ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు! | Different Types Of Bank Loans In India | Sakshi
Sakshi News home page

Bank Loans: ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు!

Published Sun, Nov 19 2023 7:35 PM | Last Updated on Sun, Nov 19 2023 7:40 PM

Different Types Of Bank Loans In India - Sakshi

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న డబ్బు చాలా ప్రధానం. కావలసినంత జీతాలు రానప్పుడు ఈ చిన్న పని చేయాలన్నా.. బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకోవడం అలవాటైపోయింది. చాలామందికి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి వాటి గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో బ్యాంకులు అందించే వివిధ రకాల లోన్స్ గురించి తెలుసుకుందాం. 

పర్సనల్ లోన్స్ - కస్టమర్ ఆదాయం, సిబిల్ స్కోర్, తిరిగి చెల్లించే కెపాసిటీ వంటి వాటిని బేస్ చేసుకుని బ్యాంకులు ఈ పర్సనల్ లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్లకు ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు లోన్ తీసుకునే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి.

హోమ్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఇలాంటి లోన్స్ పొందవచ్చు. ఇలాంటి లోన్స్ మీద బ్యాంకులు వివిధ ఆఫర్స్ అందిస్తాయి, వడ్డీలో రాయితీలు కూడా లభిస్తాయి.

హోమ్ రేనోవేషన్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉన్న ఇల్లుని రేనోవేషన్ చేసుకోవడానికే లేదా ఇంటీరియర్స్ డిజైన్స్ కోసం కూడా బ్యాంకులు లోన్స్ అందిస్తాయి.

వెడ్డింగ్ లోన్స్ - బ్యాంకులు పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన లోన్స్ అందిస్తాయి. ఎందుకంటే పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకుంటారు, కొంత ఆడంబరంగా చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సమయంలో బ్యాంకులు అందించే వెడ్డింగ్ లోన్స్ చాలా ఉపయోగపడతాయి.

శాలరీ అడ్వాన్స్ లోన్స్ - అడ్వాన్స్ శాలరీ లోన్‌ అనేది జీతం తీసుకునే వారికి బ్యాంకులు అందించే తాత్కాలిక లోన్స్, ఈ లోన్ వడ్డీ రేటుని నెలవారీ లేదా రోజువారీ ప్రాతిపదికన కూడా లెక్కిస్తారు. వడ్డీలు లోన్ ఇచ్చే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి.

ఎడ్యుకేషన్ లోన్స్ - ఎడ్యుకేషన్ లోన్ అనేది పోస్ట్-సెకండరీ ఏజికేషన్ లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చుల కోసం బ్యాంకులు అందించే లోన్స్. డిగ్రీ చదువుకునే సమయంలో ట్యూషన్, బుక్స్ ఇతర ఖర్చుల కోసం ఇలాంటి లోన్స్ పొందవచ్చు.

మెడికల్ లోన్స్ - మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీరు పొందగలిగే ఈ లోన్ హాస్పిటల్ బిల్స్, ఆపరేషన్ ఖర్చులు, ప్రిస్క్రిప్షన్ బిల్లులు, కీమోథెరపీ ఖర్చులు వంటి ఏదైనా ఇతర వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగపడతాయి.

సెల్ఫ్‌ ఎంప్లాయిడ్ లోన్స్ - సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఇలాంటి లోన్స్ లభిస్తాయి. అంతే కాకుండా డాక్టర్, ఆర్కిటెక్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ వంటి వారు సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించడానికి బ్యాంకులు ఇలాంటి లోన్స్ అందిస్తాయి.

గోల్డ్ పర్సనల్ లోన్స్ - మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే లోన్ ఇది. కొంత తక్కువ వడ్డీ రేటుతో ఈ లోన్స్ పొందవచ్చు.

ట్రావెల్ లోన్స్ - చదువుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి కోసం మాత్రమే కాకుండా మీ ప్రాయానాలకు కూడా కావలసిన లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్స్ మీ ఫ్లైట్ చార్జెస్, వసతి ఖర్చులు వంటి వాటికి ఉపయోగపడతాయి.

ఇలాంటి లోన్స్ మాత్రమే కాకుండా.. పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్ లోన్, సెక్యూర్డ్ పర్సనల్ లోన్, యూజ్డ్ కార్ లోన్, స్మాల్ పర్సనల్ లోన్ మొదలైనవి కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం లోన్ పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, కాబట్టి అలంటి మోసాలు భారీ నుంచి బయటపడటానికి.. మరిన్ని ఇతర లోన్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న బ్యాంకులను సందర్శించి తెలుసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement