ATM Withdrawal Limit: ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చు..? | ATM withdrawal limit for top banks in India | Sakshi
Sakshi News home page

ATM Withdrawal Limit: ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చు..?

Published Sun, Dec 8 2024 2:05 PM | Last Updated on Sun, Dec 8 2024 3:30 PM

ATM withdrawal limit for top banks in India

ప్రస్తుతం అంతటా డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోయాయి. ముఖ్యంగా యూపీఐ వచ్చాక భౌతికంగా నగదు చలామణి చాలామటుకు తగ్గిపోయింది. ఎంత డిజిటల్‌ పేమెంట్స్‌ అందుబాటులో ఉన్నా కొన్ని సందర్భాలలో చేతిలో నగదు అవసరం ఉంటుంది. దీని కోసం ఖాతాదారులు ఏటీఎం సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఏ బ్యాంక్‌ ఏటీఎం నుంచి రోజుకు ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రధాన బ్యాంకుల్లో ఏ బ్యాంక్‌ ఏటీఎం విత్‌డ్రా లిమిట్‌ ఎంతన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..

ఎస్‌బీఐ
మీరు మ్యాస్ట్రో డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ డెబిట్ కార్డ్ కలిగి ఉంటే, గరిష్టంగా రోజుకు రూ.40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ ఖాతా ‘ఇన్‌టచ్‌’ లేదా ’ఎస్‌బీఐ గో’కి లింక్ అయిఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 40,000. అదే ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్‌తో రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ 
హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాకు ఇంటర్నేషనల్, వుమన్ అడ్వాంటేజ్ లేదా ఎన్‌ఆర్‌ఓ డెబిట్ కార్డ్‌లను లింక్ చేసినట్లయితే, రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, టైటానియం లేదా గోల్డ్ డెబిట్ కార్డ్‌లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. టైటానియం రాయల్‌ డెబిట్ కార్డ్‌కు రూ. 75,000. ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డ్‌లకు రూ. 1,00,000. అదే జెట్‌ప్రివిలేజ్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వరల్డ్ డెబిట్ కార్డ్‌తో అయితే రోజుకు రూ. 3,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ క్లాసిక్ రూపే, వీసా లేదా స్టాండర్డ్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు గరిష్టంగా రూ.75,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం లేదా మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్‌తో 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు విత్‌డ్రా పరిమితి రోజుకు రూ. 1,50,000. ఐసీఐసీఐ ఎక్స్‌ప్రెషన్, ప్లాటినం లేదా టైటానియం డెబిట్ కార్డ్‌లకు డైలీ లిమిట్‌ రూ. 1,00,000. ఇక ఐసీఐసీఐ స్మార్ట్ షాపర్ సిల్వర్ డెబిట్ కార్డులకు అయితే రూ. 50,000. అదే ఐసీఐసీఐ బ్యాంక్ సాఫిరో డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు గరిష్టంగా రూ. 2,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ రూపే ప్లాటినం లేదా పవర్ సెల్యూట్ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. లిబర్టీ, ఆన్‌లైన్ రివార్డ్స్, రివార్డ్స్ ప్లస్, సెక్యూర్ ప్లస్, టైటానియం రివార్డ్స్, టైటానియం ప్రైమ్ డెబిట్ కార్డ్‌ల ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. అలాగే ప్రెస్టీజ్, డిలైట్ లేదా వాల్యూ ప్లస్ డెబిట్ కార్డ్‌లకు లిమిట్‌ రూ. 1,00,000. యాక్సిస్ బ్యాంక్ బుర్గుండి డెబిట్ కార్డ్ ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 3,00,000.

బ్యాంక్ ఆఫ్ బరోడా
వరల్డ్ అగ్నివీర్, రూపే క్యూస్పార్క్ ఎన్‌సిఎంసి, రూపే ప్లాటినం డిఐ, మాస్టర్ కార్డ్ డిఐ ప్లాటినం లేదా బిపిసిఎల్ డెబిట్ కార్డ్ ఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే క్లాసిక్ డీఐ లేదా మాస్టర్‌ కార్డ్‌ క్లాసిక్‌ డీఐ డెబిట్ కార్డ్ నుండి రోజుకు రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే సెలెక్ట్ డిఐ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 ఉపసంహరించుకోవచ్చు.

ఇండియన్ బ్యాంక్
సీనియర్ సిటిజన్లు, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు రోజుకు రూ. 25,000 విత్‌డ్రా పరిమితి ఉంది. రూపే ప్లాటినం, రూపే డెబిట్ సెలెక్ట్, మాస్టర్ కార్డ్ వరల్డ్ లేదా మాస్టర్ కార్డ్ వరల్డ్ ప్లాటినం కార్డులతో రోజుకు రూ. 50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఐబీ డిజీ రూపే క్లాసిక్‌, కలైంజర్ మగలిర్ ఉరిమై తిట్టం (KMUT) పథకం, రూపే కిసాన్ లేదా ముద్రా డెబిట్ కార్డ్‌లు ఉన్నవారు రోజుకు రూ. 10,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక రూపే ఇంటర్నేషనల్ ప్లాటినం డెబిట్ కార్డ్ తో రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.

యూనియన్ బ్యాంక్
మీ ఖాతాకు లింక్‌ అయిన క్లాసిక్ వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్ లతో రోజుకు రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్‌లకు పరిమితి రూ. 75,000. అదే బిజినెస్ ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ ద్వారా రూ. 1,00,000 ఉపసంహరించుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 1,00,000, యూనియన్ బ్యాంక్ సిగ్నేచర్ వీసా, మాస్టర్ కార్డ్ లతో రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
రూపే ఎన్‌సీఎంసీ క్లాసిక్, వీసా క్లాసిక్ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డెబిట్ కార్డ్‌తో  రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే ఎన్‌సిఎంసి ప్లాటినం డొమెస్టిక్, రూపే ఎన్‌సిఎంసి ప్లాటినం ఇంటర్నేషనల్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే బిజినెస్ ప్లాటినం ఎన్‌సిఎంసి, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్‌ల విత్‌డ్రా పరిమితి రూ. 1,00,000. అలాగే రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు రూ. 1,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా 
మాస్టర్‌ కార్డ్‌ టైటానియం, రూపే సంగిని, రూపే పీఎంజేడీవై, రూపే ముద్ర, రూపే కిసాన్‌, రూపే పంజాబ్‌ అర్థవ్యస్థ, వీసా క్లాసిక్‌, ఎన్‌సీఎంసీ, మాస్టర్‌ బింగో లేదా వీసా బింగో డెబిట్ కార్డ్‌ల ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 15,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.
రూపే ప్లాటినం, వీసా పేవేవ్ (ప్లాటినం), మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్‌లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ లిమిట్‌ రూ. 50,000. వీసా బిజినెస్‌, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు రూ. 1,00,000 వరకు డబ్బు తీసుకోవచ్చు.

కోటక్ బ్యాంక్‌ 
కోటక్ జూనియర్ డెబిట్ కార్డ్‌తో రోజుకు రూ. 5,000, రూపే డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ వన్ డెబిట్ కార్డులతో రూ. 10,000, 811 డ్రీమ్ డిఫరెంట్, ఈజీ పే డెబిట్ కార్డ్‌లతో రూ. 25,000  విత్‌డ్రా చేసుకోవచ్చు. సిల్క్ ప్లాటినం, రూపే ఇండియా లేదా పెషోప్‌మోర్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 40,000, జిఫ్ఫీ ప్లాటినం ఎడ్జ్, ప్రో, బిజినెస్ క్లాస్ గోల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఎలైట్ కార్డుల రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000 ఉంది.

ఇక యాక్సెస్ ఇండియా డెబిట్ కార్డ్ ఉపసంహరణ పరిమితి రూ. 75,000 కాగా పీవీఆర్‌, సిగ్నేచర్ ప్రో, నేషన్ బిల్డర్స్, గోల్డ్, జిఫ్ఫీ ప్లాటినం ఏస్, ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఏస్ డెబిట్ కార్డ్‌లు రోజువారీ విత్‌డ్రాయల్ లిమిట్‌ రూ. 1,00,000. అదే ప్రివీ లీగ్‌ ప్లాటినమ్‌, వరల్డ్‌, బిజినెస్‌ పవర్‌ ప్లాటినమ్‌ ఏస్‌, ఆస్ట్రా డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రివీ లీగ్‌ నియాన్‌, ప్రివీ లీగ్‌ ప్లాటినమ్‌, ప్రివీ లీగ్‌ సిగ్నేచర్‌ డెబిట్ కార్డ్‌లకు రూ. 2,00,000, ప్రివీ లీగ్ బ్లాక్, ఇన్ఫినిట్ డెబిట్ కార్డ్‌లకు రూ. 2,50,000 రోజువారీ ఉపసంహరణ పరిమితి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement