SBI Gold Loan: Get Gold Loan Up To Rs 50 lakh, Just A Missed Call Or An SMS - Sakshi
Sakshi News home page

గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఎస్‌బీఐ బంపర్ ఆఫర్

Published Mon, Feb 22 2021 4:08 PM | Last Updated on Mon, Feb 22 2021 5:15 PM

SBI Gold Loan: Get Up To Rs 50 Lakh SBI Loan From Just a Missed Call - Sakshi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు బంపర్ ఆఫర్లను అందిస్తుంది. ఇప్పుడు బంగారంపై రుణాలను రూ.50లక్షల వరకు తీసుకోవచ్చు అని పేర్కొంది. గతంలో కేవలం రూ.20 లక్షలు మాత్రమే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు దానికి రెట్టింపు రుణాలను తీసుకోవచ్చు అని ఎస్‌బీఐ పేర్కొంది. గరిష్ట రుణ మొత్తం రూ.50 లక్షలు ఉంటే కనీస రుణ మొత్తం రూ.20వేలుగా ఉంది. ఎస్‌బీఐలో బంగారం రుణాలను తీసుకోవాలనుకునేవారు 7208933143కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా GOLD అని టైపు చేసి 7208933145కు ఎస్ఎంఎస్ పంపితే బ్యాంక్ అధికారులు తిరిగి మీకు కాల్ చేస్తారు.  

ప్రస్తుతం ఈ బంగారం రుణాలపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. తక్కువ వడ్డీ రేటుకే బంగారం రుణాలను ఎస్‌బీఐ అందిస్తుంది. అలాగే కాగితం పని కూడా తక్కువ ఉండనున్నట్లు తెలిపింది. బంగారు నాణేలతో సహా బంగారు ఆభరణాలపై ఎస్‌బీఐ బంగారు రుణాన్ని పొందవచ్చు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏమి లేదు చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారం రుణాలను 18 సంవత్సరాల పైబడిన వారు తీసుకోవచ్చు. రుణం కోసం రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

చదవండి:

బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి

బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement