Loan Scheme
-
PMEGP : సబ్సిడీతో పాడి పథకం, లోన్ ఎలా పొందాలి?
సబ్సిడీతో పాడి పథకం మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలాదరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ ప్రధానమంత్రి ఎం΄్లాయ్మెంట్ జెనరేషన్ ప్రోగ్రామ్.మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలాదరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటివివరాలను ‘‘ఓనర్‘షిప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ ప్రధానమంత్రి ఎప్లాయ్మెంట్ జెనరేషన్ ప్రోగ్రామ్. పీఎమ్ఈజీపీ (PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జెనరేషన్ ప్రాగ్రామ్) స్కీమ్... పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం రూ పొందించిన పథకం ఇది. ఇందులో 35 శాతం సబ్సిడీతో రూ. 10 లక్షల నుంచి కోటి వరకు రుణ సహాయం అందుతుంది. దీనికి అయిదు ఎకరాల సొంత లేదా రిజిస్ట్రేషన్ లీజు కలిగిన భూమి ఉండాలి. గ్రామం, పట్టణం.. ఎక్కడైనా ఈ పరిశ్రమను పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు గరిష్ఠంగా 35 శాతం రాయితీ లభిస్తుంది.ఇలా దరఖాస్తు చేసుకోవాలి...పద్ధెనిమిదేళ్లు్ల పైబడి.. 730 సిబిల్ స్కోర్ దాటినవారు ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఏరియాపాపులేషన్ రి΄ోర్ట్, టెన్త్‌క్లాస్ ఉత్తీర్ణతా సర్టిఫికెట్, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, భూమికి సంబంధించిన పట్టా, పాస్‌బుక్ కాపీలను జతచేస్తూ పీఎమ్ఈజీపీ ఆన్లైన్ ్ర΄÷ఫైల్‌ను నింపాలి. అది సంబంధిత కేవీఐబీ లేదా కేవీఐసీకి వెళ్తుంది. వాళ్లు అప్రూవ్‌చేసి ఆ దరఖాస్తును బ్యాంకులకు పంపుతారు. బ్యాంక్‌ల నుంచి పిలుపు రాగానే వారు సూచించిన ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్లు, సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సమర్పించాలి. బ్యాంక్‌లు వాటిని పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు. మళ్లీ అది కేవీఐబీ లేదా కేవీఐసీకి వస్తుంది. తర్వాత 15 రోజులు ఆన్లైన్ ట్రైనిం ఉంది., సంబంధిత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అది పాస్ అయితేనే రుణం విడుదల అవుతుంది. అప్పుడే సబ్సిడీనీ శాంక్షన్ చేయించుకోవాలి. దాన్ని మూడేళ్ల వరకు బ్యాంక్‌లోనే డిపాజిట్ చేస్తారు. మూడేళ్ల తర్వాత దాన్ని బ్యాంక్ వాడుకుంటుంది. ΄÷ందిన సబ్సిడీకి వడ్డీ ఉండదు. ఈ మొత్తం రుణానికి బ్యాంక్ ఎటువంటి పూచీకత్తు అడగదు. అందిన రుణంలోని కొంత మొత్తంతో షెడ్డును నిర్మించి, ఇంకొంత మొత్తంతో గేదెలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువైద్యనిపుణులు సర్టిఫై చేసిన ఆరోగ్యకరమైన గేదెలకు మాత్రమే బ్యాంక్ అనుమతిస్తుంది. కొన్నచోటు నుంచి రసీదు తీసుకోవాలి. షెడ్డును కూడా ప్రభుత్వ సూచనల మేరకు.. గాలి వెలుతురు ధారాళంగా సోకేలా, నీటి సౌలభ్యం, డ్రైనేజీ వసతులు ఉండేలా నిర్మించాలి. అధికంగా పాలనిచ్చే సూడి గేదెలను మాత్రమే కొనాల్సి ఉంటుంది. నాణ్యమైన పాల ఉత్పత్తి, వేరొక జాతి పశువులతో కలపని పూర్తిస్థాయి దేశీ పశు అభివృద్ధే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇదేకాకుండా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నుంచి అందుతున్న పశుజాతి అభివృద్ధి (Breed Multiplication Farm) పథకమూ ఉంది. దీనికి రూ. 4 కోట్ల రుణం అందుతోంది. అందులో సగం అంటే రూ. 2 కోట్లకు సబ్సిడీ ఉంటుంది. పది శాతం బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ అంటే రూ.4 కోట్ల ప్రాజెక్ట్‌కు రూ. 40 లక్షలు సొంత పెట్టుబడి ఉండాలి. మిగిలిన కోటీ అరవై లక్షలకు బ్యాంకు నుంచి రుణాన్ని పొందవచ్చు. అయితే దీనికి పూచీకత్తు తప్పనిసరి. అయిదు ఎకరాల భూమిలో ప్రాజెక్ట్ ఉండాలి. పదేళ్ల పైబడి లీజుకు రిజిస్ట్రేషన్ చేయించాలి. సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో ఎన్డీడీబీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ స్క్రూటినీ అనంతరం పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ లోన్, ప్రభుత్వ సబ్సిడీలు పొందిన తర్వాతప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి. అయిదు ఎకరాల భూమిలో పాడికి అవసరమైన పచ్చగడ్డిని పండించాలి. దేశీ పశు అభివృద్ధి ప్రణాళికతో తయారైన, ప్రభుత్వం సప్లయ్ చేస్తున్న దాణాను కూడా సబ్సిడీ ధరలకు కొనుక్కోవచ్చు. ఈ పథకం ద్వారా చాలామంది పాడి రైతులు తాము లాభపడటమే కాక మరికొంత మందికీ ఉపాధి కల్పిస్తున్నారు. ఇది మహిళా రైతులకు మరింత ప్రోత్సాహకరం. – బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్నిర్వహణ : సరస్వతి రమ మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.com -
బీవోఐలో రూ. 227 కోట్ల ఫ్రాడ్
న్యూఢిల్లీ: గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ రూ. 227 కోట్ల మేర రుణం తీసుకుని, మోసం చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెల్లడించింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది. రూ. 227 కోట్లకు గాను రూ. 213 కోట్లు ప్రొవిజనింగ్ చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) కూడా రూ. 271 కోట్ల ఫ్రాడ్‌కి పాల్పడింది. పీఎన్బీ కూడా దీన్ని ఎన్పీఏగా వర్గీకరించి, ప్రొవిజనింగ్ చేసి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బీవోఐ నికర లాభం 35% పెరిగి రూ. 1,870 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు చేరగా, ఆదాయం రూ.16,411 కోట్ల నుంచి రూ.19,957 కోట్లకు ఎగసింది. -
గృహ రుణం.. దిగొస్తుంది భారం!
కొండెక్కి కూర్చున్న రుణ రేటును కిందికి దింపే దిశగా ఆర్బీఐ తొలి అడుగు వేసింది. రెపో రేటును పావు శాతం తగ్గించి రుణ గ్రహీతలకు తీపి కబురందించింది. చూడ్డానికి స్వల్ప మొత్తమే అయినా.. గృహ రుణ గ్రహీతలకు లక్షల్లో మిగలనున్నాయి. తమ వంతు కృషిని కొంచెం జోడిస్తే మరింత ఆదా చేసుకోవచ్చు. రుణానికి త్వరగా గుడ్‌బై చెప్పొచ్చు. తాజా రేటు తగ్గింపుతో మిగిలేదెంత? దీనికి అదనంగా మిగుల్చుకునేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్లు ఏవి? ఈ వివరాలను అందించే కథనమే ఇది. వడ్డీ భారం తగ్గేది ఇలా.. ఏడాది క్రితం 50 లక్షల గృహ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుపై 20 ఏళ్ల కాల వ్యవధి కోసం తీసుకున్నారని అనుకుందాం. ఈఎంఐని ఇంతకుముందు మాదిరే కొనసాగించేట్టు అయితే.. పావు శాతం తగ్గింపు, అర శాతం రేటు తగ్గింపుతో ఎంత ప్రయోజనం లభిస్తుందో చూద్దాం. (టేబుల్ 2) ప్రభావం ఏ మేరకు? 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గింపు చిన్న మొత్తమే అయినా దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ మొత్తం ఆదా కానుంది. నెలవారీ చెల్లించే ఈఎంఐ ఇంతకుముందు మాదిరే కొనసాగించుకుంటూ వెళితే, పావు శాతం రేటు తగ్గింపు వల్ల రుణం త్వరగా తీరిపోతుంది. ఒకవేళ రెపో రేటు తగ్గింపును ఈఎంఐలో సర్దుబాటు చేసుకుంటే.. అప్పుడు నెలవారీ చెల్లించే ఈఎంఐ తగ్గుతుంది. రుణ కాల వ్యవధి ఇంతకుముందే మాదిరే కొనసాగుతుంది. ఈఎంఐ తగ్గించడం లేదంటే అదే ఈఎంఐ కొనసాగించి, రుణ కాల వ్యవధి త్వరగా ముగించడం.. ఈ రెండు ఆప్షన్లను బ్యాంక్‌లు కల్పిస్తాయి. రుణ గ్రహీత తనకు అనుకూలమైన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి రూ.30 లక్షల గృహ రుణాన్ని 9 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుందాం. సవరణ తర్వాత 8.75 శాతం తగ్గుతుంది. దీంతో రూ.26,992 ఈఎంఐ కాస్తా రూ.26,551కు దిగొస్తుంది. ఈఎంఐలో రూ.480 (1.8 శాతం) మిగులుతుంది. (టేబుల్ 1)అమలుకు ఎంత సమయం?బ్యాంక్‌లు 2019 అక్టోబర్ నుంచి అన్ని ఫ్లోటింగ్ రేటు రిటైల్ రుణాలను (గృహ రుణాలు సహా) ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానించాయి. చాలా బ్యాంక్‌లు రెపో రేటునే ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌గా అనుసరిస్తున్నాయి. కనుక రెపో రేటులో మార్పులు రుణాలపై వేగంగా ప్రతిఫలించనున్నాయి. బ్యాంక్‌లు వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమీక్షించాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణా లు, దీనికంటే ముందున్న బేస్ రేటు ఆధారిత రుణాలపై రేటు తగ్గింపు అమల్లోకి రావడానికి 3 నెలల నుంచి 6 నెలల సమయం తీసుకోవచ్చు. ‘‘రె పో లింక్డ్ రుణాలపై ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారికీ ఈ మేరకు తక్కువ రేటుపై రు ణాలు లభిస్తాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలపై రే టు తగ్గింపు అన్నది సమీక్షించే తేదీపైనే ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు ప్రస్తుతం మాదిరే రుణాలకు చెల్లింపులు కొనసాగించాలి’’ అని పైసాబజార్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నవీన్ కుక్రెజా తెలిపారు.కొత్తగా రుణం తీసుకునే వారికీ ఊరట ఈ ఏడాది ఆర్బీఐ మరో 25–50 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అర శాతం రేటు తగ్గడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంతన్నది పైనున్న టేబుల్–2లో గమనించొచ్చు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం డేటాపైనే భవిష్యత్తు రేట్ల తగ్గింపు ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘మరో 50–75 బేసిస్ పాయింట్ల తగ్గింపు అన్నది ద్రవ్యోల్బణం స్థిరత్వం, అంతర్జాతీయ ద్రవ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని పీఎల్ క్యాపిటల్ (ప్రభుదాస్ లీలాధర్) ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ ఎకనామిస్ట్ అర్హ మోగ్రా అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మరో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును అంచనా వేస్తున్నట్టు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బగ్లా తెలిపారు. తక్కువ రేటు రుణానికి మారిపోవడమే ఆర్బీఐ భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయి. ఎంసీఎల్ఆర్ విధానంలో ఉన్నవారికి ఈ రేటు తగ్గింపు ప్రయోజనం బదిలీ ఆలస్యంగా లభిస్తుంది. కనుక ఇప్పటికే ఎంసీఎల్ఆర్ ఆధారిత లేదా దీనికంటే ముందున్న బేస్ రేటు విధానంలో గృహ రుణాలు తీసుకున్నవారు రీఫైనాన్సింగ్ (వేరొక సంస్థకు మారిపోవడం) ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ప్రముఖ బ్యాంక్‌లు రెపో నుంచి ఆఫర్ చేస్తున్నాయి. గృహ రుణ కాల వ్యవధి ఇంకా దీర్ఘకాలం పాటు ఉంటే గనుక తక్కువ రేటుపై ఆఫర్ చేసే బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. దీని ద్వారా పెద్ద మొత్తమే ఆదా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పటికే తీసుకున్న రుణాన్ని అదే బ్యాంక్ పరిధిలో రెపో రేటు విధానంలోకి మార్చి, రేటు తగ్గించాలని కూడా కోరొచ్చు. అన్ని బ్యాంక్‌లు కాకపోయినా కొన్ని బ్యాంక్‌లు ఇందుకు అనుమతించొచ్చు. రెపో ఆధారిత గృహ రుణ గ్రహీతలు సైతం మరింత తక్కువ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంక్/ఎన్బీఎఫ్సీకి మారిపోవడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. 0.35–0.50 శాతం రేటు తక్కువ ఉన్నా కానీ, బదిలీని పరిశీలించొచ్చన్నారు. పన్ను ఆదాతో కలిపితే ఆదా ఎక్కువే ‘‘రూ.25 లక్షల స్థూల ఆదాయం కలిగిన వ్యక్తి రూ.50 లక్షల గృహ రుణం తీసుకుని (20 ఏళ్ల కాలం, 9 శాతం రేటు) 2025 మార్చి నాటికి 12 ఈఎంఐలు చెల్లించినట్టయితే.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.37 లక్షలను ఆదా చేసుకోవచ్చు. అంటే నెలవారీగా రూ.11,461. గృహ రుణం రేటును పావు శాతం తగ్గించడం, అధిక శ్లాబుల్లోని వారికి బడ్జెట్లో ప్రకటించిన పన్ను రాయితీలతో ఈ మొత్తం మిగలనుంది’’అని బ్యాంక్ బజార్ ఆదిల్ శెట్టి వివరించారు. ఎప్పుడు తీసుకున్నారు..? గృహ రుణాన్ని ఐదేళ్ల క్రితం తీసుకున్న వారితో పోల్చితే ఏడాది క్రితం తీసుకున్న వారికి .. తాజా రేటు తగ్గింపుతో మిగులు ఎక్కువగా లభిస్తుంది. ఉదాహరణ: రూ.75 లక్షల రుణాన్ని 20 ఏళ్లకు (240 నెలలు) 9 శాతం రేటుపై తీసుకున్నారు. దీనికి చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐ రూ.67,479. ఇలా 20 ఏళ్ల కాలలో మొత్తం చెల్లించాల్సింది రూ.1.62 కోట్లు. ఇందులో వడ్డీ రూ.87 లక్షలు. ఇప్పుడు రుణంపై వడ్డీ రేటు 9 శాతం నుంచి 8.75 శాతానికి దిగొచ్చింది. దీంతో గృహ రుణం తీసుకుని ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్లు పూర్తయిన వారు.. ఇంతకుముందు మాదిరిగా అదే ఈఎంఐని చెల్లిస్తూ వెళితే మిగిలిన కాలంలో ఎంత మిగులుతుంది, ఎంత తొందరగా రుణం ముగుస్తుందో టేబుల్లో చూడొచ్చు. పాక్షిక చెల్లింపుతో ఇంకా ఆదాగృహ రుణ చెల్లింపుల భారం తగ్గించుకునేందుకు అందుబాటులోని మార్గాల్లో పాక్షిక చెల్లింపులు ఒకటి. ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతుంటుంది. కనుక గృహ రుణ ఈఎంఐని ఏటా 5 శాతం పెంచి చెల్లిస్తూ వెళ్లాలి. దీని ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు చిన్న ఉదాహరణ చూద్దాం. రూ.75 లక్షల రుణాన్ని 9 శాతం రేటుపై 25 ఏళ్ల కాలానికి తీసుకున్నారు. దీనిపై నెలవారీ రూ.62,940 ఈఎంఐగా చెల్లిస్తున్నారు. ఇలా చెల్లించినట్టయితే కాల వ్యవధి పూర్తయ్యే నాటికి చెల్లించే మొత్తం రూ.1.89 కోట్లు. ఇందులో వడ్డీయే రూ.1.14 కోట్లు. ఇప్పుడు ఈఎంఐని ఏటా 5 శాతం పెంచి చెల్లించడం వల్ల 25 ఏళ్లకు బదులు 13 ఏళ్లకే రుణం తీరిపోతుంది. అసలు, వడ్డీ కలిపి చెల్లించే మొత్తం కూడా రూ.1.37 కోట్లకు తగ్గుతుంది. తద్వారా రూ.52 లక్షలు ఆదా అవుతాయి. ఇలా చేస్తే అధిక ప్రయోజనం.. → క్రెడిట్ స్కోరు పెంచుకునేందుకు ప్రయతి్నంచాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంక్‌లు గృహ రుణాలను 0.25 శాతం తక్కువకే ఇస్తుంటాయి. → గృహ రుణాన్ని వీలైనంత తక్కువ కాలానికి ఎంపిక చేసుకోవాలి. 20 ఏళ్ల కాలం మించకుండా చూసుకోవాలి. కొత్త పన్ను విధానంలో గృహ రుణంపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. → భవిష్యత్తులో రేట్లు తగ్గే అవకాశాలే ఎక్కువ. కనుక రెపో ఆధారిత రుణం తీసుకోవడమే మంచిది. → వీలైనంత అధిక డౌన్ పేమెంట్ ముందే సమకూర్చుకుని, రుణం మొత్తాన్ని తగ్గించుకోవాలి. → రుణ కాలవ్యవధి మరో 15 ఏళ్లు మిగిలి ఉంటే, ప్రస్తుత రుణ రేటు కంటే తక్కువ రేటుపై ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడం వల్ల పెద్ద మొత్తం ఆదా అవుతుంది. → ఏటా వీలైనంత మేర ఈఎంఐ పెంచి చెల్లించడం వల్ల రుణాన్ని వేగంగా ముగించేయొచ్చు. బేరమాడడమే.. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంక్‌లు కొంత తక్కువ రేటును ఆఫర్ చేస్తుంటాయి. కనుక 760కు పైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారు బ్యాంక్ అధికారితో సంప్రదించి రేటు తగ్గించుకోవడంలో సఫలం కావొచ్చు. ఇప్పటికే తీసుకున్న రుణంపై రేటు తగ్గించే విషయంలోనూ రుణ గ్రహీతల డిమాండ్‌ను అధికారులు అంగీకరించొచ్చు. లేదంటే మరొక బ్యాంక్‌కు రుణాన్ని బదిలీ చేసుకుంటామంటే దానికి బదులు రేటు తగ్గింపునకు వారు మొగ్గు చూపించొచ్చు. ముఖ్యంగా బ్యాంక్‌లకు బదులు ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తక్కువ రేటుపై రుణ బదిలీ చేసుకునే వారిని ప్రోత్సహిస్తుంటాయి. ఇందుకు కొంత ప్రాసెసింగ్ చార్జీలను భరించాల్సి రావచ్చు. ఆటో రుణాలపై తక్కువే రూ.10 లక్షల ఆటో రుణాన్ని ఐదేళ్ల కాలానికి 10 శాతం రేటుపై తీసుకుని రూ.21,247 ఈఎంఐ కింద చెల్లిస్తున్నారని అనుకుందాం. తగ్గింపు తర్వాత వడ్డీ రేటు 9.75 శాతానికి దిగొచ్చింది. ఇంతకుముందు మాదిరే రూ.21,247 ఈఎంఐ చెల్లిస్తూ వెళితే.. రుణం మూడు నెలల ముందుగా తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.15,000 ఆదా అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.50 వేల లోన్
బ్యాంకులలో రుణాలు పొందడం అంత సులువు కాదు. హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాలి.. సవాలక్ష డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే ఇవన్నీ లేకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.50 వేలు లోన్ పొందే అవకాశం ఉంది. అదే పీఎం స్వనిధి యోజన పథకం.కోవిడ్ (COVID-19) మహమ్మారి బారిన పడిన వ్యాపారాలకు మద్దతుగా ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల స్వావలంబన కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎటువంటి గ్యారెంటీ లేకుండా ఆధార్ కార్డుతో రుణాన్ని పొందవచ్చు.ఇది ఎలా పని చేస్తుందంటే..చిరు వ్యాపారులకు ప్రారంభంలో రూ.10,000 వరకు రుణం ఇస్తారు. వారు ఈ లోన్ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, తదుపరిసారి రూ.20,000 రుణం పొందవచ్చు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత రూ.50,000 లోన్ అందుకోవచ్చు.ఆధార్ కార్డు తప్పనిసరిపీఎం స్వనిధి పథకం కింద రుణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. వ్యాపారులు తమ ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాన్ని 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి.ఎలా దరఖాస్తు చేయాలి?పీఎం స్వనిధి వెబ్సైట్ ప్రకారం.. రుణగ్రహీతలు తప్పనిసరిగా లోన్ అప్లికేషన్ ఫారమ్ (LAF)ని పూరించడానికి అవసరమైన సమాచార పత్రాలను అర్థం చేసుకోవాలి.ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ-కేవైసీ/ఆధార్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. దీంతోపాటు రుణగ్రహీతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం పట్టణ స్థానిక సంస్థల (ULB) నుండి సిఫార్సు లేఖను పొందవలసి ఉంటుంది.మొబైల్ నంబర్లను అప్డేట్ చేయడానికి ఫారమ్‌ను తప్పనిసరిగా పూరించాలి. ఇతర పత్రాలు అవసరం లేదు.ఈ పథకంలో రుణం పొందడానికి అర్హులైన నాలుగు రకాల విక్రేతలు ఉన్నారు. అర్హత ప్రమాణాలను సరిచూసుకుని తదనుగుణంగా దరఖాస్తు చేసుకోండి.ఈ మూడు దశలను అనుసరించిన తర్వాత పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. రుణగ్రహీతలు నేరుగా పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.మరి వడ్డీ రేటు ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకానికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (SFB), సహకార బ్యాంకుల వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు (NBFC) వడ్డీ రేట్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి. ఎంఎంఫ్ఐలు (non NBFC) ఆర్బీఐ మార్గదర్శకాల పరిధిలోకి రాని ఇతర కేటగిరి సంస్థలకు ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పథకం కింద వడ్డీ రేట్లు వర్తిస్తాయి. -
ఏ హామీ లేకుండానే లోన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని త్వరలోనే కేబినెట్ ముందు ఉంచుతామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.బెంగళూరులో జరిగిన నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ స్కీమ్ గురించి వెల్లడించారు. ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎంఎస్ఎంఈలకు ఏకంగా రూ. 100 కోట్ల వరకు రుణాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఈ పథకానికి కేంద్ర మంత్రి మండలి అనుమతి దక్కితే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ.. బ్యాంకుల ద్వారా లోన్ అందిస్తుంది. కేంద్రం అందించే ఈ లోనుకు ఎలాంటి హామీ అవసరం లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.ఎంఎస్ఎంఈలు బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్‌ను పొందవచ్చు. కానీ వారికి టర్మ్ లోన్లు, ప్లాంట్.. మెషినరీ కోసం లోన్ లభించడం లేదని ఈ సందర్భంగా సీతారామన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టనున్న కొత్త పథకం ద్వారా.. ప్లాంట్స్, యంత్రాలకు కూడా లోన్స్ అందించనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: రతన్ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీఎంఎస్ఎంఈ రంగంలో కర్ణాటక చేస్తున్న కృషిని సీరాటమన్ ప్రశంసిస్తూ.. రాష్ట్రంలో 35 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని, అవి 1.65 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందని, ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని ఆమె అన్నారు. -
బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే...
బంగారం ఆర్థికంగా ఆపదలో ఆదుకుంటుందని అందరూ చెబుతారు. అవసరాలకు డబ్బు అందనపుడు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి అప్పు తెస్తుంటారు. ప్రైవేటు వ్యాపారులు, ఎన్బీఎఫ్సీలు, ప్రభుత్వ బ్యాంకులు బంగారం తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తుంటాయి. అయితే ఇతర సంస్థలు కంటే ప్రభుత్వరంగ బ్యాంకులు బంగారం తనఖాపై తక్కువే రుణం ఇస్తుంటాయి. అయినా తమ సొమ్మకు భరోసా ఉంటుందని భావించి ప్రజలు ప్రభుత్వ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. సదరు బ్యాంకులో దురదృష్టవశాత్తు నగలు ఎవరైనా దొంగలిస్తే తనఖాపెట్టిన బంగారానికి గ్యారెంటీ ఎవరనే ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా? అయితే ఓ బ్యాంకు అధికారి ఇలా తనఖా పెడుతున్న బంగారానికి సంబంధించి భద్రత ఎవరిపై ఉంటుందనే అంశాలను వెల్లడించారు. తనఖా పెట్టిన ఆభరణాల బాధ్యత బ్యాంకుదే అవుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందకూడదన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలను బ్యాంకు అధికారులు ‘సేఫ్’లో భద్రపరుస్తారు. బ్యాంకుశాఖలోని ఎకౌంటెంట్‌తో పాటు క్యాష్ ఇన్‌ఛార్జి (క్లర్క్) లేదా మరో అధికారి సంయుక్తంగా వీటికి బాధ్యత వహిస్తారు. ఈ సేఫ్ తాళాలు ఇద్దరి దగ్గరే ఉంటాయి. ఒకరిని గుడ్డిగా నమ్మి, వేరొకరు ఇతరులకు తాళాన్ని ఇస్తే తప్పా సొత్తును అపహరించడం కష్టం. ఇదీ చదవండి: భోజన సమయంలో కింద కూర్చుంటే రూ.220 జరిమానా..! బ్యాంకు శాఖల్లో ఆడిట్ జరిగినప్పుడు ఆభరణాలు ఏమైనా తగ్గితే.. వెంటనే పరిశీలన జరిపి, లెక్క తేలుస్తారు. కొందరు రుణం తీర్చేసినప్పుడు వారికి ఆభరణాలు ఇచ్చేసినా.. పొరపాటున సేఫ్‌లోనూ ఉన్నట్లు అధికారులు రాసుకుంటారని పదవీవిరమణ చేసిన మరో బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. ఏదైనా కారణాలతో బ్యాంకులోని బంగారం కనిపంచకుండాపోతే రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకులో నమోదయ్యే బంగారం బరువు మేరకు ఖాతాదార్లు పరిహారం పొందొచ్చని తెలిపారు. ఉదాహరణకు 100 గ్రాముల ఆభరణం తనఖా పెడితే, 98 గ్రాములను పరిగణనలోకి తీసుకుని.. దానికి సరిపడా బంగారం గానీ, దాని విలువ మేరకు నగదును కానీ పొందే హక్కు ఖాతాదార్లకు ఉంటుంది. తనఖా పెట్టినప్పటి ధర, చోరీ జరిగినట్లు గుర్తించినప్పటి ధరలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తారని సీనియర్ అధికారి వివరించారు. -
గుడ్‌న్యూస్: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..
చేతివృత్తుల వారు, సంప్రదాయ హస్తకళాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా 'పీఎం విశ్వకర్మ' (PM Vishwakarma) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తాజాగా ప్రారంభించారు. ఈ పథకం కింద సంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి పూచీకత్తు అవసరం లేకుండా అతి తక్కువ వడ్డీకి రుణసాయం అందిస్తారు. ఐదేళ్ల కాలానికి రూ. 13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో ఈ పథకం చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, బార్బర్లతో సహా సంప్రదాయ హస్తకళాకారులకు చెందిన 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సాంప్రదాయ హస్తకళాకారులు, చేతివృత్తుల వారి ఉత్పత్తులు, సేవల్లో నాణ్యతను పెంచి తద్వారా వారికి మరింత ఆదరణను పెంచడమే ఈ పథకం లక్ష్యం. రెండు విడతల్లో.. పీఎం విశ్వకర్మ పథకం కింద లబ్ధిదారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా మొదటి విడతలో రూ. 1 లక్ష రుణం అందిస్తారు. దీన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రెండో విడతలో రూ. 2 లక్షలు అందిస్తారు. ఈ రుణాన్ని 30 నెలలలో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేటు విషయానికి వస్తే లబ్ధిదారుల నుంచి కేవలం 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మిగిలిన 8 శాతం వడ్డీని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. క్రెడిట్ గ్యారెంటీ ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇతర ప్రయోజనాలు పీఎం విశ్వకర్మ పథకం కింద తక్కువ వడ్డీ లోన్‌తోపాటు మరికొన్ని ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. లబ్ధిదారులకు మొదట 5-7 రోజుల (40 గంటలు) ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారి నైపుణ్యాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు ఇస్తారు. మరింత ఆసక్తి గల అభ్యర్థులు 15 రోజుల (120 గంటలు) అధునాతన శిక్షణ కోసం కూడా నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులకు శిక్షణా కాలంలో రోజుకు రూ. 500 చొప్పున స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అంతేకాకుండా, టూల్‌కిట్ ప్రోత్సాహకంగా రూ. 15,000 అందిస్తారు. తర్వాత వారి వృత్తిలో భాగంగా నిర్వహించే డిజిటల్ లావాదేవీలకు ఒక్కోదానికి రూ. 1 చొప్పున నెలవారీ 100 లావాదేవీల వరకు ప్రోత్సాహకం చెల్లిస్తారు. లబ్ధిదారుల ఉత్పత్తులకు నాణ్యతా ధ్రువీకరణ, బ్రాండింగ్, ప్రమోషన్, ఈ-కామర్స్ అనుసంధానం, ట్రేడ్ ఫెయిర్స్ ప్రకటనలు, ప్రచారం, ఇతర మార్కెటింగ్ కార్యకలాపాలు వంటి సేవలను జాతీయ మార్కెటింగ్ కమిటీ అందిస్తుంది. అర్హతలు స్వయం ఉపాధి ప్రాతిపదికన అసంఘటిత రంగంలో పని చేసే చేతివృత్తులపై ఆధారపడినవారు ఈ పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో పేర్కొన్న 18 కుటుంబ ఆధారిత సాంప్రదాయ హస్తకళలు లేదా చేతివృత్తుల్లో ఏదో ఒకదానిలో నిమగ్నమైనవారు ఈ పథకానికి అర్హులు. అలాగే రిజిస్ట్రేషన్ తేదీ నాటికి లబ్ధిదారుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. -
తండ్రి బకాయి కోసం.. కుమార్తెతో 52 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. తుపాకీ చూపించి..
బీహార్‌లోని భాగల్పూర్లో ఒక తండ్రి తన మైనర్ కుమార్తెను వయసుమీరిన వ్యక్తికి ఇచ్చి, వివాహం చేసిన ఉదంతం సంచలనంగా మారింది. ఆ బాలికకు ఈ వివాహం ఏమాత్రం ఇష్టంలేకపోయినప్పటికీ, తండ్రి బలవంతంగా ఈ వివాహాన్ని జరిపించాడు. వివాహం అనంతరం బాధిత బాలిక ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్చేస్తూ, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది. ఆ 16 ఏళ్ల బాలిక తాను చదువుకోవాలనుకుంటున్నానని, తనకు న్యాయం చేయని పక్షంలో ప్రాణాలు తీసుకుంటానని పేర్కొంది. బాలిక పుట్టింటివారు జార్ఖండ్‌లోని గోడ్డా జిల్లాలో ఉంటారు. ఈ వీడియోలో ఆ బాలిక తన తల్లి గత ఏడాది అంటే 2022 డిసెంబరులో మృతి చెందిందని తెలిపింది. తన తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. తన తండ్రిపై అప్పుల భారం ఉందని తెలిపింది. తన తండ్రికి రుణం ఇచ్చిన ఒక వ్యక్తి.. ఈ రుణం తీర్చేందుకు బదులుగా కుమార్తె(తన)తో వివాహం చేయించాలని కోరాడని తెలిపింది. దీనికి తన సవతి తల్లి వంతపాడిందని, తనకు ఈ వివాహం ఏమాత్రం ఇష్టం లేదని పేర్కొంది. అయితే గత జూలైలో బలవంతంగా ఆ వ్యక్తితో తనకు వివాహం జరిపించారని ఆమె పేర్కొంది. పెళ్లి అయ్యాక తాను భాగల్పూర్ చేరుకున్నానని, తన భర్త తనను నిత్యం కొడుతుంటాడని, నిందిస్తుంటాడని బాధితురాలు తెలిపింది. తుపాకీ చూపించి, తనతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడని, ఈ వేధింపులను తాను భరించలేకపోతున్నానని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. కాగా ఆ బాలిక తన భర్త, తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, వారు ఎటువంటి సహాయం చేయకపోగా, ఇది తమ పరిధిలోని కేసు కాదని ఆమెను పంపించివేశారు. దీంతో బాధితురాలు డీఐజీ కార్యాలయానికి చేరుకుని, అక్కడి సిబ్బందికి తన ఆవేదన తెలియజేసినా వారు పట్టించుకోలేదు. దీంతో పూర్తిగా విసిగిపోయిన ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ ఒక వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో భాగల్పూర్ ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇది కూడా చదవండి: అది రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట! -
భర్త లోన్ చెల్లించలేదని.. భార్యపై వడ్డీ వ్యాపారి దారుణం..
పుణె: మహారాష్ట్రలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి లోన్ చెల్లించలేదని అతని భార్యను ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు వెల్లడించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు వడ్డీ వ్యాపారి వద్ద కొంత మొత్తంలో డబ్బును లోన్ రూపంలో తీసుకున్నాడు. కానీ సకాలంలో లోన్ చెల్లించలేకపోయాడు. దీంతో వడ్డీ వ్యాపారి దారుణంగా ప్రవర్తించారు. బాధితున్ని కత్తితో బెదిరించి.. అతని భార్యను అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను ఫోన్లో రికార్డ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘోరం బాధితుని కళ్లముందే జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితున్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌తో సహా.. సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
రుణమెప్పుడొస్తది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను రుణం కింద సమకూర్చుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే సబ్సిడీ గొర్రెల పంపిణీ చేపట్టాలని సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశాలిచ్చారు. ఆ మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చకచకా చేస్తున్నారు. కానీ, ఈ పథకం రెండో దఫా రాష్ట్రంలో అమలు చేయాలంటే రూ.4,565 కోట్ల రుణం కావాలి. ఈ రుణాన్నిచ్చేందుకు జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ఆమోదం తెలిపి కూడా ఆరునెలలు దాటిపోయింది. కానీ, ప్రభుత్వ పూచీకత్తు లభించకపోవడంతో ఆ ఆమోదం కాగితాలకే పరిమితం అయింది. ఇప్పుడు కేబినెట్ ఆమోదంతో ఆ రుణం ఎప్పుడు వస్తుందా అని పశుసంవర్ధక శాఖ అధికారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటివరకు గొర్రెల కొనుగోలు కోసం తమ వద్ద ఉన్న రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టగలమని, ఆ తర్వాత ఎన్సీడీసీ రుణంపైనే ఆధారపడాల్సి ఉంటుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు రుణం వస్తుందనే ఆశతో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నగదు బదిలీతో కాదు.. వాస్తవానికి, ఈ పథకం కింద గొర్రెల పంపిణీని నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించినా ఆ తర్వాత వెనక్కు తగ్గింది. పైలట్‌గా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమచేసి గొర్రెలు కొనుగోలు చేపట్టింది. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురుకావడంతో మళ్లీ పాత తరహాలోనే ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన గొర్రెలను లబ్దిదారుల వద్దకు చేర్చేందుకు అవసరమైన రవాణా కాంట్రాక్టు టెండర్లను జిల్లా స్థాయిలో పిలవగా, ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతోంది. ఈ టెండర్ల ఖరారయిన తర్వాత గొర్రెల కొనుగోలు, పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెపుతున్నారు. కొనుగోలు బాధ్యత జిల్లా అధికారులకు.. కొనుగోలు కోసం జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పజెపుతున్నారు. గతంలో మండల స్థాయిలో పశుసంవర్ధక శాఖ అధికారులతో కొనుగోళ్లు జరిపించగా, ఈసారి మాత్రం జిల్లా స్థాయి అధికారులతో (డీఆర్వో, ఆర్డీవో, పీడీ డీఆర్డీఏ, జిల్లా వ్యవసాయాధికారులు, ఇతర శాఖలకు చెందిన జిల్లా అధికారులు) కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నారు. గొర్రెల కోసం ఇప్పటివరకు 30వేల మందిలోపు లబ్దిదారులే డీడీలు తీయగా, మిగిలిన వారి చేత కూడా డీడీలు కట్టించే పనిలో స్థానిక అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఏప్రిల్ 14 తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ పథకం అమలు చేపడతామని, ఏప్రిల్ నెలాఖరు కల్లా ఎన్సీడీసీ రుణం వస్తుందని ఆశిస్తున్నామని పశుసంవర్ధక శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
కారు ఈఎమ్ఐ చెల్లించే సులభమైన టిప్స్, ఇవే!
చాలామంది కార్లను ఈఎమ్ఐ పద్దతిలో కొనుగోలు చేస్తూ ఉంటారు, మొదట్లో బాగున్నప్పటికీ క్రమంగా కార్ ఈఎమ్ఐ భారంగా మారుతుంది. అయితే కారు లోన్ చెల్లించడానికి కొన్ని సులమైన మార్గాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. కారుని సెలక్ట్ చేసుకోవడం: కొనుగోలుదారుడు ముందుగా తాను ఎలాంటి కారు కొనాలనేది డిసైడ్ చేసుకోవాలి. కారు కొనడానికి మీ ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. తక్కువ డబ్బుతో కారు కొనాలనుకున్నప్పుడు హ్యాచ్‌బ్యాక్ ఎంచుకోవడం మంచిది. ప్రీమియం SUV ఎంచుకుంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. డౌన్ పేమెంట్ పెంచుకోవడం: నిజానికి మీరు మొదట్లో చెల్లించే డౌన్ పేమెంట్ మీద కూడా ఈఎమ్ఐ ఆధారపడుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం వల్ల చెల్లించాల్సిన ఈఎమ్ఐ తగ్గుతుంది. మొత్తం వడ్డీ మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. అడిషినల్ ఈఎమ్ఐ చెల్లించడం: మీరు ఎంచుకునే ఈ అడిషినల్ ఈఎమ్ఐ వల్ల లోన్ భారం కొంత తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లోన్ కాలపరిమితి, వడ్డీ రేటు రెండూ కూడా తగ్గుతాయి. ఉదాహరణకు నెలకు రూ. 19,500 చెల్లిస్తున్నారనుకుంటే, అదనంగా ప్రతి నెల రూ. 500 చెల్లించాలి. అప్పుడు మీరు నెలకు రూ. 20,000 చెల్లించవచ్చు. ఇది ఈఎమ్ఐ చివరలో కొంత ఉపశమనం కలిగిస్తుంది. లోన్ ముందస్తుగా చెల్లించడం: మీరు తీసుకున్న లోన్ లేదా ఎంచుకున్న ఈఎమ్ఐ ముందస్తుగా చెల్లించడం వల్ల అది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ముందుగానే ఈ ఎంపిక గురించి తెలుసుకోవాలి, అప్పుడు మీకు వడ్డీ ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం: మీరు ప్రతి నెల లోన్ చెల్లిస్తున్నట్లయితే తప్పకుండా అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు మీకు ఆర్ధిక భారాన్ని పెంచుతాయి. అయితే మీరు కారు కొనేటప్పుడే నిత్యావసరాల ఖర్చులను కూడా అంచనా వేసుకోవాలి. ఇవన్నీ ఈఎమ్ఐ తొందరగా క్లియర్ సహాయపడతాయి. -
వేలల్లో రుణం.. లక్షల్లో వసూళ్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజమహేంద్రవరానికి చెందిన దుర్గారావు దంపతులు, పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన శివ రుణ యాప్‌ల వేధింపులు తాళలేక ఇటీవల చేసుకోవడం రాష్ట్ర వాప్తంగా కలకలం సృష్టించింది. ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో మంది యాప్‌ల నిర్వాహకులు పంపిన అసభ్యకర మార్ఫింగ్ వీడియోలకు జడిసి అర్ధంతరంగా తనువు చాలించడం చర్చనీయాంశమైంది. కొంత మంది బాధితులు మాత్రమే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలోనూ ఒక మహిళ తాను తీసుకున్న రూ.5 వేల రుణానికి రూ.12 వేలకుపైగా చెల్లించినా.. అసభ్య వీడియోలతో బెదిరించడంతో విశాఖ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో విశాఖ పోలీసుల విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటకొచ్చాయి. రుణయాప్‌ను డౌన్లోడ్ చేసుకునే సమయంలో మన ఫోన్చ్లోని కాంటాక్ట్ నంబర్లు, గ్యాలరీలోని ఫొటోలకు యాక్సెస్‌ను తీసుకుంటారు. తద్వారా మన కాంటాక్ట్‌లోని నంబర్లకు రుణం తీసుకున్న వారి గురించి చెడుగా ప్రచారం చేయడంతో పాటు గ్యాలరీలో నుంచి కుటుంబ సభ్యుల ఫొటోలను తీసుకుని మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి భయపెడుతున్నారు. చైనా నుంచి ఆపరేట్ అవుతున్న ఈ రుణయాప్‌ల స్థావరాలు నేపాల్, బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో, దేశంలో స్థానికంగా ఉండే వివిధ వ్యక్తుల నుంచి కరెంట్, ఫర్మ్ బ్యాంకు అకౌంట్లను కొనుగోలు చేసి.. వీటి ద్వారా మొత్తం ఆర్థిక వ్యవహారాలను సాగిస్తున్నారు. తక్కువ రుణం ఇచ్చి, భారీగా వసూలు చేసి.. అందులో కొంత మొత్తాన్ని ఇక్కడ తమకు ఫర్మ్, కరెంటు అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్ కింద చెల్లిస్తున్నారు. మిగిలిన భారీ మొత్తాన్ని డాలర్లలోకి మార్చుకుని బిట్ కాయిన్స్ రూపంలో చైనాకు తరలిస్తున్నారు. ఈ అకౌంట్లన్నింటినీ ఆన్లైన్లో చైనా నుంచే నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ అకౌంట్ల నిర్వహణకు ఇక్కడి వారి నుంచి ఓటీపీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు హాంకాంగ్‌కు చెందిన కెవిన్ అనే వ్యక్తి సూత్రధారిగా తేలింది. ఇతనికి బ్యాంకు అకౌంట్లు విక్రయించిన వారు సుమారు 250 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. ఒక్కొక్కరి అకౌంట్ల ద్వారా రూ.150 కోట్ల మేర లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. లోన్ యాప్‌లు.. విష వలయాలు విశాఖకు చెందిన గిరి ఒక ఆటోడ్రైవర్. తొలుత ఒక రుణయాప్ నుంచి రూ.5 వేలు ఫిబ్రవరిలో రుణం తీసుకున్నాడు. అయితే, ఆయనకు నికరంగా డిపాజిట్ అయ్యింది రూ.3,500 మాత్రమే. అనంతరం వారి రుణాన్ని వారంలోగా చెల్లించేందుకు మరో రుణ యాప్ ద్వారా మరికొంత రుణం తీసుకున్నాడు. అయితే రుణం తీర్చినప్పటికీ మరింత చెల్లించాల్సిందేనంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. వారి కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపిస్తామంటూ బెదిరించసాగారు. దీంతో మొత్తం 13 రుణయాప్‌ల నుంచి సుమారు లక్ష రూపాయల మేర రుణం తీసుకున్నాడు. వీరికి ఏకంగా రూ.3,65,000 మేర చెల్లించారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో చివరకు ఆగస్టులో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఒక రుణయాప్‌లో తీసుకున్న రుణానికి మించి భారీగా చెల్లించాల్సి రావడంతో మరొక రుణయాప్‌ను ఆశ్రయించేలా ఓ పథకం ప్రకారం వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది. కెవిన్ లాంటి వారు సృష్టించిన విష వలయంలో ఎంత మేర ఇండియా కరెన్సీ బిట్‌కాయిన్స్ రూపంలో చైనాకు తరలిపోతోందో అంచనాలకు అందడం లేదు. 2 వేల మంది ఉద్యోగులు వాస్తవానికి మొదట్లో చైనా నుంచి ఆపరేట్ చేస్తున్న రుణయాప్‌ల నిర్వాహకులు శ్రీలంకలో కార్యాలయాలను ప్రారంభించారు. అయితే శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో తమ స్థావరాలను నేపాల్, బంగ్లాదేశ్‌లకు మార్చారు. ఏకంగా 2 వేల మంది ఉద్యోగులతో పనిచేసే కార్యాలయాన్ని నేపాల్‌లో నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో కూడా ఇదే తరహాలో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఒక సెంటర్ నుంచి నిరంతరాయంగా రుణం తీసుకున్న వారికి బెదిరింపు కాల్స్ వెళుతుంటాయి. మరో సెంటర్ నుంచి రుణం తీసుకున్న వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలను పంపుతున్నారు. ఇక్కడ పని చేసే వారిలో అనేక మంది భారత్ నుంచి వెళ్లిన వారే. అక్కడి నుంచి ఫోన్ కాల్స్ అన్నీ ఇండియా సిమ్‌కార్డుల నుంచే వస్తుండటం గమనార్హం. ఇండియా సిమ్స్‌ను సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ రుణ యాప్‌లను ఎవరూ ఆశ్రయించకుండా అవగాహన కల్పించడమే ప్రస్తుతం ప్రాధాన్యత అంశమని విశాఖ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ చెబుతున్నారు. -
ప్రాణం పోతది స్వామి.. లోన్ యాప్ జోలికి పోమాకు..
► ‘అన్నా.. లోన్ యాప్స్ జోలికి పోకే.. ఆళ్లు జలగ లెక్క.. నీ రత్తాన్ని పీల్సి పీల్సి పాణం తీస్తారన్నా..’ ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరో బాలికను కలిసి తిరిగి వెళ్లేప్పుడు వచ్చే సీన్ ఇలా మీమ్‌గా మారింది. ► ఏ శ్రీవల్లి ఆన్లైన్ లోన్ యాప్‌లో అప్పు చేసి పట్టీలు కొన్నానే.. ప్రాణం పోతది స్వామి.. లోన్ యాప్ జోలికి పోమాకు.. పుష్ప సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సంభాషణను ఇలా మార్చారు.. ► ‘తల్లి : ఒరే.. లోన్ యాప్‌లో అప్పు చేసి గోల్డ్ తీసివ్వరా.. హీరో : లోన్ తీసుకుంటే మనకు చుక్కలే కనిపిస్తాయి అమ్మా..’ రఘువరన్ బీటెక్ సినిమాలో తల్లీకొడుకుల మధ్య జరిగిన సీన్ ఇలా మీమ్‌గా మారింది. నెల్లూరు(క్రైమ్): సోషల్ మీడియాలో మీమ్స్ చాలా ఫేమస్. సినిమాల్లోని గుర్తుండిపోయే సీన్లను సమకాలిన అంశాలకు తగినట్లుగా మీమ్స్‌గా మారుస్తుంటారు. వాటిలో కొన్ని చూడగానే నవ్వొస్తుంది. మరికొన్ని ఆలోచింపజేస్తుంటాయి. చాలామంది వాటిని షేర్ చేస్తుంటారు. జిల్లా పోలీస్ శాఖ సైబర్ నేరాలపై వినూత్న ప్రచారానికి తెరలేపింది. ప్రజలు లోన్ యాప్స్ వలలో చిక్కుకోకుండా అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అందులో మీమ్స్ ద్వారా ప్రచారం ఒకటి. సైబర్ నేరాల విషయంలో.. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఫేక్ లింకులు పంపి, ఓటీపీలు అడిగి అందిన కాడికి దోచేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో కేసులు పోలీసు రికార్డులకెక్కుతున్నాయి. నిందితులు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో పోలీసులు వారిని పట్టుకోలేకపోతున్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసు ఉన్నతాధికారులు చెబుతూనే ఉన్నారు. కాగా ఇప్పటికే నేరం జరిగిన వెంటనే 1930, సైబర్‌మిత్ర 9121211100, సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌తో పాటు స్థానిక పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కలి్పస్తున్నారు. కొంతకాలం క్రితం.. జిల్లాకు చెందిన ఓ మహిళ లోన్ యాప్‌లో రూ.2,500 నగదు తీసుకున్నారు. యాప్‌కు సంబంధించిన ఓ వ్యక్తి ఆమెను బ్లాక్మెయిల్ చేసి రూ.70,000 వరకు కట్టించుకున్నాడు. అయితే ఇంకా బాకీ ఉందని వేధించాడు. ఆమెను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఫేస్బుక్లో పేజీ పేరు : నెల్లూరు పోలీస్ ఫాలోవర్ల సంఖ్య : 49,000 లోన్ యాప్స్‌పై.. ఇన్స్టెంట్ లోన్ యాప్స్. ఇటీవలి కాలంలో యాప్స్ నిర్వాహకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. తక్కువ మొత్తం అప్పు ఇచ్చి ఎక్కువ నగదు కట్టించుకోవడం.. కట్టలేని వారిని బెదిరించడం జరుగుతోంది. ఫొటోలను మారి్ఫంగ్ చేసి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండేవాళ్ల వాట్సాప్ అకౌంట్‌కు పంపుతున్నారు. ఈ యాప్స్ వల్ల అధికశాతం మంది మోసాలు, వేధింపులకు గురవుతుండడంతో పోలీస్ శాఖ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినిమాల్లోని పాపులర్ సీన్లతో మీమ్స్ చేసి ఫేస్‌బుక్‌లోని నెల్లూరు పోలీస్ పేజీలో తదితర వాటిల్లో పోస్ట్ చేస్తున్నారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఈ పోస్టులు ఉంటున్నాయి. దీంతో వాటిని బాగా షేర్ చేస్తున్నారు. -
అడ్డగోలు ఈఎంఐలు.. భర్తపై కోపంతో బలవన్మరణం
కృష్ణా (మచిలీపట్నం): ఇంట్లో వాయిదాల పద్ధతిపై కొనుగోలు చేసిన వస్తువుల కారణంగా ఏర్పడిన వివాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అనవసరమైన ఖర్చులు పెడుతూ పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నాడంటూ భర్తపై కోపం తెచ్చుకున్న భార్య ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ నాగకళ్యాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మచిలీపట్నం అరుణోదయకాలనీకి చెందిన రాగోలు సత్యవతి (25) అదే కాలనీకి చెందిన అశోక్‌బాబును ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం నారాయణపురంలో నివాసం ఉంటున్నారు. సజావుగా సాగిపోతున్న వీరి కాపురంలో ఈఎంఐలు కలతలు రేపాయి. భర్త ఇంట్లోకి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మిషన్ తదితర వస్తువులను వాయిదాల పద్ధతిలో ఇటీవల కొనుగోలు చేశాడు. ప్రతి నెల వాయిదాలు చెల్లించటం కష్టంగా మారటంతో సత్యవతి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా అప్పులు చేసి వస్తువులు కొనుగోలు చేయటం మనకు అవసరమా అంటూ మందలించటం మొదలుపెట్టింది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుండగా బుధవారం తీవ్ర మనస్తాపానికి చెందిన సత్యవతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తండ్రి రాజేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
మన రూపాయి పవర్ ఏంటో చూపించాలి - ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలో భారతీయ బ్యాంకులను, కరెన్సీని కీలక భాగంగా చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవడంపై ఆర్థిక సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘మన దేశీ బ్యాంకులు, కరెన్సీని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంలో కీలక పాత్ర పోషించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది‘ అని మోదీ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల నిర్వహణలో వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు వివరించారు. ఇదే సందర్భంగా ’జన్ సమర్థ్’ పోర్టల్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. 13 రకాల ప్రభుత్వ రుణాల స్కీములకు సంబంధించిన పోర్టల్‌గా ఇది పని చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, చిన్న తరహా పరిశ్రమల వ్యాపారవేత్తలకు రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు జన్ సమర్థ్ తోడ్పడుతుంది. వారి జీవితాలను మెరుగుపర్చడంతో పాటు తమ లక్ష్యాలను సాధించుకోవడంలో తోడ్పడగలదు‘ అని మోదీ పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సర్వీసులను అందించేందుకు అనువైన అనేక ప్లాట్‌ఫామ్‌లను భారత్ అభివృద్ధి చేసిందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక నాణేల సిరీస్ ఆవిష్కరణ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక సిరీస్ నాణేలను ప్రధాని ఆవిష్కరించారు. రూ. 1, రూ. 2, 5, 10, రూ. 20 డినామినేషన్లలో ఇవి ఉంటాయి. వీటిపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) డిజైన్ ఉంటుంది. ఇవి స్మారక కాయిన్లు కాదని, యథాప్రకారం చెలామణీలో ఉంటాయని ప్రధాని తెలిపారు. అమృత ఘడియల లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం గురించి ప్రజలకు నిరంతరం గుర్తు చేసేలా, దేశ అభివృద్ధి కోసం పని చేసేలా ప్రోత్సహించేందుకు కొత్త సిరీస్ నాణేలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు. -
ఎంఎస్ఎంఈలకు రూ.6,062 కోట్లు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ప్రపంచబ్యాంకు సహకారంతో కూడిన 6,062 కోట్ల పథకానికి (ర్యాంప్) ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా మార్కెట్ అనుసంధానత, రుణ సాయం మెరుగుపడనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ర్యాంప్ అమల్లోకి వస్తుందని ప్రభు త్వం తెలిపింది. రూ.6,062 కోట్లలో రూ.3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,312 కోట్లను కేంద్రం సమ కూరుస్తుంది. కరోనా తర్వాత ఎంఎస్ఎంఈ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం తెలిసిందే. -
మనీ లేదాయె.. ‘మంద’ రాదాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఓ ప్రహసనంగా మారింది. బాలారిష్టాలు, అవినీతి ఆరోపణలు, రీసైక్లింగ్ విమర్శల నడుమ మొదటి విడత గొర్రెల పంపిణీ జరగ్గా, రెండో విడత పంపిణీకి నిధుల లేమి అడ్డంకిగా ఉంది. మొదటి విడతలో నాలుగేళ్లపాటు జాప్యం చేసి 3.8 లక్షల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా అర్థంకాని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 3.6 లక్షల యూనిట్లను మంజూరు చేసేందుకు అవసరమయ్యే రూ. 6 వేల కోట్లను రుణం కింద ఇవ్వా లని జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ)కు 4 నెలల క్రితమే రాష్ట్ర గొర్రెల సమాఖ్య లేఖ రాసినా ఇప్పటివరకు అతీగతీ లేదు. అసలు రుణం వస్తుందో లేదో కూడా అర్థం కాని దుస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో గొర్రెల పంపిణీకి రూ.1,000 కోట్లు కేటాయించడం గమనార్హం. సమావేశం జరగలేదట! వాస్తవానికి, హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే ముందే రెండో విడత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 3.6 లక్షల యూనిట్ల పంపిణీకి గొర్రెలు, మేకలు పెంపకందారుల సమాఖ్యకు అనుమతినిచ్చింది. కానీ, ఇప్పటివరకు కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో పంపిణీ చేసిన 3–4 వేల యూనిట్లు తప్పితే అదనంగా ఒక్క గొర్రెనూ పంపిణీ చేయలేదు. ఇందుకు ఎన్సీడీసీ రుణమే అవరోధంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎన్సీడీసీ బోర్డు సమావేశం జరగనందునే ఇంకా రుణం మంజూరు కావడం లేదని అధికారులు పైకి చెపుతున్నా.. ఆ రుణం మంజూరు లో ఎక్కడో తకరారు జరిగిందనే వాదన కూడా ఉంది. పెండింగ్‌కు ఎప్పుడు మోక్షం రెండో విడత అటుంచితే మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న యూనిట్లను కూడా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఇందులో 21 గొర్రెలు ఒక యూనిట్‌గా లబ్ధిదారులకు ఇచ్చే యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా, దాన్ని గత ఏడాది రూ.1.75లక్షలకు పెంచారు. అంటే లబ్ధిదారుల వాటా కింద చెల్లించాల్సిన రూ.31,250కి తోడు అదనంగా రూ.12,500 చెల్లించాల్సి వచ్చింది. నాలుగేళ్ల క్రితమే డీడీలు కట్టినా ప్రభు త్వ జాప్యం వల్లనే తమకు గొర్రెలు రాలేదని, అందువల్ల ఆ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని లబ్ధిదారులు అప్పట్లో కోరారు. కానీ, గొర్రెల సమాఖ్య ఒప్పుకోలేదు. రుణ నిబంధనలు అంగీకరించవంటూ అదనపు వాటానూ కట్టించుకున్నారు. కానీ, అదనపు వాటా కట్టిన 28 వేల మం దికి పైగా లబ్ధిదారుల్లో 2 వేల మందికి ఇప్పటివరకు గొర్రెల పంపిణీ చేయలేదు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలానికి చెందిన గొర్రెల పెంపకందారులు అదనపు వాటా చెల్లించి రెండు నెలలైనా ఎదురుచూపులు తప్పలేదు. రూ. 500 కోట్లు చేతులు మారాయి మొదటి విడత గొర్రెల పంపిణీలో అవినీతి ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. హైదరాబాద్‌లోని పశుసంవర్థక శాఖ ప్రధాన కార్యాలయంలోని ఓ కీలక వ్యక్తి కనుసన్నల్లోనే వ్యవహారమంతా సాగిందని, యూనిట్‌కు రేటు పెట్టి కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రూ.4 వేల కోట్ల వ్యయంతో సాగిన పంపిణీలో రూ.500 కోట్ల వరకు చేతులు మారాయనే చర్చ పశుసంవర్థక శాఖలో బహిరంగ రహస్యమే కావడం గమనార్హం. పంపిణీ కోసం దళారులు యూనియన్లుగా మారి ఒకచోట సమావేశమయ్యేంత స్థాయిలో అవినీతి జరిగిందని సమాచారం. ఇక, ఆ తర్వాత ఓ ప్రైవేటు సంస్థకు గొర్రెలను ఎంపిక చేసే కాంట్రాక్టును కట్టబెట్టినా.. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆ సంస్థను తప్పించారు. క్షేత్రస్థాయిలోని పశువైద్యుల మొదలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలున్నాయి. అధికారులు కొన్నిచోట్ల లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండా రూ.60–70 వేల వరకు డబ్బులిచ్చి అవకతవకలకు పాల్పడినట్లు కూడా వినిపిస్తోంది. నగదు బదిలీనే పరిష్కారం గొర్రెల పంపిణీలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుందని పథకం మార్గదర్శకాల్లో పెట్టారు. కానీ, ఒక్కరోజు కూడా సీఎంవో సమీక్షించలేదు. అసలు దళారులను ఎవరు ప్రోత్సహిస్తున్నారో తేల్చాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే గొల్ల, కుర్మలకు నగదు బదిలీ చేసి.. నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశమివ్వాలి. ఆ తర్వాత ఆరునెలల్లో ఎప్పుడైనా తనిఖీ చేసి దుర్వినియోగం చేసినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలి. మొదటి విడత పెండింగ్ యూనిట్లను పంపిణీ చేసి, బడ్జెట్లో పెట్టిన రూ.1,000 కోట్ల నిధులతో రెండో విడత పంపిణీని కూడా త్వరగా చేపట్టాలి. – ఉడుత రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం -
పేటీఎం బంపరాఫర్!! క్షణాల్లో రూ.5లక్షల లోన్,అప్లయ్ చేయండిలా!
Paytm Loan Process: ప్రముఖ డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం బంపరాఫర్ ప్రకటించింది. చిరు వ్యాపారులకు ఎలాంటి రుసుము లేకుండా రూ.5లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రోజూ ఈఎంఐ చెల్లించే అవకాశాల్ని కల్పించింది. బిజినెస్ కోసం వ్యాపారులు పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చు. పూర్తి డిజిలైజేషన్ పద్దతిలో జరిగే లోన్ ప్రక్రియలో అదనపు పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. వ్యాపారులు పేటీఎంలో బిజినెస్ లోన్ కోసం ప్రయత్నిస్తుంటే రోజూవారీ లావాదేవీలపై అల్గారిథమ్ని ఉపయోగించి అతని క్రెడిట్ అర్హతను గుర్తించి పేటీఎం యాప్ పెద్దమొత్తంలో లోన్‌ను మంజూరు చేస్తుంది. లోన్ పొందడానికి వ్యాపారులు యాప్‌లో ఐదు పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. ►అందుబాటులో ఉన్న ఆఫర్‌ను చెక్ చేసేందుకు లోన్ కావాలనుకునే వ్యాపారి పేటీఎం యాప్‌ని తెరిచి, ‘బిజినెస్ లోన్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అవసరాన్ని బట్టి, వ్యాపారి రుణ మొత్తాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ► అర్హతను బట్టి మీకు వచ్చే లోన్ ఎంతో మీకు డిస్ప్లే అవుతాయి. అందులో రోజువారీ ఈఎంఐ ఎంత? గడువు దాటితే ఎంత ఫైన్ విధిస్తారు. ఎన్ని సంవత్సరాల్లో లోన్ కట్టాల్సి ఉంటుందనే విషయాలు మీకు కనిపిస్తాయి . ►అనంతరం లోన్ పొందుతున్న వ్యక్తి వివరాలను నిర్ధారించడానికి చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి, కొనసాగించడానికి ‘గెట్ స్టార్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ► సీకేవైసీ నుండి కేవైసీలో అనుమతి ఇవ్వడం ద్వారా వ్యాపారి కనీస డాక్యుమెంటేషన్ లోన్ యాప్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ►ఈ సందర్భంగా పాన్ వివరాలు, పుట్టిన తేదీ, ఇమెయిల్, అడ్రస్‌ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది రుణాన్ని మంజూరు చేసే ముందు పాన్, క్రెడిట్స్కోర్,కేవైసీ వివరాలను ధృవీకరిస్తుంది. ►ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. -
ద్విచక్ర వాహనాలు కొనేవారికి ఎస్బీఐ తీపికబురు
SBI Easy Ride: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ద్విచక్ర వాహనాలు కొనేవారికి తీపికబురు అందించింది. ఎస్బీఐ యోనో ఫ్లాట్ ఫారం ద్వారా సులభంగా ద్విచక్ర వాహనా రుణాలను పొందవచ్చు అని తెలిపింది. ద్విచక్ర వాహనా రుణాల కోసం ఎస్బీఐ "ఈజీ రైడ్" పేరుతో మరో ఆప్షన్ తీసుకొనివచ్చింది. అర్హత కలిగిన ఎస్బీఐ కస్టమర్లు బ్యాంకు బ్రాంచీని సందర్శించకుండానే యోనో యాప్ ద్వారా క్షణాలలో ద్విచక్ర వాహన రుణాలను పొందవచ్చు అని తెలిపింది. "కస్టమర్లు గరిష్టంగా 4 సంవత్సరాల వరకు సంవత్సరానికి 10.5% వడ్డీరేటుతో రూ.3 లక్షల వరకు ఈజీ రైడ్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస రుణ మొత్తాన్ని రూ.20,000గా నిర్ణయించారు' అని బ్యాంకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కస్టమర్ పొందిన రుణం నేరుగా డీలర్ ఖాతాలోకి జమ కానుంది. ఈ పథకం కింద వాహనం ఆన్-రోడ్ ధరలో 85% వరకు రుణాలను పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీ ఛైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ.. 'ఎస్బీఐ ఈజీ రైడ్' రుణ పథకం మా కస్టమర్లకు అంతరాయం లేని అనుభవాన్ని అందిస్తుందని మేం ఆశిస్తున్నాం అని అన్నారు. (చదవండి: ఎలక్ట్రిక్ కారు రేసులోకి టొయోటా.. రేంజ్ కూడా అదుర్స్!) -
డప్పుకొట్టి నిరసన...
శంకరపట్నం: నాలుగేళ్లుగా తిరుగుతున్నా ఎస్సీ కార్పొరేషన్ రుణం మంజూరు చేయడం లేదని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయం ముందు సోమవారం కన్నాపూర్‌కు చెందిన అంధుడు దేవునూరి వీరయ్య డప్పుకొట్టి నిరసన తెలిపాడు. 2017 డిసెంబర్ 27న వికలాంగుల కోటా కింద రూ.2 లక్షలకు బ్యాంక్ కాన్సెంట్ లెటర్ ఇచ్చింది. 2017 డిసెంబర్ నుంచి శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయం, కరీంనగర్ ఏడీ కార్పొరేషన్ రుణ మంజూరు పత్రం అందించడం లేదు. లెటర్ ఇవ్వాలని ఏడీని వేడుకుంటే కార్యాలయం నుంచి సిబ్బందితో బయటకు పంపించారని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు గంటసేపు కార్యాలయం ముందు మండుటెండలో నిల్చుని డప్పుకొట్టడంతో సమాచారం అందుకున్న ఎంపీవో సురేందర్ వీరయ్యతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మంజూరు కోసం ఇచ్చిన పత్రం మండల పరిషత్‌లో ఉండదని, ఆన్లైన్లో నమోదు చేస్తేనే రుణ మంజూరు చేసే అధికారం ఉంటుందని సర్దిచెప్పారు. -
లోన్ ఇస్తామని చెప్పి.. భారీ టోకరా
సాక్షి, హిమాయత్‌నగర్: ‘హలో సార్, మేము ముద్ర కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీ బ్యాంకు లావాదేవీలు చక్కగా ఉండటం వల్ల మీకు మా కంపెనీ నుంచి రూ.10లక్షల లోను మంజూరైయ్యాందంటూ లాలగూడ వాసి కిరణ్‌కుమార్‌కు ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీ బ్యాంకు డాక్యుమెంట్స్‌తో పాటు లోన్ చార్జీలకు గాను రూ.3లక్షలు చెల్లించాలన్నారు. మొదట్లో అనుమానం వచ్చినా లోన్‌కు ప్రయత్నించకుండానే రూ.10 లక్షలు వస్తున్నప్పుడు రూ.3 లక్షలు ఇస్తే ఏమౌతుందిలే అని అనుకున్నాడు కిరణ్‌కుమార్. వారడిగిన విధంగా డాక్యుమెంట్స్‌ను మెయిల్ చేసి వారు చెప్పిన అకౌంట్ నంబర్లకు రూ.3 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు ఇచ్చిన 48 గంటల్లో రూ.10 లక్షలు అకౌంట్లో జమ అవుతాయని నమ్మించారు. రోజులు గడిచినా రూ.10 లక్షలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. -
తక్కువ వడ్డీకే అప్పు కావాలా? మార్గాలివిగో..
Debt At Low Interest: కరోనా ఆంక్షలు ముగిసిన తర్వాత ఒకేసారి ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు, శుభకార్యాలకు హాజరవడం వంటివి మీద పడుతున్నాయి. మరోవైపు పెట్రోలు సహా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా చాలామందికి తాత్కాలిక ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వడ్డీ తిప్పలు బయట అప్పు తీసుకుంటే వడ్డీ రేట్లు అధికం. ప్రతీ నెల అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి. బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుందామంటే అక్కడా వడ్డీ పోటు తప్పడం లేదు. బంగారం తాకట్టులోనూ ఇదే పరిస్థితి. చిన్న ఆర్థిక అవసరం కోసం తాకట్టు పెడితే వడ్డీల లెక్కలతో బంగారం దూరమయ్యే అవకాశమే ఎక్కువ. అతి తక్కువ వడ్డీతో సాధారణ ఆర్థిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంది. తక్కువ వడ్డీతో బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునే మార్గాలు మీ కోసం. శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ ప్రతీ నెల జీతం తీసుకునే ఉద్యోగులు బయట అప్పులు చేయకుండా తక్కువ వడ్డీతో నిధులు సమకూర్చుకునేందుకు ఉన్న అవకాశాల్లో ఓవర్‌డ్రాఫ్ట్ ఒకటి. ప్రతీ నెల తీసుకునే జీతానికి మూడింతల సొమ్మును బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) ద్వారా పొందవచ్చు. సాధారణంగా ఓడీలో తీసుకున్న సొమ్మును 12 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈఎంఐ తరహాలో వడ్డీ విధించరు. ఎంతకాలానికి, ఎంత సొమ్ము ఉపయోగించామనే దాన్ని బట్టే బ్యాంకు వడ్డీ విధిస్తుంది. ఎలాంటి పెనాల్టీ ఛార్జెస్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఓడీని క్లోజ్ చేయోచ్చు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఓడీ ద్వారా త్వరగా సులువుగా అవసరానికి డబ్బును సర్థుబాటు చేసుకోవచ్చు. పేడే లోన్స్ రాబోయే నెల జీతం నుంచి ముందుగానే డబ్బులు తీసుకునే వెలుసుబాటు ఉంది. దీన్ని పేడే లోన్ అంటారు. తక్కువ కాలానికి తక్కువ మొత్తంలో డబ్బును తీసుకునేందుకు పేడే లోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ లోన్‌ను ఒకేసారి చెల్లిస్తారు. సాధారణంగా నెల జీతంలో ఈ లోన్ కట్ అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లోన్ మనకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ మీద తక్కువ వడ్డీకే లోను పొందే అవకాశం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)కి సంబంధించిన మొత్తంలో 85 నుంచి 90 శాతం వరకు రుణంగా పొందవచ్చు. కోవిడ్ లోన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీతో కోవిడ్ లోన్‌ను ప్రవేశపెట్టింది. 2021 ఏప్రిల్ తర్వాత కోవిడ్ సోకిన వారు మెడికల్, ఇతర ఖర్చుల నిమిత్తం ఈ లోనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన శాలరీ, నాన్ శాలరీ ఎంప్లాయిస్‌తో పాటు పెన్షనర్లు కూడా ఈ లోను తీసుకునేందుకు అర్హులు. మ్యూచువల్ ఫండ్ లోన్ అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో మ్యూచవల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై తక్కువ వడ్డీతో లోను తీసుకొవచ్చు. కొన్ని బ్యాంకులు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మ్యూచువల్‌ఫండ్‌లో కొంత మొత్తాన్ని అమ్మకానికి పెట్టి లోను లేదా ఓడీని పొందవచ్చు. ఉపయోగించిన సొమ్ముకే వడ్డీని విధిస్తారు. లోను మొత్తానికి వడ్డీని లెక్కించరు. -
SBI: హెల్త్‌కేర్ బిజినెస్ లోన్ ద్వారా ఎంత రుణం పొందవచ్చు ?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ ‘ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్’ను ఆవిష్కరించింది. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ రంగానికి మద్దతుగా రుణ పథకాన్ని తీసుకొచ్చింది. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్‌లు, పాథాలజీ ల్యాబ్‌లు, తయారీ కంపెనీలు, సరఫరాదారులు, దిగుమతిదారులు, రవాణా సంస్థలు ఇలా ఆరోగ్యసంరక్షణ రంగంతో ముడిపడిన అన్ని రంగాల కంపెనీలకు ఈ పథకం కింద రుణాలను ఎస్బీఐ మంజూరు చేయనుంది. సామర్థ్య విస్తరణ లేదా ఆధునికీకరణ లేదా మూలధన అవసరాల కోసం టర్మ్‌లోన్‌ను తీసుకునేందుకు అర్హులని బ్యాంకు తెలిపింది. గరిష్టంగా రూ. 100 కోట్లు మెట్రో కేంద్రాల్లో అయితే ఒక్కో దరఖాస్తుదారు గరిష్టంగా రూ.100 కోట్లను తీసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో రుణ గరిష్ట పరిమితి రూ.10–20 కోట్ల మధ్యనుంది. రూ.2 కోట్ల వరకు తీసుకునే రుణాలకు ఎటువంటి తనఖా / హామీనిగానీ సమర్పించాల్సిన అవసరం లేదు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత హెల్త్ కేర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా భారీ ఎత్తున రుణాలుఏ మంజూరు చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. దానికి తగ్గట్టుగా ఎస్బీఐ హెల్త్ కేర్ బిజినెస్ లోన్‌ను ప్రవేశపెట్టింది. చదవండి : డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు -
అకౌంట్స్ డీ–ఫ్రీజ్ కేసు: ఎట్టకేలకు అనిల్ చిక్కాడు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ వ్యవహారాలకు పాల్పడిన లోన్ యాప్స్ కేసుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను అడ్డదారిలో డీ–ఫ్రీజ్ చేయించి, రూ.1.18 కోట్లు దారి మళ్లించిన కేసులో సూత్రధారి అనిల్ ఎట్టకేలకు చిక్కాడు. 15 రోజుల పాటు గాలించిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు కోల్‌కతాలో పట్టుకుంది. అక్కడి కోర్టులో హాజరుపరిచిన అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై సోమవారం సిటీకి తీసుకొచ్చారని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐగా అవతారమెత్తి... గతేడాది నమోదు చేసిన లోన్ యాప్స్ కేసుల్లో సైబ ర్ క్రైమ్ పోలీసులు దాదాపు 1100 బ్యాంకు ఖా తాలను ఫ్రీజ్ చేశారు. వీటిలో నాలుగు కంపెనీలకు చెందిన ఆరింటిని డీ–ఫ్రీజ్ చేయించడానికి కోల్‌కతాకు చెందిన ఉత్తమ్ చౌదరి కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ బాధ్యతను 5 శాతం కమీషన్ ఇస్తానని ఎరవేసి నల్లమోతు అనిల్‌కుమార్‌కు అప్పగించాడు. గుంటూరుకు చెందిన అనిల్ బీటెక్ పూర్తి చేసి ముంబైలో ఉంటున్నాడు. ఆరేళ్ల క్రితం ఓ సైబర్ నేరంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. బ్యాంకు ఖాతాలను డీ–ఫ్రీజ్ చేయించడానికి రంగంలోకి దిగిన ఇతను కోల్‌కతాకు చెందిన సైబర్ క్రైమ్ ఎస్సైగా అవతారమొత్తాడు. గత నెలలో విషయంలో వెలుగులోకి... గత నెలలో గచ్చిబౌలి ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు రీజినల్ మేనేజర్ ఈ విషయం గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు ఈ నెల 2న ఆనంద్‌ను అరెస్టు చేశారు. ఇతడి విచారణలో అనిల్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడి కోసం ముంబై, పశ్చిమబెంగాల్‌ల్లో గాలించారు. ఎట్టకేలకు కోల్‌కతాలో పట్టుకుని అతని వద్ద నుంచి రూ.2 లక్షలతో పాటు 8 డెబిట్ కార్డులు, మూడు చెక్ బుక్స్, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకొన్నారు. తనకు అందిన డబ్బును ఉత్తమ్ ఏం చేశాడనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అతడు చిక్కితేనే ఈ అంశంలో స్పష్టత వస్తుందని చెప్తున్నారు. నకిలీ పత్రాలతో... కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రీజ్ అయిన ఖాతాలను డీఫ్రీజ్ చేయాలంటూ నకిలీ పత్రాలతో ఆ బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించాడు. దీంతో పాటు ఢిల్లీ, గుర్గావ్ల్లో ఉన్న మరో ఐదు ఖాతాలను డీ–ఫ్రీజ్ చేయించాడు. అలా మొత్తం రూ.1.18 కోట్లు బేగంపేటకు చెందిన ఆనంద్ జన్ను అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లించి, ఆపై తన ఖాతాల్లోకి మార్చుకున్నాడు. ఈ డబ్బును డ్రా చేయడంతో పాటు తన కమీషన్ మినహాయించుకుని మిగిలింది ఉత్తమ్ చౌదరికి అందించాడు. చదవండి: ప్లాన్ ఐఎస్ఐది... ఫైనాన్స్ చైనాది! -
జగనన్న తోడు: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చిరువ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని, వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. రెండో విడతలో 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.370 కోట్ల రుణ సౌకర్యం అందించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మొత్తం 9 లక్షల 5 వేల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకునేవారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హత ఉన్నవారందరికీ సాయం చేస్తున్నామని, సకాలంలో వడ్డీ చెల్లించేవారికి తిరిగి వారి ఖాతాల్లోకే జమ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) రూ.10 వేలు చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 25న ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలను అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందించిన 3.70 లక్షల మందిని కూడా కలిపితే మొత్తం 9.05 లక్షల మంది లబ్ధిదారులకు రూ.905 కోట్లను ఇచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: PMAY: ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ -
Loan App: నకిలీ లెటర్‌తో రూ.కోటి కొట్టేశాడు..!
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ మైక్రోఫైనాన్సింగ్ వ్యవహారాలకు పాల్పడిన లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఓ పక్క ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. మరోపక్క కొత్త ఎత్తు వేసిన ఓ సైబర్ నేరగాడు పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాను డీ–ఫ్రీజ్ చేయించాడు. అందులో ఉన్న రూ.1.18 కోట్లు ఓ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేశాడు. దీనిపై సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడ్డ 32 కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలను గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు రూ.400 కోట్లకుపైగా ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల్లో కోల్‌కతాలోని ఐల్‌పోరే ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులోది కూడా ఉంది. ఈ ఖాతాను పోలీసులు గత ఏడాది డిసెంబర్లో స్తంభింపచేశారు. అయితే ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించి.. తాను ఎస్ఐగా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాసినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటిని ఆ మేనేజర్‌కు అందించి ఖాతాను డీ–ఫ్రీజ్ చేయించాడు. ఆపై గత నెల 13నరూ.1,18,70,779 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆనంద్ జన్ను పేరుతో ఉన్న ఖాతాలోకి బదిలీ చేసి స్వాహా చేశాడు. గత నెల 20 మరికొంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయించడానికి ప్రయత్నించాడు. దీనిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.దీంతో బ్యాంకు రీజనల్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్: నటి చాందిని -
లోన్స్‌కు డిమాండ్ రెట్టింపు!
ముంబై: బ్యాంకింగ్‌లో రుణ డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) 4 నుంచి 5 శాతం ఉండగా, ఈ శ్రేణి వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) దాదాపు రెట్టింపై 9 నుంచి 10 శాతానికి చేరుతుందని భారత్ గణాంకాల విశ్లేషణ, రీసెర్చ్ అండ్ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనావేసింది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- స్టాండెర్డ్ అండ్ పూర్స్‌కు అనుబంధంగా పనిచేస్తున్న క్రిసిల్ తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... కోవిడ్ ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న రెగ్యులేటరీ చర్యలు ఎకానమీ ఊహించిన దానికన్నా వేగంగా రికవరీ పట్టాలపైకి ఎక్కింది. 2021-22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బ్యాంకింగ్‌లో రుణ వృద్ధి రేటు 0.8 శాతం క్షీణించింది. అయితే మూడవ త్రైమాసికంలో 3 శాతం (నెలవారీగా చూస్తే) వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో కూడా 3 శాతం వృద్ధి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 0 నుంచి 1 శాతం శ్రేణిలో బ్యాంకింగ్ రుణ వృద్ధి ఉంటుందని గత ఏడాది జూన్‌లో క్రిసిల్ అంచనా వేయడం గమనార్హం. తాజా నివేదికలో ఈ అంచనాలను గణనీయంగా (4 నుంచి 5 శాతం శ్రేణిలో) మెరుగుపరచింది. కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి రూ.3 లక్షల కోట్ల విలువైన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) వంటి ప్రభుత్వం ప్రకటిస్తున్న పలు ప్రోత్సాహకాలు రుణ డిమాండ్ పెరిగేందుకు దోహద పడుతుందని విశ్లేషించింది. ప్రైవేటు పెట్టుబడులు, ఎకానమీ రికవరీ వంటి అంశాలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో రుణాల విషయంలో అటు రుణ గ్రహీతలు, ఇటు రుణ దాతలు జాగరూకత వహించారు. అయితే లాక్డౌన్ నిబంధనల సడలింపు పరిస్థితిని గణనీయంగా మార్చింది. పండుగల సీజన్ కూడా రుణ డిమాండ్‌కు గణనీయంగా దోహదపడింది. వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)కు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి తగిన చర్యలు ఉంటున్నాయి. బ్యాంకింగ్ మొత్తంగా రుణాల్లో కార్పొరేట్ క్రెడిట్ వాటా 49 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ విభాగం రుణ డిమాండ్‌లో క్షీణతే నెలకొనే అవకాశం ఉంది. మూలధన పెట్టుబడులకు కంపెనీలు వెనుకాడుతుండడమే దీనికి కారణం. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ విభాగంలో 5 నుంచి 6 శాతం వృద్ధి రేటు నమోదయ్యే వీలుంది. తక్కువ స్థాయి బేస్‌తో పాటు, డిమాండ్ తిరిగి ఊపందుకోవడం దీనికి కారణం. రిటైల్ రుణ మంజూరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 నుంచి 10 శాతానికి తగ్గవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి ఈ విభాగం రెండంకెలకు పుంజుకుంటుంది. ఇక లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)లకు సంబంధించి మొత్తం రుణ వృద్ధి 9 నుంచి 10 శాతం ఉండే వీలుంది. అయితే అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కొనసాగించని పక్షంలో ఎంఎస్ఎంఈలకు రుణ వృద్ధి 2021–22లో తిరిగి 8 నుంచి 9 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కాగా, వ్యవసాయ రంగానికి వచ్చే, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రుణ వృద్ధి రేటు 6 నుంచి 7 శాతం వరకూ ఉండే వీలుంది. భారత్ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లూ ఉన్నాయి. తగిన వర్షపాతం లేకపోవడం, కరోనా కేసుల పెరుగుదల ఇందుకు కారణం. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృత స్థాయిలో జరగడం కూడా కీలకం. రాష్ట్రాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 8.7 లక్షల కోట్లు లేదా వాటి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో 4.7 శాతానికి చేరుతుంది. ఈ అంచనాలు నిజమైతే ద్రవ్యలోటు గణాంకాల విషయంలో ఇదే చరిత్రాత్మక గరిష్ట స్థాయి అవుతుంది. కరోనా ప్రేరిత అంశాల వల్ల పన్ను వసూళ్లు పడిపోవడం తాజా అంచనాలకు ప్రధాన కారణం. -
‘సైకిల్ స్కామ్’ వెనుకా చైనీయులే!
♦ స్కీమ్–1 ప్రకారం రూ.300 పెట్టుబడి పెడితే 90 రోజుల్లో రూ.1350 ♦ స్కీమ్–2 ప్రకారం రూ.3,000 ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలల్లో రూ.13,500 ♦ స్కీమ్–3లో రూ.15,000 పెడితే 90 రోజుల్లో రూ.67,500.. ఇలా ఆర్జించవచ్చంటూ సైకిల్ స్కీమ్ పేరుతో స్కామ్‌కు పాల్పడిన ‘షేర్డ్ బీకే’ వ్యవహారం వెనుకా చైనీయులే ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఈ తరహా కేసులో సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి చేతిలో నగరానికి చెందిన పది మంది దాదాపు రూ.10 లక్షల వరకు మోసపోయారని తేలింది. దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఆ ముగ్గురినీ పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. సాక్షి, హైదరాబాద్ : హర్యానాలోని గుర్గావ్కు చెందిన ఉదయ్ ప్రతాప్, రాజేష్‌శర్మ, ఢిల్లీవాసి నితీష్ కుమార్ కోఠారి ఈ కేసుల్లో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఉదయ్ ప్రతాప్ ఐదేళ్ల క్రితం చైనాకు చెందిన టాప్–1 మోబీ టెక్నాలజీ అనే సంస్థలో పని చేశాడు. అప్పట్లో ఇతడికి చైనాకు చెందిన పెంగ్ గువాయి అలియాస్ జావీతో పరిచయమైంది. ఇతడితో పాటు నితీష్ కుమార్ కొఠారీ, రాజేష్ శర్మను ఆ చైనీయుడు మోబి సెంట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అధీకృత వ్యక్తులుగా చేశాడు. తమ వద్ద ఎవరైనా పెట్టుబడి పెడితే ఆ మొత్తంతో సైకిల్ కొంటామని, ప్రతిరోజూ దాన్ని అద్దెకు తిప్పగా వచ్చిన మొత్తం ఇన్వెస్టర్‌కే ఇచ్చేస్తామంటూ వీళ్లు ప్రచారం చేసుకున్నారు. ఈ షేర్డ్ బైక్ యాప్‌లకు చెందిన లింకుల్ని వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేశారు. ముందుగా తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు చూపించి వారిని పూర్తిగా నమ్మించేవాళ్లు. ఆ మొత్తం కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసేవాళ్లు కాదు. కేవలం వారి పేర్లతో రూపొందించిన వర్చువల్ అకౌంట్స్‌లోనే జమ చేసినట్లు చూపించేవాళ్లు. నిర్ణీత సమయం తర్వాత ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు వచ్చి విత్‌డ్రా చేసుకునే అవకాశం వస్తుందని నమ్మించి భారీ మొత్తం డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తూ పోయారు. దీని కోసం హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్, పుణేల్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఏడు డమ్మీ కంపెనీలు రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో పెంగు గువాయితో పాటు మరో చైనీయుడు జాంగ్ హంగ్వాయి కీలకంగా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరి 20న పెంగు చైనాకు వెళ్లాడు. ఈ నేరగాళ్లు వేల మంది నుంచి రూ.కోట్లలో వసూలు చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో ఉదయ్, నితీష్, రాజేష్‌లను అరెస్టు చేశారు. వీరి బారినపడిన వాళ్లు నగరంలోనూ ఉండటంతో ఇక్కడి పోలీసులూ దర్యాప్తు చేశారు. ఇన్స్పెక్టర్ బి.రమేష్ చేపట్టిన దర్యాప్తు నేపథ్యంలో తమకు వాంటెడ్‌గా ఉన్న వ్యక్తులు సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్లు తేలింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకున్న సిటీ పోలీసులు గురువారం ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఇప్పటికే కలర్ ప్రిడెక్షన్ గేమ్, లోన్ యాప్స్ వ్యవహారాల్లో చైనీయులు పాత్ర ఉన్నట్లు స్పష్టమైంది. ఆయా కేసుల్లో ఐదుగురు చైనా జాతీయులు అరెస్టు కాగా.. పది మందికి పైగా పరారీలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా షేర్డ్ బీకే స్కామ్ వెనుకా చైనీయుల పాత్రపై స్పష్టత వచ్చింది. పోలీసులకు పూర్తి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంతో ఈ నేరగాళ్లు అటు గూగుల్ ప్లేస్టోర్ ఇటు యాపిల్ స్టోర్ ఇలా ఏ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించకుండా కేవలం లింకుల్ని సోషల్ మీడియాలో విస్తరిస్తూ తమ పని చేసుకుపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. చదవండి: చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య -
చైనాకు పరారైన లోన్‌యాప్ డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : రుణాలు తీర్చినా తీవ్ర వేధింపులకు పాల్పడుతూ ప్రాణాలు తీసుకునేలాగా చేసిన లోన్ యాప్స్ నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే వారు పోలీసులకు చిక్కకుండా స్వదేశం చైనాకు పరారయ్యారు. చైనాకు వెళ్లిన లోన్ యాప్స్ కంపెనీల రెక్టర్లను తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం రెడ్ కార్నర్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో డైరెక్టర్లను పట్టుకునే ప్రయత్నాలు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు. అయితే ఆ కంపెనీ నిర్వాహకులు పక్కా ప్లాన్‌తో ఈ వ్యవహారం నడిపించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసే వారు కూడా భారత్‌కు చెందిన వారిని డైరెక్టర్లుగా నియమించుకున్నారు. నేరం చేసినా తమ మీదకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పడ్డారు. ఆ విధంగా డైరెక్టర్లను నియమించుకున్న చైనా కంపెనీలు ఇప్పుడు వారి నేరాలు బహిర్గతమవడంతో వారు చైనాకు పారిపోయారు. చైనాకు చెందిన కంపెనీలు భారత్‌కు చెందిన వారితో కంపెనీ నడిపిస్తున్న విషయం కేసుల నమోదు అనంతరం బయటపడింది. ఆ కంపెనీల భారీ ఆఫర్లు ఇవ్వడంతో భారత్‌కు చెందిన చాలామంది ఆశ పడి డైరెక్టర్లుగా చేరారు. ఇలాంటి 16 కంపెనీలపై ఇప్పటివరకు దాడులు చేసి పోలీసులు మూసివేశారు. అయితే చైనాకు పారిపోయిన ఈ కంపెనీ డైరెక్టర్లను పట్టుకుంటే అసలు విషయాలు బయటకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా చైనాకు వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రుణాల యాప్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక దాదాపు 5 మంది బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు నిమిషాల్లోనే పేటిఎమ్ పర్సనల్ లోన్!
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో పేటిఎమ్ తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటిఎమ్ తన 1 మిలియన్ కస్టమర్లకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హత గల వినియోగదారులు కేవలం 2 నిమిషాల్లోనే వ్యక్తిగత రుణాలను 365రోజుల్లో ఎప్పుడైనా పొందవచ్చు అని పేటీఎం పేర్కొంది. రుణాలను వినియోగదారులు 18-36 నెలల్లో వాయిదా పద్దతిలో తీర్చవచ్చు. పేటిఎమ్ యొక్క ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ఎన్బీఎఫ్సీలచే ప్రాసెస్ చేయబడతాయి. యూజర్లు తీసుకునే వాయిదాను బట్టి ఈఎంఐను నిర్ణయిస్తారు.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్) ఈ చర్యవల్ల ‘క్రెడిట్ టు న్యూ’ కస్టమర్లు అధికారిక ఆర్థిక మార్కెట్ పరిధిలోకి వస్తారు. పేటిఎమ్ యొక్క ఈ క్రొత్త సేవల ద్వారా బ్యాంకింగ్ సంస్థలు అందుబాటులో లేని చిన్న చిన్న పట్టణాల వారికీ ఆర్థిక సహాయం అందనున్నట్లు పేర్కొంది. రుణ దరఖాస్తు కోసం ఎటువంటి పేపర్ డాక్యుమెంటేషన్ లేకుండా మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేసింది. ఈ ప్రక్రియ కోసం అత్యాధునిక టెక్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించినట్లు పేటిఎమ్ పేర్కొంది. కొత్త ఇన్స్టంట్ పర్సనల్ లోన్ పథకం కింద అర్హులు గల ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు, ఇతరులకు 2 నిమిషాల్లోనే రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు పేటీఎం ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన కస్టమర్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం కింద 'పర్సనల్ లోన్' టాబ్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ సేవల సులభతరం చేయడానికి పేటీఎం వివిధ ఎన్‌బిఎఫ్‌సిలు, బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఒప్పందం కుదుర్చుకుంది. -
‘యాప్’సోపాలు.. యువతకు తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఫ్రెండ్ రాజేందర్‌కు యాక్సిడెంటైంది. అర్జంటుగా డబ్బులు పంపండి’ అంటూ సందేశాలు రావడంతో అవాక్కయిన మిత్రులు వెంటనే రాజేందర్‌కు ఫోన్ చేశారు. బాగానే ఉన్నాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు కానీ, ఆ మెసేజ్‌లు ఎవరు పంపారో మొదట అర్థం కాలేదు. ఆరాతీస్తే రాజేందర్ ఓ యాప్ ద్వారా తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని దాని తాలూకు మనుషులు ఇలా బద్నాం చేశారని తేలింది. ‘మీ కొడుకు తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంట్లో ఏదుంటే అది ఎత్తుకు పోతాం..’ అంటూ ఫోన్లో వచ్చిన బెదిరింపుతో ఓ తండ్రి హతాశుడు అయ్యాడు. ఇంజనీరింగ్ చదివే తన కొడుకు రూ. లక్షలు అప్పు చేసిన ఫలితమని తెలిసి ఆయన తలపట్టుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కాల్ చేసింది కలెక్షన్ ఏజెంట్లు. వీరంతా వివిధ మనీలెండింగ్ యాప్స్ (అప్పులు ఇచ్చే యాప్స్) కోసం పని చేస్తుంటారు. ఏం చేసైనా ఇచ్చిన అప్పును వడ్డీతో సహా రాబట్టుకునేందుకు ఇటీవల హద్దుమీరుతున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేస్తూ, ఆ నంబర్లకు ఫోన్లుచేసి, తప్పుడు సందేశాలు పంపి సమాజంలో చులకన చేస్తున్నారు. వారిపై మానసిక ఒత్తిడి పెంచేందుకు దూకుడుగా వ్యవహరిస్తూ బ్లాక్మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా అప్పిచ్చి.. అలా వేధిస్తూ.. మనీ లెండింగ్ యాప్స్‌కు మొబైల్ ప్లేస్టోర్స్‌లో కొదవేం లేదు. ఇవి రూ.1,000–రూ.15 లక్షల దాకా అప్పులిస్తూ, రూ.1 నుంచి రూ.3 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకునే క్రమంలో కంపెనీ షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. చిరునామా, వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ నంబర్ అందించాలి. విద్యార్థులకైతే ఆధార్, కాలేజీ ఐడీ కార్డు సరిపోతుంది. అలాగే, ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేయమంటారా? అని అడుగు తుంది. దీన్ని వినియోగదారులు పట్టించుకోక ‘ఓకే’ కొడుతున్నారు. దీంతో రుణగ్రహీతల ఫోన్ నంబర్లన్నీ యాప్ యాజమాన్యానికి యాక్సెస్ అవుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కలెక్షన్ ఏజెంట్లు.. అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్స్‌లోని ఆత్మీయులు, కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఇబ్బందుల పాల్జేస్తున్నారు. అప్పు మీద అప్పు.. పెరుగుతున్న ముప్పు లాక్‌డౌన్‌తో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. టీచర్లు, సినిమా టాకీస్ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ కార్మికులు ఇతర రంగాలకు చెందినవారు ఏడు నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి వారు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఇంతకాలం నెట్టుకొచ్చారు. వాటిని తిరిగి తీర్చలేక, ఇంటి అవసరాల కోసమని మరోసారి అప్పులు చేసేందుకు అప్పుల యాప్‌లపై ఆధారపడుతున్నారు. చిన్నమొత్తంలో అప్పు చేసేవారికి ఫర్వాలేదు గానీ, భారీ మొత్తాల్లో అప్పుచేస్తే ఆ అప్పుల వసూళ్లకు కలెక్షన్ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ యాప్‌ల ద్వారా అప్పుచేసే యువకులు పెరిగారు. వీరు ఆన్లైన్ గేమ్స్ కోసం కూడా భారీగా అప్పులు చేస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేటలో ఓ యువకుడు రూ.15 లక్షలు ఇదే తరహాలో అప్పుచేసి.. తీర్చే మార్గంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం అప్పు వసూలుకు వేధించడం, ఫోన్ కాంటాక్టులను యాక్సెస్చేసి బ్లాక్మెయిల్ చేయడం ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం. రూ.20 వేలలోపు ఉండే చిన్న రుణాల వసూలులోనూ కలెక్షన్ ఏజెంట్లు ఇష్టానుసారం వ్యవహరించడంపై బాధితులు వాపోతున్నారు. దీనిపై యాప్‌ల యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే, ‘మా దృష్టికి రాలేదంటూ’ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. వాస్తవానికి కంపెనీ సహకారం లేకుండా.. కాంటాక్ట్స్ కలెక్షన్ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం అసాధ్యమని పలువురు అంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తే సంప్రదించండి అప్పు తీసుకున్న వారి కాంటాక్టులు యాక్సెస్ చేసి బ్లాక్మెయిల్ చేయడం చట్టవిరుద్ధం, నేరం. ఇలాంటి వేధింపులకు పాల్పడితే మౌనంగా భరించవద్దు. వెంటనే సైబర్ సెల్‌ను సంప్రదించాలి. బాధితులు విద్యార్థినులు, మహిళలైతే విమెన్ సేఫ్టీవింగ్‌ను ఆశ్రయించాలి. – స్వాతి లక్రా, ఏడీజీ ఆ ఉచ్చులో పడనీయొద్దు నేటి విద్యార్థులు ప్రమాదకర టెక్నాలజీ మధ్య ఉన్నారు. సెలబ్రిటీల జీవితాలను కాపీ కొట్టేందుకు బెట్టింగ్, మనీలెండింగ్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకుం టున్నారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ తరహాలోనే ప్రతీ కాలేజీలో ప్రత్యేక సెల్స్ ఏర్పాటుచేసి విద్యార్థులు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూడాలి. –డాక్టర్ శారద, ప్రొఫెసర్, ఓయూ -
‘బి–పోస్ట్’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఐటీ విభాగం ఎమర్జింగ్ టెక్నాలజీ బ్లాక్‌చెయిన్‌తో రూపొందించిన ‘బ్లాక్‌చెయిన్ – ప్రొటెక్షన్ ఆఫ్ స్త్రీ నిధి ట్రాన్జాక్షన్స్’(బీ–పోస్ట్)ను గురువారం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది సంఘాలకు చెందిన మహిళలు ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణాలకు క్రెడిట్ రేటింగ్ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన కాగ్నిటోచెయిన్ అనే స్టార్టప్ ‘బీ పోస్ట్’ను ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఈవిధానంతో రుణవితరణ, చెల్లింపులు సులువు కానున్నాయి. పౌరసేవల్లో టెక్నాలజీ వినియోగం: జయేశ్ రంజన్ పౌర సేవలను అందించే టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అ న్నారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి గురువారం ఆయన బీ–పోస్ట్‌ను ఆవిష్కరించారు. బ్యాంకు లావాదేవీలపై అవగాహన లేని నిరుపేద మహిళలకు బీ పోస్ట్ ద్వారా సమర్థవంతంగా సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో స్త్రీ నిధి రూరల్ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రూ. 3 లక్షలతో బిజినెస్ మొదలెట్టండి!
న్యూఢిల్లీ : మీరు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముద్ర లోన్ స్కీమ్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆదాయంతో పాటు ఉపాది కల్పించటానికి నిర్ధేశించబడిన ఈ పథకం చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించటానికి మార్గాలను సులభతరం చేస్తోంది. ప్రధాన మంత్రి ముద్ర యోజన( పీఎమ్ఎమ్వై) కింద బ్యాంకుల ద్వారా మీరు మీ వ్యాపారాలకు రుణాలు పొందవచ్చు. శిశు, కిశోర్, తరుణ్ విభాగాల కింద వ్యక్తులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటం జరుగుతుంది. మనం మొదలుపెట్టబోయే వ్యాపారానికి అయ్యే ఖర్చుని బట్టి ఈ మూడు విభాగాల్లో ఒకదాని కింద బ్యాంకులు మనకు రుణాలను ఇస్తాయి. ( ఇక ముద్రా ‘మొండి’ భారం..! ) 1) శిశు దీని రుణ పరిమితి రూ. 50వేల వరకు 2) కిశోర్ దీని రుణ పరిమితి రూ. 50వేలనుంచి రూ.5 లక్షల వరకు 3) తరుణ్ దీని రుణ పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 10లక్షల వరకు బిజినెస్ ఐడియాస్ ఈ క్రింది వ్యాపారాలను మొదలుపెట్టడానికి మీ చేతుల మీద నుంచి కొంత డబ్బు పెట్టుకుంటే మిగిలినది ముద్ర ద్వారా లోన్ పొందవచ్చు. ఈ వ్యాపారాలను ప్రారంభించటానికి మీ దగ్గర రూ. 3 లక్షలు ఉంటే సరిపోతుంది. 1) అప్పడాల తయారీ యూనిట్ దీనికోసం మీరు దాదాపు రూ.2లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం రూ. 8లక్షల దాకా రుణం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా 1.91లక్షలు సబ్సీడీ కూడా పొందవచ్చు. 2) లైట్ ఇంజనీరింగ్ యూనిట్ లైట్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన నట్లు, బోల్టులు, వాషర్లు, రివట్స్ల తయారీ యూనిట్ ప్రారంభించడానికి మీ దగ్గర రూ. 1.88లక్షలు ఉంటే చాలు. ఇందుకోసం మీరు ముద్ర ద్వారా రూ.2.21లక్షలు టర్మ్ లోన్‌గా, రూ. 2.30లక్షలు వర్కింగ్ కాపిటల్‌గా పొందవచ్చు. 3) కలప వస్తువుల తయారీ ఈ వ్యాపారం కోసం మీరు రూ. 1.85 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముద్ర ద్వారా రూ. 7.48లక్షలు రుణం పొందవచ్చు. 4) కంప్యూటర్ అసెంబ్లింగ్ ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి 30 శాతం ఖర్చు మీరు పెట్టుకుంటే మిగిలిన 70శాతం లోన్ ద్వారా పొందవచ్చు. ఇందు కోసం మీ దగ్గర రూ. 2.69లక్షలు ఉంటే చాలు. లోన్ ద్వారా రూ.6.29లక్షలు రుణం పొందే అవకాశం ఉంటుంది. -
డాక్టర్ టు ఫ్రాడ్‌స్టర్!
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేటలోని అలహాబాద్ బ్యాంక్ నుంచి రూ.1.95 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ విక్రమ్ పిల్లారిశెట్టి, జంగిరాల భరత్‌లను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల రెండు రోజల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. గురువారం గడువు ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి విచారణ నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో ఒకరైన డాక్టర్ విక్రమ్ హోమిహోపతి డాక్టర్. విదేశాల్లో పీజీ చేసి వచ్చిన ఇతగాడు నగరంలో ‘మాడ్వెక్’ పేరుతో ఫార్మాస్యుటికల్ కంపెనీ ఏర్పాటు చేశాడు. దీనికోసం తీసుకున్న రుణం చెల్లించలేకపోవడంతో అడ్డదారులు వెతికాడు. తప్పుడు పత్రాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు రూ.6 కోట్లు రుణం తీసుకున్నాడు. దీని చెల్లింపులో విఫలం కావడంతో చెన్నై సీబీఐ అధికారులు 2017లో కేసు నమోదు చేసి విక్రమ్‌తో పాటు ఇతడికి సహకరించిన భరత్‌ను అరెస్టు చేశారు. వీరికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసే విధివిధానాలపై పట్టు ఉండటంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఇరువురూ అదే దందా ప్రారంభించారు. వీరిద్దరూ తమ బంధువులు, స్నేహితుల పేర్లతో అనేక చిన్న తరహా సంస్థల్ని ఏర్పాటు చేయించారు. వీటిని చిన్న తరహా పరిశ్రమలుగా జిల్లా పరిశ్రమల కేంద్రంలో రిజిస్టర్ చేయించారు. అలాంటి వాటిలో సురేష్‌కుమార్‌కు చెందిన ముషీరాబాద్ కేంద్రంగా నడుస్తున్నట్లు చూపించిన ఆమ్స్టర్ సొల్యూషన్స్ ఒకటి. కూరగాయలు, పండ్లకు సంబంధించి డ్రై పౌడర్ తయారు చేసే సంస్థగా దీనిని రిజిస్టర్ చేశారు. ఉప్పల్‌లోని ఓ ఇంటి విలువను ఎక్కువగా చూపించిన వీరు దాన్ని కొలట్రల్ సెక్యూరిటీగా చూపుతూ అమీర్‌పేట మారుతీనగర్‌లోని అలహాబాద్ బ్యాంక్ నుంచి 2016లో రూ.1.95 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని సోమేశ్వర ఎంటర్ప్రైజెస్, ధనియ వర్చువల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు మరో నాలుగు డమ్మీ సంస్థల పేర్లతో ఉన్న కరెంట్ ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు. రుణం చెల్లింపులో విఫలం కావడంతో అలహాబాద్ బ్యాంక్ 2018లో ఉప్పల్‌లోని ఇంటికి వేలం వేసింది. ఈ నేపథ్యంలో కేవలం రూ.80 లక్షలు మాత్రమే వచ్చాయి. వ్యాపార విస్తరణ కోసమంటూ రుణం తీసుకుని దారి మళ్లించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అలహాబాద్ బ్యాంక్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నమోదైన కేసును వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్–4 ఇన్స్పెక్టర్ కేవీ సూర్యప్రకాష్‌రావు దర్యాప్తు చేశారు. బాధ్యులుగా ఉన్న డాక్టర్ విక్రమ్‌తో పాటు భరత్‌కుమార్‌ను గత శుక్రవారం అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ గడువు ముగియడంతో గురువారం జైలుకు తరలించారు. -
బ్యాంకులో మీ బంగారం సేఫేనా?
చిత్తూరు అర్బన్: బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకోవడం ఆనవాయితీ. బ్యాంకుకు రుణం తీసుకునే వ్యక్తికి మధ్యలో ఆభరణాల విలువ నిర్ధారకుడు కీలకం. అతడే అప్రైజర్. కుదువ పెట్టేందుకు తెచ్చిన ఆభరణాల నాణ్యతలో అప్రైజర్ ఏం చెబితే అదే వేదం. బ్యాంకులో ఇంటర్నల్ ఆడిట్, విజిలెన్స్ విభాగాలున్నా కూడా కిలోల కొద్దీ ఉన్నా ఆభరణాలు అసలైనవా..? గిల్టువా..? నాణ్యతలో ఎన్ని క్యారెట్లు ఉన్నాయి..? అనే విషయాలను గుర్తించడంలో కొందరు బ్యాంకు అధికారులతో పాటు బంగారం కుదువపెట్టి రుణాలు ఇచ్చే ప్రైవేటు సంస్థలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. యాదమరి మండలంలోని మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు ఘటనలో వెలుగుచూసిన వాస్తవాలు అసలు జిల్లాలో బ్యాంకుల్లో కుదువపెట్టిన నగలు అసలైనవా, నకిలీవా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. నిద్దరోతున్న నిఘా.. జిల్లాలో 39 ప్రధాన బ్యాంకులు, 616 ఉప శాఖలు ఉన్నాయి. వీటిలో దాదాపు 40 లక్షల మంది ఖాతాదారులున్నారు. సగటున 60 శాతం మంది బ్యాంకుల నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నారు. ఏటా రూ.వంద కోట్ల వరకు బంగారు ఆభరణాలపై లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ఆభరణాల నాణ్యతను పరిశీలించడంతో పాటు వాటి విలువ లెక్కించడానికి విజిలెన్స్, ఆడిట్ పేరిట తనిఖీలు నిర్వహించాలి. కానీ కొన్ని జాతీయ బ్యాంకుల్లో ఇవి తూతూ మంత్రంగా సాగుతున్నాయి. ఆడిట్‌కు వచ్చే బృందంలో కూడా అప్రైజర్లదే కీలకపాత్ర. వారు ఆభరణాలు పరిశీలించి అవన్నీ అసలైననవే అని చెబితే ఆ మాటనమ్మి విజిలెన్స్ బృందాలు వెనక్కు వచ్చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం చేతివేళ్లపై అందుబాటులో ఉన్నా కూడా బంగారం నాణ్యతను పరిశీలించడంలో బ్యాంకులు మూస పద్ధతినే ఉపయోగిస్తున్నాయి. ఇక కొన్ని బ్యాంకుల ఏటీఏం కేంద్రాల్లో సెక్యూరిటీ గార్డులను ఉంచకపోవడం, లోపలున్న సీసీ కెమెరాలు పనిచేయడపోవడం, కొన్ని పనిచేసినా అందులోని దృశ్యాలు అస్పష్టతగా ఉండడం బ్యాంకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఒకే అప్రైజర్‌తో పనులు మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకులో పనిచేసిన అప్రైజర్ రమేష్.. చిత్తూరులోని మరో ఆంధ్రాబ్యాంకుకు సైతం అప్రైజర్‌గా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమైనా గిల్టు నగలు తాకట్టుపెట్టి రుణాలు పొందాడా..? అని బ్యాంకు అధికారులను అడిగితే తెల్లమొహాలు వేస్తున్నారు. పైగా థర్డ్‌పార్టీ ఆడిట్‌కు వెళ్లేప్పుడు పలు బ్యాంకులకు ప్రధాన అప్రైజర్ స్థాయిలో తనిఖీలుచేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు కంటే ఎక్కువ సం ఖ్యలో శాఖలను కలిగి ఉన్న కొన్ని బ్యాంకులు ఒకే వ్యక్తిని అప్రైజర్‌గా నియమించుకుంటున్నాయి. పైగా ఎంపిక సమయంలో అతని గురించి వాకబు చేయకపోవడం, కనీసం పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా అడగకపోవడం ఇక్కడి జవాబుదారితనాన్ని ప్రశ్నిస్తోంది. మాల్యా, నీరవ్ మోదీ లాంటి మహా మోసగాళ్లకు రూ.వేల కోట్లలో రుణాలు ఇచ్చి, ఓ సామాన్య రైతు రూ.లక్ష రుణం అడిగితే మాత్రం లక్ష యక్ష ప్రశ్నలు వేసే బ్యాంకర్లు బంగారు ఆభరణాలపై రుణాల విషయంలో కూడా ఇదే ఉదాతీనత ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సెక్యూరిటీ ఆడిట్ బ్యాంకులో పరిస్థితిపై లీడ్‌బ్యాంక్ మేనేజరుతో కలిసి అన్ని బ్యాంకుల మేనేజర్లతో మరో రెండు రోజుల్లో సమావేశం నిర్వహిస్తాం. సెక్యూరిటీ ఆడిట్ పేరిట బ్యాంకుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏటీఎం కేంద్రాల్లో ఉండాల్సిన కెమెరాల నాణ్యత ఇతర విషయాలపై ఇక్కడ చర్చిస్తాం. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటంపై సమీక్షిస్తాం. – సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు ♦ బ్యాంకులు చూడ మేలిమై యుండు ♦ పొట్లాలు విప్పి చూడ పసిడి నగలుయుండు ♦ అసలు నగలేవో.. నకిలీ నగలేవో తెలియకుండు ♦ ప్రజల సొమ్ముతో జల్సాలేరా రామా..! ♦ ప్రస్తుతం జిల్లాలో బ్యాంకుల పరిస్థితి ఇలాగే తయారయ్యింది. జిల్లాలో బ్యాంకుల గణాంకాలు జాతీయ బ్యాంకులు 370 గ్రామీణ బ్యాంకులు 133 సహకార బ్యాంకులు 31 ఇతర బ్యాంకులు 82 ఖాతాదారులు 40 లక్షల మంది బంగారు రుణగ్రస్తులు 24 లక్షల మంది ఏటా లావాదేవీలు రూ.100 కోట్లు -
లేని భూమికి HDFC రూ.కోటిన్నర రుణం
-
కస్టమర్ల దగ్గరకే బ్యాంకులు
న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ను పురస్కరించుకుని వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రుణ మేళాలు నిర్వహించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదేశించిన నేపథ్యంలో... 3వ తేదీ నుంచి తొలి దశలో 250 జిల్లాల్లో రుణ మేళాలు ఆరంభం కాబోతున్నాయి. ఎన్బీఎఫ్సీ సంస్థలతో కలసి బ్యాంకులు వీటిని నిర్వహించనున్నాయి. రిటైల్ కస్టమర్లు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (ఎంఎస్ఎంఈ).. వ్యవసాయ, వాహన, గృహ, విద్యా, వ్యక్తిగత రుణాలను ఈ మేళాల్లో భాగంగా ఆఫర్ చేయనున్నాయి. రెండో దశలో 150 జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 25వ తేదీల మధ్య రుణ మేళాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 400 జిల్లాల్లో కస్టమర్లకు చేరువకానున్నాయి. బ్యాంకు సేవలను కస్టమర్లకు చేరువగా తీసుకెళ్లడంతోపాటు మార్కెట్లో రుణ లభ్యత పెంచడమే ఈ చర్యల వెనుకనున్న ఉద్దేశ్యం. దీనివల్ల వ్యవస్థలో వినియోగం పెరిగి దేశ వృద్ధి పుంజుకుంటుందని భావించిన కేంద్ర ఆర్థిక శాఖ రెండు వారాల క్రితం ప్రభుత్వరంగ బ్యాంకులకు ఈ దిశగా సూచనలు చేసింది. -
ఫ్లోటింగ్ రేట్ రుణాలకు రెపోనే ప్రాతిపదిక
ముంబై: తమ చర వడ్డీ (ప్లోటింగ్) రుణాలు అన్నింటికీ రెపో రేటే ప్రామాణికంగా ఉంటుందని ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని స్పష్టం చేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.4 శాతంగా ఉంది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా... బ్యాంకింగ్ రుణ రేట్లు అన్నీ రెపోసహా ద్రవ్య విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు అనుసంధానం కావాల్సిందేనని బ్యాంకులకు ఈ నెలారంభంలో ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలకు ఒకసారి ఇందుకు సంబంధించి సమీక్షలు, అనుసంధాన నిర్ణయాలు (రిసెట్) జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. వ్యక్తిగత లేదా గృహ, ఆటో అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ఇచ్చే కొత్త ఫ్లోటింగ్ (చర వడ్డీరేటు) రేట్లు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచీ తప్పనిసరిగా రెపో సహా ద్రవ్య, పరపతి విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల ఆర్బీఐ రెపో తగ్గిస్తే, ఆ ప్రయోజనం త్వరితగతిన కస్టమర్‌కు అందుబాటులోనికి రావడానికి వీలు కలుగుతుంది. బ్యాంకులు తమకు లభించిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిండచం లేదని, ఆర్థిక మందగమనానికి ఇది ఒక కారణమనీ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితిపై నిరుత్సాహం... ప్రస్తుతం నిధుల సమీకరణ–వ్యయ మిగులు ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) విధానాన్ని బ్యాంకులు అనుసరిస్తున్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ఆర్బీఐ విధానపరమైన రేటు నిర్ణయ బదలాయింపు ప్రక్రియ ఎంసీఎల్ఆర్ మార్గంలో ఆలస్యం అవుతోంది. రెపో గడచిన నాలుగు ద్వైమాసికాల్లో 1.1 శాతం తగ్గింది. అయితే ఆగస్టు వరకూ రెపో 0.75 బేసిస్ పాయింట్లు తగ్గితే, (అటు తర్వాత 35 బేసిస్ పాయింట్లు) బ్యాంకులు మాత్రం 0.30 శాతం మాత్రమే ఈ రేటును కస్టమర్లకు బదలాయించాయని ఆర్బీఐ స్వయంగా పేర్కొంది. -
రైతులపై అదనపు వడ్డీ భారం వేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా దీర్ఘ, మధ్యకాలిక రుణాలకు సంబంధించి రాయితీ విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై అదనపు వడ్డీ భారం పడకుండా కేంద్ర వ్యవసాయశాఖ అధికారులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడాలని కోరారు. ఈ మేరకు శనివారం వినోద్‌కుమార్‌కు జీవన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6% వడ్డీ రాయితీ నిధులు విడుదల చేసేలా సీఎంకు నివేదిక ఇవ్వాలన్నారు. -
రూ. 10 లక్షల రుణం కోసం రూ.11లక్షలు వసూలు
సాక్షి, సిటీబ్యూరో: తక్కువ వడ్డీకే రుణమిస్తామంటూ మూడేళ్ల క్రితం వచ్చిన ఫోన్‌కాల్‌ను నమ్మిన కొండాపూర్ వాసి నుంచి రూ.10 లక్షల రుణం కోసం పలు దఫాలుగా రూ.11,20,000 డిపాజిట్ చేయించుకుని మోసం చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్, రాహుల్ పంచల్, ముఖేష్ చక్రవర్తి 2015లో నోయిడాలో బురా మాల్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీలో టెలికాలర్‌గా పనిచేశారు. అయితే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఆథారిటీ నిబంధనలు పాటించకపోవడంతో సదరు కంపెనీని 2016లో మూసివేశారు. అయితే ఈ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో నేర్చుకున్న మెళకువలతో పవన్‌కుమార్ పాత కస్టమర్ల పాలసీల జాబితాను ఆధారంగా చేసుకొని తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని నమ్మించి అమాయకులను మోసం చేయాలని పథకం పన్నాడు. ఇందుకుగాను రాహుల్, ముఖేష్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. వీరు ముగ్గురు కలిసి దేశవ్యాప్తంగా పలువురికి ఫోన్లు చేసి తక్కువ వడ్డీకే రుణమిస్తామంటూ ఎరవేశారు. ఇదే తరహాలో కొండాపూర్‌కు చెందిన గోవింద్ భట్‌కు 2016లో ఫోన్ చేసిన వీరు రూ.12,999 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లిస్తే అతి తక్కువ వడ్డీకి రూ.ఐదు లక్షల రుణం ఇస్తామని నిమ్మించారు. అయితే అతను పట్టించుకోకపోవడంతో కొన్నిరోజుల తర్వాత మరో సారి ఫోన్ చేసిన పవన్ మీ రుణం రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు పెరిగిందని, తక్కువ వడ్డీకే వస్తుందంటూ నమ్మబలికాడు. ప్రాసెసింగ్ ఫీజు రూ.24,999 చెల్లిస్తే చాలని చెప్పి పలు దఫాలుగా మూడేళ్ల నుంచి రూ.11,20,000 వరకు వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన గోవింద్ భట్ జూలై 26న సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం నిందితులను ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై మంగళవారం సిటీకి తీసుకొచ్చింది. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. -
అప్పు తీర్చలేదని ఇంటికి తాళం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బాకీ చెల్లించడంలేదని అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఇంటికి తాళం వేయించిన సంఘటన ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఒడ్డె శాంతవ్వ 15 నెలలక్రితం అదే గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తాఫాకు 2 శాతం వడ్డీపై రూ.2.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చడంలో ఆర్థిక ఇబ్బందులు ఉండడం మూలంగా వాయిదా ప్రకారం ముస్తాఫా శాంతవ్వకు డబ్బు ఇవ్వలేకపోయాడు. కుటుంబసభ్యులను బయటకు పంపి ఇంటికి తాళం వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అరగంటలోపే తాళాన్ని తీయించి సమస్యపై సోమవారం మాట్లాడతామని ఇద్దరికీ హామీ ఇచ్చారు. ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌కు రావడంతో సముదాయించి వాయిదా పద్ధతిలో డబ్బు ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చారు. సమస్యను ఇద్దరి సమ్మతితో ఎలాంటి కేసు లేకుండా పరిష్కారం చేసిన ఎస్సై ప్రవీణ్‌కుమార్ తీరును పలువురు ప్రశంసించారు. -
క్రెడిట్ కార్డు... తీసుకుంటే లాభమే!
క్రెడిట్ కార్డులో అధిక చార్జీలు ఉంటాయని, రుణ భారంలో చిక్కుకుంటామన్న అభిప్రాయాలతో చాలా మంది వీటిని తీసుకునేందుకు సుముఖత చూపరు. కానీ, నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు క్రెడిట్ కార్డుల వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అత్యవసరాలు, ఆన్లైన్ చెల్లింపులకు వినియోగించడం ద్వారా క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు క్రెడిట్ కార్డు వీలు కల్పిస్తుంది. మంచి క్రెడిట్ స్కోరు అనేది గృహ రుణం, వ్యక్తిగత రుణాలకు ఎంతో అనుకూలమన్న విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రతీ సాధనానికి సానుకూల, ప్రతికూలతలు ఉన్నట్టే క్రెడిట్‌కార్డు విషయంలోనూ ప్రయోజనాలు, మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. కాకపోతే అందరికీ ఒకే విధంగా ఉండవు. వ్యక్తుల ప్రొఫైల్ ఆధారంగా మారిపోతుంది. కనుక క్రెడిట్‌కార్డు విషయంలో అనుకూలతలను ఉపయోగించుకుని, అననుకూలతలను అధిగమించడం మంచి నిర్ణయం అవుతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డుల గురించి సమగ్ర వివరాలను అందించే కథనమే ఇది. సాక్షి, బిజినెస్ విభాగం: వడ్డీ లేకుండా రుణం సకాలంలో చెల్లింపులు చేసే వారికి అనుకూలం అత్యవసరాల్లో ఆదుకునే సాధనం ఆన్లైన్ షాపింగ్‌లు, బిల్లుల చెల్లింపులపై తగ్గింపులు మరెన్నో ఇతర ప్రయోజనాలు గడువులోపు చెల్లించకపోతే మాత్రం భారీ వడ్డీ క్రెడిట్ కార్డుల్లో ఎన్నో రకాలు ఎవరికి వారు తమకు అనువైనదే ఎంచుకోవాలి సకాలంలో బకాయిలు చెల్లించాలి క్రెడిట్ స్కోరు తక్కువ ఉంటే కార్డుకు తిరస్కారం క్రెడిట్ స్కోరుజీవితంలో కొన్ని సందర్భాల్లో రుణ అవసరం ఎంతో ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం రుణాలు, గృహ రుణాలు, వ్యాపార రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించినప్పుడు మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణాలు సులభంగా వస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి ఇతరులతో పోలిస్తే బ్యాంకులు వేగంగా ప్రక్రియను పూర్తి చేయడమే కాకుండా, తక్కువ వడ్డీ రేటును సైతం ఆఫర్ చేస్తుంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డును వినియోగించే వారు క్రెడిట్ లిమిట్ దాటిపోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. క్రెడిట్‌కార్డు పరిమితిలో 30–50 శాతం వరకే వినియోగించుకోవడం స్కోరును పెంచుకునే మంచి చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు. దీన్ని రుణమిచ్చే సంస్థలు సానుకూలంగా చూస్తాయి. వడ్డీ రహిత అరువు క్రెడిట్ కార్డులో ఉన్న అత్యంత అనువైన ఫీచర్ వడ్డీ రహిత కాలం. క్రెడిట్ కార్డును సానుకూల ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలనుకుంటే ఇది చక్కని సదుపాయమే అవుతుంది. కార్డును బట్టి క్రెడిట్ లిమిట్ వినియోగించుకున్న తేదీ నుంచి 45–50 రోజుల వరకు వడ్డీ రహిత కాలం ఉంటుంది. అంటే ఈ కాల వ్యవధి దాటకుండా చెల్లింపులు చేస్తే వడ్డీ పడదు. కాకపోతే సకాలంలో చెల్లించే వారికే ఇది అనుకూలం. లేదంటే భారీ వడ్డీతో ప్రతికూలంగా మారుతుంది. అత్యవసరాలు అత్యవసరాలు చెప్పి రావు. ముఖ్యంగా వైద్య పరమైన అవసరాల్లో అప్పటికప్పుడు పెద్ద మొత్తం డబ్బులతో అవసరం పడొచ్చు. క్రెడిట్ కార్డును దాదాపు అన్ని ఆస్పత్రులూ అనుమతిస్తున్నాయి. కీలక సందర్భాల్లో ఎదురయ్యే తక్షణ ఖర్చులను క్రెడిట్ కార్డుతో గట్టెక్కడానికి వీలుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందులను అధిగమించవచ్చు. ఆన్లైన్ చెల్లింపులు ఈ కామర్స్ కంపెనీల విస్తరణతో ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. వీటిల్లో చెల్లింపులకు క్రెడిట్ కార్డులు ఎంతో అనుకూలం. ఎందుకంటే క్రెడిట్ కార్డుల ద్వారా జీరో వడ్డీతో ఈఎంఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నాయి. పైగా ఈఎంఐ కొనుగోళ్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా కనిపిస్తుంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఆలోచన లేకుండా జోరుగా షాపింగ్ చేస్తే ఆ తర్వాత లబోదిబోమనాల్సి వస్తుంది. బిల్లుల చెల్లింపులు క్రెడిట్ కార్డులతో ప్రతీ నెలా నిర్ణీత తేదీన బిల్లులు చెల్లింపులు జరిగేలా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల గడువు దాటిన తర్వాత లేట్ ఫీజు పడకుండా సకాలంలో చెల్లింపులు జరిగిపోతాయి. బీమా ప్రీమియం వంటి ముఖ్యమైన సాధనాలు ల్యాప్స్ అవకుండా కూడా చూసుకోవచ్చు. నిష్ప్రయోజనం... క్రెడిట్ కార్డులు తీసుకుని వాడకుండా షెల్ఫ్‌లో పెట్టేస్తే ఎటువంటి ప్రయోజనం నెరవేరదు. ఒకటికి మించి కార్డులు తీసుకుని ఏదో ఒకదాన్ని వాడుతూ, మిగిలిన వాటిని అత్యవసరాల్లో ఉపయోగపడతాయనే భావనతో ఉంచుకుంటే సరిపోదు. వాటినీ మధ్య మధ్యలో వాడితేనే ప్రయోజనం. క్రెడిట్ లిమిట్ క్రెడిట్‌కార్డు లిమిట్‌ను కంపెనీలే నిర్ణయిస్తుంటాయి. అయితే, మీకు సౌకర్యం అనుకున్నంతకే లిమిట్‌ను మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు క్రెడిట్ కార్డును రూ.లక్ష లిమిట్‌తో జారీ చేసిన తర్వాత... దాన్ని తరచుగా వినియోగిస్తూ, సకాలంలో బిల్లుల చెల్లింపులు చేసే వారికి కంపెనీలు క్రెడిట్ లిమిట్‌ను ఏటేటా పెంచుతుంటాయి. ఇలా పెంచడం సౌకర్యంగా లేకపోతే, పెంచొద్దని కోరే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు ఎంపిక... క్రెడిట్ కార్డులు అన్నీ ఒకే విధంగా ఉండవు. కార్డులను బట్టి ప్రయోజనాలు మారిపోతుంటాయి. వార్షిక ఫీజులు, రివార్డు పాయింట్లు తదితర అంశాల ఆధారంగా మీకు అనువైన కార్డును ఎంపిక చేసుకోవాలి. గరిష్టంగా ఒకటి నుంచి మూడు కార్డులు మించకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక ప్రపంచంలో క్రెడిట్ కార్డు అన్నది ఓ కొకైన్ అని స్కాట్ ఆడమ్స్ అభివర్ణన. క్రెడిట్ కార్డుకు బానిస కాకుండా, దాన్ని మీ కోసం పనిచేయించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కొన్ని కార్డులు ప్రత్యేకంగా రెస్టారెంట్లలో చెల్లింపులపై డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కొన్ని కార్డులు ప్రత్యేకంగా వాహనాలకు ఇంధనం నింపుకున్న సమయాల్లో రివార్డు పాయింట్లను క్యాష్ బ్యాక్‌గా పొందే సదుపాయంతో ఉంటాయి. ఈ అవసరాల కోసమే అయితే వీటిని తీసుకోవాలి. కొన్ని కార్డులపై విమానాశ్రయ లాంజెస్‌లో ఉచిత ప్రవేశ సదుపాయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే సమయంలో క్రెడిట్ కార్డుకు బదులు ముందుగా కరెన్సీ లోడ్ చేసిన ట్రావెల్కార్డును తీసుకెళ్లడం వల్ల ఖర్చులు ఆదా చేసుకోవచ్చు. క్రెడిట్‌కార్డు ద్వారా విదేశాల్లో చెల్లింపులు చేస్తే కరెన్సీ మార్పిడి రేటు అధికంగా పడుతుంది. కానీ ట్రావెల్ కార్డుతోపాటు ఒక క్రెడిట్ కార్డును కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. గడువు దాటితే వడ్డీ బాదుడు క్రెడిట్ కార్డుల బిల్లులను గడువు దాటకుండా తీర్చివేసే వీలుంటేనే కార్డు తీసుకోవాలి. లేదంటే క్రెడిట్ స్కోరు తీవ్రంగా దెబ్బతింటుంది. అదే జరిగితే తర్వాత రుణం లభించడం కష్టమవుతుంది. గడువు దాటితే మూడు రూపాయలు, అంతకంటే ఎక్కువ వడ్డీతో చెల్లించాల్సి రావడం భారంగా మారుతుంది. ఆన్లైన్లో డిస్కౌంట్ ప్రయోజనం పొందేందుకు క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేసిన వారు... గడువు వరకు ఆగకుండా వీలైనంత ముందే ఆ మొత్తాన్ని చెల్లించాలి. క్రెడిట్ కార్డుకు తిరస్కారం... క్రెడిట్ కార్డు ఇచ్చే ప్రతీ సంస్థ కూడా కార్డుదారుడు బకాయిలు తిరిగి చెల్లించగలరా అని చూస్తుంది. అధిక రిస్క్‌తోపాటు, తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉంటే కార్డు ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి, స్వయం ఉపాధిలో ఉన్న వారి నుంచి డిఫాల్ట్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ శెడగోపన్ తెలిపారు. తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే అందుకు ఉన్న ఏకైక మార్గం క్రెడిట్ రిపోర్ట్‌ను చూడడమే. ప్రతీ వ్యక్తి తన రుణచరిత్రను క్రెడిట్ స్కోరు రూపంలో తెలుసుకోవచ్చు. రుణాలకు తిరిగి చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి, రుణాల్లో సమతుల్యత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ బ్యూరో సంస్థలు క్రెడిట్ స్కోరును ఇస్తాయని బ్యాంక్ బజార్ డాట్ కామ్ ముఖ్య అభివృద్ధి అధికారి నవీన్‌చందాని తెలిపారు. ‘‘తక్కువ క్రెడిట్ స్కోరు గతంలో రుణాలకు సకాలంలో చెల్లింపులు చేయలేదని సూచిస్తుంది. లేదా రుణ ఖాతాలను సరిగ్గా మూసివేయలేకపోవడం వల్ల కూడా ఇలా జరిగి ఉంటుంది. అలాగే, రుణానికి అవకాశం ఉంది కదా అని అధిక మొత్తంలో తీసుకోవడం కూడా స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. దీంతో క్రెడిట్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది’’ అని చందాని వివరించారు. అలాగే, క్రెడిట్ స్కోరు మెరుగుపడినప్పటికీ, గత రుణాలకు సంబంధించి డిఫాల్ట్ విషయాన్ని క్రెడిట్ రిపోర్ట్‌లో పేర్కొనడం వల్ల కూడా క్రెడిట్ కార్డు పొందలేని పరిస్థితి ఎదురుకావచ్చన్నారు. ‘‘ఒకేసారి ఒకటి మించి క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోరాదు. అలా చేస్తే అన్నీ కూడా తిరస్కరణకు గురి కావచ్చు. ఇది క్రెడిట్ కోసం అర్రులు చాచినట్టు అవుతుంది. ఇలా ఒకటికి మించిన దరఖాస్తులు కూడా క్రెడిట్ స్కోరును తగ్గిస్తాయి’’ అని చందానీ వివరించారు. అందుకే తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నవారే క్రెడిట్ కార్డుకు వెళ్లాలని సూచించారు. ముందుగా క్రెడిట్ స్కోరును పరిశీలించుకుని తక్కువగా ఉంటే, ఏవైనా తప్పులు ఉన్నాయోమో చూసుకుని సరిచేయించుకోవాలన్నారు. అలాగే, పాత బకాయిలు ఉంటే వాటిని తీర్చివేసిన తర్వాత క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
అన్నదాతకు ఆసరా..
కాజీపేట: పంటల సాగు కోసం అన్నదాతలకు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణ పరిమితి పెరగనుం ది. భూమి ఐదెకరాల పైన ఉన్న రైతులకు ఉపయోగకరంగా ఉండేలా రిజర్వు బ్యాంకు నిర్ణ యం తీసుకుంది. ఎలాంటి సెక్యూరిటీ పత్రాలు లేకుండా ప్రతి రైతుకు రూ.1.60 లక్షలు పంట రుణాలు అందించాలన్న నిర్ణయంతో రైతన్నకు కాస్త ఊరట లభించనుంది. ప్రస్తుతం రైతులకు క్రాప్‌లోను కింద రూ.లక్ష వరకు బ్యాంకులు అందిస్తున్నాయి. ఎకరాకు రూ.30వేల చొప్పున ఈ రుణాలు అందుతున్నాయి. అయితే జిల్లాలో ఐదున్నర ఎకరాలు పైబడి ఉన్న రైతులకే పెరిగిన రుణ పరిమితి వర్తించనుంది. ఒకటి, రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఇది అంతగా ప్రయోజనం చేకూర్చదు. గతంలో మాదిరిగానే రూ.లక్ష లోపు రుణమే దక్కనుంది. రబీ సీజన్ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యం లో ఈ నిబంధనలు రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు వర్తించనున్నాయి. 4.76 లక్షల మంది రైతులు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4.76 లక్షల మంది రైతులుండగా.. ఐదెకరాలలోపు ఉన్న రైతులు 2.82లక్షలు, ఐదున్నర నుంచి ఆరెకరాల వరకున్న రైతులు 72 వేల పైచిలుకు ఉన్నారు. ఇక పది నుంచి 25 ఎకరాలు ఉన్న రైతులు 89 వేల మంది దాకా ఉన్నారు. 25 ఎకరాలకు పైగా ఉన్న రైతులు 33 వేలకు పైగా ఉన్నారు. వీరందరికీ భూమితో సంబంధం లేకుండా ఆర్బీఐ నిర్ణయించిన ప్రకారమే రూ.1.60 లక్షలు రుణం దక్కనుంది. అంటే ఎకరానికి రూ.30 వేల చొప్పున బ్యాంకు రుణం పరిమితికి లోబడి ఇస్తున్నందున ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులందరికీ రుణాలు దక్కనున్నాయి. గతంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పాస్‌పుస్తకాలతో సంబంధం లేకుండానే బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో పాత పాస్పుస్తకాలన్ని బ్యాంకర్ల వద్దనే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తే పెద్ద ఎత్తున రైతులకు మేలు జరుగనుంది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మార్గదర్శకాల కోసం ఎదురుచూపు.. పెరిగిన రుణ పరిమితికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. ప్రస్తుతం ఉన్న రుణాలను మాఫీ చేస్తేనే బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. గతంలో భూములను మార్టిగేజ్ చేసుకోవడం, పాస్‌పుస్తకాలను పెట్టుకోవడం ద్వారా రుణాలను మంజూరు చేసేవారు. ప్రస్తుతం ధరణి వెబ్సైట్లో రైతులకు భూమి ఎంత ఉందనేది నిర్ధారణ చేసుకున్న అనంతరం పాస్‌పుస్తకాలను చూసి రుణాలను ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల నుంచి తనఖా పత్రాలను తీసుకోవడం కానీ, మార్జిగేజ్ చేసేకోవడం కానీ ఇకపై ఉండదు. పాస్‌పుస్తకాలను ధ్రువీకరించుకోవడం కోసమే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆన్లైన్ ద్వారా ధరణి వెబ్సైట్లో రైతుల సమాచారాన్ని, భూముల వివరాలను, సర్వే నంబర్లను చూసి సదరు భూములు రుణాలు పొందే రైతులవేనా అని సరిచూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. రుణాల పంపిణీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ కూడా రైతులకు ప్రయోజనం చేకూరేలా ఆదేశాలను ఇచ్చింది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత బ్యాంకర్లు రుణాల విషయమై చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. బ్యాంకర్లు ముందుకొచ్చేనా..? రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకొని పంటలు సాగు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో మూడెకరాలు ఉన్న రైతులకు రూ.60 నుంచి రూ.90వేల వరకు రుణాలు ఇచ్చేవారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా మూడెకరాల వరకు ఉన్న రైతులకు ఉపయోగపడలేదు. ఐదున్నర ఎకరాలు పైబడిన రైతులకు మాత్రమే రూ.1.60లక్షలు రానున్నాయి. బ్యాంకర్లు ఇస్తున్న రుణాలకు, పెరిగిపోయిన వ్యవసాయ పెట్టుబడులకు తీవ్ర వ్యత్యాసం ఉంటోంది. పంటలు సాగు చేయడానికి కూలీల ఖర్చు, ట్రాక్టర్లు దున్నకానికి, విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటలు కోసి, దిగుబడులను అమ్ముకునే వరకు రైతులకు నష్టం వస్తుందా లేదా లాభం వస్తుందా తేలని పరిస్థితులున్నాయి. లీడ్ బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు మండలాలు, డివిజన్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తే తప్ప బ్యాంకు మేనేజర్లు రుణాలపై ఓ స్పష్టతకు రారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో పెరిగిన రుణాల విషయంలో బ్యాంకర్లు ఏ మేరకు రైతులకు సహకరిస్తారో వేచిచూడాల్సిందే. ఉమ్మడి జిల్లాలో రైతులు 4.76 లక్షలు ఐదెకరాలలోపు ఉన్నవారు 2.82 లక్షలు 5.5 నుంచి ఆరు ఎకరాలు 72 వేలపైన.. పది నుంచి 25 ఎకరాలు.. 89 వేల మంది 25 ఎకరాలకు పైగా కలిగిన వారు 89 వేల మంది -
అప్పు కావాలా నాయనా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘అప్పుకావాలా బాబూ! కేవలం 8 శాతం వడ్డీకే మూడురోజుల్లోనే రూ.5 లక్షల రుణం మంజూరు’. చెన్నై నగరంలో అధికశాతం మంది సెల్‌ఫోన్ ద్వారా అందుకుంటున్న ఆఫర్ ఇది. ఇది నిజమేననుకుని ఈ మాయమాటల వలలో పడ్డారో అప్పు సంగతి అలా ఉంచి పప్పులో కాలేసినట్లే. ఆ తరువాత తిప్పలు ఎలానూ తప్పవు. చెన్నైలో పట్టభదులైన కొందరు యువకులు పీపీఓ అనే కాల్‌సెంటర్‌ను ఏడు చోట్ల నిర్వహిస్తున్నారు. ఈ కాల్సెంటర్లలో 70 మందికి పైగా యువతులను నెలకు రూ.8వేల జీతంపై ఉద్యోగంలో చేర్చుకున్నారు. వీరంతా మధ్యతరగతి కుటుంబాల వారిని సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించి అప్పుల కోసం ఎదురుచూసే వారి వివరాలను సేకరిస్తారు. అప్పు తీసుకునేందుకు అంగీకరించిన పక్షంలో మోసపూరిత వ్యక్తులు రంగప్రవేశం చేసి సంప్రదింపులు ప్రారంభిస్తారు. మా సంస్థ తరఫున రూ.5 లక్షల వరకు రుణం మంజూరు చేస్తాం, అయితే మీరు ముందుగా రూ.50వేలు చెల్లించాలి, ఈ మొత్తానికి మీ పేరుతోనే బీమా చేసిస్తాం అని నమ్మిస్తారు. ఇలా రూ.50వేలు చెల్లించే స్థోమతలేని వారిపై మరో రకమైన వల విసురుతారు. మీ బ్యాంకు ఖాతాలో కనీసం రూ.15వేలు బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండని చెబుతారు. ఆ తరువాత మీ డాక్యుమెంట్లు మాకు అందజేయండి. మూడురోజుల్లో రూ.5 లక్షలు మీ బ్యాంకు ఖాతాలో ఉంటుందని నమ్మిస్తారు. అప్పుకోసం అనేక కార్యాలయాల చుట్టూ తిరిగి అల్లాడాల్సిన అవసరం లేదు, ఎలాంటి శ్రమ లేకుండా మీ బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తాం అంటారు. మూడు రోజుల తరువాత ‘వన్‌టైం పాస్వర్డ్’ అనే ఓటీపీ నెంబరు వస్తుంది. ఆ ఓటీపీ నెంబరును మాకు తెలియజేస్తే వెంటనే రూ.5లక్షలు జమ చేయడం పూర్తవుతుందని చెబుతారు. ఇలా మాటలతో నమ్మించి ఓటీపీ నెంబరు పొంది రుణం కోసం ఎదురుచూస్తున్న వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును తమ ఖాతాల్లోకి బదలాయించుకుంటారు. ఖాతాదారులు పెద్ద మొత్తంలో బ్యాంకు బాలెన్సు పెట్టుకుని ఉన్నట్లయితే అనేక ఖాతాల్లోకి బదిలీ అయిపోతుంది. ఇలా సొమ్ము పోగొట్టుకుని బాధితులుగా మిగిలిపోయిన సుమారు 500 మందికి పైగా చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు మోసాగ్రేసరులను పట్టుకునేందుకు కేంద్ర నేర పరిశోధన విభాగం, బ్యాంకు మోసాల నిరోధక విభాగం అధికారులతో ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పడింది. ఇప్పటికి ఏడు మంది పట్టుబడ్డారు. మోసపూరిత వ్యక్తుల చేతుల్లో చిక్కుకుని బ్రెయిన్‌వాష్‌కు గురైన కొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారీ మొత్తంలో మోసపోయిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కనీస బ్యాంకు బ్యాలెన్స్‌తో రూ.15వేలు పోగొట్టుకున్న వారు చిన్నమొత్తమే కదా. పరువుపోగొట్టుకోవడం ఎందుకని మిన్నకుండిపోయారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం విచారణలో బాధితులు 5 వేల మందికిపైగా ఉన్నట్లు తేలింది. ఇలా వీరి నుంచి రూ.కోటికి పైగా సొమ్ము కాజేసినట్లు పోలీసులు అంచనావేశారు. సెల్ఫోన్లో అన్ని ముగించాలని ఆశించొద్దు: ఇందుకు సంబంధించి కేంద్ర నేరపరిశోధన విభాగం అధికారి ఒకరు మాట్లాడుతూ, రుణం పొందాలనుకునే వారు అన్ని లావాదేవీలను సెల్ఫోన్లోనే ముగించుకోవాలని భావిస్తే ఇలాంటి మోసాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. రుణాలు ఇస్తామని మోసానికి పాల్పడే వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి కార్యాలయాల సెల్‌ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నిర్ధారించడం కష్టసాధ్యం. అలాగే అనవసరమైన ‘ఆప్’అను డౌన్లోడ్ చేసుకోవద్దు. కొన్నిరకాల యాప్‌ల వల్ల మీ కదలికలను, మొబైల్లోని వివరాలను పట్టేసే అవకాశం ఉంది. మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము మాయమయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇలాంటి మోసాలకు అడ్డుకట్టవేయవచ్చని ఆయన తెలిపారు. -
ఆర్ అండ్ బీకి కొత్త రుణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మళ్లీ అప్పులవేట ప్రారంభించింది. గతేడాది మొదలైన రూ.మూడు వేల కోట్ల అప్పుల కష్టాలు ఇంకా కొలిక్కిరాలేదు. ఆర్ అండ్ బీ తాజాగా మరో రూ.వెయ్యి కోట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2018–19 ఆర్థిక ఏడాదిలో దాదాపు రూ.3 వేల కోట్ల అప్పు కోసం నానా తంటాలు పడిన ఆర్ అండ్ బీ కేవలం రూ.వెయ్యి కోట్ల వరకు అప్పు తెచ్చుకోగలిగింది. ప్రభుత్వ రద్దుతో మిగిలిన రూ.2 వేల కోట్ల రుణాలు సందిగ్ధంలో పడ్డాయి. ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడంతో అధికారులు రుణం కోసం తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈసారి బ్యాంకులు కూడా ఆర్ అండ్ బీ కి రుణం ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. గతంలో రూ.వెయ్యి కోట్లు మంజూరు! ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్అండ్ బీకి కేటాయించిన రూ.5,600 కోట్లను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. ఆర్ అండ్ బీ పరిధిలో ఈ ఏడాది రూ.20 వేల కోట్లకుపైగా విలువైన పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోగా.. రూ.మూడు వేల కోట్లు బ్యాంకు రుణం కోసం ప్రయత్నించాలని, పూచీకత్తు ఇస్తానని ప్రభుత్వం సలహా ఇచ్చింది. దీంతో అధికారులు బ్యాంకు రుణాల కోసం తిరిగారు. ఆంధ్రాబ్యాంకు నేతృత్వం లోని 4 బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడ్డా యి. ఆంధ్రాబ్యాంకు దాదాపు రూ.వెయ్యి కోట్లు, మిగిలిన బ్యాంకులు రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. ఆంధ్రాబ్యాంకు రూ.750 కోట్లు, విజయ బ్యాంకు రూ. 250 కోట్లు రుణం మంజూరు చేశాయి. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో మిగిలిన రుణం మంజూరు విషయంలో బ్యాంకులు వెనుకంజ వేశాయి. అదేసమయం లో కాంట్రాక్టర్ల బకాయిలు పెరిగిపోసాగాయి. దీంతో అక్టోబర్ మొదటివారంలో తెలంగాణ బిల్డర్ల అసోసియేషన్ పనులు నిలిపివేసింది. దీంతో చర్చలకు పిలిచిన ప్రభుత్వం వారికి తొలివిడతగా రూ.5,600 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు తిరిగి పనులు మొదలుపెట్టారు. నవంబర్ వచ్చినా వారికి ఆ నిధులు అందలేదు. దీంతో రెండోసారి సమ్మె యోచన చేశారు కాంట్రాక్ట ర్లు. చివరికి ఇటీవల సీఎస్ రూ.10 కోట్లు మంజూరు చేసి, రూ.10 లక్షల్లోపు బిల్లులకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె ఆలోచనను విరమించుకున్నారు. ఫిబ్ర వరి వచ్చినా కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లింపుల్లో పెద్దగా మార్పు రాలేదు. తాజాగా వీరికి అప్పు ఇచ్చేందుకు ఆంధ్రాబ్యాంకు అధికారులు ప్రధాన శాఖకు అనుమతి కోసం లేఖ రాశారని తెలిపారు. ఈ లేఖకు ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయం ఆమోదం తెలపగానే వీరికి రూ.వెయ్యి కోట్లు విడుదలవుతాయని ఆర్ అండ్ బీ అధికారులు వివరించారు. నెలాఖరుకు నిధులు: ఆర్ అండ్ బీ శాఖకు ఇంకా మంత్రిని నియమించలేదు. నెలాఖరున ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక విభాగం వీరికి నిధులు మంజూరు చేసే పనిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
చందా కొచర్‌పై మనీల్యాండరింగ్ కేసు
ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్-వీడియాకాన్ రుణాల వ్యవహారం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ ఇతరులపై మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్-వీడియాకాన్ రుణం కేసులో రూ 1875 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఫిర్యాదు ఆధారంగా మనీల్యాండరింగ్ చట్టం కింద ఆయా నిందితులను ప్రస్తావిస్తూ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను ఈడీ నమోదు చేసింది. కాగా, ఈడీ ఈసీఐఆర్ పోలీస్ ఎఫ్ఐఆర్తో సమానం. రుణ వ్యవహారంలో స్వీకరించిన ముడుపులు ఆస్తుల కొనుగోలుకు దారి మళ్లించారా అనే కోణంలో విచారణ సాగుతుందని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈసీఐఆర్‌లో నిందితులకు త్వరలోనే ఈడీ సమన్లు జారీ చేయనుంది. ఇదే కేసులో సీబీఐ ఇప్పటికే చందా కొచర్ దంపతులతో పాటు వీడియాకాన్ చీఫ్ వేణుగోపాల్ ధూత్ ఇతరులపై చార్జిషీటు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ కీలక సోదాలు, దాడులు చేపట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్‌కు రుణాలు జారీ చేయడంలో క్విడ్‌ప్రోకో జరిగినట్టు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు కిడ్నాప్ డ్రామా
గుంటూరు, తాడేపల్లిరూరల్: నవ్యాంధ్ర రాజధానిలో దళారులు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. రాజధాని ప్రాంతమైన తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో మహేష్ నివసిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పిచ్చికందుల గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీనివాసరావు కొన్నేళ్ల క్రితం విజయవాడ వచ్చి గ్రానైట్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. రాజధాని ప్రాంతంలో 5 సెంట్ల స్థలం కావాలని కోరడంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మహేష్ స్థలాన్ని చూపించారు. మహేష్ సర్వే నబరు 172/2లో ఉన్న తన 5 సెంట్ల భూమిని రూ.40లక్షలకు అమ్ముతున్నట్లు 2017 సెప్టెంబరు నెలలో రూ.5లక్షలు ఇచ్చి అగ్రిమెంటు రాయించుకున్నారు. అదే నెలలో మరో రూ.6 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని, చెల్లించాల్సిన మిగతా సొమ్ముకు చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత కొత్తపల్లి శ్రీనివాసరావు ఫోన్ తీయకపోవడంతో పలుసార్లు విజయవాడ షాపునకు వెళ్లినా సమాధానం చెప్పలేదని బాధితుడు మహేష్ తెలియజేశాడు. మంగళవారం తాడేపల్లి బైపాస్‌రోడ్డులో కొత్తపల్లి శ్రీనివాసరావు కనిపించడంతో అడ్డుకొని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం పద అని మాట్లాడగా కాళ్లూగడ్డాలు పట్టుకొని రాయపూడిలో పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుందామని తీసుకెళ్లాడని, అనంతరం స్థలం కొనుగోలు చేసిన శ్రీనివాసరావు తన సహచరులకు ఫోన్ చేసి, మహేష్ కిడ్నాప్ చేశాడని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడని మహేష్ తెలిపారు. పోలీసులు తనకు ఫోన్ చేశారని, వెంటనే శ్రీనివాసరావును పోలీస్‌స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చానని, కిడ్నాప్ చేస్తే పెద్ద మనుషులతో కలిసి ఎందుకు మాట్లాడతామంటూ ప్రశ్నించినా, పోలీసులు చెప్పింది వినకుండా అతను చెప్పిన అందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఏకకాలంలో రూ.2 లక్షల మాఫీ
సాక్షి,బోధన్(నిజామాబాద్): తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని మాయ మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బోధన్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మహకూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల చొప్పన పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. బుధవారం మండలంలోని రాజీవ్‌నగర్ తాండ, బెల్లాల్, ఊట్పల్లి, అమ్దాపూర్ గ్రామాల్లో సుదర్శన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. హామీల అమలులో టీఆర్ఎస్ విఫలమైందని, స్వార్థ ప్రయోజనాల కోసం మిషన్ భగీరథ వంటి పథకాలను చేపట్టిందని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తి చేస్తామని, అప్పటివకు నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖతాల్లో రూ.15లక్షలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, మండలాధ్యక్షుడు నాగేశ్వర్రావ్, నేతలు నరేందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, ఖలీల్, శంకర్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదు’
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సంక్షోభాలకు రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 2019లో కేంద్రంలో అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు ప్రైవేట్ సంస్థ ఐసీఎఫ్ఏ అగ్రికల్చర్ ప్రైజ్ ప్రకటించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వెంకయ్య చేతుల మీదుగా అగ్రికల్చర్ ప్రైజ్ కింద లక్ష డాలర్ల బహుమతిని స్వామినాథన్‌కు అందజేశారు. అగ్రికల్చర్ ప్రైజ్‌ను మొదటిసారి అందుకున్న వ్యక్తి స్వామినాథన్ కావడం విశేషం. రైతుల సమస్యలపై పార్లమెంటు, రాజకీయ పార్టీలు, నీతి ఆయోగ్, మీడియా దృష్టి కేంద్రీకరించాలని వెంకయ్య సూచించారు. రుణ మాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలను తీసుకురావడం సరికాదన్నారు. ఒకసారి రైతుల రుణాలు మాఫీ చేయడం శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. రుణాలు ఇచ్చి తిరిగి కట్టవద్దని చెప్పే బ్యాంకులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. శాశ్వత పరిష్కారాల కోసం శాస్త్రవేత్తలు, పాలసీ రూపకర్తలు దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. -
గంటలో రూ.1 కోటి రుణం..
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణ అవసరాలు తీర్చే దిశగా కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది.www.psbloansin59minutes.com పేరిట ఏర్పాటు చేసిన ఈ పోర్టల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. ఈ పోర్టల్ ద్వారా ఎంఎస్ఎంఈలు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)తో పాటు అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 1 కోటి దాకా రుణాలకు 59 నిమిషాల్లోనే సూత్రప్రాయ ఆమోదం పొందవచ్చు. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత 7–8 పనిదినాల్లోగా రుణం అందుకోవచ్చు. ‘రుణాల ప్రాసెసింగ్‌కి సంబంధించి ఈ పోర్టల్ కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుంది. 20–25 రోజుల వ్యవధి 59 నిమిషాలకే తగ్గుతుంది‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పోర్టల్ ప్రత్యేకతలివీ.. ఈ పోర్టల్ ద్వారా సిడ్బితో పాటు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు. రుణ మంజూరు, వితరణ దాకా అంతా మనుషుల ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గానే ఉంటుంది. దరఖాస్తుదారు ఐటీ రిటర్న్స్, జీఎస్టీ గణాంకాలు, బ్యాంక్ స్టేట్మెంట్ మొదలైన వాటన్నింటినీ అత్యాధునిక అల్గోరిథమ్స్ ఉపయోగించే పోర్టలే విశ్లేషించుకుంటుంది. ఎంఎస్ఎంఈలు ఎలాంటి పూచీకత్తు లేకుండా దాదాపు రూ. 2 కోట్ల దాకా రుణం పొందవచ్చు. ►రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నంబరు, జీఎస్టీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అవసరం. ► ఇన్‌కం ట్యాక్స్ ఈ ఫైలింగ్ పాస్వర్డ్, సంస్థ ఏర్పాటు తేదీ వివరాలు లేదా మూడేళ్ల ఐటీ రిటర్నులు ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఉండాలి. ► కరెంటు అకౌంటు వివరాలు, లేదా 6 నెలల బ్యాం క్ స్టేట్మెంట్ పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ►డైరెక్టరు/పార్ట్నరు/ప్రొప్రైటరు కేవైసీ వివరాలు ►సూత్రప్రాయ ఆమోదం లభించాకా రూ. 1,000 (జీఎస్టీ అదనం) కన్వీనియన్స్ ఫీజు కట్టాలి. -
రుణం చెక్ ఇచ్చే వరకూ నిద్రపోను!
ఒంగోలు టూటౌన్: ఎస్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణం కోసం నెత్తుటి ధారతో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన లబ్ధిదారుడి వ్యవహారం స్థానిక ప్రగతి భవన్లో శుక్రవారం కలకలం రేపింది. కార్యాలయ మెట్లపై నుంచి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం లోపల వరకు రక్తం ధార పడటంతో ప్రగతి భవన్‌కు వచ్చే ఉద్యోగులు, ప్రజలు ఆందోళన చెందారు. స్థానిక గద్దలగుంటకు చెందిన ఎం.జమదగ్ని 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్ఎఫ్డీసీ కింద రుణం మంజూరైంది. లబ్ధిదారుడు శుక్రవారం ఉదయం ఎస్సీ ఈడీ జయరామ్‌ను కలిశాడు. క్యాంపునకు వెళ్లి వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ పరిశీలించి రుణం చెక్ మంజూరు చేస్తామని ఆయన లబ్ధిదారుడితో చెప్పారు. తనకు తిరిగే ఓపిక లేదని, చెక్ ఇచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి లబ్ధిదారుడిని వారించినా వినిపించుకోలేదు. చేతికి ఉన్న సెలైన్ ప్యానల్‌కు మూత పెట్టుకోకుండా అడ్డం తిరుగుతున్నాడు. కానిస్టేబుల్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్ స్టాఫ్ కూడా అతడిని గంటకుపైగా వారిస్తున్నా వినలేదు. విషయం తెలుసుకున్న గద్దలగుంట యువకులు, బంధువులు వచ్చి జమదగ్నిని బలవంతంగా తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. -
విద్యార్థులకు హెచ్‌పీ బంపర్ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పీ, విద్యార్థులు సులభపద్ధతిలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను కొనుగోలు చేసేలా రుణసౌకర్యాన్ని కల్పిస్తోంది. 'బ్యాక్ టూ కాలేజ్' కార్యక్రమంలో భాగంగా సులభవాయిదా పద్ధతిలో ఈ వెసులుబాటును అందిస్తోంది. ఈ రుణసౌకర్యంలో విద్యార్థులు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సినవసరం ఉండదు. ముందస్తుగా ఎటువంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేకుండా.. 6, 9, 12 నెలల వాయిదాల పద్ధతిలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లకు తీసుకున్న రుణాన్ని విద్యార్థులు తిరిగి చెల్లించవచ్చు. సిబిల్ స్కోర్ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ ఈ రుణాన్ని సమకూరుస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.11,998 వరకు ప్రయోజనాలను అందుకోవచ్చని... ప్రయోజనాల కింద మూడేళ్ల వరకు వారంటీ, బీమా, బ్లూటూత్ స్పీకర్, హెడ్సెట్, హార్డ్ డిస్క్ వంటివి అందుకోవచ్చని హెచ్‌పీ పేర్కొంటోంది. కంప్యూటర్ కొనుగోలు చేయాలని ఉన్నా డబ్బులు లేక ఎంతో మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉంటారని, వారికి ఈ రుణ సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని హెచ్‌పీ ఇండియా కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ కేటగిరీ హెడ్ అనురాగ్ అరోరా తెలిపారు. కమ్యూనికేషన్స్ ప్రతినిధి దినేష్ జోషితో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందుతారని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 500ల పైచిలుకు హెచ్‌పీ విక్రయశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా హెచ్‌పీ పీసీల ప్రారంభ ధర రూ.23 వేలు. -
వసూలు సరే.. వడ్డింపులేవీ?
- మూడేళ్లుగా వడ్డీ రాయితీ విదల్చని సర్కారు - పేరుకుపోయిన రూ.49.74 కోట్ల బకాయిలు - ఆందోళనలో మహిళా సంఘాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్వయంసహాయక సంఘాలు సంకటంలో పడ్డాయి. మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తలపెట్టిన వడ్డీ లేని రుణాల పథకం.. ఆర్థిక చిక్కుల్లోకి నెట్టేశాయి. దీంతో జిల్లాలోని మహిళలు గత మూడేళ్లుగా తీసుకున్న బ్యాంకు లింకు రుణాలకు వడ్డీ చెల్లిస్తుండడంతో ఆర్థిక బలోపేతం సంగతేమో గాని అసలుకే ఎసరు వచ్చింది. జిల్లాలోని మహిళా సంఘాలు రుణాలు పొందిన బ్యాంకులకు గత మూడేళ్లకాలంలో రూ. 106.36 కోట్ల మేర వడ్డీ చెల్లించాయి. కానీ ఈ వడ్డీ మొత్తాన్ని సర్కారు రద్దు చేసి నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ. 56.59 కోట్లు చెల్లించి మమ అనిపించింది. దీంతో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి వడ్డీ నిధులు రాకపోవడంతో మహిళలు సొంతంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. స్పందించని సర్కారు.. జిల్లాలో 31,719 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో దాదాపు 3.35లక్షల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. అర్హత ఉన్న ప్రతి మహిళా సంఘానికి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి లింకు రుణాలందిస్తోంది. ఈ రుణాన్ని పొందిన మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఈ రుణాలను ఏవిధమైన వడ్డీ లేకుండా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సంఘాలు సైతం మొగ్గుచూపాయి. దీంతో జిల్లాలో దాదాపు అన్ని సంఘాలు అర్హత ప్రకారం రుణాలు పొందాయి. అయితే రుణ చెల్లింపుల్లో భాగంగా సంఘాలు ముందుగా వడ్డీ డబ్బులు సైతం బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన తర్వాత సకాలంలో రీపేమెంట్ చేసిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బును తిరిగి ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో భాగంగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మహిళా సంఘాలు వడ్డీ రూపంలో రూ.106.36 కోట్లు చెల్లించినట్లు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మూడేళ్లకు సంబంధించి కేవలం రూ. 56.59 కోట్లు మాత్రమే విడుదల చేసి మమ అనిపించింది. ఇంకా రూ. 49.74 కోట్లు రావాల్సి ఉండగా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. వడ్డీపై వడ్డీ.. లింకు రుణాలు పొందిన సంఘాల నుంచి బ్యాంకులు ముక్కుపిండి మరీ వసూళ్లకు ఉపక్రమిస్తున్నాయి. వాస్తవానికి వడ్డీ లేని రుణాలను ముందస్తుగా మంజూరు చేస్తే సంఘాల సభ్యులకు ఊరట లభించేంది. అదేవిధంగా తిరిగి చెల్లింపులు సైతం ఉత్సాహంతో చేసేవారు. కానీ రుణ మొత్తానికి సంబంధించి చెల్లింపులు వందశాతం పూర్తయిన తర్వాత వడ్డీ రాయితీ కల్పించడం సంఘాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బ్యాంకులు మాత్రం రాయితీ ప్రక్రియతో సంబంధం లేకుండా వడ్డీని కలిపి వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సరిగ్గా చెల్లింపులు చేయని సంఘాలపై వడ్డీ డబ్బులపైనా అదనంగా వడ్డీ వసూలు చేస్తున్నట్లు పలువురు మహిళలు పేర్కొంటున్నారు.