Loans
-
నాబార్డ్ పంట రుణాలు తగ్గాయ్!
సాక్షి, హైదరాబాద్: రైతుకు రుణాల జారీలో రాష్ట్రస్థాయి బ్యాంకులే కాక... జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) కూడా చిన్నచూపే చూస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతుండగా, రైతుకు ఇచ్చే రుణాల విషయంలో మాత్రం బ్యాంకులు లక్ష్యాలకు దూరంగానే ఉంటున్నాయి. 2025–26 సంవత్సరానికి నాబార్డు విడుదల చేసిన ఫోకస్ పేపర్ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. 2025–26 సంవత్సరానికి తెలంగాణలో రుణాల లక్ష్యం రూ.3.86 లక్షల కోట్లుగా పేర్కొన్నప్పటికీ... ఇందులో కేవలం పంటలకు సంబంధించి పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం కేటాయించిన నిధులు రూ. 87,149 కోట్లు మాత్రమే. ఈ మొత్తం 2024–25లో పెట్టుకున్న రూ.90,794 కోట్ల లక్ష్యం కంటే రూ.3,645 కోట్లు తక్కువ కావడం గమనార్హం. ఐదేళ్లుగా లక్ష్యానికి దూరంగా రుణాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024–25 లక్ష్యానికన్నా రూ.3,645 కోట్లు తక్కువగా రుణ అంచనాను ప్రకటించిన నాబార్డ్ అంతకుముందు మూడేళ్లు కూడా పంటలకు ఇచ్చే రుణాల విషయంలో లక్ష్యాలను చేరుకోలేదు. 2021–22లో పంట రుణాల కింద రూ. 59,440 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకొని కేవలం రూ. 42,854 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. 2022–23లో రూ.67,764 కోట్ల లక్ష్యాలకు గాను రూ. 59,060 కోట్ల వరకే ఇచ్చిoది. 2023–24లో అత్యధికంగా రూ.10వేల కోట్ల లోటు కనిపించింది. ఆ ఏడాది రూ. 73,437 కోట్ల లక్ష్యానికి గాను రూ. 64,940 కోట్లు మాత్రమే పంట రుణాలుగా ఇవ్వగలిగారు. రుణాలు, పెట్టుబడి 1.39 లక్షల కోట్లు పంటకు సంబంధించి రుణాలు 87,149 కోట్లు కా గా నీటి వనరులు, యాంత్రీకరణ, ప్లాంటేషన్, హార్టికల్చర్, అటవీ, బీడు భూముల వినియోగంతో పాటు పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖలకు సంబంధించి టర్మ్లోన్లు, పెట్టుబడి కలిపి 2025–26 సంవత్సరానికి నాబార్డ్ రూ.1.39 లక్షల కోట్ల రుణ అంచనా వేసింది. ఇందులో యాంత్రీకరణకు రూ. 5,608 కోట్లు, నీటి వనరులకు రూ.2,613 కోట్లు, అటవీ, బీడు భూముల సాగుకు రూ. 793 కోట్లు కేటాయించింది. పశుసంవర్థక శాఖలో డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకానికి రూ.16వేల కోట్ల వరకు కేటాయించారు. 53 శాతం నిధులు ఎంఎస్ఎంఈలకే.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు నాబార్డు అత్యధికంగా రూ. 2.03 లక్షల కోట్లు కేటాయించింది. ఇది రాష్ట్రానికి కేటాయించిన మొత్తం బడ్జెట్లో 53 శాతం. వ్యవసాయ టర్మ్ లోన్లు 12 శాతం కాగా, వ్యవసాయ మౌలిక వసతులకు కేవలం 2 శాతం కేటాయించారు. -
కార్పొరేట్లకు.. రూపాయి టెన్షన్
రూపాయి పతనంతో ధరలు పెరిగిపోయి సామాన్యులు పడే కష్టాలు అటుంచితే కార్పొరేట్లకు కూడా టెన్షన్ తప్పట్లేదు. ముఖ్యంగా విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకున్న కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. గత రుణాలను తీర్చేందుకు మరింత ఎక్కువగా చెల్లించాల్సి రానుండటమే ఇందుకు కారణం. సాధారణంగా కార్పొరేట్లు తమ వ్యాపార అవసరాల కోసం, దేశీయంగా వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంటే విదేశీ మార్కెట్ల నుంచి తక్కువ వడ్డీ రేటుపై రుణాలు తీసుకుంటూ ఉంటాయి. చౌకగా వచ్చిన నిధులను వ్యాపార విస్తరణకు లేదా అధిక వడ్డీ రేటు మీద తీసుకున్న రుణాలను తీర్చేసేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాయి. గత రెండేళ్లుగా మిగతా కరెన్సీలు ఒడిదుడుకులకు లోనవుతున్నా రూపాయి మాత్రం దాదాపు స్థిర స్థాయిలోనే కొనసాగింది. దీంతో కార్పొరేట్లు గణనీయంగా విదేశీ రుణాలు సమీకరించాయి. ఈ మధ్య సంగతే చూస్తే గతేడాది ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో నికరంగా 13.5 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు వచ్చినట్లు ఆర్బీఐ డేటా చెబుతోంది. గతేడాది నవంబర్‌లో దాదాపు 2.83 బిలియన్ డాలర్ల ఈసీబీలను సమీకరించే ప్రతిపాదనలను కంపెనీలు సమరి్పంచాయి. రూపాయి విలువ పడిపోకుండా, స్థిరంగా ఉన్నన్నాళ్లూ విదేశీ రుణాల వ్యవహారం బాగానే ఉంటోంది. కానీ ఎక్కడా ఆగకుండా పడిపోతుంటేనే సమస్యాత్మకంగా మారుతోంది. ‘‘ఆర్బీఐ లెక్కలను బట్టి చూస్తే రూపాయి వేల్యుయేషన్ ఇప్పటికే అధిక స్థాయిలో ఉంది. దాని విలువ ఇంకా తగ్గాల్సి ఉంది. అమెరికా టారిఫ్‌లు విధిస్తే మరింతగా పడే అవకాశం ఉంది’’ అంటూ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కార్పొరేట్లకు రూపాయి బాధ ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభాలపైనా.. సాధారణంగా విమానయాన సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్‌ల లీజింగ్‌లు, ఇంధన కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులను డాలర్ల మారకంలో నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రూపాయి పతనంతో ఎయిర్‌లైన్స్ ఖర్చులూ పెరిగిపోయి లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు ఇండిగోను తీసుకుంటే ఇటీవలి మూడో త్రైమాసికంలో లాభం ఏకంగా 18 శాతం పడిపోయింది. రూపాయి క్షీణతతో విదేశీ టూర్లు మరింత భారంగా మారే అవకాశం ఉండటంతో ప్రయాణాలను వాయిదా లేదా రద్దు చేసుకునే అవకాశాలు ఉండటంతో టూరిజం, హాస్పిటాలిటీ లాంటి రంగాల మీద కూడా పడొచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అలాగే దిగుమతులపైన ఆధారపడిన లేక గణనీయంగా విదేశీ కరెన్సీలో రుణభారం ఉన్న రంగాల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారం ఇలా.. 2020లో భారత్, అమెరికాలో వడ్డీ రేట్ల మధ్య దాదాపు అయిదు శాతం వ్యత్యాసం ఉన్న తరుణంలో రూపాయి మారకంలో కన్నా విదేశీ మారకంలో రుణాలు తీసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అవే రుణాలు ఇప్పుడు గుదిబండలుగా మారుతున్నాయి. అప్పట్లో గానీ రూ. 2,000 కోట్లు విదేశీ రుణం తీసుకుని ఉంటే పెరిగిన వడ్డీ భారంతో పాటు రూపాయి కూడా క్షీణించడం వల్ల 22 శాతం అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు డాలరు విలువ రూ. 75గా ఉన్నప్పుడు 500 మిలియన్ డాలర్లు రుణం తీసుకుని ఉంటే, దేశీ కరెన్సీ విలువ 5 శాతం క్షీణించిన పక్షంలో అదనంగా రూ. 2,500 కోట్ల భారం పడుతుందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పాబ్రి తెలిపారు. ఇలా ఒకవైపు అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో పాటు, రూపాయి బలహీనపడిపోవడం వల్ల విదేశీ రుణాలను తీర్చడం భారంగా మారుతోంది.హెడ్జింగ్ అంతంతే..విదేశీ రుణాలు తీసుకున్నప్పుడు రూపాయి పడిపోతే నష్టపోకుండా ఉండేందుకు, తిరిగి చెల్లించేటప్పుడు ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు కంపెనీలు హెడ్జింగ్ వ్యూహాన్ని పాటిస్తుంటాయి. సుమారు గత మూడేళ్లుగా భారీగా విదేశీ నిధులు సమీకరించినవి, సమీకరించడంపై కసరత్తు చేస్తున్న వాటిలో ఆర్ఈసీ (500 మిలియన్ డాలర్లు), టాటా మోటార్స్ ఫైనాన్స్ (200 మిలియన్ డాలర్లు), ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (125 మిలియన్ డాలర్లు), టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు (100 మిలియన్ డాలర్లు) బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొదలైనవి ఉన్నాయి. అయితే, దేశీ కంపెనీలు తీసుకున్న ఈసీబీల్లో దాదాపు మూడో వంతు రుణాలకు హెడ్జింగ్ రక్షణ లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2023–24లో దాదాపు 38.4 బిలియన్ డాలర్ల రుణాలు రాగా ఇందులో సుమారు 11.52 బిలియన్ డాలర్ల మొత్తానికి హెడ్జింగ్ రక్షణ లేదు. ఇలా హెడ్జింగ్ చేసుకోని కంపెనీలన్నింటికీ ప్రస్తుత రూపాయి పతనం సమస్యగా మారినట్లు పేర్కొన్నాయి. ఇటీవలి ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో సమీకరించిన మొత్తం ఈసీబీల్లో 40 శాతాన్నే పెట్టుబడి వ్యయాల కోసం కంపెనీలు ఉపయోగించుకున్నాయి. అంటే మిగతా 60 శాతాన్ని ఖరీదైన ఇతరత్రా రుణాలను తీర్చేందుకు ఉపయోగించుకుని ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
లోన్ ఈఎంఐలు తగ్గనున్నాయా?.. శుభవార్త సిద్ధం!
రుణగ్రహీతలకు శుభవార్త సిద్ధంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వడ్డీ రేట్లను కదిలించకుండా స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్న ఆర్బీఐ ఈసారి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.గృహ రుణాలు, వ్యక్తిగత, కారు లోన్లు వంటి వాటికి ఈఎంఐలు (EMI) కడుతున్నవారు ఈసారి తమకు కాస్త ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కొత్తగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మొదటి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు చర్చించిన తర్వాత వడ్డీ రేటు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించనున్నారు.మార్కెట్ లిక్విడిటీని మెరుగుపరచడంతో పాటు, వినియోగం ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ కూడా రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే అంటే ఆర్బీఐ కంఫర్ట్ జోన్ 6 శాతంలోపే ఉంది. దీనివల్ల ధరల గురించి ఆందోళన చెందకుండా ఆర్బీఐ నిర్ణయం తీసుకునే వీలు ఏర్పడింది.ఆర్బీఐ రెపో రేటు (స్వల్పకాలిక రుణ రేటు)ను ఎటువంటి మార్పు లేకుండా 2023 ఫిబ్రవరి నుండి 6.5 శాతంగా కొనసాగిస్తోంది. కోవిడ్ కాలంలో (2020 మే) ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును తగ్గించింది. ఆ తర్వాత దానిని క్రమంగా 6.5 శాతానికి పెంచింది. ఇప్పుడు వినియోగం ఇంకా మందగించడంతో రుణాలు చౌకగా చేయడం ద్వారా వృద్ధిని పెంచాలని ఆర్బీఐ చూస్తోంది. తద్వారా రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం తగ్గుతుంది. -
ఆశల పల్లకీలో ఎంఎస్ఎంఈలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ 2025–26 బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (ఎంఎస్ఎంఈ) ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల పరిధిని కొత్తగా నిర్వచించడంతోపాటు రుణ పరిమితిని రెట్టింపు చేశారు. దీంతో వచ్చే ఐదేళ్లలో ఎంఎస్ఎంఈలకు దేశవ్యాప్తంగా రూ.లక్షన్నర కోట్లు అదనంగా రుణాలు లభించే అవకాశం ఏర్పడింది. తెలంగాణలోనూ రుణ లభ్యత పెరగడంతోపాటు కొత్తగా అనేక సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రంలో 2015 నాటికి 26.05లక్షల ఎంఎస్ఎంఈలు ఉండగా, టీజీ ఐపాస్ పోర్టల్‌లో నమోదవుతున్న వివరాల ప్రకారం వీటి వృద్ది రేటు 11 నుంచి 15 శాతం వరకు ఉంటోంది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే 40శాతం మేర ఉన్నాయి.ఎంఎస్ఎంఈలతో సుమారు 33లక్షల మంది ఉపాధి పొందుతుండగా, సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజాధారిత పరిశ్రమల్లోనే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు భూమి, నిధులు, ముడి సరుకులు, కార్మికులు, సాంకేతికత, సరైన మార్కెటింగ్ వసతులు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిధుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లే ఎంఎస్ఎంఈలు కొల్లేటరల్ సెక్యూరిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎంఎస్ఎంఈ రుణాల కోసం డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. నిర్వహణ వ్యయం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నా సరైన సమాచారం లేకపోవడం, ఇతర నిబంధనలతో సకాలంలో ఎంఎస్ఎంఈలకు నిధులు అందుబాటులోకి రావడం లేదు. కొల్లేటర్ సెక్యూరిటీ లేకుండా రుణపరిమితిని రెట్టింపు చేసి రూ.10 కోట్లకు పెంచారు.ప్రగతిశీల, పురోగామి బడ్జెట్ ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక అనుకూల ప్రగతిశీల, పురోగామి బడ్జెట్ ఇది. టారిఫ్ రేట్ల విధానంలో మార్పులతో దేశీయంగా తయారీ రంగానికి ఊతం లభిస్తుంది. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్’ద్వారా లిథియం, కోబాల్ట్ వంటి అనేక ఖనిజాలు దేశ ఆర్థిక పురోగతిలో కీలకంగా మారడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. తద్వారా లిథియం, ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని ప్రోత్సహిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరం. నైపుణ్య శిక్షణ రంగానికి కూడా బడ్టెట్‌లో పెద్ద పీట వేశారు. –సురేశ్ కుమార్ సింఘాల్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు నిధుల లభ్యత పెరుగుతుంది ఎంఎస్ఎంఈల్లో సులభతర విధానాలకు బాటలు వేసేలా బడ్జెట్ ఉంది. రుణ లభ్యత పెరగడంతో రూ.5 లక్షల విలువ చేసే క్రెడిట్ కార్డులను 10 లక్షల మందికి జారీ చేయాలనే నిర్ణయాన్ని ఆహా్వనిస్తున్నాం. ఇది ఎంఎస్ఈలకు నిర్దేశిత వడ్డీపై ఎప్పుడైనా రుణ మొత్తాన్ని ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకుల దిగుమతి సులభతరమవుతుంది. స్టార్టప్‌ల రుణ పరిమితి కూడా రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచడాన్ని ఆహా్వనిస్తున్నాం. – కొండవీటి సుదీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు -
ఎస్ఎంఈ రుణాలపై మరింత ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ (సీఎస్బీ) తెలుగు రాష్ట్రాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) రుణాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగం కోసం రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆరు శాఖలను నిర్వహిస్తున్నట్లు ఎస్ఎంఈ, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ శ్యామ్ మణి తెలి పారు. ఎస్ఎంఈలకు రుణాల అవకాశాలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పా ల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. టర్బో, శుభమంగళ్ వంటి ఉత్పత్తులతో చిన్న సంస్థలకు సత్వరం రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి బ్యాంకు మొత్తం రుణాల్లో ఎస్ఎంఈ పోర్ట్‌ఫోలియో సుమారు 13%గా, దాదాపు రూ. 3,400 కోట్ల స్థాయిలో ఉందని శ్యామ్ తెలిపారు. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 12 శాతమని, ఇది సుమారు 28% వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎంఈ రుణాల విషయంలో హైదరాబాద్‌లో ఫార్మా బల్క్ డ్రగ్స్ విభాగంపై, ఆంధ్రప్రదేశ్‌లో తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలపైనా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లు శ్యామ్ చెప్పారు. దేశీ ఫార్మా మార్కెట్ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లు కాగా.. హైదరాబాద్ వాటా సుమారు రూ. 44,000 కోట్లుగా ఉందని చెప్పారు. ఇందులో ఎస్ఎంఈల వాటా దాదాపు రూ.15,000 కోట్లుగా అంచనా వేశారు. -
లోన్ల మంజూరులో జాగ్రత్త.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
చట్టపరమైన వివాదాలను నివారించడంలో, ఆస్తి లావాదేవీలు సజావుగా జరిగేలా చూడడంలో అసలైన యజమానులు ఎవరో తెలిపే సమగ్ర టైటిట్ సెర్చ్ రిపోర్ట్‌ల ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టులను సిద్ధం చేయడానికి ప్రామాణికమైన, ఆచరణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇతర వాటాదారులు అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. తప్పుడు టైటిల్ సెర్చ్ రిపోర్టు ఆధారంగా రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు అధికారిపై ఎలాంటి చర్యలు ఉండాలన్నది కూడా ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చాలని కోర్టు పేర్కొంది.బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలి"అస్పష్ట టైటిల్ క్లియరెన్స్ రిపోర్ట్‌ల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఇది ప్రజా ధన రక్షణకు, పెద్ద ప్రజా ప్రయోజనానికి సంబంధించినది. అందువల్ల, రుణాలను మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టును సిద్ధం చేయడానికి, ఆమోదించే అధికారి బాధ్యతను (క్రిమినల్ చర్యతో సహా) నిర్ణయించే ఉద్దేశంతో ఒక ప్రామాణిక, ఆచరణాత్మక విధానాన్ని అభివృద్ధి చేయడంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇతర వాటాదారులు సహకరించడం చాలా అవసరం. అంతే కాకుండా టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌లకు సంబంధించిన ఫీజులు, ఖర్చుల కోసం ప్రామాణిక మార్గదర్శకాలు ఉండాలి” అని కోర్టు పేర్కొంది.వివాదాస్పద తనఖా ఆస్తిపై ఆధారపడి బ్యాంకు మంజూరు చేసిన రుణం, టైటిల్ వివాదాలు ఉన్నట్లు గుర్తించిన సందర్భంలో, అటువంటి ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. యాజమాన్యాన్ని ధ్రువీకరించడం, ప్రతికూల క్లెయిమ్‌లు లేవని నిర్ధారించడం, ఆస్తికి సంబంధించిన స్పష్టమైన చట్టపరమైన స్థితిని నిర్ధారించడం ద్వారా బలమైన టైటిల్ సెర్చ్ మోసపూరిత లావాదేవీలను నిరోధించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌ను నియంత్రించే స్టాండర్డ్ మెకానిజం అంటూ ఏదీ ఇప్పటి వరకు ఆర్బీఐ అభివృద్ధి చేయలేదు. ఎంప్యానెల్ చేసిన న్యాయవాదులు తయారుచేసిన టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌పై బ్యాంకులు ఆధారపడుతున్నాయి. టైటిల్ సెర్చ్ రిపోర్ట్ తయారీకి ఎటువంటి ప్రామాణీకరణ లేదు. -
ఎయిర్టెల్ యాప్‌లో బజాజ్ ఫైనాన్స్.. కొత్త క్రెడిట్ కార్డు
ఆర్థిక సేవల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ఎన్బీఎఫ్సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్, టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా బజాజ్ ఫైనాన్స్ రుణ సంబంధ ఉత్పత్తులను తొలుత ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో అందజేస్తారు. ఆ తరువాత ఎయిర్టెల్ స్టోర్ల ద్వారా ఈ సేవలను విస్తరిస్తారు.ఆర్థిక సేవలు దేశవ్యాప్తంగా విస్తృతం అయ్యేందుకు తమకున్న బలం దోహదం చేస్తుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ‘10 లక్షల మందికిపైగా వినియోగదార్లు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. కస్టమర్ల అన్ని ఆర్థిక అవసరాల కోసం ఎయిర్టెల్ ఫైనాన్స్‌ను వన్–స్టాప్ షాప్‌గా మార్చడమే లక్ష్యం’ అని భారతీ ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. డేటా ఆధారిత రుణ పూచీకత్తు, అందరికీ ఆర్థిక సేవలు చేరేందుకు భారత డిజిటల్ పర్యావరణ వ్యవస్థ గుండెకాయగా ఉందని బజాజ్ ఫైనాన్స్ ఎండీ రాజీవ్ జైన్ చెప్పారు.కంపెనీ ప్రకటన ప్రకారం.. ఎయిర్టెల్ కస్టమర్లు ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డును (Airtel-Bajaj Finserv EMI) ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ స్టోర్ల నెట్వర్క్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.“ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డు బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఆఫర్ల శ్రేణికి యాక్సెస్‌ను అందిస్తుంది. 4,000 కంటే ఎక్కువ నగరాల్లోని 1.5 లక్షల పార్టనర్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా సామాగ్రితో సహా వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి సౌకర్యవంతమైన ఈఎంఐ ఎంపికలు, చెల్లింపు ప్లాన్ల నుండి వినియోగదారులు ప్రయోజనం పొందుతారు. అదనంగా కో-బ్రాండెడ్ కార్డ్ బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ-కామర్స్ లావాదేవీలకు వర్తిస్తుంది" అని పేర్కొంది. -
కాళేశ్వరం రుణాల లెక్కలెందుకు దాచారు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం కురిపించింది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మంగళవారం కమిషన్ ఆయనను ప్రశ్నించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు రామకృష్ణారావు తడబడటంతో ‘మీ మీదేమీ వేసుకోవద్దు’అని అసహనం వ్యక్తంచేసింది. 2015లో జారీ చేసిన ఓ జీవో ప్రకారం కోర్ కమిటీ తరచుగా మీతో సమావేశమై ప్రాజెక్టు పురోగతిని వివరించిందా? అని కమిషన్ ఆయన్ను ప్రశ్నించగా, కమిటీలోని ఇంజనీర్లు తనను కలిసి ప్రాజెక్టు పురోగతిని వివరించి బిల్లులకు నిధులు కోరేవారని రామకృష్ణారావు బదులిచ్చారు. ఆ సమావేశాల మినిట్స్ ఏమయ్యాయి? అని కమిషన్ అడగటంతో సమాధానమివ్వలేక ఆయన తడబడ్డారు. దీంతో మీ మీదేమీ వేసుకోవద్దు అని కమిషన్ సూచించింది. బడ్జెట్లో కాళేశ్వరం రుణాలెందుకు చూపలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2021–22లో తీసుకున్న రూ.35,257 కోట్ల బడ్జెటేతర రుణాలను రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపగా, 2022–23లో రూ.9,596 కోట్లు, 2023–24లో రూ.2,545 కోట్ల బడ్జెటేతర రుణాలను ఎందుకు చూపలేదని కమిషన్ ప్రశ్నించింది. ఆ రుణాలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపితే రాష్ట్ర రుణపరిమితికి కేంద్రం కోతలు విధించే అవకాశం ఉండడంతో వాటిని బడ్జెట్లో చూపలేదని రామకృష్ణారావు వివరించారు. దీంతో ఇది తెలంగాణ ఫిస్కల్ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి విరుద్ధమని కమిషన్ మండిపడింది.ప్రభుత్వమే రుణాలు తిరిగి చెల్లిస్తుంది.. కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాల విషయంలో ఆర్థిక శాఖ బాధ్యత ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, వాటికి ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినందున ఆర్థిక శాఖ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుందని రామకృష్ణా రావు బదులిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.6,519 కోట్లు, అసలు రూ.7,382 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రుణాలను 9 నుంచి 10.5 శాతం వడ్డీలతో తీసుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణకే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీఎల్) ఏర్పాటైందని చెప్పారు. కేఐపీసీఎల్‌కు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అని ప్రశ్నించగా, పరిశ్రమలకు నీళ్లను విక్రయించడం ద్వారా రూ.7 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. రుణాల సమీకరణ బాధ్యత కేఐపీసీఎల్‌దేనని చెప్పారు. బరాజ్‌ల నిర్మాణంలో తీవ్ర ఉల్లంఘనలు బరాజ్‌లను టర్న్‌కీ పద్ధతిలో కట్టాలని జీవో 145 పేర్కొంటుండగా, ప్రభుత్వం తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కమిషన్ తప్పుబట్టింది. జీవోలో అలా ఉందని, ప్రాజెక్టును మాత్రం పీస్ రేటు విధానంలో నిర్మించారని రామకృష్ణారావు తెలిపారు. బరాజ్‌లకు అనుమతిచ్చే విషయంలో ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం తీసుకుంటారా? అని కమిషన్ ప్రశ్నించగా, అది తప్పనిసరి అని వివరించారు. బరాజ్‌ల పాలసీలను శాసనసభ ముందు ప్రభుత్వం ఉంచిందా? అని ప్రశ్నించగా, తనకు తెలియదని సమాధానమిచ్చారు. నేటి నుంచి వరుసగా...జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్‌ను ప్రశ్నించనుంది. గురు, శుక్ర, శనివారాల్లో వరుసగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల నిర్మాణ సంస్థలైన నవయుగ, అఫ్కాన్స్, ఎల్ అండ్ టీల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. -
ఈఎంఐ ఇక మారదు! ఆర్బీఐ కీలక ఆదేశాలు
నెలవారీ సమాన వాయిదాలపై (EMI) మంజూరు చేసే అన్ని వ్యక్తిగత రుణాల్లో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా స్థిర వడ్డీ రేటు ఉత్పత్తిని అందించాల్సిందేనని ఆర్బీఐ (RBI) ప్రకటించింది. వడ్డీ రేటు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ విధానంతో లేక ఇంటర్నల్ బెంచ్‌మార్క్ విధానంతో అనుసంధానమైనదా? అన్న దానితో సంబంధం లేకుండా అన్ని ఈఎంఐ ఆధారిత వ్యక్తిగత రుణాలకు ఇది అమలవుతుందని స్పష్టం చేసింది.రుణాన్ని మంజూరు చేసే సమయంలోనే వర్తించే వార్షిక వడ్డీ రేటు (ఏపీఆర్)ను కీలక సమాచార నివేదిక (కేఎఫ్ఎస్), రుణ ఒప్పంద పత్రాల్లో బ్యాంక్‌లు, ఇతర నియంత్రిత సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. రుణ కాల వ్యవధిలో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు కారణంగా ఈఎంఐ/లేదా కాల వ్యవధిని పెంచేట్టు అయితే ఆ విషయాన్ని తప్పకుండా రుణగ్రహీతకు తెలియజేయాలని తెలిపింది.ప్రతి త్రైమాసికానికి ఒకసారి లోన్ అకౌంట్ స్టేట్మెంట్ను జారీ చేయాలని, అందులో అప్పటి వరకు చెల్లించిన వడ్డీ, అసలు ఎంత?, ఇంకా ఎన్ని ఈఎంఐలు మిగిలి ఉన్నాయనే సమాచారం ఉండాలని పేర్కొంది. ఈఎంఐ ద్వారా రుణాన్ని చెల్లించే వారికి స్థిర వడ్డీ రేటును లేదా కాల వ్యవధిని పెంచుకునే అవకాశం కల్పించానలి 2023 ఆగస్ట్‌లోనే బ్యాంక్‌లను ఆర్బీఐ ఆదేశించడం గమనార్హం. దీనికి సంబంధించి సందేహాలపై తాజా స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరిలో ఆర్బీఐ ఎంపీసీ సమావేశంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 5-7 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..ఆర్బీఐ వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది. -
చిన్న సంస్థల రుణాల ట్రాకింగ్‌కు ప్రత్యేక సంస్థ ఉండాలి
చిన్న వ్యాపార సంస్థలు తీసుకునే రుణాలు లేదా ఈక్విటీ కింద సమీకరించే సద్వినియోగం అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిదేదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. ‘నిధులను దేని కోసం తీసుకుంటున్నారో కచి్చతంగా ఆ అవసరానికే వినియోగించేలా చూసేందుకు ఒక యంత్రాంగం అవసరం. రుణంగా లేదా ఈక్విటీ కింద తీసుకున్న నిధుల వినియోగాన్ని ట్రాక్ చేసే అధికారాలతో ప్రత్యేక మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిది ఉండాలి‘ అని ఎన్ఐఎస్ఎం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం వల్ల రుణదాతలు, ఇన్వెస్టర్లకు కొంత భరోసా లభించగలదని శెట్టి చెప్పారు. చిన్న వ్యాపార సంస్థలు సమీకరించిన నిధులను అంతిమంగా ఉపయోగించే తీరుతెన్నులపై ఆందోళన వ్యక్తమవుతుండటం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలంటూ బ్యాంకులపై ఆర్బీఐ కూడా ఒత్తిడి పెంచుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో శెట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలంటే దేశీయంగా పొదుపు రేటు మరింత పెరగాలని, ఇందులో క్యాపిటల్ మార్కెట్లు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని శెట్టి చెప్పారు. క్రెడిట్ రేటింగ్స్‌ను పొందాలంటే చిన్న, మధ్య తరహా సంస్థలకు సరైన ఆర్థిక వివరాల రికార్డులు గానీ ఆర్థిక వనరులు గానీ ఉండవని, అలాంటి సంస్థలకు రుణాలివ్వడంలో రిస్కులను మదింపు చేయడం బ్యాంకులకు కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
అపోహలు వీడితేనే మంచి స్కోరు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి స్కోరు(CIBIL score)ను సాధించాలంటే దీనిపై ఉన్న అపోహలు వీడాలని సూచిస్తున్నారు.ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు సాలరీ ఆధారంగా క్రెడిట్ కార్డు(Credit Card) ఆఫర్ ఉందని ఫోన్లు వస్తుంటాయి. దాంతో చాలామంది క్రెడిట్‌కార్డును తీసుకుంటున్నారు. తొలి కార్డును సంపాదించడమే కొంత కష్టం. ఆ తర్వాత కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోరును ఆధారంగా చేసుకుని తమ క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ ముందుకు వస్తాయి. అయితే క్రెడిట్ స్కోరును పెంచుకునే దశలో చాలామందికి కొన్ని సందేహాలున్నాయి. వాటిపై స్పష్టత ఉంటే స్కోరు దూసుకెళ్లేలా చేయవచ్చు.ఆదాయం అవసరమా..?క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలంటే రాబడి బావుండాలని అనుకుంటారు. కానీ, ఆదాయంతో సంబంధం ఉండదు. ఏటా రూ.6 లక్షలు ఆదాయం ఉన్నవారికి మంచి క్రెడిట్ స్కోరు ఉండొచ్చు. ఏటా రూ.20 లక్షల ఆదాయం(Income) ఉన్నవారి స్కోరు పేలవంగా ఉండొచ్చు. వారు గతంలో తీసుకున్న రుణాలు, వాటి చెల్లింపులు సరళి ఎలా ఉందనే దానిపై ఇది ఆధారపడుతుంది. ఆదాయంతో సంబంధం లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించడం, తక్కువ క్రెడిట్ వినియోగం వంటివి స్కోరు పెరిగేందుకు దోహదపడుతాయి.కార్డును పూర్తిగా వాడవచ్చా..?క్రెడిట్ కార్డు పరిమితి పూర్తిగా వాడలేదు కదా, స్కోరు పడిపోయిందనే సందేహం వ్యక్తం చేస్తారు. నిజానికి కార్డు మొత్తం పరిమితి మేరకు వినియోగిస్తే స్కోరుపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్(Card Limit) రూ.1 లక్ష అనుకుందాం. మీరు అందులో సుమారు 40 శాతం అంటే రూ.40,000 వినియోగిస్తే మేలు. లిమిట్ ఉందని రూ.90,000 వరకు లిమిట్ వినియోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఏకమొత్తంలో అధికంగా క్రెడిట్ కార్డు వాడితే స్కోరు తగ్గే ప్రమాదం ఉంది.పాత కార్డులను క్లోజ్ చేయాలా..?గతంలో వాడి, ప్రస్తుతం వాడకుండా ఉన్న కార్డులను క్లోజ్ చేస్తే స్కోరు పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇందులో నిజం లేదు. గతంలో మీరు వాడిన కార్డులపై క్రెడిట్ హిస్టరీ జనరేట్ అవుతుంది. మీరు కార్డు క్లోజ్ చేస్తే ఆ హిస్టరీ కూడా డెలిట్ అవుతుంది. సుధీర్ఘ క్రెడిట్ హిస్టరీ ఉంటే స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’స్కోరు పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్(Loans)ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30-40 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది. -
తగ్గనున్న ఈఎంఐ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్‌న్యూస్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7 నుండి అమలులోకి వచ్చిన సవరించిన రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి.ఎంసీఎల్ఆర్ తగ్గింపు ద్వారా రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) కూడా తగ్గుతాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ని 9.20 శాతం నుండి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.15 శాతానికి సవరించింది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 9.20 శాతం, 9.30 శాతంగా ఉన్నాయి.అదే విధంగా ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేట్లు ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గి 9.45 శాతంగా ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.45 శాతం వద్ద యథాతథంగా ఉంది.ఎంసీఎల్ఆర్ అంటే?"ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్తే తప్ప తప్ప ఇందులో మార్పు ఉండదు" అని ఎంసీఎల్ఆర్ భావనను వివరిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.పీఎల్ఆర్ ఇలా..ఎంసీఎల్ఆర్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (PLR) సంవత్సరానికి 17.95 శాతం ఉంది. ఇది 2024 సెప్టెంబర్ 9 నుండి అమలులోకి వచ్చింది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటును అదే తేదీ నాటికి 9.45 శాతంగా నిర్ణయించారు.ఈబీఎల్ఆర్ గృహ రుణాల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇక అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి.హోమ్ లోన్ రేట్లుఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు తీసుకునే ప్రత్యేక గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. రెపో రేటుతో పాటు 2.25 శాతం నుండి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఇక ఇదే కేటగిరీకి చెందిన రుణగ్రహీతలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40 శాతం నుండి 9.95 శాతం వరకు ఉంటాయి. వీటిలో రెపో రేటుతో పాటు 2.90 శాతం నుండి 3.45 శాతం మార్జిన్ కలిసి ఉంటాయి. -
అప్పుల లెక్క పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే ఈసారి బహిరంగ మార్కెట్ రుణాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొన్నదానికంటే 23శాతం అదనంగా అప్పులు తీసుకోనుంది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్వారా రుణ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్‌ను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.40,500 కోట్ల రుణాలను సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.ఇప్పుడు చివరి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు) నెలకు రూ.10వేల కోట్ల చొప్పున మరో రూ.30 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. అంటే బహిరంగ మార్కెట్ నుంచి తీసుకునే రుణం రూ.70,500 కోట్లకు చేరనుంది. రాష్ట్ర సర్కారు బడ్జెట్లో పేర్కొన్న రుణ సమీకరణ అంచనా రూ.57,112 కోట్లు మాత్రమే. కానీ రుణాలు అంతకన్నా రూ.13 వేల కోట్లు (23 శాతం) అదనంగా పెరగనున్నాయి. ప్రతి నెలా నాలుగు సార్లు..: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు (చివరి త్రైమాసికం) ప్రతి నెలా నాలుగు దఫాల్లో ఆర్బీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐకి ఇచ్చిన ఇండెంట్లో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలు కావడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులపై ఆధారపడకుండా బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు నెలల కాలంలో రైతు భరోసా, రేషన్ కింద సన్న బియ్యం సరఫరా, పింఛన్ల పెంపు వంటి పథకాలను అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో నిధుల అవసరం పెరగనుందని పేర్కొంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్ ప్రతిపాదనల కంటే ఎక్కువగా బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.40,615 కోట్లు రుణ సేకరణను ప్రతిపాదించగా.. సవరించిన అంచనాల్లో రూ.49,618 కోట్లు చూపారు. అంటే రూ.9వేల కోట్లకుపైనే అదనంగా తీసుకోవడం గమనార్హం. -
‘అమరావతి’కి ఇచ్చేది అప్పే!
సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన రూ.15 వేల కోట్లు రుణమని తేలిపోయింది. ఈ మొత్తం కేంద్రం నుంచి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు ఇప్పటికే శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు.. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సభలో ధన్యవాదాలు సైతం తెలిపారు. ఇక ప్రకటించిన మొత్తంలో రూ.13,500 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి కేంద్రం రుణం తీసుకుని ఏపీ రాజధాని నిర్మాణానికి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు కూటమి నేతలు ప్రచారం చేశారు. కానీ, ఇవన్నీ అబద్ధమని.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇచ్చేది పూర్తిగా షరతులతో కూడిన రుణమని తాజాగా బహిర్గతమైంది. ఈ మేరకు గురువారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సమావేశమైన ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు అధికారులు ‘అమరావతి ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’కి 788.8 మిలియన్ డాలర్ల రుణాన్ని (సుమారు రూ.6,694.36 కోట్లు) ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ రుణం మొత్తం థీ121.97 బిలియన్ల జపనీస్ యెన్‌లో అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తంతో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద వాటాదారులుగా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చుచేయాలని సూచించారు. ఈ మొత్తాన్ని ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్) సహకారంతో ప్రోగ్రామ్‌కు మద్దతు ఉంటుందని ఏడీబీ భారతదేశ కంట్రీ డైరెక్టర్ మియో ఓకా తెలిపారు. ఇక రుణంగా ఇచ్చే మొత్తానికి వడ్డీ ఉండదని, కానీ 20 ఏళ్ల తర్వాత వాయిదాలుగా ఆనాటికి ఉన్న డాలర్ల విలువకు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, అప్పటికి డాలర్ విలువ 20 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతికి వచ్చే రూ.15,000 కోట్లలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులు ఇచ్చే రూ.13,500 కోట్ల రుణం కాగా, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. -
పెళ్లి మీది.. ఫండ్ మాది
మన సంస్కృతిలో వివాహానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జీవితాన్ని మలుపు తిప్పే అతి ముఖ్యమైన పెళ్లి వేడుక చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహించుకోవలాన్న ఆకాంక్ష పెరుగుతోంది. కలిగిన కుటుంబాలు సహజంగానే పెళ్లిళ్లకు ఘనంగా ఖర్చు చేస్తుంటాయి. ఆ మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడి వివాహానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో గుర్తుండే ఉంటుంది. అంబానీ రేంజ్ కాకపోయినా.. తమ పరిధిలో భారీ బడ్జెట్‌తో వివాహం చేసుకునేందుకు ఎక్కువ మంది ముందుకొస్తున్న ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.మిలీనియల్స్ (1981–1996 మధ్య జన్మించిన వారు), జెనరేషన్ జెడ్ (1996–2009 మధ్య జన్మించిన వారు) యువతీయువకులు వివాహం విషయంలో కేవలం తల్లిదండ్రుల ఆర్థిక సామర్థ్యంపైనే ఆధారపడాలని అనుకోవడం లేదని ఇండియాలెండ్స్ సర్వేలో వెల్లడైంది. వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్) తీసుకుని, బాలీవుడ్ స్టైల్లో లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ (తమకు నచ్చిన వేరే ప్రాంతంలో)కు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 20 పట్టణాల పరిధిలో వివాహంపై 1,200 మంది మిలీనియల్స్ అభిప్రాయాలను ఇండియాలెండ్స్ సర్వే తెలుసుకుంది.42 శాతం మంది తమ వివాహానికి తామే సొంతంగా నిధులు సమకూర్చుకోవాలనే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. ఇందులోనూ 41 శాతం మంది తమ పొదుపు నిధులను వాడుకోవాలని అనుకుంటుంటే.. 26 శాతం మంది పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మరో 33 శాతం మంది పెళ్లి ఖర్చు విషయంలో ఇంకా ఎలాంటి ప్రణాళికతో లేనట్టు వెల్లడైంది. ఇప్పటికీ 82 శాతం పెళ్లిళ్లు వ్యక్తిగత పొదుపు సొమ్ములతోనే పూర్తవుతుండగా.. ఆస్తులు విక్రయించి 6 శాతం మేర, మరో 12 శాతం పెళ్లి వేడుకలు అప్పులతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్ల సర్వే వివరాలతో ‘వెడ్డింగ్ స్పెండ్స్ రిపోర్ట్ 2.0’ను ఇండియాలెండ్స్ విడుదల చేసింది.ముందుకొస్తున్న సంస్థలు..వివాహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించడం, ఖర్చుకు వెనుకాడని ధోరణి ఈ మార్కెట్లో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలకు భారీ అవకాశాలు కలి్పస్తున్నాయి. పెళ్లి సంబంధాలకు వేదిక అయిన మ్యాట్రిమోనీ డాట్ కామ్ దీన్ని ముందే గుర్తించి.. వెడ్డింగ్లోన్ డాట్ కామ్ పేరుతో ఇటీవలే ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది. వివాహం కోసం వధూవరులు లేదా తల్లిదండ్రులు ఈ ప్లాట్‌ఫామ్ సాయంతో రుణం తీసుకోవచ్చు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్, ఎల్అండ్టీ ఫైనాన్స్‌తో ఈ సంస్థ జట్టుకట్టింది.‘‘అన్సెక్యూర్డ్ పర్సనల్ రుణాల్లో 25–30 శాతం మేర వివాహాల కోసమే తీసుకుంటున్నట్టు మా అధ్యయనంలో తెలిసింది. గడిచిన రెండేళ్లలో ఈ డిమాండ్ 20 శాతం మేర పెరిగింది’’అని మ్యాట్రిమోనీ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ ఝా తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ అయితే తనఖా లేకుండానే వివాహ రుణాలు అందిస్తోంది. సులభతర చెల్లింపులతో ఆన్లైన్లో రుణాలను మంజూరు చేస్తున్నట్టు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ చౌదరి చెప్పారు. వెడ్డింగ్లోన్ డాట్ కామ్ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, పర్సనల్ లోన్స్, రివాల్వింగ్ క్రెడిట్ లైన్ పేరుతో 3 రకాల ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అన్నది రుణ గ్రహీత సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాతో అనుసంధానమై ఉంటుంది.పెరిగిపోయిన వ్యయాలు వివాహాలకు ఖర్చులు పెరిగిపోతుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. 68 శాతం మంది రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య రుణం తీసుకోవాలని అనుకుంటున్నారు. సగటు వివాహ వేడుక వ్యయం రూ.36.5 లక్షలకు పెరిగినట్టు ‘వెడ్‌మీగుడ్’ అనే వెడ్డింగ్ ప్లానర్ చెబుతోంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుక కోసం చేసే ఖర్చు రూ.51 లక్షలకు పెరిగినట్టు తెలిపింది. 2023తో పోలి్చతే ఈ వ్యయాలు 7 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా కల్యాణ మంటపం, క్యాటరింగ్ చార్జీలు 10 శాతం వరకు పెరిగాయి. పెళ్లి ఘనంగా చేసుకునేందుకు నిధుల లోటును అడ్డంకిగా మెజారిటీ యువతరం భావించడం లేదు. రుణాల లభ్యత పెరిగిపోవడమే ఇందుకు కారణం. మారిన ధోరణి.. గతంలో తెలిసిన వారి వద్ద, స్థానిక రుణదాతల నుంచి వివాహం కోసం అప్పు తీసుకునే వారు. ఇప్పుడు ఈ మార్కెట్ సంఘటితంగా మారి బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వైపు మళ్లుతోంది – ప్రవీణ్ ఖండేల్వాల్, సీఏఐటీ వ్యవస్థాపకులురూ.15,000 ఆదాయం ఉంటే చాలు.. నెలవారీ రూ.15,000 ఆదాయం ఉన్న వారు సైతం రూ.50,000 నుంచి రూ.40 లక్షల వరకు రుణాలు పొందొచ్చని యాక్సిస్‌బ్యాంక్ అధికారి తెలిపారు. వివాహ రుణాలపై వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమవుతోంది. -
రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 బిలియన్ డాలర్లు(రూ.24,900 కోట్లు) రుణాన్ని పొందేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది చెల్లించాల్సిన రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు దాదాపు ఆరు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.కంపెనీ గతంలో తీసుకున్న దాదాపు 2.9 బిలియన్ డాలర్ల రుణాల మెచ్యురిటీ 2025 మొదటి త్రైమాసికంలో ముగుస్తుంది. కాబట్టి కంపెనీ ఆయా రుణాలు చెల్లించి తిరిగి రిఫైనాన్స్కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్యాంకు ఇంతమొత్తంలో చెల్లించడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కాబట్టి, దాదాపు ఆరు బ్యాంకులతో సంస్థ అధికారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే 2023 నుంచి కొంత విరామం తర్వాత రిలయన్స్ ఆఫ్‌షోర్ రుణాల(ఇతర దేశాలు అందించే అప్పులు) మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినట్లుగా అవుతుంది. ఇదిలాఉండగా, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇటీవల రుణాల ద్వారా 8 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉండడంతో రుణాలు పొందేందుకు మార్గం సులువవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: గ్లోబల్ సౌత్ లీడర్‌గా భారత్మూడీస్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్‌ను Baa2 వద్ద స్థిరంగా ఉంచింది. ఇది ఇండియన్ సావరిన్ గ్రేడ్ కంటే మెరుగ్గా ఉండడం కూడా రిలయన్స్‌కు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. సంస్థ ఆర్థిక స్థితి, విభిన్న వ్యాపార నమూనా, వినియోగదారుల్లో విశ్వసనీయత..వంటి అంశాలు కూడా రుణదాతలకు భరోసా కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
వీధి వ్యాపారులకు రూ.5 లక్షల వరకు రుణం
ప్రైవేటు రుణ రంగంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సంచలనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా తమ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేసి వారికి లోన్ల ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో వీధి వ్యాపారులు సైతం ఇప్పుడు రూ.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చని పేర్కొంది.రోజువారీ వసూళ్ల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్‌లను ఉపయోగించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు రోజువారీ చెల్లింపు సౌకర్యంతో రుణాలను అందిస్తామని ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ వెల్లడించింది. ‘ఇది చిన్న వ్యాపారాల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న తన బడ్జెట్ ప్రెజెంటేషన్‌లో ప్రకటించిన న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్‌కు అనుగుణంగా ఉంది. ఈ మోడల్ కింద బ్యాంకులు చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా డిజిటల్ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేయాలి. బలమైన నగదు రాక ఉన్నప్పటికీ రుణం పొందడంలో వ్యాపారులు విఫలం చెందుతున్నారు. ఇటువంటి వారు క్యూఆర్ కోడ్ లావాదేవీల ఆధారంగా రుణం అందుకోవచ్చు’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పుఈ సందర్భంగా ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సీఈవో చందన్ ఖైతాన్ మాట్లాడుతూ.. భారత్‌లో దాదాపు 6 కోట్ల అనధికారిక సూక్ష వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఇవి దేశంలోని అతిపెద్ద ఉపాధి సృష్టికర్తలలో ఒకటని, దేశ జీడీపీకి ఇవి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. సంప్రదాయకంగా అధికారిక రుణాలను పొందడంలో అడ్డంకులను ఎదుర్కొనే అనధికారిక సూక్ష వ్యాపారాలకు క్రెడిట్‌ను అందుబాటులో ఉంచడం క్యూఆర్–కోడ్ ఆధారిత రుణ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తిని వారి రోజువారీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. ఇప్పటి వరకు 75,000 పైచిలుకు అనధికారిక సూక్ష వ్యాపారులకు రుణం సమకూర్చామని వివరించారు. -
అదానీ అప్పులపై బ్యాంకులు సమీక్ష
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల కేసు నమోదైనందున ఇకపై రుణదాతల ధోరని మారుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూప్‌నకు భారీగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది. అయితే ఎస్బీఐతోపాలు వివిధ బ్యాంకులు అదానీ గ్రూప్‌నకు గతంలో జారీ చేసిన రుణాలు, తాజాగా విడుదల చేసిన అప్పులకు సంబంధించి సమీక్ష ప్రారంభించించాయి. ఎస్బీఐ తర్వాత అదానీ గ్రూప్‌నకు అధిక మొత్తంలో లోన్లు ఇచ్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు అప్పుల వివరాలను సమీక్షిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.పాత అప్పులపై మార్పులు ఉండకపోవచ్చు..ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వివరాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదానీ గ్రూప్‌నకు సుమారు రూ.33,500 కోట్ల అప్పు ఇచ్చింది. ఈ అప్పుతో ప్రారంభించిన పలు ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ దశలో అప్పులపై రివ్యూ చేసి వాటిని నిలిపివేసే అవకాశాలు ఎస్బీఐకు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ తాజాగా బ్యాంకులు అందించిన అప్పులపై మాత్రం కొంత మార్పులు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.కేరళ-అదానీ పోర్ట్స్ ఒప్పందంఅదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలు చెలరేగుతున్న తరుణంలో కేరళ ప్రభుత్వం అదానీ పోర్స్ట్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలోని విజింజామ్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి కోసం అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 వరకు దీని పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!అదానీకి బాసటగా..మరోవైపు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు కొందరు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) 500 మిలియన్ డాలర్లు(రూ.4151 కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు(రూ.83,020 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. -
గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థతిబంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.ప్రతిపాదిత విధానంబంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!అంతరాలు గుర్తించిన ఆర్బీఐతనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లోన్ కావాలా? అయితే..
చెన్నై: వివాహ బంధాలకు వేదికగా ఉన్న మ్యాట్రిమోనీ డాట్ కామ్ మరో అడుగు ముందుకేసింది. పెళ్లి వేడుకకు రుణం సమకూర్చేందుకు వెడ్డింగ్‌లోన్స్ డాట్ కామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఐడీఎఫ్సీ, టాటా క్యాపిటల్, లార్సెన్ అండ్ టూబ్రో ఫైనాన్స్‌తో చేతులు కలిపింది.వివాహ ప్రణాళిక, బడ్జెట్, అమలు ప్రక్రియను సులభతరం చేయడానికి సేవలను విస్తరిస్తున్నట్టు మ్యాట్రిమోనీ డాట్ కామ్ సీఈవో మురుగవేల్ జానకిరామన్ తెలిపారు. ఈ సంస్థ పెళ్లిళ్ల కోసం రూ. 1 లక్ష నుండి రూ.1 కోటి వరకూ రుణాలను అందజేస్తుంది. నెలవారీ ఈఎంఐ కాలపరిమితి 30 సంవత్సరాల వరకు ఉంటుంది.2024లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన సమయంలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనాల ప్రకారం, నవంబర్ 12 నుండి డిసెంబర్ 16 మధ్య వివాహాలు జరిగే సీజన్లో దాదాపు 48 లక్షల జంటలు పెళ్లి చేసుకోనున్నాయి. -
హైడ్రాను చూసి బ్యాంకర్లు భయపడొద్దు
సాక్షి, హైదరాబాద్: హైడ్రాను చూసి భయపడొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు ధైర్యం నింపారు. హైడ్రా గురించి ఆందోళన అవసరం లేదని, హైడ్రా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు. బుధవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన బ్యాంకర్ల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం మహిళలు గౌరవ మర్యాదలతో జీవించేందుకు దోహదపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేబినెట్ నిర్ణయించిందని, వీలైతే అంతకుమించి వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు 9 నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని, బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు. మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలని ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే సూక్ష్మ, మధ్యతర పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మున్సిపల్ పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, పురపాలక సంచాలకులు, కమిషనర్ శ్రీదేవి పాల్గొన్నారు. ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణ: సామాన్య ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. బుధవారం ప్రజాభవన్‌లో ఆదాయ వనరుల సమీ కరణపై వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు రిజి్రస్టేషన్లు, మైనింగ్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారు లతో భట్టి భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా శాఖల వారీగా సాధించిన పురోగతి వివరాలు, ఆదాయ సమీకరణ కోసం రూపొందించిన ప్రణాళి కలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. భట్టి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే పన్ను ఎగవేతదారులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుకుమార్ సుల్తానియా, రెవెన్యూ, వాణిజ్య పనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, భూగర్భ గనుల శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ పాల్గొన్నారు. -
ముద్ర లోన్ లిమిట్ పెంపు: రూ.10 లక్షల నుంచి..
2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించినట్లుగా.. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఏవై) కింద ముద్ర లోన్ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.నిధులు లేని వారికి నిధులు సమకూర్చే ముద్రా పథకం.. వారి వృద్ధి, విస్తరణను మరింత సులభతరం చేయడానికి లోన్ పరిమితిని రెట్టింపు చేయడం జరిగింది. ఇది రాబోయే వ్యవస్థాపకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బలమైన వ్యవస్థాపక పర్యావరణాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.'తరుణ్ కేటగిరీ' కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్ర లోన్ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. అంటే వీరు ముద్ర లోన్ కింద రూ. 20 లక్షల లోన్ తీసుకోవచ్చు. అంతే కాకుండా రూ. 20 లక్షల వరకు ఉన్న పీఎంఏవై లోన్ హామీ కవరేజ్.. మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) కింద అందించనున్నారు.ప్రధాన్ మంత్రి ముద్ర యోజనప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY) అనేది కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. ఈ లోన్స్ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్లు అందిస్తారు. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా లోన్స్ మంజూరు చేస్తాయి.పీఎంఏవై కింద లోన్స్ అనేవి పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం మొదలైన వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు మాత్రమే కాకుండా తయారీ, వ్యాపారం వంటి వాటికి కూడా అందిస్తారు. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఈ లోన్స్ చాలా ఉపయోగపడతాయి.Union Budget 2024-25 provides special attention to #MSMEs and #manufacturing, particularly labour-intensive manufacturing.👉New mechanism announced for facilitating continuation of bank credit to #MSMEs during their stress period👉Limit of #Mudra loans increased from ₹10 lakh… pic.twitter.com/wPbMvnwBhz— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024 -
How India Borrows 2024: ఆన్లైన్ రుణం.. యస్ బాస్
హైదరాబాద్: తక్కువ, మధ్యాదాయ వర్గాల వారు సాధారణంగా తక్షణ జీవన అవసరాల కోసమే రుణం తీసుకుంటారని అనుకుంటాం. ఇది ఒకప్పుడు. కానీ, నేడు తమ ఆకాంక్షల కోసం, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు, దీర్ఘకాల పెట్టుబడుల కోసం రుణాలను వినియోగించుకే దిశగా వారిలో మార్పు కనిపిస్తోంది. వినియోగదారులు తమ జీవన నాణ్యతను పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. యాప్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రావడం, ఈఎంఐ తదితర రూపాల్లో డిజిటల్ రుణ లభ్యత మార్గాలు పెరగడం ఇందుకు మద్దతునిస్తోంది. హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన వార్షిక కన్జ్యూమర్ సర్వే ‘హౌ ఇండియా బారోస్’లో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ మేరకు ఒక నివేదికను హోమ్ క్రెడిట్ ఇండియా విడుదల చేసింది. వేటి కోసం రుణాలు.. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తుల కొనుగోలుకే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు, గృహ నవీకరణ కోసం తీసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాలకు తీసుకునే రుణాలు 2020లో ఒక శాతంగా ఉంటే, 2024కు వచ్చే సరికి 37 శాతానికి చేరాయి. స్టార్టప్‌లు, వ్యాపార విస్తరణ కోసం తీసుకుంటున్న రుణాలు 2020లో మొత్తం రుణాల్లో 5 శాతంగా ఉంటే, 2024 నాటికి 21 శాతానికి చేరాయి. వ్యాపారవేత్తలుగా అవతరించేందుకు, కొత్త ఆదాయ వనరులు, అవకాశాల కోసం యువత అన్వేíÙస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. కరోనా తర్వాత మారిన పరిస్థితులు, ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి మద్దతు సానుకూల అంశాలని తెలిపింది. గృహ నవీకరణ, నిర్మాణం కోసం తీసుకునే రుణాలు 2022లో 9%గా ఉంటే, 2024 నాటికి 15 శాతానికి పెరిగాయి. అంటే మెరుగైన నివాస వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, దీర్ఘకాల ఆస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యా రుణాల్లో పెద్దగా మార్పు లేదు. 2020లో మాదిరే 2024లోనూ 4%వద్దే ఉన్నాయి. వివాహాల కోసం రుణాలు తీసుకోవడం 2021లో ఉన్న 3% నుంచి 2024 నాటికి 4 శాతానికి పెరిగింది. ఇక వైద్య అత్యవసరాల కోసం తీసుకునే రుణాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. 2020 లో 7%గా ఉంటే, 2024లో 3 శాతానికి తగ్గింది. నాడు కరోనా విపత్తుతో వైద్యం కోసం భారీగా ఖ ర్చు చేయాల్సి రావడం తెలిసిందే. ఆ తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇది కూడా వ్యయాలను తగ్గించడంలో సాయపడింది. వాట్సాప్, చాట్‌బాట్ పాత్ర 27 శాతం మధ్య తరగతి రుణ గ్రహీతలకు చాట్‌బాట్ సేవలపై అవగాహన ఉంది. ఇది గతేడాది 4 శాతంగానే ఉంది. జెనరేషన్ జెడ్‌లో ఇది 30 శాతం ఉండడం గమనార్హం. కస్టమర్ సేవల కోసం చాట్బాట్లు సులభంగా ఉంటున్నాయని 38 శాతం రుణగ్రహీతలు భావిస్తున్నారు. ఇక వాట్సాప్ కీలక వారధిగా పనిచేస్తోంది. 59 శాతం రుణ గ్రహీతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లను అందుకుంటున్నారు. ఈఎంఐ కార్డుల వినియోగం సైతం పెరుగుతోంది. అలాగే ఎంబెడెడ్ ఫైనాన్స్ (డిజిటల్ రూపాల్లో రుణ సదుపాయాలు) పట్ల 50 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా వేగంగా రుణాలు పొందొచ్చని, ఈ కామర్స్ షాపింగ్ సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. 64 శాతం మంది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో తదితర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల సానుకూలంగా ఉంటే, 21 శాతం ట్రావెల్ బుకింగ్ యాప్‌లు మేక్మైట్రిప్, క్లియర్‌ట్రిప్, 23 శాతం ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ సేవలను వినియోగించుకుంటున్నారు.పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు.. వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సేవల వైపు మొగ్గు చూపిస్తుండడం కనిపిస్తోంది. 65 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్ సేవలకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్‌కు 44 శాతం మందే సానుకూలత చూపిస్తున్నారు. మిలీనియల్స్‌లో 69 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్‌కు మొగ్గు చూపిస్తుండగా, జెనరేషన్ జెడ్‌లో 65 శాతం మంది, జెన్ ఎక్స్‌లో 58 శాతం చొప్పున వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మెట్రోల్లో వీటిని వినియోగించుకునే వారు 71 శాతంగా ఉంటే, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 69 శాతంగా ఉన్నారు. ఆన్లైన్లో షాపింగ్ సాధారణ స్థాయికి చేరింది. కరోనా అనంతర లాక్డౌన్లతో 2021లో ఆన్లైన్ షాపింగ్ 69 శాతానికి పెరగ్గా, 2023లో 48 శాతానికి దిగొచి్చంది. 2024లో మరింత తగ్గి 53 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 64 శాతం మంది ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపిస్తున్నారు. కోల్‌కతాలో ఇది 71 శాతంగా ఉంది. -
ఇక లోన్లు ఇవ్వొద్దు.. 4 కంపెనీలపై ఆర్బీఐ బ్యాన్
నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. రుణాల మంజూరు, పంపిణీని నిలిపివేయాలని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, డీఎంఐ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవీ ఫిన్సర్వ్ లిమిటెడ్‌లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది . అక్టోబరు 21న వ్యాపార కార్యకలాపాలు ముగిసిన అనంతరం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది.ఈ కంపెనీల వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (WALR), వాటి నిధుల వ్యయంపై విధించే వడ్డీ స్ప్రెడ్ పరంగా ఈ కంపెనీల ప్రైసింగ్ పాలసీలో గమనించిన మెటీరియల్ సూపర్వైజరీ లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?అయితే ఆయా కంపెనీలు తమ కస్టమర్లకు ఇతర సేవలను, రుణాల వసూలు, రికవరీ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక రంగంలో స్థిరత్వం కోసం, సంస్థలన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఆర్బీఐ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై చర్యలు చేపడుతూ వస్తోంది. -
రుణ వాయిదాలకే నెలకు రూ. 2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి నిర్వహణ కష్టాలు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో రూ. 246 కోట్ల వ్యయంతో రావిర్యాలలో నిర్మించిన మెగా యూనిట్ ఈ కష్టాలకు కారణం కానుంది. త్వరలో మీద పడనున్న ఆర్థిక భారం డెయిరీకి పెద్ద తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది. ఈ మెగా యూనిట్ నిర్వహణను పకడ్బందీగా గాడిలోకి తెచి్చన తర్వాతే పూర్తిస్థాయిలో డెయిరీకి అప్పగించాల్సిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) కూడా తన బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా యూనిట్‌ను ఏం చేయాలి? ఎలా నడపాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. తరుముకొస్తున్న కష్టాలు..సరైన అంచనాలు, సౌకర్యాల కల్పన, ప్రణాళికలు లేకుండా రావిర్యాలలో నిర్మించిన విజయ డెయిరీ మెగా యూనిట్ చిక్కుల్లో పడింది. నీటి సౌకర్యం లేని ప్రాంతంలో ఈ డెయిరీని ఏర్పాటు చేయడంతో కేవలం ప్లాంటును నడిపించేందుకు నీటి కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చవుతోందని తెలుస్తోంది. ఇక, ఈ యూనిట్ కరెంటు బిల్లులు నెలకు రూ. కోటి దాటుతున్నాయి. వీటికి తోడు వచ్చే నెల నుంచి నెలకు రూ.2 కోట్ల వరకు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంది. ఇవేకాక, ప్లాంటు నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు అదనం కావడంతో ప్రారంభించిన తొమ్మిది నెలలకే మెగా యూనిట్ నిర్వహణ విషయంలో చేతులెత్తేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని డెయిరీ వర్గాలంటున్నాయి. వాస్తవానికి, లాలాపేటలోని యూనిట్ ద్వారా విజయ డెయిరీ రోజుకు 4.5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి పంపుతోంది. ఈ యూనిట్‌ను నడుపుతూనే రావిర్యాలలో రోజుకు 5–8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తులు చేసే అంచనాలతో, ఆ మేరకు అత్యాధునిక యంత్రాంగంతో మెగా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటివరకు కేవలం 3 లక్షల లీటర్ల ఉత్పత్తులను మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. ఈ మేరకు ఉత్పత్తి చేసేందుకు డెయిరీకి ఆర్థికంగా భారమవుతోంది. రోజుకు 3 లక్షల లీటర్ల ఉత్పత్తికి, 8 లక్షల వరకు లీటర్ల ఉత్పత్తికి అయ్యే నిర్వహణ ఖర్చులో పెద్దగా తేడా ఉండదని, ఈ నేపథ్యంలో 8 లక్షల లీటర్ల వరకు ఉత్పత్తి జరిగితేనే యూనిట్ మనుగడ సాధ్యమవుతుందని డెయిరీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కనీస సౌకర్యాలు, సిబ్బంది లేని పరిస్థితుల్లో మెగా యూనిట్ నిర్వహణ భారం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే ఆందోళనను వారు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
వినియోగదారుల రుణాలు రూ.90 లక్షల కోట్లు
కోల్‌కతా: వినియోగదారుల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15 శాతం వృద్ధి చెంది రూ.90 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో నమోదైన 17.4 శాతం వృద్ధితో పోలిస్తే కొంత క్షీణత కనిపించింది. వినియోగదారుల రుణాల్లో 40 శాతం వాటా కలిగిన గృహ రుణ విభాగంలో మందగమనం ఇందుకు కారణమని క్రిఫ్ హైమార్క్ నివేదిక వెల్లడించింది. 2023–24లో గృహ రుణాల విభాగంలో వృద్ధి 7.9 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే విభాగం 23 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం. రూ.35 లక్షలకు మించిన గృహ రుణాలకు డిమాండ్ పెరిగింది. సగటు రుణ సైజ్ 2019–20లో ఉన్న రూ.20లక్షల నుంచి 32 శాతం వృద్ధితో 2023–24లో రూ.26.5 లక్షలకు పెరిగింది. వ్యక్తిగత రుణాలకు డిమాండ్ ఇక వ్యక్తిగత రుణాల (పర్సనల్ లోన్)కు డిమాండ్ బలంగా కొనసాగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2023–24లో వ్యక్తిగత రుణాల విభాగంలో 26 శాతం వృద్ధి నమోదైంది. రూ.10లక్షలకు మించిన వ్యక్తిగత రుణాల వాటా పెరగ్గా.. అదే సమయంలో రూ.లక్షలోపు రుణాలు తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. బ్యాంకులు మంజూరు చేసిన రుణాల విలువ అధికంగా ఉండగా, ఎన్బీఎఫ్సీలు సంఖ్యా పరంగా ఎక్కువ రుణాలు జారీ చేశాయి. టూవీలర్ రుణాల జోరు ద్విచక్ర వాహన రుణ విభాగం సైతం బలమైన పనితీరు చూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2022–23లో 30 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆటోమొబైల్ రుణాల విభాగంలో 20 శాతం వృద్ధి నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 22 శాతంగా ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధిని చూపించాయి. రుణాల సగటు విలువ కూడా పెరిగింది. ఎంఎస్ఎంఈ విభాగంలో వ్యక్తిగత రుణాల కంటే సంస్థాగత రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. వ్యక్తిగత ఎంఎస్ఎంఈ రుణాలు 29 శాతం, సంస్థలకు సంబంధించి ఎంఎస్ఎంఈ రుణాలు 6.6 శాతం చొప్పున పెరిగాయి. సూక్ష్మ రుణాలు సైతం బలమైన వృద్ధిని చూపించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల్లో 27 శాతం వృద్ధి నమోదైంది. -
రుణాలు పీక్... డిపాజిట్లు వీక్
న్యూఢిల్లీ: రుణాల పెరుగుదల డిపాజిట్ వృద్ధిని మించిపోతోందని, ఇది బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతా) సవాళ్లకు దారితీయవచ్చని ఫిక్కీ–ఐబీఏ నివేదిక ఒకటి పేర్కొంది. రుణ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను పెంచడం అలాగే రుణ రేటును తక్కువగా ఉంచడం బ్యాంకుల ఎజెండాలో అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) విభాగం వాటా తగ్గినట్లు సర్వేలో పాల్గొన్న బ్యాంకుల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ తెలియజేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు సహా మొత్తం 22 బ్యాంకులు (మొత్తం అసెట్ పరిమాణంలో వీటి వాటా 67 శాతం) ఈ సర్వేలో పాల్గొన్నాయి. 2024 జనవరి నుంచి జూన్ మధ్య జరిగిన ఈ 19వ దఫా ఫిక్కీ–ఐబీఏ సర్వే నివేదికలో వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్ని..2024 ప్రథమార్థంలో 80 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు కాసా డిపాజిట్ల వాటా తగ్గుదలను నమోదుచేసుకోగా, సగానికి పైగా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇదే విషయాన్ని తెలిపాయి. అయితే అధిక, ఆకర్షణీయమైన రేట్ల కారణంగా టర్మ్ డిపాజిట్లు వేగం పుంజుకున్నాయి. సర్వేలో 71% బ్యాంకులు గత ఆరు నెలల్లో మొండిబకాయిల స్థాయిలు తగ్గిన్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల రేటు 90 శాతంగా ఉంటే, ప్రైవేటు రంగ బ్యాంకుల రేటు 67 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు, లోహాలు, ఇనుము, ఉక్కు వంటి రంగాల్లో వృద్ధికి తగినట్లుగా దీర్ఘకాలిక రుణ డిమాండ్ కనబడుతోంది. ప్రత్యేకించి మౌలిక విభాగం పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ రంగానికి రుణ డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు సర్వేలో 77% బ్యాంకులు వెల్లడించాయి. బ్యాంకులు– ఫిన్‌టెక్ కంపెనీల మధ్య భాగస్వామ్యం– నూతన ఆవిష్కరణలు, సేవల విస్తృతి, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవడం వంటి సానుకూల చర్యలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్ఏటీఎం చానెల్ నిర్వహణ విషయంలో వ్యయాలు తగ్గాలి. వ్యూహాత్మక స్థానాలను ఎంచుకోవడం, ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్‌ఛేంజ్ ఫీజులను పెంచడం, వ్యయాలు– ప్రయోజనాలను విశ్లేషించడం, సాంకేతికతను పెంచడం వంటి పలు కీలక సూచనలను బ్యాంకర్లు చేశారు. -
పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు
భారతదేశంలో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచినట్లు అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.అధికారిక వెబ్సైట్ ప్రకారం.. హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో మూడు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతంగా ఉంది. ఒక సంవత్సరానికి ఎంసీఎల్ఆర్ 9.45 శాతంగా ఉంది. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ ఈఎంఐ పెరుగుతుంది. ఇందులో ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ రెండూ ఉంటాయి. ఇది కస్టమర్ల మీద ప్రభావం చూపిస్తుంది.ఓవర్ నైట్: 9.10 శాతంఒక నెల: 9.15 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.40 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.45 శాతంఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) రుణ వృద్ధి 25–27 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 28 శాతంగా నమోదైంది. ఎస్ఎఫ్బీలు విభాగాలవారీగా, భౌగోళికంగా కార్యకలాపాలు విస్తరిస్తే రుణ వృద్ధి మెరుగుపడుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదిక పేర్కొంది.క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్‌ఎఫ్‌బీల మూలధన నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ తక్కువ వ్యయాలతో డిపాజిట్లను సేకరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో రుణ వృద్ధికి అవసరమయ్యే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ, డిపాజిట్యేతర వనరులను అన్వేషిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా ఉన్న సూక్ష్మరుణాలతో పాటు తనఖాలు, అన్సెక్యూర్డ్ రుణాలు మొదలైన కొత్త మార్గాల్లో రుణ వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు చిన్న బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని నివేదిక తెలిపింది. కొత్త అసెట్స్ విభాగాల్లో రుణ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 40 శాతం వరకు ఉండొచ్చని, సంప్రదాయ విభాగాల్లో ఇది 20 శాతంగా ఉండొచ్చని సంస్థ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ కంటెంట్మరిన్ని విశేషాలు..నెట్‌వర్క్‌పరంగా ఎస్‌ఎఫ్‌బీల బ్రాంచీల సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి రెట్టింపై 7,400కి చేరింది. తూర్పు రాష్ట్రాల్లో శాఖల సంఖ్య అత్యధికంగా ఉంది. 2019 మార్చి నాటికి మొత్తం శాఖల్లో తూర్పు రాష్ట్రాల్లో 11 శాతం ఉండగా ప్రస్తుతం ఇది 15 శాతానికి పెరిగింది. సగానికి పైగా శాఖలు, గణనీయంగా వృద్ధి అవకాశాలున్న గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి.గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బ్యాంకింగ్ రంగానికి పూర్తి భిన్నంగా, ఎస్ఎఫ్బీల్లో రుణ వృద్ధికన్నా బల్క్ డిపాజిట్ల వృద్ధి 30 శాతం అధికంగా నమోదైంది. 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ డిపాజిట్లు 22 శాతమే. చౌకగా ఉండే కరెంట్–సేవింగ్స్ డిపాజిట్ల వాటా 35 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది.ఎస్ఎఫ్బీలు టర్మ్ డిపాజిట్లపై ఆధారపడటం ఇకపైనా కొనసాగనుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీ లోన్ల విభాగంలో రూ.6,300 కోట్ల లావాదేవీలు జరగ్గా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,000 కోట్లకు చేరాయి. -
పెట్టుబడులకు ‘రుణ’ పడదాం!
ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. రుణం తీసుకోవడమే ఎక్కువ మంది అనుసరించే మార్గం. అవసరాన్ని వెంటనే గట్టెక్కడమే ముఖ్యంగా చూస్తుంటారు. వడ్డీ రేటు గణనీయంగా ఉండే క్రెడిట్‌కార్డు రుణాలే కాదు, వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తుంటారు. దీంతో అప్పటికి అవసరం తీరుతుందేమో కానీ, ఆ తర్వాత ఆర్థికంగా భారాన్ని మోయాల్సి వస్తుంది. కొందరు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉంటే వాటిని ఉపసంహరించుకుంటారు. కానీ, వీటికంటే మెరుగైన ఆప్షన్ ఉంది. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించాల్సిన అవసరం లేకుండా, వాటిపై చౌక వడ్డీకే రుణం పొందొచ్చు. దీనివల్ల పెట్టుబడుల వృద్ధి ప్రయోజనాన్ని కోల్పోవాల్సిన అవసరం ఏర్పడదు. పైగా రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ ఫండ్స్/స్టాక్స్.. మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం పొందడాన్ని లోన్ ఎగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ (ఎల్ఏఎంఎఫ్)గా.. షేర్లపై రుణం పొందడాన్ని లోన్ ఎగైనెస్ట్ సెక్యూరిటీస్ (ఎల్ఏఎస్)గా చెబుతారు. ఇవి సెక్యూర్డ్ రుణాలు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు/õÙర్లు లేదా బాండ్లు తదితర సెక్యూరిటీలను తనఖా పెట్టుకుని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలు మంజూరు చేస్తాయి. కనుక రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాల్సిన అవసరం లేదు. స్వల్పకాల అవసరాల కోసం ఈ రుణాలు తీసుకోవచ్చు. వీటిపై 9–11 శాతం మధ్య వడ్డీ రేటు అమలవుతుంటుంది. మిరే అస్సెట్ సంస్థ 10.5 శాతం వార్షిక వడ్డీ రేటును అమలు చేస్తోంది. డిజిటల్‌గా, నిమిషాల వ్యవధిలోనే రుణం పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. అర్హతలు..⇒ సెబీ అనుమతించిన కంపెనీల షేర్లకే రుణాలు పరిమితం. దాదాపు అన్ని బ్లూచిప్ షేర్లకు, టాప్–250 షేర్లకు రుణాలు లభిస్తాయి. డీలిస్ట్ అయిన వాటికి అవకాశం లేదు. ఏఏ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం లభిస్తుందో.. ప్రతి బ్యాంక్, ఎన్బీఎఫ్సీ ఒక జాబితాను నిర్వహిస్తుంటాయి. ⇒ ఒక్కసారి వీటిపై రుణం తీసుకున్నారంటే, అవి తనఖాలోకి వెళ్లినట్టు అర్థం చేసుకోవాలి. కనుక రుణం తీర్చే వరకు వాటిని విక్రయించలేరు. ⇒ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ విలువలో నిర్ణీత శాతం వరకే రుణం లభిస్తుంది. ఇక్కడ కూడా లోన్–టు–వేల్యూ (ఎల్టీవీ) వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఆర్బీఐ నిర్దేశించిన ఎల్టీవీ 75 శాతంగా ఉంది. చాలా సంస్థలు ఈక్విటీ ఫండ్స్‌పై 50– 60% మేరకే రుణం ఇస్తున్నాయి. మిరే అస్సెట్ సంస్థ 45 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తోంది. రుణం ఇచ్చే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ విడిగా రుణగ్రహీత తిరిగి చెల్లింపుల సామర్థ్యాలను అంచనా వేసుకున్న తర్వాత ఇంతకంటే తక్కువే మంజూరు చేయవచ్చు. ⇒పెట్టుబడుల విలువలో రుణం 50 శాతం మించకుండా ఉంటేనే నయం. ఎందుకంటే తనఖాలో ఉంచిన షేర్లు, సెక్యూరిటీలు, ఫండ్స్ యూనిట్ల విలువను రుణం ఇచి్చన సంస్థలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయి. ముఖ్యంగా మార్కెట్లు కరెక్షన్కు లోనైతే ఈ పనిని వెంటనే చేస్తాయి. అప్పుడు లోన్–టు–వేల్యూని మించి రుణం విలువ పెరిగిపోతుంది. దీంతో అదనపు సెక్యూరిటీలు/ఫండ్స్ యూనిట్లను తనఖా ఉంచాలని అవి కోరతాయి. లేదా నగదు సర్దుబాటు చేయాలని కోరతాయి. లేదంటే అదనపు వడ్డీని విధిస్తాయి. లేదా తనఖాలో ఉంచిన వాటిని వెంటనే విక్రయించి సొమ్ము చేసుకుంటాయి. రుణం తీసుకున్న వ్యక్తి స్పందన ఆధారంగా ఈ చర్యలు ఉంటాయి. ⇒ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఈ రుణం మంజూరు అవుతుంది. ఉదాహరణకు తనఖా పెట్టిన సెక్యూరిటీలు, ఫండ్స్ యూనిట్లపై రూ.5 లక్షల రుణానికి ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం లభించిందని అనుకుందాం. అప్పుడు రూ.2 లక్షలే వినియోగించుకుంటే ఆ మొత్తంపైనే వడ్డీ పడుతుంది. ఎన్ని రోజులు వినియోగించుకుంటే, అంతవరకే వడ్డీ పడుతుంది. కాకపోతే తీసుకున్న రుణంపై వడ్డీని ప్రతినెలా చెల్లించాల్సిందే. ⇒ రుణంపై కనిష్ట, గరిష్ట పరిమితులను బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అమలు చేస్తున్నాయి. ⇒ వ్యక్తిగత రుణాలను ముందస్తుగా తీర్చివేస్తే ప్రీక్లోజర్ చార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తుంటాయి. కానీ, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రుణాలపై ప్రీ క్లోజర్ చార్జీల్లేవు. ⇒ వ్యక్తిగత రుణాల మాదిరే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌పై రుణాలను ఎందుకు వినియోగించుకోవాలనే విషయంలో షరతులు ఉండవు. చట్టవిరుద్ధమైన, స్పెక్యులేటివ్ అవసరాలకే వినియోగించుకోకూడదు. ⇒ తనఖాలోని షేర్లు, స్టాక్స్‌కు సంబంధించి డివిడెండ్లు, బోనస్, ఇతరత్రా ప్రయోజనాలు ఇన్వెస్టర్‌కే లభిస్తాయి. ⇒ గడువు ముగిసిన తర్వాత షేర్లు, ఫండ్స్ యూనిట్లపై రుణాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ⇒ రుణంపై వడ్డీ, అసలు చెల్లింపుల్లో విఫలమైతే తనఖాలో ఉంచిన సెక్యూరిటీలు, స్టాక్స్‌ను విక్రయించే అధికారం రుణం ఇచి్చన సంస్థలకు ఉంటుంది. విక్రయించగా వచి్చన మొత్తాన్ని రుణంతో సర్దుబాటు చేసుకుంటాయి. మిగులు ఉంటే రుణగ్రహీతకు చెల్లిస్తాయి. ఇంకా బకాయి మిగిలి ఉంటే రుణగ్రహీత నుంచి రాబట్టేందుకు తదుపరి చర్యలు తీసుకుంటాయి.డెట్ ఫండ్స్‌పై వద్దు.. డెట్ ఫండ్స్‌లో రాబడులు 6–8 శాతం మధ్యే ఉంటాయి. వీటిపై రుణం తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ 10–12 శాతం మధ్య ఉంటుంది. దీనికి బదులు ఆ పెట్టుబడులను విక్రయించుకోవడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. కేవలం ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌పై రుణానికే పరిమితం కావాలి. ఎందుకంటే, ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌లో దీర్ఘకాలంలో రాబడులు 15 శాతం స్థాయిలో ఉంటాయి. కనుక వడ్డీ చెల్లింపులు పోను ఎంతో కొంత మిగులు ఉంటుంది. చార్జీలు.. సకాలంలో చెల్లింపులు చేయనప్పుడు పీనల్ చార్జీలు విధిస్తాయి. అలాగే, సెక్యూరిటీ ఇన్వొకేషన్ చార్జీ, కలెక్షన్ చార్జీ, లీగల్ చార్జీ, స్టాంప్ డ్యూటీ, చెక్ బౌన్స్ చార్జీలు కూడా ఉంటాయి. రుణ కాల పరిమితి సాధారణంగా ఒక ఏడాది ఉంటుంది. తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. దీనిపైనా చార్జీలు విధిస్తాయి. రుణం తీసుకోవడానికి ముందే ఈ చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఇతర ఆప్షన్లు బంగారం, ప్రాపర్టీ (ఇల్లు లేదా స్థలం), జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లపైనా సెక్యూర్డ్ రుణాలు పొందొచ్చు. కాకపోతే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై డిజిటల్‌గా, వేగంగా రుణం లభిస్తుంది. కనుక ఇది అత్యవసర నిధిగానూ అక్కరకు వస్తుంది. తక్కువ రేటుకే రుణం తీసుకోవాలని భావిస్తే, భిన్న సంస్థల మధ్య వడ్డీ రేటును పరిశీలించాలి. అలాగే, బంగారం, జీవిత బీమా ప్లాన్లు ఉంటే వాటి రేట్లను విచారించి, చౌక మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణం చివరి ఎంపికగానే ఉండాలి.విక్రయించడం మార్గం కాదు.. రిటైల్ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుండటం చూస్తున్నాం. ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారిలో 59 శాతం మంది 24 నెలలకు మించి కొనసాగిస్తున్నారు. మిగిలిన వారు ఆ లోపే విక్రయిస్తున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చేయడం దీర్ఘకాల లక్ష్యాలకు విరుద్ధం.పెట్టుబడులు ఉపసంహరించుకోకుండా, ఓవర్‌డ్రాఫ్ట్ రుణ సదుపాయం ద్వారా స్వల్పకాల అవసరాలను అధిగమించడమే మంచి ఆప్షన్ అవుతుంది. మిరే అస్సెట్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ డేటా ప్రకారం.. ఫండ్స్, షేర్లపై రుణాలను 30 శాతం మంది వ్యాపార అవసరాల కోసం, 19 శాతం మంది ఇంటి నవీకరణ కోసం, 18 % మంది పిల్లల స్కూల్/కాలేజీ ఫీజుల కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఎస్బీఐ యోనో నుంచే.. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ సైతం మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం ఇస్తోంది. అది కూడా యోనో యాప్ నుంచే దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌గా రుణాన్ని పొందొచ్చు. క్యామ్స్ వద్ద నమోదైన అన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు) మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై, ఆకర్షణీయమైన రేట్లకే రుణాన్ని ఇస్తున్నట్టు ఎస్బీఐ చెబుతోంది. గతంలో కేవలం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై, అది కూడా బ్యాంక్ శాఖకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు యోనో నుంచి పది నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రుణం విలువపై 0.50 శాతం ప్రాసెసింగ్చార్జీ, జీఎస్టీ చెల్లించుకోవాలి. -
డిపాజిట్లు తగ్గడం సవాలు కాదు
ముంబై: రుణాలకు ఉన్న డిమాండ్‌ను తాము అందుకోగలమని, అందుకు సరిపడా వనరులు ఉన్నాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు. రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు బ్యాంకుల్లోకి రావడం లేదన్న ఆందోళనల నేపథ్యంలో ఖరా దీనిపై స్పష్టత ఇచ్చారు. డిపాజిట్లలో వృద్ధి తగ్గుదల తమకు సవాలు కాబోదన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో అదనంగా ఉంచిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నామని, రుణాల వృద్ధికి ఈ వనరులను వినియోగిస్తామని ఖరా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు రాని పరిస్థితి రెండేళ్లుగా నెలకొంది. ఇందుకు ఎస్బీఐ కూడా అతీతమేమీ కాకపోవడం గమనార్హం. దీంతో డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు నానా తంటాలు పడుతున్నాయి. డిపాజిట్లు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా చొరవ చూపించాలంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు సూచించడం ఈ పరిణామాల్లో భాగమే. అధిక రాబడులు వచ్చే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడమే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రస్తుత పరిస్థితి ఎంత మేర ఆందోళనకరమన్న ప్రశ్నకు ఖరా స్పందిస్తూ.. ‘‘రుణ వృద్ధికి సరిపడా సేవలు అందించే స్థితిలోనే ఉన్నాం. రుణాల డిమాండ్‌ను తీర్చగలిగినంత వరకు అది మాకు సవాలుగా పరిణమించదు’’అని వివరించారు. ఎంత రేటు ఆఫర్ చేయడం ద్వారా డిపాజిట్లను ఆకర్షించొచ్చన్న ప్రశ్నకు సూటిగా కాకుండా.. తమ నిధుల సమీకరణ వ్యూహాలను ఖరా వెల్లడించారు. తమకు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటూ.. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్)లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా రుణ డిమాండ్‌ను తీర్చగలమన్నారు. పెట్టుబడుల కంటే రుణాలపైనే ప్రస్తుతం రాబడులు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితే 2003–04 లోనూ ఉందన్నారు. -
పసిడి రుణాలకు భారీ డిమాండ్.. ఐదేళ్లలో రూ.14.19 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అవసరాల్లో బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకునే ధోరణి దేశంలో గణనీయంగా పెరిగిపోతోంది. సంఘటిత రంగం బంగారం రుణాల మార్కెట్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపై రూ.14.19 లక్షల కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. ‘‘అసంఘటిత రంగంలో (వ్యక్తులు, పాన్బ్రోకర్ల వద్ద తనఖాలు) ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 2023–24లో సంఘటిత రంగంలో బంగారం రుణాల మార్కెట్ రూ.7.1 లక్షల కోట్లకు చేరుకుంది. ఏటా 14.85 శాతం కాంపౌండెడ్ చొప్పున పెరుగుతూ 2029 మార్చి నాటికి రూ.14.19 లక్షల కోట్లకు చేరుతుంది’’ అని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. ముఖ్యంగా బంగారం రుణాల్లో 79.1 శాతం వాటాతో దక్షిణాది మార్కెట్ అగ్రగామిగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘భారతీయ కుటుంబాల వద్ద 25,000 టన్నుల బంగారం ఉంటుంది. దీని ప్రస్తుత విలువ రూ.126 లక్షల కోట్లు. బంగారం విలువపై ఇచ్చే రుణం (ఎల్టీవీ) విషయంలో ఆర్బీఐ కఠిన పరిశీలనల నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో బంగారం రుణాల మార్కెట్ మోస్తరు వృద్ధిని చూడొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వివరించింది. రుణాన్ని నగదు రూపంలో రూ.20 వేలకు మించి ఇవ్వరాదంటూ ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో.. కస్టమర్లు అసంఘటిత రంగంపై ఆధారపడడం పెరగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఫిన్‌టెక్ స్టార్టప్‌ల ద్వారా రుణాల జారీ ప్రక్రియపైనా ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఇవే ఎన్‌బీఎఫ్‌సీల షేర్ల ధరలు తగ్గడానికి దారితీశాయంటూ పీడబ్ల్యూసీ తన నివేదికలో వివరించింది. నిబంధనల అమలుకు ప్రాధాన్యం.. వ్యయ నియంత్రణ చర్యల అమలుతో బంగారం రుణాలు ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీల లాభదాయకత పెరుగుతుందని, ఇన్వెస్టర్ల విశ్వాసం అధికమవుతుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు గణనీయంగా పెరగడం వీటిపై రుణ రేట్ల విషయంలో ఎన్బీఎఫ్సీలు అప్రమత్తంగా వ్యవహరించేలా చేసినట్టు వివరించింది. బంగారం ధరలు తగ్గుముఖం పడితే అది లోన్ టు వ్యాల్యూ పరిమితిని ఉల్లంఘనకు దారితీస్తుందని, నిర్వహణ పరమైన సమస్యలకు దారితీసి బంగారం వేలం వేయాల్సిన పరిస్థితులు రావొచ్చన్న ఆందోళనను పీడబ్ల్యూసీ నివేదిక ప్రస్తావించింది. బంగారం రుణ మార్కెట్ వృద్ధిని బ్యాంకులతోపాటు ఎన్బీఎఫ్సీలు నడిపిస్తాయని పేర్కొంది. బ్యాంక్‌లకు ఎక్కువ లబ్ధి ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం రుణాల మార్కెట్ అయిన భారత్‌లో.. పరిశ్రమ మరింత వృద్ధి చెందడం వల్ల ఈ రంగంలోని అన్ని సంస్థలు ప్రయోజనం పొందొచ్చని ఈ నివేదిక తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా బ్యాంక్‌లకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేసింది. ‘‘బంగారంపై రుణాలన్నవి పూర్వకాలం నుంచి ఉన్న విధానం.. వినియోగదారులతోపాటు, రుణాలిచ్చే సంస్థలకు ఇది ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉంటోంది’’అని పేర్కొంది. -
మనసు లేని బ్యాంకులు! కేరళ ప్రభుత్వం అసంతృప్తి
కేరళలో వయనాడ్ విపత్తు బాధితుల పట్ల బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై కేరళ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాధితుల ఖాతాల నుంచి రుణాల ఈఎంఐలను కట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ రుణాలను బ్యాంకులు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేసింది.ఈ రుణాలను మాఫీ చేయడం వల్ల బ్యాంకులకు భరించలేని నష్టమేమీ వాటిల్లదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం విజయన్ మాట్లాడుతూ.. బాధితుల వడ్డీ మొత్తాలలో సడలింపు లేదా నెలవారీ వాయిదాలను చెల్లించడానికి సమయాన్ని పొడిగించడం పూర్తి పరిష్కారం కాదన్నారు.గత జులై 30న జరిగిన భయానక దుర్ఘటన ప్రభావాన్ని, మిగిల్చిన శోకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విపత్తులో 200 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. రుణాలు తీసుకున్న వారిలో చాలా మంది చనిపోయారని, విపత్తు కారణంగా వారి భూమి నిరుపయోగంగా మారిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకున్న వారు ఇంటినే పోగొట్టుకున్నారని తెలిపారు. అలాంటి వారు ఇప్పుడు ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదు. బాధితులు తీసుకున్న మొత్తం రుణాలను మాఫీ చేయడమే మన చేయగల మేలు అని సీఎం విజయన్ సూచించారు.సాధారణంగా బ్యాంకులు మాఫీ చేసిన మొత్తానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం చెల్లించాలని ఆశిస్తాయనీ, అయితే ఈ సమస్యపై అలాంటి వైఖరి తీసుకోవద్దని సీఎం విజయన్ అన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు సొంతంగా భరించాలని ఆయన కోరారు. కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన కొందరి ఖాతాల నుంచి ఈఎంఐలు కట్ చేసిన కేరళ గ్రామీణ బ్యాంకుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో యాంత్రికంగా ఉండకూడదన్నారు. -
రుణమాఫీపై రైతుల అసంతృప్తి
-
క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిగే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు రూ.10,000 కోట్లకు చేరాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ, సీఈఓ దిలీప్ అస్బే తెలిపారు. అందులో యూపీఐ సేవలందించే బ్యాంకులు తమ వినియోగదారులకు సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.200 కోట్ల వరకు లోన్లు అందిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ..‘యూపీఐ ద్వారా చేసే క్రెడిట్ కార్డుల వినియోగం రూ.10వేల కోట్లకు చేరింది. కార్డు లావాదేవీలను అసరాగా చేసుకుని బ్యాంకులు దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రి అప్రూవ్డ్ లోన్లు ఇస్తున్నాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంక్ ముందంజలో ఉంది. దాంతోపాటు స్వల్ప కాల వ్యవధి కలిగిన రుణాలను కూడా బ్యాంకులు విడుదల చేస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై చిన్నమొత్తంలో రుణాలను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించాలని భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!క్రెడిట్‌కార్డు లావాదేవీలపై యూపీఐ ద్వారా లోన్లు ఇవ్వడం బ్యాంకులకు కొంత లాభాలు చేకూర్చే అంశమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సర్వీసులను వినియోగదారులకు చేరవేసేందుకు బ్యాంకులు ఎన్బీఎఫ్సీలు, ఇతర ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి యూపీఐ ద్వారా బ్యాంకులు మాత్రమే లోన్లు ఇవ్వగలవు. ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్‌లు కూడా బ్యాంకుల మాదిరి లోన్లు ఇచ్చేలా వెసులుబాటు పొందాలని భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఆర్బీఐ అనుమతులు కావాల్సి ఉంటుంది. -
ఐదేళ్లలో రద్దు చేసిన రుణాలు రూ. 9.9 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 9.90 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభకు తెలిపారు. 2019–20లో అత్యధికంగా రూ. 2.34 లక్షల కోట్లు రైటాఫ్ చేయగా ఆ తర్వాత సంవత్సరంలో ఇది రూ. 2.02 లక్షల కోట్లకు, 2021–22లో రూ. 1.74 లక్షల కోట్లకు తగ్గింది. తర్వాత సంవత్సరంలో ఇది తిరిగి రూ. 2.08 లక్షల కోట్లకు పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరం రూ. 1.70 లక్షల కోట్లకు పరిమితమైంది.రైటాఫ్ చేసినంత మాత్రాన బాకీలను పూర్తిగా రద్దు చేసి రుణగ్రహీతలకు మేలు చేసినట్లు కాదని, వారు వాటిని చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపర్చుకునేందుకు, పన్ను ప్రయోజనాలు పొందేందుకు, మూలధనాన్ని మెరుగ్గా ఉపయోగించుకునేందుకు నిర్దిష్ట నిబంధనలకు లోబడి బ్యాంకులు మొండి బాకీలను రైటాఫ్ చేస్తుంటాయని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని రాబట్టేందుకు బ్యాంకుల చర్యలు కొనసాగుతాయని తెలిపారు. గత అయిదేళ్లలో రూ. 1.84 లక్షల కోట్లు రికవర్ అయినట్లు మంత్రి చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో కొత్త బ్యాంకు
తెలుగు రాష్ట్రాల్లో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో 5 బ్రాంచిలను ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ ఇందర్జిత్ కామోత్రా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవలను తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ బ్యాంకు ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) వర్గాలు రుణాలు పొందవచ్చు. ప్రాథమికంగా హైదరాబాద్‌లో 5 బ్రాంచిలను ప్రారంభిస్తున్నాం. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ బ్యాంకు బ్రాంచీలు మొదలుపెడతాం. దేశ వ్యాప్తంగా యూనిటీ బ్యాంకుకు 182 శాఖలున్నాయి. వచ్చే ఏడాదిన్నరలో వీటిని 300కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. వీటితోపాటు 130కి పైగా అసెట్ బ్రాంచీలు ఏర్పాటు చేస్తాం. మొత్తం బ్యాంకుకు రూ.7,500 కోట్ల డిపాజిట్లు, రూ.8,500 కోట్ల రుణాలున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియా -
ఏపీకి ప్రత్యేకహోదా తప్ప ఏమీ వద్దు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలను అందించిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప ఇంకేది అవసరం లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.The people of AP whose 16 MPs are keeping the Central Government stable deserve nothing but Special Category Status. Not “arranged” additional loans, no Special Package, no concession, only Special Category Status. The General Budget is a play of words for us.— Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2024శుక్రవారం(జులై 26) ఈ విషయమై ఆయన ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. ‘కేంద్రం ఏర్పాటు చేసే అదనపు రుణాలు, ప్రత్యేక ప్యాకేజీ, మినహాయింపులు ఏవీ వద్దు. ఒక్క ప్రత్యేక హోదానే కావాలి. కేంద్ర బడ్జెట్ మాకు మాటల గారడిలా ఉంది అని విజయసాయిరెడ్డి విమర్శించారు. -
‘గ్యారెంటీ’ అప్పు రూ.5,200 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రూ.5,200 కోట్ల రుణం పొందేందుకు పౌరసరఫరాల సంస్థ, ఏపీ మార్క్ఫెడ్లకు అనుమతినిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతుల మేలు కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత రబీలో ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపులతో పాటు 2024–25 సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ రుణాన్ని వినియోగిస్తామని తెలిపింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.అప్పులు మినహా మరో మార్గం లేదు..రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇటీవలే రూ.1,000 కోట్లు విడుదల చేశాం. మరో రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపు కోసం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రూ.2 వేల కోట్ల రుణం పొందేందుకు పౌర సరఫరాల సంస్థను అనుమతిస్తూ గత నెల 28వ తేదీన ప్రభుత్వం జీవో నెం.6 జారీ చేసింది. ఈ రుణం కోసం ప్రభుత్వ హామీ కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–25లో ధాన్యం కొనుగోలు కోసం వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి ప్రభుత్వ హామీతో రూ.3,200 కోట్ల కొత్త రుణం కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలను సవరించి మెరుగైన విధానం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు మేలు చేసేందుకు అప్పులు చేయడం మినహా మరో మార్గం లేదు. ఉచిత పంటల బీమా స్థానంలో మెరుగైన పంటల బీమా పథకాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఏర్పాటయ్యే కమిటీ నెల రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక, గనుల పాలసీలు రద్దుఏపీ ల్యాండ్ టైటిలింగ్ 2022 చట్టం రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇసుక, గనుల పాలసీ 2019, మరింత మెరుగైన ఇసుక విధానం 2021ని రద్దు చేయడంతో పాటు వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్æ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం 2024 తెస్తాం. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా, ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తూ ఈ నెల 8న జారీ చేసిన జీవో నెం.43 ర్యాటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రానికి గుల్బెంకియన్ అవార్డు రావటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో అమలులో ఉన్న ప్రకృతి సాగును 2029 నాటికి కనీసం 20 లక్షల హెక్టార్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.కౌన్సిల్లో బలం లేదు.. నిజమే‘‘కౌన్సిల్లో మాకు బలంలేని మాట వాస్తవమే. అయితే అసెంబ్లీలో చేసిన చట్టాలను కౌన్సిల్ అడ్డగించే అవకాశం లేదు కదా?’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి మద్దతిచ్చిన టీడీపీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించగా నాడు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇచ్చారని ఎదురు ప్రశ్నించారు. హౌసింగ్‌లో అక్రమాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సంపద సృష్టి విషయంలో కట్టుబడి ఉన్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ మొదలైందని మంత్రి చెప్పారు. కేవలం నెల రోజుల్లో రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. భూముల ధరలు కనీసం రూ.ఐదారు లక్షలకు పైగా పెరిగాయన్నారు. ఎయిర్, రైల్ ట్రాఫిక్ 30 శాతం పెరిగిందన్నారు.ఇసుకలో తలదూర్చొద్దు!ఇసుక వ్యవహారాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి కొంతకాలం సజావుగా సాగనివ్వాలన్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో వివిధ రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉందని, వచ్చే 3 నెలలకు కోటి టన్నుల ఇసుక అవసరమని చెప్పారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు కొత్త విధానాన్ని తెద్దామన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటన విషయం ప్రస్తావనకు రావడంతో కొన్ని విషయాలు వాళ్లతో మాట్లాడాల్సి ఉందని, అవన్నీ బయటకు చెప్పలేనని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ కార్యక్రమాలను కొందరు సరిగా జనంలోకి తీసుకెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఆగస్టు ఒకటో తేదీన ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీలో అందరూ పాల్గొనాలని సూచించారు.ఐదు రోజులు అసెంబ్లీఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును ఈ సమావేశాల్లోనే పెడదామని చెప్పారు. పంటల బీమా పథకం అమలు కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసం చేసిందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ.1,600 కోట్లు రుణం తెచ్చి రూ.వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారని, మిగతాది ఎక్కడుందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రేషన్ బియ్యం ఎగుమతి చేసి అక్రమాలకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించినట్లు తెలిసింది. కిలో రూ.43 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన సూచించగా వచ్చే మంత్రివర్గం సమావేశం నాటికి దీంతోపాటు భూ అక్రమాలపైనా విచారణకు ఆదేశించడంపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. -
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్‌లో ఇకపై..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు షాక్ తగిలింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని పీరియడ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ని సవరించింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐని ప్రభావితం చేస్తుంది.ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, రుణ వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు ఈరోజు జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) బెంచ్‌మార్క్ 9.05% నుంచి 9.40% మధ్య ఉండగా బ్యాంక్ దీన్ని 0.10 శాతం వరకు పెంచింది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.95 నుంచి 9.05 శాతానికి పెరిగింది.» ఒక నెల ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది.» మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది.» ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది.» ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. (ఇది అనేక రకాల రుణాలకు అనుసంధానమై ఉంటుంది)» 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.» 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. -
నిధుల సేకరణకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మూలధన వ్యయంతో పాటు ఇతర అవసరాల కోసం రుణ మార్కెట్ నుంచి ప్రాథమికంగా రూ. 5 వేల కోట్ల మేర నిధులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ మైంది. తెలంగాణ పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ద్వారా రుణం తీసుకొనేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించింది. నిధుల సేకరణ బాధ్యతను రుణాలు ఇప్పించడంలో అనుభవంగల ‘మర్చంట్ బ్యాంకర్’కు అప్పగించాలని నిర్ణయించింది. మర్చంట్ బ్యాంకర్ ఎంపికకు గత నెల 23న జారీ చేసిన టెండర్‌ను రద్దు చేసిన టీజీఐఐసీ... తాజాగా మరో టెండర్ షెడ్యూ ల్ను విడుదల చేసింది. దీనిప్రకారం ఈ నెల 12లోగా ఫైనాన్షియల్ సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. అదేరోజు సాయంత్రం సాంకేతి క బిడ్లను తెరిచి అర్హతగల సంస్థలకు సమా చారం ఇస్తారు. 2019–24 మధ్య రుణ మార్కె ట్ నుంచి రూ. 20 వేల కోట్లకుపైగా సేకరించిన సంస్థలకు ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన బిడ్డర్ కనీసం రూ. 5 వేల కోట్ల మేర నిధులు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. రుణం సేకరించి ఇచ్చే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం కమీషన్ లభించే అవకాశం ఉంది. టీజీఐఐసీ ఎంపిక చేసే మర్చంట్ బ్యాంకర్ నిధుల సేకరణకు అవసరమయ్యే అన్ని రకాల అనుమతులు, క్లియరెన్సులు, లైసెన్సులు తదితరాల బాధ్యతలు చూసుకోవాలి.రూ. 10 వేల కోట్లు సేకరణ లక్ష్యం..?టీజీఐఐసీ ఎంపిక చేసే మర్చంట్ బ్యాంకర్ కనీసం రూ. 5 వేల కోట్ల నిధులు సేకరించాలనే లక్ష్యాన్ని టీజీఐఐసీ విధించింది. అయితే ఒకరికంటే ఎక్కువ మంది మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసి మొత్తంగా రూ. 10 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. టీజీఐఐసీ వద్ద ఉన్న పరిశ్రమల భూముల బ్యాంకు నుంచి కోకాపేట, రాయదుర్గం ప్రాంతంలోని 400 ఎకరాలకుపైగా భూమిని కుదువ పెట్టడం ద్వారా రూ. 10 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విలువైన ప్రాంతంలో ఉన్న ఈ భూముల విలువను సగటున ఎకరాకు రూ. 50 కోట్లుగా లెక్కకట్టినట్లు సమా చారం. వీలైనంత త్వరగా నిధుల సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని టీజీఐఐసీ భావిస్తోంది. రుణ మార్కెట్ నుంచి టీజీఐఐసీ రూ.10వేలు కోట్లు సేకరించేందుకు ప్రయత్నిస్తోందని శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘పరిశ్రమల భూములు తాకట్టు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమవడం తెలిసిందే. -
Shaktikanta Das: సంక్షోభాన్ని పసిగట్టి.. పనిపట్టడమే లక్ష్యం
ముంబై: సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి దానిపై చర్య తీసుకోవడమే రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నమని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎటువంటి తనఖా లేకుండా మంజూరుచేసే అన్సెక్యూర్డ్ రుణాల విషయంలో ఎటువంటి చర్య తీసుకోకపోతే అది ‘‘పెద్ద సమస్యలను’’ సృష్టించవచ్చని పేర్కొన్నారు. రిస్‌్కతో కూడిన అన్సెక్యూర్డ్ రుణ వృద్ధిని అరికట్టడానికి నవంబర్ 2023లో ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ పోర్ట్‌ఫోలియోలో పరుగు మందగించి బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆశించిన ప్రభావాన్ని చూపింది. ఆరి్థక సవాళ్లు, వీటిని ఎదుర్కొనే అంశంపై ఇక్కడ ఆర్బీఐ కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్ సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... → ఆర్బీఐ మార్గదర్శకాలు తీసుకువచ్చే నాటికి స్థూలంగా చూస్తే... బ్యాంకింగ్‌లో అన్సెక్యూర్డ్ రుణాలకు సంబంధించి పోర్ట్‌ఫోలియో పరిస్థితులు చూడ్డానికి బాగానే ఉన్నాయి. అయితే అన్సెక్యూర్డ్ రుణాల భారీగా పెరిగితే అది తీవ్ర సమస్యలు సృష్టించవచ్చన్న డానికి తగిన స్పష్టమైన ఆధారాలు కనిపించాయి. ఈ కారణంగా మేము ఈ రుణాలను అరికట్టడానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. → ఆర్బీఐ చర్యలకు ముందు ఈ పోర్ట్‌ఫోలియోలో 30 శాతం ఉన్న వృద్ధి రేటు అటు తర్వాత 23 శాతానికి తగ్గింది. ఒక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల విషయంలో ఈ రేటు 29 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. → లాభదాయకత, వృద్ధి కోసం కొన్ని వ్యాపార నమూనాలు రూపొందించుకున్నప్పటికీ, అవి కొన్నిసార్లు స్పష్టంగా కనిపించని లోపాలను, లొసుగులను కలిగి ఉంటాయి. వ్యాపార వృద్ధిని సాధించడం ముఖ్యమే. అయితే ఇది ఆమోదయోగ్యం కాని నష్టాలకు దారితీసే పరిస్థితి ఎన్నటికీ ఉత్పన్నం కాకూడదు. → భారత్ దేశీయ ఆరి్థక వ్యవస్థ ఇప్పుడు మనం కోవిడ్ సంక్షోభ కాలంలోకి ప్రవేశించడానికి ముందు కంటే చాలా బలమైన స్థితిలో ఉంది. భారత ఆరి్థక వ్యవస్థ ఇప్పుడు చాలా బలమైన స్థితిలో ఉంది. బలమైన మూలధన సమృద్ధి, తక్కువ స్థాయి నిరర్థక ఆస్తులు, బ్యాంకులు అలాగే నాన్–బ్యాంకింగ్ రుణదాతలు లేదా ఎన్‌బీఎఫ్‌సీల ఆరోగ్యకరమైన లాభదాయకత వంటి ఎన్నో సానుకూల అంశాలు ఇప్పుడు మన ఆరి్థక వ్యవస్థ పటిష్టతలు. → ఆర్బీఐ తన పర్యవేక్షక పనితీరును మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలను చేపట్టింది. ఏదైనా తప్పుగా గుర్తించినట్లయితే దానిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ద్వారా బ్యాంక్ బోర్డుకి వివరణాత్మకంగా తెలియజేయడం, అవసరమైతే బ్యాంక్ ఆడిటర్లను కలవడం వంటివి ఇందులో ఉన్నాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల ఆన్సైట్ పర్యవేక్షణ ప్రాధాన్యత కూడా ఇక్కడ చెప్పుకోదగిన కీలకాంశం. తీసుకున్న చర్యలు ఏమిటి.. అన్సెక్యూర్డ్ రుణాల విషయంలో ఆర్బీఐ గత ఏడాది నవంబర్ 16న రిస్క్ వెయిటేజ్‌ని పెంచింది. అంటే అలా ఇచి్చన రుణాలపై ‘రిస్క్ నిధుల’ అధిక కేటాయింపులు జరపాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనితో బ్యాంకింగ్ ఈ పోర్ట్ఫోలి యో విషయంలో ఆచితూచి స్పందించింది. -
హోమ్ లోన్ తీసుకోవాలంటే ఈ బ్యాంకులే బెస్ట్
-
రైతు భూమిలో బ్యాంకు ఫ్లెక్సీ!
