PNB
-
పీఎన్బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో (PNB) మరో మోసం వెలుగు చూసింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.271 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు బ్యాంకు వివరించింది. ఇప్పటికే ఈ మొత్తానికి ప్రొవిజనింగ్ చేసినట్లు పేర్కొంది.భువనేశ్వర్‌లోని పీఎన్బీ స్టేషన్ స్క్వేర్ బ్రాంచ్ ఈ రుణాన్ని జారీ చేసింది. పీఎన్బీ ఫ్రాడ్ జరిగినా డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.4,508 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.2,223 కోట్లతో పోలిస్తే అధికంగా నమోదైంది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.29,962 కోట్ల నుంచి రూ.34,752 కోట్లకు, వడ్డీ ఆదాయం రూ.27,288 కోట్ల నుంచి రూ.31,340 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా పీఎన్బీ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 6.24 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కొన్నేళ్లుగా హైప్రొఫైల్ కేసులతో ఇబ్బంది పడుతోంది. అందులో కొన్ని కింద తెలియజేశాం.నీరవ్ మోదీ స్కామ్ (2018): భారతదేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసాల్లో ఒకటిగా నిలిచింది. దీని విలువ సుమారు రూ.12,700 కోట్లు. నగల వ్యాపారి నీరవ్ మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై అనధికార లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ)లను ఉపయోగించి మోసపూరిత రుణాలు పొందారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగుల కారణంగా ఈ కుంభకోణం ఏళ్ల తరబడి బయటపడలేదు.నీరవ్ మోదీ కుంభకోణంలో గీతాంజలి జెమ్స్ యజమాని మెహుల్ చోక్సీ కూడా ఇరుక్కున్నాడు. 2018 ప్రారంభంలో దేశం విడిచి పారిపోయిన అతను అప్పటి నుంచి అధికారులు, విచారణ వ్యవస్థల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.ఇదీ చదవండి: రేట్ల కోత కాదు.. ఏం చేయాలో సూచించిన మిశ్రాపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ మోసం (2020): సరైన నిబంధనలు పాటించకుండా షెల్ కంపెనీలకు రుణాలు ఇచ్చిన కేసులో పీఎన్‌బీఐ హౌసింగ్ ఫైనాన్స్ ప్రమేయం ఉందని తేలింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. -
మెహుల్ చోక్సీకి క్యాన్సర్ చికిత్స
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ.13,500 కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఇటీవల ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టుకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చోక్సీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా (ఎఫ్ఈఓ) ప్రకటించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రయత్నిస్తోంది. దాంతో ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.చోక్సీ తన బంధువు నీరవ్ మోదీతో కలిసి మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ), ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎఫ్ఎల్సీ) ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో రూ.13,500 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి కొనసాగుతున్న ఈ కేసు తదుపరి విచారణను ముంబయి కోర్టు ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. చోక్సీ ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రయాణం చేయలేకపోతున్నాడని, ఆయనను ఎఫ్ఈఓగా ప్రకటించడం అన్యాయమని తన తరఫు న్యాయవాది వాదించారు. ఈ కుంభకోణం బయటపడకముందే భారత్‌ను వదిలి వెళ్లిన ఆయన 2018 నుంచి ఆంటిగ్వాలోనే ఉంటున్నారని చెప్పారు. మరోవైపు నీరవ్ మోదీని 2019లో ఎఫ్ఈఓగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు.ఇదీ చదవండి: భారీగా పడిపోయిన పామాయిల్ దిగుమతులుచోక్సీ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాబోయే విచారణలో ఆయనను ఎఫ్ఈఓగా ప్రకటించడంపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎఫ్ఈఓగా ప్రకటిస్తే తన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసి నష్టాన్ని భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెహుల్ చోక్సీ ఈక్విటీ ఆస్తులకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్లను జప్తు చేసింది. -
ATM Withdrawal Limit: ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చు..?
ప్రస్తుతం అంతటా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా యూపీఐ వచ్చాక భౌతికంగా నగదు చలామణి చాలామటుకు తగ్గిపోయింది. ఎంత డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నా కొన్ని సందర్భాలలో చేతిలో నగదు అవసరం ఉంటుంది. దీని కోసం ఖాతాదారులు ఏటీఎం సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి రోజుకు ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రధాన బ్యాంకుల్లో ఏ బ్యాంక్ ఏటీఎం విత్‌డ్రా లిమిట్ ఎంతన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..ఎస్బీఐమీరు మ్యాస్ట్రో డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ డెబిట్ కార్డ్ కలిగి ఉంటే, గరిష్టంగా రోజుకు రూ.40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ ఖాతా ‘ఇన్టచ్’ లేదా ’ఎస్బీఐ గో’కి లింక్ అయిఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 40,000. అదే ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్‌తో రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ ఖాతాకు ఇంటర్నేషనల్, వుమన్ అడ్వాంటేజ్ లేదా ఎన్ఆర్ఓ డెబిట్ కార్డ్‌లను లింక్ చేసినట్లయితే, రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిజినెస్, టైటానియం లేదా గోల్డ్ డెబిట్ కార్డ్‌లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. టైటానియం రాయల్ డెబిట్ కార్డ్‌కు రూ. 75,000. ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డ్‌లకు రూ. 1,00,000. అదే జెట్ప్రివిలేజ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరల్డ్ డెబిట్ కార్డ్‌తో అయితే రోజుకు రూ. 3,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్కెనరా బ్యాంక్ క్లాసిక్ రూపే, వీసా లేదా స్టాండర్డ్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు గరిష్టంగా రూ.75,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం లేదా మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్‌తో 1,00,000 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.ఐసీఐసీఐఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు విత్‌డ్రా పరిమితి రోజుకు రూ. 1,50,000. ఐసీఐసీఐ ఎక్స్ప్రెషన్, ప్లాటినం లేదా టైటానియం డెబిట్ కార్డ్‌లకు డైలీ లిమిట్ రూ. 1,00,000. ఇక ఐసీఐసీఐ స్మార్ట్ షాపర్ సిల్వర్ డెబిట్ కార్డులకు అయితే రూ. 50,000. అదే ఐసీఐసీఐ బ్యాంక్ సాఫిరో డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు గరిష్టంగా రూ. 2,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.యాక్సిస్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్ రూపే ప్లాటినం లేదా పవర్ సెల్యూట్ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. లిబర్టీ, ఆన్లైన్ రివార్డ్స్, రివార్డ్స్ ప్లస్, సెక్యూర్ ప్లస్, టైటానియం రివార్డ్స్, టైటానియం ప్రైమ్ డెబిట్ కార్డ్‌ల ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. అలాగే ప్రెస్టీజ్, డిలైట్ లేదా వాల్యూ ప్లస్ డెబిట్ కార్డ్‌లకు లిమిట్ రూ. 1,00,000. యాక్సిస్ బ్యాంక్ బుర్గుండి డెబిట్ కార్డ్ ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 3,00,000.బ్యాంక్ ఆఫ్ బరోడావరల్డ్ అగ్నివీర్, రూపే క్యూస్పార్క్ ఎన్‌సిఎంసి, రూపే ప్లాటినం డిఐ, మాస్టర్ కార్డ్ డిఐ ప్లాటినం లేదా బిపిసిఎల్ డెబిట్ కార్డ్ ఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే క్లాసిక్ డీఐ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డీఐ డెబిట్ కార్డ్ నుండి రోజుకు రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే సెలెక్ట్ డిఐ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 ఉపసంహరించుకోవచ్చు.ఇండియన్ బ్యాంక్సీనియర్ సిటిజన్లు, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు రోజుకు రూ. 25,000 విత్‌డ్రా పరిమితి ఉంది. రూపే ప్లాటినం, రూపే డెబిట్ సెలెక్ట్, మాస్టర్ కార్డ్ వరల్డ్ లేదా మాస్టర్ కార్డ్ వరల్డ్ ప్లాటినం కార్డులతో రోజుకు రూ. 50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఐబీ డిజీ రూపే క్లాసిక్, కలైంజర్ మగలిర్ ఉరిమై తిట్టం (KMUT) పథకం, రూపే కిసాన్ లేదా ముద్రా డెబిట్ కార్డ్‌లు ఉన్నవారు రోజుకు రూ. 10,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక రూపే ఇంటర్నేషనల్ ప్లాటినం డెబిట్ కార్డ్ తో రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.యూనియన్ బ్యాంక్మీ ఖాతాకు లింక్ అయిన క్లాసిక్ వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్ లతో రోజుకు రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్‌లకు పరిమితి రూ. 75,000. అదే బిజినెస్ ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ ద్వారా రూ. 1,00,000 ఉపసంహరించుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 1,00,000, యూనియన్ బ్యాంక్ సిగ్నేచర్ వీసా, మాస్టర్ కార్డ్ లతో రూ. 1,00,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్రూపే ఎన్సీఎంసీ క్లాసిక్, వీసా క్లాసిక్ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డెబిట్ కార్డ్‌తో రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. రూపే ఎన్‌సిఎంసి ప్లాటినం డొమెస్టిక్, రూపే ఎన్‌సిఎంసి ప్లాటినం ఇంటర్నేషనల్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే బిజినెస్ ప్లాటినం ఎన్‌సిఎంసి, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్‌ల విత్‌డ్రా పరిమితి రూ. 1,00,000. అలాగే రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు రూ. 1,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ కార్డ్ టైటానియం, రూపే సంగిని, రూపే పీఎంజేడీవై, రూపే ముద్ర, రూపే కిసాన్, రూపే పంజాబ్ అర్థవ్యస్థ, వీసా క్లాసిక్, ఎన్సీఎంసీ, మాస్టర్ బింగో లేదా వీసా బింగో డెబిట్ కార్డ్‌ల ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 15,000 విత్‌డ్రా చేసుకోవచ్చు.రూపే ప్లాటినం, వీసా పేవేవ్ (ప్లాటినం), మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్‌లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ లిమిట్ రూ. 50,000. వీసా బిజినెస్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌లతో రోజుకు రూ. 1,00,000 వరకు డబ్బు తీసుకోవచ్చు.కోటక్ బ్యాంక్ కోటక్ జూనియర్ డెబిట్ కార్డ్‌తో రోజుకు రూ. 5,000, రూపే డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ వన్ డెబిట్ కార్డులతో రూ. 10,000, 811 డ్రీమ్ డిఫరెంట్, ఈజీ పే డెబిట్ కార్డ్‌లతో రూ. 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. సిల్క్ ప్లాటినం, రూపే ఇండియా లేదా పెషోప్మోర్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 40,000, జిఫ్ఫీ ప్లాటినం ఎడ్జ్, ప్రో, బిజినెస్ క్లాస్ గోల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఎలైట్ కార్డుల రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000 ఉంది.ఇక యాక్సెస్ ఇండియా డెబిట్ కార్డ్ ఉపసంహరణ పరిమితి రూ. 75,000 కాగా పీవీఆర్, సిగ్నేచర్ ప్రో, నేషన్ బిల్డర్స్, గోల్డ్, జిఫ్ఫీ ప్లాటినం ఏస్, ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఏస్ డెబిట్ కార్డ్‌లు రోజువారీ విత్‌డ్రాయల్ లిమిట్ రూ. 1,00,000. అదే ప్రివీ లీగ్ ప్లాటినమ్, వరల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినమ్ ఏస్, ఆస్ట్రా డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రివీ లీగ్ నియాన్, ప్రివీ లీగ్ ప్లాటినమ్, ప్రివీ లీగ్ సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌లకు రూ. 2,00,000, ప్రివీ లీగ్ బ్లాక్, ఇన్ఫినిట్ డెబిట్ కార్డ్‌లకు రూ. 2,50,000 రోజువారీ ఉపసంహరణ పరిమితి ఉంది. -
పీఎన్బీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 103.75 ధరలో 48.19 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఫ్లోర్ ధర రూ. 109.16తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్‌గా పీఎన్బీ పేర్కొంది. ఈ నెల 23–26 మధ్య క్విప్ సబ్ర్స్కిప్షన్ పూర్తయినట్లు వెల్లడించింది.మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, బీమా కంపెనీలు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి రూ. 41,734 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. ఇవి క్విప్ ప్రాథమిక పరిమాణం రూ. 2,500 కోట్లకు 16.7 రెట్లు అధికంకాగా.. మొత్తం సమీకరణ పరిమాణం రూ. 5,000 కోట్లకు 8.3 రెట్లు అధికమని వివరించింది. క్విప్ నిధులను బ్యాంక్ సీఈటీ–1 నిష్పత్తి మెరుగుకు, కనీస మూలధన నిష్పత్తి పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. -
బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తమ బ్యాంకులోని ఖాతాలను కొనసాగించేలా ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బ్యాంకు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయా బ్యాంకు అకౌంట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ తరుణంలో బ్యాంకులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు కొనసాగించేలా చర్చలు జరుపుతున్నాయి.ఈ మేరకు రెండు బ్యాంకులు విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం..‘కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన రెండు బ్యాంకుల్లోని ఖాతాలను ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే దీనిపై చర్చలు సాగుతున్నాయి. సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకుంటాం’ అని తెలిపాయి.ఇదీ చదవండి: ఆ బ్యాంకుల్లో ఖాతాలు క్లోజ్.. కర్ణాటక సంచలన నిర్ణయంఇటీవల కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డ్, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు చెందిన మొత్తం రూ.22 కోట్ల డిపాజిట్లను ఉపసంహరించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలోనూ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల డిపాజిట్లు, పెట్టుబడులకు సంబంధించి బ్యాంకు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం ఆయా బ్యాంకులను హెచ్చరించింది. కానీ వాటి తీరు మార్చుకోలేదు. దాంతో ఇటీవల రూ.22 కోట్లు ఉపసంహరించుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ముగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు సెప్టెంబర్ 20, 2024 చివరి తేదీగా ఖరారు చేశారు. దీనిపై రెండు బ్యాంకుల అధికారులు ప్రభుత్వంతో చర్చలు సాగిస్తున్నాయి. -
ఆ బ్యాంకుల్లో ఖాతాలు క్లోజ్.. కర్ణాటక సంచలన నిర్ణయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ బ్యాంకుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఖాతాలను మూసివేయాలని బుధవారం అన్ని శాఖలను ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లు, పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ఈ బ్యాంకుల్లో కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులు కూడా పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.ఆయా బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అవకతవకలు, అనధికార లావాదేవీలు జరిగినట్లు రోపణలు వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలకు సంబంధించి గతంలోనే హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఖాతాలను మూసివేయాలనే నిర్ణయానికి దారితీసిందని ప్రభుత్వం తెలిపింది. రూ.187 కోట్ల కార్పొరేషన్ నిధులకు సంబంధించి అనధికార లావాదేవీలు జరిగిందని, ఇందులో రూ.88.62 కోట్లు ఐటీ కంపెనీల ఖాతాల్లోకి, హైదరాబాద్‌లోని సహకార బ్యాంకుకి బదిలీ అయినట్లు తేలిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలర్ట్.. ఆగస్టు 12 డెడ్‌లైన్!
దేశంలో పురాతన, అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆగస్టు 12 లోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని తమ కస్టమర్లను కోరింది. నిర్ణీత గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే, వారి ఖాతాలను నిలిపివేయనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ అల్టిమేటం మార్చి 31 నాటికి కేవైసీ వివరాలు అప్డేట్ చేయని ఖాతాల కోసమని బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు కస్టమర్లు తమ శాఖకు వెళ్లి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటో, పాన్, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్ వంటివి అందించి కేవైసీ వివరాలను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి ఆగస్టు 12 లోపు కేవైసీని అప్డేట్ చేసుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూచించింది. పీఎన్బీ వన్ యాప్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ (IBS) / రిజిస్టర్డ్ ఈ-మెయిల్ / పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఏదైనా బ్రాంచ్ని సందర్శించడం ద్వారా కేవైసీ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్: జులై 1 నుంచి ఆ ఖాతాలు క్లోజ్!
PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కోట్లాది మంది ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి గత కొన్నేళ్లుగా ఉపయోగించకపోతే జూలై 1 తర్వాత అలాంటి ఖాతాలు రద్దు కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విషయాన్ని చెబుతోంది. సేవింగ్స్ అకౌంట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ముందుగా దాని స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ నెలాఖరు కల్లా వాడుకలో లేని ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను, అలాగే గత మూడేళ్లుగా అకౌంట్ బ్యాలెన్స్ సున్నా ఉన్న అకౌంట్లను క్లోజ్ చేయబోతున్నట్లు బ్యాంకు తన నోటిఫికేషన్లో పేర్కొంది. అలాంటి కస్టమర్లకు ఇప్పటికే నోటీసులు సైతం పంపించింది.వాడుకలో లేని ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలని పీఎన్బీ కొన్ని రోజుల క్రితమే ఖాతాదారులకు తెలియజేసింది. అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఈ ఖాతాలు క్లోజ్ అవుతాయి. చాలా కాలంగా కస్టమర్లు ఉపయోగించని ఇలాంటి ఖాతాలను చాలా మంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఖాతా లెక్కింపు 2024 ఏప్రిల్ 30 ఆధారంగా జరుగుతుంది.తిరిగి యాక్టివేట్ చేసుకోండిలా..బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయి, ఖాతాదారు అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. కేవైసీ ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించవచ్చు. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెరిగాయ్!
భద్రతతో కూడిన స్థిరమైన రాబడికి ఉత్తమమైన పెట్టుబడి మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అందుకే వీటిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్దిష్ట కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల టెన్యూర్‌పై ఎఫ్డీ రేటు సాధారణ ప్రజలకు గతంలో 6.25 శాతం ఉండగా 7.05 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం నుంచి 7.55 శాతానికి, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం నుంచి 7.85 శాతానికి సవరించింది. రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల లోపు 300 రోజుల టెన్యూర్ పీఎన్బీ ఉత్తమ్ (ముందస్తు ఉపసంహరణకు వీలులేని) ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లోనూ వడ్డీ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సవరించింది. సాధారణ ప్రజలకు 6.30 శాతం నుంచి 7.10 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం నంచి 7.60 శాతానికి పెంచింది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా 7.10 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు జనవరి 8 నుంచి వర్తిస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో తెలిపింది. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటించిన తర్వాత ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు తమ ఎఫ్డీ రేట్లను సవరించాయి. -
రెండు ప్రముఖ బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్!
రెండు ప్రముఖ బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఝలక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్‌తో పాటు మరో రెండు ఫైనాన్స్ సంస్థలకు భారీగా జరిమానాలు విధించింది. వడ్డీ రేట్లు, బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ నిబంధనలు పాటించడంలో విఫలమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.72 లక్షలు, కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిన ఫెడరల్ బ్యాంక్‌కు రూ.30 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇక కేవైసీ నిబంధనలను పాటించనందుకు మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)కు రూ. 10 లక్షల పెనాల్టీని ఆర్బీఐ విధించింది. అలాగే ఎన్బీఎఫ్సీ నిబంధనలను ఉల్లంఘించిన కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్‌పై రూ. 13.38 లక్షల నగదు పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. -
వాటా విక్రయం! ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ రెడీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. యూటీఐ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)లో వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. పురాతన ఎంఎఫ్ యూటీఐ స్పాన్సర్స్ అయిన ఈ సంస్థలు వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లను సంప్రదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూటీఐ ఎంఎఫ్‌ను ఎస్బీఐ, పీఎన్బీ, ఎల్ఐసీ, బీవోబీ ఉమ్మడిగా ప్రమోట్ చేశాయి. ఈక్విటీలో మొత్తం 45.21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అనుబంధ సంస్థ ద్వారా మరో ప్రమోటర్ టీ రోవ్ ప్రైస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్(యూకే) సైతం 23 శాతం వాటాను పొందింది. 2020లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ సంస్థలన్నీ యూటీఐ ఎంఎఫ్‌లో దాదాపు 3.9 కోట్ల షేర్లను విక్రయించాయి. వెరసి ఐపీవో నిధులను ప్రమోటర్ సంస్థలే అందుకున్నాయి. 2019 డిసెంబర్లో సెబీ ఆదేశాలమేరకు వాటాను తగ్గించుకునే బాటలో ఐపీవోను చేపట్టాయి. కాగా.. ప్రభుత్వ సంస్థలు(పీఎస్ఈలు) అనుబంధ సంస్థలలో వాటాలను విక్రయించాలనుకుంటే ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపించవచ్చని గతేడాది దీపమ్ స్పష్టం చేసింది. తద్వారా ఇందుకు అనుమతించింది. ఈ బాటలో తాజాగా సంబంధిత మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వీటి ప్రకారం వాటాల విక్రయ ప్రతిపాదనలు అందాక ఆయా మంత్రిత్వ పాలనా శాఖలు తొలుత పరిశీలించి దీపమ్‌కు బదిలీ చేస్తాయి. ఆపై దీపమ్ వీటికి ముందస్తు అనుమతిని మంజూరు చేస్తుంది. 1964లో.. పార్లమెంటు యూటీఐ ఎంఎఫ్ 1964లో ఏర్పాటైంది. యూఎస్ 64 పథకం మూతపడ్డాక 2002లో పార్లమెంట్ యూటీఐ చట్టాన్ని ఆమోదించింది. దీంతో యూటీఐను సూటీ(ఎస్‌యూయూటీఐ), యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో రెండు సంస్థలుగా విభజించారు. యాక్సిస్ బ్యాంక్‌కు సూటీలో 11.8 శాతం వాటా ఉంది. ఇక యూటీఐ ఎంఎఫ్‌లో నాలుగు ప్రభుత్వ సంస్థల నుంచి టీ రోవ్ ప్రైస్ 2009లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు 14 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఒక్కో సంస్థ విడిగా 6.5 శాతం వాటా చొప్పున విక్రయించాయి. -
ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ దిగ్గజాలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ,పబ్లిక్ లెండర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండూ తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (ఎంసీఎల్ఆర్) రేట్లు పెంచాయి. సవరించిన రేట్లు జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ అనూహ్యం కొన్నింటికి వడ్డీరేటును తగ్గించి, మరికొన్నింటిపై వడ్డీరేటును పెంచడం గమనార్హం. ఒక నెల ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ వడ్డీరేటు 8.50 శాతం 8.35శాతానికి దిగి వచ్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 8.55 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అయితే ఆరు నెలలు, ఏడాది కాలవ్యవధి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 8.75 శాతంనుంచి 8.85 శాతానికి పెంచడం విశేషం. (సూపర్ ఆఫర్: ఐపోన్ 13పై రూ. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదే బాటలో నడిచింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం ఓవర్‌నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8శాతంనుంచి 8.10శాతానికి పెంచింది. ఒకటి, మూడు, ఆరు నెలల రేట్లును కూడా పెంచి వరుసగా 8.20, 8.30, 8.50 శాతంగా ఉంచింది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.60శాతంగానూ, మూడేళ్ల రుణాలపై వడ్డీరేటు 8.80శాతంనుంచి 8.90 శాతానికి పెంచింది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ చూసారా..!
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ తరుణంలో ఎన్నెన్నో కొత్త రూల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డులలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. ఇందులో ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నాయి. ఈ బ్యాంకులు చేసిన మార్పులను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీచేసే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) తమ AURUM కార్డ్‌లలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆరమ్ కార్డు కలిగిన వారు RBL Luxeకి బదులుగా టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ. 5000 వోచర్ పొందుతున్నారు. గతంలో రూ.5 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన వారికి ఆర్బీఎల్ లగ్జరీ నుంచి ఈ వోచర్ వచ్చేది. ఈజీ డైనర్ ప్రైమ్, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్ షిప్ ప్రయోజనాలను తొలగించింది. అయితే ఈ కార్డు మీద ప్రైమ్ అండ్ లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్షిప్ బెనిఫిట్ ఇకపై అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) 2023 మే 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కూడా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏటీఎమ్ నుంచి అమౌంట్ డ్రా చేసుకోవడం వంటి లావాదేవీలపైన రూ. 10 + జీఎస్టీ విధిస్తోంది. అంతే కాకుండా డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు వంటి వాటికి కూడా కొంత రుసుము అమలు చేసే ప్రక్రియలో బ్యాంకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే, ఇది 2023 మే 23 నుంచి డెబిట్ కార్డు చార్జీలను రూ. 259తో పాటు GST పెంచనున్నట్లు తమ కస్టమర్లకు ఒక మెయిల్ ద్వారా తెలిపింది. గతంలో ఈ చార్జీలు రూ. 199 ప్లస్ జీఎస్టీతో ఉండేది. కావున ఈ బ్యాంకు కూడా త్వరలోనే కొత్త రూల్స్ ద్వారా కస్టమర్ల మీద పెను భారాన్ని మోపే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే..
ఏప్రిల్ నెల దాదాపు ముగుస్తోంది. మే నెల ప్రారంభం కాబోతోంది. జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించిన కీలక మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్! సెలవులు ఏయే రోజుల్లో అంటే.. ఈ మార్పులు మీ ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న కీలక మార్పులు, కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం.. జీఎస్టీ కొత్త రూల్ జీఎస్టీ ఇన్వాయిస్ల అప్‌లోడ్‌కు సంబంధించి మే 1 నుంచి కొత్త రూల్ అమలవుతుంది. ఈ రూల్ ప్రకారం.. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ లావాదేవీల రసీదులను ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో ఏడు రోజుల వ్యవధిలో అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం ఇన్వాయిస్ అప్‌లోడ్‌కు ఎలాంటి కాల పరిమితి లేదు. మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ చేసిన ఈ-వాలెట్ల నుంచి మాత్రమే నగదును అంగీకరించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను ఆదేశించింది. అంటే మీ ఈ-వాలెట్ కేవైసీ కాకపోతే మీరు దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. ఈ నిబంధన కూడా మే 1 నుంచి అమల్లోకి రానుంది. గ్యాస్ సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ రేట్లను సవరిస్తుంది. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.91.50 మేర తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2028 ఉంది. ప్రభుత్వం మే 1న ధరలను మార్చవచ్చు. పీఎన్బీ ఏటీఎం చార్జీలు ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త చార్జీలు కూడా మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఖాతాల్లో బ్యాలెన్స్ లేని కారణంగా ఏటీఎంలలో లావాదేవీలు విఫలమైతే రూ.10తో పాటు అదనంగా జీఎస్టీని కూడా బ్యాంక్ విధిస్తుంది. ఇదీ చదవండి: New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు! -
ఇంటర్‌పోల్ నిర్ణయం: చోక్సీకి విముక్తి లభించినట్టేనా?
సాక్షి,ముంబై: పీఎన్బీలో రూ. 13,000 కోట్ల మోసానికి పాల్పడి భారతదేశంనుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు నుంచి మెహుల్ చోక్సీని ఎందుకు తొలగించారనేది చర్చనీయాంశంగా మారింది. చోక్సీ లాయర్ ఏమన్నారంటే? తన క్లయింట్ (మెహుల్ చోక్సీ) వ్యతిరేకంగా జారీ అయిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు విత్ డ్రా చేసిందని, ఇది సంతోషించ దగ్గ పరిణామమని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ ప్రకటించారు. లీగల్ టీమ్ ఇంటర్‌పోల్‌తో విచారణ జరుపుతోంది. తాజా నిర్ణయంతో ఇపుడు అతను భారతదేశం మినహా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చని, ఇది ఇండియాలో అతనిపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ వ్యాజ్యాన్ని ప్రభావితం చేయదని కూడా ప్రకటించారు. (పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం) The legal team is taking up the matter with Interpol. Interpool has removed RCN on my client (Mehul Choksi) and now he is free to travel anywhere except India. This is not going to affect his criminal litigation pending in India. This RCN was an effort that he can be caught and… https://t.co/hN9zGXOnYP pic.twitter.com/BY5m4oRQV5 — ANI (@ANI) March 21, 2023 ఇంటర్‌పోల్ నిర్ణయం ప్రభావితం చేయదు మరోవైపు మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సిఎన్) రద్దు కేసును ప్రభావితం చేయదని కేంద్రం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.ఈ కేసు ఇప్పటికే అధునాతన దశలో ఉందని చోక్సీ అరెస్టు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది. అసలు ఏం జరిగింది? సంచలన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడిగా విదేశాలకు చెక్కేసిన మెహుల్చోక్సీని ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుంచి ఉపసంహరించుకుందనేది ఇపుడు హాట్ టాపిక్. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని వాదించి చోక్సీ, సీబీఐ చార్జ్‌షీటు, రెడ్ కార్నర్ నోటీసులపై సీబీఐ అభ్యర్థనను సవాల్ చేస్తూ లియోన్ హెడ్‌క్వార్టర్స్ ఏజెన్సీకి అప్పీల్ చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఇంటర్‌పోల్ ఐదుగురు సభ్యుల కమిటీ ఈ కేసును పరిశీలించింది. ముఖ్యంగా డొమినికాలో చోక్సీని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన తర్వాత భారతదేశంలో న్యాయమైన విచారణ జరగక పోవచ్చని కమిటీ తెలిపింది. ఈ కేసు రాజకీయ కుట్ర ఫలితమని పేర్కొంది. హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఇంటర్‌పోల్ ఇలా ప్రకటించింది. చోక్సీని ఆంటిగ్వా నుండి డొమినికాకు కిడ్నాప్ చేయడంలో అంతిమ ఉద్దేశ్యం ఇండియాకు రప్పించడమేనని వ్యాఖ్యానించింది. అలాగే చోక్సిని ఇండియాకు తరలిస్తే.. ఈ కేసులో న్యాయమైన విచారణ లేదా అనారోగ్యంతో ఉన్న చోక్సి సరియైన చికిత్స పొందే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొంది. -
పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం
సాక్షి,ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13వేల కోట్ల రుణం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి సంబంధించికీలక పరిణామంకలకలం రేపింది. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్‌నుంచి చోక్సీ పేరును తొలగించింది. దీంతో అతనిని స్వదేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బేనని విమర్శలు వెల్లువెత్తాయి. 2018 డిసెంబర్లో జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ ఇపుడు ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే మెహుల్ చోక్సీ విదేశీ గడ్డపై దొరికితే అరెస్ట్ చేసే అధికారాన్ని భారత ప్రభుత్వం కోల్పోయినట్టే. అయితే తాజా పరిణామంపై సీబీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నమెహుల్ చోక్సీ పేరు ఇంటర్‌పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుండి తొలగించారు. లియోన్-హెడ్‌క్వార్టర్డ్ ఏజెన్సీకి చోక్సి అప్పీల్ మేరకే చోక్సీ పేరును రెడ్ లిస్ట్‌లో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఇంటర్‌పోల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అయిదేళ్లనుంచి పరారీలో ఉన్న చోక్సీని ఇండియాకు ఎపుడు రప్పిస్తారంటూ కాంగ్రెస్ ట్విటర్ ద్వారా మోదీ సర్కార్‌ను ప్రశ్నించింది. PM मोदी का चहेता मेहुल 'भाई' चोकसी अब वांटेड नहीं रहा। भगोड़े मेहुल चोकसी के खिलाफ इंटरपोल ने रेड कॉर्नर नोटिस हटा लिया है। PM मोदी जवाब दें कि आपके 'मेहुल भाई' को देश वापस कब लाया जाएगा। 5 साल से फरार है, अब और कितना वक्त चाहिए? — Congress (@INCIndia) March 20, 2023 రెడ్ నోటీసు (లేదా రెడ్ కార్నర్ నోటీసు) 2018లో డిసెంబరు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. నాలుగేళ్ల తరువాత మెహుల్ చోక్సీని రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ తొలగించింది. తాజా నివేదికల ప్రకారం ఆ నోటీసు ఇప్పుడు ఇంటర్‌పోల్ వెబ్సైట్లో అందుబాటులో లేదు. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి, మొత్తం రెడ్ నోటీసుల సంఖ్య 7023కి చేరింది. ఇంటర్‌పోల్‌లో 195 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు అనేది అప్పగించడం, లొంగిపోవడం లేదా ఇలాంటి చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాన్ని అమలు చేసేవారికి చేసే అభ్యర్థన. రెడ్ నోటీసు అరెస్ట్ వారెంట్‌తో సమానం కాదు. అయితే సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనేదానిపై సభ్యదేశాలు తమ స్వంత చట్టాలను వర్తింపజేయాలి. అనేక సందర్భాల్లో నిందితుడిని కోరుకున్న దేశానికి అప్పగిస్తారు. కాగా పీఎన్బీ స్కాం ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీకి దగ్గరి బంధువు మెహుల్ చోక్సీ. దేశంలో అతిపెద్ద స్కాం వెలుగులోకి రావడంతో ఆంటిగ్వా , బార్బుడా పారిపోయి, అక్కడి పౌరసత్వం పొందాడు. ఈడీ, సీబీఐ దర్యాప్తు, ఫుజిటివ్ నేరస్తుడుగా కేంద్రం ప్రకటించింది. సీబీఐ అభ్యర్థన మేరకు పది నెలల తర్వాత ఇంటర్‌పోల్ అతడి రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే సీబీఐ ఛార్జిషీట్‌పై చోక్సీ అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు,పలు సందర్భాల్లో భారతీయ జైళ్లు, ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ కీలక పరిణామాల మధ్య మే 2021లో చోక్సీ ఆంటిగ్వా నుండి అదృశ్యమైనాడు. ఆ తరువాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడన్న ఆరోపణలపై డొమినికాలో అరెస్ట్ కావడంతో 51 రోజులు డొమినికా జైలులో గడిపాడు. అనంతరం అక్రమంగా ప్రవేశించిన చోక్సీపై ఉన్న అన్ని అభియోగాలను కూడా డొమినికా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! ఈ బ్యాంకులో కొత్త రూల్..
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కు చెల్లింపుల విషయంలో కొత్త రూల్ తీసుకొస్తోంది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రూల్ మోసపూరిత చెక్కుల చెల్లింపు నుంచి కస్టమర్లను కాపాడుతుంది. ఇంతకుముందు రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పీపీఎస్‌లో చెక్కు వివరాలను సమర్పించాల్సి ఉండేది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్, చెక్కు నంబర్, చెక్కు ఆల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, చెక్కు మొత్తం, లబ్ధిదారు పేరుతో సహా అవసరమైన వివరాలను కస్టమర్లు పీపీఎస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మోసాలు జరిగే అవకాశం తగ్గుతుందని బ్యాంకు పేర్కొంటోంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి కస్టమర్లు ఈ పీపీఎస్ సౌకర్యాన్ని బ్యాంకు బ్రాంచ్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. చెక్కు ప్రెజెంటేషన్ లేదా క్లియరింగ్ తేదీకి ఒక రోజు ముందుగా చెక్కు వివరాలను పీపీఎస్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ క్లియరింగ్‌లో సమర్పించే రూ. 50 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు పీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. రూ. 5 లక్షల లోపు చెక్కులకు ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారు ఇష్టం. అయితే రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం మాత్రం దీన్ని తప్పనిసరి చేయవచ్చని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. -
బ్యాంకులకు దండిగా వడ్డీ ఆదాయం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంకుల వడ్డీ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. 25.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. ఇచ్చిన రుణాలపై అధిక మార్జిన్, అధికంగా రుణాల వితరణ దీనికి కలిసొచ్చింది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.17 శాతం పెరిగి 3.28 శాతానికి చేరింది. ప్రస్తుత రుణాలపై రేట్లను పెంచడంతోపాటు, కొత్తగా ఇచ్చే రుణాలపైనా రేట్లు పెంచడం, డిపాజిట్ రేట్లను పెద్దగా మార్చకుండా అదే స్థాయిలో కొనసాగించడం వడ్డీ ఆదాయం వృద్ధికి సానుకూలించినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకుల ఆదాయంపై ఈ సంస్థ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. నిమ్ వృద్ధిలో ప్రైవేటు బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల వల్ల ప్రైవేటు బ్యాంకుల నిమ్ 0.15 శాతం పెరిగి 4.03 శాతానికి చేరుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నిమ్ 0.17 శాతం వృద్ధితో 2.85 శాతంగా ఉంది. బ్యాంకులు సమీకరించిన డిపాజిట్లు/నిధులపై చెల్లించే రేటుకు, ఈ నిధులను రుణాలుగా ఇచ్చి వసూలు చేసే వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్. పెద్ద బ్యాంకులు డిపాజిట్లపై అధిక రాబడులను ఆఫర్ చేయడం ఆరంభించాయని, రుణాలకు రెండంకెల స్థాయిలో డిమాండ్ ఉండగా, అదే స్థాయిలో డిపాజిట్లు రావడం లేదని క్రిసిల్ నివేదిక తెలిపింది. కనుక నిమ్ ఈ స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి 2.5 శాతం మేర పెరో రేటును పెంచడం తెలిసిందే. రుణాల్లో చక్కని వృద్ధి డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకులు రుణాల్లో 18.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణ వితరణలో ప్రభుత్వరంగ బ్యాంకులది పైచేయిగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు 18.9 శాతం అధికంగా రుణాలను మంజూరు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకుల రుణ వితరణలో 17.9 శాతం వృద్ధిని చూపించాయి. నికర వడ్డీ మార్జిన్లో మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకుల పనితీరు మెరుగ్గా ఉంది. వడ్డీ వ్యయాలు ప్రైవేటు రంగ బ్యాంకులకు 27.3 శాతానికి పెరిగితే, ప్రభుత్వరంగ బ్యాంకులకు 22.6 శాతానికి చేరాయి. సగటు రుణ రేటు 1.2 శాతం పెరిగి 8.9 శాతంగా ఉంది. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ ఉండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రానున్న రోజుల్లో డిపాజిట్ రేట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 12 ప్రభుత్వరంగ, 18 ప్రైవేటు రంగ బ్యాంకుల గణాంకాల ఆధారంగా కేర్ రేటింగ్స్ ఈ వివరాలను రూపొందించింది. -
పీఎన్బీ కస్టమర్లకు అలర్ట్.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్ ఖాతాపై ఆంక్షలు తప్పవ్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక విషయాన్ని వెల్లడించింది. తమ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన కస్టమర్లు డిసెంబర్ 12 కేవైసీ (KYC) వివరాలను అప్డేట్ చేసుకోవాలని లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు చేసింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న తమ ఖాతాదారులకు పీఎన్బీ ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. అలాగే రిజిస్టర్డ్ అడ్రస్‌కు రెండు నోటీసులు పంపించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరి కేవైసీ అప్డేట్ ఇంకా పెండింగ్‌లో ఉందో వారికి మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు పీఎన్బీ అధికారికి ట్వీటర్లో ట్వీట్ చేసింది. ట్వీట్లో ఏముంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. కస్టమర్లు కేవైసీ అప్డేషన్ తప్పనిసరి. 30.09.2022 నాటికి ఏ కస్టమర్ల ఖాతాకు సంబంధించి కేవైసీ పెండింగ్‌లో ఉందో వారికి మొబైల్ ఎస్ఎంఎస్, నోటీసుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాం. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కస్టమర్లు వెంటనే వారి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి 12.12.2022 లోపు ఈ అప్డేట్ ప్రక్రియని పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయని కస్టమర్ల ఖాతాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. KYCని ఎలా అప్డేట్ చేయాలి పీఎన్బీ కస్టమర్లు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటోలు, పాన్ కార్డ్, ఇన్‌కం ప్రూఫ్, మొబైల్ నంబర్లు వంటి వివరాలను బ్యాంకుకు మెయిల్ చేయవచ్చు (తమ బ్యాంక్ అకౌంట్లో రిజస్టర్ చేసుకున్న ఈమెయిల్ ద్వారా), లేదా వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని బ్యాంకుకు వెళ్లి అందివ్వాల్సి ఉంటుంది. పీఎన్బీ ఖాతాదారులు కేవైసీ పెండింగ్‌లో ఉందో లేదా అనే సమాచారం కోసం 1800 180 2222/ 1800 103 2222 (టోల్-ఫ్రీ)/ 0120-2490000 (టోల్ చేసిన నంబర్)లో కస్టమర్ కేర్ సేవతో కనెక్ట్ కావచ్చు. Points to be noted 👇🏻 Remember: KYC updation is mandatory as per RBI guidelines. Beware: Bank does not call & request personal information of customers for KYC updation.#KYC #Banking #SmartBanking #FoolTheFraudster pic.twitter.com/f6WohISarL — Punjab National Bank (@pnbindia) November 20, 2022 చదవండి: మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే? -
పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) వృద్ధుల కోసం అధిక వడ్డీ రేటుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన ఎవరైనా కానీ 600 రోజుల కాలానికి డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై 7.85 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది. అక్టోబర్ 19 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఇక వృద్ధులు కాకుండా ఇతరులకు 600 రోజుల డిపాజిట్‌పై (ఎప్పుడైనా ఉపసంహరించుకోతగిన) 7 శాతం వడ్డీ రేటు, కాలవ్యవధి వరకు ఉపసంహరణకు వీల్లేని 600 రోజుల డిపాజిట్‌పై 7.05 శాతం వడ్డీని ఇస్తున్నట్టు పీఎన్బీ తెలిపింది. -
భారీ పెంపు: పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ రేట్లను పెంచింది. పీఎన్బీ రూ.2 కోట్ల వరకు ఎఫ్డీలపై రేట్లను సవరించింది. వారం వ్యవధిలో రేట్లను సవరించడం రెండో సారి. ఈ రేట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా 0.75 శాతం వరకు రేట్లను పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం ఎఫ్డీలపై రేట్లను పెంచడం ఒక నెలలో ఇది రెండో పర్యాయం. వివిధ కాల పరిమితులపై రూ.2 కోట్ల వరకు చేసే ఎఫ్డీలపై 0.50 శాతం వరకు పెంచింది. రికరింగ్ డిపాజిట్ల రేట్లను కూడా పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్ 26 నుంచే అమల్లోకి వచ్చాయి. -
ఆ ఖాతాదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త!
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిపాజిట్ మెచ్యూరిటీలపై సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలుగా చూసే వారికి ఇది అద్భుతమైన వార్త. ముఖ్యంగా సీనియర్,సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర అదనంగా ఇవ్వనుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 13, 2022 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీ సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం FDలపై వడ్డీ రేట్లు నిర్దిష్ట కాలవ్యవధిని సెట్ చేసినప్పటికీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం అన్నిరకాల డిపాజిట్లపై ఒకే రేటు అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్సైట్ ప్రకారం రూ. 2 కోట్ల వరకు రేటు 30 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) గా ఉంది. 60-80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల పరిధి డిపాజాట్లపై 50 బీపీఎస్ అదనపు వడ్డీని పొందుతారు. 5 కంటే ఎక్కువ కాలానికి 80బీపీఎస్ పాయింట్ల ఎక్కువ పొందుతారు.మొత్తంగా సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం, సూపర్ సీనియర్లకు 6.90 శాతం వడ్డీ రేటు పొందుతారు. రిటైర్డ్ సిబ్బంది, రిటైర్డ్ సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 180 బీపీఎస్ పాయింట్లు వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే పీఎన్బీ ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించే అత్యధిక వడ్డీ రేటు 100 బీపీఎస్ పాయింట్లుగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. -
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. పీఎన్బీ నుంచి రూ.52 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారనే అభియోగాల నేపథ్యంలోనే ఆమెను సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని నివాసం నుంచి మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించారు అధికారులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో సీబీఐ ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకోవడం విశేషం. బెంగళూరు అధికారులు కేవలం విచారణ కోసం తీసుకెళ్లారా? లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ఆరు పార్టీల తొలగింపు! -
బంపర్ ఆఫర్: మొబైల్ ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.2 లక్షలు
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉన్నతస్థాయిలోని (మేనేజ్మెంట్) ఉద్యోగులు ఒక్కొక్కరికి మొబైల్ ఫోన్లు కొనుగోలుకు వీలుగా ఏడాదికి రూ.2 లక్షలను అలవెన్స్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలను ఈ మేరకు సవరించింది. దీని ప్రకారం ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మొబైల్ ఫోన్ అలవెన్స్‌కు అర్హులు. సవరించిన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీలో ఎండీ, సీఈవోకి సహాయం అందించేందుకు ప్రస్తుతం నలుగు రు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఇక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థాయి అధికారికి గతంలో మాదిరే మొబైల్ ఫోన్ అలవెన్స్ కొనసాగనుంది. సీజీఎం రూ.50,000, జీఎం రూ.40,000ను ఫోన్ అలవెన్స్ పొందొచ్చు. -
ఎయిర్‌ఫోర్స్‌తో ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ ఒప్పందాలు
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌తో ‘డిఫెన్స్ వేతన ప్యాకేజీ’ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం కింద ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు, పదవీ విరమణ తీసుకున్న వారికి ఎస్బీఐ పలు ప్రయోజనాలు, ఫీచర్లతో ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. వ్యక్తిగత ప్రమాద బీమా, వాయు ప్రమాదం, విధుల్లో మరణిస్తే అదనపు పరిహారంతో బీమా రక్షణను అందించనున్నట్టు తెలిపింది. శాశ్వత/పాక్షిక అంగవైకల్య కవరేజీ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘‘మన జాతి, పౌరుల రక్షణ కోసం వైమానిక దళ ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. డిఫెన్స్ శాలరీ స్కీమ్ కింద వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారాలు అందించడాన్ని కొనసాగిస్తాం’’అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. ఈ ప్రయోజనాలు డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ పరిధిలో ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిగ్గా లభిస్తాయని ఎస్బీఐ తెలిపింది. -
వినియోగదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకు షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం పెంచింది. అన్ని రకాల టెన్యూర్స్‌పై ఈపెంపు వర్తిస్తుందని బుధవారం ప్రకటించింది. దీంతో రుణాల ఈఎంఐలపై భారం పడనుంది. సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఏడాదికాల రుణాలపై ఎంసీఎల్ ఆర్ 7.25 - 7.40 శాతానికి పెరిగింది. అలాగే ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 6.7, 6.80, 6.90 శాతానికి చేరుకోగా, ఆరు నెలల వడ్డీరేటు 7.10 శాతానికి పెరిగింది. గత నెల మేలో ఆర్బీఐ రేటును పెంచిన తర్వాత ఈ మార్పు చోటు చేసుకొంది. -
పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకుల్లో కీలక పరిణామం.. !
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంకులలో ప్రభుత్వం ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేయనుంది. పంకజ్ శర్మను 2022 ఏప్రిల్ 11 నుంచి డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించినట్లు పీఎన్బీ పేర్కొంది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేటంతవరకూ బాధ్యతల్లో కొనసాగుతారని తెలియజేసింది. పంకజ్ జైన్ స్థానే శర్మ పదవిని చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పంకజ్ శర్మ ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ఈ నెల 11న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మనోజ్ సహాయ్, సుశీల్ కుమార్ సింగ్‌లను డైరెక్టర్లుగా నియమించినట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది. మీరా శ్వాంప్, అన్షుమన్ శర్మ స్థానే వీరి నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు వీరు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొంది. ప్రత్యేక నియామకం ప్రస్తుతం ప్రయివేట్ రంగ సంస్థగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉంది. దీంతో కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 161(3) ప్రకారం ప్రభుత్వ నామినీ డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించినట్లు బ్యాంక్ వివరించింది. కాగా.. ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఎంజీ జయశ్రీని డైరెక్టర్‌గా నామినేట్ చేసినట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా జయశ్రీ విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ప్రభుత్వ నామినీ డైరెక్టర్ల నియామక వార్తల నేపథ్యంలో పీఎన్బీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 36.75 వద్ద, ఐడీబీఐ బ్యాంక్ 3 శాతం నష్టంతో రూ. 46 వద్ద ముగిశాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 1.5 శాతం నీరసించి రూ. 17 వద్ద స్థిరపడింది. -
ఖాతాదారులకు గట్టిషాకిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు గట్టి షాక్‌ను ఇచ్చింది. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 4, 2022 నుంచి అమలులోకి రానుంది. ఖాతాదారులకు నిరాశపరుస్తూ వడ్డీరేట్లను పీఎన్బీ తగ్గించింది. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి గాను 2.70 శాతానికి తగ్గించినట్లు పీఎన్బీ ప్రకటించింది. అంతేకాకుండా రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును ఏడాదికి 2.75 శాతానికి తగ్గిస్తూ పీఎన్బీ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఖాతాదారులకు వర్తించనుంది. పీఎన్బీ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది డిపాజిటర్లను ప్రభావితం చేయనుంది. వీరిలో చాలా మందికి రూ.10 లక్షల కంటే తక్కువ ఖాతా నిల్వలు ఉన్నాయి. రెండు నెలల సమయంలో రెండోసారి డిపాజిట్‌దారుల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును పీఎన్బీ మరింత తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొదుపు ఖాతాపై రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగే నేపథ్యంలో పీఎన్బీ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో భాగంగా స్వల్పకాలిక డిపాజిట్లపై 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. మధ్యస్థ, దీర్ఘకాలిక డిపాజిట్లపై సంవత్సరానికి 2.25 శాతం, 2.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. చదవండి: స్టాక్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నది తెలుగువారే.. -
కస్టమర్ల ధ్రువీకరణ తర్వాతే చెక్కులకు ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రూ.10 లక్షలు అంతకుమించిన చెక్కుల ఆమోదానికి కస్టమర్ల ధ్రువీకరణను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పేసిస్టమ్ (పీపీఎస్)ను అమలు చేయనుంది. రూ.10 లక్షలకు మించిన చెక్కు క్లియరెన్స్ కోసం వచ్చినప్పుడు కస్టమర్ ధ్రువీకరణను తీసుకోనుంది. తద్వారా చెక్కుల రూపంలో భారీ మోసాలకు చెక్ పెట్టొచ్చన్నది పీఎన్బీ అభిప్రాయంగా ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ విధానంలో రూ.50,000, అంతకుమించిన చెక్కులకు పీపీఎస్‌ను పీఎన్బీ అమలు చేస్తోంది. ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారుల ఇష్టానికి వదిలేయాలని, రూ.5లక్షలకు మించిన చెక్కులకు బ్యాంకులు తప్పనిసరి చేయవచ్చని గతంలో ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
పీఎన్బీ ఖాతాదారులకు అలర్ట్.. మరో కొత్త రూల్..!
