small and medium enterprises
-
లఘు, చిన్న పరిశ్రమలకు కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటీఎంఎస్ఈ) ద్వారా ఇచ్చే క్రెడిట్ గ్యారెంటీలను వచ్చే రెండేళ్లలో మరో రూ. 5 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అదనపు కార్యదర్శి, డెవెలప్మెంట్ కమిషనర్ (లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు) రజ్నీష్ ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, 22 సంవత్సరాల్లో క్రెడిట్ గ్యారెంటీలు రూ.2.6 లక్షల కోట్లు. అయితే గడచిన రెండేళ్లలో ఈ విలువ రూ. 4 లక్షల కోట్లకు పెరిగింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.5 లక్షల కోట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యమని ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. లఘు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంస్థాగత రుణలను భారీగా అందించడానికి క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌ను సంబంధిత మంత్రిత్వశాఖ అలాగే సిడ్బీ (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. -
అమెజాన్‌తో వాణిజ్య శాఖ ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా 20 జిల్లాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) శిక్షణ కలి్పంచే దిశగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇమేజింగ్, డిజిటల్ క్యాటలాగ్‌లను రూపొందించడం, పన్నుల సంబంధమైన అంశాలను తెలుసుకోవడం మొదలైన వాటికి ఈ శిక్షణ ఉపయోగపడగలదని పేర్కొంది. ఎగుమతుల హబ్‌లుగా గుర్తించిన జిల్లాల్లో అమెజాన్, డీజీఎఫ్టీ కలిసి శిక్షణ, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాల కోసం ఫ్లిప్‌కార్ట్, ఈబే, రివెక్సా, షిప్‌రాకెట్, షాప్‌క్లూస్ వంటి వివిధ ఈ–కామర్స్ సంస్థలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) చర్చలు జరుపుతున్నట్లు వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశీ సంస్థలు అంతర్జాతీయంగా మరిన్ని ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి. 2030 నాటికి ఈ–కామర్స్ ద్వారా 350 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకోవాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇవి 2 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ఎగుమతులను సరళతరం చేయడం, 2025 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులను 20 బిలియన్ డాలర్లకు చేర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వాకంకర్ తెలిపారు. -
మార్కెట్ల ప్రవేశం, కస్టమర్లను కాపాడుకోవడమే కీలకం
న్యూఢిల్లీ: మార్కెట్లలోకి ప్రవేశించలేకపోవడం, కస్టమర్లను కాపాడుకోవడం, తమ ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేసుకోలేకపోవడం వంటి ప్రధాన సవాళ్లను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) ఎదుర్కొంటున్నాయి. మార్కెటింగ్‌కు సంబంధించి సవాళ్లు వాటి వృద్ధికి అవరోధంగా ఉంటున్నాయి. ఈ వివరాలను ‘కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్’(ఐసీఆర్ఐఈఆర్) సర్వే తెలిపింది. 2022 నవంబర్ 4 నుంచి 2023 జనవరి 20 మధ్య కాలంలో 2,007 ఎంఎస్ఎంఈల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకుంది. ఇందులో 65 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. 19 శాతం చిన్నవి కాగా, 16 శాతం మధ్య స్థాయి సంస్థలు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను విక్రయ మార్గాలుగా ఎంపిక చేసుకుంటున్న ఎంఎస్ఎంఈలు ప్రధానంగా యువ, విద్యావంతులైన వారి నిర్వహణలో ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. ఇతర ఎంఎస్ఎంఈలతో పోలిస్తే, ఎగుమతి ఆధారిత ఎంఎస్ఎంఈలలో అధిక శాతం ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమై ఉన్నాయి. ఎగుమతుల పట్ల అవగాహన కలిగిన సంస్థలు, ఈ కామర్స్ సేవల వినియోగానికి అనుకూలంగా ఉన్నట్టు ఇది తెలియజేస్తోంది. సమీకృత ఎంఎస్ఎంఈలు పనితీరు, టర్నోవర్, లాభదాయకత, ఉద్యోగ ప్రయోజనాల విషయంలో మెరుగ్గా ఉన్నట్టు ఐసీఆర్ఐఈఆర్ నివేదిక తెలిపింది. సదుపాయాల కొరత, రుణ సాయం లభించకపోవడం, నిపుణులైన కార్మిక శక్తి, ఆలస్యపు చెల్లింపులు ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ఇతర ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఈ కామర్స్‌తో అవకాశాల విస్తరణ.. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 1,005 ఇప్పటికే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమయ్యాయి. మిగిలిన 1,002 ఈ కామర్స్‌పై నమోదు కానివి. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం కావడం వల్ల కేవలం మార్కెట్ విస్తరణ అవకాశాలు పెరగడమే కాకుండా, రుణ సదుపాయానికి అవకాశం ఉంటుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. సమ్మిళిత వృద్ధికి ఎంఎస్ఎంఈలు కీలకమని పేర్కొంటూ.. అవి డిజిటల్‌గా పరివర్తనం చెందడం ఎంతో అవసరమని ఈ సర్వే ప్రస్తావించింది. ఈ కామర్స్ వేదికల ద్వారా మరిన్ని భౌగోళిక ప్రాంతాలకు విస్తరించే అవకాశాల పట్ల ఎంఎస్ఎంఈల్లో అవగాహన ఉన్నట్టు పేర్కొంది. ఎంఎస్ఎంఈలు టెక్నాలజీ సాయంతో మార్కెట్ అనుసంధానాన్ని పెంచుకునేందుకు, వాటికి ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు అవసరాన్ని ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర రుణ హామీ పథకం తదితర ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా, వాటి మధ్య స్థిరీకరణ అవసరమని ఎంఎస్ఎంఈలు అభిప్రాయపడ్డాయి. విధానపరమైన అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అసవరాన్ని కూడా ప్రస్తావించాయి. సమగ్ర ఎంఎస్ఎంఈ విధానం ఉండాలని, ఒకే వేదికగా అన్ని ప్రయోజనాలు పొందేలా అవకాశం కలి్పంచాలని పేర్కొన్నాయి. ఈ ప్రయోజనాల పట్ల ఎంఎస్ఎంఈల్లో అవగాహన కలి్పంచాలని కూడా అభిప్రాయపడ్డాయి. -
Union Budget 2023-24: ఎంఎస్ఎంఈలకు చేయూత..
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చే దిశగా రుణ హామీ పథకాన్ని కేంద్రం మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది. ఇందుకోసం రూ. 9,000 కోట్లు కేటాయించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అదనంగా రూ. 2 లక్షల కోట్ల తనఖా లేని రుణాలకు ఈ స్కీము ఉపయోగపడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే రుణ వ్యయం కూడా 1 శాతం మేర తగ్గుతుందని పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలో కాంట్రాక్టులను పూర్తి చేయలేని ఎంఎస్ఎంఈలకు ఊరటనిచ్చే నిర్ణయం కూడా తీసుకున్నారు. అవి జమ చేసిన లేదా సమర్పించిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీని జప్తు చేసుకుని ఉంటే.. అందులో 95 శాతం మొత్తాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు వాపసు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకాలుగా ఆమె అభివర్ణించారు. ఎంఎస్ఎంఈలు, బడా వ్యాపార సంస్థలు, చారిటబుల్ ట్రస్టుల కోసం డిజిలాకర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పత్రాలను ఆన్లైన్లో భద్రపర్చుకునేందుకు, అవసరమైనప్పుడు బ్యాంకులు, నియంత్రణ సంస్థలు మొదలైన వాటితో షేర్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఉపశమనం.. ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం కల్పిస్తున్న ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ విషయంలో మరింత వెసులుబాటు లభించింది. వృత్తి నిపుణులు అయితే వార్షిక ఆదాయం రూ.50 లక్షల్లోపు, ఎంఎస్ఎంఈలు అయితే వార్షిక టర్నోవర్ రూ.2 కోట్ల వరకు ఉంటే ఆదాయపన్ను చట్టం కింద ప్రిజంప్టివ్ ఇనక్మ్ (ఊహించతగిన ఆదాయం) పథకానికి అర్హులు. తాజా ప్రతిపాదన ప్రకారం సంస్థలు తమ వార్షిక టర్నోవర్ లేదా స్థూల చెల్లింపుల స్వీకరణల్లో నగదు రూపంలో స్వీకరించే మొత్తం 5 శాతంలోపు ఉంటే ప్రిజంప్టివ్ స్కీమ్ కింద మరింత ప్రయోజనం పొందొచ్చు. అంటే తమ వార్షిక టర్నోవర్‌లో 5 శాతం లోపు నగదు స్వీకరించే సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.3 కోట్ల వరకు ఉన్నా, వృత్తి నిపుణుల ఆదాయం రూ.75 లక్షల వరకు ఉన్నా ప్రయోజనానికి అర్హులు. ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా.. వాస్తవంగా ఆ చెల్లింపులు చేసినప్పుడే అందుకు అయ్యే వ్యయాలను మినహాయించుకునే విధంగా నిబంధనలు మార్చారు. ప్రిజంప్టివ్ స్కీమ్ నిబంధనల కింద చిన్న వ్యాపార సంస్థలు తమ టర్నోవర్‌లో 8 శాతం కింద (నాన్ డిజిటల్ రిసీప్ట్స్) లాభంగాను, డిజిటల్ లావాదేవీల రూపంలో స్వీకరించినట్టయితే టర్నోవర్‌లో 6 శాతాన్ని లాభం కింద చూపించి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. -
చిన్న సంస్థలకు రుణాలపై ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్య తరహా సంస్థలు, స్వయం ఉపాధి పొందుతున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ ఎండీ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు. కొత్తగా సప్లై చెయిన్ ఫైనాన్సింగ్, విద్యా రుణాల విభాగాల్లోకి కూడా మరికొద్ది నెలల్లో ప్రవేశించనున్నట్లు చక్రవర్తి వివరించారు. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 15% పైచిలుకు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 18% వరకు వ్యాపార వృద్ధిని అంచనా వేస్తున్నట్లు శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) రూ. 1,71,000 కోట్లుగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ. 33,000 కోట్లుగా ఉందని చక్రవర్తి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.3,000 కోట్ల డిపాజిట్లు, 46,000 పైచిలుకు డిపాజిట్‌దారులు, 10,000 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. అన్ని శాఖల్లో అన్ని సర్వీసులు .. ప్రస్తుతం 268 శాఖల్లో మాత్రమే వాణిజ్య వాహన (సీవీ) రుణాలు ఇస్తుండగా, కొత్తగా మరో 170 శాఖల్లో కూడా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 2023 ఆఖరు నాటికి అన్ని శాఖల్లోనూ అన్ని ఉత్పత్తులను అందించాలని నిర్దేశించుకున్నట్లు చక్రవర్తి చెప్పారు. -
చిన్న సంస్థలకు గోద్రెజ్ క్యాపిటల్ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ గ్రూప్ సంస్థ గోద్రెజ్ క్యాపిటల్ .. చిన్న, మధ్య తరహా (ఎస్ఎంఈ) సంస్థలకు ప్రాపర్టీ తనఖా రుణాలపై (ఎల్ఏపీ) మరింతగా దృష్టి పెడుతోంది. తాజాగా హైదరాబాద్‌లోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. హైదరాబాద్ ప్రాంతంలో ఎల్ఏపీ మార్కెట్ విలువ దాదాపు రూ. 700 కోట్లుగా ఉంటుందని ఈ సందర్భంగా కంపెనీ ఎండీ మనీష్ షా వెల్లడించారు. వచ్చే 18 నెలల్లో ఇందులో కనీసం 10 శాతం వాటా దక్కించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. త్వరలో ఎస్ఎంఈలకు అన్సెక్యూర్డ్ రుణాల విభాగంలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఎస్ఎంఈల వ్యాపార నిర్వహణ అవసరాలు విభిన్నంగా ఉంటాయని, అందుకు అనుగుణంగా అవి తమ వెసులుబాటును బట్టి మరీ భారం పడకుండా ఈఎంఐలను ఎంచుకునే విధానం, పాతికేళ్ల వరకూ కాలపరిమితి మొదలైన ఆప్షన్లు అందిస్తున్నట్లు మనీష్ షా తెలిపారు. 2020 నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తమ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్ సహా 11 నగరాలకు విస్తరించిందని చెప్పారు. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ రుణాలకు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావమేదీ పెద్దగా కనిపించడం లేదని షా తెలిపారు. హౌసింగ్ ఫైనాన్స్ వ్యాపార విభాగం ద్వారా గృహ రుణాలు, గోద్రెజ్ ఫైనాన్స్ విభాగం ద్వారా ఎల్ఏపీ రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్ఏపీ కార్యకలాపాలు మాత్రమే ప్రారంభించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ. 3,500 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేశామని ఇందులో రూ. 2,500 కోట్ల మేర గృహ రుణాలు, మిగతావి ఎల్ఏపీ ఉన్నాయని షా వివరించారు. రుణ మొత్తాన్ని 2024 మార్చి నాటికి రూ. 12,000 కోట్లకు, 2026 కల్లా రూ. 30,000 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. -
ఎంఎస్ఎంఈల్లో వ్యాపార ఆశావహం
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల్లో (ఎంఎస్ఎంఈ) వ్యాపార ఆశావహం పుంజుకుంది. 2022 డిసెంబర్ వరకు ఆరు నెలల్లో వ్యాపార వృద్ధి పట్ల 71 శాతం ఎంఎస్ఎంఈలు సానుకూలంగా ఉన్నాయి. వచ్చే ఆరు నెలల్లో వ్యాపారం కుంటుపడొచ్చని కేవలం 5 శాతం మందే చెప్పారు. ఫిన్‌టెక్ సంస్థ ‘ఖాతాబుక్’ అర్ధ సంవత్సర ఎంఎస్ఎంఈ బిజినెస్ సెంటిమెంట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలతో ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనూ ఎంఎస్ఎంఈలో అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాల్లోనూ వృద్ధిని చూసినట్టు ఈ నివేదిక తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంఎస్ఎంఈల్లో సానుకూల వృద్ధి ఉందని, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందంజంలో ఉన్నట్టు పేర్కొంది. 2021లో ప్రతికూల వృద్ధిని చూసిన పారిశ్రామిక సేవలు, స్టేషనరీ, హోమ్ ఫర్నిషింగ్ కంపెనీలు సైతం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో సానుకూల వ్యాపారాన్ని నమోదు చేసినట్టు వివరించింది. 2022 మొదటి రెండు త్రైమాసికాల్లో ఫార్మా, సెలూన్లు, రెస్టారెంట్లు అధిక వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది. సమస్యలు కూడా తక్కువే.. తమకు వ్యాపారానికి సంబంధించి పెద్ద సమస్యలు ఏమీ లేవని 66 శాతం ఎంఎస్ఎంఈలు చెప్పాయి. దీనికి విరుద్ధంగా ఇతర ఎంఎస్ఎంఈలు డిమాండ్ బలహీనంగా ఉందని, రుణాల లభ్యత, లిక్విడిటీ సమస్యలను ప్రస్తావించాయి. 7,295 అభిప్రాయాలను సర్వేలో తెలుసుకోగా, 58 శాతం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వ్యాపారం మెరుగుపడినట్టు చెప్పాయి. ఇదే కాలంలో వ్యాపారం క్షీణించినట్టు 14 శాతం ఎంఎస్ఎంఈలు తెలిపాయి. రిటైలర్లు, హోల్‌సేల్ విక్రేతలు, పంపిణీదారులు, తయారీదారుల్లో వ్యాపార సెంటిమెంట్ బలపడింది. -
చిన్న సంస్థలకు ఈ–కామర్స్‌తో దన్ను
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి, మార్కెటింగ్ వ్యయాలను తగ్గించుకోవడానికి, కొత్త మార్కెట్లలో విస్తరించడానికి ఈ–కామర్స్ ఎంతగానో తోడ్పడుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. చిన్న వ్యాపారాలు తమ మేనేజ్మెంట్ నైపుణ్యాలను, టెక్నాలజీని మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భారతీయ ఎంఎస్ఎంఈల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎంఎస్ఎంఈలు దేశీయంగా ఉపాధి కల్పనలోనూ, తయారీ కార్యకలాపాలను విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వాటిపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వర్మ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ చేయూత.. కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా చిన్న పరిశ్రమలు ఎదురొడ్డి నిల్చాయని మంత్రి తెలిపారు. కొన్ని యూనిట్లు ఆర్థిక కష్టాలతో మూతబడే పరిస్థితికి వచ్చినా ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు తోడ్పాటునివ్వడంతో గట్టెక్కాయని ఆయన చెప్పారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకే కేంద్రం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను (ఈసీఎల్జీఎస్) ఆవిష్కరించినట్లు మంత్రి వివరించారు. దీని కింద చిన్న సంస్థలకు రూ. 3.1 లక్ష కోట్ల మేర నిధులను కేటాయించినట్లు ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్ తెలిపారు. డీ2సీ మార్కెట్ నివేదిక ఆవిష్కరణ.. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రాక్సిస్, షిప్‌రాకెట్, సీఐఐ సంయుక్తంగా రూపొందించిన భారత డీ2సీ మార్కెట్ నివేదికను మంత్రి ఆవిష్కరించారు. దీని ప్రకారం ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని నేరుగా కస్టమర్లకు పంపే చాలా మటుకు డీ2సీ (డైరెక్ట్ టు కస్టమర్స్) సంస్థలకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రధాన సరఫరా, డిమాండ్ హబ్‌లుగా ఉంటున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో నిత్యావసరాలు మొదలైన ఉత్పత్తుల మార్కెట్ పరిమాణం 571 బిలియన్ డాలర్లుగా, ఆభరణాల మార్కెట్ 82 బిలియన్ డాలర్లు, దుస్తులు.. పాదరక్షలు 81 బిలియన్ డాలర్లు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 9.4 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. -
డిజిటల్ పేమెంట్స్ బాటలో చిన్న సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 కష్టాల నుంచి క్రమంగా బైటపడుతున్న చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎక్కువగా డిజిటల్ పేమెంట్ విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాదీ సంస్థలు మరింత ముందున్నాయి. 76 శాతం సంస్థలు వీటిని వినియోగించుకుంటున్నాయి. దేశంలోనే ఇది అత్యధికం. చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలిచ్చే ఫిన్‌టెక్ సంస్థ నియోగ్రోత్ విడుదల చేసిన ఎంఎస్ఎంఈ ఇన్సైట్ రిపోర్ట్ 2022 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2020 మార్చి–2022 మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 88 పరిశ్రమల వ్యాప్తంగా 40,000 పైచిలుకు ఎంఎస్ఎంఈలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా నియోగ్రోత్ ఈ నివేదిక రూపొందించింది. మహమ్మారి విజృంభించిన సమయంలో ఎంఎస్ఎంఈలకు డిమాండ్‌పరంగా ఎదురైన పరిస్థితులు, రికవరీపై సహాయక చర్యల ప్రభావం, వ్యాపార నిర్వహణ కోసం డిజిటల్ వైపు మళ్లడం, రెండేళ్లుగా నిలదొక్కుకునేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను ఇందులో పరిగణనలోకి తీసుకుంది. ‘డిమాండ్ పడిపోయి, రుణాల చెల్లింపు భారం పెరిగిపోవడంతో 2020–21లో చాలా మటుకు ఎంఎస్ఎంఈలు చాలా సతమతమయ్యాయి. వ్యాపారం నిజంగానే దెబ్బతినడం వల్లే చాలా మటుకు సంస్థలకు అదనపు సహాయం అవసరమైందని కరోనా తొలినాళ్లలో మేము గుర్తించాము. సాధారణంగా ఎంఎస్ఎంఈ కస్టమర్లు నిజాయితీగానే ఉంటారు. రుణాలు తిరిగి చెల్లించే యోచనలోనే ఉంటారు. అందుకే వారికి అవసరమైన తోడ్పాటును మా వంతుగా మేము కూడా అందించాము‘ అని నియోగ్రోత్ సీఈవో అరుణ్ నయ్యర్ తెలిపారు. నివేదికలో మరిన్ని అంశాలు .. ► కోవిడ్–19 కష్టాల నుంచి గట్టెక్కడానికి దేశీయంగా 46 శాతం ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా సహాయం అవసరమైంది. ► కోవిడ్–19 రెండో వేవ్ వచ్చేనాటికి ఎంఎస్ఎంఈలు కాస్త సంసిద్ధంగా ఉన్నాయి. దీంతో ఒకటో వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో 30 శాతం సంస్థలు మాత్రమే ఆర్థిక సహాయం తీసుకున్నాయి. ► మెట్రోయేతర నగరాల్లో ఎంఎస్ఎంఈల రుణాలకు డిమాండ్ ఈ ఏడాది మార్చిలో తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకుంది. మెట్రో నగరాలు స్వల్పంగా వెనుకబడ్డాయి. బెంగళూరు, చెన్నైలో ఎంఎస్ఎంఈల రుణాలకు డిమాండ్ .. కోవిడ్ పూర్వ స్థాయిని మించింది. ► పెట్రోల్ బంకులు, ఇన్ఫ్రా, ఆటోమొబైల్ వంటి విభాగాలు మిగతా రంగాలతో పోలిస్తే వేగంగా కోలుకున్నాయి. ► గడిచిన రెండేళ్లలో ఎంఎస్ఎంఈలకు కొత్త అవ కాశాలు అందుబాటులోకి వచ్చాయి. రుణాలు పొందేందుకు, వ్యాపారాలను నిర్వహించుకునేందుకు పాటిస్తున్న సంప్రదాయ విధానాల స్థానంలో కొత్త తరం డిజిటల్ విధానాలు వచ్చేశాయి. చిన్న సంస్థల ఆర్థిక అవసరాలు తీర్చడంలో డిజిటల్ రుణాలకు ప్రాధాన్యం పెరిగింది. -
ఎంఎస్ఎంఈలకు రూ.6,062 కోట్లు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ప్రపంచబ్యాంకు సహకారంతో కూడిన 6,062 కోట్ల పథకానికి (ర్యాంప్) ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా మార్కెట్ అనుసంధానత, రుణ సాయం మెరుగుపడనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ర్యాంప్ అమల్లోకి వస్తుందని ప్రభు త్వం తెలిపింది. రూ.6,062 కోట్లలో రూ.3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,312 కోట్లను కేంద్రం సమ కూరుస్తుంది. కరోనా తర్వాత ఎంఎస్ఎంఈ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం తెలిసిందే. -
ఎస్ఎంఈ విభాగం నుంచి క్యూ1లో 4ఐపీఓలే..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చిన్న మధ్య తరహా విభాగంలో కేవలం 4ఐపీఓలు మాత్రమే మార్కెట్లోకి వచ్చాయి. ఈ 4ఐపీఓల మొత్తం విలువ 2.8మిలియన్ డాలర్లు ఉంది. కరోనా వైరస్ అంటువ్యాధి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుంటుబడటంతో కంపెనీలు ఐపీఓ బాటపట్టేందుకు సంశయించాయిని ఈవై ఇండియా నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో పెద్దగా యాక్టివిటీ లేకపోయినప్పటికీ, కంపెనీలు దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలను పరిశీలిస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని కంపెనీలు ఈ ఆర్థిక మందగమనంలోనూ ఐపీఓ ఇష్యూపై దృష్టిని సారిస్తున్నాయని ఈవై ఇండియా ఆదివారం తెలిపింది. ఇతర కంపెనీ కొనుగోళ్ల పాటు ప్రధాన సెకండరీ మార్కెట్లో ఎలాంటి ఐపీఓలు రాలేదు. ప్రస్తు్తత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ కార్వర్ట్తో పాటు రెండో త్రైమాసికంలో కన్జ్యూమర్ ప్రాడెక్ట్స్&రీటైల్, డెవర్సీఫైడ్ ఇండస్ట్రీయల్ ప్రాడెక్ట్స్ రంగాలకు చెందిన కంపెనీలు మాత్రమే ఐపీఓ విభాగంలో చురుగ్గా పాల్గోనే అవకాశం ఉంది. ఈ రెండు సెక్టార్ల నుంచి తలా రెండు ఐపీఓలు మాత్రమే ఉన్నాయి. 4ఐపీఓల మొత్తం విలువ 2.08 మిలియన్లుగా ఉంది. ‘‘కోవిడ్ -19 మానవ జీవితాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో గడిచిన 3నెలల్లో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో లాగానే భారతఐపీఓ మార్కెట్లోనూ ఎలాంటి యాక్టివిటీ లేదు. అయితే కోవిడ్-19 తర్వాత కంపెనీలకు వచ్చే ఆర్డర్ల విలువలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్లు, విశ్లేషకులు ఆర్డర్ల తయారీ అవకాశాలను ఎంతమేరకు అందిపుచ్చుకుంటాయనే అంశాన్ని నిశీతంగా పరిశీలిస్తున్నారు.’’ అని ఫైనాన్సియల్ అకౌంటింగ్ అడ్వైజర్ సర్వీస్ సందీప్ ఖేతన్ తెలిపారు. భవిష్యత్ నిధుల సేకరణ కోసం ప్రస్తుత సమయాన్ని ఉపయోగించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరపు చివరికల్లా లేదా వచ్చే 2021 ఎఫ్వై తొలిభాగంలో ఐపీఓ యాక్టివిటీ పుంజుకోవచ్చు.’’ ఆయన తెలిపారు. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఇదే ఎస్ఎంఈ మార్కెట్లో 14 కంపెనీలు ఐపీఓకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం
కాలిఫోర్నియా: ప్రపంచ వ్యాప్తంగా మహారక్కసిలా విరుచుకుపడుతున్న కరోనాపై యుద్ధానికి తమ వంతుగా కార్పొరేట్ దిగ్గజాలు కదిలి వస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19పై పోరుకు సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. చిన్న,మధ్య తరహా వ్యాపారులను (ఎస్‌ఎంబీస్) ఆదుకునేందుకు, 800 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,990 కోట్లు) సహాయాన్ని ప్రకటించింది. చిన్న వ్యాపారాలతోపాటు మహమ్మారి కరోనాపై చేస్తున్న ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలనే దానిపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు(డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా ప్రభుత్వ సంస్థలకు 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,872 కోట్లు) యాడ్ గ్రాంట్స్‌ను గూగుల్ అందిస్తుందని ఆయన తెలిపారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ), ఇతర వైద్య పరికరాల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సహాయం అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. అవసరమైన పరికరాల తయారీ దారులకు, ఫెడరల్ ప్రభుత్వం సహాయం చేయడానికి గూగుల్ తన ఉద్యోగులను గుర్తిస్తామని గూగుల్ పేర్కొంది. రాబోయే కొన్ని వారాల్లో 2 నుంచి మూడు మిలియన్ల ఫేస్‌మాస్క్‌లను ఉత్పత్తి చేసేందుకు మాజిడ్ గ్లోవ్స్ అండ్ సేఫ్టీతో కలిసి గూగుల్ పనిచేస్తోంది. అలాగే కమ్యూనిటీ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్జీవోలకు ప్రకటన గ్రాంట్లలో 20 మిలియన్ డాలర్లు ఇవ్వనుండగా, గూగుల్ యాడ్స్ క్రెడిట్స్‌లో 340 మిలియన్ డాలర్లు మేర అర్హత ఉన్న ఖాతాలకు గూగుల్ స్వయంచాలకంగా క్రెడిట్‌ను అందుబాటులో ఉంచనుంది. చిరువ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్జీవోలు, ఫైనాన్షియల్ సంస్థలకు 200 మిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది. ఈ పెట్టుబడుల నిధిని సమకూర్చడం ద్వారా నగదు లభ్యత అందించనున్నామని, తద్వారా వ్యాపారాలకు, ఇతర ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు లభిస్తుందన్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులకు గూగుల్ క్లౌడ్‌లో 20 మిలియన్ డాలర్లను అందించనుంది. తద్వారా టీకాలు రూపకల్పన, చికిత్సలను అధ్యయనం చేయడానికి లేదా డేటాను ట్రాక్ చేయడానికి ఉపయోగించుకోవచ్చని పిచాయ్ వివరించారు. -
‘చిన్నతరహా పరిశ్రమలకు చేయూతనివ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్మ్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎమ్ఎస్ఎమ్ఈ) చేయూతనిచ్చి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి సంబంధిత మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పనితీరుపై గురువారం రాజ్యసభలో కొనసాగిన చర్చలో పాల్గొన్న ఆయన భారత దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో మూడో వంతు భాగస్వామ్యం చిన్నపరిశ్రమలదేన్నారు. దేశంలోని మాన్యుఫాక్చరింగ్ రంగం మొత్తం ఉత్పాదనల్లో 45 శాతం వాటా రూ. 7.5 కోట్లు ఎమ్ఎస్ఎమ్ఈలదేనని తెలిపారు. చిన్న పరిశ్రమల ద్వారా దేశంలో రూ. 11 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది కాబట్టి చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం నిలకడగా వృద్ధి చెందితేనే దేశ జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాల సాధన సాధ్యపడుతుందని ఆయన అన్నారు. (ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా వృద్ధి చెందడానికి ప్రధానంగా తీసుకోవలసిన కొన్ని చర్యలను విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సాధారణంగా ఈ తరహా పరిశ్రమలు తమ ఉత్పాదనలకు చెల్లింపులు చేయడానికి కొనుగోలుదారులకు 90 రోజుల గడువు ఇస్తాయి. కానీ జీఎస్టీ నిబంధనల ప్రకారం ఇన్వాయిస్ ఇచ్చిన 20 రోజుల్లో జీఎస్టీ చెల్లంపులు జరగాలన్నారు. ఫలితంగా మూలధనం సమస్య ఈ పరిశ్రమలను నిత్యం వేధిస్తూ ఉంటుందని అన్నారు. అందువలన జీఎస్టీ చెల్లింపు, రిటర్న్స్ ఫైల్ చేసే విషయంలో ఎంఎస్ఎంఈకి నిబంధనలు సడలింపు కల్పించాలని కోరారు. అలాగే గడువు దాటిన చెల్లింపులకు విధించే జరిమానా వడ్డీని తగ్గించాలని కోరారు.(‘పరోక్షంగా తప్పు ఒప్పుకున్న నిమ్మగడ్డ’ ) చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధిలో రుణ సౌకర్యం కీలక పాత్ర పోషిస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. తక్కువ వడ్డీకి రుణం లభ్యమైనప్పుడే అవి పెద్ద పరిశ్రమలతో పోటీ అన్నారు. అయితే ఈ పరిశ్రమలు రిస్క్ కేపిటల్‌ను సేకరించలేకపోతున్నాయని, అలాగే బ్యాంక్‌లకు అవసరమైన కొలేటరల్ హామీని కూడా సమకూర్చలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. కాబట్టి రుణ సౌకర్యం పొందలేక ఎమ్ఎస్ఎమ్ఈలు విలవిలలాడే పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఆయన ఉదహరిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వాటి సైజును బట్టి రూ. 25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకుల నుంచి రుణ పొందే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. (నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’) ఈ విధంగా ప్రభుత్వం హామీదారుగా ఉండి బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పిస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌లో 6,572 చిన్నతరహా పరిశ్రమలు ఆవిర్భవించాయని అన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాల కారణంగా దేశంలో 80 లక్షల మంది మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కాగలిగారు. గడచిన అయిదేళ్ళలో వారి సంఖ్య 38 శాతం పెంచేందుకు కృషి చేజత్రి గడ్కరీని ఆయన అభినందించారు. అలాగే కొన్ని రకాల ఉత్పాదనలు కేవలం చిన్నపరిశ్రమలు మాత్రమే ఉత్పాదన చేసేలా రిజర్వ్ చేసి వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని శ్రీ విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. (కరోనా నివారణకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు) ఎన్నాళ్లు తప్పించుకుంటావ్ బాబూ? ‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’ -
అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
అనంతపురం టౌన్ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు రాష్ట్రస్థాయి అవార్డుల కోసం ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్‌బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2014 మార్చి 31వ తేదీకి ముందు ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు అవార్డు ఎంపికకు అర్హతగా నిర్ణయించామన్నారు. దరఖాస్తు వివరాలు, సమర్పించాల్సిన పత్రాలు, పాటించాల్సిన విధి విధానాల సమాచారం కోసం జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
కంపెనీలు హైదరాబాద్ వదిలేస్తున్నాయట....
ప్రభుత్వం ఏర్పడి పక్షం రోజులు కాలేదు. ఒక్క అసెంబ్లీ సెషన్ తప్ప ఏమీ జరగలేదు. రాజధాని ఎక్కడ అన్నది ఇంకా తేలలేదు. తెలంగాణ పంచాయితీ ముగియలేదు. కేంద్రంతో లెక్కలింకా కుదరలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ కి రామరాజ్యం వచ్చేసింది. ఫేస్ బుక్ పేజీలో ఆ పార్టీ తెలంగాణ నుంచి పారిశ్రామిక వేత్తలందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూలు కడుతున్నారని, వారంతా చంద్రబాబు సామర్థ్యాన్ని చూసి వచ్చేస్తున్నారని పేర్కొన్నారు. తమాషా ఏమిటంటే ఇప్పటి వరకూ అలా వచ్చిన సంస్థల జాబితా ఇవ్వలేదు. వాటి చిరునామాలివ్వలేదు. కానీ వచ్చేస్తున్నారన్న ప్రచారం మాత్రం టీడీపీ ప్రచార తంత్రం ఉధృతంగా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు హాట్ స్పాట్ గా మారిపోయిందని కూడా పార్టీ వెబ్ సైట్ ప్రచారం చేస్తోంది. ఏకంగా 700 కంపెనీలు వచ్చేశాయని కూడా పార్టీ వెబ్ సైట్ చెబుతోంది. అయితే ప్రభుత్వం తరఫు నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి మాటా లేదు. అధికారికంగా ఏమీ చెప్పడం లేదు. కానీ పార్టీ ప్రచార యంత్రాంగం మాత్రం హడావిడి పడిపోతోంది. చంద్రబాబు మాత్రం ఇసుజు కంపెనీ ప్రతినిధులతో తాను సమావేశమయ్యానని, మంచి ఫలప్రదంగా సమావేశం జరిగిందని చెప్పారు. అయితే ఆ ఫలమేమిటో మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.