సాక్షి, కామారెడ్డి/లింగంపేట: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంపై బ్యాంకు అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. తనఖా పెట్టిన భూములను వేలం వేస్తామంటూ ఆ భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని పోల్కంపేట, పర్మల్ల, శెట్పల్లి సంగారెడ్డి తదితర గ్రామాల రైతులు 2010 ప్రాంతంలో పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. కొందరు కొన్ని వాయిదాలు చెల్లించి మానుకోగా, మరికొందరు అసలే చెల్లించలేదు. కొందరు మాత్రం పూర్తిగా చెల్లించారు. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు కొన్నేళ్లుగా రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులిచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. అయితే అప్పులు తీసుకుని పది పదిహేనేళ్లు కావడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పట్లో రూ.5 లక్షలు అప్పు తీసుకుంటే ఇప్పుడది రూ.15 లక్షలు దాటింది. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం రైతులకు భారంగా మారింది. వడ్డీ తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అప్పులు చెల్లించడం లేదంటూ బ్యాంకర్లు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. పోల్కంపేటలో ఓ రైతు పొలంలో భూమిని వేలం వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు. వడ్డీలు తగ్గిస్తే అప్పు తిరిగి చెల్లిస్తామని పేర్కొంటున్నారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నాం బ్యాంకుకు భూమి తనఖా పెట్టి అప్పు తీసుకున్న రైతు తిరిగి చెల్లించకపోవడమే గాక, ఆ భూమిని అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. బ్యాంకు తనఖాలో ఉన్న భూమిని ఎలా అమ్ముకుంటారు? ఆ భూమిపై బ్యాంకుకే హక్కు ఉంటుంది. లింగంపేట మండలంలో దాదాపు 7 వందల మంది రైతులు దీర్ఘకాలిక రుణాలు తీ సుకున్నారు. వారిలో చాలామంది అప్పులు తి రిగి చెల్లించలేదు. సహకార చట్టం ప్రకారం వా రందరికీ నోటీసులిచ్చాం. వారి ఆస్తులను జప్తు చేయడం, లేదా వేలం వేయడం జరుగుతుంది. – కుమారస్వామి, బ్రాంచి మేనేజర్, ఎన్డీసీసీబీ, లింగంపేట -
రఘురామ, గంటాకు బ్యాంకుల షాక్
సాక్షి, అమరావతి: రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఉండి, భీమిలి అసెంబ్లీ స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుకు ఎన్నికలకు రెండు రోజుల ముందు బ్యాంకులు గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఆస్తులను వేలం వేయడానికి నోటీసులు జారీ చేశాయి. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇందులో రూ. 826.17 కోట్ల రుణాన్ని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించారు. వడ్డీ కూడా చెల్లించలేదు. ఈ వ్యవహారం తెలిసి బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో ఆయన మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బ్యాంకులు దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో రూ.361.96 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) హైదరాబాద్ శాఖ పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇండ్ భారత్ థర్మల్‌కు చెందిన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తులు రూ.180.98 కోట్లు, తమిళనాడు టూటికోరిన్లో ఉన్న 311.72 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాలు రూ.164.73 కోట్లు, కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఉన్న 129.73 ఎకరాలు రూ.11.74 కోట్లు, ఇతర సెక్యూరిటీలు, ఆర్థిక ఆస్తులకు రూ.4.51 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించింది. ఈ ఆస్తులకు సంబంధించిన జూన్ 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం వేయనున్నట్లు ఎన్సీఎల్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.రూ.400.37 కోట్లు ఎగవేసిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి, భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.400.37 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు చెందిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు ఈ రుణం తీసుకొని, ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఇండియన్ బ్యాంకు ఆస్తుల స్వా«దీనానికి రంగంలోకి దిగింది. విశాఖ నగరం గంగుల వారి వీధిలోని సర్వే నెంబర్ 13లో ఉన్న వాణిజ్య భవనాన్ని వేలానికి పెట్టింది. జూన్ 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేలం జరుగుతుంది. ఈ భవనం రిజర్వు ధరను రూ.2.84 కోట్లుగా బ్యాంకు నిర్ణయించింది. -
రామోజీ.. మీ రాతల్లోనే వ్యత్యాసం
సాక్షి, అమరావతి : రామోజీ మెదడు మోకాల్లోకి వచ్చిందేమోనన్న సందేహాలను ఈనాడు ప్రచురించే కథనాలు బలపరుస్తున్నాయి. పొదుపు సంఘాల రుణాలకు కొన్ని జిల్లాల్లో ఒక విధంగా.. మరికొన్ని జిల్లాల్లో మరో విధంగా వ్యత్యాసపు వడ్డీ రేటును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అజ్ఞానపు రాతలతో సున్నా వడ్డీ రుణాలపై శుక్రవారం ‘అన్నా...సున్నా అంటే అంత భారమా?’ శీర్షికన ఒక తెలివితక్కువ కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈనాడు అజ్ఞానాన్ని చూసి బ్యాంకులు, పొదుపు సంఘాల మహిళలు నవ్విపోతారన్న స్పృహ అయినా రామోజీకి లేకుండా పోయింది. బాబు 2014 ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే బేషరతుగా పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఘోరమైన అబద్ధమాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి కూడా మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా తన హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని ఆపేస్తే.. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు పెట్టిన బకాయిలన్నిటినీ బ్యాంకులకు చెల్లించి, ఆ పథకాన్ని పునరుద్ధరించారు. బాబు చేసిన మోసానికి పొదుపు సంఘాలు నీరుకారిపోయాయి. సున్నా వడ్డీ రుణాలు అందక అల్లాడిపోయాయి. బాబు చేసిన ఈ ఘోరమైన తప్పును జగన్ సరిదిద్దడంతో బ్యాంకులు ఇప్పుడు పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి. ఈ నిజాలు రామోజీ మట్టిబుర్రకు తెలియక అజ్ఞానాన్ని రంగరించి, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో నాలుగు శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, మిగిలింది కేంద్రం ఇస్తోందని తన తెలివితక్కువ పాత్రికేయ అసమర్థతను బయటపెట్టుకుంది. తెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకున్న ఈనాడు... ‘ఆరు జిల్లాలకు ఏడు శాతం కేంద్రం రాయితీ’ అంటూ తమ కథనంలో ఓ ఉపశీర్షికను పెట్టి.. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోందని , అందులో ఏపీ పరిధిలో ఆరు ఉమ్మడి జిల్లాలు ఉన్నట్టు ‘ఈనాడు’ రాసుకుపోయింది. ఆ ఆరు జిల్లాల్లో మాత్రమే సంఘాలు రూ. 3 లక్షల వరకు తీసుకున్న రుణానికి అక్కడ బ్యాంకులు 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తూ, కేంద్రం ఏడు శాతం రాయితీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు శాతమే భరిస్తోందంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే..2022 జూలై 20న ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏడు శాతం వడ్డీకే పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణాలపై కేంద్రం ఏడు శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నదే శుద్ద తప్పు. ఆ ఏడు శాతం వడ్డీ మొత్తాన్ని ఇప్పటి ప్రభుత్వమే భరిస్తోంది. ఈనాడు మరో పెద్ద శుద్ధ తప్పు రాసింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఒకలా, మరో ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకోలా వడ్డీ రేటుకు పొదుపు సంఘాలకు రుణాలిస్తోందని రాసింది. అలాంటి వ్యత్యాసం లేనేలేదు. ఇప్పుడు.. బ్యాంకులే మహిళలను బతిమిలాడి రుణాలిచ్చే స్థితి.. అప్పట్లో చంద్రబాబు డ్వాక్రా రుణామాఫీ హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయని కారణంగా రాష్ట్రంలో మొత్తం పొదుపు సంఘాల్లో 18.6 శాతం సంఘాలు అంటే ప్రతి ఐదులో ఒక సంఘం బాబు మాట నమ్మి తమ రుణాలు చెల్లించకపోవడంతో వాళ్లందరూ బ్యాంకుల ఎగవేతదారులుగా ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 2019 ఎన్నికల నాటికి ఉన్న అప్పు మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లించడం వంటి కారణాలతో ఇప్పుడు మహిళలు 99.83 శాతం మంది అంటే దాదాపు అందరూ ఎప్పటికప్పుడు తమ కిస్తీలను చెల్లిస్తున్నారు. ఈ చెల్లింపులతో బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలపై నమ్మకాన్ని పెంచుకున్నాయి. ఇప్పుడు ఎంత కావాలంటే అంత రుణాలు బ్యాంకులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. 2019 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఐదేళ్ల కాలంలో ఏకంగా 1.73 లక్షల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలుగా ఇచ్చాయంటే రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల వద్ద ఎంత పరపతి పెరిగిందో అర్ధమవుతుంది. బాబు ప్రభుత్వంలో కేవలం ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ. 10 లక్షల చొప్పున మాత్రమే బ్యాంకు రుణాలు ఇవ్వగా, ఇటీవల ఆర్బీఐ పొదుపు సంఘాలకు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు పరిమితిని పెంచడంతో చాలా సంఘాలు ఇప్పుడు రూ. 20 లక్షల చొప్పున రుణాలు పొందుతున్నాయి. చంద్రబాబు చేసిన మోసం ఈ ప్రభుత్వానికి అంటగట్టే యత్నం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల రుణాలపై మొదట పావలా వడ్డీ పథకం అమలు చేయగా, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే సున్నా వడ్డీ అమలులోకి వచ్చింది. విభజన అనంతరం.. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఐదేళ్ల కాలంలో ఒక రూపాయినైనా మాఫీ చేయకుండా రాష్ట్రంలో పొదుపుసంఘాల మహిళలందరినీ మోసం చేసిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకానికీ మంగళం పాడేశారు. 2016 జూలై తర్వాత రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీలో ఒక్క రూపాయి అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లించలేదు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు గత ఐదేళ్లుగా ఏటా ఠంచన్‌గా ఆర్థిక సంవత్సరం ముగియగానే ఆ ఏడాది వడ్డీ డబ్బును ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లిస్తూ వస్తోంది. గత నాలుగేళ్లల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ. 4969.05 కోట్లను ఇప్పటికే ఆయా మహిళలకు చెల్లించింది. 2023–24 సంవత్సర వడ్డీని ఇటీవల ముగిసిన మార్చి నెలాఖరు తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. వాస్తవం ఇది...దీనికి భిన్నంగా చంద్రబాబును వెనకేసుకొచ్చే రాతలు రాసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ఆపేసిన సున్నా వడ్డీని గొప్పగా చిత్రీకరిస్తూ.. అవన్నీ బకాయిలుగా పేర్కొంది. అప్పటి ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించలేదని , ఇదంతా ‘జగన్ మోహన్‌రెడ్డి నయవంచన’ అంటూ ఈనాడు వక్రీకరించింది. వరుసగా రెండన్నరేళ్ల పాటు పథకానికి నిధులు ఇవ్వకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే వాటిని బకాయిలు ఎలా అంటారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
ఊరూరా ఉపాధికి బాటలు
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థాయిలో సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తద్వారా ఊరూరా ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ.. పదిమందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. ఈ తరహా పరిశ్రమలు దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ఉంటే.. మన రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని ఆధునికీకరించేందుకు అవసరమైన తోడ్పాటు ఇవ్వడమే కాకుండా కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ‘వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రోడక్ట్’ కింద జిల్లాకో ఉత్పత్తిని ఎంపిక చేసి.. ఆ ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్‌ప్రైజస్ (పీఎం ఎఫ్ఎంఈ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో ఆర్థిక చేయూత ఇస్తున్నాయి. 2021లో ప్రారంభించిన ఈ పథకం కింద ఐదేళ్లలో రూ.460 కోట్ల ఆర్థిక చేయూతతో 10 వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. మూడేళ్లలో 3,843 పరిశ్రమలకు రూ.300 కోట్లకు పైగా ఆర్థిక చేయూత అందింది. రూ.10 లక్షల వరకు చేయూత వ్యక్తిగత కేటగిరీతో పాటు వ్యవసాయ సహకార సంఘాలు (ఎఫ్‌పీఓ), ఉత్పత్తిదారుల సంఘాలు (పీఓ), స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణ అనుసంధాన గ్రాంట్ మంజూరు చేశారు. పచ్చళ్లు, తినుబండారాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందే ఎస్‌హెచ్‌జీల్లోని çసభ్యులకు రూ.40 వేల వరకు సీడ్ క్యాపిటల్ కింద అందించారు. వ్యక్తిగత కేటగిరీలో ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు రుణ అనుసంధాన రాయితీ (క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ) గరిష్టంగా రూ.10 లక్షల వరకు అందించారు. ఇందులో 10 శాతం లబ్దిదారు భరిస్తే మిగిలిన 55 శాతం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో అందించారు. కల్పించిన సౌకర్యాలివే.. ఈ స్కీమ్ కింద పొందే రుణాలతో కామన్ ప్రోసెసింగ్ ఫెసిలిటీ కింద వ్యవసాయ ఉత్పత్తులను సారి్టంగ్, గ్రేడింగ్, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలతోపాటు ఉత్పత్తులను ప్రోసెస్ చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్, ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కెపాసిటీ బిల్డింగ్‌లో భాగంగా 9 కేటగిరీల్లో ఫుడ్ ప్రోసెసింగ్ టెక్నాలజీలు, తయారీ పద్ధతులు, ఆహార ప్రమాణాలు, నిబంధనలు, ఫుడ్ లైసెన్సింగ్ వంటి వాటిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. మనుగడలో ఉన్న పరిశ్రమల క్రమబద్దీకరణతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్‌లో శిక్షణ, రిటైల్ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో చేయూత ఇచ్చారు. బ్రాండింగ్ ఉత్పత్తుల ద్వారా మెరుగైన వాణిజ్యానికి సహకారం అందించారు. యంత్రాలు కొన్నాం మాది గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్. మసాలా దినుసులు తయారు చేస్తాం. పరిశ్రమను విస్తరించాలనుకున్నాం. కరోనా వల్ల వెనక్కి తగ్గాం. ఆ సమయంలో ఉద్యాన శాఖ అధికారులొచ్చి ఈ స్కీమ్ గురించి చెప్పారు. దగ్గరుండి దరఖాస్తు చేయించారు. 35 శాతం సబ్సిడీతో రూ.30 లక్షల రుణం తీసుకున్నాం. కొత్త యంత్రాలు కొనుగోలు చేశా. వ్యాపార విస్తరణకు ఇది ఎంతగానో దోహదపడింది. – బలుసు వీణ, గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్, కడప జీడిపప్పు వ్యాపారానికి చేయూత కొన్నేళ్లుగా జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాం. మెషినరీ కొనుగోలు కోసం ఆలోచిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో రూ.7.50 లక్షల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తం పరిశ్రమకు అవసరమైన మెషినరీ కొనుగోలుకు ఉపయోగపడింది. – మణిదేవి, వజ్జిలపేట, తూర్పు గోదావరి జిల్లా పప్పు పరిశ్రమకు విస్తరించాం పప్పు ప్రోసెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్తాం. వ్యాపారం విస్తరించుకోవాలని అనుకున్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. పీఎంఎఫ్ఎ స్కీమ్ కింద దరఖాస్తు చేశాం. రూ.28 లక్షల రుణమిచ్చారు. మెషినరీ కొనుగోలుతోపాటు వ్యాపారాన్ని మరింత విస్తరించుకోగలిగాం. – జోడు లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు -
ఆక్వా, పాడి రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి, ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో ఆక్వా రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆరి్థక చేయూతనిస్తుండగా.. పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తోంది. కార్డుల జారీ, రుణ పరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మరీ రుణాలు మంజూరు చేస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా ఐదేళ్లలో రూ.4,420.38 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. కార్డు పొందే పాడి రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించింది. తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 1.5 శాతం చొప్పున ఏటా వడ్డీ రాయితీ పొందొచ్చు. సకాలంలో చెల్లించిన వారికైతే 3 శాతం వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా అందించింది. పాడి రైతులకు రూ.1,747.18 కోట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడి పశువులు, సన్న జీవాలు కొనుగోలు చేసిన పాడి రైతులకు ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద ఐదేళ్లలో 5.15 లక్షల మందికి మూగ, సన్నజీవాలను అందించింది. వీరందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. కార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు 1,38,392 మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా, వారిలో 1,13,399 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1,09,199 మందికి రూ.1.60 లక్షల వరకు రుణాలు ఇచి్చంది. ఇలా రూ.1,747.18 కోట్ల రుణం అందించింది. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కేసీసీ కార్డులు జారీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసే పాడి రైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు, ఎంత పాడి ఉంది, ఎన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నారనే వివరాలను స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరిస్తే చాలు. ఎలాంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో పాడి రైతులు పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలు చేశారు. ఆక్వా రైతులకు రూ.2,673 కోట్లు ఐదేళ్లలో 19,059 మంది ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కార్డులు పొందిన ఆక్వా రైతులకు ప్రతి సీజన్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఇందులో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తోంది. రూ.2 లక్షలపై 2 శాతం, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద మరో 3 శాతం వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించింది. ఇలా ఐదేళ్లలో రూ.2,673 కోట్లను రుణాలుగా ఇచ్చింది. -
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
కొత్త రుణాలు కావాలా.. పాత అప్పు కట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు వారి ముక్కుపిండి మరీ తిరిగి వసూలు చేస్తున్నాయి. లీగల్ నోటీసులు, మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్లతో వడ్డీతో సహా రాబట్టుకుంటున్నా యి. కొన్ని బ్యాంకులు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఎంతోకొంత తగ్గించి వసూలు చేస్తున్నాయి. కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాల్సిందేనంటూ మెడపై కత్తి పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లోని రైతుబంధు సొమ్మును లాగేసుకుంటున్నాయి. దీంతో కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ బ్యాంకులకు చెల్లిస్తున్నారు. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో అప్పులు తిరిగి చెల్లించలేదని, రుణమాఫీ జరగకపోగా వడ్డీ తడిచిమోపెడు అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ జరిగేవరకు వేచిచూడాలని వేడుకుంటున్నా బ్యాంకులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బ్యాంకులు నోటీసులు..మరోవైపు వ్యవసాయశాఖ చేతులెత్తేయడం, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో తెలియక, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక రైతులు నలిగిపోతున్నారు. ముందుకు సాగని రూ.2 లక్షల రుణమాఫీ తమ పార్టీని గెలిపిస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడదే పార్టీ అధికారంలోకి వచి్చంది. కానీ నాలుగు నెలలైనా ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు చేయలేదు. కానీ రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని మాత్రం ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు.. ఎలా చేయాలి? ఏ తేదీ వరకు రుణమాఫీ చేయాలి అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పట్లో సాధ్యం కాదా? ఎన్నికల కోడ్‌తో ఇప్పటికిప్పుడు రుణమాఫీకి మార్గదర్శకాలు ఖరారు చేయడం, ఇతరత్రా ప్రక్రియ మొ దలు పెట్టడం కానీ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో జూన్ మొదటి వారం వరకు రుణ మాఫీపై అడుగు ముందుకు పడే అవకాశం లేదు. మరోవైపు వానాకాలం సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు మే నుంచే రైతులు సిద్ధం అవుతుంటారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, త్వరగా వర్షాలు కురిస్తే దుక్కులు దున్నడానికి సన్నాహాలు చేసుకుంటుంటారు. ఇంకోవైపు ఏప్రిల్ నుంచే వానాకాలం సీజన్ పంట రుణాల ప్రక్రియను బ్యాంకులు ప్రారంభిస్తాయి. కానీ రుణమాఫీ జరగకుంటే కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు తిరిగి చెల్లించాలని, రె న్యువల్ చేసుకోవాలని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ‘‘బ్యాంకుల్లో రైతు రుణాలు ఉన్నవాళ్లు ఎవ్వరూ కట్టకండి.. మేం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం’’అప్పట్లో పలు ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ముందు చెల్లించండి.. తర్వాత సర్దుబాటు చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూ డు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా అవి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు చెప్పిన ప్రకారం పాత అప్పులు చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేశాక సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే రైతులు డిఫాల్టర్లుగా మారిపోతారు. అయితే కొన్ని బ్యాంకులు రైతుబంధు సొమ్మును జమ చేసుకోవడం ద్వారా రెన్యువల్ చేయడం గమనార్హం. కాగా తాము రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం సాధ్యం కాదని ఒక బ్యాంకు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. బకాయిలు పేరుకుపోతే ఎవరినైనా డిఫాల్టర్లుగా ప్రకటిస్తామని అన్నారు. లక్షలాది మంది రైతుల రుణ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, అందుకే నోటీసులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పాత రుణాన్ని అలాగే ఉంచి కొత్త రుణం ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. -
అన్నదాతకు అండ
సాక్షి, అమరావతి: ఆరు గాలం శ్రమించే అన్నదాతకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా వంటి పథకాల ద్వారా అవసరమైన ఆర్థిక చేయూతనిస్తోంది. అలాగే బ్యాంకర్ల సాయంతో ముందెన్నడూ లేని రీతిలో రైతులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు అయ్యేలా చూస్తోంది. గతంలో రుణాల కోసం అన్నదాతలు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగేవారు. అయినా సకాలంలో అప్పులు పుట్టక వడ్డీ వ్యాపారుల ఉచ్చులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. సీఎం జగన్ పాలనలో ఆ పరిస్థితి మారింది. అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. రైతులకు లబ్ధి చేకూరుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా బ్యాంకులు సైతం వ్యవసాయ రంగానికి రుణాల మంజూరును ఏటా పెంచుతున్నాయి. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల లబ్ధి చేకూర్చింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు అందించింది. ఫలితంగా రైతుల ఆర్థిక పరపతి గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రికార్డు స్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. వాటికి మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి మంచి ధరలు లభిస్తున్నాయి. దీంతో తీసుకున్న రుణాలను రైతులు కూడా సకాలంలో చెల్లిస్తున్నారు. రికార్డు స్థాయిలో మొండి బకాయిలు సైతం వసూలవుతున్నాయి. 2019–20లో మొండి బకాయిలు 3.57 శాతం ఉండగా, 2023–24కు వచ్చేసరికి 2.50 శాతానికి తగ్గింది. దీంతో గత ఐదేళ్లుగా రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో మంజూరు.. 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో 3.97 కోట్ల మందికి రూ.3,64,624 కోట్ల రుణాలు మంజూరు చేస్తే.. గత 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 5.27 కోట్ల మంది రైతులకు ఏకంగా రూ.8,70,964 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. అంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏటా సగటున 79 లక్షల మందికి రూ.72,925 కోట్ల రుణాలిస్తే.. వైఎస్ జగన్ పాలనలో ఇప్పటివరకు ఏటా సగటున 1.05 కోట్ల మంది రైతులకు ఏకంగా రూ.1,74,193 కోట్ల రుణాలు బ్యాంకులు అందించాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రైతుల సంఖ్య దాదాపు 30 శాతం పెరిగితే, మంజూరు చేసిన రుణాలు ఏకంగా 142 శాతం పెరిగింది. అంటే ఏ స్థాయిలో రుణాలు మంజూరయ్యాయో అర్థం చేసుకోవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 2024 ఫిబ్రవరి నాటికి 99.65 లక్షల మందికి 2.08 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు అందించాయి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది షార్ట్ టర్మ్ రుణాలు రూ.1.22 లక్షల కోట్లు కాగా, అగ్రి టర్మ్ రుణాలు రూ.66 వేల కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగానికి రూ.20,816 కోట్లు మంజూరు చేశాయి. కౌలు రైతులకు వెన్నుదన్ను భూ యజమానుల హక్కులకు రక్షణ కల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం పంట సాగుదారు హక్కు పత్రాల(సీసీఆర్సీ)ను జారీ చేస్తోంది. వైఎస్ జగన్ పాలనలో ఇప్పటివరకు ఏటా సగటున 5.80 లక్షల మంది చొప్పున 26 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. అలాగే ఈ ఐదేళ్లలో 15 లక్షల మందికి రూ.8,577 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8.31 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా.. వీరిలో ఇప్పటికే 5.48 లక్షల మందికి రూ.1,908 కోట్ల పంట రుణాలు మంజూరయ్యాయి. -
ఎస్బీఐలో రూ.4.50 కోట్లు కాజేసిన మేనేజర్
సూర్యాపేట: తను పనిచేస్తున్న ఎన్‌బీఐ బ్యాంకులోని సొమ్మునే ఓ మేనేజర్ కాజేశారు. 2022 నుంచి 2023 వరకు 24 మంది ఉద్యోగుల పేరుతో రుణాలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ సైదులు సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బ్యాంక్ రుణం తీసుకునేందుకు అర్హత కలిగిన వారిని ఎంచుకొని కుంభకోణానికి శ్రీకారం చుట్టాడు. బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉన్నా, సాంకేతిక కారణాలు చూపి, అవసరమైన అదనపు పత్రాలు లేవంటూ రుణ దరఖాస్తును మొదటగా తిరస్కరించేవాడు. ఆపై అదే దరఖాస్తు ఆధారంగా, దరఖాస్తుదారుడి పేరు, వివరాలతో నకిలీ పత్రాలు సృష్టించి, వారి పేర్లతో మరోసారి రుణం కోసం దరఖాస్తు చేసేవాడు. దీనికి రుణం మంజూరు చేసినట్టు బ్యాంకు రికార్డుల్లో పొందుపర్చేవాడు. ఇలా ఒక్కో దరఖాస్తుదారుడి పేరుతో కనిష్టంగా రూ.15 లక్షలు కాజేశాడు. ఈ మొత్తాన్ని తన సొంత ఖాతాల్లోకి మళ్లించాడు. వెలుగులోకి వచ్చింది ఇలా.. ఉద్యోగుల పేరుతో రుణం తీసుకొని తన ఖాతాల్లోకి మళ్లించుకున్న సైదులు గత సంవత్సరం హైదరాబాద్‌లోని సీసీసీ (కమర్షియల్ క్లయింట్గ్రూప్) మేనేజర్‌గా బదిలీ అయ్యాడు. అయితే తాను తీసుకున్న ఈ రుణాలకు ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించేవాడు. 2024 ఫిబ్రవరి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఉద్యోగులకు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితులు సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇతను రామంతాపూర్ ఎస్బీఐ మేనేజర్‌తో కలిసి ఇదే తరహా మోసం చేసి రూ. 2.84 కోట్లు, సికింద్రాబాద్‌లో వెస్ట్ మారేడ్‌పల్లి బ్రాంచ్ నుంచి రూ. 9.50 కోట్లు కాజేసినట్టు సమాచారం. కొందరు ఉద్యోగులకు తెలిసే చేశారా ? పోలీస్‌శాఖలో 11 మంది ఉద్యోగులు, వైద్యారోగ్యశాఖలో ఇద్దరు, విద్యాశాఖలో ఇద్దరు, ఎక్సైజ్‌లో ఇద్దరు, కలెక్టరేట్లో వివిధ శాఖలకు చెందిన ఐదుగురు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు ఇలా మొత్తం 24 మంది ఉద్యోగుల పేరుతో బ్యాంక్ మేనేజర్ రుణం తీసుకున్నాడు. అయితే తమ పేరున రుణాలు తీసుకున్నట్టు కొందరు ఉద్యోగులకు ముందుగానే తెలిసినట్టు సమాచారం. మేనేజర్‌తో ఉద్యోగులు పర్సెంటేజీ మాట్లాడుకొని రుణం తీసుకునేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. మరి కొంతమంది ఉద్యోగులు మేనేజర్ మాయమాటలకు మోసపోయినట్టు సమాచారం. -
షరతులు నచ్చితేనే రుణం..
ఎన్నో అవసరాలకు రుణాలు తీసుకోవడం నేడు సర్వ సాధారణంగా మారింది. డిజిటైజేషన్ కారణంగా కోరుకున్నంత రుణం నిమిషాల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాకు జమ అవుతోంది. అవసరంలో ఉన్న వారు రుణం వస్తే చాలన్నట్టు, మిగిలిన ముఖ్యమైన విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనివల్ల తర్వాతి కాలంలో పడే భారాన్ని చూసి ఆందోళన చెందే పరిస్థితి. షరతులు, నియమ, నిబంధనలు, ఫీజుల గురించి తెలుసుకోకుండానే రుణ ఒప్పందంపై నిస్సంకోచంగా సంతకాలు చేయకూడదు. రుణానికి సంబంధించి కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్/ముఖ్య విషయాల సమాహారం)ను తప్పకుండా చదవాలి. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో అంగీకారానికి రావాలి. కేఎఫ్‌ఎస్‌ను రుణ గ్రహీతలకు తప్పకుండా అందజేయాలంటూ ఆర్బీఐ తన నియంత్రణ పరిధిలోని అన్ని ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఒక విధంగా రుణ గ్రహీతకు రుణంపై కళ్లు తెరిపించేదే కేఎఫ్ఎస్. కేఎఫ్ఎస్తో రుణ గ్రహీత నిర్ణయం సులభంగా మారుతుంది. ఒక బ్యాంక్ ఇస్తున్న రుణ ఆఫర్‌తో పోలిస్తే మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ రుణ ఆఫర్లో ఏది మెరుగైనదో తేల్చుకోవచ్చు. కేఎఫ్ఎస్ అందించకపోయినా, ఒకవేళ కేఎఫ్ఎస్లో వైరుధ్యాలు ఉన్నా వాటిని రుణదాత దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫిర్యాదును 30 రోజుల్లో పరిష్కరించకపోతే, పరిష్కారం సహేతుకంగా లేకపోతే ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించొచ్చు. ఒకవేళ డిజిటల్ రుణం అయితే దానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ కాలంలో రుణ గ్రహీత తనకు మంజూరైన రుణాన్ని వెనక్కి తిప్పికొట్టొచ్చు. దీనికి ఎలాంటి పెనాలీ్టలు పడవని గార్గ్ వివరించారు. కేఎఫ్ఎస్ అంటే..? 2023 నవంబర్ 15న ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఎన్బీఎఫ్సీ బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన ‘ఈకామ్’, ‘ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్’ రుణ ఉత్పత్తులను తక్షణం నిలిపివేయాలని కోరింది. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్)ను రుణ గ్రహీతలకు బజాజ్ ఫైనాన్స్ అందించకపోవడంతో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది. కేఎఫ్ఎస్ అన్నది ఒక డాక్యుమెంట్ (పత్రం). ఇందులో రుణానికి సంబంధించి కీలక సమాచారం అంతా ఉంటుంది. నిజానికి రుణ ఒప్పందంలో (లోన్ అగ్రిమెంట్) అన్ని వివరాలు ఉన్నప్పటికీ, అందులోని పదజాలం అర్థం చేసుకోవడం అందరికీ సులభం కాదు. కీలక వివరాలన్నింటినీ సులభంగా అర్థమయ్యేలా కేఎఫ్ఎస్ చెబుతుంది. అందుకే దీన్ని కీలక సమాచార పత్రంగా చెబుతారు. రుణంపై వడ్డీ రేటు ఎంత, షరతులు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు, నిర్ణీత కాలం కంటే ముందే సంబంధింత రుణాన్ని తీర్చివేస్తే విధించే చార్జీలు, రుణ వాయిదా చెల్లింపుల్లో ఆలస్యం అయితే పడే పెనాల్టీ చార్జీలు.. ఇలా రుణానికి సంబంధించి సమగ్ర వివరాలు అందులో వెల్లడించడం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల బాధ్యత. సమస్యల పరిష్కార యంత్రాంగాన్ని కూడా అందులో తెలియజేయాలి. కేఎఫ్ఎస్ పారదర్శకతను తీసుకొస్తుంది. కీలక వివరాలన్నీ ఉండడంతో, రుణ గ్రహీత అన్నీ తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలు కలుగుతుంది. అందుకే దీన్ని రుణదాతలు అందరికీ అందించాలంటూ ఆర్బీఐ ఆదేశాలు తీసుకొచ్చింది. ‘‘కేఎఫ్ఎస్ అంటే రుణానికి సంబంధించి అస్థిపంజరం వంటిది. రుణం తీసుకునే వ్యక్తి అన్ని కీళ్లను తెలుసుకోవాలి, వంపులు, కదలికలను తెలుసుకోవాలి’’అని సింఘానియా అండ్ కో పార్ట్నర్ రాజీవ్ శర్మ వివరించారు. డిజిటల్ రుణాలకు సంబంధించి కేఎఫ్ఎస్ మరింత కీలకం. ఎందుకంటే రుణ ప్రక్రియలో ఒకటికి మించిన పారీ్టలు భాగస్వాములై ఉంటాయి. ఏమి చూడాలి..? రుణ కాల వ్యవధి, రుణానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన మొత్తం (ఈఎంఐ) గురించి కేఎఫ్ఎస్లో స్పష్టంగా ఉంటుంది. రుణానికి అనుబంధంగా ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ కోరుతోందా? అన్నది కేఎఫ్ఎస్లో పరిశీలించుకోవాలని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. ముఖ్యంగా రుణానికి సంబంధించి చెబుతున్న వడ్డీ రేటు వార్షికమేనా? అన్నది చూడాలి. రుణం చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలు గురించి, అన్ని రకాల చార్జీల గురించి తెలుసుకోవాలి. రుణ గ్రహీత కోరితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కేఎఫ్ఎస్ కాపీ, రుణ డాక్యుమెంట్లను ఈమెయిల్‌కు పంపిస్తాయని పరిజిత్ గార్గ్ చెబుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రుణం తీసుకుంటున్నట్టు అయితే, రుణ వివరాల పేజీ నుంచే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని శర్మ సూచించారు. నెట్‌బ్యాంకింగ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆదిల్ శెట్టి తెలిపారు. పారదర్శకత కోసం.. ‘‘చారిత్రకంగా చూస్తే రుణ వ్యయాల విషయంలో పారదర్శకత ఉండేది కాదు. వడ్డీ రేటునే ప్రముఖంగా ప్రకటనల్లో పేర్కొనడం కనిపించేది. తక్కువ వడ్డీ రేటుకు వస్తుందని రుణం తీసుకున్న తర్వాతే.. వివిధ రకాల ఫీజుల భారం తెలిసొచ్చేది. పారదర్శకత లేకపోవడం వల్ల వారు వివిధ రుణ ఉత్పత్తులను పోల్చుకుని, వాస్తవ రుణ వ్యయాల గురించి అర్థం చేసుకోలేకపోయేవారు’’అని మై మనీమంత్ర ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు. అన్ని రకాల చార్జీల గురించి కేఎఫ్ఎస్లో పేర్కొనడం పారదర్శకత, వినియోగదారు అనుకూల రుణ వాతావరణానికి దారితీస్తుందన్నారు. ‘‘ఇప్పటికైతే రుణాలపై వడ్డీ రేటు, ఇతర ఫీజులు, చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ చార్జీలు తదితరమైనవి ఉండేవి. కేఎఫ్‌ఎస్‌ను అన్ని రకాల రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలకు విస్తరించాం. రుణాల పంపిణీలో పారదర్శకత పెంపు, కస్టమర్లు తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కలి్పస్తుంది’’అని ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. వడ్డీ రేటు వేరు, ఏపీఆర్ వేరు ఈ రెండింటి మధ్య ఉన్న బేధాన్ని రుణ గ్రహీతలు అర్థం చేసుకోవాలి. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్) అంటే అన్ని చార్జీలు కలిపినది. ఉదాహరణకు రూ.లక్ష రుణాన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) నుంచి 36 నెలల కాలానికి 18 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుందాం. అంటే నెలవారీ ఈఎంఐ రూ.1,500 అనుకుంటాం. కానీ కాదు. ఈ రుణం ఏపీఆర్ 20.16 శాతం అవుతుంది. అంటే చెల్లించాల్సిన ఈఎంఐ రూ.1,680 అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, ఆరంభంలో విధించే పలు చార్జీలు అన్నీ కలసి ఈ స్థాయికి చేరింది. రుణంపై నికర వడ్డీ రేటుకు అన్ని రకాల చార్జీలు కలిపి ఏపీఆర్ ఎంత అన్నది కేఎఫ్ఎస్లో పేర్కొనాలన్నది ఆర్బీఐ ఆదేశం. అయితే, రుణ వాయిదా ఆలస్యంగా చెల్లిస్తే విధించే ఆలస్యపు రుసుము, కంటింజెంట్ చార్జీలు ఇందులో భాగంగా ఉండవని బ్యాంక్ బజార్ ఆదిల్ శెట్టి తెలిపారు. ఈఎంఐ బౌన్స్ చార్జీలు, రుణాన్ని ముందస్తుగా చెల్లించేట్టు అయితే విధించే చార్జీలు కూడా ఏపీఆర్లో కలసి ఉండవు. ఇవి తెలుసుకున్న తర్వాతే.. ► చెల్లింపుల సామర్థ్యం: ఎంత రుణం కావాలన్న స్పష్టత ఒక్కటీ ఉంటే సరిపోదు. తీసుకునే ఆ రుణానికి నెలవారీ ఎంత మేర చెల్లించగలరు? అన్నది చాలా కీలకమైన అంశం అవుతుంది. దీని ఆధారంగానే కాల వ్యవధిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తక్కువ కాలవ్యవధిని ఎంపిక చేసుకుంటే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం ఎంపిక చేసుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. దీనివల్ల చెల్లించాల్సిన వడ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. బ్యాంకుల మధ్య వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తదితర చార్జీలను పోల్చుకున్న తర్వాతే ఏ బ్యాంక్ నుంచి తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే 0.5% వ్యత్యాసమున్నా 4–5 ఏళ్ల చెల్లింపుల్లో చెప్పుకోతగ్గంత తేడా వస్తుంది. తమ ఆదా యంలో అన్ని రుణాలకు చేసే చెల్లింపులు 40% మించకుండా చూసుకోవాలి. ► ఆదాయంలో అప్పుల రేషియో: బ్యాంక్‌లు రుణం ఇచ్చే ముందు రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు, ఆదాయంలో అప్పుల రేషియోని చూస్తాయి. ఆదాయంలో అప్పులకు చేసే చెల్లింపులు 43 శాతం మించి ఉంటే అప్పుడు చెల్లింపుల్లో రిస్క్ ఉన్నట్టు అవి భావించొచ్చు. దాంతో రుణ దరఖాస్తు తిరస్కరణ లేదంటే అధిక వడ్డీ రేటును విధించొచ్చు. ► క్రెడిట్ స్కోర్: 750 అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే దాన్ని ఉత్తమమైనదిగా పరిగణిస్తాయి బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు. అంతేకాదు రుణం సులభంగా, వేగంగా లభిస్తుంది. డిమాండ్ చేసి వడ్డీ రేటులో కొంత తగ్గింపు ప్రయోజనాన్ని సైతం పొందొచ్చు. ► ముందస్తు చెల్లింపులు: రుణాన్ని నిర్ణీత కాలానికి ముందే లేదంటే నెలవారీ వీలున్నప్పుడల్లా అదనపు చెల్లింపులు చేసుకుంటూ వెళితే త్వరగా తీరిపోతుంది. దీనివల్ల వడ్డీ రూపంలో చెప్పుకోతగ్గంత ఆదా చేసుకోవచ్చు. కాకపోతే చాలా సంస్థలు మందుస్తు రుణ చెల్లింపులపై 2–4 శాతం చార్జీ విధిస్తుంటాయి. ఈ తరహా చార్జీ అమలు చేయని సంస్థ నుంచి తీసుకోవడం అనుకూలం. మెరుగైన అవగాహన ‘‘కస్టమర్లలో అవగాహన పెంచేందుకు ఇదొక అవకాశం. రుణానికి సంబంధించి అన్ని ముఖ్యమైన వివరాలను తెలియజేయడం వల్ల రుణగ్రహీత అనుభవం మెరుగ్గా ఉంటుంది. ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలు మెరుగైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుంది’ ’అని గోద్రేజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాలు, డిజిటల్ రుణాలకే లోగడ కేఎఫ్ఎస్ తప్పనిసరి. ఇకపై అన్ని రిటైల్ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలకు ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘రుణాలపై అసలు వ్యయాలు ఎంత మేర ఉన్నాయనేది రుణ గ్రహీతలకు దీనివల్ల తెలుస్తుంది. చెప్పకుండా విధించే చార్జీలకు కళ్లెం వేస్తుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం రుణ గ్రహీతల్లో రుణ ఎకోసిస్టమ్ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది.’’అని ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ ‘వెలాసిటీ’ వ్యవస్థాపకుడు, సీఈవో అభిరూప్ మేధేకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేఎఫ్ఎస్ రిటైల్ రుణ గ్రహీతలకు మేలు చేస్తుంది. కార్పొరేట్ సంస్థలకు కేఎఫ్ఎస్తో ప్రత్యేకంగా అవసరం ఉండదు. ఎందుకంటే ఆయా సంస్థల వద్ద ఆర్థిక, న్యాయ నిపుణులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కనుక బ్యాంకుల ఒప్పంద పత్రాలను అవి సమగ్రంగా సమీక్షించుకోగలవు. కానీ, చిన్న సంస్థలు, వ్యక్తులకు ఇది కష్టమైన పనే అవుతుంది. వ్యక్తులు అయితే బ్యాంక్ మార్కెటింగ్ సిబ్బంది చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కేఎఫ్‌ఎస్‌ను వ్యక్తులు, ఎంఎఎస్‌ఎంఈ రుణాలకు ఆర్బీఐ తప్పనిసరి చేసింది. -
మారుతీ సుజుకీ డీలర్లకు బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తాజాగా యూనియన్ బ్యాంక్‌తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ డీలర్లకు యూనియన్ బ్యాంక్ రుణ సాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా 4,000 పైచిలుకు మారుతీ విక్రయ శాలల్లో వాహనాల నిల్వకు కావాల్సిన నిధుల సమీకరణ అవకాశాలను ఈ భాగస్వామ్యం మెరుగుపరుస్తుందని సంస్థ మంగళవారం ప్రకటించింది. డీలర్ నెట్‌వర్క్‌ను పెంపొందించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 2008 నుంచి మారుతీ సుజుకీ, యూనియన్ బ్యాంక్ మధ్య బంధం కొనసాగుతోంది. 3,00,000 పైచిలుకు కస్టమర్లకు యూనియన్ బ్యాంక్ వాహన రుణం సమకూర్చింది. -
రుణ గ్రహీతల పూర్వ ధ్రువీకరణకు పోర్టల్
న్యూఢిల్లీ: రుణాలు కోరుకునే వారికి సంబంధించి పూర్వపు ధ్రువీకరణ వివరాలతో ఒక పోర్టల్‌ను సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ) ప్రారంభించింది. రుణాల మంజూరు విషయంలో బ్యాంక్‌లు సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా కావాల్సిన సమాచారాన్ని ఇది అందిస్తుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. అతిపెద్ద బ్యాంక్ మోసాలకు సంబంధించి 2015 మే 13, 2019 నవంబర్ 6న ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల మేరకు.. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) రూ.50 కోట్లకు మించిన రుణాన్ని కొత్తగా మంజూరు చేసే ముందు, లేదా అప్పటికే ఎన్పీఏగా మారిన రుణ గ్రహీత విషయంలో సీఈఐబీ నుంచి నివేదిక కోరాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్బీఐ సహకారంతో సీఈఐబీ రూపొందించిన పోర్టల్ ఇప్పుడు బ్యాంక్‌ల పని సులభతరం చేయనుంది. పెద్ద రుణాలకు సంబంధించి సీఈఐబీ అనుమతిని ఈ పోర్టల్ ద్వారా బ్యాంక్‌లు పొందే అవకాశం ఏర్పడింది. -
తెలంగాణ స్టార్టప్‌ల అభివృద్ధికి జైకా.. ఏకంగా రూ.1336 కోట్లు
ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి రూ.1,336 కోట్లు (JPY 23679 మిలియన్స్) లోన్ అందించేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA), ఈ రోజు లోన్ అగ్రిమెంట్ మీద సంతకం సంతకం చేసింది. ఈ కార్యక్రమం కేవలం పట్టణ పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, ఔత్సాహిక వ్యాపార నాయకులకు కూడా మద్దతునిచ్చేలా వ్యూహాత్మకంగా రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ కోసం లోన్ అగ్రిమెంట్ మీద ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ & జైకా ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జైకా ఇండియా ఆఫీస్ చీఫ్ రిప్రజెంటేటివ్ 'సైటో మిత్సునోరి' మాట్లాడుతూ.. తెలంగాణలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం మా లక్ష్యం అంటూ.. ప్రపంచంలోనే ఓడీఏ లోన్ ద్వారా స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ అండ్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి JICA మద్దతిచ్చే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే అని ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ దేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో జపాన్ & భారతదేశం మధ్య బలమైన భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుందని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది. -
బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..త్వరలోనే ఆర్బీఐ కీలక నిర్ణయం?!
దేశంలో వెహికల్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ చెల్లింపు దారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పనుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన 19 లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన 35 మంది మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ గణనీయమైన వృద్ధి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే తదితర అంశాలపై మాట్లాడారు. దేశం ఆర్ధికంగా బలంగా ఉందని, పదేళ్ల సగటు ద్రవ్యోల్బణం దాదాపు 5 నుంచి 5.5 శాతం ఉందని చెప్పారు. కాబట్టే త్వరలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత వడ్డీ రేట్లు మళ్లీ 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి. కానీ ఇప్పుడు ద్రవ్యోల్భణం చాలా వరకు నియంత్రణలో ఉంది. త్వరలో వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో బ్యాంకుల నుంచి వసూలు చేస్తే వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించే అవకాశం ఉందని అన్నారు. అదే జరిగితే బ్యాంకుల నుంచి కస్టమర్ల తీసుకునే లోన్లపై విధించే వడ్డీ రేట్లు అదుపులోకి వస్తాయి. ఈఎంఐల భారం తగ్గుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే సెంట్రల్ బ్యాంక్ .. దేశంలో పలు బ్యాంకులకు లోన్లు ఇస్తుంటుంది. బ్యాంకులు తీసుకునే ఆ రుణాలపై ఆర్బీఐ కొంత మొత్తంలో వడ్డీని వసూలు చేస్తుంటుంది. అయితే, ఈ ఇంట్రస్ట్ రేటు ఎక్కువగా ఉంటే.. సదరు బ్యాంకుల్లో తీసుకునే కస్టమర్లకు తీసుకునే లోన్ పై చెల్లింపులు అధికంగా ఉంటాయి. అదే ఇంట్రస్ట్ రేటు తక్కువగా ఉంటే ఆయా లోన్లపై విధించే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటుంది. అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5 శాతం వడ్డీని విధించింది. ఆ మొత్తం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వడ్డీ చెల్లింపులు వడ్డీలను కొనసాగిస్తూ వస్తుంది. ఫలితంగా ఆయా బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై అధిక మొత్తంలో వడ్డీని వసూలు చేస్తున్నాయి. పియూష్ గోయల్ చెప్పినట్లు ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే ఈఎంఐల భారం తగ్గనుంది. -
AP: కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల్లో ఏపీ ఐదో స్థానం
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసీసీ) ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయ రంగానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటం, మద్దతు ధర కల్పిస్తుండటంతో రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు పంటలు సాగు చేస్తున్నారు. దీంతో కేసీసీ ద్వారా స్వల్పకాలిక రుణాలు తీసుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. ఈ రుణాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని నాబార్డు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నివేదికలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నట్లు నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 45.52 లక్షల రైతులకు ఈ కార్డులు మంజూరు చేశారు. ఈ రైతుల్లో చాలా మందికి కేసీపీ కవరేజ్ అయిందని ఎస్ఎల్బీసీ నివేదిక పేర్కొంది. పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య కార్యకలాపాల రైతులకు అవసరమైన వర్కింగ్ కేపిటల్ కోసం కేసీసీలను సంతృప్త స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎస్ఎల్బీసీ పేర్కొంది. ఈ రైతులకు కేసీసీల మంజూరుకు మార్చి నెలాఖరు వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ శిబిరాల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అక్కడికక్కడే పరిశీలిస్తారని తెలిపింది. అర్హులైన వారికి కేసీసీ జారీ చేస్తారంది. ఈ శిబిరాల ద్వారా ఇప్పటివరకు పశు సంవర్ధక, డైరీ కార్యకలాపాలకు కేసీసీ కోసం 82,366 ధరఖాస్తులు రాగా 68,948 దరఖాస్తులకు కేసీసీ మంజూరు చేశారు. మత్స్య కార్యకలాపాల కోసం 36,076 దరఖాస్తులు రాగా 22,856 మందికి కేసీసీ మంజూరు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పశుసంవర్ధక రంగంలో 95,445 ఖాతాలకు రూ.1079.26 కోట్లు, మత్స్య రంగంలో 5,112 ఖాతాలకు రూ.285.95 కోట్లు మంజూరు చేశారు. అయితే సంతృప్త స్థాయిలో కేసీసీల మంజూరుకు బ్యాంకులు మరింతగా దృష్టి సారించాలని ఎస్ఎల్బీసీ సూచించింది. -
రూ.6200 కోట్లు ఉద్యోగులకు దానం, చిన్న ఇంట్లో నివాసం, ఎవరీ బిజినెస్ టైకూన్
సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేయడం చాలామందికి అలవాటు. భారతదేశంలో చాలామంది వ్యాపారవేత్తలు కూడా తమ సంపదలో చాలా దాతృత్వానికి వినియోగిస్తారు. మరి కొంతమంది తమ కంపెనీ అభివృద్ధికి పనిచేసిన ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపిస్తారు. బోనస్‌లు, బహుమతులతో వారిని ఆనందింపజేస్తారు. కానీ తన సంపదనంతా ఉద్యోగులకు దానం చేసేసి అతి నిరాడంబరంగా జీవనాన్ని గడుపుతున్న ఒక బిజినెస్ టైకూన్ గురించి తెలుసా. ఆయనే ఆర్.త్యాగరాజన్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు పద్మభూషణ్ అందుకున్న ఆయన గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ సంగతులను ఈ కథనంలో తెలుసుకుందాం. సాయం చేయడం అంటే అపారమైన ఆనందం. అందుకే దాదాపు మొత్తం సంపదను రూ. 62,262 కోట్లు (750 మిలియన్ డాలర్లు) తన ఉద్యోగులకి పంచి ఇచ్చారు. సరసమైన ధరలకు రుణాలను అందించే లక్ష్యంతో శ్రీరామ్ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించారు త్యాగరాజన్. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న సాధారణ ప్రజలకు వెలుగు బాట చూపించారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లు, షేర్హోల్డర్లకు కూడా ఎనలేని సంతోషాన్ని మిగిల్చారు. త్యాగరాజన్ చెన్నైలో 1974లో శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించారు. 37 ఏళ్ళ వయసులో స్నేహితులు, బంధువులతో కలసి మొదలు పెట్టి, తక్కువ-ఆదాయ రుణగ్రహీతలకు డబ్బు ఇవ్వడం ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆర్. త్యాగరాజన్ 1937, ఆగస్టు 25వ తేదీన తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో జన్మించారు. గణితంలో గ్రాడ్యుయేషన్, కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1961సంవత్సరంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో చేరిన త్యాగరాజన్, దాదాపు 20 ఏళ్లు పలు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పనిచేశాడు. ఇక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. వడ్డీలు బాధలు, వివిధ రుణాల కోసం ఎదురు చూస్తున్న అల్పాదాయ వర్గాల ఇబ్బందులను చూసి చలించిపోయారు. దీనికి తోడు త్యాగరాజన్ నివసిస్తున్న చెన్నై చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు తమ జీవనోపాధికోసం ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు కొనుగోలు చేయడానికి నానా కష్టాలు పడడాన్ని ఆయన గమనించారు. అందుకే సులువుగా, తక్కువ వడ్డీతో రుణాలు అందించేలా శ్రీరామ్ చిట్‌ఫండ్ సంస్తను ఏర్పాటు చేశారు. శ్రీరామ్ చిట్ ఫండ్స్ ద్వారా పిల్లల పాఠశాల ఫీజులు కట్టడానికో, వ్యవదారులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికో, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు అందిస్తూ ఆదరణ పొందింది. బ్యాంకులు పైనాన్స్ కంపెనీలలో వడ్డీరేట్లు 30-35శాతం ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్ లో 17-18 శాతానికే రుణాలందించేది. అలా ప్రారంభమైన శ్రీరామ్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగి 30 కంటే ఎక్కువ కంపెనీలతో అలరారుతోంది. ( Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..! 2023 ఆగస్టు నాటికి కంపెనీ 108,000 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. 2006లో 85సంవత్సరాల త్యాగరాజన్ తన ఆస్తులను అన్నింటిని శ్రీరామ్ యాజమాన్య ట్రస్ట్ కుబదిలీ చేశారు. దీని విలువ రూ. 62వేల కోట్లకు పైమాటే. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ 2023 జూన్ త్రైమాసికంలో 200 మిలియన్ డాలర్లు. సెల్ ఫోనూ లేదు, ఖరీదైన కారూ లేదు శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకుంటూ 86 ఏళ్ల వయసులో చిన్న ఇంటిలో, రూ. 6 లక్షల విలువైన కారుతో అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు త్యాగరాజన్. అంతేకాదు ఆయన సెల్‌పోన్ కూడా వాడరు. తనకు ఆ అవసరమే లేదంటారు. పత్రికలు, సాహిత్యం, సంగీతం ఇదే ఆయన కాలక్షేపం. అలాగే కంపెనీ సీనియర్ మేనేజర్లతో ప్రతి 15రోజులకొకసారి మాట్లాడుతో సలహాలు, సూచనలు అందిస్తూ కంపెనీ అభివృద్దికి మార్గనిర్దేశనం చేస్తూ ఉంటారు. ‘‘లాభం అనేది ఒక కొలమానం మాత్రమే’’ లాభం ఎప్పటికీ అంతిమ లక్ష్యం కాదు. కస్టమర్‌దే తొలిస్థానం. లాభం అనేది మనం సమాజానికి ఎంత బాగా సేవ చేస్తున్నామో తెలుసుకునే ఒక మార్గం మాత్రమే. మంచి సేవ చేస్తే లాభంగా కూడా అలానే వస్తుంది అదే తన సక్సెస్ సీక్రెట్ అంటారాయాన.. బిజినెస్‌లో రిస్క్‌లు చాలా సాధారణం. వాటిని అర్థం చేసుకోవాలి తప్పితే భయ పడకూడదంటారు. -
రుణాలు ఎగ్గొట్టి మా వద్దకా?
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.వెయ్యి కోట్లు రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ) తనను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామకృష్ణంరాజునుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ విచక్షణాధికారాలను ఇలాంటి రుణ ఎగవేతదారులకోసం వినియోగించడానికి సిద్ధంగా లేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై మూడు వారాల్లో రివ్యూ కమిటీని ఆశ్రయించాలని, చట్టానికి అనుగుణంగా కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇ చ్చి న ఆదేశాల్లో తాము జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని పేర్కొంది. రూ.500 కోట్లు దారి మళ్లింపు తమిళనాడులోని టుటికోరిన్ జిల్లా సత్తాంకుళం తాలూకా సత్తావినల్లూరు, పల్లక్కురిచి గ్రామాల్లో 660 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఇందు భారత్ పవర్‌కు రూ.2,655 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ మంజూరు చేసింది. పనులు పరిశీలిస్తూ దశల వారీగా ఈ మొత్తాన్ని ఇస్తామని పేర్కొంది. 2014లో ఈమేరకు రూ.947.71 కోట్ల రుణాన్ని అందచేసింది. ఆ సమయంలో రఘురామకృష్ణంరాజు, ఆయన సతీమణి రమాదేవి ఇందు భారత్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఇందులో దాదాపు రూ.500 కోట్లను ఇందు భారత్ ఇతర కంపెనీల్లోకి మళ్లించినట్లు ఆర్ఈసీ గుర్తించింది. దీంతో తదుపరి విడుదల కావాల్సిన రుణాన్ని నిలిపివేసి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది. 2015 ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసింది. ఈ సర్క్యులర్ జారీ చేస్తే ఇతర ఏ బ్యాంకులూ రుణ ఎగవేతదారులకు ఎలాంటి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. అన్ని అవకాశాలు ఇచ్చాకే పిటిషనర్లకు సర్క్యులర్ తమను రుణ ఎగవేతదారులుగా గుర్తించి 2022 జూన్ 16న సర్క్యులర్ జారీ చేయడాన్ని, క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి అన్ని అవకాశాలు ఇ చ్చి న తర్వాతే ఆర్ఈసీ కమిటీ పిటిషనర్లకు సర్క్యులర్ జారీ చేసిందని స్పష్టం చేశారు. చట్టప్రకారమే ఆర్ఈసీ వ్యవహరించిందని, ఆ సర్యు్కలర్లో జోక్యం చేసుకునేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి పిటిషన్లను కొట్టి వేశారు. ఆర్ఈసీ రుణం మంజూరు చేసే నాటికి పిటిషనర్లు ఇద్దరూ డైరెక్టర్లుగా ఉన్నారన్న వాదనతో ఏకీభవించారు. సింగిల్ జడ్జి తీర్పుపై పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తీర్పునిచ్చారని, అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రివ్యూ కమిటీని ఆశ్రయించకుండా తమ వద్దకు రావడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. రివ్యూ కమిటీ చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి, డి.మధుసూదన్‌రెడ్డి అప్పీళ్లలో వాదనలను ముగించింది. -
డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్.. నిందితులకు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్), దాని మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, దీరజ్ వాధ్వాన్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని కన్షార్షియాన్ని రూ.34,615 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ మోసగించిందన్న అభియోగాలపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కపిల్, ధీరజ్లకు దిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంలో హైకోర్టు, ట్రయల్ కోర్టు ఇంకాస్త మెరుగ్గా స్పందించాల్సిందని సుప్రీంకోర్టు తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ లోన్ స్కామ్‌కు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఆర్పీసీ ప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువులోపు క్రిమినల్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంలో విఫలమైతే నిందితులకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 88వ రోజు సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, ట్రయల్ కోర్టు నిందితులకు కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాలుచేస్తూ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈతీర్పు వెలువడినట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే.. డీహెచ్ఎఫ్ఎల్ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్పై ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలంటూ కేపీఎమ్‌జీ సంస్థను 2019 ఫిబ్రవరి 1న బ్యాంకులు నియమించాయి. 2015 ఏప్రిల్ 1-2018 డిసెంబరు మధ్యకాలానికి, ఆ సంస్థ ఖాతా పుస్తకాలపై సమీక్ష నిర్వహించాలని కేపీఎమ్‌జీని అప్పట్లో కోరాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్అవుట్ సర్క్యులర్’లను బ్యాంకులు జారీ చేశాయి. కేపీఎమ్‌జీ నిర్వహించిన ఆడిట్లో.. రుణాలు, అడ్వాన్సులు పొందిన తర్వాత డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన సంస్థలు, వ్యక్తులు, డైరెక్టర్ల ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగిందని తేలినట్లు యూనియన్ బ్యాంకు పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు రూ.29,100 కోట్ల మేర పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో చాలా వరకు లావాదేవీలు భూములు, ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు బ్యాంకు ఖాతా పుస్తకాల పరిశీలనలో తేలినట్లు వివరించింది. రుణాలిచ్చిన నెలరోజుల్లోనే ఆ నిధులు సుధాకర్ షెట్టికి చెందిన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లినట్లు తేలింది. రూ.వందల కోట్ల చెల్లింపులకు సంబంధించిన వివరాలు బ్యాంకు స్టేట్మెంట్లలో కనిపించలేదు. రుణాల అసలు, వడ్డీలపై సహేతుకం కాని రీతిలో మారటోరియం కనిపించింది. పలు సందర్భాల్లో డీహెచ్ఎఫ్ఎల్, తన ప్రమోటర్లకు భారీ ఎత్తున నిధులను పంపిణీ చేసింది. వాటిని తమ ఖాతా పుస్తకాల్లో రిటైల్ రుణాలుగా పేర్కొన్నారు. రూ.14,000 కోట్ల గల్లంతు ప్రాజెక్ట్ ఫైనాన్స్ కింద రూ.14,000 కోట్లు ఇచ్చినట్లు చూపారు. ఇందు కోసం 1,81,664 మందికి రిటైల్ రుణాలు ఇచ్చినట్లు తప్పుగా సృష్టించారు. ఇవ్వని రుణాల విలువ రూ.14,095 కోట్లుగా తేలింది. తరుచుగా.. ‘బాంద్రా బుక్స్’ పేరిట రుణాలను పేర్కొంటూ, వాటికి విడిగా డేటాబేస్ నిర్వహించారు. ఆ తర్వాత వాటన్నింటినీ ‘అదర్ లార్జ్ ప్రాజెక్ట్ లోన్స్’(ఓఎల్‌పీఎల్)లో విలీనం చేశారు. కాగా, కంపెనీకి చెందిన గృహ రుణాలు, ప్రాజెక్టు రుణాల హామీలు, ప్రమోటర్ల వాటా అమ్మకం తదితరాల ద్వారా కంపెనీపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎప్పటికప్పుడు డీహెచ్ఎఫ్ఎల్, ఆ కంపెనీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు చెబుతూ వచ్చారు. ఇదీ చదవండి: సేవింగ్స్ ఖాతాలపై 7.75 శాతం వడ్డీ కావాలా..! 2019 మే నుంచి రుణాల చెల్లింపులు, వడ్డీలను డీహెచ్ఎఫ్ఎల్ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నిరర్థక ఆస్తులుగా కంపెనీ ఖాతాలను ప్రకటించారు. దాంతో బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. ఎఫ్ఐఆర్లో మాజీ ప్రమోటర్లతోపాటు అమిలిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ షెట్టి, మరో ఎనిమిది మంది బిల్డర్లు కూడా ఉన్నారు. -
రైతు రుణాలను రికవరీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాలను రికవరీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లు, ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల (ప్యాక్స్)ల్లో ఉన్న రుణాల మొండి బకాయిలు, వ్యవసాయేతర రుణాలను తీర్చని వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వారం రోజుల్లో రుణాలను తీర్చని రైతులపై, రు ణాలను రికవరీ చేయని అధికారులపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. డీసీసీబీ, ప్యాక్స్‌ల్లో పాత రుణాల బకాయిలపై గురువారం మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. రుణాలను నియమాల ప్రకారం ఆమోదించాలని ఆదేశించారు. నిజామాబాద్ పర్యటనలో రైతులు ఇచ్చిన వినతిపత్రాలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో ఆయన స్పందించారు.ప్యాక్స్‌లను బలోపేతం చేయండి: ప్యాక్స్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా తీసు కున్న రుణాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎండీని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్యాక్స్ లను బలోపేతం చేయాలని సూ చించిన ఆయన రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రామ స్థాయి వరకు చేర్చే ప్రణాళికను మార్క్‌ఫెడ్ అమలు చేయా లనీ, ఎరువుల కంపెనీలతో చర్చించాలని సూచించారు. రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన స్థాయిలోఎరువులు అందుబాటులో ఉ న్నందున రైతులు ఎటువంటి ఆందోళనకు గురికా వాల్సిన అవసరం లేదని తుమ్మల భరోసానిచ్చారు. తుమ్మల ఆదేశాలపై చర్చ కాగా, మంత్రి తుమ్మల రుణ వసూళ్ల ఆదేశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసా యేతర రుణ బకాయిలు పేరుకుపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలపై వ్యవసాయశాఖలోనూ చర్చకు తెరలేపింది. రైతులు బకాయిలపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డీసీసీబీ, టెస్కాబ్ వర్గాలు చెబుతున్నాయి. -
బ్యాంక్‌లోన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలంటే..
బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. అన్ని సందర్భాల్లోనూ రుణం దొరకండ అంత తేలికేమీ కాదు. కొందరికి ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం కష్టం అవుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకున్నప్పటికీ బ్యాంకులు రుణ దరఖాస్తును తిరస్కరిస్తోంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు రుణగ్రహీత ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. రుణ దరఖాస్తును తిరస్కరించేందుకు చాలా కారణాలుంటాయి. అంతకు ముందు తీసుకున్న రుణాల చెల్లింపు తీరు, ఆదాయాన్ని మించిన అప్పుల్లాంటివీ ఇందులో ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరించిన వెంటనే మళ్లీ కొత్తగా వేరే బ్యాంకులో దరఖాస్తు చేయకముందు చాలా విషయాలు సరిచేసుకోవాలి. మీ దరఖాస్తును బ్యాంకు ఎందుకు తిరస్కరించిందో కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రుణదాతలు కచ్చితంగా దీన్ని తెలియజేస్తారు. క్రెడిట్ స్కోరు 700 పాయింట్ల లోపు ఉన్నప్పుడు రుణ దరఖాస్తును ఆమోదించడం కష్టం. తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలు మీ ఆదాయంలో 50-60 శాతానికి చేరడం, వాయిదాలను ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగంలో సమస్యలు, తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి చట్టపరమైన చర్యల వంటి వాటివల్లా దరఖాస్తు తిరస్కరించే ఆస్కారం ఉంది. మీ క్రెడిట్ నివేదికలో తప్పుడు వివరాలూ కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. వాయిదాలు చెల్లింపులో.. రుణ తిరస్కరణ ఎదురుకాకుండా చూసుకునేందుకు ఆరోగ్యకరమైన రుణ చరిత్రను నిర్వహించడం ఎంతో కీలకం. వాయిదాలను సకాలంలో చెల్లించాలి. 750కి మించి క్రెడిట్ స్కోరున్నప్పుడు రుణ దరఖాస్తును సులభంగా ఆమోదిస్తారు. తక్కువ స్కోరు వల్లే రుణం లభించలేదు అని తేలితే.. ముందుగా స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. చిన్న మొత్తంలో ఉన్న అప్పులను పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు క్రమంగా పెరుగుతుంది. తప్పుడు వివరాలుంటే.. వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా, సంతకం, పాన్, ఆధార్ ఇలా పలు వివరాలను రుణ దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ రుణదాతల యాప్‌లోనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటిలో ఏ చిన్న పొరపాటు గుర్తించినా, రుణ దరఖాస్తు ఆమోదం పొందదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలు సరిచూసుకోవాలి. నిత్యం లోన్లు అడుగుతుంటే.. కొంతమంది అవసరం లేకపోయినా వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులను సంప్రదిస్తారు. ఇలా మీరు అడిగిన ప్రతిసారీ మీ క్రెడిట్ స్కోరు స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి, తక్కువ వ్యవధిలోనే బహుళ రుణ దరఖాస్తులు మీ క్రెడిట్ స్కోరును గణనీయంగా దెబ్బతీస్తాయి. మీ స్కోరును కాపాడుకునేందుకు సాధ్యమైనంత వరకూ తక్కువ దరఖాస్తులు చేయడం మేలు. అనేకసార్లు దరఖాస్తు చేస్తే.. మీరు అప్పుల మీదే ఆధారపడుతున్నారని బ్యాంకులు భావించే అవకాశం ఉంది. తనిఖీలు చేసుకోండి.. క్రెడిట్ నివేదికలో తప్పులు దొర్లినప్పుడు వాటిని వెంటనే గుర్తించేలా ఉండాలి. కాబట్టి, క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. కొన్ని క్రెడిట్ బ్యూరోలు నెలకోసారి వీటిని ఉచితంగానే అందిస్తాయి. మీ ఆర్థిక ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఏదైనా పొరపాట్లు ఉంటే, వెంటనే వాటిని గుర్తించి, సరి చేసుకునేందుకు వీలవుతుంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు, అది పెరిగేందుకు కొంత సమయం పడుతుంది. రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బాకీల్లాంటివి సకాలంలో చెల్లించాలి. అప్పుడు మీపై బ్యాంకులకు విశ్వాసం పెరిగి, రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలుంటాయి. -
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల జోరు.. వెహికల్ లోన్స్‌లో సరికొత్త రికార్డ్‌లు
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వాహన రుణ పుస్తకం గణనీయంగా పెరిగి 2025 మార్చి నాటికి రూ.8.1 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2023 మార్చి నాటికి ఇది రూ.5.9 లక్షల కోట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు, కార్లు, యుటిలిటీ వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు డిమాండ్‌కు తోడు.. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడాన్ని అనుకూలమైన అంశాలుగా పేర్కొంది. రుణ చెల్లింపులు మెరుగ్గా ఉండడంతో, ఆస్తుల నాణ్యత మరింత బలపడుతుందని తెలిపింది. 2023 నాటికి మొత్తం వాహన రుణాల్లో 50 శాతం వాణిజ్య వాహనాల కోసం తీసుకున్నవేనని పేర్కొంది. ఆ తర్వాత కార్లు, యుటిలిటీ వాహన రుణాలు 29 శాతం, ద్విచక్ర/త్రిచక్ర వాహన రుణాలు 11 శాతం, ట్రాక్టర్ల కోసం తీసుకున్న రుణాలు 10 శాతంగా ఉన్నాయి. ‘‘వాణిజ్య వాహనాల ఫైనాన్స్ ఏటా 12–14 శాతం చొప్పున 2023–25 మధ్య కాలంలో వృద్ధి చెందుతుంది. వాణిజ్య వాహనాలను వినియోగించే సిమెంట్, స్టీల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వినియోగం పెరగనుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. కొత్త వాహనాల ధరలు పెరగడంతో, యూజ్డ్ (అప్పటికే ఒకరు వాడిన) వాహన రుణాలకు డిమాండ్ పెరుగుతున్నట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తుల నాణ్యత మెరుగుపడడం వాహన రుణ సంస్థల పరపతికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. వాహన రుణాల మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన సంస్థల బ్యాలన్స్ షీట్లను పరిశీలించినప్పుడు, 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణాల శాతం 1.2 శాతం తగ్గి 4.7 శాతానికి పరిమితమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
రైతులపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: రైతులపై కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ కోసం రైతులు ప్రతి ఏడాది కరువు రావాలని కోరుకుంటున్నారని అన్నారు. బెళగావీలో జరిగిన ఓ కార్యక్రమంలో రుణ మాఫీల గురించి మాట్లాడారు. దీనిపై బీజేపీ మండిపడింది. "వ్యవసాయానికి కరెంట్, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ రుణ మాఫీ రద్దు కోసం రైతులు కరువు రావాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకోవడం ఏ మాత్రం సరికాదు." అని మంత్రి శివానంద పాటిల్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివానంద పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని దుయ్యబట్టింది. పాటిల్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. సీఎం సిద్ధరామయ్య మంత్రి వర్గం తెలివిలేనివాళ్లతో నిండిపోయిందని విమర్శించింది. ఇదీ చదవండి: 'నేమ్‌ప్లేట్‌పై కన్నడ తప్పనిసరి..' బెంగళూరులో భాషా వివాదం -
వరల్డ్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ లోన్.. కారణం ఇదే
న్యూఢిల్లీ: రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడం కోసం ప్రపంచ బ్యాంక్‌తో రూ.1,300 కోట్లకు పైగా లైన్ ఆఫ్ క్రెడిట్‌పై (ఎల్ఓసీ) సంతకం చేసినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం తెలిపింది. గృహ,ఇన్స్టిట్యూషనల్ విభాగాల్లో గ్రిడ్‌కు అనుసంధానించే రూఫ్‌టాప్ సోలార్ పీవీ ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇవ్వడం కోసం ఈ ఎల్ఓసీ అని ఎస్బీఐ శుక్రవారం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్ట్‌లకు రుణ సా యం అందించేందుకు యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌తో సుమారు రూ.1,800 కోట్ల ఎల్ఓసీపై ఎస్బీఐ ఈ వారం ప్రారంభంలో సంతకం చేసింది.ఎల్ఓసీ అనేది బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థ ద్వారా ప్రభుత్వం, కంపెనీ లేదా వ్యక్తిగత కస్టమర్‌కు ఇచ్చే రుణ సదుపాయం. -
పెరిగిన బ్యాంక్ లోన్స్.. ఆ రంగానికే ప్రాధాన్యం
ముంబై: ప్రైవేటు కార్పొరేట్ రంగానికి బ్యాంకుల రుణ వితరణ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 14.9 శాతం పెరిగినట్టు ఆర్బీఐ డేటా వెల్లడింంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ 14.7 శాతం వృద్ధి నమోదు కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ 11.5 శాతం చొప్పున వృద్ధి చెందడం గమనార్హం. బ్యాంకుల మొత్తం రుణాల్లో పరిశ్రమలకు ఇచ్చినవి 25 శాతంగా ఉన్నాయి. వార్షికంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 8.6 శాతం పెరిగాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాల వృద్ధి గత ఆరు త్రైమాసికాలుగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. బ్యాంక్ రుణాల్లో వ్యక్తిగత రుణాల వాటా ఐదేళ్ల క్రితం ఉన్న 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. మహిళా రుణ గ్రహీతల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లు రుణాల్లో ఎక్కువ వృద్ధిని చూపిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగిపోవడంతో, అధిక ఈల్డ్స్ వచ్చే డిపాజిట్లలోకి పెట్టుబడులు మళ్లుతున్నాయి. 6 శాతం వడ్డీలోపు డిపాజిట్లు 2022 మార్చి నాటికి 85.7 శాతంగా ఉంటే, 2023 మార్చి నాటికి 38.7 శాతానికి, సెప్టెంబర్ వరికి 16.7 శాతానికి తగ్గాయి. రేట్లు పెరగడంతో కరెంట్, సేవింగ్స్ డిపాజిట్ల కంటే టర్మ్ డిపాజిట్లలోకి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో బ్యాంక్‌ల మొత్తం డిపాజిట్లలో టర్మ్ డిపాజిట్ల వాటా ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 57 శాతం నుం సెప్టెంబర్ చివరికి 60 శాతానికి చేరింది. డిపాజిట్లను ఆకర్షించడంలోనూ ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లే ముందున్నాయి. మొత్తం టర్మ్ డిపాజిట్లలో 44 శాతం రూ.కోటికి పైన ఉన్నవే కావడం గమనార్హం. -
కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణాల పేరిట భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: కిసాన్ క్రెడిట్ కార్డ్(కేసీసీ)లపై చేపల చెరువుల నిర్మాణానికి రుణాలు ఇచ్చినట్టు లెక్కల్లో చూపి కోట్ల రూపాయలు దారిమళ్లించిన కేసు దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. సీబీఐ విశాఖపట్నం బ్రాంచ్ ఏసీబీ విభాగం నమోదు చేసిన ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 29న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు ఈడీ అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ సోదాలు ఏ ప్రాంతాల్లో చేశారన్న విషయాలు ఈడీ అధికారులు వెల్లడించలేదు. రాజమండ్రిలోని ఐడీబీఐ బ్యాంక్‌లో కిసాన్ క్రెడిట్కార్డులపై రుణాల పేరిట మొత్తం రూ. 311.05 కోట్లు దారిమళ్లించినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. నిందితులు వారి సంస్థలో పనిచేసే ఉద్యోగులు పలువురి నుంచి కేవైసీ డాక్యుమెంట్లు, బ్లాంక్ చెక్కులు, మరికొందరు రైతుల నుంచి వారికి సంబంధించినపత్రాలను సేకరించి వారి పేరిట రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును తర్వాత నిందితులు తమ కంపెనీల్లో పెట్టుబడులకు, కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఆస్తుల కొనుగోలుకు వాడినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో కొన్ని కీలకపత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. -
నకిలీ బంగారంతో రూ 2.71 కోట్లకు టోకరా
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని ఒక బ్యాంకు బ్రాంచిలో భారీ మోసం బయటపడింది. కొందరు వ్యక్తులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందినట్టు వెల్లడైంది. ఇందులో బ్యాంకు అప్రైజర్ ప్రమేయం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడకుండా కొందరు అధికారులు నిజమైన బంగారం తాకట్టు పెట్టిన వారికి వారు వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ కట్టాలని నోటీసులు పంపడం, ఆడిట్లో అసలు విషయాలు వెలుగుచూడటంతో మొత్తం గుట్టంతా రట్టయింది. మొత్తం 107 మంది నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు వెల్లడైంది. నిజమైన బంగారంతో రుణాలు పొందిన ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి ఎక్కువ మొత్తానికి ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశి్నంచినందుకు వారిని కూడా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్ ధికారులు, బ్యాంక్ అధికారులు గుంటూరు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నల్లపాడు సీఐ రాంబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు – అమరావతి రోడ్డు గోరంట్ల గ్రామంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆడిట్ నిర్వహిస్తుండగా వెండి వస్తువులకు బంగారు పూత పూసి బంగారు వస్తువులుగా చూపి పలువురు కోట్ల రూపాయలు రుణాలు పొందారని బ్యాంక్ ఇంటర్నల్ అధికారి అనిల్ డెకాబె, బ్యాంక్ రీజినల్ మేనేజర్ ధనరాజ్ ఫిర్యాదు చేశారు. 2021 జనవరి 29 నుంచి 2023 నవంబరు 16 వరకు ఆడిట్ నిర్వహించగా 107 ఖాతాలలో నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు గుర్తించారు. వీటిలో దాదాపు 100 ఖాతాలలో నకిలీ బంగారం పెట్టి రుణం పొందే సమయంలో రీ అప్రైజల్ కూడా నిర్వహించలేదని గుర్తించారు. ఈ విధంగా నకిలీ బంగారంతో రూ.2.71 కోట్లు బ్యాంకుకు టోకరా వేసినట్లు తేలిందన్నారు. లోన్ అప్లికేషన్స్, అప్రైజల్ తదితర పరిశీలనలు చేయకుండా రుణాలు ఇ చ్చి నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. నిజమైన బంగారంతో రుణాలు పొందిన పలువురు ఖాతాదారులకు వారు తీసుకున్న రుణం కంటే రెండు రెట్లకు నోటీసులు రావడంతో వారంతా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. -
ఎన్బీఎఫ్సీ వృద్ధి అంతంతే..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ)పై ప్రభావం చూపనుంది. కఠిన నిబంధనల వల్ల రుణాల మంజూరు నెమ్మదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీ రంగ వృద్ధి ఒక మోస్తరుగానే ఉండనుంది. 16–18 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల్లో వైవిధ్యం, రుణాల ప్రొఫైల్ వంటివి వృద్ధి వ్యూహాల్లో కీలకంగా ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన స్థూల, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు .. రిటైల్ రుణాల వృద్ధికి ఊతమివ్వగలవని వివరించింది. రిటైల్‌గా గృహాలు, వాహనాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై చేసే వ్యయాలు పటిష్టంగా ఉండటంతో ప్రైవేట్ వినియోగమనేది దీర్ఘకాలిక సగటుకు పైన కొనసాగుతోందని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ గుర్ప్రీత్ చత్వాల్ తెలిపారు. అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం అయినప్పటికీ హామీతో కూడుకున్న రుణాలపై ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (హెచ్ఎఫ్సీ) ప్రభావం ఉండదని తెలిపారు. పటిష్టమైన అమ్మకాల దన్నుతో వాహన రుణాల విభాగం ఈ ఆర్థిక సంవత్సరం 18–19 శాతం వృద్ధి చెందగలదని వివరించారు. వచ్చే ఏడాది గృహ రుణాలు 14 శాతం అప్.. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) ప్రస్తుతం గృహ, వాహన రుణాలకు చెరో 25–27 శాతం వాటా ఉన్నట్లు క్రిసిల్ తెలిపింది. ఈ రెండూ స్థిరంగా వృద్ధి చెందగలవని వివరించింది. అఫోర్డబుల్ గృహ రుణాలపై (రూ. 25 లక్షల కన్నా లోపు) హెచ్ఎఫ్సీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం హోమ్ లోన్ సెగ్మెంట్ 12–14 శాతం వృద్ధి చెందగలదని క్రిసిల్ తెలిపింది. వాహన రుణాల విభాగం 2024–25 మధ్యకాలంలో స్థిరంగా 17–18 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీ ఏయూఎంలో అసురక్షిత రుణాల సెగ్మెంట్ మూడో అతి పెద్ద విభాగంగా ఉంది. మరోవైపు, బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల నిధుల సమీకరణ వ్యయాలు 25–50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే, అవి ఎంత మేర బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉన్నాయనే అంశంపై వాటి ఆర్థిక పనితీరు మీద ప్రభావం ఉంటుందని వివరించింది. -
ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు!
ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న డబ్బు చాలా ప్రధానం. కావలసినంత జీతాలు రానప్పుడు ఈ చిన్న పని చేయాలన్నా.. బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకోవడం అలవాటైపోయింది. చాలామందికి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి వాటి గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో బ్యాంకులు అందించే వివిధ రకాల లోన్స్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ లోన్స్ - కస్టమర్ ఆదాయం, సిబిల్ స్కోర్, తిరిగి చెల్లించే కెపాసిటీ వంటి వాటిని బేస్ చేసుకుని బ్యాంకులు ఈ పర్సనల్ లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్లకు ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు లోన్ తీసుకునే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి. హోమ్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఇలాంటి లోన్స్ పొందవచ్చు. ఇలాంటి లోన్స్ మీద బ్యాంకులు వివిధ ఆఫర్స్ అందిస్తాయి, వడ్డీలో రాయితీలు కూడా లభిస్తాయి. హోమ్ రేనోవేషన్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉన్న ఇల్లుని రేనోవేషన్ చేసుకోవడానికే లేదా ఇంటీరియర్స్ డిజైన్స్ కోసం కూడా బ్యాంకులు లోన్స్ అందిస్తాయి. వెడ్డింగ్ లోన్స్ - బ్యాంకులు పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన లోన్స్ అందిస్తాయి. ఎందుకంటే పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకుంటారు, కొంత ఆడంబరంగా చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సమయంలో బ్యాంకులు అందించే వెడ్డింగ్ లోన్స్ చాలా ఉపయోగపడతాయి. శాలరీ అడ్వాన్స్ లోన్స్ - అడ్వాన్స్ శాలరీ లోన్ అనేది జీతం తీసుకునే వారికి బ్యాంకులు అందించే తాత్కాలిక లోన్స్, ఈ లోన్ వడ్డీ రేటుని నెలవారీ లేదా రోజువారీ ప్రాతిపదికన కూడా లెక్కిస్తారు. వడ్డీలు లోన్ ఇచ్చే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్స్ - ఎడ్యుకేషన్ లోన్ అనేది పోస్ట్-సెకండరీ ఏజికేషన్ లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చుల కోసం బ్యాంకులు అందించే లోన్స్. డిగ్రీ చదువుకునే సమయంలో ట్యూషన్, బుక్స్ ఇతర ఖర్చుల కోసం ఇలాంటి లోన్స్ పొందవచ్చు. మెడికల్ లోన్స్ - మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీరు పొందగలిగే ఈ లోన్ హాస్పిటల్ బిల్స్, ఆపరేషన్ ఖర్చులు, ప్రిస్క్రిప్షన్ బిల్లులు, కీమోథెరపీ ఖర్చులు వంటి ఏదైనా ఇతర వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగపడతాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్స్ - సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఇలాంటి లోన్స్ లభిస్తాయి. అంతే కాకుండా డాక్టర్, ఆర్కిటెక్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ వంటి వారు సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించడానికి బ్యాంకులు ఇలాంటి లోన్స్ అందిస్తాయి. గోల్డ్ పర్సనల్ లోన్స్ - మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే లోన్ ఇది. కొంత తక్కువ వడ్డీ రేటుతో ఈ లోన్స్ పొందవచ్చు. ట్రావెల్ లోన్స్ - చదువుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి కోసం మాత్రమే కాకుండా మీ ప్రాయానాలకు కూడా కావలసిన లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్స్ మీ ఫ్లైట్ చార్జెస్, వసతి ఖర్చులు వంటి వాటికి ఉపయోగపడతాయి. ఇలాంటి లోన్స్ మాత్రమే కాకుండా.. పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్ లోన్, సెక్యూర్డ్ పర్సనల్ లోన్, యూజ్డ్ కార్ లోన్, స్మాల్ పర్సనల్ లోన్ మొదలైనవి కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం లోన్ పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, కాబట్టి అలంటి మోసాలు భారీ నుంచి బయటపడటానికి.. మరిన్ని ఇతర లోన్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న బ్యాంకులను సందర్శించి తెలుసుకోవచ్చు. -
కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అ భ్యరి్థగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్.. సీఎం కేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చినట్టుగా తన అఫిడవిట్లో పేర్కొన్నా రు. అదేవిధంగా రామలింగారెడ్డికి రూ.10లక్షలు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.1.50కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. మొత్తంగా రూ.23.99 కోట్లను వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లుగా పేర్కొన్న వివేక్ ఆయనకు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో ఈ మాజీ ఎంపీ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో రూ.377కోట్లు ఉండగా, విశాఖ కంపెనీతో సహా పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు. రెండో స్థానంలో పొంగులేటి: ఆ తర్వాత పాలేరు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.460కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎ కేసీఆర్ తన అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తులు రూ.59కోట్లు ఉన్నట్లు, సొంత కారు కూడా లేదని పేర్కొనడం తెలిసిందే. అయితే తాను మాజీ ఎంపీ వివేక్‌కు రూ.1.06కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్‌కు మ«ధ్య లావాదేవీలు జరిగినట్లు, గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఈ డబ్బులు ఇచి్చనట్లు పార్టీ నాయకులు అనుకుంటున్నారు. చదవండి: తెలంగాణకు మోదీ గ్యారంటీలు -
పశువుల రీసైక్లింగ్‌కు ఆస్కారమే లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశువుల రీ సైక్లింగ్‌కు ఏమాత్రం ఆస్కారంలేదని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టంచేశారు. జగనన్న పాల వెల్లువ పథకం కింద వైఎస్సార్ చేయూత లబ్ధిదారులు చేసిన పశువుల కొనుగోళ్లలో ఎలాంటి కుంభకోణాలు జరగలేదని గురువారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ స్కీంపై అవగాహనలేకుండా కొన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రకటనలు ఇవ్వడం.. వాటి ఆధారంగా కొన్ని పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుని కనీసం క్రాస్‌చెక్ కూడా చేసుకోకుండా దుష్ప్రచారం చేయడం సరికాదని ఆయనన్నారు. చేయూత పథకం ద్వారా లబ్ధిపొందిన వారిలో ఎవరైతే పాడి పశువుల యూనిట్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారో, వారికి మాత్రమే పశువుల కొనుగోలు కోసం రుణాలు మంజూరు చేశారన్నారు. ఎస్ఎల్బీసీ సమావేశాల్లో ప్రభుత్వపరంగా చేసిన విజ్ఞప్తి మేరకు బ్యాంకర్లు ముందుకొచ్చి అర్హులైన ప్రతీ ఒక్కరికీ రుణాలు మంజూరు చేశారన్నారు. ఈ సమావేశాల్లో కానీ, మరెక్కడా కానీ పశువుల రీసైక్లింగ్ చేస్తున్నట్లుగా ఏ ఒక్కరూ ఆరోపించలేదని అమరేంద్రకుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రమేయమేమీలేదు.. ఇక లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారే తప్ప ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీలేదని స్పష్టంచేశారు. ఒక్కో యూనిట్ ఖరీదు రూ.75వేలు కాగా.. చేయూత పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన మొదటి విడత సొమ్ము రూ.18,750ను నేరుగా బ్యాంకు ఖాతాకు జమచేయగా, మిగిలిన 56,250ను బ్యాంకులు రుణాలుగా మంజూరు చేశాయన్నారు. ఈ మొత్తాన్ని తిరిగి వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇక ఏటా చేయూత పథకం కింద ప్రభుత్వం జమచేసే మొత్తాన్ని రుణవాయిదాల రూపంలో లబ్ధిదారులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పశువుల ఎంపిక, కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఇష్ట్రపకారమే రైతుల నుంచి రైతు పశువులను నేరుగా కొనుగోలు చేసుకున్నారని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సబ్సిడీ రూపంలోగానీ, గ్రాంట్ రూపంలోగానీ సబ్సిడీ విడుదల చేయలేనప్పుడు కుంభకోణాలు, స్కాంలు జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. పాడి పశువుల కొనుగోలు పూర్తిగా స్థానికంగానే జరుగుతున్నందున కొత్తగా పాడి సంపద పెరిగిన దాఖలాల్లేవన్నారు. ఇనాఫ్ ట్యాగ్స్‌తో రీసైక్లింగ్‌కు ఆస్కారంలేదు.. పథకంలో లబ్ధిదారులు కొనుగోలు చేసిన ప్రతీ పశువుకూ ఇనాఫ్ ట్యాగ్స్ ఉన్నాయని, అలాంటప్పుడు పాడి పశువుల రీసైక్లింగ్‌కు ఆస్కారం ఎక్కడ ఉంటుందని అమరేంద్రకుమార్ ప్రశ్నించారు. పథకంలో లబ్ధిదారులు పాడి పశువులను ఇతర రాష్ట్రాల నుంచికాకుండా, రాష్ట్ర పరిధిలోనే తమకు నచ్చిన పశువును నేరుగా రైతు నుండే కొనుగోలు చేశారన్నారు. కాబట్టి పాడి పశువుల సంఖ్యలోగానీ, పాడిలో కానీ ఎలాంటి వ్యత్యాసం కానీ, స్థూల పాల దిగుబడిలో ఎటువంటి పెరుగుదల ఉండదని స్పష్టంచేశారు. -
పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు. నిర్మాణాలపై సీఎస్ సమీక్ష ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం ముగిసిన దృష్ట్యా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో మరింత దృష్టి లబ్ధిదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ చెప్పారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ప్రత్యేక సూచనలు ఇచ్చారన్నారు. పావలా వడ్డీ రుణాలు మంజూరులో నాలుగైదు జిల్లాలు వెనుకబడగా.. ఆయా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినందున అదే స్ఫూర్తితో రెండో దశలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకోవాలని జైన్ పేర్కొన్నారు. -
జాలి చూపించి ఓటేస్తే! గెలిచిన తర్వాత అంతకంతకూ సంపాదించుకుంటారు జాగ్రత్త!!
జాలి చూపించి ఓటేస్తే! గెలిచిన తర్వాత అంతకంతకూ సంపాదించుకుంటారు జాగ్రత్త!! -
లోన్ల పేరుతో.. బ్యాంకులకు రోజుకు రూ.100 కోట్లు ఎగ్గొడుతున్నారు
దేశంలో కావాలనే బ్యాంకు రుణాలు ఎగవేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వెరసి ప్రతి రోజు ఉద్దేశ పూర్వకంగా (Wilful Defaulter) ఎగవేతకు పాల్పడుతున్న సొమ్ము రూ.100 కోట్లుగా ఉంది. గత నాలుగేండ్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.2 లక్షల కోట్ల మేరకు పేరుకుందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఎగవేత దారులు ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే విల్‌ఫుల్ డిఫాల్టర్లు బ్యాంక్‌లకు ఎగవేసిన మొత్తం..దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలో అధికంగా ఉంది. 2019 మార్చి నుంచి మహారాష్ట్రలోని ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల బకాయి మొత్తం రూ.60,000 కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు చేరింది. ఈ తరహా రుణాల్లో 70 శాతం మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడుల్లో పేరుకుపోయింది. గత నాలుగేండ్లలో ఢిల్లీలోనైనే ఉద్దేశపూర్వక ఎగవేత మొత్తం 200 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరగా, మిగిలిన రాష్ట్రాల్లో ఈ పెరుగుదల 95 శాతం మేర ఉన్నది. ఎగవేత దారులంటే? ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2019 మార్చి నుంచి ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంక్‌లకు బకాయిపడిన సొమ్ము 50 శాతంపైగా పెరిగి, 2023 జూన్ నాటికి మొత్తం బకాయిలు రూ.3 లక్షల కోట్లకు చేరాయి. కట్టగలిగే సామర్ధ్యం ఉండి తీసుకున్న లోన్లను 6 నెలలు లోపు చెల్లించని వారిని ఉద్దేశ పూర్వకంగా ఎగవేత దారులకు ప్రకటించాలని ఇటీవల ఆర్బీఐ ప్రతిపాదన తెచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో అధికం మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (Wilful defaulters) జాబితాలో 1,921 ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లు ఉండగా.. ఆ అకౌంట్ల నుంచి తీసుకున్న మొత్తం రుణాల విలువ రూ.79,271 కోట్లు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ 11,935 అకౌంట్లు ఉండగా రుణాలు మొత్తం రూ. 193,596 కోట్లు, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లు 2,332 ఉండగా.. రుణాలు రూ. 54,250 కోట్లు, 2,231 పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లు ఉండగా ఆ రుణాల మొత్తం విలువ రూ.41,353 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు చెందిన 1,831 అకౌంట్లు ఉండగా వాటి మొత్తం విలువ రూ.35,623 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.22,754 కోట్లు తీసుకోగా అకౌంట్లు 340 ఉన్నాయి. ఐడీబీఐకి చెందిన 340 బ్యాంక్ అకౌంట్లు ఉండగా 24,192 కోట్లు ఉన్నాయి. మార్చి 2023 సమయానికి 36,150 ఎన్పీఏ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.9.24లక్షల కోట్లు వసూలు చేసింది. -
‘పట్టణ మహిళల ప్రగతి’కి తోడ్పాటు
సాక్షి, అమరావతి: ఆర్థికంగా కాస్త ఆసరా ఇచ్చి అండగా నిలిస్తే మహిళలు అద్భుతాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా నమ్మిన వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగడుగునా వారిని ప్రోత్సహిస్తూనే ఉంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దిశగా సహకరిస్తోంది. జగనన్న మహిళామార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు విజయవంతం కావడంతో పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల కోసం పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) మరో ముందడుగు వేసింది. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఆసక్తి ఉన్న రంగాల్లో, పర్యావరణ హితమైన సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు కార్యాచరణ చేపట్టింది. ఈ అంశంపై గత నెలలో పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశా«దికారులతో మెప్మా మిషన్ డైరెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇందులో దాదాపు 165 సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదించారు. ఒక్కో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున రూ.2.50 లక్షల సాయం అందించాలని నిర్ణయించారు. యూనిట్ల ఏర్పాటు, నిర్వహణపై ఆయా రంగాల నిపుణులతో వచ్చే నెలలో మహిళలకు శిక్షణ ఇస్తారు. గత నాలుగున్నరేళ్లుగా మెప్మా పట్టణ పొదుపు సంఘాల మహిళలను వ్యాపార యూనిట్ల ఏర్పాటు దిశగా ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు 11 మహిళా మార్టులు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో 140కి పైగా ఆహా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా అర్బన్ మార్కెట్లు సైతం ఏర్పాటు చేసి, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నారు. ఇవన్నీ విజయవంతం కావడంతో మెప్మా పర్యావరణ హిత సూక్ష్మ పరిశ్రమలను పట్టణ మహిళా ప్రగతి యూనిట్ల పేరిట ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 32 రకాల యూనిట్ల ఏర్పాటుకు మహిళల ఆసక్తి మహిళల ఆధ్వర్యంలో స్థాపించే సూక్ష్మ పరిశ్రమలకు అవసరమైన మూలధనం సేకరణ, పరిశ్రమ స్థాపన, నిర్వహణ, మార్కెటింగ్ వంటి అంశాలపై వచ్చే నెలలో నిపుణులతో శిక్షణనివ్వాలని మెప్మా నిర్ణయించింది. రాష్ట్రంలోని 120 యూఎల్బీల నుంచి 32 రకాల యూనిట్ల ఏర్పాటుకు మహిళలు ఆసక్తి చూపారు. ఇలా వచ్చిన ఆసక్తుల్లో మొత్తం 165 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇద్దరు సభ్యుల నుంచి 35 మంది సభ్యుల వరకు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో వాడిపోయిన పూల నుంచి అగర్బత్తీల తయారీ, పేపర్ కప్పులు, ప్లేట్లు తయారీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ, జ్యూట్ బ్యాగ్‌ల మేకింగ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, అరటినార ఉత్పత్తులు, మిల్లెట్స్‌తో నూడుల్స్ తయారీ, డ్రై వెజిటబుల్ ఫ్లేక్స్ తయారీ వంటివి ఉన్నాయి. అద్దె భారం లేకుండా చర్యలు మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా మెప్మా కృషి చేస్తోంది. సాధారణంగా పట్టణాల్లో చిన్న వ్యాపారం పెట్టాలన్నా గదుల అద్దె అధికంగా ఉంటుంది. మెప్మా ఏర్పాటు చేసే మహిళా ప్రగతి యూనిట్లను మున్సిపల్ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనివల్ల భవనాల అద్దె భారం, అడ్వాన్స్ చెల్లింపులు పెద్దగా ఉండవు. ఇది మహిళలకు ఊరటనిస్తుంది. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.2.50 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్!
దేశంలో రోజువారి లెక్కన సరకులు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించే వీధి వ్యాపారులకు లోన్లు కావాలంటే బ్యాంకులు, లేదంటే ఇతర ఫైనాన్స్ కంపెనీలు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వ్యాపారస్తుల్ని గట్టెక్కించేలా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన యూపీఐ పేమెంట్స్ ఫ్లాట్‌ఫారమ్ గూగుల్ పే ద్వారా వారికి రుణాలు అందించేందుకు సిద్ధమైంది. భారత్‌లో గూగుల్ 9వ ఎడిషన్ ‘గూగుల్ ఫర్ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజం వినియోగదారుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది వివరించడంతో పాలు పలు ప్రొడక్ట్‌లు విడుదల, భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తుంది. చిరు వ్యాపారులకు శుభవార్త సెప్టెంబర్ 19 ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఈవెంట్లో చిరు వ్యాపారులకు గూగుల్ శుభవార్త చెప్పింది. భారత్‌లోని చిరు వ్యాపారులకు చేయూతనందించేలా తన యూపీఐ పేమెంట్ ఫ్లాట్‌ఫారమ్ ‘గూగుల్ పే’ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటికే గూగుల్ పే ద్వారా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. Our experience with merchants has taught us that they often need smaller loans and simpler repayment options. To meet this need, sachet loans on Google Pay with @DMIFinance will provide flexibility and convenience to SMBs, with loans starting at just 15,000 rupees and can be… pic.twitter.com/SehpcQomCA — Google India (@GoogleIndia) October 19, 2023 రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు రుణాలు చిన్న మొత్తంలో రుణాలు అందించేలా గూగుల్.. డీఎంఐ ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. దీంతో వ్యాపారులు గూగుల్ యూపీఐ నుంచి రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు లోన్లు అందిస్తుంది. వాటిని తిరిగి 7 నెలల నుంచి 12 వ్యవధిలోపు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ఈఎంఐ రూ.111 అంతేకాదు, వ్యాపార నిమిత్తం అవసరమే నిధుల అవసరాల్ని తీర్చేలా క్రెడిట్లైన్ (credit line) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పద్దతిలో అతి తక్కువ రూ.15,000 తీసుకుంటే నెల ప్రారంభ ఈఎంఐ రూ.111 చెల్లించాలి. వ్యక్తిగత రుణాలు చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్‌తో, యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్స్ రుణాలు కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో జతకట్టింది. చిరు వ్యాపారులకోసం ఏఐ సాయం భారత్‌లోని చిరు వ్యాపారుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. ఏఐ సాయంతో గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్(Google Merchant Center Next)లో వ్యాపారుల ప్రొడక్ట్‌ల వివరాల గురించి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందించనుంది. అయితే, ఉత్పత్తుల గురించి ఎలాంటి సమాచారాన్ని గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్‌లో ఇవ్వాలనే అంశం వ్యాపారుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. 100కి పైగా ప్రభుత్వ పథకాల సమాచారం త్వరలో, భారత్‌లోని వినియోగదారులకు 100కి పైగా ప్రభుత్వ పథకాల గురించి పూర్తి స్థాయిలో సమాచారాన్నిఅందించేలా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా గూగుల్ భవిష్యత్ కార్యచరణను ప్రకటించింది. రూ.12,000 కోట్ల విలువైన మోసాలకు చెక్ గూగుల్‌లో పేలో రూ.12,000 కోట్ల విలువైన ఆర్ధిక మోసాలకు చెక్ పెట్టిన గూగుల్.. అందుకు సాయం చేసే 3,500 లోన్ యాప్‌లను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంది. -
92 శాతం కౌలురైతులకు సీసీఆర్సీలు
సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్ చార్జ్ క్రియేష్ మాడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్‌తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
నేతన్నకు నగదు పరపతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తంతోపాటు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం నగదు పరపతి కూడా సమకూరుస్తోంది. మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలు, మార్కెటింగ్‌కు అనేక రూపాల్లో ఊతమిస్తోంది. చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా వరుసగా ఐదు విడతల్లో నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించిన సంగతి తెలిసిందే. సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఐదు విడతల్లో రూ.1.20 లక్షలు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కార్మికులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇచ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు సాయం వంటి మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లను వెచ్చించింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇవి కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు సైతం అందిస్తోంది. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం ప్రాథమిక చేనేతకారుల సహకార సంఘా(పీహెచ్డబ్ల్యూపీఎస్)లకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. రాష్ట్రంలో 681 చేనేత సొసైటీలకు రూ.209.29 కోట్లు నగదు పరపతి (రుణాలు) అందించింది.