Banks
-
కమర్షియల్ ఫ్లైట్లలో తరలుతున్న బంగారం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president Donald Trump) విధించిన సుంకాలు (US tariffs) భిన్నమైన గోల్డ్ రష్కు దారితీశాయి. న్యూయార్క్, లండన్ నగరాల మధ్య వాణిజ్య విమానాల్లో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం తరలుతోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న ధరలు, మారుతున్న మార్కెట్ల కారణంగా జేపీ మోర్గాన్ సహా బ్యాంకులు బంగారాన్ని తరలించడానికి ఇబ్బంది పడుతున్నందున వింత పరిస్థితి ఏర్పడుతోందని క్వార్ట్జ్ నివేదించింది.పెరుగుతున్న బంగారం ధరలు బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 11% పెరిగాయని నివేదిక పేర్కొంది. గత బుధవారం న్యూయార్క్‌లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్సుకు 2,909 డాలర్ల వద్ద ముగిశాయి. ఇది త్వరలో 3,000 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ట్రంప్ ఎన్నిక, యూరప్‌పై సుంకాలు విధిస్తానని ఆయన బెదిరింపు తర్వాత, డిసెంబర్ ప్రారంభం నుండి లండన్‌లో భౌతిక బంగారం ధర దాదాపు 20 డాలర్లు తక్కువగా ట్రేడవుతోందని నివేదిక పేర్కొంది.న్యూయార్క్‌కు బంగారం తరలింపుసాధారణంగా లండన్, న్యూయార్క్ నగరాల్లో బంగారం ధరలు ఒకే రకంగా కదులుతాయి. ధరల అంతరం ఉన్నప్పుడల్లా వ్యాపారులు ఈ రెండు నగరాల మధ్య బంగారాన్ని తరలిస్తూ ఉంటారు. లండన్‌లో గోల్డ్ బార్లను కలిగి ఉన్న బ్యాంకులు వాటిని రుణంగా ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇక ధరల తగ్గుదల నుండి రక్షించుకోవడం కోసం న్యూయార్క్‌లో ఫ్యూచర్స్ కాంట్రాక్టులను విక్రయిస్తుంటాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ వంటి పెద్ద బ్యాంకులు ఈ బంగారు లావాదేవీలను నిర్వహిస్తుంటాయి.కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో బంగారం ధరలు లండన్ కంటే ఎక్కువగా పెరగడంతో గోల్డ్ ఫ్యూచర్లను విక్రయించిన బ్యాంకులు ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను నష్టానికి తిరిగి కొనుగోలు చేయడానికి బదులుగా, బ్యాంకులు తమ లండన్ వాల్ట్‌ల నుండి భౌతిక బంగారాన్ని న్యూయార్క్‌కు తరలించే తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా బ్యాంకులు నష్టపోకుండా తమ ఒప్పందాలను నెరవేర్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని అధిక యూఎస్ ధరకు అమ్మడం ద్వారా లాభం కూడా పొందవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఒక్క జేపీ మోర్గాన్ సంస్థే ఈ నెలలో న్యూయార్క్‌కు 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని తరలించాలని ప్రణాళిక వేసింది.బంగారం తరలింపునకు వాణిజ్య విమానాలుబంగారం తరలింపు బ్యాంకులకు నష్టాలను తగ్గించి, లాభాలను కూడా పొందేందుకు వీలు కల్పించినప్పటికీ, తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది క్లయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుండి తమ బంగారాన్ని తిరిగి పొందడానికి ఒక వారం వరకు వేచి ఉన్నారని నివేదిక పేర్కొంది. ధర వ్యత్యాసాలు ఓవైపు ఉంటే మరోవైపు కామెక్స్ కాంట్రాక్టులు గోల్డ్ బార్ల పరిమాణానికి సంబంధించి కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే వ్యాపారులు బంగారాన్ని యథాతథంగా రవాణా చేయలేరు. యూఎస్‌కు రవాణా చేయడానికి ముందు సరైన పరిమాణంలోకి మార్చడానికి వాటిని ముందుగా శుద్ధి కర్మాగారాలకు పంపాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఇలా బంగారం సిద్ధమైన తర్వాత కూడా దానిని రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే వాణిజ్య విమానాల ద్వారా తరలింపు సురక్షితమైన మార్గమని బ్యాంకులు భావిస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్యాంకులు భద్రతా సంస్థలతో కలిసి సాయుధ వ్యాన్లలో బంగారాన్ని లండన్‌లోని విమానాశ్రయాలకు తరలిస్తున్నాయని, తరువాత వాటిని న్యూయార్క్‌కు తరలిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. -
బంగారం వేలం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
న్యూఢిల్లీ: బంగారం వేలం విషయంలో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బంగారం తనఖాపై రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే, బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) ఆ బంగారాన్ని వేలంలో విక్రయించి రుణ బకాయిలతో సర్దుబాటు చేసుకుంటుంటాయి. ఇందుకు నిర్దేశిత ప్రక్రియలు, నిబంధనలను బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అనుసరించాల్సి ఉంటుంది. ఈ విషయమై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు. ఎన్బీఎఫ్సీలు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లకు ఈ విషయంలో నిబంధనలు ఒకే విధంగా ఉన్నట్టు చెప్పారు. రుణ చెల్లింపులు సరిగ్గా లేవంటూ ఖాతాదారులకు బ్యాంక్‌లు తగినన్ని సార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ రుణ గ్రహీత చెల్లింపులకు ముందుకు రాకపోతే అప్పుడు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ బంగారం వేలానికి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. నిబంధనలను బ్యాంక్‌లు ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బంగారానికి డిమాండ్: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గలేదని, పెరుగుతూ వెళుతోందని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సీతారామన్ బదులిచ్చారు. ‘‘దేశంలో వ్యక్తులు, చిన్న వర్తకులు సురక్షితమైన, లిక్విడ్ సాధనమన్న ఉద్దేశ్యంతో బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు’’అని వివరించారు. -
మరీ ఇంత అన్యాయమా?.. కోర్టు మెట్లెక్కిన విజయ్ మాల్యా!
బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా కర్ణాటక కోర్టును ఆశ్రయించారు. తాను వ్యాపార నిమిత్తం భారత్‌లోని పలు బ్యాంకుల్లో చేసిన అప్పు కంటే.. అవి తన వద్ద నుంచి వసూలు చేసిన మొత్తం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని ఆరోపించారు. కాబట్టి రికవరీ చేసిన మొత్తానికి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్ను అందించేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని మాల్యా తన పిటిషన్లో కోరారు.బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా తరుపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఆర్ దేవదాస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య తన వాదనల్ని కోర్టుకు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.6,200 కోట్ల అప్పు చేసిందని.. అందుకు బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని అన్నారు. ఈ విషయం గురించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. మాల్యాకు చెందిన రూ.14, 131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని, ఆయన తీసుకున్న రుణంలో దాదాపు రూ.10, 200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారు. కాబట్టి బ్యాంకులు తీసుకునే తదుపరి రికవరీ చర్యలపై తాత్కాలిక స్టే విధించాలని, అన్నీ బ్యాంక్ స్టేట్మెంట్లు అందించాలని మాల్యా కోరారు.వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది. -
బ్యాంక్ టైమింగ్స్ మారుతాయా?
బ్యాంకులకు వారంలో 5 రోజులే పనిదినాలు ఉండాలని, రెండు రోజులు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఒప్పుకొంటుందా లేదా అన్నది అన్నది శనివారం (ఫిబ్రవరి 1) తేలనుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ 2025-26ను (Union Budget 2025-26) ప్రవేశపెట్టనున్నారు.రానున్న బడ్జెట్లో బ్యాంకు ఉద్యోగుల 5 రోజుల పనిదినాల డిమాండ్‌కు సంబంధించిన ప్రకటన ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఒకవేళ బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తే బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయి. రెండు రోజులు మూసిఉంటాయి. దీంతో బ్యాంకుల రోజువారీ పనివేళలు (Bank timings) కూడా మారుతాయి.రోజూ 40 నిమిషాలు అదనంగా..వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండేలా చూడాలని బ్యాంకు ఉద్యోగులు, సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఒక ప్రభుత్వం ఇలా చేస్తే బ్యాంకులు ప్రతిరోజూ 40 నిమిషాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. ప్రతి శనివారం, ఆదివారం బ్యాంకు శాఖలు మూసిఉంటాయి. ఇప్పటి వరకు బ్యాంకులు మొదటి, మూడో శనివారాల్లో పనిచేస్తున్నాయి. రెండవ, నాల్గవ శనివారాలు సెలవు పాటిస్తున్నారు. 5 రోజుల పనిదినాలపై బ్యాంకు ఉద్యోగుల సంఘం, ఆర్బీఐ, ప్రభుత్వ అధికారుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఆర్బీఐ, ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది.నెలలో 8 సెలవులుబ్యాంకులకు ప్రస్తుతం నెలలో 6 సెలవులు ఉండగా 8 సెలవులు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వం, ఆర్బీఐ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది.ఖాతాదారులకు ఇబ్బందులు!బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని దినాలు అమలైతే ఖాతాదారులకు కాస్త ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా శనివారాల్లో బ్యాంకు పనులు పూర్తి చేసుకునేవారు అసౌకర్యం ఎదుర్కోవాల్సి ఉంటుంది.వారు తమ పనిని బ్యాంకులు పనిచేసే 5 రోజుల విండోలోనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు బ్యాంకులు రోజూ 40 నిమిషాలు అదనంగా తెరవాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకు శాఖలు ఉదయం 9:45 గంటల నుంచి తెరుచుకుంటాయి. సాయంత్రం 5:30 గంటలకు పనివేళలు ముగుస్తాయి. బ్యాంకులను ప్రస్తుతం ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 5 గంటలకు మూసివేస్తున్నారు. -
నెలలో 8.2 లక్షల క్రెడిట్ కార్డులు జారీ
దేశంలోని బ్యాంకులు 2024 డిసెంబర్ నెలలో సుమారు 8,20,000 కొత్త క్రెడిట్ కార్డు(Credit Cards)లను జారీ చేశాయి. ఇది గడిచిన నాలుగు నెలల్లో అత్యధిక సంఖ్యలో కార్డుల జారీని సూచిస్తుంది. పెళ్లిళ్ల సీజన్, ఇయర్ ఎండ్ ఫెస్టివల్స్ సమయంలో ఖర్చులు అధికమవడం ఈ కార్డుల పెరుగుదలకు కారణమైందని నిపుణులు చెబుతున్నారు.బ్యాంకుల వారీగా కార్డుల జారీ ఇలా..హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ కార్డుల జారీలో అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం జారీ చేసిన కార్డుల్లో ఈ రెండు సంస్థలే సగానికిపైగా వాటా ఆక్రమించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3,12,000 కార్డులను జోడించగా, ఎస్బీఐ కార్డ్స్ 2,09,000 కార్డులను జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 1,50,000 కొత్త కార్డులు విడుదల చేసింది.దేనికి ఖర్చు చేస్తున్నారంటే..క్రెడిట్ కార్డు వ్యయం గతంలో కంటే దాదాపు 11 శాతం పెరిగి 2024 డిసెంబర్ నాటికి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అందించే ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, డీల్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లకు ఆదరణ లభించడం ఈ వ్యయం పెరగడానికి కారణం.ఇదీ చదవండి: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు అప్‌మార్కెట్ వాటా, వృద్ధిచలామణిలో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 2024 నవంబర్‌లో 107.2 మిలియన్ల నుంచి 2024 డిసెంబర్ చివరి నాటికి 108 మిలియన్లకు చేరుకుంది. అన్ సెక్యూర్డ్ లోన్ల విభాగంలో సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత వివాహ సీజన్, రాబోయే వేసవి సెలవులను అందిపుచ్చుకోవడానికి బ్యాంకులు వ్యూహాత్మకంగా కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నారు. -
లోన్ల మంజూరులో జాగ్రత్త.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
చట్టపరమైన వివాదాలను నివారించడంలో, ఆస్తి లావాదేవీలు సజావుగా జరిగేలా చూడడంలో అసలైన యజమానులు ఎవరో తెలిపే సమగ్ర టైటిట్ సెర్చ్ రిపోర్ట్‌ల ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టులను సిద్ధం చేయడానికి ప్రామాణికమైన, ఆచరణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇతర వాటాదారులు అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. తప్పుడు టైటిల్ సెర్చ్ రిపోర్టు ఆధారంగా రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు అధికారిపై ఎలాంటి చర్యలు ఉండాలన్నది కూడా ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చాలని కోర్టు పేర్కొంది.బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలి"అస్పష్ట టైటిల్ క్లియరెన్స్ రిపోర్ట్‌ల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఇది ప్రజా ధన రక్షణకు, పెద్ద ప్రజా ప్రయోజనానికి సంబంధించినది. అందువల్ల, రుణాలను మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టును సిద్ధం చేయడానికి, ఆమోదించే అధికారి బాధ్యతను (క్రిమినల్ చర్యతో సహా) నిర్ణయించే ఉద్దేశంతో ఒక ప్రామాణిక, ఆచరణాత్మక విధానాన్ని అభివృద్ధి చేయడంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇతర వాటాదారులు సహకరించడం చాలా అవసరం. అంతే కాకుండా టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌లకు సంబంధించిన ఫీజులు, ఖర్చుల కోసం ప్రామాణిక మార్గదర్శకాలు ఉండాలి” అని కోర్టు పేర్కొంది.వివాదాస్పద తనఖా ఆస్తిపై ఆధారపడి బ్యాంకు మంజూరు చేసిన రుణం, టైటిల్ వివాదాలు ఉన్నట్లు గుర్తించిన సందర్భంలో, అటువంటి ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. యాజమాన్యాన్ని ధ్రువీకరించడం, ప్రతికూల క్లెయిమ్‌లు లేవని నిర్ధారించడం, ఆస్తికి సంబంధించిన స్పష్టమైన చట్టపరమైన స్థితిని నిర్ధారించడం ద్వారా బలమైన టైటిల్ సెర్చ్ మోసపూరిత లావాదేవీలను నిరోధించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌ను నియంత్రించే స్టాండర్డ్ మెకానిజం అంటూ ఏదీ ఇప్పటి వరకు ఆర్బీఐ అభివృద్ధి చేయలేదు. ఎంప్యానెల్ చేసిన న్యాయవాదులు తయారుచేసిన టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌పై బ్యాంకులు ఆధారపడుతున్నాయి. టైటిల్ సెర్చ్ రిపోర్ట్ తయారీకి ఎటువంటి ప్రామాణీకరణ లేదు. -
ఆర్బీఐ కొత్త రూల్: ఎంతో మేలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. బ్యాంక్ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించడానికి కావలసిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలో పెద్ద సంఖ్యలో డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేదని వెల్లడించింది. తప్పనిసరిగా ఖాతాదారులకు నామినీలు ఉండాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.మరణించిన డిపాజిటర్ల ఖాతాలో డబ్బు ఉన్నట్లయితే.. దానిని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని నివారించడానికి ఆర్బీఐ ఈ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు లేదా కొత్త ఖాతాదారులందరికీ.. ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, సేవింగ్స్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లు వంటివి ఉన్నట్లయితే వారందరికీ నామినీలు ఉండేలా చూడాల్సిందిగా ఆర్బీఐ చెప్పింది.అర్హత కలిగిన వ్యక్తి నామినీ అయితే.. మరణించిన వ్యక్తి పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేఫ్ డిపాజిట్ లాకర్ల నుంచి నిధులను ఎటువంటి సమస్య లేకుండానే బదిలీ చేయవచ్చు.ఖాతాదారులు.. నామినీలను కలిగి ఉన్నారా లేదా అనే విషయాలను గురించి బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకు ఓ సారి.. దీనికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాలని ఆర్బీఐ ఆదేశించింది. డిపాజిట్ అకౌంట్లకు సంబంధించిన దరఖాస్తు పత్రాలలో కూడా.. నామినీ పేరును తెలియజేసేలా, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.నామినీ ఎవరు?ఖాతాదారుడు మరణిస్తే.. తమ నిధులను ఎవరికి బదిలీ చేయాలనుకుంటున్నాడో అతడే.. నామినీ. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో నామినీ పేరును చేర్చవచ్చు లేదా అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత అయినా నామినీ పేరును యాడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!
చేతిలో డబ్బు ఉంటే.. కొందరు గోల్డ్ కొనుగోలు చేస్తారు. మరి కొందరు రియల్ ఎస్టేట్ మీద పెడతారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఇలా ఎన్నెన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా.. చాలా మంది చూపు మాత్రం 'ఫిక్స్డ్ డిపాజిట్' (FD) వైపు వెళ్తుంది.రిస్క్ లేకుండా వడ్డీ పొందాలంటే.. ఫిక్స్డ్ డిపాజిట్ ఉత్తమమైన మార్గం. వడ్డీ అనేది బ్యాంకులు రెండు విధాలుగా అందిస్తాయి. ఇందులో ఒకటి రెగ్యులర్, మరొకటి సీనియర్ సిటిజన్. రెగ్యులర్ కింద అందరికీ ఒకేరకమైన వడ్డీ లభిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్లకు కొంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది.ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. చాలా బ్యాంకులు కొంతవరకు దాదాపు ఒకే విధమైన వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ.. 40 - 50 బేసిస్ పాయింట్ల స్వల్ప వ్యత్యాసం కూడా మీ డబ్బును పెంచడంలో సహాయపడుతుంది. మీ డబ్బును పెంచుకోవడానికి లేదా ఎక్కువ వడ్డీ పొందటానికి ఎన్ని సంవత్సలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామన్నది సహాయపడుతుంది.ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లు అందించే వడ్డీ రేట్లు➤హెచ్డీఎఫ్సీ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤ఐసీఐసీఐ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤యాక్సిస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం➤యెస్ బ్యాంక్: సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం➤పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం (ఈ వడ్డీ రేట్లు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి).➤బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): సాధారణ పౌరులకు లేదా రెగ్యులర్ వడ్డీ రేటు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం (ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 14, 2024 నుంచి అమల్లో ఉన్నాయి).ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్బ్యాంకులలో ఫిక్స్డ్ చేయాలనుకునే ఎవరైనా.. ముందుగా మీరు ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో, అక్కడ (బ్యాంకులో) వడ్డీ ఎంత ఇస్తున్నారనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ బ్యాంక్ ఇచ్చే వడ్డీని.. ఇతర బ్యాంకులతో కంపార్ చేసుకోవాలి. ఆ తరువాత మీకు నచ్చిన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసివచ్చు. -
బ్యాంకుల్లో 2 లక్షల ఉద్యోగాలకు ముప్పు..
విస్తృతంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత బ్యాంకింగ్ రంగంలో (banks) లక్షలాది ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) నివేదికల ప్రకారం.. ప్రస్తుతం మానవ కార్మికులు నిర్వహిస్తున్న పనులను కృత్రిమ మేధస్సు (AI) ఆక్రమించడంతో అంతర్జాతీయ బ్యాంకులు రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలను తొలగించనున్నాయి.ఆయా బ్యాంకుల చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులను బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ సర్వే చేసిన తాజాగా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక్కో బ్యాంకు సగటున తమ వర్క్‌ఫోర్స్‌లో నికరంగా 3% మందిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. క్లయింట్ ఫంక్షన్లను కూడా బాట్లు(ఏఐ) నిర్వహించడం వల్ల కస్టమర్ సేవల్లో మార్పులు రానున్నాయి. ఇక కేవైసీ విధులను నిర్వర్తించే పాత్రలకు ముప్పు తప్పదు.ఎక్కువ మంది ఇదే చెప్పారు..మొత్తం 93 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది మొత్తం హెడ్‌కౌంట్‌లో 5% నుంచి 10% క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ చేసిన ఈ సర్వేలో సిటీ గ్రూప్ (Citigroup), జీపీ మోర్గాన్ చేజ్ & కో (JPMorgan Chase & Co), గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ (Goldman Sachs) వంటి దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలపై ప్రభావం పడినా బ్యాంకులకు మాత్రం మెరుగైన ఆదాయాలను అందించనున్నాయి. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను పెంచడం వల్ల 2027లో బ్యాంకులు 12% నుండి 17% ప్రీ-టాక్స్ లాభాలను చూడగలవు. ప్రతి పది మందిలో ఎనిమిది మంది జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను, ఆదాయ సృష్టిని రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో కనీసం 5% పెంచుతుందని భావిస్తున్నారు.ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిర్వహణను వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి తమ ఐటీ వ్యవస్థలను ఆధునీకరణ కోసం సంవత్సరాలు గడిపిన బ్యాంకులు.. ఉత్పాదకతను మరింత మెరుగుపరచగల కొత్త తరం ఏఐ సాధనాల్లోకి ప్రవేశించాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇతర రంగాల కంటే బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఎక్కువ ఉద్యోగాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిటీ గ్రూప్ గత జూన్‌లోనే ఒక నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్‌లో దాదాపు 54% ఉద్యోగాలు ఆటోమేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సిటీ పేర్కొంది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు కస్టమర్లకు త్వరితగతిన సేవలు అందించాలని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు అందించాల్సిన సేవలలో ఏ మాత్రం ఆలస్యం జరిగిన జరిమానా తప్పదని వెల్లడించింది.బ్యాంకులు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కస్టమర్లకు అందించే సేవలలో ఎక్కువ ఆలస్యం చేస్తున్నాయని ఆర్బీఐ ఫిర్యాదులు అందుకుంది. దీంతో కొత్త ఆదేశాలను జారీ చేస్తూ.. నెల రోజులు లేదా 30 రోజుల లోపల వినియోగదారుల సమస్యలు పరిష్కారం కాకపోతే, రోజుకు 100 రూపాయలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఈ డబ్బు వినియోగదారునికే పరిహారం రూపంలో అందించడం జరుగుతుంది.వినియోగదారుల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ పొందినట్లయితే.. దానిని వారికి ఈమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ రూపంలో తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఖాతాదారుడు డిఫాల్ట్‌గా లోన్ చెల్లించకుండా ఉంటే ఆ విషయాన్ని కూడా బ్యాంకులు తెలియజేయాలి. ఈ విషయాన్ని 21 రోజులలోపు తెలియజేయకపోతే.. వినియోగదారునికి రోజుకి 100 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఆర్ధిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.ప్రస్తుతం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే అధికారం పొందిన నాలుగు సీఐసీలు ఉన్నాయి. అవి సిబిల్, సీఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్. ఇవి కూడా వినియోగదారుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలి లేదా ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్ కస్టమర్‌కు తెలియజేయాలి. ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లయితే.. దానికి కారణం కూడా చెప్పాలని ఆర్బీఐ ఆదేశించింది.ఆర్బీఐ నిర్ణయం వెనుక ఉద్దేశ్యంవినియోగదారులు లేదా ఖాతాదారులు ఏదైనా సమస్యను పరిష్కరించాలనుకుంటే.. రోజుల తరబడి బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల చుట్టూ పదే పదే తిరగాల్సి ఉండేది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించాలని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఏటీఎంల గురించి ఆర్బీఐనగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయిందని ఆర్బీఐ స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి. సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి. -
బ్యాంకుల లాభాలకు గండి!
మొండిబకాయిల ప్రభావం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26) బ్యాంకింగ్ (Banks)లాభదాయకతపై ప్రభావం చూపుతుందని దేశీయ రేటింగ్ సంస్థ– ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ లాభదాయకత 2024–25లో ‘‘పీక్’’ స్థాయిలో ఉండగా, 2025–26లో ఇది దిగివచ్చే అవకాశాలు అధికమని వివరించింది. రిటైల్ రంగం నుంచి ప్రధానంగా మొండి బకాయిల సవాళ్లు తలెత్తే వీలుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ అండ్ డైరెక్టర్ కరణ్ గుప్తా నివేదికలో వెల్లడించారు. నివేదికలోని ముఖ్యాంశాలు... » మొండి బకాయిలు నియంత్రణ స్థాయిలోనే ఉంటాయి. రూ.50,000 కంటే తక్కువ రిటైల్ సురక్షిత రుణాలు బ్యాంకుల రుణాల మొత్తంలో 0.4 శాతంగా ఉన్నాయి. 11 శాతానికి పైగా వడ్డీ రేటు కలిగిన రుణాలు మొత్తం రుణాల్లో 3.6 శాతంగా ఉన్నాయి. » 2024–25లో రుణ వృద్ధి మందగించింది. 2023–24తో పోల్చితే ఈ రేటు 15 శాతం నుండి 13–13.5 శాతానికి తగ్గే వీలుంది. » బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2025–26లో 0.10 శాతం తగ్గిపోతుంది. డిపాజిట్ వడ్డీ రేటు పెంపు, కొత్త అకౌంటింగ్ విధానాలు దీనికి కారణంగా ఉంటాయి. » 2025–25లో రుణ–డిపాజిట్ వృద్ధి మధ్య వ్యత్యాసం తగ్గుముఖం పడుతుంది. అయితే ప్రాజెక్ట్ ఫైనాన్స్ కొత్త నిబంధనలు, లిక్విడిటీ కవరేజ్ రేషియో, క్రెడిట్ నష్టాల అంచనా విధానం వంటి అంశాలు బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను సృష్టిస్తాయి. » 2024–25లో మైక్రోఫైనాన్స్ ఆస్తుల వృద్ధి 5 శాతంగా ఉంటుంది. 2024–25లో ఇది 12 శాతానికి పెరుగుతుంది. గ్రామీణ ఎకానమీ బలోపేతం మైక్రోఫైనాన్స్ రంగానికి లాభదాయకంగా ఉండొచ్చు. శక్తికాంతదాస్ విధానాలు భేష్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆర్బీఐ తీసుకున్న సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలంగా మార్చాయని నివేదిక పేర్కొనడం గమనార్హం. అయితే కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఈ నిబంధనల్లో పూర్తిగా కాకున్నా, కొంతమేర సరళతరం అయ్యే అవకాశం ఉందని అంచనావేసింది.వ్యక్తిగత రుణాలు, సురక్షిత వ్యాపార రుణాలు, మైక్రోఫైనాన్స్ రంగంపై అవుట్‌లుక్ ‘స్థిరత్వం’ నుండి ‘దుర్వినియోగ పరిస్థితి‘ గా మారుతోందని నివేదిక పేర్కొంది. బ్యాంకులు, నాన్–బ్యాంకు ఫైనాన్స్ కంపెనీలు అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఇండ్రా రేటింగ్ తన అవుట్‌లుక్‌ను కొనసాగించింది. అయితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున కొన్ని అసెట్ సెగ్మెంట్లపై అవుట్‌లుక్‌ను సవరించింది. -
బ్యాంక్‌నెట్ పోర్టల్ ప్రారంభం
న్యూఢిల్లీ: బ్యాంక్‌లు స్వా«దీనం చేసుకున్న అన్ని రకాల ఆస్తులను ఇక మీదట బ్యాంక్‌నెట్ పోర్టల్ పైనే వేలానికి పెట్టనున్నారు. ఇందుకు వీలుగా నవీకరించిన బ్యాంక్‌నెట్ (బీఏఏఎన్కేఎన్ఈటీ) పోర్టల్‌ను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు ప్రారంభించారు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) చేపట్టే ఆస్తుల వేలం సమాచారం ఈ పోర్టల్‌పై ఉంటుందని.. కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు భిన్న రకాల ఆస్తులను గుర్తించొచ్చని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఫ్లాట్లు, ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య ప్రాపరీ్టలు, ఇండ్రస్టియల్ ల్యాండ్, బిల్డింగ్లు, షాప్‌లు, వాహనాలు, ప్లాంట్, మెషినరీ, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వేలం సమాచారం పోర్టల్‌పై అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ వివరాలన్నీ ఒకే చోట లభించడంతో, విలువైన ఆస్తులను గుర్తించి, వేలంలో పాల్గొనడానికి వీలుంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు రుణాలను వసూలు చేసుకోవడంలో ఈ ప్లాట్‌ఫామ్ గణనీయంగా సాయపడుతుందని నాగరాజు తెలిపారు. కొత్త పోర్టల్‌లోకి ఇప్పటికే 1,22,500 ప్రాపరీ్టలను లిస్ట్ చేసినట్టు చెప్పారు. -
ఎన్పీఏ కేసులు.. ఆర్థిక శాఖ కీలక సూచనలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), జాతీయ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) వద్ద ఎన్పీఏ కేసుల సత్వర పరిష్కారానికి వీలుగా బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచనలు చేసింది. విధానపరమైన జాప్యం, కేసుల విచారణలో వాయిదాలను సాధ్యమైన మేర తగ్గించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఆయా కేసుల పురోగతిని పర్యవేక్షించాలని కోరింది.వసూలు కాని నిరర్థక రుణ ఖాతాలను ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించడం లేదంటే దివాలా పరిష్కార చర్యలు కోరుతూ ఎన్సీఎల్టీ ముందుకు బ్యాంక్‌లు తీసుకెళ్లడం తెలిసిందే. ఎన్సీఎల్టీలో కేసుల తాజా సమాచారాన్ని బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కార్పొరేట్ శాఖ ఒక పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఎన్ఏఆర్సీఎల్, ఎన్సీఎల్టీలో కేసుల పరిష్కార యంత్రాంగం సమర్థతను పెంచడం, నిర్వహణ సవాళ్ల పరిష్కారం కోసం కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అధ్యక్షతన తాజాగా సమావేశం జరిగింది.కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే విషయమై ఇందులో చర్చించినట్టు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. రూ.95,711 కోట్ల విలువతో కూడిన 22 మొండి ఖాలాలను ఎన్ఏఆర్సీఎల్ సొంతం చేసుకోగా, రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే మరో 28 ఎన్పీఏ ఖాతాలను బ్యాంక్‌లు పరిష్కరించుకున్నట్టు సమావేశంలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. -
బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐ
బీమా పాలసీలను విక్రయించేందుకు ఏదో ఒక సంస్థ మీదో లేదా బ్యాంకులపైనో అధికంగా ఆధారపడకూదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) బీమా కంపెనీలకు సూచించింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతకాలని తెలిపింది. పాలసీలను విక్రయించేందుకు ఇతర అనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది.బీమా కంపెనీలు వాటి మాతృ సంస్థలుగా ఉన్న బ్యాంకుల ద్వారానే దాదాపు 90 శాతం పాలసీలను విక్రయిస్తున్నాయని బీమా నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ఐఆర్డీఏఐ మార్కెట్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సమీప భవిష్యత్తులో పాలసీల విక్రయానికి సంబంధించి కొత్త నిబంధనలతో ముసాయిదాను తీసుకురావాలని ఐఆర్డీఏఐ యోచిస్తోంది. ఇప్పటివరకు అధికంగా బ్యాంకుల ద్వారానే పాలసీలు విక్రయిస్తున్నందున ఒక్కసారిగా ఈ విధానంలో మార్పు రాదని, అందుకు కొంత సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు. పాలసీల విక్రయానికి సంబంధించి ఐఆర్డీఏఐ నిబంధనలు తీసుకురాబోతున్న నేపథ్యంలో కంపెనీలు ఇతర పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు ఇప్పటికే బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా గతంలో స్పష్టం చేశారు. బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలన్నారు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకులు కీలకపాత్రే పోషిస్తున్నప్పటికీ, బలవంతంగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నట్లు చెప్పారు. -
ATM Withdrawal Limit: ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చు..?
ప్రస్తుతం అంతటా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా యూపీఐ వచ్చాక భౌతికంగా నగదు చలామణి చాలామటుకు తగ్గిపోయింది. ఎంత డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నా కొన్ని సందర్భాలలో చేతిలో నగదు అవసరం ఉంటుంది. దీని కోసం ఖాతాదారులు ఏటీఎం సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి రోజుకు ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రధాన బ్యాంకుల్లో ఏ బ్యాంక్ ఏటీఎం విత్‌డ్రా లిమిట్ ఎంతన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..ఎస్బీఐమీరు మ్యాస్ట్రో డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ డెబిట్ కార్డ్ కలిగి ఉంటే, గరిష్టంగా రోజుకు రూ.40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ ఖాతా ‘ఇన్టచ్’ లేదా ’ఎస్బీఐ గో’కి లింక్ అయిఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 40,000. అదే ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్‌తో రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ ఖాతాకు ఇంటర్నేషనల్, వుమన్ అడ్వాంటేజ్ లేదా ఎన్ఆర్ఓ డెబిట్ కార్డ్‌లను లింక్ చేసినట్లయితే, రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిజినెస్, టైటానియం లేదా గోల్డ్ డెబిట్ కార్డ్‌లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. టైటానియం రాయల్ డెబిట్ కార్డ్‌కు రూ. 75,000. ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డ్‌లకు రూ. 1,00,000. అదే జెట్ప్రివిలేజ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరల్డ్ డెబిట్ కార్డ్‌తో అయితే రోజుకు రూ. 3,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్కెనరా బ్యాంక్ క్లాసిక్ రూపే, వీసా లేదా స్టాండర్డ్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు గరిష్టంగా రూ.75,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం లేదా మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్‌తో 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.ఐసీఐసీఐఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు విత్‌డ్రా పరిమితి రోజుకు రూ. 1,50,000. ఐసీఐసీఐ ఎక్స్ప్రెషన్, ప్లాటినం లేదా టైటానియం డెబిట్ కార్డ్‌లకు డైలీ లిమిట్ రూ. 1,00,000. ఇక ఐసీఐసీఐ స్మార్ట్ షాపర్ సిల్వర్ డెబిట్ కార్డులకు అయితే రూ. 50,000. అదే ఐసీఐసీఐ బ్యాంక్ సాఫిరో డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు గరిష్టంగా రూ. 2,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.యాక్సిస్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్ రూపే ప్లాటినం లేదా పవర్ సెల్యూట్ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. లిబర్టీ, ఆన్లైన్ రివార్డ్స్, రివార్డ్స్ ప్లస్, సెక్యూర్ ప్లస్, టైటానియం రివార్డ్స్, టైటానియం ప్రైమ్ డెబిట్ కార్డ్‌ల ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. అలాగే ప్రెస్టీజ్, డిలైట్ లేదా వాల్యూ ప్లస్ డెబిట్ కార్డ్‌లకు లిమిట్ రూ. 1,00,000. యాక్సిస్ బ్యాంక్ బుర్గుండి డెబిట్ కార్డ్ ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 3,00,000.బ్యాంక్ ఆఫ్ బరోడావరల్డ్ అగ్నివీర్, రూపే క్యూస్పార్క్ ఎన్‌సిఎంసి, రూపే ప్లాటినం డిఐ, మాస్టర్ కార్డ్ డిఐ ప్లాటినం లేదా బిపిసిఎల్ డెబిట్ కార్డ్ ఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే క్లాసిక్ డీఐ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డీఐ డెబిట్ కార్డ్ నుండి రోజుకు రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే సెలెక్ట్ డిఐ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 ఉపసంహరించుకోవచ్చు.ఇండియన్ బ్యాంక్సీనియర్ సిటిజన్లు, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు రోజుకు రూ. 25,000 విత్‌డ్రా పరిమితి ఉంది. రూపే ప్లాటినం, రూపే డెబిట్ సెలెక్ట్, మాస్టర్ కార్డ్ వరల్డ్ లేదా మాస్టర్ కార్డ్ వరల్డ్ ప్లాటినం కార్డులతో రోజుకు రూ. 50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఐబీ డిజీ రూపే క్లాసిక్, కలైంజర్ మగలిర్ ఉరిమై తిట్టం (KMUT) పథకం, రూపే కిసాన్ లేదా ముద్రా డెబిట్ కార్డ్‌లు ఉన్నవారు రోజుకు రూ. 10,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక రూపే ఇంటర్నేషనల్ ప్లాటినం డెబిట్ కార్డ్ తో రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.యూనియన్ బ్యాంక్మీ ఖాతాకు లింక్ అయిన క్లాసిక్ వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్ లతో రోజుకు రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్‌లకు పరిమితి రూ. 75,000. అదే బిజినెస్ ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ ద్వారా రూ. 1,00,000 ఉపసంహరించుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 1,00,000, యూనియన్ బ్యాంక్ సిగ్నేచర్ వీసా, మాస్టర్ కార్డ్ లతో రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్రూపే ఎన్సీఎంసీ క్లాసిక్, వీసా క్లాసిక్ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డెబిట్ కార్డ్‌తో రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే ఎన్‌సిఎంసి ప్లాటినం డొమెస్టిక్, రూపే ఎన్‌సిఎంసి ప్లాటినం ఇంటర్నేషనల్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే బిజినెస్ ప్లాటినం ఎన్‌సిఎంసి, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్‌ల విత్‌డ్రా పరిమితి రూ. 1,00,000. అలాగే రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు రూ. 1,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ కార్డ్ టైటానియం, రూపే సంగిని, రూపే పీఎంజేడీవై, రూపే ముద్ర, రూపే కిసాన్, రూపే పంజాబ్ అర్థవ్యస్థ, వీసా క్లాసిక్, ఎన్సీఎంసీ, మాస్టర్ బింగో లేదా వీసా బింగో డెబిట్ కార్డ్‌ల ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 15,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.రూపే ప్లాటినం, వీసా పేవేవ్ (ప్లాటినం), మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్‌లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ లిమిట్ రూ. 50,000. వీసా బిజినెస్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు రూ. 1,00,000 వరకు డబ్బు తీసుకోవచ్చు.కోటక్ బ్యాంక్ కోటక్ జూనియర్ డెబిట్ కార్డ్‌తో రోజుకు రూ. 5,000, రూపే డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ వన్ డెబిట్ కార్డులతో రూ. 10,000, 811 డ్రీమ్ డిఫరెంట్, ఈజీ పే డెబిట్ కార్డ్‌లతో రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. సిల్క్ ప్లాటినం, రూపే ఇండియా లేదా పెషోప్మోర్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 40,000, జిఫ్ఫీ ప్లాటినం ఎడ్జ్, ప్రో, బిజినెస్ క్లాస్ గోల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఎలైట్ కార్డుల రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000 ఉంది.ఇక యాక్సెస్ ఇండియా డెబిట్ కార్డ్ ఉపసంహరణ పరిమితి రూ. 75,000 కాగా పీవీఆర్, సిగ్నేచర్ ప్రో, నేషన్ బిల్డర్స్, గోల్డ్, జిఫ్ఫీ ప్లాటినం ఏస్, ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఏస్ డెబిట్ కార్డ్‌లు రోజువారీ విత్‌డ్రాయల్ లిమిట్ రూ. 1,00,000. అదే ప్రివీ లీగ్ ప్లాటినమ్, వరల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినమ్ ఏస్, ఆస్ట్రా డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రివీ లీగ్ నియాన్, ప్రివీ లీగ్ ప్లాటినమ్, ప్రివీ లీగ్ సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌లకు రూ. 2,00,000, ప్రివీ లీగ్ బ్లాక్, ఇన్ఫినిట్ డెబిట్ కార్డ్‌లకు రూ. 2,50,000 రోజువారీ ఉపసంహరణ పరిమితి ఉంది. -
బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలు
బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసులను మరింత సమర్థంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థల మధ్య సాధారణ చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రత్యేక వేదిక ఏర్పాటు..?బ్యాంకు మోసాలపై సీబీఐలో చాలా కేసులు నమోదవుతున్నాయి. వాటి దర్యాప్తులో అవసరమయ్యే కీలక సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి సమాచారం అందించేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటాయి. అయితే ఎలాంటి కేసుల్లో ఎలాంటి సమాచారం అందించాలనే విషయంపై స్పష్టత వచ్చేందుకు సీబీఐ, బ్యాంకర్లు పరస్పరం చర్చించాల్సి ఉంది. అందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా..కేసులకు సంబంధించి సీబీఐ చేసిన అభ్యర్థనలను బ్యాంకర్లు పరిశీలించనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంపై భవిష్యత్తులో కస్టమర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సీబీఐ నుంచి బ్యాంకర్లకు రక్షణ ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. సీబీఐ, బ్యాంకర్ల మధ్య పరస్పరం సహకారం వల్ల ఫిర్యాదుల దాఖలుకు సంబంధించిన కార్యాచరణ అంశాలు, దర్యాప్తును క్రమం తప్పకుండా సమీక్షించడం, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సులువవడం వల్ల త్వరగా కేసులు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!అనుమతుల్లేక కేసులు పెండింగ్2018లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aలో చేసిన సవరణ ప్రకారం.. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆమోదించిన తర్వాతే బ్యాంకు మోసాలపై దర్యాప్తు ఏజెన్సీ ఉద్యోగులను విచారించే అధికారం ఉంటుంది. పీఎస్‌యూ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఇన్వెస్ట్‌గేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వారి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజా సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు కొందరు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు బ్యాంకు యాజమాన్యాలు తమ ఉద్యోగులపై విచారణకు అనుమతి ఇవ్వనందున వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫిర్యాదు చేశాయి. -
అదానీ అప్పులపై బ్యాంకులు సమీక్ష
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల కేసు నమోదైనందున ఇకపై రుణదాతల ధోరని మారుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూప్‌నకు భారీగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది. అయితే ఎస్బీఐతోపాలు వివిధ బ్యాంకులు అదానీ గ్రూప్‌నకు గతంలో జారీ చేసిన రుణాలు, తాజాగా విడుదల చేసిన అప్పులకు సంబంధించి సమీక్ష ప్రారంభించించాయి. ఎస్బీఐ తర్వాత అదానీ గ్రూప్‌నకు అధిక మొత్తంలో లోన్లు ఇచ్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు అప్పుల వివరాలను సమీక్షిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.పాత అప్పులపై మార్పులు ఉండకపోవచ్చు..ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వివరాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదానీ గ్రూప్‌నకు సుమారు రూ.33,500 కోట్ల అప్పు ఇచ్చింది. ఈ అప్పుతో ప్రారంభించిన పలు ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ దశలో అప్పులపై రివ్యూ చేసి వాటిని నిలిపివేసే అవకాశాలు ఎస్బీఐకు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ తాజాగా బ్యాంకులు అందించిన అప్పులపై మాత్రం కొంత మార్పులు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.కేరళ-అదానీ పోర్ట్స్ ఒప్పందంఅదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలు చెలరేగుతున్న తరుణంలో కేరళ ప్రభుత్వం అదానీ పోర్స్ట్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలోని విజింజామ్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి కోసం అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 వరకు దీని పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!అదానీకి బాసటగా..మరోవైపు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు కొందరు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) 500 మిలియన్ డాలర్లు(రూ.4151 కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు(రూ.83,020 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. -
తగ్గిన ఆర్థిక మోసాలు
సాక్షి, అమరావతి: గత రెండు సంవత్సరాలుగా దేశంలో వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు తగ్గాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే... 2022–23, 2023–24 ఆరి్థక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ఆర్థిక మోసాలు బాగా తగ్గడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. 2021–22లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో రూ.9,289 కోట్ల విలువైన ఆర్థిక మోసాలు జరిగాయని తెలిపారు. 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.3,607 కోట్ల విలువైన మోసాలు, 2023–24 ఆరి్థక సంవత్సరంలో రూ.2,175 కోట్ల విలువైన మోసాలు జరిగాయని పంకజ్ చౌదరి వివరించారు. మోసగాళ్లను అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవడంతో మోసాల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు.‘2021–22లో అత్యధికంగా పశి్చమ బెంగాల్లో 537 కేసుల్లో రూ.3,391 కోట్ల మోసం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 715 కేసుల్లో రూ.2,630 కోట్లు, మహారాష్ట్రలో 2,233 కేసుల్లో రూ.1,257 కోట్లు, 2022–23లో అత్యధికంగా ఢిల్లీలో 1,743 కేసుల్లో రూ.762 కోట్లు, 2023–24లో తమిళనాడులో అత్యధికంగా 6,468 కేసుల్లో రూ.663 కోట్ల మేర మోసం జరిగింది.’ అని ఆయన తెలిపారు. వాణిజ్య బ్యాంకులు, ఆరి్థక సంస్థల్లో మోసాలను నివారించేందుకు ఆర్బీఐ రిస్క్ మేనేజ్మెంట్పై ఇటీవల తగిన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. బ్యాంకుల్లో డెడికేటెడ్ డేటా అనలిటిక్స్ మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటును తప్పనిసరి చేసినట్లు తెలిపారు. మూడేళ్లలో యూపీఐ చెల్లింపుల్లో రూ.2,145 కోట్ల మోసం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 26.99 లక్షల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల్లో రూ.2,145 కోట్ల మేర మోసం జరిగినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. లావాదేవీలు, చెల్లింపుల మోసాన్ని నివేదించే సాధనంగా ఆర్బీఐ మార్చి 2022 నుంచి వెబ్ అధారిత సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని అమలు చేస్తోందని చెప్పారు. అన్ని సంస్థలు చెల్లింపుల మోసాలను వెబ్ అధారిత సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీకి నివేదించాల్సి ఉంటుందన్నారు. లావాదేవీల మోసాలతోపాటు చెల్లింపు సంబంధిత మోసాలను నిరోధించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఏఐ అండ్ ఎంఎల్‌ను వినియోగించడం ద్వారా మోసపూరిత లావాదేవీలను బ్యాంకులు తిరస్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఆన్‌లైన ఫైనాన్స్ భద్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. -
భారీగా తగ్గనున్న ఏటీఎంలు: కారణం ఇదే..
నగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదికల ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి.సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి.భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నగదు ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. 2022 ఆర్ధిక సంవత్సరంలో 89 శాతం లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇది జీడీపీలో 12 శాతం. ఉచిత ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ నిబంధనలు, ఇంటర్ ఆపరేబిలిటీ, ఇంటర్‌ఛేంజ్ ఫీజులు వంటి అంశాలు ఏటీఎం పెట్టుబడులను నిరుత్సాహపరిచాయి. దీనితో పాటు ఏటీఎంలను వినియోగించేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది.బ్యాంకులు తమ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నందున.. భారతదేశం ఒక్కో శాఖకు రెండు ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ఒకటి ఆన్-సైట్, మరొకటి ఆఫ్-సైట్ మోడల్ ఉంటుందని సమాచారం. -
తస్మాత్ జాగ్రత్త!
ముంబై: అక్రమ లావాదేవీలపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)సహా తన నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలూ ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించింది. ఈ సమస్య అరికట్టడానికి సంబంధిత అంతర్గత, బాహ్య వనరుల నుండి పొందిన సమాచారాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ‘మనీ లాండరింగ్/టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఇంటర్నల్ రిస్క్ అసెస్మెంట్ గైడెన్స్’ను జారీ చేసింది. అక్రమ ధనార్జన, తీవ్రవాదులకు ఫైనాన్షింగ్ వంటి అంశాలు వ్యవస్థలపై త్రీవ ప్రభావం చూపుతాయని, బ్యాంక్ సాధరణ ఖాతాదారులకు, దేశాలకు, భౌగోళిక ప్రాంతాలకు, ఉత్పత్తులకు, సేవలకు, లావాదేవీలకు అలాగే డెలివరీ చానెళ్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగజేస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర నిఘా, కాలానుగుణమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు మారుతున్న వ్యాపార పరిస్థితులు, బ్యాంకులు– తదితర నియంత్రిత సంస్థలు అందించే బ్యాంకింగ్, ఇతర ఆరి్థక ఉత్పత్తులలో పెరుగుతున్న సంక్లిష్టత స్థాయిలు, పోటీ పరిస్థితుల నేపథ్యంలో మనీలాండరింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్ వంటి సవాళ్లు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతికత వినియోగం, చెల్లింపుల విధానాల్లో కొత్త పద్ధతులు వంటి అంశాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొంది. -
బ్యాంకులకు డిపాజిట్ల కష్టాలు
న్యూఢిల్లీ: గడిచిన రెండు సంవత్సరాల్లో పెరిగిన రుణ డిమాండ్ స్థాయిలో డిపాజిట్ల సమీకరణకు బ్యాంక్‌లు సమస్యలు ఎదుర్కొన్నట్టు ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు 2023–24లో జారీ చేసిన రుణాలు రూ.1,64,98,006కోట్లుగా ఉన్నాయి. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో (సీడీ రేషియో) ఈ కాలంలో 75.8 శాతం నుంచి 80.3 శాతానికి పెరిగింది. త్రైమాసికం వారీగా చూసిన కానీ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు ఇన్ఫోమెరిక్స్ నివేదిక తెలిపింది.2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలోనూ డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాలు, అసంఘటిత రంగంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదు ఎక్కువగా ఉండడం డిపాజిట్ల సమీకరణపై ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య 2018–19 నాటికి 22.6 శాతంగా ఉంటే, 2025 జూలై నాటికి 39.9 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. యువ ఇన్వెస్టర్లలో ఈక్విటీ మార్కెట్ల పట్ల పెరిగిన ఆసక్తిని ఈ ధోరణి తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో 30–39 వయసులోని ఇన్వెస్టర్ల బేస్ (సంఖ్య) స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. సంయుక్త కృషి అవసరం: డిపాజిట్ల నిష్పత్తి పెరగాలంటే బ్యాంక్‌లు, ప్రభుత్వం ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ట్రూనార్త్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో రోచక్ బక్షి అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజల నుంచి చిన్న మొత్తాల్లో డిపాజిట్లు సమీకరించే వెనుకటి ధోరణి నుంచి బయటకు రావాలని.. పెద్ద మొత్తంలో కార్పొరేట్ డిపాజిట్లను ఆకర్షించడంపై దృష్టి సారించాలని సూచించారు.బ్యాంక్ టర్మ్ డిపాజిట్లలో 47 శాతం 60 ఏళ్లు నిండిన వృద్ధులవే ఉన్నట్టు, యువతరం బ్యాంక్ డిపాజిట్ల వట్ల ఆసక్తి చూపించడం లేదన్న దానికి నిదర్శనమని చెప్పారు. కనీసం ఆదాయపన్ను అధిక శ్లాబులోని వారికి అయినా బ్యాంక్ డిపాజిట్ల వడ్డీపై పన్ను భారాన్ని తగ్గించాలని భక్షి సూచించారు. ఏటా వడ్డీపై టీడీఎస్ మినహాయించడం కాకుండా, డిపాజిట్ కాల వ్యవధి ముగిసిన సమయంలోనే పన్నును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
టెక్ హైరింగ్‌లో బ్యాం‘కింగ్’!
ఆన్లైన్ మోసగాళ్లు.. డేటా హ్యాకర్ల రిస్కును మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని ఒకపక్క ఆర్బీఐ పదేపదే హెచ్చరికలు. మరోపక్క తీవ్ర పోటీ నేపథ్యంలో సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయాలతో పాటు టెక్ సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసులు– ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో కూడా మరిన్ని ఐటీ కొలువులు సృష్టించనుంది. దేశ ఐటీ రంగంలో హైరింగ్ ఇంకా మందకొడిగానే ఉన్నప్పటికీ... దీనికి భిన్నంగా బ్యాంకులు మాత్రం రారమ్మంటూ టెకీలకు స్వాగతం పలుకుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బీఎఫ్ఎస్ఐ రంగంలో టెక్నాలజీ నిపుణులకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ సంస్థలు తమ ఐటీ వ్యయాలను 12% పెంచుకోనున్నట్లు అంచనా. ఎనలిటిక్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత సొల్యూషన్లతో పాటు ఆటోమేషన్ టెక్నాలజీలపై ఆయా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరింగ్ కూడా జోరందుకుందని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకమైన విభాగాల్లో హైరింగ్ డిమాండ్ ఉంది. క్లౌడ్‌కు మారుతున్న సంస్థలు అత్యవసరంగా టెక్నాలజీ నిపుణులు కావాలని కోరుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో కూడా భారీగానే నియామకాలు కొనసాగనున్నాయి’ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ డిప్యూటీ సీఈఓ కపిల్ జోషి పేర్కొన్నారు. ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ రంగం టెక్ హైరింగ్ 6–8% వృద్ధి చెందనుందని, ఫ్రెషర్లతో పాటు టెక్నాలజీపై పట్టున్న ప్రొఫెషనల్స్‌కు కూడా అవకాశాలు లభిస్తాయని టీమ్‌లీజ్ తెలిపింది. తయారీ తర్వాత అత్యధిక జాబ్స్... టెక్నాలజీయేతర కంపెనీల్లో అత్యధికంగా టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్న రంగంగా త్వరలో బీఎఫ్ఎస్ఐ అగ్రస్థానానికి ఎగబాకనుంది. ప్రస్తుతం టాప్‌లో తయారీ రంగం ఉంది. 2023 నాటికి బీఎఫ్ఎస్ఐ సంస్థల మొత్తం టెక్ సిబ్బంది సంఖ్య 4 లక్షల స్థాయిలో ఉండగా.. 2026 కల్లా 4.9 లక్షలకు ఎగబాకుతుందనేది టీమ్‌లీజ్ అంచనా. అంటే 22.5 శాతం వృద్ధి చెందనుంది. మరోపక్క, బీఎఫ్ఎస్ఐలో మొత్తం సిబ్బంది సంఖ్య ఇప్పుడున్న 71 లక్షల నుంచి 2026 నాటికి 12 శాతం వృద్ధితో 80 లక్షలకు చేరుకుంటుందని లెక్కగట్టింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో బీఎఫ్ఎస్ఐ రంగంలో జరిగిన మొత్తం నియామకాల్లో 8% పైగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి చెందినవే. 15% ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 11% సైబర్ సెక్యూరిటీలో నమోదయ్యాయి. ఇక డేటా సైన్స్– ఎనలిటిక్స్ జాబ్స్‌లో హైరింగ్ 7% వృద్ధి చెందగా, ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లకు 10% అధికంగా జాబ్స్ లభించాయి. ఈ రెండు విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ కంటే ఎక్కువగా ఉద్యోగాలిచి్చన రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు, ఇంటర్నెట్–ఈకామర్స్, అడ్వర్టయిజింగ్–పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి.టెక్నాలజీకి పెద్దపీట... నెట్ బ్యాంకింగ్‌కు తోడు యాప్స్, యూపీఏ పేమెంట్స్ ఇలా బ్యాంకింగ్ లావాదేవీలకు ఇప్పుడు ఆన్లైన్ కీలకంగా మారింది. దీంతో బ్యాంకులు సిబ్బంది నియామకాల్లో టెకీలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆరి్థక సంవత్సరంలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)గా సుమారు 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఇందులో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశాలు లభించనున్నాయని అంచనా. గడిచిన మూడేళ్లలో యస్ బ్యాంక్ ఏటా 200 మంది టెక్ నిపుణులను నియమించుకోవడం గమనార్హం. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలదించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్–ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ సంస్థలన్నీ జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ రంగంలో ప్రతిభ గల ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పుంజుకోవడానికి ఇదే ప్రధాన కారణం. – కపిల్ జోషి, డిప్యూటీ సీఈఓ, క్వెస్ ఐటీ స్టాఫింగ్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
టర్మ్ డిపాజిట్లకే ఆదరణ
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ డిపాజిట్లకు బదులు, అధిక రాబడినిచ్చే టర్మ్ డిపాజిట్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా బ్యాంకులకు నిధులపై వ్యయాలు పెరిగిపోయి, వాటి నికర వడ్డీ మార్జిన్లకు చిల్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఐదు ప్రముఖ బ్యాంక్‌ల్లో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.7–3 శాతం మధ్య ఉండగా, ఏడాది కాల టర్మ్ డిపాజిట్లపై అవే బ్యాంకులు 7.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే టర్మ్ డిపాజిట్ల రూపంలో 18.64 శాతం అధికంగా రూ.116 లక్షల కోట్లను సమీకరించాయి. అదే కాలంలో బ్యాంకుల సేవింగ్స్ డిపాజిట్లు కేవలం 6 శాతం పెరిగి రూ.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 13.5 శాతంగా ఉంటే, సేవింగ్స్ డిపాజిట్లలో పరుగుదల 4.9 శాతంగానే ఉండడం గమనార్హం. 2021–22లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 9.6 శాతంగానే ఉంది. అదే ఏడాది సేవింగ్స్ డిపాజిట్లు ఇంతకంటే అధికంగా 12.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 13.5 శాతం వృద్ధి చెందాయి. అంతకుముందు వరుస ఆర్థిక సంవత్సరాల్లో ఈ వృద్ధి వరుసగా 9.6 శాతం, 8.9 శాతం చొప్పున ఉంది.అధిక రాబడుల కోసమే..పొదుపు నుంచి టర్మ్ డిపాజిట్లకు పెట్టుబడుల మరళింపు స్పష్టంగా కనిపిస్తున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. రేట్లు గరిష్ట స్థాయిలో ఉండడంతో టర్మ్ డిపాజిట్లలోకి పొదుపు నిధులు మళ్లించుకోవడం ద్వారా రాబడులను పెంచుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ (డిపాజిట్లలో 22.6 శాతం వాటా) ఎస్బీఐ డిపాజిట్ బేస్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11.13 శాతం వృద్ధితో రూ.49.16 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘2023–24లో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో టర్మ్ డిపాజిట్లు 16.38 శాతం మేర వృద్ధి చెంది రూ.27.82 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు (కరెంట్, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు) 4.25 శాతం పెరిగి రూ.19.42 లక్షల కోట్లకు చేరాయి’’అని ఎస్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల నుంచి డిపాజిట్లు కేవలం టర్మ్ డిపాజిట్లలోకే కాకుండా, ఇంకా మెరుగైన రాబడులు వచ్చే ఈక్విటీలు, ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లోకి వెళుతున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా బ్యాంకు రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి తగ్గడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి క్షీణించడం పట్ల ఆర్బీఐ సైతం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. డిపాజిట్లు ఆకర్షించేందుకు బ్యాంకులు వినూత్నమైన మార్గాలను అన్వేíÙంచాలని సైతం ఆర్బీఐ సూచించింది. ‘‘బ్యాంక్‌లు డిపాజిటర్లను ఆకర్షించేందుకు మెరుగైన సంబంధాల దిశగా కృషి చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా వ్యాపార విధానాలు సైతం మారాల్సిందే. కేవలం డిపాజిట్ల స్వీకరణకే పరిమితం కాకుండా, సంపద నిర్వహణ సేవలు, క్లయింట్లతో పూర్తి సంబంధాల దిశగా వ్యవహరించాల్సిందే’’అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొనడం గమనార్హం. -
బ్యాంకుల్లో అప్రెంటిస్‌లుగా గ్రాడ్యుయేట్లు
ముంబై: గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగావకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా కీలక ప్రకటన చేశారు.అప్రెంటిస్‌లుగా 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి బ్యాంకులు యోచిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా శుక్రవారం తెలిపారు. 12 నెలల అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ ఇస్తారు. వీరికి నెలకు రూ.5,000 స్టైపెండ్‌ను బ్యాంకులు చెల్లిస్తాయని మెహతా వెల్లడించారు.‘నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం లేని మార్కెటింగ్, రికవరీ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. వారికి ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. 21–25 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. అభ్యర్థి పన్ను చెల్లింపుదారు కాకూడదు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి డిగ్రీని కలిగి ఉండకూడదు.బ్యాంకింగ్ సేవలను చివరి మైలు వరకు తీసుకువెళ్లే అప్రెంటిస్‌లను బిజినెస్ కరస్పాండెంట్లుగా కూడా నియమించుకోవచ్చు. శిక్షణ పూర్తి అయ్యాక వారిలో కొందరు ఉద్యోగులుగా చేరే అవకాశమూ ఉంది. అన్ని బ్యాంకులు నెలరోజుల్లోగా అప్రెంటిస్‌లను నియమించుకోనున్నాయి. ఈ స్కీమ్ అమలుకు ప్రభుత్వ మద్దతు కూడా ఉంది’ అని చెప్పారు. అయితే ఎంత మందిని అప్రెంటిస్‌లుగా చేర్చుకుంటారనేది వెల్లడి కాలేదు. ఐబీఏ ఈ స్కీమ్‌పై కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సెక్రటరీతో గురువారం చర్చించింది. -
డిపాజిట్లు రూట్ మారడానికి కారణం ఇదే..
ముంబై: బ్యాంకుల నుంచి డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, ఇతర సాధనాల వైపు మళ్లడానికి సులభతర నిబంధనలే కారణమని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్ ఎంవీ రావు వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాది కాలంగా బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించిన నేపథ్యంలో.. ఎఫ్‌ఐబీఏసీ వార్షిక సదస్సులో భాగంగా దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది.సెంట్రల్ బ్యాంక్ ఇండియా ఎండీ, సీఈవోగానూ వ్యవహరిస్తున్న ఎంవీ రావు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సులభతర నిబంధనల కారణంగా ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడులు అందిస్తున్నాయని చెప్పారు. నిధుల నిర్వహణ విషయంలో బ్యాంకులపై ఎన్నో నియంత్రణలు ఉండగా.. మ్యూచువల్ ఫండ్స్‌కు అలాంటి నిబంధనలేవీ లేవన్నారు. ‘‘నిధులను అంతిమంగా ఎందుకు వినియోగిస్తున్నారో తనిఖీ చేయాల్సిన అవసరం మ్యూచువల్ ఫండ్స్‌కు లేదు.మా వద్దే డిపాజిట్ చేయాలని కస్టమర్లను బ్యాకింగ్ రంగం నిర్దేశించలేదు. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసే విషయంలో ఫండ్స్‌కు ఎలాంటి ప్రొవిజనింగ్ లేదు. కానీ ప్రామాణిక రుణ ఆస్తులకు సంబంధించి కూడా నిర్దేశిత మొత్తాన్ని బ్యాంక్‌లు పక్కన పెట్టాల్సి ఉంటుంది. 99 శాతం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి పరిశోధన చేయడం లేదు.ఆరేడేళ్ల తర్వాత ఈ సైకిల్ తిరగబడితే అది వ్యవస్థాగత ముప్పుకు దారితీయవచ్చు. రానున్న రోజుల్లో డిపాజిటర్లు అధిక రాబడులు సొంతం చేసుకునేందుకు, దేశ వృద్ధికి కావాల్సిన ముడి సరుకు (నిధులు)ను బ్యాంక్‌లు పొందేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థల మధ్య చురుకైన భాగస్వామ్యం, చర్చ అవసరం’’అని రావు ఈ సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు.డిపాజిట్ల మందగమనం కారణాలు వేరే..కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యుడు కూడా అయిన నీలేష్ షా ఈ అభిప్రాయాలతో విభేదించారు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించడానికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమను ఎలా తప్పుబడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.ప్రభుత్వ నిధులు సైతం బ్యాంకింగ్ నుంచి బయటకు వెళుతున్నాయని, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, నగదు పంపిణీ తదితర అంశాలను ఇందుకు కారణాలుగా ప్రస్తావించారు. ప్రభుత్వ బ్యాలన్స్‌లను (మిగులు నిధులు) బ్యాంకుల్లో ఉంచాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ను తాను కోరినట్టు చెప్పారు. ఇలా చేసిన ప్రభుత్వం ఏటా రూ.12,000 కోట్ల ఆదాయం పొందొచ్చన్నారు. కాగా, రావు అభిప్రాయాలతో ఇదే సమావేశంలో పాల్గొన్న హెచ్ఎస్బీసీ హితేంద్ర దవే సేతం విభేదించడం గమనార్హం. -
బ్యాంకు వారికి.. ఆ హక్కు లేదు!
ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – గ్రాట్యుటీని బ్యాంకు వారు లోన్ బకాయిల రీత్యా జమ కట్టుకోవచ్చా?ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న మాధవరావు (పేరు మార్చాము) అనే ఒక వ్యక్తి కోవిడ్ సమయంలో సేవలు నిర్వహిస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం తన వారసులకు –భార్యకు రావలసిన కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ వంటి అంతిమ ఆర్థిక ప్రయోజనాలు (టెర్మినల్ బెనిఫిట్స్) భార్య అకౌంట్లోకి వచ్చాయి. అయితే, అలా అకౌంట్ లోకి వచ్చిన వెంటనే సదరు బ్యాంకు అధికారులు పెన్షన్ మొత్తాన్ని మాధవ రావు బతికుండగా తీసుకున్న లోన్ బకాయి కింద జమ కట్టుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన సదరు ఉద్యోగి భార్యను ‘ఇది మా హక్కు‘ మీ ఆయన మా బ్యాంకులో లోను తీసుకోవడమే కాక, తన టెర్మినల్ బెనిఫిట్స్ నుంచి కూడా రికవరీ చేసుకోవచ్చు అని మాకు రాసి ఇచ్చారు. అంతేకాక మీ భర్త పని చేసిన డిపార్ట్మెంట్ వారికి, మా బ్యాంకుకు మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. అందువలన మేము ఆ మొత్తాన్ని లోను కింద జమ కట్టుకున్నాము‘ అని చెప్పి ఆవిడని వెళ్ళిపొమ్మన్నారు. అప్పుడు ఇద్దరు మైనర్ పిల్లల తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.వాదోపవాదాలు విన్న తర్వాత, పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని, మరీ ముఖ్యంగా సి.పి.సి లోని సెక్షన్ 60 (1) నిబంధనల ప్రకారం ‘‘టర్మినల్ బెనిఫిట్స్ లోనుంచి వచ్చిన నిధులను, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్) వంటి సామాజిక సంక్షేమ పథకాల ద్వారా సంక్రమించిన నిధులను ఏ బ్యాంకు అయినా, కోర్టు అయినా అలా తీసుకోవడానికి, అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదు’’ అని తీర్పునిస్తూ ‘‘ఆ మహిళ అకౌంట్లో నుంచి లోను బకాయి పేరుతో బ్యాంకు వారు తీసేసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఆ మహిళకు చెల్లించవలసిందే’’ అని ఆదేశించింది. అప్పటికీ కూడా బ్యాంకు వారు తిరిగి చెల్లించక΄ోవడంతో గౌరవ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయాల్సి వచ్చింది. మొత్తానికి సదరు మహిళకి ఆ డబ్బులు మొత్తం బ్యాంకు వారు తిరిగి చెల్లించారు. బ్యాంకు వారికి లోన్ రికవరీ చేసే అధికారం వున్నప్పటికీ, చట్ట పరిధిలో ఉండి మాత్రమే రికవరీ చేయాల్సి వుంటుంది. లోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకు లోన్ తీసుకున్నెప్పుడు ‘లోన్ ఇన్సూరెన్స్’ అనే పథకాన్ని ఎంచుకోవాలి. అంటే, రుణ బకాయీలు ఉండగా లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా, ఏదైనా శాశ్వత వైకల్యం వంటివి కలిగి ఉపాధి కోల్పోయిన సమయాలలో వారు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ఉండచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీ బదులు లోన్ కడతారు. మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. కొన్ని లోన్ఖాతాలకి లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, బ్యాంకు వారు కూడా లోన్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ చెప్పి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
మనసు లేని బ్యాంకులు! కేరళ ప్రభుత్వం అసంతృప్తి
కేరళలో వయనాడ్ విపత్తు బాధితుల పట్ల బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై కేరళ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాధితుల ఖాతాల నుంచి రుణాల ఈఎంఐలను కట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ రుణాలను బ్యాంకులు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేసింది.ఈ రుణాలను మాఫీ చేయడం వల్ల బ్యాంకులకు భరించలేని నష్టమేమీ వాటిల్లదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం విజయన్ మాట్లాడుతూ.. బాధితుల వడ్డీ మొత్తాలలో సడలింపు లేదా నెలవారీ వాయిదాలను చెల్లించడానికి సమయాన్ని పొడిగించడం పూర్తి పరిష్కారం కాదన్నారు.గత జులై 30న జరిగిన భయానక దుర్ఘటన ప్రభావాన్ని, మిగిల్చిన శోకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విపత్తులో 200 మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. రుణాలు తీసుకున్న వారిలో చాలా మంది చనిపోయారని, విపత్తు కారణంగా వారి భూమి నిరుపయోగంగా మారిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకున్న వారు ఇంటినే పోగొట్టుకున్నారని తెలిపారు. అలాంటి వారు ఇప్పుడు ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదు. బాధితులు తీసుకున్న మొత్తం రుణాలను మాఫీ చేయడమే మన చేయగల మేలు అని సీఎం విజయన్ సూచించారు.సాధారణంగా బ్యాంకులు మాఫీ చేసిన మొత్తానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం చెల్లించాలని ఆశిస్తాయనీ, అయితే ఈ సమస్యపై అలాంటి వైఖరి తీసుకోవద్దని సీఎం విజయన్ అన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు సొంతంగా భరించాలని ఆయన కోరారు. కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన కొందరి ఖాతాల నుంచి ఈఎంఐలు కట్ చేసిన కేరళ గ్రామీణ బ్యాంకుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో యాంత్రికంగా ఉండకూడదన్నారు. -
సిబిల్ అప్డేట్ @ 15
సాక్షి, అమరావతి: రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న వారు సిబిల్ స్కోర్ వేగంగా పెంచుకునే అవకాశంతో పాటు సిబిల్ స్కోర్ వివాదాలు సత్వరం పరిష్కరించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు ముందుకు వేసింది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి సిబిల్ స్కోర్‌ను అప్డేట్ చేయాల్సిందిగా అటు సిబిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతో పాటు, రుణాలిచ్చే సంస్థలనూ ఆదేశించింది.ఈ నిర్ణయం జనవరి1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని, తదనుగుణంగా బ్యాంకులు, ఇతర ఆరి్థక సంస్థలు 15 రోజులకోసారి రుణాల మంజూరు చెల్లింపుల వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం నెలకోసారి బ్యాంకులు సమాచారం ఇస్తున్నాయి. ఈ సమాచారం కూడా లోపభూయిష్టంగా ఉంటుండటంతో సిబిల్ స్కోర్‌పై పలు వివాదాలు తలెత్తుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పలు సంస్థలు రోజుల వ్యవధికి కూడా రుణాలిస్తున్నాయని, ఇలా 15 రోజులకోసారి సమాచారం అప్డేట్ చేయడం ద్వారా అటు రుణ గ్రహీతలతో పాటు రుణాలిచ్చే సంస్థలు కూడా ప్రయోజనం పొందుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తప్పుల సవరణ 30 నుంచి 45 రోజుల్లో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకొచి్చన ఈ రోజుల్లో 15 రోజులకోసారి సమాచారం అప్డేట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులుండవంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా రానున్న రోజుల్లో రియల్ టైమ్‌లో అంటే ఎప్పుడు రుణం చెల్లిస్తే అప్పుడే సిబిల్ స్కోర్ అప్డేట్ చేసేలా ఆర్బీఐ అడుగులు వేస్తోందనడానికి ఇది ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిబిల్ స్కోర్‌లో ఏదైనా తప్పు జరిగితే దాని సవరణకు 60 నుంచి 90 రోజుల సమయం పట్టేదని అది ఇప్పుడు 30 నుంచి 45 రోజులకు తగ్గనుండటంతో సిబిల్ స్కోర్ వివాదాలు వేగంగా పరిష్కారమవుతాయంటున్నారు. అదే విధంగా సకాలంలో చెల్లించే వారికి స్కోర్ పెరగడం ద్వారా రానున్న కాలంలో తీసుకునే రుణాలపై తక్షణ ప్రయోజనం పొందే వెసులుబాటు కలుగుతుందని, అదే విధంగా రుణ గ్రహీత ఆరి్థక పరిస్థితి కూడా తెలిసి దానికి అనుగుణంగా బ్యాంకులు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు. -
ఆర్బీఐ కఠిన నిబంధనలు.. నవంబర్ 1 నుంచి అమలు
ముంబై: బ్యాంకుల్లో నగదు చెల్లింపు సేవలు (క్యాష్ పే–అవుట్స్) ఇక మరింత కఠినతరం కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై నగదు గ్రహీతల రికార్డులను రుణదాతలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. నగదు చెల్లింపు అనేది బ్యాంకు ఖాతా లేని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల నుండి బదిలీ చేయబడే మొత్తాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అంశం. ఆర్బీఐ ’డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్’కి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను అక్టోబర్ 2011 సవరించింది. -
RBI: బ్యాంకింగ్‌లో కార్పొరేట్లకు నో ఎంట్రీ
ముంబై: బ్యాంకులను ప్రమోట్ చేయడానికి వ్యాపార సంస్థలను అనుమతించే ఆలోచన ఏదీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల ప్రమోట్‌కు కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్‌్కలు, సంబంధిత లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని పేర్కొంటూ. మంచి, పటిష్ట, సుపరిపాలన ఉన్న బ్యాంకులు ఇప్పు డు కీలకమైన అంశమని వివరించారు. సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపులను సమీకరిస్తుందన్నారు.రుణాలకన్నా... డిపాజిట్ల వెనుకడుగు సరికాదు... డిపాజిట్ల పురోగతికన్నా.. రుణ వృద్ధి పెరగడం సరైంది కాదని పేర్కొంటూ ఇది లిక్విడిటీ సమస్యలకు దారితీస్తుందన్నారు. గృహ పొదుపులు గతం తరహాలోకి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్‌స్ట్రమెంట్ల వైపు మళ్లడం బ్యాంకింగ్ డిపాజిట్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు–రుణాల మధ్య సమతౌల్యత ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థికాభివృద్ధి ఊపందుకుందని పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇంకా పొంచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారిస్తుందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సుస్థిర ప్రాతిపదికన 4 శాతం వైపునకు దిగివస్తేనే రుణ రేటు వ్యవస్థ మార్పు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.స్పెక్యులేషన్‌లోకి గృహ పొదుపులుఎఫ్అండ్వో ట్రేడ్ చాలా పెద్ద అంశం సెబీ చైర్పర్సన్ మాధవిపురిఇంటి పొదుపులు స్పెక్యులేషన్ వ్యాపారంలోకి వెళుతున్నాయని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతున్నందున ఎఫ్‌అండ్‌వోలో స్పెక్యులేటివ్ ట్రేడ్లకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు గట్టి హెచ్చరిక పంపుతున్నట్టు చెప్పారు. మూలధన ఆస్తి కల్పనకు ఉపయోగపడుతుందన్న అంచనాలను తుంగలో తొక్కుతున్నారని.. యువత పెద్ద మొత్తంలో ఈ ట్రేడ్లపై నష్టపోతున్నట్టు తెలిపారు. ‘‘ఓ చిన్న అంశం కాస్తా.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ దిశగా ఇన్వెస్టర్లను ఒత్తిడి చేయాల్సి వస్తోంది’’అని సెబీ చైర్పర్సన్ చెప్పారు. ప్రతి 10 మంది ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో నష్టపోతున్నట్టు సెబీ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ట్రేడింగ్ పరిమాణం పెద్ద ఎత్తున పెరగడంతో, ప్రతి ఒక్కరినీ ఈ దిశగా అప్రమ్తతం చేయడం నియంత్రణ సంస్థ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఫిన్ఫ్లూయెన్సర్లు (ఆర్థిక అంశాలు, పెట్టుబడులను ప్రభావితం చేసేవారు) పెట్టుబడుల సలహాదారులుగా సెబీ వద్ద నమోదు చేసుకుని, నియంత్రణల లోపాలను వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదుల చేస్తామన్నారు. -
రికార్డుల ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ మూడో రోజూ కొనసాగింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడి ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులు లిఖించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే., ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. సెన్సెక్స్ ఉదయం 242 పాయింట్ల లాభంతో 77,235 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 374 పాయింట్లు పెరిగి 77,366 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 308 పాయింట్ల లాభంతో 77,301 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 23,579 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 92 పాయింట్లు 23,558 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఐటీతో పాటు రియలీ్ట, కన్జూమర్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 1శాతం, అరశాతం చొప్పున రాణించాయి. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రయ్...సెన్సెక్స్ నాలుగోరోజూ రాణించడంతో బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టానికి చేరింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.42 లక్షల కోట్లు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 437.24 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం 4 రోజుల్లో రూ.10.29 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.⇒ అమెరికా ఫ్యాషన్ దుస్తుల సంస్థ హానెస్ బ్రాండ్స్‌తో వ్యాపార కాంట్రాక్టు కొనసాగింపుతో పాటు జీబీఎస్టీతో కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో విప్రో షేరు 3% పెరిగి రూ.492 వద్ద ముగిసింది. ⇒ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోళ్ల ఆర్డర్ దక్కించుకోవడంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేరు 6 శాతం పెరిగి రూ. 5,533 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ. 5,565 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. -
హోమ్ లోన్ తీసుకోవాలంటే ఈ బ్యాంకులే బెస్ట్
-
కొత్తగా ‘160’ సిరీస్ ఫోన్ నంబర్లు.. ఎవరికంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల ‘160’ సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉన్న సంస్థలు మొదటి దశలో సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం '160' ఫోన్ నంబర్ సిరీస్‌కు మారుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.అంటే ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర సంస్థల నుంచి సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ '160'తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తాయి. మోసగాళ్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించడంలో సహాయపడటానికి ట్రాయ్ ఈ చర్య తీసుకుంది.ట్రాయ్ అధికారులు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 25కు పైగా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ బ్యాంకులు, టెల్కోలు సహా ఇతర ఆర్థిక సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రమోషనల్ అవసరాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న 140 సిరీస్ కార్యకలాపాలను డీఎల్టీ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)కి మార్చడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు, డిజిటల్ సమ్మతిని కూడా అమలు చేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 సిరీస్, మార్కెటింగ్ కోసం 140 సిరీస్‌ను అమలు చేయడంతో.. 10 అంకెల నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ పై గణనీయమైన నియంత్రణ ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలకు చెందిన 10 అంకెల స్పామ్ నంబర్లలో చాలా వరకు కృత్రిమ మేధను ఉపయోగించి టెల్కోలు నేరుగా బ్లాక్ చేస్తున్నాయి. -
కీలక వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం ఇదేనా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో వడ్డీ రేట్లపై ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఆర్బీఐ ఎంపీసీ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. అనంతరం ఎంపీసీ సమావేశంలోని నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించనున్నారు. అయితే ఈ తరుణంలో ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
బ్యాంకుల నిండా పింఛనుదారులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం పలుచోట్ల పింఛను డబ్బులు తీసుకునేందుకు వచ్చిన అవ్వాతాతలతో బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,838 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1,939.35 కోట్లు విడుదల విషయం చేసిన విషయం తెలిసిందే. మొత్తంలో లబ్ధిదారుల్లో 47,74,733 మందికి ప్రభుత్వం డీబీటీ రూపంలో శనివారం ఉదయమే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసింది. డబ్బు బ్యాంకుల్లో జమ అయినట్లు శనివారం సాయంత్రానికి 44,54,243 (93.29 శాతం) లక్షల మంది మొబైల్ నంబర్లకు సమాచారం కూడా చేరినట్టు అధికారులు తెలిపారు. శనివారమే 14.33 లక్షల మందికి ఇంటివద్దే అందిన పింఛను డీబీటీ రూపంలో బ్యాంకులో జమచేసినవారు పోను మిగిలిన 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై ఉండే 17,56,105 మంది లబ్ధిదారులకు ఒకటోతేదీ నుంచి ఐదోతేదీ మధ్య గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా వారి ఇంటివద్దే పింఛను డబ్బులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరిలో 14,33,709 మందికి శనివారమే వారి ఇళ్లవద్ద పింఛను డబ్బు పంపిణీ చేశారు. ఇంటివద్ద పింఛన్ల పంపిణీ 81.64 శాతం పూర్తయిందని, మిగిలిన వారికోసం మరో నాలుగు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
బ్యాంకుల్లో రూ .78,213 కోట్లు.. ఎవరిదీకానిది ఈ సొమ్ము!
దేశంలోని వివిధ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు భారీగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకుల వద్ద ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 2024 మార్చి చివరి నాటికి 26 శాతం పెరిగి రూ .78,213 కోట్లకు చేరుకున్నాయి.సహకార బ్యాంకులతో సహా వివిధ బ్యాంకుల్లో 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాల్లోని సొమ్మును అన్క్లెయిమ్డ్గా పరిగణించి ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ నిధికి బదిలీ చేస్తాయి. ఇలా 2023 మార్చి నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌లో ఉన్న మొత్తం రూ.62,225 కోట్లు.ఖాతాదారులకు సహాయపడటానికి మరియు ఇన్‌యాక్టివ్ ఖాతాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను క్రమబద్ధీకరించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది ప్రారంభంలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతాలు, డిపాజిట్లను ఇన్ యాక్టివ్ లేదా అన్ క్లెయిమ్డ్ గా వర్గీకరించడంతోపాటు బ్యాంకులు అమలు చేయాల్సిన చర్యలను ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు.నవీకరించిన మార్గదర్శకాలు అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా), సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను కేంద్రీకృత పద్ధతిలో వెతికే ప్రక్రియను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఉడ్గామ్ (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) అనే వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. -
అకౌంట్లపై అదనపు వసూళ్లు.. బ్యాంక్‌లకు ఆర్బీఐ వార్నింగ్..
ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు విధిస్తున్న బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది.బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్ బ్యాంక్‌కు రూ. 91 లక్షల జరిమానా విధించింది. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపైజీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్‌లు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్బీఐ అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానామరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సైతం ఆర్బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. -
బ్యాంక్‌ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
మీరు బ్యాంక్ బ్రాంచ్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? సమస్య పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండి అని అంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). బ్యాంక్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, దానిని బ్యాంక్ బ్రాంచ్ అధికారులు లేదా దాని ప్రధాన కార్యాలయం పరిష్కరించలేకపోతే, మీరు ఆర్బీఐలో బ్యాంక్‌పై ఫిర్యాదు చేయడానికి ఈ పద్దతిని ఎంపిక చేసుకోవచ్చు.ఫిర్యాదులను స్వీకరించేందుకుఅటువంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం బ్యాంకులు అందించే కొన్ని సేవలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం బ్యాంక్ కస్టమర్ల కోసం ఒక వేగంగా చర్యలు తీసుకునే వేదిక.ఎటువంటి రుసుము లేకుండాబ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006లోని క్లాజ్ 8 ప్రకారం (జూలై 1, 2017 వరకు సవరించిన ప్రకారం) ఖాతాదారుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి, పరిష్కరించడానికి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ఎటువంటి రుసుమును వసూలు చేయరు అని ఆర్బీఐ తరచుగా పేర్కొంది.ఆర్బీఐ అంబుడ్స్‌మన్ బ్యాంక్ ఖాతాదారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నా.. బ్యాంక్ తరుపు లోపాలుంటే ఖచ్చితంగా ఆర్బీఐకి ఫిర్యాదు చేయొచ్చు. సమస్య ఉందని పరిష్కారం కోరినా బ్యాంకులు పట్టించుకోకపోతే, సంబంధిత బ్యాంకు మీ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఒక నెలలోపు బ్యాంకు నుండి ప్రత్యుత్తరం రాకుంటే, బ్యాంక్ ఫిర్యాదును తిరస్కరించినట్లయితే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు https://rbi.org.in/Scripts/Complaints.aspx ఈ లింక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. -
ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు అలెర్ట్. మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించాయి. వాటిల్లో ఎస్బీఐ, డీసీబీ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎస్, క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి .డీసీబీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు డీసీబీ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం కొత్త రేట్లు మే 22, 2024 నుండి అమలులోకి వస్తాయి.19 నెలల నుండి 20 నెలల కాలవ్యవధిలో సాధారణ కస్టమర్లకు 8శాతం, సీనియర్ సిటిజన్లకు 8.55శాతం అత్యధిక ఎఫ్డీ వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేటు 8శాతం వరకు అందించబడుతుంది. పొదుపు ఖాతాపై 8 శాతం వరకు, ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.55 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.ఐడీఎఫ్సీఐడీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయిబ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం నుండి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం వడ్డీ రేటు 3.50 శాతం నుండి 8.40 శాతం వరకు ఉంటుంది. 500 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 8శాతం, 8.40శాతం వరకు అందిస్తుంది. ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైల్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల వరకు), బల్క్ డిపాజిట్లపై (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ) నిర్దిష్ట కాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లుఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 8.50 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, బ్యాంక్ 4.60 శాతం నుంచి 9.10 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కాలవ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.10 శాతం వరకు పొందవచ్చు.ఆర్బీఎల్లో వడ్డీ రేట్లు ఆర్బీఎల్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఆర్బీఎల్ బ్యాంక్ 18 నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 8శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అదే ఎఫ్డీ వ్యవధిలో, సీనియర్ సిటిజన్ 0.50 శాతం అదనంగా పొందవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్లు (80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ) 8.75శాతం అదనపు వడ్డీ రేటుకు అర్హులు. -
క్రాప్‌లోన్ కట్టాల్సిందే...!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, బ్యాంకులు మాత్రం రైతుల నుంచి అప్పులు వసూలు చేస్తూనే ఉన్నాయి. నోటీసులు ఇవ్వడంతోపాటు అధికారులు రోజూ ఫోన్లు చేస్తూ చికాకు పెడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ వారి వేధింపులు ఆగడం లేదనడానికి సరస్వతి చెప్పిన సంఘటనే ఉదాహరణ. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రైతుభరోసా సొమ్మును కూడా అప్పు కింద జమ చేసుకున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచే ప్రారంభం అవుతుందని, కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాలని, అప్పుడే కొత్త పంట రుణం ఇస్తామని చెబుతున్నాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా రైతుల అప్పులను ముక్కుపిండి వసూలు చేస్తూనే ఉన్నాయి. వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేసేందుకు ఇప్పటికే అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చాయి. భరోసా ఇవ్వని యంత్రాంగం...అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే రూ. 2 లక్షల వరకు రుణం మాఫీ చేయాలంటే రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు రుణమాఫీ మార్గదర్శకాలు కానీ, అందుకు సంబంధించిన ప్రక్రియ కానీ మొదలు పెట్టడం సాధ్యం కాదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అంటే జూన్ 4వ తేదీ వరకు కోడ్ అమలులో ఉన్నందున అప్పటివరకు రుణమాఫీపై ముందుకు సాగలేమని అంటున్నారు. అయితే అప్పటివరకు రైతులు బ్యాంకుల్లో కొత్త పంటరుణాలు తీసుకోవాలి. కానీ పాతవి ఉండటంతో కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు చెప్పిన ప్రకారమే పాత అప్పులు చెల్లించాలని, అంతకు మించి తాము ఏమీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేశాక బ్యాంకులకు రైతులు చెల్లించిన సొమ్ము అడ్జెస్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మండి పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపటా్ననికి చెందిన సీహెచ్ సరస్వతి గతేడాది లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో దానికోసం ఎదురుచూస్తు న్నారు. కానీ బ్యాంకర్లు మాత్రం ఆమెకు ప్రతీ రోజూ ఫోన్ చేసి అప్పు చెల్లించాల్సిందేనని, ప్రభుత్వ రుణమాఫీతో తమకు సంబంధం లేదని వేధిస్తున్నారు. అంతేగాక నోటీసులు ఇచ్చారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి వడ్డీతో కలిపి రూ.1.10 లక్షలు చెల్లించారు. అతని పేరు లక్ష్మయ్య (పేరు మార్చాం)... ఖమ్మం జిల్లాకు చెందిన ఈ రైతు గత మార్చి నెలలో రూ. 95 వేల పంట రుణం తీసుకున్నా రు. బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడితో తీసు కున్న అప్పుతో కలిపి మొత్తం రూ.1.05 లక్ష లు చెల్లించాడు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, అప్పటివరకు ఆగాలని వేడుకున్నా బ్యాంకులు కనికరించలేదని వాపోయాడు. -
అవ్వాతాతలకు వందనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్ర రాజకీయాలకు అవ్వాతాతలు బలైపోతున్నారు. పింఛన్ కోసం మండుటెండల్లో రోడ్లపై సొమ్మసిల్లి పడిపోతున్నారు. నాలుగున్నరేళ్లకు పైగా సూర్యోదయానికి ముందే వలంటీర్ ఇంటికే వచి్చన పింఛన్.. ఒక్కసారిగా నిలిచిపోవడంతో దిక్కుతోచక విలవిల్లాడుతున్నారు. రెండు నెలలుగా పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు కష్టాలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు రాజకీయ అరాచకత్వానికి ఇదొక నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికీ తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందిన వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆదినుంచీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన బినామీ, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌తో కోర్టుల్లో కేసులు వేయించి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. ఫలితంగా ఎన్నికల సంఘం వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్ పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు అవ్వాతాతలు అనుభవిస్తున్న దుస్థితికి ముమ్మాటికి చంద్రబాబే కారణమంటూ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు ‘అవ్వాతాతలకు వందనం’ అంటూ భరోసా కల్పిస్తున్నారు. బాబు చేసిన అన్యాయాన్ని చెబుతూనే.. జూన్ 4వ తేదీ తర్వాత సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్లీ వలంటీర్ వచ్చి ఇంటికే పింఛన్ అందిస్తారని ధైర్యాన్ని ఇస్తున్నారు. గడపగడపకూ వెళ్తూ సీఎం జగన్ వచ్చిన వెంటే ఈ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. శనివారం కుప్పంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్, శింగనమలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు అవ్వాతాతల పాదాలు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. బాబు చేసిన ఘోర పాపానికి ఓటుతో తగిని బుద్ధి చెప్పాలని వినమ్రంగా అభ్యర్థించారు. -
అయ్యో.. అవ్వాతాతలు
సాక్షి, అమరావతి: ఇలా చంద్రబాబు కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ప్రతి నెలా ఒకటినే తమ ఇళ్ల వద్దే వారు పింఛన్ అందుకునేవారు. అయితే చంద్రబాబు ముఠా కుతంత్రాలతో వలంటీర్లతో పింఛన్ల పంపిణీ జరగనీయకుండా అడ్డుకున్నారు. బ్యాంకుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవ్వాతాతలకు పింఛన్ సొమ్మును బ్యాంకుల్లో జమచేశారు. దీంతో అవ్వాతాతలు బ్యాంకుల్లో పడ్డ పింఛన్ సొమ్మును తెచ్చుకునేందుకు చాలా చోట్ల వలంటీర్లపైనే ఆధారపడుతున్నారు. వారినే బతిమలాడుకుని బ్యాంకులకు తీసుకువెళ్తున్నారు. అవ్వాతాతల కష్టాలతో చలించిపోతున్న వలంటీర్లతోపాటు ఇప్పటికే రాజీనామా చేసిన వలంటీర్లు కూడా వారికి మానవతాదృక్పథంతో సాయమందిస్తున్నారు. చంద్రబాబు ముఠా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకోకపోయి ఉంటే ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్ము అందించేవారు. ఈపాటికే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తయి ఉండేది. కానీ, చంద్రబాబు కుతంత్రాలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల పింఛన్ నగదును బ్యాంకుల్లో జమ చేశారు. అయితే ఇప్పటికీ సగం మంది లబ్ధిదారుల చేతికి సొమ్ము అందలేదని తెలుస్తోంది. నగదు ఏ బ్యాంకు ఖాతాలో జమైందో లబ్ధిదారులు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక ఆన్లైన్ సిస్టమ్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే చాలా గ్రామాల్లో బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో లేవు. దీంతో కనీసం 5 కి.మీ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు అవ్వాతాతలు వెళ్లాల్సి వస్తోంది.సమాచారం కోసం వలంటీర్ల దగ్గరకే..ప్రతి నెలా పింఛన్ డబ్బులు ఇవ్వడానికి వెళ్లినప్పుడు తమను చిరునవ్వుతో పలకరించే అవ్వాతాతలు ఇప్పుడు అదే పింఛన్ కోసం అవస్థలు పడుతుంటే చూడలేకపోతున్నామని గ్రామ, వార్డు వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలి కాళిదాస్ ‘సాక్షి’ ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలు సమాచారం కోసం తమ వద్దకే వచ్చి బ్యాంకు దాకా తోడు రమ్మని అడుగుతుంటే చాలాచోట్ల వలంటీర్లు కాదనలేక వెంట వెళ్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంకలో తన క్లస్టర్ పరిధిలో 35 మంది పింఛనుదారులు ఉన్నారన్నారు. అందరికీ పింఛన్ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులో జమ చేసినా అందులో 13 మంది మాత్రమే బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నారని చెప్పారు. లబ్ధిదారులు తన ఇంటికొచ్చి.. పింఛన్ సొమ్ము ఏ బ్యాంకులో పడిందో చెప్పాలని అడిగితే చెప్పానని వెల్లడించారు. బోరివంకకు బ్యాంక్ 5 కి.మీ దూరంలో ఉందని.. దీంతో ఎండల్లో అంతదూరం వెళ్లలేనివారు ఇంకా పింఛన్ తీసుకోలేదన్నారు. గతంలో తాము ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినప్పుడు 35 మందికి ఒకట్రెండు తేదీల్లోనే పింఛన్ సొమ్ము అందేదని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2.57 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తుండగా, అందులో 93 వేల మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారన్నారు. రాజీనామా చేసిన వలంటీర్లు అవ్వాతాతల కోరిక మేరకు వారికి సాయం చేస్తున్నా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.నిండిపోయిన బ్యాంకులుశనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు అవ్వాతాతలతో నిండిపోయాయి. కొన్నిచోట్ల పింఛను డబ్బులు తీసుకోవడానికి తమ ఊరి నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చారు. కొన్ని చోట్ల బ్యాంకులకు అనుసంధానంగా గ్రామాల్లో ఉండే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అవ్వాతాతలకు రూ.3,000 తీసి ఇచ్చేందుకు రూ.200 దాకా తీసుకుంటున్నారని సమాచారం.ఈ చిత్రంలోని వృద్ధుడి పేరు ఉల్చాల మద్దయ్య. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం మజారా లక్షుంపల్లె నివాసి. మండల కేంద్రం వెల్దుర్తిలోని యూనియన్ బ్యాంకుకు 30 కిలోమీటర్ల దూరంలో ఈయన ఊరు ఉంది. పింఛన్ కోసం బ్యాంకుకు శుక్రవారం ఉదయం వచ్చాడు. ఇంకా అకౌంట్లో పడలేదని తెలుసుకుని శనివారం పడతాయేమోనని బ్యాంకు బయటే రాత్రి పడుకున్నాడు. తెల్లారి బ్యాంకు ఉద్యోగులు వచ్చి బయటపడుకున్న మద్దయ్యకు టిఫిన్ పెట్టించారు. అనంతరం అకౌంట్ చెక్ చేస్తే పింఛన్ సొమ్ము పడలేదు. అదే సమయంలో ఒక సచివాలయ ఉద్యోగి నరేశ్ బ్యాంకుకు వచ్చి విషయం తెలుసుకుని వృద్ధుడి వివరాలు తీసుకున్నారు. ఆయన పింఛన్‌ను ఇంటి వద్ద ఇచ్చేందుకు ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెళ్లగా వృద్ధుడు లేడని, ఎక్కడికెళ్లాడో తెలియక ఇవ్వలేకపోయినట్లు తెలుసుకున్నాడు. చివరకు వృద్ధుడికి ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెల్దుర్తి బ్యాంకు వద్దకే వచ్చి పింఛన్ అందించాడు. నాకీ కష్టం తెచ్చింది ఆ చంద్రబాబేనని, మట్టి కొట్టుకుపోతాడని తిడుతూ మద్దయ్య వెళ్లిపోయాడు.చంద్రబాబు కుట్రకు బదులు తీర్చుకుంటాంచంద్రబాబు దుర్మార్గం వల్ల రెండు నెలలుగా పింఛన్ తీసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. బాబుకు పేదల కష్టాలు ఎప్పటికీ తెలియవు. ఎంతో ఆశగా ఈనెల పింఛను తీసుకుందామని రెండు రోజుల నుంచి వాకాడు యూనియన్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాను. అయినా.. పింఛన్ అందుకోలేకపోయాను. వలంటీర్లు ఇంటికి పింఛన్ తెచ్చి ఇచ్చేటప్పుడు మాకు ఈ కష్టాలు తెలియలేదు. బాబు కుట్రకు బదులు తీర్చుకుంటాం. – చేను వెంకటయ్య, వాకాడు, తిరుపతి జిల్లా చంద్రబాబు దుర్మార్గమే ఇదిమా ఊరి నుంచి మూడు రోజులుగా నరసాపురం బ్యాంకుకు వచ్చి పోతున్నాను. ఎక్కువ మంది ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. అసలే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రోజూ ఇలా తిరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. వలంటీర్ల ద్వారా పంపిణీ చేసి ఉంటే ఈ కష్టాలు తప్పేవి. చంద్రబాబు చేసిన రాజకీయ దుర్మార్గం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నారు. – చోడదాసి బొంతమ్మ, జోనానగర్, లక్ష్మణేశ్వరం, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి మమ్మల్ని ఏడిపిస్తే ఏమొస్తుంది బాబూమాలాంటి ముసలోళ్లను ఏడిపిస్తే చంద్రబాబుకు ఏమొస్తుందో అర్థం కావటం లేదు. నాలుగో తారీఖు వచ్చింది. అయినా పింఛన్ అందలేదు. అంతకుముందు ప్రతి నెలా మొదటి రోజున వలంటీర్ మా ఇంటికే వచ్చి తలుపు తట్టి చేతిలో పింఛను డబ్బులు పెట్టేవారు. చంద్రబాబు పుణ్యమా అని మాకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. – షేక్ మస్తాన్‌బీ సుబ్బాయిగూడెం, పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా చంద్రబాబుకు మా ఉసురు తగులుతుందివలంటీర్లు ప్రతినెలా ఇంటికొచ్చి ఇచ్చే పింఛన్లను చంద్రబాబు రానివ్వకుండా చేశాడు. 75 ఏళ్ల వయసులో నడిచే ఓపిక లేక మనవడితో పాటు మరో మహిళ సాయంతో సచివాలయానికి వెళ్లా. బ్యాంకు దగ్గరకు వెళ్లండని చెప్పారు. అక్కడ చూస్తే ఒకటే జనం. పింఛన్ డబ్బు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. ప్రతినెలా హాయిగా ఇంటి వద్దే పింఛన్ తీసుకునేవాళ్లం. చంద్రబాబు చేసిన పని వల్ల రెండు నెలల నుంచి నరకం చూస్తున్నాం. చంద్రబాబుకు మా ఉసురు తప్పక తగులుతుంది.– సిద్ధరామక్క, పళారం, గుడిబండ మండలం, శ్రీసత్యసాయి జిల్లాపేదోళ్లంటే బాబుకు కడుపుమంట80 ఏళ్ల వయసులో పింఛన్ కోసం బ్యాంక్‌కు తిరగలేకపోతున్నాను. చంద్రబాబు చేసిన పనికి మా కడుపు మండుతోంది. గతంలోనూ ఆయన హయాంలో ఇలాంటి ఇబ్బందులే పడ్డాం. పింఛన్ తీసుకొనేందుకు రోజుల తరబడి పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్లం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత మా కష్టాలు తీరాయి. పేదోళ్లంటే బాబుకు కడుపుమంట. మాపై కక్ష కట్టి మరీ సాధిస్తున్నాడు. ఇప్పటికీ నా పింఛన్ సొమ్ము చేతికి అందలేదు. – దేవళ్ల రమణమ్మ, కోవూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
కళ్లు చల్లబడ్డాయా బాబూ!
సాక్షి, అమరావతి: పింఛన్ల కోసం ఎర్రటి ఎండలో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు బ్యాంకుల వెంట, ఏటీఎంల వెంట, సచివాలయాల వెంట తిరుగుతున్నారు. కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. కొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా చంద్రబాబు నాయుడూ? ఇప్పుడు నీ మనసు శాంతించిందా? ఐదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లు... ఈ ఒకటి రెండు నెలల్లోనే ఓటర్లను ప్రభావితం చేసేస్తారా?ఒకవేళ ప్రభావితం చేయగలిగి ఉంటే ఇప్పటికే చేసి ఉండేవారు కదా!!. ఐదేళ్లలో లేనిది... కొత్తగా ఈ రెండు నెలల్లో మారింది.. ఏంటి చంద్రబాబు నాయుడూ నీ కుట్ర బుద్ధి తప్ప? మీరే గనక పనిగట్టుకుని కోర్టుల్లో పిటిషన్లు వేసి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి వలంటీర్లను ఈ కార్యక్రమానికి దూరం చేయకుండా ఉంటే అవ్వాతాతలకు ఈ కష్టాలుండేవా? వాళ్లు ఈ రెండు నెలలు కూడా ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చి ఉంటే పండుటాకులు ఇంత వేదన పడేవారా? ఇదెక్కడి రాజకీయం బాబూ? బ్యాంకుల్లో వెయ్యమన్నదీ మీరేగా? ప్రతి పథకాన్నీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం పింఛన్లను మాత్రం ఎందుకు వేయటం లేదు? వలంటీర్లు నేరుగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు నుంచి... ఆయన వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి, దత్త పుత్రుడు పవన్.. వీళ్లు చెప్పినట్టల్లా ఆడే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వీళ్లంతా అడిగిన ప్రశ్న ఇదే. అక్కడితో ఆగలేదు వీళ్లెవరూ. కోర్టులకెక్కారు. వలంటీర్లు పింఛన్లు ఇవ్వటానికి ఈ మూడు నెలలూ వీల్లేదన్నారు. నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే నగదు వెయ్యాలని ఎన్నికల కమిషన్‌కు నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చెప్పారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ బహిరంగ సభల్లో కూడా ఇదే చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో వేసేలా ఈసీపై ఒత్తిడి తెచ్చారు. నిజానికి బ్యాంకు ఖాతాల్లో వేస్తే ఏమవుతుందో ప్రభుత్వానికి తెలియదా? ప్రతి పథకాన్నీ పైసా అవినీతికి తావు లేకుండా నేరుగా లబి్ధదారులకే చేరుస్తున్న వైఎస్ జగన్‌కు ఇదంతా తెలియదా? కానీ పింఛన్లు తీసుకుంటున్న వాళ్లంతా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వాళ్లు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే తీసుకోవటం వాళ్లకంత సులువేమీ కాదు. బ్యాంకులు ఎక్కడో ఊళ్లకు దూరంగా ఉంటాయి. అన్ని గ్రామాల్లోనూ ఏటీఎంలు అందుబాటులో లేవు. పైపెచ్చు ఖాతాల్లోని డబ్బులు ఎలా తియ్యాలో కూడా కొందరికి తెలియదు. కొందరికి ఖాతాలే లేవు. ఇంకొందరిదైతే ఇల్లు కదల్లేని పరిస్థితి. అందుకే బ్యాంకుల్లో వేయకుండా... ఆ నగదును బ్యాంకుల్లో డ్రా చేసి నేరుగా వలంటీర్లు ఇళ్లకు పట్టుకెళ్లి వాళ్లకు ఇస్తున్నారు. ఒకరకంగా ఖాతాల్లో వేయటానికన్నా అడ్వాన్స్డ్ ప్రక్రియ ఇది. అలాంటి ప్రక్రియను నిలిపేయించడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబూ? ఖాతాల్లో వెయ్యమని చెప్పేటప్పుడు వీళ్లు ఇన్ని కష్టాలు పడతారన్న సంగతి నీకు తెలియనిది కాదు కదా? మండుటెండల్లో విలవిల్లాడుతున్న వృద్ధుల శాపాలిపుడు ఊరికే పోవు కదా? బాబు రక్షణకు ఎల్లో మీడియా... ఎండలకు విలవిల్లాడుతూ వృద్ధులు పెడుతున్న శాపనార్థాలకు తానెక్కడ కొట్టుకుపోతాడోనన్న భయం చంద్రబాబునిపుడు నిలువెల్లా వణికిస్తోంది. దీంతో పింఛన్లు ఇవ్వటానికి సచివాలయ సిబ్బందిని వినియోగించాలని, వాళ్ల ద్వారా ఇంటింటికీ పంచాలని కథలు చెబుతున్నారు. నిజానికి సచివాలయ సిబ్బందిని కూడా మొదట్లో అడ్డుకున్నది చంద్రబాబే. పైపెచ్చు ప్రతి ఇంటినీ అడ్రస్ పట్టుకుని వెతకటం, ఆ చిరునామాలో ఉన్నవారికి ఇవ్వటం ఎవరో కొత్తవారిని చెయ్యమంటే సాధ్యం కాదు. అయితే ఈసీ ఆదేశాల మేరకు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానికి పరిమితమైన వారి విషయంలో సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లే పింఛన్లు ఇస్తున్నారు. దారుణమేంటంటే ఇలా పింఛన్లిచ్చేటపుడు కొందరు చిరునామాలు దొరక్క వలంటీర్ల సాయం తీసుకుంటున్నారు. కానీ వారు వలంటీర్ల సాయం తీసుకున్నారన్న ఒకే ఒక్క కారణంతో ‘ఈనాడు’ దాని తోక మీడియా దౌర్భాగ్యపు రాతలు రాసి ఆయా సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేదాకా వెంటాడుతున్నాయి.చంద్రబాబు మాత్రం సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఇస్తే బాగుంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైపెచ్చు చేసిందంతా చేసి... ఇలా వృద్ధులు మండుటెండల్లో బయటకు రావటానికి ముఖ్యమంత్రి జగనే కారణమని ‘ఉల్టా చోర్...’ తరహాలో నిందిస్తున్నారు. ఈ మాటలు ఎవరూ నమ్మటం లేదని తెలిసి... ఎల్లో మీడియానూ రంగంలోకి దింపారు. ‘ఈ పాపం జగన్‌దే’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో వండి వార్చిన కథనం ఉద్దేశం చంద్రబాబును రక్షించటమే. మొదటి నుంచీ వలంటీర్లంటే కక్షే... కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఏపీ వలంటీర్ల సైన్యాన్ని ప్రశంసించని వారు లేరు. కానీ చంద్రబాబు ముఠాకు మొదటి నుంచీ ఈ వ్యవస్థంటే ఇష్టం లేదు. వలంటీర్ల సేవల కారణంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరొస్తుండటమే దీనికి కారణం. ఈ వ్యవస్థను ఎలాగైనా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వలంటీర్లంతా మగవాళ్లు లేనపుడు ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వీళ్లది మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు నాయుడు నానా మాటలూ అన్నారు. ఇక ఈయన గారి దత్తపుత్రుడైతే మూడడుగులు ముందుకేసి.. వలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారని, ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ తమ వాళ్లచేత కేసులూ వేయించారు. కానీ వీళ్ల పథకాలేవీ పారకపోవటంతో... తాము వలంటీర్లకు వ్యతిరేకం కాదంటూ, తాము గెలిస్తే వారి పారితోషికాన్ని పెంచుతామంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. చేసిన పనికి కూలీ ఇవ్వనివాడు ఫ్రీగా బిరియానీ పెట్టిస్తానంటే నమ్మేదెవరు బాబూ? బాబు యావ తెలియనిదెవరికి? బాబుకు పని చేయటం చేతకాదు. కానీ చేయని పనిని కూడా అందంగా చెప్పుకోవటంలో మాత్రం పెద్ద బిడ్డే. అమరావతిలో ఒకటిరెండు భవనాలు కూడా కట్టకుండానే అదో పెద్ద సింగపూర్‌లా అయిపోయినట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసుకున్న ఘనత బాబుది. నిజానికి అమరావతిని గురించి తెలిసిన వారు... బయటి వారెవరైనా ఆ ప్రాంతమెలా ఉందని అడిగితే, పేరు తప్ప అక్కడేమీ లేదని చెప్పటానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇక 2015లో గోదావరి నదిని ఈయనే కనిపెట్టినట్టు పుష్కరాల సందర్భంగా భారీ ప్రచార వీడియోను షూట్ చేయబోయి ఏకంగా 29 మంది అమాయక భక్తుల్ని బలితీసుకున్నాడు. ఏడాదిన్నర కిందట కూడా... ఎక్కువ మంది జనం వచ్చినట్లుగా చూపించుకోవాలన్న తాపత్రయంలో ఇరుకు సందులో సభ నిర్వహించి, జనాన్ని రప్పించడం కోసం తాయిలాలు కూడా ఇవ్వటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెబుతూ పోతే బాబు ప్రచారపిచ్చికి ఎంతైనా చాలదు. అప్పుడు ప్రభావితం చేస్తారా..!! వలంటీర్లను రాజకీయాలకు సంబంధం లేకుండా, అందరి వద్ద నుంచి నిర్ణీత సమయంలో దరఖాస్తులు స్వీకరించి, అధికారులు ఇంటర్వ్యూలు చేసి వారిని ఎంపిక చేశారు. అలాంటి వలంటీర్లు ఇప్పుడు పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటింటికి వెళితే, వాళ్లు అధికార పార్టీకి అనుకూలంగా లబ్దిదారులను ప్రభావితం చేస్తారనేది చంద్రబాబు అండ్ కో విపరీత బుద్ధి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే అంశంపై ఫిర్యాదు చేసి వలంటీర్లను అడ్డుకున్నారు. ‘అయినా నిత్యం ఆ 50 ఇళ్ల మధ్య ఉండే వలంటీర్లు... పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటికి వెళ్లిన పది నిమిషాలు లేదా పావుగంట సమయంలోనే రాజకీయంగా ప్రభావితం చేస్తారా? వాళ్లు గనక చెయ్యాలనుకుంటే మిగిలిన రోజులన్నీ వాళ్ల పక్కనే ఉంటూ ప్రభావితం చేసే అవకాశం ఉండదా?’ అనేది పింఛనుదార్ల మాట. బాబూ... అచ్చెన్నాయుడు చేత ఫిర్యాదు చేయించలేదా? వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని చంద్రబాబు తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఈ ఏడాది మార్చి 1న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదులో.. ‘ప్రభుత్వం పింఛన్ల పంపిణీ, రేషన్ల పంపిణీలో వలంటీర్లను ఉపయోగిస్తోంది. వలంటీర్లు తమ గ్రామాల్లో, వార్డులో రాజకీయ కార్యకలాపాల్లో నిమ్నగమయ్యే అవకాశం ఉంది. వలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచే గౌరవ వేతనాలు చెల్లిసున్నందున సెక్షన్ 32 ఆర్పీ చట్ట ప్రకారం ప్రభుత్వ సేవకులకు వర్తించేలా శాఖపరమైన క్రమశిక్షణ, నిబంధనలను వీళ్లకూ వర్తింపజేయాలి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు వలంటీర్లపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. తర్వాత చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ ఈసీని కలిసి ‘‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు పింఛను డబ్బులు వాళ్ల ఖాతాల్లోనే జమ చేయాలి’’ అని సూచించారు. ఈ విషయాన్ని ఈటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. దీంతో ఈసీ ‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ విధానంలో పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. 97.91% మందికి పంపిణీ రాష్ట్రంలో 97.91 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. 65,49,864 మందికి ఈ నెల పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి 64,13,200 మందికి పెన్షన్ డబ్బులు నేరుగాను, బ్యాంకు ఖాతాల్లో జమచేయడం ద్వారాను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇవీ... వలంటీర్లపై బాబు, పవన్ మాటలు ‘వలంటీర్లతో ఏంటి లాభం? 5వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది. గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం, డిస్ట్రబ్ చేయడం. పగలు మగవాళ్లు ఉండరు.. వలంటీర్లు పోయి తలుపులు కొడుతున్నారు. ఎంత నీచం ఇది’ – 2019, సెపె్టంబర్ 27వ తేదీన చంద్రబాబు ‘ఊళ్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటిష్ ఏజెంట్లలా వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ – 2021, అక్టోబర్ 30న కుప్పంలో చంద్రబాబు ‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశి్నస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్లకేంటి సంబంధం’ – 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో చంద్రబాబు. ‘వలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ – 2023, అక్టోబర్ 7న ఏలూరులో పవన్‌కళ్యాణ్ పింఛన్ కోసం వెళ్లి 12 మంది మృతిరెండు రోజుల్లో 16 మంది మృత్యువాత సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు వికృత రాజకీయానికి రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు బలవుతున్నారు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛను కార్యక్రమంపై చంద్రబాబు తన మనుషులతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి పంపిణీని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసి, బ్యాంకుల ద్వారా ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు అవ్వాతాతలు మండుటెండలు, వడగాడ్పుల్లో బ్యాంకులకు వెళ్లి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలా గురువారం పింఛను కోసం వెళ్లి వడదెబ్బకు నలుగురు మరణించగా, శుక్రవారం 12 మంది మృతి చెందారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం జంబుకేశవపురానికి చెందిన జి.నాగయ్య (68), పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరుకు చెందిన ఇంజేటి మంగతాయారు (69), గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన వితంతు మహిళ చొప్పర లక్ష్మి (49), బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లల చెరువుకు చెందిన చాగంటి సుబ్బాయమ్మ (68), ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన తానికొండ రమణమ్మ (65), ఏలూరు జిల్లా పోలవరం బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరాంకు చెందిన కె.పోలినాయుడు (70), కర్నూలు జిల్లా మాచాపురం గ్రామానికి చెందిన ఆనంద్ (61), వైఎస్సార్ జిల్లా బద్వేలులో నాగిపోగు యల్లమ్మ (64), రామయ్య (68), పల్నాడు జిల్లా చిలకలూరిపేటకి చెందిన మాట నాగేశ్వరరావు (65), అనంతపురం జిల్లా ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన ఎరుకుల సుంకన్న (72) వడదెబ్బకు మృతి చెందారు. -
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు
గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్‌దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. -
అధిక చార్జీల రిఫండ్
ముంబై: కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ విధింపు విషయంలో అసమంజస విధానాలను పాటిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన రిజర్వ్ బ్యాంక్ .. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా వాటిని ఆదేశించింది. అలా అధికంగా వసూలు చేసిన వడ్డీలు, చార్జీలను కస్టమర్లకు తిరిగివ్వాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. పలు నియంత్రిత సంస్థలను (ఆర్ఈ) పరిశీలించిన మీదట వడ్డీ విషయంలో కొన్ని సంస్థలు అసమంజస విధానాలు పాటిస్తున్నాయని గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. కొన్ని ఆర్ఈలు వాస్తవంగా రుణాన్ని విడుదల చేసిన తేదీ నుంచి కాకుండా రుణాన్ని మంజూరు చేసిన తేదీ నుంచి లేదా రుణ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి వడ్డీ విధిస్తున్నాయని పేర్కొంది. -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: మే నెలలో మారుతున్న రూల్స్
ఏప్రిల్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో మే నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా మాదిరిగానే మే నెల ప్రారంభం నుంచి కొన్ని ఆర్థిక నియమాలు మారబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి మే నెలలో మారబోతున్న నియమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.యస్ బ్యాంక్ రూల్స్యస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. మే 1 నుంచి, వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు నిల్వ (Minimum Average Balance) మారుతుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్ మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్ (MAB) రూ. 50,000గా మారుతుంది. దీనిపై గరిష్ట రుసుమును రూ. 1000గా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ. 25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుమును రూ. 750గా నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్ ప్రోలో కనీస నిల్వ రూ. 10,000. దీనిపై గరిష్ట రుసుము రూ. 750గా మారింది.ఐసీఐసీఐ బ్యాంక్ రూల్స్ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ బుక్, ఐఎంపీఎస్, ఈసీఎస్ / ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు, మరిన్నింటితో సహా కొన్ని సేవల సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1 నుండి అమలులోకి వస్తాయి.డెబిట్ కార్డ్ వార్షిక రుసుములు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99, పట్టణ ప్రాంతాల్లో రూ. 200 ఉండనున్నాయి. చెక్ బుక్ విషయానికి వస్తే 25 లీఫ్స్ వరకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఆపైన ఒక్క చెక్ లీఫ్‌కు రూ.4 చొప్పున చెల్లించాలి. డీడీ క్యాన్సిలేషన్, డూప్లికేట్, రీవ్యాలిడేషన్‌ను చార్జీలను రూ.100లుగా బ్యాంక్ సవరించింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం అమలు చేస్తున్న "హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సీటిజన్ కేర్ ఎఫ్డీ" గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కింద, సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. 5 - 10 సంవత్సరాల కాలపరిమితి ఎఫ్డీపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకం కింద, సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు.బ్యాంక్‌లకు సెలవులువచ్చే మే నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో నాలుగు శనివారాలు, వివిధ పండుగలు, ఇతర సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి. -
కొత్త రుణాలు కావాలా.. పాత అప్పు కట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు వారి ముక్కుపిండి మరీ తిరిగి వసూలు చేస్తున్నాయి. లీగల్ నోటీసులు, మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్లతో వడ్డీతో సహా రాబట్టుకుంటున్నా యి. కొన్ని బ్యాంకులు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఎంతోకొంత తగ్గించి వసూలు చేస్తున్నాయి. కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాల్సిందేనంటూ మెడపై కత్తి పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లోని రైతుబంధు సొమ్మును లాగేసుకుంటున్నాయి. దీంతో కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ బ్యాంకులకు చెల్లిస్తున్నారు. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో అప్పులు తిరిగి చెల్లించలేదని, రుణమాఫీ జరగకపోగా వడ్డీ తడిచిమోపెడు అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ జరిగేవరకు వేచిచూడాలని వేడుకుంటున్నా బ్యాంకులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బ్యాంకులు నోటీసులు..మరోవైపు వ్యవసాయశాఖ చేతులెత్తేయడం, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో తెలియక, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక రైతులు నలిగిపోతున్నారు. ముందుకు సాగని రూ.2 లక్షల రుణమాఫీ తమ పార్టీని గెలిపిస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడదే పార్టీ అధికారంలోకి వచి్చంది. కానీ నాలుగు నెలలైనా ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు చేయలేదు. కానీ రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని మాత్రం ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు.. ఎలా చేయాలి? ఏ తేదీ వరకు రుణమాఫీ చేయాలి అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పట్లో సాధ్యం కాదా? ఎన్నికల కోడ్‌తో ఇప్పటికిప్పుడు రుణమాఫీకి మార్గదర్శకాలు ఖరారు చేయడం, ఇతరత్రా ప్రక్రియ మొ దలు పెట్టడం కానీ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో జూన్ మొదటి వారం వరకు రుణ మాఫీపై అడుగు ముందుకు పడే అవకాశం లేదు. మరోవైపు వానాకాలం సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు మే నుంచే రైతులు సిద్ధం అవుతుంటారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, త్వరగా వర్షాలు కురిస్తే దుక్కులు దున్నడానికి సన్నాహాలు చేసుకుంటుంటారు. ఇంకోవైపు ఏప్రిల్ నుంచే వానాకాలం సీజన్ పంట రుణాల ప్రక్రియను బ్యాంకులు ప్రారంభిస్తాయి. కానీ రుణమాఫీ జరగకుంటే కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు తిరిగి చెల్లించాలని, రె న్యువల్ చేసుకోవాలని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ‘‘బ్యాంకుల్లో రైతు రుణాలు ఉన్నవాళ్లు ఎవ్వరూ కట్టకండి.. మేం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం’’అప్పట్లో పలు ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ముందు చెల్లించండి.. తర్వాత సర్దుబాటు చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూ డు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా అవి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు చెప్పిన ప్రకారం పాత అప్పులు చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేశాక సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే రైతులు డిఫాల్టర్లుగా మారిపోతారు. అయితే కొన్ని బ్యాంకులు రైతుబంధు సొమ్మును జమ చేసుకోవడం ద్వారా రెన్యువల్ చేయడం గమనార్హం. కాగా తాము రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం సాధ్యం కాదని ఒక బ్యాంకు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. బకాయిలు పేరుకుపోతే ఎవరినైనా డిఫాల్టర్లుగా ప్రకటిస్తామని అన్నారు. లక్షలాది మంది రైతుల రుణ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, అందుకే నోటీసులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పాత రుణాన్ని అలాగే ఉంచి కొత్త రుణం ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. -
పసిడి, వెండి దిగుమతికి అనుమతులు పొందిన బ్యాంకులివే
వచ్చే ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి దిగుమతి చేసుకోవడానికి అనుమతించిన బ్యాంకుల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌లు మనదేశంలోకి పసిడి, వెండి దిగుమతి చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ అనుమతులు వర్తిస్తాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు బాంగారాన్ని మాత్రం దిగుమతి చేసుకోవచ్చు. ఇదీ చదవండి..అలర్ట్.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు -
రుణమాఫీపై సర్కారు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ రుణమాఫీ చేసేందుకు రకరకాల కొర్రీలు పెట్టిందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 40.66 లక్షల మంది రైతులకు రూ. 25,916 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించిందని ధ్వజమెత్తింది. మరోవైపు అయిదేళ్ల పాటు వంతుల వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం.. చివరకు కేవలం 23 లక్షల మంది రైతులకే రుణ మాఫీ చేసినట్టుగా అధికారులు లెక్కలు తేల్చినట్టు సమాచారం. దాదాపు 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఎగవేసినట్టుగా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై మొదటి వంద రోజుల్లోనే కసరత్తు మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. -
నగదు లావాదేవీల సమాచారమివ్వండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అక్రమ డబ్బు రవాణాను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతాదారులు ఎవరైనా రూ.లక్ష కంటే ఎక్కువ డిపాజిట్, విత్ డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలకు పైగా నగదును ఖాతాదారుడు తీసుకున్నా జిల్లా ఎన్నికల అధికారికి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి తెలపాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం తన పేరుతో లేదా ఏజెంట్ పేరుతో కలిపి బ్యాంకు, పోస్టాఫీసుల్లో ప్రత్యేకంగా అకౌంట్ లేదా ఉమ్మడి అకౌంట్ తెరవవచ్చని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అన్ని బ్యాంకులకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
ఆ లావాదేవీల జాబితా ఇవ్వండి..
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా రాష్ట్రంలో అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) ముకేశ్‌కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గత ఏడాది అక్టోబరు 1 నుండి రోజుకి రూ.10 లక్షలకు మించి.. గత 30 రోజుల కాలవ్యవధిలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంసీ) అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్ఈసీ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉందన్నారు. అయితే, అంతకుమించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించి గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఐటి శాఖతోపాటు ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు, వారి సంబంధీకులు లేదా రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాలని ఎస్ఈసీ కోరారు. ప్రలోభాలపై నిఘా.. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో అధిక మొత్తంలో నగదు, లిక్కరు, ఓటర్లను ప్రలోభపరిచే సామాగ్రి అక్రమ తరలింపుపై కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని ముకేశ్‌కుమార్ చెప్పారు. అలా తరలించే సమయంలో సీజ్ చేయబడిన వివరాలను రియల్ టైమ్ బేసిస్‌లో నివేదించేందుకు ఈసీఎంసీ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ అంశానికి సంబంధించి ఐటి, జీఎస్టీ, పోలీస్, ఎౖMð్సజ్ తదితర 22 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు నిరంతరం పనిచేస్తున్నాయని, వీరు సీజ్‌చేసే నగదు, వస్తువుల వివరాలను ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తామన్నారు. అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఈ యాప్‌ను పటిష్టంగా వినియోగించుకునేందుకు వీలుగా అందులోకి లాగిన్ కావాలని ఆయన సూచించారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు బ్యాంకులు తరలించే సొమ్మును అకారణంగా జప్తు చేయకుండా ఉండేందుకు ఈఎస్ఎంఎస్ యాప్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా నగదు తరలింపునకు బ్యాంకులు అనుమతులు, రశీదు పొందవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ధ్రువీకరణ చేసుకునే వీలుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ రవీంద్రబాబు, అన్ని బ్యాంకుల ప్రతినిధులు మరియు డిప్యూటీ సీఈఓ కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెయిడ్ ఆర్టికల్స్‌పై కన్ను.. ఆయా మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో వాటి ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రసార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు.. సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలన్నారు. ఈ విషయమై మీనా అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ (ఎంసీ అండ్ ఎంసీ) కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటాయన్నారు. నిర్దేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్‌ను గణించి, ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో వేస్తామన్నారు. ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని, ఆ ఆర్డరు కాపీ నెంబరును ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందన్నారు. -
ఆర్బీఐ ఉద్గమ్ పోర్టల్‌లోకి 30 బ్యాంకులు
ముంబై: వివిధ బ్యాంకుల్లో ఉండిపోయిన తమ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు/ఖాతాల వివరాలను కస్టమర్లు తెలుసుకునేందుకు ఉద్దేశించిన ఉద్గమ్ పోర్టల్‌లో 30 బ్యాంకులు భాగస్వాములైనట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో వీటి వాటా 90 శాతంగా ఉంటుందని (విలువపరంగా) పేర్కొంది. క్లెయిమ్ చేయని తమ డిపాజిట్లు/ఖాతాల వివరాలను తెలుసుకునేందుకు యూజరు ముందుగా తన పేరు, మొబైల్ నంబరుతో ఉద్గమ్ (యూడీజీఏఎం– అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ బ్యాంకుల్లో తమ పేర్లతో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు, ఖాతాలను సెర్చ్ చేసుకునేందుకు, సెటిల్మెంట్ ప్రక్రియ వివరాలను తెలుసుకునేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సెటిల్మెంట్ కోసం ఆయా బ్యాంకులను సందర్శించాల్సి ఉంటుంది. 2023 మార్చి ఆఖరు నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం రూ. 42,270 కోట్లుగా ఉంది. -
వాహనదారులకు ముఖ్య గమనిక, ఫాస్టాగ్‌లపై కీలక అప్డేట్!
టోల్గేట్ల వద్ద సమయం ఆదా చేయడంతో పాటు, వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిచ్చింది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేమెంట్స్ పేటీఎం బ్యాంక్ (పీపీబీఎల్) ద్వారా జరిగేవి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో పీపీబీఎల్‌లో ఫాస్టాగ్‌లను ఫిబ్రవరి 29 లోపు వినియోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ సూచించింది. ఆ తర్వాత నుంచి తాము నిర్ధేశించిన బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని తెలిపింది. నిర్ధేశించిన గడువు తర్వాత పీపీబీఎల్ మినహా బ్యాంకులు అందించే ఫాస్టాగ్‌లను పొందాలని వెల్లడించింది. ఇప్పుడు ఆయా బ్యాంకుల్లో నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్‌లను పొందవచ్చు. ఫాస్టాగ్ ఛార్జీలు? హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఫాస్టాగ్ యాక్టివేషన్ ఛార్జీలు నామమాత్రంగా ఉన్నాయి. అయితే, వినియోగదారులకు మూడు రకాల ఫాస్టాగ్ ఛార్జీలు ఉన్నాయని గుర్తించాల్సి ఉంటుంది. వాటిల్లో 1.ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు - ఫాస్టాగ్ యూజర్‌గా పేరు నమోదు చేసుకొని, మీ వాహనానికి ఫాస్టాగ్‌ను వినియోగించేలా యాక్టీవేట్ చేసేందుకు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఒక్కసారే ఉంటుంది. 2.సెక్యూరిటీ డిపాజిట్ - ఫాస్టాగ్ అకౌంట్ మూసివేసే సమయంలో ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తిగా వాపస్ చేసేందుకు అతితక్కువ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మీ వాహనాన్ని బట్టి ఆ మొత్తం మారుతూ ఉంటుంది. యూజర్ల ఫాస్టాగ్ ఖాతాలో తగినంత నిధులు లేకుంటే, ఏదైనా బకాయి ఉన్న టోల్ ఛార్జీలను సర్దుబాటు చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్‌ని బ్యాంకులు ఉపయోగించుకోవచ్చు 3.ఫాస్టాగ్ యాక్టివేషన్ టైం : ఫాస్టాగ్ యాక్టివేషన్ అయిన వెంటనే ఏదైనా టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఈ మొత్తం మీ ఫాస్టాగ్ ఖాతాలో ఉంటుంది. ఈ థ్రెషోల్డ్ మొత్తం వాహనం తరగతిపై ఆధారపడి ఉంటుంది. ఫాస్టాగ్‌లు జారీ చేసే బ్యాంకులు, వినియోగదారులు ఫాస్టాగ్ కోసం ఎంత చెల్లించాలో తెలిపే వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాహనదారుల నుంచి ట్యాక్స్ కింద రూ.100, సెక్యూరిటీ కింద రూ.100 వసూలు చేస్తుంది. కారు, జీప్, వ్యాన్, టాటా ఏస్ ఇలాంటి మినీ-లైట్ కమర్షియల్ వాహనాలకు విధిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ జాయినింగ్ ఫీజుగా బ్యాంక్ రూ. 99.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 200, కారు, జీప్, వ్యాన్ థ్రెషోల్డ్ మొత్తం రూ. 200. ఈ మొత్తం చెల్లిస్తేనే మీ ఫాస్టాగ్ పనిచేస్తుంది. లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్లు, జీప్‌లు, వ్యాన్లు, టాటా ఏస్, ఇతర కాంపాక్ట్ లైట్ కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్ ఫీజులు లేదా సెక్యూరిటీ డిపాజిట్లకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయదు. కాకపోతే ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం కనీస బ్యాలెన్స్ రూ. 200 అవసరమని గుర్తించాలి. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్ జారీ చేసినందుకు కస్టమర్ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయదు. అయితే, తిరిగి రెన్యువల్ చేసే సమయంలో బ్యాంక్ రూ.100 (అన్ని ట్యాక్స్‌లు కలిపి) వసూలు చేస్తుంది. కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలకు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా ఫాస్టాగ్ వన్ టైమ్ ఫీ కింద జీఎస్టీతో కలిపి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి మారుతుంది. థ్రెషోల్డ్ పరిమితి రూ. 200తో పాటు కారు, జీప్, వ్యాన్లకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ రెన్యువల్ సమయంలో రీ-ఇష్యూషన్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. టాగ్ని ఆన్లైన్లో రీ-లోడ్ చేయడానికి కన్వీనియన్స్ ఫీజు రూ.10 అవుతుంది. కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఉంది. ఐడీబీఐ ఐడీబీఐ బ్యాంక్ పన్నులతో సహా రూ. 100 రీ-ఇష్యూషన్ ఫీజును వసూలు చేస్తుంది. బ్యాంక్ ట్యాగ్ డిపాజిట్ రూ. 200 వసూలు చేస్తుంది. కొటక్ మహీంద్రా వీసీ4 కోసం బ్యాంక్ రూ. 100 వసూలు చేస్తుంది. ఇతర వెహికల్ క్లాస్‌కు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజుగా, డిపాజిట్‌గా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 200, కస్టమర్ వాలెట్లో లోడ్ చేసే థ్రెషోల్డ్ మొత్తంగా రూ. 200 వసూలు చేస్తుంది. బ్యాంక్ వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజుగా రూ. 100 , రీఇష్యూన్స్ ఫీజు కోసం రూ. 100 వసూలు చేస్తుంది. పీఎన్బీ కారు, జీప్ , వ్యాన్ వంటి వాహనాలకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జ్ చేయబడుతుంది . థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్‌కి ఒక్కసారి రుసుము రూ. GSTతో కలిపి 100. ట్యాగ్ జాయినింగ్ ఫీజు (వన్-టైమ్ ఫీజు) రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా), వన్-టైమ్ ట్యాగ్ రీ-ఇష్యూషన్ ఫీజు రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా). రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి ఉంటుంది. కారు / జీప్ / వ్యాన్ కోసం వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ (రిజర్వ్ చేయబడిన మొత్తం) మొత్తం రూ. 150. -
డబ్బులు ఈ బ్యాంకుల్లో వేసుకుంటే మంచి వడ్డీ!
FD Interest Rate: దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఇటీవల సవరించాయి. కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ప్రత్యేక ఎఫ్డీ పథకాలకు గడువు తేదీని కూడా పొడిగించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించాయి. ప్రస్తుతం ఆయా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనవరిలో ఎఫ్డీపై వడ్డీ రేటును రెండుసార్లు సవరించింది. ఒకే టెన్యూర్ ఎఫ్డీపై వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల ఎఫ్డీపై వడ్డీ రేటును సాధారణ కస్టమర్లకు 6.25 శాతం నుంచి 7.05 శాతానికి పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ అందిస్తోంది. రేట్లు సవరించిన తర్వాత ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్ (IDBI): ఐడీబీఐ బ్యాంక్ కూడా ఇటీవల ఎఫ్డీ వడ్డీ రేటును సవరించింది. మార్పు తర్వాత 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.50 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB): బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త మెచ్యూరిటీ వ్యవధితో ప్రత్యేక స్వల్పకాలిక ఎఫ్డీని ప్రారంభించింది. ఇందులో కస్టమర్లకు అధిక వడ్డీ లభిస్తుంది. కొత్త రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి. బ్యాంక్ 360D (bob360) పేరుతో కొత్త మెచ్యూరిటీ ఎఫ్డీని తీసుకొచ్చింది. ఇది సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్తరేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్డీలపై సాధారణ కస్టమర్లకు 4.25 శాతం నుంచి 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం నుంచి 7.65 శాతం వడ్డీ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ : ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 500 రోజుల వ్యవధిలో గరిష్టంగా 8 శాతం రాబడిని అందిస్తోంది. సవరించిన రేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.50 శాతం నుంచి 8.00 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. గమనిక: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. డబ్బులు డిపాజిట్ చేసే ముందు వివరాలు క్షణ్ణుంగా తెలుసుకోవడం అవసరం. -
దేశంలోని ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఆర్బీఐ కీలక ప్రకటన!
దేశంలో సామాన్యులు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యను అరికట్టేందుకు ఆర్ బీ ఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇక నుంచి నగదుతో పనిలేకుండా, చిల్లర సమస్యలు లేకుండా ప్రయాణాలకు చెల్లింపులు సులభతరం కానున్నాయి. ప్రయాణికులకు డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం, వేగం, స్థోమత, భద్రతను అందించేలా విధ ప్రజా రవాణా వ్యవస్థల్లో చెల్లింపులు చేసేందుకు వీలుగా బ్యాంక్, నాన్-బ్యాంకులకు బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పీపీఐ PPI-MTS (ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు-మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్) సాధానాల్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది పీపీఐ అంటే? ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ ఇన్ స్ట్రుమెంట్ (పీపీఐ)లు డిజిటల్ వాలెట్స్ గా పనిచేస్తాయి. వీటిలో మనీని యాడ్ చేసుకొని, వేర్వేరు లావాదేవీలు చేసుకోవచ్చు. అమెజాన్ పే, పేటీఎం,ఫోన్ పే వంటివి డిజిటల్ వాలెట్స్ ను అందిస్తున్నాయి. కస్టమర్ ఈ వాలెట్లలో డబ్బులు యాడ్ చేసుకుంటే, ఆ మనీ బ్యాంక్ అకౌంట్ లో స్టోర్ అవ్వదు. బదులుగా పేమెంట్ కంపెనీ దగ్గర స్టోర్ అవుతుంది. పేమెంట్స్ చేసేటప్పుడు వాలెట్ లోని మనీ కట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి కాదు. తాజాగా ఆర్ బీ ఐ ప్రయాణ సమయాల్లో పీపీఐని వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రీపెయిడ్ సాధనాలు మెట్రో, బస్సులు, రైలు, జలమార్గాలు, టోల్లు, పార్కింగ్ వంటి వివిధ ప్రజా రవాణా మార్గాలలో చెల్లింపుల కోసం మాత్రమే ప్రారంభించబడతాయి. ఈ ప్రీపెయిడ్ సాధనాలకు హోల్డర్ల కేవైసీ ధృవీకరణ అవసరం లేదు. -
ఆర్థిక సైబర్ నేరాలకు చెక్
సాక్షి, అమరావతి :‘బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది చెప్పిండి’ ఇటీవల కాలంలో మితిమీరి పెరుగుతున్న కాల్స్ ఇవీ. ఆ ఫోన్ కాల్ బ్యాంకు నుంచో లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచే వచ్చిందని నమ్మి ఓటీపీ చెబితే.. బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మంతా కొల్లగొడుతున్నారు. ఇలాంటి సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉపక్రమించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల పేరుతో మితిమీరుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇటీవల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై చర్చించాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్’ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక సిరీస్‌తో నంబర్ల కేటాయింపు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు కాల్ చేసే నంబర్లకు ప్రత్యేక సిరీస్ కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం సాధారణ టెలికాం సంస్థలు వినియోగదారులకు కేటాయిస్తున్న 10 అంకెల సిరీస్ నంబర్లనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కూడా కేటాయిస్తున్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. 2023లో అటువంటి మోసాలకు పాల్పడ్డ 1.40 లక్షల ఫోన్ నంబర్లను సైబర్ పోలీసులు గుర్తించి వాటిని బ్లాక్ చేశారు. అంటే ఈ తరహా మోసాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఆధార్ కార్డ్ అప్డేట్ లేదా పాన్ నంబర్ లింక్ చేయాలనో.. ఫోన్ నంబర్ అప్డేట్ చేయాలనో రకరకాల పేరుతో బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. అవగాహనలేకో పొరపాటులో ఓటీపీ నంబర్ చెబితే నగదు కాజేస్తున్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సాధారణ టెలికాం వినియోగదారులకు కేటాయించే సెల్‌ఫోన్ నంబర్ సిరీస్ కేటాయించకూడదని హోం శాఖ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ (ట్రాయ్) గతంలోనే సూచించిన విధంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రత్యేకంగా నంబర్ సిరీస్ (140+...)తో ఫోన్ నంబర్లు కేటాయిస్తారు. కాబట్టి ఆ సిరీస్ నంబర్ల నుంచి కాల్ వస్తేనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసినట్టుగా భావించాలి. సాధారణ ఫోన్ నంబర్ల సిరీస్ నుంచి కాల్చేసి తాము బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేస్తున్నామని చెబితే.. వినియోగదారులు వెంటనే అప్రమత్తమవుతారు. సైబర్ నేరాల ముఠాల పనేనని గుర్తించి ఆ ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా జాగ్రత్త పడతారు. మోసపోయిన సొమ్ము తిరిగి ఇప్పించేలా.. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తాన్ని నిర్ణిత వ్యవధిలోనే తిరిగి ఇప్పించే ప్రక్రియను కూడా కేంద్ర హోం, ఆర్థిక శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. మోసానికి పాల్పడిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, ఆ ఖాతాల్లో ఉన్న మొత్తం నుంచి బాధితుల సొమ్మును వారి ఖాతాలకు మళ్లించడం అనే ప్రక్రియకు నిర్ణిత గడువును నిర్దేశించాలన్నారు. బాధితులు పదేపదే పోలీస్ స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి ఇప్పించనున్నారు. బ్యాంకులు ని ర్ణిత ఫార్మాట్లో సైబర్ పోలీసులకు సమరి్పంచాల్సిన సమాచారం నమూనాను రూపొందించారు. -
బ్యాంకులే కస్టమర్లకు ఫైన్ కట్టాలి.. ఎందుకో తెలుసా?
సాధారణంగా బ్యాంకులకు కస్టమర్లకు పైన్ కడుతుంటారు. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెన్ టైన్ చేయకపోవడమో లేదా తీసుకున్న లోన్ సరైన సమయంలోగా చెల్లించకపోయిన బ్యాంకులు పెనాల్టీ వేస్తుంటాయి. మరి బ్యాంకుల నుంచి కస్టమర్లు కూడా ఫైన్ కట్టించుకోవచ్చని తెలుసా ? నిబంధనలు పాటించకపోతే ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు కూడా ఫైన్ కట్టాల్సిందే. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ వాడకం బాగా విస్తృతం అయింది. దాదాపు అందరూ వీటిని ఉపయోగిస్తుంటారు. చేతిలో డబ్బు లేనప్పుడు వాటిని ఉపయోగించి వస్తువులు కొనుకోవడం, ఇతరత్రా అవసరాలకు డబ్బు వాడుకుంటుంటారు. క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్న అమౌంట్ సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వాడుకున్న డబ్బు సరైన సమయానికి చెల్లించని పక్షంలో పెనాల్టీల ద్వారా బాంకులు కస్టమర్ల నుంచి అధిక ఫైన్ వసూలు చేస్తుంటాయి. అయితే ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులు ఉన్నవారు, వాటి అవసరం లేదనుకున్నవారు క్లోజ్ చేస్తుంటారు. ఇలా క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తుంటాయి. ఎందుకంటే వాటి నుంచి ఫీజ్ ల ద్వారా వచ్చే ఆదాయం పోతుందనే భావనతోనో లేదా మరేదైనా కారణంతో బ్యాంకులు కొంత ఆలస్యం చేస్తుంటాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలని బ్యాంకును ఆశ్రయించిన తరువాత వారం రోజుల్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వారం రోజులు దాటినప్పటికి ఆ బ్యాంకు నిర్లక్ష్యం వహిస్తే ఆ క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు సంబంధిత బ్యాంక్ పై ఫిర్యాదు చేయవచ్చు. అలా చేస్తే ఆ బ్యాంకు నిర్లక్ష్యం చేసిన రోజులన్నిటికి రోజుకు రూ. 500 చొప్పున పెనాల్టీ రూపంలో బాధిత కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది. -
అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్‌లు క్లోజ్!
అగ్రరాజ్యం అమెరికాలో రికార్డ్ స్థాయిలో బ్యాంక్ శాఖలు మూత పడుతున్నాయి. అక్కడి బ్యాంకులు గత నెలలో ఒక్క వారంలో 37 బ్యాంచ్‌లను మూసివేయడానికి అనుమతి కోరాయి. మూసేస్తున్న బ్యాంచ్లలో మూడింట రెండు వంతులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, టీడీ బ్యాంక్, కీబ్యాంక్ శాఖలే ఉన్నాయి. అమెరికాలో బ్రాంచ్‌లను మూసేస్తున్న బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు వరుసలో నిలిచింది. ఇది గత సంవత్సరం దాదాపు 160 శాఖలను మూసేసింది. 2024 మొదటి నెలలోనే 30 బ్రాంచ్‌లు మూసేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ధోరణి ఇంతటితో తగ్గేలా కనిపించడం లేదు. యూఎస్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ‘ఆఫీస్ ఆఫ్ ద కంప్ట్రోలర్ ఆఫ్ ద కరెన్సీ’ (OCC) నుంచి సమాచారం ఆధారంగా జనవరి 21 నుంచి 27వ తేదీ వరకు మూత పడిన బ్యాంక్ బ్రాంచ్‌ల వివరాలను డైలీ మెయిల్ కథనం పేర్కొంది. అమెరికాలో ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ను మూసివేయాలనుకున్నా లేదా కొత్తది ఏర్పాటు చేయాలనుకున్నా ఓసీసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. యూఎస్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ప్రకారం.. గత జనవరి నెలలో మొత్తం 139 షెడ్యూల్డ్ బ్యాంక్ బ్రాంచ్‌లు శాశ్వతంగా మూతపడ్డాయి. 2023లో నెలవారీ సగటు కంటే ఇది అధికం. మరో వారంలో 41 శాఖలు మూసివేస్తామని అమెరికన్ బ్యాంకులు గత నెలలోనే ప్రకటించాయి. -
పర్సనల్ లోన్స్ అతి తక్కువ వడ్డీ రేటు ఇచ్చే టాప్ 5 బ్యాంక్స్ ఇవే..
-
ఆర్బీఐ, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల నుంచి కేంద్రానికి రూ.70,000 కోట్లు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల (ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్) ద్వారా ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.70,000 కోట్ల డివిడెండ్‌ను పొందవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ మేరకు అంచనాలు ఉండవచ్చన్నది సమాచారం. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్స్ నుంచి రూ.48,000 కోట్ల డివిడెండ్లను కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఈ మొత్తం లక్ష్యాన్ని మించి వనగూడాయి. ఒక్క ఆర్బీఐ రూ.87,416 కోట్ల డివిడెండ్‌ను అందించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇదే సానుకూల అంకెలు వచ్చాయి. దీనితో 2023–24 కన్నా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీ డివిడెండ్లు వెలువడుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి 2023–24లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతంగా బడ్జెట్ అంచనా. 2025–26లో దీనిని 4.5 శాతానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 5.4 శాతంగా ద్రవ్యలోటు ఉండాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్స్‌లో భాగంగా ఉంది. -
Davos: బ్యాంకులతో ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక చర్చలు
జ్యురిచ్: రష్యాతో యుద్ధంలో చితికిపోయిన ఉక్రెయిన్ దేశాన్ని పునర్నిర్మించేందుకు ఆ దేశ అధ్యకక్షుడు జెలెన్స్కీ నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారు. సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు, అగ్రశ్రేణి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల యాజమాన్యాలను జెలెన్స్కీ కలుస్తున్నారు. తమ దేశాన్ని పునర్నిర్మించేందుకు అప్పులివ్వడంతో పాటు పెట్టుబడులు పెట్టాల్సిందిగా జెలెన్స్కీ వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేస్ సీఈవో జేమీ డైమన్తో జెలెన్స్కీ సమావేశమయ్యారు. డైమన్తోనే కాక ప్రముఖ పీఈ సంస్థలు బ్లాక్‌రాక్, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్, కార్లైల్ గ్రూపు, బ్లాక్‌స్టోన్ సంస్థల యాజమాన్యాలతోనూ జెలెన్స్కీ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ ‘2023లో ఉక్రెయిన్ ఎకానమీ 5 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది మరో 4.6 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు ప్రభుత్వ పెట్టుబడితో పాటు ప్రైవేటు పెట్టుబడి కూడా ఎంతో ముఖ్యం’అని జెలెన్ స్కీ తెలిపారు. కాగా, తాజాగా ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్‌కు తక్షణమే 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కావాలని తన భాగస్వామ్య దేశాలను కోరడం గమనార్హం. ఇదీచదవండి.. చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు -
బ్యాంక్‌లోన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలంటే..
బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. అన్ని సందర్భాల్లోనూ రుణం దొరకండ అంత తేలికేమీ కాదు. కొందరికి ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం కష్టం అవుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకున్నప్పటికీ బ్యాంకులు రుణ దరఖాస్తును తిరస్కరిస్తోంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు రుణగ్రహీత ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. రుణ దరఖాస్తును తిరస్కరించేందుకు చాలా కారణాలుంటాయి. అంతకు ముందు తీసుకున్న రుణాల చెల్లింపు తీరు, ఆదాయాన్ని మించిన అప్పుల్లాంటివీ ఇందులో ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరించిన వెంటనే మళ్లీ కొత్తగా వేరే బ్యాంకులో దరఖాస్తు చేయకముందు చాలా విషయాలు సరిచేసుకోవాలి. మీ దరఖాస్తును బ్యాంకు ఎందుకు తిరస్కరించిందో కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రుణదాతలు కచ్చితంగా దీన్ని తెలియజేస్తారు. క్రెడిట్ స్కోరు 700 పాయింట్ల లోపు ఉన్నప్పుడు రుణ దరఖాస్తును ఆమోదించడం కష్టం. తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలు మీ ఆదాయంలో 50-60 శాతానికి చేరడం, వాయిదాలను ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగంలో సమస్యలు, తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి చట్టపరమైన చర్యల వంటి వాటివల్లా దరఖాస్తు తిరస్కరించే ఆస్కారం ఉంది. మీ క్రెడిట్ నివేదికలో తప్పుడు వివరాలూ కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. వాయిదాలు చెల్లింపులో.. రుణ తిరస్కరణ ఎదురుకాకుండా చూసుకునేందుకు ఆరోగ్యకరమైన రుణ చరిత్రను నిర్వహించడం ఎంతో కీలకం. వాయిదాలను సకాలంలో చెల్లించాలి. 750కి మించి క్రెడిట్ స్కోరున్నప్పుడు రుణ దరఖాస్తును సులభంగా ఆమోదిస్తారు. తక్కువ స్కోరు వల్లే రుణం లభించలేదు అని తేలితే.. ముందుగా స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. చిన్న మొత్తంలో ఉన్న అప్పులను పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు క్రమంగా పెరుగుతుంది. తప్పుడు వివరాలుంటే.. వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా, సంతకం, పాన్, ఆధార్ ఇలా పలు వివరాలను రుణ దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ రుణదాతల యాప్‌లోనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటిలో ఏ చిన్న పొరపాటు గుర్తించినా, రుణ దరఖాస్తు ఆమోదం పొందదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలు సరిచూసుకోవాలి. నిత్యం లోన్లు అడుగుతుంటే.. కొంతమంది అవసరం లేకపోయినా వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులను సంప్రదిస్తారు. ఇలా మీరు అడిగిన ప్రతిసారీ మీ క్రెడిట్ స్కోరు స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి, తక్కువ వ్యవధిలోనే బహుళ రుణ దరఖాస్తులు మీ క్రెడిట్ స్కోరును గణనీయంగా దెబ్బతీస్తాయి. మీ స్కోరును కాపాడుకునేందుకు సాధ్యమైనంత వరకూ తక్కువ దరఖాస్తులు చేయడం మేలు. అనేకసార్లు దరఖాస్తు చేస్తే.. మీరు అప్పుల మీదే ఆధారపడుతున్నారని బ్యాంకులు భావించే అవకాశం ఉంది. తనిఖీలు చేసుకోండి.. క్రెడిట్ నివేదికలో తప్పులు దొర్లినప్పుడు వాటిని వెంటనే గుర్తించేలా ఉండాలి. కాబట్టి, క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. కొన్ని క్రెడిట్ బ్యూరోలు నెలకోసారి వీటిని ఉచితంగానే అందిస్తాయి. మీ ఆర్థిక ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఏదైనా పొరపాట్లు ఉంటే, వెంటనే వాటిని గుర్తించి, సరి చేసుకునేందుకు వీలవుతుంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు, అది పెరిగేందుకు కొంత సమయం పడుతుంది. రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బాకీల్లాంటివి సకాలంలో చెల్లించాలి. అప్పుడు మీపై బ్యాంకులకు విశ్వాసం పెరిగి, రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలుంటాయి. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: క్లెయిమ్ చేయని డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచుగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించేందుకు, ఆ నిధులను వాటి అసలు యజమానులకు తిరిగి అందించేందుకు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలకు ఈ మార్గదర్శకాలు అదనంగా ఉండనున్నాయి. నోటిఫికేషన్ ప్రకారం వినియోగంలో లేని ఖాతాలు, అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి లేఖలు, ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఖాతాదారులను సంప్రదించేందుకు బ్యాంకులు ప్రయత్నించాలి. ఈమెయిల్/ఎస్ఎంఎస్లను మూడు నెలలకోసారి ప్రాతిపదికన పంపాలి. అవసరమైతే ఖాతాదారును కనుగొనేందుకు ఇంట్రడ్యూసర్‌ను, నామినీని కూడా సంప్రదించాలి. -
ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలను ఆవిష్కరించండి
న్యూఢిల్లీ: నిధుల సమీకరణకు బ్యాంకులు ఆకర్షణీయమైన, వినూత్న డిపాజిట్ పథకాలను ఆవిష్కరించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించారు. తద్వారా బ్యాంకులు తమ రుణ వృద్ధిని కూడా సాధించగలుగుతాయని అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఎండీ, సీఈఓల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మోసం, ఉద్దేశపూర్వక డిఫాల్ట్‌లకు సహకరించే అధికారులపై కఠిన పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. బ్యాంకింగ్ డిపాజిట్ వృద్ధి గత కొన్ని నెలలుగా క్రెడిట్ వృద్ధికి అనుగుణంగా లేదు. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినప్పటికీ క్రెడిట్– డిపాజిట్ వృద్ధి మధ్య అంతరం ఇప్పటికీ 3 నుంచి 4 శాతంగా ఉంది. ఇటీవల ఎస్బీఐ (అరశాతం), బ్యాంక్ ఆఫ్ బరోడా (125 బేసిస్ పాయిట్ల వరకూ) తమ డిపాజిట్ రేట్లను పెంచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెరుగైన పనితీరు పట్ల ఆర్థికమంత్రి ఈ సమావేశంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. బ్యాంకు మోసాలు వ్యక్తిగత ఖాతాదారులకు ఆర్థిక సంస్థల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని, ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందనీ ఆమె హెచ్చరించారు. అందువల్ల ఆయా పరిణామాలు తలెత్తకుండా బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు రూ. 68,500 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. వాణిజ్య బ్యాంకుల స్ధూల మొండిబకాయిల నిష్పత్తి 2023 మార్చి నాటికి 3.9 శాతం ఉంటే, సెపె్టంబర్ నాటికి 3.2 శాతానికి తగ్గాయి. ఈ సమావేశంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఎఆర్‌సిఎల్) ఖాతాల సేకరణ పురోగతిపై కూడా చర్చ జరిగింది. -
కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు?
ఇండియన్ రూపాయి సుమారు పదేళ్లపాటు అంతర్జాతీయ మార్కెట్లో ప్రజలను, పాలకులను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. గ్లోబల్, దేశీయ పరిస్థితులు 2013లో రూపాయి పతనానికి దారితీశాయి. నాటి నుంచి ఇంచుమించు స్థిరంగా కొనసాగిన భారత కరెన్సీ- ఈసారి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆటుపోట్లకు గురైంది. 2021 నుంచి దాదాపు 12 శాతం నష్టపోయింది. అయితే 2023లో దాదాపు కన్సాలిడేషన్‌లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి కొంతకాలంగా పతనమవుతూ వచ్చింది. డాలరు బలపడటం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వు 2023లో వడ్డీరేట్లను మొదట్లో కొంతమేర పెంచినా తదుపరి వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని సానుకూలంగా స్పందించింది. భారత దిగుమతుల్లో అత్యధికం ముడిచమురే కావడంతో, పెరిగిన ధరల కారణంగా వాణిజ్యలోటు ఏర్పడింది. మదుపరులు ఈక్విటీ, రుణాల రూపంలో ఉన్న విదేశీ ప్రైవేటు పెట్టుబడులను డాలర్లలోకి మార్చుకోవడంతో రూపాయి విలువ పడిపోయింది. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ నెలలో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల్లోకి చేరుకోవడంతో తిరిగి ఎఫ్ఐఐలు మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా నెల రోజుల నుంచి రూపాయి కన్సాలిడేషన్‌లో ఉంది. రూపాయి పతనానికి ఈ ఏడాదిలో కొంత విరామం లభిస్తుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. గతంలో మన కరెన్సీ పతనానికి దారితీసిన పరిస్థితుల తీవ్రత 2024లో అంతగా ఉండకపోవచ్చు. భారత్ తన చమురు అవసరాలకు సుమారు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. నిజానికి ముడిచమురు వినియోగం దేశ ఆర్థికప్రగతికి చిహ్నం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. మన చమురు దిగుమతులు దేశ మొత్తం దిగుమతుల్లో 30శాతం వరకు ఉన్నాయి. తగ్గనున్న కరెంటు ఖాతా లోటు.. భారత కరెంటు ఖాతాలో సింహభాగం సాఫ్ట్వేర్ ఎగుమతులు, ప్రైవేటు బదలాయింపులదే. భవిష్యత్తులో ఈ రెండింటి వాటా ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. దిగివస్తున్న ముడిచమురు ధరలతో వస్తు వాణిజ్యలోటు తగ్గుముఖం పట్టడం; సాఫ్ట్వేర్, ప్రైవేటు బదలాయింపులు పెరగడం- కరెంటు ఖాతా లోటును కొంతవరకు పరిష్కరించగలుగుతాయి. కొత్త ఏడాదిలో ముఖ్యంగా ముడిచమురు వాణిజ్య లోటు తగ్గడం, కరెంటు ఖాతా లోటు సన్నగిల్లడం, విదేశీ పెట్టుబడుల రాక వంటి బలమైన ఆర్థిక పరిస్థితులు రూపాయిని బలోపేతం చేస్తాయని చెప్పవచ్చు. మాంద్యం ప్రభావం ఇలా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులతో కొన్ని దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాదిలో మాంద్యం మరింత తీవ్రంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023లో ప్రపంచ వృద్ధిరేటు 3 శాతం. 2024లో ఇది 2.9 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గతంలో వెల్లడించింది. ఈలోగా డాలరు సాధారణంగానే బలపడుతుంది. 2001 మాంద్యం సమయంలో డాలరు సూచీ ఆ ఏడాది జనవరిలో 108గా ఉండగా జులై నాటికి 121కు పెరిగి, ఆ తరవాత తగ్గింది. అలాగే 2008-09 మాంద్యం కాలంలో డాలరు సూచీ 71 నుంచి 89కు ఎగబాకి ఆ తరవాత కిందికి వచ్చింది. అంటే సాధారణంగా మాంద్యం సమయంలో డాలరు తొలుత బలపడి, తరవాత బలహీనపడుతుంది. ఇదీ చదవండి: ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే.. మిగతా దేశాలపై ఉన్నట్లే ఒకవేళ భారత్‌పైనా మాంద్యం ప్రభావం ఉంటుందని భావించినా- మాంద్యం మధ్యకాలం నుంచి విదేశీ పెట్టుబడులు భారత్‌లో విశేషంగా ప్రవహించి ఆ ప్రవాహం కొన్నాళ్లు కొనసాగుతుందని చరిత్ర చెబుతోంది. 2008-09 సంక్షోభ సమయంలో భారత్ నుంచి 1200 కోట్ల డాలర్ల మేర ఈక్విటీ వెనక్కి తరలిపోయింది. 2009లో మార్చి-జూన్ మధ్య మాంద్యం తిరోగమనం పట్టడంతో తిరిగి ఈక్విటీ రూపంలో పెట్టుబడులు భారత్‌లోకి రావడం మొదలయ్యాయి. అదే ఏడాది మార్చి- డిసెంబరు కాలంలో 1800 కోట్ల డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. దీన్ని బట్టి మాంద్యం తీవ్రరూపం దాల్చినా స్వల్పకాలమే ఉంటుందని చెప్పవచ్చు. -
బ్యాంక్లపైనే ఆధారపడొద్దు
ముంబై: నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలని, బ్యాంక్‌లపై ఆధారపడడాన్ని పరిమితం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలకు) ఆర్బీఐ సూచించింది. బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లు పటిష్టం చేసుకుని, మోసాలు, డేటా చోరీల నుంచి రక్షణ కలి్పంచుకోవాలని కోరింది. దేశ బ్యాంకింగ్ రంగం, ఎన్బీఎఫ్సీలు బలంగా ఉన్నాయంటూ.. అధిక నగదు నిష్పత్తి, మెరుగుపడిన ఆస్తుల నాణ్యత, లాభాల్లో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. ఈ మేరకు బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పరస్పర అనుసంధానత పెరిగిన నేపథ్యంలో.. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలి. బ్యాంక్‌లపై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. కస్టమర్లకు సేవల విషయంలో మరింత కృషి చేయాలి’’అని ఆర్బీఐ కోరింది. సైబర్ దాడుల రిస్క్ నూతన టెక్నాలజీల అమలు నేపథ్యంలో సైబర్ దాడులు, డేటా చోరీ, నిర్వహణ వైఫల్యాలు పెరిగినట్టు పేర్కొంది. మెరుగైన పాలన, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాలన్స్ షీట్లను పటిష్టం చేసుకుని, పెరుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలను చేరుకునే విధంగా ఉండాలని కోరింది. ‘‘ఈ విధమైన సాంకేతిక, సైబర్ భద్రతా రిస్క్‌లను గుర్తించి, వాటి ముప్పును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. బలమైన గవర్నెన్స్, రిస్క్ నిర్వహణ విధానాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి’’అని సూచించింది. -
వరల్డ్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ లోన్.. కారణం ఇదే
న్యూఢిల్లీ: రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడం కోసం ప్రపంచ బ్యాంక్‌తో రూ.1,300 కోట్లకు పైగా లైన్ ఆఫ్ క్రెడిట్‌పై (ఎల్ఓసీ) సంతకం చేసినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం తెలిపింది. గృహ,ఇన్స్టిట్యూషనల్ విభాగాల్లో గ్రిడ్‌కు అనుసంధానించే రూఫ్‌టాప్ సోలార్ పీవీ ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇవ్వడం కోసం ఈ ఎల్ఓసీ అని ఎస్బీఐ శుక్రవారం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్ట్‌లకు రుణ సా యం అందించేందుకు యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌తో సుమారు రూ.1,800 కోట్ల ఎల్ఓసీపై ఎస్బీఐ ఈ వారం ప్రారంభంలో సంతకం చేసింది.ఎల్ఓసీ అనేది బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థ ద్వారా ప్రభుత్వం, కంపెనీ లేదా వ్యక్తిగత కస్టమర్‌కు ఇచ్చే రుణ సదుపాయం. -
20 ఖాతాలను సమీక్షించండి.. బ్యాంకులకు ఆర్థిక శాఖ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) నిర్వహణలో భాగంగా ఇన్సాల్వెన్సీ– దివాలా కోడ్ కింద దాఖలైన టాప్ 20 ఖాతాలను నెలవారీగా పర్యవేక్షించాలని, సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులను కోరింది. పీఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలతో జరిగిన సమావేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి మాట్లాడుతూ, నెలవారీగా టాప్ 20 దివాలా కేసులను సమీక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) పని తీరును కూడా సమీక్షించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెజారిటీ వాటాతో ఎన్ఏఆర్సీఎల్ 2021లో ఏర్పాటయి న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే.. కెనరా బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్‌గా ఉంది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది. -
వడ్డీతో సహా చెల్లించాల్సిందే.. కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో బ్యాంకింగ్‌కు అనుకూలంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) బుధవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లు సంయుక్తంగా బ్యాంకులకు కార్వీ తాకట్టు పెట్టిన షేర్లను తిరిగి ఇవ్వాలని లేదా బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్వీ రుణదాతలకు (బ్యాంకులకు) ఎన్ఎస్డీఎల్, ఎన్ఎస్ఈ, సెబీలు వార్షికంగా 10 శాతం వడ్డీ సహా షేర్ల విలువ రూ. 1,400 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కేసు వివరాల్లోకి వెళితే... క్లయింట్ సెక్యూరిటీలను కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసిననట్లు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2019లో ధ్రువీకరించింది. బ్యాంకుల వద్ద రూ.2,300 కోట్లకుపైగా విలువైన ఖాతాదారుల సెక్యూరిటీలను స్టాక్ బ్రోకర్ తాకట్టు పెట్టినట్లు పేర్కొంది. అయితే తాము బ్రోకరేజ్ సంస్థకు ఇచ్చిన రుణాలకుగాను (ప్లెడ్జ్ ఆధారంగా) ఈ తనఖా షేర్లను సర్దుబాటు చేసుకుంటామని యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సెబీని అభ్యర్థించాయి. అయితే దీనిని సెబీ తిరస్కరించింది. తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను బ్యాంకులకు బదిలీ చేయవద్దని రెగ్యులేటర్ డిపాజిటరీని ఆదేశించిన సెబీ, ఈ షేర్లను తిరిగి క్లయింట్ ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని డిపాజిటరీని ఆదేశించింది. దీనితో రుణ దాతలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్‌లో తాజాగా రెండు వేర్వేరు రూలింగ్ ఇస్తూ, సెబీ ఆదేశాలను తప్పుపట్టింది. -
మా వ్యూహం అదే..టాప్–5లో ఫెడరల్ బ్యాంక్
కోల్‌కతా: వృద్ధి వ్యూహంలో భాగంగా తాము ఫిన్‌టెక్ కంపెనీలతో జట్టు కట్టనున్నట్టు ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ ప్రకటించారు. టాప్–5 బ్యాంకుల్లో ఒకటిగా అవతరించడమే తమ లక్ష్యమన్నారు. ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యంతో తాము పెద్ద సంఖ్యలో కస్టమర్లను చేరుకోగలమన్నారు. ఫిన్‌టెక్ కంపెనీలతో పోటీ పడడం కంటే, వాటి సహకారానికే తాము ప్రాధాన్యమిస్తామని చెప్పారు. బ్యాంక్ అంతర్గత వృద్ధి వ్యూహంలో ఇది భాగమన్నారు. ఫిన్‌టెక్‌లు బ్యాంక్‌కు గణనీయమైన విలువను తెచ్చి పెడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కొత్త ఖాతాల ప్రారంభం దిశగా కస్టమర్లను సొంతం చేసుకోవడానికి ఫిన్‌టెక్ కంపెనీలు సాయపడతాయి. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ రోజూ 15,000 కొత్త ఖాతాలను తెరుస్తోంది. ఇందులో 60 శాతం ఫిన్‌టెక్ సంస్థల ద్వారానే వస్తున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఖాతాలు’’అని చెప్పారు. ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా రుణాల మంజూరు అన్నది ప్రధానంగా క్రెడిట్ కార్డుల రూపంలో ఉంటున్నట్టు తెలిపారు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య సమతుల్యాన్ని పాటిస్తూ, సొంతంగానే తాము వృద్ధిని సాధించగలమన్నారు. ‘‘మా పోర్ట్‌ఫోలియోలో 3 శాతం మేర క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాల రూపంలో అన్సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. ఉత్పత్తులు, విభాగాలు, ప్రాంతాల వారీగా వైవిధ్యం పాటించాలన్నది మా విధానం’’అని శ్రీనివాసన్ వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు రుణ వితరణకు సబంధించి గ్రీన్ బ్యాంకింగ్‌పైనా తాము దృష్టి సారించినట్టు చెప్పారు. శాఖల విస్తరణ దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను తెరిచే ప్రణాళికతో ఉన్నట్టు శ్రీనివాసన్ ప్రకటించారు.‘‘ప్రస్తుతం మాకు 1408 శాఖలు ఉన్నాయి. 2024 జనవరి నుంచి 2025 మధ్య నాటికి మరో 250 శాఖలను తెరవాలన్నది ప్రణాళిక’’అని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ శాఖల విస్తరణ చేపడతామన్నారు. ఏటా 100 నుంచి 150 శాఖలు తెరవాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. -
బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్ కామత్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ముప్పు పొంచి ఉందా.. విస్తృతమవుతున్న డీప్ ఫేక్‌లు బ్యాంకులనూ బురిడీ కొట్టిస్తాయా? అవుననే హెచ్చరిస్తున్నారు ప్రముఖ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బ్యాంకులకు ఎదురుకానున్న సమస్యలను తెలియజేస్తూ ఆయనో వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విస్తృతమైంది. ఈ క్రమంలోనే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఈ టెక్నాలజీని తమ కార్యకలాపాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. అయితే ఏఐ టెక్నాలజీని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. సెలబ్రిటీల డీప్ ఫేక్‌లు సృష్టిస్తున్నారు. ఇది ఇక్కడికే పరిమితం కాదని, పెరుగుతున్న ముప్పును హైలైట్ చేస్తూ నితిన్ కామత్ ‘ఎక్స్’లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. డీప్‌ఫేక్ కస్టమర్ గుర్తింపులను ధ్రువీకరించడంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలియజేశారు. నిజమా.. ఏఐ కల్పితమా? ప్రస్తుతం కస్టమర్లు నేరుగా బ్యాంకులకు, కార్యాలయాలకు వెళ్లడం తగ్గిపోయింది. అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు డిజిలాకర్ లేదా ఆధార్‌ని ఉపయోగించి కస్టమర్ల ఐడీ, అడ్రస్ ప్రూఫ్ డేటాను బ్యాంకులు పొందుతున్నాయి. ఇక ఖాతాను తెరిచే వ్యక్తితో ఈ ఐడీని వెబ్‌క్యామ్ ద్వారా నిర్ధారించుకుంటున్నాయి. అయితే డీప్‌ఫేక్‌లు పెరుగుతున్న కొద్దీ అవతలి వైపు ఉన్న వ్యక్తి నిజమా లేదా ఏఐ కల్పితమా అన్నది ధ్రువీకరించడం కష్టమవుతుందని తాను భావిస్తున్నట్లు నితిన్ కామత్ పేర్కొన్నారు. ఆన్‌బోర్డింగ్ సమయంలో మరింత కఠినమైన నియంత్రణ అవసరాలు ఉన్న బ్యాంకులకు ఈ సమస్య మరింత పెద్దదిగా మారుతుందన్నారు. ఇది కూడా చదవండి: మస్క్ వారి మరమనిషి మరింత కొత్తగా.. టెస్లా రోబో 2.0! ఈ ముప్పును అధిగమించడానికి రానున్న రోజుల్లో ఎలాంటి నిబంధనలు రూపొందిస్తారు.. ఖాతాలు తెరవాలంటే నేరుగా బ్యాంకులకే వెళ్లాల్సిన రోజులు మళ్లీ వస్తాయా అన్నది చూడాలి. వీడియో చివరిలో నితిన్ కామత్ ‘ఇక్కడ ఉన్నది నేను కాదు.. ఇది డీప్ ఫేక్’ అంటూ చమత్కరించారు. The rise of AI technology and deepfakes pose a large risk to the financial services industry. The tipping point for Indian financial services businesses was when onboarding became completely digital, thanks to Aadhaar, etc. For businesses onboarding a new customer, an important… pic.twitter.com/DI9Z1Q3jxY — Nithin Kamath (@Nithin0dha) December 13, 2023 -
Fixed Deposits: శుభవార్త.. వడ్డీ రేట్లు పెరిగాయ్..
స్థిరమైన ఆదాయంతోపాటు భవిష్యత్తుకు భద్రతనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి ఉన్న వారికి శుభవార్త. ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ వద్ద చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచాయి. మెరుగైన వడ్డీ రేటు కోసం చూస్తున్నవారికి ఇదే మంచి సమయం. పలు బ్యాంకులు వివిధ కాల వ్యవధులు, డిపాజిట్ మొత్తాన్ని బట్టి 8 శాతం వరకూ వార్షిక వడ్డీని అందిస్తున్నాయి. కీలకమైన రెపో రేటును 6.5 వద్దే యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ రానున్న నెలల్లోనూ అలాగే ఉంచుతుందన్న అంచనాల నేపథ్యంలో కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఆయా బ్యాంకులు తమ వెబ్సైట్లలో ప్రకటించిన ఎఫ్డీ రేట్లు ఇక్కడ అందిస్తున్నాం.. వివిధ బ్యాంకుల ఎఫ్డీ రేట్లు ఇవే.. డిసెంబర్లో ఎఫ్డీలపై వడ్డీ రేటును పెంచిన మొదటి బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ 1 నుంచి తమ ఎఫ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్లు, ఆపైన, రూ. 10 కోట్ల లోపు డిపాజిట్ చేసే దేశీయ కస్టమర్లకు ఒక సంవత్సరం కాలవ్యవధికి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు డిపాజిట్లపై ఎఫ్డీ రేట్లను సవరించింది. ఏడు నుంచి 14 రోజుల వ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు వ్యవధిపై గరిష్టంగా 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. ఇవి డిసెంబరు 13 నుంచి అమలులోకి వస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా రూ. 5 కోట్లకు మించిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఏడు నుంచి 14 రోజుల కాలవ్యవధికి కనిష్టంగా 4.75 శాతం, ఏడాది నుంచి 15 నెలల వరకు గరిష్టంగా 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. డిసెంబర్ 13 నుంచి మారిన రేట్ల ప్రకారం.. రూ. 100 కోట్ల నుండి రూ. 500 కోట్లకు మించిన ఎఫ్డీలపై వడ్డీ ఇప్పుడు 7.35 శాతం నుండి 7.30 శాతానికి చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసెంబర్ 11 నుంచి రూ. 2 కోట్ల లోపు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 85 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సాధారణ కస్టమర్ల కోసం కూడా ఎఫ్డీ రేట్లు వివిధ కాల వ్యవధులకు 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి. సీనియర్ సిటిజన్లు ఇప్పుడు 23 నెలల నుండి రెండు సంవత్సరాల వరకు 7.80 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చు. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసే సాధారణ కస్టమర్లకు 23 నెలల ఒక రోజు నుంచి రెండేళ్ల లోపు కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ కూడా తన డిపాజిట్ రేట్లను సవరించింది. రెసిడెంట్ , నాన్-రెసిడెంట్ డిపాజిట్లకు వర్తించే 500 రోజుల కాలవ్యవధికి 7.50 శాతం రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 8.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డీసీబీ బ్యాంక్ డీసీబీ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచింది. డిసెంబరు 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం.. 25 నెలల నుండి 26 నెలల కాలవ్యవధితో సాధారణ డిపాజిట్లపై 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం అత్యధిక వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. -
బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు.. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తుందా?
బ్యాంకు ఉద్యోగుల ఐదురోజుల పనిదినాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పనిదినాల్ని తగ్గించి బ్యాంకు ఉద్యోగుల రోజూవారి పనిగంటలు పెంచమని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో బ్యాంకులు వారానికి ఐదు రోజులు పనిచేయనున్నాయా? ఇదే అంశంపై తాజా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ స్పందించారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పనిదినాల్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అయితే దీనిని కేంద్రం అంగీకరిస్తుందా? లేదా? అని అంశంపై స్పందించలేదు. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి రెండవ శనివారం, నాలుగవ శనివారం రోజు మాత్రమే సెలవు దినాలు. ఒకవేళ కేంద్రం ఐబీఏ ప్రతిపాదనల్ని అంగీకరిస్తే ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కాగా.. రోజూవారి పనిగంటలు పెరిగే అవకాశం ఉందంటూ బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అలెర్ట్, దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె.. బ్యాంక్ సేవలపై ఎఫెక్ట్!
బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్. డిసెంబర్, జనవరిలో అత్యవసరమైన బ్యాంక్ పనులున్నాయా? ఉంటే ఇప్పుడే చూసుకోండి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు డిసెంబర్ 4 నుంచి జనవరి 20 వరకు దేశ వ్యాప్తంగా సమ్మె చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్‌కి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు డిసెంబర్ 4 నుంచి స్ట్రైక్ చేయనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ నియామకాలకు స్వస్తి పలకాలన్న ప్రధాన డిమాండ్లతో బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘అన్ని బ్యాంకులలో తగినంత సిబ్బందిని నియమించాలి. బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగాల ఔట్సోర్సింగ్ లేదా, అవుట్ సోర్సింగ్‌కు సంబంధించిన బీపీ సెటిల్మెంట్ నిబంధనల ఉల్లంఘనను ఆపాలి’ అని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మెలో ప్రైవేట్ బ్యాంకులు సైతం ప్రభుత్వ బ్యాంకులే కాదు, ప్రైవేట్ బ్యాంకులు సైతం సమ్మెలో పాలు పంచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 11న సమ్మెకు దిగనుండగా.. జనవరి 19, 20 తేదీలలో స్ట్రైక్ చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడనుంది. డిసెంబర్ 4 నుంచి సమ్మె ప్రారంభం డిసెంబరు 4న ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ల సమ్మెలతో అఖిల భారత సమ్మె ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5, 6, 7, 8, 11 తేదీల్లో వివిధ బ్యాంకులు మూసివేయబడతాయి. రాష్ట్రాల వారీగా బ్యాంకుల సమ్మె అయితే, జనవరి 2 నుండి సమ్మె ఆయా రాష్ట్రాల వారీగా కొనసాగుతుంది. జనవరి 2తో ప్రారంభమైన ఈ స్ట్రైక్‌లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్, లక్ష్వదీప్‌లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు. జనవరి 3, 4, 5, 6 తేదీల్లో రాష్ట్రాల వారీగా సమ్మె నిర్వహించనున్నారు. యూపీ, ఢిల్లీ బ్యాంకుల సమ్మె ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలోని బ్యాంకులు వరుసగా జనవరి 4, 5 తేదీలలో మూసివేయబడతాయి. రెండు రోజుల సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బ్యాంకులు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
కస్టమర్లకు అలర్ట్: దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న ఉద్యోగులు
న్యూఢిల్లీ: డిసెంబరు నెలలో దేశవ్యాప్త సమ్మెకు దేశంలోని పలు బ్యాంకులు సిద్ద మవు తున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు లక్షల ఉద్యోగాలను భర్తి , బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్వస్తి అనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పలు బ్యాంకులు సమ్మెలో భాగం కానున్నాయి. డిసెంబర్ 4 -11 వరకు బ్యాంకుల వారీగా సమ్మె కొనసాగుతుంది. బ్యాంకుల్లో తగినంత శాశ్వత సిబ్బందిఉండేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాల అవుట్సోర్సింగ్ వల్ల దిగువ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ను తగ్గించడమే కాకుండా కస్టమర్ల గోప్యత , వారి డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనే బ్యాంకుల వివరాలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి. అలాగే డిసెంబరు 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిసెంబరు 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెను పాటిస్తారు.అలాగే డిసెంబరు 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, డిసెంబరు 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డిసెంబరు 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. #BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/YkbNeE87kK — CH VENKATACHALAM (@ChVenkatachalam) November 14, 2023 -
ప్రభుత్వ బ్యాంక్ ‘స్వీట్’ ఐడియా! మిఠాయిలిచ్చి ప్రేమగా అడుగుదాం..
మొండి బకాయిలను రికవరీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ (UCO Bank) సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి శాఖలోని టాప్ 10 డిఫాల్టర్లకు 'స్వీట్ ప్యాకెట్లు' పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. వాళ్లూ ఒకప్పుడు విలువైన కస్టమర్లే ప్రస్తుతం డిఫాల్టర్‌గా మారినవాళ్లు ఒకప్పుడు విలువైన కస్టమర్ అనే విషయాన్ని బ్యాంకు మరచిపోదని యూకో బ్యాంక్ జనరల్ మేనేజర్ (రికవరీ) ధీరజ్ పట్వర్ధన్ అన్ని జోనల్ హెడ్లకు జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ.2వేల నోట్లు మార్చడానికి కిరాయి మనుషులు.. ఆర్బీఐ ఆఫీస్ వద్ద హల్చల్! కాబట్టి, అటువంటి కస్టమర్లతో "సరైన అనుసంధానం"తో వారికి, బ్యాంకుకు మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించవచ్చని ఆయన అన్నారు. దీనివల్ల బ్యాంక్ పట్ల సానుభూతి, సామరస్యం పెరుగుతాయని, కొంత మంది రుణగ్రహీతలు తమ బకాయిలు సెటిల్ చేయడానికి ముందుకు వస్తారని వివరించారు. స్వీట్లిచ్చి దీపావళి శుభాకాంక్షలు దీనికి సంబంధించి యూకో బ్యాంక్ జారీ సర్కులర్‌ను ప్రముఖ బ్యాంకింగ్ కాలమిస్ట్ తమల్ బందోపాధ్యాయ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రతి బ్రాంచ్‌లోని టాప్ 10 ఎన్పీఏ రుణగ్రహీతలకు స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని, బ్రాంచ్ హెడ్లు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని, దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని సర్క్యులర్‌లో బ్యాంక్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను! గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 124 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 223 కోట్లకు పెరిగి 80.80 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,650 కోట్ల నుంచి 21.78 శాతం పెరిగి రూ. 2,009 కోట్లకు చేరుకున్నట్లు యూకో బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఎన్పీఏ రుణాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 4.48 శాతంగా ఉన్నాయి. ఇవి మార్చిలో 4.78 శాతం కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో 7.42 శాతంగా ఉన్నాయి. Wonderful idea. UCO Bank plans to celebrate Diwali, greeting top ten #NPA borrowers of every branch with sweets. @UCOBankOfficial @ChairmanIba @ChiefIba pic.twitter.com/HZJMenPnz5 — Tamal Bandyopadhyay (@TamalBandyo) November 2, 2023 -
లోన్ల పేరుతో.. బ్యాంకులకు రోజుకు రూ.100 కోట్లు ఎగ్గొడుతున్నారు
దేశంలో కావాలనే బ్యాంకు రుణాలు ఎగవేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వెరసి ప్రతి రోజు ఉద్దేశ పూర్వకంగా (Wilful Defaulter) ఎగవేతకు పాల్పడుతున్న సొమ్ము రూ.100 కోట్లుగా ఉంది. గత నాలుగేండ్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.2 లక్షల కోట్ల మేరకు పేరుకుందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఎగవేత దారులు ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే విల్‌ఫుల్ డిఫాల్టర్లు బ్యాంక్‌లకు ఎగవేసిన మొత్తం..దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలో అధికంగా ఉంది. 2019 మార్చి నుంచి మహారాష్ట్రలోని ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల బకాయి మొత్తం రూ.60,000 కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు చేరింది. ఈ తరహా రుణాల్లో 70 శాతం మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడుల్లో పేరుకుపోయింది. గత నాలుగేండ్లలో ఢిల్లీలోనైనే ఉద్దేశపూర్వక ఎగవేత మొత్తం 200 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరగా, మిగిలిన రాష్ట్రాల్లో ఈ పెరుగుదల 95 శాతం మేర ఉన్నది. ఎగవేత దారులంటే? ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2019 మార్చి నుంచి ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంక్‌లకు బకాయిపడిన సొమ్ము 50 శాతంపైగా పెరిగి, 2023 జూన్ నాటికి మొత్తం బకాయిలు రూ.3 లక్షల కోట్లకు చేరాయి. కట్టగలిగే సామర్ధ్యం ఉండి తీసుకున్న లోన్లను 6 నెలలు లోపు చెల్లించని వారిని ఉద్దేశ పూర్వకంగా ఎగవేత దారులకు ప్రకటించాలని ఇటీవల ఆర్బీఐ ప్రతిపాదన తెచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో అధికం మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (Wilful defaulters) జాబితాలో 1,921 ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లు ఉండగా.. ఆ అకౌంట్ల నుంచి తీసుకున్న మొత్తం రుణాల విలువ రూ.79,271 కోట్లు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ 11,935 అకౌంట్లు ఉండగా రుణాలు మొత్తం రూ. 193,596 కోట్లు, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లు 2,332 ఉండగా.. రుణాలు రూ. 54,250 కోట్లు, 2,231 పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లు ఉండగా ఆ రుణాల మొత్తం విలువ రూ.41,353 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు చెందిన 1,831 అకౌంట్లు ఉండగా వాటి మొత్తం విలువ రూ.35,623 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.22,754 కోట్లు తీసుకోగా అకౌంట్లు 340 ఉన్నాయి. ఐడీబీఐకి చెందిన 340 బ్యాంక్ అకౌంట్లు ఉండగా 24,192 కోట్లు ఉన్నాయి. మార్చి 2023 సమయానికి 36,150 ఎన్పీఏ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.9.24లక్షల కోట్లు వసూలు చేసింది. -
‘అసలే ఎన్నికలు’, బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుందా?
ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను కేంద్ర ఆర్థిక శాఖ అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు వేతనాల్ని సగటున 15 శాతం పెంపుపై బ్యాంకులు - బ్యాంకు యూనియన్ సంఘాలు చర్చిస్తున్నాయి. ఐదు రోజుల పనిదినాలను కల్పించేందుకు భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ) కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. తాజాగా, ఉద్యోగులు వేతనాల్ని 15 శాతం పెంపును ప్రతిపాదించింది. అయితే, పనిదినాల మార్పులతో పాటు వేతనాల శాతాన్ని మరింత పెంచాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. ఇప్పటికే పీఎన్బీ వంటి కొన్ని బ్యాంకులు వేతనాల పెంపుకు పెద్దమొత్తంలో కేటాయింపులు జరుపుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వేతనం 10 శాతం పెరిగేలా బడ్జెట్ కేటాయించడానికి బదులుగా, 15శాతం పెరుగుదల కోసం నిధులను కేటాయించింది. నిశితంగా పరిశిలీస్తున్న కేంద్రం ‘ఇటీవలి కాలంలో బ్యాంకుల లాభాలు బాగా పెరిగాయని, కొవిడ్ సమయంలో పనిచేయడం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుణదాతలను తిరిగి గాడిలో పెట్టడానికి ఉద్యోగులు చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటే తమకు మెరుగైన పరిహారం లభిస్తుందని’ ఉద్యోగులు, యూనియన్లు వాదించుకుంటున్నాయి. ఈ చర్చలను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. అసలే ఎన్నికలు అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నందున వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కంటే ముందే వేతన సెటిల్ మెంట్‌తో పాటు వారానికి ఐదురోజుల పనికి కేంద్రం ఆమోదం తెలుపుతుందని బ్యాంక్ ఉద్యోగులు, యూనియన్ సంఘాలు అంచనా వేస్తున్నాయి. -
Bank holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! నవంబర్‌లో సెలవులు ఇవే..
Bank holidays in November 2023: అక్టోబర్ నెల ముగుస్తోంది. నవంబర్‌లోకి అడుగు పెట్టబోతున్నాం. పండుగ సీజన్ కావడంతో నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కస్టమర్లు తమ ఆర్థిక కార్యకలాపాలను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేసింది. నవంబర్‌లో దీపావళి, గోవర్ధన్ పూజ, ఛత్ పూజ, సాధారణ వారాంతాలతో సహా దేశంలోని పలు రాష్ట్రాలలో సెలవులతో కలుపుకొని మొత్తం 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. నవంబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే.. నవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవం/కుట్/కర్వా చౌత్ (కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 5 - ఆదివారం నవంబర్ 10 - వంగల పండుగ (మేఘాలయ) నవంబర్ 11 - రెండవ శనివారం (వీక్లీ ఆఫ్) నవంబర్ 12 - ఆదివారం (వీక్లీ ఆఫ్) నవంబర్ 13 - గోవర్ధన్ పూజ/లక్ష్మీపూజ (త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర) నవంబర్ 14 - దీపావళి నవంబర్ 15 - భాయ్ దూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/నింగల్ చక్కుబా/భ్రాత్రి ద్వితీయ (సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 19, 2023 - ఆదివారం నవంబర్ 20 - ఛత్ (బిహార్, రాజస్థాన్) నవంబర్ 23 - సెంగ్ కుట్ స్నెమ్/ఇగాస్ బగ్వాల్ (ఉత్తరాఖండ్, సిక్కిం) నవంబర్ 25 - నాల్గవ శనివారం నవంబర్ 26 - ఆదివారం నవంబర్ 27 - గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ (త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్ - తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 30 - కనకదాస జయంతి (కర్ణాటక)