Catholic Syrian Bank
-
సీఎస్బీ బ్యాంక్ లిస్టింగ్.. భేష్
న్యూఢిల్లీ: సీఎస్బీ బ్యాంక్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లోనూ, ముగింపులోనూ మెరుపులు మెరిపించాయి. ఇష్యూ ధర రూ.195తో పోల్చితే లిస్టింగ్‌లో 41 శాతం లాభాన్ని, ముగింపులో 54 శాతం లాభాన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. రూ.193–195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ బ్యాంక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 87 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. బుధవారం సీఎస్బీ బ్యాంక్ షేర్లు బీఎస్ఈలో ఇష్యూ ధర, రూ.195తో పోల్చితే 41 శాతం లాభంతో రూ. 275 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 57 శాతం లాభంతో రూ. 307 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 54 శాతం లాభంతో రూ.300 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 40.2 లక్షలు, ఎన్ఎస్ఈలో 3.7 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్‌రూ.5,205 కోట్లకు చేరింది. ఈ ఐపీఓ ద్వారా ఈ బ్యాంక్ రూ.410 కోట్లు సమీకరించింది. -
సీఎస్బీ బ్యాంక్ ఐపీఓ... అదరహో !
న్యూఢిల్లీ: సీఎస్బీ బ్యాంక్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ)కు అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 22న మొదలై మంగళవారం ముగిసిన ఈ ఐపీఓ 87 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.193–195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ సైజు రూ.410 కోట్లు. ఈ ఐపీఓలో భాగంగా మొత్తం 2.10 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. మొత్తం వంద కోట్ల షేర్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల(క్విబ్)లకు కేటాయించిన వాటా 62 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల(ఎన్ఐఐ) వాటా 165 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 44 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ప్రస్తుతం సీఎస్బీ బ్యాంక్ షేర్‌కు గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) రూ.75–100 రేంజ్లో ఉందని, ఈ రేంజ్ లాభాలతోనే(కనీసం) ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లిస్టింగ్ తేదీ డిసెంబర్ 4. యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.184 కోట్లు ఈ ఐపీఓలో భాగంగా రూ.24 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో 1.97 కోట్ల ఈక్విటీ షేర్లను బ్యాంక్‌లో ఇప్పటికే వాటా ఉన్న కొన్ని కంపెనీలు విక్రయించాయి. కాగా గత గురువారం నాడు సీఎస్బీ బ్యాంక్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.184 కోట్లు సమీకరించింది. -
23 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ సహా 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సారథ్యంలో సోమవారం సమావేశమైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) 47 ప్రతిపాదనలను పరిశీలించింది. గ్రీన్‌సిగ్నల్ లభించిన వాటిలో మైలాన్ ల్యాబరేటరీస్, జీఎస్కే ఫార్మా, డెన్ నెట్వర్క్స్ మొదలైనవి ఉన్నాయి. మరోవైపు రిలయన్స్ గ్లోబల్‌కామ్, సిస్టెమా శ్యామ్ టెలీ ప్రతిపాదనలపై నిర్ణయాలను ఎఫ్ఐపీబీ వాయిదా వేసింది. 2013-14లో 24.29 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా .. 2014-15లో 27% పెరిగి 30.93 బిలియన్ డాలర్లకు చేరాయి.