intrest rates
-
కీలక వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం ఇదేనా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో వడ్డీ రేట్లపై ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఆర్బీఐ ఎంపీసీ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. అనంతరం ఎంపీసీ సమావేశంలోని నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించనున్నారు. అయితే ఈ తరుణంలో ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు అలెర్ట్. మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించాయి. వాటిల్లో ఎస్బీఐ, డీసీబీ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎస్, క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి .డీసీబీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు డీసీబీ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం కొత్త రేట్లు మే 22, 2024 నుండి అమలులోకి వస్తాయి.19 నెలల నుండి 20 నెలల కాలవ్యవధిలో సాధారణ కస్టమర్లకు 8శాతం, సీనియర్ సిటిజన్లకు 8.55శాతం అత్యధిక ఎఫ్డీ వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేటు 8శాతం వరకు అందించబడుతుంది. పొదుపు ఖాతాపై 8 శాతం వరకు, ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.55 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.ఐడీఎఫ్సీఐడీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయిబ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం నుండి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం వడ్డీ రేటు 3.50 శాతం నుండి 8.40 శాతం వరకు ఉంటుంది. 500 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 8శాతం, 8.40శాతం వరకు అందిస్తుంది. ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైల్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల వరకు), బల్క్ డిపాజిట్లపై (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ) నిర్దిష్ట కాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లుఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 8.50 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, బ్యాంక్ 4.60 శాతం నుంచి 9.10 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కాలవ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.10 శాతం వరకు పొందవచ్చు.ఆర్బీఎల్లో వడ్డీ రేట్లు ఆర్బీఎల్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఆర్బీఎల్ బ్యాంక్ 18 నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 8శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అదే ఎఫ్డీ వ్యవధిలో, సీనియర్ సిటిజన్ 0.50 శాతం అదనంగా పొందవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్లు (80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ) 8.75శాతం అదనపు వడ్డీ రేటుకు అర్హులు. -
ఈ బ్యాంకుల్లో 2 సంవత్సరాల డిపాజిట్లపై 7.25% వడ్డీ
-
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే కీలక వడ్డీరేట్లు
రాజకీయాలతోపాటు రాష్ట్ర బాగోగులు, సమస్యలపై నిత్యం పార్లమెంట్లో పోరాడే ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రపంచ ఆర్థికవ్యవస్థపై విస్తృత పట్టు ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను తగ్గించేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలేంటి.. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది.. అసలు ద్రవ్యోల్బణం ఎలా ఏర్పడుతుంది.. కార్మికుల జీతాలకు ఇన్ఫ్లేషన్కు సంబంధం ఏమిటనే అంశాలను విజయసాయిరెడ్డి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాల్లో, చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిన వర్ధమాన దేశాల్లో మధ్యతరగతి ప్రజల నుంచి ఆర్థికవేత్తల వరకూ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారు. జనం వినియోగించే వస్తువులు, సరకుల ధరలు పెరుగడం అందరినీ వేధిస్తున్న సమస్య. అమెరికా నుంచి ఇండియా వరకూ ద్రవ్యోల్బణంలో వచ్చే మార్పులే మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) ఇటీవల ‘దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేకొద్దీ 2024లో వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించగలం’ అని సూచనప్రాయంగా తెలిపింది. దీంతో ఇండియాలో స్టాక్ మార్కెట్లలో సూచీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ ఆర్థికవ్యవస్థ గమనాన్ని నిర్ణయించే ద్రవ్యోల్బణంపై తరచూ ‘ఫెడ్’ ప్రకటనలు చేస్తూ అమెరికన్లను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. ఫెడ్ సూచనలు కీలకం ప్రస్తుత ద్రవ్యోల్బోణం ఈ ఏడాది లేదా తర్వాత ఏడాది ఏ స్థాయిలో అదుపులోకి వస్తుందనే విషయంపై ఫెడ్ లేదా దాని సభ్యులు అంచనా వేసి చెబుతుంటారు. ఈ అంచనాల ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తోంది ఫెడ్. రాబోయే సుమారు మూడు నెలల కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు లేదా పెంపు ఎలా ఉండవచ్చనే అంశంపై ప్రజలకు ఫెడ్ ముందే సూచిస్తోంది. ఇలా ద్రవ్యోల్బణంపై ఫెడ్ వేసే అంచనాలకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఫెడ్ అభిప్రాయాలపై విస్తృతంగా చర్చలు సాగుతాయి. చివరికి ఫలానా వస్తువుల ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే విషయంపై సగటు వినియోగదారుడు ఒక నిర్ధారణకు వస్తాడు. ఫెడ్ కీలక నిర్ణయాల వల్ల బ్యాంకు వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణంపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయంపై క్లారిటీ వస్తుంది. అర్థశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టే అంతా జరుగుతుందా అంటే, వాటిలో వివరించిననట్టు ప్రపంచం నడవదు. వాస్తవ ప్రపంచం వేరు.. వ్యాపారులు తమ ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించాలనుకున్నప్పుడు అందుకు సరిపడా కార్మికులు లేకపోతే ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంటుంది. ఉద్యోగులకు డిమాండ్ ఉండడంతో వారు అధిక వేతనాల కోసం పట్టుబడతారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. దాంతో వేరే దారిలేక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు నిర్ణయిస్తారు. జీతాలు పెరగడం వల్ల కార్మికుల జేబుల్లోకి ఎక్కువ డబ్బు వస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ కనీస అవసరాల కోసం షాపుల్లో కొనుగోలు చేసే వస్తు ధరలు ఊహించినదాని కన్నా ఎక్కువ ఉంటాయి. వేతనాలు పెరగడంతో వచ్చిన ప్రయోజనం వస్తు ధరల పెంపుతో మాయమౌతుంది. ఇక ధరలు ఇలాగే పెరుగుతాయనే ఆందోళనతో కార్మికులు మరింత ఎక్కువ వేతనాలు కావాలంటూ ఒత్తిడి చేస్తారు. ఈ విధంగా వర్కర్ల జీతాలతోపాటే వస్తువుల ధరలూ పెరుగుతుంటాయి. దీన్నే ‘ధరల వలయం’ అని పిలుస్తారు. ఈ రకమైన సూత్రీకరణలు అర్థసత్యాలేగాని సంపూర్ణ వాస్తవాలు కావు. సరకుల కొరత ఉన్నప్పుడు తమ లాభాలు పెంచుకోవడానికి వ్యాపారులు చేసే ప్రయత్నాల వల్ల (ధరలు పెంచడం ద్వారా) కొన్ని కాలాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిల్లో ఉంటుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే? అసలు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే ఏమిటి? అనే విషయంపై అమెరికాలో చర్చ జరుగుతోంది. ఫెడ్ తన ప్రకటనలో వాడిన ఈ మాటలకు (ఇన్ఫ్లేషన్ ఈజింగ్) అర్థం–ద్రవ్యోల్బణం తగ్గిపోవడం. అంటే ధరలు తగ్గవు. గతంతో పోల్చితే ధరలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అమెరికాలో ఇళ్లలో వాడే సరకుల ధరలు 2022లో 12% పెరగగా, గడచిన 12 మాసాల్లో కేవలం 2 శాతమే పెరిగాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ముందుకు నడిపించే ఈ దేశంలో గతేడాది ద్రవ్యోల్బణం 9.1% ఉండగా, నవంబర్‌లో 3.1% గా నమోదైంది. ఈ లెక్కన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం 2024లో కూడా ఇప్పటిలా ఆశావహంగా ఉండొచ్చని అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంచనా. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ ఇటీవలే అరశాతం వడ్డీరేటు పెంచిన నేపథ్యంలోనే బీఓబీ తాజా నిర్ణయం తీసుకుంది. 1.25 శాతం వరకూ పెరిగిన వడ్డీరేటు డిసెంబర్ 29వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. రుణ రేటు పెరుగుదల, నిధుల సమీకరణ అవసరాల నేపథ్యంలో కొన్ని బ్యాంకులు డిపాజిట్ రేటు పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది. తాజాగా బీఓబీ ఏడాది లోపు స్వల్పకాలిక కాలపరిమితులపై డిపాజిట్ రేట్ల పెంపుపై ప్రధానంగా బ్యాంక్ దృష్టి సారించింది. బీఓబీ తాజా నిర్ణయం ప్రకారం... రూ.2 కోట్ల వరకూ వివిధ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 10 బేసిస్ పాయిట్ల నుంచి 125 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. 7 నుంచి 14 రోజుల డిపాజిట్ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25 % పెరిగి 4.25 శాతానికి చేరింది. 15 నుంచి 45 రోజుల డిపాజిట్ రేటు 1 శాతం పెరిగి 4.50 శాతానికి చేరింది. -
RBI Monetary policy: అయిదోసారీ అక్కడే..!
ముంబై: ద్రవ్యోల్బణంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ వరుసగా అయిదోసారీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం హోదాను నిలబెట్టుకుంటూ భారత్ మరింత వృద్ధి నమోదు చేయగలదని అంచనా వేసింది. అటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మరోవైపు, రికరింగ్ చెల్లింపుల ఈ–మ్యాండేట్ పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6–8 మధ్య ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మళ్లీ సమావేశం అవుతుంది. ఆర్బీఐ నిర్ణయాలు అధిక వృద్ధి సాధనకు దోహదపడగలవని బ్యాంకర్లు, కార్పొరేట్లు వ్యాఖ్యానించగా .. రేటును తగ్గించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని రియల్టీ రంగం అభిప్రాయపడింది. వచ్చే సమీక్షలోనైనా తగ్గించాలని కోరింది. వివరాల్లోకి వెడితే.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రామాణిక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు) యధాతథంగా 6.5%గా కొనసాగించాలని కమిటీలోని సభ్యులందరూ (ఆరుగురు) ఏకగ్రీవంగా తీర్మానించారు. ధరలను కట్టడి చేసే దిశగా 2022 మే నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును 2.5% పెంచింది. యూపీఐ పరిమితులు పెంపు.. ► ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపుల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు. ► మళ్లీ మళ్లీ చేసే (రికరింగ్) చెల్లింపులకు సంబంధించి ఈ–మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలు 6.5 శాతం నుంచి 7%కి పెంపు. జీడీపీ డిసెంబర్ త్రైమాసికంలో 6.5%గా, మార్చి క్వార్టర్లో 6 శాతంగా ఉంటుందని అంచనా. ► వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం క్యూ3లో 5.6%గా, క్యూ4లో 5.2%గా ఉండొచ్చని అంచనా. 2024–25 జూన్ క్వార్టర్లో ఇది 5.2 శాతంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 4 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 4.7 శాతంగా ఉండవచ్చు. ► డేటా భద్రత, గోప్యతను మరింతగా పెంచే దిశగా ఆర్థిక రంగం కోసం ఆర్బీఐ క్లౌడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ► ఆర్థిక రంగ పరిణామాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా ‘‘ఫిన్‌టెక్ రిపాజిటరీ’’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2024 ఏప్రిల్‌లో లేదా అంతకన్నా ముందే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని అందుబాటులోకి తేనుంది. ఫిన్‌టెక్ సంస్థలు స్వచ్ఛందంగా సంబంధిత వివరాలను రిపాజిటరీకి సమర్పించవచ్చు. ► డిసెంబర్ 1 నాటికి విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఇతర వర్దమాన దేశాలతో పోలిస్తే రూపాయి మారకంలో ఒడిదుడుకులు తక్కువగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఎఫెక్ట్.. సెపె్టంబర్ క్వార్టర్ వృద్ధి గణాంకాలు పటిష్టంగా ఉండి, అందర్నీ ఆశ్చర్యపర్చాయి. ఆహార ధరల్లో నెలకొన్న అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ అంచనాలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. వేగంగా మారిపోయే ఆహార ధరల సూచీలన్నీ కూడా కీలక కూరగాయల రేట్ల పెరుగుదలను సూచిస్తున్నాయి. ఫలితంగా సమీప భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగొచ్చు. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంచనాల పెంపు సముచితమే.. ప్రథమార్ధంలో సాధించిన వృద్ధి, ఆ తర్వాత రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) గణాంకాలన్నీ సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం సముచితమే. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి రేటు తగ్గించాల్సింది.. వడ్డీరేట్లను య«థాతథంగా కొనసాగించడం మంచి నిర్ణయమే. అయితే, ప్రస్తుతం స్థూల–ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున రేటును తగ్గించి ఉంటే రియల్టీ రంగం, ఎకానమీకి గణనీయంగా ప్రయోజనం కలిగేది. – »ొమన్ ఇరానీ, నేషనల్ ప్రెసిడెంట్, క్రెడాయ్ సానుకూల సంకేతాలు ద్రవ్యోల్బణం స్థిర స్థాయిలో ఉంటూ, ఎకానమీ అధిక వృద్ధి సాధించే దిశగా ముందుకెడుతుందని పాలసీ స్పష్టమైన, సానుకూల సంకేతాలిస్తోంది. వరుసగా మూడో ఏడాది 7 శాతం వృద్ధిని సాధించే అవకాశాలను సూచిస్తోంది. – దినేష్ ఖారా, చైర్మన్, ఎస్బీఐ -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఇప్పటికే పలువురు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు వడ్డీని పొందారు. ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న నిల్వలపై 8.15 శాతం వడ్డీ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈపీఎఓ ఖాతాలో వడ్డీ జమైందో లేదో అని తెలుసుకునేందుకు ఖాతాదారులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా వారి పాస్‌బుక్‌ను ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ని ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలంటే? ♦ https://www.epfindia.gov.in/ site_en/For_Employees.php ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి ♦ హోమ్‌పేజీలో 'సర్వీస్' పై క్లిక్ చేసి, 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ని ఎంచుకోండి ♦ ఆపై 'మెంబర్ పాస్‌బుక్' లింక్‌పై క్లిక్ చేయండి. మీకు అక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ♦ మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి అకౌంట్లో లాగిన్ అవ్వండి. ♦ అనంతరం మీరు మీ ఖాతా వివరాలను ఎంటర్ చేసి ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఉమాంగ్ యాప్‌లో ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలంటే ♦ ఉమాంగ్ యాప్‌ను ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఓటీపీ లేదా ఎంపీఐఎన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ♦ లాగిన్ చేసిన తర్వాత ఈపీఎఫ్‌ని సెలక్ట్ చేసుకోవాలి. ♦ కాన్ వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. ♦ ఆ తర్వాత మీ యూఏఎన్‌ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి ♦ ఓటీపీని ఎంటర్ చేయండి ♦ ఇప్పుడు మీరు మీ ఈపీఎఫ్ఓ ఖాతా వివరాలను చూడవచ్చు. మెంబర్ ఐడిని సెలక్ట్ చేసుకుని ఇ-పాస్‌బుక్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ని చెక్ చేయండి మీరు మీ యూఏఎన్‌ని ఉపయోగించి ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఖాతా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి "EPFOHO UAN ENG"ని 7738299899కి పంపండి. వెంటనే మీకు మీ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో మీ మొబైల్ నెంబర్‌కి మెసేజ్ వస్తుంది. 40ఏళ్లలో తొలిసారి తగ్గిన వడ్డీరేట్లు ఈపీఎఫ్ వడ్డీరేట్లను ఖాతాదారుల అకౌంట్లలోకి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) జమ చేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కోసం సీబీటీ ప్రతి ఏడాది ఆదాయం, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఓ బడ్జెట్‌ను తయారు చేస్తుంది. ఆ బడ్జెట్‌కు అనుగుణంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ♦తాజా సమాచారం ప్రకారం, కోవిడ్ కారణంగా ఈపీఎఫ్ఓ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.1శాతానికి తగ్గించింది. 40ఏళ్ల తర్వాత ఇదే అత్యల్పం. అయితే నాలుగు దశాబ్దాల తర్వాత కోవిడ్ కారణంగా వడ్డీని తగ్గిస్తూ వచ్చింది. ♦గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే 13.22శాతం పెరుగుదలతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓకి 1.39 కోట్ల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు. -
అధిక వడ్డీరేట్లు కొనసాగుతాయన్న ఆర్బీఐ గవర్నర్
ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన సంక్లిష్టంగా మారిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. 2023లో ఇప్పటివరకు పాలసీ రేట్లపై ఆర్బీఐ విరామం కొనసాగించిందన్నారు. ప్రస్తుతం వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయని, అవి ఇంకెంతకాలం కొనసాగుతాయో చెప్పలేమన్నారు. శుక్రవారం జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తోడవ్వడంతో ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచాయి. ఈ క్రమంలో ఆర్బీఐ సైతం గతేడాది మేనెల నుంచి దాదాపు 250 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. ఇప్పటికే రెపో రేటు 6.50 శాతానికి చేరింది. అయితే, ఈ రేట్లు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో అప్పుడే చెప్పలేమని, కాలమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని శక్తికాంత దాస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.(వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్) ప్రపంచ వృద్ధిలో మందగమనం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణంలో అనిశ్చితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్బీఐతో సహా సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో బాధ్యత వహించాలని సూచించారు. క్రూడాయిల్ ధర పెరుగుదల, బాండ్ల రాబడి పెరగడం వంటి తాజా సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా బ్యాంకులు కనీస మూలధన అవసరాలను తీర్చగలవన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఇంకా రూ.10వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని చెప్పారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలెర్ట్, అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు!
ఖాతాదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లను పెంచింది. దీంతో ఎఫ్డీ చేసిన సాధారణ ఖాతాదారులు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజన్లు 7.75 శాతం వడ్డీని పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సవరించిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడు రోజుల నుంచి 14 రోజుల టెన్యూర్ కాలానికి 3 శాతం, 15 రోజుల నుంచి 45 రోజుల కాలానికి 3.50శాతం పెంచింది. 4.5 శాతం ఉన్న వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచి 46 నుంచి 180 రోజుల టెన్యూర్‌కు 5శాతం వడ్డీని, 181 నుంచి 210 టెన్యూర్ కాలానికి 5.50 శాతం,211 నుంచి 270 కాలానికి 6 శాతం, 271 నుంచి ఏడాది లోపు వడ్డీ రేట్లను 6.25 శాతం అందిస్తుంది. అయితే, 399 రోజుల కాలవ్యవధి గల ‘బరోడా తిరంగా ప్లస్’డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.25 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు 2023 అక్టోబర్ 9 (నేటి) నుంచి అమల్లోకి వచ్చాయి. -
మార్కెట్లో ‘ఆర్బీఐ’ హుషారు
ముంబై: అంచనాలకు తగ్గట్లే ఆర్బీఐ వరుసగా నాలుగోసారీ కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ ర్యాలీ చేసింది. రేట్ల సంబంధిత ఫైనాన్స్, రియల్టీ, ఆటో షేర్లు రాణిండంతో సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 65,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,654 వద్ద నిలిచింది. ఆసియా, యూరప్ మార్కెట్ల రికవరీ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. క్రూడాయిల్ ధరలు మరింత దిగిరావచ్చనే అశలూ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య పాలసీ ప్రకటన వెల్లడి తర్వాత మరింత దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 464 పాయింట్లు బలపడి 66,096 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు దూసుకెళ్లి 19,676 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. -
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించేసింది. సాధారణ ఖాతాదారులకు 35 నెలల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7.20 శాతం నుంచి ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపుతో 7.15 శాతానికి, అలాగే 55 నెలల టెన్యూర్ కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ 7.20 శాతానికి తగ్గించింది. 12 నెలల నుంచి 15 నెలల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేండ్ల నుంచి రెండు సంవత్సరాల 11 నెలలు, మూడేండ్ల ఒక్కరోజు నుంచి నాలుగేండ్ల ఏడు నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ ఖాతాదారులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నది. ఇక ఐదేండ్ల ఒక రోజు నుంచి 10 ఏండ్ల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి. -
కేంద్రం వడ్డీ రేట్లు పెంచింది.. చెక్ చేసుకున్నారా?
న్యూఢిల్లీ: ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేటును కేంద్రం శుక్రవారం 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. అన్ని ఇతర చిన్న పొదుపు పథకాల రేట్లను యథాతథంగా ఉంచింది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి తాజా రేట్ల విధానంపై ఆర్థికశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. డిసెంబర్ త్రైమాసికానికి యథాతథంగా కొనసాగుతున్న మిగిలిన పొదుపు పథకాల రేట్లు ఇలా... -
ఆర్బీఐ కొత్త రూల్స్ : హోమ్‌లోన్‌పై రూ. 33 లక్షల వరకు ఆదా
హోమ్ లోన్ ఖాతాదారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. ఆర్బీఐ అమల్లోకి తేనున్న కొత్త రూల్స్‌తో ఇంటి రుణాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఫలితంగా రూ.50 లక్షల హోమ్‌లోన్‌పై చెల్లించే వడ్డీ రూ.33 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలుస్తోంది. గత ఏడాది ఆర్బీఐ వరుస వడ్డీ రేట్ల పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, వడ్డీ రేటు పెరిగినప్పుడు కస్టమర్లు నెలవారీ చెల్లించే ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం నుంచి కాపాడేందుకు బ్యాంకులు టెన్యూర్ కాలాన్ని పెంచుతున్నాయి. అయితే, కొన్నిసార్లు ఈ పొడిగింపులు ఎక్కువ కాల కొనసాగడంతో రుణాలు చెల్లించే సమయంలో రుణ గ్రహితలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో రుణగ్రహీతల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, హోమ్లోన్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కొన్ని రీపేమెంట్ నిబంధనలను రూపొందించింది . ఇందులో కొత్తదనం ఏమిటి? ఇది గృహ రుణ గ్రహీతలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? హోమ్లోన్లపై ఆర్బీఐ కొత్త ఆదేశాలు, చోటు చేసుకున్న మార్పులు అయితే ఆగస్టు 18,2023న విడుదల చేసిన నోటిఫికేషన్లో హౌస్‌లోన్ తీసుకున్న రుణదాతలు ఈఎంఐని పెంచడానికి లేదా లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను రీసెట్ చేసే సమయంలో రెండు ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. 1) ఈఎంఐ/టెన్యూర్..ఇలా రెండింటిలో మార్పుకు దారితీసే బెంచ్‌మార్క్ రేట్లలో మార్పుల్ని, వాటి ప్రభావాల్ని బ్యాంకులు ఇంటి రుణాలు తీసుకునే రుణగ్రహీతలకు తెలియజేయాలి. 2) వడ్డీ రీసెట్ సమయంలో, రుణగ్రహీతలకు స్థిర వడ్డీ రేటుకు మారే అవకాశం ఇవ్వాలి. ఫ్లోటింగ్ నుండి ఫిక్స్‌డ్‌కి మారడానికి వర్తించే అన్ని ఛార్జీలు లోన్ ప్రాసెసింగ్ సమయంలో వెల్లడించాలి. 3) రుణ గ్రహీతలకు లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా ఈఎంఐలలో మెరుగుదలను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. 4) రుణదాతలు ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ టెన్యూర్ కాలాన్ని పొడిగించడం వల్ల ప్రతికూల ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలి. అంటే రుణాలు తీసుకునే సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులు రుణాలకు సంబంధించిన అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. గృహ రుణాలపై కొత్త ఆర్బీఐ నియమం: ఇది రుణ గ్రహితలకు ఎలా ఉపయోగపడుతుంది? ఉదాహరణకు మీరు 2020లో 20 సంవత్సరాలకు (240 నెలలు) 7% వడ్డీతో రూ. 50 లక్షల గృహ రుణాన్ని ఈఎంఐ చెల్లించడం ప్రారంభించారు అని అనుకుందాం. లోన్ తీసుకునే సమయంలో మీ నెలవారీ ఈఎంఐ నెలకు రూ. 38,765. మొత్తం వడ్డీ రూ.43.04 లక్షలు. మూడేళ్ల తర్వాత వడ్డీ రేటు 9.25%కి పెరిగిందనుకుందాం. కొత్త ఆర్బీఐ ఆదేశం ప్రకారం, బ్యాంకులు మీ ఈఎంఐ లేదా టెన్యూర్ కాలాన్ని పెంచుకోవడానికి లేదా వడ్డీ రేటును రీసెట్ చేసేటప్పుడు పైన పేర్కొన్న రెండు ఆప్షన్లను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలి. మీరు మీ 20 సంవత్సరాల లోన్‌ను మిగిలిన 17 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలనుకుంటే (3 సంవత్సరాలు గడిచినందున), మీ ఈఎంఐ నెలకు రూ. 44,978కి పెరుగుతుంది. మీరు లోన్ టెన్యూర్ ముగిసే సమయానికి మొత్తం రూ. 55.7 లక్షల వడ్డీ చెల్లించుకోవచ్చు. అయితే, మీరు మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాలనుకుంటే మీ లోన్ ఈఎంఐ రూ. 38,765 చెల్లిస్తే.. అదే లోన్ 321 నెలలు లేదా 26 సంవత్సరాల 10 నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. లోన్ గడువు ముగిసే సమయానికి మీ మొత్తం వడ్డీ చెల్లింపు రూ. 88.52 లక్షలు అవుతుంది. ఈ సందర్భంలో మీరు అధిక ఈఎంఐకి బదులుగా ఈఎంఐ టెన్యూర్ కాలాన్ని పెంచుకుంటే మీరు రూ. 33 లక్షల అదనపు వడ్డీ చెల్లించకుండా ఉపశమనం పొందే అవకాశం లభిస్తుంది. మీరు హోమ్ లోన్ ఈఎంఐని పెంచాలా లేదా ఈఎంఐ చెల్లించే టెన్యూర్ కాలాన్ని పొడిగించాలా? వడ్డీ రేటు పెరిగినప్పుడు, గృహ రుణగ్రహీత ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్ కాలాన్ని ఎంపిక చేసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. (Disclaimer: హోమ్లోన్ల గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. రుణ గ్రహితలకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు తీసుకోవాలనుకుంటున్న హోమ్లోన్లు, ఇతర లోన్లపై సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఆర్బీఐ కీలక నిర్ణయం : సామాన్యులకు భారీ ఊరట?
ముంబై: గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల అత్యున్నత స్థాయి ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. 3 రోజుల ఈ సమావేశ నిర్ణయాలు గురువారం (ఆగస్టు 10వ తేదీ) వెలువడతాయి. ద్రవ్యోల్బణంపై అనిశ్చితి పరిస్థితి నేపథ్యంలో యథాతథ రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి కమిటీ మెజారిటీ మొగ్గుచూపవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇదే జరిగితే రేటు యథాతథ స్థితి కొనసాగింపు ఇది వరుసగా మూడవసారి (ఏప్రిల్, జూన్ తర్వాత) అవుతుంది. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో గత ఏడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.5 శాతానికి (ఫిబ్రవరికి) చేరింది. అటు తర్వాత రేటు మార్పు నిర్ణయం తీసుకోలేదు. -
పెరిగిన సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీరేట్లు..ఎంతో తెలుసా?
Small saving schemes: సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జులై - సెప్టెంబర్ మధ్య కాలానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన స్మాల్ స్కీమ్ వడ్డీ రేట్లను 10 నుంచి 30 బేసిస్ మేర పెరిగాయి. సవరించిన వడ్డీ రేట్లు ఏడాది, రెండేళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరగ్గా, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ 30 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఏడాది డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 6.9 శాతం, 2ఏళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 7 శాతం, 5ఏళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరుకున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ), కిసాన్ వికాస్ పాత్ర, సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సంవృద్ది యోజన స్కీమ్ మినహా మిగిలిన స్కీమ్‌లు యధావిధిగా కొనసాగుతున్నాయి. జులై1 నుంచి అమలు ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకాలు సురక్షితం, ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈస్మాల్ సేవింగ్స్‌లో వడ్డీ రేట్లు ఎక్కువ. దీంతో కేంద్ర పథకాల్లో పెట్టుబడి పెట్టే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టే సీనియర్ సిటిజన్లు, పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తరచూ వడ్డి రేట్లను పెంచుతుంది. ఇక, తాజా వడ్డీ రేటు పెరుగుదల మునుపటి త్రైమాసికంతో పోల్చితే, ప్రభుత్వం 70బీపీఎస్ వరకు పెంపుదలను ప్రకటించింది. అంతేకాకుండా, గత రెండు త్రైమాసికాల్లో, సుకన్య సమృద్ధి ఖాతా పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, నెలవారీ ఆదాయ పొదుపు పథకం, అన్ని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ల వంటి ప్రముఖ పథకాల రేట్లను ప్రభుత్వం పెంచింది. చదవండి👉 అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం! -
తపాలాకు సాంకేతిక సొబగులు
నేరడిగొండ: బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకుంటూ ఆధునికతను అందిపుచ్చుకునే దిశగా తపాలా శాఖ అడుగులు వేస్తోంది. అన్ని రంగాలతో సమానంగా ఆన్లైన్ విధానంలోనూ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది. ఇప్పటికే పలుసేవలను ఆన్లైన్ విధానంలోకి తెచ్చింది. వీటితోపాటు తాజాగా ‘పోస్ట్ ఇన్ఫో యాప్’ను తీసుకువచ్చింది. దీనిద్వారా పోస్టల్‌కు సంబంధించిన సమాచారాన్ని ఫోన్లోనే తెలుసుకునే వీలు కలిగింది. వినియోగదారుడికి సదుపాయంగా.. పోస్ట్ ఇన్ఫో యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో తపాలా చార్జీలు, బీమా ప్రీమియం, వివిధ డిపాజిట్లపై వడ్డీ లెక్కించుకునే సదుపాయాలు సైతం ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన, డిపాజిట్ పథకం, టైమ్ డిపాజిట్లపై ఏడాది నుంచి ఐదేళ్ల వరకు వచ్చే ఆదాయం వాటిని లెక్కించుకోవచ్చు. ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లు ఆధారంగా పథకాలు ఎంచుకొని డిపాజిట్లు చేయడం ద్వారా వచ్చే ఆదాయం వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు అమలులో ఉన్న (ఆరు అంకెల) పిన్‌కోడ్ నంబర్లను ఎంటర్ చేస్తే తపాలా కార్యాలయం పేరు, డివిజన్ పరిధి తెలియజేస్తుంది. తపాలా అందిస్తున్న సేవలపై ఖాతాదారులు ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం సైతం ఉంది. కూర్చున్న చోటు నుంచే. ఈ యాప్ ద్వారా కూర్చున్న చోటు నుంచే వినియోగదారులు సులువుగా సమాచారం పొందవచ్చు. తపాలా చార్జీలు, బీమా ప్రీమియం, పొదుపు పథకాల గురించి తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మరింత సులువు.. తపాలా శాఖలో బ్యాంకులకు దీటుగా ఆన్లైన్ ద్వారా సేవలందిస్తోంది. మహిళలకు ప్రత్యేక పథకాలు ఉన్నాయి. మా శాఖ ద్వారా ఆయా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఏవైన వివరాలు ఉంటే ఆయా గ్రామాల్లో గల తపాలా శాఖ కార్యాలయంలో కాని, బీపీఎంల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. – మహేశ్‌రెడ్డి, సబ్ పోస్టుమాస్టర్, నేరడిగొండ -
హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు భారీ షాక్!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన టెన్యూర్ కాలానికి 15 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్( (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల )ను పెంచింది. పెంచిన ఈ రేట్లు మే 8 నుంచే అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగిన ఈ ఎంసీఎల్ఆర్ రేట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లోని పర్సనల్, వెహికల్ లోన్స్ పాటు ఇతర రుణాలు తీసుకున్న ఖాతాదారులు నెలనెలా చెల్లించే ఈఎంఐలు భారం కానున్నాయి. ఇక కొత్తగా అమల్లోకి వచ్చిన ఎంసీఎల్ఆర్ రేట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ ఆర్ రేటు 7.95 శాతం, ఒక నెల టెన్యూర్ కాలానికి 8.10శాతం, 3 నెలల టెన్యూర్ కాలానికి 8.40శాతం, 6 నెలల టెన్యూర్ కాలానికి 8.80శాతం, ఏడాది టెన్యూర్ కాలానికి 9.05 శాతం, రెండు సంవత్సరాల టెన్యూర్ కాలానికి 9.10 శాతం, 3ఏళ్ల టెన్యూర్ కాలానికి 9.20శాతం విధిస్తుంది. -
పెరిగిపోతున్న హోమ్లోన్లు.. రూ.19.36 లక్షల కోట్లకు చేరిన రుణాలు!
ముంబై: వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ గృహ రుణాలు (రుణ గ్రహీతలు చెల్లించాల్సిన మొత్తం) గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.19.36 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది మే నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లను 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై రేట్లు పెరిగాయి. 2022 మార్చి చివరికి గృహ రుణాలు రూ.16.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చి చివరికి రూ.14.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల్లో 20.6 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి 12.6 శాతంతో పోలిస్తే పెరిగింది. కన్జ్యూమర్ రుణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా, వాహన రుణాలన్నీ పర్సనల్ లోన్ కిందకు వస్తాయి. పరిశ్రమలకు రుణాల మంజూరు 5.7 శాతం పెరిగింది. పెద్ద పరిశ్రమలకు ఇది 3 శాతంగా ఉంది. మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాల మంజూరులో 19.6 శాతం వృద్ధి నమోదైంది. ఇక సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణ వితరణ 12.3 శాతం పెరిగింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రుణాల మంజూరు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15.4 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతంతో పోలిస్తే మంచి పురోగతి కనిపించింది. -
అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే సామెత తెలుసుగా..అంటే జీవితంలో ఎవరైనా ఈ రెండు పనులు చేయడం అంత వీజీ కాదనేది దాని అర్థం. అపార్ట్మెంట్ కట్టాలన్నా లేక ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలన్నా ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నదే. ఇందుకు ఎంతగానో డబ్బు కూడా అవసరమవుతుంది. ధరలను నియంత్రించేందుకు గాను ఆర్బీఐ రెపోరేట్లు.. తదనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్నాయి. అయినప్పటికీ మిలియనిల్స్ (1980 తర్వాత జన్మించిన వాళ్లు) సొంతింటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో పెరిగిపోతున్న వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోళ్లు ప్రభావం చూపుతుందా? మిలియనిల్స్ ఏమనుకుంటున్నారు? అన్న అంశంపై ప్రముఖ రియాల్టీ సంస్థ నోబ్రోకర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ - ఎన్సీఆర్ నగరాల నుంచి సుమారు ఇంటి లోన్ తీసుకున్న 2 వేల మంది పాల్గొన్నారు. ♦ ఇక, ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయం ప్రకారం.. 2022 అక్టోబర్ - డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి - మార్చి మధ్య కాలంలో వడ్డీ రేట్లు ఆకాన్నంటుతున్నా.. 42 శాతం హోం లోన్ తీసుకున్నట్లు తెలిపింది. గత ఏడాది ముగిసిన ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2021 సమయంలో ఇళ్ల లోన్ల వృద్ధి 120 శాతం పెరిగింది. ♦ కోవిడ్-19 తెచ్చిన మార్పుల కారణంగా చాలా మందిలో ‘మనకీ ఓ సొంతిల్లు’ ఉంటే బాగుండేదన్న ఆలోచన పెరిగింది. కాబట్టే కోవిడ్-19కి ముందు మిలియనిల్స్ 17శాతం ఉంటే ఇప్పుడు అదికాస్త 27కి పెరిగింది. వారిలో ఎక్కువ మంది 25 - 35 మధ్య వయస్కులే ఉండటం గమనార్హం. ♦ 36 ఏళ్ల వయసు దాటిన తర్వాత గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ‘లేట్ మిలీనియల్స్’ నిలుస్తున్నారు. వీళ్లు సైతం ఇల్లు కొనుగోలు చేసే వారి జాబితాలో ఎక్కువ మంది ఉన్నారని సర్వే హైలెట్ చేసింది. ♦ సొంతింటి కోసం ఎక్కువ మంది కుర్రకారు 10 శాతం డౌన్ పేమెంట్ కోసం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్(ఎన్బీఐఎఫ్సీ) వంటి సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. వాటిల్లో పర్సనల్ లోన్ తీసుకొని వాటి ద్వారా డౌన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. ♦ 78 శాతం మంది హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం లేదు.. అలా అని తక్కువగా ఉన్నాయని చెప్పడం లేదని తేలింది ♦ రుణాలపై ఇళ్లను కొనుగోలు చేసేవారు ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు.. ఆ భారం వల్ల ఎదుర్కొన్నే కష్ట - నష్టాలను పూర్తిగా అర్ధం చేసుకున్నారు. గత 10-12 ఏండ్ల నుంచి పరిశీలిస్తే గత దశాబ్ధ కాలంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు 6 నుంచి 8 శాతం మధ్యే ఉందని పేర్కొన్నారు. ♦ ‘ఇళ్ల రుణాలు సాధారణంగా 20 ఏండ్ల టెన్యూర్ కలిగి ఉంటాయి. మేము ఈ 20 సంవత్సరాల టెన్యూర్ కాలంలో రెపో రేట్ పెంపు, తదుపరి రేటు తగ్గింపు సాధారణంగా సగటున ఉన్నట్లు స్పష్టమవుతుంది’ అని నోబ్రోకర్ సీఈవో అమిత్ కుమార్ అగర్వాల్ అన్నారు. ♦ మిలీనియల్స్ కోసం నిర్వహించిన ప్రత్యేక నోబ్రోకర్ అధ్యయనంలో కొవిడ్‌కు ముందు 49 శాతం మంది మిలియనిల్స్ ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపితే, ఇప్పుడు దాదాపు 63 శాతం మంది సొంతింటి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారని నో బ్రోకర్ సర్వేలో తేలింది. చదవండి👉 ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్! -
ఆర్బీఐ షాక్.. త్వరలో వడ్డీరేట్లను పెంచనుందా?
పెరిగిపోతున్న రీటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3,5,6 తేదీలలో ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన బెంచ్ మార్క్ వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని విడుదల చేయడానికి ముందు వివిధ జాతీయ,అంతర్జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఏప్రిల్ 3, 5, 6 తేదీలలో మూడు రోజుల పాటు సమావేశం కానుంది. కాగా, ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో మే నుండి ఇప్పటికే రెపో రేటును మొత్తం 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీల)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి10 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎంత పెంచిందో తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్ల ఇలా ఉన్నాయి ►7 రోజుల నుంచి 45 రోజుల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ►46 రోజుల నుంచి 60 రోజుల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది ►61 రోజుల నుంచి 3 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది ►3 నెలల నుంచి 6 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► 6 నెలల నుంచి 9 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► 9 నెలల నుంచి ఏడాది నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 6.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం 24 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► ఒక సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ►13 నెలల నుంచి 2 సంవత్సరాల నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► 2 నుంచి 30 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.26 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ►30 నెలల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. -
సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
ఓ వైపు ఆర్ధిక మాద్యం.. మరోవైపు బ్యాంకులు పెంచుతున్న వడ్డీ రేట్లు సామాన్యులకు భారంగా మారాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లబ్ధిదారులకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్ల(ఎంసీఎల్ఆర్)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్డీఎఫ్సీ ప్రతినిధులు తెలిపారు. ఇక హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఎంసీఎల్ఆర్ వడ్డీరేట్లు 10 బేసిస్ పాయింట్ల పెరిగాయి. దీంతో ప్రస్తుతం మొత్తం ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.60 శాతంగా ఉన్నాయి. నెల వ్యవధి కాలానికి ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.60శాతం, మూడు నెలల టెన్యూర్ కాలానికి 8.65శాతం, ఆరునెలల కాలానికి 8.75శాతం, ఏడాది కాలానికి కన్జ్యూమర్ లోన్స్ 8.85శాతం నుంచి 8.90శాతానికి పెరిగాయి. రెండేళ్ల టెన్యూర్ కాలానికి 9శాతం, మూడేళ్ల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 9.10శాతంగా ఉన్నాయి. కాగా, గత 9 నెలలుగా పెరుగుతోన్న వడ్డీరేట్ల మోతకు ఈసారి కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) ఆర్థిక రంగ వృద్ధి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పాలసీ సమీక్ష ఇది. ఆర్బీఐ సమావేశంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) మేర పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పండుగ పూట కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ!
సంక్రాంతి పండుగ రోజే ఎస్బీఐ తన కస్టమర్లకు షాకిచ్చింది. బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేట్లు పెంచింది. దీంతో హోమ్లోన్లు, ఇతర రుణాలపై ఏడాది టెన్యూర్ కాలానికి 10 బేసిస్ పాయింట్లు పెరిగాయి.పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ వెబ్‌పోర్ట్‌లో పొందుపరిచిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఏడాది ఎంసీఎల్ ఆర్ రేటు గతంలో 8.3శాతం ఉండగా ఇప్పుడు 8.4 శాతానికి పెరిగింది. అయితే ఇతర టెన్యూర్లలోని ఎంసీఎల్ఆర్ రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇక, 2 ఏళ్ల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్ఆర్ రేటు 8.50శాతం, 3 ఏళ్ల టెన్యూర్ కాలానికి 8.60 శాతంగా ఉంది. ఒక నెల, మూడు నెలల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్ఆర్ రేటులో మారకుండా 8 శాతంగా కొనసాగుతుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.85 శాతంతో తటస్థంగా ఉంది. -
ఈపీఎఫ్ పోర్టల్‌లో సమస్యలు.. వినియోగదారులకు చుక్కలు!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) వెబ్ సైట్లో అంతరాయం ఏర్పడింది. గతేడాది 2021-2022 కాలానికి ఈపీఎఫ్ వడ్డీ రేట్లు 8.1శాతానికి పెరిగాయి. అయితే పెంచిన ఆ వడ్డీ రేట్లు ఈపీఎఫ్ పోర్టల్‌లో మాయమయ్యాయి. గత కొద్ది రోజులుగా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు పాస్‌బుక్ కనిపించడం లేదంటూ పెద్ద ఎత్తు ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. అయినా పోర్టల్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. జనవరి 14 సాయంత్రం 5గంటలకు అప్డేట్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ తరహా మెసేజ్‌లు గతకొన్ని రోజులుగా అలాగే చూపిస్తున్నట్లు యూజర్లు వాపోతున్నారు. ఇదే విషయంపై వినియోగదారులు ట్విటర్లో ఈపీఎఫ్‌వోకు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు ఈపాస్ బుక్ కనిపించడం లేదంటూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఫిర్యాదులపై ఈపీఎఫ్‌వో ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని, యూజర్ల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు రిప్లయి ఇచ్చారు. For latest updates on #PF, #Pension, and #EDLI, follow #EPFO on #Instagram, click on this links: 👇https://t.co/Z78a7NEsi4@byadavbjp @Rameswar_Teli @LabourMinistry — EPFO (@socialepfo) January 11, 2023 For latest updates on #PF, #Pension, and #EDLI, follow #EPFO on #Instagram, click on this links: 👇https://t.co/Z78a7NEsi4@byadavbjp @Rameswar_Teli @LabourMinistry — EPFO (@socialepfo) January 11, 2023 Choose the process of filing e-Nomination for speedy claim settlement. #AmritMahotsav #epfo #SocialSecurity #PF #Pensions #insurance @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @mygovindia @PIB_India @MIB_India @_DigitalIndia @AmritMahotsav pic.twitter.com/5svrfg3Mbs — EPFO (@socialepfo) January 11, 2023 Choose the process of filing e-Nomination for speedy claim settlement. #AmritMahotsav #epfo #SocialSecurity #PF #Pensions #insurance @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @mygovindia @PIB_India @MIB_India @_DigitalIndia @AmritMahotsav pic.twitter.com/5svrfg3Mbs — EPFO (@socialepfo) January 11, 2023 -
సేవింగ్స్ అకౌంట్లపై బ్యాంకులు వడ్డీ జమ చేస్తాయని మీకు తెలుసా?
2022 ఏప్రిల్ 1 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు .. ఆ తర్వాత 2023 మార్చి 31 వరకు మీ బ్యాంకు ఖాతాలను ముందుగా అప్డేట్ చేయించండి. అన్ని బ్యాంకుల్లో మీకున్న అన్ని అకౌంట్లు, అలాగే మీకున్న జాయింట్ బ్యాంకు ఖాతాలు, మీరు .. మీ కుటుంబ సభ్యులు.. రెసిడెంటు కావచ్చు లేదా నాన్ రెసిడెంటు కావచ్చు .. అందరివి అన్ని ఖాతాలను అప్డేట్ చేసి విశ్లేషణ మొదలుపెట్టండి. ముందు జమలను పరిశీలించండి. ప్రతి జమకి వివరాలు వేరే లాంగ్ నోట్‌బుక్‌లో రాయండి. మీ సేవింగ్స్ అకౌంటు ఖాతాలో బ్యాంకులు సాధారణంగా మూడు నెలలకోసారి..లేదా కొన్ని బ్యాంకులు ఆరు నెలలకోసారి వడ్డీని జమ చేస్తుంటాయి. అలాంటి పద్దుల్ని గుర్తించి అవన్నీ ఒక చోట రాయండి. సాధారణంగా ఎక్కువ మంది ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. సినిమా పరిభాషలో చెప్పాలంటే ’లైట్’గా తీసుకోకండి. ఇక మిగిలినవి మీరు నిర్వహించిన జమలు. వీటిలో .. 1. నగదు జమలు: ఈ డిపాజిట్లు ఎందుకు చేశారో తెలుసుకోండి. మొదట్లో డ్రా చేయగా, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినవా? లేదా అద్దెనా? పారితోషికమా? ఆదాయమా? అప్పుగా వచ్చినదా? ఎవరిచ్చారు? కుటుంబ సభ్యులా? ఇతరులా? దేని నిమిత్తం ఇచ్చారు? వందలు అయితే ఫర్వాలేదు. ఏదో కథ చెప్పొచ్చు. వేలల్లో ఉంటే సంతృప్తికరమైన జవాబు ఇవ్వండి. అమ్మకాలా? ట్యూషన్ ఫీజులా? ఆదాయమే కాదా? తగిన జాగ్రత్త వహించాలి. 2. నగదు కాని జమలు: ఇవి చెక్కులు, డీడీలు, పే ఆర్డర్లు, ఫోన్‌పే, గూగుల్‌పే, బదిలీలు కావచ్చు. మీరే ఒక అకౌంటు నుండి మరో అకౌంటుకు బదిలీ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. విదేశాల నుండి మీ కుటుంబ సభ్యులు చేయవచ్చు. మీ నికర జీతం కావచ్చు.. ఇంటద్దె కావచ్చు .. వడ్డీ కావచ్చు.. వ్యవసాయం మీద ఆదాయం కావచ్చు .. జీవిత బీమా .. ఎన్ఎస్సీల మెచ్యూరిటీ మొత్తం కావచ్చు. బ్యాంకు లోన్ కావచ్చు.. అప్పు ఇచ్చి ఉండవచ్చు.. లేదా గతంలో మీరు ఇచ్చిన అప్పును వారు వెనక్కి ఇచ్చి ఉండవచ్చు. అలాగే మీ ఆదాయం కావచ్చు .. ఏదైనా స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన బాపతు కావచ్చు. ఇందులో మళ్లీ అడ్వాన్సు ఉండొచ్చు.. వాయిదాలు .. ఫైనల్ సెటిల్మెంట్ ఉండొచ్చు. సేల్స్ కావచ్చు .. ఫీజులు కావచ్చు టీడీఎస్ పోనూ మిగిలిన మొత్తమే జమవుతుంది. అప్పుడు టీడీఎస్‌తో కలిపి లెక్కలోకి తీసుకోవాలి. ఇలా ప్రతి జమని విశ్లేషించండి. ప్రత్యేకంగా ఆదాయాలు ఒక పక్కన రాయండి. ఆదాయాలు కానివి మరో పక్కన వివరంగా రాయండి. ఇక చెప్పేదేముంది. మీ ముందే ఉంది చిట్టా. పరీక్షించండి. పరికించి చూడండి ప్రతీ జమని. -
కేంద్రం కీలక నిర్ణయం.. చిన్న మొత్తాల వడ్డీ రేట్లు పెంపు!
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వీటిపై వడ్డీ రేట్లను ఒక శాతం వరకు పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి – మార్చి కాలానికి కొత్త రేట్లు అమలు కానున్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 2.25 శాతం మేర కీకలమైన రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సవరించినట్టు తెలుస్తోంది. వివిధ పథకాలపై పెంపు 0.20–1.1 శాతం మధ్య ఉంది. తాజా పెంపు తర్వాత కొన్ని పెట్టుబడి పథకాలు ఆకర్షణీయంగా మారాయి. ప్రధానంగా జీవిత లక్ష్యాలకు ఉపకరించే, దీర్ఘకాలంతో కూడిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై రేట్లు పెరగలేదు. అలాగే, సేవింగ్స్ డిపాజిట్, ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేట్లలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. నాలుగేళ్ల విరామం తర్వాత ఈ పథకాల రేట్లను కేంద్ర సర్కారు 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సవరించడం గమనార్హం. అప్పుడు 0.10–0.30 శాతం మేర మూడు పథకాల రేట్లను పెంచింది. తాజా సవరణ తర్వాత బ్యాంక్ ఎఫ్డీ రేట్లకు, ఈ పథకాల రేట్లకు పెద్దగా వ్యత్యాసం లేదు. -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. అన్ని కాలపరిమితులకు గాను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంకులో తీసుకున్న రుణాలు మరింత భారం కానున్నాయి. ఈ పెంచిన రేట్లు నవంబర్ 15, 2022 నుండి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. వాహన, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లు ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ ఆధారంగా నిర్ణయించబడతాయి. అయితే ఎస్బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ రేట్లు అంతకుముందు 7.95 శాతం నుండి 10 బేసిస్ పాయింట్లు (bps) 8.05 శాతానికి పెంచింది అలాగే, రెండేళ్లు , మూడేళ్ల ఎంసీఎల్ఆర్లను ఒక్కొక్కటి 10 బేసిస్ పాయింట్లు వరుసగా 8.25 శాతం, 8.35 శాతానికి పెంచినట్లు ఎస్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్లను ఒక్కొక్కటి 15 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతానికి చేర్చింది. 6 నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెరిగి 8.05 శాతానికి, ఓవర్‌నైట్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 7.60 శాతానికి చేరుకుంది. ఎంసీఎల్ఆర్ అంటే కస్టమర్లు తీసుకునే రుణాలపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీరేటే ..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ అంటారు. రుణంపై వడ్డీరేటు పెరిగితే ఎంసీఎల్ఆర్ ఆటోమేటిక్‌గా రుణాల కాస్ట్‌పై ప్రభావం చూపుతుంది. రుణాలపై వడ్డీరేటు పెరిగితే నెలవారీ ఈఎంఐలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు ఎక్కువ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసీఎల్ఆర్పై ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపైనా ఈఎంఐ ప్రభావం పడుతుంది. -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 61 రోజుల నుంచి 89 నెలల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. గతంలో ఇంట్రస్ట్ రేట్లు 4శాతం ఉండగా ఇప్పుడు (50బేసిస్) 4.50 శాతానికి పెంచింది. ► 90 రోజుల నుంచి 6 నెలల కాలానికి.. గతంలో 4.25 శాతం ఉండగా ఇప్పుడు 4.50 శాతానికి పెంచింది. ►1 రోజుల నుంచి 9 నెలల కంటే తక్కువ 6 నెలల తగ్గకుండా చేసిన ఎఫ్డీలపై నిన్న వరకు 5 శాతం వడ్డీని చెల్లించేది. ఇప్పుడు ఆ వడ్డీని 5.25 శాతానికి పెంచింది. ►1 రోజు నుంచి ఏడాదికి కాలానికి 9 నెలలు ఎఫ్డీని కొనసాగిస్తే.. వాటిపై 5.50శాతం వడ్డీని పొందవచ్చు. గమనిక : పెరిగిన పిక్స్డ్ రేట్లు ►ఒక సంవత్సరం నుండి 15 నెలల ఎఫ్డీ టెన్యూర్ కాలానికి 6.10 శాతం, 15 నెలల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్డీలపై 6.15 శాతం ఇంట్రస్ట్ పొందవచ్చు. ►ఒక రోజు నుండి ఐదేళ్ల లోపు అంటే (రెండేళ్ళ టెన్యూర్ కాలానికి) చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం, ఐదు నుంచి పదేళ్ల టెన్యూర్ కాలానికి 6.20 శాతం వడ్డీని పొందవచ్చు. ►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీని పొందుతారు. గమనిక : పెరిగిన రికరింగ్ డిపాజిట్ రేట్లు ►హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 నెలల నుంచి 120 నెలల కాలానికి చేసే సాధారణ రికరింగ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. చదవండి👉 భారత్‌లో అదరగొట్టిన ధంతేరాస్ సేల్స్, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం! -
సేవింగ్ అకౌంట్‌తో డబ్బులు సంపాదించండిలా
మీరు డబ్బులు ఎక్కడ దాస్తుంటారు. సేవింగ్స్ అకౌంట్‌లోనా? అయితే మీ సేవింగ్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో వడ్డీని పొందవచ్చు. ఆ విషయం మీకు తెలుసా? మీ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంకు అధికారుల్ని సంప్రదించండి. నా సేవింగ్ అకౌంట్‌కు స్వీప్ - ఇన్ ఎఫ్డీ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయమని అడగండి. అలా అడిగితే ఆ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వినియోగదారులకు అందించే వడ్డీ.. మీ సేవింగ్ అకౌంట్లో ఉన్న మనీకి అందిస్తారు. కానీ ఈ మొత్తం ఆయా బ్యాంకులు విధించిన నిబంధనలకు లోబడి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ అకౌంట్‌ను నుంచి డబ్బులు తీయాలని అనుకుంటున్న ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ ఆకౌంట్ వినియోగిస్తున్నప్పుడు సేవింగ్ అకౌంట్గాను, వినియోగించకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌గా పనిచేస్తుంది. షార్ట్ టర్మ్‌లో డబ్బులపై వడ్డీ పొందాలంటే ఇదే మంచి ఆప్షన్ అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ స్వీప్-ఇన్ స్వీప్ ఇన్ లేదా ఆటో స్వీప్ సదుపాయం అనేది సేవింగ్ అకౌంట్లో బ్యాంకు అధికారులు నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండాలి. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వన్ ఇయర్ టెన్యూర్ కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజిట్‌గా బదిలీ చేసుకోవచ్చు. ఆ మొత్తానికే మీరు ఇంట్రస్ట్‌ను పొందవచ్చు. స్వీప్ ఆప్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే? సేవింగ్ అకౌంట్‌పై ఉన్న మొత్తానికి ఇంటస్ట్ర్ పొందడంతో పాటు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. స్వీప్ ఇన్ ఫెసిలిటీ ఎలా పని చేస్తుంది? కొన్ని బ్యాంకులు సేవింగ్ అకౌంట్‌ను .. ఫిక్స్డ్ డిపాజిట్‌కి లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు మీరు నిర్వహించే లావాదేవీల ఆధారంగా ఆ సదుపాయాన్ని అందిస్తాయి. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా వడ్డీని అందిస్తాయి. కానీ అది చాలా తక్కువ మొత్తంలో ఉండనున్నాయి. ఈ స్వీప్- ఇన్ ఆప్షన్ పొందాలి అంటే బ్యాంకు అధికారుల వద్ద పూర్తి సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది. స్వీప్-ఇన్ అకౌంట్ అర్హతలు అవును, మీరు కనీసం రూ.25వేలతో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. దీనిలో నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన కనీస బ్యాలెన్స్ రూ. 25, 000 - రూ.1, 00, 000. డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా?
ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఈ డిజిటల్ చెల్లింపుల కంటే లిక్విడ్ క్యాష్తో మన అవసరాల్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో డెబిట్ కార్డుతో డబ్బుల్ని డ్రా చేస్తుంటాం. మరి క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంది కదా. డబ్బుల్ని డ్రా చేయొచ్చా? డ్రా చేస్తే ఏమవుతుంది? ఆర్ధిక నిపుణులు ఏం చెబుతున్నారు. ఏటీఎంలో డెబిట్ కార్డును ఎలా ఉపయోగిస్తామో.. క్రెడిట్ కార్డును కూడా అలాగే వినియోగించుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డుల విషయంలో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకుంటే కొన్ని అదనపు ఛార్జీలు బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆర్ధికంగా అంత మంచి పద్దతి కాదని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుండి నగదును విత్‌డ్రా చేస్తే.. సదరు విత్ డ్రాల్ పై సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సాధారణంగా మీరు ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదు పై చెల్లించాలి. మొత్తంగా ఆ అదనపు ఛార్జీలు 2.5% నుండి 3% వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు మీ నెక్ట్స్ క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ స్టేట్మెంట్లో యాడ్ అవుతాయి. వడ్డీ సాధారణంగా డెబిట్ కార్డుతో నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్‌తో అలా కాదు. బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డుతో ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేస్తే భారీగా వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసిన నెంబర్‌ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రారంభ వడ్డీ నెలకు 3.5% వరకు ఉండవచ్చు. సిబిల్ స్కోర్ తగ్గుతుందా? క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి డబ్బుల్ని డ్రా చేసుకుంటే ఆ ప్రభావం నేరుగా క్రెడిట్ కార్డు స్కోర్‌పై ప్రభావితం చూపదు. అయినప్పటికీ, అధిక ఛార్జీల కారణంగా మీరు కనీస బకాయిని చెల్లించడంలో విఫలం కావచ్చు. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రయోజనాలు, డీల్స్ రెస్టారెంట్లు, దుకాణాలలో చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేసినప్పుడు, బ్యాంకులు మీకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. కానీ, మీరు నగదు ఉపసంహరించుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు ఈ అదనపు ప్రయోజనాల్ని పొందలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్పా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయొద్దని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
లోన్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) 20 బేసిస్ పాయింట్లు లేక 0.2 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో ఎస్బీఐసహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ రుణ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం బ్యాంక్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 7.60 శాతం నుంచి 7.8 శాతానికి ఎగసింది. -
గృహ రుణాలకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: గృహ రుణాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో బ్యాంకుల పుస్తకాల్లో గృహ రుణాలు రెట్టింపై రూ.16.85 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనూ (ఏప్రిల్–ఆగస్ట్ వరకు) గృహ రుణాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఆర్బీఐ 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. సెప్టెంబర్‌లోనూ అర శాతం మేర పెంచడం గమనార్హం. 2016–17 నాటికి బ్యాంకుల నుంచి గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.8,60,086 కోట్లుగా ఉండగా, 2022 మార్చి నాటికి రూ.16,84,424 కోట్లకు వృద్ది చెందింది. రేట్ల పెంపు ప్రభావం ఉండదు.. వడ్డీ రేట్ల అన్నవి ముఖ్యమైనవే అయినప్పటికీ.. అవి గృహ కొనుగోలుకు అవరోధం కాదని, రుణ గ్రహీతల ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తు ఆదాయ అంచనాలపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గృహ రుణ కాలంలో (15–20 ఏళ్లు) వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం అన్నది సాధారణ ప్రక్రియగా ఇన్వెస్టర్లలోనూ అవగాహన పెరుగుతుండడాన్ని ప్రస్తావించాయి. రుణాలపై ఇళ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంటి ధర కీలకం అవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ట్గేజ్, రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి పేర్కొన్నారు. ‘‘గృహ రుణం అన్నది దీర్ఘకాలంతో ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయని కస్టమర్లకూ తెలుసు. దేశంలో సగటు వేతన పెంపులు 8–12 శాతం మధ్య ఉంటున్నందున పెరిగే రేట్ల ప్రభావాన్ని వారు తట్టుకోగలరు’’అని సోలంకి అభిప్రాయపడ్డారు. ప్రణాళిక మేరకే.. వడ్డీ రేట్ల పెంపు గృహ రుణాల డిమాండ్‌పై పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ రేణు సూద్ కర్నాడ్ సైతం పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు అన్నది మిగిలిన ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య చర్చించిన తర్వాతే, ప్రణాళిక మేరకు ఉంటుందన్నారు. కారు, కన్జ్యూమర్ రుణాల మాదిరిగా కాకుండా, 12–15 ఏళ్లు, అంతకుమించి కాల వ్యవధితో ఉండే గృహ రుణాలపై ఫ్లోటింగ్ రేట్లు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు. ‘‘కనుక వడ్డీ రేట్ల పెంపు వారి నగదు ప్రవాహాలపై తక్కువ ప్రభావమే చూపిస్తుంది. సాధారణంగా 12–15 ఏళ్ల కాలంలో రెండు మూడు విడతల్లో రేట్ల పెంపు ఉండొచ్చు. దీర్ఘకాలంలో రేట్లు దిగొస్తాయని వినియోగదారులకు సైతం తెలుసు’’అని కర్నాడ్ పేర్కొన్నారు. ఇళ్లకు డిమాండ్ చక్కగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ‘‘ఇళ్ల విక్రయాలు బలంగా కొనసాగుతున్నాయి. 2022 చివరికి దశాబ్ద గరిష్టానికి చేరుకుంటాయి. స్థిరమైన ధరలకుతోడు, పండుగల డిమాండ్, గృహ రుణాలపై తక్కువ రేట్లు (గతంలోని 10–11 శాతంతో పోలిస్తే) సానుకూలతలు’’అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ వివరించారు. కాకపోతే అదే పనిగా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే ఈఎంఐ పెరిగి, సెంటిమెంట్‌కు విఘాతం కలగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87 శాతం పెరిగి.. 2,72,709 యూనిట్లు అమ్ముడైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. -
అలెర్ట్: ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు అలెర్ట్. మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో వడ్డీ మొత్తం కనిపించడంలేదని కంగారు పడుతున్నారా? సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్మెంట్లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ సంస్థ ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత చెల్లించేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సంబంధిత ఖాతాలో ఆ వడ్డీని జమ చేస్తుంది. ఎప్పటిలాగే 2020-2021 ఆర్ధిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని చెల్లించినట్లు మార్చి 2021లో ప్రకటించింది. అదే ఏడాది డిసెంబర్ నెలలో లబ్ధి దారుల అకౌంట్లలో డిపాజిట్ అయ్యింది. 2021-22 సంబంధించి ఈపీఎఫ్ బోర్డు వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు అకౌంట్లో జమ కాలేదు. There is no loss of interest for any subscriber. The interest is being credited in the accounts of all EPF subscribers. However, that is not visible in the statements in view of a software upgrade being implemented by EPFO to account for change in the tax incidence. (1/2) https://t.co/HoY0JtPjII — Ministry of Finance (@FinMinIndia) October 5, 2022 దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు సభ్యులు నిర్ణయించిన వడ్డీ మొత్తం ఇప్పటి వరకు తమ అకౌంట్లలో జమ కాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ పీఎఫ్ వడ్డీ ఎక్కడ? అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖ..పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల మించి జమ చేస్తే..ఆ మొత్తంపై లభించే వడ్డీకి పన్ను విధిస్తామని గతంలో పేర్కొన్నాం. దానికి సంబంధించి సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ జరుగుతుండటంతో ఆలస్యం అవుతోందని, వడ్డీ మొత్తాన్ని ఏ ఒక్క చందాదారుడూ కోల్పోరని తన ట్వీట్లో స్పష్టం చేసింది. -
ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. కోవిడ్ విజృంభణ సమయంలో అత్యధికంగా వడ్డీ చెల్లించేలా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ స్కీమ్ గడువును పెంచుతున్నట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్ల కోసం హెచ్డీఎఫ్సీ మే 18, 2020లో ‘సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ’ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఆ ఎఫ్డీ పథంలో చేరిన ఖాతాదారులకు .. సాధారణ డిపాజిట్ల కంటే ఎక్కువగా వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఆ పథకంలో చేరే గడువు సెప్టెంబర్ 30,2022తో ముగియగా..తాజాగా ఆ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 0.25శాతం అదనపు వడ్డీతో మే 18, 2020 నుండి మార్చి 31, 2023 మధ్య కాలంలో సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీలో చేరిన ఖాతాదారులకు ఐదేళ్ల టెన్యూర్, లేదంటే ఒక రోజు నుంచి 10 ఏళ్ల టెన్యూర్ కాలానికి రూ.5కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.25శాతం అదనంగా వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. తేడా ఎంతంటే ఐదు సంవత్సరాలు, ఒక రోజు నుండి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు సాధారణ వడ్డీ రేటు 5.75 శాతం అందిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద అదనంగా 6.50 శాతం వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లు పొందుతారు. టెన్యూర్ లోపు డ్రా చేస్తే అయితే, పైన పేర్కొన్నట్లుగా ఐదేళ్లలోపు డిపాజిట్లను ప్రీ క్లోజ్ చేసుకుంటే బ్యాంకు లబ్ధి దారులకు చెల్లించే వడ్డీరేటులో ఒకశాతం తగ్గుతుందని, లేదా డిపాజిట్ ఉన్న కాలానికి వర్తించే బేస్ రేటు ఉంటుందని బ్యాంక్ తెలిపింది. చదవండి👉 బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కంపెనీలు.. మాఫీ అయిన లక్షల కోట్ల జాబితా ఇదే! -
మరోసారి వడ్డీరేట్లు పెంచిన RBI
-
మరోసారి వడ్డీ రేట్లు పెంచిన RBI
-
చిన్న పొదుపు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: వరుసగా రేట్ల తగ్గింపులతో చిన్నబోయిన చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం కట్టడికి కీలకమైన వడ్డీ రేట్లను పెంచుతూ వెళుతున్నాయి. మన ఆర్బీఐ కూడా ఇదే బాటలో నడుస్తోంది. మే చివరి నుంచి ఇప్పటి వరకు 1.4 శాతం మేర రెపో రేటును పెంచింది. దీంతో మార్కెట్ తీరుకు అనుగుణంగా, తొమ్మిది వరుస త్రైమాసికాల యథాతథ స్థితి తర్వాత.. చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సైతం కేంద్ర సర్కారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 0.30 శాతం వరకు పలు పథకాల రేట్లను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. పన్ను పరిధిలోకి వచ్చే పథకాలపై ప్రధానంగా రేట్లను పెంచింది. అదే సమయంలో కొన్ని పథకాల రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రతి త్రైమాసికానికీ ఈ పథకాల రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే తదుపరి మూడు నెలల కాలానికి తాజా రేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై ప్రస్తుతం 5.5 శాతం రేటు ఉంటే, ఇక మీదట ఇది 5.8 శాతం కానుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై రేటు 0.20 శాతం పెరిగి 7.6 శాతానికి చేరింది. ప్రస్తుతం ఈ పథకంలో రేటు 7.4 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్ర రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి (123 నెలలకు మెచ్యూరిటీ).. పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో రేటును 6.6 శాతం నుంచి 6.7 శాతానికి కేంద్రం సవరించింది. వీటిల్లో మార్పు లేదు..: ఏడాది, ఐదేళ్ల ఎఫ్డీలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాల రేట్లు ప్రస్తుతమున్న మాదిరే మరో మూడు నెలలు కొనసాగుతాయి. ఈ పథకాల రేట్లను కేంద్రం సవరించలేదు. సవరించిన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. -
మీకే రుణాలిస్తాం..చిరు వ్యాపారులకు జై కొట్టిన బ్యాంకులు!
ముంబై: మహమ్మారి కరోనా ముందటి స్థాయిలతో పోలిస్తే చిన్న వ్యాపారాలకు రుణ పంపిణీ రెట్టింపు అయ్యింది. అయితే బ్యాంకర్లు రుణ పంపిణీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇప్పటికే ఖాతాలు కలిగి ఉన్న రుణ గ్రహీతలకే తిరిగి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్ మొగ్గు చూపింది. రుణ సమాచార కంపెనీ– సిబిల్ వెల్లడించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి.. ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుండి రుణాల కోసం డిమాండ్ (వాణిజ్య క్రెడిట్ విచారణల సంఖ్య ప్రాతిపదికన) కరోనా ముందస్తు స్థాయితో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1.6 రెట్లు పెరిగింది. ►మొత్తం ప్రత్యక్ష ఎంఎస్ఎంఈ రుణగ్రహీతల సంఖ్య మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 6 శాతం వృద్ధి రేటుతో 7 మిలియన్లకు చేరుకుంది. ►ఎంఎస్ఎంఈ విభాగంలో ఎన్పీఏలు మార్చి 2021 నుండి పెరుగుతున్నాయి. మహమ్మారి వల్ల సూక్ష్మ పరిశ్రమ విభాగం ఎక్కువగా దెబ్బతింది. ►వర్కింగ్ క్యాపిటల్ లోన్ల కంటే టర్మ్ లోన్ విషయంలో ఎక్కువగా పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇది సానుకూల సంకేతంగా పేర్కొనవచ్చు. ►ఎంఎస్ఎంఈలు క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్ (సీసీ, ఓడీ) రుణాల ద్వారా తమ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) అవసరాలను నిర్వహిస్తున్నాయి. చదవండి👉 మరింత తగ్గనున్న మొండిబాకీల భారం -
వరల్డ్ టాప్ బ్యాంకర్..సాఫ్ట్ బ్యాంక్‌కు ఊహించని షాక్!
టోక్యో: అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనల కారణంగా పెట్టుబడుల విలువ కరిగిపోవడంతో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 23.4 బిలియన్ డాలర్ల భారీ నష్టం నమోదు చేసింది. గతేడాది ఇదే వ్యవధిలో 5.6 బిలియన్ డాలర్ల లాభం ఆర్జించింది. సమీక్షాకాలంలో అమ్మకాలు 6 శాతం పెరిగి 11.6 బిలియన్ డాలర్లకు చేరాయి. కంపెనీ ఏర్పాటైన తర్వాత నుంచి ఒక త్రైమాసికంలో ఇంత భారీ నష్టాలు ఎన్నడూ చూడలేదని సంస్థ సీఈవో మసయోషి సోన్ తెలిపారు. గత ఆరు నెలలుగా నమోదైన నష్టాలు 37 బిలియన్ డాలర్లకు ఎగిశాయని వివరించారు. చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబాలో వాటాల విలువ భారీగా పడిపోవడం .. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నష్టాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిల్చింది. అలాగే, యెన్ విలువ పడిపోవడం కూడా మరో కారణం. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ద్రవ్యోల్బణం వంటి అంశాల కారణంగా ఈ సవాళ్లు నెలలు లేదా సంవత్సరాల తరబడి కూడా కొనసాగవచ్చని సోన్ పేర్కొన్నారు. -
మిరే అస్సెట్ తక్కువ వడ్డీకే స్టాక్ ఫండింగ్
ముంబై: మిరే అస్సెట్‌కు చెందిన ఎం.స్టాక్ ‘మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ’ (ఎంటీఎఫ్)ను ఆరంభించింది. 7.99 శాతం వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపింది. పరిశ్రమలోనే ఇది కనిష్ట వడ్డీ రేటుగా పేర్కొంది. ఈక్విటీలకు సంబంధించి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తక్షణమే నిధుల సదుపాయం పొందొచ్చని తెలిపింది. 700 స్టాక్స్‌కు సంబంధించి 80 శాతం మార్జిన్‌ను పొందొచ్చని వివరించింది. మార్జిన్ ఫండింగ్ (రుణం)తో కొనుగోలు చేసిన షేర్లను ఎంత కాలం పాటు అయినా కొనసాగించుకోవచ్చని తెలిపింది. ట్రేడర్లు రూపాయి బ్రోకరేజీ లేకుండా అపరిమిత డ్రేడ్స్ చేసుకోవచ్చని ఈ సంస్థ ప్రకటించింది. రూ.10 లక్షల వరకు ఫండింగ్పై 9.49 శాతం రేటు, రూ.10–25 లక్షల మధ్య తీసుకుంటే రూ.8.99 శాతం రేటు, రూ.25 లక్షలకు పైగా ఫండింగ్ తీసుకున్న వారికి 7.99 శాతం రేటును వసూలు చేస్తున్నట్టు తెలిపింది. షేర్ల ప్లెడ్జ్ (ఫండింగ్ కోసం), అన్ ప్లెడ్జ్ లావాదేవీపై కేవలం రూ.12 వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి!
బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ ఆర్ )రుణాల్ని 10బీపీఎస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సవరించిన ఈఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో నేటి నుంచి రుణాలు తీసుకున్న వారు, లేదంటే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్న వారికి మరింత అదనపు భారం పడనుంది. ఎంసీఎల్ఆర్ అంటే ఎంసీఎల్ఆర్ను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అని చెప్పొచ్చు. ఈ ఎంసీఎల్ఆర్ను వాడుక భాషలో సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. వివిధ బ్యాంకుల్లో (బ్యాంకును బట్టి మారతాయ్) ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్లతో పాటు, టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి. ఈ విధానాన్ని ఆర్బీఐ 2016లో అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో ఎంసీఎల్ఆర్ను ఆధారంగా హోం లోన్, పర్సనల్ కార్ లోన్లపై ఇంట్రస్ట్ రేట్లు తగ్గు తుంటాయి.పెరుగుతుంటాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఇదే ఎంసీఎల్ఆర్పై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. జూలై15 (నేటి) నుంచి ఈ కొత్త వడ్డీరేట్లు అమలవుతున్నాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఇంట్రస్ట్ రేట్లు ఎస్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం..ఎంసీఎల్ఆర్ రేట్లు టెన్యూర్‌ను బట్టి మారాయి. ఆ వడ్డీ రేట్లు ఇప్పుడు ఎంత పెరిగాయో తెలుసుకుందాం. ఒక నెల నుంచి 3నెలల టెన్యూర్ మధ్య కాలానికి వడ్డీ రేట్లు 7.05శాతం నుంచి 7.15 శాతానికి పెరిగాయి. 6నెలల టెన్యూర్ కాలానికి 7.35 శాతం నుంచి 7.45 శాతానికి పెరిగాయి వన్ ఇయర్ టెన్యూర్ కాలానికి 7.40 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగాయి 2 ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.60 శాతం నుంచి 7.70శాతానికి పెరిగాయి. 3ఏళ్ల టెన్యూర్ కాలానికి 7.70శాతం నుంచి 7.80 శాతానికి పెరిగాయి. అదనపు భారం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు సామాన్యుడి తీవ్ర ప్రభావం చూపనుంచి ముఖ్యంగా హోం లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్‌పై చెల్లించే ఈఎంఐ పెరగనుంది. చదవండి: తప్పు చేస్తే వేటే..ఉద్యోగులకు ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్నింగ్! -
ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్‌ఐల లాభాలు పెరుగుతాయ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) లాభదాయకత పుంజుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. నూతన నియంత్రణపరమైన కార్యాచరణ కింద అవి మెరుగైన రేట్లకు రుణాలు ఇచ్చే వెసులుబాటు లాభాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. ప్రస్తుతం పెరుగుతున్న వడ్డీ రేట్ల క్రమం.. ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్‌ఐల లాభాలను ప్రభావితం చేయకపోవచ్చని, నిధులపై అవి వెచ్చించే అధిక వ్యయాలను, రుణాలపై అధిక వడ్డీ రేట్ల రూపంలో అధిగమించగలవని పేర్కొంది. దీంతో నికర వడ్డీ మార్జిన్లు మెరుగ్గానే ఉంటాయని తన నివేదికలో అంచనా వేసింది. రుణ రేట్లను నిర్ణయించడంలో పెరిగిన అనుకూలతే వాటి లాభదాయకతకు తోడ్పడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది. పెరిగిన రేట్లు.. ఇప్పటికే చాలా వరకు ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు రుణ రేట్లను 1.5 శాతం నుంచి 2.5 శాతం వరకు పెంచినట్టు క్రిసిల్ రేటింగ్స్ డిప్యూటీ చీఫ్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. దీంతో వాటికి పెరిగిన రుణ సమీకరణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు తగినంత వెసులుబాటు ఉందని చెప్పారు. అలాగే, ఆస్తుల నాణ్యత సవాళ్లను ఎదుర్కొనేందుకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎక్కువ నిధులను పక్కన పెట్టినందున, అవసరమైతే ఆయా నిధులను కూడా వినియోగించుకోగలవన్నారు. ఆదాయ పరిమితి పెంచడం (రుణ గ్రహీతల), రుణ రేట్లను నిర్ణయించడంలో వచ్చిన వెసులుబాటు వల్ల ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు ప్రస్తుత మార్కెట్లలోనే మరింతగా చొచ్చుకుపోగలవని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు, అసలు కారణం ఇదే!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) 15 శాతం తగ్గాయి. 84,930 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) ఇళ్ల విక్రయాలు 99,550 యూనిట్లుగా ఉన్నాయి. అయితే గతేడాది ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల విక్రయాలు 24,569 యూనిట్లతో పోలిస్తే 3.5 రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 11,190 యూనిట్లు ఏప్రిల్–జూన్‌లో హైదరాబాద్ మార్కెట్లో 11,190 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది జనవరి–మార్చిలో విక్రయాలు 13,140 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ఈ ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే, జూన్ త్రైమాసికంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఇళ్ల అమ్మకాలు 11 శాతం తగ్గి 25,785 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 19 శాతం తక్కువగా 15,340 యూనిట్లు అమ్ముడుపోయాయి. బెంగళూరులో 14 శాతం తగ్గి 11,505 యూనిట్లుగా ఉన్నాయి. పుణెలో 11 శాతం తగ్గి 12,500 యూనిట్లు, చెన్నైలో 24 శాతం క్షీణించి 3,810 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలోనూ 20 శాతం తక్కువగా 4,800 యూనిట్లు విక్రయమయ్యాయి. కొనుగోలు వ్యయాలు పెరగడం వల్లే.. ‘‘నిర్మాణ వ్యయాలు పెరిగినందున డెవలపర్లు ప్రాపర్టీల రేట్లను పెంచాల్సి వచ్చింది. ఆర్బీఐ రెండు విడతలుగా రేట్ల పెంపుతో గృహ రుణ రేట్లు పైకి ఎగబాకాయి. ఈ రెండు అంశాలతో కొనుగోలు వ్యయం పెరిగిపోయింది. ఇళ్ల విక్రయాలు తగ్గడానికి కారణం ఇదే’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. చదవండి👉 దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువే! -
వడ్డీలు కట్టలేక చేతులెత్తేసిన ‘ఫ్యూచర్’!
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ తాజాగా రూ. 6.07 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. కంపెనీ గతంలో జారీ చేసిన మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు)పై ఈ నెల 20కల్లా వడ్డీ చెల్లించవలసి ఉన్నట్లు తెలియజేసింది. అయితే ప్రతికూల పరిస్థితులతో వీటిపై వడ్డీ చెల్లించలేకపోయినట్లు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రూ. 120 కోట్ల విలువైన సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. ఈ సెక్యూర్డ్ డిబెంచర్లను వార్షికంగా 10.15 శాతం కూపన్ రేటుతో జారీ చేసింది. కాగా.. ఈ నెల మొదట్లోనూ రూ. 29 కోట్ల విలువైన ఎన్‌సీడీలపై రూ. 1.41 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో కంపెనీ విఫలంకావడం గమనార్హం! -
ఖాతాదారులకు పీఎన్బీ షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నిధుల సమీకరణ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. తాజా సవరణతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.40 శాతానికి చేరింది. ఓవర్‌నైట్, నెల, మూడు నెలల రేట్లు వరుసగా 6.75 శాతం, 6.80 శాతం, 6.90 శాతానికి పెరిగాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.10 శాతానికి పెరిగింది. ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన బ్యాంక్ ఈఎంఐల భారం వినియోగదారులపై పెరగనుంది. హెచ్డీఎఫ్సీ.. నెలలో ‘మూడవ’ వడ్డింపు కాగా, హెచ్డీఎఫ్సీ గత నెల రోజుల్లో మూడవసారి రుణ రేటును పెంచింది. గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును (ఆర్పీఎల్ఆర్) స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త, పాత రుణ గ్రహీతలకు జూన్ 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. తాజా పెంపు అనంతరం క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం ప్రాతిపదికన కొత్త రుణ గ్రహీతలకు రుణ రేట్లు 7.05 శాతం నుంచి 7.50 శాతం శ్రేణిలో ఉంటాయి. ప్రస్తుత కస్టమర్లకు ఈ రేట్లు 7–7.45 శాతం శ్రేణిలో ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానానికి నిర్ణయించిన నేపథ్యంలో బ్యాంకులు తాజా వడ్డీరేట్ల పెంపునకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. -
ఇళ్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్బీఐ భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంకేతాలిచ్చారు. అయితే ఇన్నిరోజులు ఆయా బ్యాంకులు ఇంటి రుణాల్ని తక్కువ వడ్డీ రేట్లకే ఆఫర్ చేశాయి. కానీ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో ఇంటి రుణాలపై వడ్డీలను పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్ని ద్రవ్యోల్బణం తీవ్రంగా వేధిస్తోంది. అందుకే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలకు చెందిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. పనిలో పనిగా ఆర్బీఐ సైతం పలు వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ(మే) నెలలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ..40 బేసిస్ పాయింట్లు వరకు వడ్డీ రేట్లను పెంచింది. అంతేకాక తదుపరి సమావేశాలలో కూడా వడ్డీ రేట్లను పెంచుతామని హింట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కరోనాకు ముందు హోం లోన్‌పై ఎంత వడ్డీ కడుతున్నామో..ఇప్పుడు కూడా అంతే కట్టాల్సి ఉంటుంది.దీంతో హోమ్ లోన్ల వడ్డీ రేట్లు 10 శాతం వరకు పెరగొచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆర్బీఐ హోం లోన్లపై ఎంత వడ్డీ విధిస్తుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. -
ఫ్యూచర్‌కు మరో ఎదురు దెబ్బ.. ఈసారి వడ్డీ రూపంలో
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఈఎల్) తాజాగా రూ. 23 కోట్ల నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి రూ. 1.06 కోట్ల వడ్డీని చెల్లించడంలో విఫలమైనట్లు తెలిపింది. మే 17న దీన్ని చెల్లించాల్సినట్లు పేర్కొంది గత మూడు నెలల్లో ఫ్యూచర్ గ్రూప్ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి బ్యాంకులకు రూ. 2,836 కోట్ల చెల్లింపులో కూడా విఫలమైనట్లు ఎఫ్ఈఎల్ గత నెల స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్‌లోని 19 సంస్థలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయడానికి రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ డీల్ సాకారం కాలేదు. -
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్‌నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్... రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కెనరా బ్యాంక్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్‌లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది. -
ఫిక్స్డ్ డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను మరోసారి సవరించింది. కొద్ది రోజుల క్రితమే ఆయా టెన్యూర్స్‌కు సంబంధించి వడ్డీరేట్లను మార్చగా..ఇప్పుడు మరోకసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేట్లను సవరిస్తూ హెచ్డీఎఫ్సీ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీరేట్లు బుధవారం (ఏప్రిల్ 20) నుంచి అమల్లోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారిక వెబ్సైట్లో...“ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని పేర్కొంది. సవరించిన వడ్డీరేట్ల జాబితా ప్రకారం...హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధారణ పౌరులకు 7-29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 2.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇక 30 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.91 రోజులు- 6 నెలల వ్యవధిలో మెచ్యూర్ అయినట్లయితే, బ్యాంక్ సాధారణ పౌరులకు 3.5 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై సాధారణ పౌరులకు 5.1 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 5.6 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. సాధారణ పౌరులకు 2 సంవత్సరాల వ్యవధితో 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల సమయం 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల సమయం 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై వడ్డీ రేట్లు వరుసగా 5.2 శాతం, 5.45 శాతం, 5.6 శాతం. సీనియర్ సిటిజన్ల విషయంలో, ఈ రేట్లు వరుసగా 5.7 శాతం, 5.95 శాతం, 6.35 శాతంగా ఉన్నాయి. చదవండి: మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..? -
EPF వడ్డీ రేట్లు తగ్గించడం సరికాదు :విజయసాయిరెడ్డి
-
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్..!
ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిపై ప్రతిపాదిత 8.1 శాతం వడ్డీ రేటు ఇతర చిన్న పొదుపు పథకాలు అందించే వడ్డీ రేట్ల కంటే మెరుగ్గా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత కాలపు వాస్తవికతలను బట్టి, త్వరలో వడ్డీ రేటును సవరించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటుపై ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ రేటును 8.1 శాతానికి తగ్గించాలని బోర్డు ప్రతిపాదించిందని ఆమె రాజ్యసభలో అప్రాప్రియేషన్ బిల్లులపై చర్చకు సమాధానంగా చెప్పారు. "ఈపీఎఫ్ఓకు ఒక సెంట్రల్ బోర్డు ఉంది, చందాదారులకు ఎంత రేటు ఇవ్వాలనే దానిపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. వారు కొంతకాలంగా వడ్డీ రేటును మార్చలేదు.. ఇప్పుడు దానిని 8.1 శాతానికి మార్చారు" అని ఆమె పేర్కొన్నారు. ఇది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు తీసుకున్న నిర్ణయం.. బోర్డులో విస్తృత శ్రేణి ప్రతినిధులు ఉన్నారు. సుకన్య సమృద్ధి యోజన(7.6 శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (7.4 శాతం), పీపీఎఫ్ (7.1 శాతం) వంటి ఇతర పథకాలు అందించే రేట్లు చాలా తక్కువగా ఉండగా, ఈ వడ్డీ రేటును 8.1 శాతంగా ఉంచాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. "వాస్తవంగా ఈ రోజు అమలులో ఉన్న ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు మిగిలిన వాటి కంటే ఇంకా ఎక్కువగా ఉంది" అని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ సవరణ ఇప్పుడు "నేటి వాస్తవాలను" ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2020-21లో ఉన్న 8.5 శాతం నుంచి 2021-22 నాటికి 8.1 శాతానికి తగ్గించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. (చదవండి: టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్‌కు సిద్ధమైన యూరప్ కంపెనీ..!) -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎస్బీఐ బాటలోనే ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు కూడా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు మార్చి 10, 2022 వస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ వడ్డీ రేట్లు 2 కోట్ల కంటే ఎక్కువ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రమే వర్తించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ► 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక ఎఫ్డీ వడ్డీరేటు 4.6 శాతం. ► 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాల వ్యవధికి వడ్డీరేటు 4.50 శాతం. ► 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 4.2 శాతం వడ్డీరేటు ► 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధికి వడ్డీ రేటు 4.3 శాతం. ► 1 సంవత్సరం నుంచి 15 నెలల మధ్య కాలానికి చేసిన ఎఫ్డీలపై 4.15 శాతం వడ్డీ రేటు ► 1 సంవత్సరం లోపు, ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 2.5 శాతం నుంచి 3.7 శాతం వరకు ఉంటాయి. పైన పేర్కొన్న రేట్లు సాధారణ , సీనియర్ సిటిజన్లకు సమానంగా ఉంటాయి. అంతేకాకుండా రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఎఫ్డీలపై వడ్డీ రేట్లను కూడా ఐసీఐసీఐ సవరించింది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనున్నాయి.ఇక రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీరేట్లు మారవు. చదవండి: ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ.. ఎంతంటే? -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం ఊహించని షాక్, 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం షాకివ్వనుంది. 40 ఏళ్ల తరువాత తొలిసారి ఈపీఎఫ్ఓపై ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫర్ ట్రస్ట్రీ (సీబీటీ) సభ్యులు 2021 -2022 సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వచ్చే వడ్డీరేట్లపై సమావేశమైంది. ఈ భేటీలో ఖాతాదారులకు 8.1శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ వడ్డీ రేట్లు 40ఏళ్ల మందుకు అంటే 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఖాతాలపై 8శాతం ఇవ్వడం గమన్హారం. మళ్లీ 40ఏళ్ల తరువాత అదే తరహాలో వడ్డీ రేట్లు ఇవ్వడానికి కోవిడ్ తో పాటు ఖాతాదారుల నుంచి జమయ్యే నిధి తక్కువ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకుముందు ఎలా ఉన్నాయ్! 2011 -2012 లో 8.25శాతం 2012-2013 లో 8.5శాతం 2013-2014 లో 8.75శాతం 2015 -2016లో 8.8శాతం 2016 - 2017లో 8.65శాతం 2017 - 2018లో 8.55శాతం 2018 -2019 లో 8.65శాతం 2019-2020లో 8.5శాతం 2020-2021లో 8.5శాతం 2021 -2022లో 8.1శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు రిపోర్ట్‌లో హైలెట్ చేస్తున్నాయి. తాజా వడ్డీరేట్ల తగ్గుదల నిర్ణయాన్ని సీబీటీ సభ్యులు కేంద్ర ఆర్ధిక శాఖకు పంపనున్నారు. ఆర్ధిక శాఖ నిర్ణయంతో ఈ తగ్గిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?! -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. పెరిగిన వడ్డీ రేట్లు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఎఫ్డీ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ గల బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఎస్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు మార్చి 10, 2022 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.2 కోట్లకు కంటే ఎక్కువ పెట్టుబడి, 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల ఎఫ్డీ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది. వడ్డీ రేట్లను పెంచడం వల్ల మార్చి 10 నుంచి ఎఫ్డీలపై 3.30 శాతం వడ్డీ లభించనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.60 శాతం నుంచి 3.80 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఎస్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరనుంది. అలాగే, ఈ ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని ఎస్బీఐ తెలిపింది. సమీక్షించిన ఈ వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు, రెన్యూవల్ అయ్యే డిపాజిట్లకు వర్తిస్తున్నాయి. (చదవండి: పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ) -
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త..!
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కోటక్ నిర్ణయం తీసుకుంది. ఈ వడ్డీరేట్ల పెంపు డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనుంది. కొత్త వడ్డీ రేట్ల అమలు 2022 మార్చి 9 నుంచి సవరించిన కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. రూ.2 కోట్ల వరకు బ్యాలెన్స్ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. దీంతో 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 5 శాతానికి పెరిగింది. గతంలో ఈ ఎఫ్డీలపై 4.9 శాతం వడ్డీ రేటును కోటాక్ అందించింది. సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. కాగా గత నెలలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. సవరించిన వడ్డీరేట్లు ఇలా..! ► 7 రోజుల నుంచి 30 రోజుల కాలపరిమితి ఎఫ్డీలపై 2.5 శాతం ► 31 నుంచి 90 రోజుల ఎఫ్డీలపై 2.75 శాతం ► 91 నుంచి 120 రోజుల ఎఫ్డీలపై 3 శాతం వడ్డీ ► 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి ఎఫ్డీలపై వడ్డీ రేటు 2.5 శాతం నుంచి 5.8 శాతం వరకు ఉంటుంది. ► 181 రోజుల నుంచి 363 రోజుల ఎఫ్డీలపై 4.4 శాతం ► 364 రోజుల ఎఫ్డీలపై 4.5 శాతం ► 390 రోజుల నుంచి 23 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.1 శాతం ► 3 నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్డీలపై 5.45 శాతం ► 5 ఏళ్లుపై మించిన ఎఫ్డీలపై 5.5 శాతం చదవండి: క్రెడిట్‌కార్డు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ వార్త..! -
కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
Canara Bank Hikes Fixed Deposit Rates: కెనరా బ్యాంక్ తన ఎఫ్డీ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు(౦.25) శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు మార్చి 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయని కెనరా బ్యాంక్ తెలిపింది. కెనరా బ్యాంక్ 7 నుంచి 45 రోజుల మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వినియోగదారులకు 46 రోజుల నుంచి 90 రోజులు మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.90 శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.95 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇంకా 180 రోజులు లేదా అంతకంటే తక్కువ మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఎఫ్డీలకు 4.40% వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే కస్టమర్లు 2-3 సంవత్సరాల కాల వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే కస్టమర్లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.25 శాతానికి బదులుగా.. 5.45 శాతం వడ్డీ రేటు లభించనుంది. మిగత ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల గురించి బ్యాంక్ పోర్టల్ సందర్శించండి. సీనియర్ సిటిజన్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడులపై అధిక వడ్డీ రేటును స్వీకరిస్తారని బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు చేసే పెట్టుబడులపై బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5% అధిక వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంకు "1111 డేస్" రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకం కింద డిపాజిట్ రేటుకంటే అదనంగా 0.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు 5.55 శాతం. (చదవండి: ఆ విషయంలో ఢిల్లీ, ముంబైలతో పోటీ పడుతున్న హైదరాబాద్!) -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త...!
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ దారిలోనే హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీరేట్ల పెంపు వుంటుందని బ్యాంకు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఫిబ్రవరి 14 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ తెలిపింది. కాగా ఈ వడ్డీరేట్ల పెంపు కేవలం రూ.2 కోట్లలోపున్న ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తించనునాయి. ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.45 శాతానికి చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం 6 నెలలకు గాను 1 రోజుల నుంచి 9 నెలల టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం 9 నెలల గాను 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ టైం పీరియడ్ వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం ఒక ఏడాది పాటు: జనరల్ పబ్లిక్ కోసం - 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.50 శాతం 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.35 శాతం -
ఎస్బీఐ కీలక నిర్ణయం, బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!!
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లనుపెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నిర్ణయంపై ఫిక్స్డ్ డిపాజిటర్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా ..కొత్తగా పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్డీలకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ♦ ఎస్బీఐ వెబ్సైట్ కథనం ప్రకారం..ఎస్బీఐ ఇప్పుడు 2ఏళ్లకు పైన కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ♦2 సంవత్సరాల నుండి 3సంవత్సరాల కంటే తక్కువ ఫిక్స్‌డ్రేట్ల కాలపరిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.20 శాతానికి, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.45 శాతానికి చేరింది. ♦ 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీల కాలపరిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50 శాతానికి చేరుకుంది. ♦ 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి ఎఫ్డీపై వడ్డీ రేట్లు మారవు. ఎస్బీఐ జనవరి 2022లో 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలం ఉన్న ఎఫ్‌డీల వడ్డీ రేటును రూ. 2 కోట్లలోపు 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచిందని గమనించాలి. ఈ ఎఫ్డీలు ఇప్పుడు 5.1 శాతం (5% నుండి పెరిగాయి) సీనియర్ సిటిజన్లు 5.6% (5.5% నుండి) వడ్డీని పొందవచ్చు. ♦ డిసెంబర్ 2021లో ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం..బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బీపీఎస్‌కి పెంచింది. కొత్త బేస్ రేటు, అంటే సంవత్సరానికి 7.55శాతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 10, 2022న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రెపో మరియు రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. -
మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై సీబీటీ కీలక సమావేశం..!
ఈపీఎఫ్ఓకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వచ్చే నెలలో గౌహతిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో 22021-22కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ 5 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మార్చి రెండో వారంలో గౌహతిలో సమావేశం కానుంది. వడ్డీ రేటు, కొత్త ఉత్పత్తులలో పెట్టుబడి తదితర విషయాల గురించి సమావేశంలో చర్చించనుంది. 2020-21లో పీఎఫ్ డిపాజిట్ల వడ్డీ రేటును నిర్ణయించిన విధంగా 2021-22కు 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అందిస్తుందా అని మీడియా అడిగినప్పుడు కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిస్తూ.. ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనా ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 2020-21 నాటికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీరేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2021 మార్చిలో నిర్ణయించింది. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2021లో ఆమోదించింది. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ 2020-21కు వడ్డీ ఆదాయాన్ని 8.5 శాతంగా చందాదారుల ఖాతాలోకి క్రెడిట్ చేయాలని ప్రాంత కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును సీబీటీ నిర్ణయించిన తర్వాత, ఈ వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ మేరకు ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును చందాదారుల ఖాతాలో జమ చేస్తుంది. (చదవండి: విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏసియా శుభవార్త..!) -
పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు.. వడ్డీ రేటు పెరిగే అవకాశం..!
పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఈపీఎఫ్ఓ తీపికబురు అందించనున్నట్లు తెలుస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటును నిర్ణయించడానికి గౌహతిలో మార్చి 4-5న సమావేశమవుతుంది. ఈ సమావేశంలో పీఎఫ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ బోర్డు ఆదాయాలపై చర్చించడానికి ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ(ఎఫ్ఐఏసీ) బుధవారం సమావేశం కానుంది. గత ఆర్థిక సంవత్సరం 2020-21కు 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ బోర్డు గత ఏడాది మార్చిలో ఖరారు చేసింది. గత 8 ఏళ్లలో ఈపీఎఫ్ఓ అందించిన అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. ఈపీఎఫ్ బోర్డు తన చందాదారులకు ఎఫ్ వై21 వడ్డీ రేటును క్రెడిట్ చేయడం ప్రారంభించింది. "2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.50% వడ్డీతో 23.59 కోట్ల ఖాతాలు క్రెడిట్ చేయబడ్డాయి" అని డిసెంబర్ 20న ఒక ట్వీట్లో బోర్డు పేర్కొంది. ప్రస్తుతం పీఎఫ్‌లో డిపాజిట్ చేసిన సొమ్ముపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. అయితే ఇది మునుపటి వడ్డీ రేట్ల కంటే తక్కువ. 2019-20కి వడ్డీ రేటు 8.5 శాతంగా నిర్ణయించారు. ఇది గత 7 సంవత్సరాలలో అతి తక్కువ. 2018-19లో పీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం. 2016-17 సంవత్సరంలో EPFO సభ్యులకు 8.65 శాతం వడ్డీని ఇచ్చింది. ఈపీఎఫ్ సభ్యులు ఎస్ఎమ్ఎస్ ద్వారా బ్యాలెన్స్ ఎంతో మనం చెక్ చేసుకోవచ్చు. కేవలం ‘EPFOHO UAN’ అని టైప్ చేసి తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేయడానికి ఈపీఎఫ్ సభ్యుడు 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. (చదవండి: హైదరాబాద్‌లో పెట్టుబడులకు జర్మన్ కంపెనీ రెడీ.. మూడు వేల మందికి ఉపాధి!) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
తన ఖాతాదారులలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచింది. ఖాతాదారుడి ఖాతాలో నిర్వహించే రోజువారీ బ్యాలెన్స్ మీద వడ్డీ లెక్కించనున్నట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఈ వడ్డీలను త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెంచిన కొత్త వడ్డీలు ఫిబ్రవరి 2, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై 3 శాతం వడ్డీరేటును అందిస్తుంది. ఖాతాలో రూ. 50 లక్షల నుంచి రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్ మీద బ్యాంక్ 3.50 శాతం వడ్డీని ఇస్తుంది. అదే సమయంలో, రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మొత్తం మీద వడ్డీ రేటు 4.50 శాతం ఇవ్వనున్నట్లు తెలిపింది. సవరించిన రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ పొదుపు ఖాతాలకు వర్తిస్తాయని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాంకుతో పాటు మరో రెండు బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై విధించే వడ్డీరేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరోవైపు ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశీయ, ఎన్ఆర్ఐ పొదుపు ఖాతాలపై ఇచ్చే వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇంతకు ముందు, రూ.10 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ గల ఖాతాలకు 2.80 శాతం వడ్డీరేటును ఇస్తే, ఈప్పుడు అది 2.75 శాతానికి తగ్గింది. రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల కంటే తక్కువ బ్యాలెన్స్‌ల మీద ఇచ్చే వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.80 శాతానికి తగ్గించింది. సేవింగ్స్ ఫండ్ రూ.500 కోట్లు కంటే ఎక్కువ ఖాతా బ్యాలెన్స్‌పై 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమలులోకి రానున్నాయి పంజాబ్ & సిండ్ బ్యాంక్ పంజాబ్ & సిండ్ బ్యాంక్ కూడా ఫిబ్రవరి 1 నుంచి పొదుపు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ప్రభుత్వ రంగ రుణదాత ఇప్పుడు రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా నిల్వలపై 3 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా, రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.20 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రేట్లు దేశీయ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, అలాగే ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వర్తిస్తాయి. (చదవండి: కియా నుంచి మరో కొత్త మోడల్, కారు ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!) -
పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులకు షాక్..!
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) తన పొదుపు ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలలో జమ చేసే నగదుపై చెల్లించే ప్రస్తుత వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐపీపీబీ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.25% వడ్డీ రేటు లభిస్తుంది. లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభించనుంది. గతంలో రూ.లక్ష వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.50% వడ్డీ రేటు లభిస్తే, లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు డీపాజిట్ చేసే నగదు మీద 2.75% వడ్డీ రేటు లభించేది. రోజు వారి బ్యాలన్స్ మీద కొత్త వడ్డీ రేటు లెక్కిస్తారు. రోజువారీ ఈఓడి బ్యాలెన్స్ మీద లెక్కించిన వడ్డీని 3 నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేయనున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గత నెలలో 5 కోట్ల మంది కస్టమర్లకు చేరుకొని సరికొత్త మైలురాయిని అధిగమించింది. యూపీఐ బెనిఫీషియరీ బ్యాంక్స్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తర్వాత మూడవ స్థానంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. (చదవండి: ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. అదుర్స్!) -
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాదిరిగానే ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. తాజా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు జనవరి 20 నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకులతో పాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా & కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు కూడా ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. మరిన్ని బ్యాంకులు ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్దం అవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన అధికారిక పోర్టల్‌లో వడ్డీ రేట్లకు సంబంధించన కొత్త జాబితాను ప్రకటించింది. సాదారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ కి బ్యాంకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన టర్మ్ డిపాజిట్లపై ఎక్కువగా 0.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఎన్ఆర్ఐ సీనియర్ సిటిజన్స్ కి అదనంగా వడ్డీ రేటు లభించదు. కొత్త ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. 3 నెలల్లో ఏకంగారూ.2.4 కోట్లు లాభం!) -
బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్!
బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంట్రస్ట్ రేట్లు పెంచుతూ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతా దారులు వడ్డీరేట్ల పెంపుపై సంతోషం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన ఆ ఇంటస్ట్ర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం? దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు తర్వాత వడ్డీ రేటు 5.6 శాతంగా ఉంటుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా..,రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి.ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. అలాగే, ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ పొందేందుకు కనీస వ్యవధి 7 రోజులు. వడ్డీ ఒక సంవత్సరంలోని రోజుల సంఖ్య ఆధారంగా లెక్కించబడుతుంది. లీపు సంవత్సరంలో వడ్డీ 366 రోజులకు లెక్కించబడుతుంది, సాధారణ సంవత్సరంలో వడ్డీ 365 రోజులకు లెక్కించబడుతుంది. కాగా, పెరిగిన వడ్డీ రేట్లపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీ దగ్గర్లోని బ్యాంక్‌ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
Small Savings Schemes: చిన్న పొదుపు ఖాతాదారులకు శుభవార్త..!
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమీక్రాన్ కేసులు పేరుగతున్న తరుణంలో కేంద్రం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 31 మార్చి 2022తో ముగిసే 2021-22 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కూడా చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం నుంచి స్థిర ఆదాయం పొందే పెట్టుబడిదారులకు ఉపశమనం కలగనుంది. అంటే ఫిక్సిడ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన వంటి మొదలైన చిన్న పొదుపు పథకాలకు సెప్టెంబర్-డిసెంబర్ 2021 మధ్య కాలంలో వర్తించే వడ్డీరేట్లు 31 మార్చి 2022 వరకు వర్తించనున్నాయి. ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్హోల్డర్లకు వార్షిక వడ్డీ 7.1 శాతం లభిస్తుండగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతం ఉంది. ఇక సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎక్కువ వడ్డీ ఇస్తున్న స్కీమ్ ఇదే. ఇక ఐదేళ్ల మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్‌కు 6.6 శాతం వడ్డీ, 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది టర్మ్ డిపాజిట్‌కు 5.5 శాతం, ఐదేళ్ల డిపాజిట్‌కు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు ఖాతాలకు 4% వడ్డీ రేటు లభిస్తుంది. ఏప్రిల్ 2020 నుంచి ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సవరిస్తూ ఉంటుంది. (చదవండి: షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ జరిమానా..?) -
కొత్త ఇల్లు కొనేవారికి గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఏడాది రాబోతున్న సందర్భంగా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. క్రెడిట్ స్కోరు 750 పైగా ఉండాలి అలాగే, దరఖాస్తుదారుడి సిబిల్ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి అని తెలిపింది. వీరికి మాత్రమే గృహ రుణాలు 6.65% వడ్డీ రేటుకు లభిస్తాయి. 750 నుంచి 799 మంచి క్రెడిట్ స్కోరు కలిగి ఉన్నవారు కూడా ఈ వడ్డీ రేటును పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చివరి షరతు ఏమిటంటే కొత్త ఇల్లు కొనేవారు 26 జనవరి 2022 నాటికి రుణదాత అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 28 డిసెంబర్ 2021 నుంచి 26 జనవరి 2022 మధ్య కాలంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసి, 25 ఫిబ్రవరి 2022 నాటికి రుణం తీసుకున్న వారు మాత్రమే ఈ వడ్డీ రేటు పొందడానికి అర్హులు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో బజాజ్ ఆటో లిమిటెడ్ భారీగా పెట్టుబడులు!) -
గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ఆ బ్యాంకులో వడ్డీ రేటు 6.40% మాత్రమే!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎమ్) 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ కింద ప్రస్తుతం గృహ రుణాలపై ఉన్న వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, మార్కెట్ పోటీకి అనుగుణంగా కారు రుణాలపై ప్రస్తుతం ఉన్న 7.05 శాతం వడ్డీ రేటును కూడా 6.80 శాతానికి బ్యాంకు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి ఉంటాయని బీఓఎమ్ ఒక ప్రకటనలో తెలిపింది. 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ రేటు రుణగ్రహీతల క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుందని తెలిపింది. బ్యాంకు ఇప్పటికే తన బంగారం, గృహ నిర్మాణం & కారు రుణం కోసం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు తెలిపింది. "రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా ఆఫర్ వల్ల వినియోగదారులు తమ రుణాలపై మరింత ఆదా చేసుకోవచ్చు అని, ఇది వారి జీవితాల్లో సంతోషాన్ని తీసుకొని రావడానికి సహాయపడతాయని మేము నమ్ముతున్నాము" అని బీఓఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రాజీవ్ తెలిపారు. (చదవండి: మా మహేంద్రా ట్రాక్టరుతో ఇలా నడపాలంటే జర జాగ్రత్త!: ఆనంద్ మహీంద్రా) -
RBI: వడ్డీరేట్లపై ఆర్బీఐ ప్రకటన
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి సర్దుబాటు నిర్ణయం వైపే మొగ్గు చూపింది. వరుసగా 9వసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది ఆర్బీఐ. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. అలాగే ఎంఎస్ఎఫ్(మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ), బ్యాంక్ రేట్లను 4.25 శాతానికే పరిమితం చేసినట్లు తెలిపారు. పెట్రోల్ మరియు డీజిల్‌పై ఇటీవలి ఎక్సైజ్ సుంకం & రాష్ట్ర వ్యాట్ తగ్గింపులు.. కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వినియోగ డిమాండ్‌కు మద్దతు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం డిమాండ్‌కు మద్దతునిస్తూ ఆగస్టు నుంచి ప్రభుత్వ వినియోగం కూడా పుంజుకుంది. ► 2021-22లో వాస్తవ GDP వృద్ధి అంచనా 9.5% వద్ద ఉంచబడింది, Q3లో 6.6% & Q4లో 6% ఉంటుంది. వాస్తవ GDP వృద్ధి 2022-23 Q1కి 17.2% మరియు 2022-23 Q2కి 7.8%గా అంచనా వేయబడింది. ► జూన్ 2020 నుండి ఆహారం & ఇంధనం మినహా CPI ద్రవ్యోల్బణం కొనసాగడం అనేది ఇన్పుట్ కాస్ట్ ఒత్తిళ్ల దృష్ట్యా విధానపరమైన ఆందోళన కలిగించే అంశం. ఇది డిమాండ్ బలపడుతున్నప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణానికి వేగంగా ప్రసారం చేయబడుతుంది ► ధరల ఒత్తిడి తక్షణ కాలంలో కొనసాగవచ్చు. రబీ పంటలకు ప్రకాశవంతమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కూరగాయల ధరలు శీతాకాలపు రాకతో కాలానుగుణ దిద్దుబాటును చూడగలవని అంచనా. ► 2021-22లో CPI ద్రవ్యోల్బణం 5.3%గా అంచనా వేయబడింది. ఇది క్యూ3లో 5.1%, మరియు క్యూ4లో 5.7% రిస్క్ విస్తృతంగా సమతుల్యతతో ఉంటుంది ► జూన్ 2020 నుండి ఆహారం & ఇంధనం మినహా CPI ద్రవ్యోల్బణం కొనసాగడం అనేది ఇన్పుట్ కాస్ట్ ఒత్తిళ్ల దృష్ట్యా విధానపరమైన ఆందోళన కలిగించే అంశం. చదవండి: మార్కెట్ నుంచి మాయమవుతున్న రూ.2000 నోట్లు ! కారణాలు ఇవే -
హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ వినియోగదారులకు తీపికబురు
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వల్ల గత కొంత కాలంగా ఎఫ్డీలపై అందించే వడ్డీ రేట్లు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థ(ఎన్బీఎఫ్సి)లు తగ్గించిన విషయం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు తీపికబురు అందించాయి. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు నేడు ప్రకటించాయి. హెచ్డీఎఫ్సీ ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇప్పటి వరకు హెచ్డీఎఫ్సీ 33 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.2 శాతం వడ్డీని అందించేంది. అలాగే, 66 నెలల ఎఫ్డీలపై అందించే వడ్డీ రేటు 6.6 శాతంగా, 99 నెలల డిపాజిట్లపై వడ్డీ రేటు 6.65 శాతంగా వడ్డీని ఉండేది. కానీ, ఇప్పుడు దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు వరకు పెంచింది. దీంతో 33 నెలల కాలపరిమితితో కూడిన రూ.2 కోట్ల వరకు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. 66 నెలల కాలపరిమితితో రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై 6.7శాతం, 99 నెలల కాలపరిమితికి 6.8 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.25 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. (చదవండి: భారత్‌లో రైతుల ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే..!) బజాజ్ ఫైనాన్స్ ఎఫ్డీ వడ్డీ రేట్లు బజాజ్ ఫైనాన్స్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య కాలవ్యవధి గల ఎఫ్డీలకు ఇచ్చే వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు/0.30% వరకు పెంచింది. అయితే, 12-23 నెలల కాలపరిమితితో కూడిన ఎఫ్డీ వడ్డీరేట్లలో ఎటువంటి మార్పు లేదు. 24 నెలల-35 నెలల మధ్య కాలపరిమితితో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ల కోసం సంవత్సరానికి 6.4% వడ్డీ రేటు చెల్లిస్తే, 36 నెలల-60 నెలల మధ్య డిపాజిట్లకు సంవత్సరానికి 6.8% వడ్డీ రేటు చెల్లించనుంది. అయితే, ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షకు ముందు ఈ రెండు సంస్థలు వడ్డీరేట్లు పెంచడం గమనార్హం. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు పెంపు
ముంబై: ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీరేటు స్వల్పంగా 0.05 శాతం పెరిగింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుంది. దేశంలో వడ్డీరేట్ల పెంపునకు అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ విషయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ బ్యాంక్ గృహ రుణ రేటు 6.50 శాతం అయితే, ఇది 6.55 శాతానికి పెరిగింది. నిజానికి పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంక్ సెప్టెంబర్‌లో వడ్డీరేటును తగ్గించింది. పోటీరీత్యా మిగిలిన బ్యాంకులూ ఈ దిశలో నిర్ణయం తీసుకున్నాయి.తమ ప్రత్యేక 60 రోజుల పండుగల సీజన్ ఆఫర్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు బ్యాంక్ కన్జూమర్ బిజినెస్ వ్యవహారాల ప్రెసిడెంట్ అంబుజ్ చందనా పేర్కొనడం గమనార్హం. కోటక్ కీలక ట్వీట్ నేపథ్యం... కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ ఆదివారం చేసిన ట్వీట్ నేపథ్యంలో బ్యాంక్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి’ అని ఉదయ్ కోటక్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ త్వరలో శుభవార్త చెప్పనుంది. తన ఖాతాదారులకు వడ్డీ జమ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్ఓ 6 కోట్ల మంది ఖాతాదారులకు దీపావళికి ముందే వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి, రిటైర్డ్ బోర్డు ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ తన చందాదారులకు 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2016-17లో వడ్డీ రేటు 8.65%గా ఉంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2020లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(పీఎంజీకెవై) కింద కొత్త నిబంధనను రూపొందించింది. ఈపీఎఫ్ సభ్యులు మూడు నెలల ప్రాథమిక వేతనం, కరువు భత్యం(డీఏ) లేదా వారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులో 75 శాతం వరకు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. (చదవండి: డ్రీమ్-11కు షాకిచ్చిన క్యాబ్ డ్రైవర్...!) ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్‌కు వస్తాయి. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.(చదవండి: ఇక నల్లకుబేరుల పని అయిపోయినట్లే!) -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!
Bajaj Housing Finance Home Loan Rates: మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్(బిహెచ్ఎఫ్ఎల్) నేడు (అక్టోబర్ 1) గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. వేతన, వృత్తిపరమైన దరఖాస్తుదారులకు వడ్డీ రేట్లను 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది. మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయం & ఉపాధి ఉన్న దరఖాస్తుదారులు ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త వడ్డీ రేటు వల్ల గృహ రుణ గ్రహితలకు భారీగా ఆదా కానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలలో తెలిపింది. ఇప్పటికే ఉన్న గృహ రుణం తీసుకున్న వినియోగదారులు గృహ రుణ బ్యాలెన్స్ ను బదిలీ చేసుకోవడం ద్వారా కొత్త రేటును పొందవచ్చని సంస్థ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ)తో సహా ఇతర బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సీ)లు ఇటీవల పండుగ ఆఫర్లలో భాగంగా గృహ రుణ రేట్లలో భారీగా కోత విధించాయి. సెప్టెంబర్ 21న హెచ్డీఎఫ్సీ పండుగ ఆఫర్లలో భాగంగా 6.7 శాతానికే గృహ రుణాలను అందిస్తుందని తెలిపింది. రుణ మొత్తం, ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రత్యేక గృహ రుణ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుంది. (చదవండి: కార్డు చెల్లింపులు.. ఇవాల్టి నుంచే కొత్త రూల్స్!) -
కొత్త ఇల్లుకొనేవారికి హెచ్డీఎఫ్సీ ఫెస్టివల్ బొనాంజా!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) పండుగ ఆఫర్లలో భాగంగా సెప్టెంబర్ 21 నుంచి 6.70 శాతానికి గృహ రుణాలను అందించనున్నట్లు తెలిపింది. అయితే, క్రెడిట్ స్కోర్ 800కి పైగా ఉండాలని షరతు విధించింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద, కస్టమర్లు 20 సెప్టెంబర్ 2021 నుంచి 6.70 శాతానికి హెచ్డీఎఫ్సీ అందించే గృహ రుణాలను పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తం లేదా ఉపాధితో సంబంధం లేకుండా కొత్త రుణ దరఖాస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కేవలం 31 అక్టోబర్ 2021 వరకు అందుబాటులో ఉండనున్నట్లు రుణదాత తెలిపింది. గతంలో ఉద్యోగులు రూ.75 లక్షలపైన గృహ రుణాలకు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి 7.30 శాతం వడ్డీ వర్తించేంది. తాజా ఆఫర్ కింద ఏ మొత్తానికైనా తక్కువలో తక్కువ 6.7 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా సైతం పండగ సీజన్ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును సైతం రద్దు చేసింది.(చదవండి: అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్!) -
రిస్క్ తక్కువ.. నాణ్యత ఎక్కువ
యాక్సిస్ షార్ట్‌టర్మ్ ఫండ్: వృద్ధికి మద్దతుగా నిలిచే లక్ష్యంతో ఆర్బీఐ ఎంపీసీ ఆగస్ట్ భేటీలో రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. అలాగే, సర్దుబాటు ధోరణినే కొనసాగించింది. లిక్విడిటీని సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో వేరియబుల్ రివర్స్ రెపో (వీఆర్ఆర్) మొత్తాన్ని పెంచింది. దీంతో భవిష్యత్తు వడ్డీ రేట్ల గమనంపై అనిశ్చితి కొనసాగనుంది. మోస్తరు రిస్క్ తీసుకుని, ఏడాది నుంచి మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేసుకునే వారు షార్ట్ డ్యురేషన్ (స్వల్ప కాల) ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు డెట్, మనీ మార్కెట్ సాధనాలైన కార్పొరేట్ బాండ్లు, డిబెంచరర్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీలు), ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. 1–3 ఏళ్ల కాలంతో కూడిన సాధనాలను ఎంపిక చేసుకుంటాయి. ఈ విభాగంలో యాక్సిస్ షార్ట్‌టర్మ్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. పనితీరు.. ఈ పథకాల రాబడుల్లో అస్థిరతలను గమనించొచ్చు. కానీ, రాబడులు అధికంగా ఉంటాయి. యాక్సిస్ షార్ట్ టర్మ్ పనితీరును గమనిస్తే స్థిరంగా కనిపిస్తుంది. వ్యాల్యూరీసెర్చ్ 4స్టార్ రేటింగ్ ఇచ్చిన పథకం ఇది. ఏడాది కాలంలో 8.9 శాతం, మూడేళ్లలో 8.5 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. ఐదేళ్లలో 7.52 శాతం, ఏడేళ్లలో 8 శాతం, 10 ఏళ్లలో 8.24 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఎఫ్డీ రాబడుల కంటే ఇవి మెరుగైనవే. ఈ పథకం నిర్వహణలో రూ.12,183 కోట్ల పెట్టుబడులున్నాయి. రిస్క్ విషయంలో సగటు కంటే తక్కువ విభాగంలో ఈ పథకం ఉంది. చదవండి: ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతులు, 75 రకాల ఉత్పత్తులు గుర్తింపు పోర్ట్‌ఫోలియో.. అధిక నాణ్యత, తక్కువ రిస్క్ అనే విధానాన్ని యాక్సిస్ షార్ట్ టర్మ్ ఫండ్ అనుసరిస్తుంది. ప్రస్తుతం ఏడాది కాలవ్యవధితో కూడిన కార్పొరేట్ బాండ్స్, మనీ మార్కెట్ సాధనాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఉంది. అధిక రేటింగ్ కలిగిన దీర్ఘకాల కార్పొరేట్ బాండ్స్‌లోనూ కొంత పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్వల్పకాల సాధనాలు.. సమీప కాలంలో వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు తోడ్పడతాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. దీర్ఘకాలంతో కూడిన సాధనాల నుంచి మెరుగైన రాబడులను ఆశించొచ్చు. 2021 జూలై నాటికి పథకం పోర్ట్‌ఫోలియోలోని సాధనాల సగటు మెచ్యూరిటీ 2.90 సంవత్సరాలుగా ఉంది. విడిగా పరిశీలిస్తే.. 27 శాతం పెట్టుబడులు ఏడాది వరకు కాల వ్యవధి కలిగిన సాధనాల్లోనూ.. 39 శాతం పెట్టుబడులు 1–3 ఏళ్ల సాధనాల్లోనూ ఉన్నాయి. 3–5 ఏళ్ల కాలవ్యవధి సాధనాల్లో 11 శాతం, అంతకుమించిన కాలవ్యవధి కలిగిన డెట్ ఇన్స్ట్రుమెంట్లలో 14 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న సాధనాల నాణ్యతను పరిశీలించినట్టయితే.. ఏఏఏ రేటెడ్ పేపర్లలోనే 83 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఏఏఏ అనేది అధిక నాణ్యతకు సూచిక. 9 శాతం పెట్టుబడులు ఏఏప్లస్ డెట్ పేపర్లలో ఉన్నాయి. -
దశాబ్దం కనిష్టానికి కోటక్ మహీంద్రా గృహ వడ్డీ
ముంబై: పండుగల సీజన్లో గృహ రుణ మార్కెట్లో వాటా పెంచుకోవడమే ప్రధాన ధ్యేయంగా ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ విభాగంలోని వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గృహ రుణ వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గింది. దీనితో ఈ రుణ రేటు 6.50 శాతం నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘ఈ గృహ రుణ రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి’ అని కన్జూ్యమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుచ్ చందన తెలిపారు. అయితే ఆ ఆఫర్ రెండు నెలలు అంటే నవంబర్ 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగిన ఉద్యోగులకు మాత్రమే దిగువ స్థాయి రుణ రేటు ఆఫర్‌ను అందిస్తున్నట్లు వివరించారు. బ్యాంక్ గృహ రుణ విభాగం మంచి పనితీరును కనబరుస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించిన ఐడీబీఐ
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు 2021 ఆగస్టు 16 నుంచి అమలులోకి రానున్నాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ కాలానికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఐడీబీఐ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ల కొత్త వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.(చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజైన్ అదుర్స్!) -
ప్రజల కోసం ఎస్బీఐ సరికొత్త డిపాజిట్ పథకం
దేశంలోని అతిపెద్ద పబ్లిక్ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రజల కోసం కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త డిపాజిట్ పథకం కింద ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీని లభిస్తుంది. ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్లు అని పిలువబడే ఈ కొత్త డిపాజిట్ పథకం కాలవ్యవధి పరిమిత కాలం మాత్రమే. ఈ ఆఫర్ సెప్టెంబర్ 14 వరకు కొనసాగుతుందని ఎస్బీఐ తన పోర్టల్ లో తెలిపింది. "ప్లాటినం డిపాజిట్లతో భారతదేశం 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని జరుపుకునే సమయం ఇది. టర్మ్ డిపాజిట్లు, స్పెషల్ టర్మ్ డిపాజిట్ల కింద ఎస్బీఐ అనేక ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తుంది. ఈ ఆఫర్ 14 సెప్టెంబర్ 2021 వరకు చెల్లుబాటు అవుతుంది" అని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో తెలిపింది. ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్లు ప్రత్యేక డిపాజిట్ పథకంలో భాగంగా డిపాజిట్ దారులకు 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలవ్యవధుల్లో ప్రస్తుతం లభిస్తున్న టర్మ్ డిపాజిట్లపై 0.15 శాతం వరకు అదనపు వడ్డీని పొందవచ్చు. ఈ ప్రత్యేక డిపాజిట్ పథకం కింద డిపాజిట్ దారులు 75 రోజులు, 525 రోజులు, 2,250 రోజుల కాలవ్యవధులను ఎంచుకోవచ్చు. దీని కింద పెట్టిన పెట్టుబడులపై అదనపు వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లను ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టవచ్చు. ఎన్ఆర్ఈ డిపాజిట్ల కాలపరిమితి 525 రోజులు, 2,250 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ పథకం టర్మ్ డిపాజిట్, స్పెషల్ టర్మ్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది. It's time to celebrate India's 75th year of Independence with Platinum Deposits. Exclusive benefits for Term Deposits and Special Term Deposits with SBI. Offer valid up to: 14th Sept 2021 Know More: https://t.co/1RhV1I8fam #SBIPlatinumDeposits #IndependenceDay #SpecialOffers pic.twitter.com/qnbZ4aRVEs — State Bank of India (@TheOfficialSBI) August 15, 2021 వడ్డీ రేటు ఎస్బీఐ ప్లాటినం కింద పెట్టుబడి పెట్టిన ఖాతాదారులకు 75 రోజుల కాలానికి ప్రత్యేక ఆఫర్ కింద వారికి 3.95 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 525 రోజుల కాలంలో వారికి ప్రస్తుతం ఉన్న 5 శాతానికి బదులుగా 5.10 శాతం వడ్డీరేటు లభిస్తుంది. 2,250 రోజుల కాలంలో వారికి 5.40 శాతానికి బదులుగా 5.55 శాతం వడ్డీరేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్ల కింద పెట్టుబడి పెడితే ప్రత్యేక 4.45 శాతం వడ్డీ రేటు 75 రోజుల కాలానికి, 5.60 శాతం వడ్డీ రేటు 525 రోజుల కాలానికి అందించనున్నారు. అయితే, 2,250 రోజుల పదవీకాలంలో అదనపు వడ్డీ ప్రయోజనం లభించదు. టర్మ్ డిపాజిట్ల విషయంలో వడ్డీ చెల్లింపు నెలవారీగా, త్రైమాసిక కాలానికి చెల్లించబడుతుంది. ఎస్బీఐ పరిమిత ఆఫర్ డిపాజిట్ స్కీం గురించి మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. -
ఎఫ్డీ వడ్డీ రేట్లు సవరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులు జమ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ) వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్లు పెట్టుబడి పెట్టె ఎఫ్డీ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ రేటును అందించనున్నట్లు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.9% - 5.25% మధ్య వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజా ఎఫ్డీ వడ్డీ రేట్లు (రూ.2 కోట్ల కంటే తక్కువ): డిపాజిట్ కాల వ్యవది వడ్డీ రేటు 7 నుంచి 14 రోజులు 2.9% 15 నుంచి 29 రోజులు 2.9% 30 నుంచి 45 రోజులు 2.9% 46 నుంచి 90 రోజులు 3.25% 91 నుండి 179 రోజులు 3.80% 180 రోజుల నుంచి 270 రోజులు 4.4% 271 రోజులు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ 4.4% 1 సంవత్సరం 5% 1 సంవత్సరం కంటే పైన & 2 సంవత్సరాల వరకు 5% 2 సంవత్సరాల కంటే పైన & 3 సంవత్సరాల వరకు 5.10% 3 సంవత్సరాలు పైన & 5 సంవత్సరాల వరకు 5.25% 5 సంవత్సరాల కంటే పైన & 10 సంవత్సరాల వరకు 5.25% -
వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత?
కరోనా మహమ్మారి లాంటి విపత్కర కాలంలో చాలా మంది ప్రజలు అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం వడ్డీరేట్లు తగ్గాయని చెప్పుకోవాలి. అయితే, ప్రజలకు అందించే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఇతర రుణాల వడ్డీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. హోమ్ లోన్, కారు లోన్, గోల్డ్ లోన్ లతో పోలిస్తే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఈ రుణాల కోసం ఎటువంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి ప్రాసెసింగ్ ఫీజ్, జీఎస్ టీ ఫీజ్ ఎంత ఉన్నాయి అనేది తెలుసుకుంటే మంచిది. ప్రస్తుతానికి కొన్ని బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు లక్ష రూపాయలకు 5 ఏళ్ల కాలానికి ఎంత అనేది ఈ క్రింద తెలుసుకోండి. -
ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ నెలాఖరులోగా చందాదారుల ఖాతాలో 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని జమ చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువగా చందాదారులు విత్ డ్రాలు చేయడంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును మార్చకుండా ఉంచింది. 2020లో వచ్చిన కోవిడ్-19 కారణంగా మార్చి 2020లో పీఎఫ్ వడ్డీ రేటును 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతానికి తగ్గించింది. గత 7 సంవత్సరాల కాలంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు ఇప్పుడే చాలా తక్కువగా ఉంది. రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటర్ వచ్చే వారం పనిదినాల్లో 6 కోట్ల మంది చందాదారుల ఖాతాలో ఈపీఎఫ్ వడ్డీని 8.5 శాతం క్రెడిట్ చేయవచ్చు. కాబట్టి, ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఈపిఎఫ్ బ్యాలెన్స్ ని ఎస్ఎమ్ఎస్, మిస్డ్ కాల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎస్ఎమ్ఎస్, మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా తన ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి “EPFOHO UAN ENG" అని టైపు చేసి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీ పీఎఫ్ ఖాతాకు గనుక మీ మొబైల్ నెంబర్ లింకు చేసినట్లయితే, ఎస్ఎమ్ఎస్ పంపిన తర్వాత పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఒక ఎస్ఎమ్ఎస్ మీకు వస్తుంది. అలాగే, ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ మిస్డ్ కాల్ ద్వారా తన ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్ నెంబర్ ద్వారా 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన కొద్ది సమయం తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. అందులో మీ ఖాతా బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి. ఈ సౌకర్యం కెవైసీ పూర్తి చేసుకున్న చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది. -
ఐడీబీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ తన బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంకులో పెట్టుబడి పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఎఫ్డీ వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేసింది. రూ. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐడీబీఐ పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 20 సంవత్సరాల మెచ్యూరిటీతో వస్తాయి. ఈ వ్యవధిలోని అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.7% నుంచి 4.8%% వరకు వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు అనేవి జూలై 14 నుంచి అమల్లోకి వచ్చాయి. ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఎఫ్డీలపై ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్ల కొరకు ప్రస్తుతం బ్యాంక్ 3.2% నుంచి 5.3% వరకు ఎఫ్డీ రేట్లను అందిస్తుంది. ఈ డిపాజిట్లను పన్ను ఆదా చేసే ఎఫ్డీలు అని కూడా అంటారు. ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బీపీఎస్ వడ్డీరేట్లను అన్ని టెనర్లలో అందిస్తుంది. ఐడీబీఐ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ల అయితే ఈ వడ్డీ రేట్లకు 50 బీపీఎస్(0.50 శాతం) అదనం అని గుర్తు పెట్టుకోవాలి. ఎఫ్డీలపై తాజా వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 14 రోజులు వరకు అయితే 2.7% 15 రోజుల నుంచి 30 రోజులు వరకు అయితే 2.7% 31 రోజుల నుంచి 45 రోజులు వరకు అయితే 2.8% 46 రోజుల నుంచి 60 రోజులు వరకు అయితే 3.00% 61 రోజుల నుంచి 90 రోజులు వరకు అయితే 3.00% 3 నెలల నుంచి 6 నెలలు వరకు అయితే 3.5% 6 నెలలు 1 రోజు నుంచి 270 రోజులు వరకు అయితే 4.3% 271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు అయితే 4.3% 1 సంవత్సరం వరకు అయితే 5% 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే 5.1% 2 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.1% 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.3% 5 సంవత్సరాల వరకు అయితే 5.25% 5 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 7 సంవత్సరాల వరకు అయితే 5.25% 7 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల వరకు అయితే 5.25% 10 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 20 సంవత్సరాలు వరకు అయితే 4.8% -
ఐపీపీబీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు చేదువార్త. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఛార్జీలతో పాటు పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను కూడా ఐపీపీబీ సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జులై 1 నుంచి వర్తిస్తాయి. వడ్డీ రేట్లు ఖాతా బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్ష రూపాయల వరకు బ్యాలెన్స్ ఉంటే 2.75 శాతం అందిస్తుండగా, ఇక 2021 జూలై 1 నుంచి ఏడాదికి 2.5 శాతం అందించనున్నారు. అలాగే, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఖాతాదారులకు లభిస్తుంది. పోస్టాఫీస్ ఖాతాదారులు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మనీ ట్రాన్స్ఫర్ సర్వీసుల కోసం, ఇతర ఆర్థిక సేవలను ఇప్పుడు ఐపీపీబీ యాప్ ద్వారానే పొందవచ్చు. ఈ సేవల కోసం పోస్టాఫీస్ బ్రాంచుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. -
పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు తీపికబురు!
ఒకవేళ మీకు కనుక పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా ఉన్నట్లయితే శుభవార్త. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఖాతా విషయంలో ₹3,500 వరకు సంపాదించిన వడ్డీపై పన్ను మినహాయింపును కేంద్రం అందిస్తుంది. ఒకవేళ మీకు ఉమ్మడి ఖాతా ఉన్నట్లయితే పన్ను మినహాయింపు ₹7,000 వరకు ఉంటుంది. అలాగే, చాలా తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంకు పొదుపు ఖాతా కంటే అధిక వడ్డీరేటుతో పాటు పన్ను మినహాయింపు ఇస్తూ పోస్టాఫీసు కొత్త ఖాతాదారులను ఆకట్టుకుంటుంది. పొదుపు ఖాతాలపై పోస్టాఫీసు అందిస్తున్న వడ్డీ రేట్లు చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పొదుపు ఖాతాపై వడ్డీ రేటు 2.7 శాతం అందిస్తుంది. అదే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ పై 4 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. కనీసం ₹500 డిపాజిట్‌తో పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవవచ్చు. తపాలా కార్యాలయ పొదుపు ఖాతాపై వడ్డీ ప్రతి నెలా 10వ తేదీ లేదా నెలలో చివరి రోజు కనీస బ్యాలెన్స్ పై లెక్కిస్తారు. ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివరల్లో అకౌంట్ బ్యాలెన్స్ రూ.500కు మించి డబ్బులు జమ చేయకపోతే అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజుగా రూ.100 కట్ చేస్తారు. పోస్టాఫీసు పొదుపు ఖాతాతో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తారు. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును యథాతదంగా ఉంచిది. -
కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూలై 2న ప్రత్యేక పరిమిత కాల ఆఫర్ కింద గృహ రుణ వడ్డీ రేట్లను 6.66 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారు ఆగస్టు 31, 2021 లోపు రుణాలు కోసం దరఖాస్తు చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని ఎల్ఐసీ తెలిపింది. వేతన జీవులకు రూ.50 లక్షల వరకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు 6.66 శాతం నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే, రుణగ్రహీతల సీబీల్ స్కోర్ కచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటామని పేర్కొంది. సీబీల్ స్కోర్ మంచిగా ఉన్న వారికి 6.66 శాతం నుంచి వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గరిష్టంగా 30 సంవత్సరాల గడువు వరకు గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రుణగ్రహీతలు గృహ రుణాల కోసం ఆఫీస్ కూడా రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ కి చెందిన HomY app ద్వారా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొంది. అలాగే, ఆన్లైన్ ద్వారానే రుణ దరఖాస్తులను ట్రాక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ HomY app ద్వారా తమ వినియోగదారులకు డోర్ స్టెప్ సర్వీస్ అందిస్తుందని తెలిపింది. మిగతా వివరాల కోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(https://www.lichousing.com) పోర్టల్ సందర్శించవచ్చు. LIC Housing Finance Ltd slashes Home loan rates to all time low of 6.66%. It's the right time to grab this offer and make your dream home come true...#LICHFL #homeloans #HousingForAll #deal #Offers #HomY — LIC Housing Finance Limited (@LIC_HFL) July 2, 2021 చదవండి: డీఆర్డీఓ డీ-4 డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్ -
సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవే!
చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడుతున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి ఇంకా కొనసాగుతున్న కారణంగా 2021-22 రెండవ త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎన్ఎస్పీ, కేవీపీ వంటి చిన్న పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సెప్టెంబర్ 30 వరకు పొదుపు పథకాలపై పాత వడ్డీ రేట్లు ఉంటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు వరుసగా ఐదు త్రైమాసికాలు(సెప్టెంబర్ 30, 2021వరకు) వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా అదేవిధంగా ఉంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అందులో ఇలా ఉంది.. "ఈ ఆర్థిక సంవత్సరం జూలై 1, 2021 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30, 2021తో ముగిసే రెండవ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు అనేవి మొదటి త్రైమాసికంలో(ఏప్రిల్ 1, 2021 నుంచి జూన్ 30, 2021) ఉన్న వడ్డీ రేట్లు మాదిరిగానే ఉండనున్నాయి" అని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై 7.1 శాతం వడ్డీ రేటు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్పీ)పై 6.8% వార్షిక వడ్డీ రేటు లభిస్తాయి. అలాగే నెలవారీ ఇన్కమ్ అకౌంట్‌పై 6.6 శాతం, సేవింగ్స్ ఖాతాపై 4 శాతం ఇలా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై గత త్రైమాసికంలో ఉన్న వార్షిక వడ్డీ రేట్లే ఉంటాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు - 7.1 శాతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీరేటు - 6.8 శాతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీరేటు - 7.6 శాతం కిసాన్ వికాస్ పత్రా వడ్డీరేటు - 6.9 శాతం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు - 7.4 శాతం చదవండి: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్ -
గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్!
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కుటుంబాల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా వ్యాపారాల పరిస్థితి మరి దారుణంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా అనేక చిన్న, చిన్న వ్యాపారాల మీద పడింది. అయితే, ఈ ఎమ్ఎస్ఎమ్ఈలకు తాము అండగా ఉంటామని కెనరా బ్యాంక్ భరోసా ఇచ్చింది. మన దేశంలో గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక సాయంగా పరిగణిస్తారు. కెనరా బ్యాంక్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎమ్ఎస్ఎమ్ఈల) కోసం గోల్డ్ లోన్ లను అందిస్తోంది. "కెనరా బ్యాంక్ మా ఖాతాదారులకు ఆకర్షణీయమైన గోల్డ్ లోన్స్ తక్కువ వడ్డీరేట్లతో అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీకు ఎల్లప్పుడూ మాతో భద్రతా ఉంటుంది" అని కెనరా బ్యాంక్ ట్వీట్ చేసింది. Canara Bank #GoldLoans provide emergency financial assistance to our customers in exchange for gold with attractive interest rates. With us, you’ll always have a safety net.#CanaraBank pic.twitter.com/Hy4i0REvPt — Canara Bank (@canarabank) June 20, 2021 కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు 7.35 శాతం వడ్డీరేటుకే "గోల్డ్ లోన్"ను అందిస్తోంది. ఈ గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక అవసరాలకు అనువైనదని పేర్కొంది. తక్కువ వడ్డీ రేటుకు గోల్డ్ లోన్ ను వేగంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఏవైనా ఎంక్వైరీల కోసం 1800 425 0018 /1800 103 0018కు కాల్ చేయవచ్చు అని తెలిపింది. మీ లాకర్ లోని బంగారం మీ వ్యాపారానికి గోల్డ్ మైన్ కావచ్చు అని కెనరా బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఎమ్ఎస్ఎమ్ఈల కొరకు ఓవర్ డ్రాఫ్ట్ లేదా డిమాండ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ లోన్ కింద రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణ మొత్తాన్ని అప్పుగా తీసుకోవచ్చని బ్యాంకు తెలిపింది. రేపో రేటుతో ముడిపడి ఉన్న 7.35 శాతం పోటీ వడ్డీ రేటును అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకుకి దేశ వ్యాప్తంగా 10,495 శాఖలు, 13,023 ఎటిఎంలు ఉన్నాయి. Need funds to kickstart your MSME business? Avail “CANARA MSME GOLD LOAN” from Canara Bank, for financial assistance up to 20 lakhs. With us, your business goals can be achieved!#CanaraBank #TogetherWeCan #MSME #BusinessLoans pic.twitter.com/2rpDhRkp5K — Canara Bank (@canarabank) June 18, 2021 చదవండి: పాన్ కార్డులో ఉన్న ఈ సీక్రెట్ కోడ్స్ తెలుసా? -
క్రెడిట్ కార్డ్ మంచిదా.. పర్సనల్ లోన్ మంచిదా!
సాక్షి,వెబ్ డెస్క్: మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరు మనీ సేవ్ చేసుకోవడం చాలా అవసరం. అలా కాకుండా మనకు ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు తలెత్తితే బంధువులు ఉన్నారులే..! వాళ్లే చూసుకుంటారు. "ఇప్పుడంటే ఇలా ఉన్నాం. ఎల్లకాలం ఇలా ఉండం కదా. కాలం కలిసొస్తే మనం డబ్బుల్ని సంపాదిస్తాం. వాళ్లకు అవసరం అయినప్పుడు మనమే ఆదుకుందాం". ఇదిగో ఇలాంటి అజాగ్రత్తలే మనల్ని అగాథంలోకి నెట్టేస్తాయి. అందుకే మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే ఎంత ఇంట్రస్ట్ పడుతుంది. ఎలాంటి సమయాల్లో రుణాలు తీసుకోవాలి. క్రెడిట్ కార్డ్ లను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలనే విషయాలపై అంచనా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్‌లను ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్‌ల మధ్య తేడా క్రెడిట్ కార్డులను రొటేషనల్ పద్దతిలో వినియోగిస్తాం. ఉదాహరణకు జనవరి 1వ తేదీన క్రెడిట్‌కార్డ్ నుంచి కొంత అమౌంట్ అవసరానికి వినియోగించుకున్నాం అనుకోండి. తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత సమయంలో పే చేయాల్సి ఉంటుంది. అదే పర్సనల్ లోన్ పెద్దమొత్తంలో పిల్లల చదువుల కోసం, ట్రీట్మెంట్ కోసం, ఇంటి నిర్మాణ పనుల లాంటి వాటి కోసం పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ లు తక్కువ వడ్డీ రేట్లకే అందిస్తాయి. తీసుకుంటే..ఆ మొత్తాన్నికొన్ని సంవత్సరాల పాటు వాయిదా పద్దతుల్లో చెల్లించుకోవచ్చు. లేదంటే ఒకే సారి చెల్లించుకోవచ్చు. పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి? పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అనుకున్నప్పుడే పర్సనల్ లోన్ గురించి ఆలోచించాలి. అలా కాకుండా కార్ రిపేర్ చేయించాలి, ఇల్లు బాగు చేయించాలని రుణం తీసుకునేందుకు ప్రయత్నించొద్దు. ఒకవేళ మీకు పెద్దమొత్తంలో కావాలనుకుంటే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ లు తక్కువ వడ్డీ రేట్లకే అందిస్తాయి. క్రెడిట్ కార్డును ఎప్పుడు ఉపయోగించాలి క్రెడిట్ కార్డులు తక్కువ బడ్జెట్ లో ఇంట్లో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడానికి, షాపింగ్ చేయడానికి క్రెడిట్ కార్డ్ లను వినియోగిస్తారు. వినియోగించిన మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ పేమెంట్ నిర్ణీత గడువులోపు పే చేయాలి. లేదేంటే ఇంట్రస్ట్ ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. చెల్లించినప్పుడే అప్పు అనే ఊబికి దూరంగా ఉండొచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే మీరు చెల్లించిన ఇంట్రస్ట్ మొత్తాన్ని తిరిగి రివార్డ్ రూపంలో పొందవచ్చు. క్రెడిట్ కార్డ్‌తో ప్రమాదం ఏంటంటే? క్రెడిట్ కార్డుల వల్ల అతిపెద్ద ప్రమాదం ఏంటంటే? కార్డును స్వైప్ చేసి వస్తువుల్ని ఈజీగా కొనుగోలు చేస్తుంటారు. ఇది మీకు లేనిపోని తలనొప్పుల్ని తెచ్చిపెడుతుంది. షాపింగ్ చేసే సమయంలో క్రెడిట్ కార్డ్ ఉందని అవసరానికి మించి ఖర్చు చేస్తుంటాం. దీంతో క్రెడిట్ కార్డ్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఇంట్రస్ట్‌ను వసూలు చేస్తాయి. ఒకవేళ మీకు ఒకేసారి చెల్లించే స్తోమత లేనప్పుడు ఈఎంఐ గా మార్చుకోవచ్చు. అది కూడా కట్టలేకపోతే అధిక వడ్డీ, చక్రవడ్డీతో పాటూ అప్పు తీర్చేందుకు సంవత్సరాల పాటు శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. చదవండి: క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్‌తో రూ.2.17 కోట్ల సంపాదన -
కేవలం 1 శాతం వడ్డీకే రుణం.. వారికి మాత్రమే
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మరి వల్ల ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలా మంది ఆర్దికంగా పడుతున్న భాదల నుంచి బయటపడటానికి ఇతరులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పథకంలో చేరిన వారికి కొంచెం ఊరట అని చెప్పుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేరిన వారికి అతి తక్కువ వడ్డీకే లోన్ పొందే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది కేవలం పీపీఎఫ్ పథకంలో చేరిన వారికి మాత్రమే వర్తిస్తుంది. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ ఒకటని చెప్పుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఈ పథకంలో చేరిన వారికి సులభంగానే లోన్ తీసుకునే సదుపాయం ఉంది. మీరు ఖాతా తెరిచిన తర్వాత 3వ ఏడాది నుంచి 6వ ఏడాది వరకు మధ్యలో ఎప్పుడైనా లోన్ తీసుకోవచ్చు. ఏడవ సంవత్సరం నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుల్లో గరిష్టంగా 50 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే మీరు లోన్ తీసుకోవాలని భావిస్తే.. పీపీఎఫ్ అకౌంట్లో జమ చేసిన నగదులో 25 శాతం వరకు డబ్బులు పొందొచ్చు. ఇంతకు మించి తీసుకోవడానికి వీలు లేదు. అయితే ఈ రుణం మీద మీకు 1 శాతం వడ్డీకే లోన్ లభిస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత నుంచి పూర్తిగా చెల్లించే వరకు మీరు జమ చేసిన నగదుపై ఎలాంటి వడ్డీ రాదు. అంటే మీకు లోన్‌పై వడ్డీ రేటు 8.1 శాతంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలతో పోలిస్తే పీపీఎఫ్ ఖాతాపై రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే పీపీఎఫ్‌పై లోన్ తీసుకుంటే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ పొందలేం. అందువల్ల మీరు పీపీఎఫ్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చదవండి: ప్రతి నెల పది వేల పెన్షన్ పొందాలంటే.. -
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు ఇవే!
కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల భవిష్యత్ కోసం అందిస్తోన్న పథకమే సుకన్య సమృద్ది యోజన. ఇందులో కేవలం ఆడ పిల్లల పేరిట మాత్రమే డబ్బులు పొదుపు చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఇందులో చేరోచ్చు. ఈ పథకం వలన అమ్మాయిలకు ఆర్థిక భద్రత ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలన మీ అమ్మాయి కలలను సాకారం చేయవచ్చు. ఇందులో పొదుపు చేసిన నగదుపై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో చేరాలని భావించే వారు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లితే సరిపోతుంది. సులభంగానే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. అయితే అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. సుకన్య సమృద్ధి యోజన అర్హతలు, ప్రయోజనాలు: పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లల పేరి మీద వారి సంరక్షకులు ఖాతాను ఓపెన్ చేయవచ్చు. పోస్టాఫీసులో లేదా బ్యాంకులలోనైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఒక కుటుంబంలోని ఇద్దరు బాలికలు ఉన్న కూడా ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాను ఓపెన్ చేయడానికి కనీసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఏడాదికి నగదు జమ చేయవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అంటే స్కీమ్‌లో చేరి 21 ఏళ్ల తర్వాతనే డబ్బులు తీసుకోగలం. అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత కొంత నగదు తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 21 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి. ప్రతి నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ కాలానికి రూ.15 లక్షలకు పైగా పొందవచ్చు. చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు! -
కరోనా సంక్షోభంలోనూ సానుకూల పురోగతి
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో నికర కొత్త సభ్యత్వ సంఖ్య ఫిబ్రవరిలో దాదాపు 20 శాతం పెరిగి(2020 ఫిబ్రవరిలో కొత్త సభ్యత్వంతో పోల్చితే) 12.5 లక్షలకు చేరింది. కరోనా మహమ్మారి ప్రభావిత అంశాల నేపథ్యంలోనూ సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాల సాసుకూల తీరుకు ఇది అద్దం పడుతోంది. కార్మిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన పేరోల్స్ లెక్కలు ఈ విషయాన్ని తెలిపాయి. డేటా ప్రకారం, 2021 జనవరితో పోల్చితే ఫిబ్రవరి 2021లో నికర సబ్స్కైబర్ల సంఖ్య 3.52 శాతం పెరిగింది. ఫిబ్రవరి 2021 వరకూ ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓలో మొత్తం నికర కొత్త సభ్యత్వం మొత్తం 69.58 లక్షలుగా ఉంది. 2018-19లో మొత్తం కొత్త సబ్స్కైబర్ల సంఖ్య 61.12 లక్షలు కాగా, 2018-20లో ఈ సంఖ్య 18.58 లక్షలుగా ఉంది. సంఘటిత, పాక్షిక సంఘటిత రంగాలకు సంబంధించి కార్మికులకు సంబంధించిన సామాజిక భద్రతా భవిష్యత్ నిధులను ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ అరు కోట్లకుపైగా క్రియాశీల సభ్యత్వం కలిగి ఉంది. 2018 ఏప్రిల్ నుంచి కొత్త సబ్‌ఫైబర్ల పేరోల్ డేటాను ఈపీఎఫ్ఓ విడుదల చేస్తోంది. వడ్డీరేటు ఇలా... ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటును గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20, 2020-21) 8.5 శాతంగా ఉంది. భవిష్యత్తులోనూ అత్యధిక స్థాయిలో రిటర్బ్స్ అందించడానికి తగిన వ్యూహాలను ఈపీఎఫ్ఓ అవలంభిస్తోంది. ఈ దశలో పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ ఈపీఎఫ్ఓ కలిగి ఉంది. 2015-16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభంచింది. ఈక్విటీ అసెట్స్‌లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ఫ్రస్తుతం 15 శాతానికి చేరాయి. 2018-19లో ఈపీఎఫ్ఓ చందాదారులకు లభించిన వడ్డీ 8.65 శాతంగా ఉంది. 2019-20కి సంబంధించి వడ్డీరేటును 8.5 శాతానికి తగ్గించింది. కాగా మహమ్మారి కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలకు భిన్నంగా ట్రస్టీల బోర్డ్ 2020-21లోనూ 8.5 శాతంగా వడ్డీరేటు నిర్ణయించింది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే. ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ. అంశాలను పరిగణనలోకి. తీసుకుని రిటైర్మెండ్ ఫండ్ వ్యవహారాలను నిర్వహించే- ఈపీఎఫ్ ఓ అత్యున్నత నిర్ణయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 8.5 శాతం వడ్డీరేటునే కొనసాగించాలని ఇటీవలే నిర్ణయించింది. చదవండి: యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా? -
చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!
మీరు మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీ దగ్గర సొంతిల్లు కట్టుకోవడానికి సరిపడినంత డబ్బులు మీ వద్ద లేవా? అయితే మీకు ఒక శుభవార్త. చాలా బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. అయితే గృహ రుణాలను బ్యాంక్ నుంచి తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. హోమ్ లోన్ అనేది ఎక్కువ మొత్తంతో కూడుకున్న వ్యవహారం. అందుకే వడ్డీ రేట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు కొంచెం తగ్గిన దీర్ఘకాలంలో భారీ లాభం కనిపిస్తుంది. అందువల్ల వడ్డీ రేటు తక్కువున్న బ్యాంకులో లోన్ తీసుకోండి. మేము మీ కోసం చౌక వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకులు జాబితాను మీ కోసం అందిస్తున్నాం. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65 శాతం ఐసీఐసీఐ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 శాతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.80 శాతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.85 శాతం ఐడీబీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.90 శాతం కెనరా బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేటు 6.90 శాతం ఎస్బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.95 శాతం చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! -
కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గృహ రుణాల కనీస వడ్డీ రేటును పెంచింది. ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ రుణ వడ్డీ రేట్లు 6.95 శాతం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ వడ్డీ రేటులో మార్పు అనేది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో అతిపెద్ద రుణదాత అయిన ఎస్బీఐ మార్చిలో గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. మార్చి నెలలో 6.70 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు గృహ రుణాలు అందించింది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంది. బ్యాంకు ఇప్పుడు గృహ రుణాల వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేటు ఇప్పుడు 6.95 శాతంగా ఉంది. గృహ రుణాలపై ఏకీకృత ప్రాసెసింగ్ ఫీజును కూడా బ్యాంక్ విధిస్తుంది. ఇది రుణ మొత్తంలో 0.40 శాతం, అలాగే జీఎస్టీ చార్జీలు కూడా ఉంటాయి. మార్చిలో ఎస్బీఐ గృహ రుణ ప్రాసెసింగ్ ఫీజును మార్చి 31 వరకు మాఫీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో గృహ కొనుగోలుదారులు ఇతర బ్యాంకుల వైపు చూసే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. ఇది దేశంలో అతిపెద్ద తనఖా రుణదాత. బ్యాంకు యొక్క గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ.5 లక్షల కోట్లు. చదవండి: షియోమీ కొత్త లోగోపై నెటిజన్ల ట్రోల్స్ -
హోమ్ లోన్ అప్లై చేసే ముందు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి (స్పాన్సర్డ్)
ఇల్లు కొనుగోలు అన్నది ఒక పెద్ద నిర్ణయం. దీనికోసం మనలో చాలా మంది ఆర్థిక సాయం కోసం గృహ రుణాల(హోమ్ లోన్)పై ఆధారపడుతుంటాం. హౌసింగ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసే ఒక అవకాశం. ప్రస్తుతం రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ “లో”గా ఉన్నాయి. ఏది ఏమైనా, హౌసింగ్ లోన్ అన్నది ఒక కీలకమైన అడుగు. అది దీర్ఘకాలిక ఆర్థిక కమిట్మెంట్ కాబట్టి హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న ఏళ్లలో వారి ఆదాయంలో పెద్ద మొత్తం దానికే పోతుంది. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణ గ్రహీత పరిశీలించాల్సిన కొన్ని అంశాలు ఇవి: 1. వడ్డీ చెల్లింపులు హోమ్ లోన్ తక్కువ వడ్డీరేట్లు పొందేందుకు ఆర్థిక సంస్థలను కంపేర్ చేయడం ముఖ్యం. అంతేకాదు రెండు రకాల వడ్డీరేట్లలో ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం: ● ఫ్లోటింగ్ ● ఫిక్స్డ్ ఫ్లోటింగ్ రేట్లు అనేవి ఆర్బీఐ బేస్ రేట్లలో మార్పులు చేసినప్పుడు, మొత్తంగా మార్కెట్ పరిస్థితులకు లోబడి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఎప్పుడు మారవు అన్నమాట. భవిష్యత్ లో వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ రేట్లు ఎంచుకోవడం మంచిదని ఆర్థికనిపుణులు సిఫార్సు చేస్తారు. సాధారణంగా ఫిక్స్డ్ రేట్లతో పోల్చితే ఫ్లోటింగ్ రేట్లు 1శాతం నుంచి 2 శాతం వరకు తక్కువుంటాయి. దీర్ఘకాలంలో సొమ్ము ఆదాచేస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు ఆర్థికవ్యవస్థలో కనిపించినప్పుడు ఫిక్స్డ్ రేటు ఎంచుకోవడం మేలు. ఫిక్స్డ్ వడ్డీ రేటులో రుణ గ్రహీతలు తమకు అనుగుణంగా ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవచ్చు. ఈఎంఐ మొత్తాలు చెల్లించేందుకు దరఖాస్తులు సౌకర్యవంతంగా ఉంటారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్లోటింగ్, ఫిక్స్డ్ రేట్ల మధ్య ఎంపిక చేసుకోవాలి. 2. వ్యవధి హౌసింగ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది, అంటే 360 వాయిదాలు. ఈఎంఐ భారం తక్కువుంటుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం మేలు. అయితే వడ్డీ చెల్లింపును తగ్గించుకునేందుకు స్వల్పవ్యవధి అనువైనది. ఎందుకంటే ఇందులో వడ్డీ చెల్లింపును స్వల్పకాలానికే లెక్కిస్తారు. ఉదాహరణకు, 15 సంవత్సరాల వ్యవధికి రూ.80 లక్షల హౌసింగ్ లోన్ ను 8.25 శాతం వార్షిక రేటు లెక్కన తీసుకుంటే ఈఎంఐ రూ.77,611 ఉంటుంది. అలాగే, చెల్లించే మొత్తం వడ్డీ రూ.59,70,000గా ఉంటుంది. ఒకవేళ ఈ రుణవ్యవధిని 20 ఏళ్లకు పెంచినట్టు అయితే, ఇన్స్టాల్మెంట్ మొత్తం రూ.68,165కు తగ్గుతుంది. కాని చెల్లించే వడ్డీ మొత్తం రూ.83.59,760 అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు హోమ్ లోన్ కాలిక్యూలేటర్ ఉపయోగించాలి. ఇన్స్టాల్మెంట్ మొత్తం తమ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. తమ వయస్సు, ఆదాయ అవకాశాలు, తాము పూర్తి చేయాల్సిన ఇతర బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. 3. డౌన్ పేమెంట్ రుణమిచ్చే సంస్థలు ఆస్తివిలువలో కొంతమొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తాయి, మిగిలిన మొత్తాన్ని దరఖాస్తుదారు స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తిధర, దరఖాస్తుదారు అర్హతను బట్టి ఇది75 శాతం నుంచి 90శాతం మధ్యన ఉంటుంది. రుణ గ్రహీతలు కనీస మొత్తాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లించవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. రుణంగా ఎంత మొత్తం తీసుకోవాలి, బిల్డర్ లేదా అమ్మకందారుకు తన దగ్గరనున్న సొమ్ములోఎంత చెల్లించాలనే విషయాన్ని కొనుగోలుదారులు తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. గణనీయస్థాయిలోడౌన్ పేమెంట్ చెల్లించేందుకు ముందుకు వస్తే హోమ్ లోన్(Home Loan) అర్హత అవకాశాలు మెరగువుతాయి. కాబట్టి, కుదిరిన పక్షంలో ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్ గా చెల్లించడం మంచిది. ఇలా చేయడం వలన రీపేమెంట్ భారం కూడా తగ్గుతుంది. అర్హత విషయానికి వస్తే తమకు ముందుస్తు ఆమోదిత ఆఫర్ తో కూడిన హోమ్ లోన్ అందుబాటులోఉందా అన్నది పరిశీలించుకోవాలి. ఇలా చేయడం వలన అప్లికేషన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. ఇలాంటి ఆఫర్లు అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్స్ పై ఉంటాయి, ఉదాహరణకు ఆస్తిపై లోన్. ముందస్తు ఆమోదిత ఆఫర్ గురించి తెలుసుకునేందుకు దరఖాస్తుదారులు తమపేరు, ఫోన్ నెంబర్ అందించాల్సిఉంటుంది. 4. అనుబంధఛార్జీలు హోమ్ లోన్ పై కేవలం వడ్డీ మాత్రమే ఉండదు. దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రారంభంలోనే దీనిని రుణదాతతో చర్చించడం మంచిది. ఫిక్స్డ్ రేట్ హోమ్ లోన్ పైన మాత్రమే ఫోర్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తిస్తాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేటువిషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రీపేమెంట్ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం మంచిది. తద్వారా వ్యవధి తగ్గించుకోవచ్చు దాని వలన పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. 5. క్రెడిట్ స్కోర్ హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు దరఖాస్తుదారు తన క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్కోర్ అంటే 750 కంటే ఎక్కువుంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకోవ డానికి ముందు అన్ని బకాయిలు క్లియర్ చేసుకొని ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ పెంపొందించుకోవడం మంచిది. అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి, అలాగే లోన్ ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. హోమ్ లోన్ తీసుకోవడమన్నది చాలాపెద్ద నిర్ణయం, అది రానున్న సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం, రుణం తీసుకుంటున్న వ్యక్తి ఆర్థికప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం చాలాముఖ్యం. పైన పేర్కొన్న విషయాలన్నీ మీరు అర్థంచేసుకున్నారు కాబట్టి, హోమ్ లోన్ సంబంధించి అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ముఖ్యం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అందిస్తున్నహోమ్ లోన్ ఎంచుకోవడమన్నది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక సౌకర్యవంతమైన ఆప్షన్. మీ కలల ఇంటిని కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేందుకు మీరు రుణం తీసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో పాటు సౌకర్యవంతంగా 30 ఏళ్లవ్యవధిలోపు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. (అడ్వర్టోరియల్) -
గృహ కొనుగోలుదారులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్
గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. రుణ మొత్తంపై సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ₹75 లక్షల వరకు రుణాలపై 6.70 శాతం వడ్డీ, ₹75 లక్షల నుంచి ₹5 కోట్ల వరకు రుణ మొత్తంపై 6.75 శాతం వడ్డీ వర్తిస్తుందని పేర్కొంది. ప్రాసెసింగ్ ఫీజుపైనా నూరు శాతం రాయితీ అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అదేవిధంగా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ తీసుకుంటే మరో 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రుణ గ్రహీతలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఎస్బీఐ బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో ఇప్పటికే ₹ 5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. 31 డిసెంబర్ 2020 నాటికి బ్యాంక్ ₹35 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ బేస్ కలిగి ఉంది. చదవండి: ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఎఫ్ రూల్స్! రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ -
ఒక్క ఎస్ఎంఎస్ తో రూ.14 లక్షల వరకు పెన్షన్ లోన్
దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్లకు కోసం సరికొత్త లోన్ ఆప్షన్ ను ముందుకు తీసుకోని వచ్చింది. పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా ఎస్బీఐ పెన్షన్ లోన్ అందిస్తుంది. ఇందుకోసం కేవలం ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే చాలని భరోసా కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్ తీసుకునేవారు, డిఫెన్స్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఈ పెన్షన్ లోన్ తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించింది. 9.75 శాతం వడ్డీతో సంతోషంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చని పేర్కొంది. PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు మెస్సేజ్ చేయాలని తన ట్వీట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అలాగే 7208933142కు మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ బాక్ చేస్తారు. మీ పిల్లల పెళ్లిళ్లు చేయడానికి, మీ డ్రీమ్ హోమ్ కొనుగోలు చేసేందుకు, మెడికల్ అవసరాల కోసం రిటైర్మెంట్ ఫండ్ తరహాలో ఎస్బీఐ పెన్షనర్లకు పెన్షన్ లోన్ అందిస్తుంది. పూర్తి వివరాల కోసం కస్టమర్ కేర్ నెంబర్ 1800-11-2211కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. చదవండి: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..! మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు -
గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు బంపర్ ఆఫర్లను అందిస్తుంది. ఇప్పుడు బంగారంపై రుణాలను రూ.50లక్షల వరకు తీసుకోవచ్చు అని పేర్కొంది. గతంలో కేవలం రూ.20 లక్షలు మాత్రమే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు దానికి రెట్టింపు రుణాలను తీసుకోవచ్చు అని ఎస్బీఐ పేర్కొంది. గరిష్ట రుణ మొత్తం రూ.50 లక్షలు ఉంటే కనీస రుణ మొత్తం రూ.20వేలుగా ఉంది. ఎస్బీఐలో బంగారం రుణాలను తీసుకోవాలనుకునేవారు 7208933143కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా GOLD అని టైపు చేసి 7208933145కు ఎస్ఎంఎస్ పంపితే బ్యాంక్ అధికారులు తిరిగి మీకు కాల్ చేస్తారు. ప్రస్తుతం ఈ బంగారం రుణాలపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. తక్కువ వడ్డీ రేటుకే బంగారం రుణాలను ఎస్బీఐ అందిస్తుంది. అలాగే కాగితం పని కూడా తక్కువ ఉండనున్నట్లు తెలిపింది. బంగారు నాణేలతో సహా బంగారు ఆభరణాలపై ఎస్బీఐ బంగారు రుణాన్ని పొందవచ్చు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏమి లేదు చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారం రుణాలను 18 సంవత్సరాల పైబడిన వారు తీసుకోవచ్చు. రుణం కోసం రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది. Business ke liye achhi investment chaho toh #PehleSBI socho. Apply for a #GoldLoan with SBI and enjoy exciting deals like 7.50% Interest Rate, Nil Processing Fee, and many more. For a call back, give a missed call on 7208933143 or SMS GOLD at 7208933145 #SBI #StateBankOfIndia pic.twitter.com/OiY1SWt7Rg — State Bank of India (@TheOfficialSBI) February 21, 2021 చదవండి: బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
హోంలోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : హోంలోన్ కస్టమర్లకు అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ భారీ ఊరట కల్పించింది. గృహరుణాలపై వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ కల్పించనున్నట్టు బుధవారం ప్రకటించింది. కస్టమర్ల సిబిల్ స్కోర్ ఆధారంగా వారికి వడ్డీపై 25 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ ఇస్తామని వెల్లడించింది. యోనో యాప్ ద్వారా రూ 75 లక్షలకు పైబడిన గృహ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. కాగా పండుగ ఆఫర్లలో భాగంగా రూ 30 లక్షల నుంచి రూ 2 కోట్ల లోపు గృహ రుణాలపై కస్టమర్ల క్రెడిట్ స్కోర్ ఆధారంగా 20 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇదే రాయితీని ఎనిమిది మెట్రో నగరాల్లో రూ 3 కోట్ల లోపు గృహ రుణాలపై కూడా అందచేస్తామని బ్యాంకు తెలిపింది. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. బ్యాంకు ప్రస్తుతం రూ 30 లక్షలలోపు విలువ కలిగిన గృహ రుణాలపై కనిష్టంగా 6.9 శాతం నుంచి వడ్డీ ఆఫర్ చేస్తుండగా రూ 30 లక్షలు పైబడిన గృహ రుణాలపై కనిష్ట వడ్డీ 7 శాతంగా నిర్ణయించింది. చదవండి : రుణానుబంధానికి మించి కార్పొరేట్‌తో సంబంధం! -
డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లు కట్..!
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అన్ని రకాల కాల పరిమితులు కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఎస్బీఐ మే నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల తగ్గడం వరుసగా రెండోసారి. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లపై 40బేసిస్ పాయింట్ల(0.4శాతం) వరకు తగ్గించింది. ఈ తగ్గింపు మే 27నుంచే అమల్లోకి వస్తుంది. కొత్త రేట్ల ప్రకారం ఒక ఏడాది నుంచి రెండేళ్ల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్‌పై 5.1శాతం మాత్రమే వడ్డీ వస్తుంది. 3-5 ఏళ్ల మద్య కాలపరిమితి గల 5.3శాతం, 5ఏళ్లకు పైబడి 10ఏళ్ల కాల పరిమితి కలిగి డిపాజిట్లపై వడ్డీ 5.4శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్బీ తాజా వడ్డీరేట్ల తగ్గింపు ఇలా ఉన్నాయి. -
ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ స్కీమ్ పొడిగింపు!
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ పథకాన్ని (ఈక్వలైజేషన్ స్కీమ్) కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలున్నాయి. ఎగుమతుల రంగానికి సంబంధించిన ఈ పథకం 2015, ఏప్రిల్‌లో మొదలైంది. ఎంపిక చేసిన వస్తువులకు సంబంధించిన రుణాలపై 3–5 శాతం సబ్సిడీనిచ్చే ఈ స్కీమ్ ఈ ఏడాది మార్చి 31న ముగిసింది. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఎగుమతుల రంగాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా ఈ స్కీమ్‌ను పొడిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన వెబినార్‌లో విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ అమిత్ యాదవ్ మాట్లాడారు. రానున్న వారాల్లో ఈ స్కీమ్ పొడిగింపునకు సంబంధించి శుభవార్త వింటారనిపేర్కొన్నారు -
తగ్గిన ఎస్బీఐ రుణ రేటు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)... ఏడాది కాల వ్యవధి ఉండే రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించినట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గడం ఇది వరుసగా ఎనిమిదవసారి. తాజా తగ్గింపుతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ 8% నుంచి 7.90%కి దిగివచ్చింది. తన గతవారం పాలసీ సమీక్షలో ఆర్బీఐ ఎటువంటి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) తగ్గింపు నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఎస్బీఐ తాజా రుణరేటు కోత ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 బేసిస్ పాయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. ఓవర్‌నైట్ రుణ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 7.75%కి దిగివచ్చింది. ఇతర కాలపరి మితి రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.30% నుంచి 8.20%కి చేరింది. -
పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు
న్యూఢిల్లీ: గత నెలలో ఆర్బీఐ కీలక రేట్లకు మరో విడత కోత పెట్టిన తర్వాత నుంచి సుమారు అరడజను ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రుణాలపై రేట్లను పావు శాతం వరకు తగ్గించాయి. దీంతో గృహ, ఆటో, ఇతర రుణాలు చౌకగా మారాయి. ఆర్బీఐ పాలసీ రేట్లకు అనుగుణంగానే .. రిటైల్ విభాగం, ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలపై రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు, రెపో ఆధారిత రుణ రేటు నవంబర్ 1 నుంచి 8 శాతంగా ఉంటుందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు(0.15శాతం), ఏడాది కాల ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచే వీటిని అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే వివిధ కాల పరిమితుల రుణాలపై రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 8.40 శాతానికి దిగొచ్చింది. రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించి 8.45 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గించింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు, అక్టోబర్ 10 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో సెంట్రల్ బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేటు 8 శాతానికి తగ్గగా, ఎంఎస్ఈ రుణ రేట్లు 8.95–9.50 శాతానికి తగ్గాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సైతం ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటును 8.4 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వడ్డీ తగ్గింపు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (పీపీబీ) సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ రేటును అర శాతం తగ్గించి 3.5 శాతం చేసింది. నవంబర్ 9 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పీపీబీ ప్రకటించింది. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం మేర తగ్గించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు పీపీబీ సీఈవో, ఎండీ సతీష్‌కుమార్ గుప్తా తెలిపారు. 7.5 శాతం వడ్డీ రేటుతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని కూడా పీపీబీ ప్రకటించింది. పీపీబీ భాగస్వామ్య బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా ఈ వడ్డీ రేటు పొందొచ్చు. -
రైతులపై అదనపు వడ్డీ భారం వేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా దీర్ఘ, మధ్యకాలిక రుణాలకు సంబంధించి రాయితీ విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై అదనపు వడ్డీ భారం పడకుండా కేంద్ర వ్యవసాయశాఖ అధికారులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడాలని కోరారు. ఈ మేరకు శనివారం వినోద్‌కుమార్‌కు జీవన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6% వడ్డీ రాయితీ నిధులు విడుదల చేసేలా సీఎంకు నివేదిక ఇవ్వాలన్నారు. -
‘బేర్’ బాజా!
ఈ ఏడాది మరో రేట్ల తగ్గింపు లేదని, ప్రస్తుత రేట్ల తగ్గింపు ‘తగ్గింపు సైకిల్’కు ఆరంభంగా పరిగణించకూడదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో గురువారం మన స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. కీలక పరిశ్రమలు, ద్రవ్యలోటు, వాహన విక్రయాల గణాంకాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్ల దిగువకు పతనమైంది. 138 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 463 పాయింట్లు క్షీణించి 37,018 పాయింట్ల వద్దకు చేరింది. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈ స్థాయిలకు పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ రెండు సూచీలకు ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ముడి చమురు ధరలు చెప్పుకోదగిన స్థాయిలో పడిపోయినా, మన మార్కెట్ పతనం ఆగలేదు. అయితే చివర్లో కొన్ని బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ 787 పాయింట్లు డౌన్... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. ఎన్ఎస్ఈ వీక్లీ ఆప్షన్ల ముగింపు కారణంగా మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్787 పాయింట్లు, నిఫ్టీ 204 పాయింట్ల వరకూ నష్టపోయాయి. ట్రేడింగ్ చివరి గంటలో కొంత నష్టాల రికవరీ జరిగింది. ఇంధన, వాహన షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం, హిందుస్తాన్ యూని లివర్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఈ రికవరీ కారణంగా సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,900 పాయింట్లపైన ముగియగలిగాయి. నికాయ్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► వేదాంత షేర్ 5.5% నష్టంతో రూ.145 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 600కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐషర్ మోటార్స్, బ్లూడార్ట్, ఎౖMð్స డ్ ఇండస్ట్రీస్, వీఎస్టీ టిల్లర్స్, కేర్ రేటింగ్స్, ఎస్కార్ట్స్, ఆర్తి ఇండస్ట్రీస్, వేదాంత, టాటా మోటార్స్, హిదాల్కో, బయోకా న్, ఓకార్డ్, గెయిల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తదతర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► ఓపెన్హీమర్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినప్పటికీ, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 4 శాతం మేర నష్టపోయి రూ.347 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ భారీ పతనంలోనూ 16 షేర్లు ఏడాది గరిష్ట స్థాయికి ఎగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, వైభవ్ గ్లోబల్ ఈ జాబితాలో ఉన్నాయి. 1.6 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో రూ.1.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.6 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.1,39,87,400 కోట్లకు తగ్గింది. తాజా బడ్జెట్ నుంచి చూస్తే, రూ.13.70 లక్షల కోట్లు సంపద ఆవిరైంది. రెండు నెలల్లో 9 శాతం డౌన్ ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది జూన్ 3న రికార్డ్ స్థాయి, 12,103 పాయింట్లను తాకింది. అప్పటి నుంచి కేవలం రెండు నెలల్లో 11,000 పాయింట్లకు (9%) పడిపోయింది. ఈ రెండు నెలల కాలంలో వాహన, బ్యాంక్, ఇంధన, మౌలిక, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 13%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 16% చొప్పున క్షీణించాయి. అంతేకాకుండా నిఫ్టీ 500 సూచీలోని 300కు పైగా షేర్లు 50–90 శాతం రేంజ్లో పతనమయ్యాయి. కాక్స్ అండ్ కింగ్స్, జెట్ ఎయిర్వేస్, సింటెక్స్ ప్లాస్టిక్స్, రిలయన్స్ క్యాపిటల్, డీహెచ్ఎఫ్ఎల్, జైన్ ఇరిగేషన్ , రిలయన్స్ ఇన్ఫ్రా, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పతనానికి కారణాలు ఇవీ.... ► ఫెడ్ కామెంట్స్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో రేట్లు 2.0–2.25 శాతం రేంజ్లో ఉన్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఫెడ్ రేట్లను తగ్గించింది. అయితే ఈ తగ్గింపు, రేట్ల తగ్గింపు సైకిల్‌కు ఆరంభం కాదని ఫెడ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. దీంతో సమీప భవిష్యత్తులో మరో రేట్ల పెంపు ఉండకపోవచ్చని ఫెడ్ సంకేతాలిచ్చినట్లయింది. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న తాజా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగియడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ► గణాంకాల నిరుత్సాహం: ఈ ఏడాది జూన్‌లో ఎనిమిదికీలక పరిశ్రమల వృద్ధి 0.2 శాతం తగ్గింది. సిమెంట్ ఉత్పత్తి, చమురు సంబంధిత రంగాల్లో మందగమనం చోటు చేసుకోవడం దీనికి కారణం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ద్రవ్యలోటు 61.4 శాతానికి (రూ.4.32 లక్షల కోట్లు) చేరింది. ఈ గణాంకాలు ఇన్వెస్టర్లలో నిరుత్సాహాన్ని నింపాయి. ► ఉత్తేజాన్నివ్వని వాహన విక్రయాలు: ఈ ఏడాది జూన్‌లో వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని కంపెనీలు వెల్లడించిన గణాంకాలు పేర్కొన్నాయి. ► కొనసాగుతున్న విదేశీ నిధుల ఉపసంహరణ: సంపన్నులపై విధించిన అదనపు పన్ను భారం విదేశీ ఇన్వెస్టర్లకు కూడా వర్తిస్తుంది. ఈ పన్ను విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు స్పష్టం చేయడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. బడ్జెట్ నుంచి ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు 300 కోట్ల డాలర్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని అంచనా. మన స్టాక్ మార్కెట్ జోరుకు కీలకమైన విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటంతో మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,870 కోట్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇదే ఎఫ్‌పీఐల అత్యధిక పెట్టుబడుల ఉపసంహరణ. సూపర్ రిచ్ పన్నుతో కినుక వహించిన విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. నిధుల ఉపసంహరణ కొనసాగుతుందని నిపుణులంటున్నారు. ► రూపాయి పతనం: డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు నష్టపోయింది. రూపాయి విలువ గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక దశలో 69.20కు పడిపోయింది. -
వడ్డీ రేటు తగ్గిస్తున్న బ్యాంకులు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వేగంగా బదలాయించాలన్న గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) స్పందించాయి. రుణ రేటును స్వల్పంగా తగ్గించాయి. ఈ విషయంలో ఎస్బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే, ఓబీసీ 10 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించింది. 100 బేసిస్ పాయింట్లంటే ఒక శాతం. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. ప్రస్తుతం ఈ రేటు 5.75 శాతంగా ఉంది. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం నాడు జరిగిన బడ్జెట్ అనంతర సంప్రదాయక సమావేశం సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ‘‘జూన్ 6వ తేదీకి ముందు పాలసీ నిర్ణయం వరకూ చూస్తే, రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గింది (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 75 బేసిస్ పాయింట్లు). అయితే బ్యాంకర్లు మాత్రం ఇందులో కేవలం 21 బేసిస్ పాయింట్ల రేటును కస్టమర్లకు బదలాయించారు. ఈ విధానం మారాలి. వేగంగా రెపో ప్రయోజనం కస్టమర్‌కు అందాలి. వృద్ధికి ఇది అవసరం. ఏది ఏమైనా ఇప్పుడు ఒక సానుకూల అంశం ఉంది. రేటు బదలాయింపునకు ఇంతక్రితం ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతోంది’’ అని అన్నారు. ఎస్బీఐ.. ఆర్థిక సంవత్సరంలో మూడవసారి ► ఎస్బీఐ తగ్గించిన తాజా ఐదు బేసిస్ పాయింట్ల రుణ రేటు తగ్గింపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ మూడుసార్లు రుణ రేటును తగ్గించింది. ఇంతక్రితం ఏప్రిల్, మే నెలల్లో కూడా ఎస్బీఐ రుణ రేటు ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మొత్తంగా ఈ కాలంలో గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీరేటు 20 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది. అయితే ఇది ఆర్బీఐ తగ్గించిన రెపో రేటుకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. ► నిధుల సమీకరణ వ్యయభారం ప్రాతిపదికన ఉండే మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీ ఎల్ఆర్) ప్రస్తుతం 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గింది. ► జూలై 1 నుంచే బ్యాంక్ రెపో ఆధారిత గృహరుణ పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు.. జూన్ 6 పాలసీ సమీక్ష, పావుశాతం రేటు కోత అనంతరం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు కూడా తమ ఎంసీఎల్ఆర్ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. మరో రేటు కోత! ఆగస్టు 5 నుంచి 9వ తేదీల మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా వృద్ధే లక్ష్యంగా మరో పావుశాతం రెపో రేటు కోత ఉంటుందని అంచనా. ఇదే జరిగితే, రెపో రేటు 5.5 శాతానికి తగ్గుతుంది. ఇది ఆరు సంవత్సరాల గరిష్టస్థాయి. పారిశ్రామిక రంగం ఊపునకు సైతం రేటు తగ్గింపు తప్పనిసరన్న డిమాండ్ ఉంది. నేటి నుంచే తగ్గిన ఓబీసీ రేటు అమలు వివిధ కాలపరిమితుల రుణ రేట్లను ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) 10 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. తాజా రేట్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయి. బ్యాంక్ తాజా నిర్ణయం ప్రకారం– ఓవర్‌నైట్, నెల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గి 8.20 శాతం, 8.25 శాతానికి తగ్గాయి. అలాగే మూడు, ఆరు, ఏడాది రేట్లు ఐదు బేసిస్ పాయింట్లు తగ్గి 8.45 శాతం, 8.55 శాతం, 8.65 శాతాలకు దిగివచ్చాయి. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ జోష్!
వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర విధానం కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. దీనికి మన దగ్గర షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు, వేల్యూ బయింగ్ కూడా జత కావడంతో మన మార్కెట్ కూడా గురువారం భారీగా లాభపడింది. గత మూడు రోజులుగా అంతంత మాత్రం లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలు సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, రానున్న బడ్జెట్లో వ్యాపార వర్గాలకు అనుకూలమైన చర్యలు ఉంటాయనే అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 39,602 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 11,832 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా... అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసిందన్న వార్తల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ప్రజ్వరిల్లుతాయనే ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు 3% పెరిగి 63.37 డాలర్లకు చేరింది. సాధారణంగా చమురు ధరలు పెరిగితే మన మార్కెట్ పడిపోతుంది. ఈసారి దీనికి భిన్నంగా జరిగింది. ముడిచమురు 3% పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం 23 పైసలు లాభపడటం కలసివచ్చింది. 703 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ నష్టాల్లో ఆరంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుంది. బ్యాంక్, ఫార్మా, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయన్న ఆశలూ సానుకూల ప్రభావం చూపించాయి. మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న వార్తలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. ఇటీవల నష్టాలతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో వేల్యూబయింగ్ చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లూ జరిగాయి. ఒక దశలో 179 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 524 పాయింట్లు పెరిగింది. రోజంతా 703 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జెట్ ఎయిర్వేస్ షేరు డబుల్... జెట్ ఎయిర్వేస్ భారీ లాభాలను సాధించింది. స్టాక్ మార్కెట్లో ఏ షేరూ ఏ రోజూ పెరగనంత స్థాయిలో జెట్ ఎయిర్వేస్ షేర్ పెరిగింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేర్ 18 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.27కు పడిపోయింది. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతోఈ ఈ షేర్ పుంజుకుంది. ఇంట్రాడేలో 134 శాతం లాభంతో రూ.77కు ఎగసిన జెట్ ఎయిర్వేస్ షేర్ చివరకు 93 శాతం లాభంతో రూ.64 వద్ద ముగిసింది. గత 13 సెషన్లలో ఈ షేర్ దాదాపు 78 శాతం పతనమైంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని ఎన్సీఎల్టీలో ఎస్బీఐ కేసు వేయడం తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ షేర్ 8% ఎగసింది. ► యస్ బ్యాంక్ 11 శాతం లాభపడి రూ. 115 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆరంభంలో ఈ షేర్ రెండంకెల స్థాయి, రూ.98.75కి పడిపోయింది. ఈ షేర్ రెండంకెల స్థాయికి పడిపోవడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారి. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల కారణంగా ఈ నష్టాల నుంచి ఈ షేర్ కోలుకుంది. రూ.1.75 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.75 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.75 లక్షల కోట్లు పెరిగి రూ.1,61,30,671 కోట్లకు పెరిగింది. ఫెడ్... రేట్ల తగ్గింపు సంకేతాలు! అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను ప్రస్తుతమున్న 2.25–2.50 శాతం రేంజ్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధి తోడ్పాటుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వివిధ పరిణామాల కారణంగా మందగమనం చోటు చేసుకోవడంతో అవసరమైతే, వచ్చే నెలలోనే రేట్లను అర శాతం మేర తగ్గించగలమని సంకేతాలు ఇచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఫెడ్ నిర్ణయాన్ని ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లూ అనుసరించే అవకాశాలుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఫెడ్ రేట్లను తగ్గిస్తే, వృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా భారత్‌కు విదేశీ నిధులు వెల్లువలా వస్తాయి. అందుకని ఫెడ్ నిర్ణయంతో మన మార్కెట్ భారీగా లాభపడింది. ఐదేళ్ల గరిష్టానికి పసిడి పరుగు న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీ య ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ధర గురువారం పరుగులు పెట్టింది. ఒక దశలో ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, 45 డాలర్ల లాభంతో 1,395 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. పసిడికి ఇది ఐదు సంవత్సరాల్లో గరిష్టస్థాయి. గతంలో పలు సార్లు పసిడి 1,360 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు ఈ స్థాయి దాటడంతో ఒక్కసారిగా 1,400 డాలర్ల వైపు పరుగుపెట్టింది. ఈ స్థాయి దాటితే మరో 50 డాలర్లకు పసిడి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. పరుగుకు కారణం..: అమెరికాలో వృద్ధి రేటు మందగమనం, దీనితో అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు తగ్గుతుందన్న అంచనాలు (ప్రస్తుతం 2.25–2.50 శాతం) పసిడి పరుగుకు కారణంగా నిలిచాయి. అమెరికా వృద్ధి మందగమనం వార్తలతో డాలర్ ఇండెక్స్ స్పీడ్ తగ్గడం కూడా గమనార్హం. ఇక వాణిజ్యయుద్ధం వంటి అంశాలు ప్రపంచ వృద్ధి తీరును ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆయా అంశాలు పసిడికి తక్షణ బలాన్ని ఇస్తున్నాయి. దేశంలో రూ. 1,000 అప్..: ఇక దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ చూస్తే, ఈ వార్త రాసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 లాభంతో రూ. 34,058 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 69.44 వద్ద ఉన్న రూపాయి మరింత బలహీనపడితే, దేశంలో పసిడి పరుగు మరింత వేగంగా ఉండే అవకాశం ఉందని అంచనా. -
ఆర్బీఐ వరమిచ్చినా..
ముంబై: అంచనాలు, విశ్లేషణలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6% నుంచి 5.75%కి తగ్గింది. రెపో రేటు తగ్గించడం జనవరి నుంచీ ఇది మూడవసారి. రెండు నెలలకోసారి జరిగే సమీక్షలో గడిచిన ఆరు నెలల్లో మూడు సార్లు 0.25% చొప్పున రేటును ఆర్బీఐ తగ్గిస్తూ వస్తోంది. తాజా రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రేటు కోత నిర్ణయం తీసుకుంది. ఇక ముందూ రేటు తగ్గిస్తామనే సంకేతాలను ఇస్తూ, పాలసీ విధానాన్ని ‘తటస్థం’ నుంచి ‘మార్పునకు వీలైన సరళ వైఖరికి’ మార్చింది. ఏంటీ రెపో... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపోగా వ్యవహరిస్తారు. గడిచిన ఆరునెలల్లో ఇది ఏకంగా 0.75 శాతం తగ్గింది. ఇలా తగ్గటం వల్ల ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చౌక వడ్డీకే నిధులు లభ్యమవుతాయి. అప్పుడు బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. అలా చేసినా వాటి లాభాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడదు. కానీ ఇక్కడే జరగాల్సింది సరిగా జరగడం లేదు. స్వయంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50% రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం తగ్గింపును మాత్రమే కస్టమర్లకు బదలాయించాయి. అది కూడా కొత్తగా రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందజేశాయి. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04%. ఈ విషయంపై తాను బ్యాంకర్లతో మాట్లాడతానని కూడా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. రుణాల్లో వృద్ధే ప్రధాన లక్ష్యంగా తాజా పాలసీ సమీక్ష, నిర్ణయాలు జరిగినట్లు తెలిపారు. రేటు తగ్గింపు పరిస్థితులు చూస్తే... బ్యాంకులకు తగ్గించిన రేటు ప్రయోజనం... సాధారణ వినియోగదారు నుంచి పరిశ్రమల వరకూ అందినప్పుడు అది వ్యవస్థలో రుణ రేటు తగ్గుదలకు తోడ్పడుతుంది. రుణాలపై వడ్డీ తక్కువ కనక రుణాలు ఎక్కువ తీసుకుంటారు. ఇది వృద్ధి మెరుగుదలకు దోహదపడుతుందనేది క్లుప్తంగా ఆర్థిక విశ్లేషణ. ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిపోయింది. మందగమనం చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో... రెపో రేటు తగ్గింపునకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. ఆ అంశాలను పరిశీలిస్తే... ► అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్బీఐ నిర్దేశిత శ్రేణి 2%కి అటు ఇటుగా 4 శాతం వద్దే కొనసాగుతున్నాయి. ► మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణి పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి. వాహన రంగం రివర్స్‌గేర్‌లో ప్రయాణిస్తోంది. ► గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (208–19, జనవరి–మార్చి) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది. వాహన, ఆటో, గృహ రుణ రేట్లు తగ్గే చాన్స్... బ్యాంకులు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని గనక వినియోగదారులకు బదలాయిస్తే... దీనికి అనుసంధానమయ్యే వాహన, ఆటో, గృహ రుణాలపై కస్టమర్ నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం (ఈఎంఐ) తగ్గుతుంది. కొత్త రుణాలకు సైతం వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరోవంక డిపాజిట్లపై చెల్లించే వడ్డీని కూడా బ్యాంకులు తగ్గించేస్తాయి. అసంఘటిత రంగమే అత్యధికంగా ఉండే మన దేశంలో చాలామంది రిటైరైన తరవాత సరైన ఆదాయం కోసం వడ్డీపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారికి ఈ వడ్డీ తగ్గింపులు అశనిపాతం లాంటివే. కొన్నాళ్లుగా బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే... ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే అవి డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించేస్తున్నాయి. అదే స్పీడులో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించటం లేదు. దీనివల్ల బ్యాంకుల లాభాలు పెరుగుతాయి తప్ప కస్టమర్లకు ఒరిగేదేమీ ఉండదు. బ్యాంకుల ఈ వైఖరి వల్ల వృద్ధి రేటు వచ్చే మూడేళ్లు కూడా పెద్దగా పెరిగేదేమీ ఉండకపోవచ్చనేది రేటింగ్ ఏజెన్సీల అంచనా. పాలసీ ప్రధానాంశాలు... ► రెపో రేటును పావుశాతం తగ్గించడం వరుసగా ఇది మూడవసారి. ఇంతక్రితం వరుసగా రెండు దఫాలుగా తగ్గిన అరశాతంసహా తాజా పావుశాతం తగ్గింపుతో ఈ రేటు 5.75 శాతానికి దిగివచ్చింది. ఇది తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి. ► రివర్స్ రెపో రేటు 5.50 శాతంగా ఉంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6%. ► పాలసీ వైఖరిని ‘తటస్థం’ నుంచి ‘తగిన విధం గా మార్చుకునే సరళ విధానం’ వైపు మార్పు. ► జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు. ► ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతం శ్రేణిలో ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రేటు 3.4–3.7 శ్రేణిలో ఉంటుంది. ► వర్షపాతం విషయంలో అనిశ్చితి, క్రూడ్ ఆయి ల్ ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతాయి. ► డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చార్జీల రద్దు. ► బ్యాంకులు విధించే ఏటీఎం చార్జీలు, ఫీజుల సమీక్షకు కమిటీ నియామకం. ► నిర్దిష్టకాల పరిమితితో సంబంధం లేకుండా, ఎప్పటికప్పుడు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్సుల జారీకి సంబంధించి ఆగస్టు నాటికి ముసాయిదా మార్గదర్శకాల జారీ. ► పెట్టుబడుల్లో తీవ్ర మందగమనం, ప్రైవేటు వినియోగ వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలపై ఆందోళన. ► పావుశాతం రేటు తగ్గింపునకు సానుకూలంగా మొత్తం ఆరుగురు సభ్యుల ఏకగ్రీవ ఓటు. ► జూన్ ప్రారంభంనాటికి వ్యవస్థలో సగటు రోజువారీ ద్రవ్యలభ్యత రూ.66,000 కోట్లు. ► దేశంలో మే 31వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 421.9 బిలియన్ డాలర్లు. ► మొండిబకాయిల పరిష్కారం దిశలో 3, 4 రోజుల్లో కొత్త నిబంధనలు ► ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల సవాళ్లను ఎదుర్కొనడంలో సహకారం. ► తదుపరి విధాన సమీక్ష ఆగస్టు 7. బ్యాంకర్లూ... మీరెంతో చేయాలి! ఆర్బీఐ రేటు తగ్గించినా... ఆ ప్రయోజ నాన్ని బ్యాంకర్లు వ్యవస్థలోకి బదలాయించకపోవడంపట్ల గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు మరెంతో చేయాల్సి ఉందని ఆయన సూచిం చారు. పాలసీ అనంతరం శక్తికాంతదాస్ పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూస్తే... ‘‘గతంలో ఆర్బీఐ పాలసీ రేటు తగ్గింపు నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రభావం వ్యవస్థలో ప్రతిబింబించడానికి నాలుగు నుంచి ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50 శాతం రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం కస్టమర్లకు బదలాయించాయి. కొత్త రుణ గ్రహీతలకే ఈ మొత్తం ప్రయోజనం దక్కింది. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04% మాత్రమే. రేటు తగ్గింపు ప్రయోజనం మరింతమేర, మరింత వేగంగా అందాలన్నది మా అభిప్రాయం. వినియోగదారులకు, ద్విచక్ర వాహన గ్రహీతలకు అందరికీ ఈ ప్రయోజనం అందాలి. రేటు ప్రయోజనం బదలాయింపు ఏ మేర జరుగుతోందన్న విషయాన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రేటు ప్రయోజనం ఎంతో కీలకం. బ్యాంకులతో ఈ విషయంపై చర్చిస్తాం. చేయాల్సినదంతా చేస్తాం. ఏప్రిల్‌లో పావుశాతం రేటు తగ్గించాం. అయితే కొన్ని బ్యాంకులు కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల రేటు కోత నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే మరింత రేటు ప్రయోజన బదలాయింపు జరగాలి. రుణ డిమాండ్, ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు ఇది ఎంతో అవసరం’’ – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ -
ఏడాది పెట్టుబడుల కోసం...
అంచనాలకు అనుగుణంగా ఈ నెల ఆరంభంలో ఆర్బీఐ మరోసారి కీలక రేటును పావు శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 6 శాతానికి దిగివచ్చింది. ఆర్బీఐ తన విధానాన్ని తటస్థం వద్దే కొనసాగించింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల పరంగా రిస్క్ తీసుకోలేని వారు, సంప్రదాయ ఇన్వెస్టర్లు కొద్ది కాలం కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఎస్బీఐ మ్యాగ్నం లో డ్యురేషన్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఎందుకంటే ఈ పథకం ఆరు నెలల నుంచి ఏడాది కాల వ్యవధితో కూడిన డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంది. దీంతో రేట్ల పరంగా రిస్క్, అస్థిరతల నుంచి రక్షణ ఉంటుంది. అయితే, ఈ తరహా పథకాలు అద్భుత రాబడులను ఇవ్వవు. అన్ని కాలాల్లోనూ స్థిరమైన రాబడులను ఆశించే వారికి ఇది ఎంపిక అవుతుంది. ఏడాది, ఆలోపు కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు దీన్ని పరిశీలించొచ్చు. పనితీరు..: ఎస్బీఐ మ్యాగ్నం లో డ్యురేషన్ ఫండ్ అనే ఈ పథకం గతంలో ఎస్బీఐ అల్ట్రా షార్ట్‌టర్మ్ ఫండ్ పేరుతో కొనసాగింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 7.5 శాతం రాబడులను ఇచ్చింది. ఏడాది కాలంలో రాబడులు 7.9 శాతంగా ఉన్నాయి. ఇక మూడేళ్లలో వార్షికంగా ఇచ్చిన రాబడులు 8 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో లో డ్యురేషన్ ఫండ్స్ విభాగం సగటు రాబడులు ఏడాదిలో 7.5 శాతం, మూడేళ్లలో వార్షికంగా 7.5 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 7.8 శాతం చొప్పున ఉన్నాయి. ఇక ఈ పథకం 2007లో ఆరంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా సగటున 7.85 శాతం రాబడులను ఇప్పటి వరకు అందించింది. 2015, 2017లో ఈ పథకం రాబడులను కచ్చితంగా పరిశీలించాల్సిందే. ఎందుకంటే ఆ సంవత్సరాల్లో లాంగ్ డ్యురేషన్ గిల్ట్ ఫండ్స్ 5 శాతం, 2 శాతం సగటు రాబడులు ఇవ్వగా, ఎస్బీఐ లో డ్యురేషన్ ఫండ్ మాత్రం 8.6 శాతం, 6.6 శాతం చొప్పున ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు అందించింది. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ వడ్డీ రేట్ల పరంగా సున్నితంగా ఉంటాయి. బాండ్ల ర్యాలీ కారణంగా లాంగ్ డ్యురేషన్ డెట్ ఫండ్స్ ఇటీవల మంచి పనితీరు చూపించాయి. అయితే, స్థిరమైన రాబడులు కోరుకునే వారికి లో డ్యురేషన్ బాండ్ ఫండ్స్ మరింత అనుకూలమని చెప్పొచ్చు. పోర్ట్‌ఫోలియో..: ఎస్బీఐ లో డ్యురేషన్ పథకంలో క్రెడిట్ రిస్క్ తక్కువ. అధిక రేటింగ్ కలిగిన ఏఏఏ, ఏ1ప్లస్ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫిబ్రవరి నాటికి ఈ పథకం పెట్టుబడుల్లో 46 శాతం ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే ఉన్నాయి. ఏ1ప్లస్ డెట్ సాధనాల్లో 19.5 శాతం, ఏఏ ప్లస్ బాండ్స్‌లో 15 శాతం వరకు ఇన్వెస్ట్ చేసి ఉంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడి సాధనాల సగటు మెచ్యూరిటీ ఐదు నెలలు. ఎఫ్‌డీతో పోలిస్తే... స్వల్ప కాలం అంటే ఏడాది వరకు పెట్టుబడులకు ఈ పథకం అనువుగా ఉంటుంది. ఇదే కాలంలో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.5–7 శాతం మధ్య ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 7.5 శాతం వరకు వడ్డీ రేటును ఇస్తున్నాయి. మార్కెట్ రిస్క్‌ను భరించే వారు, లిక్విడిటీ ప్రధానంగా భావించే వారు లో డ్యురేషన్ ఫండ్ తరహా మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఎఫ్డీలను ముందుగా ఉపసంహరించుకుంటే వడ్డీ రేటు తక్కువే వస్తుందని గమనించాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ పరిస్థితి ఉండదు. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ? రూ. కోటి వరకు డిపాజిట్లు,(ఏప్రిల్–2– 2019 అంకెలు శాతాల్లో) -
ఎఫ్ఐఐల పెట్టుబడులే కీలకం..
ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) భారత స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను జోరుగా కొనసాగించిన నేపథ్యంలో గతవారం ప్రధాన సూచీలు మూడున్నర శాతం మేర లాభాలను నమోదుచేశాయి. రెట్టించిన ఉత్సాహంతో వీరు పెట్టుబడులను కొనసాగించడంతో నిఫ్టీ వారాంత ట్రేడింగ్ రోజున 11,427 వద్దకు చేరుకుంది. అయితే, ఇక్కడ నుంచి జీవితకాల గరిష్టస్థాయిలకు చేరుకుంటుందా..? లేదంటే, స్వల్పకాలిక దిద్దుబాటుకు లోనవుతుందా? అనే ప్రధాన అంశానికి ఎఫ్ఐఐల నిర్ణయమే అత్యంత కీలకం కానుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈనెల్లో ఇప్పటివరకు దేశీ స్టాక్ మార్కెట్లో రూ.17,055 కోట్లను పెట్టుబడి పెట్టిన వీరు ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే సూచీలు ఊర్థ్వముఖంగా ప్రయాణం కొనసాగిస్తాయని భావిస్తున్నారు. ‘ఎమర్జింగ్ మార్కెట్లతో పోల్చితే ఫిబ్రవరి మధ్యవరకు దేశీ ప్రధాన సూచీలు అండర్పెర్ఫార్మ్ చేశాయి. ఇప్పుడైతే ఈ ట్రెండ్‌లో మార్పు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలపై అంచనాలు, ఇక్కడి మార్కెట్లో స్వల్పకాలిక రాబడికి ఉన్న అవకాశాల ఆధారంగా ఎఫ్ఐఐల పెట్టుబడుల కొనసాగింపు ఉండనుంది. ఒకవేళ వీరి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం షార్ప్ కరెక్షన్ ఉంటుంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. నిఫ్టీలో 38 శాతం వాటా కలిగిన ఫైనాన్షియల్ రంగంలో ప్రస్తుతం పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. వీటిలో ప్రైవేటు బ్యాంకులు బలమైన రిటైల్ వృద్ధిని నమోదుచేస్తుండగా.. పీఎస్‌యూ బ్యాంకులు మొండిబకాయిల భారం నుంచి బయటపడడం సానుకూలంగా ఉంది. ఇక హోలీ సందర్భంగా 21న (గురువారం) మార్కెట్లకు సెలవుకావడం గమనార్హం. అంతర్జాతీయ అంశాలపై దృష్టి.. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ).. కీలక వడ్డీ రేట్లపై ఈవారంలో తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అత్యధిక శాతం నిపుణుల అంచనాల ప్రకారం ఫెడరల్ ఫండ్ రేట్లు (2.25 శాతం నుంచి 2.5 శాతం) మార్చకపోవచ్చు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ) వడ్డీ రేట్ల నిర్ణయం గురువారం వెల్లడికానుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని తెలుస్తోంది. ఈవారంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. యూకే ద్రవ్యోల్బణం బుధవారం వెల్లడికానుండగా.. జపాన్ వాణిజ్యలోటు సోమ వారం, ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఎఫ్ఐఐల నికర కొనుగోళ్లు మార్చి 1–15 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.20,400 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. రూ.17,919 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.2,499 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టారు. అటు దేశీయ, ఇటు అంతర్జాతీయ సానుకూల అంచనాలు దీనికి కారణం. -
ఈ నెల18 నుంచి తొలి రీట్
న్యూఢిల్లీ: భారత్‌లో తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) ఈ నెల 18 నుంచి ఆరంభం కానున్నది. ఈ నెల 20న ముగిసే ఈ రీట్ ఆఫర్‌కు రూ.299– 300 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కంపెనీ బ్లాక్‌స్టోన్, రియల్టీ కంపెనీ ఎంబసీల జాయింట్ వెంచర్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఈ రీట్‌ను ఆఫర్ చేస్తోంది. మొత్తం 12.95 కోట్ల యూనిట్లను విక్రయించనున్నారు. ఈ రీట్ ద్వారా రూ.4,750 కోట్లు సమీకరించాలని ఎంబసీ ఆఫీస్ పార్క్స్ యోచిస్తోంది. ఇప్పటికే రూ.876 కోట్ల మేర వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ హామీని పొందింది. అమెరికన్ ఫండ్స్ ఇన్సూరెన్స్ సిరీస్, న్యూ వరల్డ్ ఫండ్ ఐఎన్‌సీ, స్మాల్‌క్యాప్ వరల్డ్ ఫండ్ ఇన్‌కార్పొ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సంస్థలకు 2.92 కోట్ల యూనిట్లను కేటాయించి రూ.876 కోట్లు సమీకరిస్తారు. రీట్ అంటే.... అద్దెలు ఆర్జించే రియల్ ఎస్టేట్ ఆస్తులను నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ సాధనాన్ని రీట్‌గా వ్యవహరిస్తారు. ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి. రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను 2014లోనే సెబీ నోటిఫై చేసింది. 9 శాతం రాబడి... ఈ రీట్పై తొలి ఏడాది ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 9 శాతంగా, ఐదేళ్ల కాలానికి 18 శాతం మేర ఉండొచ్చని నిపుణుల అంచనా. ఈ ప్రతిపాదిత రీట్‌లో 33 మిలియన్ చదరపుటడుగుల ఆఫీస్, హాస్పిటాలిటీ అసెట్స్ ఉన్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, నోయిడాలోని ఏడు బిజినెస్ పార్క్‌లు, నాలుగు సిటీ– సెంట్రిక్ బిల్డింగ్స్ భాగంగా ఉన్నాయి. దీంట్లో 24 మిలియన్ చదరపుటడుగుల అసెట్స్ ద్వారా ఏడాదికి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. 3 మిలియన్ చదరపుటడుగుల రియల్ ఎస్టేట్ ఆస్తులు నిర్మాణంలో ఉండగా, మరో 6 మిలియన్ చదరపుటడుగుల రియల్టీ ఆస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. రానున్న మూడేళ్లలో అద్దె ఆదాయం 55 శాతం పెరగగలదన్న అంచనాలున్నాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్స్‌కు వచ్చే అద్దె ఆదాయాల్లో సగానికి పైగా ఫారŠూచ్యన్ 500 కంపెనీల నుంచే వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, వెల్స్‌ఫార్గో, జేపీ మోర్గాన్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. -
అప్పు కావాలా నాయనా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘అప్పుకావాలా బాబూ! కేవలం 8 శాతం వడ్డీకే మూడురోజుల్లోనే రూ.5 లక్షల రుణం మంజూరు’. చెన్నై నగరంలో అధికశాతం మంది సెల్‌ఫోన్ ద్వారా అందుకుంటున్న ఆఫర్ ఇది. ఇది నిజమేననుకుని ఈ మాయమాటల వలలో పడ్డారో అప్పు సంగతి అలా ఉంచి పప్పులో కాలేసినట్లే. ఆ తరువాత తిప్పలు ఎలానూ తప్పవు. చెన్నైలో పట్టభదులైన కొందరు యువకులు పీపీఓ అనే కాల్‌సెంటర్‌ను ఏడు చోట్ల నిర్వహిస్తున్నారు. ఈ కాల్సెంటర్లలో 70 మందికి పైగా యువతులను నెలకు రూ.8వేల జీతంపై ఉద్యోగంలో చేర్చుకున్నారు. వీరంతా మధ్యతరగతి కుటుంబాల వారిని సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించి అప్పుల కోసం ఎదురుచూసే వారి వివరాలను సేకరిస్తారు. అప్పు తీసుకునేందుకు అంగీకరించిన పక్షంలో మోసపూరిత వ్యక్తులు రంగప్రవేశం చేసి సంప్రదింపులు ప్రారంభిస్తారు. మా సంస్థ తరఫున రూ.5 లక్షల వరకు రుణం మంజూరు చేస్తాం, అయితే మీరు ముందుగా రూ.50వేలు చెల్లించాలి, ఈ మొత్తానికి మీ పేరుతోనే బీమా చేసిస్తాం అని నమ్మిస్తారు. ఇలా రూ.50వేలు చెల్లించే స్థోమతలేని వారిపై మరో రకమైన వల విసురుతారు. మీ బ్యాంకు ఖాతాలో కనీసం రూ.15వేలు బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండని చెబుతారు. ఆ తరువాత మీ డాక్యుమెంట్లు మాకు అందజేయండి. మూడురోజుల్లో రూ.5 లక్షలు మీ బ్యాంకు ఖాతాలో ఉంటుందని నమ్మిస్తారు. అప్పుకోసం అనేక కార్యాలయాల చుట్టూ తిరిగి అల్లాడాల్సిన అవసరం లేదు, ఎలాంటి శ్రమ లేకుండా మీ బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తాం అంటారు. మూడు రోజుల తరువాత ‘వన్‌టైం పాస్వర్డ్’ అనే ఓటీపీ నెంబరు వస్తుంది. ఆ ఓటీపీ నెంబరును మాకు తెలియజేస్తే వెంటనే రూ.5లక్షలు జమ చేయడం పూర్తవుతుందని చెబుతారు. ఇలా మాటలతో నమ్మించి ఓటీపీ నెంబరు పొంది రుణం కోసం ఎదురుచూస్తున్న వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును తమ ఖాతాల్లోకి బదలాయించుకుంటారు. ఖాతాదారులు పెద్ద మొత్తంలో బ్యాంకు బాలెన్సు పెట్టుకుని ఉన్నట్లయితే అనేక ఖాతాల్లోకి బదిలీ అయిపోతుంది. ఇలా సొమ్ము పోగొట్టుకుని బాధితులుగా మిగిలిపోయిన సుమారు 500 మందికి పైగా చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు మోసాగ్రేసరులను పట్టుకునేందుకు కేంద్ర నేర పరిశోధన విభాగం, బ్యాంకు మోసాల నిరోధక విభాగం అధికారులతో ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పడింది. ఇప్పటికి ఏడు మంది పట్టుబడ్డారు. మోసపూరిత వ్యక్తుల చేతుల్లో చిక్కుకుని బ్రెయిన్‌వాష్‌కు గురైన కొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారీ మొత్తంలో మోసపోయిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కనీస బ్యాంకు బ్యాలెన్స్‌తో రూ.15వేలు పోగొట్టుకున్న వారు చిన్నమొత్తమే కదా. పరువుపోగొట్టుకోవడం ఎందుకని మిన్నకుండిపోయారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం విచారణలో బాధితులు 5 వేల మందికిపైగా ఉన్నట్లు తేలింది. ఇలా వీరి నుంచి రూ.కోటికి పైగా సొమ్ము కాజేసినట్లు పోలీసులు అంచనావేశారు. సెల్ఫోన్లో అన్ని ముగించాలని ఆశించొద్దు: ఇందుకు సంబంధించి కేంద్ర నేరపరిశోధన విభాగం అధికారి ఒకరు మాట్లాడుతూ, రుణం పొందాలనుకునే వారు అన్ని లావాదేవీలను సెల్ఫోన్లోనే ముగించుకోవాలని భావిస్తే ఇలాంటి మోసాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. రుణాలు ఇస్తామని మోసానికి పాల్పడే వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి కార్యాలయాల సెల్‌ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నిర్ధారించడం కష్టసాధ్యం. అలాగే అనవసరమైన ‘ఆప్’అను డౌన్లోడ్ చేసుకోవద్దు. కొన్నిరకాల యాప్‌ల వల్ల మీ కదలికలను, మొబైల్లోని వివరాలను పట్టేసే అవకాశం ఉంది. మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము మాయమయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇలాంటి మోసాలకు అడ్డుకట్టవేయవచ్చని ఆయన తెలిపారు. -
‘హ్యాపీ’ న్యూ ఇయర్ షేర్లివి..!
మార్కెట్లు... అంటే సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఇండెక్స్‌లు మరీ అంతగా పడలేదు. లార్జ్ క్యాప్ షేర్లు కొన్ని పెరిగాయి... కొన్ని తగ్గాయి. కానీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మాత్రం ఘోరంగా పతనమయ్యాయి. మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి 9 శాతం వరకూ పతనమైతే ఈ షేర్లు మాత్రం చాలావరకూ 50– 60– 70 శాతం కూడా పతనమయ్యాయి. మ్యూచ్‌వల్ ఫండ్ పథకాలు చాలావరకూ ఈ ఏడాది నష్టాలనే ఇచ్చాయి. నిజం చెప్పాలంటే ఏ షేర్లలో పెట్టుబడి పెట్టాలి? ఏ ఫండ్స్ మంచివి? అనేది 2018లో ఇన్వెస్టర్లకు ఎంత బుర్రబద్దలుకొట్టుకున్నా అర్థం కాలేదు. ఒకేరోజు సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగితే... మరోరోజు 500 పాయింట్లకు పైగా పతనం!!. ఇలాంటి ఎగుడు దిగుళ్లెన్నో సర్వసాధారణమైపోయాయి. దీనికి అంతర్జాతీయ వాణిజ్య యుద్ధభయాలు... ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు.. దేశీయంగా ఎన్బీఎఫ్సీ సంక్షోభం వంటివన్నీ కారణమని చెప్పొచ్చు. కాకపోతే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లు సంతోషించదగ్గ అత్యంత కీలక పరిణామం ఒకటుంది. అది... మార్కెట్లు పరిణితితో వ్యవహరించటం. గతానికి భిన్నంగా.. అగ్రరా జ్యం అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందన్న నానుడికి విరుద్ధంగా, దేశీ ఇన్వెస్టర్లు ఈసారి మరీ భయపడిపోకుండా కాస్త తట్టుకుని నిలబడ్డారు. అమెరికా మార్కెట్లు ఎలా ఉన్నా... మన మార్కెట్లు మాత్రం ఇక్కడి పరిణామాలకు అనువుగా స్పందించటం మొదలుపెట్టాయి. పైపెచ్చు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో (సిప్) వస్తున్న పెట్టుబడులు మరింత పెరిగాయి తప్ప నిలిచిపోలేదు. అందుకే మన ఇండెక్స్‌లు అంతర్జాతీయ మార్కెట్ల మాదిరి మరీ ఎక్కువ పతనం కాలేదన్నది వాస్తవం. ఇక 2019లో మరో ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. క్రూడ్ ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండుమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచుతామనే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించటం కాస్త కష్టం. కాకపోతే కంపెనీల ఆదాయాల్ని బట్టి ఆయా షేర్లు రాణిస్తాయనేది బ్రోకరేజీ సంస్థల మాట. ఆయా బ్రోకరేజీ సంస్థలు కొత్త సంవత్సరం కోసం సిఫార్సు చేస్తున్న షేర్లలో కొన్ని ‘సాక్షి’ ప్రాఫిట్ పాఠకులకు ప్రత్యేకం.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆశావహంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్... 2018లో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్లను వెంటాడగా, ప్రపంచ వృద్ధి రేటుపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుతం వాణిజ్య యుద్ధ భయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రూడ్ ధరలూ తగ్గుతున్నాయి. 2019లో దేశీయంగా అంతర్గత అంశాల ప్రభావం మార్కెట్లపై గణనీయంగా ఉంటుంది. ఎన్నికల దరిమిలా కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందనేది కీలకంగా మారింది. ఒకవేళ బలహీన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఎకానమీ వృద్ధి పైనా ప్రభావం పడుతుంది. 2018–20 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నిఫ్టీ 18.5 శాతం వృద్ధి నమోదు చేయొచ్చు. ఇందుకు బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగాల షేర్లు తోడ్పడవచ్చు. 2019లో ఆటోమొబైల్ రంగం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ రంగాలు ఆశావహంగా ఉంటాయని భావిస్తున్నాం. అలాగే, కన్సూ్యమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల షేర్లు కూడా సానుకూలంగా ఉండొచ్చు. మెటల్, మైనింగ్, రియల్ ఎస్టేట్, టెలికం, ఐటీ రంగాల పనితీరు తటస్థంగా ఉండవచ్చు. 2019లో బీజేపీ కూటమికి అత్యధికంగా సీట్లొచ్చే అవకాశం ఉంది. స్టాక్‌మార్కెట్‌పై దీని ప్రభావం కూడా ఉంటుంది. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్ బెస్ట్ రాష్ట్రాల ఎన్నికలు, ఆర్బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్లో స్టాక్ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే. సిఫార్సులు 1. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 265 ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్ వాటాతో ఎక్సైడ్.. లీడర్ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. 2. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రస్తుత ధర రూ. 148 ఎందుకంటే..?: ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్పోర్ట్ రన్‌వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా. 3. పీఐ ఇండస్ట్రీస్ ధర రూ. 857 ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్అండ్డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్ బుక్ వంటివి ఈ షేర్‌కు సానుకూలాంశాలు. యాక్సిస్ డైరెక్ట్ ఎన్నికల దాకా ఒడిదుడుకులు ప్రస్తుత ఒడిదుడుకులు సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగే అవకాశాలున్నాయి.ఫెడ్ నిర్ణయాలు, వాణిజ్యయుద్ధం, క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ నిర్ణయాలు వంటివి ప్రభావం చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల వృద్ధితో భారీ డిమాండ్ కొనసాగిన పక్షంలో మార్కెట్లు మరింతగా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో చూడతగ్గ స్టాక్స్ కొన్ని... 1. ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 1,583 టార్గెట్ రూ. 1,876 రాబడి: 18 శాతం ఎందుకంటే..?: మెరుగైన మార్జిన్లు, అత్యధిక వడ్డీయేతర ఆదాయాలు, స్థిరమైన అసెట్ క్వాలిటీ వంటివి బ్యాంకుకు సానుకూలాంశాలు. 2. వోల్టాస్ ప్రస్తుత ధర రూ. 551 టార్గెట్ ధర రూ. 672 రాబడి: 22 శాతం ఎందుకంటే..?: సుమారు మూడు నుంచి అయిదేళ్ల వ్యవధికి సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వోల్టాస్ మెరుగ్గా ఉంది. పటిష్టమైన నెట్వర్క్, విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణి, మెరుగైన ఆర్డర్ బుక్ సానుకూలాంశాలు. 3. స్టెరిలైట్ టెక్నాలజీస్ ప్రస్తుత ధర రూ. 289 టార్గెట్ ధర రూ. 410 రాబడి: 41 శాతం ఎందుకంటే..?: ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తదితర ఉత్పత్తుల సరఫరాదారు స్థాయి నుంచి డేటా నెట్వర్క్ సొల్యూషన్స్ అందించే సంస్థగా రూపాంతరం చెందుతుండటం కంపెనీకి సానుకూలాంశం. మిలిటరీ, ఏరోస్పేస్, హెల్త్‌కేర్ వంటి విభాగాల నుంచి కూడా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటం కంపెనీకి లాభించనుంది. సంస్థకు దేశీయంగా 40 శాతం, అంతర్జాతీయంగా 10 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు రూ. 6,000 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. 4. ఆర్తి ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,421 టార్గెట్ ధర రూ. 1,740 రాబడి 22 శాతం ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ, డిమాండ్ వృద్దితో ఆదాయాలు మెరుగుపడగలవు. కొత్త టాలీన్ వ్యాపారం వచ్చే రెండు, మూడేళ్లలో గరిష్ట స్థాయిలో రాబడులివ్వొచ్చు. 5. టేక్ సొల్యూషన్స్ ప్రస్తుత ధర రూ. 149 టార్గెట్ ధర రూ. 178 రాబడి 19 శాతం ఎందుకంటే..?: భారీ మార్కెట్ లభ్యత, టీఎస్ఎల్ విభాగంలో అపార అనుభవం, కార్యకలాపాల విస్తరణపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో ఆదాయాలు మెరుగుపడగలవు. 6. మారికో ప్రస్తుత ధర రూ. 378 టార్గెట్ ధర రూ. 428 రాబడి 12 శాతం ఎందుకంటే..?: కొబ్బరి ధరలు తగ్గనుండటం (గడిచిన పది నెలల్లో కేజీకి రూ. 90 పలికిన రేటు.. 30 శాతం తగ్గొచ్చని అంచనా) సంస్థకు సానుకూలం. ప్రధాన బ్రాండ్స్, అంతర్జాతీయ మార్కెట్లలో పనితీరు మెరుగ్గా ఉండటం.. ప్రయోజనకరం. 7. అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర రూ. 912 టార్గెట్ రూ. 1,106 రాబడి 21 శాతం ఎందుకంటే..?: రూమ్ ఎయిర్ కండీషనర్స్ (ఆర్ఏసీ) పరిశ్రమలోని ప్రధాన కంపెనీల్లో అంబర్ కూడా ఒకటి. ఇటీవల ఇతర కంపెనీల కొనుగోలుతో ఇన్వర్టర్ ఆర్ఏసీ విభాగాన్ని పటిష్టపర్చుకుంది. బ్రాండ్ ఓనర్లు అవుట్సోర్సింగ్ చేసే ధోరణి పెరుగుతుంటం కంపెనీకి లాభించే అంశం. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సానుకూలం.. 1. ఏసీసీ ప్రస్తుత ధర రూ. 1,478 ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య వినియోగం పదేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో సిమెంటు రేట్లు మెరుగుపడ్డాయి. కొంగొత్త ప్రీమియం ఉత్పత్తులు, మెరుగైన ధర అంచనాలు, కార్యకలాపాల విస్తరణ, తక్కువ వేల్యుయేషన్‌లో లభిస్తుండటం దీనికి సానుకూలాంశాలు. 2. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 625 ఎందుకంటే..?: రెండేళ్ల పాటు 17 శాతం అసెట్ వృద్ధి సాధనకు సరిపడేంతగా మూలధన నిల్వలున్నాయి. తదుపరి వృద్ధికి అవకాశమిచ్చే సాధనాల్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేసింది. కొత్తగా మరిన్ని మొండిబాకీలు తలెత్తకుండా ఉండటంతో పాటు రుణ వ్యయాలు తగ్గుతుండటం మూలంగా ఆదాయాలు ద్వితీయార్ధంలో మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇక, టాప్ మేనేజ్మెంట్ మారడంతో స్టాక్ రీరేటింగ్ జరగొచ్చు. ప్రస్తుతం షేరు ఆకర్షణీయ వేల్యుయేషన్స్‌లో లభిస్తోంది. 3. ఐటీసీ ప్రస్తుత ధర రూ. 282 ఎందుకంటే..?: ఈ షేరు అవుట్పెర్ఫార్మ్ చేయడానికి అయిదు కారణాలు కనిపిస్తున్నాయి. 1) మూడింట రెండొంతుల మంది స్మోకర్స్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం, వీరు బీడీల నుంచి అప్‌గ్రేడ్ అవుతుండటం. 2) పన్నుల విధానం స్థిరంగా ఉంటుందన్న అంచనాలు 3) సానుకూలమైన బేస్ 4) అక్రమ వ్యాపారాలను కట్టడి చేయడం 5) ఎఫ్ఎంసీజీ వ్యాపార వాటా పెరుగుతుండటం. ఈ అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా మెరుగైన రాబడులు రావొచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో మిగతా వాటితో పోలిస్తే 35 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. 4. ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ధర రూ. 504 ఎందుకంటే..?: గోల్డ్ లోన్ సెగ్మెంట్లో దీర్ఘకాలికంగా కార్యకలాపాలు, మంచి అనుభవం ఉండటం దీనికి సానుకూలాంశం. బంగారంయేతర రుణాల వాటా పెరుగుతుండటంతో.. పోర్ట్‌ఫోలియోకు రిస్కులు తగ్గుతున్నాయి. ఇతరత్రా పథకాలను విక్రయించడానికి ప్రస్తుతం ఉన్న అసెట్స్నే ఉపయోగించుకునేందుకు వీలుండటంతో.. ఆదాయాలతో పోలిస్తే వ్యయాలు తక్కువగా ఉండొచ్చు. పసిడి రుణాల విభాగం పునర్వ్యవస్థీకరణ కారణంగా రాబోయే రోజుల్లో మొండిబాకీల స్థాయి తగ్గుతుంది. 5. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,125 ఎందుకంటే..?: కన్జూమర్, టెలికం సెగ్మెంట్ విస్తరించే కొద్దీ కంపెనీ ఆదాయాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా టెలికం విభాగం ఆర్‌జియో ఆదాయం 27 శాతం మేర, లాభాలు 77 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా. 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రిలయన్స్ జియో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 41 కోట్లకు చేరొచ్చు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్ బెస్ట్ రాష్ట్రాల ఎన్నికలు, ఆర్బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్లో స్టాక్ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే. సిఫార్సులు 1. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 265 ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్ వాటాతో ఎక్సైడ్.. లీడర్ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. 2. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రస్తుత ధర రూ. 148 ఎందుకంటే..?: ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్పోర్ట్ రన్‌వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా. 3. పీఐ ఇండస్ట్రీస్ ధర రూ. 857 ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్అండ్డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్ బుక్ వంటివి ఈ షేర్‌కు సానుకూలాంశాలు. – సాక్షి, బిజినెస్ విభాగం గమనిక: ఇవన్నీ బ్రోకరేజి సంస్థల సిఫార్సులు మాత్రమే. రిస్కులను బేరీజు వేసుకుని ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
షాకింగ్ : ఏడాది చివర్లో ఆర్బీఐ వడ్డింపు షురూ
సాక్షి, న్యూఢిల్లీ : అందుబాటులో ఉన్న వడ్డీ రేట్ల ఊరట ఇక ఎంతోకాలం నిలవదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంవత్సరాంతం నుంచి వడ్డీరేట్ల పెంపును ఆర్బీఐ ప్రారంభిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. 2018 నాలుగో త్రైమాసికం నుంచి వడ్డీరేట్ల పెంపు సీజన్ ప్రారంభమవుతుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాల పరిధిలోనే ఉండే అవకాశం ఉండటంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వేగవంతమవడంతో వడ్డీరేట్ల పెంపు దిశగా ఆర్బీఐ చర్యలు చేపట్టవచ్చని మోర్గాన్ స్టాన్లీ పరిశోధన నివేదిక పేర్కొంది. గత కొద్ది త్రైమాసికాల నుంచి ధరల పెరుగుదలను కారణంగా చూపుతూ ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో వడ్డీరేట్లు అందుబాటులో ఉంటూ ఈఎంఐలు భారం కాకుండా ఉన్నాయి. అయితే వడ్డీరేట్ల పెంపు శకం ప్రారంభమైతే రుణ కస్టమర్ల ఈఎంఐ భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్బీఐ త్వరలోనే వడ్డీరేట్ల పెంపునకు పూనుకుంటుందని డచ్ బ్యాంక్ సైతం అంచనా వేసింది. -
పొదుపు వడ్డీ కుదింపు
బద్వేలు:చిన్న మొత్తాలపై వడ్డీ శాతాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పొదుపు డిపాజిట్లపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కడప డివిజన్లో దాదాపు 1.20లక్షల మేర పొదుపు ఖాతాల్లోని ఖాతాదారులు తమ చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీని కోల్పోనున్నారు. సామాన్య మధ్య తరగతి వర్గాలు కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువగా చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తుంటారు. రూ.వంద నుంచి రూ.లక్ష వరకు పొదుపు చేసుకునే వీలుం ది. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు వర్తించే ఈ తగ్గింపులో 0.20 శాతం అంటే రెండు పైసల చొప్పున తగ్గుతుంది. ప్రభుత్వ హామీతో పాటు ఆదాయపన్ను మినహాయింపు వర్తించే ప్రయోజనాలు ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం తపాలాశాఖ అందించే ఏడు రకాల పథకాలపై వడ్డీరేటు ప్రభావం పడనుంది. జిల్లాలోని పోస్టల్ డివిజన్లో దాదాపు రూ.10 0కోట్లకు పైగా పొదుపు నిల్వలు ఉంటాయి. ఇప్పటి వరకు పొదుపు చేసుకున్న మదుపరులపై తాజా నిర్ణయం ప్రభావం ఉండదు. జనవరి ఒకటి నుంచి పొదుపు చేసే మొత్తాలపై వడ్డీ రేటు తగ్గింపు ప్రభావం ఉంటుంది. బాలికా పథకాలకుఇబ్బందే:ఆడపిల్లల సంక్షేమం కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకానికి చాలా ఆదరణ ఉంది. కానీ ఈ పథకం వడ్డీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. పుట్టిన ఆడపిల్లకు 14 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పొదుపు చేస్తే ఏటా వడ్డీతో కలిపి 21ఏళ్లకు రూ.6.5లక్షల వరకు అవుతుంది. ఈ పథకం ఆరంభంలో వడ్డీ రేట్టు 9.2శాతం ఉండగా ప్రస్తుతం 8.3 శాతం ఉంది. ఒకటో తేదీ నుంచి ఇది 0.20శాతం తగ్గనుంది. చిన్నపాటి ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేతి కందిన సొమ్మును నెలసరి ఆదాయంగా ఐదేళ్ల పథకంలో పొదుపు చేస్తుంటారు. దీనిపై వచ్చే వడ్డీతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటుంటారు. వడ్డీరేటు తగ్గింపు ప్రభావం వీరిపై కూడా పడనుంది. తపాలా శాఖలో ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీరేట్లు మారుతుంటాయి. ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలవుతాయని పోస్టల్ సిబ్బంది చెబుతున్నారు. -
ఐటీ కన్ను
అధిక డిపాజిట్లపై ఆరా వివరాలు అందించాలని బ్యాంకులు, తపాలశాఖకు ఆదేశాలు ఏలూరు (మెట్రో) : నల్ల కుబేరుల భరతం పట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి డిసెంబర్ 31 వరకూ బ్యాంకుల్లో జమ అయిన డిపాజిట్లపై ఆరా తీస్తోంది. ఈ వివరాలను ఈ నెలాఖరులోగా తమకు అందించాలని బ్యాంకర్లను ఐటీ అధికారులు కోరారు. ఈనెల 31లోగా వివరాలు అందించకుంటే తామే బ్యాంకుల్లో తనిఖీలు చేపడతామని హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఈనేపథ్యంలో బ్యాంకర్లు అత్యవసర విధులు తప్ప ఇతర సాధారణ పనులన్నీ ఆపేసి గత రెండునెలల డిపాజిట్ల వివరాలను క్రోడీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా పంట, బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర పనులను బ్యాంకులు వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పక్కనే ఉన్న కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆదాయపుపన్ను చెల్లించకుండా నగదు డిపాజిట్ చేసిన వారి వివరాలను సేకరించి వారికి నోటీసులు ఇచ్చేందుకు ఐటీ అధికారులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ రెండు జిల్లాలతో పాటుగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ పెద్దసంఖ్యలో భారీ డిపాజిట్లు జరిగినట్టు ఇప్పటికే ఐటీ శాఖ ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో రూ.కోట్లు జమయ్యాయని ఐటీ శాఖ గుర్తించినట్టు సమాచారం. బ్యాంకులు వివరాలు ఇచ్చిన అనంతరం అనుమానం ఉన్న లాకర్లనూ ఆదాయపుపన్ను శాఖ పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. రాత్రికిరాత్రే భారీ డిపాజిట్లు! పెద్దనోట్ల రద్దు తర్వాత పొదుపు ఖాతాల్లో రూ.2.50లక్షలలోపు, కరెంటు ఖాతాల్లో రు.12.50లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్‌బ్యాంకు సూచించింది. అంతకుమించి డిపాజిట్లు నమోదైతే వాటికి సబంధించిన ఆధారాలు చూపాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే పెద్దనోట్ల ర్దు ప్రకటించిన నవంబరు 8వ తేదీ రాత్రే భారీ ఎత్తున నగదు డిపాజిట్ మిషన్ల ద్వారా జమైనట్లు తెలుస్తోంది. ఇలాంటి వివరాలను ఈఫైలింగ్ ద్వారా అందించాలని ఐటీ అధికారులు బ్యాంకులకు సూచించారు. బ్యాంకర్లపైనా నిఘా బ్యాంకర్లపైనా ఐటీ శాఖ నిఘాపెట్టినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నగదు మార్పిడికి పాల్పడిన అక్రమ అధికారులపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే తణుకు స్టేట్‌బ్యాంకులోనూ, మేనేజర్, సిబ్బంది నివాసాలపైనా ఐటీ శాఖ దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్‌పై జరిగిన దాడులూ దీనిలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఏలూరు వన్‌టౌన్‌లో బంగారు దుకాణాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఫిబ్రవరిలో ఐటీశాఖ దాడులు భారీగా ఉండొచ్చని తెలుస్తోంది -
బంగారం ధరల్లో స్వల్ప వృద్ధి
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వు వడీ ్డరే ట్లను యథాస్థితిలో కొనసాగించడం, దేశీ డిమాండ్ పెరుగుదల వంటి కారణాల వల్ల గతవారం బంగారం ధరల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. గతవారంలో పండుగ సీజన్ వల్ల డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధర రూ.26,000 మార్క్‌ను అధిగమించింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర అంతక్రితం వారంతో పోలిస్తే 34 డాలర్ల మేర బలపడి ఔన్స్‌కు 1,137 డాలర్ల వద్ద స్థిరపడింది. దేశీయంగా చూస్తే.. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,110తో పోలిస్తే రూ.380 పెరిగి రూ.26,490 వద్ద ముగిసింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా అంతక్రితం వారం ముగింపు ధర రూ.25,960తో పోలిస్తే రూ.380 పెరిగి రూ.26,340 వద్ద స్థిరపడింది.