
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా దీర్ఘ, మధ్యకాలిక రుణాలకు సంబంధించి రాయితీ విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై అదనపు వడ్డీ భారం పడకుండా కేంద్ర వ్యవసాయశాఖ అధికారులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడాలని కోరారు. ఈ మేరకు శనివారం వినోద్‌కుమార్‌కు జీవన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6% వడ్డీ రాయితీ నిధులు విడుదల చేసేలా సీఎంకు నివేదిక ఇవ్వాలన్నారు.