హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ కినారా క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు (ఎంఎస్‌ఎంఈ) రూ.800 కోట్ల రుణాలను అందించాలని నిర్ణయించింది. తనఖా లేకుండా ఈ వ్యాపార రుణాలను సమకూరుస్తామని కంపెనీ సీవోవో తిరునవుక్కరసు ఆర్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు.
‘తెలుగు రాష్ట్రాల్లో 2016 నుంచి ఇప్పటి వరకు 20,000 పైచిలుకు కంపెనీలకు మొత్తం రూ.1,200 కోట్ల లోన్లు ఇచ్చాం. ఈ కంపెనీల ద్వారా 16,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కినారా వృద్ధిలో 20 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎంఎస్‌ఎంఈల నుండి సమకూరుతుందని ఆశిస్తున్నాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment