పథకంలో భాగమైన జెడ్ఈడీ ధృవీకరణ పథకం ద్వారా వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చని, ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని, పర్యావరణ స్పృహపై అవగాహన పెరుగుతుందని, సహజ వనరులను అత్యుఉత్తమంగా ఉపయోగించుకోవచ్చని, మార్కెట్ విస్తరించుకోవచ్చని మంత్రి వెల్లడించారు. బహుళ ప్రయోజనం... అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ పథకం కాంస్య, వెండి, బంగారంతో సహా మూడు ధృవీకరణ స్థాయిలను కలిగి ఉంటుంది. ఎంఎస్ఎంఈలు ఏదైనా ధృవీకరణ స్థాయికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన ప్రమాణాలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. పథకం కింద దాదాపు 20 మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ఎంఎస్ఎంఈలు జెడ్ఈడీ మార్గర్శకాల దిశగా చర్యలు తీసుకోవాలి. జెడ్ఈడీ ధృవీకరణ వ్యయంపై ఎంఎస్ఎంఈలు సబ్సిడీని పొందుతాయి. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ధృవీకరణ ఖర్చులో 80 శాతం వరకు సబ్సిడీ మొత్తం ఉంటుంది, అయితే చిన్న, మధ్యస్థ యూనిట్లకు ఇది వరుసగా 60 శాతం, 50 శాతంగా ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు 10 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది. పైన పేర్కొన్న వాటికి అదనంగా మంత్రిత్వ శాఖ యొక్క స్పూర్తి లేదా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ – క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈ–సీడీపీ) భాగమైన ఎంఎస్ఎంఈలకు 5 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది. ఇంకా, జెడ్ఈడీ మార్గదర్శకాలు, ప్రమాణాలు పాటించడం ప్రారంభించిన తర్వాత ప్రతి ఎంఎస్ఎంఈకి పరిమిత ప్రయోజనం చేకూర్చే విధంగా రూ. 10,000 రివార్డు ప్రదానం జరుగుతుంది. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ సొల్యూషన్స్ వైపు వెళ్లేందుకు ప్రోత్సాహకరంగా వారికి జెడ్ఈడీ సర్టిఫికేషన్ కింద హ్యాండ్‌హోల్డింగ్, కన్సల్టెన్సీ మద్దతు కోసం ఎంఎస్ఎంఈకి రూ. 5 లక్షల వరకూ కేటాయింపు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్థిక సంస్థలు మొదలైన వాటి ద్వారా జెడ్ఈడీ సర్టిఫికేషన్ కోసం అందించే అనేక ఇతర ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు. ఎంఎస్ఎంఈ కవచ్ (కోవిడ్–19 రక్షణ నిమిత్తం) చొరవ కింద ఉచిత ధృవీకరణ కోసం కూడా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. -
చిన్న పరిశ్రమల కోసం కొత్త క్లస్టర్లు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు వ్యవస్థాపకులు తమ యూనిట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రధాన పారిశ్రామికవాడల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయనుంది. మరోవైపు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంఎస్ఎంఈల నడుమ పోటీ తత్వాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలతో పాటు అవార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఎంఎస్ఎంఈలో ఉత్పాదకత, సృజనాత్మకత, భద్రతకు సంబంధించిన కృషిని గుర్తిస్తూ రాష్ట్ర స్థాయితో పాటు 33 జిల్లాల్లో అవార్డులు ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ‘తెలంగాణ ముత్యాలు’పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం 2022–23 బడ్జెట్లో రూ.50 లక్షలు కేటాయించింది. ఉత్పాదకత, నాణ్యత మెరుగు పరిచేలా.. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లలో ఉమ్మడి సదుపాయాల కేంద్రాలను పరిశ్రమల శాఖ నెలకొల్పుతుంది. తద్వారా ఉత్పాదకత, నాణ్యతను మెరుగు పరుచుకోవంతో పాటు ముడిసరుకు కొనుగోలు, మార్కెటింగ్‌లో సంప్రదింపులు బలోపేతం చేసుకునే వెసులుబాటు ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు లభిస్తుంది. కేంద్ర సర్కారు భాగస్వామ్యం క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక క్లస్టర్లకు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సాయం అందిస్తోంది. రాష్ట్రాలు కూడా తమ వంతు వాటాగా క్లస్టర్ల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో 12 క్లస్టర్లు ఈ పథకంలో భాగంగా పురోగతిలో ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 19 జిల్లాల్లో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో క్లస్టర్ ఏర్పాటుకు రూ.10 కోట్లు చొప్పున అవసరమవుతాయని అంచనా వేయగా, ఇందులో కేంద్రం వాటాగా రూ.8 కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.2 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా రూ.38 కోట్లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నా కొన్ని సందర్భాల్లో పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులు లేక యూనిట్ల స్థాపన ఆలస్యమవుతోంది. దీంతో పెట్టుబడిదారులపై అదనపు భారం పడటంతో పాటు అనుమతులు ఉన్నా ఉత్పత్తి దశకు చేరేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రధాన పారిశ్రామిక వాడల్లో ప్లగ్ అండ్ ప్లే (వాడుకోవడానికి సిద్ధంగా ఉండేలా) సౌకర్యాలను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడిదారులు తమ యూనిట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని (ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంపెŠల్క్స్) ప్రకటించింది. ఈ పథకం నిబంధనల మేరకు ఒక్కో పారిశ్రామికవాడకు తన వంతు వాటాగా కేంద్రం రూ.12 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 27 పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా రూ.81 చెల్లించేందుకు సుముఖత చూపుతోంది. -
చిన్న సంస్థల ఎగుమతుల కోసం మార్కెట్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్!
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు ఊతమిచ్చేందుకు అంతర్జాతీయ మార్కెట్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తెలిపారు. విదేశీ మార్కెట్లకు ఎగుమతుల డేటా సంబంధ సమాచారానికి ఇది కేంద్రంగా ఉండగలదని ఆయన వివరించారు. ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఈడీఐఐ) నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. గణాంకాల ప్రకారం.. భారత ఎగుమతుల్లో దాదాపు 45 శాతం వాటా ఎంఎస్ఎంఈ రంగానిదే ఉంటోంది. అయితే, విదేశీ మార్కెట్లకు సంబంధించిన విశ్వసనీయ వాణిజ్య గణాంకాలు అందుబాటులో లేకపోతుండటం వల్ల చిన్న సంస్థలు తమ సామర్థ్యాల మేరకు ఎగుమతులు చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ఎంఈ రంగాన్ని పటిష్టం చేసేందుకు, రుణ లభ్యత పెంచేందుకు, మెరుగైన సాంకేతికత అందించేందుకు, ఎగుమతి మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి అయిన రాణె వివరించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని దేశ ఎకానమీకి చోదక శక్తిగా మార్చేందుకు తగు మార్గదర్శ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత వర్గాలకు ఆయన సూచించారు. దీటుగా పోటీపడేలా చిన్న సంస్థలను తీర్చిదిద్దేందుకు మరింత అధ్యయనం, ఆవిష్కరణలు, సరికొత్త వ్యాపార ఐడియాలు అవసరమని రాణె చెప్పారు. -
ఎంఎస్ఎంఈలకు రూ.6,062 కోట్లు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ప్రపంచబ్యాంకు సహకారంతో కూడిన 6,062 కోట్ల పథకానికి (ర్యాంప్) ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా మార్కెట్ అనుసంధానత, రుణ సాయం మెరుగుపడనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ర్యాంప్ అమల్లోకి వస్తుందని ప్రభు త్వం తెలిపింది. రూ.6,062 కోట్లలో రూ.3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,312 కోట్లను కేంద్రం సమ కూరుస్తుంది. కరోనా తర్వాత ఎంఎస్ఎంఈ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం తెలిసిందే. -
మహిళా ఎంట్రప్రెన్యూర్షిప్ కోసం ‘సమర్థ్’
International Women's Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని .. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్ఎంఈ) సోమవారం ’సమర్థ్’ పేరిట ప్రత్యేక స్కీమును ఆవిష్కరించింది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు స్వావలంబన సాధించేందుకు ఇది తోడ్పడగలదని ఈ సందర్భంగా కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణె తెలిపారు. సమర్థ్ కింద ఎంఎస్ఎంఈ శాఖ నిర్వహించే నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణా స్కీములు అన్నింటిలోనూ మహిళలకు 20 శాతం సీట్లను ఔత్సాహిక మహిళా ఎంట్రప్రెన్యూర్లకు కేటాయిస్తామని పేర్కొన్నారు. 2022–23లో దీనితో 7,500 మంది పైచిలుకు మహిళలకు ప్రయోజనం చేకూరగలదని ఆయన వివరించారు. ఇక మార్కెటింగ్పరమైన సహకారం అందించే పథకాల్లో భాగంగా దేశ, విదేశ ఎగ్జిబిషన్లకు పంపించే ఎంఎస్ఎంఈ వ్యాపార బృందాల్లో 20 శాతం వాటా మహిళల సారథ్యంలోని సంస్థలకు లభిస్తుందని మంత్రి చెప్పారు. అలాగే 2022–23లో జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ)కి సంబంధించిన కమర్షియల్ స్కీముల వార్షిక ప్రాసెసింగ్ ఫీజులో 20 శాతం రాయితీ కూడా మహిళా ఎంట్రప్రెన్యూర్లు పొందవచ్చని పేర్కొన్నారు. -
చిన్న పరిశ్రమలకు సాయం చేద్దాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈల) అభివృద్ధికి, యువతలో నైపుణ్యాభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కరోనా కష్ట సమయంలో రీచార్జ్ ప్యాకేజితో పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంది. ఎంఎస్ఎంఈల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నాబార్డు కూడా దన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంచాలని నిర్ణయించిందని నాబార్డు రాష్ట్ర ఫోకస్ పత్రంలో స్పష్టం చేసింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. రాష్ట్రంలో 2022 –23 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.52,468.55 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఇందులో మూల ధనం కింద రూ.18,400.93 కోట్లు, పెట్టుబడి రుణం కింద రూ.34,067.62 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపింది. పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు బ్యాంకులు సహాయం అందించాలని చెప్పింది. మూత పడిన యూనిట్ల పునరుద్ధరణకు బ్యాంకులు ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వైఎస్సార్ నవోదయం పేరిట వన్‌టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆ పత్రంలో నాబార్డు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపింది. వ్యవసాయ రంగంలో రైతులకు, ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. -
ఎంఎస్ఎంఈ ఈసీఎల్జీఎస్ స్కీంతో ఎకానమీకి భారీ భరోసా!
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) ప్రయోజనాలకు సంబంధించి ఆవిష్కరించిన అత్యవసర రుణహామీ పథకం(ఈసీఎల్జీఎస్) వల్ల ఎకానమీకి భారీ ప్రయోజనాలు కలిగినట్లు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. ఈ పథకం వల్ల దాదాపు 13.5 లక్షల సంస్థలు దివాలా చర్యల నుంచి రక్షణ పొందాయని, ఫలితంగా 1.5 కోట్ల మంది ఉద్యోగాలకు రక్షణ లభించిందని విశ్లేషించింది. కోవిడ్-19 ప్రేరిత లాక్డౌన్ కారణంగా వివిధ రంగాలకు, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలకు రుణాన్ని అందించడం ద్వారా వాటిని కష్టాల్లో నుంచి గట్టెక్కించడానికి మే 2020లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించారు. దీనిలో అత్యవసర రుణహామీ పథకం ప్రధాన భాగంగా ఉంది. ఆయా అంశాలపై ఎస్బీఐ రిసెర్చ్ తాజా సమీక్షాంశాలను పరిశీలిస్తే.. ఈసీఎల్జీఎస్ (పునర్వ్యవస్థీకరణ సహా) కారణంగా దాదాపు 13.5 లక్షల సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఖాతాలు ప్రయోజనం పొందాయి. ఇలాంటి ఖాతాల్లో దాదాపు 93.7 శాతం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ కేటగిరీలో ఉన్నాయి. మహమ్మారి కాలంలో రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలు మొండిబకాయిల్లోకి (ఎన్పీఏ) జారిపోకుండా రక్షణ పొందాయి. ఈ సంస్థలు మొండిబకాయిలుగా మారితే 1.5 కోట్ల కార్మికులు నిరుద్యోగులుగా మారేవారు. ఒక్కొక్కరి కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురిగా భావిస్తే, ఆరు కోట్ల జీవిత అవసరాలకు రుణ హామీ పథకం రక్షణ కల్పించింది. ఈ పథకం వల్ల లబ్ది పొందిన రాష్ట్రాల్లో తొలుత గుజరాత్ ఉంది. తరువాతి స్థానంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. (చదవండి: Bitcoin: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర..!) -
AP: పెట్టుబడులకు పెట్టని కోట
సాక్షి, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సింహద్వారంగా మారుతోంది. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయనేందుకు ప్రముఖ కంపెనీల మనోగతమే నిదర్శనం. పెట్టుబడుల ప్రతిపాదనలతో రావడమే ఆలస్యం అతి వేగంగా కీలకమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తుండటంతో పునాది సమయంలోనే కార్పొరేట్ సంస్థలు విస్తరణ ప్రణాళికలను సైతం ప్రకటిస్తుండటం గమనార్హం. ఇటీవల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించకుండానే విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. పాత బకాయిలు సైతం.. గత సర్కారు మాదిరిగా పారిశ్రామిక రాయితీలను ఎగ్గొట్టకుండా సకాలంలో ఇవ్వడంతోపాటు పాత బకాయిలను సైతం పిలిచి మరీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగింది. ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్ పరిశ్రమలకు మొదటి విడతలో రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం రెండో విడతలో ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్టైల్ రూ.684 కోట్లు ఇచ్చింది. ఇప్పటి వరకు రూ.2,248 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేసింది. గత సర్కారు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించింది. నిర్వహణ వ్యయం తగ్గడంతో లాభాలు.. ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా ప్రతిపాదనల దగ్గర నుంచి ఓ కంపెనీకి జీవిత కాలం అండగా నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండే విధంగా, కంపెనీలకు మెరుగైన ఆదాయం లభించేలా అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం అభివృద్ధి చేసి అందచేస్తోంది. దీంతో పలు సంస్థలు ఉత్పత్తి ప్రారంభం కాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం ఇలా.. ► జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) రాష్ట్రంలో భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన సంస్థ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో పెట్టుబడుల ప్రతిపాదనను రూ.2,500 కోట్లకు పెంచింది. ► తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్న సెంచరీ ప్లైవుడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో యూనిట్ ఏర్పాటుకు అంగీకరించింది. ప్రతిపాదన అందిన రెండు నెలల్లోనే యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా ఇవ్వడంతో సెంచరీ ఫ్లైవుడ్ తన పెట్టుబడులను రూ.600 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంక స్వయంగా ప్రకటించారు. ► కేవలం ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుందని డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ స్థాపించే యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేయనున్నామని, యూనిట్‌ను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ► రూ.50 కోట్లతో బ్లూటూత్, పవర్ బ్యాంక్, రూటర్స్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల యూనిట్‌ను సెల్కాన్ రెజల్యూట్ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వై.గురు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా మరింత విస్తరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వైఎస్ఆర్ ఈఎంసీలో ఆరు ఎకరాలు తీసుకున్నట్లు చెప్పారు. ► యాపిల్, రెడ్మీ లాంటి ప్రముఖ బ్రాండ్స్ సెల్ఫోన్లు తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లను నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ జోష్ ఫల్గర్ ఇప్పటికే ప్రకటించారు. వైఎస్ఆర్ ఈఎంసీలో యూనిట్ ఏర్పాటు చేయాలంటూ ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించడాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. ► రాష్ట్రం నుంచి కియా మోటార్స్ చెన్నై తరలి వెళ్లిపోతోందంటూ ఓ వర్గం మీడియా చేసిన ప్రచారంలో నిజం లేదని ఇప్పటికే స్పష్టమైంది. ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ రూ.409 కోట్లతో విస్తరణ ప్రణాళికను సైతం కియా మోటార్స్ ప్రకటించింది. ఏపీలో సరికొత్త నినాదం.. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు. – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ అంతకు మించి.. తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక మరిన్ని కంపెనీలను తీసుకొస్తాం పెట్టుబడి ప్రతిపాదన అందచేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు అనేక కంపెనీలను తీసుకురావడానికి కృషి చేస్తాం. – పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ ప్రకటన -
భీమిలిలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్కు
మధురవాడ(భీమిలి): భీమిలి నియోజకవర్గంలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. రుషికొండ సమీపంలోని రాడిసన్స్ బ్లూ హోటల్లో సోమవారం నిర్వహించిన ‘దేశీ–2021 ఆంధ్రప్రదేశ్’ వర్క్‌షాప్‌నకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు చేపట్టి సమర్ధవంతమైన పాలన అందిస్తోందన్నారు. కరోనా కాలంలోనూ రాయితీలు కరోనా కష్టకాలంలోనూ టెక్స్టైల్ రంగానికి రూ.600 కోట్ల ప్రోత్సాహకాలతోపాటు ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి..రూ.వెయ్యి కోట్ల గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని వెల్లడించారు. ఐటీ పరిశ్రమలకు సంబంధించిన బకాయిలు రూ.30 కోట్లు ఉన్నాయని వాటిని, ఈ ఏడాది చెల్లిస్తామని చెప్పారు. ఈ –గవర్నెన్స్, ఇంటర్నెట్ వంటి అంశాల్లో భవిష్యత్‌లో దేశంలోనే ఏపీ బెస్ట్ అనిపించుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభించాలని నిర్ణయించారని చెప్పారు. 2 వేలు పైబడి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు కస్టమ్స్ సహా పలు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్రం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా నిలుస్తోందని మంత్రి మేకపాటి తెలిపారు. కొత్త పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ఎటువంటి అవాంతరాలు ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పెట్టుబడిదారుల అనుకూల విధానాలతో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్స్ సొసైటీ(ఏపీఐఎస్).. అరŠాత్యన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఈఐటీఏ–నేషనల్ రీసెర్చ్ డిజైన్ కార్పొరేషన్ల మధ్య మంత్రుల సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, వర్చువల్‌గా డీఆర్డీవో చైర్మన్ సతీష్‌రెడ్డి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
మోతీలాల్ ఓస్వాల్ ఎంఎస్‌ఈఐ ఇండెక్స్ ఫండ్
మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మోతీలాల్ ఓస్వాల్ ఎంఎస్సీఐ ఈఏఎఫ్‌ఈ టాప్ 100 సెలక్ట్ ఇండెక్స్ ఫండ్’ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీనిద్వారా ఎంఎస్‌ఈఐ ఈఏఎఫ్ఈలో టాప్–10 దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని పేర్కొంది. యూరోప్, ఆస్ట్రేలియా తదితర 21 వర్ధమాన మార్కెట్ల వెయిటేజీతో ఎంఎస్సీఐ ఈఏఎఫ్ఈని ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి తీసుకొచ్చిన మొదటి ఇండెక్స్ ఫండ్ ఇదని, దీనివల్ల అంతర్జాతీయంగా ఉన్న చక్కని అవకాశాలను కోల్పోకుండా చూసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 15న మొదలై.. 25న ముగుస్తుంది. -
విశాఖలో మరో ఎంఎస్ఎంఈ పార్క్
సాక్షి, అమరావతి: విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) పార్కును అభివృద్ధి చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సహా పార్కు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన భూమి వరల్డ్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వంద ఎకరాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా.. 20 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ‘భూమి వరల్డ్ గ్రూప్’ ప్రతిపాదనపై చర్చించారు. దీన్ని మరోసారి పరిశీలించి నివేదికివ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది పాల్గొన్నారు. ఇండో–జపాన్ ప్రతినిధుల భేటీ మంత్రి గౌతమ్‌రెడ్డితో ఇండో–జపాన్ ప్రతినిధులు మరోసారి సమావేశమయ్యారు. పెట్టుబడులు, ఐటీ పార్కులు, సెజ్‌లు, టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ తదితర అంశాలపై మంత్రి చర్చించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ పాల్గొన్నారు. -
ఇక విద్యుత్ వృథా వ్యథకు చెక్!
స్వల్ప పెట్టుబడితో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల్లో విద్యుత్ వృథా అరికట్టడంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) దృష్టి సారించింది. ఐఐటీలో చదివి హైదరాబాద్‌లో స్టార్టప్ కంపెనీ ప్రారంభించిన ఔత్సాహిక ఇంజనీర్లు రూపొందించిన ఆటోమేటిక్ పవర్ మానిటరింగ్ డివైజ్ ద్వారా విద్యుత్తు వృథాను సమర్థంగా అరికట్టవచ్చని గుర్తించారు. దీన్ని ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అని వ్యవహరిస్తున్నారు. ఏమిటీ ఐఓటీ? ఆటోమేటిక్ పవర్ మానిటరింగ్ డివైజ్‌ను ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. విద్యుత్‌తో పనిచేసే ప్రతి పరికరాన్నీ ఈ డివైజ్‌కు అనుసంధానిస్తారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, యంత్రాల్లో సాంకేతిక లోపాలు, విద్యుత్ సరఫరాలో వృథా, ఏది ఎంత విద్యుత్ వినియోగిస్తోందనే వివరాలను ఈ డివైజ్ సమగ్రంగా విశ్లేషించి మొబైల్ ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు విద్యుత్ వృథాను అరికట్టడంతో పాటు నాణ్యమైన కరెంట్ సరఫరాకు చర్యలు తీసుకుంటారు. ఫలితంగా అనవసర వినియోగం తగ్గిపోయి బిల్లులు కూడా తక్కువగా వస్తాయి. దీని ద్వారా దూరం నుంచే నియంత్రించే వీలుంది. పిట్ట కొంచెం..కూత ఘనం పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు స్ధిర, శక్తి చార్జీలు విధిస్తారు. స్థిర చార్జీలు కేవీఏకు రూ.470, శక్తి చార్జీలు యూనిట్‌కు రూ.6.7 పైసలు చొప్పున ఉంటాయి. అధిక బిల్లులను నివారించడానికి కెపాసిటర్ బ్యాంకులు, ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్స్‌ను ఉపయోగిస్తారు. పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) సరిచేయడంలో ఏదైనా లోపం తలెత్తితే వెంటనే గుర్తించలేం. ఒకవేళ గుర్తించాలన్నా దాదాపు రూ.1,50,000 నుంచి రూ.2,00,000 వరకూ ఖర్చు చేయాలి. కేవలం రూ.20 వేలు ఖర్చయ్యే పోర్టబుల్ పరికరం ద్వారా దీన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. (చదవండి: గత 7 ఏళ్లలో భారీగా పెరిగిన సౌరశక్తి సామర్థ్యం) ప్రయోగం విజయవంతం తూర్పు గోదావరి జిల్లా పద్మ సిరామిక్స్‌లో గతేడాది మార్చిలో తొలిసారి ప్రయోగాత్మకంగా అమర్చిన ఈ పరికరం విజయవంతంగా పనిచేసింది. పరిశ్రమలోని పవర్ ప్యానెల్ సరిగా పనిచేయడం లేదని, కొన్ని స్విచ్ కాంటాక్టులు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఐవోటీ పరికరం గుర్తించింది. అనుసంధానం చేసిన అన్ని పరికరాలకు ప్రతి 30 నిమిషాలకు క్రమం తప్పకుండా డేటాను అందించింది. సగటు శక్తి కారకం 0.87 కు పడిపోతున్నట్లు గమనించి మొబైల్‌ఫోన్ ద్వారా అప్రమత్తం చేసింది. మూడు కెపాసిటర్ బ్యాంకులు దెబ్బతిన్నట్లు గుర్తించి వెంటనే మార్చారు. ఫేజ్ 3లో ఒక కాంటాక్టర్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గమనించి సరి చేశారు. ఐఓటీ పరికరం ఈ సమస్యను గుర్తించకుంటే సరిదిద్దేందుకు కనీసం నెల గడిచేది. ఐవోటీ ద్వారా మొత్తం క్లస్టర్లో సుమారు 11,000 యూనిట్ల వాడకం తగ్గడం ద్వారా ఏడాదిలో రూ.80,000 ఆదా అయింది. ప్లాంట్‌లో ఉత్పత్తి పెరిగి నష్టాలు తగ్గాయి. కర్చన ఉద్గారాల తగ్గింపుతో పర్యావరణహితంగా మారింది. (చదవండి: ఈ సోలార్ కారును ఏడాదికి రెండు సార్లు ఛార్జ్ చేస్తే చాలు!) రాష్ట్రమంతా విస్తరిస్తాం.. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా 65 ఎంఎస్ఎంఈల్లో ఐఓటీ పరికరాలను అమర్చాలని బీఈఈ భావించింది. రూ.13 లక్షల నిధులతో ఉచితంగానే పరికరాలను అమర్చుతోంది. 65 ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆదాపై అధ్యయనం నిర్వహించి అనంతరం అన్ని ఎంఎస్ఎంఈలకు విస్తరించే కార్యక్రమాన్ని బీఈఈ చేపడుతుంది’’ -వినీత కన్వాల్, డైరెక్టర్, బీఈఈ. బిల్లు తగ్గుతోంది.. ‘‘ఐఓటీ పరికరం బిగించిన తర్వాత మూడు క్లిష్టమైన సమస్యలను గుర్తించడంలో నాకు సహాయపడింది. దీనివల్ల విద్యుత్తు బిల్లు తగ్గుతోంది. ఈ పరికరం నా మొబైల్‌కు హెచ్చరికలను పంపిస్తుంది. విద్యుత్ బిల్లు వచ్చాక బాధపడకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తోంది. ఊరికి దూరంగా ఉన్నప్పటికీ ఈ పరికరం తనపని తాను చేసుకుపోతోంది’’ -శంకర్, చైర్మన్, పద్మ సెరామిక్స్ -
‘అనంత’లో 3 ఎంఎస్ఎంఈ పార్క్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా మూడు ఎంఎస్ఎంఈ పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. అనంతపురం జిల్లా కోటిపి, రాప్తాడు, కప్పలబండలో ఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం మొత్తం రూ.18.11 కోట్లు వ్యయం చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రూ.7.46 కోట్లతో కోటిపి ఎంఎస్ఎంఈ పార్కు, రూ.4.83 కోట్లతో రాప్తాడు పార్కు, రూ.5.82 కోట్లతో కప్పలబండ పార్క్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఒక్కొక్కటి సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కులలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారు. ఇందులో ఇప్పటికే కోటిపి పార్కులో అంతర్గత, బహిర్గత రహదారులు, వరద.. మురుగు నీటి కాల్వలు, వీధి దీపాలు, నీటి సరఫరా వంటి కీలకమైన మౌలిక వసతులను కల్పించడానికి రూ.7.46 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. రాప్తాడు, కప్పలబండల ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనుంది. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద పీట వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకునేందుకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఇప్పటి వరకు రూ.2,086.42 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసింది. ఇందులో రూ.1,588 కోట్లు గత ప్రభుత్వ హయాంకు చెందినవి కావడం గమనార్హం. తద్వారా రాష్ట్రంలో సుమారు 98,000 కుపైగా ఎంఎస్ఎంఈల్లో పని చేస్తున్న 12 లక్షల మంది ఉపాధికి భరోసా కల్పించినట్లయ్యింది. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నెల్లూరు జిల్లాలో రూ.30 కోట్లతో 173.67 ఎకరాల్లో ప్లాస్టిక్, ఫర్నిచర్ పార్కు, చిత్తూరు జిల్లా గంధరాజుపల్లిలో ఎంఎస్ఎంఈ క్లస్టర్ పనులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్ఈ–సీడీపీ కింద రూ.61 కోట్లతో ఐదు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. -
డిజిటల్ రుణాల బాటలో బ్యాంకులు
ముంబై: డిజిటల్ రుణాల విధానం బ్యాంకింగ్ ముఖచిత్రాన్ని భారీ స్థాయిలో మార్చేస్తోందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ జి తెలిపారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో రిటైల్, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ)కు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో దాదాపు సగభాగం వాటా డిజిటల్ రుణాల ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఉండగలవని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల వార్షిక సదస్సు సిబాస్ 2021లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు చెప్పారు. డిజిటల్ రుణాల విభాగం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో కస్టమర్లకు ఆన్లైన్లోనే సరీ్వసులు అందించగలిగేలా తగు సాధనాలను బ్యాంకులు రూపొందించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో పెను మార్పులు చోటు చేసుకోగలవన్నారు. మరోవైపు ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) వచి్చన తొలినాళ్లలో అది బ్యాంకింగ్‌కు పోటీగా మారుతుందనే అభిప్రాయాలు ఉండేవని, ప్రస్తుతం రెండూ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని రాయ్ చెప్పారు. ‘ఫిన్‌టెక్‌లు ప్రస్తుతం బ్యాంకులకు సహాయపడుతున్నాయి. అవి మాకు పోటీ కాదు‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు నిరంతరం టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలని, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలని రాయ్ సూచించారు. టెక్నాలజీలో నిపుణులు, కొత్త ఆవిష్కరణలు చేసే ప్రతిభావంతులను నియమించుకోవడం పై ప్రభుత్వ రంగ బ్యాంకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఇంధన పొదుపుపై కసరత్తు
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల్లో భారీ స్థాయిలో ఇంధన పొదుపునకు అవకాశం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యలను ప్రోత్సహించడం, అత్యాధునిక ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా పెద్దఎత్తున ఇంధనాన్ని ఆదా చేయడానికి అవకాశం ఉందని నమ్ముతోంది. ఈ దృష్ట్యా ఇంధన ఆడిట్ నిర్వహించేలా ఎంఎస్ఎంఈ యజమానులను ప్రోత్సహించాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది. రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్ ఆదా పరిశ్రమల్లో ఇంధన వినియోగం ఏటా 17,000 మిలియన్ యూనిట్లు ఉండగా..ఇందులో ఎంఎస్ఎంఈలు 5,000 మిలియన్ యూనిట్లు వినియోగించుకుంటున్నాయి. కనీసం 10 శాతం పొదుపు చేస్తే 500 మిలియన్ యూనిట్లు ఆదా అయినట్టే. ఎంఎస్ఎంఈల్లో పూర్తిస్థాయిలో ఇంధన సామర్థ్య చర్యలు చేపడితే దాదాపు 2,000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, ఇది రూ.1,200 కోట్లకు సమానమని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రానికి బీఈఈ ఆడిటర్లు భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో) సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ సంచాలకులు, జిల్లాల్లోని జనరల్ మేనేజర్లను తాజాగా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆడిట్ నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందించడంతో పాటు గుర్తింపు పొందిన ఇంధన ఆడిటర్లను రాష్ట్రానికి పంపేందుకు బీఈఈ (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ) అంగీకరించింది. ది ఎనర్జీ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టీఈఆర్ఐ) సమర్పించిన ఇంధన ఆడిట్ నివేదిక ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఫిషరీస్ క్లస్టర్లో 43 ఎంఎస్ఎంఈలు 455 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నాయి. వీటి విద్యుత్ బిల్లు రూ.296 కోట్లు వస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద ఏపీఎస్ఈసీఎం రెండు ఫిషరీస్ ఎంఎస్ఎంఈలు ఆనంద ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కదెర్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థల్లో ఇంధన ఆడిట్ చేసింది. రూ.1.37 కోట్ల పెట్టుబడితో 1.45 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, 1,306 టన్నుల కార్బన్ డయాౖఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ ఆడిట్ లో తేల్చింది. పరిశ్రమల శాఖ మద్దతు హర్షణీయం టీఈఆర్ఐ సంస్థ ద్వారా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇప్పటికే ఇంధన ఆడిట్ నిర్వహించి ఫిషరీస్ విభాగంలో ఇంధన పొదుపునకు భారీగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో పరిశ్రమల శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుండటం హర్షించదగ్గ విషయం. – నాగులాపల్లి శ్రీకాంత్, కార్యదర్శి, ఇంధన శాఖ బీఈఈ సంస్థలతోనే ఆడిట్ పరిశ్రమల్లో ఇంధన పొదుపు తద్వారా ఆర్థిక పొదుపు అవకాశాలను గుర్తించేందుకు ఇంధన శాఖకు చెందిన ఏపీ సీడ్కో ఐజీఈఏ (ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ ) కార్యక్రమాన్ని చేపడతాయి. ఐజీఈఏను బీఈఈకి చెందిన ఇంధన ఆడిట్ సంస్థలే నిర్వహించనున్నాయి. ఐజీఈఏ ఖర్చు పరిశ్రమను బట్టి ఉంటుంది. – కరికాల వలవన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంధన ఖర్చును, ఉత్పత్తి ఖర్చును, విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. పర్యావరణం దెబ్బతినకుండా, కాలుష్యం పెరగకుండా చూసుకోవచ్చు. గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పోటీతత్వం, ఇంధన సరఫరాను మెరుగుపర్చుకోవచ్చు. –జేవీఎన్ సుబ్రహ్మణ్యం, కమిషనర్, పరిశ్రమల శాఖ -
ఎంఎస్ఎంఈలకు కేంద్రం భరోసా
న్యూఢిల్లీ: రుణ ఒత్తిళ్లలో ఉన్న సూక్ష్మ, లఘు, చిన్న మధ్య(ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలకు మద్దతుగా రుణ హామీ పథకాన్ని(సీజీఎస్ఎస్డీ) 2022 మార్చి 31వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. 2020 జూన్ 1వ తేదీన ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. అదే ఏడాది జూన్ 24న అమల్లోకి తీసుకువచ్చింది. కాగా ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రముఖ ఖాదీ ఇండియా షోరూమ్ అమ్మకాలు గాంధీ జయంతి సందర్బంగా రూ.1.02 కోట్లుగా నమోదయినట్లు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ మరో ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఫేస్‌బుక్‌కు మరో షాక్..! ఈ సారి రష్యా రూపంలో..!) ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న పలు విజ్ఞప్తుల నేపథ్యంలో ఇటీవల ఖాదీ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా పేర్కొన్నారు. ఈ పథకం కింద రుణాల పంపిణీ గడువును కూడా 2022 జూన్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. 2021 సెప్టెంబరు 24 వరకు ఈ పథకం కింద రూ.2.86 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఇందులో ఇచ్చిన రుణ హమీల్లో 85 శాతం వరకు ఎంఎస్‌ఎమ్‌ఈలకే మంజూరు చేశారు. -
వైఎస్సార్ నవోదయం: చిన్నపరిశ్రమలకు సర్కారు దన్ను
కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఇతడి పేరు పి.సుధాకర్. సొంత ఊళ్లోనే ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సుధాకర్ హైదరాబాద్‌లో తాను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలి వచ్చేశారు. తనకున్న అనుభవంతో ఫ్యాన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని నిశ్చయించుకున్నారు. ఏపీఐఐసీ, బ్యాంకు అందించిన రుణసాయంతో ఎంఎస్ఎంసీ యూనిట్ నెలకొల్పారు. దానిని ప్రారంభించిన రెండేళ్లకే కరోనా ముంచుకొచ్చింది. యూనిట్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆదాయం లేకపోయినా బ్యాంకు వాయిదాలతోపాటు ఉద్యోగులను కాపాడుకోవడానికి ప్రతినెలా చెల్లించాల్సి వచ్చింది. అప్పటికే అప్పులు రూ.80 లక్షలు దాటేశాయి. ఇక తన పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘రీ స్టార్ట్’ పేరుతో ఎంఎస్ఎంఈలకు ఆపన్నహస్తం అందించారు. సుధాకర్ నెలకొల్పిన యూనిట్‌కు పాత బకాయిల రూపంలో ఒకేసారి రూ.51.50 లక్షలు చెల్లించారు. అలాగే లాక్డౌన్ కాలానికి మూడు నెలల విద్యుత్ చార్జీలను మాఫీ చేశారు. దీంతో అతడు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా నిలదొక్కుకోగలిగాడు. సుధాకర్ మాట్లాడుతూ.. ‘రీ స్టార్ట్ ప్యాకేజీ రూపంలో వచ్చిన మొత్తంతో బ్యాంకు రుణం తీర్చేశాను. ఖర్చులను తగ్గించుకున్నాను. వెంటిలేటర్‌పై ఉన్న నా పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రీ స్టార్ట్ పేరుతో ఊపిరిలూదటంతో కోవిడ్ కష్టాలు ఇంకా ఉన్నప్పటికీ అతిపెద్ద సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలిగాను’ అని చెప్పుకొచ్చారు. ఇలా ఒక్క సుధాకరే కాదు.. అనేక మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వైఎస్సార్ నవోదయం, రీ స్టార్ట్ ప్యాకేజీలు ఆపన్న హస్తం అందించాయి. సాక్షి, అమరావతి : కోవిడ్ రూపంలో ముంచుకొచ్చిన సంక్షోభం కారణంగా రాష్ట్రంలో ఒక్క ఎంఎస్ఎంఈ యూనిట్ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం పుణ్యమా అని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న చిరుద్యోగుల జీవనోపాధి నిలబడింది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.1,110 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో గత ప్రభుత్వం ఐదేళ్లలో చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిల కింద రూ.904.83 కోట్లను విడుదల చేయడంతోపాటు ఆయా యూనిట్ల రుణాల కోసం గ్యారంటీగా రూ.250 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రీ స్టార్ట్ ప్యాకేజీ ద్వారా ఎస్సీ వర్గాలకు చెందిన 4,093, ఎస్టీ వర్గాలకు చెందిన 810 యూనిట్లు ప్రయోజనం పొందాయి. ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నమ్మకం పెరగడంతో బ్యాంకులు కూడా వాటిని రుణాలిచ్చి తమ వంతుగా ఆదుకున్నాయి. ఇదిలావుంటే.. ఎంఎస్ఎంఈలకు రెండో ఏడాది పారిశ్రామిక రాయితీలను సైతం ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. లక్ష్యాలను మించి రుణాలు ఎంఎస్ఎంఈ రంగానికి 2020–21 సంవత్సరంలో రూ.39,600 కోట్లను రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా నిర్ణయించుకోగా.. లక్ష్యాన్ని మించి రూ.40,311.76 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులోను అత్యధికంగా సూక్ష్మ సంస్థలను ఆదుకున్నాయి. గతేడాది సూక్ష్మ సంస్థలకు రూ.18,674 కోట్ల రుణాలివ్వాలనేది లక్ష్యం కాగా.. రూ.20,598.53 కోట్లను రుణాలుగా ఇచ్చాయి. అలాగే వ్యాపారాలు లేక తీసుకున్న రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులుగా మారిపోయిన ఖాతాలను ‘వైఎస్సార్ నవోదయం’ పథకం కింద పునర్ వ్యవస్థీకరించారు. ఈ విధంగా 2020–21 సంవత్సరంలో రూ.3,236.52 కోట్ల రుణ ఖాతాలను పునర్ వ్యవస్థీకరించాయి. దీనివల్ల 1,08,292 ఖాతాలకు లబ్ధి చేకూరింది. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22లో రుణాల లక్ష్యాన్ని రూ.44,500 కోట్లకు పెంచాయి. పనితీరు బాగుంది రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం పనితీరు బాగుంది. వీటికి గత ఏడాది లక్ష్యానికి మించి రుణాలిచ్చాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లక్ష్యాలను అధిగమించాం. అదే విధంగా ఒత్తిడిలో ఉన్న యూనిట్లను ఆదుకునే విధంగా నిరర్థక ఆస్తులను పునర్ వ్యవస్థీకరిస్తున్నాం. ఈ ఏడాది కూడా భారీగా నిర్దేశించుకున్న రూ.44,500 కోట్ల రుణ లక్ష్యాన్ని కూడా అధిగమిస్తాం. –వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రభుత్వ అండతో నిలబడ్డాం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా ఎంఎస్ఎంఈలకు రీ స్టార్ట్ ప్యాకేజీ ప్రకటించారు. కష్టకాలంలో పాత బకాయిలను చెల్లించడంతోపాటు రుణాల గ్యారంటీ కోసం రూ.250 కోట్లు కేటాయించారు. ఈ చర్యల వల్ల కోలుకుని 70 శాతం నిర్వహణ సామర్థ్యంతో సంస్థలు నిలదొక్కుకుని వ్యాపారం చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని కూడా తట్టుకుని నిలబడ్డాం. – ఏపీకే రెడ్డి, అధ్యక్షుడు, ఎఫ్‌ఎస్‌ఎంఈ ఇండియా -
జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలి: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పార్లమెంట్ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు చేస్తున్న ఎంఎస్ఎంఈల బకాయిలు చెల్లించాలని, ఇందులో ఆలస్యం కారణంగా ఎంఎస్ఎంఈలు జీఎస్టీ కట్టలేకపోతున్నాయంటూ వివరించారు. రాష్ట్రానికి జీఎస్టీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలని ఆయన కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఎంఎస్ఎంఈల బకాయిలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమాధానమిచ్చారు. ఇక జూలై 19(సోమవారం) నుంచి 17వ లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు జరగనున్నాయి. -
AP: కంపెనీలను ఆకట్టుకునేలా..
సాక్షి, అమరావతి: ఫర్నీచర్, ప్లాస్టిక్ తయారీ కంపెనీలను ఆకర్షించే విధంగా నెల్లూరు జిల్లా నారంపేట వద్ద ఏపీఐఐసీ చేపట్టిన ఎంఎస్ఎంఈ పార్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 100 చిన్న, మధ్య స్థాయి కంపెనీలు ఏర్పాటు చేసేలా 173.67 ఎకరాల్లో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 36.23 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్, 25.26 ఎకరాల్లో ఫర్నీచర్ పార్క్ ఏర్పాటు అవుతోంది. పెద్ద ఫర్నీచర్ సంస్థలతో పాటు చిన్న వాటిని కూడా ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో రహదారులు, మురుగు, వరద నీటి కాల్వల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెంచురీ ప్లే వంటి భారీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఈ పార్కుకు ఆనుకునే మరో 401 ఎకరాలు సేకరించే యోచనలో ఏపీఐఐసీ ఉంది. ఈ ఎంఎస్ఎంఈ పార్క్‌లో మొత్తం 73.91 ఎకరాల్లో కంపెనీలు తమ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి 323 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నారు. అలాగే 10.05 ఎకరాల్లో రెడీ బిల్ట్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నారు. ఇదే పారిశ్రామికవాడలో 5.49 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. 21.38 ఎకరాలు మొక్కల పెంపకానికి కేటాయించారు. ప్రస్తుతం మౌలిక వసతులు కల్పన పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయిన తర్వాత ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఎంఎస్ఎంఈలకు అండగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రుణాలు, ఫండింగ్ విషయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు బ్యాంకులు అండగా ఉండాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల నుంచి మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు రుణాల వసూళ్ల విషయంలో కొంత ఉదారతతో వ్యవహరించాలని, పరిశ్రమలు తిరిగి గాడినపడేందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈల కోసం ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ‘ప్రేరణ’కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రారంభించారు. ఎంఎస్ఎంఈలకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలతోపాటు రుణాల లింకేజీ విషయంలో కొంత సంక్లిష్టత ఉందని, దీన్ని సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఖాయిలా పడిన ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు కృషి చేస్తున్న ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌తో ఇండియన్ బ్యాంక్ భాగస్వామిగా మారి సహాయం చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని స్వయం సహాయక సంఘాలు రెండు దశాబ్దాలుగా తీసుకున్న రుణాలకు అద్భుతమైన రీపేమెంట్ రేటును కలిగి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇండియన్ బ్యాంకుతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కలిగి ఉందని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ డెవలప్మెంట్ రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని బ్యాంక్ సీఈఓ, ఎండీ పద్మజా చుండూరును మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రారంభించిన టీ–హబ్, వీ–హబ్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. ఎంఎస్ఎంఈ రంగానికి అండగా దేశవ్యాప్తంగా ‘ప్రేరణ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇందులోభాగంగా అత్యంత సులువుగా రుణాలివ్వడంతోపాటు పరిశ్రమల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని పద్మజా చెప్పారు. రాష్ట్రంలో తమ బ్యాంకు ఇప్పటికే పలు కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
ఇది చరిత్రాత్మక నిర్ణయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలనూ ఎంఎస్ఎంఈ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు నిన్న కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కీలక నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్పందించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) జాబితాలో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలను చేర్చి తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మోదీ అన్నారు. దీని వల్ల కోట్లాది మంది వర్తకులకు లబ్ధి చేకూరుతుందని మోదీ చెప్పారు. వేగంగా ఆర్థిక సాయం అందడంతో పాటు వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్నారు. వ్యాపారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ట్వీట్ చేశారు. ఇక నూతన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. కొత్త నిబంధనలతో దాదాపు 2.5 కోట్ల మంది రిటైల్, హోల్ సేల్ వర్తకులు లబ్ధి పొందుతారని చెప్పారు. దీంతో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రాధాన్య రంగాలకు రుణాల్లో చిరు వర్తకులకు లాభం కలుగుతుంది. అంతేగాకుండా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో వారు నమోదు చేసుకోవచ్చు. Our government has taken a landmark step of including retail and wholesale trade as MSME. This will help crores of our traders get easier finance, various other benefits and also help boost their business. We are committed to empowering our traders. https://t.co/FTdmFpaOaU — Narendra Modi (@narendramodi) July 3, 2021 అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇకపై ఎంఎస్ఎంఈలకు వర్తించే ప్రభుత్వ స్కీములు, ప్రయోజనాలు తమకు కూడా లభించగలవని సీఏఐటీ జాతీయ ప్రెసిడెంట్ బీసీ భార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో ఆయా వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. చిన్న సంస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి వాటిని చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ నిన్న ట్వీట్ చేశారు. తాజా మార్గదర్శకాలతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 250 కోట్లపైగా టర్నోవర్ ఉన్న హోల్‌సేల్ వ్యాపారులు, చిన్నస్థాయి రిటైలర్లు త్వరగతిన ఫైనాన్స్ పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వారు ఉద్యమ్ పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. -
రిటైల్, హోల్‌సేల్ వ్యాపారం ఎంఎస్ఎంఈ పరిధిలోకి: గడ్కరీ
న్యూఢిల్లీ: రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలను కూడా లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) రంగం పరిధిలోకి చేరుస్తున్నట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. దీంతో ఆయా వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. చిన్న సంస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి వాటిని చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ట్వీట్ చేశారు. తాజా మార్గదర్శకాలతో 2.5 కోట్లపైగా రిటైల్, హోల్‌సేల్ ట్రేడర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. వారు ఉద్యమ్ పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇకపై ఎంఎస్ఎంఈలకు వర్తిం చే ప్రభుత్వ స్కీములు, ప్రయోజనాలు తమకు కూడా లభించగలవని సీఏఐటీ జాతీయ ప్రెసిడెంట్ బీసీ భార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్!
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కుటుంబాల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా వ్యాపారాల పరిస్థితి మరి దారుణంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా అనేక చిన్న, చిన్న వ్యాపారాల మీద పడింది. అయితే, ఈ ఎమ్ఎస్ఎమ్ఈలకు తాము అండగా ఉంటామని కెనరా బ్యాంక్ భరోసా ఇచ్చింది. మన దేశంలో గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక సాయంగా పరిగణిస్తారు. కెనరా బ్యాంక్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎమ్ఎస్ఎమ్ఈల) కోసం గోల్డ్ లోన్ లను అందిస్తోంది. "కెనరా బ్యాంక్ మా ఖాతాదారులకు ఆకర్షణీయమైన గోల్డ్ లోన్స్ తక్కువ వడ్డీరేట్లతో అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీకు ఎల్లప్పుడూ మాతో భద్రతా ఉంటుంది" అని కెనరా బ్యాంక్ ట్వీట్ చేసింది. Canara Bank #GoldLoans provide emergency financial assistance to our customers in exchange for gold with attractive interest rates. With us, you’ll always have a safety net.#CanaraBank pic.twitter.com/Hy4i0REvPt — Canara Bank (@canarabank) June 20, 2021 కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు 7.35 శాతం వడ్డీరేటుకే "గోల్డ్ లోన్"ను అందిస్తోంది. ఈ గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక అవసరాలకు అనువైనదని పేర్కొంది. తక్కువ వడ్డీ రేటుకు గోల్డ్ లోన్ ను వేగంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఏవైనా ఎంక్వైరీల కోసం 1800 425 0018 /1800 103 0018కు కాల్ చేయవచ్చు అని తెలిపింది. మీ లాకర్ లోని బంగారం మీ వ్యాపారానికి గోల్డ్ మైన్ కావచ్చు అని కెనరా బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఎమ్ఎస్ఎమ్ఈల కొరకు ఓవర్ డ్రాఫ్ట్ లేదా డిమాండ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ లోన్ కింద రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణ మొత్తాన్ని అప్పుగా తీసుకోవచ్చని బ్యాంకు తెలిపింది. రేపో రేటుతో ముడిపడి ఉన్న 7.35 శాతం పోటీ వడ్డీ రేటును అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకుకి దేశ వ్యాప్తంగా 10,495 శాఖలు, 13,023 ఎటిఎంలు ఉన్నాయి. Need funds to kickstart your MSME business? Avail “CANARA MSME GOLD LOAN” from Canara Bank, for financial assistance up to 20 lakhs. With us, your business goals can be achieved!#CanaraBank #TogetherWeCan #MSME #BusinessLoans pic.twitter.com/2rpDhRkp5K — Canara Bank (@canarabank) June 18, 2021 చదవండి: పాన్ కార్డులో ఉన్న ఈ సీక్రెట్ కోడ్స్ తెలుసా? -
టెలికాం రంగంలోకి పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం పరికరాల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన రూ.12,195 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీముకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం గురువారం విడుదల చేసింది. టెలికం శాఖ(డాట్) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పథకంలో నమోదు చేసుకునే ప్రక్రియ శుక్రవారం (జూన్ 4న) ప్రారంభమై జూలై 3 దాకా కొనసాగుతుంది. అర్హత పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 దాకా పెట్టే పెట్టుబడులు, విక్రయాలపై ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి దీన్ని వర్తింపజేస్తారు. అధునాతన టెక్నాలజీ ఊతంతో దేశీ కంపెనీలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించడం స్కీము ప్రధాన లక్ష్యమని డాట్ వెల్లడించింది. ఈ పథకం ఊతంతో వచ్చే అయిదేళ్లలో దేశీయంగా రూ. 2.44 లక్షల కోట్ల విలువ చేసే టెలికం పరికరాల ఉత్పత్తి జరగగలదని అంచనా. టెలికం పీఎల్ఐ ద్వారా సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో దాదాపు రూ.3,000 కోట్ల మేర పెట్టుబడులు రానుండగా, రూ.17,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం సమకూరగలదని అంచనాలు ఉన్నాయి. దేశ, విదేశ కంపెనీలు.. చిన్న, మధ్య తరహా సంస్థలు దీని కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి పరిమితి.. ఎంఎస్ఎంఈలకు రూ.10 కోట్లుగాను, ఇతర సంస్థలకు రూ.100 కోట్లుగాను ఉంటుంది. స్థలం, నిర్మాణ వ్యయాలను పెట్టుబడి కింద పరిగణించరు. ఎరిక్సన్, నోకియా, హెచ్ఎఫ్సీఎల్ వంటి అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు విస్తరించడంపై ఆసక్తిగా ఉన్నాయి. స్టీల్, ఆటో, జౌళి రంగాలు త్వరలో నోటిఫై ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి రంగాల్లో అమలుకుగాను ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్ఐ) కేంద్రం త్వరలో నోటిఫై చేయనుంది. తద్వారా ఈ పథకం కింద ఆయా రంగాల్లో పెట్టుబడులకు సంబంధిత సంస్థలకు వీలుకలుగుతుంది. పథకం అమలుకు సంబంధించి ప్రకటించిన నోటిఫికేషన్ విధివిధానాలకు అనుగుణంగా సంస్థలు కేంద్రానికి దరఖాస్తు చేసుకోగలుగుతాయి. అనంతరం దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే ఫార్మా, ఐటీ హార్డ్‌వేర్ వంటి రంగాలకు పీఎల్ఐ నోటిఫై జరిగింది. ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి వంటి రంగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీపీఐఐటీ(పారిశ్రామిక, అంతర్గత వాణిజాభివృద్ధి శాఖ) అదనపు కార్యదర్శి సుమితా దావ్రా గురువారం జరిగిన ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ వెబినార్‌లో వెల్లడించారు. భారత్ తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేయడానికి వీలుగా కేంద్రం ఐదేళ్ల కాలపరిమితికిగాను రూ.2 లక్షల కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 13 రంగాలకు ఈ పథకం కింద రాయితీలు వర్తిస్తాయి. ఏసీసీ బ్యాటరీ, సోలార్ మాడ్యూల్స్ విభాగాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని కూడా కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. సప్లై చైన్ సవాళ్ల పరిష్కారం, తయారీ రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులకు కూడా తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వెబినార్‌లో సుమితా దావ్రా పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్ఐ స్కీమ్ దోహదపడుతుందన్నారు. చదవండి: భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్ సగటు వినియోగం -
ఆవిష్కరణలకు ఊతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న స్థానిక సమస్యలకు కొత్త ఆవిష్కరణల ద్వారా పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటికి క్షేత్ర స్థాయి నుంచే సామాజిక ఆవిష్కరణలను ప్రోత్సహించి వాటికి వాణిజ్య రూపం ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పన, రాష్ట్ర ఆదాయం కూడా పెంచడం సాధ్యమని అంచనా వేస్తోంది. ఈ తరహా ఆవిష్కరణల కోసం జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా)తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న స్టార్టప్ వాతావరణం అంశం గ్లోబల్ స్టార్టప్ ఇకో సిస్టమ్ 2020 (జీఎస్‌ఈఆర్) నివేదికలో ప్రస్తావనకు నోచుకుంది. రాష్ట్రంలోని మూడున్నర కోట్ల జనాభాలో 2.1 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా పట్టణ వాసులతో పోలిస్తే వారు విభిన్న సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి భిన్నమైన మార్గాన్ని అనుసరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘జికా’సాయంతో క్షేత్రస్థాయిలో సామాజిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆవిష్కరణలు, వాణిజ్య, ఇతర సామర్థ్యాల పట్ల ఆసక్తితో ఉన్న జికా ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచేందుకు ముందుకు వస్తోంది. దీంతో మరిన్ని అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలు కూడా ఈ రంగంలో పెట్టుబడులతో ముందుకొచ్చే అవకాశముందని సర్కారు భావిస్తోంది. తద్వారా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాల కల్పన, ఉత్పాదకతతో పాటు జీడీపీ పెరుగుతుందని అంచనా వేస్తోంది. దీంతో ఇన్నాళ్లూ ఆవిష్కరణల కేంద్రాలుగా ఉన్న నగరాల నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ఆవిష్కరణల వాతావరణం విస్తరించే అవకాశముంది. సామాజిక, క్షేత్ర స్థాయి ఆవిష్కరణలకు రూ.660 కోట్లు స్టార్టప్‌ల ద్వారా వెలుగు చూస్తున్న ఆవిష్కరణలు రాష్ట్ర ఆర్థికాభివృద్దిలో కీలకంగా మారుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో పురుడు పోసుకుంటున్న ఆవిష్కరణలు మాత్రం వెలుగు చూడటం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు సామాజిక, క్షేత్ర స్థాయి ఆవిష్కరణల ద్వారా వాణిజ్య కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు రూ.660 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు జికా మద్దతు ఇస్తుంది. ఇందులో రూ.100 కోట్లు సోషల్ ఇంపాక్ట్ సెక్టార్లో మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం కేటాయిస్తారు. రూ.117.61 కోట్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలు, కళాశాలల్లో ఎంట్రప్రెన్యూర్ల ప్రోత్సాహానికి, మరో రూ.56.72 కోట్లు గిరిజనుల్లో పోషకాహార సమస్యలు, మురుగునీరు నిర్వహణ, పారిశుధ్యం, అంటు వ్యాధులు తదితరాల కోసం ఉపయోగిస్తారు. వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలను గుర్తించేందుకు రూ.90.5 కోట్లు, రాష్ట్రంలో ఐటీ టవర్లు కలిగిన ఐదు జిల్లాలతో పాటు, హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.264 కోట్లు వెచ్చిస్తారు. జిల్లాల్లో ఉన్న ఐదు ఐటీ టవర్లు క్షేత్ర స్థాయిలో సామాజిక ఆవిష్కరణలకు మూల కేంద్రాలుగా పనిచేస్తూ హైదరాబాద్‌పై ఆధారపడటాన్ని కొంత మేర తగ్గించగలుగుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోగాత్మకంగా గిరిజనుల్లో పోషకాహార లోపం, మురుగునీరు, పారిశుధ్య నిర్వహణ, అంటు వ్యాధులు, తాగునీరు పారిశుధ్యం, పరిశుభ్రత, వ్యవసాయ ఉత్పాదక పెంపు వంటి వాటికి ఆవిష్కర్తలు పరిష్కారం చూపుతారు. 20 లక్షల మందికి అవగాహన కల్పించడమే లక్ష్యం ‘జికా’సాయంతో చేపట్టే ప్రాజెక్టు లక్ష్యాలు, ఉద్దేశాల గురించి వివరించడంతో పాటు కొత్త ఆవిష్కరణలపై 20 లక్షల మంది సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, యాత్రలు, విలేజ్ ఇన్నోవేషన్ చాలెంజెస్, హ్యాకథాన్స్ వంటివి నిర్వహిస్తారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 3,200 మంది బాలికలు, మహిళలు, 1.38 లక్షల మంది విద్యార్థులు, 1,456 మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,190 క్షేత్ర స్థాయి ఆవిష్కరణలను సృష్టించడం లక్ష్యం కాగా, వీటిలో 4,188 ఆవిష్కరణలను ప్రపంచస్థాయి ఉత్పత్తులుగా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తద్వారా ఉత్పాదక, ఉత్పత్తి పెరిగి రాష్ట్ర ఆర్థికాభివృద్దికి బాటలు వేయనుంది. ఈ ఆవిష్కరణల ద్వారా 1,880 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు జీవం పోయడంతోపాటు మరో 645 ఎంఎస్ఎంఈల పునరుజ్జీవనానికి దారితీస్తుంది. వీటిలో 1,370 ఎంఎస్ఎంఈలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో సర్దుబాటు చేస్తారు. వీటి ద్వారా 7,600 మందికి ప్రత్యక్షంగా, 22 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించడంతోపాటు ఆదాయం, కొనుగోలు శక్తి, అనుబంధ ఎంటర్ప్రైజెస్ వృద్ధి, పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సామాజిక, క్షేత్ర స్థాయి ఆవిష్కరణల ప్రోత్సాహక ప్రాజెక్టు కోసం ‘జికా’తో జరుపుతున్న సంప్రదింపులు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. సామాజిక ఆవిష్కరణలు.. సంగారెడ్డి జిల్లాకు చెందిన సంగమేశ్వర్ అనే ఉపాధ్యాయుడు ఎరువులను పిచికారీ చేసేందుకు కంప్రెసర్ ద్వారా నడిచే వీల్ స్ప్రేయింగ్ పంప్‌ను రూపొందించారు. పంటల అవసరాలకు అనుగుణంగా స్ప్రేయర్ ఎత్తును సర్దుబాటు చేయొచ్చు. నల్గొండకు చెందిన అరుణజ్యోతి లోఖండే అనే మహిళ వంటింటి కూరగాయల వ్యర్థాలతో ‘సీడ్ పేపర్ న్యాప్కిన్లు‘ తయారు చేశారు. విత్తనాలు లేని న్యాప్కిన్లను ముక్కలుగా చేసి మొక్కలకు ఎరువుగా వాడొచ్చు. విత్తనాలు ఉన్న న్యాప్కిన్లను నర్సరీల్లో ఉపయోగించవచ్చు. ఇలా సామాజిక అవసరాలు లేదా సమస్యలకు ప్రస్తుతం ఉన్న పరిష్కారాలకంటే మెరుగైన వాటిని కనుగొనడమే సామాజిక ఆవిష్కరణల లక్ష్యం. ఇలాంటి ఆవిష్కరణలను వాణిజ్యపరంగా తయారు చేసేందుకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు చేస్తే ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
ఐటీ ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పాలసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో వివిధ కేటగిరీల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట రంగాల వారీగా (సెక్టోరల్) ప్రత్యేక పాలసీలు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఐటీ ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ప్రత్యేక పాలసీ రూపొందించాలని నిర్ణయించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం ఎగుమతుల్లో జాతీయ స్థాయి కంటే మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్న తెలంగాణ 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.40 లక్షల కోట్ల ఎగుమతులు సాధి స్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ రంగం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 5.82 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది. అయితే రాష్ట్రంలో ఈ రంగానికి వెన్నుదన్నుగా ఉంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎంఎస్ఎంఈ) కరోనా పరిస్థితుల్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో 1,200కు పైగా ఎంఎస్ఎంఈలు ఉండగా, ఉద్యోగాల కల్పన, ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు, ప్రభుత్వా నికి ఆదాయం సమకూర్చడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల్లో సగానికిపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల్లోనే పనిచేస్తున్నారు. అయితే ఏడాది క్రితం మొదలైన కరోనా సంక్షోభం ఇంకా కొన సాగుతుండటంతో ఎంఎస్ఎంఈలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో ప్రత్యేక విధానం ప్రకటించాలని హైసియా, నాస్కామ్ వంటి సంస్థలతో పాటు ఐటీ ఎంఎస్ఎంఈలు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ప్రత్యేక ఐటీ టవర్, ఆఫీస్ స్పేస్ కావాలి ఐటీ ఎంఎస్ఎంఈల కోసం రూపొందించే ప్రత్యేక పాలసీలో చేర్చాల్సిన అంశాలపై హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), ఇతర ఎంఎస్ఎంఈలు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రత్యేక ఐటీ టవర్ నిర్మించి, అందులో ఒక్కో కంపెనీకి కనీసం 20 మంది కూర్చునేలా ఆఫీసు స్పేస్‌ను కేటాయించాలని కోరాయి. కంపెనీలు తమ నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు వీలుగా ఐటీ టవర్లోని కిచెన్, సమావేశ మందిరాలు వంటి వసతులు అందరూ ఉపయోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశాయి. తమకు కేటాయించే ఆఫీస్ స్పేస్‌కు తక్కువ అద్దె చెల్లించేలా సబ్సిడీ ఇవ్వాలని కోరాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటయ్యే ఐటీ ఎగ్జిబిషన్లలో ఎంఎస్ఎంఈలకు స్టాల్స్ కేటాయించడం, ఇతర మౌలిక వసతులు, ప్రోత్సాహకాలతో ‘సెక్టోరల్ పాలసీ’ రూపొందించాలని ఎంఎస్ఎంఈలు కోరుతున్నాయి. సర్కారు చేయూత.. కరోనా మూలంగా రాష్ట్రంలో ఇతర రంగాలు దెబ్బతిన్నా మొత్తంగా ఐటీ రంగం మాత్రం పురోగతి సాధిస్తోంది. 2019–20లో రాష్ట్రంలో 18 శాతం వృద్ధిరేటు సాధించిన ఐటీ రంగం 2020–21లో ఆరు నుంచి ఏడు శాతం మేర వృద్ధి నమోదు చేసే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చివరిలోనే ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసింది. హైసియా, నాస్కామ్తో పాటు ఐటీ విభాగం అధికారులు ఈ ప్రత్యేక సలహా కమిటీలో సభ్యులుగా ఉంటారని ఐటీ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ పరంగా చేపడుతున్న ఐటీ ప్రాజెక్టులన్నీ పెద్ద కంపెనీల చేతుల్లోకి వెళ్తుండగా, కరోనా పరిస్థితుల్లో 30 శాతం ప్రాజెక్టులను చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా ఎంఎస్ఎంఈలు కన్సార్షియంగా ఏర్పాటై పెద్ద ఐటీ ప్రాజెక్టులను చేపట్టేలా ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందిస్తోంది. సెక్టోరల్ పాలసీతో మరింత మందికి ఉపాధి ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలు మనుగడ సాధించేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. ఎంఎస్ఎంఈలు కూడా తమ సామరŠాధ్యన్ని పెంచుకునేలా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉండాలని కోరుతున్నాం. సెక్టోరల్ పాలసీ ద్వారా ఐటీలో ఎంఎంఎస్ఈ రంగం మరింత మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఐటీ ఉత్పత్తుల్లోనూ మరింత క్రియాశీలంగా పనిచేస్తుంది. - భరణికుమార్ ఆరోల్, అధ్యక్షులు, హైసియా త్వరలో ప్రత్యేక పాలసీ విడుదల ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల రంగంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీలోనూ తెలంగాణ రాష్ట్రం అనేక కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేథస్సు (ఏఐ) వంటి వాటిని ప్రోత్సహించేందుకు ‘సెక్టోరల్ పాలసీ’ని ప్రకటించాం. ఐటీ రంగంలో పనిచేస్తున్న ఎంఎస్ఎంఈలు కరోనా సంక్షోభంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో త్వరలో వీటి కోసం కూడా ప్రత్యేక ‘సెక్టోరల్ పాలసీ’ విడుదల చేస్తాం. - జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ పరిశ్రమల శాఖ -
బ్యాంకులపై ‘మొండి’బండ!
ముంబై: బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య 2020 రెండవ అర్థ భాగంలో కొంత మెరుగుపడినప్పటికీ, 2021 మొదటి ఆరు నెలల కాలంలో సమస్య మళ్లీ కొంత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఫిక్కీ-ఐబీఏ సర్వే ఒకటి పేర్కొంది. జూలై-డిసెంబర్ 2020 మధ్య ఫిక్కీ-ఐబీఏ నిర్వహించిన 12వ దఫా బ్యాంకర్ల సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... మొత్తం 20 బ్యాంకులను సర్వేకు ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు విదేశీ బ్యాంకులు వీటిలో ఉన్నాయి. మొత్తం బ్యాంకింగ్ రంగంలో దాదాపు 59 శాతం మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 2020 చివరి ఆరు నెలల్లో మొండిబకాయిలు తగ్గాయని సగం మంది ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఎన్పీఏలు తగ్గాయని చెప్పిన వారి శాతం 78గా ఉంది. 2021 మొదటి ఆరు నెలల్లో ఎన్పీఏలు 10 శాతం పైగా పెరిగే అవకాశం ఉందని దాదాపు 68 శాతం మంది తెలిపారు. ఇది ఏకంగా 12 శాతందాటిపోతుందని అంచనావేస్తున్న వారి శాతం 37గా ఉంది. పర్యాటక, ఆతిథ్యం, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), పౌర విమానయానం, రెస్టారెంట్ల విభాగాల్లో అధిక ఎన్పీఏల ప్రభావం ఉంటుందని మెజారిటీ ప్రతినిధులు తెలిపారు. రవాణా, ఆతిథ్య రంగాల్లో ఎన్పీఏలు భారీగా పెరిగిపోతుందని అంచనావేస్తున్నవారు 55 శాతంగా ఉన్నారు. 45 శాతం మంది ఈ రంగంలో ఎన్పీఏల భారం కొద్దిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి భారీ ఎన్పీఏల భారం ఉంటుందని దాదాపు 84 శాతం అంచనావేయడం గమనార్హం. రెస్టారెంట్ల విషయంలో ఈ శాతం 89గా ఉంది. ఈ విభాగంలో ఎన్పీఏల భారం అంతంతే అన్న అంచనావేసినవారు 26 శాతంమందే. ఎంఎస్ఎంఈలో ఒన్‌టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణకు (గత ఏడాది ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన) విజ్ఞప్తులు గణనీయంగా పెరుగుతాయి. మౌలిక, ఔషధ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో దీర్ఘకాలిక రుణ డిమాండ్ పెరుగుతుంది. ఫార్మా రంగానికి రుణ డిమాండ్ పెరుగుతుందన్న అంచనాల విషయంలో 11వ దఫా సర్వేలో 29 శాతం మంది సానుకూలంగా స్పందిస్తే, 12వ దఫా సర్వేలో ఇది 45 శాతానికి పెరిగింది. ఒన్-టాప్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కింద తాము నిధులు పొందలేదని మెజారిటీ ప్రతినిధులు సర్వేలో తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీల్లోకి దాదాపు టీఎల్టీఆర్ఓ నిధులు వెళ్లాయని 33 శాతం మంది పేర్కొన్నారు. 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతం! కోవిడ్-19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల(ఎన్పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంటోంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 7.5 శాతం. చదవండి: ఆయుధాల తయారీలో స్వావలంబన దిశగా భారత్ -
విశాఖలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.350 కోట్లతో సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో 20 ఎకరాల్లో రూ.133 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ సమావేశం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయవాడ నుంచి పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ఎంఎస్ఎంఈ కేంద్ర సహాయమంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి, కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బి.బి.స్పెయిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి ఎంఎస్ఎంఈలే వెన్నెముక అని పేర్కొన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్లు, మౌలికాభివృద్ధి కేంద్రాలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ టెర్మినళ్ల ఏర్పాటు దిశగా ఏపీ ముందడుగు వేస్తోందన్నారు. టెక్నాలజీ సెంటర్ల ద్వారా చిన్న పరిశ్రమలకు మరింత ఊతమివ్వనున్నట్లు తెలిపారు. నౌకా నిర్మాణం, వెల్డింగ్, ఫాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్న నేపథ్యంలో విశాఖలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరుల(స్కిల్డ్ మ్యాన్‌పవర్)ను ఏటా 8,500 మంది చొప్పున రాబోయే ఐదేళ్లపాటు తీర్చిదిద్దడమే ఈ సెంటర్ ఏర్పాటు లక్ష్యమని మంత్రి వివరించారు. కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచాం కోవిడ్–19 సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చి ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచామని మంత్రి మేకపాటి చెప్పారు. కరోనా లాక్డౌన్ వల్ల ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనే లక్ష్యంగా కృషి చేశామన్నారు. 11,238 యూనిట్లకు రూ.905 కోట్ల ప్రోత్సాహక బకాయిలను చెల్లించామని చెప్పారు. లాక్డౌన్లో పరిశ్రమలకు విద్యుత్ చార్జీలను రద్దు చేశామన్నారు. మూడేళ్లలో తిరిగి చెల్లించుకునేలా తక్కువ వడ్డీకి ఎంఎస్ఎంఈలకు రుణాలిచ్చేందుకు రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు. ‘వైఎస్సార్ నవోదయం’ పథకం ద్వారా వన్ టైమ్ రీ స్ట్రక్చరింగ్ విధానంలో ఒకేసారి లక్షకుపైగా యూనిట్లకు రూ.2,807 కోట్ల విలువైన రుణాలను అందించి ఎంఎస్ఎంఈల్లో జవసత్వం నింపామని తెలిపారు. సరసమైన ధరకే ఎంఎస్ఎంఈలకు భూమిని అందించి రాష్ట్రవ్యాప్తంగా 31 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఎంఎస్ఎంఈ సీఈవో పవనమూర్తి తదితరులు ఏపీ తరఫున పాల్గొన్నారు. -
కాలం చెల్లిన చట్టాలు మనకొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. తద్వారా దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయొచ్చని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి కేంద్ర, రాష్ట్రాలు మరింత సన్నిహితంగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగస్వామిగా మారడానికి ప్రైవేట్ రంగానికి పూర్తి అవకాశం ఇవ్వాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆంక్షల సడలింపుపై రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని గుర్తుచేశారు. దేశాన్ని పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లించేందుకు మేధోమథనం చేయడమే ఈ సమావేశ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషి వల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం అధిగమించగలిగిందని గుర్తు చేశారు. దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నీతి ఆయోగ్ సమావేశ ఎజెండాను ఎంపిక చేసినట్లు వెల్లడించా రు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. పేదలకు పక్కా ఇళ్లు ‘దేశంలో ప్రతి పేద పౌరుడికీ పక్కా గృహ వసతి కల్పించే ఉద్యమం కొనసాగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 2014 నుంచి ఇప్పటివరకు 2.40 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. జల్‌జీవన్ మిషన్ ప్రారంభించాక 18 నెలల్లో∙3.5 లక్షల గ్రామీణ నివాసాలకు నల్లా ద్వారా తాగునీరు అందుబాటులోకొచ్చింది. ఇంటర్నెట్తో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ఉద్దేశించిన ‘భారత్ నెట్’ పథకం పెను మార్పులకు మాధ్యమం కానుంది. ప్రైవేట్ రంగం శక్తిని గౌరవించాలి : ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌పై సానుకూల ప్రతిస్పందన వ్యక్తమయ్యింది. ఇది దేశం మనోభావాలను బహిర్గతం చేసింది. ఇక సమయం వృథా చేయకుండా వేగంగా ముందడుగు వేయాలన్న దృఢ నిర్ణయానికి దేశం వచ్చింది. ఇండియా ప్రారంభించిన ఈ ప్రగతి ప్రయాణంలో భాగస్వామ్యానికి ప్రైవేట్ రంగం కూడా ఉత్సాహంతో ముందుకువస్తోంది. ఈ నవ్యోత్సాహాన్ని, ప్రైవేట్ రంగం శక్తిని ప్రభుత్వం తనవంతుగా గౌరవిస్తూ స్వయం సమృద్ధ(ఆత్మ నిర్భర్) భారత్ ఉద్యమంలో వీలైనంత ఎక్కువ అవకాశాలు సృష్టించాలి. దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచం కోసం కూడా ఉత్పత్తి చేయగలిగేలా భారత్ అభివృద్ధి చెందాలి. ఇందుకు స్వయం సమృద్ధ భారత్ ఉద్యమం ఒక మార్గం. ఆవిష్కరణలకు ప్రోత్సాహం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశ ఆకాంక్షల దృష్ట్యా ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం వేగంగా చేపట్టాలి. నవీన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలి. విద్యా, నైపుణ్య రంగాల్లో మెరుగైన అవకాశాల కల్పన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువగా వాడుకోవాలి. దేశంలో వ్యాపారాలు, సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), అంకుర సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోని వివిధ జిల్లాల్లో వాటికే ప్రత్యేకమైన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నాం. ఈ విధానాన్ని మండలాల స్థాయికి విస్తరించాలి. వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాల నుంచి ఎగుమతులను పెంచాలి. వివిధ రంగాల కోసం కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులు భారీగా పెరుగుతున్నాయి. స్థానిక పరిపాలన సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోపాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. ప్రపంచ దేశాలకు మన ఉత్పత్తులు విదేశాల నుంచి వంటనూనెల దిగుమతికి ప్రతిఏటా రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వాస్తవానికి ఈ సొమ్మంతా మన రైతులకు దక్కాల్సి ఉంది. నూనె గింజల ఉత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి. అనేక వ్యవసాయ ఉత్పత్తులను దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేయాలి. ఇది జరగాలంటే ఉత్పత్తులను భారీగా పెంచాలి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ప్రాంతీయ వ్యవసాయ–వాతావరణ ప్రణాళిక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. లాభార్జన కోసం కేవలం ముడి ఆహార పదార్థాలను కాకుండా, వాటి నుంచి రూపొందించిన ఉత్పత్తులను ఎగుమతి చేయాలి’ అని మోదీ అన్నారు. మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎల్జీలు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్‌గా ప్రధాని మోదీ నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. పాలక మండలి చైర్మన్‌గా ఇకపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రతినిధులు పాలక మండలిలో ఫుల్‌టైమ్ సభ్యులుగా ఉంటారు. అండమాన్ నికోబార్ దీవులు, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తారు. ప్రతిభ మనది.. ఉత్పత్తి మనది కాదు ‘నేను ఇటీవల ఐటీ రంగంలోని వ్యక్తులతో మాట్లాడా. తమలో 95 శాతం మంది ఇప్పుడు ఇంటినుంచే పని చేస్తున్నారని, ఉత్పాదకత పెరిగిందని చెప్పారు. నిబంధనల్లో సంస్కరణలు తేవడం వల్లే ఇది సాధ్యమైంది. జియో స్పేషియల్ డేటాకు సంబంధించిన నియమాలను కూడా సరళీకృతం చేశాం. పదేళ్ల క్రితమే చేయగలిగితే.. బహుశా గూగుల్ వంటివి భారతదేశం వెలుపల నిర్మితమయ్యేవి కావు. మన ప్రజలకు ప్రతిభ ఉంది, కానీ వారు తయారు చేసిన ఉత్పత్తి మనది కాదు’ అని అన్నారు. -
చిన్న పరిశ్రమలకు చేయూత
సాక్షి, హైదరాబాద్: ఎక్కడికక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచే చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వీటి ఏర్పాటుకు తోడ్పాటును అందించనుంది. పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 23 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న, మధ్య తరహా వ్యాపార, వాణిజ్య సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఉండగా, ఇందులో 56 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, మరో 44 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 జనవరి నుంచి ఇప్పటివరకు ఎంఎస్ఎంఈ రంగంలో రూ.11 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో ఎనిమిది వేల పైచిలుకు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’లో భాగంగా పలు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించడంతో పాటు ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా 18 ప్రాధాన్యతా రంగాలను గుర్తించగా, వీటిలో ఎంఎస్ఎంఈ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ టెండర్లలో అవకాశం ప్రభుత్వ టెండర్లలో ఎంఎస్ఎంఈలు పాల్గొనేలా ఈఎండీ, సెక్యూరిటీ వంటి అడ్డంకులను తొలగించడంతో పాటు, ప్రభుత్వ సంస్థల ద్వారా వీటి ఉత్పత్తుల కొనుగోలు కోసం వార్షిక టర్నోవర్, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోరు. ఎస్సీ, ఎస్టీ, మహిళల ఆధ్వర్యంలో నడిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తారు. మరోవైపు ‘గ్లోబల్‌లింకర్’అనే డిజిటల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అమ్మకందారులు, కొనుగోలుదారులను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐటీ శాఖ సహకారంతో రాష్ట్రంలో 4,500కు పైగా ఎంఎస్ఎంఈలు ఇప్పటికే గ్లోబల్ లింకర్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకున్నాయి. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత యాదాద్రి– భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసింది. గత ఏడాది ప్రారంభమైన ఈ పార్కులో ఏర్పాటయ్యే 450 పరిశ్రమల ద్వారా రూ.1,553 కోట్ల పెట్టుబడు లు వస్తాయని అంచనా. ఈ పార్కుతో 35 వేల కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని పరిశ్రమల శాఖ అంచనా. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే మొట్టమొదటి ఆదర్శ పారి శ్రామిక పార్కుగా అధికారులు చెప్తున్నారు. మ రోవైపు టీఎస్ఐఐసీలను ఎంఎస్ఎంఈ ల కోసం 18 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఇందులో 6 కొత్తవి. మరో 12 పార్కులను అప్‌గ్రెడేషన్ చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలు నష్టాల బారినపడకుండా చూ సే బాధ్యతను తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు అప్పగించారు. పారిశ్రామిక క్లస్టర్లలోని మాన్యుఫ్యాక్చరింగ్ ఎం ఎస్‌ఎంఈలలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలివ్వడంతో పా టు ఈక్విటీ మార్కెట్లలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తారు -
లాక్‌డౌన్‌లోనూ ఎంఎస్ఎంఈలకు విరివిగా రుణాలు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రకటించిన లాక్డౌన్ కష్ట సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లను ఆదుకోవడానికి బ్యాంకులు ముందుకువచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల కాలంలో రూ.1,5,303.71 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఎంఎస్ఎంఈ రంగానికి రూ.39,599.77 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా తొలి మూడు నెలల్లోనే 38.65% లక్ష్యాన్ని చేరుకున్నట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) తాజా నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఎంఎస్ఎం రంగాన్ని ఆదుకోవడానికి రుణాలకు బ్యాంక్ గ్యారంటీగా రూ.200 కోట్లు కేటాయించడంతో బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీంని వినియోగించుకోవడంలోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. ఈ స్కీం కింద అక్టోబర్ 5వ తేదీ నాటికి రూ.4,421.76 కోట్ల విలువైన రుణాలను ఎంఎస్ఎంఈలకు మంజూరు చేశాయి. లక్ష్యాన్ని మించిన విజయనగరం ఎంఎస్ఎంఈ రుణాల మంజూరు విషయంలో విజయనగరం జిల్లా తొలిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొత్తం మీద రూ.810 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తొలి మూడు నెలల్లోనే లక్ష్యాన్ని మించి రూ.1,145.38 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. అంటే లక్ష్యానికి మించి 141.40% రుణాలను మంజూరు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ.4,912.36 కోట్ల రుణాల లక్ష్యం కాగా మూడు నెలల్లో కేవలం రూ.845.81కోట్ల రుణాలను మాత్రమే మంజూరు చేసింది. నిర్దేశిత లక్ష్యంలో 17.22% మాత్రమే మంజూరు చేయడం ద్వారా చివరి స్థానంలో నిలిచింది. -
బీఎస్ఈతో తెలంగాణ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) కంపెనీల వ్యాపారం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్లోబల్ లింకర్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా స్టాక్ ఎక్సే్ఛంజ్ బీఎస్ఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆర్థిక వనరుల లభ్యత, కంపెనీల విశ్వసనీయతను పెంచే కీలక సవాల్‌ను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. అలాగే లిస్టింగ్ ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి కంపెనీలకు అవగాహన కల్పించేందుకు బీఎస్ఈ సాయం చేస్తుంది. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల లభ్యత ఎంఎస్ఎంఈలకు పరిమితంగా ఉంటోంది. ఇది కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటని బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిశ్ కుమార్ చౌహాన్ అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విస్తరణ మొదలుకుని కొనుగోళ్ల స్థాయికి వ్యాపారం ఎదిగేందుకు ఎంఎస్ఎంఈలకు నిధుల సమీకరణకు తోడ్పాటు లభిస్తుందన్నారు. ప్రస్తు తం స్టాక్ ఎక్సే్ఛంజీల్లో రాష్ట్రానికి చెందిన కొన్ని ఎంఎస్ఎంఈలు మాత్రమే నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ఈ సంఖ్య త్వరలో పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
ఎంఎస్ఎంఈ మార్ట్‌తో అంతర్జాతీయ లావాదేవీలు
సాక్షి, అమరావతి : సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి (ఎంఎస్ఎంఈ) వ్యాపార సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్ఐసీ) అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ మార్ట్ (msmemart.com) ద్వారా గ్లోబల్ బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. చిన్న వ్యాపార వేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఎంఎస్ఎంఈ మార్ట్ పోర్టల్ గురించి అవగాహన కల్పించండంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వ్యాపారులు ఏడాది పాటు ఈ పోర్టల్‌లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఏడాది పాటు ఉచితంగా సేవలు వినియోగించుకోవచ్చు. ఏడాది తర్వాత కొనసాగితే ఫీజులో 80 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఇతర వ్యాపార సంస్థలకు 30 రోజులు ఉచిత సభ్యత్వాన్ని కల్పిస్తున్నారు. ఈ ఉచిత సభ్యత్వం సమయంలో పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ పోర్టల్ ద్వారా ప్రయోజనం బాగుందని అనిపిస్తే ఏడాదికి రూ.7,080 (జీఎస్టీతో కలిపి) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈ మార్ట్ అందించే సేవలు వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్, ఐఎల్వో వంటి అంతర్జాతీయ సంస్థలు టెండర్లలో పాల్గోనే అవకాశం కొనుగోలు/అమ్మకాలకు సంబంధించి ట్రేడ్ లీడ్స్ ఆన్లైన్లో 24 గంటలు ఉత్పత్తుల ప్రదర్శన ఆన్లైన్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్. అంతర్జాతీయ ట్రేడ్ షో వివరాలు, వాటి ప్రదర్శన పాత మిషనరీ కొనుగోలు, అమ్మకం యూనిట్ల మెర్జింగ్ అండ్ అక్విజేషన్స్ ఎప్పటికప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్, ధరల వివరాలు ఫ్రాంచైజీ, డిస్ట్రిబ్యూటర్‌షిప్ సొంతంగా వెబ్ డెవలప్మెంట్కు టూల్స్ కొటేషన్స్ (ఆసక్తి వ్యక్తీకరణ)లో పాల్గొనే అవకాశం ఎదుటి సంస్థల యాజమాన్యం గురించి తెలుసుకునే అవకాశం. -
ఇకపై జిల్లాకు మరింత దగ్గరగా..
సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి ఆలోచన పరిశ్రమల మంత్రి ఆచరణతో ఏపీలో పారిశ్రామిక విప్లవం ఊపందుకుంది. మంత్రి మేకపాటి ఇలాకాలో ఏపీ పారిశ్రామికాభివృద్ధికి తొలి అడుగు పడింది. సొంత నియోజకవర్గం ఆత్మకూరులో ఆదివారం రోజున పారిశ్రామికవాడకు శ్రీకారం చుట్టారు. మెట్ట ప్రాంత ప్రజల సాక్షిగా పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆత్మకూరు ప్రజలు, ముఖ్యమంత్రి నమ్మకం వల్లే మంత్రిగా అవకాశం దక్కింది. మెట్ట ప్రాంత ప్రజలు గర్వించేలా ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఏడాది పాలనలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రికి కీర్తి ప్రతిష్టలు దక్కాయి. ఉద్యోగాల కోసం ఊరు వదిలే పరిస్థితి రానీయం. పారిశ్రామిక పార్క్ వల్ల భవిష్యత్‌లో 2,000 ఉద్యోగాలు దక్కనున్నాయి. ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు రూ.400కోట్లతో అత్యున్నత హంగులతో అభివృద్ధి చేస్తాం. పార్క్ శంకుస్థాపన ఏవిధంగా అయితే వేగంగా జరిగిందో అలాగే.. ఏడాదిన్నరలోగా ఎంఎస్ఎమ్ఈ పార్క్ పూర్తి చేస్తాం. మొత్తం 173 ఎకరాలలో పార్కు నిర్మాణం చేస్తుండగా.. మొదటి దశలో 87 ఎకరాలలో అభివృద్ధి చేయనున్నాము. ప్లాస్టిక్ ఫర్నిచర్ తయారు చేసే పార్కుతోనే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. సకల వసతులతో , అన్ని వనరులు పుష్కలంగా ఉండేలా పార్కును తీర్చిదిద్దుతాము. కీలక శాఖలు, ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతల వల్ల ప్రత్యక్ష్యంగా మాత్రమే నియోజకవర్గానికి దూరం ఉన్నాను. నేనెక్కడున్నా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. (ఏపీలో సమగ్ర పరిశ్రమ సర్వే: గౌతమ్‌రెడ్డి) ఎలాంటి సమస్య వచ్చినా పాలనపరంగా నిత్యం అందుబాటులో ఉంటాను. ఎంత కుదరకపోయినా ఎంజీఆర్ హెల్ప్ లైన్, వర్చువల్ మీటింగులతో మీ మధ్యే ఉన్నా. ఇకపై నియోజకవర్గం, జిల్లాకు మరింత దగ్గరగా ఉంటా' అని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్ఎస్ఈఎమ్ఈల నిర్మాణం ఎలా ఉండబోతుందో మంత్రి మేకపాటి వీడియో ద్వారా ప్రజలకు చూపించారు. వీడియోలు, ఫోటోలకు పరిమితమయ్యే పారిశ్రామికాభివృద్ధి మా విధానం కాదు. చెప్పింది చెప్పినట్లు చేసి చూపే నినాదం మా ప్రభుత్వానిది. (2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ) సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులతో మెట్ట ప్రాంతం పచ్చని మాగాణమవుతుంది. త్వరలోనే ఆ పనులు చేపట్టి పూర్తి చేస్తాం. పాదయాత్రలో చెప్పిన సోమశిల హామీని నెరవేరుస్తాం. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు 6 టీఎంసీల నీరు అందిస్తాం' అని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా.. 'వైఎస్సార్ ఆసరా' పథకం ద్వారా నియోజకవర్గ మహిళలకు రూ. 13.05 కోట్ల చెక్కును అందించారు. ఉదయగిరిలో పార్క్ ఏర్పాటు చేయండి యువత ఆశయాలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి, మంత్రి కృషి చేస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఆయన విజ్ఞప్తి చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, ఆత్మకూరు ఆర్డీవో సువర్ణమ్మ, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కంచెర్ల శ్రీహరి నాయుడు, ఏఎంసీ ఛైర్మన్ అనసూయమ్మ, ఆత్మకూరు నియోజకవర్గంలోని మండలాల కన్వీనర్లు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
నేపాల్ సంస్థతో ఫ్లిప్‌కార్ట్ జోడీ..
ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎమ్ఈ) రంగంలో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్ ఈ కామర్స్ దిగ్గజం సాస్టోడీల్‌తో కలిసి పనిచేయనుంది. సాస్టోడీల్‌కు చెందిన 5,000 ఉత్పత్తులను ఫ్టిప్‌కార్ట్ సంస్థలో నమోదు చేయనున్నట్లు తెలిపారు. కాగా ఫ్లిప్‌కార్ట్ హెడ్ జగజీత్ హరోడే స్పందిస్తూ.. ఫ్లిప్‌కార్ట్, సాస్టోడీల్ కలయికతో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే కాకుండా, దేశీయ అమ్మకాలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. మరోవైపు సాస్టోడీల్ సీఈఓ అమున్ థాపా స్పందిస్తూ.. ఫ్లిప్‌కార్ట్‌తో జోడీ వల్ల నేపాల్‌లోని వినియోగదారులకు మెరుగైన క్వాలిటీతో కూడిన ఉత్పత్తులను అందించవచ్చని తెలిపారు. ఇరు సంస్థలు కలయికతో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లెయెన్సెస్, ఫర్నిషింగ్స్ తదితర విభాగాలలో మెరుగైన సేవలు అందిస్తామని సంస్థల ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నేపాల్, భారత వినియోగదారుల అభిరుచులు ఒకే విధంగా ఉంటాయని సాస్టోడీల్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఫ్లిప్‌కార్ట్‌కు 2లక్షల మంది అమ్మకందార్లు ఉన్నారని, 50శాతం ఉత్పత్తులు జైపూర్, లక్నో, మీరట్, కాన్పూర్, కోయంబత్తూర్, అహ్మదాబాద్ తదితర నగరాల నుంచే వస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. చదవండి: ఫ్లిప్‌కార్ట్ సేల్ : బంపర్ ఆఫర్లు -
ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎంఎస్ఎంఈ)కు రూ.3 లక్షల కోట్ల రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అత్యవసర రుణ హామీ పథకం’ (ఈసీఎల్జీఎస్) కింద.. బ్యాంకులు ఇప్పటికే రూ.లక్షకోట్లకు పైగా రుణాలను అందించాయి. ఆగస్ట్ 18 నాటికి మొత్తం రూ.1,50,759.45 కోట్ల రుణాలను మంజూరు చేయగా, ఇందులో రూ.1,02,245.77 కోట్ల మేర వారికి పంపిణీ చేయడం కూడా పూర్తయింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. ఈ పథకం కింద బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు అందించే రుణాలకు కేంద్రం హామీదారుగా ఉంటుంది. కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల విలువైన వివిధ ప్యాకేజీల్లో ఈ పథకం కూడా ఒకటి కావడం గమనార్హం. 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 24 ప్రైవేటు బ్యాంకులు, 31 ఎన్బీఎఫ్ సీలు కలసి ఎంఎస్ఎంఈలకు ఈ మేరకు రుణాలను అందించాయి. కేంద్రం ప్రకటించిన నాటి నుంచి ఈ ఏడాది అక్టోబర్ చివరి వరకు లేదా గరిష్టంగా రూ.3 లక్షల కోట్ల రుణాలకు (ఏది ముందు అయితే అది) ఈ పథకం అమల్లో ఉంటుంది. రుణంపై 9.25 శాతం వార్షిక వడ్డీ రేటు అమలవుతుంది. అత్యధికంగా మహారాష్ట్రలోని ఎంఎస్ఎంఈలకు రూ.7,756 కోట్ల రుణాలు మంజూరు కాగా, ఆ తర్వాత తమిళనాడులోని ఎంఎస్ఎంఈలకు రూ.7,740 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. -
ఎంఎస్ఎంఈల్లో మరింతగా ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎంఎస్ఎంఈ) మరిన్ని పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. రహదారి భద్రత కోసం తీసుకున్న చర్యలను మంత్రి ప్రస్తావిస్తూ.. వీటి ఉద్దేశ్యం 2030 నాటికి రహదారి ప్రమాదాల కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడడమేనని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్, ఎంఎస్ఎంఈ సంస్థలు రెండు ప్రధాన వృద్ధి కారకాలుగా పేర్కొన్నారు. ఇండో ఆస్ట్రేలియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. రహదారి భద్రత విషయంలో భారత్–ఆస్ట్రేలియా సహకారం అందించుకుంటున్నాయని చెప్పారు. రహదారుల అభివృద్ధి, నవీకరణ కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలను 50 శాతం వరకు తగ్గిస్తాయన్నారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి రూ.7,000 కోట్ల నిధుల సాయానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు అంగీకరించినట్టు మంత్రి గడ్కరీ వెల్లడించారు. -
ఎంఎస్ఎంఈలకు వైఎస్సార్ నవోదయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పది లక్షల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో బ్యాంకులు కూడా అంతే పాత్ర పోషిస్తున్నాయి. అత్యధిక ప్రాధాన్యత ► ఎంఎస్ఎంఈల రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేకంగా వైఎస్సార్ నవోదయం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ► ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈల రుణాలను వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కల్పించారు. ► ఇందులో భాగంగా ఇప్పటి వరకు లక్షకు పైగా యూనిట్ల రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేశాయి. మొత్తం 1,00,738 యూనిట్లకు చెందిన రూ.2769.82 కోట్ల రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేశాయి. ► రుణాల పునర్వ్యవస్థీకరణకు ఇంకా 63,515 ఎంఎస్ఎంఈలకు అర్హత ఉందని, వాటి రుణాలనూ త్వరగా పునర్వ్యవస్థీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను కోరింది. ► సీఎం వైఎస్ జగన్ ఎంఎస్ఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టిన రాయితీ సొమ్ము రూ.905 కోట్లనూ విడుదల చేసిన విషయం తెలిసిందే. ► బ్యాంకులు కూడా గత ఆర్థిక ఏడాది లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేశాయి. -
ఆదాపై ‘టెరీ’ ఆరా
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల్లో ఇంధన పొదుపు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఏపీలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో చేపట్టే.. అంతర్జాతీయ ఇంధన పొదుపు సాంకేతికతకు ఈ అధ్యయనం కీలకం కానుంది. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ. చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ► విద్యుత్ వినియోగం అధికంగా ఉండే గ్లాస్, రిఫ్రాక్టరీ పరిశ్రమలను అధ్యయనం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ను బీఈఈ ఎంపిక చేసింది. ఈ అధ్యయన బాధ్యతను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్–టెరీ’కు అప్పగించింది. ► అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ జాబితా ప్రకారం మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రిఫ్రాక్టరీ పరిశ్రమల్లో ఏడాది పాటు టెరీ అధ్యయనం చేస్తుంది. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా జాతీయ స్థాయిలో ఎంఎస్ఎంఈల కోసం బీఈఈ ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తుంది. ► రాష్ట్రంలో విద్యుత్ పొదుపుకు అపార అవకాశాలున్నాయని టెరీ గతంలో నిర్వహించిన ఓ సర్వేలో గుర్తించింది. దీంతో అన్ని స్థాయిల్లోనూ అత్యాధునిక సాంకేతికత, పొదుపు చేయగల విద్యుత్ ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంధన పొదుపు సంస్థ కృషి చేస్తోంది. ► ఎంఎస్ఎంఈ రంగంలో నూతన ఎనర్జీ ఎఫిషియన్సీ సాంకేతికత అమలు చేస్తున్న ఇంధన శాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నదని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్రంలో చేపట్టే అధ్యయనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. -
చిన్న పరిశ్రమలకు రుణ సౌలభ్యం
న్యూఢిల్లీ: అత్యవసర రుణ హామీ పథకం (ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్– ఈసీఎల్జీఎస్) పరిధిలోకి వచ్చే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణాల మంజూరీని నిరాకరించవద్దని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బ్యాంకింగ్‌కు శుక్రవారం స్పష్టంచేశారు. ఇలాంటి పరిస్థితి ఏ సంస్థకైనా ఎదురైతే ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని కూడా ఆమె కోరారు. వివరాల్లోకి వెళితే... . మేలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్) ప్యాకేజ్‌లో ఈసీఎల్జీఎస్ ఒక భాగంగా ఉంది. కోవిడ్–19 నేపథ్యంలో ఏర్పడిన మందగమన పరిస్థితుల్లో చిక్కుకున్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ స్కీమ్ కింద మొత్తం రూ.3 లక్షల కోట్లను అందించాలన్నది ప్యాకేజ్ ఉద్దేశం. జూలై 23 వరకూ ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు రూ.1,30,492 కోట్లను మంజూరు చేశాయి. ఇందులో 82,065 కోట్లను పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇండస్ట్రీ చాంబర్– ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘అత్యవసర రుణ సౌలభ్యం కిందకు వచ్చే ఎంఎస్ఎంఈలకు రుణాల మంజూరీని బ్యాంకులు తిరస్కరించలేవు. ఒకవేళ అలా జరిగితే ఫిర్యాదు చేయండి. నేను ఆ విషయాన్ని పరిశీలిస్తాను’’ అని నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల జీఎస్టీ రేటు తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు ఉంటాయని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు ఫిక్కీ వెల్లడించింది. మారటోరియం పెంపు అవకాశం రుణాల పునఃచెల్లింపులకు సంబంధించి మార్చి నుంచి ఆగస్టు వరకూ అమలులో ఉన్న బ్యాంకింగ్ రుణ మారటోరియం కాలపరిమితిని మరింత పెంచే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో చర్చిస్తున్నట్లు ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దీనితోపాటు ఆతిథ్య పరిశ్రమకు రుణ పనర్వ్యవస్థీకరణ అంశంపైనా ఆర్బీఐతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. ‘‘ఆతిథ్య రంగం అవసరాలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మారటోరియం పెంపుకానీయండి లేదా రుణ పునర్వ్యవస్థీకరణ కానీయండి. ఆయా అంశాలపై ఆర్బీఐతో కేంద్రం చర్చిస్తోంది’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. చర్యలు తీసుకునే ముందు సంబంధిత పారిశ్రామిక రంగాలతో సంప్రతింపులు జరుపుతుంది’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నట్లు పిక్కీ ఒక ట్వీట్లో వెల్లడించింది. -
పారిశ్రామిక చేయూతలో ఏపీనే బెస్ట్
సాక్షి, అమరావతి: సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని పరిశ్రమలకు పూర్తిస్థాయి చేయూతను అందిస్తున్నామని, ఆదాయం పడిపోయిన సమయంలోనూ ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)లకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ‘మేకింగ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ పాజిటివ్’ అనే అంశంపై సోమవారం ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ► కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైన సమయంలోనూ ఎంఎస్ఎంఈలను ఆదుకోవటానికి రూ.1,168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించి, రెండు విడతల్లో చెల్లించాం. ► ప్రభుత్వ విభాగాలకు కొనుగోలు చేసే 360 రకాల వస్తువుల్లో 25% ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేసి 45 రోజుల్లో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. ► పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కార్మిక శక్తిని అంచనా వేసి ఉపాధి అందించే విధంగా ఒక యాప్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నాం. ► అవసరమైతే నైపుణ్య శిక్షణను అందించి ఎక్కువ మందికి ఉపాధి కొరతను తీర్చేందుకు ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాం. ► రాష్ట్రానికి తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టాం. సమావేశంలో శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ పీఐ హరనాథ్, రాష్ట్రీయ ఇస్పట్ నిగం లిమిటెడ్ చైర్మన్ ప్రదోశ్ కుమార్ రత్, ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, తదితరులు హాజరయ్యారు. -
కోవిడ్ సంక్షోభమున్నా అవకాశాలను సృష్టిస్తాం..
సాక్షి, అమరావతి: పారిశ్రామిక రంగానికి చేయూతనందించడంలో దేశంలోనే అత్యుత్తమంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. 'కోవిడ్ సంక్షోభమున్నా అవకాశాలను సృష్టిస్తాం.. అభివృద్ధి సాధిస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రణాళిక, సమయపాలనలతో లక్ష్యాలను చేరుతాం. ఆర్థిక, పారిశ్రామిక, రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమయ్యింది. దేశ వ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు నెమ్మదించాయి. (వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయండి) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను దేశంలోనే ముందు ఆదుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఏప్రిల్ 30న కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను(ఎంఎస్ఎంఈ) ఆదుకోవటానికి రూ.1,168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించాం. జూన్ 30 కల్లా ప్రకటించిన మొత్తాన్ని 2 విడతలుగా చెల్లించాం. మే, జూన్ నెలల్లో ఎంఎస్ఎమ్ఈలకు రూ.905 కోట్ల పెండింగ్ ప్రోత్సాహక బకాయిలు అందించాం. లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలకు వెసులుబాటు కోసం విద్యుత్ స్థిర ఛార్జీలు రూ.188 కోట్లు మాఫీ చేశాం. మరో రూ.200 కోట్ల నిధితో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించాం. ప్రభుత్వ విభాగాలకు అవసరమైన 360 రకాల వస్తువులు, ఇతర సామగ్రిలో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేసి 45 రోజుల్లో బిల్లులు చెల్లించే నిర్ణయాలు అమలు చేస్తున్నాం. (ఇకపై ఉద్యోగ వివరాలకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్..) మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనా ప్రభావం దేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా పడింది. ముఖ్యంగా ఏపీలోనూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలు వెనకబడ్డాయి. అన్ని రాష్ట్రాలలో పరిశ్రమలు మూతపడి, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలపై ఆ ప్రభావం పడింది. కార్మికులు సొంత ఊళ్లకు చేరడంతో పరిశ్రమలలో పనులకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్ ప్రభావాన్ని అధిగమించి అభివృద్ధి అంచనాలను మించుతాం. కీలక రంగాలను ఎంచుకుని, ఆర్థికంగా బలపడడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. గ్రామీణ స్థాయిలో సొంత ఊళ్లకు వచ్చిన వలస కార్మికుల వివరాలపై అధ్యయనం ప్రారంభిస్తున్నాం. ఉద్యోగం లేని వారి సంఖ్య.. వారిలోని నైపుణ్యం ఏంటి, పరిశ్రమలలో వారిని వినియోగించుకోవడం ఎలా అన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు' మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. -
జియోమార్ట్‌కు షాక్ : ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్
సాక్షి, ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూపు వాల్‌మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని రివర్స్ అక్విజిషన్‌లో భాగంగా వాల్‌మార్ట్ ఇండియా హోల్‌సేల్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ కొనుగోలు ద్వారా సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ను ప్రారంభించినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తద్వారా భారతదేశంలో కిరాణా రీటైల్ వ్యాపార స్వభావాన్ని మార్చి వేయనున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆన్లైన్ కిరణా వ్యాపారంలో ఉన్నపోటీ, జియోమార్ట్ పేరుతో రిలయన్స్ రీటైల్ రంగంలో దూసుకువస్తున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ తాజా డీల్ విశేషంగా నిలిచింది. ‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ ను ఆగస్టులో లాంచ్ చేయనున్నామని, కిరాణా, ఫ్యాషన్ వర్గాలకు పైలట్ సేవలను అందిస్తామని పేర్కొంది. దీనికి ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగి, అనుభవజ్ఞుడు ఆదర్శ్ మీనన్ నేతృత్వం వహిస్తారు. అలాగే వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ సమీర్ అగర్వాల్ కొంతకాలంవరకు సంస్థతోనే ఉంటారు. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సంస్థ కిరాణా దుకాణాలు, చిన్నవ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. భారతదేశ రిటైల్ వ్యాపారంలో కిరణాల దుకాణాలు, ఎంఎస్ఎంఈలు కీలకంగా ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ నైపుణ్యాలు, లాజిస్టిక్ అవసరాలు, ఆర్థికంగా చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడంతోపాటు, వినియోగదారుల అవసరాలను తీర్చడంపై ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ దృష్టి సారిస్తుందని అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు. ఇదొక కీలక ముందడుగు అని వాల్‌మార్ట్ ఇండియా సీఈవో జుడిత్ మెక్కెన్నా వ్యాఖ్యానించారు. ఒకరి బలాలు, నైపుణ్యాలు పరస్పరం పెంచుకోవడం ద్వారా, కొత్త ఒరవడికి నాంది పడుతుందని పేర్కొన్నారు. -
ఎంఎస్ఎంఈలకు ప్రపంచ బ్యాంకు భారీ సాయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రపంచ బ్యాంకు భారీ సాయాన్ని ప్రకటించింది. వాటికి ద్రవ్య లభ్యత లభించేందుకు 750 మిలియన్ డాలర్లు(సుమారు 5,670 కోట్ల రూపాయలు) పైగా సహకారం అందించే ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే, ప్రపంచ బ్యాంకు భారత డైరెక్టర్ జునైద్ అహ్మద్ సంతకం చేశారు. ప్రస్తుత సంక్షోభంనుంచి తట్టుకోవడంతోపాటు, మిలియన్ల ఉద్యోగాలను రక్షించడంలోనూ, తక్షణ ద్రవ్య భ్యత, ఇత రుణ అవసరాల నిమిత్తం 1.5 మిలియన్ల సంస్థలకు ఇది సాయపడుతుందని తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఇబ్బందులనుంచి గట్టెక్కించడానికి అవసరమైన చర్యల్లో ఇది మొదటి అడుగు అని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. మహమ్మారి ఎంఎస్ఎంఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఫలితంగా జీవనోపాధి, ఉద్యోగాలు కోల్పోతున్నారని ఖరే చెప్పారు. సంక్షోభం నుండి బయటపడేందుకు ఎంఎస్ఎంఈ రుణ ప్రణాళికను ప్రకటించామని చెప్పారు. జునైద్ అహ్మద్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ రంగం భారతదేశం వృద్ధికి, ఉద్యోగ కల్పనకు కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. (భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం) కరోనా అనంతరం ఆర్ధిక పునరుద్ధరణకు ఈ రంగానికి ద్రవ్యలభ్యత తక్షణ అవసరమని ఆయన తెలిపారు. మొత్తం ఫైనాన్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రధానంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బిఎఫ్సి) స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌సిబి)ల రుణ సామర్థ్యాన్ని పెంచాలని, దీంతో ఎంఎస్ఎంఈ ఆర్థిక సమస్యల పరిష్కారంలో ఇవి సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కాగా కరోనా నేపథ్యంలో భారత సామాజిక, వైద్య రంగాలకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2.75 బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించింది. వీటికి అదనంగా ప్రస్తుతం ప్రకటించిన మొత్తాన్ని ఎంఎస్ఎంఈల కోసం ఇస్తామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ లోన్ మెచ్యూరిటీ 19 ఏళ్లతో 5 ఏళ్ల గ్రేస్ పీరియడ్ కలిగి ఉంటుందని చెప్పారు. భారతదేశ ఆరోగ్య రంగానికి తక్షణ మద్దతు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించింది. అలాగే పేదలు, బలహీన వర్గాలకు నగదు బదిలీ, ఆహార ప్రయోజనాల నిమిత్తం మే నెలలో మరో బిలియన్ డాలర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం
విజయనగరం పూల్‌బాగ్: పరిశ్రమలు పచ్చగా ఉంటే దానినే నమ్ముకున్న కారి్మకుల బతుకు బాగుంటుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దానిని కష్టాల్లోకి నెట్టేస్తే వేలాది కుటుంబాలపై దాని ప్రభావం పడుతుంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో పరిశ్రమల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్త పరిశ్రమలు రాలేదు సరికదా... ఉన్నవి చాలావరకూ మూ తపడ్డాయి. ఫలితంగా జిల్లాలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది. అటువంటి తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించింది. పరిశ్రమలను ఆదుకునేందుకు కంకణం కట్టుకుంది. రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈ (చిన్నపరిశ్రమ)లకు బకాయిలు చెల్లించేసింది. రెండు విడతలుగా 194 క్లెయిమ్‌లకు రూ.15.82కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా కంపెనీల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల పురోగతికి ఊతం చిన్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సాయం అందించింది. రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో ఎంఎస్ఎమ్ఈలకు ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రారంభించారు. మొదటి విడతలో 44 యూనిట్లకు 64 క్లెయిమ్స్ మొ త్తం రూ.6.92 కోట్లను మంజూరు చేశారు. రెండో విడ తలో 59 యూనిట్లకు చెందిన 130 క్లయిమ్స్ మొత్తం రూ.8.90 కోట్లు విడుదల చేసింది. రెండు విడతల్లో మొత్తం 194 క్లెయిమ్‌లకు రూ.15.82 కోట్లు విడుద లైంది. ఈ సహాయంతో జిల్లాలోని పరిశ్రమలకు ప్రోత్సాహంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. గర్వంగా ఉంది... 15 ఏళ్లుగా కష్టాన్ని నమ్ముకుని అప్పు చేసి కంపెనీలు నడుపుతున్నాం. ఇటీవల కోవిడ్ వల్ల లాక్డౌన్లో ఇన్స్టాల్ మెంట్ చెల్లించలేని దుస్థితి దాపురించింది. బ్యాంకుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. అటువంటి నాకు మొదటి విడతలో రూ.55 లక్షలు పెట్టుబడి రాయితీ లభించడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని బ్యాంకుకు వెళ్తున్నాము. మాకు చేయూతనిచ్చి, మా పరువు నిలిపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. చిన్న పరిశ్రమల వైపు ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ఇకపై చిన్న పరిశ్రమలకు మంచిరోజులు వస్తున్నాయి. – మామిడి వాసుదేవరావు, యజమాని, బల్‌్కడ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్ బడ్జెట్ లేకపోయినా.... ఇండస్ట్రీ బడ్జెట్ లేకపోయినా ఎంఎస్ఎమ్ఈలకు బకాయిలు చెల్లించడంతో పరిశ్రమలు చక్కగా నడిపించుకోవటానికి, ఇంకా మరింత మందికి ఉపాధి కల్పించేందుకు ఇప్పుడు చాలా అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఎంఎస్ఎమ్ఈలకు ఊతం ఉంటేనే ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా లోకల్ మార్కెట్ బాగా డెవలప్ అయి నిత్యావసరాలు కావాల్సిన ఇంజినీర్ ప్రొడక్టులు గాని, దానికి సంబంధించిన సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎంఎస్ఎంఈల వల్ల అత్యధికంగా ఉపాధి కలుగుతుంది. తద్వారా సేవారంగం, ట్రాన్స్‌పోర్టు రంగం కూడా పెరుగుతుంది. జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. – కోట ప్రసాదరావు, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, విజయనగరం -
ఏపీ సోషల్ రిఫార్మర్ సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవం పోశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈల ద్వారా10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సింగిల్ విండో విధానాన్ని కూడా సీఎం జగన్ తీసుకొచ్చారని తెలిపారు. రీస్టార్ట్ ప్యాకేజీ రూపంలో ఎంఎస్ఎంఈలకు మొదటి విడతలో రూ. 450 కోట్లు రెండో విడతలో రూ.512 కోట్లు సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారని చెప్పారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారని చెప్పారు. (ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్) ఆంధ్రప్రదేశ్‌కు సోషల్ రిఫార్మర్ సీఎం జగన్ అని అబ్బయ్య చౌదరి కొనియాడారు. ఎల్లో మీడియా కీయా మోటార్స్ తరలిపోతుందని తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. కీయా మోటార్స్ తమ ప్లాంట్‌ను మరింత విస్తరిస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. సౌత్ ఇండియాకు పారిశ్రామిక ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ ఉన్న నేత అని అన్నారు. చంద్రబాబు ఎన్ని ఇండస్ట్రీల్ సమ్మిట్లు పెట్టినా రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాలేదని ఎద్దేవా చేశారు.చంద్రబాబులా మాయ మాటలు చెప్పడం సీఎం జగన్‌కు తెలియదన్నారు. ఎంఎస్ఎంఈలకు చంద్రబాబు ప్రభుత్వం 4 వేలకోట్లు బకాయిలు పెట్టిందని అబ్బయ్య చౌదరి మండిపడడ్డారు. ఎంఎస్ఎంఈలు పెట్టిన వాళ్లలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారని తెలిపారు. వాటికి మేలు చేసే విధంగా రూ.182 కోట్లు విద్యుత్ బకాయిలు సీఎం వైఎస్ జగన్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈల ద్వారా గ్రామ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. త్వరలో 47 సెజ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. -
పరిశ్రమలకు చేయూత
-
పరిశ్రమలకు రెండో విడత బకాయిలు విడుదల
-
పరిశ్రమలకు రెండో విడత బకాయిలు విడుదల
సాక్షి, అమరావతి: కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను సోమవారం విడుదల చేసింది. రిస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మే నెలలో రూ.450 కోట్లను మే నెలలో విడుదల చేయగా, ఈ రోజు రూ.512 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014–15 నుంచి గత సర్కారు రూ.827.5 కోట్ల మేర బకాయిలు పెట్టింది. టీడీపీ సర్కారు బకాయిలతో పాటు ఈ ఏడాది రాయితీలు కూడా కలిపి రూ.962.62 కోట్లను రెండు విడతలుగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మే నెలలో తొలివిడతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.450.27 కోట్లను విడుదల చేశారు. మిగతా బకాయిలను జూన్ 29వ తేదీన విడుదల చేస్తామని అదే రోజు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండో విడత బకాయిలను సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలకు తోడుగా ఉంటేనే వారి కాళ్లమీద వాళ్లు నిలబడటంతో పాటు కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వగల్గుతారని పేర్కొన్నారు. వ్యవసాయరంగం తర్వాత ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ఎంఈలదే అని సీఎం అన్నారు. గత ప్రభుత్వం రూ.800 కోట్లను బకాయిలుగా పెట్టిందని, వాటన్నింటిని తమ ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు. కరోనా వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో వెసులుబాటు ఇచ్చేందుకు ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో కరెంటు ఫిక్స్డ్ ఛార్జీలు రూ.180 కోట్లు మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏపీఎస్ఎఫ్సీ ద్వారా రూ.200 కోట్లతో పెట్టుబడి రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నామని చెప్పారు. రుణాలకు 6 నెలల మారటోరియంతో పాటు మూడేళ్ల కాలపరిమితిలో చెల్లించే అవకాశం కల్పించామని చెప్పారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి 25శాతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. స్పిన్నింగ్ మిల్లులకు సబంధించిన రూ.1000 కోట్ల బకాయిలను వచ్చే ఏడాదిలో చెల్లిస్తామన్నారు.ఎంఎస్ఈలకు సంబంధించి బాగోగులు చూసేందుకు ఓ జేసిని పెడుతామన్నారు. పనుల కోసం అధికారుల చుట్టూ తిరినే పరిస్థితి రాకుండా చూస్తామన్నారు. ఎంఎస్ఈల పనులపై జేసీలు దృష్టిపెట్టేలా కలెక్టర్లులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు వీరికి చేయూత నిచ్చేలా పనిచేయాలని, అప్పుడే నలుగురికి ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. “రాష్ట్రంలో ఉన్న దాదాపు 98వేల ఎంఎస్ఎంఈ యూనిట్లలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ఆర్థికస్థితి బాగాలేకున్నా ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించాం.” pic.twitter.com/JSTLJ7byvN — YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2020 -
కరోనా కష్టకాలంలో MSMEలకు అండగా ప్రభుత్వం
-
చిన్న పరిశ్రమలు కళకళ
సాక్షి, అమరావతి: పదేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు రాష్ట్రంలో తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకునే విధంగా సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటి నాటినుంచీ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బ్యాంకు రుణాలను చెల్లించలేక ఎన్పీఏలుగా మారిపోయిన యూనిట్లను ఆదుకోవడానికి ‘వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు లేక, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని రక్షించేందుకు తక్షణం రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద గత ప్రభుత్వం బకాయిపడ్డ రాయితీలతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సిన రాయితీలు కలిపి రూ.905 కోట్లు విడుదల చేయడం ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న ఎంఎస్ఎంఈలకు ఆక్సిజన్ అందించినట్టయ్యిందని పారిశ్రమికవేత్తలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా ఏపీ ప్రభుత్వం ఒక్క ఏడాది బకాయి కూడా లేకుండా చెల్లించిదంటున్నారు. ప్రయోజనాలు కల్పించారిలా.. రూ.188 కోట్ల స్థిర విద్యుత్ డిమాండ్ చార్జీల భారాన్ని మాఫీ చేయడం, వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లు కేటాయించడం, ప్రభుత్వ శాఖలు చేసే కొనుగోళ్లలో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచి తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంఎస్ఎంఈలకు కొండంత భరోసానిచ్చింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 78,634 యూనిట్లకు రూ.2,079.23 కోట్ల రుణాన్ని మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 33,574 యూనిట్లకు రూ.1,269.91 కోట్ల రుణాలు అందించారు. పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను నిరంతరం పర్యవేక్షించే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎంఎస్ఎంఈలకు పరిశ్రమ ఆధార్ ఇవ్వడం ద్వారా పూర్తిస్థాయిలో డేటాబేస్‌ను తయారు చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా ఏపీఐఐసీ ప్లగ్ అండ్ పే విధానంలో వినియోగించుకునే విధంగా 31 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆశలు వదిలేసుకున్న సమయంలో.. పొలం అమ్మేసి రూ.3.50 కోట్లతో కృష్ణా జిల్లా కొండపర్రు గ్రామంలో ‘ఒలేనో’ పేరుతో ఫ్యాన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పా. మూడేళ్ల నుంచి ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు కోసం అధికారులు చుట్టూ తిరిగినా ఉపయోగం లేకపోయింది. కరోనా దెబ్బతో పూర్తిగా ఆశలు వదిలేసుకున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ రీస్టార్ట్ ప్యాకేజీ కింద మొత్తం బకాయిలను విడుదల చేశారు. దీనివల్ల మాకు రూ.50.45 లక్షలు వచ్చాయి. తక్కువ వడ్డీ రేటుపై రూ.7 లక్షల అదనపు రుణం తీసుకున్నాం. ఓడిపోయా అనుకుంటున్న తరుణంలో సీఎం నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. – పి.సుధాకర్, ఎలైట్ ఆప్ట్రానిక్స్ మహిళలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. ఆసమయంలో పరీక్షల నోటిఫికేషన్ రాకపోవడంతో కృష్ణా జిల్లా సూరంపల్లిలో రూ.80 లక్షలతో పాదరక్షల తయారీ యూనిట్ ఏర్పాటు చేశా. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు రాకపోగా కరోనా దెబ్బతో రావాల్సిన మొత్తాలూ ఆగిపోయాయి. ఉద్యోగులకు బంగారం తాకట్టు పెట్టి జీతాలు చెల్లించా. చేతిలో చిల్లిగవ్వ లేక పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయా. ఈ తరుణంలో రీస్టార్ట్ ప్యాకేజీ కింద నాకు రెండో విడతలో జూన్ 29న రూ.11 లక్షలు రానున్నాయి. ప్రస్తుత రుణంపై అదనంగా రూ.7 లక్షల రుణం లభించింది. – షైనీ, షైనీ వాక్ ఫుట్‌వేర్ ప్రోపెరిటెక్స్ మూడు నెలలకోసారి ఎస్ఎల్బీసీ పెట్టాలి సీఎం ప్రకటించిన ప్యాకేజీతో ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకోవడానికి ఊతం లభించింది. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల ముడి సరుకు లభించకపోవడం, కార్మికుల కొరత, లాజిస్టిక్, బకాయిల చెల్లింపులు వంటి అనేక సమస్యలున్నాయి. ఎంఎస్ఎంఈలు సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. పారిశ్రామిక అవసరాలు తీర్చడం కోసం ప్రత్యేక ఎస్ఎల్బీసీ సమావేశాన్ని ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాలి. – ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షులు, ఎఫ్‌ఎస్‌ఎంఈ. -
ఎంఎస్ఎంఈ రుణాలపై ఆర్థిక మంత్రి సమీక్ష
న్యూఢిల్లీ: అత్యవసర రుణ వితరణ హామీ పథకం కింద (ఈసీఎల్జీఎస్) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రూ.3 లక్షల కోట్ల మేర రుణాల మంజూరును వేగవంతం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో ఆమె మంగళవారం ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా లాక్డౌన్ వల్ల ఎంఎస్ఎంఈ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితులను చవిచూస్తుండడంతో.. కేంద్ర ప్రభుత్వం వాటిని ఆదుకునేందుకు రూ.3లక్షల కోట్ల మేర హామీ లేని రుణాలను మంజూరు చేసేందుకు ఈసీఎల్జీఎస్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘‘ఈసీఎల్జీఎస్ కింద రూ.20,000 కోట్ల రుణాలను మంజూరు చేసిన ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్థిక మంత్రి సీతారామన్ అభినందించారు. బ్యాంకు శాఖల స్థాయిలో రుణ వితరణను పెంచడంతోపాటు ఇందుకు సంబంధించిన ప్రక్రియలు సులభంగా ఉండేలా చూడాలని సూచించారు’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఆర్థిక మంత్రి జూన్ 8 నాటికి ప్రభుత్వరంగ బ్యాం కుల రుణ వితరణ గణాంకాలను పరిశీలించారు. -
పరిశ్రమలకు ‘నవోదయం’
సాక్షి, అమరావతి: అవి పేరుకు మాత్రం చిన్న కంపెనీలైనా.. ఉపాధి కల్పించడంలో మాత్రం ముందుంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ఆదుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూతపడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు ఆర్థిక చేయూత ఇవ్వడమే కాకుండా.. వాటి ఉత్పత్తులు అమ్ముడయ్యేలా భరోసా కల్పించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ విభాగం ఏటా చేసే 360 వస్తువుల్లో 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్ఎఈల నుంచి కొనుగోలు చేయాలంటూ రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఉత్తర్వులు జారీ చేశారు. నవోదయం నుంచి.. రీస్టార్ట్ ప్యాకేజీ వరకు.. ► గత ప్రభుత్వ హయాంలో 81 వేల ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో అవన్నీ ఎన్పీఏలుగా మారిపోయాయి. ► వాటిని ఆదుకునే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ నవోదయం పథకం ప్రారంభించి రూ.2,300 కోట్లతో రుణ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ► దీంతో ఎంఎస్ఎంఈలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం కలిగింది. ► తాజాగా కోవిడ్–19 నేపథ్యంలో రీస్టార్ట్ ప్యాకేజీ కింద సుమారు రూ.1,200 కోట్ల ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ► ఈ ప్యాకేజీలో రూ.905 కోట్లు పారిశ్రామిక బకాయిలు కాగా.. మిగిలినవి విద్యుత్ ఫిక్స్డ్ చార్జీల రద్దు, కొత్త రుణాల మంజూరుకు సంబంధించినవి ఉన్నాయి. ► రెండు విడతలుగా ప్రభుత్వం విడుదల చేస్తున్న పారిశ్రామిక బకాయిల వల్ల మొత్తం 11,238 యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి. ► మొదటి విడత కింద విడుదల చేసిన రూ.450.26 కోట్లతో 5,251 యూనిట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ► ఈ నెల 29న మిగిలిన మొత్తం విడుదల కానుండటం, కొత్త టర్మ్ రుణాలకు ప్రభుత్వం హామీగా ఉండటంతో.. బ్యాంకులు కూడా వాటికి రుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయి. ► 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలకు ఈ స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రూ.25 వేల కోట్ల కొనుగోళ్లు ఎంఎస్ఎంఈల నుంచే.. ► ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 98 వేల ఎంఎస్ఎంఈలలో పనిచేస్తున్న 10 లక్షల మంది ఉపాధికి హామీ లభించింది. ► రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలన్నీ కలిపి ఏటా రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులు చేస్తుంటాయని అంచనా. ► ఇందులో 25 శాతం అంటే సుమారు రూ.25 వేల కోట్ల విలువైన ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి హామీ లభించిందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. సాయంతో పాటు చేయూత కష్టాల్లో ఉన్న చిన్న పరిశ్రమలకు నవోదయం, రీస్టార్ట్ ప్యాకేజీల కింద ఆర్థిక సాయం అందించడంతో పాటు వాటి ఉత్పత్తుల్లో 25 శాతం ప్రభుత్వ శాఖలే కొనుగోలు చేసేలా హామీ ఇవ్వడం ద్వారా ఎంఎస్ఎంఈలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవం పోస్తున్నారు. దీనివల్ల పరిశ్రమలను తిరిగి ప్రారంభించి ఉత్పత్తి మొదలు పెట్టడానికి ధైర్యం కలిగింది. – వాసిరెడ్డి మురళీకృష్ణ, అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్ కొత్త వారికి భరోసా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాల వల్ల పాత యూనిట్లకు భద్రత లభిస్తోంది. కొత్తగా యూనిట్లు పెట్టే వారికి భరోసా కలుగుతోంది. యువ పారిశ్రామికవేత్తలకు ఇది శుభపరిణామం. ఆర్థిక సాయం ప్రకటించి పాత యూనిట్లకు భద్రత కల్పిస్తే.. 25 శాతం కొనుగోళ్ల నిబంధన ద్వారా కొత్తగా యూనిట్లు పెట్టాలనుకునే వారికి ఒక నమ్మకాన్ని కల్పించారు. – ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షుడు, ఎఫ్‌ఎస్‌ఎంఈ -
ఆరు నెలల్లో పూర్వ వైభవం..
అసలే లాక్డౌన్.. ఆపై ఉత్పత్తులు నిలిచిపోవడం.. దానికి తోడు ఐదేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు విడుదల కాకపోవడంతో చిన్న పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. లాక్డౌన్లో సడలింపు ఇచ్చినా కోలుకోలేనంతగా కష్టాల్లో కూరుకుపోయిన ఎంఎస్ఎంఈలకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. తాళాలు వేసే స్థితికి చేరుకున్న పరిశ్రమలను రీస్టార్ట్ చేయించింది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) 13,548 ఉండగా.. ఇందులో నగర పరిధిలో 6,331 ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో 2 లక్షల మందికి పైగా నిర్వాహకులు, ఉద్యోగులు, కార్మికులున్నారు. అప్పోసప్పో చేసి పరిశ్రమను లాగిస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. 2014 నుంచి 2019 వరకూ రావల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలేవీ విడుదల చేయకపోవడంతో జిల్లాలో 40 శాతం వరకూ పరిశ్రమలు అంపశయ్యపైకి చేరుకున్నాయి. నష్టాలతో నడుస్తున్న ఈ పరిశ్రమలకు లాక్డౌన్ శరాఘాతంలా మారిపోయింది. వీటిని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ జీవం పోసింది. జిల్లాలో గాజువాక, ఆటోనగర్, అగనంపూడి, స్టీల్‌ప్లాంట్, పరవాడ, పెదగంట్యాడ, పెందుర్తి ప్రాంతాల్లో పలు ఎంఎస్ఎంఈలు నడుస్తున్నాయి. ఇంజినీరింగ్ లేత్ వర్క్, ఫ్యాబ్రికేషన్, కాస్టింగ్, మెషినింగ్, కాయిర్ ప్రాసెసింగ్ పరిశ్రమలున్నాయి. అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, ఆటోనగర్, పెదగంట్యాడ, కంచరపాలెం, గంభీరం, గుర్రంపాలెం (పెందుర్తి), రాచపల్లి పారిశ్రామిక వాడల్లోనూ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఎస్ఎంఎంఈలకు ప్రభుత్వం ప్రకటించిన రీస్టాట్ ప్యాకేజీతో జిల్లాలోని పలు పరిశ్రమలకు కొత్త ఊపిరి వచ్చింది. 779 అకౌంట్లు.. రూ.53.35 కోట్లు గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీలు తదితర పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎంఎస్ఎంఈలకు విడుదల చేయకుండా విస్మరించింది. కాని కష్ట కాలంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సబ్సిడీ నిధుల బకాయిలను విడుదల చేసింది. దీంతో.. జిల్లాలోని 276 అకౌంట్లకు రూ.28 కోట్ల వరకూ ఈ నెల 22న అందాయి. జూన్ 29న 503 అకౌంట్లకు రూ.25.35 కోట్లు అందనున్నాయి. లాక్డౌన్ కాలంలో మూడు నెలల విద్యుత్ బిల్లులపై స్థిర విద్యుత్తు చార్జీలు మాఫీ చేయడంతో జిల్లాలో పదివేలకు పైగా ఎంఎస్ఎంఈలకు మేలు జరిగింది. మూడు నెలల పాటు ఈ చార్జీలను వాయిదా వేయడం వల్ల 140 భారీ పరిశ్రమలకు కూడా లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలోనే పలు పరిశ్రమలు సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి. షిఫ్టుల వారీగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆరు నెలల్లో అధిగమించేలా... లాక్డౌన్లో నిబంధనలు సడలించినప్పటికీ.. పరిశ్రమలకు కారి్మకుల కొరత వేధిస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన కారి్మకుల్లో 80 శాతం వరకూ తమ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో కారి్మకులు దొరకడంలేదు. సాధారణంగా మార్చి నెల తర్వాత ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. కాని లాక్‌డౌన్‌తో పూర్తిగా వర్క్ ఆర్డర్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నా.. ఒక్కో పరిశ్రమలో 60 శాతం వరకు కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ తాత్కాలికమేనని.. ప్రభుత్వం అందించిన చేయూతతో కేవలం ఆరు నెలల్లో సమస్యలన్నింటినీ అధిగమించి.. ఎంఎస్ఎంఈలకు పూర్వ వైభవం వస్తుందని పారిశ్రామిక వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల సమస్య తాత్కాలికమే లాక్డౌన్లో కార్మికుల్లో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో కార్మికుల సమస్య వేధిస్తున్నప్పటికీ ఇది తాత్కాలికమే. ఉదాహరణకు రాష్ట్రం నుంచి 2.80 లక్షల మంది కారి్మకులు వెళ్లిపోతే.. 1.80 లక్షల మంది వచ్చారు. ఈ లెక్కన చూస్తే.. కార్మికుల కొరత కొంత మాత్రమే ఉంది. సీఎం జగన్ వల్ల ఆర్థిక సమస్య నుంచి ఎంఎస్ఎంఈలు గట్టెక్కడం సరికొత్త విప్లవమనే చెప్పాలి. – ములగాడ సుధీర్, ఏపీసీసీఐఎఫ్ చైర్మన్ పరిశ్రమలను బతికించారు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని బతికించారు. లాక్డౌన్ కాలంలో మూడు నెలల విద్యుత్తు బిల్లులపై స్థిర విద్యుత్తు చార్జీలు మాఫీ చేయడంతో జిల్లాలో పదివేలకు పైగా ఎంఎస్ఎంఈలకు మేలు జరిగింది. మూడు నెలల పాటు ఈ చార్జీలను వాయిదా వేయడం వల్ల 140 భారీ పరిశ్రమలకు కూడా దీనివల్ల లబ్ధి జరగనుంది. ముఖ్యమంత్రికి పరిశ్రమలన్నింటి తరఫునా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – ఏకే బాలాజీ, ఏపీ ఛాంబర్స్ డైరెక్టర్ సాహసోపేత నిర్ణయం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ఏ సీఎం తీసుకోని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణ మూలధన రుణాల (వర్కింగ్ క్యాపిటల్ లోన్స్)కు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతో 6 నుంచి 8 శాతం వరకూ వడ్డీతో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం కలి్పంచింది. వెబ్సైట్లో సాంకేతిక లోపాలు రెండు రోజుల్లో క్లియర్ అవుతాయి. ఆ తర్వాత నుంచి రీస్టాట్ ప్రయోజనాల కోసం ఆన్‌లైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. – జి. సాంబశివరావు, ఏపీ చాంబర్స్ మాజీ అధ్యక్షుడు కొనుగోళ్లనూ ప్రోత్సహించడం చరిత్రాత్మకం ప్రభుత్వ విభాగాల అవసరాలకు ఉద్దేశించిన వస్తువుల్లో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పరిశ్రమలకు లాభం చేకూరుతుంది. త్వరితగతిన కోలుకునేందుకు అవకాశం లభిస్తుంది. 4 శాతం ఎస్సీ ఎస్టీ పరిశ్రమల నుంచి, 3 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు చెందిన పరిశ్రమల నుంచి 18 శాతం ఓపెన్ కేటగిరీకి చెందిన వారి పరిశ్రమల నుంచి కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడం నిజంగా గ్రేట్. – పైడా కృష్ణప్రసాద్, ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ వెన్నెముక దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ సెక్టార్ వెన్నెముక వంటిది. అందుకే దాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రోత్సాహకాలు ఎంతో బూస్టప్ ఇస్తాయి. బకాయిలు అందడం వల్ల ముడి సరకు కొనుగోళ్లకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఉపయుక్తమవుతున్నాయి. అర్హులైనవారికి రుణాలందించాలని ఆదేశించడం సీఎం ఉదారతకు ఓ ఉదాహరణ. – డా.కె కుమార్‌రాజా, ఏపీ చాంబర్స్ వైస్ ప్రెసిడెంట్ -
సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు భరోసా
-
జగనన్న భరోసా
-
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత
-
ఎంఎస్ఎంఈలకు సీఎం జగన్ భారీ సాయం
సాక్షి, తాడేపల్లి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ల బలోపేతం కోసం ‘రీస్టార్ట్’ పేరిట ఓ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయాన్ని ప్రకటించి ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రభుత్వం నుంచి చేయూతను అందించనున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో చిన్న,మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని సుక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ పూర్తి భరోసా ఇచ్చారు. పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వహయాంలోని బకాయిలను కూడా చెల్లిస్తున్నామని, లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు మూతపడి నష్టాల్లో ఉండటంతో విద్యుత్ ఛార్జీలు మూడు నెలల పాటు మాఫీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోనే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం గల కార్మికులు అవసరమో గుర్తించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.827 కోట్లతో పాటు మొత్తం రూ.905 కోట్ల ప్రోత్సాహకం అందించనుంది. అంతేకాకుండా రూ.187 కోట్ల స్థిర విద్యుత్ చార్జీల మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్వహణ మూల ధనం రుణాలకు రూ.200 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం ఎమ్ఎస్ఎమ్ఈల నుంచే చేయాలని నిర్ణయించారు. అలా చేసిన కొనుగోళ్లకు 45 రోజుల్లో చెల్లింపులు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలకి విద్యుత్ డిమాండ్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక బకాయిలను విడుదల చేయడంపై ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధి డివి రాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రోత్సాహక బకాయిలు విడుదల చేయడంతో పాటు విద్యుత్ డిమాండ్ ఛార్జీలు రద్దు చేయడంపై సీఎం వైఎస్ జగన్‌కు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణబాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
చిన్న పరిశ్రమలకు పెద్ద మేలు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో తీవ్రంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన పారిశ్రామిక బకాయిలు రూ.904.89 కోట్లు విడుదల చేయడంతో పాటు, చిన్న పరిశ్రమలకు విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలు రద్దు చేసింది. పెద్ద పరిశ్రమలకు పెనాల్టీలు లేకుండా మూడు నెలలు వాయిదా వేసింది. చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించనుంది. ఈ మేరకు సీఎం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాల వల్ల 97,428 చిన్న తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరడంతో పాటు వీటిల్లో పనిచేస్తున్న 9,68,269 మంది ఉపాధికి భద్రత కల్పించినట్లయ్యిందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. రూ.188 కోట్ల ఫిక్స్డ్ చార్జీలు రద్దు ► ఎంఎస్ఎంఈలకు ఏప్రిల్, మే, జూన్ నెలల కాలానికి సంబంధించి మినిమం కరెంటు డిమాండ్ చార్జీలు రూ. 188 కోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన పరిశ్రమలకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్ )కరెంటు మినిమం డిమాండ్ చార్జీల చెల్లింపులో వాయిదాలకు అనుమతించారు. ఎటువంటి పెనాల్టీలు, వడ్డీలు చెల్లించనవసరం లేకుండా మూడు నెలల పాటు వాయిదా వేసింది. ► ఈ రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకు, 24,252 చిన్న తరహా పరిశ్రమలకు, 645 మధ్య తరహా పరిశ్రమలకు మొత్తంగా 97,428 ఎంఎస్ఎంఈలకు మేలు జరుగుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేసింది. 25% ఎంఎస్ఎంఈల నుంచే కొనాలి ► రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు జరిపే కొనుగోళ్లలో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచే చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఎస్పీవీలు, సొసైటీలు, ట్రస్టులు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తాయి. ► ఈ 25 శాతంలో 4 శాతం ఎస్సీ,ఎస్టీలు, 3 శాతం మహిళలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. తక్కువ వడ్డీకే రుణాలు ► ప్రస్తుతం ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీ ఇస్తూ సబ్సిడీతో వర్కింగ్ కేపిటల్ అందించనుంది. ► కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీతో రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను అందించనున్నారు. ఈ రుణాలను 6 నెలల మారిటోరియం పీరియడ్‌తో కలిపి మూడేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ► అతి తక్కువ వడ్డీతో ఇచ్చే ఈ వర్కింగ్ కేపిటల్ రుణాల కోసం సిడ్బీ, ఐడీబీఐలతో కలిపి రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతంగా నిర్ణయించారు. ఈ రుణాల మంజూరుకు ఏపీఎస్ఎఫ్సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఆదాయం బాగున్నా ఐదేళ్లలో చెల్లించింది సున్నా ► ఒకపక్క లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిన తరుణంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఆరేళ్ల బకాయిలు తీర్చాలని ఆదేశాలు జారీ చేయడంపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ► రాష్ట్ర ఆదాయం బాగున్న తరుణంలోనూ గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ► పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటితో ఎంఎస్ఎంఈ రంగం ఆర్థికంగా చితికిపోయిందని, ఆదుకోమని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. రెండు విడతలుగా చెల్లింపులు లాక్ డౌన్‌తో నష్టపోయిన సంస్థలు తిరిగి కార్యకలాపాలను కొనసాగించేందుకు ఊతమిచ్చేలా ఆరేళ్ల రాయితీ బకాయిలు రూ.904.89 కోట్లు రెండు విడతలుగా మే, జూన్ నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2014 నుంచి చెల్లించాల్సిన రూ.827.52 కోట్లతో పాటు 2019–20కి సంబంధించిన రూ.77.37 కోట్లు చెల్లించనున్నారు. దీంతో 11,238 ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో ఎస్సీలకు చెందిన 3,876 యూనిట్లకు రూ.238.9 కోట్లు, ఎస్టీలకు చెందిన 839 యూనిట్లకు రూ.46.16 కోట్లు చెల్లించనున్నారు. ఇందులో భాగంగా మే 22న సుమారు రూ.450 కోట్లు విడుదల చేస్తామని పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పిన సంగతి విదితమే. కోలుకోవడానికి ఊతం క్లిష్ట సమయంలో రాయితీ బకాయిలు చెల్లించి లిక్విడిటీ కల్పించడం ద్వారా ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకోవడానికి ఊతమిచ్చినట్లయ్యింది – సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ డి.రామకృష్ణ కొత్త రుణాలతో ఊపిరి ఖజానాకు రూపాయి రాని తరుణంలోనూ వందల కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నారు. కొత్త రుణాలు ఇచ్చి ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని సీఎం జగన్ దేశంలోనే ప్రథమంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది పారిశ్రామిక రంగంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. – ఏపీకే రెడ్డి, ఎఫ్‌ఎస్‌ఎంఈ జాతీయాధ్యక్షుడు. -
‘ఆ దిశగా ఆలోచిస్తే బాగుండేది’
సాక్షి, అమరావతి: లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కేంద్రం ప్యాకేజీ ప్రకటిందని.. అయితే ఆంధ్రప్రదేశ్‌కు జరిగే ప్రయోజనంపై స్పష్టత రావాల్సి ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్యాకేజీకి సంబంధించిన మార్గదర్శకాలు రావాలన్నారు. కేంద్రం రాష్ట్రాల వారీగా ఆ ప్యాకేజీని అమలు చేస్తుందా లేదా అన్నది చూడాలన్నారు. 3 లక్షల కోట్ల ప్యాకేజీపై వీలైనంత వేగంగా మార్గదర్శకాలు రావాలని ఆయన కోరారు. రుణాలపై మారిటోరియం, టాక్స్ హాలిడే ప్రకటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తేనే పారిశ్రామిక రంగాన్ని ఆదుకోగలుగుతామని చెప్పారు. (‘టీడీపీ జూమ్ పార్టీలా మారింది’) 97 వేల ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ప్యాకేజీ అమలుకు చర్యలు చేపట్టామని.. దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్‌కు కొరియన్ బృందం వచ్చిందని.. 14 రోజులు అక్కడే ఉండి అధ్యయనం చేస్తారని చెప్పారు. హై పవర్ కమిటీ కూడా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తోందని, అనంతరం నివేదికల ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. (విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి) -
‘22వ తేదీ నుంచి ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు’
సాక్షి, విజయవాడ: దేశంలో అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కోరిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారని తెలిపారు. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో అవే అంశాలను ప్రధాని మోదీ చెప్పారని మంత్రి అన్నారు. ఈ నెల 22 నుంచి ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు చేస్తామని తెలిపారు. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ వివరించారని ఆయన చెప్పారు. పరిశ్రామిక ప్యాకేజీ కావాలని ప్రధానికి లేఖ కూడా రాశారని ఆయన గుర్తుచేశారు. రెవెన్యూ లోటుని కూడా భర్తీ చేయాలని గతంలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. (ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు) ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాలకు కేంద్రం సాయం చేస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం జగన్ ఎంత వాస్తవికంగా ఆలోచిస్తారో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. దానివల్ల కార్మికులు, ప్రజల్లో నమ్మకం కలిగిందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ప్రారంభమవుతున్నాయని మంత్రి చెప్పారు. క్రమంగా ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టామని గౌతమ్‌రెడ్డి చెప్పారు. -
సంక్షోభం నుంచే కొత్త అవకాశాలు
‘లాక్డౌన్ ప్రారంభానికి ముందే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ), కరోనాతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉండగా, రాష్ట్ర జీడీపీలో 35 శాతం, ఎగుమతుల్లో 40 శాతం మేర వాటా కలిగి ఉంది. వ్యవసాయ రంగం తర్వాత ఎంఎస్ఎంఈ రంగం రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో, ఈ రంగం పూర్తిగా చతికిల పడింది. అందువల్ల సూక్ష్మ, చిన్న పరిశ్రమలపై కేంద్రం దృష్టి పెట్టాలి’ అని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తుపై సుధీర్‌రెడ్డి ‘సాక్షి’తో ఏమన్నారంటే.. ► సుమారు 50 రోజుల పాటు లాక్డౌన్ మూ లంగా పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అయినా వేతనాలు, విద్యుత్ బిల్లులు, పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ చెల్లింపుతో పాటు బ్యాంకు రుణాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. మామూలు పరిస్థితుల్లోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలకు ఇప్పుడు మరింత భారం మోపుతోంది. ► లాక్డౌన్ నిబంధనలను సడలించి పరిశ్రమలకు అనుమతి ఇచ్చినా 30 నుంచి 40 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల మార్కెట్ ఇంకా తెరుచుకోలేదు. కొనుగోళ్లు పెరిగితేనే ఎంఎస్ఎంఈ రంగం పుంజుకుంటుంది. కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకున్నా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాల్సి ఉంది. పూర్తిస్థాయిలో పరిశ్రమల కార్యకలాపాలకు మరో 4 నెలలు పట్టే అవకాశం ఉంది. ► పారిశ్రామికరంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల్లో సుమారు 30, 40 శాతం మంది తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ముడిసరుకు లేకపోవడం కూడా పూర్తి స్థాయి లో పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆటంకం కలిగిస్తున్నాయి. ► పరిశ్రమలు తిరిగి గాడిన పడేందుకు వర్కింగ్ క్యాపిటల్ కోసం 20 నుంచి 30 శాతం రుణాలు తక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాలని కోరినా, బ్యాంకింగ్ రంగం కూడా సంక్షోభంలో ఉండటంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇలాంటి రుణాలకు కేంద్రం క్రెడిట్ గ్యారంటీ ఇస్తే తప్ప ఎంఎస్ఎంఈ పరిశ్రమలు గట్టెక్కే పరిస్థితి లేదు. ► పరిశ్రమలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోతే నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలోకి వెళ్తాయి. దీంతో పరిశ్రమల సిబిల్ రేటు తగ్గి రుణ పరిమితి పెంచడం, కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తాయి. రూ.5 కోట్ల రుణ పరిమితి లోపల ఉన్న అన్ని రకాల ఎంఎస్ఎంఈలను ఎన్పీఏ జాబితాలో చేర్చడానికి ఉన్న గడువును ఏడాది పాటు వాయిదా వేయాలి. ► సాధారణ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురయ్యే కార్మికులకు ఈఎస్ఐ కార్పొరేషన్ 70 శాతం వేతనం చెల్లిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు అంతకంటే ఏమీ భిన్నంగా లేవు కాబట్టి ఎంఎస్ఎంఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మూడు, నాలుగు నెలల పాటు ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి చెల్లించాలని ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించాం. కొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఈఎస్ఐ పరిధిలో లేవు. ఆంక్షలు తొలగించినా వీటిలో సుమారు 30 శాతం పరిశ్రమలు తిరిగి తెరుచుకోవడం కష్టమే. ఇలాంటి పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రమే 6 నెలల పాటు నేరుగా వేతనాలు చెల్లించాలి. ► జీఎస్టీ చెల్లింపుపై ప్రభుత్వం 3 నెలల పాటు డిఫర్మెంట్ ఇచ్చినా 9 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. డబ్బులే లేనప్పుడు వడ్డీ చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది. వడ్డీ లేకుండా జీఎస్టీ చెల్లింపు గడువును కనీసం 6 నెలల పాటు పొడిగించాలి. ► పరిశ్రమలు పనిచేయని కాలానికి సంబంధించి ఏపీ తరహాలో ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.2,700 కోట్ల సబ్సిడీలు రావాల్సి ఉంది. ఇందులో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు సంబంధించి రూ.600 కోట్ల వరకు ఉండొచ్చు. చిన్న పరిశ్రమలకు గుర్తించి రాయితీలు విడుదల చేస్తే సుమారు ఐదారు వేల పరిశ్రమలకు ఊరట లభిస్తుంది. ► ఎంఎస్ఎంఈ రంగం స్థితిగతులపై ఇటీవల సిడ్బీ, క్రిసిల్ సంస్థలు అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. ఈ నివేదిక ప్రకారం రూ.కోటి కంటే తక్కువ రుణాలు తీసుకున్న చిన్న పరిశ్రమల ఆస్తుల విలువ సుమారు రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్లే గతంలో జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దు వంటి సందర్భాల్లోనూ సవాళ్లను ఈ రంగం అధిగమించగలిగింది. రుణాలు తిరిగి చెల్లించడంలోనూ చిన్న పరిశ్రమలు మెరుగ్గా ఉన్నట్లు సిడ్బీ, క్రిసిల్ నివేదిక వెల్లడించింది. పెద్ద పరిశ్రమల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 19.1 శాతం కాగా, ఎంఎస్ఎంఈలు 11.3 శాతం మాత్రమే ఎన్పీఏ జాబితాలో ఉన్నాయి. కాబట్టి ఎంఎస్ఎంఈ రంగానికి అదనపు రుణాలు ఇచ్చినా బ్యాంకులు నష్టపోయే అవకాశం ఉండదు. ► ఫార్మా, వైద్య ఉపకరణాలు, ఆరోగ్య రంగం లో మౌలిక వసతుల రంగాల్లో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటేనే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మనుగడ సాగించగలుగుతాయి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తే చైనా నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునే శక్తి వస్తుంది. ► కరోనా సంక్షోభంలోనూ ఎంఎస్ఎంఈ పరిశ్రమల రంగం కొత్త పుంతలు తొక్కేందుకు అనువైన మార్గాలు ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రంలో ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. నైపుణ్య శిక్షణ, సరళీకృత విధానాలతో తెలంగాణ రాబోయే రోజుల్లో పారిశ్రామిక రంగంలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. -
ఎంఎస్ఎంఈలకు అండగా బీఓబీ
విజయవాడ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు అండగా నిలవడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కోవిడ్–19 వైరస్ విపత్తు కారణంగా ఈ రంగం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, పరిష్కారాలకు తగిన సూచినలను అందించడంలో భాగంగా జాతీయస్థాయి వెబినార్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ కిచి మాట్లాడుతూ.. ‘దేశంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఎంఎస్ఎంఈకి బీఓబీ అండగా ఉంటుంది. ఈ రంగానికి ఆర్బీఐ అందిస్తున్న పలు ప్రోత్సాహాల గురించి సమావేశం ద్వారా తెలియజేశాం’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 33వేలకు పైగా ప్రతినిధులు ఆన్లైన్లో పాల్గొన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. -
రాష్ట్రంలో ఎనిమిదిచోట్ల మేజర్ ఫిషింగ్ హార్బర్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ జోడించడమే లక్ష్యంగా భారీ ఎత్తున మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులెవరూ ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకూడదన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్రంలో ఎనిమిదిచోట్ల ఈ మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఒకచోట ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఇందుకు సుమారు రూ.3 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ విషయమై సీఎం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, సం బంధిత అధికారులతో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో నిర్ణయాలు ఇలా.. ►వీటి నిర్మాణాన్ని రెండున్నర నుంచి మూడేళ్లలో పూర్తిచేయాలి. ఈ ఎనిమిది చోట్లా చేపల వేటకు చక్కటి మౌలిక సదుపాయాలు కలి్పంచాలి. ►శ్రీకాకుళం జిల్లాలో రెండుచోట్ల, విశాఖపట్టణం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటుచేయాలి. ►శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెంలో మేజర్ ఫిషింగ్ హార్బర్, ఇదే జిల్లా మంచినీళ్లపేటలో ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాన్ని, అలాగే.. విశాఖ జిల్లా పూడిమడక, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, పశి్చమ గోదావరి జిల్లా ►నర్సాపురం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కూడా మేజర్ ఫిషింగ్ హార్బర్లను నిర్వహించాలి. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహక బకాయిల చెల్లింపు 4 2014–15 నుంచి పెండింగులో ఉన్న ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకాల బకాయిలు రూ.905 కోట్లు పూర్తిగా చెల్లిస్తారు. ఈ బకాయిలను మే నెలలో సగం, జూన్ నెలలో మిగతా సగం చెల్లిస్తారు. 4 2014–15 నుంచి 2018–19 వరకు గత ప్రభుత్వ హయాంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లతో (2014–15లో రూ.43 కోట్లు, 2015–16లో రూ.70 కోట్లు, 2016–17లో రూ.195 కోట్లు, 2017–18లో రూ.207 కోట్లు, 2018–19లో రూ.313 కోట్లు) పాటు 2019–20లో (అప్లోడ్ చేసిన వివరాల ప్రకారం) రూ.77 కోట్లు.. మొత్తం రూ.905 కోట్లు చెల్లించాలని నిర్ణయం. తక్కువ వడ్డీతో వర్కింగ్ కేపిటల్ ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు. ఇందులో భాగంగా ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తూ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. రూ.200 కోట్లు సమకూర్చుకుని, ఆ మొత్తాన్ని వర్కింగ్ కేపిటల్‌గా ఎంఎస్ఎంఈలకు అందించాలి. తక్కువ వడ్డీతో ఈ వర్కింగ్ కేపిటల్ సమకూర్చాలి. టీడీపీ హయాంలో మొక్కుబడిగా.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం మూడు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారని.. పైగా, వీటికి కేవలం రూ.40కోట్లు మాత్రమే ఖర్చుచేశారని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సమావేశానంతరం మీడియాకు తెలిపారు. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని సర్కారు మాత్రం మత్స్యకారులకు పెద్దపీట వేసి 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో మత్స్యకారుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని.. భవిష్యత్తులో వలసలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. తద్వారా రాష్ట్రంలో చేపల వేట పెరగడమే కాకుండా మత్స్యకారులకు ఆదాయం పెరిగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. కాగా, మే 6న చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని 1,15,000 కుటుంబాలకు ఇస్తున్నామన్నారు. -
ఐటీలోని చిన్న కంపెనీలను ఆదుకోండి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, కరోనా ప్రభావం వీరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడిందన్నారు. ఐటీ, అనుబంధ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో ఇటీవల రవిశంకర్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణను భాగస్వామి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు అంశాలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. మినహాయింపులివ్వాలి.. ప్రస్తుత కరోనా సంక్షోభ ప్రభావం చిన్న తరహా ఐటీ కంపెనీలపై ఎక్కువగా పడే అవకాశమున్నందున పలు మినహాయింపులివ్వాలని కేటీఆర్ కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన ఐటీ, జీఎస్టీ పన్ను రిఫండ్‌ను పరిష్కరించడం, రూ.25 లక్షల కంటే తక్కువున్న ఆదాయ పన్ను బకాయిల్లో కనీసం 50 శాతం విడుదల చేయడం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. జీఎస్టీ చెల్లింపు విషయంలో కంపెనీలకు సహకరించచేందుకు ఐటీ విభాగంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి వివిధ శాఖలతో సమన్వయం చేయాలని కోరారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కనీసం 50 శాతం మేర వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం ద్వారా మూడు నాలుగు నెలల పాటు ఆయా సంస్థల ఉద్యోగులకు వేతనాలు చెల్లించే అవకాశం కలుగుతుందన్నారు. రుణాల చెల్లింపునకు కనీసం ఏడాది పాటు గడువు ఇవ్వాలని లేఖలో సూచించారు. ఆ గడువు ఏడాది పాటు పెంచాలి.. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) ప్రత్యక్ష ప్రయోజనాలు పొందేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు విధించిన గడువును ఏడాది పాటు పొడిగించాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే కార్యాలయ విస్తీర్ణం తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ఒక్కో ఉద్యోగికి వంద నుంచి 125 చదరపు అడుగులు లెక్కన కార్యాలయాలు ఉండేలా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. ఐటీ పార్కులు, సెజ్‌లలో స్టాండర్డ్ హెల్త్ కోడ్‌ను తప్పనిసరి చేయాలని తన లేఖలో కేటీఆర్ సూచించారు. -
ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష కోట్ల నిధి
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు నిధుల ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల పథకాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, భారీ పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా ఈ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం కేబినెట్ పరిశీలనకు ఉంచుతామని చెప్పారు. -
చిన్న వ్యాపారాల నుంచి రూ. 2.32 లక్షల కోట్ల డిఫాల్ట్‌ల ముప్పు: సిబిల్
ముంబై: కోవిడ్–19 ప్రభావంతో చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాల్లో దాదాపు రూ.2.32 లక్షల కోట్లు డిఫాల్ట్ అయ్యే తీవ్ర పరిస్థితి నెలకొందని సిబిల్ పేర్కొంది. ప్రత్యేకించి రూ.10 లక్షలలోపు రుణం ఉన్న లఘు పరిశ్రమలు తీవ్రంగా కరోనా ప్రభావానికి గురవుతాయని బుధవారంనాడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ పేర్కొంది. రూ.10 లక్షల లోపు రుణం ఉన్న చిన్న సంస్థల మొత్తం రుణ పరిమాణం దాదాపు రూ.93,000 కోట్లయితే, ఇందులో రూ.13,600 కోట్లు మొండిబకాయిల ఖాతాలోకి వెళ్లొచ్చని అంచనావేసింది. చిన్న పరిశ్రమలను ఆదుకోవాలి.. ఐబీఏ: కాగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలని కేంద్రం, ఆర్బీఐలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ రంగానికి సంబంధించి రుణ బకాయిల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, వన్‌టైమ్ లోన్ రిస్ట్రక్చరింగ్ వంటి కొన్ని కీలక సిఫారసులు ఐబీఏ జాబితాలో ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలుసహా పలు పారిశ్రామిక విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఐబీఏ కీలక సిఫారసులు చేసింది. -
ఎంఎస్ఎంఈలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ఎంఎస్ఎంఈలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎంఎస్ఎంఈల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, కరోనా వైరస్ వల్ల వాటిపై ఏ మేరకు ప్రభావం పడిందన్న దానిపై సమీక్షించారు. ఎంఎస్ఎంఈల కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. వాటి పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం గ్రీన్ క్లస్టర్లో ఉన్న పరిశ్రమలు కోవిడ్ –19 నివారణ చర్యలు తీసుకుంటూనే తమ కార్యకలాపాలను ముందుకు కొనసాగించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు రాష్ట్రంలో తయారైన ఇన్ ఫ్రా రెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ ధర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్‌లను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఇతర అధికారులు పాల్గొన్నారు.