చెక్కు మోసాల నుంచి బ్యాంకు ఖాతాదారులను రక్షించడం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్)ను తప్పనిసరి చేస్తామని నేడు తెలిపింది. ₹10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కుల కోసం వచ్చే నెల నుంచి పీపీఎస్ తప్పనిసరి చేయనున్నట్లు రుణదాత తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. 1 జనవరి 2021 నుంచి సీటీఎస్ క్లియరింగ్ సమయంలో ₹50,000, అంతకంటే విలువ కలిగిన చెక్కుల కోసం పీపీఎస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్) కింద పెద్ద మొత్తం గల చెక్కును క్రాస్ చెక్ చేసే సమయంలో కొన్ని వివరాలను తప్పక తిరిగి ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎన్బీ కస్టమర్లు అకౌంట్ నెంబరు, చెక్ నెంబరు, చెక్ ఆల్ఫా కోడ్, జారీ తేదీ, మొత్తం, లబ్ధిదారుపేరు వంటి వివరాలను తెలపాల్సి ఉంటుంది. చెక్ క్లియరింగ్ కోసం కనీసం 24 పనిగంటల ముందు చెక్ వివరాలను బ్యాంకుతో పంచుకోవాలి. కస్టమర్లు తన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎమ్ఎస్ బ్యాంకింగ్ లేదా తమ హోమ్ బ్రాంచీకి వెళ్ళి వివరాలను పంచుకోవచ్చు. ₹5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కులను క్లియర్ చేయడం కోసం పాజిటివ్ పే సిస్టమ్ వేసులుబాటును ఆర్బీఐ బ్యాంకులకు కల్పించింది. (చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!) -
అప్పులు చేసి పారిపోయిన మెహుల్ చోక్సీ.. హైదరాబాద్ ఆస్తుల అమ్మకం
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన ఆస్తులను హైదరాబాద్‌కి చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికారిక వ్యవహరాలు ఇటీవలే కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్‌లో పెట్టుబడులు ఒకప్పుడు దేశంలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా మెహుల్ చోక్సీ వెలుగొందారు. రోజుకో దేశంలో తిరుగుతూ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఈ క్రమంలో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణం పొందారు. వీటితో దేశవ్యాప్తంగా తన వ్యాపారాలను విస్తరించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కి చెందిన ఏపీ జెమ్స్, జ్యూయల్లరీ వ్యాపారాన్ని మెహుల్ చోక్సీ సొంతం చేసుకున్నారు. విదేశాలకు పరారీ బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించలేదు. ఈ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఒత్తిడి చేయడంతో అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు మెహుల్ చోక్సీ. ఈ క్రమంలో ఆయన దివాళా తీసినట్టుగా ప్రకటించారు. దీంతో ఇండియాలో ఆయన ఆస్తులను బ్యాంకుల అప్పులు తీర్చే ప్రక్రియ కొనసాగుతుంది. అమ్మకానికి ఆమోదం ఏపీ జెమ్స్ అండ్ జ్యూయల్లరీ కంపెనీ 2001లో హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ఆ తర్వాత క్రమంలో కంపెనీని మెహుల్ చోక్సీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కార్పోరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) 2019లో మొదలైంది. ఈ క్రమంలో ఏపీ జెమ్స్‌ని అమ్మకానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. విలువ ఎంతంటే హైదరాబాద్‌కి చెందిన రియాల్టీ డెవలపర్స్ సంస్థ రూ. 107 కోట్ల రూపాయలకు ఏపీ జెమ్స్ అండ్ జ్యూయల్లర్స్ని కొనేందుకు ముందుకు వచ్చింది. అమ్మకం ద్వారా సమకూరిన మొత్తాన్ని అప్పుల కింద బ్యాంకులకు జమ చేస్తారు. కాగా ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ సంస్థకి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో రెండెకరాల స్థలంతో పాటు ఐదు అతంస్థుల భవనం ఉంది. 2018 నుంచి ఈ ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. చదవండి: విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసు.. ఆ రోజే తుది తీర్పు -
ఆర్థిక సంక్షోభంలో బ్యాంకు.. రంగంలోకి దిగిన ఆర్బీఐ
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్‌ను యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూఎస్‌ఎఫ్‌బీ) టేకోవర్ చేసేందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ముసాయిదా స్కీమును రూపొందించింది. దీని ప్రకారం పీఎంసీ బ్యాంక్‌కు చెందిన డిపాజిట్లతో పాటు ఆస్తులు, అప్పులను యూఎస్‌ఎఫ్‌బీ తీసుకోనుంది. ఒకవేళ కొత్త బ్యాంకులో కొనసాగరాదని భావిస్తే రిటైల్ డిపాజిటర్లు దశలవారీగా నగదును వెనక్కి తీసుకోవచ్చు. ఇక పీఎంసీ బ్యాంక్ ఉద్యోగులు అవే వేతనాలు, అవే సర్వీసు నిబంధనల కింద నిర్దిష్ట తేదీ నుంచి మూడేళ్ల పాటు సర్వీసులో కొనసాగుతారు. ఈ స్కీముతో డిపాజిటర్ల సొమ్ముకు మరింత భద్రత చేకూరగలదని ఆర్బీఐ తెలిపింది. దీనిపై డిసెంబర్ 10 దాకా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ఆర్బీఐకు పంపవచ్చు. ఆ తర్వాత ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసి, విత్డ్రాయల్స్పై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెజిలియెంట్ ఇన్నొవేషన్ కలిసి ఏర్పాటు చేసిన యూఎస్‌ఎఫ్‌బీ ఈ ఏడాది అక్టోబర్‌లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ పొందింది. నవంబర్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. చదవండి:మీ పేర్లలో ‘బ్యాంక్’ను తగిలించొద్దు -
వామ్మో! ఎస్బీఐ ఛార్జీల రూపంలో ఇంత వసూలు చేసిందా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ)తో సహా పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్(బిఎస్‌బిడిఎ) ఖాతాదారులకు అందించే కొన్ని సేవలపై అధిక ఛార్జీలు విధిస్తున్నట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. బీఎస్‌బిడిఎ ఖాతాదారులు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీ నుంచి రూ.17.70 వసూలు చేయాలని ఎస్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని"సహేతుకమైనది"గా పరిగణించ లేమని అధ్యయనం పేర్కొంది. సేవా ఛార్జీలు విధించడం వల్ల 2015-20 మధ్య కాలంలో ఎస్బిఐ దాదాపు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(బీఎస్‌బిడిఎ) హోల్డర్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది. అలాగే, ఎస్బీఐ తర్వాత ఇండియాలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇదే సమయంలో 3.9 కోట్ల బీఎస్‌బిడిఎ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు వసూలు చేసింది. "కొన్ని బ్యాంకులు బీఎస్బిడిఎలపై గల ఆర్బిఐ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఎస్బీఐ గరిష్ట సంఖ్యలో బీఎస్‌బిడిఎలను నిర్వహిస్తుంది. ప్రతి డెబిట్ లావాదేవీపై(డిజిటల్ మార్గాల ద్వారా కూడా) నెలకు నాలుగు దాటిన ప్రతిసారి 17.70 రూపాయలు వసూలు చేస్తుంది. 2018-19 కాలంలో రూ.72 కోట్ల వసూలు చేస్తే 2019-20 రూ.158 కోట్లు వసులు చేసినట్లు” ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. 2013 సెప్టెంబర్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బీఎస్‌బీడిఎపై ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఎస్బీఐ, 2013 నాటి నుంచి ఆర్బిఐ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ నెలకు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీపై బీఎస్బీడిఎ హోల్డర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుంది. నెఫ్ట్, ఐఎంపిఎస్ వంటి డిజిటల్ లావాదేవీలపై కూడా ఛార్జీలు రూ.17.70 వసూలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. "ఒక వైపు ప్రభుత్వం దేశంలో డిజిటల్ చెల్లింపు మార్గాలను గట్టిగా ప్రోత్సహిస్తుంటే. మరోవైపు, ఎస్బీఐ ఖాతాదారులను నిరుత్సాహపరుస్తుంది" అని ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. చదవండి: రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం! -
పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్
ముంబై, సాక్షి: మార్కెట్లు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఫలితంగా రికార్డ్ గరిష్టాలను తాకాయి. ఈ నేపథ్యంలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) కారణంగా పీఎస్‌యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మరోపక్క వచ్చే జనవరి 1 నుంచి వివిధ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి పీఎన్బీ కౌంటర్ నష్టాలతో డీలాపడగా..ఎంఅండ్ఎం లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం సమావేశమైన మూలధన పెట్టుబడుల సమీకరణ కమిటీ క్విప్ ఇష్యూకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పీఎన్బీ వెల్లడించింది. ఇందుకు రూ. 37.35 ఫ్లోర్ ధరను ప్రకటించింది. క్విప్‌లో భాగంగా అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించేందుకు బ్యాంక్ ఇప్పటికే అనుమతులు పొందింది. అయితే ఫ్లోర్ ధరకు 5 శాతానికి మించి డిస్కౌంట్ ఇవ్వబోమని బ్యాంక్ తెలియజేసింది. క్విప్ ధర, షేర్ల జారీ తదితర అంశాలపై శుక్రవారం సమావేశంకానున్న పెట్టుబడుల కమిటీ నిర్ణయాలు తీసుకోనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో పీఎన్బీ షేరు 8.3 శాతం పతనమై రూ. 37.25ను తాకింది. ప్రస్తుతం 5 శాతం నష్టంతో రూ. 38.60 వద్ద ట్రేడవుతోంది. (మార్కెట్ డౌన్- ఈ షేర్లు జూమ్) మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 1 నుంచి ప్రయాణికుల, వాణిజ్య వాహన ధరలను పెంచనున్నట్లు ఎంఅండ్ఎం తాజాగా వెల్లడించింది. ముడిసరుకులు, తదితర వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. పెంపు వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు తొలుత ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 746ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 740 వద్ద ట్రేడవుతోంది. -
పీఎన్బీలో మరో భారీ స్కాం
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (సిల్) 1,203.26 కోట్ల రూపాయల మేర టోపీ పెట్టింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి పీఎన్బీ స్కాం వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకముందే పీఎన్బీ ఈ భారీ స్కాం గురించి రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. అహ్మదాబాద్ జోనల్ కార్యాలయంలోని కార్పోరేట్ శాఖలో ఈ మోసం జరిగినట్లు తెలిపింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ మోసపూరితంగా రూ.1,203 కోట్ల రుణాన్ని పొందిందని బ్యాంకు ప్రకటించింది. సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్ క్లోజర్ రిక్వైర్ మెంట్స్ (ఎల్ఓడిఆర్) బ్యాంకు విధానాల ప్రకారం సింటెక్స్ ఇండస్ట్రీస్ నికర నిర్థక ఆస్తుల్లో రూ.1203 కోట్ల మేర మోసంతో తీసుకున్న రుణాలు ఉన్నాయని ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. -
జీఏఈఎల్, నాగార్జునా జూమ్- సింటెక్స్ బోర్లా
రేపటి నుంచి మార్కెట్లు మూడు రోజులపాటు పనిచేయని కారణంగా గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ కౌంటర్ నేటి నుంచి ఎక్స్స్ల్పిట్గా ట్రేడవుతోంది. కంపెనీ రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించింది. ఇతర వివరాలు చూద్దాం.. జీఏఈఎల్ షేర్ల విభజనకు అక్టోబర్ 5 రికార్డ్ డేట్ కావడంతో గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్(జీఏఈఎల్) కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 20 శాతం దూసుకెళ్లి రూ. 128ను తాకింది. ఆపై కొంత వెనకడుగుతో రూ. 122 వద్ద ట్రేడవుతోంది. ఇది 12 శాతం లాభంకాగా.. బుధవారం ముగింపు రూ. 218తో పోలిస్తే.. రూ. 110 దిగువన ప్రారంభమైంది. మార్కెట్లకు మూడు రోజులు సెలవులు కావడంతో నేటి(గురువారం) నుంచి ఎక్స్స్ల్పిట్లో ట్రేడింగ్ ప్రారంభమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్ఎఫ్సీఎల్ ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో నాగార్జునా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఎన్ఎఫ్సీఎల్) రూ. 85.3 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 113 కోట్ల నష్టం నమోదైంది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ క్యూ1(ఏప్రిల్-జూన్)లో మొత్తం ఆదాయం రూ. 347 కోట్ల నుంచి రూ. 464 కోట్లకు ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఎన్ఎఫ్సీఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 4.35 వద్ద ఫ్రీజయ్యింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ సింటెక్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రుణ ఖాతాలలో రూ. 1,203 కోట్లమేర మోసాలు జరిగినట్లు ఆర్బీఐకి పీఎస్‌యూ సంస్థ పంజాజ్ నేషనల్ బ్యాంక్ నివేదించింది. ఈ రుణాలు ఎన్‌పీఏలుకాగా.. ఇప్పటికే ఈ ఖాతా కింద రూ. 215 కోట్లకు ప్రొవిజన్లు చేపట్టినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సింటెక్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. కొనుగోలుదారులు లేకపోవడంతో రూ. 2 వద్ద ఫ్రీజయ్యింది. -
2,300 కిలోల వజ్రాలు, ముత్యాలు వెనక్కి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించారంటూ ప్రముఖ వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ(48), మెహుల్ చోక్సీ(60)పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. హాంకాంగ్‌లోని వారి సంస్థల నుంచి 2,340 కిలోల పాలిష్డ్ వజ్రాలు, ముత్యాలను బుధవారం వెనక్కి తీసుకొచ్చింది. వీటి విలువ రూ.1,350 కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 108 బ్యాగేజీల్లో వీటిని తీసుకొచ్చారు. ఇందులో నీరవ్ మోదీకి చెందినవి 32, చోక్సీకి చెందినవి 76 ఉన్నాయి. ఈ మొత్తం వజ్రాలు, ముత్యాలు, నగలను 2018లో వారు హాంకాంగ్ నుంచి దుబాయ్‌కి తరలించేందుకు ప్రయత్నించారు. ఇండియా దర్యాప్తు అధికారులు అప్రమత్తం కావడంతో అది ఫలించలేదు. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తప్పుడు గ్యారంటీలు చూపించి, 2 బిలియన్ డాలర్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. దీనిపై కేసు నమోదు చేసి ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా హాంకాంగ్‌లో నీరవ్ మోదీ, చోక్సీ సంస్థల నుంచి వజ్రాలు, ముత్యాలు, వెండి నగలను వెనక్కి తీసుకొచ్చింది. వీటిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సీజ్ చేసింది. 2018లో విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఈడీ అధికారులు గతేడాది లండన్‌లో అరెస్టు చేశారు. -
పీఎన్బీ : మూడు ఆడి కార్లు, విమర్శలు
సాక్షి, ముంబై : దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) మరోసారి వార్తల్లో నిలిచింది. వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణంతోపాటు, కరోనా వైరస్, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సంక్షోభంలో పడిన బ్యాంకు టాప్ మేనేజ్ మెంట్ కోసం అత్యంత విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడం సంచలనం రేపుతోంది. ఆర్థిక నష్టాలను పట్టించుకోకుండా గత నెలలో సుమారు రూ .1.34 కోట్ల విలువైన హై-ఎండ్ లగ్జరీ కార్లను అందించడం విమర్శలకు తావిచ్చింది. అయితే బోర్డు ఆమోదం పొందిన తరువాత, ఫుల్ టైం డైరెక్టర్లకు మంజూరు చేసిన పరిమితిలోనే వీటిని కొనుగోలు చేసినట్లు బ్యాంకు వర్గాలు ప్రకటించాయి. అలాగే గత సంవత్సరం ఉపయోగించకుండా మిగిలిన నిధులతో కలిపి వీటిని కొనుగోలు చేసినట్టు వెల్లడించాయి. పీఎన్బీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ కార్లను ఉపయోగిస్తారని తెలిపాయి. (లాక్డౌన్ ఎఫెక్ట్ : రికార్డు అమ్మకాలు) ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, క్యాబినెట్ మంత్రులు కూడా జర్మన్ లగ్జరీ కారు ఆడి కంటే చాలా తక్కువ ఖరీదైన మారుతి సుజుకి సియాజ్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శికి సమానం. అటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ (ఎండీ కంటే ఎక్కువ స్థాయి ర్యాంకు) కూడా టయోటా కరోలా ఆల్టిస్‌ను ఉపయోగిస్తున్నారని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ అతని మామ మెహుల్ చోక్సీకు మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్ఓయూ) జారీ చేయడం ద్వారా రూ .14 వేల కోట్ల కుంభకోణం 2018లో వెలుగు చూసింది. 2020 జనవరితో ముగిసిన మూడవ త్రైమాసికంలో, బ్యాడ్ లోన్లు గణనీయంగా పెరగడంతో బ్యాంక్ రూ. 502 కోట్ల నష్టాన్ని నివేదించింది. ఏడాది క్రితం ఇదే కాలానికి బ్యాంక్ నికర లాభం రూ .249.75 కోట్లు. (పెట్రో షాక్ : నాలుగో రోజూ) కాగా కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం అన్నిమంత్రిత్వ శాఖలను కోరింది. ఈ క్లిష్ట సమయాల్లో మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను వివేకంతో ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
వడ్డీరేట్లు తగ్గించిన పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బి) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రుణాల వడ్డీరేటును తగ్గిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అన్ని కాల పరిమితి గల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 15 బీపీఎస్‌పాయింట్లు తగ్గించింది. అలాగే రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ను 40 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది. దీంతో 7.05 నుంచి 6.65 శాతానికి తిగి వచ్చింది. ఈ సవరించిన రేట్లు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది ఫండ్ డిపాజిట్ రేటును కూడా తగ్గించింది. గరిష్టంగా 3.25 శాతం చెల్లించనున్నట్టు తెలిపింది. వివిధ మెచ్యూరిటీల టర్మ్ డిపాజిట్ రేట్లను గరిష్టంగా 5.50 శాతంగా ఉంచింది. రూ .2 కోట్లకు పైన డిపాజిట్లపై సీనియర్ సిటిజనులకు సాధరణ వాటికంటే కంటే 75 బీపీఎస్ పాయింట్ల మేర అధిక వడ్డీ రేటును అందివ్వనుంది. ఇటీవల ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో దీనికనుగుణంగా దేశీయ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను సవరిస్తున్న సంగతి తెలిసిందే. -
గేదెల రుణం : బ్యాంకు సీనియర్ అధికారి అరెస్ట్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. గేదెలను కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేసినందుకు గాను లక్ష రూపాయల లంచం లంచం డిమాండ్ చేశాడు. దీంతో వలపన్నిన సీబీఐ అధికారులు పీఎన్బీ సీనియర్ మేనేజర్ సుమేర్ సింగ్, అతని సతీష్ సహచరుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హర్యానా, రేవారి జిల్లా కన్వాలి బ్రాంచ్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ అందించిన సమాచారం కుష్పురాలో డెయిరీ యూనిట్ నడుపుతున్న ఫిర్యాదుదారునికి రూ .24.72 లక్షల రుణం మంజూరుకు పశుసంవర్ధక శాఖ ఆమోదించింది. గేదెలను కొనుగోలు చేసేందుకు మొదటి దశగా రూ.7.92 లక్షలను బ్యాంకు మంజూరు చేయాల్సి వుంది. అయితే ఇందుకుగాను లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు సుమేర్ సింగ్. ఈ మొత్తాన్ని మధ్యవర్తి (ప్రైవేట్ వ్యక్తి) కు అప్పగించాలని నిందితులు ఫిర్యాదుదారుని కోరారు. దీంతో అతడు సీబీఐని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటుండగా నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. -
