సంక్రాంతి పండుగ రోజే ఎస్‌బీఐ తన కస్టమర్లకు షాకిచ్చింది. బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేట్లు పెంచింది. దీంతో హోమ్‌లోన్లు, ఇతర రుణాలపై ఏడాది టెన్యూర్ కాలానికి 10 బేసిస్ పాయింట్లు పెరిగాయి.పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఎస్‌బీఐ వెబ్‌పోర్ట్‌లో పొందుపరిచిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఏడాది ఎంసీఎల్ ఆర్ రేటు గతంలో 8.3శాతం ఉండగా ఇప్పుడు 8.4 శాతానికి పెరిగింది. అయితే ఇతర టెన్యూర్లలోని ఎంసీఎల్ఆర్ రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నట్లు తెలిపింది.
ఇక, 2 ఏళ్ల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్‌ఆర్ రేటు 8.50శాతం, 3 ఏళ్ల టెన్యూర్ కాలానికి 8.60 శాతంగా ఉంది. ఒక నెల, మూడు నెలల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్‌ఆర్ రేటులో మారకుండా 8 శాతంగా కొనసాగుతుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ రేటు 7.85 శాతంతో తటస్థంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment