
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) ప్రపంచబ్యాంకు సహకారంతో కూడిన 6,062 కోట్ల పథకానికి (ర్యాంప్) ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా మార్కెట్ అనుసంధానత, రుణ సాయం మెరుగుపడనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ర్యాంప్ అమల్లోకి వస్తుందని ప్రభు త్వం తెలిపింది. రూ.6,062 కోట్లలో రూ.3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,312 కోట్లను కేంద్రం సమ కూరుస్తుంది. కరోనా తర్వాత ఎంఎస్‌ఎంఈ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం తెలిసిందే.