పీఎన్బీ, అలాహాబాద్ బ్యాంకు రెపో రేటు రుణాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ), అలహాబాద్ బ్యాంకులు తమ రిటైల్ రుణాలను ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో రుణాల రేట్లు దిగిరానున్నాయి. రెపో రేటుతో అనుసంధానించిన ‘పీఎన్బీ అడ్వాంటేజ్’ పథకాన్ని పీఎన్బీ ప్రారంభించింది. ‘‘ప్రస్తుతమున్న ఎంసీఎల్ఆర్తో పోలిస్తే రెపో ఆధారిత విధానంలో 0.25 శాతం తక్కువగా వడ్డీ రేటు ఉంటుంది. ఇంటి రుణాలు తీసుకునే వారికి నూతన రేట్లు 8.25 శాతం నుంచి 8.35 శాతం వరకు.. కార్ల కోసం తీసుకునే రుణాలపై 8.65 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది’’ అని పీఎన్బీ తెలిపింది. అంతేకాదు, ఎంసీఎల్ఆర్ కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు రెపో ఆధారిత లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)కు మారిపోయే అవకాశం కూడా ఇస్తున్నట్టు పేర్కొంది. ఇక రూ.75 లక్షల వరకు రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ అనుసంధానిత రేటు (ఈబీఎల్ఆర్) ఆధారంగా రుణాలను మంజూరు చేయనున్నట్టు అలహాబాద్ బ్యాంకు ప్రకటించింది. -
పీఎన్బీకి మరోసారి ఆర్బీఐ షాక్
సాక్షి, ముంబై : ప్రభుత్వ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఖాతాలో మోసం జరిగినట్లు నివేదించడంలో ఆలస్యం చేసినందుకుగాను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పీఎన్బీకి రూ .50 లక్షల భారీ పెనాల్టీ విధించింది. ఈ విషయాన్ని శనివారం అందించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పీఎన్బీ వెల్లడించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ ఖాతాకు సంబంధించి జూలై 10, 2018 న పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమర్పించిన ఫ్రాడ్ మానిటరీ రిపోర్ట్-1లో ఆలస్యాన్ని ఆర్బీఐ గుర్తించిందని తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని వివిధ సెక్షన్ల కింద బ్యాంకుపై ఈ జరిమానా విధించింది. మరోవైపు ఫ్రాడ్‌పై నివేదించడంలో జరిగిన ఆలస్యానికి గాను ఆర్బీఐ రూ .50 లక్షల జరిమానా విధించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రత్యేక దాఖలులో పేర్కొంది. కాగా ఇటీవల కరెంట్ బ్యాంకు అకౌంట్ల విషయంలో అవసరమైన కెవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు నాలుగు బ్యాంకులపై ఆర్బీఐ పెనాల్టీ విధించింది. పీఎన్బీ, అలహాబాద్ బ్యాంకు, యూసీఓ బ్యాంకులకు ఒక్కోదానిపై రూ.50 లక్షలు జరిమానా విధించగా, కార్పొరేషన్ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
లాభాల్లోకి పీఎన్బీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. గత క్యూ1లో రూ.940 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ1లో రూ.1,019 కోట్ల నికర లాభం వచ్చిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.4,750 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. రుణ నాణ్యత మెరుగుపడటంతో కేటాయింపులు తగ్గాయని, ఫలితంగా ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ సునీల్ మెహతా చెప్పారు. గత క్యూ1లో రూ.15,072 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.15,162 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా అధ్వాన పరిస్థితులు ముగిశాయని, రానున్న క్వార్టర్లలో మంచి పనితీరు చూపిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రుణ నాణ్యత మెరుగు... బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 18.26 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 16.49 శాతానికి తగ్గాయని మెహతా తెలిపారు. నికర మొండి బకాయిలు 10.58 శాతం నుంచి 7.17 శాతానికి చేరాయని పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.82,889 కోట్ల నుంచి రూ.77,267 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.43,872 కోట్ల నుంచి రూ.30,180 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా మొండి బకాయిలు 10–12 శాతం రేంజ్లో దిగిరాగలవని ఆయన ధీమాగా చెప్పారు. మొండి బకాయిలు తగ్గడంతో మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు సగం తగ్గాయి. గత క్యూ1లో రూ.4,982 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో రూ.2,147 కోట్లకు తగ్గాయని తెలిపారు. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 61.80 శాతం నుంచి 74.63 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. రిటైల్ రుణాలు 22 శాతం అప్... భారీ మార్పుల దిశగా చర్యలు చేపట్టామని, ఫలితంగా వ్యాపారంలోనూ, రుణ నాణ్యతలోనూ మెరుగుదల సాధించామని మెహతా తెలిపారు. కేంద్రీకృత రుణ ప్రాసెసింగ్ ప్రక్రియ, ఒత్తిడిలోని రుణాల నిర్వహణలో మెరుగైన విధానం, పర్యవేక్షణ విభాగాల మెరుగుదల వంటి ప్రయత్నాలు ఫలాలనివ్వడం మొదలైందని పేర్కొన్నారు. రిటైల్ రుణాలు 22 శాతం, గృహ రుణాలు 30 శాతం పెరిగాయని పేర్కొన్నారు. నష్టాల్లోంచి లాభాల్లోకి రావడం, రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్ఈలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ 2.5 శాతం లాభంతో రూ.67.75 వద్ద ముగిసింది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట..
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అత్యుత్తమ రేటింగ్ ఉన్న అసెట్స్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్‌టైమ్ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల మేర విలువ చేసే ఎన్‌బీఎఫ్‌సీల అసెట్స్ కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం వన్‌టైమ్ ప్రాతిపదికన పాక్షికంగా హామీనిస్తుంది. ఒకవేళ నష్టం వాటిల్లితే 10 శాతం దాకా హామీ ఉంటుంది‘ అని మంత్రి తెలిపారు. వినియోగ డిమాండ్‌ను నిలకడగా కొనసాగించడంలోనూ, చిన్న..మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చడంలోను ఎన్ బీఎఫ్సీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు డిఫాల్టు అయినప్పట్నుంచీ ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటున్నాయి. అయినప్పటికీ వాటి నియంత్రణ విషయంలో ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ బీఎఫ్సీలను ఆర్బీఐ మరింత పటిష్టంగా నియంత్రించే విధంగా ఫైనాన్స్ బిల్లులో మరిన్ని చర్యలుంటాయని సీతారామన్ తెలిపారు. డీఆర్ఆర్ తొలగింపు.. పబ్లిక్ ఇష్యూల ద్వారా ఎన్బీఎఫ్సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ (డీఆర్ఆర్) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం డెట్ పబ్లిక్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే ఎన్బీఎఫ్సీలు డీఆర్ఆర్ కింద కొంత మొత్తాన్ని పక్కన పెట్టడంతో పాటు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ రిజర్వ్ కింద మరికాస్త పక్కన పెట్టాల్సి ఉంటోంది. మరోవైపు, గృహ రుణాల రంగంపై నియంత్రణాధికారాలను ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్బీఐకి బదలాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వివరించారు. పెన్షను రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ట్రస్టును విడదీయనున్నట్లు తెలిపారు. -
పీఎన్బీ సహా నాలుగు బ్యాంకులకు జరిమానా
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), యూకో బ్యాంక్, అలహాబాద్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులకు ఆర్బీఐ రూ.1.75 కోట్ల జరిమానాలు విధించింది. కేవైసీ అవసరాలు, కరెంటు ఖాతాల ప్రారంభానికి సంబంధించి నిబంధనలు పాటించకపోవడమే కారణం. పీఎన్బీ, అలహాబాద్ బ్యాంకు, యూకో బ్యాంకులకు ఒక్కో దానికి రూ.50 లక్షల చొప్పున, కార్పొరేషన్ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించినట్టు ఆర్బీఐ తెలిపింది. -
క్యూ4లో పీఎన్బీ నష్టం రూ.4750కోట్లు
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ( పీఎన్బీ) క్యూ4లో భారీ నష్టాలను నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన మార్చి ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాల్లో రూ. 4750 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. అయితే స్థూల నిరర్ధక ఆస్తులు గత త్రైమాసికంలో 16.33 శాతం నుంచి 15.5 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు కూడా రూ.12,970కోట్ల నుంచి రూ. 7,611 స్థాయికి దిగి వచ్చాయి. ఈ ఫలితాలపై ఎనలిస్టులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికం లో రూ.13,417 కోట్ల నష్టాలతో పోలిస్తే గణనీయంగా కోలుకుంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కుంభకోణం బ్యాంకును భారీగా నష్టపర్చింది. మరోవైపు ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ షేరు నష్టాల్లో కొనసాగుతోంది. -
మరో బ్యాంకింగ్ మెర్జర్‌కు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో మరికొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనం తరువాత మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్‌బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకులతో రెండవ దఫా విలీన చర్చలు జరుపుతోందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. తుది చర్చల అనంతరం విలీనానికి ఆయా బ్యాంకులకు ఆహ్వానం పంపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విలీన ప్రక్రియకోసం ఎంతో కాలం వేచి వుండాలని తాము భావించడం లేదనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా, మూడవ త్రైమాసికంలో విలీనం ఉండవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. అలాగే బ్యాంకులు తగిన ప్రతిపాదనలు ఇవ్వడంలో విఫలమైతే, ప్రత్యామ్నాయ విధానం (ఏఎం) గ్రూప్ తగిన సలహాలను ఇస్తుందని ఆయన మీడియాకు చెప్పారు. కాగా విజయ, దెనా, బీవోబీ విలీన ప్రక్రియ గత ఏడాది అక్టోబరులో మొదలై , ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విలీనం తరువాత బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన సంగతి తెలిసిందే. -
పీఎన్బీలో ఏటీఎం ఫ్రాడ్ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంలో చిక్కుకున్ పంజాబ్ నేషనల్‌బ్యాంకు (పీఎన్బీ)లో తాజాగా అక్రమ లావాదేవీల ఉదంతం ప్రకంపనలు రేపుతోంది. ఏటీఎం మోసం ద్వారా పీఎన్బీ ఖాతాదారుల సొమ్మలు స్వాహా అయిపోతున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో 61 మంది వినియోగదారుల ఖాతాల నుంచి సుమారు 15 లక్షల రూపాయలు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏటీఎం మోసాలపై ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా...తగిన సూచనలు జారీ చేస్తున్నా ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) లకు సంబంధించిన నేరాలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 8 న తన ఖాతానుంచి తన ప్రమేయం లేకుండానే గుర్తు తెలియని లావాదేవీ జరిగిందని ఒక ఖాతాదారుడు పీఎన్బీ వసంత్ విహార్ బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించారు. దీంతో బ్యాంకు అధికారులు ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఫిర్యాదుదారుల జాబితా మరింత పెరిగింది. బ్యాంకు ప్రకటన ప్రకారం మొత్తం 14, 97,769 రూపాయల సొమ్ము అక్రమార్కుల జేబులోకి వెళ్లిపోయింది. దీనిపై కేసు నమోదు చేశామని వసంత్ విహార్ డీసీపీ(సౌత్ వెస్ట్) దేవేందర్ ఆర్యా వెల్లడించారు. -
పీఎన్బీ హౌసింగ్‌లో వాటా విక్రయించిన పీఎన్బీ
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ భ్యాంకు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను విక్రయ నిర్ణయాన్ని పూర్తి చేయనుంది. జనరల్ అట్లాంటిక్, వర్డె పార్టనర్స్ సంస్థలకు రూ. 1851 కోట్లకు విక్రయించనున్నామని పీఎన్బీ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. అయితే హౌసింగ్ యూనిట్లో ప్రమోటర్ హోదా ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు 1.09 కోట్ల పీఎన్బీ హౌసింగ్ షేర్లను రూ. 850 చొప్పున కొనుగోలు చేస్తాయి. ఈ విలువ ప్రకారం పీఎన్బీ హౌసింగ్ మొత్తం విలువ రూ. 926 కోట్లకు చేరుతుంది. ఈ విక్రయం అనంతరం పీఎన్బీకి హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటా 32.79 శాతం నుంచి 19.78 శాతానికి దిగిరానుంది. హౌసింగ్ యూనిట్లో వాటాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని గత డిసెంబర్లో పీఎన్బీ నిర్ణయించింది. ఈ ప్రకటనతో శుక్రవారం మార్కెట్లో పీఎన్బీ హౌసింగ్ ఫిన్ షేర్ దాదాపు 4శాతం లాభపడింది. -
పీఎన్బీ.. సంస్కరణల అమల్లో టాప్
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్, చాలా వేగంగా కోలుకుని సంస్కరణల అజెండా అమల్లో అగ్రస్థానంలో నిల్చింది. ఈ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెండో స్థానం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. సేవల నాణ్యతను మెరుగుపర్చుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణలపై బీసీజీ–ఐబీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటలైజేషన్, రుణ వితరణ తదితర 140 అంశాల ప్రాతిపదికగా రూపొందించిన ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం విడుదల చేశారు. ఇందులో 100 మార్కులకు గాను పీఎన్బీకి 78.4 స్కోరు దక్కించుకుంది. మిగతా బ్యాంకుల స్కోర్లు చూస్తే.. బీవోబీ 77.8, ఎస్బీఐ (74.6), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (69), కెనరా బ్యాంక్ (67.5), సిండికేట్ బ్యాంక్ 67.1గా ఉన్నాయి. బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, రుణ వితరణ, ఆర్థిక సేవల విస్తరణ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సత్వరం స్పందించడం తదితర అంశాల్లో పీఎన్బీ ’మెరుగైన పనితీరు’ కనపర్చినట్లు బీసీజీ–ఐబీఏ నివేదిక పేర్కొంది. ‘భారీ కుంభకోణం కారణంగా ఇటు ఆర్థికంగాను, అటు ప్రతిష్టపరంగానూ దెబ్బతిన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండిబాకీలకు రూ. 14,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. అయితే, 9 నెలల్లోనే బ్యాంక్ పనితీరు గణనీయంగా మెరుగుపడింది. తొమ్మిది నెలల తర్వాత గత క్వార్టర్లో లాభాలు కూడా ప్రకటించింది. అలాగే, సంస్కరణల అమల్లో అగ్రస్థానాన్నీ దక్కించుకోవడం అభినందనీయం‘ అని జైట్లీ ప్రశంసించారు. ఇలాంటి ర్యాంకింగ్‌ల విధానంతో బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒత్తిడి తగ్గిందని, మొండిబాకీలను గుర్తించడంతో పాటు వాటికి పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేయడం కూడా ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. పీసీఏలోని బ్యాంకులకూ ర్యాంకింగ్.. భారీ మొండిబాకీల కారణంగా ఆర్బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ఈ నివేదికలో ర్యాంకింగ్ లభించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కి 66.7, యూకో బ్యాంక్ (64.1), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (60.8), ఐడీబీఐ బ్యాంక్ (60.2), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (55.7), దేనా బ్యాంక్‌కు 53.8 ర్యాంక్ లభించింది. ప్రభుత్వ రంగంలో మొత్తం 21 బ్యాంకులు ఉండగా, 11 బ్యాంకులను ఆర్బీఐ గతేడాది పీసీఏ పరిధిలోకి చేర్చి కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. 5 బ్యాంకులు ఇటీవలే దీన్నుంచి బైటికి వచ్చాయి. దివాలా చట్టంతో ప్రయోజనాలు.. దివాలా చట్టం, మొండిబాకీల రికవరీపరమైన సంస్కరణల పక్కా అమలు.. బ్యాంకులు కోలుకునేందుకు తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. 2015 ఏప్రిల్ నుంచి 2018 డిసెంబర్ దాకా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2.87 లక్షల కోట్లు రికవర్ చేసుకున్నాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ దాకా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 98,498 కోట్లు రాబట్టుకోగలిగాయని తెలిపింది. 2014–15 నుంచి 2019 ఫిబ్రవరి దాకా ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ. 2.5 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చింది. కొనసాగనున్న బ్యాంకుల విలీనం.. అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ఇందులో భాగంగా బ్యాంకుల విలీన విధానాన్ని క్రమంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. మొండిబాకీలను బ్యాంకులు పూర్తిగా బైటపెట్టేలా చర్యలు తీసుకోవడంతో.. ప్రారంభంలో వీటి పరిమాణం భారీ స్థాయికెళ్లిందని, అయితే కేటాయింపులు, రికవరీలతో ఇవి తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. గడిచిన 2–3 త్రైమాసికాల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో మొండిబాకీల సమస్య క్రమంగా తగ్గుతోందన్నారు. ‘అదనపు మూలధనం సమకూర్చడంపై ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటోంది. పలు బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి రావడం హర్షణీయం. త్వరలో మిగతావి కూడా తమ కార్యకలాపాలు మెరుగుపర్చుకుని, బైటికి రాగలవని ఆశిస్తున్నాను‘ అని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ వచ్చాక.. బ్యాం కుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యానికి ఫుల్స్టాప్ పడిందని జైట్లీ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ప్రతిభ, ప్రొఫెషనలిజంకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే మరిన్ని నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటున్నా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండటం అభినందించతగ్గ విషయమని జైట్లీ పేర్కొన్నారు. -
వడ్డీ రేట్లు తగ్గించిన పీఎన్బీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 0.10 శాతం కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీరేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ ఒక ప్రకటనలోవెల్లడించింది. దీంతో సంవత్సరాల కాలపరిమితి గల లోన్లపై వడ్డీరేటు 8.55శాతం నుంచి 8.45 శాతానికి దిగి రానుంది. మూడేళ్ల కాల రుణాల రేట్లు 8.65శాతంగా ఉండనున్నాయి. కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ తాజా ద్రవ్య పరపతి విధాన సమీకలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలను అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు వినియోగదారులకు అందించాలని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కూడా 0.05శాతం ఎంసీఎల్ఆర్ను తగ్గించిన సంగతి తెలిసిందే. -
మార్చి తరువాతే పీఎన్బీ మెట్‌లైఫ్ ఐపీవో!
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) తన బీమా విభాగం పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటోంది. తనకున్న 30 శాతం వాటాల నుంచి 4 శాతం వాటాల విక్రయంపై ప్రస్తుతం దృష్టి పెట్టింది. 2016 నుంచీ పీఎన్బీ మెట్‌లైఫ్ ఐపీవోకు రావాలనుకుంటోంది. జాయింట్ వెంచర్ నుంచి అమెరికా కంపెనీ మెట్‌లైఫ్ పూర్తిగా బయటకు వెళ్లిపోవాలని భావిస్తుండడంతో ఐపీవో అనివార్యం కానుంది. 2001లో ముంబై కేంద్రంగా పీఎన్బీ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు కాగా, ఇందులో పీఎన్బీకి 30%, మెట్‌లైఫ్‌కు 26%, ఎల్ప్రోకు 21 శాతం, ఎం పల్లోంజి అండ్ కంపెనీకి 18%, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకుకు 5 శాతం చొప్పున వాటాలున్నాయి. ‘‘పీఎన్బీ మెట్‌లైఫ్ ఐపీవోతో సరైన సమయంలో మార్కెట్లోకి వస్తాం. ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉంది. కనుక వచ్చే ఆర్థిక సంవత్సరంలో వస్తాం’’ అని పీఎన్బీ ఎండీ, సీఈవో సునీల్ మెహతా మీడియాకు తెలిపారు. ఐపీవో సైజుపై ఆయన వివరాలేవీ చెప్పలేదు. సరైన ధరను గుర్తించేందుకు పీఎన్బీ మెట్‌లైఫ్ తన వాటాల నుంచి 4 శాతాన్ని విక్రయించే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఉంది. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో బ్యాంకుకున్న వాటాలను కొనుగోలు చేసేందుకు బిడ్లు వచ్చాయని, వీటిపై -
ఆశ్చర్యపర్చిన పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న ప్రభుత్వరంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 2018-19 మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది. దాదాపు రెండు మూడు క్వార్టర్ల తరువాత ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించడంతో ఈ కౌంటర్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో జోరందుకుంది. 4 శాతం జంప్ చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో పీఎన్బీ 7 .12 శాతం వృద్ధితో రూ. 246.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సైతం 7.6 శాతం పెరిగి రూ. 4290 కోట్లను తాకింది. రూ. 2754 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. గతేడాది(2017-18) క్యూ3లో ఇవి రూ. 4467 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 17.16 శాతం నుంచి 16.33 శాతానికి మెరుగుపడ్డాయి. నికర ఎన్పీఏలు సైతం 8.9 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఫ్రాడ్కింద రూ. 2014 కోట్లమేర ప్రొవిజన్‌ను చేపట్టినట్లు బ్యాంక్ తెలిపింది. -
క్యూ2లో ఢమాలన్న పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) క్యూ2లో ఢమాల్ అంది. శుక్రవారం విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర నష్టాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తోముగిసిన క్యూ2లో రూ. 4532 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత త్రైమాసికంలో రూ. 940 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్లో భారీ నష్టాలను నమోదు చేసింది. పీఎన్బీ నికర వడ్డీ ఆదాయం కూడా 1 శాతం తగ్గి రూ. 3974 కోట్లకు పరిమితమైంది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 18.26 శాతం నుంచి 17.16 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 10.58 శాతం నుంచి 8.9 శాతానికి నీరసించడం గమనార్హం. త్రైమాసిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 5758 కోట్ల నుంచి రూ. 9758 కోట్లకు ఎగశాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 5250 కోట్ల నుంచి రూ. 4476 కోట్లకు తగ్గాయి. రైటాఫ్స్ రూ. 2648 కోట్ల నుంచి రూ. 3543 కోట్లకు ఎగశాయి. ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ కౌంటర్లో అమ్మకాలతో 4శాతానికి పైగా నష్టపోయింది. అయితే ఇటీవల నీరవ్‌మోదీ స్కాంతో అభాసుపాలైన పీఎన్బీ ఎసెట్ క్వాలీటీ క్వార్టర్-ఆన్ క్వార్టర్ మెరుగుపడింది. సెప్టెంబర్ చివరినాటికి రుణాల మొత్తం 17.16 శాతంగా ఉంది. జూన్ చివరి నాటికి ఇది 18.26 శాతం, అంతకు ముందు ఏడాది 13.31 శాతంగా ఉంది. -
పీఎన్బీ వినియోగదారులకు దీపావళి షాక్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఫెస్టివ్ సీజన్లో వినియోగదారులకు చేదు వార్త అందించింది. రుణాలపై వడ్డీరేటును పెంచుతున్నట్టు వెల్లడించింది. తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లను పెంచింది. అన్ని రకాల రుణీలపై ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. నవంబరు 1నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్బీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా పెంపుతో పీఎన్బీ అందించే ఒక సంవత్సర కాలపు రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 8.50 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిధి రుణాలపై పీఎన్బీ వసూలు చేసే వడ్డీరేటు 8.7శాతంగాను, ఆరునెలల వ్యవధి రుణాలపై వడ్డీ రేటు 8.45శాతంగాను, మూడు నెలల కాలానికి 8.25శాతం గాను ఉంది. -
బ్యాంకులకు రూ.1,700 కోట్ల టోపీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం, నెట్వర్కింగ్, పవర్ కన్వర్షన్ పరికరాల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ వీఎంసీ సిస్టమ్స్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.1,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. పీఎన్బీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వీఎంసీతో పాటు, కంపెనీ ప్రమోటర్లు ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, బి.వెంకట రమణపై కేసు నమోదు చేసింది. వీరిపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులు పెట్టటమే కాక... వీఎంసీ సిస్టమ్స్ ఆఫీసుతో పాటు డైరెక్టర్ల నివాసాల్లో మొత్తం మూడు చోట్ల సోదాలు కూడా చేసింది. సంస్థకు హైదరాబాద్ దగ్గర్లోని రావిర్యాల వద్ద ప్లాంటు ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే ఉపకరణాలను బీఎస్ఎన్ఎల్తోపాటు వివిధ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఆకాశ్ ట్యాబ్లెట్ల విషయంలో దేశవ్యాప్తంగా వివాదాల్లో చిక్కుకున్న డేటావిండ్‌తో ఈ కంపెనీకి గతంలో భాగస్వామ్యం ఉండేది. ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లను డేటావిండ్‌తో పాటు పలు కంపెనీలకు సరఫరా చేసింది. ఇవీ కేసు పూర్వాపరాలు.. నిర్వహణ మూలధనం కోసమని వీఎంసీ సిస్టమ్స్ 2009 ఆగస్టు 12న పీఎన్బీ, ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల నుంచి రూ.1,010.50 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ రుణాలు చెల్లించకుండా డిఫాల్టయింది. బ్యాంకులు ఆరా తీయడంతో కంపెనీ అక్రమాలు బయటపడ్డాయి. రూ.1,010.50 కోట్ల నిర్వహణ మూలధన రుణాల్లో రూ.43.83 కోట్లను బ్యాంకుల అనుమతి లేకుండానే ఏప్రిల్ 2013– ఏప్రిల్ 2014 మధ్య వేరే బ్యాంకుల ఖాతాలకు మళ్లించింది. మిగతా నిధులను కూడా ఇలాగే వేరే ఖాతాలకు దారి మళ్లించి ప్రమోటర్లు స్వాహా చేసినట్టు సీబీఐకి పీఎన్బీ ఫిర్యాదు చేసింది. తీసుకున్న అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.1,700 కోట్లయింది. దీన్లో రూ.539 కోట్లు పీఎన్‌బీకే రావాలి. మిగిలిన రూ.1,207 కోట్లు ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్ అసెట్స్ రీకన్‌స్ట్రక్షన్‌లకు రావాల్సి ఉంది. అన్నీ అబద్ధాలే.. అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడంతో వీఎంసీ ఏదో ఒక సాకు చెబుతూ వచ్చింది. బీఎస్ఎన్ఎల్ నుంచి తమకు రూ.262 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పింది. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఆరా తీయగా వీఎంసీకి తాము చెల్లించాల్సింది రూ.33 కోట్లు మాత్రమేనని బీఎస్ఎన్ఎల్ తేల్చి చెప్పింది. ఇంకా ఐటీఐ, న్యుట్రినో పవర్ సిస్టమ్స్, వీపీ సిస్టమ్స్‌ల నుంచి రూ.352.99 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్టు వీఎంసీ చెప్పింది. ఎస్బీఐ అధికారులు దీనిపై ఆరా తీయగా, అవన్నీ అబద్ధాలేనని తేలటంతో.. పీఎన్బీ సీబీఐని ఆశ్రయించింది. బ్యాంకు రుణాలను ప్రమోటర్లు ఏయే ఖాతాలకు మళ్లించారనే అంశంపైనా సీబీఐ శోధిస్తోంది. -
ఫలితాల దెబ్బ: పీఎన్బీ షేరు పతనం
సాక్షి, ముంబై: అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో ఇరుక్కున్న దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నష్టాలు వదిలిపెట్టడం లేదు. వరుసగా రెండవ క్వార్టర్లో కూడా నష్టపోవడంతో పీఎన్బీ షేరు భారీగా నష్టపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆ బ్యాంకు భారీగా నష్టాలను చవి చూవడడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో పీఎన్బీ షేరు ఒక దశలో దాదాపు 9శాతం కుప్పకూలింది.. చివరికి 7శాతం నష్టంతో రూ.82.90 వద్ద ముగిసింది. జూన్ 30తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.940 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పీఎన్బీ నికర లాభం కేవలం రూ.343 కోట్లు మాత్రమే. ఇక మొత్తం ఆదాయం రూ.15,072 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది పీఎన్బీ ఆదాయం రూ.14,468గా ఉంది. మార్చితో ముగిసిన గత త్రైమాసికంలో బ్యాంక్ 13,417 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఇక మొండి బకాయిలు 18.26 శాతం పెరిగినట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. -
పీఎన్బీ ఖాతాలో రూ.2,816 కోట్లు జమ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,816 కోట్ల మూలధన కేటాయింపు లభించినట్లు ప్రకటించింది. ప్రాధాన్యతా కేటాయింపు మార్గంలో ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. నియంత్రణ పరమైన ఆమోదాల అనంతరం మూలధన సాయం అందినట్లు వివరించింది. ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐదు పీఎస్‌యూలకు రూ.2.11 లక్షల కోట్ల నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. గడిచిన వారంలోనే అలహాబాద్ బ్యాంకు రూ.1,790 కోట్ల మూలధన సాయం అందుకున్నట్లు ప్రకటించింది. -
బ్యాంకులకు బెయిలవుట్ జోష్
న్యూఢిల్లీ: మొండిబాకీల(ఎన్పీఏ) దెబ్బకి మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఆదుకునేందుకు ఉద్దేశించిన బెయిలవుట్ ప్యాకేజీ కింద కేంద్రం మరికొన్ని నిధులను సమకూర్చనుంది. ఇందులో భాగంగా అయిదు పీఎస్బీలకు రూ.11,336 కోట్లు అందించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ), అలహాబాద్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో అదనపు మూలధనాన్ని సమకూర్చడానికి సంబంధించి ఇదే తొలి విడత కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ. 53,664 కోట్లు కూడా పీఎస్బీలకు కేంద్రం అందించనుంది. తాజా ప్రణాళిక ప్రకారం.. నీరవ్ మోదీ స్కామ్ బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 2,816 కోట్లు లభించనున్నాయి. ఆంధ్రా బ్యాంక్‌కు రూ. 2,019 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ. 2,157 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ. 2,555 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ. 1,790 కోట్లు లభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాండ్లపై వడ్డీల చెల్లింపులకు తోడ్పాటు.. అదనపు టయర్ 1 (ఏటీ–1) బాండ్‌హోల్డర్లకు వడ్డీ చెల్లింపులు జరపాల్సి ఉండటంతో... ఈ జాబితాలోని కొన్ని బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. తాజా పరిణామం వీటికి కొంత ఉపశమనం ఇవ్వనుంది. సాధారణంగా శాశ్వత ప్రాతిపదికన ఉండే ఏటీ1 బాండ్ల ద్వారా కూడా బ్యాంకులు తమకు కావాల్సిన మూలధనాన్ని సమీకరిస్తుంటాయి. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పెరిగిపోతుండటంతో పాటు భారీ నష్టాలు చవిచూస్తున్న పీఎస్బీలకు.. తమ సొంత ఆదాయం నుంచి ఈ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కష్టంగా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయమే తీసుకుంటే.. గతేడాది జూలైలో ఏటీ1 బాండ్ల విక్రయం ద్వారా సమీకరించిన రూ.1,500 కోట్ల మొత్తంపై వడ్డీ చెల్లించేందుకు తక్షణం రూ.135 కోట్లు అవసరముంది. 8.98 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ నెల 25లోగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. అయితే, నీరవ్ మోదీ స్కామ్ దెబ్బకి లాభాలు తుడిచిపెట్టుకుపోగా భారీ నష్టాలు, మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎన్బీకి ఈ చెల్లింపులు జరపడం కష్ట సాధ్యంగా మారింది. మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం పీఎన్బీ టయర్ 1 మూలధనం 5.96 శాతం స్థాయిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 7.375 శాతం కన్నా ఇది చాలా తక్కువ. జూలై 25 గడువులోగా నిర్దేశిత స్థాయికి మూలధనం పెంచుకుంటేనే పీఎన్బీ ఈ చెల్లింపులు చేయగలుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్లకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతే.. దేశ ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవలే ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అదనపు మూలధన నిధులు సమకూర్చనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో పీఎన్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం రూ.1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో పీఎస్బీలకు లభించనున్నాయి. మిగతా రూ. 58,000 కోట్లను బ్యాంకులు మార్కెట్ నుంచి సమీకరించుకోవచ్చు. రూ.1.35 లక్షల కోట్లలో కేంద్రం ఇప్పటికే రూ.71,000 కోట్లు అందించింది. మిగతా మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూర్చనుంది. పీఎస్‌బీలు కూడా సొంతంగా రూ. 50,000 కోట్లను సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 21 పీఎస్బీల్లో ఇప్పటికే 13 బ్యాంకులు ఇందుకోసం బోర్డులు, షేర్‌హోల్డర్ల అనుమతులు కూడా పొందాయి. పీఎస్‌బీల షేర్లు రయ్.. కేంద్రం అదనపు మూలధనం సమకూర్చనున్న వార్తలతో మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. 11 శాతం దాకా పెరిగాయి. కార్పొరేషన్ బ్యాంక్ షేరు సుమారు 10.88%, అలహాబాద్ బ్యాంక్ 7.23%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.57%, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.38%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.87%, కెనరా బ్యాంక్ 5.71%, ఇండియన్ బ్యాంక్ 5.04% పెరిగాయి. అటు ఆంధ్రా బ్యాంక్ 4.91%, దేనా బ్యాంక్ 3.58%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.10%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2.27%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1.35% పెరిగాయి. కేంద్ర రీక్యాపిటలైజేషన్ ప్రతిపాదన వీటికి ఊతమిచ్చినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ‘కనీస బ్యాలెన్స్’ పెనాల్టీలతో పీఎన్బీకి రూ.152 కోట్లు న్యూఢిల్లీ: మినిమం బ్యాలెన్స్ పాటించని పొదుపు ఖాతాలపై జరిమానాల ద్వారా పీఎన్బీ గత ఆర్థిక సంవత్సరంలో ఖాతా దారుల నుంచి రూ.151.66 కోట్లు వసూలు చేసింది. 1.23 కోట్ల సేవింగ్స్ ఖాతాలపై పీఎన్బీ ఈ మేరకు పెనాల్టీలు విధించింది. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల ద్వారా వసూలు చేసిన మొత్తం గురించిన వివరాలు వెల్లడించాలంటూ దరఖాస్తు చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్‌కు పీఎన్బీ ఈ విషయాలు తెలియజేసింది. ‘2017–18లో మినిమం బ్యాలెన్స్ పాటించని 1,22,98,748 సేవింగ్స్ అకౌంట్స్ నుంచి రూ.151.66 కోట్ల మేర పెనాల్టీని వసూలు చేయడం జరిగింది’ అని పేర్కొంది. ప్రభుత్వం మరింత మందిని బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. బ్యాంకులు ఇలా మినిమం బ్యాలెన్స్ నిబంధనల పేరుతో పెనాల్టీలు విధించడం సరికాదని, ఈ విషయంలో ఆర్బీఐ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆర్థికవేత్త జయంతిలాల్ భండారీ వ్యాఖ్యానించారు. -
పీఎన్బీ హౌసింగ్‌లో వాటా విక్రయం!
ముంబై: పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో వాటాను విక్రయించనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలియజేసింది. కార్లైల్ గ్రూప్‌తో కలిసి కనీసం 51 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో పీఎన్బీకి 32.79 శాతం వాటా, కార్లైల్ గ్రూప్‌కు చెందిన క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్‌కు 32.36 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 4.8 శాతం వాటాను ఈ ఏడాది మేలో క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ.1,024 కోట్లకు విక్రయించింది. తాజా వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్ 3.4 శాతం లాభంతో రూ.1,232 వద్ద ముగిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.62,252 కోట్లుగా ఉన్నాయి. ఇది దేశంలోనే ఐదో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. -
విదేశీ శాఖల్లో కూడా మోదీకి రుణాలు
న్యూఢిల్లీ: వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ రుణ కుంభకోణాన్ని తవ్వినకొద్దీ మరిన్ని కొత్త అంశాలు బయటపడుతున్నాయి. మోదీ సంస్థలు కేవలం బ్రాడీ హౌస్ బ్రాంచ్ నుంచే కాకుండా తమ దుబాయ్, హాంకాంగ్ శాఖల నుంచి కూడా రుణాలు తీసుకున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పేర్కొంది. ఇందుకు సంబంధించిన అంతర్గత విచారణ నివేదికను పీఎన్బీ దర్యాప్తు ఏజెన్సీలకు అందజేసింది. దీని ప్రకారం మోదీ గ్రూప్ కంపెనీలైన ఫైర్‌స్టార్ డైమండ్ లిమిటెడ్ హాంకాంగ్, ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్జెడ్ఈ దుబాయ్ సంస్థలు పీఎన్బీకి చెందిన హాంకాంగ్, దుబాయ్ శాఖల నుంచి రుణ సదుపాయాలు పొందాయి. రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణంపై విచారణ ప్రారంభమైన వెంటనే.. ఈ రెండు సంస్థలకు రుణ సదుపాయాన్ని బ్యాంకు నిలిపివేసింది. అయితే, ఈ రెండు ఖాతాల్లోనూ అవకతవకలేమీ జరిగిన దాఖలాలు లేవని పీఎన్బీ తమ నివేదికలో పేర్కొంది. మోదీ సంస్థలతో బ్యాంకు అధికారులు కుమ్మక్కై మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ (ఎల్వోయూ) ద్వారా ఈ స్కామ్‌కు ఎలా తెరతీసినదీ.. వివరంగా తెలియజేసేలా సుమారు 162 పేజీల నివేదికతో పాటు పలు అంతర్గత ఈ–మెయిల్స్‌ని కూడా ఆధారాలుగా దర్యాప్తు ఏజెన్సీలకు సమర్పించింది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఫైర్‌స్టార్ డైమండ్ స్కామ్ బైటపడిన తర్వాత ఫిబ్రవరిలోనే దివాలా పిటీషన్ వేసింది. రుణ కుంభకోణంలో సింహభాగం ఈ సంస్థకే చేరినట్లు అనుమానాలున్న నేపథ్యంలో దివాలా ప్రక్రియలో పీఎన్బీ కూడా పారీగా చేరింది. అడ్డంకులు పెడితే రహస్య ఎజెండా ఉన్నట్లే: మాల్యా బాకీలు తీర్చే దిశగా తన ఆస్తుల అమ్మకానికి ఈడీ, సీబీఐ అభ్యంతరాలు పెడితే.. రుణాల రికవరీకి మించిన రహస్య ఎజెండా మరేదో ఉందని భావించాల్సి వస్తుందని వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉంటానని, కానీ రాజకీయాలు చేస్తే మాత్రం తాను చేయగలిగేదేమీ లేదన్నారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీట్టర్లో ట్వీట్ చేశారు. న్యాయస్థానం పర్యవేక్షణలో ఆస్తులను విక్రయించి రుణదాతలకు చెల్లించేసేందుకు అనుమతించాలంటూ న్యాయస్థానం అనుమతి కోరినట్లు మాల్యా పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 9,000 కోట్ల పైచిలుకు బ్యాంకులకు ఎగవేసిన మాల్యా.. ఇంగ్లాండ్‌కి పారిపోయిన సంగతి తెలిసిందే. -
ఒక ఏడాది.. 1.2 లక్షల కోట్ల రైటాఫ్!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) గత ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ. 1.20 లక్షల కోట్ల మేర మొండిబాకీలను రైటాఫ్ చేశాయి. ఆయా బ్యాంకులన్నీ కలిపి ప్రకటించిన నష్టాలతో పోలిస్తే రద్దు చేసిన బాకీల విలువ ఏకంగా ఒకటిన్నర రెట్లు అధికం కావడం గమనార్హం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2013–14లో రూ. 34,409 కోట్లుగా ఉన్న రైటాఫ్‌లు.. అయిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. 2017–18 నాటికి రూ. 1.20 లక్షల కోట్లకు (ప్రొవిజనల్) చేరాయి. బ్యాంకింగ్ పరిభాషలో రైటాఫ్ చేయడమంటే.. మొండిపద్దుకు సంబంధించి బ్యాంకు తనకొచ్చిన ఆదాయం నుంచి 100 శాతం ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, దీనివల్ల మొండిబాకీలను ఖాతాల నుంచి తొలగించినట్లయినప్పటికీ.. బ్యాంకు నిర్వహణ లాభాలు దెబ్బతింటాయి. ఈ పరిణామాల కారణంగానే పీఎస్‌బీలు గత ఆర్థిక సంవత్సరంలో ఇటు భారీగా రైటాఫ్‌లతో పాటు అటు రికార్డు స్థాయిలో నష్టాలు కూడా ప్రకటించాయి. 2016–17 దాకా ఎంతో కొంత లాభాలు ప్రకటిస్తూ వచ్చిన పీఎస్‌బీలు 2017–18లో ఏకంగా రూ. 85,370 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2017–18లో ఎస్బీఐ రైటాఫ్ చేసిన మొండిబాకీలు రూ. 40,196 కోట్లు. -
బ్యాంకింగ్ స్కాంలతో భారీ నష్టం, కోట్లకు కోట్లు ఆవిరి
ఇండోర్ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న కుంభకోణాలు చూస్తూనే ఉన్నాం. ఈ కుంభకోణాలు బ్యాంకులను భారీ మొత్తంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న బ్యాంకింగ్ కుంభకోణాలతో దేశంలో ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.25,775 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడైంది. వీటిలో ఎక్కువగా నష్టపోయింది పంజాబ్ నేషనల్ బ్యాంకేనని తెలిసింది. ఈ ఏడాది ముగింపు వరకు వివిధ రకాల కుంభకోణాలతో పీఎన్బీకి అత్యధిక మొత్తంలో రూ.6461.13 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్టీఐ డేటాలో తేలింది. చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ఈ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బ్యాంకింగ్ కుంభకోణాల్లో అతిపెద్దది డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలది. వీరు పీఎన్బీ అధికారులతో కుమ్మకై, బ్యాంకులో దాదాపు రూ.12,636 కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో పలు బ్యాంకింగ్ కుంభకోణాల వల్ల రూ.2390.75 కోట్ల నష్టం వచ్చినట్టు ఆర్ఐటీ సమాధానంలో తెలిసింది. ఇదే కాలంలో బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.2,224.86 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడాకు రూ.1,928.25 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ.1520.37 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.1,303.30 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.1,224.64 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.1,116.53 కోట్లు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.1,095.84 కోట్లు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.1,084.50 కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకు రూ.1,029.23 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.1,015.79 కోట్ల నష్టం వచ్చినట్టు వెల్లడైంది. కుంభకోణాలతో ప్రస్తుతం బ్యాంకులు తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయని ఎకనామిస్ట్ జయంతిలాల్ భండారి అన్నారు. దీని వల్ల ప్రస్తుతం బ్యాంకులు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టాలను ఎదుర్కొనడమే కాకుండా... భవిష్యత్తులో కొత్త రుణాలు అందివ్వడంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదని హెచ్చరించారు. -
పీఎన్బీ రేటింగ్ డౌన్‌గ్రేడ్: మూడీస్
ముంబై: కుంభకోణం, భారీ నష్టాలతో సతమతమవుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రేటింగ్‌ను మూడీస్ డౌన్‌గ్రేడ్ చేసింది. లాభదాయకతపై తీవ్ర ప్రతికూల ప్రభావాల కారణంగా బీఏ/ఎన్పీ రేటింగ్ నుంచి బీఏఏ3/పీ–3కి డౌన్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొంది. ఇతరత్రా వనరుల మద్దతు లేకుండా నిలదొక్కుకోగలిగే సామర్థ్యానికి సంబంధించిన బేస్‌లైన్ క్రెడిట్ అసెస్మెంట్ను (బీసీఏ) కూడా తగ్గించింది. అయితే, అవుట్‌లుక్ మాత్రం స్థిరంగానే కొనసాగిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి బాసెల్ నిబంధనలకు తగ్గట్లుగా కనీస మూలధనం ఉండాలన్నా... పీఎన్బీ బయటి నుంచి సుమారు రూ. 12,000–13,000 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నుంచి కొంత మొత్తం లభించడంతో పాటు ఇతరత్రా రియల్టీ ఆస్తులు, అనుబంధ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌లో పాక్షికంగా వాటాలను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్నా.. స్కామ్ బైటపడక పూర్వం ఉన్న స్థాయికి మూలధనం పెరగకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. -
పీఎన్బీని దాటిన ‘హౌసింగ్ ఫైనాన్స్’
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బ నుంచి బైటపడటానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నానా తంటాలు పడుతోంది. అయితే, దీని ప్రతికూల ప్రభావాలతో దాని మార్కెట్ విలువ గణనీయంగా హరించుకుపోయింది. అనుబంధ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (పీఎన్‌బీహెచ్‌ఎఫ్) కన్నా మాతృ సంస్థ పీఎన్బీ మార్కెట్ క్యాప్ తగ్గిపోయింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి పీఎన్‌బీహెచ్‌ఎఫ్ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 21,172 కోట్లు కాగా పీఎన్బీ విలువ రూ. 21,105 కోట్లకు చేరింది. మాతృసంస్థ కన్నా పీఎన్‌బీహెచ్‌ఎఫ్ విలువ రూ. 68 కోట్లు అధికం కావడం గమనార్హం. గురువారం బీఎస్ఈలో పీఎన్బీ షేరు 1.19 శాతం లాభంతో రూ. 76.45 వద్ద ముగియగా, పీఎన్‌బీహెచ్‌ఎఫ్ షేరు 0.44 శాతం క్షీణించి రూ. 1,265 వద్ద క్లోజయ్యింది. పీఎన్‌బీహెచ్‌ఎఫ్‌లో పీఎన్బీకి 32.96 శాతం వాటాలు ఉన్నాయి. స్కామ్ బైటపడకముందు ఫిబ్రవరిలో పీఎన్బీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతమున్న దానికి రెట్టింపు స్థాయిలో రూ. 44,625 కోట్ల పైచిలుకు ఉండేది. అయితే, రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం వెలుగుచూసినప్పట్నుంచీ షేరు పతనమవుతూ వస్తోంది. ఇక నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలతో ఆర్థిక ఫలితాల కారణంగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పీఎన్బీ స్టాక్ సుమారు 15 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో పీఎన్బీ షేరు పెట్టుబడికి అంత అనువైనది కాకపోవచ్చంటూ ఎడెల్వీస్ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. -
హాంకాంగ్ కోర్టు మెట్లెక్కిన పీఎన్బీ
హాంకాంగ్‌లో ఉన్న నీరవ్ మోదీని ఎలాగైనా భారత్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్లు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన ఈయన్ని ఇటీవలే హాంకాంగ్‌లో ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. నీరవ్‌ను అరెస్ట్‌చేసి తమకు అప్పగించాలని భారత్ అధికారులు, హాంకాంగ్ అథారిటీలను కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా నీరవ్ మోదీకి వ్యతిరేకంగా హాంకాంగ్ హైకోర్టును ఆశ్రయించింది. హాంకాంగ్ హైకోర్టును మాత్రమే కాక, నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి ఆస్తులు, వ్యాపారాలు ఉన్న ఇతర దేశాల కోర్టులను సైతం పీఎన్బీ ఆశ్రయించింది. హైకోర్టు నోటీసులను హాంకాంగ్ న్యూస్‌పేపర్లు శనివారం ప్రచురించాయి. కాగ, పీఎన్బీకి దాదాపు రూ.13,500 కోట్లు ఎగవేసిన నీరవ్ మోదీపై ఇండియాటుడే సైతం పలు కీలక విషయాలను వెలుగులోకి తెస్తోంది. నీరవ్ సీక్రెట్ అకౌంట్లు, అతనికి విదేశాల్లో ఉన్న వ్యాపారాలు, నీరవ్ కుంభకోణంపై అతని కుటుంబ సభ్యుల స్పందన వంటి పలు విషయాలను ఇండియాటుడే విడుదల చేసింది. మరోవైపు ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారులపై బ్యాంకు సైతం కొరడా ఝళిపించడం ప్రారంభించింది. 1,084 వేల మంది రుణ ఎగవేతదారులను గుర్తించిన పీఎన్బీ, వారిలో 260 మంది ఫోటోలను పేపర్లలో కూడా ప్రచురించింది. -
‘మిషన్ గాంధీగిరీ’తో రూ. 1,800 కోట్ల రికవరీ
న్యూఢిల్లీ: మొండిబాకీలను రాబట్టుకునేందుకు దాదాపు ఏడాదికాలంగా కొనసాగిస్తున్న మిషన్ గాంధీగిరీ ద్వారా .. రూ. 1,800 కోట్లు రికవరీ కాగలవని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అంచనా వేస్తోంది. గతేడాది మేలో ప్రారంభించిన ఈ కార్యక్రమంతో సానుకూల ఫలితాలనిస్తోందని, సగటున నెలకు రూ. 150 కోట్ల మేర వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. మొండిబాకీదారుల పేర్లను బైటపెట్టడం ద్వారా వారిపై సామాజికంగా ఒత్తిడి పెంచి, బాకీలు రాబట్టుకోవాలన్నది మిషన్ గాంధీగిరీ ఉద్దేశమని పేర్కొన్నాయి. బ్యాంకు సర్కిల్స్ అన్నింట్లోనూ ఇందుకోసం ప్రత్యేకంగా రికవరీ టీమ్ కూడా ఏర్పాటు చేసినట్లు పీఎన్బీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొండిబాకీలపై పీఎన్బీ తీసుకుంటున్న చర్యల ఫలితంగా గత కొన్ని నెలల్లో 150 పైచిలుకు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పాస్‌పోర్టులను జప్తు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో డిఫాల్టర్లపై 37 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్లు చెప్పారు. -
మా బ్యాంకులో మీ డబ్బు భద్రం!!
న్యూఢిల్లీ: భారీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తమ ఖాతాదారులకు డిపాజిట్లపై భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. కస్టమర్స్ సొమ్ముకు తమ బ్యాంకులో పూర్తి భద్రత ఉంటుందని, వారెప్పుడైనా డిపాజిట్.. విత్‌డ్రా చేసుకోవచ్చని పునరుద్ఘాటించింది. వీటిపై వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. వ్యవస్థలో అనైతిక విధానాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని, మోసపూరిత లావాదేవీల్లాంటివేమైనా జరిగాయని తెలిసిన మరుక్షణం దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థలకు సమాచారం వెళ్లిపోతుందని .. కఠిన చర్యలు ఉంటాయని పీఎన్బీ తెలిపింది. స్కామ్ ప్రభావం పడిన ఇతర బ్యాంకులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని, తాజా పరిణామాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామని వివరించింది. ఇటీవలి రూ. 13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఖాతాదారుల సందేహాలను నివృత్తి చేసేలా ఇచ్చిన వివరణలో పీఎన్బీ ఈ అంశాలు పేర్కొంది. వజ్రాభరణాల వ్యాపారి నీవర్ మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 11,400 కోట్ల మేర పీఎన్బీని మోసం చేసినట్లు ఇటీవల బైటపడిన సంగతి తెలిసిందే. మరింత లోతుగా దర్యాప్తు చేయగా ఈ మొత్తం రూ. 13,000 కోట్లకి చేరింది. పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై, బ్యాంకు నుంచి తీసుకున్న నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ)తో మోదీ తదితరులు ఈ స్కామ్‌కి తెరతీశారు. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐతో పాటు యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మొదలైన దాదాపు 30 బ్యాంకులపై ఈ స్కామ్ ప్రభావం పడింది. -
పీఎన్బీ స్కాం: బ్యాంకు కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) సోమవారం కీలక ప్రకటన చేసింది. దాదాపు రూ.13వేల కోట్ల స్కాం రేపిన ప్రకంపనల నేపథ్యంలో వినియోగదారులకు భరోసా ఇస్తూ ప్రకటన జారీ చేసింది. వినియోగదారుల సొమ్ము పూర్తి భద్రంగా ఉందనీ, ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరింది. కస్టమర్లు తమ సొమ్మును ఎపుడైనా ఉపసంహరణ, లేదా డిపాజిట్ యథావిధిగా చేసుకోవచ్చని హామీ ఇచ్చింది. అనైతిక ,అక్రమ పద్ధతులను తాము సహించబోమని స్పష్టం చేసింది. ఖాతాదారుల ఆందోళనలను పరిష్కరించాలని కోరుతూ తరచూ అడిగే ప్రశ్నలు(FAQs) పై వివరణాత్మక ప్రకటన ఇచ్చింది. అక్రమ పద్దతులను, మోసపూరిత లావాదేవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ స్కాంకు సంబంధించి నియంత్రణాధికారులు, చట్ట సంస్థలకు వెంటనే ఫిర్యాదు చేశామని వివరించింది. -
ప్రభుత్వ బ్యాంకులపై పునరాలోచన అవసరం
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణల అవసరమని ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల యాజమాన్యం విషయంలో పునరాలోచనకు సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవలి పీఎన్బీ సహా పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మోసాలు వెలుగు చూడడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరిష్కార యత్నాలకు విఘాతం కలిగించాయన్నారు. పీఎస్బీల్లో ఈ మోసాలు భవిష్యత్తులో చోటు చేసుకోకూడదంటే విప్లవాత్మక అజెండా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం ట్విన్ బ్యాలన్స్ షీటు (రుణాలు తీసుకున్న సంస్థలు, ఇచ్చిన బ్యాంకులు సమస్యలను ఎదుర్కోవడం) సవాలును పరిష్కరించేందుకు దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ), బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అనే రెండు కీలక చర్యలు చేపట్టింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ ప్రయత్నాలన్నింటికీ బ్యాంకుల్లో మోసాలు గండికొట్టాయి’’ అని సుబ్రమణియన్ అన్నారు. ట్విన్ బ్యాలన్స్ షీటు సమస్య నుంచి బయటపడేందుకు తాజా చర్యలు అవసరమని సూచించారు. ప్రఖ్యాత నోబెల్ గ్రహీత ఆర్థిక వేత్త పాల్క్రుగ్మ్యాన్ భారత్‌లో తయారీ ఉద్యోగాలు లోపించాయనడం నిజమేనని సుబ్రమణియన్ అంగీకరించారు. తయారీ రంగంలో అవకాశాలను భారత్ 25–30 ఏళ్ల క్రితమే చేజార్చుకుందన్నారు. అయితే, భవిష్యత్తులోనూ తయారీ రంగం ఇదే స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుందన్న నమ్మకం లేదని, నిర్మాణం, వ్యవసాయం, సేవల రంగాలు మరింత ఉద్యోగాలు కల్పించగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశీయ డిమాండ్‌పైనే భారత్ ఎదగడం సాధ్యం కాదన్నారు. -
పీఎన్బీ ఉద్యోగినిపై యాసిడ్ దాడి
సాక్షి, లక్నో: పంజాబ్ నేషనల్ మహిళా బ్యాంకు ఉద్యోగిపై యాసిడ్ దాడి కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు పీఎన్బీ ఉద్యోగి(29)పై యాసిడ్ చల్లి పారిపోయారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు ఆమెకుసమీపంలో నిలుచ్చున్న మరో ఏడుగురు కూడా గాయాలపాటైనట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని పక్కనున్న వారు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నీరవ్ వ్యాపారంపై అంబానీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు చెక్కేసిన డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీపై విపుల్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఎన్బీ స్కాంలో కీలక నిందితుడుగా ఉన్న నీరవ్ వ్యాపార విస్తరణ క్రమం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో మరింత విస్తరించేలా భారీ ప్లాన్లను రూపొందించుకున్నారని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బంధువు, టవర్ క్యాపిటల్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపుల్ అంబానీ వెల్లడించారు. 1999లో వ్యాపారాన్ని ప్రారంభించిన నీరవ్ మోదీ అయిదేళ్లు తిరక్కుండానే తన రత్నాలు, వజ్రాల వ్యాపార సంస్థ ‘ఫైర్‌స్టార్ గ్రూప్’ ను విదేశాల్లోనూ విస్తరించాడని తెలిపారు. అప్పటికే 6 అంతర్జాతీయ నగరాలకు తన వ్యాపారాన్నివిస్తరింపజేసిన నీరవ్ 2015లో మరింత దూకుడు పెంచాడన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డైమండ్ వ్యాపార సామ్రాజ్యాన్ని 2020 నాటికి 12 దేశాల్లో భారీగా విస్తరించాలని భావించారట. ఈ సందర్భంగా 30కి పైగా ఔట్లెట్లను నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తానని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో నీరవ్ వెల్లడించిన విషయాన్ని విపుల్ గుర్తు చేశారు. అంతటి విస్తరణా కార్యక్రమాల్ని చూసిన ఎవరికైనా ఔరా.! అనిపిస్తుందని ఆయన తెలిపారు. ప్రఖ్యాత నటి, మోడల్ నవోమీ వాట్స్ నుంచి జూనియర్ ట్రంప్ వరకు నీరవ్ బిజినెస్ మోడల్‌ను చూసి అలా ఆశ్చర్యపోయిన వారేనని అన్నారు. నీరవ్ మోదీ, అతని మామ మోహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్కాంలో ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
ఎల్వోయూలు అన్నింటినీ గౌరవిస్తాం
న్యూఢిల్లీ: నీరవ్‌మోదీ కంపెనీలకు వాస్తవంగా జారీ చేసిన అన్ని ఎల్వోయూలను గౌరవిస్తామని (చెల్లింపులు చేయడం) పంజాబ్ నేషనల్ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ పరిస్థితి నుంచి బయటపడగలిగే సామర్థ్యం బ్యాంకుకు ఉందని తెలిపింది. వాటాదారుల అసాధారణ సమావేశం (ఈజీఎం)లో ఎదురైన ప్రశ్నలకు కంపెనీ ఈ మేరకు బదులిచ్చింది. బ్యాంకు జారీ చేసిన ఎల్వోయూల ఆధారంగా వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ విదేశీ బ్యాంకు శాఖల నుంచి రూ.13,000 కోట్ల మేర రుణాలు పొంది ఎగవేసిన విషయం తెలిసిందే. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణపై వాటాదారుల ఆమోదం కోసం ఏర్పాటు చేసిన ఈజీఎంలో స్కామ్‌పై బ్యాంకు యాజమాన్యం ప్రశ్నలను ఎదుర్కొన్నది. తనిఖీ, నియంత్రణలను మెరుగుపరిచేందుకు బహుళ అంచెల విధానాన్ని అనుసరించనున్నట్టు బ్యాంకు తెలిపింది. అంతర్గత నియంత్రణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు గాను తరచుగా ఇంటర్నల్ ఆడిట్, అవసరమైనప్పుడు ఎక్స్టర్నల్ ఆడిట్ చేపట్టనున్నట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి. దీనికితోడు కరెంట్, సేవింగ్స్ ఖాతా (కాసా)లు, చిన్న డిపాజిటర్లపై దృష్టి సారించాలని నిర్ణయించింది. బ్యాంకు వనరుల్లో 40 శాతం కాసా నుంచే వస్తుండటం గమనార్హం. మరోవైపు 33.49 కోట్ల షేర్లను ఒక్కో షేరు (రూ.2 ముఖ విలువ)ను రూ.161.38 ధరకు కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసే ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సే్చంజ్‌లకు పీఎన్బీ సమాచారం ఇచ్చింది. ఈ వాటాల జారీ తర్వాత బ్యాంకులో కేంద్రం వాటా ప్రస్తుతమున్న 57 శాతం నుంచి 62.25 శాతానికి పెరుగుతుంది. -
పీఎన్బీలో మరో కుంభకోణం
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణాలు తవ్వే కొద్దీ బయటికి వస్తున్నాయి. నీరవ్ మోదీ కుంభకోణం అనంతరం మరో స్కాం వెలుగులోకి వచ్చింది. ముంబై బ్రాంచ్‌లో మరో 9.1 కోట్ల రూపాయల మోసం జరిగినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు గుర్తించింది. ఈ విషయంపై ఫెడరల్ పోలీసు వద్ద పీఎన్బీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నీరవ్ మోదీ పాల్పడిన మాదిరిగానే.. అధికారుల సహకారంతో చంద్రీ పేపర్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీ కూడా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది. అయితే ఈ స్కాంపై ఇటు పీఎన్బీ అధికార ప్రతినిధి కానీ, అటు చంద్రీ పేపర్ కానీ వెంటనే స్పందించలేదు. ఈ స్కాంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగ, గత నెలలో వెలుగులోకి వచ్చిన నీరవ్ మోదీ కుంభకోణంలో పీఎన్బీ ముంబై బ్రాంచ్‌లో దాదాపు రూ.12,700 కోట్ల అవకతవకలు జరిగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ స్కాం బయటికి రాకముందే, ఈ భారీ మోసానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చౌక్సి, కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోయారు. వీరిని ప్రస్తుతం భారత్‌కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మోదీ, చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్‌పోల్‌ను కూడా కోరుతోంది ఈడీ. -
ఎల్వోయూల జారీపై నిషేధం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13,000 కోట్ల మేర లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ) కుంభకోణం దరిమిలా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఎల్వోయూలు జారీ చేయడాన్ని నిషేధించింది. వాణిజ్య రుణాలకు సంబంధించి బ్యాంకులు.. ఎల్వోయూలు, లెటర్స్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్వోసీ)ల జారీ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వివరించింది. మార్గదర్శకాలను పునఃసమీక్షించిన అనంతరం.. కేటగిరీ–1 బ్యాంకులు ఎల్వోయూలు/ఎల్వోసీలు జారీ చేసే విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, దిగుమతులకు సంబంధించి వివిధ సంస్థల రుణ అవసరాల కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీల జారీని బ్యాంకులు య«థాప్రకారం కొనసాగించవచ్చని పేర్కొంది. పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై తీసుకున్న ఎల్వోయూల ఆధారంగా వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆర్బీఐ తాజా నిబంధనలతో ఎక్కువగా ఎల్‌వోయూలమీదే ఆధారపడే వ్యాపార సంస్థలపై ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే, బ్యాంక్ గ్యారంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం యథాప్రకారం కొనసాగనున్నందున వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. ఎల్వోయూలను ఎక్కువగా వజ్రాభరణాల రంగంలోని పెద్ద సంస్థలే ఉపయోగిస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు, నీరవ్ మోదీ 2011 మార్చి 10న ముంబైలోని పీఎన్బీ బ్రాడీ హౌస్ శాఖ నుంచి తొలిసారిగా ఎల్వోయూ తీసుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు తెలిపారు. ఆ తర్వాత 74 నెలల వ్యవధిలో ఏకంగా 1,212 ఎల్వోయూలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) స్కామ్ ఆర్థిక వ్యవస్థలో భయాందోళనకు, అచేతనానికి దారితీయరాదని ఫిక్కీ సూచించింది. ఈ విధమైన పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఆర్బీఐ, ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు ఫిక్కీ ప్రెసిడెంట్ రషేష్ షా తెలిపారు. షా ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. పీఎన్బీ స్కామ్ యూపీఏ–2 హయాంలోని చివరి రోజులను గుర్తు చేస్తోందని, నాడు సీబీఐ, సీవీసీ, కాగ్ అంటే భయం ఉండేదని షా పేర్కొన్నారు. ఈ తరహా స్కామ్‌ల తో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న ఆయన, 1992లో హర్షద్ మెహతా స్కామ్, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్‌ల తర్వాత పరిస్థితిని గుర్తు చేశారు. పీఎన్బీ స్కామ్‌ను వ్యవస్థల బలోపేతా నికి అవకాశంగా సూచించారు. రుణాలపై ప్రభావం పడరాదు పీఎన్బీ స్కామ్‌తో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు అతిగా స్పందించడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు రుణాల జారీపై ప్రభావం పడుతుందని అసోచామ్ హెచ్చరించింది. బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ చర్యలు నష్టాన్ని పరిమితం చేసే విధంగా ఉండాలని సూచించింది. ‘‘కుంభకోణాలు బయటకు వచ్చాక, మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో ఈ స్థాయి హడావిడి సాధారణమే. కానీ, ఇది బ్యాంకుల విశ్వాసానికి విఘాతం కలిగిస్తుంది. కనుక ఎంతో నిగ్రహంతో ఈ సందర్భాన్ని ఓ అవకాశంగా భావించి వ్యవస్థాపరమైన సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలి’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ సూచించారు. -
అందుకు నో అంటున్న విరాట్ కోహ్లి
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను నీరవ్ మోదీ నిండాముంచిన వ్యవహారంతో బ్యాంక్ ప్రతిష్ట దారుణంగా దెబ్బతింది. నీరవ్ స్కాం నేపథ్యంలో పీఎన్బీతో తన ఎండార్స్మెంట్ కాంట్రాక్టు రెన్యువల్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విముఖత చూపుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఏడాది చివరి వరకూ కాంట్రాక్టు టర్మ్ ముగియనున్నందున అప్పటివరకూ ఎండార్స్‌మెంట్‌ను తొలగించబోమని కోహ్లీ బ్రాండ్ వ్యవహారాలను చక్కదిద్దే ఏజెన్సీ కార్నర్‌స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్పష్టం చేసింది. కాంట్రాక్టును పొడిగించడంపై ఇప్పటివరకూ పీఎన్బీతో ఎలాంటి చర్చలూ జరపలేదని సంస్థ సీఈఓ బంటీ సజ్దే చెప్పారు. అయితే నీరవ్ మోదీ స్కాంలో పీఎన్బీని నిందించేందుకు సరైన కారణం లేదని బంటీ పేర్కొనడం గమనార్హం. పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో విరాట్ కోహ్లీ మాత్రం కాంట్రాక్టు పొడిగింపునకు సుముఖత వ్యక్తం చేయరని సమాచారం. -
60 సంస్థల ఆస్తుల విక్రయాలపై నిషేధం
న్యూఢిల్లీ/మారిషస్: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రూ.12,700 కోట్ల రూపాయల స్కామ్‌లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. నీరవ్‌మోదీ, మెహుల్‌చోక్సీ, వారికి సంబంధించిన కంపెనీలు, పీఎన్‌బీకు చెందిన పలువురు ఉద్యోగులు, పరిమిత బాధ్యత కలిగిన భాగస్వామ్య సంస్థలు ఇలా 60కుపైగా సంస్థలను ఆస్తులు విక్రయించకుండా నిషేధం విధిస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది. పీఎన్బీ స్కామ్ నేపథ్యంలో కంపెనీల చట్టంలోని పలు సెక్షన్ల కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్సీఎల్టీ ముందు పిటిషన్ దాఖలు చేయగా ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 221 (విచారణ, దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీ ఆస్తులను స్తంభింపజేయడం), సెక్షన్ 222 (సెక్యూరిటీలపై నియంత్రణ విధించడం)ల కింద పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆస్తులు విక్రయించకుండా నిషేధానికి గురైన వాటిలో గీతాంజలి జెమ్స్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్స్, ఫైర్‌స్టార్ డైమండ్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లర్ డైమండ్ తదితర కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు ఉన్నాయి. అవసరమైన చర్యలు తీసుకుంటాం అక్రమ లావాదేవీలకు పాల్పడిన సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని మారిషస్ ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణం వివిధ దేశాలతోనూ ముడిపడి ఉన్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నీరవ్‌మోదీ, ఆయన బంధువు మెహుల్ చోస్కీలపై మీడియాలో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్నామని ఫైనాన్సియల్ సర్వీసెస్ కమిషన్ (ఎఫ్ఎస్సీ)తెలిపింది. ‘మీడియా లో వచ్చిన వార్తలను పరిగణలోని తీసుకున్నాం. ఇందుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మారిషస్, మారిషస్ రెవెన్యూ అథారిటీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. అలాగే ఎఫ్ఎస్సీ కూడా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. -
కస్టమర్లకు షాక్: రుణాలపై వడ్డీరేటు పెంపు
సాక్షి, ముంబై: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు లెండింగ్ రేట్లను పెంచి బ్యాంకు వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఊహించినట్టుగానే దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పీఎన్బీ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ భారీగా పడనుంది. వార్షిక ఎంసిఎల్ఆర్ రేటును పెంచుతూ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎస్బీఐ వెబ్సైట్లో వివరాలను పొందు పర్చింది. 2016, ఏప్రిల్ తరువాత మొదటిసారి రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో వార్షిక ఎంసీఎల్ఆర్ 8.15శాతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇది 7.9 శాతం మాత్రమే. అటు మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా వడ్డీరేట్లను పెంచిది. వార్షిక ఎంసీఎల్ఆర్ను 8.30శాతంగా నిర్ణయించింది. మార్చి 1, 2018నుంచి ఈ రేట్లు అమల్లో రానున్నాయని పీఎన్బీ, ఎస్బీఐ ప్రకటించింది. కాగా డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన ఒకరోజు తరువాత ఎస్బీఐ లెండింగ్ రేట్లను సవరించింది. -
పీఎన్బీ హెడ్ క్యాషియర్ మృతి
సాక్షి, లక్నో:దేశవ్యాప్తంగా పీఎన్బీ మెగాస్కాం రేపిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే..ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. బ్యాంకు ఉద్యోగి ఒకరు అనుమానాస్పద రీతిలో గురువారం శవమై తేలారు. దీంతో బ్యాంకింగ్ వర్గాల్లో కలకలం రేగింది. లక్నోకు చెందిన రోహిత్ శ్రీవాత్సవ (28) ఉత్తర ప్రదేశ్‌లో బలరాంపూర్ పీఎన్బీ బ్రాంచ్‌లో హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అయితే రోహిత్ మృతదేహాన్ని మంకాపూర్ రోడ్డులోని కల్వర్ట్‌లో గుర్తించామని పోలీసు అధికారులు వెల్లడించారు. బంధువులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.