తెలుగు రాష్ట్రాల్లో క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ (సీఎస్‌బీ) తెలుగు రాష్ట్రాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) రుణాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగం కోసం రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆరు శాఖలను నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎంఈ, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ శ్యామ్ మణి తెలి పారు.
ఎస్‌ఎంఈలకు రుణాల అవకాశాలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పా ల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. టర్బో, శుభమంగళ్ వంటి ఉత్పత్తులతో చిన్న సంస్థలకు సత్వరం రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు.
సెప్టెంబర్ ఆఖరు నాటికి బ్యాంకు మొత్తం రుణాల్లో ఎస్‌ఎంఈ పోర్ట్‌ఫోలియో సుమారు 13%గా, దాదాపు రూ. 3,400 కోట్ల స్థాయిలో ఉందని శ్యామ్ తెలిపారు. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 12 శాతమని, ఇది సుమారు 28% వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎస్‌ఎంఈ రుణాల విషయంలో హైదరాబాద్‌లో ఫార్మా బల్క్ డ్రగ్స్ విభాగంపై, ఆంధ్రప్రదేశ్‌లో తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలపైనా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లు శ్యామ్ చెప్పారు. దేశీ ఫార్మా మార్కెట్ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లు కాగా.. హైదరాబాద్ వాటా సుమారు రూ. 44,000 కోట్లుగా ఉందని చెప్పారు. ఇందులో ఎస్‌ఎంఈల వాటా దాదాపు రూ.15,000 కోట్లుగా అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment